నా కథ...14
తల దించుకొని గదిలోకి వెళ్లిన నేను కాసేపటికి తలెత్తి చూసాను.. ఎదురుగా మంచం కనిపించింది...
అక్కడ రవి ఉంటాడనుకున్నా నేను..
కానీ మంచం ఖాళీ గా ఉంది...
రకరకాల పూలతో అందంగా అలంకరించారు మంచాన్ని...
బెడ్ మీద నిండా తెల్లటి మల్లెపూలు చల్లి ఉన్నాయి...
మధ్యలో గులాబీ రేకులతో హార్ట్ సింబల్ వేశారు...
నీలం రంగు పూల రేకులతో హార్ట్ లోకి బాణం గుచ్చినట్టు పేర్చారు...
చుట్టూ రకరకాల పూల దండల్ని వేలాడ దీశారు...
బెడ్ పక్కన స్టూల్ మీద ఒక ప్లేట్ లో పండ్లు స్వీట్లు ఉన్నాయి...
దాని పక్కన మరో స్టూల్ మీద అగరొత్తుల స్టాండ్ ఉంచి సువాసన వెదజల్లే అగరొత్తులు ముట్టించి ఉన్నాయి.. అప్పటికే ఆ గది నిండా అగరొత్తులు వాసన నిండిపోయింది...వాటికి పూల వాసన కూడా కలిసి కొత్త రకమైన వాసనలా అనిపించింది...
నేను చుట్టు చూస్తూ వెళ్లి చేతిలోని పాల గ్లాస్ అక్కడున్న స్టూల్ మీద పళ్ళ ప్లేట్ పక్కన పెట్టాను...
బాత్ రూమ్ డోర్ తీర్చుకున్న చప్పుడు విని అటు తిరిగి చూసాను...
లోపల్నుండి రవి బయటకు వస్తూ కనిపించాడు...
తెల్లటి లాల్చీ, పైజామా వేసుకున్నాడు...
బాత్రూం డోర్ మూసి మేమున్న గది తలుపువైపు వెళ్లి దాన్ని లోపల్నుండి లాక్ చేసి నా దగ్గరకు వచ్చాడు...
నేను తల దించుకొని నిలబడ్డాను...
బయట అక్క చెప్పిన మాటలు నా చెవుల్లో తిరుగుతుంటే...
అతడేమి చేసినా వద్దనొద్దని నిర్ణయించుకున్నాను...
ఆల్రెడీ ఒకసారి నా శరీరాన్ని నా ఇష్టం లేకుండానే అనుభవించాడు... ఇప్పుడు ఇంకొకసారి నా ఇష్టంతో సంబంధం లేకుండా అనుభవిస్తాడు... బహుశా జీవితాంతం అంతేనేమో...
కాకపోతే ఆ రోజు నేను అతన్ని వద్దని చాలా సేపు ప్రతిఘటించాను.. ఇకనుండి అతనికి ఆ కష్టం కూడా ఉండదు...
ఇలా మనసంతా ఒక రకమైన వైరాగ్యం నిండి...మంచం పక్కన తల దించుకొని... ఉదాసీనంగా నిలబడి ఉన్న నా దగ్గరికి వచ్చాడు రవి...
నా ముందు నిలబడి పైనుంచి కింది దాకా నన్ను పరీక్షగా చూసాడు...
కొద్దిసేపు అలాగే చూసి... " నిలబడే ఉన్నావేం కూర్చో అక్షరా"
అన్నాడు...
నేను తల దించుకుని అలాగే నుంచున్నాను...
భుజాల మీద చేతులు వేసి కూచోమన్నట్టుగా కిందికి వత్తాడు...
నేనిక తప్పదన్నట్టుగా మంచం మీద కూర్చున్నా...
కాసేపు నన్ను అలాగే చూస్తూ నిలబడ్డ రవి... సడన్ గా కింద నేలకు ఆనించి ఉన్న నా పాదాలను పట్టుకున్నాడు...
నేను వెంటనే నా కాళ్ళు పైకి లాక్కునే ప్రయత్నం చేశాను... కానీ రవి గట్టిగా వాటిని కౌగిలించుకున్నట్టుగా పట్టుకోవడంతో సాధ్యం కాలేదు...
నేను విడిపించుకునేందుకు పెనుగులాడుతుంటే...
" ఐ యాం సారీ అక్షరా... నన్ను మన్నించు.. "
అన్నాడు కాళ్ళు వదలకుండానే...
"ఎంత సింపుల్ గా చెప్పేసావ్ .. సారీ .. అని.. నేను ఇన్ని రోజులు పడిన బాధ అంతా ఒక్క మాటతో పోతుందా..." అందామనుకున్నాను కానీ అనవసరం అనిపించింది...
ఇంతలో రవి మళ్లీ అన్నాడు
" ఐ యాం రియల్లీ సారి అక్షరా.. నాకు తెలుసు నేను చేసింది క్షమించరాని నేరం అని... క్షమాపణలు అడిగే అర్హత కూడా నాకు లేదు... కానీ నేను కావాలని చేయలేదు.... ముందు నేను చెప్పేది పూర్తిగా విను అక్షరా.. తర్వాత నువ్ నాకు ఏ శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను "
అంటూ నా మొహం వైపు చూసాడు...
నేను కదలకుండా అలాగే కూర్చుని తల తిప్పుకున్నా...
అతని మాటలు వింటుంటే ఇన్నాళ్లు నేను అనుభవించిన నరకం లాంటి క్షోభ గుర్తొచ్చింది...
నా కళ్లలోంచి అప్రయత్నంగా కన్నీళ్ళు కారుతున్నాయి...
రవి నా కాళ్ళు వదిలేసి నా రెండు చేతుల్ని కలిపి పట్టుకుని " ప్లీజ్ అక్షరా నువ్ అలా ఏడవకు ... నేను చెప్పేది విను.. ఆ తర్వాత నీ కోపం తగ్గే వరకు ..అవసరమైతే ఈ జీవితాంతం నన్ను శిక్షించు... అంతే కానీ నువ్ ఏడవకు... నేను చూడలేను"
అన్నాడు...
'తట్టుకోలేను' అనే మాట వినే సరికి కోపం వచ్చింది నాకు..
తర్వాత అదొరకమైన నవ్వు కూడా వచ్చింది... ఏడిస్తే తట్టుకోలేని వాడు... అలా చేస్తాడా ఎక్కడైనా అనిపించింది... కానీ ఏమీమాట్లాడలేదు నేను... ఇంకా ఏం చెప్తావ్ అన్నట్టు చూసాను..
" ఆరోజు జరిగింది నేను కావాలని చేసింది కాదు అక్షరా... అదంతా అనుకోకుండా జరిగింది..."
"ఎలా నమ్ముతాను "మనసులో అనుకున్నాను నేను..
"నువు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం అక్షరా" అన్నాడు నా మనసు చదివినట్టు..
నేను తలెత్తి అతన్ని చూసాను...
తను నన్ను చూడకుండా తన చేతుల్లో ఉన్న నా చేతుల్ని చూస్తూ చెప్పడం కంటిన్యూ చేసాడు..
"అక్షరా...మీ అక్క పెళ్లిలో నువు కనిపించిన మరుక్షణమే నీ మీద ఇష్టం ఏర్పడింది నాకు... లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో నాకు ఆ క్షణమే తెలిసింది ...
నువ్ కనిపించగానే నా మనసులో అనిపించిన దాన్నే నేను నీకు చీటీ మీద రాసి పంపాను..
ఆ రోజ్ నువ్ కనపడిన తర్వాత చాలా సేపటి వరకు మరేదీ కనిపించలేదు నాకు...
నువ్వేటు వెళ్తే నా కళ్ళు అటే తిరిగాయి...
మధ్యాహ్నం ఫ్రెండ్స్ బలవంతంగా నన్ను తీసుకెళ్తేనే వెళ్ళాను...
అంత నచ్చావు నువ్ నాకు..."
"....."
"ఆ రోజు బయటకు వెళ్లిన తర్వాత నా ఫ్రెండ్స్ అడిగారు 'ఏంటిరా ఏంటి సంగతి' అని....
నాకు నువ్ నచ్చావని వాళ్ళతో చెప్పా...
అప్పటివరకు నేను ఏ అమ్మాయిని చూడలేదు...
అలాంటిది మొదటి సారి నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు... నన్ను కంగ్రాట్యులేట్ చేస్తూ పార్టీ కావాలని అడిగారు...
నువ్ కనబడిన సందర్భాన్ని నాక్కూడా సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది...
అందుకే సరే అని పెద్ద హోటల్ కి వెళ్ళాం...
నేను సాధారణంగా తాగను కానీ ఆ రోజు వాళ్ళు నేను తాగితే గానీ తాగను అంటే కొద్దిగా తాగాను...
