08-12-2018, 03:29 PM
Episode 55
శిరీష్ అజయ్ భుజాన్ని తడుతూ, "సరే... వెళ్ళి ఫ్రెషప్ అవ్... అటు... బయటుంది బాత్రూమ్...!" అన్నాడు.అజయ్ వెళ్ళి ఫ్రెషప్ అయ్యి వస్తూ, "గురూ... మీనా డార్లింగ్ తన బంగళాకి రమ్మని చెప్పిందిగా... ఎప్పుడెళ్ళమంటావ్?" అనడిగాడు... వాతావరణాన్ని లైట్ చేద్దామని.
శిరీష్ చిన్నగా నవ్వి, "తొందరపడి నువ్వలాంటి పనులేవీ చెయ్యకు... నాకు తెలిసినంతవరకు ఆ బంగళా అంత సేఫ్ కాదు... ప్లేస్ ఎప్పుడైనా మనకి ఫేవర్ గా ఉండాలి...!" అంటూ నవ్వాడు.
అజయ్ కి కూడా నవ్వుతూ తలూపి శిరీష్ పక్కన కూర్చుని మళ్ళా ఏదో అడగబోతుండగా లతా, వాణీలు భోజనం పట్టుకుని రూమ్లోకి వచ్చారు.
లత తలదించుకుని వెళ్ళి ప్లేట్ టేబుల్ మీద పెట్టింది. వాణీ అయితే అజయ్ ని చూస్తూ వెళ్ళి ప్లేట్ ని టేబుల్ మీద పెట్టి తన అక్క దగ్గరికి పోయి ఆమె చెయ్యి పట్టుకుని నిల్చుంది. లత ఇంకా తన తల దించుకునేవుంది.
అజయ్ నిలబడి లతతో, "Excuse me... కాస్త మీ తలెత్తుతారా... మీ ముఖాన్ని చూసి తరిస్తాం!" అన్నాడు. తన గురువుగారిని ప్రేమించిన ఆ అమ్మాయిని కాస్త శ్రధ్ధగా చూడాలని.
లత మెల్లగా తలెత్తింది.. కానీ, తన కళ్ళు మాత్రం నేలని అతుక్కుపోయాయి. ఇక వాణీ మాత్రం అజయ్ ని ఏదో వింత జంతువును చూస్తున్నట్టుగా చూస్తోంది.!
"హ్మ్... ఓ విషయం చెప్పండి. మీ ఫేవరేట్ టీచర్ ఎవరూ..?" అని అడిగాడు అజయ్.
లత మౌనం వహించింది... అయితే, వాణీ ఒక్క క్షణం కూడా ఆగకుండా, "శిరీష్ సార్, సార్!" అంది.
అజయ్ నవ్వుతూ వాణీని చూసి, "సార్... కాదు.! నా పేరు అజయ్. నీ పేరూ...?" అంటూ షేక్-హ్యాండ్ ఇవ్వడానికి చేయిచాపాడు.
వాణీ వెంటనే 'ఠాప్'మని శబ్దం వచ్చేలా తన రెండు చేతులు జోడించి, "నా పేరు వాణీ... నేను మీతో చేతులు కలపను. బయటవాళ్ళతో అలా వుండకూడదని మా అక్క చెప్పింది...!" అంది.
అంతే, అజయ్, శిరీష్ లు పగలబడి నవ్వసాగారు. దాంతో వాణీ ముఖం చిన్నదైపోయింది. తను చేసిన తప్పేంటో అర్ధంకాక తన అక్కవైపు చూసింది. లత కూడా ముసిముసిగా నవ్వసాగింది.
వాణీ ఉక్రోషంతో, "నువ్వే చెప్పావు కదా.. అక్కా!" అంది.
లత కాస్త సిగ్గుపడి అక్కడినుంచి బయటకి వచ్చేసింది.... వాణీ కూడా తను చేసిన తప్పేంటో తెలుసుకోవాలని తన అక్క వెంట పరుగుతీసింది.
కిందకొచ్చాక లత కూడా గట్టిగా నవ్వడం మొదలెట్టింది. వాణీ, "ఏమయ్యిందక్కా...? చెప్పూ..!" అని అడిగింది.
"పిచ్చీ... వారి ముందు నిలబడి అవన్నీ ఎవరైనా చెప్తారా...? పైగా అతను సార్ స్నేహితుడు కూడా!"
"ఓహో.. అలాగా! అయితే మేడమీదకు పోయి సారీ చెప్పి రానా..!"
"ఏం అక్కర్లేదుగానీ... ఓ విషయం చెప్పు, సార్ ఫ్రెండ్ ఎలా వున్నారు?"
"బావున్నారక్కా... సార్ కంటే అందంగా ఉన్నారు.."
"అయితే ఓ పని చెయ్... నువ్వతన్ని ప్రేమించు... నాకు సార్ ని వదిలేయ్!"
"అదేం కుదరదు... కావాలంటే నువ్వే అతన్ని ప్రేమించుకో...! నేను మాత్రం సార్ నే ప్రేమిస్తా... ఇంకా పెళ్ళికూడా చేసుకుంటా!"
వాణీ తన పట్టుని ఏమాత్రం విడవకపోవడంతో లత వాణీని మొట్టి, "నువ్వు నిజంగా పిచ్చిదానివే!" అంటూ గసిరింది.
అప్పుడే తన పిన్నీ బాబాయిలు భోజనాలు తినడానికి రమ్మని పిలవడంతో ఇద్దరూ అలాగే ఒకర్నొకరు గుర్రుగా చూసుకుంటూ అన్నాన్ని మెసవి ఆ రాత్రికి పైకెళ్ళకుండా క్రిందనే పడుకున్నారు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK