20-04-2021, 10:29 AM
(14-03-2021, 11:01 AM)Okyes? Wrote: అదే .... ఆ శెట్టియార్ గురించే .....చంద్రప్ప కృష్ణప్ప శెట్టియార్..."
"అతని గురించి చాలా విన్నాను.....ఆంధ్రలో ఎక్కడో పెనుగొండను పాలించిన కోమటి రాజుల వంశజుడు..... పెనుగొండ రాజ్యపతనం తరువాత బుక్కరాయలు కొలువులో హంపీ విజయనగరం వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు ఈ శెట్టీలు రాజ్యాలు.... రాజరికాలు పొయిన
వాల్ల పెత్తనం మాత్రం వదులుకోలేదు.... కొందరు రాజకీయాల్లో చేరి తమ కపట బుద్ధి తో అధికారాన్ని చేజారకుండా చూసుకొంటే మరికొందరు తమ బ్రౄట్ ఫోర్స్ తో సొంతం సామ్రాజ్యాన్ని స్థాపించుకొన్నారు ..... వారిలో ఒకడు చంద్రప్ప శెట్టి..... అందరికీ శెట్టియార్...
నేను చెప్పింది కరెక్టా లేక ఏమైనా విడిచి పెట్టానా....." అడిగాడు ఆశారి
" లేదు , చెప్పింది ఆల్ మోస్ట్ కరెక్ట్..... ఈ చంద్రప్ప శెట్టి మంగళూరూ.... ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని బెస్త గ్రామాలకు కిరీటం లేని రాజు"
అతనికి తెలువకుండా అక్కడ ఏమీ జరగదు"
తంగవేలు
" నీ పని ఏంటో ..... నీ ఆపరేషన్ ఏంటో నాకు తెలువదు.... అలా తెలువకుండా ఉండడం మంచిది..... ముఖ్యంగా నా ఆరోగ్యానికి
ఇక ఎక్కడ రిపేర్లు చెయ్యాలి అనే విషయం అయితే నా సలహా ..... రాత్రి చీకట్లో బెంగ్రె లో ఎంటర్ అవుదాం... ఒకటి లేదా రెండు రోజుల్లో పని పూర్తి చేసుకుని బయటకు పడదాం.... ఆశారి జవాబిచ్చాడు
" ఉహూ...... అది జరిగే పనికాదు... ఎలాగైనా
శెట్టియార్ కు తెలిసిపొతుంది"
" అయితే తూతుకుడి కే వెలుదాం .... రిపేర్లు అక్కడే చేస్దాం "
" కాస్త ఆలోచించనివ్వు.... మనం తూతుకుడికి వెళ్ళినా ఈ విషయం ఐ మీన్ బోటు దొంగతనం శెట్టియార్ కు తెలిసి పోతుంది కాక పోతే రెండు రోజులు ఆలస్యంగా తెలుస్తోంది అంతే...... ఆ తరువాత దీనితో మనల్ని ఐ మీన్ అలియర్ సామిని జోడించడానికి ఎక్కువ సమయం తీసుకోదు..... ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం ఈ శెట్టియార్..... ఈ సౌత్ ఇండియా లో అలియార్ స్వామి కి సమఉజ్జి .... ప్రత్యర్థి ఈ శెట్టియారే " చెప్పడం ఆపి తన ఖాలిగ్లాసు ఆశారి వైపు కు జరిపాడు...
"అంటే శెట్టియార్ కు నీప్లాన్ తెలువదు అంటావు " గ్లాసులోకి రమ్ పోసి ఇస్తూ
" అవును తెలువదు, మన ఇద్దరి కి తప్ప ఇంకెవ్వరికి తెలువదు...."గ్లాస్ లోకి నీల్లు పోసుకొంటూ తంగవేలు
" అయితే భయం ఎందుకు.... బోటు దొంగతనం సంగతి 4-5 రోజుల వరకు బయటకు పొక్కదు
ఈ లోపు మనం రిపేర్లు చేసుకొని బయటపడొచ్చు అందుకు భెంగ్రా కరెక్ట్ ప్లేస్ అని నా అభిప్రాయం" ఆశారి
" హూం.... ఇంకా ఒక గంట సమయం ఉంది ఎటువైపు పోవాలి అని తీర్మానం తీసుకోడానికి"
అంటూ చార్ట్ టేబుల్ వైపు కదిలాడు వేలు.
