Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
(21-02-2019, 11:02 PM)annepu Wrote: చాలా బాగుంది.ఈ కథ........super....
ధన్యవాదాలు అన్నెపూ గారు... ఎలా ఉన్నారు..

(22-02-2019, 12:03 AM)Cool Boy Wrote: “ఉత్తరాలు ఎవరు రాశారా” అని సుమనశ్రీ, రమేష్ లు  తికమక పడుతుంటే విని నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది పద్మావతి." ఈ లైన్ చూడగానే నాకు మ్యాంగో శిల్ప గుర్తుకు వచ్చింది...


ఈ కథను ఎక్కడ ఆపకుండా చదివెలా రాసావ్... అంత బాగా రాసావ్ లక్ష్మి......



లక్ష్మి నువ్వు రాసిన కథ అదిరిపోయింది... ముందు రెండు కథలలాగే ఈ కథ కూడా అమోగం చాలా చాలా బాగుంది... అదిరిపోయింది...
ధన్యవాదాలు జీవన్ గారూ... నిజంగా నా రచన శిల్పని గుర్తుకు తెచ్చిందా...

(22-02-2019, 05:42 AM)Eswar P Wrote: లక్ష్మి గారు కుమ్మేసారు.సూపర్ మీలో ఇంకొ కోణం చూపించారు.

ధన్యవాదాలు ఈశ్వర్ గారూ...


(23-02-2019, 12:46 AM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారు..
మీ రెండవ పారిజాతం గుభాలింపు భలే మత్తెక్కించింది. కథావస్తువును చక్కగా మలిచిన తీరు అమోఘం. చదువుతున్నప్పుడు చిన్న అనుమానం వచ్చింది అది పద్మావతి పని అయి వుంటుందని. అయినా మొత్తానికీ ద్వితీయ విఘ్నం కాకుండా కథని, కథనాన్ని, కార్యాన్ని కడురమ్యంగా నడిపించారు. పాత్రల పేర్లు చాల బాగా కుదిరాయి. ముఖ్యంగా 'సుమనశ్రీ'. అలాగే వారి వారి మనోవేదననూ, మనోభిలాషననూ చక్కగా ఆవిష్కరించారు. సుమనశ్రీని ఒప్పించడానికి ఆమె మేనత్త వ్రాసిన ఉత్తరంలో 'మీరు ఒప్పుకుంటే పిన్నిని నా సొంత తల్లిలా ..కాదు కాదు…  కన్నకూతురిలా చూసుకుంటాను…' అన్న వాక్యం వ్రాసినప్పుడు పద్మావతి మనస్థితిని ఊహిస్తే కాస్త నవ్వు వచ్చింది. తప్పుగా అనుకోకండే...! ఏదేమైతేనేం అంతా మేనకోడలి కళ్యాణం కోసమే కదా...
ఇహపోతే,
కథలలో శృంగారం వుండాలా వద్దా అన్నది మీ ఇష్టం. మీరిలా వ్రాస్తూ వుంటే చాలు. ఇక్కడ అందరూ శృంగారాన్ని ఆశించి వస్తారు, నిజమే... కానీ అందుకోసం చాలా కథలు ఈ సైట్ లోనే వున్నాయి. కనుక, మనం తప్పకుండా కథల్లో సెక్స్ జోడించాలని ఏమీ లేదు. మనసుకి నచ్చినట్లు వ్రాసుకుంటూ వెళ్ళండి. చిలిపి మాటలు వొలికిస్తే చాలు. చేష్టలూ వ్రాయనక్కరలేదు. (మీరు వాటిని వ్రాయలేరు అని నా అభిమతం కాదండోయ్!)

మీరిలాగే మరిన్ని కథలను వ్రాస్తూ మా మనసులను సదా రంజింపజేస్తారని ఆశిస్తున్నాను...

ధన్యవాదాలండి...

ధన్యవాదాలు కవి గారూ...

మీ సలహాలు తప్పక పాటిస్తాను..

పద్మావతి ఉత్తరం రాసేప్పుడు చాలా ఆలోచించాను... పద్మావతే రాసినా సుమనశ్రీకి మాత్రమే కాకుండా పాఠకులకి కూడా రమేష్ రాసినట్టుగానే అనిపించాలని ప్రయత్నం చేసా... కానీ నేను సఫలం కాలేదనుకుంటా... కథా పరంగా ఆలోచిస్తే పద్మావతి కి సుమన ఎందుకు పెళ్లి వద్దంటుందో అర్థమై ఆమెను పెళ్లికి ఒప్పించడానికి అలాంటి పదాలు రాసింది... నేను పద్మావతి స్థానంలో ఉంటే ఆ ఉత్తరం ఎలా రాస్తానా అని ఆలోచించి రాసాను...

(23-02-2019, 10:48 AM)prasthanam Wrote: మొదటి కథ లాగే, పేరు లోనే కథ ముగింపు కి ఒక అవగాహన ఇచ్చారు. సుమన శ్రీ కి ఆ ఉత్తరం రాసింది, పద్మావతి అని ఊహించిన, ఇద్దరి వైపు నుండి పద్మావతి కథ నడి పారని ఊహించ లేదు. ఎప్పుడైతే పాఠకులకు ముగింపు అందక పోతే, రచయిత విజయం సాధించి నట్టే. మొదటి కథతో పోల్చితే ఇది ఇంకా బాగుంది.

శృంగారం ఏ మాత్రం దట్టించాలి అన్నది రచయిత స్వాతంత్రం. ఈ కథలో అది లేక పోయినా, నా దృష్టిలో ఈ కథ కి మంచి మార్కులే. సృజనాత్మక కి సమయం కావాలి. ఇంత తక్కువ సమయంలో రెండు కధలు రాయడం గొప్ప. నాణ్యత కోల్పోకుండా మరిన్ని కధలు రాయాలని ఆశిస్తూ... సెలవు.

ధన్యవాదాలు ప్రస్తానం గారు...
మీ విశ్లేషణ ఎప్పుడూ .బాగుంటుంది..
మొదటి కథలో ఎక్కువ శృంగారం దట్టించానని ఎవరో అనడంతో ఈ కథలో శృంగారం లేకుండా రాద్దామనిపించింది... ఈ కథకి శృంగారం లేకపోయినా సరిపోతుందని అనిపించడం తో పాటు నాకు శృంగార సన్నివేశాల్ని సరిగా రాయడం రావట్లేదు... అందుకే అది లేకుండా రాయాలా అని ఒక పోస్ట్ పెట్టి అడిగా.. కానీ ఎక్జువగా స్పందన రాకపోవడంతో ఆ మొదటి రాత్రి సీన్ రాసాను.

మీరు ప్రస్తావించిన ఇంకో విషయం... ఈ దారం ప్రారంభించడానికి ముందే మూడు కథాంశాలు సిద్ధం చేసుకున్నా... అందుకే వెంటనే రెండో కథ రాయగలిగా...
మూడు కథలు రాసాక్ మళ్లీ ఆలోచించాలి...
మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉంటే తప్పక కథా వస్తువు దొరుకుతుందనే నమ్మకంతొనే దారం ప్రారంభించా..


(23-02-2019, 02:12 PM)coolsatti Wrote: లక్ష్మీ గారు... రెడవ కథ కూడా అద్భుతంగా ఉంది.... షార్ట్ అండ్ స్వీట్

ధన్యవాదాలు కూల్ సత్తి గారూ...
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(రెండో కథ - "తిరిగొచ్చిన వసంతం") - by Lakshmi - 24-02-2019, 12:22 PM



Users browsing this thread: 11 Guest(s)