Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అలా మొదలైంది
#2
అలా మొదలైంది



నాకు చిన్నప్పటి నుండీ కథలు చదవడం బాగా ఇష్టంగా ఉండేది....మొదట్లో చందమామ , బాలమిత్ర పుస్తకాలు బాగా చదివేది... తర్వాత ఈనాడు ఆదివారం పుస్తకాలు ఇష్టంగా చదివే దాన్ని...

నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేప్పుడు మా బంధువుల ఇంటికి వెళ్ళాను.... అదొక పల్లెటూరు... ఆ ఇంటి దంపతులకు ఇద్దరికీ చదువు రాదు... వాళ్ళకి ఇద్దరు పిల్లలు... పెద్దోడు అప్పుడు నాలుగో తరగతి చదువుతున్నాడు... నేను ఎటూ తోచక ఆ పిల్లాడి పుస్తకాలని చూస్తున్నాను... అన్ని పుస్తకాలని తిరగేస్తుంటే ఒక పుస్తకానికి వాడు వేసిన అట్ట(కవర్) మీద బూతు పదం ఒకటి కనబడి ఆసక్తిగా చూసాను... ఒక పేరా చదివేసరికి అది కథ అని అర్థం అయింది... ఆ అట్ట విప్పి మొత్తం చూసాను... పూర్తి కథ ఉంది.. అలా రెండు పుస్తకాలకు ఉన్న అట్టల్ని విప్పేసి వాటిల్లో ఉన్న రెండు కథల్ని చదివాను... ఆ పుస్తకాలకి న్యూస్ పేపర్ తో వేరే అట్టలు వేసిచ్చి... ఆ కథలు ఉన్న పేపర్లు వెంట తెచ్చుకున్నాను...

ఆ రెండు కథల్ని దాచిపెట్టుకుని చాలా సార్లు చదువుకునేదాన్ని... తర్వత చాలా రోజులకి ఇంటర్నెట్ వచ్చే ఫోన్ కొనుక్కున్నాక నెట్ లో ఇంగ్లీష్ కథలు దొరికాయి... పెళ్ళాయ్యాక xossip దొరకడంతో ఇలా ఆ ప్రవాహం కొనసాగుతుంది...



నేను చదివిన ఆ మొదటి కథని త్వరలో నా పారిజాతాలు దారంలో పోస్ట్ చేస్తాను..


అప్పటిదాకా సెలవు

మీ లక్ష్మి
Like Reply


Messages In This Thread
అలా మొదలైంది - by Lakshmi - 24-03-2019, 07:14 PM
RE: అలా మొదలైంది - by Lakshmi - 24-03-2019, 07:48 PM
me too - by will - 14-07-2019, 06:06 PM
RE: me too - by Lakshmi - 12-09-2019, 08:54 PM
RE: me too - by Domnic - 12-09-2019, 09:53 PM
RE: me too - by Domnic - 12-09-2019, 09:54 PM



Users browsing this thread: 12 Guest(s)