Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏకాంతం ముగిసింది.. సెలవు
#20
అపోహలు — అభాండాలు — గరుతులు

మిత్రమా లక్కీYరస్...
మా జాబుల వలన మీకు ఏమేమి కలిగాయో మీ తిరుగు టపా వలన అంతకు పదింతల ఎఫెక్టు మాకు కలిగింది.
మీరు అందుకు పూర్తిగా బాధ్యులు.
విషయాన్ని సూటిగా చెప్పటం మీకు అలవాటు అన్నారు. కానీ, మీ మొదటి మెసేజీ సూటిగా లేదు గనుకనే ఈ సమస్య ఎదురయింది.
అది సులువుగా అర్ధమవుతుందని మీరు 'అపోహ' పడ్డారు.
మేమేదో అభాండం వేశాం అన్నారు. మీరు పెట్టిన మెసేజీలో ఒక్కటే కాక చాలానే అర్ధాలు గోచరించాయి. ఒక్కసారి తటస్థ వ్యక్తి కోణంలో మీ మెసేజీని మీరు చదివితే అది మీకే అర్ధమవుతుంది. అందుకే, ఎవరికి అర్ధమైన రీతిలో వారు స్పందించారు. ఆ మాత్రానికి అది అభాండం వేశామనటం సరికాదు.
మీరు చెప్పాలనుకున్న విషయాన్ని మీరు సరిగ్గా తెలియజేయకుండా మాపై ఇప్పుడు 'అభాండాలు' వేస్తున్నారు అని మేమనుకోవాలి.
ఎందుకంటే, మీలాగే నేను ముక్కుసూటిగా చెప్పే రకాన్నే!
నాకూ మీరు 'ఏకాంతం ముగిసింది... సెలవు' అనగానే పోన్లే మంచిదే కదా జోడు కుదిరింది కాబోలును అని సంతోషంగానే స్పందించాను. అది అభాండం అని అనుకుంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.
అలాగే... మీ కృషిని ఇక్కడ ఎవరూ తక్కువగా చూడటం లేదు. చాలామంది రైటర్స్ కి కథలు వ్రాయటంతోనే సమయం కుదరటం లేదు. కనుకనే ప్రక్క దారాల్లోకి కూడా తొంగి చూడ్డం కుదరటం లేదని వాపోతున్నారు. రావటం... కథ అప్డేట్ పెట్టడం... వెళ్ళడం... ఇదే చాలామంది రైటర్స్ చేస్తున్న పని. పాఠకులని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కష్టమైనా, వారంలో అప్డేట్ పెట్టడానికి ఎంతో శ్రమపడుతున్నారు వారు. దాంతో కొంత ఏమరుపాటు కలిగివుంటుంది.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి ||
'నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు'
అని చెప్పిన మీరే రైటర్స్ రిప్లయిస్ ఇవ్వలేదని, కృతజ్ఞతలు చెప్పలేదని అన్నారు... మరి దాన్నేమంటారు!?
అసలు మొదట పెట్టిన మెసేజీ సూటిగా వుంటే మళ్ళా ఇంత పెద్ద మెసేజీ పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదుగా...

అందరి కథలనూ ఒక పడగ్గదిలో చక్కగా అలంకరించారు. అందుకు గానూ... మీకు అందరు రచయితల/రచయిత్రిల తరపున మీరు చేసిన కృషికి మనఃపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇది మీరు ఏ విధంగా తీసుకున్నా సరే!
మా మాటల వలన మీ మనసుకి గాయం కలిగిందని అంటున్నారు. మీరు సరిగ్గా గమనిస్తే మా మెసేజీల్లో వున్న మీ పట్ల వున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానం, ఒకరు బాధ పడుతున్నారే అనే కన్సెర్న్ కన్పిస్తాయి. 'మీరు' వాటిని గుర్తించకపోవటం నిజంగా చాలా బాధాకరం. గాయం మానిపోతుంది. 'గురుతు' మిగిలిపోతుంది. దాన్ని పట్టించుకోవాలో వద్దో మీ ఇష్టం.
చివరిగా...
మీ కర్తవ్యం ఇంకా ముగిసిపోలేదు. మీ ప్రయాణం ఆగిపోలేదు.
మీ కలం బలం కరిగిపోలేదు.
అలాగే...
మీరు పంచిన 'సంతోషం' ఎన్నటికీ చెదిరిపోదు.

మీకు 'సెలవు'కి ఇంకా పర్మిషన్ ఇవ్బలేదు

మళ్ళా రావాల్సిందే!!!


ఇట్లు

అనామకుడు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఏకాంతం ముగిసింది.. సెలవు - by Vikatakavi02 - 28-11-2018, 11:02 PM



Users browsing this thread: 1 Guest(s)