23-02-2019, 12:46 AM
(This post was last modified: 23-02-2019, 10:04 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
లక్ష్మిగారు..
మీ రెండవ పారిజాతం గుభాలింపు భలే మత్తెక్కించింది. కథావస్తువును చక్కగా మలిచిన తీరు అమోఘం. చదువుతున్నప్పుడు చిన్న అనుమానం వచ్చింది అది పద్మావతి పని అయి వుంటుందని. అయినా మొత్తానికీ ద్వితీయ విఘ్నం కాకుండా కథని, కథనాన్ని, కార్యాన్ని కడురమ్యంగా నడిపించారు. పాత్రల పేర్లు చాల బాగా కుదిరాయి. ముఖ్యంగా 'సుమనశ్రీ'. అలాగే వారి వారి మనోవేదననూ, మనోభిలాషననూ చక్కగా ఆవిష్కరించారు. సుమనశ్రీని ఒప్పించడానికి ఆమె మేనత్త వ్రాసిన ఉత్తరంలో 'మీరు ఒప్పుకుంటే పిన్నిని నా సొంత తల్లిలా ..కాదు కాదు… కన్నకూతురిలా చూసుకుంటాను…' అన్న వాక్యం వ్రాసినప్పుడు పద్మావతి మనస్థితిని ఊహిస్తే కాస్త నవ్వు వచ్చింది. తప్పుగా అనుకోకండే...! ఏదేమైతేనేం అంతా మేనకోడలి కళ్యాణం కోసమే కదా...
ఇహపోతే,
కథలలో శృంగారం వుండాలా వద్దా అన్నది మీ ఇష్టం. మీరిలా వ్రాస్తూ వుంటే చాలు. ఇక్కడ అందరూ శృంగారాన్ని ఆశించి వస్తారు, నిజమే... కానీ అందుకోసం చాలా కథలు ఈ సైట్ లోనే వున్నాయి. కనుక, మనం తప్పకుండా కథల్లో సెక్స్ జోడించాలని ఏమీ లేదు. మనసుకి నచ్చినట్లు వ్రాసుకుంటూ వెళ్ళండి. చిలిపి మాటలు వొలికిస్తే చాలు. చేష్టలూ వ్రాయనక్కరలేదు. (మీరు వాటిని వ్రాయలేరు అని నా అభిమతం కాదండోయ్!)
మీరిలాగే మరిన్ని కథలను వ్రాస్తూ మా మనసులను సదా రంజింపజేస్తారని ఆశిస్తున్నాను...
ధన్యవాదాలండి...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK