27-07-2026, 01:58 AM
".. valla jeevitallo akhari roju..." ani bhayapettaku bro!!!
|
Misc. Erotica ❤️ భావన & విజయ్ ❤️ అపరిచిత బంధం ❤️(రక్త కధనరంగం -1)
|
|
27-07-2026, 01:58 AM
".. valla jeevitallo akhari roju..." ani bhayapettaku bro!!!
27-07-2026, 07:09 AM
Wow ...so many turns and twists in vijay and bhavana's life ...nice update
28-07-2026, 09:43 PM
హలో అందరికీ ,
మన రీడర్స్ లో ఒకరు పంచుకున్న గతం గురించి ఒక కొత్త కధ మొదలు పెట్టాను. https://xossipy.com/thread-74751-post-62...pid6274989 ----- తొలి ప్రేమ -------- చదివి మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారు అని అనుకుంటున్నా..
ఇట్లు,
✿SUNNY ✿ 1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️? 2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం 3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
29-07-2026, 04:27 PM
ప్రదేశం: వైజాగ్ ఇల్లు (హాల్)
సమయం: మద్యానం 1:00 గంట (అలేఖ్యను సంతోషంతో గాలిలోకి లేపి గిరగిరా తిప్పుతున్న విజయ్‌ని చూసి, బయటి నుండి వస్తున్న నానమ్మ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. నవ దంపతుల్లా ఉన్న వాళ్లిద్దరినీ చూస్తూ మెల్లగా గొంతు సర్దుకుంది.) నానమ్మ: "అమ్మా అలేఖ్యా... నీకు కళ్లు తిరుగుతాయిరా, కిందకి దింపు అమ్మాయిని విజయ్..." (విజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, తను చేస్తున్న పనిని గమనించి హడావిడిగా అలేఖ్యను కిందకి దింపాడు.) నేను (విజయ్): (తడబడుతూ) "అది... ఏమీ లేదు నానమ్మా! ఏదో అలా సరదాగా..." నానమ్మ: (చిరునవ్వుతో) "ఎందుకంత సంతోషంగా ఉన్నారు ఇద్దరు?" (అలేఖ్యకు ఏం చెప్పాలో అర్థం కాక, సిగ్గుపడుతూ విజయ్ చేయి గట్టిగా పట్టుకుంది.) ![]() నేను: "అది... రేపు ఉదయాన్నే అలేఖ్య వాళ్ల అమ్మగారు, ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు నానమ్మా. మేము రేపు మధ్యాహ్నం వైజాగ్ సిటీలోకి వెళ్తున్నాం..." నానమ్మ: "మంచిదిరా! నేను వెళ్లి పంతులుగారిని కలిసి వస్తాను. రేపు మంచి రోజు అయితే రేపే మీ పెళ్లి ముహూర్తం మాట్లాడేస్తాను. మిమ్మల్ని ఇలా వదిలేస్తే పక్షుల్లా ఎగిరిపోయేలా ఉన్నారు!" (నానమ్మ అలేఖ్య తలను ఎంతో ఆప్యాయంగా నిమురుతూ ముద్దాడింది.) నానమ్మ: "సరే, వెళ్లి ఇద్దరూ భోజనం చేయండి. అమ్మా అలేఖ్యా... వాడికి నువ్వే వడ్డించు. నేను పంతులుగారింటికి వెళ్లి ఇప్పుడే వస్తాను." (నానమ్మ బయటకు వెళ్లగానే విజయ్ సంకోచంగా చూశాడు.) నేను: "సారీ అలేఖ్య... నానమ్మ ముందు అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది..." అలేఖ్య: "నాకు సారీ వద్దు విజయ్... నేను చెప్పిన ఒక పని చేయాలి, చేస్తావా?" నేను: "ఏంటి చెప్పు?" అలేఖ్య: "ఈరోజు నీ చేతులతో నాకు అన్నం తినిపించు..." నేను: (షాక్ అవుతూ) "ఏంటి? నేనా?" అలేఖ్య: (చిన్న పిల్లలా అలుగుతూ) "నువ్వు తినిపిస్తే తింటాను... లేకపోతే నాకు వద్దు పో!" విజయ్ కాసేపు ఆలోచించి, వంటగదిలోకి వెళ్లి అన్నం కలుపుకుని వచ్చి అలేఖ్యకు ముద్దలు తినిపించడం మొదలుపెట్టాడు. విజయ్ చేతి ముద్ద తింటూ అలేఖ్య కళ్ల నుండి కన్నీళ్లు ధారగా కారడం చూసి విజయ్ కంగారుపడ్డాడు. నేను: "ఏమైంది అలేఖ్య? కారంగా ఉందా?" అలేఖ్య: (తల అడ్డంగా ఊపుతూ, ఏడుస్తూ) "లేదు విజయ్... నా జీవితాంతం నీ పక్కన ఇలాగే ఉండిపోవాలని అనిపిస్తోంది..." నేను: (తల దించుకుని, బాధగా) "అలేఖ్య... నేను భావనకు మాట ఇచ్చాను. నా జీవితంలో ఆమె తప్ప మరొకరు ఉండరని చెప్పాను..." ![]() (ఆ మాట వినగానే అలేఖ్య ఏడుస్తూ వెళ్లి తన గది తలుపులు గడియ పెట్టుకుంది. విజయ్ ఎంత బతిమిలాడినా తలుపు తీయలేదు.) అలేఖ్య: (తలుపు చాటు నుండి) "నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్ విజయ్... ప్లీజ్..." ప్రదేశం: వైజాగ్ ఇల్లు (పడకగది) సమయం: రాత్రి 11:30 గంటల నుండి 1:00 గంట వరకు గదిలో చీకటి ఆవరించి ఉంది. అలేఖ్య మంచం మూలన ముడుచుకుని కూర్చుని ఉంది. ఆమె కళ్లు ఏడ్చి ఏడ్చి ఎర్రగా వాచిపోయాయి. గడియారంలో ముల్లు ప్రతి సెకను కదులుతుంటే... ఆమె గుండెల్లో విజయ్‌తో గడిపే ఆఖరి ఘడియలు ముగిసిపోతున్నాయనే భయం నరనరాల్లో ప్రవహిస్తోంది. అలేఖ్య: (తనలో తాను వెక్కి వెక్కి ఏడుస్తూ, పెదవులు వణుకుతుండగా) "రేపు సూర్యుడు ఉదయిస్తే విజయ్ నాతో ఉండడు... భావన అక్క రాగానే విజయ్ నన్ను వదిలేసి వెళ్లిపోతాడు. ఈ రెండు రోజులు నా జీవితంలో దొరికిన ఒకే ఒక్క వెలుగు... ఇక్కడితో ఈ వెలుగు ఆరిపోతుందా? ఇక విజయ్ స్పర్శ నాకు దక్కదా?" ఆమె తన రెండు చేతులతో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా ఏడ్చింది. కన్నీళ్లతో తడిసిన ఆమె కళ్లు గడియారం వైపు చూశాయి... సమయం రాత్రి 1:00 గంట అయింది. ఇక ఆ ఏకాంతాన్ని, ఆ భరించలేని విరహాన్ని ఆమె భరించలేకపోయింది. మెల్లగా లేచి హాల్ వైపు అడుగులు వేసింది. వైజాగ్ హోటల్ లో భావన నరకం ప్రదేశం: వైజాగ్ బీచ్ రోడ్ హోటల్ సమయం: రాత్రి 1:00 గంట అదే సమయంలో... హోటల్ రూమ్‌లో భావన పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. కాళ్లు, చేతులు విపరీతంగా వాచిపోయి నీరసంతో మంచం దిగలేని స్థితి. కళ్లు తిరుగుతున్నాయి... ![]() తీవ్రమైన ఆకలి దహిస్తున్నా, ఏం తిన్నా, చివరికి ఒక చుక్క నీళ్లు తాగినా విపరీతంగా వాంతులు (Vomit) అవుతున్నాయి.) భావన: (పొట్ట పట్టుకుని, కన్నీళ్లతో రోదిస్తూ) "నాకేమైంది... ఎందుకిలా ఒళ్లంతా ప్రాణం లేనట్లు నీరసించిపోతోంది? నా శరీరంలో ఏ మార్పు వస్తోంది? కానీ... నేను ఇప్పుడు పడిపోకూడదు! అధీర నా కొడుకు విజయ్ ప్రాణాలు తీయడానికి మృత్యువులా తిరుగుతున్నాడు. నా బిడ్డను కాపాడుకోవడానికి నాకు ఊపిరి ఉన్నంతవరకు, నా దేహంలో చివరి రక్తపు చుక్క ఉన్నంత వరకు నేను పోరాడాలి!" భావన బలవంతంగా మళ్లీ నీళ్లు తాగడానికి ప్రయత్నించింది... కానీ మళ్లీ వాంతి అయింది. మూడు రోజుల నుండి ఏడుస్తూ, స్క్రీన్ వైపు చూస్తూ తన సైబర్ నెట్వర్క్ ద్వారా శత్రువుల కదలికలను గమనిస్తోంది. ![]() భావన: (కన్నీళ్ల సంద్రంలో మునిగిపోతూ) "ఒకవైపు విజయ్‌ని తీవ్రంగా నిందించాననే బాధ... మరోవైపు నన్ను వదిలేసి ఆ అలేఖ్యతో వెళ్లిపోయాడనే భయం... ఇంకోవైపు ఆ రాక్షసుడు అధీరను అంతం చేయాలనే క్రోధం! విజయ్... నువ్వు నా కొడుకువి! నిన్ను ఏ ఒక్కడూ తాకలేడు... తాకనివ్వను!" ప్రదేశం: వైజాగ్ ఇల్లు (హాల్ - సోఫా దగ్గర) సమయం: రాత్రి 1:15 గంటలు హాల్లో సోఫాపై విజయ్ గాఢనిద్రలో ఉన్నాడు. అలేఖ్య అడుగుల శబ్దం లేకుండా వచ్చి, సోఫా పక్కన నిలబడింది. నిద్రపోతున్న విజయ్ ముఖాన్ని, అతని పెదవులను, అతన ఊపిరి తీస్తున్న తీరును కళ్లారా ఆరాధగా చూసింది. ఇక ఆగలేక... ఒక్కసారిగా విజయ్ మీదకు వాలిపోయి, అతని ఛాతీకి గట్టిగా హత్తుకుని ఏడవడం మొదలుపెట్టింది. నేను (విజయ్): (ఒక్కసారిగా కంగారుగా లేచి, గాలిలో ఉలిక్కిపడుతూ) "ఎవరు? ఏమైంది అలేఖ్య? ఏమైనా పీడకల వచ్చిందా తల్లీ?" అలేఖ్య: (విజయ్ ఛాతీలో తన ముఖాన్ని మరింత లోతుగా దాచుకుని, వణుకుతున్న దేహంతో) "లేదు విజయ్... పీడకల కాదు... నిజమే పీడకలలా మారుతోంది..." నేను: (ఆమె వీపును, జుట్టును ఎంతో ఆప్యాయంగా నిమురుతూ, ఆందోళనగా) "చెప్పు అలేఖ్య... ఎందుకు అంతగా వణుకుతున్నావు? ఏమైంది నీకు?" అలేఖ్య: (ఏడుస్తూ, శ్వాస వేగమవుతుండగా విజయ్ కళ్లలోకి చూస్తూ) "నాకు అంతా తెలుసు విజయ్... రేపు నువ్వు భావన అక్కను కలిశాక నాతో ఉండవని నాకు తెలుసు. నేను మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి మిమ్మల్ని విడదీసే రాక్షసిని కాను విజయ్... మిమ్మల్ని బాధపెట్టను. కానీ... నీతో ఉన్న ఈ కొద్ది సమయం, ఈ కొన్ని గంటలు... ![]() నీ మనసులో ఏ వేరే ఆలోచనా లేకుండా కేవలం నాతో మాత్రమే ఉండు విజయ్! నీ మీద ఒట్టు... నేను నిన్ను ఏ హక్కునూ అడగను... ఏమీ అడగను..." ఆ మాటల్లోని స్వచ్ఛత, ఆవేదన చూసి విజయ్ కళ్లలో కూడా కన్నీళ్లు సుడితిరిగాయి. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను తన రెండు చేతులతో గట్టిగా కౌగిలించుకుని తన గుండెలకు హత్తుకున్నాడు. ఆమె తలపై, నుదుటిపై ఎంతో ఆప్యాయంగా ముద్దులు పెట్టాడు. నేను: "ఏమీ కాదు అలేఖ్య... ఏమీ కాదు... నేను నీతోనే ఉంటాను. ఈ క్షణం నేను నీతోనే ఉన్నాను..." ![]() అలేఖ్య: (విజయ్ ఛాతీపై చెవి ఆనించి, అతని గుండె చప్పుడు వింటూ, మత్తుగా) "విజయ్... నీ గుండె చప్పుడు ఎంత బాగుందో తెలుసా? ఇన్నాళ్లూ నా జీవితంలో ఏ లయ లేని శూన్యం ఉండేది... కానీ నీ గుండె చప్పుడు వింటుంటే నా మనసంతా ఏదో తెలియని ప్రశాంతతతో నిండిపోతోంది. నన్ను ఇలాగే పట్టుకో విజయ్... నన్ను వదలకు..." నేను: (ఆమె భుజాలను తన వైపు తిప్పుకుని, కళ్లలోకి చూస్తూ) "అలేఖ్య... నీ ప్రేమ ఎంత పవిత్రమైనదో నాకు అర్థమవుతోంది. నిన్ను బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు... నీ ఈ నవ్వు, నీ ఈ అమాయకత్వం ఎప్పుడూ ఇలాగే ఉండాలి." అలేఖ్య: (చిరునవ్వుతో, కన్నీళ్లు తుడుచుకుంటూ) "విజయ్... ఒక్కసారి నా కళ్లల్లోకి చూసి నన్ను ప్రేమగా నీ కౌగిలిలోకి తీసుకోవా? ఈ రాత్రికి నేను నీ ఒడిలోనే నిద్రపోవాలనుకుంటున్నాను..." విజయ్ నవ్వుతూ ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు. సోఫాపై విజయ్ వెల్లకిలా పడుకోగా, అలేఖ్య తన తలను అతని ఛాతీపై పెట్టి, తన ఒక చేతిని అతని నడుము చుట్టూ వేసి బంధించింది. వి జయ్ తన ఒక చేతితో ఆమెను సురక్షితంగా కౌగిలించుకుని, మరో చేత్తో ఆమె జుట్టును మెల్లగా నిమురుతూ జోకొట్టడం మొదలుపెట్టాడు. అలేఖ్య: (మెల్లగా కళ్లు మూస్తూ, గుసగుసగా) "ఐ లవ్ యూ విజయ్..." నేను: (మృదువైన స్వరం తో) "ఇస్స్ ....అలేఖ్య... ప్రశాంతంగా నిద్రపో..." విజయ్ గుండె చప్పుడు వింటూ అలేఖ్య ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఏ విధమైన కల్మషం, కామం లేని ఆ స్వచ్ఛమైన ప్రేమలో... ఇద్దరూ ఒకరి శ్వాసను ఒకరు పంచుకుంటూ ఆ రాత్రివేళ ఒడిలో ఒదిగిపోయారు. ప్రదేశం: హాల్ సమయం: ఉదయం 9:00 గంటలు ( దాడి జరిగే రోజు ) ఉదయం 9:00 గంటలైనా విజయ్, అలేఖ్యలు ఇంకా సోఫాలోనే ఒకరినొకరు హత్తుకుని పడుకుని ఉన్నారు. నానమ్మ పనులు చేసుకుంటూ వాళ్లను చూసి కళ్లల్లో నీళ్లు తిరిగేలా మురిసిపోయింది. నానమ్మ: (తనలో తాను) 'ఈ అమ్మాయి విజయ్‌ని ఒక సెకను కూడా వదిలి ఉండలేకపోతోంది... వీడే ఈ అమ్మాయి లోకం, వీడే ఈ అమ్మాయికి ప్రపంచం! కన్నతల్లిలా వాడిని అంటిపెట్టుకుని బతుకుతోంది...' బయట చప్పుడు కావడంతో విజయ్ కళ్లు తెరిచాడు. తన టీషర్ట్‌ను గట్టిగా పట్టుకుని తనపైనే నిద్రపోతున్న అలేఖ్యను చూసి షాక్ అయ్యాడు. నేను: (ఆందోళనగా) "అలేఖ్య... లే... టైమ్ 9 అయింది! అల్కా వాళ్ళ అమ్మ వాళ్ళని కలవాలి, లే..." అలేఖ్య: (కళ్లు తెరిచి, తను విజయ్ మీద ఉండటం చూసి, చప్పున లేచి నిలబడి, గట్టిగా) "నువ్వు నా బెడ్ మీద ఏం చేస్తున్నావ్ విజయ్??" నేను: (ఫ్యూజులు ఎగిరిపోయి) "ఏంటి?? నేనా??" (ఇదంతా చూస్తున్న నానమ్మ గట్టిగా నవ్వింది.) నానమ్మ: "అలా గడ్డి పెట్టు తల్లి దొంగ వెదవకి! అమ్మాయి ఒంటరిగా పడుకుంటే చాలు అలా దగ్గరకు వచ్చి పడుకుంటాడా? పెళ్లి కాకుండా వెదవ! పో అమ్మ, నువ్వు వెళ్లి ఫ్రెషప్ అవ్వు." (అలేఖ్య నానమ్మకు దొరికిపోయామని విజయ్ వైపు చూసి రూమ్‌లోకి వెళ్లిపోయింది.) ![]() నేను: "ఏంటి నానమ్మా... నేనేం చేశాను? ఆమె వచ్చి నాపై పడుకుంది!" నానమ్మ: (నవ్వుతూ) "మొద్దు వెదవ... నీకేం అర్థం కాదులే! ఒకటి గుర్తుపెట్టుకో విజయ్... నువ్వు లేని రోజు ఆ అమ్మాయి బ్రతకలేదు. నీపై ఆమెకు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ ఉంది. జగదేక జంట మీది... దీర్ఘాయుష్మాన్ భవ!" ప్రదేశం: వైజాగ్ ఇల్లు (పూజ గది) సమయం: ఉదయం 10:30 గంటలు (స్నానం చేసి బయటకు వచ్చిన అలేఖ్య ముఖం వెలిగిపోతోంది. కానీ నానమ్మ ఆమె నుదుటిన బొట్టు లేకపోవడం గమనించింది.) నానమ్మ: "ఒరేయ్ విజయ్... అమ్మాయి నుదుటిన బొట్టు లేదు చూడు! పూజ గదిలోకి వెళ్లి కుంకుమ తీసుకురా!" (విజయ్ దేవుడి గదిలోకి వెళ్లి కుంకుమ తెచ్చి నానమ్మకు ఇచ్చాడు.) నానమ్మ: "నాకెందుకురా ఇస్తున్నావ్? నీ కాబోయే భార్యకు నువ్వే బొట్టు పెట్టు!" నేను: "అయ్యో వద్దమ్మా... ఆమె పెట్టుకుంటుంది..." (అలేఖ్య ఎంతో ప్రేమగా విజయ్ వైపు చూస్తూ, తన తలను ముందుకు వంచి కళ్లు మూసుకుంది. విజయ్ ఇంకేమీ అనలేక కొద్దిగా సింధూరం తీసి ఆమె నుదుటిన దిద్దాడు. ఆ క్షణంలో అలేఖ్య తన ప్రపంచం పూర్తిగా విజయ్ అని అనుకుంది. వెంటనే విజయ్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంది.) నానమ్మ: "ఒక్క నిమిషం ఆగు తల్లి..." (నానమ్మ లోపలికి వెళ్లి భావన పెళ్లి కోసం కొన్న పట్టుచీరను తెచ్చింది) "ఇదిగో అలేఖ్యా... నీ అత్తగారింటి నుండి ఇస్తున్న మొదటి బహుమతి. ఇది కట్టుకుని రా తల్లీ!" (అలేఖ్య కళ్లల్లో నీళ్లతో ఆ చీరను తీసుకుని, దాన్ని కట్టుకుని, తలలో మల్లెపూలతో అచ్చం కొత్త పెళ్లికూతురిలా దేవతలా బయటకు వచ్చింది.) ![]() అలా నవ్వుతూ వచ్చి విజయ్ పక్కన నిలబడి సిగ్గుతో తల దించుకుని ఉంది. నానమ్మ దగ్గరికి వచ్చి బొమ్మలా ఉన్నావు అని ముద్దు పెట్టుకుంది. అలేఖ్య వెంటనే విజయ్ చెయ్యి పట్టుకుని కిందకి లాగి నానమ్మ ఆశీర్వాదం కోసం కిందకి వంగింది విజయ్ తో కలిసి. ఆమె ఇద్దరి తల పైన చెయ్యి పెట్టి “ ధీర్గసుమంగళి భవ ” అని చెప్పింది. ఆ మాటకి ఇద్దరికీ ఎక్కడికి సిగ్గు వచ్చింది. అలా ఇద్దరు కలిసి వైజాగ్ బయలుదేరారు. దారిలో విజయ్ చెయ్యిని అలేఖ్య అసలు వదలకుండా పట్టుకుని కూర్చుంది. ప్రదేశం: వైజాగ్ కాలేజ్ ఆవరణ సమయం: మధ్యాహ్నం 3:00 గంటలు విజయ్, అలేఖ్యలు ఇద్దరు కలిసి అల్కా , మరియు వాళ్ళ అమ్మ వాళ్ళకి మొదటి సారి కలుస్తున్నాము అని కొన్ని గిఫ్ట్స్ కొని నెమ్మదిగా అక్కడినుండి బయలుదేరారు . మధ్యాహ్నం 3:00 గంటలకు కాలేజ్ ఆవరణకు చేరుకున్నారు. అలేఖ్య విజయ్ చేయి వదలకుండా పట్టుకుని ఉంది. మరోవైపు... అనారోగ్యంతో కళ్లు తిరుగుతున్నా భావన తన బ్లాక్ కమాండో సూట్ పైన లాంగ్ కుర్తా వేసుకుని, ముఖం కవర్ చేసుకుని, కాలేజ్ బయట 100 మీటర్ల దూరంలో పొంచి ఉన్న పులిలా నిలబడి ఉంది. ![]() భావన: (కన్నీళ్లతో, విజయ్‌ని చూస్తూ) "నా కొడుకు నన్ను వదిలేసి ఆ అమ్మాయితో ఎంత సంతోషంగా ఉన్నాడో... కానీ వాడు నా కొడుకు, నా ప్రాణం! వాడు నా వాడు నేను ఎవరికి ఎవ్వను.వాడి జోలికి ఏ రాక్షసుడు వచ్చినా నరికిపడేస్తాను!" సరిగ్గా అదే సమయంలో... కాలేజ్ గెట్ ముందుకు వేగంగా 6 నల్లటి కార్లు వచ్చి ఆగాయి! దాంతో డెత్ ఏంజెల్ భావన ఒక్కసారిగా అలర్ట్ అయింది. కార్లలో నుండి అల్కా, సన్నీ మరియు కంపెనీ డైరెక్టర్లు మరియు ప్రైవేట్ బాడీగార్డ్స్ దిగారు. అల్కా కారు దిగి, విజయ్, అలేఖ్యల కోసం నవ్వుతూ ఫోన్ తీసింది... ![]() కాలేజ్ లోపల ఆల్రెడీ అధీర రాక్షసులు ... మరియు ఆధీర! అందరూ ఒకే చోటకు చేరుకున్నారు! రాబోయే దారుణమైన యుద్దం కోసం అలాగే మిగిలిన ఇద్దరి అమ్మాయిల కోసం చూస్తున్నాడు!
ఇట్లు,
✿SUNNY ✿ 1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️? 2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం 3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
29-07-2026, 05:45 PM
Bro urinchi urinchi champestunnaru....asalu emavuddo ani pichekkutondi bro..evaro chanipotharu annaru..evaru...
Update chaala bagundi...asalu bhavaniki emindi...kompadisi pregnant aa?
29-07-2026, 08:07 PM
Naku guess.... bhavana kani alekya kani idharilo okallu potaremo...or bro manaki mind block iyyela oka twist isthado...chudali
01-08-2026, 10:28 PM
((ముందుగా మూడు కధల చివరి అప్డేట్స్ చదివి తరువాత ఇది చదవాలి అని కోరుకుంటున్న....))
సమయం: మధ్యాహ్నం 02:45 గంటలు ప్రదేశం: వైజాగ్ రోడ్లు (పూనమ్ కారు ప్రయాణం) వైజాగ్‌లో పూనమ్ దేవి, వర్ష మరియు సోనులను కారులో ఎక్కించుకుని కాలేజ్ ఫెస్ట్ వద్దకు బయలుదేరింది. హఠాత్తుగా... పూనమ్ డాష్‌బోర్డ్ పక్కన ఉన్న సీక్రెట్ ఎన్క్రిప్టెడ్ ఫోన్ గట్టిగా మోగడం మొదలైంది! 30 ఏళ్లుగా మోగని ఆ ఫోన్ రింగ్ అవ్వగానే పూనమ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఎడమ చేత్తో స్టటీరింగ్ పట్టుకుని, కుడిచేత్తో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవిన పెట్టుకుంది. పూనమ్: (గాబరాగా, శ్వాస వేగంగా తీసుకుంటూ) "హలో... సీమా?!" అవతలి నుండి చిన్న పాప ఏడుస్తూ మాట్లాడింది. పాప: (కన్నీళ్లతో, భయంతో వణుకుతూ) "అమ్మమ్మ... ఆ రాక్షసులు ఊరిలోని అందరినీ చంపేస్తున్నారు అమ్మమ్మ! ఇల్లంతా రక్తం చిమ్మి ఉంది... సీమ అమ్మమ్మ నన్ను దాచిపెట్టి, ఫోన్ ఎత్తగానే 'నన్ను క్షమించు అక్కా... నేను బతకను' అని నీకు చెప్పమంది అమ్మమ్మ! కాపాడు అమ్మమ్మ..." పూనమ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సీమ పరిస్థితి తలుచుకుని గుండె పిండేస్తున్నా... వణుకుతున్న గొంతును సరిచేసుకుంటూ అడిగింది. పూనమ్: (ఏడుస్తూనే) "తల్లి! అమ్మమ్మ నిన్ను కాపాడాలంటే నాకు మీ ఊరు తెలీదు కదా..., మీ ఊరు పేరు తెలుసా? ఇంకా నువ్వు ఆడుకోవడానికి, తిరగడానికి ఎక్కడికి వెళ్తావు? అవి అయినా తెలుసా తల్లి?" పాప: (నత్తినత్తిగా ఏడుస్తూ) "అమ్మమ్మ... డెహ్రాడూన్! సీమ అమ్మ రోజు నన్ను 'పూనమ్ అమ్మ' అనే హాస్పిటల్‌కి తీసుకువెళుతుంది. అక్కడే ఆడుకుంటాను. కానీ 4 డేస్ నుండి అందరం ఇంట్లోనే దాక్కున్నాం అమ్మమ్మ..." డెహ్రాడూన్‌లోని తన పేరు మీద ఉన్న ఆ హాస్పిటల్ లొకేషన్ వినగానే పూనమ్ సింహంలా గర్జించింది. పూనమ్: "తల్లి! నేను వస్తున్నాను... సరేనా? నువ్వు అక్కడే జాగ్రత్తగా ఉండు. సీమ అమ్మని, నిన్ను కాపాడటానికి నేను వస్తున్నాను!" పూనమ్ కంగారుగా అడ్రస్ కనుక్కుని ఫోన్ కట్ చేసింది. వెంటనే వర్ష, సోనుల వైపు చూసి ఫోన్ సీక్రెట్ సైబర్ టీమ్‌కి కనెక్ట్ చేసింది. డెహ్రాడూన్‌లోని ఆ హాస్పిటల్ ఓనర్ అడ్రస్ కనుక్కోవాలని, అక్కడ 5 గురు స్పెషల్ స్నిపర్లు రెడీగా ఉండాలని, ఎయిర్పోర్ట్ రన్‌వే పైన తన ప్రైవేట్ జెట్ విమానం ల్యాండ్ అయి రెడీగా ఉండాలని ఆదేశించింది. పూనమ్: "వర్షా, సోనూ... నేను వెళ్లాలి! ఒక కుటుంబం చావు బతుకుల మధ్య ఉంది. నేను వెళ్లి వాళ్లను కాపాడుకోవాలి!" వర్ష కళ్లల్లో నీళ్లతో వెంటనే సోను చేయి పట్టుకుని అంది. వర్ష: "అమ్మ... నువ్వు వెంటనే వెళ్లు! నేను ఇక్కడ అల్కాని, సోనూని జాగ్రత్తగా చూసుకుంటాను." పూనమ్: "సోనూ! నేను తిరిగొచ్చినా, రాకపోయినా... మన అక్కల బాధ్యత నీదే! అలాగే మీ ముగ్గురు ఈ చిన్న సైబర్ జీపీఎస్ ట్రాకింగ్ పిన్ను ఇన్జెక్ట్ చేసుకోండి. ఇది మీ బాడిలో ఉంటుంది. శత్రువులకు కాలేజీలో మీరు ప్రాణాలతో కావాలి. మీరు ఎక్కడున్నా నేను వచ్చి మిమ్మల్ని తీసుకువస్తాను... నన్ను క్షమించండి!" వర్ష: (కన్నీళ్లతో పూనమ్ ముఖాన్ని పట్టుకుని) "అమ్మ! నువ్వు మాకు ఎందుకు ఇదంతా చెప్తున్నావు? శత్రువులు ఏంటి అమ్మ ఏం జరుగుతుంది ? కానీ నువ్వు ఏం చెప్పినా మేము చేస్తాం... కానీ తిరిగి వస్తానని మాత్రం ప్రమాణం చెయ్యి అమ్మ!" పూనమ్ నెమ్మదిగా నవ్వి వర్ష ముఖాన్ని తడిమింది. కారును నేరుగా తన సీక్రెట్ ఎయిర్‌స్ట్రిప్ వైపు మళ్లించి, ప్రైవేట్ జెట్ ఎక్కి ఆ భయంకరమైన ప్రళయ వాతావరణంలో డెహ్రాడూన్ వైపు వాయువేగంతో బయలుదేరింది! వర్ష, సోనులు కారులో కాలేజ్ వైపు ప్రయాణమయ్యారు. ప్రదేశం: వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (రణధీర్ డెత్ ట్రాప్) సమయం: మధ్యాహ్నం 03:00 గంటలు ఆధీర తమ్ముడు రణధీర్ (రావు) సాధారణ ప్రేక్షకునిలా మ్యాచ్ చూడటానికి వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం లోపలికి ప్రవేశించి, తన విఐపి గ్యాలరీ సీట్లో కూర్చున్నాడు. అతని మనసులో వికృతమైన ఆనందం ఉంది. తన ప్లాన్ ప్రకారం... మధ్యాహ్నం 3:30 గంటలకు విఐపి ఫుడ్ & క్యాటరింగ్ సప్లై వ్యాన్ ద్వారా 50 కేజీల RDX బాంబ్ స్టేడియం లోపలికి చేరుకుంటుంది. ఆ బాంబు ప్యాకేజ్ రాగానే దాన్ని సీక్రెట్‌గా రిసీవ్ చేసుకుని స్టేడియాన్ని ఊచకోత కోయాలనేది అతడి ప్లాన్! వైజాగ్ కాలేజ్ ఆవరణ (విజయ్, అలేఖ్య & భావన నిరీక్షణ) సమయం: మధ్యాహ్నం 03:00 గంటలు ఇటు కాలేజ్ ఆవరణకు విజయ్, అలేఖ్యలు ఇద్దరూ కలిసి అల్కాకి, ఆమె అమ్మకి మొదటిసారి కలుస్తున్నామని కొన్ని గిఫ్ట్స్ కొని మధ్యాహ్నం 3:00 గంటలకు చేరుకున్నారు. అలేఖ్య విజయ్ చేయి వదలకుండా పట్టుకుని నడుస్తోంది. మరోవైపు... అనారోగ్యంతో కళ్లు తిరుగుతున్నా సరే, భావన తన బ్లాక్ కమాండో సూట్ పైన లాంగ్ కుర్తా వేసుకుని, ముఖం కవర్ చేసుకుని, కాలేజ్ బయట 100 మీటర్ల దూరంలో పొంచి ఉన్న పులిలా నిలబడి ఉంది. భావన: (కన్నీళ్లతో, దూరంగా ఉన్న విజయ్‌ని చూస్తూ) "నా కొడుకు నన్ను వదిలేసి ఆ అమ్మాయితో ఎంత సంతోషంగా ఉన్నాడో... కానీ వాడు నా కొడుకు! నా ప్రాణం! వాడు నా వాడు, నేను ఎవరికీ ఇవ్వను! వాడి జోలికి ఏ రాక్షసుడు వచ్చినా నరికిపడేస్తాను!" సరిగ్గా అదే సమయంలో... కాలేజ్ గేట్ ముందుకు వేగంగా 6 నల్లటి కార్లు వచ్చి ఆగాయి! దాంతో భావన ఒక్కసారిగా అలర్ట్ అయింది. కార్లలో నుండి అల్కా, సన్నీ, కంపెనీ డైరెక్టర్లు మరియు అల్కా పర్సనల్ బాడి గార్డ్స్ దిగారు. సురేష్ చోప్రా పంపిన 10 మంది వరల్డ్ డేంజరస్ కిల్లర్స్ కూడా దిగారు వాళ్ళలో కలిసిపోయారు. అల్కా కారు దిగి, విజయ్, అలేఖ్యల కోసం ఫోన్ తీసి డయల్ చేయబోయింది, కానీ ఫోన్ కలవలేదు. అప్పటికే సురేష్ చోప్రా మనుషులు జామార్ ఆన్ చేసి పెట్టేశారు. అప్పుడే దూరంగా ఉన్న అలేఖ్య గట్టిగా "అల్కా!" అని పిలవగానే అక్కడున్న కిల్లర్స్ చూపు ఆమె పైన పడింది. అల్కా కూడా వాళ్ళకి చెయ్యి ఊపింది. వాళ్లు వచ్చి అల్కాని కలిశారు. అల్కా: "సన్నీ! మేనేజ్మెంట్ కి చెప్పి కొంచెం రితిక అనే అమ్మాయిని తీసుకురావా? మా అమ్మ వాళ్లు కూడా వచ్చేస్తారు కాసేపట్లో, ప్లీజ్... అమ్మ ఆ అమ్మాయిని చూడకపోతే నన్ను తిడుతుంది!" సన్నీ: "సరే మేడమ్!" సన్నీ లోపలికి వెళ్లి ఇన్ఫార్మ్ చేశాడు. లోపల ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న రితికకి "అల్కా మేడమ్ పిలిచారు" అనగానే, పూనమ్ అమ్మని కలవవచ్చని ఎదురుచూస్తున్న ఆమె నవ్వుకుంటూ బయటకి వచ్చింది. బయటకు రాగానే రితిక అందరినీ కలిసింది. అల్కా, సన్నీని సిగ్గుగా అలేఖ్యకి, విజయ్‌కి పరిచయం చేసింది. అలేఖ్య కూడా వాళ్లిద్దరితో సరదాగా మాట్లాడింది. రితిక: అల్కా, అమ్మ వాళ్ళు రాలేదా అని కొంచెం విచారంగా అడిగింది. అల్కా : నేను వాళ్ళకి ఎప్పుడో ఫోన్ చేశాను, ఈపాటికి వెచేస్తూ ఉండాలి కాసేపట్లో వస్తారు. ఇదంతా దూరంగా ఉండి చూస్తున్న భావనకి... విజయ్ వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతుంటే ప్రాణం పోతున్నట్లు ఉంది. ఆ క్షణం విజయ్ తాను లేకపోయినా ఉండగలాడు ఏమో అనుకుంది. కానీ విజయ్ మనసులో మాత్రం "పూనమ్ అమ్మ రాగానే భావన అమ్మ గురించి చెప్పి ఇద్దరినీ ఒకటి చేయాలి" అని నిరంతరం ఆలోచిస్తున్నాడు. స్టేడియంలో రణధీర్‌కి బిగ్ షాక్ & కాలేజీకి బయలుదేరిన ఆధీర సమయం: మధ్యాహ్నం 03:30 గంటలు సరిగ్గా 3:30 అయింది! రణధీర్ తన గడియారం వైపు చూసుకుంటూ ఫుడ్ వ్యాన్ కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ... పూనమ్ దేవి ముందే వేసిన 'త్రీ-స్టెప్ కమాండో ప్లాన్' అమలులోకి వచ్చింది! RAW స్పెషల్ ఫోర్స్ స్టేడియం చుట్టూ 300 మీటర్ల దూరంలోనే బారికేడ్లు పెట్టి ప్రతీ ఒక్క వాహనాన్ని ఆపేసింది. ఫుడ్ వ్యాన్‌ను లోపలికి రానివ్వకుండా బయట నుంచే కంప్లీట్ స్కాన్ చేసి, కమాండోలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు! అంతేకాకుండా, లోపల ఉన్న రణధీర్‌కి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది... "లోపలికి వచ్చిన వారు ఒక్కసారి బయటకు వెళ్తే, మళ్లీ లోపలికి రావడానికి విఐపి పాస్ చెల్లదు! గేట్లు పూర్తిగా లాక్ అయిపోయాయి!" దాంతో రణధీర్ బాంబు తీసుకోలేక, బయటకు వెళ్లలేక స్టేడియంలోనే విఫలమై కూర్చుండిపోయాడు! మరోవైపు సరిగ్గా 3:30 గంటలకు: ఆధీర 50 కేజీల RDX బాంబును ఆ ఫుడ్ ట్రక్‌లో లోడ్ చేయించి, తన ప్లాన్ వర్కవుట్ అవుతుందనే ధీమాతో తన భయంకరమైన రీతిలో కాలేజ్ వైపు ప్రయాణం ప్రారంభించాడు! కాలేజీకి చేరుకోవడానికి అతనికి ఇంకో 45 నిమిషాల సమయం పడుతుంది. ప్రదేశం: కాలేజ్ VIP ఎంట్రెన్స్ & జామర్లు సమయం: మధ్యాహ్నం 03:45 గంటలు చూస్తుండగానే టైమ్ 3:45 అయింది. అప్పుడే అక్కడికి వర్ష, సోను కూడా కారులో వచ్చారు. కారుని గేట్ దగ్గర ఆపగానే వర్ష అల్కాకి కాల్ చేయాలి అనుకుంటే సిగ్నల్ లేదు... సురేష్ చోప్రా గార్డ్స్ బందోబస్తు కోసం జామర్లు ఆన్ చేశారు! అక్కడున్న వాచ్‌మెన్‌ని అడిగితే, JSS కంపెనీ ఓనర్ అని చెప్పగానే లోపలికి వేరే సీక్రెట్ ఎంట్రెన్స్ ఓపెన్ చేసి పంపించారు. భావన చూపు విజయ్ పైన కాకుండా రితిక పైన నిలిచిపోయింది! ఎందుకంటే చిన్నప్పుడు తన ప్రాణమైన అచ్చం అనుష్కలా ఉంది! నవ్వుతూ అందరితో ఉన్న ఆమెనే చూస్తూ... భావన తాను కోల్పోయిన వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటే కళ్లు తిరగడం స్టార్ట్ అయింది. అయినా అలాగే ఓపిక పట్టి నిలబడింది. నిరంతరం అన్నీ చూస్తూ ఉంది. వర్ష, సోను రాగానే అందరూ కలిసి ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. కానీ ఇద్దరి కళ్ళు మాత్రం ఇంకా కార్ లో ఎవరు అయిన ఉన్నారా అని చూస్తున్నాయి (రితిక, విజయ్ ) అల్కా: ఒరేయ్ అమ్మ ఎక్కడ మీ ఇద్దరే వచ్చారు. వర్ష: బుజ్జి పిల్ల , ఇప్పుడు అల్లరి చేయకు అమ్మ వేరే పని పైన వెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తా అన్నారు. సరేనా అక్కడే ఉండి అది అంత గమనిస్తున్న ఆధీర మనుషులు "ముగ్గురు అమ్మాయిలు ఇక్కడే ఉన్నారు!" అని ఫోన్లో ఆధీరకు చెప్పగానే... ఆధీర "నేను రావడానికి మరొక 30 నిమిషాలు పడుతుంది. లోపల కాలేజీలో ఉన్న అమ్మాయే ముఖ్యంగా కావాలి, ఎందుకంటే ఆమె మిగిలిన ఇద్దరి కంటే పెద్ద అమ్మాయి!" అని ఆర్డర్ ఇచ్చాడు. వర్ష కారును పార్కింగ్‌లో పెట్టమని ఎవరినో అడుగుతుంటే... సన్నీ వచ్చి "మేడమ్ నేను వెళ్తాను" అని ప్రేమగా అడిగాడు. వర్ష నవ్వుతూ కారు కీస్ ఇచ్చి అల్కా వైపు చూసింది. సన్నీ కార్ పార్కింగ్ చేస్తుంటే... రితిక చూపు అంతా గేట్ వైపే ఉంది, ఎందుకంటే పూనమ్ అమ్మ కోసం ఎదురుచూస్తోంది! ప్రదేశం: కాలేజ్ పార్కింగ్ ఏరియా సమయం: సాయంత్రం 04:00 గంటలు సన్నీ కార్ పార్కింగ్ ఏరియాకి వెళ్లగానే జామర్కి కొంచెం దూరంగా వెళ్లేసరికి అతనికి మొబైల్లో ఒక మెసేజ్ వచ్చింది. అది అనుష్క నుండి వచ్చింది! ఆ సమయానికి అనుష్క స్పోర్ట్స్ బైక్ మీద కాలేజీకి కేవలం 5 నిమిషాల దూరంలో ఉంది! అనుష్క మెసేజ్: "సన్నీ! ఎవరినీ నమ్మకు! నీ ముందున్నదంతా భయంకరమైన నాటకం! రితికకి ఒక్క చిన్న గీత పడినా నిన్ను ప్రాణాలతో ఉంచను. నేను వచ్చే వరకు నా కూతురిని కాపాడటమే నీ లక్ష్యం... నేను వస్తున్నాను!" అప్పుడే లోపలి నుండి ఒక సర్ వచ్చి "మేడమ్ ప్రొగ్రామ్ స్టార్ట్ అయింది వెళ్దాం" అనగానే అందరూ బయలుదేరుతుండగా... భావన గేట్ దగ్గర నిలబడే సడన్‌గా కుప్పకూలిపోయింది! వాచ్మెన్ గట్టిగా "మేడమ్ మేడమ్ ఏం అయింది!" అని అడుగుతున్నా ఆమెలో ఉలుకూ పలుకూ లేదు. నాడి చాలా తక్కువగా కొట్టుకుంటోంది! ఆ అరుపు విని అందరూ వెనక్కి తిరిగారు. కానీ రితిక ఎందుకో ఆగలేకపోయింది! పరుగెత్తి భావనని తన ఒడిలోకి తీసుకుంది! రితిక: "కాలేజ్ మెయిన్ గేట్ పక్కన మెడికల్ టీమ్ ఉంది, త్వరగా తీసుకువెళ్లండి!" అక్కడున్న ఇద్దరు వాచ్మెన్లు భావనను మోసుకెళ్లారు. రితిక కంగారు చూసి అమ్మ చెప్పిన మాట గుర్తుతెచ్చుకుని సన్నీ కూడా రితిక వెనుకే పరుగెత్తాడు. భావనను తీసుకువెళ్లగానే డోర్ దగ్గరే ఆగి ఉన్న అందరూ "ఏమైంది?" అని అడిగితే, రితిక "ఏం లేదు, కళ్లు తిరిగి ఎవరో ఒక ఆమె పడిపోయారు" అని చెప్పి వాళ్ల వైపు నడవడం మొదలుపెట్టింది. ప్రదేశం: ఆధీర ముఠా వీరవిహారం సమయం: సాయంత్రం 04:05 గంటలు సరిగ్గా అప్పుడే వేగంగా ఇద్దరు రౌడీలు వాళ్ల వైపు పరుగెత్తుకుంటూ వచ్చారు! ఒకడు గాలిలోకి ఎగిరి సన్నీని గుండెల పైన బలంగా తన్నగానే... సన్నీ సుమారు 30 అడుగుల దూరంలో ఎగిరి పడిపోయాడు! ఆ శబ్దం ఎంత గట్టిగా ఉందంటే సన్నీ ఎముకలు విరిగిపోయాయా అనేంత భయంకరంగా ఉంది! రితిక నోరు తెరిచే ఉండిపోయింది, షాక్ అయింది! అప్పుడే ఆకాశం నల్లగా మారింది... మొత్తం మబ్బులు! అందులో ముసుగులతో ఉన్న ఆధీర మనుషులు వచ్చి రితిక ముందు నిలబడ్డారు. అవును, ఆధీరకు కావలసిన మొదటి అమ్మాయి రితికే! రితిక పరుగెత్తాలి అనుకుంది, కానీ వాళ్లు కత్తులతో అడ్డుపడగానే అక్కడే నిలబడిపోయింది. 1 నిమిషంలో తేరుకున్న అల్కా... సన్నీ కోసం ప్రాణం పోయేలా అరుస్తూ పరుగెత్తింది. సన్నీ కూడా తేరుకుని తన అక్కను చూడగానే రక్తం మరిగిపోయింది! అలేఖ్య వెంటనే అల్కా వెంట పరుగెత్తింది. సోను వేగంగా వెళ్లి రితిక ఎదురు నిలబడిన వారిని కొట్టాలని గాలిలో జంప్ చేశాడు. కానీ పక్క నుండి వచ్చిన మిగిలిన 8 మందిలో ఒకడు సోనుని బలంగా తన్నగానే ఎగిరి సన్నీ పక్కన పడ్డాడు! ఆ 8 మంది సన్నీ, సోనుల వైపు వెళ్తుంటే విజయ్ కూడా అడ్డుకోవడానికి వెళ్లాడు. ప్రదేశం: రక్తసిక్తమైన రణరంగం - ట్రైన్డ్ యోధుల వీరసమరం సమయం: సాయంత్రం 04:15 గంటలు ఆధీర రావడానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. అనుష్క మెయిన్ గేట్ దగ్గర ముసుగు ధరించి నిలబడి ఉంది, తన వాళ్లు ఎక్కడున్నారో అర్థం కాలేదు. ఇటు సురేష్ చోప్రా మనుషులు తమ పని వేరే ఎవరో చేస్తున్నారని ఆ దారిని లాక్ చేసి చూస్తూ ఉన్నారు. మనకి కావాల్సింది డబ్బు మనకి వస్తుంది. అల్కా రియల్ బాడీగార్డ్స్ ఆమెను కాపాడటానికి వెళ్తుంటే... ఆధీర రౌడీలు ముగ్గురు బాడీగార్డ్స్ తలలు తెగేలా నరికి పడేశారు! అది చూసి అందరి కాళ్లూ చేతులూ వణికిపోయాయి! రితిక వాళ్ల మధ్య ఉంది... వర్ష, సోను, సన్నీ, అల్కా, అలేఖ్య, విజయ్ అందరూ ఒకే చోట ఉన్నారు. సన్నీ చూపు తన అక్క ముఖం పైనే ఉంది. సన్నీ: "మిమ్మల్ని చంపి అయినా నా వాళ్లను కాపాడుకుంటాను!"అంటూ సన్నీ ముందుకు కదిలాడు. సన్నీతో పాటు విజయ్, సోను, అలేఖ్య కూడా వెళ్లారు. సాధారణంగా కాకుండా... వీళ్లు ముగ్గరు కొన్ని అత్యంత భయంకరమైన మార్షల్ ఆర్ట్స్ మరియు కంబైన్డ్ టాక్టికల్ ఫైటింగ్లో ట్రైన్డ్ చేసిన యోధులు! సన్నీ తన బాడీని లోవర్-స్టాన్స్ పొజిషన్‌కి తెచ్చి, ఎదురుగా వచ్చిన ఒక రౌడీ దవడపై 'రివర్స్ ఎల్బో స్ట్రైక్' ఇచ్చాడు! "థచ్" మంటూ వాడి పళ్లు రాలిపోయాయి. కానీ ఆ రౌడీలు సాధారణ మనుషులు కాదు... నొప్పి తెలియని కిల్లర్ డ్రగ్స్ తీసుకున్న ఆధీర గొరిల్లాలు! వాడు తట్టుకుని సన్నీ భుజంపై కత్తితో దెబ్బ తీశాడు! సన్నీ భుజం చీలుకుంటూ రక్తం చిమ్మింది! సన్నీ నొప్పిని దిగమింగుతూ వాడి కత్తి పట్టుకున్న చేతిని విరిచి నేలకేసి బాదాడు. సోను పక్కన నిలబడి సన్నీకి పర్ఫెక్ట్ 'డిఫెన్సివ్ షీల్డ్' గా మారాడు! సోను తన మోకాళ్లతో, మోచేతులతో ఎదురొచ్చిన రౌడీల దాడులను సైడ్-బ్లాక్ చేస్తూ దెబ్బలు తింటున్నాడు. అలేఖ్య తన హై-స్పీడ్ ఫుట్‌వర్క్‌తో గాలిలోకి ఎగిరి, ఒక రౌడీ మెడను తన రెండు కాళ్లతో చుట్టి 'ఫ్లయింగ్ సిజర్ కిక్' తో వాడిని కిందకి పడేసింది! వాళ్లు వెంటనే తమ కత్తులు పడేసారు... ఎందుకంటే వాళ్లకు కావలసిన రెండో అమ్మాయి అలేఖ్య! ఆమెకి చిన్న గీత పడినా ఆధీర తమని ప్రాణాలతో ఉంచడని తెలుసు! అందుకే కేవలం ఆమెను అడ్డుకుంటూ మిగిలిన ముగ్గురినీ కొట్టడానికి చూస్తున్నారు. ఒక్కసారిగా ఆరుగురు రౌడీలు ఉమ్మడిగా విరుచుకుపడ్డారు. ఒక రౌడీ తన పదునైన కత్తితో సన్నీ భుజంపై లోతుగా నరికి, ఆ తర్వాత అతడి మోకాలి వెనుక భాగంలో గట్టిగా తన్నాడు! "కటక్" అనే శబ్దంతో సన్నీ కాలు బెణికి కిందపడ్డాడు! సన్నీ దారుణంగా దెబ్బ తిని రక్తం కక్కుతున్నాడు. అది చూసి రితిక, అల్కా ఇద్దరూ అరుస్తూ నేలపై కూర్చుండిపోయారు! సోను కోపంతో గర్జిస్తూ వాళ్లపై పడ్డాడు, కానీ ఒక రౌడీ ఇనుప రాడ్‌తో సోను పక్కటెముకలపై బలంగా కొట్టాడు! సోను నోటి నుండి రక్తం వచ్చింది. మరో రౌడీ విజయ్ కడుపులో కత్తితో కోశాడు! విజయ్ కడుపు పట్టుకుని రక్తం ఓడుతూ నేలకొరిగాడు. అలేఖ్య అది చూసి విజయ్ వైపు పరుగెత్తింది. సోను ఒక్కడే రక్తం కారుతున్న ఒంటితో, తెగిపోయిన ఊపిరితో పోరాడుతున్నాడు. రితిక: (భోరున ఏడుస్తూ, కన్నీళ్లతో) "మీకు ఏం కావాలి? వాళ్లని వదిలేయండి! ప్లీజ్ వాళ్లని చంపకండి!" రౌడీలు: (సోనుని గాలిలో ఎత్తి, వాడి మెడను బలంగా పట్టుకుని) "మాకు మీ ముగ్గురూ కావాలి! మీరు మాతో వస్తే వీళ్లని వదిలేస్తాం!" అని అల్కా, అలేఖ్య, రితికల వైపు చూపించారు. అల్కా: "మేము వస్తాం! వాళ్లని ఏం చేయకండి... నా తమ్ముడిని వదిలేయండి!" సోను గాలిలోనే తన సర్వశక్తులనూ కూడగట్టుకుని, వాడి ముఖంపై తన కాళ్లతో తన్ని విడిపించుకున్నాడు. తన అక్కలను కాపాడటానికి రక్తం ఓడుతున్న కాలుతోనే ముందుకు కదిలాడు. అందులో ఒక రాక్షసుడు తన భయంకరమైన కత్తిని పైకెత్తి, సోను తల నరకడానికి బలంగా కిందికి విసిరాడు! ప్రదేశం: అనుష్క కాళికా విజృంభణ & భావన రహస్యం సమయం: సాయంత్రం 04:25 గంటలు సరిగ్గా ఆ కత్తి సోను మెడను తాకే మిల్లీసెకనులో... "భచ్స్సససస!!!!!!!" దూరం నుండి మెరుపు వేగంతో ఎగిరివచ్చిన ఒక పదునైన కాంబాట్ కత్తి... ఆ రౌడీ తలలో నిలువునా వెనుక నుండి నోట్లోకి దిగి, నాలుకను చీల్చుకుంటూ బయటకు వచ్చింది! రక్తం ఫౌంటెన్ లా చిమ్మింది! టైమ్ 4:25! అక్కడ బ్లాక్ ఈగల్ టీం సూట్లో, చేతిలో రక్తం ఓడుతున్న కాంబాట్ నైఫ్‌తో నిలబడి ఉంది... అనుష్క! ఆమె తన ముసుగుతో చుట్టూ చూసింది... సన్నీ రక్తపు మడుగులో పడి కదల్లేకపోతున్నాడు, తన కంటిపాప రితిక గాయాలతో ఏడుస్తూ మోకాళ్లపై ఉంది! ఆ దృశ్యం చూడగానే అనుష్కలోని మాతృమూర్తి మాయమైంది! సాక్షాత్తు రక్తపిపాసి అయిన కాళికాదేవి ఆవాహనమైనట్లు ఆమె కళ్లు రక్తం రంగులోకి మారాయి! తాను మనిషిననే విషయమే మర్చిపోయింది! మిగిలిన 9 మంది రౌడీలు కత్తులు తిప్పుతూ అనుష్క వైపు పరుగెత్తారు. పిల్లలంతా భయంతో ఒకచోట చేరారు. అటు మెడికల్ రూమ్‌లో (సమాంతరంగా): బెడ్ పైన స్పృహలేకుండా ఉన్న భావనను చెక్ చేసిన డాక్టర్లు పరస్పరం చూసుకుని ఆశ్చర్యంతో చిరునవ్వు నవ్వారు. అవును... భావన ప్రెగ్నెంట్! (ఆమె గర్భవతి!) ఆ విషయమే భావనకు తెలీదు! గడిచిన మూడు రోజుల నుండి ఏమీ తినకపోవడం, ప్రయాణాలు, మానసిక ఒత్తిడి వల్ల నాడి చాలా బలహీనంగా కొట్టుకుంటోంది. డాక్టర్లు ఆమెకి అత్యవసరంగా గ్లూకోజ్ ఫ్లూయిడ్స్, విటమిన్ ఇన్జెక్షన్లు ఎక్కించారు. మరొక 15 నిమిషాల్లో ఆమెకి స్పృహ వస్తుందని ఎదురుచూస్తున్నారు! సరిగ్గా అదే సమయానికి (సాయంత్రం 4:25 గంటలకు)... ఆధీర తన భయంకరమైన రూపం లో ఉన్న జీప్ తో, లోపలికి అడుగు పెట్టాడు. ఈగల్ టీం డ్రస్‌లో ఉన్న అనుష్క వైపు చూస్తూ పర్లేదు ఈరోజు కొంచెం మాజా వస్తుంది అని కార్ లో కూర్చొని చూస్తున్నాడు. (ఈగల్ టీం కేవలం ప్రెసిడెంట్ కె రిపోర్ట్ చేస్తారు , RAW, కంటే కూడా చాలా పవర్ఫుల్ అని ఆధీరకి తెలుసు)
ఇట్లు,
✿SUNNY ✿ 1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️? 2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం 3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
02-08-2026, 05:04 PM
.........................అదే రోజు కొన్ని గంటల ముందు ప్రదేశం డెహ్రాడూన్.......................
సమయం: మధ్యాహ్నం 02:30 గంటలు (ప్రళయ వర్షం) ప్రదేశం: సీమ నివాసం & ఆ గ్రామం (నరమేధ దృశ్యం) బయట మధ్యాహ్నం 2:30 గంటల సమయమే అయినా... ఆకాశమంతా కాళరాత్రిలా నల్లటి మేఘాలు కమ్మేసి ప్రళయంలా మారింది. ఊహించని రీతిలో పిడుగుల వర్షం కురుస్తోంది. ఆకాశాన్ని నిలువునా చీల్చేస్తూ ఉరుములు, భయంకరమైన పిడుగుల వెలుగులు ఆ ఊరిపైన పడుతున్నాయి. అజిత్, రంగల రాక్షస మూక ఆ గ్రామంలోకి విరుచుకుపడి కంటపడిన ప్రతి ఒక్కరినీ దారుణంగా నరికి చంపేస్తోంది! ఇళ్లన్నీ తగలబడిపోతున్నాయి, రక్తం వర్షపు నీటితో కలిసి కాల్వలై పారుతోంది. సీమ ఇంట్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. 1000 ఏనుగుల రాక్షస బలం ఉన్న అజిత్, రంగలు వినాశనం సృష్టించి అందరినీ తమ అదుపులోకి తీసుకున్నారు. అన్ష్, అభిలు ఆఖరి శ్వాస వరకు పోరాడి తీవ్రంగా గాయపడి రక్తం కక్కుకుంటూ పడిపోయారు. శత్రువుల గూండాలు తుపాకులు, కత్తులను సీమ, రీయా, స్నేహ, అవ్నిలతో సహా కుటుంబ సభ్యుల తలలపై పెట్టడంతో... అందరూ నిస్సహాయంగా ఏడుస్తున్నారు. శత్రువులు తలుపులు బద్దలుగొడుతున్న ఆఖరి క్షణంలో... సీమ తన చిన్న పాపను రహస్య కబోర్డ్ వెనుక దాచింది. పాప చేతిలో ఒక పాత సీక్రెట్ ఫోన్ పెట్టి, ఆమె కళ్లల్లో నీళ్లతో వణుకుతున్న గొంతుతో అంది: సీమ: "బుజ్జి తల్లి... భయపడకు, ఇక్కడే నిశ్శబ్దంగా దాక్కో! ఈ ఫోన్లో 'గ్రీన్ బటన్' నొక్కు. అవతలి వాళ్లు ఫోన్ ఎత్తగానే... 'నన్ను క్షమించు అక్కా... నేను బతకను' అని ఒక్క మాట మాత్రమే చెప్పు తల్లి!" ఆ మాట చెప్పి, సీమ పాపను లోపల దాచి, ఆ అభాగ్య కుటుంబంతో నిలబడటానికి బయటకు వెళ్లిపోయింది. ఆ పాప వణుకుతున్న చేతులతో ఆ గ్రీన్ బటన్ నొక్కింది. పాప: "అమ్మమ్మ... అమ్మమ్మ! ఆ రాక్షసులు ఊరిలోని అందరినీ చంపేస్తున్నారు అమ్మమ్మ! ఇల్లంతా రక్తం చిమ్మి ఉంది...! కాపాడు అమ్మమ్మ..." పూనమ్: (సింహంలా గర్జిస్తూ) "తల్లి! నేను వస్తున్నాను... సరేనా నువ్వు అక్కడే జాగ్రత్తగా ఉండు. సీమ అమ్మమ్మని , మిమ్మల్ని కాపాడటానికి నేను వస్తున్నాను!" ప్రదేశం: సీమ నివాసం సమయం : సాయంత్రం 4.15 నిమిషాలు ఇంట్లో రక్తం ఓడుతున్న ఆ వాతావరణంలో...అజిత్ భయంకరమైన బలంతో విజృంభిస్తూ, అందరినీ కూలదోశాడు. అతడు కత్తి పట్టుకుని మాయ, అభి, రీయా, అవ్నిల వైపు క్రూరంగా చూస్తూ వారి శక్తిని లాక్కోవడానికి సిద్ధపడ్డాడు. ఆడవాళ్లందరూ భోరున ఏడుస్తున్నారు. అజిత్ పదునైన కత్తిని చేతుల్లోకి తీసుకుని, "ఈ 3 అమ్మాయిలను చంపి నేను మరింత బలవంతుడిని అవుతాను!" అని ఝుళిపించబోతుండగా... చావుబతుకుల మధ్య రక్తం కక్కుకుంటూ పడి ఉన్న అన్ష్... తన నరనరాల్లోని సర్వశక్తినీ కూడగట్టుకుని తుఫానులా పైకి లేచాడు! చేతిలోని కత్తితో దారిలో ఉన్న శత్రువులను నరుకుతూ, అజిత్ వైపు రౌద్రంతో దూసుకొచ్చాడు. అన్ష్: (అజిత్‌ను చూసి గర్జస్తూ) "నువ్వేమీ చేయలేవు! నువ్వేమీ చేయలేవు!" అన్ష్ అరుపుకు అజిత్ ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు, కానీ మరుక్షణమే నవ్వుతూ తన కత్తిని అన్ష్ వైపుకు కాకుండా... మోకాళ్లపై ఉన్న 'సీమ' గొంతు వైపు బలంగా విసిరాడు! అజిత్: "ముందు మీ అమ్మ గొంతు కోస్తానురా!" ఆ కత్తి సీమ గొంతును తాకబోయే సరిగ్గా ఆ ఆఖరి మిల్లీసెకనులో... "ఢాంఅఅఅఅంంమ్మ్మ్స్!!!!!!!" ఆకాశంలో పిడుగు బద్దలైనంత శబ్దంతో... గది పైకప్పు నుండి సీక్రెట్ కమాండో రూపంలో పిడుగులా కిందకు దూకింది పూనమ్ దేవి! అజిత్ విసిరిన ఆ కత్తికి అడ్డంగా... పూనమ్ దేవి తన నల్లటి కాంబాట్ కత్తిని మెరుపు వేగంతో అడ్డుపెట్టింది! ఆ రెండు ఆయుధాలు ఢీకొన్న రసవత్తర క్షణంలో... రెండు పర్వతాలు ఢీకొన్నట్లు విపరీతమైన నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి! బయటి వర్షపు నీటి చినుకులు లోపల ఎగిరిన ఆ నిప్పు రవ్వలపై పడి ఆవిర్లుగా మారాయి. మాస్క్ లేకుండా నిలబడి ఉన్న పూనమ్ దేవిని చూసి అక్కడున్న శత్రువులు, అన్ష్, అభి మరియు ఆ కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులై షాక్‌కు గురయ్యారు! ఎందుకంటే... మోకాళ్లపై ఉన్న 'సీమ', ఆమె ఎదురుగా కత్తి పట్టుకుని దేవతలా నిలబడిన 'పూనమ్' ఇద్దరూ అచ్చం ఒకేలా ఉన్నారు! ప్రదేశం: టైటాన్స్ సమరం అన్ష్: (శ్వాస తీసుకుంటూ, షాక్‌తో సీమను చూస్తూ) "అమ్మా... ఎవరు ఈమె?! అచ్చం నీలాగే ఉంది?" సీమ: (కళ్లల్లోంచి ఆనంద భాష్పాలు కారుతుండగా) "మనందరినీ కాపాడటానికి వచ్చిన నా ప్రాణసమానమైన అక్క... పూనమ్ దేవి!" అజిత్ కోపంతో రగిలిపోతూ పూనమ్పైకి దూకాడు. అక్కడ ఇద్దరు యోధుల మధ్య భయంకరమైన నరమేధ సమరం మొదలైంది! అజిత్ తన కత్తిని పూనమ్ మెడను లక్ష్యంగా చేసుకుని అడ్డంగా విసిరాడు. పూనమ్ మెరుపు వేగంతో కిందకు వంగి ఆ దాడిని తప్పించుకుంటూ, తన మోచేతితో అజిత్ పొత్తికడుపులో "భచ్" మంటూ బలంగా పొడిచింది! ఆ దెబ్బకి అజిత్ కడుపులో గాలి పోయినంత పనైంది, నోటి నుండి నురుగు వచ్చింది! అజిత్ తనలో ఉన్న 1000 ఏనుగుల బలాన్ని ఉపయోగించి, తన ఎడమ పిడికిలిని నిలువుగా పూనమ్ ఛాతీకి బలంగా విసిరాడు! పూనమ్ తన రెండు చేతులను అడ్డంగా పెట్టి ఆ పిడికిలి దెబ్బను అడ్డుకుంది. "థచ్!!" అనే భయంకరమైన శబ్దం వచ్చింది! ఆ దెబ్బలోని అపారమైన భారానికి పూనమ్ కమాండో బూట్లు నేలను చీల్చుకుంటూ... వేగంగా నాలుగు అడుగులు వెనక్కి పడిపోయాయి! పూనమ్ కాళ్లల్లో వణుకు వచ్చింది. "ఒక మనిషికి ఇంత బలం ఎలా సాధ్యం?!" అని పూనమ్ ఆశ్చర్యపోయింది. అజిత్ వెంటనే పూనమ్ కాలును లక్ష్యంగా చేసుకుని కత్తితో దాడి చేశాడు. పూనమ్ వెనక్కి తుళ్లుతూ తప్పించుకునే ప్రయత్నం చేసింది, కానీ అజిత్ కత్తి పూనమ్ తొడ భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది! రక్తం చిమ్మి నేలపై కురుస్తున్న వర్షపు నీటిలో కలిసింది. పూనమ్ ఆ తీవ్రమైన నొప్పిని దిగమింగుతూ... రివర్స్‌లో తన కత్తిని అజిత్ భుజంలోకి గుచ్చి లోతుగా గాయం చేసింది! అజిత్ గర్జించాడు! మరోవైపు స్పృహలోకి వచ్చిన అన్ష్, అభిలు రక్తం ఓడుతున్నా సరే తమ సర్వశక్తులనూ కూడగట్టుకుని రంగపై విరుచుకుపడ్డారు! అన్ష్ గాలిలోకి లేచి రంగ ముఖంపై తన రెండు కాళ్లతో 'ఫ్లయింగ్ డ్రాప్ కిక్' కొట్టాడు! రంగ వెనక్కి పడబోతుంటే... అభి వెనుక నుండి వచ్చి రంగ మోకాలి వెనుక భాగంలో బలంగా తన్ని మండే భుజాలపై నేలకేసి బాదాడు! అన్ష్, అభిలు ఇద్దరూ రంగ దవడ పైన, గుండెల పైన శబ్దాలు వచ్చేలా పిడిగుద్దుల వర్షం కురిపించారు! రంగ ముఖం రక్తసిక్తమై మూలుగుతూ క్రుంగిపోయాడు! కుటుంబ సభ్యుల తలలపై శత్రువుల గుండాలు పెట్టిన కత్తులను, తుపాకులను చూసి పూనమ్ కంగారుపడింది. ఆ భయం ఆమెను సరిగా పోరాడనీయడం లేదు. వెంటనే ఆమె తన సిగ్నల్ పంపింది... ఈ ప్రళయ వర్షం హోరులో కూడా "డాట్... డాట్... డాట్... డాట్!" అని స్నైపర్ల శబ్దం స్పష్టంగా వినిపించింది! కిటికీల వెనుక ఉన్న పూనమ్ స్పెషల్ స్నైపర్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు! కుటుంబం వెనుక నిలబడిన శత్రువుల తలలన్నీ 'హెడ్ షాట్స్' తో బద్దలై శవాలుగా నేలపై కూలిపోయారు! ఇది చూసి అజిత్ తీవ్ర భయానికి గురయ్యాడు. రంగ పరిస్థితి దారుణంగా మారింది. అన్ష్, అభి, పూనమ్‌లు ముగ్గురూ కలిసి అజిత్‌ను మూడు వైపులా చుట్టుముట్టారు. అన్ష్ ఒకవైపు నుండి అజిత్ వీపుపై కత్తితో నరకగా, అభి అజిత్ పొట్టలో తన్నాడు. పూనమ్ తన కత్తితో అజిత్ రొమ్ముపై లోతైన గాయం చేసింది. మూడు వైపులా పడుతున్న దెబ్బలకు, పూనమ్ డిఫెన్స్‌కి అజిత్ పూర్తిగా నీరసపడిపోయాడు. అజిత్ కొట్టే ప్రతీ దెబ్బనూ పూనమ్ తన పదునైన కమాండో టెక్నిక్స్‌తో అడ్డుకుంటుంటే... సమయం 5 గంటలు అతను ఆశ్చర్యపోతూ ఆలోచించాడు: "ఈ సమయం పోరాటానికి తగదు... తప్పుకోవడమే మేలు!" వెంటనే అజిత్ తన జాకెట్లోని స్మోక్ గ్రెనేడ్, గ్రెనేడ్ల పిన్స్ ఊడదీసి, నేరుగా రీయా, స్నేహల వైపు విసిరాడు! పూనమ్: "నోఓఓఓ!" పూనమ్ ప్రాణాలకు తెగించి పరుగున వెళ్లి, రీయాను బలంగా పక్కకు నెట్టి, ఆ గ్రెనేడ్‌ను తన కాలితో దూరంగా విసిరేసింది. కానీ... అది గాల్లోనే "భూం" మంటూ పేలిపోయి, దట్టమైన పొగను విడుదల చేసింది! ఆ పొగను ఆసరాగా చేసుకుని అజిత్, రంగలు అక్కడి నుండి పారిపోయారు! కానీ పొగ తగ్గగానే... ఒంటిపై ఉన్న గాయాల వల్ల, రక్తస్రావం వల్ల పూనమ్ దేవి కింద పడిపోయిఉంది . కన్నీళ్లతో ఉన్న సీమ పరుగున వచ్చి పూనమ్‌ను పట్టుకుంది. పూనమ్ ఒంట్లో శ్వాస లేనట్లు ఉంది. సీమ: (భోరున ఏడుస్తూ) "అక్కా... అక్కా! నువ్వు నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లకు! లే అక్క .....
ఇట్లు,
✿SUNNY ✿ 1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️? 2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం 3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
02-08-2026, 05:06 PM
ప్రదేశం: కాలేజ్ మెయిన్ ఆవరణ (ఆధీర వీక్షణ & వికృత ఆలోచన)
సమయం: సాయంత్రం 04:30 గంటలు కాలేజ్ ప్రాంగణానికి సముద్రపు దిశ నుండి విరుచుకుపడ్డ నల్లటి మేఘాలు వాతావరణాన్ని కాళరాత్రిలా మార్చేశాయి. సూర్యుడు ఉన్నా సరే... ఆ చీకటి వెలుగుల్లో రక్తం చిమ్మిన దృశ్యాలు మరింత భయంకరంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా సాయంత్రం 04:30 గంటలకు... ఆధీర అక్కడ తన కార్ పైన కాలు మీద కాలు వేసుకుని ప్రశాంతంగా కూర్చున్నాడు. అతని ముఖంలో నరరూప రాక్షసుడి వికృత చిరునవ్వు తాండవిస్తోంది. చేతిలోని సిగార్ పొగను గాల్లోకి వదులుతూ, దూరంగా గ్రౌండ్లో రక్తం కక్కుకుంటూ పడి ఉన్న పిల్లలను, తన ముందున్న దారుణ పరిణామాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆధీర: (తన మనసులో వికృతంగా నవ్వుకుంటూ) "ఈ సురేష్ చోప్రా గాడు నేను అనుకున్న దానికంటే చాలా పవర్ఫుల్ గానే ప్లాన్ చేశాడు... ఎంత క్రూరమైన బాడీగార్డ్స్‌ని తెచ్చినా, నా రాక్షసుల ముందు వాళ్ల తలలు ఎగిరిపడ్డాయి. ఇక్కడ ఈ 'ఈగిల్ టీమ్' (ఆధీర సైన్యం) ఏం చేస్తుందో, ఎంత నరమేధం సృష్టిస్తుందో చూద్దాం!" తన ముందు కింద పడి ఉన్న రౌడీ గొంతు నుండి రక్తపు లోతైన ధార పారుతోంది. ఆ రౌడీ తలలో వెనుక నుండి దిగి నోట్లోంచి బయటకొచ్చిన కాంబాట్ కత్తిని చూసి, ఆధీర మనుషులు ఆ క్షణంలో స్థాణువైపోయారు! అక్కడ నిలబడి ఉన్నది మరేవరో కాదు... అనుష్క! తన కంటిపాపలాంటి కూతురు రితిక గాయాలతో మోకాళ్లపై ఏడుస్తుండటం, సన్నీ రక్తపు మడుగులో విరిగిపోయిన కాలుతో కొట్టుమిట్టాడటం చూసిన అనుష్కలో... మనిషి అనే భావన నశించిపోయింది. ఆమె కళ్లల్లో రక్తం ఉప్పొంగింది. సాక్షాత్తు కాళికాదేవి ఆవాహనమైనట్లు రౌద్రంతో ఊగిపోతోంది! ఆధీర సైన్యంలోని మిగిలిన 9 మంది నరరూప రాక్షసులు తమ పదునైన రాక్షస కత్తులు, బాకులను చేతుల్లోకి తీసుకుని, ఒక్కసారిగా అనుష్క పైకి నరకం చూపించడానికి పరుగెత్తారు! ఆ 9 మంది రాక్షసులు ఒక్కసారిగా తన మీదికి విరుచుకుపడుతుంటే... అనుష్క మెరుపు వేగంతో కిందికి వంగి, చచ్చిపడి ఉన్న ఆ మొదటి రౌడీ గొంతులో నుండి ఆ కాంబాట్ కత్తిని బలంగా బయటకు లాగింది! ఆ దెబ్బకి వాడి రక్తపు చినుకులు గాల్లో ఎగిరి పడ్డాయి. ఇప్పుడు ఆమె రెండు చేతుల్లోనూ రెండు పదునైన కత్తులు మెరుస్తున్నాయి! ఆమె కళ్లల్లో కనిపిస్తున్న కసి చూసి చుట్టూ నిలబడ్డ పిల్లల (అల్కా, వర్ష, సోను, విజయ్, అలేఖ్య) గుండెలు భయంతో ఒణికిపోయాయి! మొదటి రాక్షసుడు కత్తిని అనుష్క తల లక్ష్యంగా నిలువుగా విసిరాడు. అనుష్క తన శరీరాన్ని వెనక్కి విరిచి ఆ దాడిని తప్పించుకుంది. మరుక్షణం తన కుడిచేతి కత్తిని వాడి పొత్తికడుపులోకి బలంగా గుచ్చి, పైకి లాగుతూ కడుపును నిలువుగా చీల్చి వేసింది! వాడి ప్రేగులు నేలపైన పడగా, ఎడమ చేతి కత్తితో వాడి నడుముని అడ్డంగా నరికి రెండు ముక్కలు చేసి పడేసింది! రెండోవాడు పక్క నుండి దాడి చేయబోతుండగా... అనుష్క తన కాలి బూటుతో వాడి మోకాలి పై బలంగా తన్నింది! "కటక్" మనే శబ్దంతో వాడి కాలు వెనక్కి విరిగిపోయింది. వాడు పెడబొబ్బలు పెడుతూ కిందపడబోతుంటే, అనుష్క రెండు కత్తులను వాడి మెడకు రెండు వైపులా కత్తెరలా పెట్టి తిప్పేసింది! వాడి తల శరీరం నుండి వేరై ఎగిరిపడింది! మూడోవాడు భయంకరమైన గొడ్డలితో అనుష్క పైకి దూకాడు. అనుష్క వెనక్కి జరిగి, వాడి చేతి మణికట్టుపై తన కత్తితో అడ్డంగా నరికి చెయ్యి వేరు చేసింది. వాడు అరుస్తుండగానే... మరో కత్తిని వాడి ఛాతీ ఎముకల మధ్యలోకి గుచ్చి, తన మోచేతితో వాడి గొంతుపై తన్ని కత్తిని కిందకి గుంజడంతో వాడి ఛాతీ, కడుపు రెండు భాగాలుగా బద్దలైపోయాయి! నాలుగోవాడు వెనుక నుండి అనుష్క జుట్టు పట్టుకోవడానికి చేయి చాచాడు. అనుష్క గాలిలోకి లేచి వాడి ముఖంపై తన్నింది. వాడు తూలి పడుతుండగా, గాల్లోనే తన రెండు కత్తులతో వాడి తొడల నరాలను కత్తిరించి, కిందపడగానే వాడి గొంతును నిలువునా చీల్చేసింది! ఐదో రాక్షసుడు వెనక్కి తగ్గకుండా కత్తితో అనుష్క కడుపులో గుచ్చడానికి వచ్చాడు. అనుష్క వాడి కత్తి ఉన్న చేతిని తన ఎడమ చేత్తో అడ్డుకుని, వాడి రెండు కళ్లల్లోకి తన రెండు కత్తుల పదునైన కొనలను గుచ్చింది! వాడు గుడ్డివాడై కేకలు వేస్తుంటే... వాడి నడుము భాగాన్ని కత్తితో బలంగా నరికి పేగులు బయటకు వచ్చేలా నేలకేసి కొట్టింది! ఆరో, ఏడో రాక్షసులు ఇద్దరూ ఒకేసారి రెండు వైపుల నుండి విరుచుకుపడ్డారు. అనుష్క తన రెండు చేతులను రెండు వైపులా చాచి, ఒకడి కాలు నరాన్ని, ఇంకొకడి గొంతు నరాన్ని ఒకే క్షణంలో తెగ్గోసింది! ఒకడి కాళ్లు విరిగి కిందపడగా, రెండోవాడి తల సగం తెగి వేలాడింది. ఆ వెంటనే అనుష్క వాళ్లిద్దరి శరీరాలను మూడు భాగాలుగా వీడిపోయేలా నరికి పారేసింది! ఎనిమిదోవాడు దారిన ఉన్న ఇనుప రాడ్‌ని తీసుకుని అనుష్క వీపుపై కొట్టాడు. ఆ దెబ్బకి అనుష్క నోటి నుండి రక్తం చిమ్మింది! కానీ ఆమె వెనక్కి తిరిగి, వాడి రాడ్‌ని పట్టుకుని, కత్తితో వాడి రెండు చేతులను భుజాల వద్ద నరికి వేసింది! ఆ తర్వాత వాడి గుండెల్లోకి కత్తిని గుచ్చి, తిప్పి బయటకు లాగేసింది! తొమ్మిదోవాడు భయంతో వణుకుతూ వెనక్కి పారిపోవడానికి ప్రయత్నించాడు. అనుష్క తన చేతిలోని ఒక కత్తిని గాలిలోకి విసిరింది! ఆ కత్తి వాడి వీపు గుండా దూసుకెళ్లి రొమ్ము భాగంలోంచి బయటకు వచ్చింది! వాడు మోకాళ్లపై పడగానే... అనుష్క పరిగెత్తుకెళ్లి రెండో కత్తితో వాడి తలను బలంగా నరికి వేసింది! ఆ తల ఎగిరి దూరంగా పడింది! చుట్టూ నలుగురి రక్తం, తెగిపడిన శరీర భాగాలు శవాల దిబ్బలా మారాయి! ఆ తొమ్మిదో రాక్షసుడి తల తెగిపడి నేలపై దొర్లుతుంటే... అప్పటివరకు సిగార్ తాగుతూ నవ్వుతూ చూస్తున్న ఆధీర నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతడి కళ్లల్లో క్రూరత్వం, వికృతమైన సంతోషం ఉప్పొంగాయి. అనుష్క తొమ్మిది మందిని వరుసగా నరికివేసి, రక్తం ఓడుతున్న శరీరంతో, ఊపిరి సలపక అలసిపోయి మోకాళ్లపై తూలుతోంది. అప్పుడే ఆధీర నవ్వుకుంటూ... తన ఆర్మీ జీప్ వెనుక భాగంలో ఉన్న అతి పెద్ద ఇనుప రాక్షస సుత్తిని చేతుల్లోకి తీసుకున్నాడు. అతను రాక్షస అడుగులు వేస్తూ, అలసిపోయిన అనుష్క వెనుక భాగానికి నిశ్శబ్దంగా చేరుకున్నాడు! రితిక: (గాయాలతో రక్తపు మడుగులో ఉండి, గట్టిగా అరుస్తూ) "అమ్మమ్మమ్మమ్మ! వెనుకాల... అమ్మమ్మ జాగ్రత్త!" సన్నీ: "అమ్మమ్మమ్మమ్మా!" పిల్లలందరూ ప్రాణాలు పోయేలా అరిచారు! కానీ అనుష్క తేరుకునేలోపే... "ధమ్మ్మ్మంంంంఅఅఅఅఅససససస్స్స్!!!!!!!" ఆధీర ఆ అతి పెద్ద ఇనుప సుత్తిని తన సర్వశక్తితో... అనుష్క తల వెనుక భాగానికి బలంగా బాదాడు! ఆ దెబ్బ శబ్దానికి అక్కడ ఉన్న భూమి కంపించినంత పనైంది! అనుష్క తల పగిలి రక్తం ఉప్పెనలా చిమ్మింది! ఆ రక్తపు చినుకులు దూరంగా నిలబడి ఉన్న పిల్లలందరి ముఖాల పైన, బట్టల పైన తుంపరలుగా పడ్డాయి! అనుష్క కళ్లు తేలేసింది... రక్తంతో నిండిపోయి, ప్రాణాలు కోల్పోతూ ముందుకు ఒరిగిపోతోంది. కానీ ఆధీర క్రూరత్వం అక్కడితో ఆగలేదు! మోకాళ్లపై పడిపోతున్న అనుష్క పరిస్థితిని చూసి వికృతంగా నవ్వుతూ... తన చేతిలో ఉన్న పదునైన రాక్షస కత్తిని తీసి, అనుష్క తలను మరో రెండు ముక్కలు చేయాలి అని చూస్తూ పిల్లలవైపు చూస్తూ నవ్వాడు .. సరిగ్గా సాయంత్రం 05:00 గంటలు అయింది! అటు డెహ్రాడూన్ రణరంగంలో శత్రువులతో వీరపోరాటం చేసి, తీవ్ర గాయాలతో రక్తం కక్కుకుంటూ పూనమ్ దేవి నేలకొరగగా... ఇటు వైజాగ్ కాలేజీ ప్రాంగణంలో ఆధీర రాక్షస దెబ్బకు తల ముక్కలై అనుష్క రక్తపు మడుగులో శవమై కూలబడింది! ఒకే క్షణంలో... సాయంత్రం 5:00 గంటలకు, ఇద్దరు వీర మాతృమూర్తులు (అటు పూనమ్ దేవి, ఇటు అనుష్క) దారుణంగా నేలకొరిగారు! విజయ్ అక్కడ ఉంది భావన ని అనుకుంటున్నాడు, సన్నీ ,రితిక అక్కడ ఉంది అనుష్క అమ్మ అని అనుకుంటున్నారు, అల్కా, వర్ష, సోనూ అక్కడ ఉంది పూనమ్ దేవి అని ఎడుస్తున్నారు..... పిల్లలందరూ: (గుండెలు పగిలేలా ఏడుస్తూ) "అమ్మమ్మమ్మమ్మమ్మఅఅఅఅఅఅఅఅఅ!!!!!!!!" అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.. ఆధీర ఆ రక్తం ఓడుతున్న కత్తిని, సుత్తిని భుజంపై వేసుకుని వికృతంగా గర్జిస్తున్నాడు!
ఇట్లు,
✿SUNNY ✿ 1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️? 2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం 3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
02-08-2026, 05:08 PM
ప్రదేశం: కాలేజ్ మెడికల్ రూమ్ & రణరంగం
సమయం: సాయంత్రం 04:55 గంటలు మెడికల్ రూమ్‌లో బెడ్‌పై ఉన్న భావనకు సాయంత్రం 4:55 గంటలకు సడన్‌గా మేల్కువ వచ్చింది. శరీరంలో విపరీతమైన నీరసం, అనారోగ్యంతో తల తిరుగుతున్నా సరే... ఆమె కళ్ళు తెరిచింది. అక్కడున్న డాక్టర్లు, నర్సులు ఆమెను ఆపడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ భావన వారి మాటలను అసలు పట్టించుకోలేదు! తన చేతులకు ఉన్న గ్లూకోజ్ డ్రిప్స్, ఇన్జెక్టో వైర్లు, మానిటర్ వైర్లన్నింటినీ కసిగా పీకి అవతల పడేసింది! ఆమె దేహం లోపల ఉన్న మాతృ రౌద్రం, విశ్వం లాంటి శక్తి ఒకేసారి మేల్కొన్నాయి. తన బ్లాక్ కమాండో సూట్ పైన ఉన్న లాంగ్ డ్రెస్‌ను విసిరేసి, కేవలం ఆ అడ్వాన్స్డ్ సూట్‌తో, నీరసంతో తూలుతూనే ప్రైవేట్ VIP ఎంట్రెన్స్ వైపు రాకెట్ వేగంతో పరుగెత్తింది! ప్రదేశంలోకి అడుగుపెట్టగానే ఆమె చూపుల ముందు ఒక భయంకరమైన నరకం కనిపించింది! ఆధీర ఆ అతి పెద్ద ఇనుప రాక్షస సుత్తితో ఒక ఏజెంట్ తలను బలంగా కొట్టడం... ఆమె తల పగిలి రక్తం చిమ్మడం..... పిల్లలందరూ (రితిక, సన్నీ, వర్ష, సోను, అలేఖ్య, విజయ్, అల్కా) రక్తపు ముద్రలతో మోకాళ్లపై కూర్చుని గుండెలు పగిలేలా ఏడవడం భావన కంటపడింది! ఆ గుంపులో తన కొడుకు విజయ్ ఎక్కడున్నాడో అని భావన వెతుకుతూ ఒక్క క్షణం ఆగింది. విజయ్ కడుపులోంచి రక్తం ధారలా కారుతూ, దారుణమైన గాయంతో కిందపడి ఉండటం చూడగానే... భావన గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది! కళ్లల్లోంచి కన్నీటి చుక్క రాలగా... లోపల గట్టిగా అనుకుంది: (మనసులో) "నన్ను క్షమించు అమ్మ! నా కొడుకుని, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను రాక తప్పలేదు! నేను మరోసారి నియమం తప్పుతున్నాను . " భావన వెంటనే తన ముఖానికి ఉన్న బ్లాక్ కమాండో మాస్క్ ను ధరించింది! అనుష్క తలను మరింత వికృతంగా ముక్కలు చేయాలని మళ్లీ కత్తి పైకెత్తిన ఆధీర వైపుకు భావన గాల్లో 20 అడుగుల ఎత్తుకి లేచి, 'ఫ్లయింగ్ డ్రాప్ కిక్' తో విరుచుకుపడింది! "ఢాంఅఅఅఅంంమ్మ్మ్స్!!!!!!!" ఆ దెబ్బ తీవ్రతకు ఏనుగుల బలం ఉన్న ఆధీర కూడా రెండడుగులు ముందుకి తూలి పడిపోయాడు! భావన నేలపై వాలి, అక్కడ పడి ఉన్న ఆమె మాస్క్, ఆమె డ్రెస్ చూడగానే అర్థమైంది... ఈమె 'ఈగిల్ టీమ్' అని! భావన గంభీరంగా, గర్జించే గొంతుతో పిల్లల వైపు చూస్తూ అరిచింది: భావన: "త్వరగా ఈ ఆఫీసర్ని తీసుకుని హాస్పిటల్‌కి పరుగెత్తండి! ఇక్కడ ఉన్న రాక్షసుడిని నేను చూసుకుంటాను!" పిల్లలు కంగారుగా లేచి పరుగెడుతుంటే... ఆధీర కోపంతో రగిలిపోతూ, తన చేతిలో ఉన్న భయంకరమైన రాక్షస ఆయుధాన్ని (కత్తిని) సన్నీ తల లక్ష్యంగా చంపేయాలనే కసితో గాల్లోకి విసిరాడు! కానీ... భావన మెరుపు వేగంతో ముందుకు దూకి, ఆ యుగాంతపు వేగంతో వస్తున్న ఆయుధాన్ని పకడ్బందీగా తన వట్టి చేతితో పట్టుకుని ఆపేసింది! ఆధీర ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు! ఒక మనిషి తన ఆయుధాన్ని గాల్లోనే పట్టుకోవడం ఏంటి?! భావన ఆ ఆయుధాన్ని తిరిగి ఆధీర ముఖం మీదికే బలంగా విసిరికొడుతూ అంది: భావన: "తీసుకోరా!" అటువైపు పిల్లలందరూ పరుగెత్తుకుంటూ వచ్చి అనుష్క దేహాన్ని లేపి, ఆమె చేయి పట్టుకున్నారు. కానీ అనుష్క నాడి ఆడటం లేదు! అయితే... ఆ చేయి స్పర్శ తగలగానే రితిక, సన్నీలు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ స్పర్శలో ఏదో రహస్య సంకేతం వారిద్దరికీ అర్థమైంది! సన్నీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తన విరిగిన కాలు నొప్పిని కూడా లెక్కచేయకుండా... అనుష్క దేహాన్ని తన భుజంపై వేసుకున్నాడు. వర్ష పార్క్ చేసిన కారు వైపు పరుగెత్తాడు. రితిక కారు డోర్ తీసి ఎక్కగానే, సన్నీ కారు స్టార్ట్ చేసి అనుష్కని తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు! మిగిలిన అందరూ (అల్కా, సోను, అలేఖ్య, విజయ్, వర్ష) మరొక కారు కోసం పరుగెత్తబోయి ఒక్కసారిగా ఆగిపోయారు. కానీ సోను పరిస్థితి దారుణంగా మారింది! పక్కటెముకలు విరిగి, రక్తం కక్కుతున్న సోనుని చూసి అల్కా అరిచింది: అల్కా: "అక్క! ఏం చూస్తున్నావ్? వీడు చనిపోతాడు, త్వరగా పదా!" అని సోనుని తీసుకుని వర్ష, అల్కాలు కారులో హాస్పిటల్‌కి బయలుదేరారు. అక్కడ అలేఖ్య, విజయ్ మిగిలిపోయారు. అలేఖ్య విజయ్‌ని రమ్మని లాగుతున్నా... విజయ్ మాత్రం వెళ్లకుండా, మాస్క్ వేసుకుని పోరాడుతున్న ఆ కమాండో (తన తల్లి భావన) వైపే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు! ఆధీర తన ఒంటి నిండా ఉన్న రాక్షస బలంతో, వికృతమైన గర్జన చేస్తూ భావనపైకి పర్వతంలా విరుచుకుపడ్డాడు! కానీ భావనకు ప్రతి క్షణం స్పృహ తప్పుతున్నా, కళ్లు తిరుగుతున్నా... తన కొడుకు విజయ్ రక్షణ కోసం, విశ్వమంత శక్తితో పోరాటం ప్రారంభించింది! ఆధీర తన రాక్షస ఇనుప సుత్తిని రెండు చేతులతో పట్టుకుని, భావన తలను పొడి పొడి చేయడానికి బలంగా విసిరాడు! "విష్చ్స్స్" మంటూ గాల్లో విపరీతమైన శబ్దం వచ్చింది. భావన కళ్లు తిరుగుతున్నా, రీఫ్లెక్స్ స్పీడ్‌తో నేలపైకి వంగి (Back-bend Dive) తప్పించుకుంది. ఆ సుత్తి నేలకు తగలగానే "భూమ్మ్మ్!" మంటూ అక్కడి కాంక్రీట్ రోడ్డు బద్దలై శకలాలు గాల్లోకి ఎగిరాయి! భావన క్షణాల్లో పైకి లేచి, ఆ సుత్తి హ్యాండిల్‌పై తన కాలు పెట్టి నొక్కింది. ఆధీర దాన్ని లాక్కోలేకపోయాడు! భావన మెరుపు వేగంతో ఆధీర గొంతుపై తన మోచేతితో "భచ్" మంటూ నరాల పైన కొట్టింది! ఆధీర నోటి నుంచి రక్తం ఓడింది! ఆధీర తన పదునైన రాక్షస కత్తిని తీసి భావన పొత్తికడుపులో గుచ్చడానికి విసిరాడు. భావన ప్రెగ్నెంట్ విషయం ఆమెకి తెలీదు ! భావన తను చిన్నతనం నుండి నేర్చుకున్న విశ్వం లాంటి అడ్వాన్స్డ్ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌తో ఆధీర కత్తి పట్టుకున్న మణికట్టును పట్టుకుని తిప్పేసింది. "కటక్...!" ఆధీర కుడిచేతి మణికట్టు ఎముక చర్మం చీల్చుకుని బయటకు వచ్చింది! ఆధీర అరిచిన కేక నగరమంతా వినపడింది! భావన ఆ కత్తిని లాక్కుని, ఆధీర కుడి తొడ భాగంలోకి లోతుగా దింపి, అడ్డంగా నరికి పడేసింది! రక్తం ఫౌంటెన్ లా చిమ్మి ఆధీర ఒళ్లంతా ఎర్రగా మారింది! ఒక చెయ్యి, ఒక కాలు దారుణంగా గాయపడి రక్తం కారుతున్నా... ఆధీర తన ఎడమ చేత్తో భావన గొంతు పట్టుకోవడానికి వచ్చాడు. భావన తన రెండు వేళ్లతో ఆధీర నరాలపై పొడిచింది! ఆ వెంటనే భావన గాలిలోకి 15 అడుగులు లేచి, ఆధీర ఎడమ భుజంపై తన మోకాలితో "భచ్" మంటూ బలంగా బాదింది! "ఖచ్ఛచ్!" ఆధీర ఎడమ భుజం ఎముక పూర్తిగా విరిగిపోయి, చెయ్యి వేలాడిపోయింది! ఆధీర మోకాళ్లపై కూలబడ్డాడు! భావన ఆ తర్వాత ఆధీర ఎడమ కాలు మోకాలి చిప్ప (Knee-Cap) పైన తన బూటుతో గట్టిగా తన్నింది! "కటక్!" అనే శబ్దంతో ఆధీర రెండో కాలు కూడా విరిగిపోయింది! ఒళ్లు నిండా గాయాలు, రెండు చేతులు, రెండు కాళ్లు దారుణంగా దెబ్బతిని, రక్తం మడుగులో ఆధీర నరకయాతన అనుభవిస్తున్నాడు! పోరాటం 40 నిమిషాలకు చేరుకుంది. ఆధీర రక్తపు మడుగులో లేవలేక కొట్టుమిట్టాడుతున్నాడు. సరిగ్గా అప్పుడే... ఆధీర చెవిలో ఉన్న రహస్య బ్లూటూత్‌కి అతడి తమ్ముడు రణధీర్ నుండి ఫోన్ వచ్చింది! రణధీర్: (భయంతో పిచ్చివాడిలా అరుస్తూ) "అన్నా! స్టేడియంలో మన 50 కేజీల RDX బాంబును ఎవరో సీక్రెట్‌గా డిఫ్యూజ్ చేసి, డిస్పోజ్ చేశారు అన్నా! మన ప్లాన్ అంతా లీక్ అయిపోయింది!" ఆ మాట వినగానే ఆధీరకు మైండ్ బ్లాంక్ అయింది! ఇది తనను నాశనం చేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్ అని అర్థమైంది! అతడు వెంటనే తన స్నిపర్లకు సిగ్నల్ ఇవ్వడానికి జేబులోని బటన్ నొక్కాడు... కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు! ఎందుకంటే... భావన అప్పటికే ఆ ఇద్దరు స్నిపర్లను చంపేసింది! ఆధీర మనసులో భయంకరమైన ప్రకంపనలు మొదలయ్యాయి: "నా జీవితంలో నన్ను ఏ ఒక్కడూ ఓడించలేకపోయాడు! కానీ 25 ఏళ్ల క్రితం ఒకే ఒక్క రాక్షసి నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లి నా సామ్రాజ్యాన్ని నాశనం చేసింది! బ్లాక్ స్క్వాడ్ అంతా చనిపోయారు... మరి నా ఎదురుగా ఉన్న ఈ 'విశ్వ రూప మృత్యు దేవత' ఎవరు?!" భావన ఆధీర తలను శరీరం నుండి వేరు చేయడానికి తన చేతిని కత్తిలా పైకెత్తింది! సరిగ్గా ఆఖరి క్షణంలో... సాయంత్రం 06:00 గంటలు కావస్తుండగా... రక్తపు మడుగులో పడి ఉన్న విజయ్ నోటి నుండి ఆఖరి శ్వాసతో బిగ్గరగా అరుపు వినిపించింది: విజయ్: "అమ్మాఅఅఅఅఅఅఅఅఅఅ!!!!!!!" అంటూ విజయ్ స్పృహతప్పి నేలపై పడిపోయాడు! అలేఖ్య గట్టిగా "విజయ్!" అని అరిచింది! ఆ 'అమ్మా' అనే కేక వినగానే... భావన గుండె నిలువునా బద్దలైంది! ఆధీర తల నరకాల్సిన చేయి గాల్లోనే ఆగిపోయింది. మాస్క్ లోంచి కన్నీళ్లు ధారగా కారుతుండగా... భావన ఆధీరను అక్కడే వదిలేసి, పిచ్చిదానిలా తన కొడుకు విజయ్ వైపు పరుగెత్తింది! భావన విజయ్ దగ్గరకు పరుగెత్తి అతడిని గుండెలకు హత్తుకుని ఏడుస్తుండగా... అక్కడ చావుబతుకుల మధ్య రక్తం కక్కుకుంటూ పడి ఉన్న ఆధీర... భావన దృష్టి విజయ్ పైకి మళ్లడం గమనించాడు. తన విరిగిపోయిన కాలు, చేతితో నరకయాతన అనుభవిస్తూనే, నేలపై ఈదుకుంటూ... అక్కడ విరిగిపడి ఉన్న తన ముఠా వాహనం నీడలోకి వెళ్లి, అక్కడ సిద్ధంగా ఉన్న తన రహస్య అనుచరుల సహాయంతో అక్కడి నుండి సైలెంట్‌గా తప్పించుకుని పారిపోయాడు! భావన రహస్యం & పంచభూతాల తత్వం: సృష్టిలో 5 శక్తులు ఉంటే... 1. భూమి (పూనమ్ దేవి): ఎంతటి భారాన్నైనా మోస్తూ, ఓర్పుతో ఉంటూనే... శత్రువుపై అత్యంత భయంకరమైన ఫైటర్ అండ్ డిఫెండర్‌గా మారుతుంది. 2. నిప్పు (అనుష్క): శత్రువు కంటే పది అడుగులు ముందుంటూ, రణరంగంలో నిప్పులా రగిలిపోతూ నరమేధం సృష్టిస్తుంది. 3. నీరు, 4. గాళి: (వీరి వివరాలు మున్ముందు రాబోయే ఎపిసోడ్లలో తెలుస్తాయి). 4. ఆకాశం / విశ్వం (భావన - FAB SHADOW): భావనకు సమస్త యుద్ధ తంత్రాలు తెలుసు! ఆమెతో పూనమ్, అనుష్కలతో సహా 50 మంది అత్యున్నత శిక్షణ పొందిన యోధులు కలిసి పోరాడినా... భావనను ఓడించడం అసాధ్యం! ఆమె మెదడు శత్రువు దాడి చేయబోయే దిశను మిల్లీమీటర్ సెకను కంటే వేగంగా విశ్లేషిస్తుంది. శత్రువు చెయ్యి ఎత్తేలోపే ఆమె కౌంటర్ అటాక్ సిద్ధంగా ఉంటుంది! 25 ఏళ్ల క్రితం... ఆధీర చేతిలో చావుబతుకుల మధ్య ఉన్న పూనమ్‌ను, అనుష్కను కాపాడి... ఆధీర మొత్తం రాక్షస సామ్రాజ్యాన్నే భూమి మీద లేకుండా తుడిచిపెట్టింది భావనే! వైజాగ్ నేల పైన 5:15 గంటల ప్రళయం ముగిసింది... ఆధీర గాయాలతో పారిపోగా, భావన తన రక్తసిక్తమైన కొడుకు విజయ్ను కాపాడుకోవడానికి పోరాడుతోంది!
ఇట్లు,
✿SUNNY ✿ 1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️? 2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం 3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
02-08-2026, 05:11 PM
ప్రదేశం: కాలేజ్ ఆవరణ - VIP ఎంట్రెన్స్ సమయం: సాయంత్రం 06:05 గంటలు (ప్రళయ వర్షం ఆరంభం) ఆధీర దారుణంగా గాయపడి అక్కడి నుండి తప్పించుకుని పారిపోయిన సరిగ్గా అదే సమయంలో... ఆకాశమంతా కాళరాత్రిలా మారి, ఒక్కసారిగా పిడుగుల హోరుతో భారీ ప్రళయ వర్షం కురవడం ప్రారంభమైంది! రక్తంతో తడిసిన ఆ నేల పైన వర్షపు నీరు పడుతూ... ఎర్రటి రక్తపు కాల్వలై పారుతోంది. అక్కడే ఉన్న అల్కా, సోనుని తీసుకుని కారులో హాస్పిటల్‌కి వెళ్లిపోవడంతో... అక్కడి రణరంగంలో కేవలం అలేఖ్య, రక్తపు మడుగులో స్పృహతప్పి పడి ఉన్న విజయ్, మరియు అలసిపోయి రక్తం ఓడుతున్న భావన (FAB SHADOW) మాత్రమే మిగిలారు. సరిగ్గా అదే సమయంలో... అప్పటివరకు సురేష్ చోప్రా పంపిన విఐపి సెక్యూరిటీ డ్రెస్‌లో దాక్కున్న 10 మంది వరల్డ్ డేంజరస్ కిల్లర్స్ పొదల్లోంచి బయటకు వచ్చారు! వాళ్లకు కావలసిన అసలైన టార్గెట్ అలేఖ్య మరియు అక్కడున్న ఆ ముసుగు కమాండో (భావన) దొరకగానే... ఆ 10 మంది రౌడీలు తమ చేతుల్లోని పదునైన కత్తులు, ఇనుప రాడ్లను ఝుళిపిస్తూ వర్షంలో నీటిని చీల్చుకుంటూ వేగంగా వారి వైపు పరుగెత్తుకుంటూ వచ్చారు! వెనుక నుండి వర్షపు హోరులో వినబడుతున్న ఆ రాక్షస అడుగుల శబ్దాన్ని భావన మైండ్ కంప్యూటర్ కంటే వేగంగా గ్రహించింది! భావన వెంటనే వెనక్కి తిరిగి, అలేఖ్య వైపు చూస్తూ గట్టిగా అరిచింది: భావన: "అలేఖ్యాఅఅఅఅఅ!!!!!!!" ఆ గొంతు వినగానే... అలేఖ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది! ఆ పరిచితమైన, ప్రాణసమానమైన గొంతును అలేఖ్య క్షణాల్లో గుర్తుపట్టింది. అలేఖ్య: (కళ్లల్లోంచి కన్నీళ్లు వర్షంలో కలుస్తుండగా, షాక్‌తో) "అక్కాఅఅఅఅఅ...!" రక్తపు మడుగులో స్పృహతప్పి పడి ఉన్న విజయ్ కూడా ఆఖరి శ్వాసతో కళ్లు విప్పి, ముసుగులో ఉన్న భావన వైపు చూస్తూ క్షీణించిన గొంతుతో: విజయ్: "అమ్మా...!" భావన మోకాళ్లపై కూర్చుని, విజయ్ చెంపపై తన వణుకుతున్న చేతిని ఉంచింది. తల్లి స్పర్శ తగలగానే విజయ్ కళ్లల్లో ఆనంద భాష్పాలు నిండాయి. భావన మాస్క్ లోంచి కన్నీళ్లు కారుతుండగా అలేఖ్యతో అంది: భావన: "అలేఖ్యా! విజయ్‌ని హాస్పిటల్‌కి తీసుకువెళ్లొద్దు... అక్కడ శత్రువుల నిఘా ఉంటుంది! మీ ఫ్రెండ్స్‌కి చెందిన ఏదైనా రహస్య ఇంట్లో అత్యవసరంగా మెడికల్ ట్రీట్మెంట్ చేయించండి! నువ్వు విజయ్‌ని తీసుకుని ఇక్కడి నుండి త్వరితగతిన వెళ్లు... ఇక్కడున్న ఆ రాక్షసులను నేను చూసుకుంటాను!" విజయ్: (భావన చేయి గట్టిగా పట్టుకుని) "వద్దు అమ్మా... నువ్వు కూడా రా అమ్మా!" భావన: "వెళ్లు నాన్నా... నేను మీ వెనుకాలే వస్తాను! నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో అలేఖ్యా!" అలేఖ్య విజయ్‌ని భుజాలపైకి లేపబోతుండగా... వెనుక నుండి పరుగెత్తుకొచ్చిన ఒక సురేష్ చోప్రా కిల్లర్ తన పదునైన కత్తిని అలేఖ్య తల నరకడానికి బలంగా కిందికి విసిరాడు! "భచ్స్సససస!!!!" సరిగ్గా ఆ కత్తి అలేఖ్య తలను తాకే మిల్లీసెకనులో... భావన తన కుడిచేతిని అడ్డంగా పెట్టి ఆ పదునైన కత్తి దెబ్బను తన పట్టి చేతితో అడ్డుకుంది! కత్తి భావన అరచేతిని చీల్చింది, రక్తం వర్షపు నీటిలో చిమ్మింది! భావన: (అలేఖ్యతో గర్జిస్తూ) "ఆపి... నువ్వు వెళ్లు!" అలేఖ్య కన్నీళ్లతో విజయ్‌ని పట్టుకుని పరుగెత్తడం ప్రారంభించింది. ఇప్పుడు భావన ఆ 10 మంది వరల్డ్ డేంజరస్ కిల్లర్స్ ఎదుట ఏ ఒక్క ఆయుధం లేకుండా రణచండిలా నిలబడింది! తన దేహంలో విపరీతమైన నీరసం, ప్రెగ్నెన్సీ వల్ల కళ్లు తిరుగుతున్నా... తన కొడుకుకి, చెల్లికి రక్షణగా నిలబడటానికి సృష్టిలోని 'విశ్వం' లాంటి ఆఖరి శక్తిని బయటకు తీసింది. తన కత్తిని పట్టుకున్న భావనను చూసి మొదటివాడు వికృతంగా నవ్వి ముందుకు దూకాడు. భావన వాడి కత్తి ఉన్న చేతిని మణికట్టు వద్ద పట్టుకుని 360 డిగ్రీలు తిప్పేసింది! "కటక్" మంటూ వాడి చెయ్యి విరిగిపోగా, మరుక్షణంలో వాడి గొంతును తన రెండు చేతులతో పట్టుకుని మెడ ఎముకలను విరిచి పడేసింది! రెండోవాడు ఇనుప రాడ్‌తో భావన తలపై కొట్టడానికి వచ్చాడు. భావన వర్షపు నీటిలో జారి కిందికి వంగి (Low Glide Slide), వాడి ఛాతీ ఎముకల (Ribcage) పై తన రెండు పిడికిళ్లతో "భచ్... భచ్!" మంటూ బలంగా బాదింది! వాడి పక్కటెముకలు విరిగి గుండెల్లోకి దిగిపోవడంతో వాడు రక్తం కక్కుకుంటూ పడిపోయాడు! మూడోవాడు సైడ్ నుండి దాడి చేయగా... భావన తన కాలి బూటుతో వాడి మోకాలిప్పపై తన్నింది! వాడు మోకాళ్లపై పడగానే, తన మోచేతితో వాడి వెన్నుపూస (Spine) పై బలంగా కొట్టింది! వాడి నడుము విరిగి నిశ్చేష్టంగా పడిపోయాడు! నాలుగో, ఐదో కిల్లర్స్ ఇద్దరూ ఒకేసారి భావనపై పడ్డారు. భావన వాళ్లిద్దరి జుట్టును, మెడలను పట్టుకుని... వర్షపు పిడుగుల శబ్దంతో సమానంగా వాళ్లిద్దరి తలలను ఒకదానికొకటి బలంగా బాదింది! "థచ్!" అనే శబ్దానికి వాళ్లిద్దరి పుర్రెలు బద్దలై రక్తసిక్తమై శవాలుగా కూలబడ్డారు! ఆరోవాడు భావన వీపుపై కత్తితో నరికాడా! సూట్ దెబ్బకి కాపాడినా నొప్పికి భావన నోటి నుంచి రక్తం వచ్చింది. భావన కోపంతో తిరిగొచ్చి వాడి లివర్ భాగంలో బలంగా గుద్ది, వాడి దవడ బద్దలయ్యేలా 'అప్పర్కట్' ఇచ్చింది! వాడు గాల్లోకి లేచి పడ్డాడు! ఏడోవాడు భావన గొంతు నొక్కడానికి చూడగా... భావన వాడి రెండు భుజాల నరాలపై (Nerve-Lock) పొడిచి, రెండు భుజాలను సాకెట్ల నుండి ఊడదీసి విరిచేసింది! ఎనిమిదో, తొమ్మిదో రాక్షసులు భయంతో అరుస్తూ రాడ్లతో వచ్చారు. భావన గాల్లోకి 10 అడుగులు లేచి, వాళ్లిద్దరి ఛాతీలపై తన రెండు కాళ్లతో ఒకేసారి 'డబుల్ డ్రాప్ కిక్' కొట్టింది! వాళ్లిద్దరి గుండెల ఎముకలు పొడిపొడై అక్కడే ప్రాణాలు వదిలారు! పదోవాడు పారిపోవడానికి చూడగా... భావన వర్షపు నీటిలో వేగంగా పరుగెత్తి వాడి జుట్టు పట్టుకుని వెనక్కి గుంజి, వాడి గొంతును తన కాళ్లతో చుట్టి 'హెడ్-లాక్' చేసి మెడ తిప్పేసింది! "కటక్!" ఆ 10 మంది వరల్డ్ డేంజరస్ కిల్లర్స్ ఎముకలు విరిగి, దారుణంగా శవాలై వర్షపు నీటిలో పడిపోయారు! ఆ 10 మందినీ ఏ ఆయుధం లేకుండా దారుణంగా నరికివేసిన తర్వాత... భావన ఒళ్లంతా రక్తంతో తడిసిపోయింది. ఆమె దేహంలో ఉన్న శక్తి మొత్తం ఇంకిపోయింది. మూడు రోజుల నుండి తిండి లేకపోవడం, ప్రెగ్నెన్సీ వల్ల వస్తున్న దారుణమైన నీరసం, కాలేజీ ప్రాంగణంలో సాగించిన భయంకరమైన పోరాటం వల్ల... భావన కళ్లు పూర్తిగా తిరగడం మొదలయ్యాయి! విజయ్, అలేఖ్యలు దూరంగా ఒక కారులో సురక్షితంగా వెళ్లడం చూసి... భావన ప్రశాంతంగా చిరునవ్వు నవ్వింది. తన ముఖానికి ఉన్న మాస్క్‌ను తీసివేసి... తూలుతూ, రక్తం కారుతున్న శరీరంతో వర్షంలో నడుచుకుంటూ ముందుకు సాగింది. కొద్ది అడుగులు వేసిందో లేదో... భావన కళ్లు మూతపడి, వర్షపు నీటితో నిండిన ఆ నేల పైన స్పృహతప్పి కుప్పకూలిపోయింది! సరిగ్గా అదే క్షణంలో... కాలేజీ వెనుక రహస్య మార్గం నుండి ఒక నల్లటి గ్లాసెస్ ఉన్న హై-స్పీడ్ విఐపి కార్ వేగంగా వచ్చి భావన పక్కన ఆగింది! కారు డోర్ తెరుచుకుని అందులోంచి కొందరు బయటకు వచ్చారు. స్పృహతప్పి పడి ఉన్న భావనను ఎంతో జాగ్రత్తగా ఎత్తుకుని కారు వెనుక సీట్లో పడుకోబెట్టారు. ఆ కారు డోర్ మూతపడగానే... ఎమర్జెన్సీ సైరన్ లేకుండా, వర్షంలో లైట్లు వెలిగించుకుని ఆ నల్లటి కారు భావనను తీసుకుని వాయువేగంతో అక్కడి నుండి వెళ్లిపోయింది!
ఇట్లు,
✿SUNNY ✿ 1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️? 2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం 3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం |
|
« Next Oldest | Next Newest »
|