Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#61
ఏజెంట్ రూహి వాసుదేవ్...26




"మనల్ని పట్టించుకోని దేశం కోసం మనమెందుకు ప్రాణాలు త్యాగం చేయాలి మేడం..." వంశీ ప్రశ్నించాడు.

రూహి కాసేపు ఆశ్చర్యంగా ఉండిపోయింది. ఎడారిలో ఆకలి దప్పికాలతో వారి ప్రాణాలు పోవాల్సింది. ఒక భారతీయుడు వారిని చూసి కాపాడాడు. అంతే కాకుండా వారికి వైద్యం చేయించి కడుపు నిండా భోజనం పెట్టాడు. దాంతో అందరూ కోలుకున్నారు. అక్కడి నుంచి చైనా బోర్డర్ చేరుకోడానికి కేవలం అరగంట మాత్రమే పడుతుంది అని తెలిసింది.

త్వరగా అక్కడికి వెళ్దాం పదండి అని తను అందరినీ పిలిచింది. కాని ఇంతలో వంశీ ఇలా మాట్లాడుతున్నాడు. రూహి మరోసారి వంశీ వంక చూసింది.

"అవును మేడం. మీరు విన్నది నిజమే... ఇందాక న్యూస్ లో చూసాను. మన ఇండియా లో వేరే కులం వారిని పెళ్లి చేసుకున్నారని ప్రేమికులను చంపేశారు అంట.
మా మతం గొప్పది, మా మతం గొప్పది అంటూ అల్లర్లు కూడా జరిగాయి. అంతే కాకుండా ఈ రాజకీయ నాయకులు కోట్ల కొద్ది స్కాం లు కూడా చేస్తున్నారు.
ఇలా కులం, మతం, డబ్బు, హోదా, అధికారం అంటూ దేశం లో ఎవరికి వారు స్వార్థం తో కొట్టుకొని చస్తుంటే... మనమెందుకు వారి కోసం బ్రతకాలి. నిన్న మనం ఈ ఎడారిలో చనిపోతే ఒక్కడైనా పట్టించుకునేవాడా....
మహా అంటే ఒకరోజు వాట్సాప్, ఫేస్ బుక్ లో స్టేటస్ పెడతారు. రెండు రోజులు మాట్లాడుకుంటారు. మూడో రోజు మనమెవరో కూడా మర్చిపోతారు. మన కుటుంబాలు మాత్రం మనల్ని తలుచుకుంటూ నరకం చూస్తుంటాయి.
నన్ను పట్టించుకోని దేశం కోసం నేనెందుకు ప్రాణాలు వదలాలి.." వంశీ ఆవేశంగా పలికాడు.

మరణం అంచుల దాకా వెళ్లి వచ్చిన వంశీ మాటల్లో రూహి కి న్యాయం ఉందని అనిపించింది. అలా మాట్లాడుతున్నప్పుడు వంశీ కళ్ళలో సన్నని నీటి పొర కమ్మడం కూడా గమనించింది. పార్వతి ఏమి మాట్లాడకపోయినా తన మనసులో కూడా ఇవే ప్రశ్నలు మెదులుతున్నాయి అని అర్థమైంది.

రూహి ఒక్కసారి ఊపిరి భారంగా పీల్చింది. తరువాత వారి వంక తిరిగి...
"వంశీ, నీకొక కథ చెప్తాను. కాసేపు వింటావా..
ఒక ఊర్లో ఓ చిన్న పాప ఉండేది. తనకు వాళ్ళ నాన్నంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమంటే ప్రతి రోజు రాత్రి తన ఒళ్ళో పడుకొని కబుర్లు చెప్పుకోనిదే పడుకునేది కాదు. బేబీ బేబీ అని పిలుస్తూ తన వేలు పట్టుకొని తెగ అల్లరి చేసేది. తన నాన్నే తన ప్రపంచం అనుకునేది. ఇంతలో ఒకరోజు వాళ్ళ నాన్న పుట్టినరోజు రాబోతుంది. ఆ పాప చాలా రోజులుగా ఎవరికీ తెలియకుండా తనకు ఇచ్చిన పాకెట్ మని భద్రంగా దాచుకుంది. ఆ డబ్బులతో వాళ్ళ నాన్న కోసం ఓ మంచి వైట్ షర్ట్, ప్యాంటు కొనింది. వాళ్ళ నాన్న వస్తే ఆ బట్టలు ఇవ్వాలని, అవి చూడగానే తన కళ్ళలో కనిపించే ఆనందం చూడాలని... ఆ పాప వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది.

తరువాతి రోజు వాళ్ళ నాన్న ఊరి నుంచి తిరిగివచ్చాడు. కాని నడుచుకుంటూ కాదు.. నలుగురూ మోసుకుంటూ తెచ్చారు.
ఆ పాప పరుగున వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళింది. పిలిచినా పలకడం లేదు. కదిలించినా కదలడం లేదు. ఆ పాపకు కన్నీరు ఆగడం లేదు.
తనకోసం కొన్న కొత్త బట్టలు తీసుకొని వచ్చింది.
'నాన్న, ఈ బట్టలు నీకోసమే కొన్నాను.  ఇక నుంచి నువ్వు చెప్పినట్టే ఉంటాను. చాకొలెట్లు తినడం తగ్గిస్తాను. బుద్దిగా ఉంటాను. ఒక్కసారి లే నాన్న...'

కాని వాళ్ళ నాన్న వైపు నుంచి సమాధానం లేదు. రక్తం తో తడిచిన తన చొక్కా చూసి ఇక ఎప్పటికీ నాన్న లేవడని అర్థమైంది. వెక్కి వెక్కి ఏడుస్తూ నాన్న గుండెల మీద పడుకుంది. లాలి జో అని తనని జో కొట్టే గుండె చప్పుడు ఇప్పుడు మూగ బోయింది.

వాళ్ళ నాన్నని చూడటం కోసం కొన్ని లక్షల మంది వచ్చారు. గాల్లో తుపాకులు కూడా పేల్చారు. టీవీ లో ఎక్కడ చూసినా వాళ్ళ నాన్న గురించే... తరువాత తెలిసింది. దేశం లో ఎంతో మందిని కాపాడటం కోసం వాళ్ళ నాన్న ప్రాణం వదిలాడు అని.

కొన్ని రోజులకు అందరూ ఆ విషయం గురించి మర్చిపోయారు. కాని ఆ పాప మాత్రం ప్రతి క్షణం వాళ్ళ నాన్న జ్ఞాపకాలతోనే గడిపేది. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ నాన్న డైరీ చూసింది. అందులో ఓ పేజీ లో ఇలా రాసి ఉంది.

'మరణమా....
నాకు ఎదురుగా రాలేక చీకటి చాటున దాక్కొని, నా నీడలో నక్కి నన్ను వెంటాడుతూ...
ఏదో రోజు నా దరి చేరుతావని తెలుసు...

కాని నీకు తెలియంది ఏంటంటే...
నిజానికి ఓ సైనికుడు తను ఉద్యోగం లో చేరిన క్షణం నుంచి ప్రతి క్షణం తన చావు కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు.
నువ్వు ఏ క్షణం నన్ను చేరినా నా మోహం లో నీ స్నేహితుడు భయాన్ని మాత్రం చూడలేవు. మృత్యువు నన్ను కబలించినా సరే, నా పెదాల మీద చిరునవ్వు మాత్రం చెరగదు. దేశం కోసం పాటుపడే సైనికుడి ప్రతి అణువు లోను వీరత్వమే ఉంటుంది.

అందరూ అంటుంటారు... రాజులు మాత్రమే చరిత్రలో మిగులుతారు అని..
కాని అది తప్పు... ఆ రాజుల చరిత్ర రాయడానికి ఓ సిరా లా మా సైనికుల రక్తమే వాడారు అనేది చదివే మనిషి మరిచినా, పుస్తకం మరుస్తుందా...

ప్రతి మనిషి ముగింపు మరణంలో ఉంటుంది.
కాని ఓ సైనికుడి ముగింపు మాత్రం తన దేశపు మట్టి లో ఉంటుంది. ఈ నేల ఉన్నంత కాలం బ్రతికే ఉంటాం..

నా మరణం అందరూ మర్చిపోవచ్చు. కాని నా నెత్తుటి తో వీర తిలకం అద్దుకున్న ఈ దేశం మరువగలదా...
నా ఊపిరి తో పురుడు పోసుకొని రెప రెప లాడే నా మువ్వన్నెల త్రివర్ణ పతాకం మరువగలదా...
నేను నిదురించే నేల మీద స్వేచ్చగా తిరిగే ఈ ప్రజల అడుగులు మరువగలవా....

దీనెమ్మ జీవితం దేశం కోసం బ్రతికితే ఎలా ఉంటుందో తెలీదు కాని...  దేశం కోసం చచ్చే క్షణం లో మాత్రం చాలా గర్వంగా ఉంటుంది. ఆ గర్వం కోసం మళ్ళీ మళ్ళీ పుట్టి చావాలని ఉంది.'

ఆ మాటలు చదవగానే ఆ పాప కు ఏం చేయాలో అర్థమైంది. తను కూడా వాళ్ళ నాన్న లాగానే దేశం కోసం బ్రతకాలని అనుకుంది. ఆ పాప ఎవరో, ఆ తండ్రి ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కాదా...
ఏజెంట్ రూహి వాసుదేవ్ D/o విక్రమ్ వాసుదేవ్...

మన దేశమంటే ప్రజలు మాత్రమే కాదు..  నేల... ఇక్కడ పారే నదులు.. మన భారతీయ సంస్కృతి... ప్రపంచానికి విజ్ఞానం అందించిన గ్రంధాలు... మేధావుల స్మృతులు... దేశ భక్తుల జ్ఞాపకాలు...
వీటన్నిటిని కాపాడుకోవడం మన బాధ్యత...

నా ప్రజలు నాకోసం నిలబడినా నిలబడకపోయినా... నేను మాత్రం నా దేశం కోసం చివరి క్షణం దాకా పోరాడుతాను. నిలబడతాను.

ఈ పోరాటం లో మీరు వెంట లేకపోతే ఒంటరిగానైనా యుద్ధం చేస్తాను. ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు నడక మాత్రమే నేర్పించారు. కాని ఆ అడుగులు నడిచింది మాత్రం ఈ నేల మీదే అని మరువను.."

రూహి చెప్పడం ఆపి బ్యాగ్ భుజాన వేసుకొని చైనా బోర్డర్ వైపు అడుగులు వేసింది. కాసేపటికి తన అడుగుల వెనుక మరో రెండు జతల అడుగులు కూడా వెంట నడిచాయి. వెనక్కి తిరిగి చూస్తే వంశీ, పార్వతి...

"కోపంలో ఏదో తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి. ఎప్పటికి మీ వెంటే మేము కూడా మేడం..." అని వంశీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు. రూహి చిరునవ్వుతోనే వారికి సమాధానం ఇచ్చింది.

తరువాత అందరూ ఆగకుండా ఆ బోర్డర్ వైపు అడుగులు వేస్తూనే ఉన్నారు. ఆకలి దప్పికలు తీరడం తో, అలాగే కంటి నిండా నిద్ర పోవడం తో వారిలో అప్పటిదాకా ఆవహించిన నిశ్శత్తువ దూరమై ఉత్సాహం గా కదిలారు. పైగా ఇందాక రూహి మాట్లాడిన మాటలు వారిలో స్ఫూర్తిని నింపాయి. అందుకే అడుగుల వేగం పెరిగింది.

అందరూ చేతుల్లో ఆయుధాలు పట్టుకున్నారు. ఎందుకంటే ఎటు వైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. అందుకే సిద్ధంగా ఉన్నారు.

అప్పటిదాకా ఎటు చూసినా ఎర్రని ఎడారి కనిపించేది. కాని మెల్లగా ఆ ఇసుక మాయమై దాని స్థానం లో నేల, చెట్టు, పుట్ట కనిపించడం మొదలయింది. అది చూసాక బోర్డర్ కి దగ్గర పడ్డాం అని వారికి అర్థమైంది.

చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అలా వారి దారికి అడ్డంగా ఓ కొండ వచ్చింది. దాన్ని ఎక్కితే కాని ముందుకు వెళ్లలేం అని అర్థమై నిదానంగా దాన్ని ఎక్కడం మొదలుపెట్టారు. ఆ కొండ అంచున ఓ పెద్ద లోయ ఉండటం తో నిదానంగా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని నడుస్తున్నారు. కాళ్లకు వేసుకున్న షు లు కూడా చిరిగిపోయి ఉండటం తో పదునైన రాళ్లు గుచ్చుకుంటున్నాయి. దారిలో ఏపుగా పెరిగిన ముళ్ల కంపలు గీరుకుంటున్నాయి. కాని అవేవి లెక్క చేయకుండా ముందుకు సాగారు.

అలా కాసేపటి తరువాత ఆ కొండ మీదకు చేరుకున్నారు. ఆ కొండ మీద నుంచి ఎదురుగా చూసి కొన్ని క్షణాలు కదలకుండా ఉండిపోయారు. ఎన్నో ప్రమాదాలను దాటిన తరువాత అనుకున్న చోటుకు చేరువయ్యామని అర్థమై వారి మోహం లో ఆనందం విరిసింది. వారికి ఎదురుగా చైనా బోర్డర్ కనిపించింది.

ఇంకొన్ని అడుగులు వేస్తే గమ్యం చేరుకుంటారు. కాని ఆ చివరి అడుగులలో ఇంకెన్ని ప్రమాదాలు వారి కోసం ఎదురుచూస్తున్నాయో ముందు ముందు కాలమే సమాధానం చెప్పాలి.

--------------------------------------------------------------

హైదరాబాద్...

జలంధర్ చెప్పినట్టుగానే వాడి అనుచరులు మార్కెట్ బయట నిలిపిన ఆటో డ్రైవర్ల మెడ మీద కత్తులు పెట్టి అందరినీ తమ అధీనం లోకి తీసుకున్నారు. ఇక సుజిత బయటకు రావడం కోసం ఎదురుచూస్తూ నుంచున్నారు.

కాసేపటికి సుజిత కూరగాయలు కొని మార్కెట్ నుంచి బయటకు వచ్చింది. ఒకసారి చుట్టూ చూసింది. తనకు కొంచెం దూరంలో ఉన్న ఒక ఆటో ని పిలిచింది. ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తున్న ఓ రౌడీ, తన చొక్కా మీద ఖాకి చొక్కా వేసుకొని సుజిత వైపు ఆటో పోనిచ్చాడు.

అక్కడున్నది జలంధర్ మనిషి అని తెలియక సుజిత ఆటో ఎక్కింది. అది చూసి ఆ రౌడీలు అందరూ మనసులోనే నవ్వుకున్నారు.

ఆటో కదిలింది.
ఆ ఆటో వెనుకే జలంధర్ మనుషులు కూడా కారులో వెంబడించడం మొదలుపెట్టారు.

ఊహించని ప్రమాదం లో చిక్కుకున్న సుజిత... దాని నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి..
[+] 4 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
ఏజెంట్ రూహి వాసుదేవ్...27



ఎన్నో కఠినమైన ప్రమాదాలు దాటుకొని రూహి బృందం చైనా బోర్డర్ దగ్గరకు చేరుకున్నారు. ఆ కొండ మీద నుంచి చూస్తే దూరంగా చైనా జెండా ఎగురుతూ ఉండటం కనిపించింది. అది చూడగానే అప్పటిదాకా వారు పడిన శ్రమ మొత్తం మర్చిపోయారు. వారి కళ్ళలో ఆనందం కలిగింది.

ఎలాగోలా అటు వైపుకు చేరుకొని ఆ ఆపరేషన్ FISH అంటే ఏంటో తెలుసుకొని, ఆ విధ్వంసం ఎలాగైనా ఆపాలని రూహి మరోసారి దృడంగా అనుకుంది. అందుకే వేగంగా ఆ కొండ దిగడం మొదలుపెట్టింది. తన వెనుకే పార్వతి, వంశీ కూడా నడిచారు.

రూహి గుండెల్లో ఆత్మవిశ్వాసం అంతకంతకు పెరుగుతుంది. ఇక్కడిదాకా వచ్చాం, ఎలాగైనా గెలిచి తీరుతాం అనే నమ్మకం తనలో పెరిగింది. నిజంగా తన ధైర్యం, తెగింపు లేకపోతే ఈ బృందం ఇక్కడిదాకా రావడం అనుమానమే... ఇదంతా తన తండ్రి విక్రమ్ వాసుదేవ్ పంచిన రక్తం వల్లే అని మనసులోనే అనుకుంది.

అలా ఆలోచిస్తూనే కొండ దిగారు. బోర్డర్ వైపు అడుగులు వేసే కొద్ది వారి కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవి అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే వారికి ఎదురుగా ఓ పెద్ద రాతి గోడ అడ్డుగా వచ్చింది. సుమారు 15 అడుగుల ఎత్తు ఉంది. ఎవరైనా ఈ ప్రమాదకరమైన అడవి నుంచి బయటపడినా, వారు తమ దేశంలోకి అక్రమంగా రాకుండా ఉండటం కోసం చైనా ఈ నిర్మాణం చేసింది అని అర్థమైంది. ఇప్పుడు దాన్ని ఎలా దాటాలో అర్థం కాలేదు.

ఎందుకంటే చుట్టూ గోడ కనిపిస్తుంది కాని ఎక్కడా తలుపు లాంటిది కనిపించలేదు. రూహి ఆ గోడ మీదకు ఎక్కాలని అనుకుంది. ప్రతి రాయికి మధ్య చిన్నని సందు ఉంది. ఆ సందులో వేలు పెట్టి ఎక్కడానికి ప్రయత్నించింది. సరిగ్గా సగం దూరం వెళ్ళగానే, అక్కడ గోడ మొత్తం ఏదో నూనె లాంటి ద్రవం తో నిండి ఉంది. దాంతో పట్టు దొరకక దబ్బున కింద పడిపోయింది. వంశీ, పార్వతి కూడా ఆ గోడ ఎక్కడానికి ప్రయత్నించారు. కాని వారు కూడా కొంచెం దూరం వెళ్ళగానే జారుతూ కింద పడ్డారు.

