Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#1
ఏజెంట్ రూహి వాసుదేవ్ - 1



"రూహి లేమ్మ. ఆఫీస్ కి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది." అంటూ వంటింట్లో నుంచి సుజిత అప్పటికి మూడో సారి కేక వేసింది.

రూహి మాత్రం ప్రశాంతంగా నిద్ర లో మునిగిపోయింది. తన చెవులకు చుట్టూ తలగడ అడ్డంగా పెట్టుకొని పడుకోవడం తో అమ్మ మాటలు అస్సలు వినిపించడం లేదు.

ఇలా కాదు అని సుజిత ఈసారి నేరుగా రూహి గదిలోకి వచ్చింది. బెడ్ మీద చిన్న పిల్ల మాదిరి పడుకున్న రూహి ని కాసేపు ముచ్చటగా చూసింది. తన రూపం కంటి నిండా నింపుకుంది. తరువాత మెల్లగా తన దగ్గరకు చేరి గట్టిగా తట్టి లేపింది.

"ఏంటమ్మ అప్పుడే లేపుతున్నావ్. ఇంకాసేపు పడుకోని" అంటూ రూహి అటు తిరిగి పడుకుంది.

"సరే మరి. టైం ఇప్పటికే ఎనిమిది అయ్యింది. తొమ్మిది గంటలకు ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉంది అని చెప్పావ్. ఆ తరువాత నీ ఇష్టం." అని అంది.

ఆ మాట వినగానే రూహి టక్కున లేచి కూర్చుంది. ఒక్కసారి గడియారం వంక చూసింది. నిజంగానే టైమ్ 8 అయ్యింది.

"ఏంటమ్మ నువ్వు. టైం అవుతుంది, చిన్న పిల్లని లేపాలని తెలియదా. లేక వంటలక్క లతో ముచ్చట్లలో పడి మర్చిపోయావా" అని కన్ను కొట్టింది.

"నిన్ను..." అంటూ తనని కొట్టడానికి సుజిత ముందుకు వెళ్ళింది.

రూహి తనకు దొరకకుండా పరిగెత్తుకుంటూ బాత్ రూమ్ లోకి తుర్రుమంది. సుజిత నవ్వుతూ తన వంకే చూస్తుంది.
ఈ క్షణం తమ మధ్య విక్రమ్ వాసుదేవ్ ఉంటే ఎంత బాగుండు అని మనసులో అనుకుంది. విక్రమ్ గుర్తుకురాగానే తన కళ్ళలో నీళ్లు తిరిగాయి.

15 సంవత్సరాల క్రితం విక్రమ్ ఈ దేశం కోసం తన కుటుంబాన్ని సైతం కాదని ప్రాణ త్యాగం చేశాడు. తన సాహసం, తెగింపు చూసి ఈ దేశం మొత్తం గర్వం తో ఉప్పొంగింది. తన పేరు మీద అవార్డు ఒకటి ఇచ్చారు. కొన్ని రోజులు తన గురించి అందరూ చెప్పుకున్నారు, కన్నీళ్లు కార్చారు, పేపర్లో రాసారు. ఆ తరువాత మెల్లగా జనాలు ఆ విషయం మర్చిపోయారు. కానీ తను మాత్రం ఎప్పటికి మర్చిపోలేదు. మర్చిపోవాలి అనుకున్నా మరువలేని జ్ఞాపకం తను.

నిజానికి విక్రమ్ చనిపోయే సమయానికి సుజిత గర్భవతి. ఆ తరువాత తనకు ఒక అబ్బాయి పుట్టాడు. ప్రస్తుతం తను IIT లో చదువుకుంటున్నాడు. విక్రమ్ లేకపోయినా తన ఆశయం ఎప్పటికి బ్రతకే ఉండాలని తన కూతురు రూహి వాసుదేవ్ ని మాత్రం ఒక secret ఏజెంట్ లా మార్చింది. రూహి కూడా తండ్రి లక్షణాలను పునికి పుచ్చుకుంది. ఎవరిని లెక్క చేయదు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయడానికైనా సిద్ధంగా ఉంటుంది. అతి చిన్న వయసులోనే ఎవరికీ సాధ్యం కాని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తన పేరు చెప్తేనే శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది. డిపార్ట్మెంట్ అంతా తనని ఏజెంట్ వారసురాలు అంటే... శత్రువులు మాత్రం చోటా షేర్ అని పిలిచేవారు.

సుజిత ఇలా ఆలోచనల్లో మునిగిపోయి ఉండగానే రూహి బయటకు వచ్చింది.

"ఏమైంది మాతా శ్రీ. నన్ను కొట్టాల్సిన దెబ్బలను లెక్క పెడుతున్నావా" అని నవ్వుతూ అడిగింది.

సుజిత ఏమి మాట్లాడకపోతే రూహి తన దగ్గరగా వచ్చి తన కన్నీళ్లను చూసింది.

"నాన్న గుర్తొచ్చారా అమ్మ.." అని ప్రేమగా అడిగింది.

అవును అన్నట్టు సుజిత తల ఆడించింది.

"నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు గుర్తుందా అమ్మ... మన దేశపు జాతీయ పతాకం ఎగురుతున్నంత కాలం, ఆ స్వేచ్చా వాయువు ఆణువణువు లోను తను బ్రతికే ఉన్నాడని. నా దృష్టిలో నాన్న మన దగ్గరే మన చుట్టూనే ఉన్నాడు. మనం కన్నీరు కారుస్తూ నాన్నను బాధపెట్టకూడదు." అంటూ తన కన్నీరు తుడిచింది.