మాటల మధ్యలో నా లవ్ సక్సెస్ కావాలంటే నేను నీకు అదే రోజు ప్రపోస్ చేయాలని నా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు.. లేదంటే నేను నిన్ను అందుకోలేనన్నారు...
నేను ఛాలెంజ్ కి ఒప్పుకున్నాను...
నిజానికి నాక్కూడా నిన్ను మళ్లీ చూడాలనిపించింది...
ఆ రాత్రికి నీ రూమ్ కి వచ్చి నీకు ప్రపోస్ చెయ్యాలని అనుకున్నాను...
మందు వాసన నోటినుండి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా....
మీరు అప్పగింతలు చేస్తున్నప్పుడే నేను మీ ఇంట్లోకి వచ్చి ఒక గదిలో అటక మీద దాక్కున్నాను...
అందరూ పడుకున్నాక నువ్ ఉన్న గదికి వచ్చాను..."
రవి ఎలా వచ్చాడో చెప్తుంటే ఆశ్చర్యంగా అతన్ని చూశా నేను...
నన్ను పట్టించుకోకుండా రవి చెప్పుకుంటూ వెళ్తున్నాడు...
" నేను నీ గదికి వచ్చే సరికి నువ్ నిద్రపోతున్నావ్...
పెళ్లికోసం వేసుకున్న డ్రెస్ లోనే నిద్రపోతున్నావ్ నువ్వు...
నిద్రలో కూడా చాలా అందంగా కనిపించావు నువ్వు...
నాకు నిన్ను లేపాలనిపించలేదు....
నీ పక్కనే కూర్చుని నిన్నే చూస్తూ కూర్చున్నా...
అలా ఎంతసేపు కూర్చున్నానో నాకూ తెలియదు...
ఎంతసేపు చూసినా తనివి తీరలేదు...
చాలా సేపటి తరువాత నువ్ నిద్రలో కదలడంతో నీ చెయ్యి నా మీద పడింది...
మెత్తటి నీ చెయ్యిని నా చేతుల్లోకి తీసుకుని నిమురుతున్నప్పుడే నువ్ నిద్ర లేచావ్...
తర్వాత జరిగింది నీకు తెలుసు............."
అని కాసేపు ఆగాడు...
"అవును చాలా బాగా ప్రపోస్ చేశావ్... లోకంలో ఎవరూ చేయని విధంగా" మనసులోనే అనుకున్నా...
రవి మళ్లీ అన్నాడు...
".............కానీ నేను అలా కావాలని చేయలేదు...
నేను వచ్చింది నీకు ప్రపోస్ చేసి వెల్దామని మాత్రమే...
కానీ నేను వచ్చినపుడు నువ్ పడుకున్న విధానం చూసి ముచ్చటేసింది నాకు.... నీ అందం నన్ను మైమరిపింప జేసింది. . నిన్ను ఎక్కువ సేపు చూడొచ్చని అనిపించి నిన్ను లేపకుండా చూస్తూ కూర్చున్నాను...
నువ్ లేచాక కూడా నాకెలాంటి దురుద్దేశమూ లేదు...
నీకు గుర్తుందో లేదో...
మొదట నువ్ ఎందుకొచ్చావ్ అని అడిగినప్పుడు కూడా నిన్ను చూడలనిపించి వచ్చాననే చెప్పాను...
అది నిజంగా నిజం కూడా...
ఫ్రెండ్స్ ఛాలెంజ్ నాకు అక్కడికి రావాలనే కోరికకు సాకు మాత్రమే....
నిజానికి నిన్ను చూడాలనే వచ్చాను...
నువ్ లేవకుండా ఉండి ఉంటే నేను రాత్రంతా నిన్ను చూస్తూనే గడిపే వాన్ని కావొచ్చు......."
"నేను లేవడం వల్లే ఆ ఘోరం చేశానని... నీ తప్పేం లేదని... తప్పంతా నాదేనని సమర్ధించుకుంటావా ఇప్పుడు" అనుకున్నా నేను...
"........అయితే నువ్ లేచాక మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ....నీలో కలిగిన భయం చూసి.. నాకు నిన్ను కాసేపు ఆటపట్టిస్తే బాగుంటుందని అనిపించింది...
అందుకే నీ మీదిమీదికి వచ్చా...
నువ్ భయపడుతున్న కొద్దీ నిన్ను ఏడిపించాలనే కోరిక పెరిగింది...
'మొదటిసారి ఒక బాపు బొమ్మని అనుభవిద్దామని వచ్చాను' అని నీతో అన్నప్పుడు కూడా నాకా ఉద్దేశ్యం లేదు... కేవలం నిన్ను ఆటపట్టించడానికే అన్నా ఆ మాట...
నిన్ను ఇంకా ఏడిపించాలనే మొదటిసారి నిన్ను ముద్దు పెట్టుకున్నాను గానీ ఏదో చేయాలని కాదు....
అయితే ఆ ముద్దు ప్రభావమో...లేక తాగిన మందు ప్రభావమో గానీ తర్వాత నాలో మార్పు వచ్చింది...
నువ్ నన్ను నెట్టేసి బెదిరించినట్టు మాట్లాడుతుంటే నాలో నీ మీద ఇంకా ఏదో చేయాలనే కోరిక కలిగింది...
అది క్రమంగా పెరిగి ఒకరకమైన ఉన్మాదం నన్ను కమ్మేసింది....
నీ బాడీ తప్ప నాకేమీ కనిపించలేదు...
నీ వేడుకోలు వినబడలేదు... నీ కన్నీళ్లు కనబడలేదు...
నేను చేసిందంతా నా కంట్రోల్ లో లేకుండానే జరిగింది....
అంతా అయ్యాక కూడా నాకు పట్టుకున్న మైకం తొలగలేదు....."
రవి నోటి వెంట ఆ మాటలు వింటుంటే నాకు అదంతా గుర్తుకు వచ్చి కన్నీళ్లు ఆగలేదు...
"నీ మీదనే నిద్రపోయిన నేను మళ్ళీ లేచే సరికి నువ్వు నిద్ర పోతున్నావు...
మత్తు దిగి నీ మీది నుండి దిగా...
నీ చెంపలమీద కన్నీటి చారలు కనబడుతుంటే నేను చేసిన ఘోరం ఏంటో అర్థం అయింది...
అక్కడే తలపట్టుకొని కూర్చున్నా...
చాలాసేపటి వరకు నాకేం చేయాలో అర్థంకాలేదు...
ఇంతలో బయట మనుషుల అలికిడి మొదలయింది...
మీ వాళ్ళు లేచినట్టున్నారు అని అర్థం అయింది...
లేచి వెళ్లిపోదామని డోర్ వరకు వెళ్లి తిరిగి నీ వైపు చూసా...
ఏడుపు ముఖంతో నగ్నంగా నిద్రిస్తున్న నీ మీద చాలా జాలి వేసింది...
కానీ అప్పుడు చేయడానికి ఏం లేదు...
ఎవరైనా నువ్ లేవక ముందు నీ గదికి వస్తే నువ్ నగ్నంగా ఉంటే బాగుండదనిపించింది...
తిరిగి నీ దగ్గరకు వచ్చి ఒక దుప్పటి తీసుకొని నీ మెడ వరకు కప్పి.. డోర్ ముందుకు వేసి వెళ్లిపోయా....."
"కసాయిపని చేసి తరువాత కనికరం చూపించావన్నమాట" అనుకున్నా నేను...
చాలా సేపట్నుండి ఒకే తీరుగా కూర్చోవడం తో నడుము నొప్పెట్టి మంచం పైకి జరిగి కాళ్ళు చాపుకుని మంచపు చెక్కను అనుకుని కూర్చున్నా...
రవి కిందనే అలాగే కూర్చుని నా కాళ్ళ మీద తలా ఆనించి చెప్పడం కంటిన్యూ చేసాడు....
"ఇంటికి వెళ్ళాక నా రూంలోకి వెళ్లి విపరీతంగా ఏడ్చాను...
ఎప్పుడూ ఏ అమ్మాయి వంకా నేను కన్నెత్తి చూడలేదు అక్షరా...
ఏ ఒక్కరితోనూ మిస్ బిహేవ్ చేయలేదు... మాటవరసకి కూడా పరాచకాలు ఆడలేదు...
నువ్ ఎవరినైనా అడుగు అమ్మాయిలతో నా ప్రవర్తన ఎలా ఉంటుందో...
ఆఫీసులో కూడా చాలా మంది అమ్మాయిలు పనిచేస్తారు...
ఏ ఒక్కరినీ నేను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదు....
అటువంటిది నేను ఎంతగానో ఇష్టపడ్డ నిన్ను ఏకంగా రేప్ చేసాను...
నన్ను నేను క్షమించుకోలేని నేరం చేసా నేను..
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు...
నిన్ను కలిసి క్షమాపణ అడిగితే బాగుంటుందనిపించింది...
ఆ రోజు మధ్యాహ్నం నిన్ను కలవాలని మీ ఇంటికి వచ్చాను... కానీ ఇంటినిండా బంధువులు ఉండడంతో నాకు ధైర్యం చాలలేదు...
తర్వాత కూడా ఒకటి రెండు సార్లు మీ ఇంటిదాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయాను...
నా వల్ల కాలేదు..
రెండు మూడు రోజుల వరకు ఎవరినీ కలువ లేదు...
సరిగా భోజనం చేయలేదు...
అమ్మ , రాజు అడిగితే ఏమీ లేదని చెప్పా...
రాత్రి పగలు నా రూంలోనే ఉన్నా...
ఎంత ఆలోచించినా ఏం చేయాలో తెలియట్లేదు...
నాకే ఇలా ఉంటే నువ్వు ఎలా ఉన్నవో అని భయం వేసింది..
నీ పరిస్థితి తలచుకున్నప్పుడల్లా గుండెల్ని పిండేసే బాధ కలిగేది... ఏం చేస్తే నీకు ఉపశమనం కలుగుతుందో తెలియలేదు... ఇప్పుడు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము ఏంటి... అని ఎంతగానో ఆలోచించా ... కానీ ఏమీ తోచలేదు...
ఒక రోజు మీ ఇంటికి దగ్గరకు వచ్చి మళ్లీ వెళ్లిపోతుంటే... దారిలో ఒక ముసలావిడ ఒక చెట్టుకింద కూర్చొని ఎవరో ఒక అబ్బాయికి చేతిమీద పచ్చబొట్టు పొడుస్తుంది... సన్నటి సూదితో ఆమె పొడిచినప్పుడల్లా ఆ అబ్బాయి అమ్మా అని అరుస్తున్నాడు... అయిపోతుంది బాబు కొంచెం ఓర్చుకో అంటూ పొడుస్తుంది ఆవిడ..
నేను ఆ అబ్బాయి పని అయ్యేంత వరకు అక్కడే ఆగాను....
అయ్యాక చూసాను అతని చేతి మీద ఒక పేరు ఉంది... అది వాళ్ళ అమ్మ పేరట డబ్బులిస్తూ ముసలావిడకి చెప్తున్నాడా అబ్బాయి...
అతడు వెళ్ళాక నేను ఆమె దగ్గరకు వెళ్ళాను...
ఏం బాబు పచ్చబొట్టు పొడిపించుకుంటావా అని అడిగింది....
నేను సమాధానం చెప్పకుండా...
రోజుకి ఎంత సంపాదిస్తావ్ అని అడిగా...
ఎంత బాబు పేరుకు వంద తీసుకుంటా... రోజులో ఒకరో ఇద్దరో వస్తారు.. అంతే అంది...
సరే నాతో వస్తావా రోజుకి రెండు వేలు ఇస్తాను అన్నా...
ఎందుకు బాబు అంది ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ...
నువ్ చేసేపనే చెయ్యాలి అన్నా...
సరే బాబు అంది...
అయితే పద కారెక్కు అన్నా నేను..
ఆమెను తీసుకొని ముంబయి లో ఉన్న మా గెస్ట్ హౌస్ కి వెళ్ళాను..."
అంటూ చెప్పడం ఆపి పైకి లేచాడు రవి....
రవి చెప్తున్నది నాకేం అర్థం కాలేదు...
అయోమయంగా అనిపించి తలెత్తి అతని వైపు చూసాను...
లేచి నిలబడ్డ రవి తన లాల్చీ తీస్తున్నాడు...
నా కనుబొమ్మలు ముడి పడ్డాయి...
తర్వాత తన బనియన్ కూడా తీసేసాడు...
ఈ సారి నా కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి...
అతని తెల్లటి ఒంటిపై నిండా చిన్న చిన్న అక్షరాలు మూడేసి ఉన్నాయి... చాలా చిన్నగా ఉన్నాయి...
చేతుల మీద తప్ప మెడ కింద నుండి నడుము వరకు ఒంటి నిండా ఉన్నాయి... ఒక్కో పదానికి మధ్య చాలా చిన్న గ్యాప్ ఉంది... రవి తన లాల్చీ బనియన్ కొయ్యకు వేయడానికి వెళ్తుంటే చూసా... వీపు మీద కూడా నిండా ఉన్నాయి... తిరిగి రవి దగ్గరగా వచ్చాక వాటిని సరిగ్గా గమనించి చూసాను... కలిపి చదివితే అన్నీ
... 'అక్షర' ...అంటే నా పేరు..
" నేను చేసిన తప్పుకు ఇది శిక్షగా భావించా అక్షరా"
అన్నాడు మంచం మీద నా కాళ్ళ దగ్గర కూర్చుంటూ...
"వారం రోజుల పాటు సూదులతో పొడిపించుకున్నాను నీ పేరుని... ఒక్కో సూది పోటు ఆమె గుచ్చుతుంటే కలిగిన బాధతో నీ తరపున నా మీద నేను ప్రతీకారం తీర్చుకున్నాను...."
రవి చెప్తుంటే నేను ఆశ్చర్యంగా చూసాను...
కొన్ని వందల పేర్లు ఉన్నట్టున్నాయి అతని శరీరం మీద...
అన్ని సార్లు అంత చిన్నగా పేర్లు రాస్తే ఎన్ని సూదుల పోట్లు గుచ్చి ఉండాలి...
తలుచుకుంటేనే నా ఒళ్ళు జలదరించింది....
" దీని వల్ల నీకు జరిగిన ఉపకారం ఏమీ ఉండకపోవచ్చు కానీ నాకు మాత్రం ఎవరిమీదో తీవ్రమైన కసి తీర్చుకున్న ఫీలింగ్ కలిగింది...
కొంతలో కొంత సాంత్వన లభించింది...
రక్తాలు కారిన నా శరీరం గాయాలు తగ్గడానికి మరో రెండు వారాలు పట్టింది....
కానీ నా మనసుకు నేను చేసుకున్న గాయం ఇంకా ఫ్రెష్ గా ఉండి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది...
అది నీ గురించే ఆలోచిస్తుంది...
నువ్వెంత బాధపడుతున్నావో అని ఎప్పుడూ బాధ పడుతూనే ఉంది...
ఏం చేస్తే నీకు మేలు జరుగుతుంది అని మదన పడింది............."
ఇన్నాళ్లు నేనొక్కదాన్నే బాధ పడ్డాను అనుకున్నా నేను... కానీ ఇప్పుడు రవి చెప్తున్నది వింటుంటే రవి కూడా నాతో సమానంగా బాధ పడ్డట్టు అనిపిస్తుంది నాకు...
కానీ ఇదంతా నిజంగా నిజమేనా అని ఒక సందేహం కూడా కలిగింది...
పచ్చబొట్లు అయితే కనబడుతున్నాయి...
కానీ అతను చెప్పేవన్నీ నిజమేనా...
"........... ముంబై లో ఉన్న మూడు వారాలు నీ గురించే ఆలోచించా అక్షర... కానీ నాకు ఏం చేయాలో తెలియలేదు....
మళ్లీ ఇక్కడికి వచ్చాక ఒక రోజు మీ బావ ఇంటికి వచ్చి మమ్మల్ని డిన్నర్ కి పిలిచాడు...
అమ్మ బలవంతం మీద నేనూ వెళ్ళాను...
అక్కడ వాళ్ళ పెళ్లి ఆల్బమ్ చూస్తుండగా ఒక ఫొటోలో నువ్వొక్కదానివే ఉన్నావ్...
మీ అక్క పెళ్లిలో నువ్ ఎంత అందంగా ఉన్నావో ఆ ఫోటో చూపిస్తుంటే... చాలా సేపు నేను ఆ ఫోటోనే చూస్తూ ఉండి పోయా...
అమ్మ అది గమనించినట్టుంది....
చాలా రోజులుగా అమ్మ నన్ను పెళ్లిచేసుకోమని బతిమాలుతుంది... కానీ నేనే ఒప్పుకోలేదు...ఆ రోజు నేను నీ ఫోటోను అంతసేపు చూడడంతో నన్ను అడిగింది... ఆ అమ్మాయి నచ్చిందా.. పెళ్లి చేసుకుంటావా అని...
పరధ్యానంలోనే అవును అని చెప్పా నేను...
అంతే అమ్మ వెంటనే మీ అక్కని పిలిచి అడిగింది ఎవరు అని...
మా చెల్లెలే అని మీ అక్క చెప్పడంతో అమ్మ డైరెక్ట్ గా పెళ్లి విషయం అడిగేసింది...
మీ అమ్మ వాళ్ళని అడిగి చెప్తా అని మీ అక్క చెప్పింది...
నేను తేరుకుని వారించే లోపే ఇవన్నీ జరిగిపోయాయి...
తర్వాత నాకూ అదే బాగుంటుందనిపించింది...
నిన్ను పెళ్లిచేసుకోవడమే సమస్యకు పరిష్కారంలా తోచింది...
ఇంతకన్నా వేరే మంచి దారి ఏదీ లేదనిపించింది....పెళ్లి చూపులకి వచ్చినపుడు నీతో పర్సనల్ గా మాట్లాడి నీకు సారి చెప్పి నిన్ను ఒప్పిద్దామనుకున్నా... కానీ నువ్ పెళ్లిచూపులు ఏం వద్దు అనే సరికి నీ మనసులో ఏముందో, ఎందుకు పెళ్లిచూపులు వద్దంటున్నావో నాకు అర్థం అయింది...
నిన్ను నేను పెళ్లిచేసుకోవడమే కరెక్ట్ అని నాకా క్షణం ఇంకా గట్టిగా అనిపించింది... "
అంటూ నా వైపు చూసాడు రవి...
నేను తలదించుకొని అతని మాటలన్నీ వింటున్నాను... .రవి మంచం దిగి కిటికీ వద్దకు వెళ్లి బయటకు చూస్తూ నిలుచున్నాడు...
నేను అతని మాటల్లో నిజానిజాలని బేరీజు వేసుకుంటున్నాను.... రవి చెప్పేదంతా నిజమేనా నమ్మొచ్చా అని ఆలోచిస్తున్న...
ఇంతలో రవి తిరిగి మంచం వద్దకు వచ్చాడు...
మంచం పక్కన కింద కూర్చుని నా కాళ్ళ పై తల ఆనించి నా వైపు చూస్తూ మళ్లీ చెప్పడం మొదలెట్టాడు..
" నిన్ను పాడు చేసాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను అనుకోవద్దు అక్షరా...
నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను ....
ఎంత కష్టమైనా నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను...
కానీ దురదృష్టం కొద్దీ నిన్ను నొప్పించి పెళ్లి చేసుకున్నా...
ఇకనుంచి నా జీవితం నీకు అర్పిస్తున్నాను అక్షరా...
బతికున్నన్నాళ్లు నేను నీకు బానిసను...
నిన్ను అంతగా ఇబ్బంది పెట్టినందుకు నాకు నువ్ ఏ శిక్షయినా విధించు.. ఆనందంగా అనుభవిస్తా... ఇక మీదట నీకు ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకుంటా... నన్ను నమ్ము అక్షరా.....
ఈ ఒక్క సారికి నన్ను క్షమించు... ఈ జీవితంలో మళ్లీ ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను...
Forgive me Akshara... please forgive me"
అంటూ కళ్ళు మూసుకొన్నాడు రవి...
అతని కళ్లలోంచి నీళ్లు కారి నా పాదాలను తడుపుతున్నాయి....
నాకు అంతా కన్ఫ్యూజన్ గా ఉంది రవి చెప్పిందంతా విన్నాక...
నమ్మాలా వద్దా అని తేల్చుకోలేక పోతున్నా నేను...
రవిని క్షమించాలి అంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు... ఆ రాత్రి అతని ప్రవర్తన గుర్తుకొస్తే ఇప్పటికీ విపరీతమైన కోపం వస్తుంది...
కానీ నా బుద్ధి వేరేలా ఆలోచిస్తుంది...
రవి చెప్పిందంతా తిరిగి ఒకసారి మననం చేసుకున్నా...
ఎక్కడా అబద్ధం చెప్పినట్టుగా అనిపించట్లేదు...
కావాలని చేయలేదని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాక కూడా అతని మీద ద్వేషం పెంచుకోవడం తగదని నా బుద్ధి చెబుతోంది..
రవి చెప్పింది మొత్తం నిజమే కావచ్చు అనిపించసాగింది...
మోసం చేసే ఉద్దేశ్యమే ఉంటే తిరిగి నన్ను పెళ్లి చేసుకోవలసిన అవసరం ఏముంది..
నా శరీరం మీద మోజు తీరకనా... అలా అయితే ఇప్పుడు కూడా ఈ రాత్రి అతనికి అడ్డేముండేది...
ఎందుకు సంజాయిషీ ఇచ్చాడు... శరీరాన్ని అనుభవించడానికి ఇప్పుడు అతనికి ఏ అడ్డంకి లేదు కదా...
ఒక వేళ నేను ఒప్పుకోకున్నా ఆ రాత్రిలా ఈ రాత్రీ... బలవంతంగానైనా అనుభవించొచ్చుగా...
కానీ ఎందుకు చేయలేదు...
అతని మాటలు నిజమేనేమో అనిపించి అతని వైపు చూసాను... పాదలమీద తలాఉంచి కళ్ళు మూసుకొని ఉన్నాడు...
తల నా వైపే తిరిగి ఉంది... ఏ కదలికా లేదు.. నిద్ర పట్టినట్టు ఉంది....
నేను పరీక్షగా చూసాను...
ముఖం చాలా అలిసిపోయినట్టుగా ఉంది...
నా కళ్ళు కాస్త కిందికి చూశాయి...
షర్ట్ లేని అతని ఒంటి మీద నిండా...... 'అక్షర' అనే అక్షరాలు సందులేకుండా ఉన్నాయి...
వాటిని చూడగానే నా మనసు కదిలి పోయింది...
నేను కాళ్ళు కదలకుండా కొద్దిగా పైకి లేచి అతని ఒంటిపై నున్న అక్షరాలని తడిమి చూసాను...
కళ్లలోంచి నీళ్లు పొంగుకొచ్చాయి...
మనసు తన బెట్టు వీడి బుద్ధితో ఏకీభవించింది...
నేను తిరిగి వెనక్కి మంచాన్ని ఆనుకుని కూర్చున్నా....
ఆలోచిస్తుంటే జరిగిందాంట్లో రవి తప్పు లేదని కూడా అనిపించింది... అదీ కాకుండా నేను ఇప్పుడు చేయగలిగేది కూడా ఏమి లేదు అనిపించింది...
ఎలాగు అతనితో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకునే ఆ గదిలోకి అడుగు పెట్టా.. అటువంటప్పుడు అతన్ని క్షమించి ఆ పని చేస్తే కాస్త మనసుకి ఉపశమనం కలుగుతుంది... కాబట్టి జరిగింది ఒక ఆక్సిడెంట్ అనుకోవాలి అని మనసుకి సర్ది చెప్పా...
చాలా సేపు ఆలోచించా నేను... క్రమ క్రమంగా రవి మీద కోపం కాస్తా తగ్గిపోసాగింది...
మరొక్క సారి కళ్ళు మూసుకొని రవి చెప్పిందంతా గుర్తు చేసుకోసాగాను...
ఇప్పుడు రవి చెప్పిన ఒక్కో మాట నా మనసును నింపుతున్న అమృతపు బిందువుల్లా అనిపించసాగాయి...
రవిమీద కోపం పూర్తిగా పోయింది...
తిరిగి చూస్తే రవి ఇంకా నా కాళ్ళమీద అలాగే నిద్రపోతున్నాడు...
అతని మొహం చూస్తుంటే తప్పు చేసి తల్లితో దెబ్బలు తిని... ఏడ్చి ఏడ్చి తల్లి ఒళ్ళోనే తలపెట్టి పడుకున్న చిన్న పిల్లాడిలా అనిపించాడు..
ముందుకి వంగి అతని తల మీద చేయి వేసి నిమిరా... మరో చెయ్యి అతని వీపు మీద వేసి నిమిరా... ఒక్కో పేరును తడుముతూ నా చెయ్యి అతని వీపంతా నిమురుతుంటే.. రవి సడన్ గా లేచాడు...
నేను చిన్నగా నవ్వాను ... రవి చటుక్కున లేచి కూర్చున్నాడు....
" నీకు నా మీద కోపం పోయిందా" అని అడిగాడు...
అవును అని తలూపాను...
"థాంక్యూ అక్షరా... థాంక్యూ వెరీ మచ్... నువ్ నన్ను ఇంత త్వరగా క్షమిస్తావని అనుకోలేదు" అన్నాడు నా పాదాలని ఊపుతూ....
"ముందు నువ్ అక్కడనుండి లే పైకి " అన్నాను నేను..
రవి లేచి మంచం మీద కూర్చున్నాడు...
" అక్షరా ... అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను... ఇక మీదట నీకు కష్టం కలిగించే ఏ పనీ చెయ్యను... " అన్నాడు నా చేతిని తన చేతిలోకి తీసుకొని ఒట్టేస్తూ...
నేను నా మరో చేతిని అతని చేతి మీద వేసాను సరే నమ్ముతున్నాను అన్నట్టుగా...