04-12-2018, 07:08 AM
వందన సమర్పణ
యద్దనపూడి సులోచనా రాణి గారి ఒక నవలలో ఒక అమ్మాయి తనెంతగానో ప్రేమించే తన భర్త చనిపోయాడనుకొని ఇంకో వ్యక్తిని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటుంది... తర్వాత అతన్ని అమితంగా ప్రేమిస్తుంది.... ఒక బిడ్డను కంటుంది... అటువంటి సమయంలో తన మొదటి భర్త తిరిగి వస్తాడు... అప్పుడు ఆ అమ్మాయి పడే బాధ వర్ణనాతీతం...
మొన్న సమ్మర్ లో ఆ నవల చదివా నేను...
అనుకోకుండా ఈ నవలలోని 'ఒకమ్మాయికి ఇద్దరు భర్తలు' అనే కాన్సెప్ట్ మీద xossip లో కథ రాస్తే ఎలా ఉంటుంది అని నాకు అనిపించింది...
కానీ నాకు అప్పటికి కథలు రాసే అనుభవం లేకపోవడం వల్ల కాస్త ముందు వెనకా అయ్యాను...
ఎందుకంటే కథ రాయడం చాలా కష్టమని నేను అనుకునేదాన్ని(నిజంగా కూడా కష్టమే)..
ఒక రెండు మూడు రోజుల తర్జనభర్జన తర్వాత రాయడానికే నిశ్చయించుకొన్నాను.
అయితే ఆ కథను యధాతధంగా కాకుండా కాస్త మార్చి xossip కథలకు అనుగుణంగా రాయాలని అనుకున్నాను... అలా ఈ కథ కి సంబంధించిన లైన్ సిద్ధం చేసుకున్నాక... ఒక్క ఎపిసోడ్ కూడా రాయకుండానే Xossip లో "ఇదీ... నా కథ" అంటూ దారం మొదలు పెట్టాను... అప్పటికీ నాకు రాయగలను అనే నమ్మకం రాలేదు... అయితే దారం మొదలు పెట్టాక మిత్రులు.... ముఖ్యంగా మా బావగారు సరిత్ గారు, వికటకవి గారు... అందించిన ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపించింది.... నేను ఒక వేళ రాయలేకపోతే మీరు పూర్తి చేయాలి అంటూ వారిపై భారం వేసి. ... నా కథకి సంబంధించిన మెదటి భాగం పోస్ట్ చేసాను...
చాలా మంది మిత్రులు బాగా రాసాను అని నన్ను మెచ్చుకున్నారు... అయినప్పటికీ నాకు... అప్పటికీ నేను రాయగలను అనే నమ్మకం కుదరలేదు... శృంగారం సరిగ్గా రాయగలనా అని ఒకటే సందేహంగా ఉండేది... ఏదోలాగా అది కూడా రాసేసాను కానీ ఇప్పటికీ నేను శృంగారం (ఇంటర్ కోర్సు) సరిగా రాయలేను అనే అనిపిస్తుంది...
రాసిన నాలుగైదు ఎపిసోడ్స్ ఒక్కలాగే ఉండొచ్చు అనిపిస్తుంటుంది నాకు...
అందుకే చివరి భాగంలో కూడా శృంగారం రాద్దామని అనిపించినా ఒక్కలాగే రాస్తున్నానేమో అనే శంక కారణంగా ఆ విధంగా రాసి ముగించా...
చాలా వరకు కథని నేను ముందు అనుకున్నట్టే రాసాను... ఒకటి రెండు ఎపిసోడ్స్ తప్ప... ముందు నేను అనుకున్న కథలో లావణ్య, ప్రకాష్ పాత్రలు లేవు... తర్వాత వాటిని యాడ్ చేసాను... అక్షర కి అబోర్షన్ కూడా అనుకోకుండా కలిపినదే...
ఏది ఏమైనా మొత్తానికి నా కథని పూర్తి చేశాను..
కథకాలంలో నాకు వెన్నంటి ఉండి నన్ను అభినందించిన మిత్రులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు... మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల రెండు మూడు సార్లు కథను ఆపేద్దామని అనిపించింది కానీ మీ అభిమానమే నన్ను కథను పూర్తి చేసేలా చేసింది....
ఆంధ్రులు ఆరంభశూరులు అంటూ నేనే xossip కి వచ్చిన కొత్తలో చాలా మందిని విమర్శించాను.... అలా నన్నుకూడా విమర్శించొద్దు అనేది కూడా ఈ కథ పూర్తి కావడానికి ఒక కారణం...
ఇక ఈ కొత్త సైట్. xossipy పుట్టకపోయినా నా కథ మధ్యలోనే ఆగిపొయ్యేది... ఆ విధంగా నా కథ పూర్తి అయ్యేందుకు మా బావగారు కూడా కారణమే...
అయితే కథకు లభించిన స్పందన, ప్రోత్సాహమే మొదటి కారణమూ, మూలకారణము కూడా... అందువల్ల అందరికీ మరోసారి శిరస్సు వంచి వందనాలు తెలియ జేసుకుంటున్నాను...
ఎవరినైనా నొప్పించి ఉంటే(..ముఖ్యంగా తెలుగులో రాయమని... ) మన్నించగలరని కోరుకుంటూ....
మీ
లక్ష్మి