Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
ప్రదేశం: కాలేజ్ ఆవరణ - VIP ఎంట్రెన్స్
సమయం: సాయంత్రం 06:05 గంటలు (ప్రళయ వర్షం ఆరంభం)
ఆధీర దారుణంగా గాయపడి అక్కడి నుండి తప్పించుకుని పారిపోయిన సరిగ్గా అదే సమయంలో... ఆకాశమంతా కాళరాత్రిలా మారి, ఒక్కసారిగా పిడుగుల హోరుతో భారీ ప్రళయ వర్షం కురవడం ప్రారంభమైంది!
రక్తంతో తడిసిన ఆ నేల పైన వర్షపు నీరు పడుతూ... ఎర్రటి రక్తపు కాల్వలై పారుతోంది.
అక్కడే ఉన్న అల్కా, సోనుని తీసుకుని కారులో హాస్పిటల్‌కి వెళ్లిపోవడంతో...
అక్కడి రణరంగంలో కేవలం అలేఖ్య, రక్తపు మడుగులో స్పృహతప్పి పడి ఉన్న విజయ్, మరియు అలసిపోయి రక్తం ఓడుతున్న భావన (FAB SHADOW) మాత్రమే మిగిలారు.
సరిగ్గా అదే సమయంలో... అప్పటివరకు సురేష్ చోప్రా పంపిన విఐపి సెక్యూరిటీ డ్రెస్‌లో దాక్కున్న 10 మంది వరల్డ్ డేంజరస్ కిల్లర్స్ పొదల్లోంచి బయటకు వచ్చారు!
వాళ్లకు కావలసిన అసలైన టార్గెట్ అలేఖ్య మరియు అక్కడున్న ఆ ముసుగు కమాండో (భావన) దొరకగానే...
ఆ 10 మంది రౌడీలు తమ చేతుల్లోని పదునైన కత్తులు, ఇనుప రాడ్లను ఝుళిపిస్తూ వర్షంలో నీటిని చీల్చుకుంటూ వేగంగా వారి వైపు పరుగెత్తుకుంటూ వచ్చారు!
వెనుక నుండి వర్షపు హోరులో వినబడుతున్న ఆ రాక్షస అడుగుల శబ్దాన్ని భావన మైండ్ కంప్యూటర్ కంటే వేగంగా గ్రహించింది! భావన వెంటనే వెనక్కి తిరిగి, అలేఖ్య వైపు చూస్తూ గట్టిగా అరిచింది:
భావన: "అలేఖ్యాఅఅఅఅఅ!!!!!!!"
ఆ గొంతు వినగానే... అలేఖ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది! ఆ పరిచితమైన, ప్రాణసమానమైన గొంతును అలేఖ్య క్షణాల్లో గుర్తుపట్టింది.
అలేఖ్య: (కళ్లల్లోంచి కన్నీళ్లు వర్షంలో కలుస్తుండగా, షాక్‌తో) "అక్కాఅఅఅఅఅ...!"
రక్తపు మడుగులో స్పృహతప్పి పడి ఉన్న విజయ్ కూడా ఆఖరి శ్వాసతో కళ్లు విప్పి, ముసుగులో ఉన్న భావన వైపు చూస్తూ క్షీణించిన గొంతుతో:
విజయ్: "అమ్మా...!"
భావన మోకాళ్లపై కూర్చుని, విజయ్ చెంపపై తన వణుకుతున్న చేతిని ఉంచింది. తల్లి స్పర్శ తగలగానే విజయ్ కళ్లల్లో ఆనంద భాష్పాలు నిండాయి. భావన మాస్క్ లోంచి కన్నీళ్లు కారుతుండగా అలేఖ్యతో అంది:
భావన: "అలేఖ్యా! విజయ్‌ని హాస్పిటల్‌కి తీసుకువెళ్లొద్దు... అక్కడ శత్రువుల నిఘా ఉంటుంది! మీ ఫ్రెండ్స్‌కి చెందిన ఏదైనా రహస్య ఇంట్లో అత్యవసరంగా మెడికల్ ట్రీట్మెంట్ చేయించండి!
నువ్వు విజయ్‌ని తీసుకుని ఇక్కడి నుండి త్వరితగతిన వెళ్లు... ఇక్కడున్న ఆ రాక్షసులను నేను చూసుకుంటాను!"
విజయ్: (భావన చేయి గట్టిగా పట్టుకుని) "వద్దు అమ్మా... నువ్వు కూడా రా అమ్మా!"
భావన: "వెళ్లు నాన్నా... నేను మీ వెనుకాలే వస్తాను! నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో అలేఖ్యా!"
అలేఖ్య విజయ్‌ని భుజాలపైకి లేపబోతుండగా... వెనుక నుండి పరుగెత్తుకొచ్చిన ఒక సురేష్ చోప్రా కిల్లర్ తన పదునైన కత్తిని అలేఖ్య తల నరకడానికి బలంగా కిందికి విసిరాడు!
"భచ్స్సససస!!!!"
సరిగ్గా ఆ కత్తి అలేఖ్య తలను తాకే మిల్లీసెకనులో... భావన తన కుడిచేతిని అడ్డంగా పెట్టి ఆ పదునైన కత్తి దెబ్బను తన పట్టి చేతితో అడ్డుకుంది! కత్తి భావన అరచేతిని చీల్చింది, రక్తం వర్షపు నీటిలో చిమ్మింది!
భావన: (అలేఖ్యతో గర్జిస్తూ) "ఆపి... నువ్వు వెళ్లు!"
అలేఖ్య కన్నీళ్లతో విజయ్‌ని పట్టుకుని పరుగెత్తడం ప్రారంభించింది.
ఇప్పుడు భావన ఆ 10 మంది వరల్డ్ డేంజరస్ కిల్లర్స్ ఎదుట ఏ ఒక్క ఆయుధం లేకుండా రణచండిలా నిలబడింది!
తన దేహంలో విపరీతమైన నీరసం, ప్రెగ్నెన్సీ వల్ల కళ్లు తిరుగుతున్నా... తన కొడుకుకి, చెల్లికి రక్షణగా నిలబడటానికి సృష్టిలోని 'విశ్వం' లాంటి ఆఖరి శక్తిని బయటకు తీసింది.
తన కత్తిని పట్టుకున్న భావనను చూసి మొదటివాడు వికృతంగా నవ్వి ముందుకు దూకాడు. భావన వాడి కత్తి ఉన్న చేతిని మణికట్టు వద్ద పట్టుకుని 360 డిగ్రీలు తిప్పేసింది! "కటక్" మంటూ వాడి చెయ్యి విరిగిపోగా, మరుక్షణంలో వాడి గొంతును తన రెండు చేతులతో పట్టుకుని మెడ ఎముకలను విరిచి పడేసింది!
రెండోవాడు ఇనుప రాడ్‌తో భావన తలపై కొట్టడానికి వచ్చాడు. భావన వర్షపు నీటిలో జారి కిందికి వంగి (Low Glide Slide), వాడి ఛాతీ ఎముకల (Ribcage) పై తన రెండు పిడికిళ్లతో "భచ్... భచ్!" మంటూ బలంగా బాదింది! వాడి పక్కటెముకలు విరిగి గుండెల్లోకి దిగిపోవడంతో వాడు రక్తం కక్కుకుంటూ పడిపోయాడు!
మూడోవాడు సైడ్ నుండి దాడి చేయగా... భావన తన కాలి బూటుతో వాడి మోకాలిప్పపై తన్నింది! వాడు మోకాళ్లపై పడగానే, తన మోచేతితో వాడి వెన్నుపూస (Spine) పై బలంగా కొట్టింది! వాడి నడుము విరిగి నిశ్చేష్టంగా పడిపోయాడు!
నాలుగో, ఐదో కిల్లర్స్ ఇద్దరూ ఒకేసారి భావనపై పడ్డారు. భావన వాళ్లిద్దరి జుట్టును, మెడలను పట్టుకుని... వర్షపు పిడుగుల శబ్దంతో సమానంగా వాళ్లిద్దరి తలలను ఒకదానికొకటి బలంగా బాదింది! "థచ్!" అనే శబ్దానికి వాళ్లిద్దరి పుర్రెలు బద్దలై రక్తసిక్తమై శవాలుగా కూలబడ్డారు!
ఆరోవాడు భావన వీపుపై కత్తితో నరికాడా! సూట్ దెబ్బకి కాపాడినా నొప్పికి భావన నోటి నుంచి రక్తం వచ్చింది. భావన కోపంతో తిరిగొచ్చి వాడి లివర్ భాగంలో బలంగా గుద్ది, వాడి దవడ బద్దలయ్యేలా 'అప్పర్కట్' ఇచ్చింది! వాడు గాల్లోకి లేచి పడ్డాడు!
ఏడోవాడు భావన గొంతు నొక్కడానికి చూడగా... భావన వాడి రెండు భుజాల నరాలపై (Nerve-Lock) పొడిచి, రెండు భుజాలను సాకెట్ల నుండి ఊడదీసి విరిచేసింది!
ఎనిమిదో, తొమ్మిదో రాక్షసులు భయంతో అరుస్తూ రాడ్లతో వచ్చారు. భావన గాల్లోకి 10 అడుగులు లేచి, వాళ్లిద్దరి ఛాతీలపై తన రెండు కాళ్లతో ఒకేసారి 'డబుల్ డ్రాప్ కిక్' కొట్టింది! వాళ్లిద్దరి గుండెల ఎముకలు పొడిపొడై అక్కడే ప్రాణాలు వదిలారు!
పదోవాడు పారిపోవడానికి చూడగా... భావన వర్షపు నీటిలో వేగంగా పరుగెత్తి వాడి జుట్టు పట్టుకుని వెనక్కి గుంజి, వాడి గొంతును తన కాళ్లతో చుట్టి 'హెడ్-లాక్' చేసి మెడ తిప్పేసింది! "కటక్!"
ఆ 10 మంది వరల్డ్ డేంజరస్ కిల్లర్స్ ఎముకలు విరిగి, దారుణంగా శవాలై వర్షపు నీటిలో పడిపోయారు!
ఆ 10 మందినీ ఏ ఆయుధం లేకుండా దారుణంగా నరికివేసిన తర్వాత... భావన ఒళ్లంతా రక్తంతో తడిసిపోయింది.
ఆమె దేహంలో ఉన్న శక్తి మొత్తం ఇంకిపోయింది. మూడు రోజుల నుండి తిండి లేకపోవడం, ప్రెగ్నెన్సీ వల్ల వస్తున్న దారుణమైన నీరసం, కాలేజీ ప్రాంగణంలో సాగించిన భయంకరమైన పోరాటం వల్ల... భావన కళ్లు పూర్తిగా తిరగడం మొదలయ్యాయి!
విజయ్, అలేఖ్యలు దూరంగా ఒక కారులో సురక్షితంగా వెళ్లడం చూసి... భావన ప్రశాంతంగా చిరునవ్వు నవ్వింది.
తన ముఖానికి ఉన్న మాస్క్‌ను తీసివేసి... తూలుతూ, రక్తం కారుతున్న శరీరంతో వర్షంలో నడుచుకుంటూ ముందుకు సాగింది.
కొద్ది అడుగులు వేసిందో లేదో... భావన కళ్లు మూతపడి, వర్షపు నీటితో నిండిన ఆ నేల పైన స్పృహతప్పి కుప్పకూలిపోయింది! సరిగ్గా అదే క్షణంలో...
కాలేజీ వెనుక రహస్య మార్గం నుండి ఒక నల్లటి గ్లాసెస్ ఉన్న హై-స్పీడ్ విఐపి కార్ వేగంగా వచ్చి భావన పక్కన ఆగింది!
కారు డోర్ తెరుచుకుని అందులోంచి కొందరు బయటకు వచ్చారు. స్పృహతప్పి పడి ఉన్న భావనను ఎంతో జాగ్రత్తగా ఎత్తుకుని కారు వెనుక సీట్లో పడుకోబెట్టారు.
ఆ కారు డోర్ మూతపడగానే... ఎమర్జెన్సీ సైరన్ లేకుండా, వర్షంలో లైట్లు వెలిగించుకుని ఆ నల్లటి కారు భావనను తీసుకుని వాయువేగంతో అక్కడి నుండి వెళ్లిపోయింది!
The following 18 users Like Sunnysunnysunny's post:18 users Like Sunnysunnysunny's post
• AB-the Unicorn, akak187, Akhil2544, Babu_07, gora, krish1983, Krush_5242, Mahesh12345, Mohana69, na_manasantaa_preme, puku pichi, Raj0003, Ram.alone, Santhosh king, sriramakrishna, Terminator619, Vego1990, VijayPK
Posts: 1,450
Threads: 0
Likes Received: 756 in 570 posts
Likes Given: 4,637
Joined: Nov 2018
Reputation:
12
Mugguru danger lo unnaru....yudham chala bhayankaranga jarigindhi bro...
Update chala chala bagundi
Posts: 291
Threads: 3
Likes Received: 766 in 196 posts
Likes Given: 1,733
Joined: Nov 2024
Reputation:
57
Yudhani kallamundhu chupinchadam meke sadyam sunny garu
AKHIL❤️
Posts: 390
Threads: 0
Likes Received: 371 in 305 posts
Likes Given: 2,313
Joined: Aug 2021
Reputation:
6
Excellent superb extremely nice
Posts: 32
Threads: 0
Likes Received: 32 in 24 posts
Likes Given: 299
Joined: Nov 2024
Reputation:
4
I thought sunny is the strongest and bhavana weakest but here sunny fell first and bhavana stood still ....in thrillers readers will get excited when some thing happens than they never thought of .....excellent writing bro keep going
Posts: 450
Threads: 8
Likes Received: 1,085 in 281 posts
Likes Given: 1,042
Joined: May 2022
Reputation:
54
Posts: 4,440
Threads: 0
Likes Received: 3,043 in 2,327 posts
Likes Given: 12
Joined: Feb 2020
Reputation:
39
Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
డెహ్రాడూన్ నరమేధం - పూనమ్ దేవి త్యాగం & 'సీమ' అవతారం
సమయం: సాయంత్రం 05:00 గంటలు
ప్రదేశం: డెహ్రాడూన్ (సీమ నివాసం & ప్రైవేట్ హ్యాంగర్)
సాయంత్రం సరిగ్గా 5:00 గంటల సమయం.
శత్రువులతో వీరపోరాటం చేసి, ఒంటినిండా భయంకరమైన గాయాలతో రక్తం ఓడుతూ పూనమ్ దేవి నేలకొరిగింది. శరీరం స్పృహ కోల్పోతున్న క్షణాల్లో...
ఆమె ఆఖరి శ్వాసతో పక్కనే ఉన్న చెల్లి సీమ చేతిని గట్టిగా పట్టుకుంది. పూనమ్ గొంతు బొంగురుపోయి, మాటలు కూడా సరిగ్గా రావడం లేదు.
పూనమ్: (తీవ్రమైన నొప్పిని దిగమింగుతూ, తడబడుతూ) "సీ... సీమా... నా పిల్లలు... వైజాగ్‌లో నా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు! నేను... నేను లేకపోతే వాళ్లు చనిపోతారు సీమా! వాళ్లను కాపాడు..."
ఆ మాటలు చెప్తూనే, పూనమ్ దేవి తను తన జీవితం గురించి, తన కమాండో ఆపరేషన్ల గురించి రికార్డ్ చేసిన ఒక సీక్రెట్ ఆడియో డివైస్‌ను సీమ చేతిలో పెట్టింది.
పూనమ్: "పిల్లలు... పిల్లలు జాగ్రత్త సీమా..." అని చెప్తూ పూనమ్ దేవి కళ్లు మూసింది!
సీమ భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతురాలైన శస్త్రచికిత్స నిపుణులలో (Top Surgeons) ఒకరు. అక్క పరిస్థితి చూసి గుండె నిలువునా బద్దలైనా...
వెంటనే తేరుకుని, తన ఇంట్లోనే ఉన్న అడ్వాన్స్డ్ మెడికల్ ఈక్విప్మెంట్ సాయంతో అక్కకు అత్యవసర చికిత్స చేయడం మొదలుపెట్టింది.
పూనమ్ ప్రాణాలనైతే కాపాడగలిగింది గానీ... పూనమ్ దేవి శరీరం తీవ్రమైన గాయాల వల్ల కోలుకోవడానికి సమయం పడుతుంది, ఆమె ప్రస్తుతం కనీసం పక్కపై నుండి కూడా లేవలేని స్థితిలో ఉండిపోయింది!
ఆ క్షణంలో సీమకు అక్క పూనమ్ చెప్పిన ఆఖరి మాటలు గుర్తుకొచ్చాయి: "నా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు!"
సీమ వెంటనే నిశ్చయించుకుంది.
సీమ: (కన్నీళ్లతో అక్క ముఖాన్ని పట్టుకుని) "అక్కా... నువ్వు నాకోసం ప్రాణాలు పణంగా పెట్టావు. ఇప్పుడు పిల్లలను కాపాడుకోవడానికి నేను వైజాగ్ వెళ్తున్నాను! నేను వాళ్ళతో తిరిగి వస్తాను అక్క.
సీమ నెమ్మదిగా బయటికి వచ్చి ఆ ఇంటి పెద్ద అయిన ఒక ముసలి అతని దగ్గరికీ వెళ్ళి తల వంచుకుని నేను ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పింది..
రియా: అమ్మ ఇలాంటి సమయంలో మమ్మల్ని వదిలి వెళ్లకు అమ్మ.. నీకు ఏమైనా అయితే మా వాళ్ళ కాదు .
సీమ: మీలాగే లోపల పడుకున్న నా అక్క పిల్లలకి ఇప్పుడు తల్లి అవసరం రియా. నేను వెళ్ళాలి.
ఇంటి పెద్ద: కోడలా చూడండి,, ఏది మంచి ఏది చెడు అనేది మీకంటే ఎవరికి బాగ తెలీదు అని నాకు తెలుసు. దేవుడు ఏ కారణం లేకుండా మిమ్మల్ని అక్కడికి పంపడు. మీరు ధైర్యంగా వెళ్ళి పిల్లల్ని తీసుకుని ఇక్కడికి రండి.
సీమ: సరే మావయ్య .. ఆమెకి ఏమేమి చికిత్స చేయాలో ఇక్కడ ఉన్న హెల్త్‌కేర్ టీమ్‌కి చెప్పి వెళ్తున్నాను. అలాగే మీరు అంత జాగ్రత్త నా అక్కాకి ఏం కానివ్వను..."
ఇంటిపెద్ద: అమ్మ, అసలు మీరు ఎవరు?
సీమ: ఇంకా టైమ్ రాలేదు మావయ్య , అక్క చెప్తుంది మీకు. నేను వెళుతున్నాను.
సీమ వెంటనే పూనమ్ దేవి వేసుకున్న ఆ కమాండో డ్రెస్‌ను తను ధరించి... పూనమ్ దేవిలా మారిపోయింది!
ఇంటి బయట ల్యాండ్ అయి ఉన్న హెలికాప్టర్, ప్రైవేట్ జెట్ దగ్గరకు సీమ నడుచుకుంటూ వచ్చింది.
అక్కడ ఉన్న స్పెషల్ స్నిపర్లు, కమాండోలు అందరూ పూనమ్ రూపులో ఉన్న సీమకు సెల్యూట్ చేశారు.
అక్కడ జరుగుతున్నది అంతా ఆమెకి కొత్తగా ఉంది, అస్సలు అక్క ఏం చేసింది ఈ 30 ఏళ్లు.
గుండెల్లో అక్క త్యాగం వల్ల కలిగిన బాధను, ఆవేదనను దిగమింగుకుని... సీమ తన అక్క పిల్లలను కాపాడటానికి వైజాగ్ ప్రయాణమైంది.
ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు "అమ్మా! మేము పూనమ్ అక్కని చూసుకుంటాం, నువ్వు వెళ్లి పిల్లలను కాపాడుకుని జాగ్రత్తగా తీసుకరా!" అని సీమకు ధైర్యం చెప్పి పంపించారు.
సమయం: సాయంత్రం 05:15 గంటల నుండి 06:00 వరకు
ప్రదేశం: వైజాగ్ వీధులు
సాయంత్రం 05:15 గంటలకు: వైజాగ్ కాలేజీ ప్రాంగణంలో అనుష్కను కారులోకి ఎక్కించుకుని సన్నీ, రితికలు వాయువేగంతో బయలుదేరారు.
రితిక తన చున్నీ తీసి అనుష్క తలకు రక్తస్రావం కాకుండా గట్టిగా కట్టు కట్టింది. రితిక "అమ్మా... అమ్మా..." అని ఏడుస్తున్న ఏడుపు సన్నీ గుండెను పిండేస్తోంది.
సన్నీకి ఒక కాలు, రెండు పక్కటెముకలు విరిగిపోయి విపరీతమైన నొప్పితో రక్తం కారుతున్నా... తన తల్లి లాంటి అనుష్కని కాపాడుకోలేకపోతున్నాననే వేదనతో కన్నీళ్లతో డ్రైవింగ్ చేస్తున్నాడు.
సాయంత్రం 05:30 గంటలకు: కాలేజీ ప్రాంగణం నుండి సోనుని తీసుకుని అల్కా, వర్షలు వేగంగా కారులో హాస్పిటల్‌కి పరుగెడుతున్నారు.
అల్కా భోరున ఏడుస్తూ: "అక్కా! త్వరగా పోనివ్వు... అమ్మకి ఏమైంది? అమ్మ ఎక్కడుంది?" అని అరుస్తోంది.
వర్ష ఓదారుస్తూ: "నాకు తెలీదు అల్కా... అమ్మకి ఏం కాదు, నువ్వు ఏడవకు, అమ్మ వచ్చేస్తుంది!" అని నచ్చజెబుతోంది.
సాయంత్రం 06:00 గంటలకు: కాలేజీలో ఆధీర పారిపోయాక... అలేఖ్య రక్తసిక్తమైన విజయ్‌ని కారులో ఎక్కించుకుని బయలుదేరింది.
వర్షంలో డ్రైవింగ్ చేస్తూ "విజయ్... కళ్లు తెరువు విజయ్!" అని ఏడుస్తోంది. ఎక్కడికి వెళ్లాలో తెలీక... వెంటనే అల్కాకి ఫోన్ చేసింది.
అలేఖ్య: "అల్కా! మా అక్క చెప్పింది... హాస్పిటల్స్‌కి వెళ్లొద్దు, అక్కడ కూడా శత్రువులు ఉంటారు! ఏదైనా సీక్రెట్ ప్లేస్‌కి తీసుకువెళ్లమనీ అంది. నేను విజయ్‌ని తీసుకుని ఎక్కడికి రావాలి?!"
వర్ష: (అల్కా చేతిలోంచి ఫోన్ లాక్కుని) "అలేఖ్యా! మీరందరూ 'లెమన్ ట్రీ బిల్డింగ్' సీక్రెట్ జోన్‌కి రండి! నేను అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాను!"
వర్ష వెంటనే అల్కాతో: "అల్కా! సన్నీకి కూడా ఫోన్ చేసి లెమన్ ట్రీ బిల్డింగ్‌కే రమ్మని చెప్పు!" అని ఆదేశించింది.
అల్కా వెంటనే సన్నీకి ఫోన్ చేసింది. అప్పటికే సన్నీ ఒక హాస్పిటల్ ముందరకు వచ్చి అనుష్కను చేతుల్లోకి తీసుకోబోతున్నాడు. కారులో ఉన్న రితిక ఫోన్ ఎత్తింది.
అల్కా: "రితికా! హాస్పిటల్‌కి వెళ్లొద్దు... అక్కడ కూడా ప్రమాదం ఉంది! ఆ ఆఫీసర్ని తీసుకుని లెమన్ ట్రీ బిల్డింగ్‌కి రండి, పూనమ్ అమ్మ అక్కడకి వస్తోంది!"
రితిక: (గట్టిగా అరిచింది) "సన్నీ... ఆగు! ఇక్కడ వద్దు... మనం పూనమ్ అమ్మ దగ్గరకు వెళ్దాం, పద!"
సన్నీ: "రితికా! టైమ్ లేదురా... రక్తస్రావం పోతుంది అమ్మకి!"
రితిక: "ఏం కాదు సన్నీ... పదా, అమ్మ అక్కడికే వస్తుంది!" సన్నీ వెంటనే కారును లెమన్ ట్రీ బిల్డింగ్ వైపు మళ్లించాడు!
ఇటు వర్ష వెంటనే లోకల్లో ఉన్న ఒక ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌కి ఫోన్ చేసి: "నాకు 10 నిమిషాల్లో ప్రైవేట్ స్పెషలిస్ట్ డాక్టర్లు, అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఈక్విప్మెంట్ లెమన్ ట్రీ బిల్డింగ్‌కి కావాలి!
ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను!" అని ఆర్డర్ వేసింది. హాస్పిటల్ యాజమాన్యం వెంటనే అంగీకరించింది.
సమయం: సాయంత్రం 06:15 గంటల నుండి 06:40 వరకు
ప్రదేశం: లెమన్ ట్రీ బిల్డింగ్ హ్యాంగర్ & మెడికల్ రూమ్
సాయంత్రం 06:15: రోడ్డు మీద స్పృహతప్పి పడిపోయిన భావనను ఒక నల్లటి సీక్రెట్ కారు ఎక్కించుకుని వేగంగా వెళ్లిపోయింది.
సాయంత్రం 06:30: వైజాగ్‌లో వర్షం భయంకరంగా పడుతోంది. లెమన్ ట్రీ బిల్డింగ్ ముందు 6 అంబులెన్సులు వచ్చి ఆగాయి. డాక్టర్లు మెడికల్ పరికరాలను లోపలికి తరలిస్తున్నారు.
అప్పుడే వర్ష, అల్కాల కారు వేగంగా వచ్చి ఆగింది. సిబ్బంది పరుగెత్తుకుంటూ వచ్చి గాయపడిన సోనుని స్ట్రెచ్చర్‌పై లోపలికి తీసుకువెళ్లారు.
వెంటనే సన్నీ కారు కూడా వచ్చి ఆగింది. రితిక దిగింది, సన్నీ కారు దిగుతూనే విరిగిన కాలు వల్ల కిందపడిపోయాడో! అల్కా పరుగెత్తి సన్నీని లేపింది. వర్ష డాక్టర్లను పిలిచి అనుష్కను స్ట్రెచ్చర్‌పై లోపలికి పంపించింది.
సరిగ్గా అనుష్కను లోపలికి తీసుకువెళ్తున్న క్షణంలో... ఆకాశాన్ని చీల్చుకుంటూ పిడుగు శబ్దంతో ఒక ప్రైవేట్ హెలికాప్టర్ బిల్డింగ్ హెలిప్యాడ్ పైన ల్యాండ్ అయింది!
ఆ శబ్దానికి అల్కా, వర్ష, రితికలు పైకి పరుగెత్తారు. హెలికాప్టర్ నుండి సీమ (పూనమ్ దేవి రూపంలో) కిందకు దిగింది. అక్కడికి అలేఖ్య, విజయ్‌లు కూడా కారులో వచ్చి చేరుకున్నారు. విజయ్‌ని, సన్నీని లోపలికి చికిత్స కోసం తీసుకెళ్లారు.
సమయం: సాయంత్రం 06:45 గంటలు
పూనమ్ దేవి రూపంలో ఉన్న సీమ... ఒంటిపై, ముఖంపై వర్షపు చుక్కలు, రక్తపు తడితో మెట్లు దిగి లోపలికి నడుచుకుంటూ వచ్చింది.
బయట వెయిట్ చేస్తున్న అల్కా, వర్ష, రితిక, అలేఖ్యలు ఆమెను చూశారు. అల్కా పరుగెత్తుకెళ్లి పూనమ్‌గా ఉన్న సీమను హత్తుకుని భోరున ఏడ్చింది!
అల్కా: "అమ్మా... అమ్మా! నువ్వు ఎందుకు రాలేదమ్మా? తమ్ముడు... సన్నీ... వాళ్లంతా రక్తం
కక్కుకుంటున్నారు అమ్మా! వాళ్లను చంపేసేవారు అమ్మా!"
వర్ష, అలేఖ్యలు కూడా వచ్చి పూనమ్‌ను పట్టుకుని ఏడ్చారు. సీమ గుండె తరుక్కుపోయింది! "నా అక్క తన కుటుంబాన్ని, పిల్లలను వదిలేసి నన్ను కాపాడటానికి వచ్చింది" అని లోపల ఏడుస్తూ, పిల్లల తలలు నిమిరింది.
అప్పుడే... రితిక పరుగెత్తుకుంటూ వచ్చి సీమ కాళ్ల పైన పడిపోయింది!
వర్ష, అల్కా shock అయ్యారు: "రీతూ! ఏమైందిరా?!"
రితిక: (సీమ కాళ్లు పట్టుకుని, గుండెలు పగిలేలా ఏడుస్తూ) "అమ్మా... ఆరోజు నీ దగ్గర ఏది కావాలన్నా అడగమన్నావు కదా అమ్మా! నాకు లోపల ఉన్న వాళ్లందరూ కావాలి అమ్మా!
నా వాళ్ళు... అందరూ బతకాలి అమ్మా! నన్ను అనాథను చేయకండి అమ్మా... ప్లీజ్!" సీమ రితికను పైకి లేపి, ఆమె ముఖాన్ని ముద్దుపెట్టుకుని హత్తుకుంది.
సీమ: (మనసులో) "వీళ్లంతా నా అక్క పిల్లలు... ఒకరికొకరు ప్రాణంగా ఉన్నారు!"
సీమ: (రితికతో ప్రేమగా) "నువ్వు ఇలా ఏడిస్తే నేను ఎలా కాపాడతానమ్మా? నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను!"
అప్పుడే లోపలి నుండి వచ్చిన సీనియర్ డాక్టర్ అన్నాడు:
డాక్టర్: "మామ్... ఆ ఫీమేల్ ఆఫీసర్ (అనుష్క) బ్రెయిన్ సెల్స్ దారుణంగా దెబ్బతిన్నాయి. మేము ఏమీ చేయలేము. ఆపరేషన్ చేస్తే ఇప్పుడే చనిపోతారు, వదిలేస్తే కొద్దిరోజులు బతుకుతారు."
అది విన్న అల్కా "లేదు! ఆవిడ మమ్మల్ని కాపాడింది, ఆవిడ బతకాలి!" అని అరిచింది. రితిక పూనమ్ చేతిని గట్టిగా పట్టుకుని వేడుకుంది.
సీమకు అర్థమైంది... లోపల ఉన్న ఆ ఆఫీసర్ (అనుష్క) రితిక కి ఎంత ముఖ్యమో!
సీమ: "మీరందరూ ఇక్కడే ఉండండి... నేను చూసుకుంటాను!"
అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా, సీమ లోపలికి వెళ్లి: "నాకు ఆవిడ ఫుల్ మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వండి, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి!" అని ఆర్డర్ వేసింది.
సమయం: సాయంత్రం 07:00 గంటలు
ప్రదేశం: సీక్రెట్ లోకేషన్ / ఆధీర డెన్
వర్షం వల్ల స్టేడియం నుండి బయటకు వచ్చిన రణధీర్... తన అన్న ఆధీరకు ఫోన్ చేశాడు.
రణధీర్: "అన్నా... ఏమైంది? మన ప్లాన్ అంతా దెబ్బతింది!"
ఆధీర: (రక్తపు మడుగులో గాయాలతో ఉండి, రగులుతూ) "రణధీర్... త్వరగా మన 'తంత్ర శాల (సామ్రాజ్య పూజారి/వ్యూహకర్త)కి ఫోన్ చేయి! మహాయుద్ధం రాబోతోంది!"
రణధీర్: "అన్నా! ఏం మాట్లాడుతున్నావ్?!"
ఆధీర: "వాళ్లు ఇంకా బ్రతికే ఉన్నారురా! 25 ఏళ్ల క్రితం మనం ఏ యుద్ధాన్ని చూసి భయపడ్డామో... ఆ 'బ్లాక్ స్క్వాడ్' ఇంకా బ్రతికే ఉంది! ఆమె ఉంటే మనం ఏమీ చేయలేము!"
రణధీర్ గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే అవతలి సీక్రెట్ నంబర్‌కి ఫోన్ చేశారు.
అజ్ఞాత వ్యక్తి: "చెప్పండి... ఏమైంది?"
రణధీర్: "అయ్యా... మమ్మల్ని క్షమించండి! 'బ్లాక్ స్క్వాడ్' బ్రతికే ఉంది! అన్నయ్య కూడా దారుణంగా గాయపడ్డాడు!"
అజ్ఞాత వ్యక్తి: (కోపంతో గర్జిస్తూ) "వాట్?! ఒకేసారి రెండు చోట్ల మన ప్లాన్ ఎలా విఫలమైంది? నేను మిమ్మల్ని నమ్మి తప్పు చేశాను! ఇక మీరు వైజాగ్ వదిలి తిరిగొచ్చేయండి... మిగిలినది నేను చూసుకుంటాను!" అని ఫోన్ కట్ చేశాడు!
((డెహ్రాడూన్ , వైజాగ్ రెండు చోట్ల ప్లాన్ చేసింది అతనే ఆ అజ్ఞాత వ్యక్తి)))
ఇటు RAW ఆఫీస్ అధికారులు ఆ వర్షంలో కాలేజీలో జరిగిన రక్తపాతం ఆధారాలు బయటకు రాకుండా సీక్రెట్‌గా క్లూస్ అన్నింటినీ తుడిచిపెట్టేశారు.
ఇటు సురేష్ చోప్రా పంపిన 10 మంది రౌడీలు ఫోన్ ఎత్తకపోవడంతో... సురేష్ చోప్రా, సోనియాలు భయంతో, కోపంతో రగిలిపోతున్నారు!
ఆపరేషన్ థియేటర్ నాటకం & సీమ శస్త్రచికిత్సా విన్యాసం
సమయం: సాయంత్రం 07:15 గంటల నుండి 09:00 వరకు
సీమ ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెట్టింది. అక్కడ అనుష్క క్రిటికల్ పొజిషన్లో ఉంది.
డాక్టర్లు: "మేడమ్! మీరేం చేస్తున్నారు? ఆవిడకి ఏమైనా అయితే మా ఉద్యోగాలు పోతాయి! ఇది డాక్టర్లు చేయాల్సిన పని!"
సీమ: (లేత చిరునవ్వుతో) "మీరు కాసేపు బయట వెయిట్ చేయండి!"
ఈలోపు సన్నీ, విజయ్‌లు మైకంలో ఉన్నారు. కానీ సోనుకి స్పృహ వచ్చింది. గాజు తలుపుల అవతలి నుండి అల్కా, వర్ష, రితికలను చూసి సోనుకి ప్రాణం లేచొచ్చినట్లయింది.
పక్కనే పూనమ్ డ్రెస్‌లో ఉన్న సీమను చూసి సోను గట్టిగా: "అమ్మా... అమ్మా!" అని అరిచాడు.
సీమ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి... నన్నే పిలుస్తున్నాడు అనుకుంటా అని వేగంగా సోను దగ్గరకు వెళ్లి, వాడి తల నిమిరింది:
సీమ: "బాబు... ప్రశాంతంగా పడుకో! నేను ఆ ఆఫీసర్‌కి ట్రీట్మెంట్ చేయాలి. తర్వాత మాట్లాడుకుందాం, డిస్టర్బ్ చేయకు సరేనా?" అని చెప్పి అనుష్క దగ్గరకు వెళ్లింది.
బయటకు వచ్చిన డాక్టర్ వర్షతో అన్నాడు:
డాక్టర్: "మేడమ్... ఆవిడ బతకడం అసాధ్యం. సర్జరీ చేయాలంటే ఇండియాలోనే ఒకరిద్దరు టాప్ న్యూరో సర్జన్లు ఉన్నారు, వాళ్లు వస్తే తప్ప బతకదు!"
ఆ మాట పూర్తికాకముందే... రితిక ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, కానీ అల్కా కోపంతో రగిలిపోతూ ఆ డాక్టర్ చెంప పగలగొట్టింది!
అల్కా: "నోరు మూయ్! అసలు నువ్వు డాక్టర్‌వేనా?!"
రితిక వెంటనే అల్కాని కౌగిలించుకుని ఓదార్చింది. అల్కా: "ఏం కాదు రీతూ... అమ్మ వచ్చింది కదా, అమ్మ చూసుకుంటుంది!"
అంతలో ఆపరేషన్ థియేటర్ లోపల జరుగుతున్న దానిని చూసిన ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గాజు తలుపుల్లోంచి సీమ చేస్తున్న అద్భుతమైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్సను చూసి ఆశ్చర్యపోయాడు!
డాక్టర్: "మై గాడ్... షీ నోస్ వాట్ షీ ఈజ్ డూయింగ్! ఐ థింక్ షీ ఈజ్ ఏ వరల్డ్-క్లాస్ సర్జన్!"
ఆ మాట వినగానే బయట ఉన్న పిల్లలందరూ, డాక్టర్స్ షాక్ అయ్యారు... అల్కా, రితికలు ఆనందంతో నవ్వేశారు!
అలేఖ్య మాత్రం భావన అక్కకి ఏం అయిందో అని కంగారుగా ఆమె ఫోన్ కి ఫోన్ చేస్తుంది కానీ కాలవట్లేదు.
సరిగ్గా రాత్రి 09:00 గంటలకు సీమ ఆపరేషన్ థియేటర్ బయటకు వచ్చింది.
సీమ: "డాక్టర్స్! ఈ మెడిసిన్స్ 24 అవర్స్ కంటిన్యూ చేయండి. ఆవిడ ప్రాణాలకి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు... రేపటికి స్పృహ వస్తుంది!"
ఆ మాట వినగానే రితిక ఆనందంతో పరుగెత్తుకెళ్లి సీమను ఎంత గట్టిగా హత్తుకుందంటే... సీమ రెండడుగులు వెనక్కి పడింది!
రితిక: (కన్నీళ్లతో) "థ్యాంక్స్ అమ్మా... థ్యాంక్స్ అమ్మా!"
సీమ: (రితిక తల నిమిరి, ప్రేమగా) "నేను వచ్చేసాను కదా తల్లి... ఇక ఏమీ కాదు, సరేనా?"
అల్కా కూడా కన్నీళ్లతో చూడగానే సీమ చేయి చాచింది... అల్కా, వర్షలు కూడా వచ్చి సీమను గట్టిగా కౌగిలించుకున్నారు!
రహస్య ఆవిష్కరణ - సృష్టిలోని 5 పంచభూతాల తత్వం:
సృష్టి నిర్మాణం 5 పంచభూతాల పైన ఆధారపడి ఉంది. ఈ సిరీస్ 5 మహా శక్తులు ఆ పంచభూతాలకు ప్రతిరూపాలు:
1. భూమి (క్షమాగుణం & భారం) - పూనమ్ దేవి: ఎంతటి కష్టాన్నైనా, భారాన్నైనా తనపై మోస్తూ... ఓర్పుతో ఉంటూనే శత్రు సంహారంలో అత్యంత భయంకరమైన డిఫెండర్‌గా నిలుస్తుంది.
2. నిప్పు (రౌద్రం & క్రోధం) - అనుష్క: శత్రువుల కంటే పది అడుగులు ముందుంటూ... రణరంగంలో నిప్పులా రగిలిపోతూ శత్రు సామ్రాజ్యాలను తగలబెడుతుంది.
3. గాళి / ఆక్సిజన్ (జీవనాధారం) - సీమ: గాలి కంటికి కనిపించదు... కానీ అది లేకపోతే సమస్త సృష్టి అంతమైపోతుంది!
చనిపోతున్న ప్రాణాలకు ఊపిరిపోసి, మృత్యువు అంచుల నుండి ప్రాణాలను తిరిగి తీసుకువచ్చే జీవనాధార శక్తే 'సీమ'! వైద్య విద్యలో ప్రపంచానికే తలమానికమైన ఆ శక్తి... ఈరోజు తన అక్క పిల్లల కోసం, అనుష్క కోసం ఊపిరిగా మారింది!
4. నీరు: (దీని వివరాలు రాబోయే చాప్టర్లలో వెల్లడవుతాయి).
5. ఆకాశం / విశ్వం (పరిపూర్ణ శక్తి) - భావన (FAB SHADOW):
సమస్త విశ్వాన్ని తనలో లయం చేసుకునే అత్యున్నత శక్తి! వైజాగ్ నగరంలో ప్రళయ రాత్రి గడిచింది... 'సీమ' ఆగమనం, అనుష్క పునర్జన్మ, పిల్లల రక్షణతో కథ మహా సమరానికి నాంది పలికింది!
------------------------------------------------------------------------------------------
భావనని తీసుకు వెళ్ళింది ఎవరు?
ఆధీర, అజిత్ ఇద్దరికంటే పైన ఉన్న ఆ లీడర్ “ అజ్ఞాతవ్యక్తి ఎవరు?
సురేష్ చోప్రా ఏం చేయబోతున్నాడు?
అనుష్క రేపు లేచాక ఏం అవుతుంది?
పూనమ్ కి మెళుకువ వచ్చి జరిగింది తెలిస్తే? అన్స్ , అభి లకి ఇప్పుడు పూనమ్ శక్తి తోడైతే? (పార్ట్ -2 లో )
ఇప్పటి నుండి మూడు కధలు మళ్ళీ ,, విడి విడిగా కొనసాగుతాయి. అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా.......
The following 16 users Like Sunnysunnysunny's post:16 users Like Sunnysunnysunny's post
• akak187, Akhil2544, Babu_07, Being human, gora, krish1983, Mahendar, Mahesh12345, Mohana69, puku pichi, Raj0003, Ram.alone, Santhosh king, selfread, sriramakrishna, VijayPK
Posts: 390
Threads: 0
Likes Received: 371 in 305 posts
Likes Given: 2,313
Joined: Aug 2021
Reputation:
6
Super antye super bro excellent update
Posts: 4,440
Threads: 0
Likes Received: 3,043 in 2,327 posts
Likes Given: 12
Joined: Feb 2020
Reputation:
39
Posts: 450
Threads: 8
Likes Received: 1,085 in 281 posts
Likes Given: 1,042
Joined: May 2022
Reputation:
54
Baga rastunnav mitrama bagundi
Mr. V
Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
ప్రదేశం: లెమన్ ట్రీ సీక్రెట్ బిల్డింగ్ - ఆపరేషన్ థియేటర్ బయట
సమయం: రాత్రి 09:30 గంటలు
ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన సీమ (పూనమ్ దేవి) చుట్టూ పిల్లలందరూ ప్రేమగా, భద్రతగా చేరుకున్నారు.
అనుష్క ప్రాణాపాయం నుండి బయటపడిందనే వార్త అందరి గుండెల్లో నిండిన కొండంత భారాన్ని ఒక్కసారిగా దించేసింది.
అక్కడ ఉన్న మెడికల్ టీమ్ అంతా తమ వస్తువులు సర్దుకుని వెళ్లడానికి సిద్ధమయ్యారు.
కానీ ఆ స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రం అక్కడే ఆగిపోయి, అప్పటినుండి తన మనసును తొలిచేస్తున్న ఆశ్చర్యంతో సీమ వైపు చూశాడు.
డాక్టర్: "మాడమ్... నన్ను క్షమించండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా?"
పిల్లలు, సీమ అందరూ అతడి వైపు చూశారు.
డాక్టర్: "మీరు నిజంగా ఎవరు మాడమ్? అంత సీరియస్ న్యూరో-సర్జరీ ప్రాసెస్ లో ఒక్క చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని మా అందరికీ తెలుసు.
కానీ మీరు ఎలాంటి భయం లేకుండా, ఏ ప్రాక్టీస్ లేకుండా ఒంటరిగా ఆ ఆపరేషన్ సక్సెస్ చేశారు!
కనీసం 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న టాప్ సర్జన్ తప్ప ఇది ఎవరూ చేయలేరు... మీ గురించి నేను తెలుసుకోవచ్చా?"
సీమ ముఖంలో ఒక చిన్న, ప్రశాంతమైన నవ్వు వెలిసింది. ఆ నవ్వు వెనుక తన అక్క పూనమ్ దేవి త్యాగం, తన వృత్తిపై ఉన్న పట్టు దాగి ఉన్నాయి.
సీమ (పూనమ్ రూపంలో): "అది అంత పెద్ద విషయం కాదు డాక్టర్. నా పిల్లల సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను! నేను ఎవరో మీకు తర్వాత తెలుస్తుంది... ఇప్పుడు మీరు వెళ్లండి."
ఆ సమాధానం వినగానే డాక్టర్ ఆశ్చర్యంతో తలాడించి వెళ్లిపోయాడు.
ఒకవేళ సీమ ఆ క్షణంలో తన అసలు పేరు (భారతదేశంలోనే టాప్ సర్జన్ డోక్టర్ సీమ) అని చెప్పి ఉంటే... అక్కడ కథ మరో రకంగా మారేది!
కానీ ఆమె తన అక్క 'పూనమ్' పాత్రలోనే ఉండిపోయింది.
రితిక కళ్లల్లోంచి మళ్లీ కన్నీళ్లు కారడం చూసి సీమ ప్రేమగా ఆమె దగ్గరకు వచ్చింది.
సీమ: "చూడు రీతూ... అంతా మంచిగా జరిగినా ఇంకా ఏడుస్తూనే ఉన్నావా తల్లి?"
రితిక ఏమీ మాట్లాడకుండా సీమను మరింత గట్టిగా కౌగిలించుకుని ఆమె గుండెల్లో ముఖం దాచుకుంది.
అప్పుడే గాయాలతో బెడ్‌పై ఉన్న సన్నీ మొబైల్ వైబ్రేట్ అయింది. రితిక వెెళ్లి చూసేసరికి స్క్రీన్ పైన 'మీనాక్షి అక్క' అని పడింది. రితిక ఫోన్ లిఫ్ట్ చేసింది.
రితిక: "హలో మీనాక్షి అక్కా... మేమందరం క్షేమంగానే ఉన్నాం. అల్కా మేడమ్ వాళ్ల ఇంట్లో ఉన్నాం. మీరేం కంగారుపడకండి, రేపు ఉదయమే ఇంటికి వచ్చేస్తాం!" అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
సీమ పిల్లలందరి వైపు చూసింది. సాయంత్రం నుండి జరిగిన నరకంలో వాళ్లు బొట్టుడు నీళ్లు కూడా తాగలేదని ఆమెకు అర్థమైంది.
సీమ: "సరే పిల్లలూ... మీరందరూ వెళ్లి ఫ్రెష్ అయి రండి, నేను మీకు ఏమైనా తినడానికి పెడతాను."
కానీ ఎవరూ అక్కడ నుండి కదిలే మూడ్‌లో లేరు. పూనమ్‌ను, గాయపడిన వారిని వదిలి వెళ్లడానికి ఎవరికీ మనసు రావడం లేదు.
అది గమనించిన సీమ ఈసారి ప్రేమగా కాకుండా... కొంచెం గంభీరంగా, అధికారంగా గొంతు పెంచింది!
సీమ: "ఏంటి... నేను చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా?! నేను చూసుకుంటాను అని చెప్పాను కదా!
అందరూ వెళ్లి రెడీ అయి రండి, నాకు ఆకలిగా ఉంది... టైమ్‌కి తినాలి!"
అమ్మ ఎప్పుడూ లాలనగా మాట్లాడేది, కానీ ఈరోజు అంత అధికారంగా ఆర్డర్ వేసేసరికి వర్ష, అల్కాలకు కొంచెం కొత్తగా, వింతగా అనిపించింది!
కానీ ఏమీ మాట్లాడకుండా అమ్మ మాట జవదాటలేక అందరూ లేచి గదుల్లోకి వెళ్లారు.
సీమ వెంటనే కిచెన్ వెతుక్కుంటూ వెళ్లి పిల్లల కోసం వేడి వేడిగా వంట చేయడం ప్రారంభించింది.
కానీ సీమ చేసిన ఒక చిన్న పొరపాటు... తన అక్క పూనమ్ దేవి తనకు ఇచ్చిన వాయిస్ రికార్డింగ్ డివైస్‌ను డెహ్రాడూన్ ఇంట్లోనే మరిచిపోయి రావడం!
పూనమ్ దేవి నెట్వర్క్ ఏంటి, పిల్లల నిజమైన నేపథ్యం ఏంటి అనేది ఏమీ తెలియకుండానే... సీమ కేవలం ఒక తల్లిలా ఆ పిల్లలకు ప్రేమతో వంట చేయడంలో మునిగిపోయింది.
ప్రదేశం: హాల్ & రెస్ట్ రూమ్
సమయం: రాత్రి 10:30 గంటలు
రాత్రి 10:30 అయింది. లోపల మెడికల్ కేర్‌లో ఉన్న ముగ్గురు అబ్బాయిలకి (సోను, విజయ్, సన్నీ) మెల్లగా మత్తు వదిలి స్పృహ వచ్చింది.
సన్నీ కంగారుగా చుట్టూ చూస్తూ, పక్కనే ఉన్న అనుష్క అమ్మని చూసి కంటి నీళ్లు పెట్టుకున్నాడు. బయట సీమ అందరికీ కొసరి కొసరి వడ్డిస్తుంటే...
పిల్లలందరూ హాల్లో కూర్చుని తింటున్నారు.
అదే సమయంలో... విజయ్ కళ్లు తెరిచి చుట్టూ చూశాడు. అక్కడ 'భావన' కనిపంచలేదు! విజయ్ గుండెల్లో భయం మొదలైంది. వెంటనే తన పాకెట్స్ వెతుక్కుని ఫోన్ బయటకు తీశాడు.
స్క్రీన్ ఆన్ చేయగానే... భావన పంపిన ఒక మెసేజ్, ఒక సీక్రెట్ లొకేషన్ అడ్రస్ కనిపించాయి!అది చూడగానే విజయ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు!
కడుపులో భయంకరమైన గాయం ఉందనే విషయం మరిచిపోయి... పక్కపై నుండి లేవడానికి ప్రయత్నించాడు!
నర్స్: (కంగారుగా) "సార్! సార్... పిచ్చి పనుల చేయకండి, మీకు గాయం తగిలింది! రెస్ట్ తీసుకోండి!" అని అరిచింది.
ఆ అరుపు వినగానే బయట భోజనం చేస్తున్న పిల్లలందరూ తింటుంది వదిలేసి పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చారు!
డ్రిప్స్, ఐవి వైర్లు పీకేస్తూ వెళ్లడానికి ప్రయత్నిస్తున్న విజయ్‌ని చూసి అలేఖ్య తట్టుకోలేకపోయింది. పరుగెత్తుకెళ్లి విజయ్ భుజాలు పట్టుకుంది!
అలేఖ్య: (కన్నీళ్లతో) "విజయ్... ప్లీజ్ విజయ్! రెస్ట్ తీసుకో... ఏమైంది నీకు? ఎక్కడికి వెళ్తున్నావ్?!"
అల్కా, వర్ష, రితికలు ఆందోళనగా చూస్తున్నారు. సీమ కూడా కంగారుగా లోపలికి వచ్చింది.
పూనమ్ : "అయ్యో! ఏంటిది పిల్లలూ... కనీసం భోజనం కూడా చేయకుండా ఇక్కడికి వచ్చారు?" అని విజయ్ వైపు చూస్తూ...
"నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావ్ బాబు? నీకు ఇంకా నయం కాలేదు!" అంది.
విజయ్: (పూనమ్ కళ్లల్లోకి చూస్తూ, బొంగురుపోయిన గొంతుతో) "అమ్మా... నేను వెళ్లాలి! నేను ఇప్పుడు వెళ్లకపోతే... నా జీవితంలో నా ప్రాణాన్ని శాశ్వతంగా కోల్పోతాను అమ్మా!"
ఆ మాట వినగానే... అలేఖ్యకు అంతా అర్థమైపోయింది! విజయ్ వెళ్తున్నది తన తల్లి భావన దగ్గరకే అని గ్రహించింది.
అలేఖ్య మెల్లగా విజయ్ చేయి వదిలేసింది. కన్నీళ్లతో రెండడుగులు వెనక్కి వేసి తలదించుకుంది.
పూనమ్ : "వద్దు బాబు... బయట చాలా ప్రమాదం ఉంది, నువ్వు రెస్ట్ తీసుకో."
అలేఖ్య: (ఏడుస్తూ, మధ్యలో కల్పించుకుని) "లేదమ్మా... అతన్ని వెళ్లనివ్వండి! అతను వెళ్లడం ఇప్పుడు చాలా అవసరం..."
విజయ్ అలేఖ్య వైపు ఒక క్షణం కృతజ్ఞతగా చూసి, దేహాన్ని ఈడ్చుకుంటూ బయటకు వెళ్లిపోయాడు.
అది చూసి అలేఖ్య భరించలేని బాధతో ఏడ్చేసింది.
అల్కా దగ్గరకు వచ్చి: "ఎందుకు వెళ్లనిచ్చావ్ అలేఖ్యా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావ్?" అని అడిగింది.
అలేఖ్య: (బాధతో) "బహుశా... నేను అతన్ని కలిసే ఆఖరి క్షణం ఇదే కావచ్చు అల్కా!" అని ఏడ్చేసింది. ఆ మాటకి అందరూ షాక్ అయ్యారు.
పక్కనే ఉన్న సోను... పూనమ్ వైపు ప్రేమగా చూస్తూ, ఆకలిగా ఉన్న చిన్న పిల్లాడిలా "అమ్మా... అమ్మా" అని పిలిచాడు. సీమ దగ్గరకు వెళ్లి వాడి తల నిమిరింది.
సీమ: "ఎలా ఉంది బాబు నీకు?"
సోను: (సీమ చేయి పట్టుకుని) "నాకు బానే ఉందమ్మా... నా పక్కన కాసేపు కూర్చోవా?"
సోను స్పర్శలో సీమకు ఒక విచిత్రమైన, పవిత్రమైన అనుభూతి కలిగింది.
"నా అక్క ఎంత అదృష్టవంతురాలు... ఎంత మంచి పిల్లలను పెంచింది" అనుకుంటూ, "నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ప్రశాంతంగా పడుకో" అంది.
ఇటు రితిక... సన్నీ దగ్గరకు వెళ్లి, అనుష్కకి ఏం కాలేదన్నట్లు తల ఊపింది. సన్నీ, సోనులు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.
ప్రదేశం: హాల్ (మధ్యరాత్రి అనుబంధాలు & వాగ్దానం)
సమయం: రాత్రి 01:30 గంటల నుండి 02:00 వరకు
అందరూ మళ్లీ హాల్లో కూర్చుని భోజనం ముగించారు. కానీ అలేఖ్య మాత్రం తన లోకమంతా శూన్యమైపోయినట్లు ఒక మూల కూర్చుని ఏడుస్తూనే ఉంది.
పూనమ్ ఎంత తినిపించాలని చూసినా ఆమె తినలేకపోయింది.
అందరూ అలసిపోవడంతో... హాల్లో పెద్ద మ్యాట్రెస్లు వేసి అందరూ ఒకే చోట పడుకున్నారు.
సరిగ్గా రాత్రి 02:00 గంటల సమయం!
ఎవరో ఏడుస్తున్న చిన్న శబ్దం విని పూనమ్ కళ్లు తెరిచింది. తన పక్కన ఒకవైపు అల్కా తన్ను వదలకుండా పట్టుకుని పడుకుని ఉంది.
మరోవైపు పడుకోని ఉన్న రితిక అక్కడ లేదు!
పక్కనే అలేఖ్య కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుస్తోంది. వర్ష అల్కాని పట్టుకుని నిద్రపోతోంది.
పూనమ్ మెల్లగా అల్కాని పక్కకు జరిపి, ఆమె నుదుటిపై ముద్దుపెట్టి లేచింది.
అలేఖ్య దగ్గరకు వెళ్లి ఆమెను పట్టుకుంది. అలేఖ్య ఒక్కసారిగా సీమను హత్తుకుని గుండెలపై ఏడ్చేసింది.
పూనమ్ : (మెల్లగా, నిశ్శబ్దంగా) "నీకు ఆ అబ్బాయి (విజయ్) అంటే ఇష్టమా తల్లి?"
అలేఖ్య: (ఏడుస్తూ తల ఊపింది) "అవునమ్మా..."
పూనమ్ : (అలేఖ్య కన్నీళ్లు తుడిచి, ప్రేమగా) "సరే... నేను నీకు మాట ఇస్తున్నాను! అతడితో నీ పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా?"
అలేఖ్య ఒక్కసారిగా సీమ వైపు ఆశ్చర్యంగా చూసింది.
పూనమ్ : "ఏంటి... నన్ను నమ్మట్లేదా? నేను అందరితో మాట్లాడి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. కానీ నువ్వు ఇప్పుడు పడుకోవాలి. వాళ్లు కోలుకోగానే మనం అక్కడికి వెళ్దాం.
నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నీ ఫేస్ పాడైపోతుంది, అప్పుడు అతడికి నువ్వు నచ్చకపోతే ఎలా?"
అలేఖ్య ముఖంలో చిన్న చిరునవ్వు వికసించింది. "హ్మ్మ్..." అంటూ కన్నీళ్లు తుడుచుకుంది.
సీమ ఆమె బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టుకుని, "నువ్వు పడుకో... నేను లోపల వాళ్లను చెక్ చేసి వస్తాను" అని లేచింది.
ప్రదేశం: ఐసియు గది
సమయం: రాత్రి 02:15 గంటలు
పూనమ్ ఐసియు గది వైపు నడుచుకుంటూ వెళ్తుండగా... తలుపుల సందులోంచి లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్క క్షణం అక్కడే ఆగిపోయింది!
అక్కడ... రితిక, సన్నీ మరియు అనుష్కల బెడ్ల మధ్యలో నేలపై కూర్చుని ఉంది!
ఆమె ఒక చేత్తో బెడ్‌పై ఉన్న అనుష్క చేయిని, మరొక చేత్తో సన్నీ చేయిని పట్టుకుని అనుష్క ముఖం వైపు తదేకంగా చూస్తోంది. సోనుతో సహా అందరికీ దుప్పట్లు కప్పి ఉన్నాయి.
రితిక కళ్లల్లో ఎలాంటి వికారం లేదు, ఏడుపు లేదు... కేవలం ఎనలేని నిశ్శబ్దం, అమితమైన ప్రేమ మాత్రమే ఉన్నాయి!
లోపల ఏ ప్రళయం జరుగుతుందో ఎవరికీ తెలియనివ్వకుండా, బయటకు అంత ప్రశాంతంగా ఉందో ఆ పిల్ల!
సీమ మనసులో అనుకుంది: (మనసులో) "ఈ అమ్మాయి నిజంగా నా అక్క కంటే గుండె నిబ్బరం ఉన్నదిలా ఉంది!
ఎంత ప్రశాంతంగా ఉందో... లోపల ఇంత బాధను దాచుకుని అందరిపట్ల ఎంత ప్రేమగా ఉంది!
ఈమె నిజంగా అందరికంటే చాలా ప్రత్యేకమైనది. బహుశా... ఈమె నా అక్క కూతురే అయి ఉంటుంది!
కానీ అందరూ నన్నే అమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు? అసలు ఈ కుటుంబం ఏంటి, వీరి అనుబంధాలు ఏంటి?"
పూనమ్ నెమ్మదిగా లోపలికి అడుగులు వేసింది. అనుష్క పక్కన నిలబడి, ఆమె చెంపపై చేయి వేసి హెల్త్ రిపోర్ట్స్ చూసింది.
అనుష్క హార్ట్ బీట్ నార్మల్‌గా కొట్టుకుంటోంది, కోలుకుంటోంది!
అప్పుడే రితిక... సీమ చేయిపై తన చిన్న చేయి వేసి "అమ్మా..." అని పిలిచింది. సీమ చల్లగా, అమితమైన ప్రేమతో రితిక వైపు చూసింది.
రితిక: "వీళ్లందరూ ఎప్పుడు లేస్తారు అమ్మా?"
సీమ: (నవ్వుతూ) "నువ్వు ఇప్పుడు వెళ్లి పడుకో తల్లి... నువ్వు నిద్రలేచే సరికి వాళ్లు కూడా నవ్వుతూ లేస్తారు, సరేనా? రా..."
సీమ రితిక చేయి పట్టుకుని బయటకు తీసుకువచ్చింది. ఇద్దరూ మ్యాట్రెస్ పైన పడుకుని, ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నారు!
పంచభూతాల విశేషం - గాలి - సీమ:
ఈ కథలోని 5 పంచభూతాల శక్తులలో మూడోది... - సీమ!
గాలి కంటికి కనిపించదు... కానీ అది ఒక్క క్షణం లేకపోయినా సమస్త సృష్టి అచేతనమైపోతుంది!
డెహ్రాడూన్ లో పూనమ్ దేవికి ఊపిరి పోసి, ఇక్కడ చావుబతుకుల మధ్య ఉన్న అనుష్క బ్రెయిన్ సెల్స్‌ని పునర్జీవింపజేసి, గాయపడిన సన్నీ, సోను, విజయ్‌లకు ప్రాణదానం చేసిన 'జీవనాధార వాయువు' సీమ!
ఆమె లేకపోతే ఈ రాత్రి ఈ కుటుంబమంతా అంతమైపోయేది! ఆ గాళిలాంటి సీమ రక్షణలోనే ఆ రాత్రి అందరూ క్షేమంగా నిద్రపోయారు!
ప్రదేశం: లెమన్ ట్రీ బిల్డింగ్ టెర్రస్ & కంట్రోల్ రూమ్
సమయం: ఉదయం 05:00 గంటల నుండి 05:30 వరకు
ఉదయాన్నే 5:00 గంటలకు సీమ (పూనమ్ రూపంలో ఉన్న) కి మేల్కువ వచ్చింది. చుట్టూ చూస్తే అలసిపోయిన పిల్లలందరూ హాల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
సీమ ప్రశాంతంగా లేచి, తన అక్క పూనమ్ దేవి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి, ఎవరికీ తెలియకుండా మెల్లగా మెట్లు ఎక్కి బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్లింది.
వెంటనే డెహ్రాడూన్ లో ఉన్న తన మామయ్యకి ఎన్క్రిప్టెడ్ శాటిలైట్ కాల్ చేసింది.
మామయ్య: "చెప్పు సీమా... ఎలా ఉన్నారు అక్కడ పిల్లలందరూ?"
సీమ: (కంగారుగా) "మావయ్యా... అక్క ఎలా ఉంది? ఆమెకి స్పృహ వచ్చిందా?"
మామయ్య: (నిట్టూరుస్తూ) "లేదు సీమా... ఆమె ఇంకా కోలుకోలేదు. స్పృహ రాలేదు. పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది."
ఆ మాట వినగానే సీమ గుండె భారమైంది. నిజానికి డాక్టర్‌గా సీమకు తన అక్క పూనమ్ పరిస్థితి ఏంటో ముందే తెలుసు, కానీ ఈ సమయంలో నిజం చెప్పి పిల్లలను మరింత బాధపెట్టడం ఆమెకు ఎంతమాత్రం ఇష్టం లేదు.
మామయ్య: "చూడు సీమా... దేవుడు ఏ కారణం లేకుండా నిన్ను అక్కడికి పంపలేదు. అలాగే మీ అక్క పరిస్థితి చూస్తుంటే ఆమె త్వరలో తిరిగి వచ్చేలా లేదు. కాబట్టి ఏం జరిగినా అది విధికి వదిలేస్తూ...
మీ అక్క కోలుకునే వరకు నువ్వు ఆ పిల్లలను, ఆ కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకో!
వాళ్లకు తల్లి లేని లోటు తెలియనివ్వకు. ఒకవేళ వాళ్లకి ఏమైనా అయితే... లేచాక మీ అక్క ఆ బాధను తట్టుకోలేదు!"
సీమ: (కన్నీళ్లను అదుపు చేసుకుంటూ) "సరే మావయ్యా... నేను బాధ్యతగా చూసుకుంటాను."
మాట్లాడటం ముగించి సీమ ఫోన్ కట్ చేసి, కిందకి దిగుతుండగా... బిల్డింగ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కంగారుగా ఆమె దగ్గరకు వచ్చాడు.
సెక్యూరిటీ: "మేడమ్! రాత్రి నుండి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. RAW చీఫ్ మీ ఎన్క్రిప్టెడ్ లైన్‌కి 3 సార్లు కాల్ చేశారు!
అలాగే మీరు తక్షణమే ఆయనకు కాల్ చేయాలని ఒక ప్రత్యేక సెక్యూర్ కోడ్ జనరేట్ చేసి మీ ఫోన్‌కి పంపారు. మీరు వెంటనే మాట్లాడాలి మేడమ్!"
సీమకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది! RAW ఏంటి? రహస్య కోడ్స్ ఏంటి? అసలు వీళ్లంతా ఎవరు?! సీమ మనసులో భయం, తీవ్రమైన ఆందోళన మొదలయ్యాయి.
ప్రదేశం: ఐసియు గది - అనుష్క మేల్కొనడం & ప్రయాణం
సమయం: ఉదయం 05:30 గంటలు
సరిగ్గా అదే సమయంలో... ఐసియు గదిలో ఉన్న అనుష్క కి సడన్‌గా మేల్కువ వచ్చింది!
ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ ఉలిక్కిపడి లేచి... "రీతూ!" అని గట్టిగా అరిచింది!
ఆ అరుపు వినగానే పక్కనే ఉన్న సోను, సన్నీలు ఉలిక్కిపడి లేచారు!
The following 20 users Like Sunnysunnysunny's post:20 users Like Sunnysunnysunny's post
• AB-the Unicorn, akak187, Akhil2544, Babu_07, coolguy, gora, Krush_5242, Mohana69, na_manasantaa_preme, puku pichi, Raj0003, Ram.alone, sahamira, selfread, sriramakrishna, Terminator619, the_kamma232, TringDan, Vego1990, VijayPK
Posts: 1,450
Threads: 0
Likes Received: 756 in 570 posts
Likes Given: 4,637
Joined: Nov 2018
Reputation:
12
Haammayya...anushka lechindi...santhosham...super update bro
Posts: 98
Threads: 0
Likes Received: 134 in 83 posts
Likes Given: 143
Joined: Jul 2026
Reputation:
2
సీమ రావడం మరింత కొత్త వాతావరణం ఏర్పడింది. చూడాలి ముందు ముందు మళ్లీ మా అంచనాలను మించి ఏమీ రాస్తారో
Posts: 32
Threads: 0
Likes Received: 32 in 24 posts
Likes Given: 299
Joined: Nov 2024
Reputation:
4
Sunny bro papam bro muggurini ipudu apudey kalipey la leru ga ...
Posts: 4,440
Threads: 0
Likes Received: 3,043 in 2,327 posts
Likes Given: 12
Joined: Feb 2020
Reputation:
39
Posts: 994
Threads: 0
Likes Received: 873 in 671 posts
Likes Given: 212
Joined: Aug 2024
Reputation:
23
Posts: 390
Threads: 0
Likes Received: 371 in 305 posts
Likes Given: 2,313
Joined: Aug 2021
Reputation:
6
Great update excellent superb
Posts: 450
Threads: 8
Likes Received: 1,085 in 281 posts
Likes Given: 1,042
Joined: May 2022
Reputation:
54
Emaiendi no updates 3 lo
Mr. V
Posts: 390
Threads: 0
Likes Received: 371 in 305 posts
Likes Given: 2,313
Joined: Aug 2021
Reputation:
6
|