14-02-2019, 06:51 AM
(14-02-2019, 05:00 AM)stories1968 Wrote: రాత్రి పుష్పించి తెల్లవారు సమయానికి నేలంతా పరచుకుని భూదేవి వికసించిందా అన్నట్లు ఉంటాయి పారిజాతాలు..
ఎంతో సువాసన కూడిన ఈ పువ్వులు చూసేందుకు తెల్లని పూ రేకులతో ఎర్రటి కాడతో చూడముచ్చటగా ఉంటాయి.
పూలను సుగంధ తైలాన్ని తీసేందుకు ఉపయోగిస్తారు.
. . ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత చెట్టు దిగువ భాగంలో ఆకులు ఐదు చేతివేళ్ళను పోలి ఉంటాయి.
పై భాగంలోని ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి.
ఈ వృక్షం వయసు వెయ్యి నుంచి దాదాపు ఐదువేల సంవత్సరాలు పారిజాతం అంటే సౌరభం అని ఒక అర్థం ఉంది.
.
పారిజాతాలకు సంబంధించి మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు స్టోరీస్ గారు...
నాకు తెలియని చాలా విషయాలు తెలియ జేశారు..
అయితే నేను నా దారానికి "పారిజాతాలు" అని పేరు పెట్టడానికి కారణం....
పారిజాత పుష్పాలు చాలా చిన్నవి... వాటిల్లాగే నా కథలు కూడా చిన్నవే అని అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టాను...