ఎవరూ పైకి ఎక్కకుండా ఉండటం కోసం చైనియులే ఇలా గోడ పై భాగం లో నూనె లాంటి ద్రవం పోశారు అని వారికి అర్థమైంది. ఇప్పుడు ఆ గోడ ను ఎలా దాటాలో అర్థం కాలేదు.

"మేడం మన బ్యాగ్ లో ఇంకా కొన్ని బాంబ్ లు ఉన్నాయి కదా. వాటి సాయం తో ఈ గోడను పెల్చేద్దామా..." అని పార్వతి తన ఆలోచన చెప్పింది.

"అలా పేలిస్తే సరిహద్దు దగ్గర కాపలా కాసే చైనా సైనికులకు ఆ చప్పుడు వినిపిస్తుంది. మనం వస్తున్నామని తెలిసిపోతుంది. చాలా సులభంగా మనం వారికి దొరికిపోతాం." అని వంశీ చెప్పాడు. తన మాటను ఏకిభవిస్తూ రూహి కూడా అవును అన్నట్టు తల ఊపింది.

అప్పుడే రూహి కి ఒక విషయం గుర్తొచ్చింది. RAW శిక్షణ లో భాగంగా ఒకరి భుజాల మీద మరొకరు నిలబడి తాడు పట్టుకొని పైకి పాకడం నేర్పించారు. ఇప్పుడు కూడా అలాగే చేయాలని అనుకుంది. ఆ మాట వినగానే వంశీ...
మీరు నా భుజాల మీదకు ఎక్కండి మేడం... నేను కింద నిలబడతాను అన్నాడు. రూహి సరే అంది.

వంశీ గోడకు ఆనుకొని కొంచెం ఒంగి నిలబడ్డాడు. రూహి  వంశీ భుజాల మీదకు ఎక్కింది. తరువాత వంశీ నిదానంగా పైకి లేచాడు. పార్వతి వాళ్ళు ఇద్దరూ కింద పడకుండా పట్టుకుంది. వంశీ భుజాల మీద నుంచి రూహి ఆ గోడ అంచును అందుకోవాలని చూసింది. కాని అది కొన్ని అడుగుల దూరం లో ఉంది. ఒకరి మీదకు ఒకరు ఎక్కినా సరే వారి ఎత్తు ఆ గోడ అంచును అందుకోడానికి సరిపోవడం లేదు.

మళ్ళి పరిస్థితి మొదటికి వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా... వారికి దూరంగా ఒక పెద్ద బండ రాయి కనిపించింది. దాన్ని నిలబెట్టి, దాని మీదకు ఎక్కి ప్రయత్నిస్తే తప్పకుండా అందుతుంది అని రూహి కి అనిపించింది.

అందరూ కలిసి ఆ రాయిని తీసుకొద్దామని వెళ్లారు. అది చాలా బరువుగా ఉంది. దాన్ని లేపడానికి వీరి బలం సరిపోవడం లేదు. అక్కడ కొన్ని జూగాల్స్ జాతి మొక్కల తీగలు కనిపించాయి. అవి చాలా బలంగా ఉంటాయి. అలాంటి చాలా తీగలతో ఆ రాయి చుట్టూ కట్టి ముగ్గురు కలిసి దాన్ని లాగడం మొదలుపెట్టారు.

వారి చేతులు చాలా నొప్పిని కలిగించాయి. అయినా సరే వదలలేదు. కొన్ని క్షణాలకు వారి ప్రయత్నానికి ఆ రాయి కరిగిందేమో, ముందుకు కదిలింది. అది చూసి రెట్టింపు ఉత్సాహం తో ముందుకు లాగారు. దాన్ని లాగుతుంటే ఆ తీగలు వారి చేతులను కోస్తున్నాయి. రక్తాలు కారుతున్నాయి. ప్రాణం పోయినంత నొప్పిని కలిగిస్తుంది. అయినా సరే పంటి బిగువున ఓర్చుకుంటూ ముందుకు లాగారు. కాసేపటికి ఎలాగోలా ఆ రాయిని రాతి గోడ ముందుకు తీసుకొని వచ్చారు.

అప్పటికే అందరికీ బాగా ఆయాసం కావడం తో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. చేతుల వంక చూస్తే ఎర్రగా రక్తపు మరకలు ఉన్నాయి.

విక్రమ్ ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు.
అందరి ఆస్తి తమ దగ్గర ఉన్న డబ్బులతో లెక్కిస్తే, ఓ సైనికుడి ఆస్తి మాత్రం దేశం కోసం తాను చిందించిన రక్తం బిందువులలో  లెక్కిస్తారు అని... ఆ మాట గుర్తుకురాగానే ఆ కాస్త నొప్పి కూడా మాయమైంది.

కాసేపటికి అందరూ కాస్త కుదుట పడ్డారు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు అనిపించింది. ముందుగా వంశీ ఆ రాయి మీదకు ఎక్కి నిలబడ్డాడు. రూహి మరోసారి వంశీ భుజాల మీదకు ఎక్కింది. తన కాళ్ళను అలాగే పైకి లేపి ప్రయత్నించాక గోడ అంచు కొంచెం అందింది. ఆ మాత్రం చాలు, రూహి టక్కున దాన్ని పట్టుకొని పైకి పాకింది. కొన్ని క్షణాలు తరువాత గోడ పైకి చేరుకుంది.

అది చూసి మిగతా బృందం సంతోషించారు. తరువాత పార్వతి కూడా వంశీ భుజాల మీద నుంచి గోడ పైకి చేరుకుంది. ఈసారి రూహి ఆ గోడ పైన ఉన్న ఒక ఇనుప రాడ్ లాంటి దాని కింద కాళ్ళకు సపోర్ట్ తీసుకొని కిందకి జారింది.

వంశీ ఎగిరి తన చేతులను పట్టుకున్నాడు. రూహి తన బలమంతా ఉపయోగించి వంశీ ని పైకి లాగింది. కొన్ని క్షణాలకు బృందం మొత్తం గోడ పైకి చేరుకున్నారు. తరువాత అటు వైపుకు దూకారు.

ఎక్కడా చైనా సైనికులు కనిపించలేదు. వారికి కాస్త అనుమానంగా, ఆశ్చర్యంగా తోచింది. ఇక నుంచి వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలని అనుకున్నారు. ఆయుధాలు తీసి చేతిలో పట్టుకున్నారు. తలో వైపు చూస్తూ అడుగులో అడుగు వేస్తూ త్రికోణం లాగా మారి నడుస్తున్నారు. ఏ వైపు నుంచి, ఎలాంటి ప్రమాదం వచ్చినా సిద్ధంగా ఉన్నారు.

అలా కొంచెం దూరం నడవగానే ఈసారి వారికి ఓ ఇనుప కంచె అడ్డుగా వచ్చింది. రూహి జాగ్రత్తగా ఆ కంచెను గమనించింది. అక్కడక్కడా కొన్ని జంతువుల కలేబరాలు ఉన్నాయి. వాటిని చూడగానే ఆ కంచె కు కరెంట్ పెట్టారు అని అర్థమైంది. బ్యాగ్ లో నుంచి కట్టర్ బయటకు తీశారు.

ఆ కట్టర్ హ్యాండిల్ మొత్తం చెక్కతో చేసినది. కాబట్టి దాని ద్వారా వారికి షాక్ కొట్టే అవకాశం లేదు. రూహి భుజాలు రక్తం కారేలా దాన్ని బ్యాగ్ లో తీసుకొని రావడం మంచిది అయ్యింది. ఈరోజు వారికి అది బాగా ఉపయోగపడింది. పార్వతి చాలా జాగ్రత్తగా ఆ కంచె కు వారు పట్టేంత పెద్ద రంద్రం చేసింది.

మెల్లగా అందులో నుంచి అటు వైపుకు చేరుకున్నారు. కొన్ని అడుగులు వేయగానే వారికి మాటలు వినిపించాయి. అవి చైనా భాషలో ఉన్నాయని కాస్త వినగానే అర్థమైంది. రూహి ఒక్కసారి అటు ఇటు చూసింది. తనకు ఎదురుగా కొంచెం దూరం లో ఓ పెద్ద చెట్టు ఉంది. అందరు అటు వైపుకు కదిలారు. ఆ చెట్టు వెనకాల నిలబడి ముందుకు చూసి ఆశ్చర్యపోయారు.

అక్కడ చైనా సైనికుల క్యాంప్ ఉంది. సుమారు 50 మంది దాకా ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆదునాతన ఆయుధాలు కూడా ఉన్నాయి. నిజంగా అంత మంది ఉంటారని తను ఊహించలేదు. చైనా లోకి అడుగు పెట్టాలి అంటే ఆ క్యాంపు దాటడం తప్ప మరో మార్గం లేదు.

వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇద్దరూ రూహి వంక చూసారు. రూహి ఆలోచనలో పడింది. తాము ఉన్నది ముగ్గురు, ఎదురుగా 50 మంది. అంతమందిని ఎదురించే అన్ని ఆయుధాలు కూడా లేవు. తెగించి పోరాటానికి దిగి ప్రాణాలు కోల్పోతే, ఇప్పటిదాకా చేసిన ప్రయాణం, సాహసం అంతా వృధా అవుతుంది.

రూహి బృందం మొత్తం ఆ చైనా సైనికుల స్థావరాన్ని చూస్తూ తమ వెనుక ఏం జరుగుతుందో అస్సలు గమనించలేదు.
రూహి అలా ఆలోచనలో ఉండగానే... ఓ తుపాకీ వచ్చి తన తలకు గురి పెట్టింది.

"ఇక మీ ఆట కట్టు..." అనే గొంతు వినిపించింది.
అది వినగానే అందరూ షాక్ అయ్యి వెనక్కి తిరిగారు. ఎదురుగా ఓ ముసుగు వ్యక్తిని చూసి అందరూ అలాగే షాక్ లో ఉండిపోయారు.

రూహి తలకు ఆ తుపాకీ ఎక్కు పెట్టింది మరెవరో కాదు...
వారిని ఇండియా నుంచి వెంబడిస్తూ కొరియా దాకా వచ్చిన అదే వ్యక్తి...

------------------------------------------------------------

హైదరాబాద్...

సుజిత తన ఫోన్ లో రూహి ఫోటోలు చూస్తుంది. రూహి రూపం కళ్ళ ముందు మెదలుగానే తన కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇప్పటికే తను వెళ్లి వారం దాటింది. వెళ్లినప్పటి నుంచి ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎలా ఉందో ఏంటో అని మనసులో చాలా భయంగా ఉంది.

తను ఇన్ని రోజులు దూరంగా ఉంది అంటే అదేదో చాలా ముఖ్యమైన ఆపరేషన్ అని తనకు బాగా తెలుసు. కాని ఈసారి ఎందుకో తన మనసు కీడు శంకించింది.

దేశం కోసం ఓ బిడ్డను, తన భర్తను పోగొట్టుకుంది. మరో బిడ్డ దూరమైతే తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదు. ఎలాగైనా సరే తను విజయం సాధించి తిరిగి రావాలని మనసులోనే ఆ దేవుడిని కోరుకుంది.

అలా ఆలోచిస్తూ ఉండగానే ఆటో ఆగింది. ఇంటికి వచ్చానేమో అని కిందకు దిగి చుట్టూ చూసి కాసేపు షాక్ అయ్యింది. అది తన ఇళ్ళు కాదు... మరేదో చోటు...
అది జలంధర్ స్థావరం అని తనకు తెలీదు.
కోపంగా ఎక్కడికి తీసుకొచ్చావని డ్రైవర్ ని అడగాలని చూస్తే వాడు క్రూరంగా నవ్వుతున్నాడు.

ఈలోగా మరో పాతిక మంది రౌడీలు ఆయుధాలతో తనని చుట్టు ముట్టారు. తను తప్పించుకోడానికి అవకాశమే లేదని అర్థమైంది. ఇంత సులభంగా తమ చేతికి దొరుకుతుంది అని అస్సలు ఊహించకపోవడం తో ఆ రౌడీలు అందరూ నవ్వుతున్నారు. అది చూసి సుజిత భయపడుతూ నుంచుంది.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#63
ఏజెంట్ రూహి వాసుదేవ్...28



రూహి బృందం నార్త్ కొరియా నుంచి చైనా బోర్డర్ దాకా వచ్చారు. అక్కడ వారికి మొదటగా ఓ పెద్ద గోడ అడ్డుగా కనిపించింది. దాన్ని తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నించి దాటారు. ఆ తరువాత కరెంట్ కంచె కూడా దాటారు. చివరికి వారు చైనా సైనికుల క్యాంపు దగ్గరకు చేరుకున్నారు.

అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అంటే ఆ క్యాంపు దాటక తప్పదు. కాని ఆ క్యాంపు లో సుమారు 50 మంది దాకా చైనా సైనికులు ఉన్నారు. రూహి బృందంలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. పైగా అంతమందిని ఎదురించే ఆయుధాలు కూడా వీరి వద్ద లేవు. ఇప్పుడు ఎలా వారిని దాటాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు.

సరిగ్గా అదే సమయంలో ఓ తుపాకీ వచ్చి రూహి తలకు ఎక్కు పెట్టింది. అందరూ ఉలిక్కి పడి వెనక్కి తిరిగారు. ఎదురుగా ముసుగు మనిషి...
అతను మరెవరో కాదు. రూహి బృందాన్ని ఇండియా లో విమానం ఎక్కినప్పటి నుంచి వెంబడిస్తున్న మనిషి..

వంశీ, పార్వతి ముందుకు రావాలని చూసారు. రూహి తన చేతి సైగ తో వద్దని వారించింది.

ఇంతలో ముసుగు వ్యక్తి
"రూహి... ఈరోజు తో నీ ఆట కట్టు..." అని పలికాడు.

"నా ఆట కట్టించే ప్రాణం ఈ భూమి మీదకు రావడానికి ధైర్యం చాలక బ్రహ్మ దగ్గరే ఆగిపోయి ఉంటుంది. " అని రూహి సమాధానం ఇచ్చింది.

"ఎదురుగా మృత్యువు నిలబడ్డా సరే నీ పొగరు ఏ మాత్రం తగ్గలేదు."

"పొగరనేది నేను వేసుకునే బట్టల్లో కాదు, నా రక్తం లో ఉంది. అది ఎప్పటికీ పోదు."

"నా వెనుక చాలా మంది ఉన్నారు."

"కౌరవులు వంద మంది. పాండవులు ఐదుగురే... కాని విజయం ఎవరిని వరించిందో మరోసారి గుర్తుచేయాలా..."

"ఆ పాండవుల వెనుక శ్రీ కృష్ణుడు ఉన్నాడు. అందుకే గెలిచారు. మీ వెనుక ఎవరున్నారు."

"ఆ త్రివర్ణ పతాకం... అది ఒక్కటి చాలు. ఎంతమంది ఎదురుగా నిలబడినా వెన్ను విరిచి ధైర్యంగా నిలబడడానికి... కాదంటావా... మిస్టర్ అమిర్."

ఆ మాటకు ముసుగు మనిషి ఆశ్చర్యపోయి తన మొహానికి ఉన్న మాస్క్ తొలిగించాడు. ఎదురుగా రూహి నవ్వుతూ నిలబడింది. అమిర్ పరుగున వచ్చి రూహి ని కౌగిలించుకున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక పార్వతి, వంశీ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.

కాసేపటికి రూహి వారి వైపు తిరిగి...
"మా నాన్న విక్రమ్ వాసుదేవ్ బ్లాక్ కోబ్రా బృందం గురించి విన్నారు కదా.. అందులో అక్బర్, పల్లవి అని ఇద్దరు ఉండేవారు. వారు తీవ్రవాదుల చేతికి దొరికి ప్రాణాలు కోల్పోయారు. ఆ అక్బర్ కొడుకే ఈ అమిర్...
చిన్నప్పుడే ఆ మసూద్ ఖాన్ లాంటి కుక్కలకు ఖురాన్ గురించి సరైన అర్థం వివరించిన గొప్ప సైనికుడు.."

ఆ మాటకు అమిర్ నవ్వుతూ పార్వతి, వంశీ వైపు చూసి పలకరించాడు.

"మీరు ఇక్కడికి ఎలా వచ్చారు." అని వంశీ ఆశ్చర్యంగా అడిగాడు.

"మీకు తెలిసి మీ బృందం లో ఉన్నది నలుగురే.. కాని మీకు తెలియని ఆ ఐదో ఏజెంట్ నేనే...
మీరు నార్త్ కొరియా బయలుదేరినప్పుడే.. ఇది చాలా ప్రమాదకర ఆపరేషన్ అని అర్థమైంది. అది కాక మన ప్రభుత్వం లోని కొంతమంది అవినీతి పరుల మూలంగా మీ సమాచారం శత్రువులకు చేరవచ్చు అని అనిపించింది.
అందుకే నేను రూహి కలిసి ఓ కొత్త ప్లాన్ వేసాం. అదే ముసుగు మనిషి వేషం..
మీకు తెలియకుండా నేను మీ వెనుకే వస్తున్నాను. నా గురించి ఇటు మన ప్రభుత్వానికి కాని, మన శత్రువులకు కాని తెలీదు.
ఎప్పటికప్పుడు నేను రూహి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు ఈ అడవి మార్గం ద్వారా చైనా వస్తున్నారు అని చెప్పినప్పుడు నేను కూడా మీతో పాటు రావాలని అనుకున్నాను. కాని రూహి వద్దు అని నన్ను ఆపేసింది.
నన్ను ఓ సాధారణ టూరిస్ట్ లాగా విమానం లో రమ్మని చెప్పింది. నేనెవరో మన శత్రువులకు తెలీదు కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదు. చైనా లో ఉన్న మన ఏజెంట్స్ ద్వారా బోర్డర్ చేరుకొని మీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఇంతలో మీరే వచ్చారు." అని అమిర్ అప్పటిదాకా జరిగింది మొత్తం వివరించాడు.

తమకు తెలియకుండా ఇంత జరిగిందా అని వంశీ, పార్వతి ఆశ్చర్యపోయారు. అలాగే రూహి ముందు చూపు ను మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

ఇంతలో...
"అయాన్ ఎక్కడ" అని అమిర్ అడిగాడు.

అయాన్ పేరు వినగానే రూహి గుండెను ఎవరో మెలిపెట్టినట్టు అయ్యింది. తన రూపం కళ్ళ ముందు మెదిలి కన్నీటి వర్షం మొదలయింది. అడుగులు తడబడ్డాయి. నిలబడలేక పక్కనే ఉన్న రాయి మీద కూర్చుంది.

