09-11-2018, 11:23 AM
నా కథ...22
ఆ రాత్రి నేను నిద్ర పోలేదు...
మనసంతా అదోలా అయిపోయింది...
ఎగిరి గంతేస్తాడని ఊహించిన నాకు రవి ఇలా షాకిస్తాడనుకోలేదు...
రవి మాట్లాడిన విధానం నన్నింకా డైలామా లో పడేసింది...
తను తన అభిప్రాయం చెప్పి నిర్ణయం నాకే వదిలేయడం నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టింది...
నేను నీకు ఆ రోజు మాటిచ్చాను కాబట్టి నిర్ణయం నీదే అని రవి అనడం .. నాకు చాలా నాధగా అనిపించింది...
ఇప్పుడు నేను తన అభిప్రాయాన్ని కాదని అంటే తన మనసులో ఏమనుకుంటాడు...?
నేను తన మాటకు విలువ ఇవ్వట్లేదని అనుకోడా...?
తర్వాత తను నాతో ఇప్పట్లాగే ఉంటాడా.. లేక బాధ మనసులో ఉంచుకొని బయటకు నవ్వుతూ ఉంటాడా..?
ఇలా పరిపరి విధాలుగా నాలో ఆలోచనలు రేగాయి...
రవి చెప్పిన కారణం గురించి కూడా ఆలోచించా నేను...
నిజానికి అందులో కూడా తప్పేమీ లేదనిపించింది..
ఇంకొన్ని రోజులు సరదాగా గడుపుదాం అనడంలో తప్పేంటి అనికూడా నా మనసు నన్ను ప్రశ్నించింది...
మధ్యాహ్నం స్వప్న చెప్పినప్పట్నుండి నేను పొందిన ఎక్సయిట్మెంట్ వల్ల ఇప్పుడు రవి వద్దనగానే ఇంత బాధ అవుతుందేమో అనిపిస్తుంది...
ఒక వేళ రవి ఇంతకుముందే ఈ విషయం మీద మాట్లాడి జాగ్రత్త తీసుకుందాం అంటే ఒప్పుకునేదాన్నే కదా అనిపించింది...
అసలు రవి అలా ముందే చేయనందుకు కోపం కూడా వచ్చింది...
రకరకాల ఆలోచనల తర్వాత నేను రవి చెప్పినట్టే చేయడానికి నిర్ణయించుకున్నాను...
తర్వాతి రోజే స్వప్న దగ్గరికి వెళ్ళాం...
విషయం విన్న స్వప్న ముందు బాధపడింది...
మరొకసారి ఆలోచించుకోండి అని చెప్పింది...
రవి ఏమీ మాట్లాడలేదు...
ఇంకా ఆలోచన ఏమీ లేదు స్వప్నా చేసేయ్ అన్నా నేనే...
నా మాటల్లో , కళ్ళల్లో బాధ దానికి తెలుస్తుంది... అదే సమయంలో నా మాటల్లోని కచ్చితత్వం కూడా దానికి తెలిసింది...
భుజం మీద చేయి వేసి తట్టి... లోపలికి తీసుకెళ్లింది...
ఆ రోజు తర్వాత నేను అంతగా ఆక్టీవ్ గా ఉండలేక పోయా...
నాకిష్టం లేని పని చేయించానన్న గిల్టీ ఫీలింగ్ వల్లనో ఏమో రవి కూడా నన్ను ఎక్కువగా కదిలించలేదు...
రెండు మూడు రోజులు ఇద్దరం ముభావంగా ఉన్నాం...
రాజు మమ్మల్ని గమనిస్తూనే ఉన్నట్టున్నాడు...
రవి ఏమీ చెప్పనట్టున్నాడు...
అందుకని రాజు అత్తయ్యకు ఫోన్ చేసినట్టున్నాడు....
నాలుగో రోజు అత్తయ్య ముంబయి నుండి వచ్చింది...
రాగానే నన్ను ఆప్యాయంగా పలకరించింది...
కానీ నన్నేమీ అడగలేదు...
నేను ఆవిడతో వీలైనంత మామూలుగానే మాట్లాడా..
అత్తయ్య వచ్చిందని తెలిసి అమ్మా వాళ్ళు కూడా వచ్చారు...
నేను అందరితోనూ నవ్వుతూనే మాట్లాడా..
రవి కూడా అనుమానం రాకుండా బిహేవ్ చేసాడు...
వాళ్ళ కోసం మొదలెట్టినప్పటికీ క్రమంగా మా మధ్య ఏర్పడిన అంతరం చాలావరకు తగ్గిపోయింది...
రెండురోజుల తర్వాత అత్తయ్య మా చేత సత్యనారాయణ వ్రతం చేయించింది...
తెలిసిన వాళ్ళందరినీ పిలిపించింది...
అక్క బావ అందరూ వచ్చారు ఇల్లంతా సందడిగా మారింది...
మరో రెండు మూడు రోజులు అందరూ అక్కడే ఉండడంతో మేము మా విషయం పూర్తిగా మర్చిపోయాం...
అందరూ వెళ్లి పోయినాక రవి నేను మళ్ళీ మాములుగా మారిపోయాం...
తేడా అల్లా ఏంటంటే రవి మధ్యాహ్నం రావడం మానేశాడు...
మధ్యాహ్నం కోటా రాత్రి భర్తి చేస్తున్నాడు...
************************************
అత్తయ్య వచ్చాక ఇంటికి సంబంధించిన చిన్న చిన్న పనులు, షాపింగ్ లాంటివి నేను, రాజు కలిసి చేయవలసి రావడం వల్ల రాజు కొద్దిగా నాతో మాట్లాడుతున్నాడు... కానీ ఇప్పటికీ బాగా దూరంగా ఉండే వాడు...
కొన్నాళ్ల తర్వాత అత్తయ్యకి ఆరోగ్యం పాడవడంతో ఆవిణ్ణి వారం పది రోజులు హాస్పిటల్ లో ఉంచాల్సి వచ్చింది...
ఆ టైం లో నేను రాజు వంతుల వారీగా అత్తయ్యకి తోడుగా ఉండే వాళ్ళం...
ఇంటికి తీసుకొచ్చాక కూడా అత్తయ్యకి సేవ చేసే విషయంలో నేను రాజు ఎక్కువగా మాట్లాడుకోవలసిన అవసరం ఏర్పడింది...
కొన్నాళ్ళకి రాజు నాతో కొంచెం ఫ్రీగా మూవ్ అవడం మొదలెట్టాడు...
నేను మరింత చొరవ తీసుకొని రాజుతో చ్లొసె గా ఉండే ప్రయత్నం చేసాను...
రాజు అందరితో ఎలా ఉంటాడో నాతోనూ అలాగే ఉండాలి అనేది నా కోరిక...
అందుకని అందరిలో ఉన్నప్పుడు కూడా నేను రాజుతో మాట్లాడడం, తన మీద జోక్స్ వేయడం చేసేదాన్ని...
జోక్ వేసినపుడు రాజు నవ్వి ఊరుకునే వాడే గానీ ఏమీ అనేవాడు కాదు...
అలా కొన్నాళ్ళు గడిచాక ఒక రోజు నైట్ అందరం డిన్నర్ చేస్తున్నాం...
రవి, నేను, అత్తయ్య, రాజు నలుగురం ఏదో మాట్లాడుకుంటూ తింటున్నాం...
మాటల మధ్యలో ఎవరిదో పెళ్లి టాపిక్ వచ్చింది...
నేను అత్తయ్యతో..." అవును అత్తయ్యా... రాజుకు పెళ్లి చేయరా?..." అని అడిగి... రాజుతో " ఏంటి రాజు నువ్ పెళ్లెప్పుడు చేసుకుంటావ్" అని అడిగా....
అంతే రాజు తినే వాడల్లా ప్లేట్ లో చేయి కడుక్కుని ఏమీ మాట్లాడకుండా వెళ్లి పోయాడు...
అది చూసి అత్తయ్య కూడా లేచి వెళ్ళిపోయింది...
నాకేమీ అర్థం కాలేదు...
నేనేం తప్పుగా మాట్లాడానో తెలియలేదు...
పెళ్లి చేసుకోమనడం తప్పా?..
అదే మాట రవిని అడిగా...
ఆయన "నీ తప్పేం లేదు గాని.. ముందు తిను .. తర్వాత మాట్లాడుకుందాం" అని తనూ గబగబా తినేసి వెళ్ళిపోయాడు...
నేను కూడా ఏదో తిన్నాననిపించి ముగించాను...
మిగతా పనులన్నీ పూర్తి చేసుకొని మా బెడ్ రూమ్ కి వెళ్ళాను....
అంత సేపూ నేను అదే ఆలోచిస్తున్నాను...
రాజు పెళ్ళిమాట ఎత్తేసరికి ఎందుకు అలా వెళ్ళిపోయాడు...
అత్తయ్య కూడా ఏమీ మాట్లాడలేదు ఎందుకు...
కారణం ఏమై ఉంటుందా అని ఎన్ని విధాలుగా ఆలోచించినా వాళ్ళ ప్రవర్తనకి సరైన కారణం ఏదీ కనిపించలేదు...
నేను బెడ్ రూమ్ కి వెళ్లే సరికి రవి మంచం మీద పడుకొని ఉన్నాడు...
నేను వెళ్లి తన పక్కన కూర్చున్నా...