04-12-2018, 09:41 AM
లక్ష్మిగారూ...
ముందుగా మీకు నా క్షమాపణలు.
మీ కథను నేనింకా చదవలేదు. ఒకట్రెండు ఎపిసోడ్లు మాత్రమే చదివాను. కానీ, చదివిన ఆ రెండు ఎపిసోడ్లను బట్టీ మీ రచనలోని స్టామినా నాకు అర్ధమైంది. అనుకోకుండా చదవటం కుదరక ఇప్పుడు చదవాలంటే భయమేస్తుంది. ఫ్లోలో వుంటే చదివేస్తానేమోగానీ, ఒక్కసారి గ్యాప్ వచ్చిందా మళ్ళా చదవటం చాలా కష్టమవుతుంది. మీ... ఈ కథ, గిరీశంగారి బృహన్నల ఇంకా ప్యాషనేట్ మెన్ బాబాయ్ కథలు, కమల్ కిషన్ బ్రో రచనలు, సంధ్యకిరణ్ రైటింగ్స్... మీ అందరిలో ఒక సారూప్యత వుంది. కథలో ఒక విధమైన హెవీనెస్ వుంది. అది అందిపుచ్చుకునే సమర్థత వుంటేనే కథని చదవగలం. ఏదో హడావుడిగా చదివి వదిలేసే కథలు కావు మీవి.
మీరు రాసే పద్ధతిలో మీరు ఒక పాఠకులు/రాల్లుగా మీరు ఒక రచయిత /త్రిల నుంచి ఏం ఆశిస్తున్నారో అవి మీ కథల్లో వ్రాయటానికి నిరంతరం తాపత్రయ పడుతుంటారు.
మీరెంచుకున్న కథాంశాన్ని మీ వందనంలో సంక్షిప్తంగా తరలియజేశారు. అది కూడా నేను పూర్తిగా చదవలేదు. ఎందుకంటే, అందులో మీ కథ తెలిసిపోతుంది అని భయపడి!
మీరు యద్దనపూడి సులోచనారాణి గారి నవలని గురించి చెప్తుంటే నాకు పెరల్ హార్బర్, చాందినీ ఇంకా అలాంటి కొన్ని సినిమాలు జ్ఞాపకం వచ్చాయి.
అప్పట్లో సాహితీ అని ఓ పాఠకురాలు ఇలాంటిదే కథాంశాన్ని చెప్పి వ్రాయమని నన్నోసారి కోరింది. ఇప్పుడు మీ కథను చదివితే ఆమె సంతృప్తి చెందుతుందని నా నమ్మిక.
మీ నుంచి మరికొన్ని రచనలు ఆశిస్తున్నాం. (ఇదే చదవలేదు... మరికొన్ని అంటావేంటి అని తిట్టుకోకండి!)
వికటకవి౦2

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK