07-11-2018, 06:09 AM
నా కథ...10
అక్క వెళ్ళాక ఏం చేయాలో తెలియక చాలా సేపు అలాగే కూర్చుండి పోయాను...
మనసంతా బ్లాంక్ గా అయిపోయింది...
అక్క చెప్పిన విషయం నేను ఇంకా అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నాను...
ఇది నేను ఏ మాత్రమూ ఊహించని పరిణామం...
అక్క పెళ్ళైన నెలరోజుల్లో నా పెళ్ళికి సంబంధించిన ప్రస్తావన వస్తే మామూలు పరిస్థితుల్లోనే నమ్మడం కష్టం..
అలాంటిది ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నా దగ్గరకు ఇలా పెళ్లి ప్రస్తావన రావడం నా మనసు జీర్ణం చేసుకోలేకపోతుంది...
నాకు అక్క పెళ్లి నాటి రాత్రి సంఘటన గుర్తొచ్చింది...
రవి చేతిలో మలైనమై(?) పోయిన నేను అందరూ 'చాలా మంచివాడు' అంటున్న వ్యక్తికి భార్యగా వెళ్లడం సరైనదేనా...?
ఇది అతనికి ద్రోహం చేయడం కాదా...?
జీవితాంతం అతన్ని మోసం చేస్తూ బతకాలా?
పోనీ అతనికి నిజం చెప్తే అర్థం చేసుకుని అంగీకరిస్తాడా...? వదిలేస్తాడా..?
అప్పుడు నా పరిస్థితి ఏమిటి?
ఇలా రకరకాల ప్రశ్నలు ...
మరో వైపు..
జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా?
నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నేనెలా బాధ్యురాలిని అవుతాను?
నా తప్పేమీ లేనప్పుడు ద్రోహం చేసినట్టెలా అవుతుంది...
అయినా ఇతగాడేమైనా సత్పురుషుడా...
ఫొటోలో, వీడియోలో చూసి నచ్చానని ఏకంగా పెళ్లి వరకు వెళ్ళిపోయాడు...
నా అభిప్రాయం ఏమైనా పట్టించుకున్నాడా...
నా ఇష్టం తెలుసుకోకుండానే పెళ్లి తప్పనిసరి అనే స్టేజి కి పరిస్థితులను తీసుకొచ్చాడు...
మాట వరసకి నా అభిప్రాయం అడుగుతున్నారు గానీ అక్క చెప్పినదాన్ని బట్టి చూస్తే ఈ పెళ్లి తప్పక జరిగేలాగే ఉంది..
రవి నా ఇష్టం లేకుండానే బలవంతంగా నా శరీరంతో ఆడుకున్నాడు...
ఇతడు ఇప్పుడు పెళ్లి పేరుతో దర్జాగా అదే పని చేద్దామనుకుంటున్నాడు...
ఇద్దరి మధ్యా పెద్ద తేడా ఉన్నట్టు అనిపించట్లేదు నాకు..
ఆ మాటకొస్తే మగాళ్లేవరికీ ఆడవాళ్ళ అభిప్రాయాలతో పనిలేదేమో అనిపించింది..
లేకపోతే నాన్న గానీ, బావ గానీ నా ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండానే విషయం ఇంతవరకు తీసుకొస్తారా అనిపించింది .
చేతిలోని పుస్తకం నుండి ఫోటో ఉన్న కవర్ అంచులు బయటకు కనబడుతున్నాయి...
నాకు దాన్ని తీయాలని గానీ, ఫోటో చూడాలని గానీ అనిపించలేదు...
పుస్తకంతో సహా దాన్ని పక్కన పడేసి పడుకుండి పోయాను...
అటు కాసేపు, ఇటు కాసేపు ఆలోచనలతో తెలియకుండానే నిద్రపోయాను...
మర్నాడు పొద్దున పూట అమ్మా, నాన్నా, అక్కా, నేను అందరం టిఫిన్ చేస్తున్నాం...
నేను ఏమీ మాట్లాడకుండా తింటున్నాను...
అమ్మ అక్కకు సైగ చేయడం తెలుస్తూనే ఉంది నాకు..
కాసేపటికి అక్క అడిగింది...
"అక్షరా ఫోటో చూసావా, అబ్బాయి నచ్చాడా" అని..
నేను అవును అన్నట్టు తలూపాను..
"మరి వాళ్ళని రమ్మందామా" అని అడిగింది అక్క..
"దేనికి" అన్నాను నేను..
"చెప్పా కదే పెళ్లి చూపులకి"
"ముందే నన్ను చూసి వాళ్లకు నేను నచ్చానని చెప్పావ్ కదా... మళ్లీ పెళ్లి చూపులెందుకు"
"నువు చూడవా"
"మీరు చూసారు కదా... మీ అందరికీ నచ్చినవాడు నాకు నచ్చకుండా ఉంటాడా"
"అది కాదే. ఏదో ఫార్మాలిటీ కైనా పెళ్లిచూపులు ఉండాలి కదా"
"నాకవన్నీ ఇష్టం లేదక్కా... ఆల్రెడీ వాళ్ళకి నేను , మీకు అతడు నచ్చడం జరిగింది... ఇంక పెళ్లిచూపులు ఎందుకు"
"ఏంటే నీకా అబ్బాయి నచ్చలేదా"
"నచ్చకపోవడం కాదక్కా... నువ్వే చెప్పావు కదా.. నేను ఓకే అంటే చాలు పెళ్లి అయిపోయినట్టే అని..
ఇప్పుడు నేను సరే అంటున్నా కదా... ఇంకా ఈ తతంగం అంతా అవసరమా...
అసలు నాకు మొదట్నుంచీ పెళ్ళిచూపుల తతంగం అంటే చాలా కోపం .. వాళ్ళెవరో వస్తారని పొద్దున్నించి రెడీ అయి కూచోవడం.. కాఫీలు టిఫిన్లు ఇవ్వడం..
అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ వినయంగా జవాబులివ్వడం...
ఇదంతా ఒక పెద్ద ప్రహసనం... చిరాకు వ్యవహారం..
నా అదృష్టానికి ఇప్పుడు వీళ్ళు ఇదంతా ఏమీ లేకుండానే ఓకే చెప్పారు..
ఐ యాం వెరీ హ్యాపీ నౌ..
పెళ్ళిచూపులే కాదు ఎంగేజ్మెంట్ కూడా ఏమీ వద్దు...డైరెక్టుగా పెళ్లి పెట్టేయండి..
నా పెళ్ళికి సంబంధించి ఇదొక్కటే నా కోరిక..
ప్లీస్ అక్కా కాదనకండి"
అని చెప్పేసి నా గదిలోకి వెళ్ళిపోయాను...
నేను చాలా రోజుల్నుండి ముభావంగా ఉండడం వల్లనో ఏమో.. అమ్మగానీ, నాన్నగానీ ఏమీ మాట్లాడలేదు...
కాసేపటికి అక్క నా గదికి వచ్చి నచ్చజెప్పాలని చూసింది...
నేను అక్కతో అదే మాట చెప్పాను..
నేనేమీ ఈ పెళ్లి మీద అయిష్టంతోనో , ఎవరిమీదైనా కోపంతోనో అలా అనడం లేదని...
పెళ్లిచూపులు, ఎంగేజ్మెంట్ వంటివి ఇష్టం లేకే వద్దంటున్నాని .. వివరంగా చెప్పాను..
అందరినీ ఒప్పించమని అక్కని బతిమాలాను...
నిజంగానే నాకు ఇప్పుడు అవన్నీ అనవసరం అనిపించింది..
ఎలాగు ఎవరినో ఒకరిని ఎపుడో అపుడు పెళ్లి చేసుకోక తప్పదు...
అది ఎవరైతే ఏంటి అనిపించింది...
అందుకే పెళ్లికి ఒప్పుకున్నాను...
కానీ ఈ మిగతా ప్రహసనం అనవసరం అనిపించింది...
అందుకే అక్కను బతిమాలాను...
నాన్న అక్క మాట కాదనడని నాకు తెలుసు..
అక్క ఏమి చెప్పి వెళ్లిందో గానీ రెండు రోజుల వరకు ఎవరూ నాతో ఆ విషయం మాట్లాడలేదు...
నేను ఎక్కువగా నా రూంలోనే అర్థం లేని, అంతంకాని ఆలోచనలతో గడిపాను...
పుస్తకంలో కవర్ రోజు కనబడేది కానీ ఒక్క సారికూడా దాన్ని తీసి అతని ఫోటో చూడలనిపించ లేదు నాకు..
రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం పూట బావ వచ్చాడు...
అప్పుడు నేను నా రూమ్ లొనే ఉన్నాను..
హాల్ లో బావ, నాన్న మాటలు నాకు వినవబడుతున్నాయి...
బావ: "అక్షర వద్దందని కాదు గానీ మావయ్యా... నిజంగానే మనకు ఎంగేజ్మెంట్ లాంటివి పెట్టుకునే సమయం లేదు"
నాన్న: ఎందుకని
బావ: వాళ్ళు పంతులుగారిని పిలిచి అడిగారట... ఇప్పట్నుండి 10 రోజుల వరకు మాత్రమే మంచి ముహుర్తాలు ఉన్నాయట... అవి దాటితే మరో నాలుగు నెలలు ఆగవలసి వస్తుందట..
నాన్న : మరీ పది రోజుల్లో అంటే ఏర్పాట్లు అవీ కష్టం కదా బాబూ...
బావ: పెళ్ళిఖర్చులు,మిగతా ఏర్పాట్లు అన్నీ వాళ్ళు చూసుకుంటామన్నారు మావయ్యా...
నాన్న: కట్నకానుకలు ఎలాగూ ఇవ్వట్లేదు... పెళ్ళిఖర్చులు కూడా మనం పెట్టుకోకుంటే బాగుండదు బాబూ... అవన్నీ మనమే పెట్టుకుందాం.. అమ్మాయికి కొన్ని నగలు కూడా చేయిద్దామనుకుంటున్నాను... డబ్బుది కాదు సమస్య..
ఇంత తక్కువ సమయంలో ఏర్పాట్లు చేయగలమా అని..
బావ: మేమంతా లేమా మావయ్య... ఈ రోజుల్లో అన్నీ రెడీమేడ్... ఆర్డర్ ఇస్తే రెండు రోజుల్లో అన్నీ అయిపోతాయి.. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి... అన్నీ నేను చూసుకుంటాను
నాన్న: మీరున్నారనే నాకూ ధీమాగా ఉంది బాబూ.. సరే కానివ్వండి..
బావ వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు ..
పది రోజుల తర్వాత ఉన్న డేట్ ఫిక్స్ చేయమని చెప్పాడు...
అక్కకి కూడా ఫోన్ చేసి చెప్పేసాడు...
సాయంత్రానికి అక్క ఇక్కడికి వచ్చేసింది..
అమ్మా, నాన్న బంధువులందరికీ ఫోన్లు చేసి పెళ్లికి రమ్మని చెప్తున్నారు... దాదాపు ప్రతి ఒక్కరికీ వచ్చిన సంబంధం గురించీ, తొందరగా చేస్తున్న కారణం గురించీ చెప్తున్నారు...
నేను ఇవేమీ పట్టించుకోవడంలేదు...
వీలైనంత వరకు ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ హడావిడి నుండి తప్పించుకుంటున్నాను...
పెళ్లి ఇంకో వారం ఉందనగా షాపింగ్ కి వెల్దామన్నారు అమ్మా ,అక్కా..
నేను రాను మీరే వెళ్ళండి అన్నాన్నేను...
అదేంటే నీ పెళ్లి షాపింగ్ నువ్ రాకుంటే ఎలా అన్నారు...
మీకన్నా నాకెక్కువ తెలుస్తుందా అన్నాన్నేను..
"తెలియడం తెలియకపోవడం కాదు నువ్ రావాలంతే... నీక్కాబోయే అత్తయ్య గారు కూడా వస్తానంది... ఇప్పుడు నువ్ రాను అంటే నీకిష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారేమో అనుకుంటుంది ఆవిడ.. నోరు మూసుకుని రెడీ అవ్వు.. ఇంకో గంటలో ఆవిడ వచ్చేస్తుంది" అని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పి వెళ్ళింది అక్క...
నేను ఇంక తప్పదన్నట్టు స్నానం చేసి సాధారణంగానే రెడీ అయ్యాను...
కొద్ది సేపటికి ఇంటి ముందు ఒక పెద్ద కారు ఆగింది...
అందులోంచి ఒక పెద్దావిడ దిగింది.. ఆమె వెనుక ఇంకో పాతికేళ్ల వ్యక్తి దిగాడు... ఆరడుగుల ఎత్తున్నాడు.. కళ్ళకి నల్ల కళ్ళద్దాలు ఉన్నాయి..
రింగులు తిరిగిన ఉంగరాల జుట్టు.. చామన ఛాయ అని మనం అనుకునే రంగు కన్నా కాస్త తెలుపే అనుకుంటా.. ఠీవిగా దిగి ఆమె వెంట ఇంట్లోకి వచ్చాడు...
"ఆవిడే నీక్కాబోయే అత్తయ్య" అంది నా చెవిలో మా అక్క...
అతని గురించి ఏమీ చెప్పలేదు...
బహుశా అతడేనేమో పెళ్లికొడుకు...
ఫోటో నాకు ఇచ్చింది కదా చూసి ఉంటానేమో అనుకోని చెప్పట్లేదు అనుకుంటా...