కళ్ళ ముందే ఎదిగిన కూతురుని చూసి సుజిత ఆప్యాయంగా తన తల నిమిరింది. రూహి కూడా ప్రేమగా తనని కౌగిలించుకుంది. కాసేపు ఇద్దరూ అలాగే ఉండిపోయారు.

"సరే, ఆలస్యం అవుతుంది. త్వరగా రెడీ అవ్వు. ఈలోగా టిఫిన్ వడ్డిస్తాను" అని అంటూ సుజిత అక్కడి నుంచి వెళ్ళింది. రూహి కూడా రెడీ అవ్వడం లో మునిగిపోయింది.
కాసేపటి తరువాత త్వరగా తినేసి బయలుదేరడానికి సిద్దమైంది.

"బండి మెల్లగా నడుపు. జాగ్రత్త " అని సుజిత మరోసారి హెచ్చరించింది.

రూహి తనకు చిరునవ్వుతోనే బదులు చెప్పి, ఇంటి ముందు ఉన్న బుల్లెట్ బండి ఎక్కి కూర్చుంది. ఒక్కసారి వాచ్ వంక చూసింది. ఇంకా 15 నిముషాలు మాత్రమే ఉండటం తో బైక్ ని వేగంగా దూకించింది. క్షణాల్లోనే బండి వేగం వంద దాటేసింది.

------------------------------------------------------------

ప్రధాన మంత్రి కార్యాలయం...

బోర్డు రూమ్ లో అందరూ ఇప్పుడు మన ప్రధాన మంత్రి ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఏ విషయమైనా సరే కేంద్ర రక్షణా శాఖ మంత్రే ఎవరికి చెందిన విషయం వారికి తెలియజేస్తాడు. కాని ఈరోజు మాత్రం అందరినీ హుటా హుటున రమ్మని పిలిపించడం తో కారణం ఏమై ఉంటుందా అని అందరిలో ఆత్రుత మొదలయింది. కచ్చితంగా ఇది ఏదో పెద్ద విషయం అని మాత్రం అక్కడున్న అందరికీ అర్థమవుతుంది.

ఇలా అందరూ ఆలోచనల్లో మునిగిపోయి ఉండగానే తలుపు తెరుచుకొని ప్రధాన మంత్రి లోపలకు వచ్చారు. ఆయన రావడం తో అందరూ గౌరవ సూచికంగా లేచి నిలబడ్డారు. ఆయన ఆ టేబుల్ మధ్యలో ఉన్న కుర్చీలో కూర్చొని, అందరి వంక చూస్తూ కూర్చోమని సైగ చేసాడు. కాసేపు అక్కడ ఉన్న అందరినీ తీక్షణంగా గమనించాడు.

అక్కడ కూర్చున్న వారిలో చాలా మంది దేశం మీద ప్రేమ కంటే, డబ్బు మీద ఆశ తో బ్రతుకుతున్న వారే అని ఆయనకు కూడా తెలుసు. కాని ఏమి చేయలేరు. ఎందుకంటే అవినీతి సిస్టమ్ లోని మూల మూలల్లో పాతుకుపోయింది. వాటిని పెకిలించడం మొదలుపెడితే, తన ప్రభుత్వమే కూలిపోతుంది అని ఆయనకు తెలుసు. అందుకే కొన్ని సార్లు అన్ని తెలిసినా, ఏమి తెలియనట్టు మౌనంగా ఉండిపోతారు.

అందరూ తననే చూస్తూ ఉండటం తో గొంతు సవరించుకొని మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టారు.
"ఈ అత్యవసర సమావేశం ఎందుకంటే, మన దేశం ఒక పెద్ద ప్రమాదం లో ఉంది." అని పలికారు.

ఆ మాట వినగానే అక్కడున్న అందరూ అర్థం కాక ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.

మెల్లగా మరోసారి చెప్పడం మొదలుపెట్టారు.
"మన పొరుగున ఉన్న చైనా ఎప్పటి నుంచో మన మీద ఆధిపత్యం చెలాయించాలని, మనల్ని తన అదుపులో పెట్టుకోవాలని చూస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.. ఆర్థికంగా, వైజ్ఞానికంగా, సైనికంగా మెల్లగా మన దేశం పురోగతి వైపు అడుగులు వేయడం చూసి తట్టుకోలేకపోతుంది. ఎలాగైనా మనల్ని తన అధీనం లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది.

సరిగ్గా ఇదే సమయం లో మన దేశం ఇంకొన్ని రోజుల్లో అమెరికా తో ఒక ఒప్పందం చేసుకోబోతుంది. ఆ ఒప్పందం ప్రకారం, మన దేశం లో విరివిగా దొరికే కొన్నిటిని వారి దేశానికి ఎగుమతి చేయాలి. వారి దేశం నుంచి దిగుమతి చేసే వాటి మీద సుంకం తగ్గించాలి. దానికి బదులుగా మన దేశానికి కావాల్సిన యుద్ధ ట్యాంక్ లు, విమానాలు, అణు బాంబులు వారు మనకు సమకూర్చి పెడతారు. అంతే కాదు. ఇక నుంచి మన శత్రువులను ఆపడం కోసం, అలాగే రక్షణ శాఖ బలోపేతం కావడానికి ఆధునాతన ఆయుధాల కోసం చేసే పరిశోధనల్లో ఒకరికొకరు భాగస్వామ్యం అవ్వాలని. ఆ ఒప్పందం కాని జరిగితే, మన దేశం కోసం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మరింత వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ, తొందర్లోనే పవర్ ఫుల్ దేశాల పక్కన మనం కూడా చేరుతాం.

ఆ విషయం తెలిసినప్పటి నుంచి చైనా కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎలాగైనా ఆ ఒప్పందం ఆపాలని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా ఇంకొక 15 రోజుల్లో మన దేశ స్వాతంత్ర దినోత్సవం రానుంది. అదే రోజు మన దేశాన్ని కుప్ప కూల్చడానికి, ఆ ఒప్పందం జరగకుండా ఉండడానికి ఒక పథకం పన్నింది అని చైనా లో ఉన్న మన ఏజెంట్స్ ద్వారా  మనకు సమాచారం అందింది.

చైనా లో మన మనుషులు చాలా మంది ఉన్నారు. అందుకని అక్కడ ఏం చేసినా మనకు తెలిసిపోతుంది అని అర్థమై... అత్యంత రహస్యంగా చైనా మిత్ర దేశమైన నార్త్ కొరియా తో చేతులు కలిపి, దాని రాజధాని pyongyang (ప్యోంగ్యాంగ్) లో ఏదో పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదేంటో మన వారు తెలుసుకోలేక పోయారు. కాని వారు విన్న దాని ప్రకారం... చరిత్ర లో ఎవరూ ఊహించని వినాశనం సృష్టించనున్నారు. మన దేశం లో పెద్ద ఉన్మాదానికి తెర తీయనున్నారు. చైనా, కొరియా ఆ ప్లాన్ లో విజయవంతమైతే మన దేశం జీవితాంతం వారి చేతిలో కీలు బొమ్మ లాగా మారబోతుంది.

కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అంతే కాకుండా దాన్ని నాశనం చేయాలి. లేకపోతే మన దేశం అభివృద్ధి లో మరో 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది."

ప్రధాన మంత్రి చెప్పింది వినగానే ఆ గదిలో ఉన్న అందరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. చీమ చిటుక్కు మన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవహించింది. ఆ నిశ్శబ్దాన్ని చేదిస్తూ మన దేశ రక్షణా శాఖ మంత్రి రాజ్ గోపాల్ పెదవి విప్పాడు.

"మీరు చెప్పింది వింటుంటేనే చాలా భయంగా ఉంది సార్. నార్త్ కొరియా... ప్రపంచం మొత్తం మీద అత్యంత క్రూరమైన నియంత, కిమ్ పాలన లో ఉంది. అక్కడ గాలి కూడా కిమ్ చెప్పినట్టుగానే వీస్తుంది. మనుషుల ప్రాణాలకు అస్సలు విలువ ఇవ్వడు. పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు తను.
అలాంటి తన దేశానికి వెళ్లి ఈ ఆపరేషన్ చేయడమంటే, మృత్యువు కు ఎదురు వెళ్లడమే..."

ఆ గది లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన మాటలతో ఏకిభవిస్తూ తల ఆడించారు.

"అందుకే ఆ పనిని ఒకరికి అప్పగించాను." అంటూ ప్రధాన మంత్రి తన ముందున్న బెల్ కొట్టారు.

మరు నిమిషం లో ఆ బోర్డు రూమ్ గది తలుపులు తెరుచుకున్నాయి. అందరూ తల తిప్పి అటు వైపు చూసారు.

చురుకైన చూపులతో, ఆత్మ విశ్వాసం నిండిన అడుగులు వేస్తూ... ఒక అమ్మాయి లోపలకు వచ్చింది. చూడటానికి తను పిన్ తీసేసిన బాంబు లాగా అనిపించింది. తనని చూడగానే అక్కడ ఉన్న సగం మంది ఆశ్చర్యపోయారు.

"ఇంత పెద్ద ఆపరేషన్ ని ఒక అమ్మాయి కి అప్పగించడమా... " అంటూ ఒక అధికారి బయటకే అన్నాడు.

"అమ్మాయి కాలిస్తే గన్ పెలదా? లేక శత్రువు గుండెల్లో బుల్లెట్ దిగదా?" అతని కంట్లోకి నేరుగా చూస్తూ చెప్పింది.

"నీలో అంత సత్తా ఉందా..."

"అయితే ఎప్పుడు వెళ్తున్నారు మరి "

"ఎక్కడికి?" అని ఆశ్చర్యంగా అడిగాడు.

"పైకి... ఎందుకంటే నా సత్తా చూసిన అందరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు." అంటూ ఆ అమ్మాయి తన పిడికిలి బిగించింది. ఆ అధికారికి ఏం చెప్పాలో తెలియక బిక్క మోహం వేసాడు.

ఇంతలో...
"ఇలాంటి ఆపరేషన్స్ లో గెలవడానికి అనుభవం చాలా ముఖ్యం..." అంటూ మరో అధికారి సందేహంగా పలికాడు.

"మన పురాణాల ప్రకారం... ఒక క్రూర రాక్షస రాజు చనిపోయే సమయంలో తన వయసు లక్ష సంవత్సరాలు. అదే వాడిని జయించిన అతని వయసు 53. కొన్ని సార్లు గెలవడానికి అనుభవం కంటే సరైన లక్ష్యం, గెలవాలి అనే పట్టుదల ఉన్నా సరిపోతాయి."

ఆ మాటకు అక్కడున్న అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆ అమ్మాయి స్థిరమైన మాటలు వింటుంటే అందరిలో కొంచెం నమ్మకం కలిగింది.

ఇంతలో ప్రధాన మంత్రి...
"ఈ అమ్మాయి మరెవరో కాదు. ఎదురుగా మరణం రంకెలు వేస్తున్నా సరే, కళ్ళలో భయం లేకుండా రొమ్ము విరిచి పోరాడి నిలిచిన విక్రమ్ వాసుదేవ్ వారసురాలు... ఏజెంట్ రూహి వాసుదేవ్..." అని అన్నారు.

ఆ పేరు వినగానే అక్కడ సీట్లలో కూలబడిన అందరూ నిటారుగా కూర్చున్నారు. రూహి వాసుదేవ్ వంక ఆశ్చర్యంగా చూసారు. నాన్న పేరు వినగానే రూహి గుండె కూడా గర్వం తో ఉప్పొంగింది.

"ఇప్పుడు ఎవరికైనా తన మీద సందేహంగా ఉందా..." అని ప్రధాన మంత్రి అందరి వైపు చూస్తూ అడిగారు. ఒక్కరు కూడా నోరు మెదపలేదు.

రూహి వైపు తిరిగి...
"రూహి... మన దేశ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. ఎలాగైనా విజయం సాధించి వస్తావని ఆశిస్తున్నాను."

"మన దేశపు జెండాను శత్రువుల గుండెల్లో సగర్వంగా ఎగరేసి వస్తాను సార్..."

"ఇదిగో మొత్తం వివరాలు. ఆల్ ది బెస్ట్ రూహి..."

"థాంక్ యు సార్..." అని ఆ ఫైల్ తీసుకొని రూహి బయటకు నడిచింది.

తను వెళ్తుంటే అందరూ తన వైపే చూస్తున్నారు. ఆ క్షణం తను అచ్చం విక్రమ్ వాసుదేవ్ లాగే కనిపించింది. తన నడకలో తడబాటు లేదు. తన కళ్ళలో గెలవగలను అనే నమ్మకం స్పష్టంగా కనిపిస్తుంది.

అందరికీ తను అడివిలో వేటడానికి వెళ్తున్న చిరుత పులి లాగా కనిపించింది. మరి ఆ వేట లో విజయం ఎవరిదో కాలమే నిర్ణయించాలి........
[+] 5 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Excellent start
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#3
ఏజెంట్ రూహి వాసుదేవ్...2



ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం...

భారత దేశ అభివృద్ధి ని అడ్డుకోడానికి చైనా, నార్త్ కొరియా తో కలిసి రహస్యంగా చేస్తున్న ఆపరేషన్ ని కనిపెట్టడానికి రూహి తన బృందం తో కలిసి బయలుదేరడానికి విమానాశ్రయంలో సిద్ధంగా ఉంది. అంతకు కొంత సమయం ముందే రూహి బృందానికి సంబంధించిన వివరాలు అన్ని RAW విభాగం నుంచి పూర్తిగా తొలిగించారు. ఎందుకంటే శత్రువులు వారి కోసం మన దేశ సిస్టమ్స్ ని హ్యాక్ చేసినా సరే, వారి వివరాలు ఒక్కటి కూడ బయట పడకూడదు అనే కారణంతో...

ఇప్పుడు కూడా రూహి బృందం మొత్తం దొంగ పేర్లు పాసుపోర్టులు సృష్టించుకొని, ఒక సాధారణ ప్రయాణికులు మాదిరి నార్త్ కొరియా సందర్శన కు వెళ్తున్నారు. మొత్తం ఆపరేషన్ అంతా రూహి చాలా పకడ్బందీ గా రచించింది. ఎందుకంటే ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది మొత్తం దేశానికే చాలా ప్రమాదం అని తనకు బాగా తెలుసు.

అలా తను ఆలోచనల్లో ఉండగానే...
"రూహి, ఇది మన దేశానికి చెందిన అతి ముఖ్యమైన మిషన్. విజయం తో తిరిగి రండి." అని RAW చీఫ్ జితేంద్ర మరోసారి హెచ్చరించాడు.

రూహి తప్పకుండా గెలుస్తాము అని ధీమాగా తల ఊపింది.

"అందరూ వచ్చినట్టేనా..." అని ఆయన అడిగాడు.

రూహి ఒకసారి తన చుట్టూ చూసింది. తన వెనుక పార్వతి, వంశీ కనిపించారు.
"ఒక్కరు తప్ప..." అని అంది.

ఇంతలో అక్కడికి... నల్ల కోటు, బ్లూ జీన్స్ ధరించిన ఆరు అడుగుల అబ్బాయి ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూడగానే ఆకర్షించే రూపం అతని సొంతం. అతని మోహం లో చిరునవ్వు ఎప్పుడు చెదరదు. అతని పేరే అయాన్. రూహి బృందం లో సభ్యుడు. అతను రాగానే రూహి తన వంక కోపంగా చూసింది. అతను కళ్ళ తోనే ఆలస్యం అయినందుకు క్షమాపణలు చెప్పాడు. రూహి విసురుగా చూసింది.

ఇంతలో వాళ్లు ఎక్కబోయే ఫ్లైట్ బయలుదేరడానికి సిద్ధంగా ఉందని అనౌన్స్ మెంట్ రావడం తో జితేంద్ర కు బాయ్ చెప్పి, రూహి తన బృందం తో కలిసి లోపలకు వెళ్ళింది.

నిజానికి రూహి కూడా తన బృందానికి బ్లాక్ కోబ్రా అనే పేరే పెట్టింది. తన తండ్రి అడుగు జాడల్లో నడవడమే కాకుండా తన తండ్రి ఆలోచనలు కూడా పుణికిపుచ్చుకుంది. పేరుకు తగ్గట్టే బ్లాక్ కోబ్రా టీం ఇప్పటిదాకా చేసిన ప్రతి ఆపరేషన్ కూడ విజయవంతంగా ముగించారు. ఇప్పుడు చాలా ప్రమాదకరమైన మిషన్ లో భాగం అయ్యారు. అయినా సరే వారి గుండెల్లో గుబులు లేదు. ఎందుకంటే వారి ముందు భగ భగ మండే ఓ అగ్ని పర్వతం ఉంది. తన పేరే... ఏజెంట్ రూహి వాసుదేవ్...

బ్లాక్ కోబ్రా టీం మొత్తం ఫ్లైట్ లో కూర్చున్నారు. పార్వతి, వంశీ ఒక సీట్ లో కూర్చుంటే, రూహి - అయాన్ వారి ముందు సీట్లో పక్క పక్కన కూర్చున్నారు.

విమానం మెల్లగా నేలను వదిలి ఆకాశం లోకి ఎగిరింది. రూహి తన పక్కన ఉన్న అద్దాల కిటికీ లో నుంచి బయటకు చూస్తుంది. మళ్ళీ ఇండియా కు ఎప్పుడు వస్తుందో తెలీదు. అసలు తిరిగి వస్తుందో లేదో కూడ తన దగ్గర సమాధానం లేదు. అందుకే మౌనంగా మనసులోనే తన కుటుంబాన్ని తలుచుకుంది.

ఇప్పుడు వారు ఎక్కిన విమానం ఢిల్లీ, హంకాంగ్, బీజింగ్ మీదుగా నార్త్ కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ చేరుకుంటుంది. ఆ దేశం కిమ్ అనే నియంత పాలన లో ఉంది. అక్కడ అత్యంత కఠినమైన ఆంక్షలు ఉంటాయి. చిన్న తప్పు చేసినా మరణ శిక్ష వేస్తారు. చాలా ఆచి తూచి వ్యవహారించాలి అని అనుకుంది.

ఇంతలో...
"నా మీద ఇంకా కోపం తగ్గలేదా మేడమ్?" అని అయాన్ అడగడం తో రూహి ఈ లోకం లోకి వచ్చింది.

రూహి తన వైపు తిరిగి...
"ప్రతిసారి నీకు ఆలస్యంగా రావడం అలవాటు అయిపొయింది. ఈ ఆపరేషన్ ఎంత ముఖ్యమో నీకు తెలీదా? " అని అడిగింది.

"నేను సరైన టైమ్ కే బయలుదేరాను మేడమ్. కాని దారిలో ఒక ముఖ్యమైన వస్తువు కనిపించింది. దాన్ని తీసుకొని రావడం తో ఆలస్యం అయ్యింది." అని అమాయకంగా సమాధానం చెప్పాడు.

"దీని కంటే అంత ముఖ్యమైనది ఏంటి?" మరింత కోపంగా అడిగింది.

అయాన్ వెంటనే తన వెంట తెచ్చిన బ్యాగ్ లో నుంచి పీచు మిఠాయి బయటకు తీసాడు. దాన్ని చూడగానే రూహి కళ్ళు మిల మిలా మెరిసిపోయాయి. చిన్నప్పుడు విక్రమ్ తనని బయటకు తీసుకొని వెళ్లి కొనిచ్చేవాడు. తనకు అదంటే చాలా ఇష్టం. మళ్ళీ చాలా రోజుల తరువాత చూడటం తో మనసు ఉప్పొంగింది.

దాన్ని చూడగానే రూహి మోహం లో అయాన్ మీద అప్పటిదాకా ఉన్న కోపం మొత్తం కరిగిపోయింది. తన పెదాల మీద చేరుతున్న చిరునవ్వు ను బలవంతంగా ఆపుకుంది. వెంటనే పీచు మిఠాయి ని తన చేతిలోకి తీసుకొని ఒక ముక్క నోట్లోకి పెట్టుకుంది.

అయాన్ తన వంక ఆరాధనా పూర్వకంగా చూసాడు. ఆ క్షణం తనకు రూహి ఒక చిన్న పిల్ల మాదిరి కనిపించింది. అయాన్ బ్లాక్ కోబ్రా టీం లోకి చేరి అప్పటికి మూడు సంవత్సరాలు అయ్యాయి. రూహిని చూడగానే తనకు పడిపోయాడు. తన మీద చెప్పలేనంత ఇష్టం పెంచుకున్నాడు. తనతో గడుపుతున్న ప్రతి క్షణం ఓ అద్భుతం లాగా అనిపించింది. తన మనసులోని మాట చెప్పాలని చాలా సార్లు ప్రయత్నించాడు. కాని రూహి కళ్ళ లోకి చూడగానే మాట పెదవి దాటి బయటకు రాదు. చేతులు కాళ్ళు వణికిపోతాయి. అసలు రూహి మనసులో ఏముందో తెలుసుకోవాలని చూసాడు. కాని ఇప్పటిదాకా తెలుసుకోలేక పోయాడు. ఈ ఆపరేషన్ పూర్తి అయ్యే లోగా అయినా తన ప్రేమ విషయం చెప్పాలి అని అనుకున్నాడు.

మొత్తం వారి ప్రయాణం 15 గంటలు కావడం తో... రూహి తనకు ఇష్టమైన సంగీతం వింటూ అలాగే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అలా నిద్రపోతున్నప్పుడు మెల్లగా ఒరిగి అయాన్ భుజం మీద తల వాల్చింది. ఆ క్షణం అయాన్ మనసులో ఒక రంగు రంగుల హరివిల్లు విరిసింది. మేఘాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. ఈరోజు తన అదృష్టం తలుచుకొని మనసులోనే మురిసిపోయాడు. రూహి రూపం తన మది నిండా నింపుకునే పనిలో పడ్డాడు.

అలా అందరూ ఎవరి పనుల్లో వారు మునిగిపోయి ఉండగా... ఆ ఫ్లైట్ లో బ్లాక్ కొబ్రా టీం కూర్చున్న చోటుకు కాస్త వెనకాల నుంచి ఒక జత కళ్ళు వారినే గమనిస్తున్నాయి. అతని కళ్ళకు నల్లని కళ్లద్దాలు పెట్టుకొని ఉండటం తో అతను చూస్తున్నట్టూ అక్కడున్న ఎవరికీ అనుమానం రాలేదు. అప్పుడప్పుడు తన ఫోన్ లో ఎవరూ చూడకుండా వారి ఫోటోలు కూడ తీసుకుంటున్నాడు.

ఇవేవి పట్టనట్టు విమానం మాత్రం గాల్లో విహారిస్తూ మేఘాల నడుమ గమ్యం వైపు రివ్వున సాగిపోయింది.

-------------------------------------------------------------

కొన్ని గంటల తరువాత...

వారు ఎక్కిన విమానం నార్త్ కొరియా రాజధాని లో ల్యాండ్ అయ్యింది. రూహి మరోసారి తన బృందాన్ని హెచ్చరించింది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయమని గుర్తుచేసింది. అందరూ సరే అన్నట్టు తల ఆడించారు.

మెల్లగా అందరూ విమానం దిగి ఎయిర్ పోర్ట్ లోకి వచ్చారు. వారు అలా ఎయిర్ పోర్ట్ లోకి రాగానే ప్రయాణికులు అందరినీ వరుసలో నిలబెట్టి అక్కడి అధికారులు వెంట తెచ్చిన లగేజ్ చెక్ చేస్తున్నారు.

లాప్టాప్, కెమెరా లాంటి వాటికి అనుమతి ఇవ్వడం లేదు. అలాగే కొంతమంది ప్రయాణికులు ఇష్ట దైవాల ఫోటోలు తీసుకొని వెళ్తుంటే వాటిని కూడ లాగేసుకున్నారు. ఎందుకు అని అడిగితే, ఈ దేశం లో ఉన్నంత వరకు వారి అధ్యక్షుడు కిమ్ ని మాత్రమే పూజించాలి అని కటువుగా బదులిచ్చారు.

అంతే కాకుండా కోకో కోలా, థమ్స్ అప్ లాంటి కూల్ డ్రింక్స్ ని కూడా తీసుకొని డస్ట్ బిన్ లో పడేసారు.  హై హిల్స్ వేసుకున్న అమ్మాయిల చెప్పులు విప్పించి వాటిని విసిరేశారు. ఇలా విమానాశ్రయం లో అక్కడికి వచ్చిన ప్రతి ప్రయాణికుడి ని క్షుణ్ణంగా తనిఖీ చేసి చాలా వాటిని లాగేసుకున్నారు.

ఆ మొత్తం తతంగం పూర్తి అయ్యే సరికి రెండు గంటల సమయం పట్టింది. అంత సేపు నిలబడి అందరికీ కాళ్ళు నొప్పులు అనిపించాయి. అందరిలో ఆకలి కూడా మొదలైంది. మొత్తానికి చెకింగ్ అయిపోయాక అక్కడి నుంచి వెళ్ళచ్చు అని చెప్పారు. అందరూ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

బ్లాక్ కొబ్రా టీం నెమ్మదిగా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు అడుగులు వేసింది. వారు అలా విమానాశ్రయం బయటకు రెండు అడుగులు వేసారో లేదో... ఒక పది మంది వారిని చుట్టు ముట్టారు. కాసేపు వారికి ఏమి అర్థం కాలేదు. వారంతా ఎయిర్ పోర్ట్ లో ఉన్న భద్రతా అధికారుల యూనిఫామ్ లో ఉన్నారు. వారి చేతుల్లో తుపాకీలు ఉన్నాయి.

ఏమైంది అని పార్వతి వారిని ఇంగ్లీష్ లో అడిగింది. మీ మీద సందేహంగా ఉంది, మిమ్మల్ని కాసేపు ఇంటరాగేషన్ చేయాలి అన్నారు. సరే అని బ్లాక్ కోబ్రా టీం వారి వెంట నడిచింది. వారిని ఒక సెక్యూరిటీ వ్యాన్ లో ఎక్కించుకొని ఎయిర్ పోర్ట్ కి కాస్త దూరం లో ఉన్న ఆఫీస్ లోకి తీసుకొని వెళ్లారు.

బ్లాక్ కోబ్రా టీం అందరిని అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టారు. కాసేపటికి వారి ముందుకు ఒక పెద్ద స్థాయి లో ఉన్న అధికారి వచ్చాడు. వారి దగ్గర ఉన్న పాస్ పోర్టు లు లాక్కున్నాడు. అతని మోహం లో వారి మీద స్పష్టమైన కోపం కనిపిస్తుంది.

"ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు?" అని సూటిగా ప్రశ్నించాడు.

"మేము ఇండియా నుంచి నార్త్ కొరియా ను సందర్శించాలని వచ్చాం " అని రూహి సమాధానం చెప్పింది.

వారి సంభాషణ మొత్తం ఇంగ్లీష్ లోనే జరుగుతుంది. రూహి లో విసుగు అంతకంతకు ఎక్కువ అవుతుంది. వారి పిచ్చి ప్రశ్నలు చూస్తుంటే చాలా కోపంగా ఉంది. కష్టం మీద ఆపుకుంటుంది.

"ఎలా వచ్చారు?" మరోసారి ప్రశ్నించాడు.

"మీ దేశం ఏమైనా అంతరిక్షం లో ఉందా, రాకెట్ వేసుకొని రావడానికి. విమానం లోనే వచ్చాము." అని విసురుగా సమాధానం ఇచ్చింది.

ఆ మాటకు ఆ అధికారి కోపంగా చూసాడు. రూహి కూడా తన వంక అలాగే చూసింది.

"ఇండియా లో మీరేం పని చేస్తుంటారు"

"నేను బండి మీద దోసెలు వేస్తాను. వీరంతా తింటూ ఉంటారు." అని సమాధానం ఇచ్చింది.

ఆ మాటకు బ్లాక్ కొబ్రా టీం అంతా నవ్వింది. ఆ అధికారి మోహం మాడిపోయింది. ఏదో చెప్పాలని నోరు తెరవబోయాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవ్వడం తో లేచి అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు.

"ఏంటి మేడమ్ మీరు? కొరియా అధికారులతో అలా మాట్లాడుతున్నారు. వారికి కోపం వస్తే మనల్ని తిరిగి వెనక్కి పంపిస్తారు." అని వంశీ కంగారుగా అన్నాడు.

రూహి ఒక్కసారి భారంగా నిట్టూర్చి...
"అసలు వాళ్లు భద్రతా అధికారులు అయితే కదా మనల్ని వెనక్కి పంపడానికి" అని సమాధానం ఇచ్చింది.

ఆ మాట వినగానే మిగతా సభ్యులు అందరూ షాక్ అయ్యారు.

"ఏంటి మేడమ్ మీరు అనేది?"

"మీకు ఇంకా అర్థం కాలేదా... విమానాశ్రయం లో మనల్ని చెక్ చేసిన అధికారుల భుజం మీద బంగారు రంగులో ఉన్న బ్యాడ్జ్ ఉంది. కాని వీరి భుజాల మీద ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. మనం ఎక్కిన సెక్యూరిటీ వ్యాన్ నంబర్ ప్లేట్ ని  గమనిస్తే ఒకదాని మీద మరొకటి అతికించి ఉంది.  అంతే కాదు.. వీరి దగ్గర type 64 unlicensed తుపాకీలు కూడ ఉన్నాయి. అది ఇక్కడి ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండవు.
నిజంగా ఇది ఒక అధికారుల ఆఫీస్ అయితే, నార్త్ కొరియా రూల్స్ ప్రకారం ప్రతి ప్రభుత్వ ఆఫీస్ ముఖ్య ఎంట్రన్స్ లో కిమ్ ఫోటో ఉండాలి. కాని ఇక్కడ అది కనిపించలేదు. అంతెందుకు.. ఇందాక మనల్ని ప్రశ్నలు అడిగిన వాడి కాళ్ళు చూసారా.... గోధుమ రంగు షూస్ ఉన్నాయి. ఇక్కడి అధికారులు అందరూ నల్ల రంగు ఉన్న షూస్ మాత్రమే ధరించాలి. ఇవన్నీ చూసాక కూడా వీరు నిజమైన సెక్యూరిటీ అధికారులు అని ఎలా అనుకుంటారు?"

రూహి చెప్పిన మాటలు వినగానే అక్కడున్న అందరూ కాసేపు ఆశ్చర్యం లో ఉండిపోయారు. అంత ఆశ్చర్యం లో కూడ రూహి నిశితమైన చూపు ను, తెలివిని మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయారు.

సరిగ్గా అప్పుడే... ఫోన్ మాట్లాడటం పూర్తి అవ్వడం తో ఆ అధికారి తిరిగి గదిలోకి వచ్చాడు. తన వెంట మరో నలుగురు వ్యక్తులు వచ్చారు. అందరూ తుపాకీలు బయటకు తీసి బ్లాక్ కోబ్రా టీం కు గురి పెట్టారు.

రూహి వారి వైపు చూసి ఒక నవ్వు నవ్వింది. అది చూసి ఆ అధికారులు ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.

రూహి ఒక్కసారి తన పిడికిలి బిగించింది. కళ్లు వేగంగా కదిలాయి. గుండెల నిండా శ్వాస తీసుకుంది. తన మెదడు పాదరసం లా పని చేసింది. ఒక్కసారి తన బృందం వైపు తిరిగింది.

"Guys... It's show time..." అని అంది.

" ఏజెంట్ రూహి వాసుదేవ్...2 " రచనకు రేటింగ్ ఇవ్వండి..
[+] 6 users Like SivaSai's post
Like Reply
#4
Super update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#5
ఏజెంట్ రూహి వాసుదేవ్...3




నార్త్ కొరియా భద్రతా అధికారుల వేషం లో వచ్చిన కొందరు రూహి బృందాన్ని తీసుకొని విమానాశ్రయం కు కాస్త దూరం లో ఉన్న తమ స్థావరానికి వచ్చారు. ఆ తరువాత ఐదు మంది రూహి బృందం మీద తుపాకీలు గురి పెట్టి నుంచున్నారు. అయినా సరే రూహి వాసుదేవ్ కంట్లో చిన్న పాటి భయం కూడ లేదు.

