Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
#64
Episode 29


శిరీష్ అంజలి దగ్గర తన వేడిని చల్లార్చుకొని ఇల్లు చేరేసరికి రాత్రి 7 అయ్యింది.
ఒక ఆకలి తీరింది...కానీ, మరోటి ఇంకా మిగిలేవుంది! ఈ క'లత' తీరే ఘడియ యెన్నడో మరి!
కాసేపు ధర్మారావుగారితో ముచ్చటించి శిరీష్ మేడెక్కాడు. వాణీ కూడా అతని వెంట వెళ్ళింది. ఇంట్లో వాళ్ళకి ఇది అలవాటైపోయింది. ఇప్పుడు లత మేడమీదకెళ్ళినా వాళ్ళు ఏం అభ్యంతరం చెప్పట్లేదు. కానీ లతకి మాత్రం శిరీష్ ముందుకెళ్ళాలంటే ఎందుకో దడ.! బహుశా, తన మనసు దోచుకున్నాడని కాబోలు!
వాణీ: సార్! పదండి, ఇక భోజనానికి వెళ్దాం.
శిరీష్: (బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ) ఈ రోజుకి పైకి తెచ్చేయ్. ఇక్కడే తింటాను. తర్వాత నువ్వెళ్ళి చదువుకో.
"ఊహు...! ఇక నేను చదవను. రేపు ఆదివారంగా... బాగా పడుకుంటా.!"
"సరే, అయితే. ముందు నాకు భోజనం తెచ్చి వెళ్ళి పడుకో..."
వాణీ కిందకి వెళ్ళి, "సార్ కి భోజనం పైకి తీసుకువెళ్ళాలంటా. ఆయనకి వొంట్లో బాగున్నట్టు లేదు," అని ఎనౌన్స్ చేసింది.
నిర్మల: వాణీ నువ్వు వచ్చి భోంచేయి. లతా! నువ్వు మాస్టారుగారికి భోజనం తీసుకెళ్ళమ్మా...!


★★★

లత: may I come in, sir.?
శిరీష్ తన బట్టలు మార్చుకుంటున్నాడు. అతని వంటిమీద టవల్ తప్ప మరేమీ లేదు. లత గొంతు వినగానే, "రా...ఇదీ మీయిల్లే కదా!" అన్నాడు.
లత లోపలికొచ్చింది. కళ్ళు చెదిరే అతని శరీర సౌష్ఠవాన్ని చూస్తూ అలా నిలబడిపోయింది. వెంటనే తేరుకొని భోజనాన్ని అక్కడున్న టేబిల్ మీద పెట్టింది. తిరిగి వెళ్ళిపోతుండగా శిరీష్ లత చేతిని పట్టుకున్నాడు. "అహ్..హ.!" ఆమెలో అలజడి మొదలైంది. అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు ఎలా ఉంటుందో అలా ఉంది తన పరిస్థితి. శిరీష్ ఇక ఒక్క అడుగు ముందుకేస్తే శాశ్వతంగా అతని బాహువులలో బంధీగా మారిపోయేదేమో! ఐతే, శిరీష్ ఆ ప్రయత్నం చేయలేదు.
లత అతనివైపు తిరిగి నేలచూపులు చూస్తూంది.
"నీ పేరేంటి?" శిరీష్ మొదటిసారి లతని చూసినప్పుడు ఎలా అడిగాడో మళ్ళా అలాగే అడిగాడు.
లత ఏమీ మట్లాడలేదు; ఏమీ మట్లాడేలా కన్పించటం లేదు.!
శిరీష్ లత బుగ్గలని పట్టుకుని ముఖాన్ని పైకి లేపాడు. లత కళ్ళు మూసుకొంది. ఆమె లేత పెదాలు అదురుతున్నాయి. "ఇప్పటివరకూ 'నువ్వు' నాకు నీ పేరు చెప్పలేదు మరి!"
"ల్..ల్లత!" అంది వణుకుతున్న పెదాలతో.
"మరి ఆ-శా-లతా?"
"న్నేనే..!"
శిరీష్ ఆమె చెయ్యి వదిలేసాడు. లత వెంటనే డోర్ వైపు తిరిగింది.
"ఆశాలతా..!" అతను పిలిచాడు. లత చప్పున వెనక్కు తిరిగి శిరీష్ ని చూసింది. అలా అతన్ని చూస్తూ ఎంతసేపైనా ఉండొచ్చని అనుకుంది.
"స్సార్!"
శిరీష్ నవ్వుతూ, "నీమీద నాకేం కోపం లేదు. నువ్వు చాలా అందమైన...— మనసున్న దానివి!" 
'అంతకంటే అందమైన తనువున్న దానివి' అని మనసులో అనుకున్నాడు.
లత అది విని పరుగెత్తుకుంటూ క్రిందకి వెళ్ళిపోయింది. ఆమెకి చాలా ఆనందంగా అనిపించింది. సార్ కి తనమీద కోపం లేదు.
తను కిందకి వెళ్ళేసరికి పిన్నీ-బాబాయిల కేకలు వినిపించసాగాయి. వాణీ ఏడుస్తూ కనిపించింది.


[Image: 1.png]

లత తన పిన్నీ-బాబాయిల ముఖంలోకి చూసింది. ఇద్దరూ ఎందుకో కోపంగా వున్నట్లు కనిపించారు.
వాణీ దగ్గరికి వెళ్ళి, "ఏమైంది వాణీ, ఎందుకేడుస్తున్నావ్?" అనడిగింది.
నిర్మల: ఏమైందా... మాస్టరుగారి దగ్గర పడుకుంటుందట... ఇందాకటినుంచీ తెగ గోల చేస్తుంది.
లత వాణీ వైపు అసహనంగా చూసింది. సాయంత్రం తనకి అర్ధమయ్యేలా చెప్పినా మళ్ళీ మొదటికొచ్చింది. రాక్షసి! ఇప్పుడు సార్ ని ఇంట్లోవాళ్ళు కచ్చితంగా ఖాళీ చేసేయమని అంటారు.
"ఒసే.. పిచ్చీ! నోర్మూసుకొని వచ్చి నాతో పడుకో. లేఁ.. పద!"
వాణీ ఇంకా వెక్కి వెక్కి ఏడ్వసాగింది. సార్ తో తప్ప ఇంకెక్కడా పడుకోవడం ఆమెకి ఇష్టం లేదు. శిరీష్ ఎప్పుడు 'నా' అనకుండా 'మన' అంటుండటంతో వాణీకూడా సార్ ని వాళ్ళింట్లో ఓ మనిషి అని నమ్మింది. ఆ నమ్మకం ఆమె మనసులో బలంగా ముద్రపడిపోయింది.
అటు... లత ఆనందం అంతా ఆవిరైపోయింది. సార్ ఇప్పుడే తనమీద కోపం లేదని చెప్పారు. ఇప్పుడు ఇంట్లోవాళ్ళు సార్ తో ఈ విషయమై గొడవపడితే మళ్ళీ సార్ తనని దూరం పెట్టేస్తారేమో!
నిర్మల: చూడు వాణీ! మాస్టారుగారు ఇక్కడ అద్దెకి ఉంటున్నారు. అతనికి చాలా ముఖ్యమైన పనులుంటాయి. ఆయనేమనుకుంటారు...? అద్దెకిచ్చి మళ్ళీ తన నెత్తిమీదకెక్కుతున్నారని అనుకోరూ! అతనికీ కాస్త ఏకాంతం కావాలి. ఇరవైనాలుగు గంటలూ నిన్ను భరించాలంటే ఎలా? అయినా రెండ్రోజులముందు వరకూ మనకు ఈ ఏసీ ఉందా? అప్పుడు నువ్వు కిందే హాయిగా పడుకున్నావుగా! నామాట విని ఈ పేచీ ఆపు. లేదంటే మాస్టరుగారు నీ గోల భరించలేక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు.
తన పిన్ని మాటలు విన్న లతకి మనసు కాస్త కుదుటపడింది. 'పర్లేదు..! ఇక్కడంతా సార్ ఏమనుకుంటారో అని కలవరపడుతున్నారు గానీ సార్ మీద కోపంతో లేరు!' అని అనుకుంటూ—
"అఁ-అయితే, స్సార్ కి ఇష్టమో కాదో ఓ-సారి కనుక్కుందామా, పిన్నీ!" అనేసి చటుక్కున తలదించుకుంది లత.
వాణీ వెంటనే లేచి, "నేఁ వెళ్ళి అడిగిరానా!" అంది.
"కూర్చో, వాణీ!" అన్నాడు ధర్మారావు గంభీరంగా.
లత, వాణీలు అతని వంక భయం భయంగా చూసారు.
బాబాయి కచ్చితంగా ఒప్పుకోరు అనుకుంది లత.
కానీ ధర్మారావు లేచి, " నేను వెళ్తాను. నేను వెళ్ళి మాస్టారుగారితో మాట్లాడతాను. ఒకవేళ అతనికి మీరక్కడ ఉండటం ఇష్టమైతే మీ ఇద్దరినీ పైకి పంపిస్తాను. సరేనా!" అన్నాడు.
'ఇద్దరినా!?' లతకి ఇదంతా కలలా అనిపిస్తోంది. 'జరుగుతున్నదంతా నిజమేనా???' మెల్లగా తన చేతిని గిల్లుకుంది. 'నిజమే!!'
వాణీ ఎగిరి గెంతేసింది. లత మనసులో అదే పని చేసింది. సార్ కచ్చితంగా ఒప్పుకుంటారని ఆమెకి తెలుసు.
"పదండి, నాన్నా!" అంటూ వాణీ వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకుని గుంజింది.
"నువ్విక్కడే వుండు, వాణీ. నేనూ, మీ అమ్మా పైకెళ్ళి మాస్టారుగారితో మాట్లాడి వస్తాం," అంటూ వారిద్దరూ మేడెక్కారు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-11-2018, 09:22 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 26 Guest(s)