వీల్లకు తెలువని విషయం ఏంటంటే........
..................
సమయం.... ఉదయం..9గం
" ఏ .... హుడిగి, ఏమన్నా కూడు తిని పో ...."
" అయ్య కు ఎన్ని మాట్లు సెప్పిన నాకు కాలేజీ కి హోగర్దుకు స్కూటర్ బేకు అని..... "
" లేదు అమ్మి, నివు స్కూటర్ లో హోగర్దుకు ముడియాదు ఎల్లా ఎడత్తు నమ్మ శత్రుకల్ దా...
అందుకు దా కారూ..... బాడీ గార్డ్స్.... ఇది లేకుండా నీ బయటకు పో బేడా...
"ఓ యమ్మే జార సూడరాదే ...న్యాన్ ఎంత చెప్పినా బేడా..బేడా అన్టాఉండడు ..... అయ్యకు నివ్వు సెప్ప.."
" నివ్ జెప్తే ఇనకపాయ్ ఇగ నా మాటకు యాడ ఇలువా" అంది పిల్ల తల్లి దీర్ఘం తీస్తూ
" ఓ యమ్మే .... యార్ సెప్పినా ఈ ఇషయం లా ఒకటే మాట కారు బాడీ గార్డ్స్ లేకుండా బయటకు పొయ్యేది ల్యాదు" శెట్టియార్ భార్య కు కూతురు కు కలిపి జవాబిచ్చాడు
ఇంకా ఏదో అనేలోపు ఫోన్ బెల్ మోగడం తో ఆగిపోయింది సంభాషణ
పొద్దున శెట్టియార్ ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూతురుతొ సంభాషణ ఈ భాష వింటే మీకేం అర్థం అవుతుంది వీల్ల పూర్వపరాలు....తమకు పైతృకంగా దొరికిన భాష తెలుగును తన పిల్లలకు అందించాలి అనే తపన , ప్రేమ .....
దాంతో అక్కడి భాష కన్నడ , కాస్త తమిళం , తమ పారంపర్యంగామాట్లాడే తెలుగు ఈ మూడు భాషలు వందల సంవత్సరాలు గా కలిసిపోయి ఒక సంకర భాషనా లేక ఒక సంకీర్ణమైన బాషనా అర్థం కాదు కానీ ఇలాంటి భాష తయ్యారైయ్యింది.... అదే ఇంట్లో వాడే భాష..... వాల్లు మాట్లాడుకొనే తెలుగు.....
ఆ ఇంట్లో ఉన్న వాల్లకి అందరికి దాదాపుగా కన్నడం, తమిళం, కొంకణి,తుళు, హింది, ఇంగ్లీష్ భాషలు వచ్చినా శెట్టియార్ పెట్టిన కండిషన్ ఇంట్లో తెలుగు మాత్రమే మాట్లాడాలి
" సర్, కేరళ నుండి ఫొన్ ...... మన గఫూర్..... శెట్టియార్ సెక్రటరీ కం బాడి గార్డ్ అవినాష్ చెప్పాడు
" గఫూర్....? ప్రశ్నార్థకంగా చూసాడు
గఫూర్ బోట్ బిల్డర్స్,.... బేపూర్ సార్....."
ఓ...ఓ.యా..యా.. అంటూ టేబుల్ ముందు నుండి లేచాడు శెట్టియార్ ఆ కాస్త తినేసి వెల్లండి అంటూ ఆపుతున్న భార్య మాట వినకుండా తన ఆఫిస్ రూమ్ వైపు నడిచాడు....
.........లైలా హార్బర్ దాటి పూర్తిగా 10 గంటలు కాలేదు...........
different places, conspiracy, sex, kinky sex and intelligence ivi anni kalisi rayadam meeke chellu.




Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini