Posts: 291
Threads: 3
Likes Received: 766 in 196 posts
Likes Given: 1,733
Joined: Nov 2024
Reputation:
57
No gain only pain sort of late night's and headache everything that's can related, and nothing to gain in any way of like no response and not even expected likes or views and appreciation, it's a free service. It's waste of energy and time for writer.
I know after the so many continued updates this will affect you, it's lack of response from readers of expected response.
Just some addicted or well known writes (if they read the story) people will glory your story.
If there is a platform for these writer will be appreciated.
AKHIL❤️
Posts: 155
Threads: 0
Likes Received: 113 in 86 posts
Likes Given: 1,942
Joined: May 2019
Reputation:
2
(15-07-2026, 11:33 PM)Sunnysunnysunny Wrote: I've come to realize that when you're always available for people, they eventually stop valuing you.
Your time, effort, and consistency become so normal to them that they start taking everything you do for granted.
They begin to think, "Whether we ask or not, he'll give update us every day anyway," and that mindset slowly turns into a lack of respect. that's when appreciation slowly disappears and respect starts to fade.
I've experienced this personally. I spent countless hours giving regular daily updates and putting in genuine effort, expecting nothing more than basic respect in return. Unfortunately, even that became too much for some people to offer.
Because of that, I've decided that I no longer want to entertain or put extra effort into people who don't appreciate or respect what I do. Respect should always be mutual, and if it's missing, there's no point in continuing to give your time and energy.
From now on, I'm choosing to invest my time where it's valued and my efforts where they're respected.
I can continue—I'm just take my time because I've learned that not everyone deserves unlimited access to my time, attention, and effort.
Respect should never be expected as a favor. It should be the minimum anyone receives when they genuinely invest their time and energy.
So, I'm choosing boundaries over being taken for granted, self-respect over people-pleasing, and peace over unnecessary expectations.
Take your time,if needed follow others. Pay and read method.
You have great writing skills, keep writing the good content. All the best
Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
రక్త కధన రంగం సిరీస్
1 st :- అందని జాబిలి అమ్మ కోసం ==== మీ అందరికీ తెలుసు ఈ కధ మిగిలిన అనుష్క మరియు భావన కధల కంటే కొన్ని రోజులు ముందు జరుగుతున్నట్లు రాస్తున్నాము...
1. సోను తన అమ్మతో జరగబోయే తమ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాడు?
2. ఇన్ని ఏళ్లు తన దైవం గా కొలిచిన భర్త ఏ ఇప్పుడు అన్నిటికీ కారణం ? అసలు ఎవరు అతను?
3. 3 అమ్మయిలను చంపాలి అనుకుంటున్నారు ఒకరు అల్కా మిగిలిన ఇద్దరు ఎవరు? ఆధీర ఎవరు?
4. సురేష్ చోప్రా ఎందుకు అల్కా ని 25 ఏళ్లు వచ్చే వరకు ప్రాణాలతో ఉండాలి అని చెప్పాడు?
5. అసలు కొన్ని రోజులు ముందు ఏం జరిగింది ? పూనమ్ దేవి ఏం చేయబోతుంది?
2 nd :- అమ్మతో అపరిచిత బందం
6. భావన తన గతం చెప్పింది మరి విజయ్ కూడా చెప్పి ఉంటాడా?
7. అలేఖ్య .. భావన , విజయ్ కి అంత క్లోస్ ఎలా అయింది ఎందుకంటే మీకు పూనమ్ దేవి ఎపిసోడ్ లో అంటే రాబోయే రోజుల్లో ముగ్గురు బాగా దగ్గర అవ్వబోతున్నారు అని అర్ధం అయి ఉంటుంది?
8. విజయ్ గతం తెలిస్తే భావన ఒప్పుకుంటుందా?? అలేఖ్య ప్రేమ విజయ్ తెలుసుకుంటాడా?
3 rd :- కన్నతల్లి కన్నీటి సాక్షిగా
9. అన్నీ నిజాలు తెలిసిన పిల్లల .. మాస్టర్ మైండ్ రితీక తన శత్రులకు ఏం చేయబోతుంది?
10. అయేషా ఇంకా ఎందుకు సురేష్ చోప్రా ని కలిసిన విషయం చెప్పట్లేదు?
11. సన్నీ , అల్కా ఎలా కలవబోతున్నారు?
12. అసలు అనుష్క ఎవరు? తన గతం ఏంటి? ఎందుకు ఇక్కడే ఉంటుంది?
13. ఒకే ఇంట్లో ఉండే సన్నీ , అయేషా ఇద్దరు అల్కా కి దగ్గర అవ్వబోతున్నారు.. మరి మన అనుష్క, పూనమ్ ఇద్దరు ఒకే సిటీ లో ఉన్నారు ? పిల్లల ద్వారా కలుస్తారా?
రక్తం దాహం :-
14. సురేష్ చోప్రా ముంబై లో భావన చేసిన దాని గురించి ఏం ప్లాన్ చేశాడు ? భావన అని తెలుసా?
15. సురేష్ చోప్రా.. సోనూ ని చంపడానికి విజయవాడ వచ్చిన్నపుడు ఏం జరిగింది?
16. మరి పూనమ్ దేవి ఎపిసోడ్ లో అల్కా పై దాడి చేసిన వారిని ఏం చేయబోతున్నాడు ?
17. అసలు పూనమ్ దేవి భర్త .. అల్కా ని ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు ? మరొక ఇద్దరినీ కూడా?
18. ఆధీర , రావు కి ఉన్న సంబందం ఏంటి ?
19. పూనమ్ దేవి అండ్ డెత్ ఏంజెల్స్ బ్రతికి ఉన్నట్లు ఆధీర కి తెలుసా?
20. అసలు వీళ్ళు అంతా అల్కా మరియు మరొక ఇద్దరినీ ఏ ఎందుకు చంపాలి అని అనుకుంటున్నారు?
పూనమ్ దేవి మళ్ళీ తన ప్రాణం అయిన ఇద్దరిని కలుస్తుందా??
పూనమ్ దేవి తయారు చేసిన బ్లాక్ స్క్వాడ్ ఎవరు?
వీళ్ళు అంతా కలిసి రక్త కధన రంగం లో సృష్టించే యుద్దం మరింత భయంకరంగా ఉంటుంది..
The following 11 users Like Sunnysunnysunny's post:11 users Like Sunnysunnysunny's post
• Akhil2544, Babu_07, gora, Lucy lucifer, puku pichi, Ram.alone, ramd420, Santhosh king, selfread, Tippubhai, TringDan
Posts: 108
Threads: 0
Likes Received: 94 in 76 posts
Likes Given: 17
Joined: Apr 2026
Reputation:
0
రక్త కదన రంగం ఇప్పటికే స్టార్ట్ అయ్యిందా? ఆ రక్త కదన రంగం స్టోరీని మీరు ప్రస్తుతం నడుస్తున్న ఈ మూడు స్టోరీల్లోనే భాగంగా కలిపి రాస్తున్నారా? లేక ఈ మూడు స్టోరీలు పూర్తయ్యాక మొదలు పెడతారా?
అలాగే, రక్త కదన రంగంలో వచ్చే క్యారెక్టర్లను ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? దీనిపై కొంచెం క్లారిటీ ఇవ్వండి బ్రో.
Posts: 98
Threads: 0
Likes Received: 134 in 83 posts
Likes Given: 143
Joined: Jul 2026
Reputation:
2
(16-07-2026, 10:00 AM)క్యాప్సికమ్ ఫ్రై Wrote: రక్త కదన రంగం ఇప్పటికే స్టార్ట్ అయ్యిందా? ఆ రక్త కదన రంగం స్టోరీని మీరు ప్రస్తుతం నడుస్తున్న ఈ మూడు స్టోరీల్లోనే భాగంగా కలిపి రాస్తున్నారా? లేక ఈ మూడు స్టోరీలు పూర్తయ్యాక మొదలు పెడతారా?
అలాగే, రక్త కదన రంగంలో వచ్చే క్యారెక్టర్లను ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? దీనిపై కొంచెం క్లారిటీ ఇవ్వండి బ్రో.
Please read the last line ..... Vallu antha Kalisi ..... Raktha kadhana rangam lo chese yuddam ... Ante andaru kalisinapudu a ... E series start avuthundi anukuntunna... Maybe he's just showing us a trailer...... The main story which is..... in his mind .... Bro literally planning very big for us ...
Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
(16-07-2026, 10:00 AM)capsicumfry Wrote: రక్త కదన రంగం ఇప్పటికే స్టార్ట్ అయ్యిందా? ఆ రక్త కదన రంగం స్టోరీని మీరు ప్రస్తుతం నడుస్తున్న ఈ మూడు స్టోరీల్లోనే భాగంగా కలిపి రాస్తున్నారా? లేక ఈ మూడు స్టోరీలు పూర్తయ్యాక మొదలు పెడతారా?
అలాగే, రక్త కదన రంగంలో వచ్చే క్యారెక్టర్లను ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? దీనిపై కొంచెం క్లారిటీ ఇవ్వండి బ్రో.
లేదు అండి... నేను అనుకున్న కధ కి మరొక 2 మెయిన్ లేడి పాత్రలు లైక్ అనుష్క , భావన , పూనమ్ దేవి లా ఉంటారు.. కాకపోతే వాటి టైమ్ కాలం మారుతుంది. ( ఇవి పూర్తి అవ్వగానే వాటి గురించి చెప్తాను)
ముందుగా అసలు వీళ్ళు అందరూ కలవాలి ఆ తరువాత ఏ అసలు కధ మొదలు అవుతుంది. ( కానీ యుద్దం జరిగితే మరణం కూడా ఉంటుంది)
ముఖ్య గమనిక : యుద్దం నీతి ప్రకారం ... యుద్దం చేయాలి అంటే అన్నీ కళలు తెలియాలి అంటారు ,, అలాగే శృంగారం కూడా యుద్దం లో ఒక కీలక ఆయుధం ఏ ..............
ఇప్పుడు ఈ కధ లో అందరూ చేసే శృంగారానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంటుంది ,,, అది కేవలం పూనమ్ మరియు అనుష్క కి మాత్రమే తెలుసు.
Posts: 1,450
Threads: 0
Likes Received: 756 in 570 posts
Likes Given: 4,637
Joined: Nov 2018
Reputation:
12
Sunny garu...bridge mida aa action episode asalu crazy andi...nenu mila express cheyalenu...Kani simply superb...awsome update...asalu last lo aa twist ki dimma tirigipoyindi..asalu expect ye cheyaledu.....
Please madyalo matram apeyakandi bro...miku veelu unnapude update ivvandi...please ....finally eroju complete chesa e kathanu...mee 3 stories ni antha easy connect chestunnaru maku arthum ayyela...
Thank you so much bro...keep rocking
Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
(16-07-2026, 09:51 PM)Terminator619 Wrote: Sunny garu...bridge mida aa action episode asalu crazy andi...nenu mila express cheyalenu...Kani simply superb...awsome update...asalu last lo aa twist ki dimma tirigipoyindi..asalu expect ye cheyaledu.....
Please madyalo matram apeyakandi bro...miku veelu unnapude update ivvandi...please ....finally eroju complete chesa e kathanu...mee 3 stories ni antha easy connect chestunnaru maku arthum ayyela...
Thank you so much bro...keep rocking
థాంక్స్ బ్రదర్.. మిడిల్ లో ఆపాలి అనే ఆలోచన లేదు.. కనీసం ఇంత వరకు అయిన పూర్తి చేస్తాను..
థాంక్స్ ఫర్ యువర్ టైమ్.
Posts: 11,707
Threads: 0
Likes Received: 7,158 in 5,792 posts
Likes Given: 7,110
Joined: Nov 2018
Reputation:
62
•
Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
సమయం: రాత్రి 10:57 నిమిషాలు
ప్రదేశం: వైజాగ్ ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్
ఫోన్ రింగింగ్ శబ్దంతో పూనమ్, అల్కా ఇద్దరూ ఒక్కసారిగా నిశ్శబ్దంలోంచి లోకంలోకి వచ్చారు. స్క్రీన్ పైన సోను పేరు మెరుస్తోంది.
ఆ పేరును చూడగానే అల్కా కళ్లల్లోని పగ కరిగి కన్నీళ్లుగా మారాయి. ఆమె మెల్లగా పూనమ్ వైపు తిరిగి, చేతులు పట్టుకుంది.
అల్కా: (వణుకుతున్న గొంతుతో, ఏడుస్తూ) "అమ్మా... తమ్ముడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. వాడు కంగారుగా ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. నా మీద ఒట్టు...
నాతో ఇంటికి వచ్చేయ్, ఇంకేం మాట్లాడకు. మేము ఎప్పుడూ నీతోనే ఉంటాం. మాకు ఇంకేం వద్దు అమ్మా... నాకు, సోనుకి, వర్ష అక్కకి నువ్వు మాత్రమే కావాలి. మళ్లీ ఇలాంటి రక్తాన్ని, ఈ రూపాన్ని నేను ఎప్పటికీ చూడకూడదు!"
అంటూ అల్కా ఏడుస్తూ పూనమ్ చేతిని తీసుకుని తన తలపై పెట్టుకుంది. పూనమ్ కళ్లల్లో పాత జ్ఞాపకాలు, భయం ఒకేసారి కదలాడాయి.
పూనమ్: (ఆవేదనతో) "కానీ బుజ్జి తల్లీ... ఈ 'ఆధిర' గాడిని, వీడి వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఇప్పుడు ఇలాగే వదిలేస్తే, మిగిలిన ఇద్దరినీ వాళ్లు చంపేస్తారు తల్లి!"
అల్కా: "అమ్మా! నాకు ఏమీ చెప్పకు ఇప్పుడు. ముందు ఇంటికి వెళ్దాం పద. అక్కడ వాడు కూడా భయపడుతూ మనకోసం ఎదురుచూస్తూ ఉంటాడు."
ఆ మాటలకు పూనమ్ నిస్సహాయంగా తలాడించింది. మరోవైపు ఫోన్ కాన్ఫరెన్స్‌లో ఉన్న అలేఖ్య ఏడుస్తూ మాట్లాడింది.
అలేఖ్య: "అల్కా... నీకేం కాలేదు కదా! నేను రేపు ఫోన్ చేస్తాను...
అల్కా : హ్మ్ం నాకు బానే ఉంది ...ఇక విజయ్ గారు! మీరు అలేఖ్య ని జాగ్రత్తగా చూసుకోండి. తనకి నేను తప్ప ఎవరూ లేరు ఫ్రెండ్స్. మీరు తనతో ఉంటేనే బాగుంటుంది అనిపిస్తోంది."
విజయ్: (ఏం చెప్పాలో అర్థం కాక, గొంతు పూడుకుపోగా) "నేను... నేను చూసుకుంటాను అల్కా, నువ్వేం కంగారు పడకు."
అల్కా: (శాటిలైట్ ఫోన్ వైపు చూస్తూ) "సరే... నేను ఉంటాను. థాంక్స్ అంకుల్!" అని రా చీఫ్‌కి చెప్పింది.
వెంటనే పూనమ్ శాటిలైట్ ఫోన్ అందుకుని రా చీఫ్‌కి తన చివరి కమాండ్స్ ఇవ్వడం ప్రారంభించింది. ఆమె గొంతులో మళ్లీ పాత బ్లాక్ స్క్వాడ్ లీడర్ తాలూకు ఇంటెలిజెన్స్ స్పష్టంగా కనిపించింది.
పూనమ్: "చీఫ్! ఇక్కడ ఏం చేయాలో మీకు తెలుసు కదా? ఈ ఏరియా మొత్తం క్లీన్ చేయండి. ఒక్క క్లూ కూడా దొరకకూడదు. రోడ్ వర్క్ అని చెప్పి ఒక 5 రోజులు ఈ రోడ్డును పూర్తిగా క్లోజ్ చేయండి.
సీసీటీవీ రికార్డ్స్ అన్నింటినీ ఇప్పుడే ఎరేస్ చేయండి. ఈ లొకేషన్ పరిధిలో ఉన్న అన్ని సెల్ నెంబర్స్ డేటాను టవర్ సిగ్నల్స్ మరియు మెయిన్ సర్వర్ నుండి పూర్తిగా రిమూవ్ చేయండి."
RAW చీఫ్: "అలాగే పూనమ్. వాడు మళ్లీ నీ ఫ్యామిలీ జోలికి రాడు అని అనుకుంటున్నాను."
పూనమ్: "అలాగే... వైజాగ్ సిటీలో మరొక అమ్మాయి కోసం వాళ్లు దాడి చేసే అవకాశం ఉంది. సిటీ ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్ల పెట్రోలింగ్‌ను ఇప్పుడే పెంచండి. మీ స్పెషల్ టీమ్‌ని వెంటనే ఇక్కడికి పంపండి.
ఇక మీ ఆఫీసర్లకు చెప్పండి... ఈరోజు ఇక్కడ జరిగింది ఎవ్వరూ చూడలేదు, ఎవరికీ తెలియదు! నా పేరు గనుక బయటకు వస్తే నా పిల్లలకి ఏమైనా అవుతుంది...
వాళ్లకు ఏమైనా అయిందంటే, ఈసారి నా నుండి ఆ దేవుడు కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్లని కాపాడలేడు, వదిలిపెట్టను నేను !"
అని గంభీరంగా హెచ్చరించి పూనమ్ ఫోన్ కట్ చేసింది.
సమయం: రాత్రి 11:15 నిమిషాలు
ప్రదేశం: కిల్లర్స్ కారు (ఇంటికి తిరుగు ప్రయాణం)
అల్కా కారు దెబ్బతినడంతో, చనిపోయిన రౌడీల కారు ఒకటి తీసుకుని పూనమ్ డ్రైవ్ చేస్తోంది. పక్క సీట్లో కూర్చున్న అల్కా... పూనమ్ చేయిని ఎంత గట్టిగా పట్టుకుందంటే, మళ్లీ ఎక్కడ తన తల్లి దూరమైపోతుందో అన్న భయం ఆమెలో స్పష్టంగా ఉంది.
పూనమ్ భుజంపై తలవాల్చి ఏడుస్తూ మాట్లాడింది.
అల్కా: "అమ్మా... నేను నీ కడుపున పుట్టి ఉంటే ఎంత బాగుండేదో అమ్మా..." అని ఏడుస్తూ తన కళ్లు తుడుచుకుంది.
పూనమ్: (ఆమె తల నిమురుతూ) "నువ్వు నా కూతురివే తల్లి... అయినా, నాకసలు మీరెవరు అనే నిజం ఎందుకు చెప్పలేదు?"
అల్కా: "సరే... ఆ విషయం ఇప్పుడు వదిలేయ్ అమ్మా. ప్లీజ్..."
పూనమ్: "సరే, ఆ విషయం మర్చిపో... పడుకో."
పూనమ్ కారు నడుపుతూనే ఆలోచనల సుడిగుండంలోకి వెళ్ళిపోయింది. తన భర్త రావు... ఇదంతా వెనుక ఉండి నడిపిస్తున్నాడా? అసలు వాడికి ఇంత ధైర్యం ఎక్కడిది?
సమయం: రాత్రి 11:45 నిమిషాలు
ప్రదేశం: పూనమ్ ఇల్లు
కారు ఇల్లు చేరుకుంది. పూనమ్ అల్కాని లేపి, ఆమె ముఖం తడి గుడ్డతో తుడిచి కారు దిగమంది. అల్కా ముఖం అప్పటికే ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిపోయి, కళ్లన్నీ వాచిపోయాయి. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన అలసట, భయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పూనమ్ డోర్ బెల్ కొట్టగానే... సోను కంగారుగా తలుపు తీశాడు. ఎదురుగా తల్లి ఒంటి నిండా రక్తం, కమాండో సూట్!
సోను: (భయంతో గట్టిగా అరుస్తూ) "అమ్మా!!! ఏమైంది అమ్మా? అక్క ఎక్కడ? అంతా బానే ఉందా?"
అప్పుడే మెల్లగా అల్కా వెనుక నుండి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె ముఖం చూడగానే సోను కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నోట్లోంచి కేవలం ఒక్కటే మాట వచ్చింది.
సోను: "అక్కా............"
పూనమ్ నిశ్శబ్దంగా వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుంది. అల్కా అలాగే నిలబడి సోను వైపు చూస్తోంది. సోను నెమ్మదిగా ముందుకు జరిగి అల్కా ముఖాన్ని తాకాలని చేయి చాచాడు.
ఆ స్పర్శ తగలగానే అల్కా అప్పటివరకు ఆపుకున్న ఏడుపు ఒక్కసారిగా బద్దలైంది. పిచ్చిదానిలా అరుస్తూ సోను చెంపల పైనా, గుండెల పైనా తన చిన్న చేతులతో గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది.
అల్కా: (ఏడుస్తూ, కొడుతూ) "నువ్వు నా ఫోన్ ఎందుకు ఎత్తలేదురా?! బండ వెధవా... నీకు నేను అంటే అస్సలు ఇష్టం లేదు కదా! నన్ను అస్సలు పట్టించుకోవు!
ఆ భయంలో, ఆ చావు ముందు నాకు నువ్వే గుర్తొచ్చావురా... ఆఫీస్ దగ్గరికి నిన్ను పిలుద్దామని ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా నీకు?!"
ఆమె కొడుతుంటే సోను అడ్డు చెప్పలేదు. కళ్లల్లోంచి నీళ్లు కారుతుండగా అలాగే నిలబడ్డాడు. పూనమ్ కూడా సోఫాలో కూర్చుని ఆ ఇద్దరినీ చూస్తూ ఏడుస్తోంది.
సోను నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. అల్కా కొట్టి కొట్టి అలసిపోయి, ఒక్కసారిగా సోను గుండెలపై వాలిపోయింది.
అల్కా: "నేను మళ్లీ నిన్ను చూస్తాను అని అస్సలు అనుకోలేదురా..." అని గట్టిగా ఏడ్చేసింది.
సోను: (అల్కాని గట్టిగా తన గుండెలకి హత్తుకుంటూ) "అక్కా... ఈ సెకండ్ నుండి నీకు తగిలే ప్రతి దెబ్బ, ముందు నన్ను దాటిన తర్వాతే నీకు తగలాలి!
నా ప్రాణం అడ్డు వేసైనా సరే మీకు ఏమీ కానివ్వను. సారీ అక్కా... నా వల్లే ఇదంతా జరిగింది, నన్ను క్షమించు!"
ఆ ఇద్దరు అక్కాతమ్ముళ్లు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని అలాగే ఏడుస్తూ ఉండిపోయారు. అప్పుడు పూనమ్ సోఫాలోంచి లేచి ఆ ఇద్దరి దగ్గరికి వచ్చింది.
ఆమె కళ్లల్లో ఇప్పుడు పశ్చాత్తాపం లేదు, ఒక గురువు, ఒక తల్లి తాలూకు పట్టుదల ఉన్నాయి.
పూనమ్: "సోను! నువ్వు అలా చేయాలి అంటే... ఇలా బలహీనంగా ఏడవడం మానేయాలి. రేపటి నుండి నువ్వు ఏం చేయాలో నేను నీకు చెప్తాను.
నేను లేని రోజున కూడా, నిన్ను దాటి మీ అక్కల దగ్గరికి చావు రావాలన్నా... ఆ చావు భయపడేలా నిన్ను తయారు చేస్తాను!" అని చెప్పి ఆ ఇద్దరినీ గట్టిగా హగ్ చేసుకుంది.
పూనమ్: "సరే... ఇద్దరూ వెళ్లి స్నానం చేసి రండి. నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు నా చేతులు కూడా బాలేవు (రక్తంతో ఉన్నాయి)... మీరే నాకు తినిపించాలి."
అల్కా: (వెంటనే సోనుని నెడుతూ) "వదలకురా బండ వెధవా! అమ్మకి ఆకలి వేస్తోందంటే అర్థం కాలేదా? ఛీ వేస్ట్ ఫెలో... వెళ్లు, అన్నీ రెడీ చెయ్. ఈరోజు మీ ఇద్దరికీ నేనే అన్నం కలిపి పెడతాను!"
అని ఇద్దరికీ చెరో ముద్దు పెట్టి అల్కా తన రూమ్‌లోకి వెళ్ళింది. పూనమ్ కూడా తన రూమ్‌లోకి వెళ్ళింది.
సమయం: రాత్రి 12:30 నిమిషాలు
ప్రదేశం: పూనమ్ ఇల్లు (హాల్)
ముగ్గురూ ఫ్రెష్ అప్ అయి వచ్చారు. అల్కా ఎంతో ప్రేమగా, కళ్లల్లో నీళ్లను దాచుకుంటూ పూనమ్‌కి, సోనుకి ముద్దలు కలిపి తినిపించింది. వాళ్లు వద్దు అంటున్నా వినకుండా తినిపించుకుంటూనే ఉంది.
ముగ్గురూ తిన్న తర్వాత అల్కా సోను వైపు చూసింది.
అల్కా: "రేయ్ సోను... ఈరోజు హాల్లోనే పెద్ద బెడ్ రెడీ చెయ్. ముగ్గురం ఇక్కడే పడుకుందాం."
సోను అలాగే హాల్లో పెద్ద పరుపు పరిచి బెడ్ రెడీ చేశాడు. ముగ్గురూ పడుకోగానే అల్కా ఒకవైపు, సోను
ఒకవైపు పూనమ్‌ను గట్టిగా హత్తుకున్నారు.
ఆ అమ్మ కౌగిలిలో ఉన్నామనే ధైర్యంతో ఆ ఇద్దరూ కాసేపటికే గాఢ నిద్రలోకి జారుకున్నారు.
కానీ... పూనమ్‌కి మాత్రం నిద్ర రావడం లేదు. ఆమె కళ్లు చీకట్లోకి చూస్తున్నాయి.
మనసంతా ఒకటే ప్రశ్న...
"నా భర్త రావు... ఇదంతా ఎలా చేశాడు? అసలు నాతో పెళ్లి కాకముందు వాడు ఎవరు? ఆ దుర్గమ్మ జాతర నరమేధం నుండి వాడు ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు?!"
ఆ ఆలోచనలతో పూనమ్ కళ్లు మూసుకుంది... కాలం 2 నెలలు క్రితం జరిగిన ఆ భయంకరమైన దుర్గమ్మ జాతర కి వెనక్కి వెళ్ళింది...
ఇక్కడి నుండి అసలైన ఫ్లాష్‌బ్యాక్ మిస్టరీ ప్రారంభమవుతుంది...
The following 22 users Like Sunnysunnysunny's post:22 users Like Sunnysunnysunny's post
• Akhil2544, akkapinni, Babu_07, byebyee62, coolguy, Donkrish011, kingmahesh9898, Lucy mahi, madhoo1991, Mohana69, puku pichi, Raj0003, Ram.alone, ramd420, selfread, Spider man, sriramakrishna, Terminator619, TringDan, Vego1990, VijayPK, Vinod kumar92
Posts: 390
Threads: 0
Likes Received: 371 in 305 posts
Likes Given: 2,313
Joined: Aug 2021
Reputation:
6
Posts: 799
Threads: 1
Likes Received: 941 in 677 posts
Likes Given: 208
Joined: May 2019
Reputation:
25
అప్డేట్ చాలా బాగుంది రైటర్ గారు
Posts: 450
Threads: 8
Likes Received: 1,085 in 281 posts
Likes Given: 1,040
Joined: May 2022
Reputation:
54
Sonu baga rastunnaru
Mr. V
Posts: 4,440
Threads: 0
Likes Received: 3,043 in 2,327 posts
Likes Given: 12
Joined: Feb 2020
Reputation:
39
Posts: 1,450
Threads: 0
Likes Received: 756 in 570 posts
Likes Given: 4,637
Joined: Nov 2018
Reputation:
12
Super update bro...sonu ki training start avabotondi....sunny ki balavanthude but migatha yudha melakuvalu anushka nerpinchinda bro? Leda mundu undabotonda
Posts: 98
Threads: 0
Likes Received: 134 in 83 posts
Likes Given: 143
Joined: Jul 2026
Reputation:
2
Sonu valla dad twist is next level... Migatha iddaru emo kani .. poonam and husband fight ela untundi ani exited ga undi
Posts: 75
Threads: 0
Likes Received: 74 in 61 posts
Likes Given: 678
Joined: May 2020
Reputation:
1
Eagerly waiting to know the background story
Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
కృష్ణమ్మ ఉప్పెన – నెత్తుటి పుష్కర ఘాట్
తేదీ: జూలై 1, 2026
ప్రదేశం: విజయవాడ (రెండు వేర్వేరు ప్రాంతాలు)
సమయం: ఉదయం 09:30 గంటలు
ప్రదేశం: విజయవాడ ఎయిర్పోర్టు పరిసరాలు
సురేష్ చోప్రా పగతో రగిలిపోతూ విజయవాడలో ల్యాండ్ అయ్యాడు. అతని ముఖంలో క్రూరత్వం తాండవిస్తోంది. వెంటనే తన గ్యాంగ్ లీడర్ల కి కాల్ చేశాడు రెండు టీమ్‌లుగా విడిపోవాలని ఆదేశించాడు.
సురేష్ చోప్రా: (తీవ్రమైన గొంతుతో) "టీమ్ 1... ఇప్పుడే ఆ జాతరలోకి వెళ్లండి. ఆ సోను, వాడి తండ్రి రావు ఇద్దరినీ అక్కడే లేపేయాలి.
టీమ్ 2... నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లండి. ఇంట్లో ఉన్నవాళ్లలో ఒక్క రూం కూడా వదలకుండా అందరినీ నరికేయండి, ఒక్కడు కూడా బ్రతకకూడదు!
నా కూతుళ్ల (వర్ష, అల్కా) దగ్గరికి ఏ మగాడు వచ్చినా... వాడికి అదే చివరి ఊపిరి అవ్వాలి. క్లియర్?!"
గ్యాంగ్ లీడర్స్: "ఎస్ బాస్!"
ఆదేశాలు ఇచ్చి, సురేష్ చోప్రా కూడా జాతర రద్దీలోకి దుర్గమ్మ దర్శనం కోసం బయలుదేరాడు.
సమయం: ఉదయం 10:00 గంటలు
ప్రదేశం: ఇంద్రకీలాద్రి పరిసరాలు (ది షాకింగ్ కాల్)
సురేష్ చోప్రా గుడి వైపు నడుస్తుండగా అతని వైజాగ్ మెయిన్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది.
ఆఫీసర్ (ఫోన్ లో): "సార్! ఒక అర్జెంట్ ఇన్ఫర్మేషన్. వర్ష మేడమ్ నిన్న నైట్ విజయవాడకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్లు సిస్టమ్‌లో చూపిస్తోంది. నా గెస్ ప్రకారం మేడమ్ కూడా ఇప్పుడు విజయవాడలోనే ఉన్నారు సార్!"
ఆ మాట వినగానే సురేష్ చోప్రాకు ఒక్కసారిగా ఒంటి నిండా చెమటలు పట్టాయి! ఎందుకంటే, పూనమ్ ఫ్యామిలీతో ఎవరున్నా సరే ఒక్కడిని కూడా వదలకుండా చంపేయమని బిహార్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ హై-ప్రొఫైల్ కిల్లర్స్‌కు కాంట్రాక్ట్ ఇచ్చాడు.
ఆ కిల్లర్స్‌కి తన పేరు తెలియదు, కేవలం టార్గెట్ మాత్రమే తెలుసు! ఇప్పుడు ఒకవేళ వర్ష వాళ్ల పక్కన ఉంటే... వాళ్లు తన సొంత కూతురిని కూడా చంపేస్తారు!
ఏం చేయాలో అర్థం కాక వణుకుతున్న చేతులతో బిహార్ కిల్లర్స్ నెంబర్‌కు డయల్ చేశాడు.
సురేష్ చోప్రా: (ఫోన్‌లో గాభరాగా అరుస్తూ) " మిషన్ క్యాన్సిల్! ఇప్పుడే మిషన్ క్యాన్సిల్ చేయండి! అక్కడ ఎవరికీ ఏమీ కాకూడదు... డూ ఇట్ నౌ!"
బిహార్ కిల్లర్ లీడర్: "సార్... మేం ఆల్రెడీ ఘాట్ లో ఉన్నాం. టార్గెట్ మా కళ్ల ముందే ఉన్నాడు."
సురేష్ చోప్రా: "వద్దని చెప్తున్నా కదా! వెనక్కి వచ్చేయండి!"
సురేష్ చోప్రా మాటలకు ఆ బిహార్ కిల్లర్స్ వెనక్కి తగ్గి, నీళ్లలోంచి ఒడ్డుకు రావడం ప్రారంభించారు.
కానీ... సురేష్ చోప్రాకు కానీ, చావు అంచులకి చేరుకుంటున్న సోను ఫ్యామిలీకి కానీ తెలియని భయంకరమైన నిజం ఒకటి ఉంది.
ఆ ఫ్యామిలీని ఈరోజు పూర్తిగా తుడిచిపెట్టడానికి ఆల్రెడీ మరో ప్లాన్ సిద్ధమైంది. దాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. ఎందుకంటే, ఆ ప్లాన్ వేసింది సురేష్ చోప్రా కాదు... 'ఆధీర'!
ది అల్టిమేట్ మాస్టర్ మైండ్ - 'ఆధీర' 20 ఏళ్ల ప్లాన్
అవును, ఈ ఘోరమంతటికీ అసలు సూత్రధారి ఆధీర! వాడు ఈ స్కెచ్‌ను ఈరోజు కాదు... 20 ఏళ్ల క్రితమే వేశాడు! ఎవ్వరికీ తెలియని అత్యంత భయంకరమైన రహస్యం ఏంటంటే...
పూనమ్ భర్త రావు మరెవరో కాదు, ఆ ఆధిర సొంత తమ్ముడు!
రావుతో పాటు గుడిలోని పూజారులతో సహా దాదాపు ఒక లక్ష మంది ఆధీర నమ్మిన బంట్లుగా సమాజంలో సాదాసీదా మనుషుల్లా నటిస్తున్నారు.
వీళ్లంతా గత 25 ఏళ్లుగా వెతుకుతున్నది ఆ ముగ్గురు కన్యల కోసం ( అల్కా, మిగిలిన ఇద్దరు త్వరలో తెలుస్తుంది ) కోసం! వాళ్ల నిరీక్షణ ఫలించింది, ఆ ముగ్గురూ దొరికారు.
ఇప్పుడు ఆ ముగ్గురినీ ఎలాగైనా ప్రాణాలతో పట్టుకుని ఆధీర ముందు నిలబెట్టడమే వీళ్ల 20 ఏళ్ల మిషన్!
(గుడి పూజారులు ఇందులో ఎందుకు ఉన్నారనే మిస్టరీ తర్వాత తెలుస్తుంది).
ఈ పని కోసమే రావు ఎవరికీ తెలియకుండా ఎప్పుడూ బయట తిరుగుతుండేవాడు. అయితే, ఈ కన్యలు దొరికిన తర్వాత ఈ మిషన్‌లో ఉన్నవాళ్లు చేయాల్సిన మొదటి పని...
తమ సొంత ఆనవాళ్లను (తమతో ఉన్న కుటుంబాలను) పూర్తిగా తుడిచిపెట్టేయడం! మిగతా వాళ్లకు ఆ పని ఈజీగానే అయిపోయింది కానీ, రావుకు తన ఫ్యామిలీని చంపడం కష్టంగా మారింది.
ఎందుకంటే సిటీ కమిషనర్ పూజ, సోను ఫ్యామిలీకి సొంత మనుషుల్లా క్లోజ్ అయిపోయారు. సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయితే ఆధారాలు దొరుకుతాయని రావు కావాలనే ఈ జాతర రోజును ఎంచుకున్నాడు.
తన ప్లాన్ ప్రకారం... తానూ, కొడుకు సోను జాతరలో ఉన్నప్పుడు కేవలం ఒక 5, 6 గురు రౌడీలు తమపై దాడి చేసేలా ప్లాన్ చేశాడు.
అలాగే, తన భార్య పూనమ్ ప్రవర్తనపై కొంచెం అనుమానం రావడంతో... ఒకేసారి ఒక 40 మంది ప్రొఫెషనల్ కిల్లర్స్‌ను నేరుగా పూనమ్ ఇంటిపై దాడి చేయడానికి పంపించాడు!
ఇప్పుడు జాతరలో ఆ దారుణం ఎలా జరిగిందో చూద్దాం...
సమయం: ఉదయం 10:30 గంటలు
ప్రదేశం: కృష్ణా నది పుష్కర ఘాట్
సురేష్ చోప్రా మాటలు విని బిహార్ కిల్లర్స్ వెనక్కి తగ్గినా... ఆధీర, రావులు పంపిన కరడుగట్టిన ట్రైన్డ్ కిల్లర్స్ ఆల్రెడీ సోను, రావులను నది నీళ్లలో చుట్టుముట్టేసారు.
మిగిలిన 40 మంది కిల్లర్స్ పూనమ్ ఇంటి వైపు వాహనాల్లో బయలుదేరారు.
మరోవైపు... సోనుకి సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్చిన వర్ష, అప్పుడే కృష్ణా నది ఘాట్ మెట్లు దిగుతూ, తన పాత మొక్కు తీర్చుకోవడానికి నది వైపు నడుస్తోంది.
నదిలో మునుగుతున్న జనాలను చూస్తున్న ఆమె కళ్లు... ఒక్కసారిగా ఒక అబ్బాయి పైన పడ్డాయి.
వర్ష: (మనసులో, కళ్లు పెద్దవి చేస్తూ) "ఆ పోస్టర్... ఆ హెయిర్ స్టైల్... సోనులా ఉన్నాడేంటి? అవును... వాడే! సోను!"
వాడు సోను అని కన్ఫర్మ్ చేసుకునే లోపే... వర్ష గుండె ఆగిపోయే దృశ్యం అక్కడ కనిపించింది. ఆమె నోట్లోంచి భయంకరమైన చావు కేక వచ్చింది!
వర్ష: "వద్దుఊూూూూ!!!!!!"
ఎందుకంటే... సోను నీళ్లలో మొదటి మునక వేసి పైకి లేవబోతుండగా, అతని చుట్టూ ఉన్న ముగ్గురు కిల్లర్స్ తమ చేతుల్లోని కత్తులను నీళ్లలోంచి పైకి తీసి సోనుని నరకడానికి వేగంగా గాల్లోకి లేపారు!
మరో ఇద్దరు రౌడీలు రావు (సోను తండ్రి) ని పట్టుకుని, అతని గొంతు కోసి నదిలో పారేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నటిస్తూ పట్టుకున్నారు.
[ది ఎంట్రీ ఆఫ్ ప్రసాద్]
సరిగ్గా ఆ కత్తులు సోను మెడకు తగిలే ఆఖరి సెకన్... ఎక్కడినుండో ఒక బలమైన చేయి నీటి లోపలికి దూసుకొచ్చి, సోనుని వెనక్కి గట్టిగా లాగింది!
ఆ మూడు కత్తులు నీటిని చీల్చుకుంటూ వెళ్లాయి కానీ, అక్కడ సోను లేడు! సోనుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ చేయి సోనుని గట్టిగా పట్టుకుని ఒడ్డు వైపు విసిరేసింది.
ఆ కాపాడిన వ్యక్తి మరెవరో కాదు... అనుష్క భర్త ప్రసాద్!
((అవును, ప్రసాద్ తన ఓనర్‌తో కలిసి 3 రోజులు బయటికి వెళ్తున్నాడు అని చెప్పాడు .. మీరు 'కన్నతల్లి కన్నీటి సాక్షి'లో చెప్పిన సీన్ గుర్తుండే ఉంటుంది... ఆయన వచ్చింది ఇక్కడికే!))
***ప్రసాద్ , రావు ఆ కిల్లర్స్‌కు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం చాలా సేపటి నుండి గమనిస్తూనే ఉన్నాడు.
ఎందుకంటే కొన్ని రోజుల ముందు ఏ అనుష్క వెనుక మనుషులు వస్తున్నారు అని చెప్పింది
తనని కూడా ఎవరో ఒకరు అనుసరిస్తూ ఉండవచ్చు అని ప్రసాద్ అన్నిటిపై ఒక కన్ను వేసి ఉంచాడు. ***
కిల్లర్స్ సోను మిస్ అవ్వడం చూసి క్షణాల్లో ఒడ్డు వైపు దూసుకొచ్చారు. కానీ వాళ్లు వచ్చేలోపే...
ప్లాన్ ప్రకారం, అందరూ చూస్తుండగానే కిల్లర్స్ రావు మెడ కోసి నది నీళ్లలోకి పడేశారు!
(అందరి కళ్లముందూ తను చనిపోయినట్లు నటించాలనేది రావు ప్లాన్. అలా నీళ్లలో పడగానే ఆ ఫేక్ బ్లడ్‌ని కడుక్కొని, నీటి అడుగున ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లిపోవాలనేది వాడి అసలు వ్యూహం).
సోను: (నది ఒడ్డున పడి, తండ్రి మెడ కోయడం చూసి పిచ్చివాడైపోయి గట్టిగా అరుస్తూ)"నాన్నాఆఆఆఆఆ!!!"
సమయం: ఉదయం 10:33 నిమిషాలు
ప్రదేశం: నెత్తుటి ఘాట్
వేగంగా దూసుకొస్తున్న కిల్లర్లను ప్రసాద్ ఎదిరించే లోపే... ఒక కిల్లర్ కత్తి ఎత్తి సోను తల మీద బలంగా నరకబోయాడు. సోను ప్రాణం గాల్లో కలిసిపోయే ఆ సెకన్...
"ఛాక్!!!!"
ఒక ఆమె చేయి... ఆ పదునైన కత్తి గాటుకి అడ్డంగా వచ్చింది! ఆ కత్తి ఆమె అరచేతిని చీల్చుకుంటూ దిగింది.
అది మరెవరో కాదు... వర్ష! తన తమ్ముడిని కాపాడుకోవాలనే ఆలోచన తప్ప ఆమెకు ఏమీ గుర్తు రాలేదు. తన ప్రాణం పోయినా పర్లేదు అనుకుని కత్తికి చెయ్యి అడ్డం పెట్టింది!
ఆ దృశ్యం చూడగానే ప్రసాద్ లోపల రక్తం ఉప్పొంగింది. సింహంలా ఆ కిల్లర్స్ మీదికి విరుచుకుపడ్డాడు. ఘాట్‌లో ఉన్న జనాలంతా భయంతో కేకలు వేస్తూ అటు ఇటు పరుగులు తీస్తున్నారు.
సోను తల పైనుండి రక్తం కారుతోంది... కానీ ఆ రక్తం సోనుది కాదు, తనని హత్తుకుని ఉన్న తన అక్క వర్ష చేతి నుండి కారుతున్న రక్తం!
సోను తండ్రి మరణం నుండి కోలుకోక ముందే... కళ్లు తెరిచి చూశాడు. తన కోసం రక్తం చిందిస్తున్న ఆమె తన అక్క వర్ష అని అతను ఊహించలేదు.
సోను: (ఏడుస్తూ, గట్టిగా అరుస్తూ) "అక్కాకాాాా!!!!!!"
వర్ష: (బాధను తట్టుకుంటూ, సోను తలని తన గుండెలకి గట్టిగా హత్తుకుని నేలపై కూర్చుండిపోయింది) "ఏం కాదురా... ఏం కాదు తమ్ముడూ... నేను ఉన్నాను..."
ప్రసాద్ కింద పడిన ఒక కత్తిని అందుకుని, కిల్లర్లను నరకడం మొదలుపెట్టాడు. ఆ వేగంలో వెనుక నుండి వచ్చిన ఒక కత్తి ప్రసాద్ వీపులో దిగింది!
"అఆఆహ్!" అని గర్జించిన ప్రసాద్, ఆ నొప్పును అస్సలు లెక్కచేయలేదు. కింద కూర్చుని ఉన్న ఆ అక్కాతమ్ముళ్ల వైపు చూశాడు. వాళ్లపైకి ఎవరినీ రానివ్వకుండా కత్తిని గాల్లో సుడిగాలిలా తిప్పసాగాడు.
ఘాట్ మొత్తం ఖాళీ అయిపోయింది. అక్కడ కేవలం ప్రాణాల కోసం ఏడుస్తున్న ఆ ఇద్దరు ప్రాణబంధాలైన అక్కాతమ్ముళ్లు...
వాళ్లను కాపాడటానికి వీపులో కత్తి దిగినా పోరాడుతున్న ప్రసాద్ మాత్రమే మిగిలారు.
ప్రసాద్ ఆ ఇద్దరినీ చూస్తుంటే... తన సొంత పిల్లలు (అనుష్క పిల్లలు) గుర్తొచ్చారు.
వీళ్లు తన సొంత పిల్లలే అనిపించింది ఆ క్షణంలో! (తమ పిల్లలు కూడా ఇంతే ప్రేమగా ఉంటారు అనుకున్నాడు)
ఆ బలంతోనే ఎదురొచ్చిన మరో ఇద్దరు కిల్లర్స్ తలలను "టక్... టక్..." మంటూ నరికి అవతల పారేశాడు. రక్తం ఏరులై పారుతూ వెళ్లి కృష్ణా నది నీళ్లలో కలుస్తోంది.
అయినా గాయాలతో ఉన్న ప్రసాద్ ఒంటరిగా... ముందర ఉన్న మరో ముగ్గురు ట్రైన్డ్ కిల్లర్స్ ముందు సింహంలా నిలబడ్డాడు.
సమయం: ఉదయం 10:35 నిమిషాలు
ప్రదేశం: కమిషనర్ పూజ ఎంట్రీ
సరిగ్గా అదే సమయానికి సమాచారం అందుకున్న సెక్యూరిటీ ఆఫీసర్లు తుఫానులా ఘాట్ లోకి దూసుకొచ్చారు.
అందరికంటే ముందు ఉన్న సిటీ కమిషనర్ పూజ... అక్కడ నెత్తుటి మడుగులో ఉన్న సోనుని చూసింది.
తన బిడ్డలాంటి సోను తల నిండా రక్తం చూసేసరికి ఆమె గుండె పగిలినంత పనైంది. ఆమె సహనం పూర్తిగా కోల్పోయింది!
పూజ: (కళ్లల్లోంచి నీళ్లు కారుతుండగా, కోపంతో ఊగిపోతూ తన సర్వీస్ రివాల్వర్ తీసింది)
"నా బిడ్డ జోలికే వస్తారా... చావండ్రా నా కొడుకుల్లారా!!!"
"ఢిష్యూం! ఢిష్యూం! ఢiష్యూం!"
పూజ తూటాలు ఆ మిగిలిన ముగ్గురు ట్రైన్డ్ కిల్లర్స్ గుండెలను చీల్చుకుంటూ వెళ్లాయి. వాళ్లు అక్కడికక్కడే శవాలై పడిపోయారు.
అంతా అయిపోయింది... ఒంటి నిండా గాయాలతో, విపరీతంగా రక్తం పోయిన ప్రసాద్...
చేతిలోని కత్తిని అలాగే పట్టుకుని, సోను మరియు వర్షల ముందే నిస్సహాయంగా కింద పడిపోయాడు.
కృష్ణా నది ఘాట్ మొత్తం శవాలు, రక్తంతో ఒక భయంకరమైన యుద్ధభూమిలా మారిపోయింది!
ది డెత్ ఏంజెల్ - రక్తతర్పణం – కాళికాదేవి ప్రళయతాండవం
సమయం: ఉదయం 10:35 నిమిషాలు
ప్రదేశం: కృష్ణా నది పుష్కర ఘాట్ (మారణకాండ తదనంతర క్షణాలు)
కృష్ణా నది ఘాట్ మొత్తం శవాల దిబ్బగా మారింది. నరకయాతనతో మూలుగుతూ కింద పడిపోయిన ప్రసాద్ (అనుష్క భర్త) చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
అతని వీపులో కత్తి అలాగే దిగి ఉంది. అది చూసిన వర్ష గుండె పగిలిపోయినంత పనైంది. ఆమె తన చేతి గాయాన్ని కూడా లెక్కచేయకుండా, కన్నీళ్లు కారుస్తూ ప్రసాద్ దగ్గరకు పరుగెత్తింది.
వర్ష : (కళ్లల్లోంచి నీళ్లు వస్తుండగా, రెండు చేతులూ జోడించి ప్రసాద్‌కి దండం పెడుతూ)
"లేవండి అంకుల్! ప్లీజ్ లేవండి. మిమ్మల్ని ఇలాంటి స్థితిలో నేను చూడలేకపోతున్నాను. నా ప్రాణమైన నా తమ్ముడు సోనుని ఈరోజు మీరే కాపాడారు అంకుల్... ప్లీజ్ కళ్లు తెరవండి!"
సోను కూడా ఏడుస్తూ పరుగున వచ్చి ప్రసాద్ పక్కన మోకాళ్లపై కూర్చున్నాడు. ప్రసాద్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, ఎంతో కష్టంగా తన రక్తపు చేతిని సోను తలపై పెట్టాడు.
ప్రసాద్: (క్షీణిస్తున్న గొంతుతో, చాలా బలహీనంగా) "నువ్వు... నువ్వు బానే ఉన్నావా నాన్న...?"
సోను ఏడుస్తూ తలూపాడు. ప్రసాద్ మెల్లగా కళ్లు మూశాడు. అప్పుడే అక్కడికి పరుగున వచ్చిన కమిషనర్ పూజ వైర్లెస్ వాకి టాకీ తీసి గట్టిగా అరిచింది.
పూజ: "కంట్రోల్ రూమ్! ఇప్పుడే పుష్కర ఘాట్‌కి అంబులెన్స్ పంపండి.... ఐ నీడ్ ఇట్ నవ్ !"
సరిగ్గా నిమిషంలో అక్కడికి వచ్చిన ఎమర్జెన్సీ వెహికల్‌లో ప్రసాద్, వర్షలను ఎక్కించి నగరంలోని ప్రముఖ 'అంజలి హాస్పిటల్'కి తరలించారు.
పూజ వెంటనే హాస్పిటల్ చుట్టూ వంద మంది సెక్యూరిటీ ఆఫీసర్లతో భారీ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయించింది.
సమయం: ఉదయం 10:45 నిమిషాలు
ప్రదేశం: పూనమ్ ఇల్లు, విజయవాడ (పొంచి ఉన్న ప్రళయం)
ఘాట్‌లో ఇంత జరుగుతున్నా ఇవేమీ తెలియని పూనమ్, ఆమె అత్తగారు ఇంట్లోనే ఉన్నారు.
పూనమ్‌కు నెలసరి మొదటి రోజు (Periods First Day) కావడం, దానికి తోడు విపరీతమైన జ్వరం ఉండటంతో ఆమె ఒళ్లు తెలియని నీరసంతో లోపలి బెడ్‌రూమ్‌లో గాఢనిద్రలో ఉంది.
అత్తగారు హాల్లో కూర్చుని ప్రశాంతంగా టీవీ చూస్తున్నారు.
సరిగ్గా అప్పుడు... ఇంటికి కొద్దిగా దూరంలో రెండు మినీ బస్సులు వచ్చి ఆగాయీ . అందులోంచి 40 మంది ప్రొఫెషనల్ కిల్లర్స్ ఒకరి తర్వాత ఒకరు దిగారు.
చుట్టుపక్కల వాళ్లకు ఎలాంటి అనుమానం రాకుండా, పిల్లుల్లా అడుగులు వేస్తూ పూనమ్ ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు.
రాగానే మొదట బయట ఉన్న మెయిన్ ఐరన్ గేట్‌ను లాక్ చేసేశారు.
ఎందుకంటే, రణధీర్ (రావు) వాళ్లకు ముందే గట్టిగా హెచ్చరించాడు—"పూనమ్ దేవి మామూలు ఆడది కాదు, అత్యంత ప్రమాదకరమైన మృత్యువు!" అని.
అందుకే వాళ్లు ఎలాంటి శబ్దం రాకుండా లోపలికి వచ్చారు. ఇంటి మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంది. ఒక కిల్లర్ ముందుకు వచ్చి డోర్ బెల్ కొట్టాడు.
అత్తగారు: (టీవీ సౌండ్ తగ్గించి, మనసులో) "అప్పుడే వచ్చేసారా రావు, సోను...?" అనుకుంటూ వెళ్లి తలుపు తీశారు.
తలుపు తీసిన మరుక్షణమే—"ఛాక్!!!!"
ఒక పదునైన కత్తి ఆమె గొంతులోకి దిగిపోయింది! నోట్లోంచి కేక కూడా రాకుండా అత్తగారు అలాగే వెనక్కి పడిపోయారు. ఆమె చేతిలో ఉన్న టానిక్ చిన్న బాటిల్ 'టుప్' మంటూ కిందపడి పగిలిపోయింది.
ఆ బాటిల్ పగిలిన శబ్దానికి పూనమ్‌కు ఒక్కసారిగా మెలకువ వచ్చింది.
పూనమ్: (నీరసంగా బెడ్‌రూమ్‌లో నుంచే గట్టిగా అరిచింది) "అత్తయ్యా... ఏమైంది అత్తయ్యా?!"
కాని అవతలి నుండి ఎలాంటి శబ్దమూ లేదు. భయంకరమైన నిశ్శబ్దం. అప్పటికే ఆ 40 మంది కిల్లర్స్ ఇల్లా కారిడార్‌లోకి వచ్చేసి, మెయిన్ డోర్ లాక్ చేసి, చేతుల్లో కత్తులతో పూనమ్ బెడ్‌రూమ్ డోర్ ముందర కాపుకాశారు.
సమయం: ఉదయం 10:48 నిమిషాలు
ది బ్లాక్ స్క్వాడ్ లీడర్ !
పూనమ్ నీరసంగానే మంచం దిగి, ఏమైందో చూద్దామని మెల్లగా బెడ్‌రూమ్ డోర్ వైపు నడవడం మొదలుపెట్టింది. సరిగ్గా హాల్ లోకి అడుగు పెట్టబోయే సమయానికి...
వంటగది నుండి వచ్చే వెలుతురు హాల్లో కనిపించలేదు!
పూనమ్ ఒక సెకను ఆగి ఆలోచించింది. అత్తగారు ఎప్పుడూ వంటగది తలుపులు కానీ, ఆ వెలుతురును కానీ క్లోజ్ చేయరు. అంటే... ఇంట్లో ఎవరో ఉన్నారు!
సాధారణ స్త్రీలకైతే అంత చీకట్లో ఆ చిన్న మార్పును కనిపెట్టే షార్ప్‌నెస్ ఉండదు. కానీ నిలబడింది సాదాసీదా కోడలు కాదు... బ్లాక్ స్క్వాడ్ లీడర్!
పూనమ్ వెళ్తూ వెళ్తూనే డోర్ పక్కన మూలలో ఉన్న ఒక భారీ ఇన్యుప రాడ్‌ను కుడిచేతిలోకి తీసుకుంది.
ఆమె కాలి అడుగు బయట పెట్టడమే ఆలస్యం—చీకట్లోంచి ఒకేసారి 10 పదునైన కత్తులు ఆమె ముఖం వైపు వేగంగా దూసుకొచ్చాయి!
పూనమ్ మెరుపు వేగంతో వెనక్కి జరిగి, తన చేతిలోని ఐరన్ రాడ్‌తో కత్తులను బ్లాక్ చేస్తూ బెడ్‌రూమ్ తలుపును గట్టిగా బాది మూసేసింది!
ఆ డోర్ ఫోర్స్‌కి బయట ఉన్న నలుగురు కిల్లర్స్ వెనక్కి పడిపోయారు.
పూనమ్ క్షణకాలం కూడా వేస్ట్ చేయలేదు. బెడ్‌రూమ్‌లో ఉన్న తన పొడుగు జుట్టును గట్టిగా పైకి ముడి వేసుకుంది.
ఇన్నాళ్లుగా అణచిపెట్టుకున్న ఆ 'కాళికాదేవి' ఆమెలోంచి బయటకు వచ్చింది.
ఎడమచేత్తో పక్కనే ఉన్న డ్రెసింగ్ టేబుల్ మిర్రర్‌ను ఐరన్ రాడ్‌తో గట్టిగా కొట్టి పగలగొట్టింది. అందులోంచి ఒక అతి పెద్ద, పదునైన గాజు ముక్కను (Sharp Glass Piece) చేతిలోకి తీసుకుంది.
ఇప్పుడు ఆమె కుడిచేతిలో ఐరన్ రాడ్, ఎడమచేతిలో పదునైన గాజు ముక్క!
పూనమ్ ఒక సింహంలా బెడ్‌రూమ్ డోర్ తన్నుకుంటూ బయటకు దూకింది!
"ష్వాక్... ష్వాక్... ష్వాక్!!!"
ఆమె వేగానికి హాల్లో కిందపడి లేస్తున్న ఐదుగురు కిల్లర్స్ మెడలు క్షణాల వ్యవధిలో తెగిపోయాయి! రక్తం గోడల మీదకు చిమ్మింది.
కానీ, అక్కడి నుండి మెయిన్ డోర్ వైపు చూడగానే పూనమ్ గుండె ఆగిపోయినంత పనైంది.
అక్కడ తన తల్లి లాంటి అత్తగారు గొంతు తెగి రక్తపు మడుగులో పడి ఉన్నారు. పూనమ్ కళ్లల్లోంచి కన్నీళ్లు ఉప్పొంగాయి.
పూనమ్: (ఆవేదనతో అరుస్తూ) "అత్తయ్యాఆఆఆఆ!!!"
ఆమె బ్రతికే ఉందేమోనని పూనమ్ ముందుకు అడుగు వేయబోయింది. సరిగ్గా అప్పుడే చీకట్లోంచి వచ్చిన ఒక కిల్లర్ కత్తి...
పూనమ్ కుడికాలి మోకాలి కింద బలంగా కోసుకుంటూ వెళ్ళింది! రక్తం చిమ్మింది.
జ్వరం, పీరియడ్స్ పెయిన్, దానికి తోడు ఈ గాయం... ఏ ఆడదైనా అక్కడ కూలిపోవాలి. కానీ పూనమ్ రక్తం చూసి మరింత రౌద్రంగా మారింది.
ఆ గాయాన్ని అస్సలు లెక్కచేయకుండా వేగంగా అత్తగారి దగ్గరకు వెళ్లి ఆమె చేయి పట్టుకుని పల్స్ చూసింది. పల్స్ లేదు... ఆమె చనిపోయారు.
పూనమ్ కళ్లల్లో కన్నీళ్లు కాస్తా నెత్తురు రేఖలుగా (రక్తపు కసిగా) మారిపోయాయి.
సమయం: ఉదయం 10:52 నిమిషాలు
నరమేధం
మిగిలిన 35 మంది కిల్లర్స్ కత్తులతో పూనమ్‌ను చుట్టుముట్టారు. పూనమ్ కిందపడి ఉన్న ఒక కిల్లర్ కత్తిని కుడిచేతిలోకి తీసుకుంది, ఎడమచేతిలో ఆ పెద్ద గాజు ముక్క అలాగే ఉంది.
కిల్లర్ లీడర్: "నరకండ్రా దాన్ని! బాస్ చెప్పింది నిజమే...!"ఆ మాట పూర్తి కాకముందే...
పూనమ్ గాలిలోకి ఎగిరింది! ఒకే దెబ్బకు ముగ్గురి తలలను గాల్లోనే నరికి అవతల పారేసింది. ఆమె చేతిలోని కత్తి కంటికి కూడా కనిపించనంత వేగంతో తిరుగుతోంది.
"ష్వాక్... ష్వాక్... భఛాక్!!!"
హాల్ మొత్తం తెగిన చేతులు, కాళ్లు, తలలతో నిండిపోయింది. పూనమ్ ఒక కిరాతకమైన వేటగాడిలా ఒక్కడిని కూడా వదలకుండా...
ఆ 40 మందినీ శవాలుగా మార్చేసింది. ఇల్లంతా శవాల దిబ్బలా మారిపోయింది.
ఊపిరి పీల్చుకుంటూ, ఒంటి నిండా శత్రువుల రక్తంతో నిలబడిన పూనమ్‌కు ఒక విషయం అర్థమైంది—ఇదంతా తన కోసమే జరిగింది!
పూనమ్: (కంగారుగా, గుండెల్లో భయంతో) "ఇక్కడ నా మీద ఇంత పెద్ద దాడి జరిగిందంటే... నా కొడుకు సోను, నా భర్త రావుల పరిస్థితి ఏంటి? వాళ్లు జాతరలో ఉన్నారు... వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి!"
పూనమ్ కంటి నిండా రక్తం కారుతున్నా పట్టించుకోకుండా, వాళ్లను కాపాడటానికి బయటకు వెళ్లడానికి సిద్ధమైంది.
The following 16 users Like Sunnysunnysunny's post:16 users Like Sunnysunnysunny's post
• Akhil2544, Babu_07, Bvrn, coolguy, gora, puku pichi, Raj0003, Ram.alone, ramd420, Sachin100, selfread, sriramakrishna, Terminator619, TringDan, VijayPK, Vinod kumar92
Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
సమయం: ఉదయం 11:00 గంటలు
ప్రదేశం: పూనమ్ ఇంటి బయట
సరిగ్గా పూనమ్ మెయిన్ డోర్ తెరిచి బయటకు రాగానే... బయట సైరన్ శబ్దంతో కమీషనర్ పూజ కారు వచ్చి ఆగింది. పూజ కారు దిగి లోపలికి రాబోయింది.
కానీ మెయిన్ డోర్ దగ్గరే రక్తపు మడుగులో చనిపోయి ఉన్న అత్తగారిని, లోపల ఉన్న 40 శవాలను, రక్తంతో తడిసిపోయి నిలబడిన పూనమ్‌ను చూడగానే... పూజ గుండె ఆగినంత పనైంది.
ఆ భయానికి పూజ అక్కడే డోర్ దాన్ని పట్టుకుని కింద పడిపోయింది.
పూనమ్ వేగంగా పూజ దగ్గరకు వచ్చి, ఆమె కాలర్ పట్టుకుని గట్టిగా ఊపింది.
పూనమ్: (పిచ్చిదానిలా అరుస్తూ) "పూజా! కీస్ ఇవ్వు! కార్ కీస్ ఇవ్వు, నేను వెళ్లాలి! నా సోను ప్రమాదంలో ఉన్నాడు, నా భర్త ప్రమాదంలో ఉన్నాడు... పూజా మాట్లాడు!!!"
పూజ కన్నీళ్లతో తేరుకుని, పూనమ్ వైపు చూసింది.
పూజ: "పూనమ్... సోనుకి... సోనుకి ఏమీ కాలేదు. వాడు సేఫ్‌గా ఉన్నాడు. కానీ..." అని మాట ఆపేసింది.
పూనమ్ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. చేతులు వదిలేసి పూజ ముందు మోకాళ్లపై కింద కూర్చుంది.
పూనమ్: (రక్తపు కన్నీళ్లతో, లోతైన గొంతుతో) "చెప్పు పూజా... ఏమైంది?"
పూజ: (ఏడుస్తూ) "ఘాట్ లో సోను మీద దాడి జరిగింది పూనమ్. రావు (రణధీర్) గొంతు కోసి నదిలో పారేశారు... అతను చనిపోయాడు.
కానీ సోనుని కాపాడటానికి ఎవరో ఒక అపరిచిత వ్యక్తి, ఒక అమ్మాయి అడ్డు వచ్చారు. ఆ అమ్మాయి చేతికి తీవ్రమైన గాయమైంది. ఆ అంకుల్ వీపులో కత్తి దిగినా పోరాడి సోనుని కాపాడాడు.
ఇప్పుడు ఆయనేమో అంజలి హాస్పిటల్‌లో చావుబ్రతుకుల మధ్య ఉన్నాడు. ఆ అమ్మాయి ట్రీట్‌మెంట్ కూడా తీసుకోకుండా సోనుని పట్టుకుని ఓదారుస్తూనే ఉంది... సోను అక్కడ పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు పూనమ్..."
ఆ మాట వినగానే పూనమ్ గుండె బరువెక్కింది. కళ్లల్లోంచి కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి.
"నా వల్ల... కేవలం నా గతం వల్ల ఈరోజు నా అత్తమ్మ చనిపోయింది, నా భర్త చనిపోయాడు... కానీ, ఎవరో తెలియని ఆ ఇద్దరు నా ప్రాణమైన నా కొడుకు సోను కోసం తమ ప్రాణాలను ఎందుకు అడ్డం పెట్టారు?!" అని పూనమ్ మనసు రోదించింది.
పూనమ్ నెమ్మదిగా లేచి నిలబడింది. ఆమె కళ్లలోని రౌద్రం పోయి అంతులేని వేదన కనిపించింది.
పూనమ్: "హాస్పిటల్‌కి పద పూజా... ఇదంతా నువ్వు తరువాత చూసుకో. నేను నా కొడుకు దగ్గరకు వెళ్లాలి!"
పూనమ్ పూజ కార్ కీస్ అందుకుని, ఒంటి నిండా రక్తంతోనే హాస్పిటల్ వైపు కార్ వేగంగా పోనిచ్చింది. కృష్ణా నది సాక్షిగా...
విధి ఆడుతున్న ఈ భయంకరమైన చదరంగంలో, తన భర్త రణధీరే అసలైన విలన్ అనే నిజం తెలియని ఆ కన్నతల్లి, తన కొడుకును కాపాడిన అపరిచిత దైవాలను చూడటానికి హాస్పిటల్ వైపు దూసుకుపోతోంది!
సమయం: ఉదయం 11:10 నిమిషాలు
ప్రదేశం: విజయవాడ రోడ్లు (హాస్పిటల్‌కు వెళ్లే దారిలో కార్ లోపల)
కార్ టాప్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. పూనమ్ స్టీరింగ్ గట్టిగా పట్టుకుని డ్రైవ్ చేస్తుంటే, ఆమె కళ్లల్లోంచి కన్నీళ్లు కారి గాయపడిన ముఖం మీదున్న రక్తాన్ని కడిగేస్తున్నాయి.
పూనమ్: (తీవ్రమైన ఆవేదనతో, ఏడుస్తూ) "పూజా... హాస్పిటల్ బయట ఇప్పుడే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చెయ్. మీడియా మొత్తం ఈపాటికే అక్కడ గుమిగూడి ఉంటుంది.
ఈరోజు జరిగిన దాడిలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో రావు కుటుంబం మొత్తం చనిపోయారని చెప్పు. ఆ కిల్లర్స్‌ను పట్టుకునే క్రమంలో ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు గాయపడ్డారని, అందులో ఒక అండర్ కవర్ ఆఫీసర్ అత్యంత క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నాడని స్టేట్‌మెంట్ ఇవ్వు."
పూజ: "కానీ పూనమ్... మీడియా నన్ను వందల ప్రశ్నలు అడుగుతుంది..."
పూనమ్: "నువ్వు ఒక్కటే చెప్పాలి పూజా! ఆటాక్ చేసిన కిల్లర్స్ అందరూ సెక్యూరిటీ ఆఫీసర్ల ఎదురుకాల్పుల్లో చనిపోయారు, ఒక్కడు కూడా మిగలలేదు అని చెప్పు.
ఇంకా ఆధారాల కోసం వెతుకుతున్నామని చెప్పి క్లోజ్ చెయ్. నీ భుజానికి తగిలిన బుల్లెట్ గాయానికి ఒక చిన్న కట్టు కట్టించుకుని ప్రెస్ ముందుకు వెళ్ళు... ప్లీజ్ పూజా."
పూజ : కానీ నాకు ఏ బుల్లెట్ తగాలలేదు కదా.. మాట పూర్తి చేసే లోపు పూనమ్ పూజ గన్ తీసి తన బుజం పై ఘాట్ చేసింది.
పక్క సీట్లో కూర్చున్న కమిషనర్ పూజ తన కుడి భుజానికి గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంది. అక్కడ బుల్లెట్ తగిలి రక్తం చిమ్ముతోంది. ఆ నరకప్రాయమైన నొప్పిని భరిస్తూనే పూజ పూనమ్ వైపు చూసింది.
పూనమ్ అంతటితో ఆగలేదు. పూజ చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కుని, వెంటనే RAW హెడ్ చీఫ్‌కు పర్సనల్ లైన్ కలిపింది.
ఫోన్ అవతలి వైపు రా చీఫ్ కనెక్ట్ అవ్వగానే పూనమ్ గొంతులో ఇన్నాళ్లూ లేని ఒక ఓటమి, నిస్సహాయత ఒకేసారి బయటపడ్డాయి.
పూనమ్: (ఫోన్‌లో వెక్కి వెక్కి ఏడుస్తూ) "చీఫ్... నేను ఓడిపోయాను. నా వల్ల కావట్లేదు! నా గతం నా కళ్లముందే నా కుటుంబాన్ని బలి తీసుకుంది.
నా కొడుకు సోనుకి గనుక ఈరోజు ఏమైనా అయ్యి ఉంటే... నేను కూడా ఈపాటికే శవమై ఉండేదాన్ని. నాకొక సహాయం చేయండి చీఫ్.
నాకు అర్జెంట్‌గా 10 సర్వీస్ గన్స్, వాటితో పాటు 10 రౌండ్ల లైవ్ అమ్యునిషన్ కావాలి. అంతేకాదు... మెయిన్ డేటాబేస్ నుండి నా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క రికార్డ్, ప్రతి ఒక్క ఆధారం పూర్తిగా తుడిచేయండి!
ఒక్క గంట... నాకు కేవలం ఒక్క గంటలో ఇదంతా జరిగిపోవాలి. నా పిల్లల జోలికి ఇంకెవ్వడూ రాకూడదు, నేను ఇంకెవరినీ పోగొట్టుకోలేను!"
ఆమె మాటల్లోని ఆర్తనాదం విన్న రా చీఫ్ క్షణం కూడా ఆలోచించలేదు.
RAW చీఫ్: "నువ్వు ప్రశాంతంగా ఉండు పూనమ్. నీ ఫ్యామిలీని కాపాడటం నా బాధ్యత. వన్ అవర్... జస్ట్ వన్ అవర్‌లో అంతా క్లియర్ అయిపోతుంది."
ఫోన్ కట్ అయింది. RAW ఆఫీస్ నుండి విజయవాడ లోకల్ బ్రాంచ్‌కు అత్యంత రహస్య ఆదేశాలు వెళ్లాయి. కేవలం ఒకే ఒక్క గంటలో పూనమ్ దేవి గతాన్ని, వర్తమానాన్ని సూచించే ప్రతి ఒక్క రికార్డ్ డిజిటల్ నెట్‌వర్క్ నుండి మాయం చేసే ప్లాన్ సిద్ధమైంది.
సమయం: ఉదయం 11:25 నిమిషాలు
ప్రదేశం: అంజలి హాస్పిటల్, విజయవాడ (క్యాజువాల్టీ వార్డ్)
పూనమ్ నడుచుకుంటూ కాదు... పరుగున హాస్పిటల్ కారిడార్‌లోకి దూసుకొచ్చింది. కానీ లోపలికి రాగానే ఆమె అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి.
ఎదురుగా బెంచ్ మీద సోను కూర్చుని ఉన్నాడు. అతని తల నుండి శరీరం వరకు బట్టలన్నీ రక్తంతో తడిసి ముద్దయిపోయి ఉన్నాయి. అతని పక్కనే వర్ష కూర్చుని ఉంది.
వర్ష చేతి నుండి ఇంకా రక్తం చుక్కలు చుక్కలుగా కింద పడుతోంది. అంత భయంకరమైన నొప్పితోనూ, ఆమె సోను తలను తన భుజంపై పడుకోబెట్టుకుని, వెన్ను నిమురుతూ ఏడుస్తోంది.
ఆ దృశ్యం చూసిన పూనమ్ గుండె కరిగిపోయింది. తన కొడుకు కోసం ప్రాణాలు పెట్టడానికి తను కాకుండా... మరొక అమ్మాయి, ఒక అపరిచిత రక్తం అక్కడ నిలబడి ఉందనే నిజం ఆమెను కదిలించి వేసింది.
పూనమ్ మెల్లగా అడుగులు వేసుకుంటూ వాళ్ల వైపు నడిచింది. ఆమె నడుస్తున్న శబ్దానికి వర్ష నెమ్మదిగా తలెత్తి చూసింది.
ఒంటి నిండా శత్రువుల రక్తంతో డ్రెస్‌లో వస్తున్న పూనమ్‌ను చూడగానే వర్షకు ఆమె ఎవరో తెలియక తీవ్రమైన ప్రాణభయంతో వణికిపోయింది.
సోనుని గట్టిగా తన గుండెలకి హత్తుకుంటూ పక్కనే ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ల వైపు చూస్తూ అరిచింది.
వర్ష: (భయంతో కేకలు వేస్తూ) "ఎవరో వస్తున్నారు... ప్లీజ్ కాపాడండి! నా తమ్ముడిని కాపాడండి! రండి!"
వర్ష అరుపులకి సోను మెల్లగా తన తల పైకెత్తి చూశాడు. ఎదురుగా నిలబడిన ఆ రూపాన్ని చూసి వాడి నోట్లోంచి ఒకే ఒక్క మాట వచ్చింది.
సోను: (కన్నీళ్లతో) "అమ్మా...!"
ఆ మాట వినగానే వర్ష ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈమె సోను తల్లా?! మరుక్షణం వర్ష సోనుని వదిలేసి, పరుగున వెళ్లి పూనమ్‌ను గట్టిగా కౌగిలించుకుంది.
వర్ష: (పూనమ్ ఒంటి మీదున్న రక్తాన్ని చూసి పిచ్చిదానిలా ఏడుస్తూ) "అమ్మా!!! నీకేమైంది అమ్మా? ఈ రక్తం ఏంటి? నీకు గాయాలయ్యాయా? డాక్టర్... డాక్టర్... త్వరగా రండి, మా అమ్మను కాపాడండి!" అని హాస్పిటల్ మొత్తం వినబడేలా గట్టిగా అరుస్తోంది.
సోను ఆ ఇద్దరినీ చూసి మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. పూనమ్ కళ్లల్లోంచి కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఆమె వర్ష తలపై ప్రేమగా చేయి పెట్టి, తన గుండెలకి గట్టిగా హత్తుకుంది.
పూనమ్: "ఏం కాదు తల్లి... మీ అమ్మకి ఏం కాలేదు. మీరంతా నా కళ్లముందు ఇంత ప్రేమగా ఉండగా నాకేం కాదురా..." అని చెప్తూనే సోను వైపు తన ఎడమచేయి చాచింది.
సోను కూడా పరుగున వచ్చి పూనమ్‌ను గట్టిగా హత్తుకున్నాడు.
సోను: (వెక్కి వెక్కి ఏడుస్తూ) "అమ్మా... నాన్న... నాన్నని నా కళ్లముందే నరికేసారమ్మా... నాన్న చనిపోయారమ్మా..."
పూనమ్: (గుండెల్లో నిజాన్ని దాచుకుని, కొడుకు వీపు నిమురుతూ) "నాకు తెలుసురా నాన్న... నాకు తెలుసు... నువ్వు ఏడవకు, అమ్మ ఉంది కదా..."
సమయం: ఉదయం 11:40 గంటలు
ప్రదేశం: డాక్టర్ అంజలి క్యాబిన్
సరిగ్గా అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన డాక్టర్ అంజలి, అక్కడ రక్తంతో తడిసి ఉన్న పూనమ్‌ను చూసి షాక్ తిని పరుగున వచ్చింది.
అంజలి: "ఓసేయ్ పూనమ్! ఏంటి ఈ రక్తం? అసలు సిటీలో ఏం జరుగుతోంది? మీరంతా ఇలా ఉన్నారు ఏంటి?"
పూనమ్: "అంజలీ... నేను నీకు తర్వాత అన్నీ వివరిస్తాను. ముందు నా కూతురి చేతికి తీవ్రమైన గాయమైంది, రక్తం కారుతోంది... తనకి కట్టు కట్టు." అని వర్ష చేయి పట్టుకుని అంజలి చేతిలో పెట్టింది.
కానీ వర్ష పూనమ్ చేతిని వదలడానికి ఇష్టపడలేదు. అమ్మను వదిలితే మళ్లీ ఏమవుతుందో అన్న భయం ఆమె కళ్లల్లో ఉంది. పూనమ్ మెల్లగా వర్ష గడ్డం పట్టుకుని పైకి లేపి, ఆమె కళ్లలోకి చూస్తూ ఎంతో ఆప్యాయంగా అంది.
పూనమ్: "నేను కూడా నీతోనే ఉంటాను తల్లి... పదా లోపలికి."
ముగ్గురూ లోపలి ట్రీట్‌మెంట్ రూమ్‌లోకి వెళ్లారు. నర్సులు పూనమ్ మోకాలికి ఉన్న గాయానికి, వర్ష చేతికి ఉన్న పదునైన కత్తి గాయానికి నీట్‌గా స్టిచెస్ వేసి కట్టు కట్టారు.
సమయం: మధ్యాహ్నం 12:15 నిమిషాలు
ప్రదేశం: హాస్పిటల్ స్పెషల్ క్యాబిన్
సరిగ్గా గంట గడిచింది. కమిషనర్ పూజ తన భుజానికి కట్టు కట్టించుకుని, ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించుకుని లోపలికి వచ్చింది.
పూనమ్ చెప్పినట్లే పూనమ్ ఇంట్లో ఉన్న 40 శవాలను, ఘాట్ లో ఉన్న శవాలను మీడియా కంట పడకుండా సెక్యూరిటీ ఆఫీసర్లు పూర్తిగా క్లియర్ చేశారు.
టీవీ ఆన్ చేయగా అందులో ఫ్లాష్ న్యూస్ వస్తోంది: "విజయవాడలో ముఠా ముఠాల మధ్య దాడులు ... సెక్యూరిటీ ఆఫీసర్ల ఎదురుకాల్పుల్లో కిల్లర్స్ అందరూ హతం... సాదాసీదా కుటుంబం బలి!"
పూజ లోపలికి వస్తూ తనతో పాటు అందరికీ మార్చుకోవడానికి కొత్త దుస్తులను తెచ్చి ఇచ్చింది. అంత దుఃఖంలోనూ, పూనమ్ ఇంకా సోనుకి తన అమ్మమ్మ (రావు తల్లి) చనిపోయిన నిజాన్ని చెప్పలేదు.
వాడు తండ్రి మరణాన్నే తట్టుకోలేకపోతున్నాడు, ఇప్పుడు ఈ నిజం చెప్తే తట్టుకోలేడని ఆపింది. అందరూ బట్టలు మార్చుకుని ప్రశాంతంగా డాక్టర్ అంజలి పర్సనల్ క్యాబిన్‌లో కూర్చున్నారు.
పూనమ్ మెల్లగా పూజ వైపు తిరిగి, గంభీరమైన గొంతుతో అడిగింది.
పూనమ్: "పూజా... అసలు ఆ లోపల ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న ఆ వ్యక్తి ఎవరు?"
అంజలి: (క్యాబిన్ లోకి వస్తూ) "పూనమ్... ఆయనకు తగిలిన గాయాలు చాలా భయంకరమైనవి. వీపులో కత్తి దిగినా కూడా బ్రెయిన్ డెడ్ అవ్వకుండా పోరాడాడు. మరో అరగంటలో ఆయనకు మెలకువ వస్తుంది, అప్పుడు మనమే అతన్ని నేరుగా అడగొచ్చు."
పూనమ్: (ఆలోచనల్లో పడి, పూజ వైపు చూస్తూ) "పూజా... వచ్చిన ఆ కరడుగట్టిన ప్రొఫెషనల్ కిల్లర్స్ నుండి నా కొడుకును కాపాడటం అనేది ఒక సాదాసీదా మనిషికి అస్సలు సాధ్యం కాదు.
అయినా... అసలు ఎవరో తెలియని ఆ వ్యక్తి, ... నా పిల్లల కోసం తమ ప్రాణాలను ఎందుకు అడ్డం పెట్టారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?"
క్యాబిన్ లో ఉన్న అందరి ముఖాల్లోనూ ఒకటే నిశ్శబ్దం, ఒకటే ఉత్కంఠ!
ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ముగ్గురు కన్యల కోసం మొదలైన ఈ నెత్తుటి ఆటలో... తన భర్త రణధీరే అసలైన సూత్రధారి అనే భయంకరమైన సత్యాన్ని పూనమ్ ఎలా తెలుసుకోబోతోంది? లోపల ఉన్న ప్రసాద్ కళ్లు తెరిస్తే ఏ నిజాలు బయటపడతాయి?
The following 22 users Like Sunnysunnysunny's post:22 users Like Sunnysunnysunny's post
• Akhil2544, Babu_07, coolguy, gora, kingmahesh9898, krish1983, Mohana69, Nani 124, puku pichi, Raj0003, Ram.alone, ramd420, Sachin100, Santhosh king, selfread, sriramakrishna, Terminator619, TringDan, Vego1990, VijayPK, Vinod kumar92, wheel of Times
Posts: 4,440
Threads: 0
Likes Received: 3,043 in 2,327 posts
Likes Given: 12
Joined: Feb 2020
Reputation:
39
|