ఈలోగా వంశీ జరిగింది మొత్తం అమిర్ కి చెప్పాడు. తనకు కూడా చాలా బాధగా అనిపించింది. కాసేపు అందరూ అలాగే మౌనంగా ఉండిపోయారు.

ఇంతలో అమిర్ జేబులో నుంచి బీప్ అనే శబ్దం వచ్చింది. అందరూ తల తిప్పి అటు వైపు చూసారు. అమిర్ ఒక శ్యాటిలైట్ ఫోన్ బయటకు తీసాడు. అది రింగ్ అవుతుంది.
ఎత్తి హలో అన్నాడు. కాసేపు మాట్లాడిన తరువాత ఫోన్ రూహి కి అందించాడు.

అటు వైపు నుంచి ఓ గంభీరమైన గొంతు వినిపించింది.
"హలో ఏజెంట్ రూహి వాసుదేవ్..."

ఆ గొంతు వినగానే అది మన భారత దేశ ప్రధాన మంత్రిది అని అర్థమైంది.

"హలో సార్..." అని రూహి పలకరించింది.

"రేపే మన స్వాతంత్ర దినోత్సవం... స్వేచ్ఛగా రెప రెప లాడే మన జెండా మీద నెత్తుటి వర్షం కురవదనే నమ్ముతున్నాను.
ప్రాణాలకు తెగించి మీరు చేస్తున్న పోరాటం మన దేశ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. కొన్ని కోట్ల మంది ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఈ ఆపరేషన్ లో తప్పక విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను." అని పలికాడు.

"తప్పకుండా సార్... మా ప్రాణాలు పణంగా పెట్టి అయినా సరే ఆ విధ్వంసం ఆపుతాను." అని రూహి ధైర్యంగా పలికింది.

"ప్రజలందరూ దేశానికి రుణపడి ఉంటామని అంటారు. కాని అప్పుడప్పుడు మీ తెగింపు, ధైర్యం చూసి ఈ దేశం మాత్రం మీ కుటుంబానికి రుణ పడి ఉందేమో అనిపిస్తుంది.
ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ రూహి..."

"థాంక్ యు సార్..." అని రూహి చెప్పింది.

ఫోన్ పెట్టేసాక రూహి తన బృందం వైపు తిరిగింది.
"మన దగ్గర ఎక్కువ సమయం లేదు. త్వరగా మనం వచ్చిన పని పూర్తి చేయాలి." అని చెప్పింది. వంశీ, పార్వతి సరే అన్నట్టు తల ఊపారు.

తరువాత అమిర్ వంక తిరిగి...
"ఇప్పుడు ఆ చైనా సైనికులను దాటి అటు వైపు వెళ్లడం ఎలా " అని అడిగింది.

"దానికి మన దగ్గర ఒక దారి ఉంది. అదే రహస్య మార్గం..." అని సమాధానం ఇచ్చాడు.

"రహస్య మార్గమా..." అని అందరూ ఆశ్చర్యంగా అడిగారు.

అమిర్ నవ్వుతూ వారు నుంచున్న చోటు నుంచి ఉత్తర దిక్కుకు నడిచాడు. కొంచెం దూరం వెళ్లిన తరువాత అక్కడొక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి జారిన ఊడల్లో నుంచి ఒక చిన్న తీగ లాంటిది ఉంటే దాన్ని లాగాడు. తరువాత తన జేబులో నుంచి ఒక రిమోట్ తీసి నొక్కాడు. అంతే...
ఆ మర్రి చెట్టు మొదట్లో కీర్ మంటూ శబ్దం చేస్తూ ఒక పెద్ద తొర్ర లాంటిది ఏర్పడింది. అందరూ అది చూసి నోరు వెళ్ళబెట్టారు.

"ఇది ఇక్కడ చైనాలో ఉన్నా మన ఏజెంట్లు ఏర్పాటు చేసింది. ఈరోజు మనకు ఉపయోగపడింది." అని అమిర్ సమాధానం ఇచ్చాడు.

ముందుగా తను లోపలకు వెళ్తే, ఆ తరువాత అందరూ అందులోకి అడుగు పెట్టారు. మొత్తం చీకటిగా ఉంది. ఏమి కనిపించడం లేదు. అందరూ ఆ చెట్టు లోపలకు వచ్చాక, అమిర్ మరోసారి తన చేతిలో ఉన్న రిమోట్ నొక్కాడు. ఈసారి ఆ చెట్టు తొర్ర మరోసారి మూసుకుంది. బయట నుంచి చూస్తే చెట్టు తప్ప ఇంకేమి కనిపించదు. ఎవరికైనా అనుమానం వచ్చే అవకాశం కూడా లేదు. అంత పక్కడ్బందీ గా దాన్ని నిర్మించారు.

ఆ చెట్టు తొర్ర మూసుకున్న తరువాత అమిర్ పక్కనే ఉన్న ఒక మీట ను నొక్కాడు. అప్పటిదాకా కటిక చీకటి అలుముకున్న ఆ చోటు మొత్తం విద్యుత్ దీపాలతో వెలిగింది. అందరూ మెల్లగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదిలారు.

అది ఓ సొరంగ మార్గం అని అర్థమైంది. మట్టి కిందకు పడకుండా సిమెంట్ తో నిర్మించారు. దారి కనపడటం కోసం లైట్లు అమర్చారు. దానికి కావాల్సిన విద్యుత్ కూడా సూర్య రశ్మి నుంచి వచ్చేలా ఏర్పరిచారు. ఆ సోలార్ ప్లేట్స్ ఎవరికీ కనిపించకుండా చెట్టు ఆకులు మాదిరి తయారు చేసి ఆ దారిలో అక్కడక్కడా ఉన్న పెద్ద చెట్ల కొమ్మల్లో ఏర్పాటు చేసారు. ఒకవేళ శత్రువులు ఎవరైనా అందులోకి దిగితే వారిని అంతమోందించడానికి దారిలో అక్కడక్కడా బాంబు లు కూడా పెట్టారు.

ఈ సొరంగ మార్గం నిర్మించిన వారికి రూహి బృందం మనసులోనే కృతజ్ఞతలు చెప్పింది. అలాగే నడుస్తూ వెళ్తున్నారు. ఒక మూడు కిలోమీటర్లు నడిచిన తరువాత ఆ సొరంగ మార్గం ఒక చోట ఆగిపోయింది.

అక్కడ ఒక చిన్న నిచ్చెన లాంటిది ఉంది. అందరూ దాన్ని పట్టుకొని పైకి ఎక్కారు. అక్కడ ఒక చిన్న తలుపు లాంటిది ఉంది. అమిర్ రిమోట్ నొక్కిన తరువాత అది తెరుచుకుంది. ఆ తలుపు ద్వారా ఆ సొరంగ మార్గం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చాక చుట్టూ చూస్తే అది ఒక పాడుబడిన భవనం అని అర్థమైంది.

బోర్డర్ దగ్గర ఉన్న చైనా సైనికుల స్థావరం నుంచి చాలా దూరం వచ్చేసామని రూహి కి అర్థమైంది. అమిర్ ఆ భవనం పక్కనే చెట్టు పొదల్లో దాచిన తన కారు బయటకు తీసాడు. అందరిని అందులో ఎక్కమని చెప్పాడు. తరువాత కారును వేగంగా పోనిచ్చాడు.

రూహి కిటికీ లో నుంచి బయటకు చూస్తుంది. తన ఆలోచనలు చాలా వేగంగా వెళ్తున్నాయి. అసలు చైనా పెట్టుకున్న ఈ ఆపరేషన్ FISH అంటే ఏంటో అర్థం కాలేదు. రేపు ఏం జరగబోతుందో అని కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకో ఒకసారి అమ్మతో మాట్లాడాలి అనిపించింది. అమిర్ దగ్గర ఉన్న శాటిలైట్ ఫోన్ నుంచి సుజిత కు ఫోన్ చేసింది. కాని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తను ఏమైనా ప్రమాదం లో ఉందా అనే ఆలోచన వచ్చింది. కాసేపటికి అనవసరంగా ఎక్కువ ఊహిస్తున్నాను. అమ్మకు ఏమి కాదు. ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది లే అని తనకు తను సర్దిచెప్పుకుంది.

ఇంతలో కారు ఒక చోట ఆగింది. అందరూ అమిర్ వంక చూసారు.

"ఇదే చైనా చేస్తున్న విధ్వంస రచన స్థావరం. ఇక్కడి నుంచి ఒక అర కిలోమీటర్ నడిస్తే అక్కడికి చేరుకుంటాం." అని చెప్పాడు.

అది వినగానే రూహి బృందం అలర్ట్ అయ్యారు. కారు దిగి తమ ఆయుధాలు చేత పట్టుకొని అటు వైపు నడవడం ప్రారంబించారు.

వీరి పోరాటం తుది అంకం కు చేరుకుంది. మరి విజయం ఎవరి వైపు నిలిచేనో కాలమే సమాధానం చెప్పాలి.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#64
ఏజెంట్ రూహి వాసుదేవ్...29



అమిర్ సాయం తో రూహి బృందం రహస్య సొరంగ మార్గం ద్వారా చైనాలో అడుగు పెట్టింది. అమిర్ కారును ఒక చోట ఆపాడు.

అక్కడి నుంచి చైనా రహస్యంగా నిర్వహిస్తున్న విధ్వంస ప్రదేశాన్ని చేరుకోడానికి మరో అర కిలోమీటర్ దూరం మాత్రమే ఉందని చెప్పాడు. కారులో వెళ్తే శత్రువులకు దొరికిపోయే అవకాశం ఎక్కువ. అందుకే దిగి నడుద్దామని అమిర్ సూచించాడు. దానికి రూహి కూడా ఒప్పుకుంది. కారుని ఆ పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో దాచేశారు. తరువాత ఒక్కో అడుగు వేస్తూ అమిర్ చెప్పిన వైపు నడిచారు.

నిజానికి వారు నార్త్ కొరియా వెళ్ళింది చైనా భారత దేశం మీద చేయబోయే దాడి గురించి తెలుసుకోడానికి...
కాని చిత్రంగా అక్కడ కేవలం విధ్వంసం చేయడానికి కావాల్సిన కెమికల్స్ మాత్రమే తయారు చేసి వాటిని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే చైనా లో అంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలకు సంబంధించిన పరిశోధనలు చేస్తే మన గుడాచారులకు తప్పక తెలుస్తుంది. అదే జరిగితే చైనా అంతర్జాతీయ సమాజం ముందు తన తప్పును దాచుకోలేక దోషి గా నిలబడాల్సి వస్తుంది. అందుకే చాలా తెలివిగా ఈ పనికి తన స్నేహ దేశమైన నార్త్ కొరియా ను వాడుకుంది.

కాని రూహి బృందం నార్త్ కొరియా లో వారి పరిశోధనకు సంబంధించిన అన్ని ఆధారాలు సంపాదించింది. కాని వాటితో ఏమి చేయబోతున్నారో తెలుసుకోలేకపోయారు. అది కనిపెట్టడానికే ఇప్పుడు ఈ చైనా వచ్చారు.

రూహి బృందం ఆయుధాలు చేత పట్టుకొని ఒక్కో అడుగు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. ఎటు వైపు నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదురుకునేలా అప్రమత్తంగా ఉన్నారు.
అడుగులు సాగే కొద్ది భరించలేని దుర్గంధం వారి ముక్కులను చేరింది. కడుపులో వాంతి వచ్చినట్టు అనిపించింది. ముక్కు మూసుకొని ఒక్కో అడుగు వేస్తున్నారు.

ఇంతలో ఏదో వాహనం వారి వైపు వస్తున్న శబ్దం రావడం తో అందరూ వేగంగా పక్కనే ఉన్న పొదల్లో దాక్కున్నారు. చూస్తూ ఉండగానే ఒక వ్యాన్ లాంటి వాహనం వారి వైపు వచ్చి కాస్త దూరం లో ఆగింది.

అందరూ ఊపిరి బిగబట్టి ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. ఇంతలో వ్యాన్ లో నుంచి కొంతమంది చైనా సైనికులు కిందకు దిగారు. వారి చేతుల్లో అత్యాధునికమైన ఆయుధాలు ఉన్నాయి. వారు దిగిన తరువాత ఆ వ్యాన్ లో నుంచి కొన్ని డ్రమ్ములు కిందకు దింపారు. వాటిని ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న మైదానం లాంటి ప్రాంతానికి వెళ్తున్నారు.

అందులో ఏముందా అని రూహి బృందం ఆసక్తిగా చూస్తుంది. ఆ మైదానం దగ్గరకు చేరుకున్నాక ఆ డ్రమ్ములు ఒక్కొక్కటి గుమ్మరించారు. అందులో ఉన్నది చూసాక అందరి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. వారి కళ్ళను వారే నమ్మలేకపోయారు. ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. అంతకంటే భయంకరమైన దృశ్యం మరొకటి చూస్తారని కలలో కూడా అనుకోలేదు.

ఆ డ్రమ్ములలో మనుషుల అవయవాలు ఉన్నాయి. చేతులు, కాళ్ళు, తల ఇలా ఒక్కో భాగం విడి విడిగా నరికి... ఆ డ్రమ్ములో కుక్కి తీసుకొని వచ్చారు. అందులో నుంచి ఎర్రని రక్తం చిమ్మింది. ఆ రక్తం తో తడిచిన ఆ అవయవాలు చూస్తుంటే వారి గుండెల్లో వణుకు పుట్టింది.

పార్వతి తట్టుకోలేక భయ పడుతూ చిన్నగా అరిచింది. వంశీ వెంటనే తన నోరు మూసేసాడు. ఏదో శబ్దం రావడం తో ఓ సైనికుడు తల తిప్పి రూహి వాళ్ళు దాక్కున్న వైపు అనుమానంగా చూసాడు. ఇంతలో మరో సైనికుడు వచ్చి పనిని త్వరగా ముగించమని చెప్పడం తో మొదటి సైనికుడు ఆ విషయం మర్చిపోయి తన పనిలో పడిపోయాడు. రూహి ఊపిరి పీల్చుకుంది. పొరపాటున వారికి అనుమానం వచ్చి ఉంటే వారు చాలా ప్రమాదం లో పడిపోయేవారు అని అనిపించింది.

వీరు ఆ అవయవాలను చూసి భయపడిపోయినా...
ఆ చైనా సైనికులకి ఇదంతా చాలా సాధారణ విషయం అన్నట్టు... ఆ శరీర భాగాల మీద తమ వెంట తెచ్చిన పెట్రోల్ చల్లారు. తరువాత వాటికి నిప్పు అంటించారు. చూస్తు ఉండగానే ఆ మంటలు వేగంగా వ్యాపించాయి.

కాసేపటికి మొత్తం కాలిపోయి బూడిద అయ్యాక ఆ సైనికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు అలా వెళ్ళిపోయాక అప్పటిదాకా ఆపుకున్న పార్వతి పరుగున పక్కకు వెళ్లి వాంతి చేసుకుంది. అందరి పరిస్థితి అలాగే ఉంది. మనుషులను ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో తెచ్చి కాల్చడం ఏంటి.. ఊహిస్తుంటేనే వారి వెన్నులో వణుకు పుట్టింది.

అందరూ అలా నిలబడి ఉండగానే రూహి వారు కాల్చిన చోటు కు వెళ్లి కాసేపు తీక్షణంగా చుట్టూ గమనించి వచ్చింది.

"ఏంటి మేడం ఇది... మనుషులను ఇంత దారుణంగా చంపారు. వారు అసలు మనుషులా? లేక రాక్షసులా? "అని వంశీ ఆవేశంగా అన్నాడు.

"వారు చేస్తున్న తప్పు కప్పిపుచ్చుకోవాలి కదా..."

రూహి మాట అందరిలో ఆశ్చర్యం కలిగించింది. అందరి వంక చూస్తూ ఇలా అంది.

"అవును మీరు విన్నది నిజమే... ఇలాంటి పేలుడు పదార్థాలు తో పని చేసేటప్పుడు.. రేడియేషన్ మూలంగా అంతుచిక్కని వ్యాధులు వస్తు ఉంటాయి. వారిని ఆసుపత్రి కి తరిలిస్తే ఇక్కడ వీరు చేస్తున్న రహస్య విధ్వంసం అందరికీ తెలుస్తుంది అని భయం తో అలాంటి వారిని అంతమోందించి.. ఎవరికీ తెలియకుండా ఇలా కాల్చేస్తున్నారు. " అని రూహి అందరికీ అర్థమయ్యేలా చెప్పింది.

"ఇంతమంది ఉసురు తీస్తున్న చైనా కు ఆ పాపం అంటదంటారా...."

ఆ మాటకు రూహి నవ్వుతూ
"నువ్వు చదివిన చరిత్ర మొత్తం వెతుకు... ఈ ప్రపంచం గెలిచిన తలలను మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. ఆ గెలుపు చేరే దారిలో అన్యాయంగా నేలకు ఒరిగిన తలలను కాదు."

రూహి సమాధానం విని మిగతా అందరూ అవును అన్నట్టు తల ఊపారు.

"ఆ పేలుడు పదార్థం దగ్గర పని చేసిన వారి పరిస్థితే ఇలా ఉంటే..  ఆ పేలుడు మన దేశం లో జరిగితే మన ప్రజలకు ఎలాంటి దుస్థితి వస్తుందో మీరే ఊహించుకోండి. ఎలాగైనా సరే దాన్ని ఆపాలి. త్వరగా వెళ్దాం పదండి." అని రూహి అనడం తో అందరూ ఆ పొదలలో నుంచి బయటకు వచ్చి మరోసారి నడవడం మొదలుపెట్టారు.

అలా కొంత దూరం నడిచిన తరువాత ఓ ఫ్యాక్టరి లాంటిది కనిపించింది. దూరం నుంచి చూడగానే ఆ గేట్ దగ్గర సుమారు పది మంది సైనికులు కాపలా గా కనిపించారు. అందుకే ఆ ఫ్యాక్టరీ వెనుక వైపు నుంచి వెళ్లాలని అందరూ అటు కదిలారు. ఫ్యాక్టరీ వెనుక వైపు ఎలాంటి బందోబస్త్ లేదు.

