27-11-2018, 11:35 AM
(26-11-2018, 11:35 PM)sandhyakiran Wrote: లక్ష్మి చెల్లీ
...కధ చాలా బాగుంది..ఎక్సోసిప్ లో కొంతవరకూ చదివినా , గత రెండురోజుల్లో మొదట్నుంచీ చదివాను..మాంచి ఊపులోకొచ్చింది..
మరోవిషయం.. ఓ పాఠక మిత్రుడికి ( జీవన్ గారికి) సమాధానమిస్తూ
’ దీనివల్ల ( ...అంటే కధలు వ్రాయడం వల్ల ... అని సందర్భం..) నేను ఇతర రచయితల కథల్ని చదవలేక పోతున్నాను ...’ అన్న నీ స్టేట్మెంట్ ని స్వానుభవం వల్ల ఒప్పుకుంటున్నాను.
ఐతే ’ అందుకని నేను ఇక కథలేమీ రాయకూడదు అనుకుంటున్నాను..’ అనే భాగాన్ని మాత్రం సమర్థించను.
..దేనికి కేటాయించే టైము దానిదే!.. వేర్వేరు కారణాలవల్ల అప్డేట్లివ్వడం ఆలస్యం కావచ్చు. అంచేత పై కారణం వల్లో , మరో దానివల్లో కధలు వ్రాయడం మానేయద్దని నా విన్నపం.
సంధ్యాకిరణ్
సంధ్యక్కా...
. నీ కామెంట్ నాకు నిజంగా సంతోషాన్నిచ్చింది.. నీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం..
ఇంకో కథ రాయడం గురించి...
సమయం చిక్కినప్పుడల్లా సైట్ కి వచ్చి కొత్త అప్డేట్లు చదివి ఆనందించి వెళ్ళేదాన్ని... నేను కథ రాయడం మొదలు పెట్టాక ఉన్న సమయం అంత దానికే సరిపోతుంది.. ఇతర కథల్ని చదివేందుకు వీలు చిక్కడంలేదు...అప్డేట్ లేట్ అయితే పాఠకులు ఎలా ఫీల్ అవుతారో(ఎంతలా తిట్టుకుంటారో) తెలుసు గనుక ఉన్న సమయం అంతా కథ రాయడానికే ఇవ్వాల్సి వస్తుంది... అందుకే ఈ కథ తొందరగా ముగించి మంచి(?) పాఠకురాలిగా మిగిలిపోదామని అనుకుంటున్నాను...
అంతేగాక ఇంకో కథకి సంబంధించిన థీమ్ ఏదీ ప్రస్తుతానికి నా దగ్గర లేదు... ఆ మధ్య ఒక ఇంగ్లీష్ కథని అనువాదం చేద్దాం అనుకున్నా కానీ.. xossip మూసెయ్యడంతో అది ఇప్పుడు నా దగ్గర లేదు...
మంచి థీమ్ ఏదైనా దొరికితే అప్పుడు ఆలోచిస్తా కొత్త కథ గురించి... నీ అభిమానానికి మరో సారి ధన్యవాదాలు