15-02-2019, 06:31 PM
(14-02-2019, 10:17 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ...
మీ తొలి పారిజాతంలో 'అతడు ఆమెను జయించాడు'
ఇక మీ రచనతో మీరు మా పాఠకుల హృదయాలను సంపూర్ణంగా జయించారు.! అందులో సందేహంలేదు.
కళ్ళ ముందు జరుగుతున్నదా అన్నట్లు సాగింది కథనం.
చదువుతుంటే నాకు 'ఆవారా', 'రాజా హిందూస్థానీ' సినిమాలు గుర్తుకొచ్చాయి.
ఇక పెళ్ళిచూపులు, శోభనం, మీ 'ఇదీ... నా కథ!'ని జ్ఞప్తికి తెచ్చింది.
ఒకటి అర అచ్చుతప్పులు తప్ప కథలో వంక పెట్టడానికి ఏమి లేదు.
ధన్యవాదాలు.
మరో సుమ రచన కోసం వేచి వుంటాను.
ధన్యవాదాలు కవిగారూ ...
రాసాక నాక్కూడా కథ చివర్లో "ఇదీ..నా కథ" లా ఉందేమో అని అనిపించింది... మారుద్దామా అన్ని కూడా అనుకున్నాను.. కానీ అప్పటికే నేను దారం తెరిచి రెండు మూడు రోజులయ్యింది .. పైగా ఎందుకో మార్చేందుకు ఓపిక కూడ లేకపోవడంతో అలాగే పోస్ట్ చేసాను... ఇంకోటి నేనే రాసాను కాబట్టి నాకు అలా అనిపిస్తుందేమో అనుకున్నా...
ఇక రాజా హిందుస్తానీ నేను చూడలేదు కానీ ఆవారా సినిమాకు నా కథకు పోలిక ఉందంటారా?
అచ్చు తప్పులు సరి చేయడానికి కూడా ప్రయత్నం చేసాను.. అయినా దొర్లినట్టున్నాయి... ఇప్పుడు వెతికే ఓపిక మాత్రం నాకు లేదు... ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరైనా చెబితే బాగుండును.. ఈజీగా సరిచేద్దును..