ఇంతలో రూహి అందరిని ఎక్కడివారిని అక్కడే ఆగమని ఆదేశించింది. ఏం జరిగిందో తెలియక అందరూ కదలకుండా అలాగే నిలబడ్డారు.

"ఈ ప్రదేశం అత్యంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం చైనా కు ఉంది. అలాంటిది ఫ్యాక్టరీ వెనుక వైపు కాపలా గా ఒక్కరు కూడా లేరు అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. కాసేపు కదలకుండా అలాగే ఉండండి..." అని రూహి చుట్టూ పరిసరాలను గమనించింది.

అప్పుడే తన చూపు నేల మీద పడింది. తన అనుమానం నిజమైంది.
"ఒక్కసారి ఇటు చూడండి. ఆ చైనా సైనికుల అడుగులు  ఈ నేల మీద అక్కడక్కడా మాత్రమే ఉన్నాయి. చాలా చోట్ల ఎలాంటి అడుగుల గుర్తులు లేవు. పైగా ఆ అడుగులు లేని చోట నేల తవ్వి ముసినట్టు అనిపిస్తుంది. అంటే అక్కడ ల్యాండ్ మైన్స్ పెట్టి ఉండాలి. వాటి మీద అడుగు వేస్తె మనమందరం క్షణం లో బూడిద అవుతాం..."

రూహి ముందు చూపును, సూక్ష్మ బుద్దిని బృందం మొత్తం మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయారు.

"మరి ఇప్పుడు ఎలా మేడం..." అని వంశీ కంగారుగా అడిగాడు.

"ఈ నేల మీద ఆ చైనా సైనికుల అడుగుల గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటి మీద మాత్రమే నడుస్తూ ముందుకు వెళ్దాం..." అని రూహి అలాగే నడవడం మొదలుపెట్టింది. తన వెనుకే మిగతా బృందం కూడా...
అందరూ ఒక్కో అడుగు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు.

అలా చివరకు ఫ్యాక్టరీ వెనుకనున్న గోడను చేరుకున్నారు. అమిర్ దగ్గర ఉన్న తాడు కు S ఆకారం లో ఉండే ఒక ఇనుప చువ్వ ను తగిలించి ఆ గోడ పైకి విసిరింది. కొన్ని ప్రయత్నాల తరువాత అది పైనున్న కొక్కానికి తగిలి నిలిచింది.

రూహి ముందుగా ఆ తాడు పట్టుకొని పైకి పాకింది. ఆ ఫ్యాక్టరీ లోపల కూడా వెనుక వైపు గుబురుగా గడ్డి ఉండడం తో ఎవరూ కాపలా గా లేరు. అదే వీరికి కలిసి వచ్చింది. రూహి లోపలకు దూకింది. తన వెనుకే మిగతా బృందం కూడా తాడు సాయం తో లోపలకు చేరుకున్నారు.

ఆ ఫ్యాక్టరీ లో చాలా షెడ్డులు లాంటివి నిర్మించి ఉన్నాయి. ఒక్కో దాన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే ఇక్కడి నుంచి బృందం మొత్తం రెండు జట్లుగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పార్వతి, వంశీ ఒక వైపుకు వెళ్తే... రూహి, అమిర్ మరో వైపుకు అడుగు వేశారు.

వెళ్లే ముందు రూహి వారితో ఓ మాట చెప్పింది.
"ఓ ప్రాణం పోయాడానికి తొమ్మిది నెలలు పడుతుంది. కాని ఆధిపత్యం కోసం క్షణాల్లో ఆ ప్రాణం తీయాలని చూస్తున్న ఈ శత్రువుల కలను నేడు మనం కూల్చబోతున్నాం. దానికోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిద్దాం... వందేమాతరం..."

ఆ మాటలు పంచిన స్ఫూర్తి తో వంశీ, పార్వతి ఒక వైపుకు వెళ్లారు. మరోవైపు రూహి, అమిర్ ఒక షెడ్డు దగ్గర కు చేరుకున్నారు. దాని ముందు ఇద్దరు సైనికులు కాపలాగా ఉన్నారు. ఒకసారి చుట్టూ చూసారు. ఇంకెవరూ కనిపించలేదు. ఇంతకంటే మంచి అవకాశం లేదని... రూహి, అయాన్ ఒకేసారి వారి ఇద్దరి మీద దాడి చేసారు. వారు నోరు తెరిచేలోగా వారి మెడ నరం మీద బలంగా కొట్టారు. గుండెకు ఓ క్షణం రక్త ప్రసరణ ఆగడం తో అలాగే స్పృహ తప్పి పడిపోయారు. రూహి, అమిర్ ఆ ఇద్దరిని అలాగే ఆ షెడ్డు లోపలకు లాగేసి ఒక మూలన దాచారు. ఆ షెడ్డులో చాలా ఆయుధాలు ఉన్నాయి. వాటిని చూసి ఇద్దరూ కాసేపు షాక్ అయ్యారు. ఇన్ని ఆయుధాలు ఉన్నాయంటే చాలా ఎక్కువ మందే ఇక్కడ ఉన్నారని అర్థమైంది.

ఇద్దరూ వెంటనే స్పృహ తప్పిన చైనా సైనికుల దుస్తులు వేసుకున్నారు. వారిలో కలిసిపోయి వారి రహస్యాలు తెలుసుకోవాలని.... ఎవరికీ అనుమానం రాకుండా ధైర్యంగా నడిచారు. మిగతా చైనా సైనికులకు మోహం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

సరిగ్గా అప్పుడే రూహి చూపు అక్కడే ఉన్న ఒక లైట్ టవర్ మీద పడింది. దాని పైకి ఎక్కితే ఇక్కడ ఏం జరుగుతుందో ఓ అంచనా వస్తుంది అని అనిపించింది. అనుకున్నదే తడువుగా తన అడుగులు అటు వైపుకు కదిలాయి. వారు కూడా చైనా సైనికుల దుస్తుల్లో ఉండటం తో ఎవరికీ ఎలాంటి అనుమానం రావడం లేదు.

కాసేపటికి రూహి, అమిర్ ఇద్దరూ ఆ టవర్ పైకి చేరుకొని తమ ఎదురుగా చూసి షాక్ అయ్యారు. వారి ఎదురుగా ఓ పెద్ద అణుబాంబు లాంటిది కనిపించింది. అది మరికొద్ది సమయంలో పేల్చడానికి సిద్ధం చేస్తున్నట్టు అనిపించింది. అంత పెద్ద బాంబు ను చూసి ఇద్దరికీ నోట మాట రాలేదు.

"ఏంటి మేడం ఇది... ఇంత పెద్ద బాంబా " అని అమిర్ భయంగా పలికాడు.

"ఈ బాంబ్ తో మన దేశం లోని ఒక నగరం మొత్తం నామరూపాలు లేకుండా చేయచ్చు. ఓ నగరం అంటే ఎన్ని ప్రాణాలో ఊహించడానికే కష్టంగా ఉంది " అని రూహి చెప్పింది. తన నుదుటి మీద నుంచి చమట జారింది. గుండె వేగం పెరిగింది.

ఇంతలో అమిర్..
"మేడం ఒక్కసారి మన చుట్టూ చూడండి " అని చెప్పాడు.

ఆ మాటకు రూహి ఒక్కసారి చుట్టూ చూసి కాసేపు భయం తో అలాగే బిగుసుకుపోయింది. తన గుండె స్పందించడం ఆగిపోయింది. కాళ్ళు నిలబడలేకపోయాయి. ఊపిరి తీయడం కూడా మరిచింది.

వారి చుట్టూ... మొత్తం అలాంటివి ఐదు బాంబులు ఉన్నాయి.

వాటితో ఐదు నగరాలని నాశనం చేయచ్చు. అదే జరిగితే చరిత్ర ఎన్నడూ చూడని విధ్వంసం ఇది. కలలో కూడా ఊహించని కల్లోలం మన దేశం మీద జరగనుంది. ఆ ఊహకే రూహి గుండె ఓ క్షణం పాటు ఆగింది.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#65
ఏజెంట్ రూహి వాసుదేవ్...30



రూహి చైనా సైనికుల దుస్తులు వేసుకొని వారిలో కలిసిపోయి ఆ ఫ్యాక్టరీ లో ఉన్న లైట్ టవర్ ఎక్కింది. అక్కడి నుంచి తనకు ఎదురుగా ఒక పెద్ద అణుబాంబు లాంటిది కనిపించింది. దానితో ఒక నగరాన్ని మొత్తం నామరూపాలు లేకుండా చేయచ్చు అని తెలిసి తన గుండె ఆగినంత పనైంది. ఊపిరి వేగంగా మారింది.

సరిగ్గా అప్పుడే అమిర్, ఒకసారి ఇటు చూడండి మేడం అని పిలవడం తో రూహి తల తిప్పి చుట్టూ చూసింది. అక్కడ మొత్తం అలాంటి బాంబులు ఐదు ఉన్నాయి. వాటితో ఐదు నగరాలని నేల కూల్చచ్చు. అదే జరిగితే చరిత్రలో ఎవరూ చూడని విధ్వంసం మన భారత దేశం మీద జరుగుతుంది. ఊహిస్తుంటేనే రూహి గుండె వేగం రెట్టింపు అయ్యింది. తన ఒళ్ళంతా చమటలు పట్టాయి.

తర్వాత ఆ ఐదు బాంబులను తీక్షణంగా గమనించింది. తన అనుమానం నిజం చేస్తూ వాటిలో ఒక్కో బాంబు మీద ఒక్కో పేరు ఉంది. వాటి పేర్లు BLR, HYD, DEL, BOM, KOL
ఆ పేర్లను పరిశీలించిన తరువాత రూహి షాక్ అయ్యి అలా నిలబడిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయింది.

ఇంతలో...
"మేడం... ఆ పేర్లకు అర్థం నేను ఊహిస్తున్నదే నా..." అని అమిర్ అనుమానంగా అడిగాడు.

"అదే అమిర్... బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా... ఈ ఐదు నగరాల మీద ఈ ఐదు బాంబులు ప్రయోగిస్తున్నారు."

"మన దేశం లో ఆ ఐదు చాలా ముఖ్యమైన ప్రముఖ నగరాలు. పొరపాటున ఈ అణుబాంబు లు వాటి మీద ప్రయోగిస్తే... అసలు ఊహించడానికే కష్టంగా ఉంది. దేశం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. మన దేశం లో పెట్టుబడులు పెట్టడానికి ఇంకెవరూ రారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాం. అభివృద్ధి లో కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోతాం. అన్నిటికీ మించి కొన్ని కోట్ల మంది భారతీయుల ప్రాణాలు పోతాయి. మరెంతోమంది ఆప్తులను కోల్పోతారు. మన నేల రక్తం తో తడుస్తుంది" అని అమిర్ తడబడుతూ చెప్పాడు.

"నేను ప్రాణాలతో ఉండగా అలా జరగనివ్వను అమిర్.
శత్రువులు మనం హిమాలయాల పక్కనే ఉంటాం... అందులో మంచులా మన భారతీయులు కూడా ఎప్పుడూ చల్లగా ఉంటామని అనుకుంటున్నారు.
కాని సునామి సృష్టించే సముద్రాలు కూడా మన పక్కనే ఉంటాయని వారు మరిచారేమో...
ఆ సంగతి మరోసారి చాటి చెప్పే సమయం ఆసన్నమైంది. ఒక్క రక్తపు బొట్టు కూడా మన నేల మీద పడకుండా కాపాడుకుందాం. " అని రూహి దృడంగా పలికింది.

"మనకు కేవలం ఈ బాంబులు గురించి మాత్రమే తెలుసు. వాటిని ఎప్పుడు ఎలా ప్రయోగించునున్నారో తెలీదు. అసలు ఈ ఆపరేషన్ FISH అంటే కూడా పూర్తిగా తెలీదు. అలాంటప్పుడు దాన్ని ఎలా ఆపగలం మేడం." అని అమిర్ సందేహంగా అడిగాడు.

"దానికి ఒకటే దారి..." రూహి స్పష్టంగా చెప్పింది.

"ఏంటి మేడం అది..."

రూహి ఆ లైట్ హౌస్ నుంచి తన చూపుడు వేలితో ఒక వైపు చూపించింది. అది ఆ చైనా మిలిటరీ చీఫ్ జిన్ పింగ్ ఆఫీస్.
అమిర్ ఆశ్చర్యంగా చూసాడు.

"అవును అమిర్... మనం వాడిని బందించగలిగితే ఈ ఆపరేషన్ కి సంబందించిన వివరాలు తెలుసుకోగలం."

"కాని అది చాలా ప్రమాదకరం మేడం. ఏ మాత్రం మనం దొరికినా మన ప్రాణాలు తీసేస్తారు."

"నన్ను చేరడానికి సరిపోయేంత ధైర్యం మృత్యువు దగ్గర లేదు లే అమిర్...." అని రూహి దృడంగా చెప్పింది.

రూహి మరోసారి జిన్ పింగ్ ఆఫీస్ వైపు చూసింది. దాని ముందు ఒక పది మంది సైనికులు కాపలాగా ఉన్నారు. వారిని దాటి లోపలకు వెళ్లడం దాదాపు అసాధ్యం.  వారి దాకా వెళ్తే వీరి వేషం బయటపడి దొరికిపోవడం కూడా ఖాయం. అందుకే ఏం చేయాలా అని రూహి ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది.

వెంటనే ఏం చేయాలో అమిర్ కి చెప్పింది. అమిర్ అర్థమైంది అన్నట్టు తల ఊపాడు. అక్కడి నుంచి కిందకు దిగుతూ రూహి వైపు తిరిగి...
"జాగ్రత్త మేడం.." అని చెప్పాడు.

"గెలిస్తే మన దేశపు నేల మీద కలుద్దాం. ఓడితే అదే నేల లోపల కలుద్దాం." అని రూహి నవ్వుతూ చెప్పింది.

అమిర్ కూడా నవ్వుతూ సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రూహి ఆ లైట్ హౌస్ మీద సిద్ధంగా ఉంది.
తన వెంట తెచ్చిన బ్యాగ్ లో నుంచి రోప్ గన్ బయటకు తీసి చేతిలో పట్టుకుంది. సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది.

ఇంతలో తను చెప్పినట్టుగానే జిన్ పింగ్ ఆఫీస్ కి వ్యతిరేక దిశలో ఉన్నట్టుండి కాల్పులు మొదలయ్యాయి. అది మొదలుపెట్టింది అమిర్ అని తనకు బాగా తెలుసు. ఆ కాల్పులు వినగానే చాలా మంది సైనికులు అక్కడ ఏం జరిగిందో అని అటు వైపు కదిలారు.

అందరి దృష్టి అటు వైపే ఉండటం తో రూహి తన పని మొదలుపెట్టింది. తన చేతిలో ఉన్న గన్ తో జిన్ పింగ్ ఆఫీస్ వెనుక ఉన్న చెట్టు మీదకు కాల్చింది. ఒక తాడు వెళ్లి ఆ చెట్టులో చిక్కుకుంది. ఇంకో చివరను లైట్ హౌస్ కి కట్టింది. రూహి వెంటనే తన బెల్ట్ తీసి ఆ తాడుకు వేసి జారింది.

సైనికులు అందరూ ఆ కాల్పులు వస్తున్న వైపు చూస్తూ ఉండటం తో రూహి ని ఎవరూ గమనించలేదు. అదే అదునుగా రూహి జారుకుంటూ జిన్ పింగ్ ఆఫీస్ బిల్డింగ్ పైకి చేరుకుంది.

అక్కడున్న తలుపు తెరిచి లోపలకు అడుగు పెట్టింది. అంత సెక్యూరిటీ దాటి లోపలకు ఎవరు వస్తారులే అనే ధైర్యమేమో... ఆ ఆఫీస్ లోపల ఎలాంటి సెక్యూరిటీ లేదు. రూహి శబ్దం రాకూడదు అని తన కాళ్లకు ఉన్న షూస్ తీసేసి అడుగులో అడుగు వేసుకుంటూ నడిచింది.
తన చేతిలోని తుపాకీ ఎవరైనా శత్రువు వస్తే అతని గుండెల్లో తూటా దింపడానికి సిద్ధంగా ఉంది. తన కళ్లు చురుకుగా చుట్టూ గమనిస్తున్నాయి.

అలా నడుస్తూ ఓ పెద్ద హాల్ లాంటి గదికి చేరుకుంది. ఆ గది మధ్యలో మన భారతదేశపు చిత్రపటం ఉంది. అందులో వారు బాంబులు పెల్చాలి అనుకుంటున్న ఐదు నగరాలు ఉన్న చోటులను కత్తులతో గుచ్చారు. అది చూడగానే రూహి రక్తం మరిగిపోయింది. అలా చూస్తూ ఉండగానే వెనుక నుంచి ఓ చెయ్యి తన మీద పడింది. టక్కున తల తిప్పి చూసింది. ఎదురుగా జిన్ పింగ్...

అతను తన ఎదురుగా చైనా సైనికుడు ఉన్నాడని అనుకున్నాడు. కాని రూహి మోహం చూడగానే తన ఎవరో అర్థమై అతని కళ్లు ఆశ్చర్యం తో పెద్దవి అయ్యాయి. వెంటనే తుపాకీ తో తనని కాల్చాలని అనుకున్నాడు. కాని రూహి తనకు ఆ అవకాశం ఇవ్వలేదు. వేగంగా తన చేతిలోని తుపాకీ తీసి అతని తలకు గురి పెట్టింది. జిన్ పింగ్ తన చేతులు రెండు పైకి ఎత్తి లొంగిపోయాడు.

రూహి వెంటనే తనని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోమన్నట్టు సైగ చేసింది. అతను అలాగే చేశాడు. రూహి తాడు తో తన కాళ్ళు చేతులు కట్టేసింది. అతని ముందు కూర్చొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది. జిన్ పింగ్ మోహం లో కోపం, భయం రెండు ఉన్నాయి.

"నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావ్. ఈ పాటికే నిన్ను మావాళ్లు చంపేసి ఉంటారని అనుకున్నాను." అని ఆవేశంగా అరిచాడు.

ఆ మాటకు రూహి నవ్వుతూ...
"నన్ను కత్తులతో పొడవాలని చూస్తే గాలిలా మారుతా...
తుపాకీలతో కాల్చాలని చూస్తే నీరులా మారుతా...
నన్ను చంపే ఆయుధం ఇంకా ఆ దేవుడు తయారు చేయలేదు.. అయినా నీ లాంటి లుచ్చా గాళ్ళ చేతిలో చావడానికి నేనేవరో మర్చిపోయావా... ఏజెంట్ రూహి వాసుదేవ్ D/O ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్..."

"నీ ధైర్యం గురించి విన్నాను. కావాలంటే నీకొక అవకాశం ఇస్తాను. మా దేశం లోని సైన్యం లో కలవు.. నీకు ఏం కావాలంటే అది ఇస్తాము."

"నీ దేశం ముందు తల దించి వంద సంవత్సరాలు బ్రతకడం కంటే, నా దేశం కోసం తల ఎత్తుకొని ఒక్క రోజు బ్రతికినా చాలు... నా నుంచి నా దేశాన్ని ఎవరూ వేరు చేయలేరు " రూహి స్పష్టంగా చెప్పింది.

ఆ మాటకు జిన్ పింగ్ నవ్వుతూ...
"రూహి, నువ్వు ఇక్కడికి చాలా ఆలస్యం గా వచ్చావ్. విధ్వంసానికి మొత్తం పూర్తి అయ్యింది. ఈరోజు మీ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం. అందరూ ఆనందం లో సంబరాలు జరుపుకుంటున్నారు. కాని వారికి తెలియదు మరికాసేపట్లో రక్తపు వర్షం కురుస్తుందని....
అసలు ఆపరేషన్ FISH అంటే ఏంటో తెలుసా...
Five cities to Sack Hindustan...
అంటే ఇంకాసేపట్లో మేము ఈ బాంబు ప్రయోగించగానే... అవి మీ దేశం లోని ఐదు నగరాలను చేరుతాయి. ఆ నగరాలు అన్ని నామ రూపాలు లేకుండా పోతాయి. అప్పుడు మీరు సహాయం కోసం మా దగ్గర తల వంచి అడుక్కోవాలి. చైనా దయతో మీరు మా కాళ్ళ కింద చెప్పులా బ్రతుకుతారు." అని అన్నాడు.

ఆ మాట పూర్తి కాగానే రూహి రక్తం ఉబికే లావా లాగా ఎగసిపడింది. ఎగిరి వాడి గుండెల మీద తన్నింది. తనకోస్తున్న కోపానికి వాడి గుండెను చీల్చి ఆ రక్తం తాగాలని అనిపించింది.

"ఏమన్నవ్ రా.. నా దేశం నిన్ను అడుక్కోవాలా...
మా భారతీయులకు గుండెల్లో నుంచి రక్తం కారుతున్నా, అడుగులు తదబడినా, చివరకు మా ఎదురుగా మృత్యువే నిలబడినా... రొమ్ము విరిచి శత్రువుల పైకి దూకుతాం తప్ప... వెన్ను చూపడమన్నది మా రక్తం లోనే లేదు.
నేను ఉండగా ఇక్కడ ఒక్క ప్రాణం కూడా పోనివ్వను. " అంటూ ఆవేశంగా వాడి గుండెల్లో తుపాకీ తో బుల్లెట్ల వర్షం కురిపించింది.

సరిగ్గా అప్పుడే తన ముందున్న స్క్రీన్ వంక చూసింది. అక్కడ పార్వతి, వంశీ చైనా సైనికులకు చిక్కారు. అది చూడగానే రూహి షాక్ అయ్యి అలాగే నిలబడిపోయింది.
ఒకవైపు బాంబు ప్రయోగించడానికి ఎక్కువ సమయం లేదు. ఎలాగైనా ఆపాలి. మరోవైపు తనని నమ్మి వచ్చిన బృందం ఆపదలో ఉంది. అమిర్ ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో కూడా తెలీదు.

ఇంతలో జిన్ పింగ్ ని కాల్చినప్పుడు వచ్చిన శబ్దం తో బయట ఉన్న సైనికులు వేగంగా లోపలకు వచ్చి రూహి ని చుట్టు ముట్టారు.

ఆ క్షణం రూహి వాసుదేవ్ ఓ పెద్ద పద్మవ్యూహం లో చిక్కుకుంది. మరి ప్రాణాలతో బయటపడగలదా....?
[+] 5 users Like SivaSai's post
Like Reply
#66
ఏజెంట్ రూహి వాసుదేవ్...31



రూహి ప్రాణాలకు తెగించి జిన్ పింగ్ గదిలోకి చేరింది. అక్కడ వాడి ద్వారా అసలు ఆపరేషన్ FISH (Five Cities to Sack Hindustan ) అంటే ఏంటో అర్ధమైంది.
చైనా మన దేశం లోని హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై మరియు కొలకత్తా మీద బాంబు దాడి చేయాలని ప్లాన్ చేసారని తెలిసి షాక్ అయ్యింది. అదే జరిగితే మన దేశం పూర్తిగా పతనం వైపు అడుగులు వేస్తుంది. ఇక ఎప్పటికీ శత్రువుల గుప్పిట్లో ఉండిపోవాల్సి వస్తుంది.

ఎలాగైనా సరే ఆ వినాశనం ఆపాలి అని దృడంగా నిర్ణయించుకుంది. కాని ఇంతలో తనని చైనా సైనికులు చుట్టు ముట్టారు. అదే సమయంలో తనకెదురుగా ఉన్న కెమెరా స్క్రీన్ మీద వంశీ, పార్వతి శత్రువులకు చిక్కినట్టు కనిపించింది. రూహి కి ఏం చేయాలో అర్థం కాలేదు.

ఓ వైపు చుట్టు ముట్టిన శత్రువులు...
మరో వైపు ప్రమాదంలో తన బృందం...
అన్నిటికీ మించి మరి కొద్ది సేపట్లో చైనా ఇండియా మీద బాంబు ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది.
ఆ క్షణం రూహి ఓ పెద్ద పద్మవ్యూహం లో చిక్కుకుంది. ఎలా బయటపడాలో అర్థం కాలేదు.

ఇంతలో తనని చుట్టు ముట్టిన సైనికులలో నుంచి ఒకడు ముందుకు వచ్చి రూహి తలకు తుపాకీ గురి పెట్టాడు.

రూహి వాడి వంక కోపంగా చూసింది. వాడు నవ్వుతూ
"గుడ్ బాయ్ రూహి.." అని అంటూ ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు.

సరిగ్గా అప్పుడే ఓ తూటా వేగంగా వచ్చి వాడి తలలో నుంచి దూసుకొని వెళ్ళింది. ఆ చోటు మొత్తం రక్తం తో తడిచింది. అందరూ షాక్ అయ్యి తల తిప్పి చూసారు.

ఎదురుగా అమిర్... చైనా సైనికులు అందరూ తనని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. రూహి అదే అదునుగా పక్కనే ఉన్న తుపాకీ తన చేతిలోకి తీసుకుంది. రెప్ప పాటులో తన సత్తా ఏంటో చూపించింది. పక్కనే ఉన్న సోఫా వెనక్కి దూకి శత్రువుల మీదకు తుపాకీ ఎక్కు పెట్టింది.

ఒకవైపు రూహి, మరో వైపు అమిర్... చైనీయులకు ఏం జరుగుతుందో అర్థమవడానికి సమయం పట్టింది. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇద్దరూ అడవిలో ఆకలిగొన్న సింహాలు వేటాడినట్టు విరుచుకుపడ్డారు. ఒకరి తరువాత ఒకరు పిట్టాల్లా రాలిపోయారు. కళ్ళు ముసి తెరిచే లోగా చైనా సైనికులు అందరూ మట్టి కరిచారు.

అమిర్ వేగంగా రూహి దగ్గరకు వచ్చాడు.
"నీకేం కాలేదు కదా..." అని కంగారుగా అడిగాడు.

అలా అడుగుతున్నప్పుడు అమిర్ కళ్ళలో కన్నీళ్లు తిరగడం రూహి చూపు దాటి పోలేదు. ఎందుకో ఆశ్చర్యంగా అనిపించింది. దాన్ని ఆపుకుంటూ...

"నాకేం కాలేదు. మరి నీకు?" అని అడిగింది.

"నేను కూడా బాగానే ఉన్నాను మేడమ్." అని అమిర్ సమాధానం ఇచ్చాడు.

"అమిర్... ఆపరేషన్ FISH అంటే ఏంటో మొత్తం తెలిసింది. మరి కొద్దిసేపట్లో మన ఇండియా మీద బాంబు దాడి చేయబోతున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున మన దేశం లోని ఐదు నగరాలను రక్తం తో తడపనున్నారు. "

"అది మనకు తెలిసిందే కదా మేడం. కాని ఆపడం ఎలా?"

"ఇందాక ఈ జిన్ పింగ్ లాప్టాప్ లో ఒక విషయం చూసాను. చైనా ఈ ఐదు బాంబులను ఒకేసారి పేల్చడం కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ని రూపొందించారు. దాన్ని ఈ ఫ్యాక్టరీ మధ్యలో ఉన్న సర్వర్ గదిలో ఉంచారు. ఎలాగైనా సరే అక్కడికి చేరుకొని ఈ విధ్వంసం ఆపాలి."

"పదండి మేడమ్. ఇప్పుడే అక్కడికి వెళ్దాం." అని అమిర్ ఒక అడుగు ముందుకు వేసాడు.

రూహి తనని ఆపింది.
"ఆ పనికి నేను వెళ్తాను. నువ్వు వెళ్లి మన వంశీ, పార్వతి సంగతి చూడు "

"సర్వర్ గది చుట్టు సెక్యూరిటీ ఉంటుంది. అంతమంది ని దాటి మీరు ఒక్కరే వెళ్లడం కష్టం కదా "

"పర్లేదు అమీర్.. మనల్ని నమ్మి మనతో వచ్చిన తోటి సైనికుడి ప్రాణం కాపాడటం కూడా మన బాధ్యతే...
నువ్వు వెళ్లి ఆ సంగతి చూడు. బాంబు సంగతి నేను చూసుకుంటాను." రూహి స్పష్టంగా చెప్పింది.

"మేడం..." అమిర్ తన కళ్ళలోకి చూస్తూ పిలిచాడు.

రూహి ఏంటి అన్నట్టు తన వంక చూసింది.

"జాగ్రత్త మేడం. ఈ ఆపరేషన్ లో మనం గెలిస్తే మీకొక విషయం చెప్తాను. చాలా రోజులుగా చెప్పాలని అనుకుంటున్నాను. దేశం కోసం మీరు ఉన్నట్టు, మీకోసం నేను ఉన్నానని మర్చిపోకండి." అని అక్కడి నుంచి వేగంగా కదిలి వెళ్ళిపోయాడు.

రూహి తను వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది. తన కళ్ళు కాసేపు అలాగే షాక్ లో ఉండిపోయాయి. తన మనసుకు అయాన్ గుర్తొచ్చాడు. తన జీవితం ఎటు పోతుందో ఏమి అర్థం కాలేదు. ఒక్కసారి గుండెల నిండా శ్వాస తీసుకొని ముందు జరగాల్సింది చేద్దామని అనుకుంది.

ఒక్కసారి జిన్ పింగ్ గది ని తీక్షణంగా గమనించింది. అప్పుడే ఆ గదిలో గోడ మీద ఒక మ్యాప్ కనిపించింది. అది ఆ ఫ్యాక్టరీ బ్లూ ప్రింట్. ఆ ఫ్యాక్టరీ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం స్పష్టంగా అందులో గీసి ఉంది. అమిర్ చెప్పినట్టుగా ఆ సెక్యూరిటీ గది కి చేరుకోవడం చాలా కష్టం. ఆ గది ముందు లేకపోయినా దానికి చేరే దారిలో తప్పకుండా కట్టుదిట్టమైన కాపలా ఉంటుంది. కాబట్టి అందులోకి వెళ్లడానికి మరో దారి కావాలి. ఎంత ప్రయత్నించినా అదేంటో తెలియడం లేదు. అప్పుడే తన తండ్రి విక్రమ్ చెప్పిన ఓ మాట గుర్తొచ్చింది.

"నిరాశ రేపిన నీడలో ఆగిపోకు మిత్రమా...
కమ్ముకున్న చీకటి లో కూలిపోకు నేస్తమా...
నీ తోడుగా నేనున్నా...
నీ జతగా నేనున్నా...
నీ వెంట నేనున్నా...
నీ ఆలోచన ప్రసరించే వెలుగు కిరణాలు ముందు ఆ చీకట్లు ఎక్కువ సేపు నిలువవులే...
లే.. లేచి నడు...
నీ అడుగుల సవ్వడి శత్రువుల గుండెల్లో సునామి రేపాలి..
నీ భీకర గర్జన వారి వెన్నులో వణుకు పుట్టించాలి.
కదిలిరా నేస్తమా... బరిలోకి దిగు"

ఆ మాటలు గుర్తురాగానే రూహి బుర్ర పాద రసం మాదిరి పదునుగా మారింది. మరోసారి ఆ మ్యాప్ చూడటం మొదలుపెట్టింది. అప్పుడే తన చూపు పక్కనే ఉన్న నీళ్ల బాటిల్ మీద పడింది. దాన్ని చూడగానే ఓ ఆలోచన వచ్చింది.  అదే వాటర్ పైప్...

ఆ ఫ్యాక్టరీ లో ఉన్న ప్రతి గదికి నీళ్లు సప్లై కోసమని పెద్ద పెద్ద పైప్ లు అమర్చినట్టు తను ఇందాకే చూసింది. ఆ మ్యాప్ ప్రకారం... అందులో ఒక పైప్ లోకి దూకితే అది నేరుగా ఆ సర్వర్ రూమ్ లోపలకు చేరుస్తుంది అని అర్థమైంది.

అనుకున్నదే తడువుగా ఆ జిన్ పింగ్ గది బయటకు వచ్చింది. మ్యాప్ లో ఉన్నట్టే అక్కడ మ్యాన్ హోల్ కనిపించింది. ఒక్కసారి శ్వాస తీసుకొని అందులోకి దూకింది. తన భుజాల దాకా నీళ్లు ఉన్నాయి. నడవడం కష్టంగా ఉంది. మొత్తం చీకటిగా ఉంది. వెంట తెచ్చిన టార్చ్ లైట్ ఆన్ చేసింది.

ఆ వెలుతురు లో ఒక్కో అడుగు ముందుకు వేసింది. గాలి ఆడటం చాలా కష్టంగా అనిపించింది. అందుకే అక్కడక్కడా ఆ పైప్ కి వెంట తెచ్చిన కత్తి తో రంద్రాలు చేస్తూ వెళ్తుంది. ఎలాంటి వ్యక్తికైనా సరే అందులో నడవడం ఓ పెద్ద సాహసమనే చెప్పాలి. అదొక చీకటి గుహ లాంటిది. పైగా ఇరుకుగా ఉంటుంది. అయినా సరే దేశాన్ని కాపాడాలి అనే రూహి ఆశయం ముందు అవేవి అడ్డుగా కనిపించలేదు.

దారిలో ఒక చోట పదునుగా ఉన్న ఒక ఇనుప కమ్మి తగిలి రూహి పాదాల నుండి రక్తం కారింది. చాలా నొప్పిగా అనిపించింది. ప్రాణం పోతున్నంత బాధ కలిగింది. కాని పంటి బిగువున ఆ బాధ భరించింది.

అలా కొన్ని నిమిషాలు నడిచిన తరువాత తను అనుకున్న చోటుకు వచ్చాను అని అర్థమైంది. వెంటనే అక్కడున్న మ్యాన్ హోల్ కొంచెం పైకి లేపి తొంగి చూసింది. అక్కడ ఎవరూ లేరు. తను అనుకున్నట్టుగానే తన ముందు పెద్ద అక్షరాల తో సర్వర్ రూమ్ అని ఉంది. వెంటనే పైకి వచ్చింది. ఎదురుగా ఉన్న కిటికీ పగలకొట్టింది.

తమ స్థావరం మధ్యలో ఉన్న ఆ గది కి ఎవరు వస్తారులే అనే అతి ధైర్యం కాబోలు... ఆ గది దగ్గర కాపలా ఎవరూ లేరు. అదే రూహి కి కలిసి వచ్చింది. చాలా సులభంగానే ఆ గదిలోకి అడుగు పెట్టింది. అక్కడ చాలా సర్వర్స్ ఉన్నాయి.
RAW ఏజెంట్ గా పని మొదలుపెట్టిన అందరికీ మొదటి రోజే సాఫ్ట్వేర్ హ్యాండ్లింగ్, మెషిన్ లెర్నింగ్, హ్యాకింగ్ లాంటివి క్షుణ్ణంగా నేర్పిస్తారు. అవి ఎందుకో ఇప్పుడు తనకు అర్థమైంది.

రూహి చేతి వేళ్ళు వేగంగా సిస్టమ్ మీద పని చేస్తున్నాయి. సరిగ్గా ఇంకొక ఐదు నిమిషాల్లో చైనా ఇండియా మీద బాంబు దాడి చేయబోతుంది. రూహి మదిలో రేగుతున్న అలజడి కి తన నుదుటి మీద చేరిన స్వేద బిందువులు అద్దం పడుతున్నాయి. తన దేశం లో జరగబోయే దాడి తలుచుకుంటుంటేనే తన ఒంట్లో వణుకు కలుగుతుంది. ఊపిరి భారంగా మారింది. గుండెల్లో దడ పెరిగింది.

సరిగ్గా అప్పుడే...
రూహి తల మీద తుపాకీ ఎక్కు పెట్టారు. రూహి షాక్ అయ్యి వెనక్కి తిరిగింది.

ఎదురుగా ఆపరేషన్ FISH కి నాయకుడు...
చైనా మొత్తం రాక్షసుడు అని ముద్దుగా పిలుచుకునే... అత్యంత క్రూరుడు...
జాంగ్ లీ...

తన తుపాకీ చివర రూహి దొరకడం తో వాడి మోహం లో ఆనందం కలిగింది. తుపాకీ పేల్చడానికి ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు.

ఇంకొక్క క్షణం లో రూహి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అప్పటిదాకా పడిన కష్టం మొత్తం వృధా అయ్యింది అని బాధపడుతూ రూహి కళ్ళు మూసుకుంది

----------------------------------------------------------

సరిగ్గా అదే సమయంలో...

"పెళ్ళై పిల్లలు పుట్టినా సరే నీ అందం ఏ మాత్రం తగ్గలేదే... నిన్ను చూస్తుంటే నాలో కోరికలు మరింతగా రగులుతున్నాయి." జలంధర్ పెదవి కొరుకుతూ అన్నాడు.

ఎదురుగా సుజితను కుర్చీలో కాళ్ళు చేతులు కట్టేసారు. తను తప్పించుకోడానికి ప్రయత్నించింది. కాని వీలు చిక్కలేదు. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్నా అనుకుంది. కాని ఇలా శత్రువుల స్తావరానికి వచ్చి చిక్కుకుంటాను అని కలలో కూడా అనుకోలేదు. జలంధర్ మాటలకు కోపంగా వాడి వంక చూసింది.

"నువ్వు అలా చూడకు.. నీ పదునైన చూపులు నా గుండెల్లో గంటలు మొగిస్తున్నాయి." జలంధర్ మాటలకు అక్కడున్న రౌడీలు అందరూ పగలబడి నవ్వారు.

"రేయ్ కుక్క... నన్ను చంపడానికి వచ్చిన నీ మనుషులకు ఎలాంటి గతి పట్టిందో అప్పుడే మర్చిపోయావా?" అని సుజిత అరిచింది.

"అది చూసే కదా నీ మీద కోపం పెరిగింది. కాని నీ అందం చూసాక ఆ కోపం కామం లా మారింది."

"నేనేవరో తెలుసా... విక్రమ్ వాసుదేవ్ భార్యను.
రూహి వాసుదేవ్ తల్లిని.."

"ఇప్పటికే ఒకడు చచ్చాడు. ఇంకాసేపట్లో నీ కూతురు కూడా చావ బోతుంది. నిన్ను ఇంకెవరు కాపాడుతారు."

ఆ మాటకు సుజిత కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన కూతురు ప్రమాదం లో ఉందా... తన భర్తను కోల్పోయింది. ఇప్పుడు తనకేమైనా అయితే తన గుండె అస్సలు తట్టుకోలేదు. కళ్ళ నుంచి నీళ్లు జారుతూనే ఉన్నాయి.

తను అలా బాధలో ఉండగానే... జలంధర్ అడుగు ముందుకు వేసాడు.

"రేయ్ ఈరోజు దీన్ని బట్టలు లేకుండా నిలబెడతాను. దీన్ని అందాలతో అందరం పండగ చేసుకుందాం. "
అంటూ సుజిత చీర ను తన చేతిలోకి తీసుకున్నాడు.

ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జారుతున్నాయి. ఆ ఘోరం చూడలేక సూర్యుడు కూడా మబ్బుల వెనుక దాక్కున్నాడు.
సుజిత నిస్సహాయంగా కళ్ళు మూసుకుంది.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#67
ఏజెంట్ రూహి వాసుదేవ్...32



రూహి కష్టపడి ఎలాగోలా సర్వర్ రూమ్ కి చేరుకుంది. అక్కడికి రాగానే తన పని మొదలుపెట్టింది. తన చేతి వేళ్ళు గాలి కంటే వేగంగా పరిగెడుతున్నాయి. ఇంకొన్ని నిమిషాల్లో ఇండియా మీద జరగబోయే దాడి గురించి ఊహిస్తుంటే తన గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది. నుదుటి మీద నుంచి చమట జారుతుంది.

తన మదిలో రేగిన అలజడి తన పనిని మరింత త్వరగా పూర్తి చేయమని పోరు పెట్టింది. తను అదే పనిలో ఉంది.
ఇంతలో తన తల మీద ఓ తుపాకీ గురి పెట్టారు. రూహి వెంటనే చేస్తున్న పని ఆపి టక్కున తల తిప్పి వెనక్కి చూసింది.

తనకు ఎదురుగా... జాంగ్ లీ...
ఈ ఆపరేషన్ FISH కి నాయకుడు తనే..
చైనా మొత్తం అతనిని ముద్దుగా రాక్షసుడు అని పిలుచుకుంటారు. పచ్చి నెత్తురు తాగే క్రూరుడు తను.
మనుషుల ప్రాణాలంటే ఏ మాత్రం లెక్క చేయడు. అందుకే చైనా ఈ ఆపరేషన్ తనకు అప్పజెప్పింది. తనని ఎదురుగా చూసి రూహి కాసేపు షాక్ అయ్యి అలాగే ఉండిపోయింది.

తనని అలా చూసి జాంగ్ లీ ఒక్కసారి పెద్దగా నవ్వాడు.
"ఆ దేవుడు సృష్టించిన మనిషికి రెండే కళ్ళు. కాని ఆ దేవుడినే శాసించే నాలాంటి రాక్షసుడికి ఒళ్ళంతా కళ్ళే.. నన్ను దాటి ఈ ఆపరేషన్ ఆపుదాం అనుకున్నావా ఏజెంట్..." అని అన్నాడు.

"నీ జీవితం లో ఎంతమంది ఏజెంట్లను చూసావో నాకు తెలీదు. కాని నేను మాత్రం నీలాంటి రాక్షసులని చాలా మందిని చూసాను. అందరిని ఆ దేవుడి దగ్గరకే పంపించాను. కావాలంటే ఈ ఏజెంట్ రూహి దెబ్బ ఎలా ఉంటుందో అని చచ్చాక పైకి వెళ్లి నీ స్నేహితులను అడుగు. వాళ్లే చెప్తారు "

"నా తుపాకీ చివర నీ తల ఉన్నా సరే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావ్ అంటే నీ ధైర్య సాహసాలు గురించి నేను విన్నది నిజమే అనమాట..."

"నువ్వేం విన్నా సరే అది సగమే విని ఉంటావ్. ఎందుకంటే నా ధైర్యం పూర్తిగా చూసిన ఒక్కడు కూడా ఇప్పుడు ప్రాణాలతో లేడు."

"నీ పొగరు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. కాని నాలోని దేశ భక్తి నిన్ను చంపమని అంటుంది. "

"నీలాంటి దుర్మార్గులు దేశ భక్తి గురించి మాట్లాడితే ఆ దేశం కూడా సిగ్గు పడుతుంది జిన్ పింగ్..
నీకు నిజంగా దేశం మీద భక్తి, ప్రేమ, గౌరవం ఉంటే...
మీ దేశం ఎదగడం కోసం ఇంకా ఎలా అభివృద్ధి చేయచ్చా అని ఆలోచించి కృషి చేయాలి. అంతేకాని పక్క దేశాన్ని నాశనం చేయాలని కాదు." రూహి దీటుగా బదులిచ్చింది.

"నా తెలివైన ఎత్తులు ముందు మీ ఇండియా నిలువలేదు రూహి.."

"మహాభారతం లో కర్ణుడు ఓ గొప్ప సైనికుడు. కాని స్నేహం కోసం అధర్మం వైపు నిలబడి ఓడిపోయాడు.
నువ్వు ఎంత పెద్ద యోధుడైనా సరే నీ వెనుక న్యాయం లేకపోతే చివరకు ఓటమి తప్పదు."

"నీ పురాణాలు అన్ని నీ దేశం లో పాఠాలు గా చెప్పుకో రూహి.. మరి కాసేపట్లో మీ దేశం మొత్తం ఉలిక్కిపడుతుంది. ఐదు నగరాలు నామ రూపాలు లేకుండా కూలిపోతాయి. రక్తపు వర్షం కురుస్తుంది. " అని క్రూరంగా నవ్వాడు.

"నేను ప్రాణాలతో ఉండగా అది జరగనివ్వను."

"అందుకే ముందు నీ ప్రాణం తీస్తాను " అంటూ జిన్ పింగ్ చూపుడు వేలు ట్రిగ్గర్ మీద పెట్టాడు. రూహి అప్పటిదాకా పడిన శ్రమ మొత్తం వృధా అవుతుంది, ఈ దేశాన్ని నువ్వే కాపాడు నాన్న అంటూ విక్రమ్ ను తలుచుకొని కళ్ళు మూసుకుంది.

-------------------------------------------------------------

సరిగ్గా అదే సమయం లో...

జలంధర్ మనుషులకు సుజిత చిక్కింది. వారు తనని కుర్చీలో కట్టేసారు. సుజిత వారి నుంచి తప్పించుకోవాలని చూసింది కాని తన వల్ల కాలేదు. జలంధర్ మెల్లగా తన వైపు కదిలాడు. తన కట్లు విప్పేసాడు.

"నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది సుజిత. అరేయ్... ఇప్పుడు దీని ఒంటి మీద ఒక్కో వస్త్రం తీసేస్తాను. చూసి పండగ చేసుకోండి రా..." అని జలంధర్ క్రూరంగా నవ్వుతూ అన్నాడు.

ఆ మాటకు సుజిత కోపంగా వాడి చెంప మీద కొట్టాలని చూసింది. కాని జలంధర్ తన చేతిని బలంగా పట్టుకున్నాడు.

"నీ పొగరు నాలో సెగలు రగిలిస్తుందే... ఈరోజు నీకు నరకం చూపించి మరీ చంపుతాను." అంటూ సుజిత చీర కొంగును తన చేతిలోకి తీసుకున్నాడు.

సుజిత తేరుకునేలోగా ఆ చీరను గట్టిగా లాగేసాడు. సుజిత ఏడుస్తూ తన ఒంటిని చేతులతో కప్పుకుంది.

అది చూసి జలంధర్ తో పాటు అక్కడున్న వాడి మనుషులు కూడా పగలబడి నవ్వారు.

"నా మనుషులనే తరిమి కొడతావా.. నీ సంగతి చెప్తాను...
ఒరేయ్ దీని అందాన్ని వీడియో లో రికార్డు చేయండి. దేశం మొత్తం సెల్యూట్ చేసిన ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్ భార్య అందాలు చూసి ఈ దేశం మొత్తం మైమరచి పోవాలి." అని జలంధర్ గట్టిగా ఆదేశించాడు.

ఆ మాటలకు వాడి మనుషులు ఫోన్లు బయటకు తీసి అక్కడ జరిగేది రికార్డు చేస్తున్నారు. సుజిత వెంటనే ఒక మూలకు జరిగి కింద కూర్చొని తన ఒళ్ళు కనపడకుండా చేతులతో కప్పుకుంది.

అది చూసి జలంధర్ లోని రాక్షసుడు మరింతగా నవ్వాడు. తన మిగిలిన బట్టలు కూడా లాగేయడానికి మెల్లగా తన వైపు అడుగులు వేసాడు. సుజిత తన కన్నీళ్లను ఆపుకుంటూ అలాగే కళ్ళు మూసుకుంది.

------------------------------------------------------------

నిస్సహాయంగా రూహి కళ్ళు మూసుకుంది. జిన్ పింగ్ తనని కాల్చడానికి ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు.

"నీ చివరి కోరిక ఏమైనా ఉందా.." అని అడిగాడు.

రూహి వాడి కళ్ళలోకి సూటిగా చూస్తూ...
"నీకు ఏ మాత్రం బ్రతకాలి అన్న ఆశ ఉన్నా సరే. వెంటనే నన్ను వదిలేసి పారిపో... లేకపోతే నా దేశం మీద నువ్వు చేయాలి అనుకుంటున్న దాడి కి ప్రతి ఫలంగా నీ తల నరికేస్తాను."

రూహి కళ్ళలో కొంచెం కూడా భయం కనిపించలేదు. అది చూసి జిన్ పింగ్ కోపంగా ట్రిగ్గర్ నొక్కబోయాడు.

ఇంకొక్క క్షణంలో రూహి తలలో బుల్లెట్ దిగుతుంది. తన ముందు దారులు అన్ని మూసుకుపోయాయి. ఏం చేయడానికి లేదు. నిరాశ లో ఉండిపోయింది.

సరిగ్గా అప్పుడే...
"May I come In..." అనే గొంతు వినిపించింది.

జిన్ పింగ్ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసాడు. రూహి కూడా తలుపు వైపు చూసాడు.

ఎదురుగా ఒక యువకుడు.. తుపాకీ చేత పట్టుకొని నిలబడ్డాడు. అప్పటిదాకా శత్రువుల గుండెల్లో తూటాల వర్షం కురిపించిన దానికి గుర్తుగా అతని చొక్కా రక్తం తో తడిచి ఉంది. అతని పెదాల మీద చిరునవ్వు మాత్రం తొలిగిపోలేదు. కళ్ళలో ధైర్యం, నడకలో తెగింపు కొట్టొచ్చినట్టు కనిపించింది.

ఆ యువకుడు మరెవరో కాదు... అయాన్...

తనని చూడగానే రూహి కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయి అలాగే ఉండిపోయింది. జిన్ పింగ్ కి తన ఎదురుగా ఎవరు ఉన్నారో అర్థమవగానే తుపాకీ తో అయాన్ ని కాల్చాలని చూసాడు. కాని రూహి తనకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎగిరి వాడి గుండెల మీద తన్నింది. దెబ్బకు జిన్ పింగ్ చేతిలోని తుపాకీ కింద పడిపోయింది. రూహి ఆలస్యం చేయకుండా దాన్ని తన చేతిలోకి తీసుకుంది.

"ఆయుధం పట్టిన ప్రతి ఒక్కడు గెలవడు. గెలవాలంటే సత్తా ఉండాలి. ఆ సత్తా పట్టుకునే ఆయుధం లో కాదు. ఆ ఆయుధం పట్టిన గుండెలో ఉండాలి." అంటూ రూహి జిన్ పింగ్ రెండు కాళ్లలోకి కాల్చింది.

జిన్ పింగ్ నొప్పికి విల విల లాడుతూ పెద్దగా అరిచాడు.
ఇంతలో రూహి అయాన్ ముందుకు చేరింది.

"అయాన్..." అని ప్రేమగా పిలిచింది.

ఆ పిలుపు వినగానే అయాన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. రూహి ని గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. కొన్ని క్షణాలు వారు అలాగే ఉండిపోయారు. రూహికి చాలా ఆనందంగా ఉంది. ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఎంత బాధ ఉంటుందో, అదే తిరిగి వస్తే కలిగే ఆనందం అంతకు రెట్టింపు ఉంటుంది అని మొదటిసారి అర్థమైంది.

కాసేపటికి తేరుకొని...
"నువ్వెలా ఇక్కడికి వచ్చావ్ అయాన్.." అని అడిగింది

"ఆ అడవిలో ఉన్న నదిలోకి పడిపోయిన తరువాత స్పృహ కోల్పోయాను. ఆ నది చైనా గుండా ప్రవహిస్తుంది. అదృష్టం కొద్ది నన్ను ఒక వ్యక్తి చూసి కాపాడి వైద్యం చేశాడు. ఆ తరువాత మన RAW ఏజెంట్ల ద్వారా మీరు ఇక్కడికి వచ్చారని తెలుసుకున్నాను. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. అందుకే నేను కూడా వచ్చేసాను." అంటూ అయాన్ జరిగింది మొత్తం చెప్పాడు.

తన మాట పూర్తి అవకుండానే...
"I Love You అయాన్..." అని రూహి అంది.

ఆ మాట వినగానే అయాన్ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు. తను ఏం విన్నాడో అర్థమవడానికి కొన్ని క్షణాలు పట్టింది. అర్థమయ్యాక సంతోషం తో పెద్దగా అరుస్తు తనని గాల్లో తిప్పాడు. ప్రపంచం మర్చిపోయి ఆ ప్రేమికులు కొన్ని క్షణాలు ప్రేమలో మునిగిపోయారు.

సరిగ్గా అప్పుడే...
ఆ రూమ్ మధ్యలో ఉన్న గడియారం పెద్ద శబ్దం చేస్తూ మోగింది. దాని మీద 15:00 అని కౌంట్ డౌన్ మొదలయింది.

అంటే బాంబు పేలడానికి ఇంకా కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంది అని అర్థమైంది. రూహి ఈ లోకం లోకి వచ్చింది. పరిగెత్తుకుంటూ సిస్టమ్ ముందు కూర్చుంది.
ఆ బాంబు దాడి ఆపడానికి ప్రయత్నిస్తుంది.

అప్పుడే జిన్ పింగ్ ...
"రూహి.. ఒక్కసారి ఇది చూడు..." అంటూ తన జేబులో ఉన్న రిమోట్ నొక్కాడు.

రూహి ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద సుజిత కనిపించింది. తన చుట్టు చాలా మంది రౌడీలు నిలబడి ఉన్నారు. సుజిత ఏడుస్తూ వారికి దూరంగా భయపడుతూ మూలన కూర్చుంది. తన ఒంటి మీద చీర లేదు.

వాళ్ళ అమ్మను అలా చూడగానే రూహి రక్తం మరిగిపోయింది. రేయ్... అని గట్టిగా అరిచింది.

"నువ్వు ఇప్పుడు ఆ బాంబు ఆపాలని చూస్తే మీ అమ్మ అందాలు ఈ ప్రపంచం ముందు పెడతాను. మీ అమ్మ కావాలా? లేక దేశం కావాలో తేల్చుకో రూహి..." అని అన్నాడు.

రూహి కళ్లలో నీళ్లు తిరిగాయి. గుండెల్లో రక్తం చిమ్ముతుంది. ప్రాణం పోతున్నట్టు అనిపించింది.
ఒక వైపు కన్న తల్లి... మరో వైపు కన్న దేశం...
ఎవరిని కాపాడాలో అర్థం కాలేదు.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#68
ఏజెంట్ రూహి వాసుదేవ్... (ముగింపు)



ఆ క్షణం రూహి ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి జిన్ పింగ్ చెప్పినట్టు అమ్మ కోసం దేశం మీద జరిగే దాడి కి తలవంచడం...
రెండు... దేశం కోసం అమ్మను వదులుకోవడం...
ఆ రెండిటిలో ఏది జరిగినా రూహి తనని తాను ఈ జీవితం లో క్షమించుకోలేదు.

గుండెల్లో చెప్పలేని బాధ మొదలయింది. ప్రాణం పోయినట్టు అనిపించింది. తట్టుకోలేక గట్టిగా అరుస్తూ పిడికిలి బిగించి పక్కనే ఉన్న గోడను గుద్దింది. తన చేతి నుండి రక్తం కారింది. అయాన్ కంగారుగా తన దగ్గరకు వచ్చి తన చేతిని చేతుల్లోకి తీసుకున్నాడు.

రూహి కళ్ళ నిండా కన్నీళ్లు...
ఓ వైపు అమ్మ.. మరో వైపు దేశం...
ఎటు తేల్చుకోలేకపోతుంది.

తనని అలా చూసి జిన్ పింగ్ పగలబడి నవ్వాడు. మరోవైపు ఫోన్ లో అదంతా వింటున్న జలంధర్ కూడా నవ్వాడు.

"జలంధర్... ఆ సుజిత ను బట్టలు లేకుండా నిలబెట్టు..." అని జిన్ పింగ్ ఆదేశించాడు.

ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న జలంధర్ ఓ అడుగు ముందుకు వేసి సుజిత జుట్టు పట్టుకున్నాడు. ఇక్కడ రూహి రక్తం మరిగిపోయింది. అగ్ని పర్వతం పేలడానికి సిద్ధంగా ఉంది. తన కళ్ళు ఎర్రగా మారిపోయాయి. పిడికిలి బిగిసింది. ఏం చేయలేని తన నిస్సహాయత చూసి తన మీద తనకే కోపం వచ్చింది.

ఇంతలో జలంధర్ సుజిత జుట్టు పట్టుకొని లాక్కొని అందరి మధ్యలో తీసుకొని వచ్చాడు. అందరి ముందు తన జాకెట్ చింపాలని వీపు మీద చెయ్యి వేసాడు. ఇక ఆ దృశ్యం చూడలేక రూహి కళ్ళు మూసుకుంది. సుజిత కూడా బాధతో ఆకాశం వంక చూస్తూ రోదించింది

సరిగ్గా అప్పుడే...
"డంకు టకర... టకర టకర... డంకు టకర టకర టకర...." అంటూ ఓ డప్పు శబ్దం వినిపించింది.

ఆ శబ్దం వినగానే జలంధర్ తో పాటు అతని మనుషులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరూ తల తిప్పి ఆ శబ్దం వచ్చిన వైపు చూసారు. అక్కడంతా పొగ ఉంది.

వెళ్లి ఎవరో చూసిరా... అని ఒక అనచరుడిని అటు వైపు పంపించాడు. వాడు కత్తి చేత పట్టుకొని పరిగెత్తుకుంటూ ఆ పొగలోకి వెళ్ళాడు. అక్కడ ఎవరో ఎవరినో కొడుతున్న శబ్దం వచ్చింది. అందరూ ఏం జరుగుతుందో అర్థం కాక అటే చూస్తున్నారు. కొన్ని క్షణాలకు జలంధర్ అనుచరుడు రక్తం కక్కుకుంటూ ఎగిరి వాడి కాళ్ళ ముందు పడ్డాడు.

జలంధర్ భయపడిపోయి సుజిత మీద వేసిన చెయ్యి వదిలేసాడు. అక్కడున్న వాడి మనుషుల అందరిలో భయం మొదలైంది. గుటకలు మింగుతూ ఆ పొగ వైపే చూస్తూ నిలబడ్డారు.

మెల్లగా ఆ పొగ లో నుంచి ఒక రూపం బయటకు వచ్చింది.
ఆరు అడుగుల ఎత్తు తో నీలం రంగు ప్యాంట్, తెల్ల చొక్కా వేసుకొని, నల్ల రంగు కళ్లద్దాలు పెట్టుకొని ఒక కుర్రాడు అక్కడికి వచ్చాడు.
అతని నడక లో ధైర్యం...
కళ్లలో పొగరు...
పెదాల మీద చిరునవ్వు...
చేతల్లో చురుకుదనం కొట్టొచ్చినట్టు కనిపించింది.

తనని చూడగానే...
"కాలేజ్ కుర్రాడిలా ఉన్నావ్. నీకు ఇక్కడ ఏం పని రా..." అంటూ జలంధర్ కోపంగా అరిచాడు.

ఆ కుర్రాడు మాత్రం సమాధానం చెప్పకుండా కింద పెదవిని కొరుకుతూ కోపంగా చూపుడు వేలిని చూపించాడు.

"మా అన్నకే వేలు చుపిస్తావా. ఎంత ధైర్యం రా నీకు " అంటూ ఒక రౌడీ పరిగెత్తుకుంటూ ఆ కుర్రాడి మీదకు వెళ్లి కత్తి దూసాడు. ఆ కుర్రాడు రెప్ప పాటులో తప్పించుకొని పిడికిలి బిగించి ఒకే ఒక గుద్దు గుద్దాడు. ఆ రౌడీ కడుపు పట్టుకొని అలాగే నేల కరుచుకున్నాడు.

అది చూసి అక్కడున్న రౌడీలు అందరూ భయం తో ఒక అడుగు వెనక్కి వేశారు. వారి గుండెల్లో వణుకు పుట్టింది.
ఆ కుర్రాడు అలాగే ముందుకు వచ్చి అక్కడున్న చీర తీసి సుజితకు ఇచ్చాడు. సుజిత దాన్ని కట్టుకుంది.

ముందుగా జలంధర్ తేరుకొని...
"ఇంకా మూతి మీద మీసాలు కూడా సరిగా రాలేదు. ఏం చూసుకొని రా నీకు అంత పొగరు..." అని ఆవేశంగా అరిచాడు.

ఆ కుర్రాడు జలంధర్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ...
"ఎవరో నా వెనుక ఉన్నారని నేను ముందడుగు వేయను.
నా అడుగు చూసే చాలా మంది నా వెనుక నిలబడతారు.
అయినా ఈ పొగరు నా రక్తం లోనే ఉంది."

"అసలు ఎవడ్రా నువ్వు..." అని ఆశ్చర్యంగా అడిగాడు.

ఆ కుర్రాడు స్టైల్ గా తన కళ్ళజోడు తీసి...
"నా పేరు... విక్రమ్... విక్రమ్ వాసుదేవ్..." అని అన్నాడు.

ఆ పేరు వినగానే జలంధర్ ఒళ్ళంతా చల్లగా అయ్యింది. గుండెల్లో వణుకు పుట్టింది. అసలు ఇదెలా సాధ్యం అని బిత్తర పోతూ అయోమయంగా చూసాడు.

"అందరూ అనుకుంటూ ఉంటారు. నా భర్త దేశం కోసం మమ్మల్ని ఒంటరి చేసి పోయాడు అని...
కాని తను వెళ్తూ మాకోసం ఓ ఆరడుగుల ఆయుదాన్ని వదిలి వెళ్ళాడు.
ఇంకా అర్థం కాలేదా...  నీ ఎదురుగా ఉన్నది ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్ రక్తం..
నా కొడుకు రా నా కొడకా..." అని సుజిత ఆవేశంగా అంది.

"విక్రమ్ వాసుదేవ్ కొడుకా..." అని జలంధర్ అలా నోరు తెరిచి ఉండిపోయాడు. జలంధర్ మాత్రమే కాదు. అది చూస్తున్న జిన్ పింగ్ కూడా భయం తో వణికిపోయాడు.

ఇంతలో విక్రమ్ మెల్లగా నడుస్తూ అక్కడ జరుగుతున్నది వీడియో కాల్ లో జిన్ పింగ్ కి చూపిస్తున్న రౌడీ దగ్గరకు వచ్చాడు. చెయ్యి చాపాడు. వాడు భయపడిపోయి ఫోన్ ఇచ్చేసాడు. ఫోన్ లో రూహి కనిపించింది.

"అక్క... ఈరోజు ఉదయమే హైదరాబాద్ వచ్చాను. అమ్మ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఫోన్ చివరి సిగ్నల్ ట్రాక్ చేసి ఇక్కడి దాకా వచ్చాను. ఇక అమ్మ సంగతి నాకు వదిలేయ్. నేను చూసుకుంటాను. నువ్వు అక్కడ పని పూర్తి చేసి త్వరగా వచ్చేయ్." అని అన్నాడు.

రూహి ధైర్యంగా నిట్టూరుస్తూ...
"రేయ్ జలంధర్...
నా తండ్రి ఆలోచించి కొడతాడు.
నేను కొట్టిన తరువాత ఆలోచిస్తాను.
నా తమ్ముడు మాత్రం అలా కాదు..
కొట్టడం ఆపాలి అనే ఆలోచన లేకుండా కొడతాడు. ఎటు మొదలుపెట్టి ఎటు ఆపుతాడో వాడికే తెలీదు.
కాని ఒక్కసారి వాడి దెబ్బ తిన్నవాడు మాత్రం మళ్ళీ లేవడు. అది మాత్రం కంఫర్మ్.
వాడొక నడిచే డైనమేట్...
నా అనుకున్న వాళ్ళని తాకితేనే తట్టుకోలేడు. ఇక మా అమ్మను ముట్టుకున్నావు, ఈ రోజు నిన్ను ఏం చేస్తాడో నీ ఊహకే వదిలేస్తున్నా." అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

రూహి నుంచి ఆ మాటలు వినగానే జలంధర్ గొంతులో తడి ఆరిపోయింది. వెన్నులో వణుకు పుట్టింది.

కాసేపటికి తేరుకొని...
"నేనెవరో మర్చిపోయారా..." అని అరిచాడు.

"రేయ్ లుచ్చా... ఇప్పుడు పరిచయాలు చేసుకునేంత సమయం లేదు. త్వరగా పని పూర్తి చేయాలి. నాకసలే ఆకలిగా ఉంది. అమ్మ చేతి వంట తిని చాలా రోజులైంది." అంటూ విక్రమ్ పొగరుగా సమాధానం ఇచ్చాడు.

ఆ మాటకు జలంధర్ కోపంగా...
"ఈ బచ్చా గాడిని కూడా వీడి యబ్బ దగ్గరకు పంపించండి." అని తన మనుషులకు ఆదేశించాడు.

"నా యబ్బ మీద ఒట్టు... ఈరోజు మీ అందరికీ మీ యబ్బలు గుర్తురాకపోతే నేనసలు విక్రమ్ వాసుదేవే కాదు.. రారా చూసుకుందాం.." అని విక్రమ్ ముందుకు దూకాడు.

అది చూసి సుజిత...
"నువ్వెప్పుడైనా ఆకలితో ఉన్న సింహం జూలూ విదిల్చి వేటడం చూసావా... అయితే ఇప్పుడు చూడు." అని అంది.

ఆ మాటకు జలంధర్ కళ్ళు పెద్దవి చేసి చూసాడు. సుజిత చెప్పినట్టుగానే విక్రమ్ మీసం మెలేసి రౌడీల మీదకు దూకాడు. విక్రమ్ చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్, కరాటే, బాక్సింగ్ లాంటివి నేర్చుకున్నాడు. చూడటానికి కాలేజ్ కుర్రాడిలా ఉంటాడు కాని దెబ్బ మాత్రం సాలిడ్ గా ఉంటుంది.

ఒక్కొక్కడికి చుక్కలు చూపించడం మొదలుపెట్టడు. విక్రమ్ తెగింపు చూసి ఆ రౌడీలు అందరూ బిత్తర పోయారు.
ఆ క్షణం విక్రమ్ అచ్చం అడవిలో వేటకు బయలుదేరిన సింహం లాగానే ఉన్నాడు.


----------------------------------------------------------

సరిగ్గా అదే సమయంలో...

రూహి సిస్టమ్ లో ఆ బాంబు ఆపడానికి తన శాయ శక్తుల ప్రయత్నిస్తుంది. మరో వైపు అది పేలడానికి ఎక్కువ సమయం కూడా లేదు. చివరి ఐదు నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

రూహి గుండె వేగం వంద దాటింది. ఎలాగైనా ఇండియా ను కాపాడాలి అని ప్రయత్నిస్తుంది కాని ఆ బాంబు పేలకుండా ఆపడం తన వల్ల కావడం లేదు.

తనని అలా చూసి
"నీ వల్ల కాదు రూహి... దాన్ని ఆపాలని నేను అనుకున్నా సరే ఆపలేను. ఎవరు వచ్చినా సరే ఆ బాంబు పేలకుండా ఆపలేని విధంగా ఆ సాఫ్ట్వేర్ ని తయారు చేసాము.
నువ్వేం చేసినా సరే,  మరో 5 నిమిషాల్లో బాంబు పేలడం,  మీ ఇండియా నాశనం అవ్వడం ఒకేసారి జరుగుతాయి." అని జిన్ పింగ్ పెద్దగా నవ్వాడు.

తన మాటలు వింటుంటే రూహి లో కోపం అమాంతం పెరిగిపోయింది. ఏమి చేయలేక పక్కనే ఉన్న బల్ల మీద గట్టిగా కొట్టింది.

"చెప్పా కదా రూహి... మా చైనా ముందు మీ దేశం ఎప్పటికీ తక్కువే. జనాభా పరంగా, ఆర్థికంగా, సైనికంగా ఆఖరికి ప్రపంచ దేశాల్లో బలమైన దేశాల లిస్ట్ లో అయినా సరే మీ ఇండియా ఎప్పటికీ మా వెనుకే ఉంటుంది.
మీ పురాణాల గురించి నేను కూడా విన్నాను. మహాభారతం లో వంద మంది కౌరువుల మీద ఐదుగురు పాండవులు గెలిచారు అంట కదా.. ఇప్పుడు మేము ప్రయోగిస్తున్న ఆ ఐదు బాంబులు కూడా అలాంటివే...
చివరకు విజయం మాదే..."

ఆ మాటలు రూహిలో ఆవేశం మరింత పెంచాయి. కాని అప్పుడే తన తండ్రి తరుచుగా చెప్పే మాట గుర్తొచ్చింది.

చుట్టూ చీకటి కమ్మిన వేళ...
ఓటమి అంచున నిలబడిన సమయంలో...
న్యాయం మన వైపు ఉంటే...
శత్రువే తన ఆధిపత్యం మత్తులో మనకో దారి చూపిస్తాడు.

ఆ మాటలు గుర్తురాగానే రూహి లో ఆవేశం తగ్గి ఆలోచన పెరిగింది. ఇందాక జిన్ పింగ్ మాటలు మరోసారి గుర్తు చేసుకుంది.

కురుక్షేత్రం లో పాండవులు గెలిచారు. కాని ధర్మంగా గెలిచారు.
మరి ఈ జిన్ పింగ్ చెప్పినట్టు జరిగితే... వారు అధర్మం వైపు నిలబడినట్టు కదా...
పాండవులు కేవలం ఆయుధాలు మాత్రమే... మరి వారి వెనుక ఉండి నడిపినది ఎవరు? శ్రీ కృష్ణుడు...
శ్రీ కృష్ణుడు జరిగే యుద్దాన్ని ఆపలేదు. కాని ధర్మం వైపు నిలబడ్డాడు. అంటే పాండవులకు సరైన మార్గం చూపించాడు.

ఆ చివరి మాటలు మరోసారి మననం చేసుకుంది. రూహి పెదాల మీద ఓ చిరునవ్వు విరిసింది. వెంటనే మరోసారి సిస్టమ్ ముందు కూర్చుంది. ఈసారి తన చేతి వేళ్ళు మరింత వేగంగా కదిలాయి. ఆ చోటు మొత్తం నిశ్శబ్దంగా మారింది.

మరో వైపు కాలం దేని కోసం ఆగకుండా ముందుకు కదిలింది. సమయం గడిచే కొద్ది అక్కడే నిలబడిన అయాన్ లో ఆందోళన మరింతగా పెరిగిపోయింది.

ఇంతలో సమయం బాంబు పేలడానికి చివరి ముప్పై సెకండ్లకు చేరుకుంది. తను అనుకున్నట్టు జరగనుంది అని జిన్ పింగ్ మోహం లో ఆనందం పొంగి పోరులుతుంది. రూహి మాత్రం అదురుతున్న గుండెను ఆపుకుంటూ తన పని తను చేస్తూ వెళ్తుంది.

3...
2...
1...

బూమ్... బూమ్... అంటూ ఆ ఫ్యాక్టరి లో నుంచి ఐదు బాంబులు ఆకాశం లోకి దూసుకొని వెళ్లాయి.

వారు కూర్చున్న గదిలో ఉన్న స్క్రీన్ ల మీద ఆ బాంబులు దూసుకొని వెళ్లడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది చూసి జిన్ పింగ్ సంతోషం తో పెద్దగా అరిచాడు.

కాని ఆ సంతోషం ఎక్కువ సేపు నిలువ లేదు. ఎందుకంటే ఆ బాంబులు ఇండియా వైపు వెళ్లడం లేదు. చైనా, నార్త్ కొరియా వైపే వెళ్తున్నాయి. అది చూసి నమ్మలేకపోతునట్టు నోరు తెరిచి ఉండిపోయాడు. తన గుండె షాక్ తో కాసేపు కదలడం మర్చిపోయింది.

"అసలు ఇదెలా సాధ్యం..." అని తన నుదుటి మీద నుంచి పడుతున్న చమట ను తుడుచుకుంటూ అడిగాడు.

అది చూసి రూహి పెదాల మీదకు నవ్వు చేరింది.
"పూర్వం ఓ కథ ఉంటుంది. శత్రువులు చంపుతారేమో అనే భయం తో ఓ రాజు తన చుట్టు వందల మంది సైన్యాన్ని కాపలా పెట్టుకున్నాడంట. కాని చివరకు మాంసం ముక్క గొంతుకు అడ్డం పడి చనిపోయాడంట...
మీరు ఈ సాఫ్ట్వేర్ ని ఈ బాంబులు ఆపడానికి వీలు లేకుండా తయారు చేసారు. కాని అవి పేలే చోటును మార్చే అవకాశం మాత్రం అలాగే ఉంచారు. అది ఎందుకు అలాగే ఉంచారో నేను చెప్పనా..
ఎందుకంటే ఈ ప్రపంచానికి మీ మీద అనుమానం రాకుండా ఉండటం కోసం మీ చైనా అధ్యక్షుడు ప్రస్తుతం భారతదేశ పర్యటన కు వచ్చాడు. అతను ఎప్పుడు ఎక్కడుంటాడో తెలీదు కాబట్టి... ఎందుకైనా మంచిదని ఆ ఆప్షన్ అలాగే ఉంచారు. అదే ఇప్పుడు మాకు ఓ వరమైంది.
బాంబు పేలే కో ఆర్డినేట్స్ మార్చేసాను. ఆ ఐదు భాంబులలో మూడు మీ దేశంలో రెండు నార్త్ కొరియా లో పేలేలా సెట్ చేసాను.
నేను మీలాగా దుర్మార్గులము కాదు. అందుకే ఆ బాంబులు వెళ్లే వేగం తగ్గించాను. అవి మీ నగరాలను చేరడానికి కచ్చితంగా 90 నిమిషాల సమయం పడుతుంది. ఈలోగా బాంబు గురించి మొత్తం వివరాలు మీ మీడియా కు లీక్ చేసి అక్కడి ప్రజలను సురక్షితమైన మరో చోటు కు వెళ్లిపొమ్మని చెప్పాను. అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా జాగ్రత్త పడ్డాను. కాని ఆ నగరాల్లో మీ రాజధాని కూడా ఉండి. దెబ్బకు మీ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అవుతుంది. మీకు సహాయం చేసినందుకు నార్త్ కొరియాకు కూడా సరైన శిక్ష పడింది. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడటం అంటే ఇదేనేమో... "

రూహి చెప్పింది విన్న తరువాత జిన్ పింగ్ మోహం మాడిపోయింది. ఓటమి భారం తో తల దించుకున్నాడు.

"ఇందాక ఏమన్నవ్ రా...
ఎప్పటికీ నా భారతదేశం నీ చైనా వెనుక నిలబడాలా...
ఎదురు తిరిగితే అణగ దొక్కే నీ దేశం ఎక్కడా? ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ నిచ్చే అతి పెద్ద ప్రజాస్వామ్య నా దేశమెక్కడా?
మీ దేశం లో చాలా మంది పవిత్రంగా పాటించే బుద్ధిజం నేర్పింది ఎవరు?  నా దేశం..
వైద్య రంగం లో ఎన్నో అద్భుతమైన మందులు, మూలికలు గురించి నా దేశం లో పూర్వికులు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే రాసారు. పాఠాలు నేర్చుకుంటామని వచ్చి దొంగతనంగా మోస పూరిత యుద్ధం చేసి వాటిని కొల్లగొట్టి నేడు వాటితో వేల కోట్లు సంపాదించావు.
అలాంటి నువ్వు మా దేశం గురించి మాట్లాడుతున్నావా..
నిజమే.. బలమైన దేశాల వరుసలో మేము వెనుకే ఉన్నాం.
కాని ఆ లెక్కలు చేతిలో ఉండే ఆయుధాలను బట్టి వేసినవి.
ఒక్కసారి ఆ ఆయుధం పట్టే గుండె ధైర్యం బట్టి వేయండి.
ఈ ప్రపంచమే నా దేశం వెనుక నిలబడుతుంది.
కులాలు, మతాలు, ప్రాంతాలు... అంటూ మాలో మాకు ఎన్నో విబేధాలు..
కాని దేశం జోలికి వస్తే మాత్రం మేమంతా ఒక్కటే...
వందేమాతరం..." అంటూ రూహి తన చేతిలో ఉన్న తుపాకీ తో జిన్ పింగ్ గుండెల్లో కాల్చింది. దెబ్బకు వాడు గిల గిలా తన్నుకుంటూ చచ్చిపోయాడు.

సరిగ్గా అప్పుడే...
వంశీ, పార్వతి, అమిర్ కూడా అక్కడికి వచ్చారు. ముందు అయాన్ ని చూసి ఆశ్చర్యపోయారు. అయాన్ వారికి అక్కడ జరిగింది మొత్తం చెప్పాడు. మన దేశం సురక్షితంగా ఉంది అని తెలిసి వారంతా ఆనందించారు. రూహి గుండెల్లో కూడా ఓ భారం తగ్గింది.

ఇంతలో... వంశీ చూపు అక్కడున్న మానిటర్ మీద పడింది. మేడం అని గట్టిగా అరిచాడు. అందరూ వంశీ చూస్తున్న వైపు చూసారు. అక్కడ కొన్ని వందల మంది చైనా సైనికులు వీరు ఉన్న సర్వర్ గది వైపే దూసుకొని వస్తున్నారు. అది చూసి అందరూ షాక్ అయ్యారు.

"మన దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. అంత మందిని దాటి మనం ఇక్కడి నుంచి బయటపడలేము మేడం" అని పార్వతి భయంగా అంది.

"ఆయుధాలు లేకపోయినా మనలో గుండె ధైర్యం ఉంది కదా.. ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదాం." అని రూహి తన చేతిలో ఉన్న తుపాకీ లోడ్ చేసింది. ఆ మాటతో మిగతా బృందం కూడా తుపాకీ లు చేతిలోకి తీసుకున్నారు.

రూహి ఆ గది తలుపు తెరిచింది.
తన బృందం 5 మంది...
ఎదురుగా వందల మంది శత్రువులు...
లెక్క సరిపోవడం లేదు.
ఆ క్షణం వారు మృత్యువు కే ఎదురు వెళ్తున్నారు.
కాని వారిలో కొంచెం కూడా భయం కనిపించడం లేదు.

మరి ఈ పోరాటం లో విజయం ఎవరి వైపు...?

------------------------------------------------------------

విక్రమ్ చిరుతపులి మాదిరి ఆ రౌడీ ల మీదకు దూకాడు. అందరికీ చుక్కలు చూపిస్తున్నాడు. దెబ్బకు వారంతా బిత్తర పోయారు.

ఇంతలో వెనుక నుంచి వచ్చి జలంధర్ విక్రమ్ ని కాలితో తన్నాడు. విక్రమ్ అలాగే ముందుకు వెళ్లి ఒక ఇనుప చువ్వ మీద పడ్డాడు. అది తన కడుపులోకి కొంచెం దిగింది.

విక్రమ్ వెనక్కి తిరిగి జలంధర్ వైపు కోపంగా చూసాడు. చిరిగిన తన చొక్కా విప్పేసాడు. అతని ఎనిమిది పలకల దృడమైన దేహం కనిపించింది. రక్తం తో తడిచిన అతని రూపం మరింత గంభీరంగా ఉంది.

"మొన్ననే పుట్టినరోజు కు ఎంతో ఇష్టంగా కొన్న కొత్త చొక్కా రా... అనవసరంగా చింపేశావ్ కదా..."

ఓ వైపు కడుపులో రక్తం కారుతున్నా సరే, కొత్త చొక్కా గురించి ఆలోచిస్తున్న విక్రమ్ తెగింపును జలంధర్ ఆశ్చర్యంగా చూసాడు.

ఈలోగా విక్రమ్ ఎగిరి జలంధర్ గుండెల మీద తన్నాడు. వాడు దూరంగా పడ్డాడు. తన గుండెల మీద ఓ వెయ్యి టన్నుల బరువు పడినట్టు అనిపించింది. తేరుకోడానికి సమయం పట్టింది.

ఈలోగా విక్రమ్ పక్కనే ఉన్న రాడ్ తీసుకొని మిగిలిన రౌడీలను కూడా తరిమి తరిమి కొట్టాడు. పూర్తిగా మీసాలు కూడా మొలవని ఆ కుర్రాడు పెద్ద పెద్ద రౌడీలను పరిగెత్తించి కొడుతుంటే సుజిత తన కొడుకు వంక గర్వంగా చూసింది.

జలంధర్ కాసేపటికి లేచి నుంచున్నాడు. కళ్ళు తెరిచి చూస్తే తన ముందు విక్రమ్ నిలబడ్డాడు.

"మా అమ్మ నే ఎత్తుకొస్తారా రా..." అంటూ కడుపులో గుద్దాడు.

జలంధర్ కళ్ళు బైర్లు కమ్మాయి. నొప్పికి కడుపు పట్టుకొని పెద్దగా అరిచాడు.

విక్రమ్ ఈ సారి వాడి చేతులను పట్టుకున్నాడు.

"ఈ చేతులతోనే కదా.. మా అమ్మ చీర పట్టుకున్నావ్.." అంటూ ఆ రెండు చేతులను విరిచేసాడు.

జలంధర్ ప్రాణం పోతున్నట్టు విల విల లాడిపోయాడు.

విక్రమ్ వాడి కుడి కాళ్ళు పట్టుకున్నాడు.
"నా తల్లి నడిచే ఈ నేల మీద నీకు నడిచే హక్కు లేదు. " అంటూ తన కాలిని విరిచేసాడు.

జలంధర్ నరకం అంటే ఏంటో మొదటిసారి చూస్తున్నాడు. నొప్పికి తట్టుకోలేక చేతులతో నేల మీద గుద్దుతున్నాడు. గొంతు చించుకొని అరుస్తున్నాడు.

విక్రమ్ కోపం చల్లారడం లేదు. పక్కనే ఉన్న కత్తి ని చేతిలోకి తీసుకున్నాడు. ఆవేశంగా వాడి గుండెల్లో పొడవడానికి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే సుజిత వచ్చి తనని ఆపింది.

"వద్దు విక్రమ్... వీడి పరిస్థితి చూసి మిగతా రౌడీలు కూడా సైనికుల కుటుంబాల జోలికి రావాలన్న భయపడాలి. వాడిని వదిలేయ్." అని అంది.

ఆ మాటకు విక్రమ్ శాంతించి తన చేతిలోని కత్తి విసిరేసాడు.

"రేయ్ జలంధర్... ఒక్క విషయం గుర్తుంచుకో...
బయట నుంచి వచ్చే శత్రువుల కోసం మా అక్క సరిహద్దు దగ్గర నిలబడి ఉంది.
దేశం లోపల తిరిగే నీలాంటి లుచ్చా గాళ్ళ కోసం నేను ఉన్నాను.
పేరు గుర్తుంది గా... విక్రమ్ వాసుదేవ్..."

విక్రమ్ తన తల్లి సుజిత ను తీసుకొని అక్కడి నుంచి కదిలాడు. ఆ క్షణం ఆ కుర్రాడి ధైర్యం, తెగింపు చూసి ఆ దేవతలు కూడా తమ సృష్టిని తలచి మురిసిపోయారు.

----------------------------------------------------------

సరిగ్గా అదే సమయంలో...

రూహి బరిలో దిగింది. ఎదురుగా వందల మంది శత్రు సైనికులు.. అయినా సరే తన కళ్లలో భయం కలగలేదు.
తనకు తెలుసు ఆ పోరాటం లో వారికి ఓటమి తప్పదని, అయినా సరే తనలో కొంచెం కూడా ధైర్యం తగ్గలేదు.

శత్రువులకు వారికి మధ్య దూరం తగ్గింది. రూహి గుండెల నిండా శ్వాస తీసుకొని పిడికిలి బిగించింది.

సరిగ్గా అప్పుడే... చైనా సైనికుల మీద ఆకాశం లో నుంచి బుల్లెట్ల వర్షం కురిసింది. రూహి బృందం ఆశ్చర్యపోతు పైకి చూసారు.

అక్కడ ఆకాశం లో నాలుగు హెలికాఫ్టర్ లు... చైనా సైనికుల మీద దాడికి తెగబడ్డాయి. ఊహించని ఆ దాడి కి చైనా సైనికులు అందరూ బిత్తర పోయి ఎక్కడివారు అక్కడే దాక్కున్నారు.

సరిగ్గా అదే సమయంలో ఆ నాలుగు హెలికాప్టర్ లలో ఒకటి రూహి బృందం దగ్గర ఆగి, పై నుంచి తాడు కిందకు వేశారు. ఆలస్యం చేయకుండా అందరూ ఆ తాడు పట్టుకొని పైకి ప్రాకారు. ఆ హెలికాఫ్టర్ లో ఉన్న వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యం తో కాసేపు అలాగే ఉండిపోయారు.
అందులో మన భారత దేశ ప్రధాన మంత్రి ఉన్నారు.

"సార్.. మీరు ఇక్కడ..."

"దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి మీరంతా పోరాడుతుంటే... మీకోసం నేను ఇక్కడిదాకా రాలేనా అని అనిపించింది. అందుకే నేనే నేరుగా వచ్చాను."

ఆ క్షణం ఆయన మీద అందరికీ గౌరవం పెరిగిపోయింది. థాంక్స్ సార్ అని చెప్పారు. ఇంతలో హెలికాఫ్టర్లు అన్ని అక్కడి నుంచి భారతదేశం వైపు కదిలాయి.

రూహి చేతిని అయాన్ తన చేతిలోకి తీసుకున్నాడు. రూహి తన వంక ప్రేమగా చూసింది. అప్పుడే తన చూపు తనకు ఎదురుగా కూర్చున్న అమిర్ మీద పడింది.

అమిర్ మనసులో కూడా రూహి నే ఉంది. కాని రూహి అయాన్ ని ప్రేమిస్తుంది అని అర్థమైంది. ఒకరిని ప్రేమించడం అన్నది మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. మనం ప్రేమించిన అందరూ మనల్ని తిరిగి ప్రేమించాలని కోరుకోకూడదు. అలా కోరుకుంటే ఆ ప్రేమలో స్వార్థమే మిగులుతుంది అని తనకు తాను నచ్చజెప్పుకున్నాడు.
నువ్వు నన్ను ప్రేమించకపోయినా సరే నా చివరి శ్వాస దాకా నీకు తోడుగా ఉంటా రూహి అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు. తన గుండెల్లో నుంచి ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ నవ్వుతూ వారిని దీవించాడు. రూహి కూడా చిరునవ్వుతో తనకు బదులిచ్చింది.

భారతదేశం మొత్తం గర్వించదగ్గ ఓ ఆపరేషన్ విజయవంతంగా చేసి రూహి బృందం భారతదేశం చేరుకుంది. ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. రూహి పోరాటం తెలిసి అందరి గుండెలు గర్వంతో ఉప్పొంగాయి.
సుజిత, విక్రమ్ లను చూసి రూహి కాసేపు ఆనందం తో బాధపడింది. వారు తనని ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు.

ప్రపంచ దేశాలు ముందు చైనా చేయాలి అనుకున్న దూరాగతాలను రూహి సాక్ష్యాల తో సహా చూపడం తో చైనా తప్పు ఒప్పుకొని తల దించుకుంది.

ఆ స్వాతంత్ర దినోత్సవం రోజున...
ఎర్ర కోట పై మన జెండా ని రూహి బృందం, సుజిత, విక్రమ్ కలిసి ఎగరేశారు.
మన మువ్వన్నెల జెండా మరోసారి స్వేచ్ఛగా రెప రెప లాడింది.

ఆ దృశ్యం చూసి ప్రతి భరతీయుడి గుండె సంతోషం తో నిండిపోయింది.
ఆ క్షణం ఆకాశం లో నుంచి ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్ కూడా తన కుటుంబాన్ని చూసి ఆనంద పడుతూ కన్నీళ్లతో దీవించాడు.

అలా అందరూ సంతోషంగా మునిగిపోయి ఉండగా...
రూహి ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరా అని చూస్తే అక్కడ నంబర్ కనిపించలేదు. అందరి నుంచి కాస్త దూరంగా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది.

"గెలిచాను అని సంబరాలు చేసుకుంటున్నావా రూహి.. ఇది అంతం కాదు. ఆరంభం మాత్రమే. ఇక ముందు ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి. ఈసారి మేము కొట్టబోయే దెబ్బకు మీ దేశం మొత్తం ఉలిక్కిపడుతుంది." అంటూ అటు వైపు నుంచి ఓ గొంతు వినిపించింది.

"నువ్వెవరో నాకు తెలీదు. కాని ఒక్క విషయం గుర్తుంచుకో..
నీలాంటి శత్రువులు ఎంత మంది ఎదురువచ్చినా సరే... మీకు, నా దేశానికి మధ్యలో ఓ అణుబాంబు అడ్డుగా ఉంటుంది.
దాని పేరు ఏజెంట్ రూహి వాసుదేవ్..."

ఆ మాట వినగానే అవతలి వైపు నుంచి ఫోన్ కట్ చేసారు. రూహి నవ్వుతూ ముందుకు కదిలిపోయింది.
తనని చూస్తూ ఆ త్రివర్ణ పతాకం కూడా గర్వంతో పులకించిపోయింది.

                     ....భారత్ మతా కి జై...


-----------------------------------------------------------

భారతదేశం కోసం అహర్నిశలు పాటు పడే ప్రతి సైనికుడికి వందనాలు. మీరు లేనిదే మేము లేము..
ఇండియా... ఇదో పేరు కాదు.. కొన్ని కోట్ల హృదయాల చప్పుడు...
వీలైతే మన దేశాన్ని మరింతగా ప్రేమించి ఈ నేల రుణం కొంచెమైనా తీర్చుకుందాం..

ఏజెంట్ రూహి వాసుదేవ్ లో ఓ అధ్యాయం ముగిసింది. మరో ఆపరేషన్ లో మళ్ళీ కలుసుకుందాం..
అప్పటిదాకా సెలవు.


ఇట్లు,
సదా మీ రామ్





" ఏజెంట్ రూహి వాసుదేవ్... (ముగింపు) ?? " రచనకు రేటింగ్ ఇవ్వండి


[+] 7 users Like SivaSai's post
Like Reply
#69
అంతా బాగుంది శివసాయి గారు

కానీ దేశ ప్రధానమంత్రి హెలికాప్టర్లో వచ్చి రక్షించడం మరీ అసంబద్ధంగా ఉంది.

ఎక్కడా దేశాధ్యక్షులు ప్రధానమంత్రులు ఇటువంటి వాటిలో పాలు పంచుకోవడం వినలేదు, చదవలేదు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#70
Wow.. great story and great narration!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#71
enti Siva garu intha fast ga close chesesaru story ni?
Weekend trip aa malli? Good luck sir

Next story tho malli kalustaru anukuntunna!!
Thanks for all the wonderful stories
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#72
Excellent story. Ending konchem athi ga unna happy ending kabati np.
[+] 1 user Likes styleraja's post
Like Reply
#73
(23-05-2026, 09:19 AM)ash.enigma Wrote: enti Siva garu intha fast ga close chesesaru story ni?
Weekend trip aa malli? Good luck sir

Next story tho malli kalustaru anukuntunna!!
Thanks for all the wonderful stories

https://xossipy.com/thread-73786.html
Like Reply
#74
(23-05-2026, 09:19 AM)ash.enigma Wrote: enti Siva garu intha fast ga close chesesaru story ni?
Weekend trip aa malli? Good luck sir

Next story tho malli kalustaru anukuntunna!!
Thanks for all the wonderful stories

New Story Update Ichanu
Like Reply




Users browsing this thread: 1 Guest(s)