Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అంతలో పక్కనే ఉన్న ఫోన్ మోగడంతో రాము లిఫ్ట్ చేసి, “హలో….” అన్నాడు.

అవతల చెప్పింది విన్న రాము వెంటనే బాత్‍రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి యూనిఫామ్ వేసుకుని మానస వైపు చూసి, “మానసా నేను అర్జెంట్‍గా బయటకు వెళ్తున్నా….నువ్వు రెస్ట్ తీసుకో,” అంటూ కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోయాడు.
*********
రాము వెంటనే ప్రసాద్ చెప్పిన స్పాట్ దగ్గరకు వచ్చాడు.
అప్పటికే ప్రసాద్, నలుగురు కానిస్టేబుల్స్ అక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
రాము రావడం చూసి ప్రసాద్ అతని దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసాడు.
రాము : ఎలా జరిగింది…..
ప్రసాద్ : సార్…చనిపోయిన అతను….అడ్వాన్స్ న్యూరాలజీ సెంటర్ హెడ్….పేరు నారాయణ….న్యూరాలిజీలో దేశంలోనే మంచి ఫేమస్ పర్సన్….
రాము : న్యూరాలజీనా…..
ప్రసాద్ : అవును సార్…ఈయన స్పెషలైజేషన్ మెదడు….దానికి సంబంధించిన డాక్టర్….బ్రెయిన్ ఫంక్షనాలిటీ రీసెర్చ్ లో బాగా ఫేమస్….ఈయన చనిపోవడంతో పెద్ద పెద్ద ఇన్‍స్ట్యూషన్స్ అన్నిటికి హాలిడే డిక్లేర్ చేసారు….
అలా వాళ్లు మాట్లాడుకుంటూ మర్డర్ జరిగిన చోటకు వచ్చారు.
నారాయణ శవం దగ్గర ఫోరెన్సిక్ డిపార్ట్‍మెంట్ వాళ్ళు ఫింగర్ ప్రింట్లు కోసం వెదుకుతూ అక్కడ సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.
అక్కడ నారాయన శవం గొంతులో ఇనుప సువ్వ దిగి ఉన్నది.
రాము మెల్లగా బాడీ దగ్గరకు వెళ్లి హత్య ఎలా చేసారా అని చూస్తున్నాడు.
శవం మెడలో వెనక నుండి గోడకు ఉన్న ఇనుపసువ్వకి నొక్కి పెట్టడంతో గొంతులో నుండి బయటకు వచ్చింది.
అది చూడగానే రాముకి తనను అశోక్ ఇంతకు ముందు తనను లాక్కెళ్ళి ఇలాగే చంపడానికి ట్రై చేయడం గుర్తుకొచ్చింది.
రాము అక్కడ నుండి లేచి అక్కడ రాయి మీద రెండు చేతి వేళ్ల ముద్రలు రక్తంతో ఉండటం చూసాడు.
అక్కడ ఉన్న అతను రాము వైపు చూసి, “సార్…హంతకుడు గ్లౌస్‍లు వేసుకున్నాడు….ఫింగర్ ప్రింట్లు ఏవీ దొరకలేదు,” అన్నాడు.
రాము అలాగే చూస్తూ ముందుకు వెళ్ళేసరికి ఒక చెప్పు కనిపించింది.
అది చనిపోయిన నారాయణది అని అర్ధం అయిన రాము ఎదురుగా చూసి అక్కడ ఉన్న చెత్త మధ్యలో ఒక లైన్‍లో పక్కకు తొలగినట్టు ఉండటంతో హంతకుడు చంపే ముందు నారాయణని ఈడ్చుకొచ్చాడని అర్ధమయింది.
దాంతో రాము ఆ చెత్తను చూస్తూ ముందుకు వెళ్లాడు.
అక్కడ ఉన్న ఒక పిల్లర్ మిద రక్తం మరకలు చూసి అర్ధమయినట్టు తల ఊపాడు.
అది చూసి ప్రసాద్, “సార్….ఏమైనా క్లూ దొరికిందా,” అన్నాడు.
రాము అవునన్నట్టు తల ఊపుతూ, “ఇక్కడ జరిగింది నాకు అర్ధమయింది చెబుతాను….పొద్దున్నే ఆ సైంటిస్ట్ నారాయణ గారు….వాకింగ్‍కి వచ్చి ఉండాలి…ఇక్కడకు రాగానే హంతకుడు అతన్ని పట్టుకుని ఈ పిల్లర్‍కి ఉన్న లైట్ కేసి కొట్టి….అలాగే ఈ పిల్లర్‍కి తల పట్టుకుని కొట్టిన తరువాత…ఆయన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి అక్కడ గోడకు ఉన్న ఇనుపసువ్వని గొంతులో దిగబడేలా చేసి చంపేసాడు…కాకపోతే నారాయణని చంపే ముందు కొట్టాడు,” అంటూ ఇంతకు ముందు రక్తపుమరకలతో ఉన్న చేతి గుర్తులు ఉన్న రాయి దగ్గరకు వచ్చి, “ఇప్పటిదాకా జరిగిన హత్యలకు, ఇప్పుడు జరిగిన హత్యకు ఒక పెద్ద తేడా ఉన్నది…” అన్నాడు.
ప్రసాద్ : ఏంటి సార్ అది…..
రాము : మర్డర్ చేసి దొరికిపోగూడదని చేతికి గ్లౌసెస్ వేసుకున్నాడు….కాని హంతకుడు మాత్రం ఇపుడు జరిగిన ఈ హత్యకు….ఇంతకు ముందు జరిగిన రెండు హత్యలకు లింక్ ఉన్నది మనకి చెప్పాలని ట్రై చేస్తున్నాడు…..
ప్రసాద్ : నాకు మీరు చెప్పేది అర్ధం కావడం లేదు….వేరే వేరే వాళ్ళు హత్యలు చేస్తున్నారు…కాని హత్యలు మాత్రం ఒకే ప్యాట్రన్‍లో జరుగుతున్నాయి….చాలా కన్‍ఫ్యూషన్‍గా ఉన్నది….మర్డర్లన్నీ మళ్ళి ఒకేలా ఉంటున్నాయంటున్నారు….
రాము : నాకు అదే అర్ధం కావడం లేదు ప్రసాద్….ఇంతకు ముందు మనం చూసిన హత్యలు కోపంతోనో, కోరికతోనో చేసినవి…కాని ఈ హత్య మాత్రం క్లియర్‍గా ఒక మోటివ్ కనిపిస్తున్నది…(అంటూ అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఇద్దరూ అక్కడ నుండి బయలుదేరారు.)
అక్కడ నుండి బయలు దేరిన రాము, ప్రసాద్ తిన్నగా హత్య చేయబడిన నారాయణ వాళ్ళింటికి వచ్చారు.
అప్పటికే తన స్టాఫ్ నారాయణ భార్యతో మాట్లాడుతున్నారు.
మిగతా వాళ్ళు ఇంట్లో ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో అని వెదుకుతున్నారు.
ఇద్దరు కానిస్టేబుల్స్ ఇంట్లో పని వాళ్లను ఎంక్వైరీ చేస్తున్నారు.
రాము ఇంట్లోకి వచ్చి మొత్తం చూస్తూ నారాయణ టేబుల్ దగ్గరకు వచ్చి టేబుల్ మీద ఉన్న వస్తువులను, పేపర్లను చూస్తూ సొరుగులు తీసి చూస్తుండగా రివాల్వర్ కనిపించడంతో దాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు.
రాము ఆ రివాల్వర్ తీసుకుని పక్కనే ఉన్న కానిస్టేబుల్‍కి ఇచ్చి, “దీని సీరియల్ నెంబర్ రికార్డ్ చేసి…వివరాలు కనుక్కో …ఎప్పుడు అప్లై చేసారు….ఈయన చేతికి ఎప్పుడు వచ్చింది….అన్నీ కనుక్కో….,” అన్నాడు.
కానిస్టేబుల్ సరె అని రివాల్వర్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
రాము అక్కడ ఉన్న పుస్తకాల్లో సైకలాజిస్ట్ సతీష్ రాసిన బుక్ కనిపించేసరికి దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తున్నాడు.
అంతలో నారాయణ కొడుకుని పిలిచి, “ఈ పుస్తకం బాగా చదువుతారా,” అనడిగాడు రాము.
“అవును సార్….మా నాన్నగారు….ఈ బుక్ గురించి నాతో ఒకసారి చెప్పారు….ఆయన పేరు కూడా సతీష్….మరి దీన్ని పూర్తిగా చదివారో లేదో నాకు తెలియదు సార్…..” అన్నాడు.
రాము : ఈయన సెమినార్స్ కండక్ట్ చేస్తుంటారు….ఎప్పుడైనా మీ నాన్నగారు వెళ్లారా….
అతను : నాకు తెలిసి వెళ్ళలేదనే అనుకుంటున్నా సార్…మా నాన్న గారు స్టాన్‍ఫోర్డ్‍లో సెమినార్లు ఇస్తుంటారు… అలాంటి ఆయన ఇలాంటి సెమినార్లకు వెళ్లరనే అనుకుంటున్నా….
రాము సరె అని తల ఊపుతూ అక్కడ నుండి ప్రసాద్‍ని తీసుకుని సతీష్ సెమినార్లు జరిగే హోటల్‍కి వెళ్ళాడు.
అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి, “సతీష్ గారిని కలవాలి,” అనడిగాడు రాము.
రిసెప్షనిస్ట్ : సార్…ఇప్పుడు సెమినార్‍లో ఉన్నారు….కొద్దిసేపు కూర్చోండి సార్…..
దాంతో రాము, ప్రసాద్ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని సతీష్ కోసం ఎదురుచూస్తున్నారు.
అలా పావుగంట ఆగిన తరువాత సతీష్ తన సెమినార్ పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ బయటకు వచ్చాడు.
రిసిప్షన్ : excuse me sir…..(సతీష్ ఏంటి అన్నట్టు ఆమె వైపు చూడగానే….ఆమె రాము వాళ్ళ వైపు చూపిస్తూ…) మిమ్మల్ని కలవడానికి వచ్చారు…..
ఆమె అలా అనగానే సతీష్ తల తిప్పి అటు వైపు చూసాడు.
ప్రసాద్ సోఫాలో నుండి పైకి లేచి, “హలో సార్….ఎలా ఉన్నారు,” అంటూ విష్ చేసాడు.
కాని సతీష్ అతని మాటలకు సమాథానం ఇవ్వకుండా రాము వైపు చూస్తూ, “నాతో రండి,” అంటూ తన కేబిన్ లోకి వాళ్లను తీసుకెళ్ళాడు.
వాళ్ళు కేబిన్ లోకి వెళ్ళిన తరువాత సతీష్ తన చైర్‍లో కూర్చుంటూ, “కూర్చోండి…..” అంటూ చైర్స్ వైపు చూపించాడు.
రాము చైర్‍లో కూర్చుంటూ టేబుల్ మీద ఉన్న యాష్ ట్రేలో మోర్ సిగిరెట్ చూస్తూ అలానే ఆలోచిస్తున్నాడు.
మోర్ సిగిరెట్ చూసున్న రాముకి ఇంతకు ముందు జిమ్ ట్రైనర్ అశోక్, మేకప్ మేన్ సుబాని కూడా ఇలాగే మోర్ సిగరెట్ తాగుతున్నట్టు గుర్తుకొచ్చింది.
దాంతో రాముకి ఏదో తేడా కొడుతున్నట్టు అనిపించి సతీష్ తో, “సతీష్ గారు…..” అన్నాడు.
సతీష్ వెంటనే రాము వైపు, “ఏంటి,” అన్నట్టు చూసాడు.
రాము అతని వైపు కొంచెం ఆందోళనగా చూస్తూ, “మీరు బాగానే ఉన్నారు కదా,” అనడిగాడు.
“ofcourse…..నేను బాగానే ఉన్నాను….మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది,” అంటూ సతీష్ తన రివాల్వింగ్ చైర్‍లో వెనక్కు వాలి రాము వైపు చూసి నవ్వుతూ, “మీకు ఏమయింది….మీరే ఏదో టెన్షన్‍గా ఉన్నట్టున్నారు,” అన్నాడు.
రాము అలా ఎందుకు అడిగాడో….అతని మొహంలో కంగారు చూసి ప్రసాద్ కూడా వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూస్తున్నాడు.
“చెప్పండి రాము గారు….ఇంతకు ముందు సెమినార్‍కి వచ్చారు కదా….ఎలా ఉన్నారు….హెల్త్ అంతా సెట్ అయిందా,” అంటూ సతీష్ టేబుల్ మీద మోర్ సిగరెట్ పాకెట్ తీసుకుని అందులొ నుండి ఒక సిగిరెట్ తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు.
అది చూసిన రాము, “సతీష్ గారు….మీరు ఎమీ అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా,” అన్నాడు.
“తప్పకుండా…ఏమడగబోతున్నారు,” అంటూ సతీష్ సిగిరెట్ వెలిగించుకోవడానికి లైటర్ తీసుకున్నాడు.
రాము అతని చేతిలో ఉన్న మోర్ సిగిరెట్ వైపు చూస్తూ, “మీరు ఇప్పుడే స్మోక్ చేస్తున్నారా….లేకపోతే ఎప్పటి నుండో మీకు ఈ అలవాటు ఉన్నదా….” అనడిగాడు.
రాము అలా అడగగానే సతీష్ ఒక్కసారి తన చేతిలో ఉన్న సిగరెట్ వైపు, రాము వైపు ఒకసారి చూసి, “ఇదివరకు ఉండేది…వదిలేసాను…మళ్ళీ ఇప్పుడే మొదలుపెట్టాను….” అంటూ తన చేతిలో ఉన్న సిగిరెట్, లైటర్‍ని తిరిగి టేబుల్ మీద పెట్టేసాడు.
[+] 11 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 24-12-2019, 01:04 PM



Users browsing this thread: 1234567891011, 4 Guest(s)