పైగా వారిని చూసి ఒక చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో మీరు నన్ను ఏమి చేయలేరు అనే ఆత్మ విశ్వాసం మెండుగా కనిపిస్తుంది. ఎదురుగా వంద మంది నిలబడినా తొణకని విక్రమ్ వాసుదేవ్ కూతురు తను... అలాంటిది ఈ ఐదు మందిని చూసి భయపడుతుందా...

ఒక్కసారి తన బృందం వైపు తిరిగి...
"Guys... it's show time" అని అంది.

అదేంటో అర్థం కాక ఎదురుగా ఆయుధాలతో నుంచున్న వారు ఆశ్చర్యం తో ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.

సరిగ్గా అప్పుడే రూహి...
"3... 2... 1... " అని చెప్పి తన చేతికి ఉన్న గడియారం లో ఏదో ప్రెస్ చేసింది.

అంతే... భూమ్ అంటూ ఆ నకిలీ అధికారుల వెనుక ఉన్న అద్దాలు పేలిపోయాయి. ఆ గదిలోకి వచ్చే సమయం లోనే రూహి కి వారి మీద అనుమానం వచ్చింది. అందుకే తను రహస్యంగా తెచ్చిన రెండు ఎలక్ట్రానిక్ బటన్ లు ఆ గది అద్దాలకు అతికించింది. రూహి బటన్ ప్రెస్ చేయగానే అవి అద్దాల మీద వైబ్రేషన్ సృష్టించాయి. దాంతో పెద్ద శబ్దం చేస్తూ అవి పేలిపోయాయి.

ఆ అద్దాలు కొన్ని వేగంగా వచ్చి ఆ నకిలీ అధికారులకు గుచ్చుకున్నాయి. రూహి బృందం ముందు వారు నిలబడి ఉండటం తో వారికి ఏమి అవ్వలేదు. ఊహించని ఆ చర్యకు, ఏం జరిగిందో చూద్దామని ఆ అధికారులు వెనక్కి తిరిగారు.

సరిగ్గా అదే అదునుగా భావించి, రూహి బృందం యాక్షన్ లోకి దిగింది.

రూహి తన ముందున్న ఒకడి చెయ్యి వెనక్కి విరిచి పట్టుకుంది. ఈలోగా రెండో వాడు తన మీదకు వచ్చాడు. పంజా విసిరే చిరుత పులి లాగా రూహి ఎగిరి వాడి గుండెల మీద  తన్నింది. దెబ్బకు వాడు దూరంగా పడ్డాడు. వాడి చేతిలోకి తుపాకీ కూడా కింద పడిపోయింది. రూహి అలాగే తను పట్టుకున్న వాడి చేతిలోని తుపాకీ లాక్కుంది.

ఈలోగా పార్వతి, అయాన్, వంశీ కూడ తమ ముందున్న వారిని మట్టి కరిపించారు. వాళ్లు తిరిగి వారి మీదకు రాబోతుంటే రూహి తన చేతిలో ఉన్న తుపాకీ తో అందరినీ  కాల్చేసింది. ఒక్క వారి నాయకుడిని తప్ప... కళ్ళు మూసి తెరిచేలోగా ఆ నకిలీ అధికారులు అందరూ నేల కూలారు.

కాని ఆ రౌడీలు ఇంకా చాలా మంది ఉన్నారని రూహి కి తెలుసు. ఏ క్షణమైనా వారు పైకి రావచ్చు అనిపించింది. అందుకే వెంటనే వారు ఉన్న గది, అలాగే ముందున్న గది తలుపులు కూడా వేసేయమని సైగ చేసింది. మిగతా బృందం అలాగే చేసారు.

రూహి ఆలస్యం చేయకుండా మిగిలిన వాడి తల మీద తుపాకీ గురి పెట్టింది.

"మమ్మల్ని చంపమని ఎవరు పంపించారు?" అని సూటిగా ఇంగ్లీష్ లో అడిగింది.

వాడు చెప్పను అన్నట్టు మోహం అటు వైపుకు తిప్పుకున్నాడు. రూహి కోపంగా వాడి మోహం మీద ఒక్క తన్ను తన్నింది. వాడి పెదవి చిట్లి రక్తం వచ్చింది.

"ఆ దేవుడు నాకు ధైర్య సాహసాలు ఎక్కువ ఇచ్చి, సహనం చాలా తక్కువ ఇచ్చాడు. దాన్ని పరీక్షించకు. ఎవరు పంపించారో త్వరగా చెప్పు..." అని మరోసారి రెట్టించి అడిగింది.

వాడు నోరు విప్పడం లేదు. రూహి లో కోపం ఎక్కువ అయ్యింది. సరిగ్గా అదే సమయం లో బయట నుంచి తలుపు బాదడం మొదలయింది. ఆ రౌడీల గ్యాంగ్ వచ్చింది అని అర్థమైంది. అందరూ తల తిప్పి అటు చూసారు. సరిగ్గా అప్పుడే... రూహి తుపాకీ కింద ఉన్న వాడు, ఆ తుపాకీ ట్రిగ్గర్ నొక్కుకొని తనని తాను కాల్చుకొని చనిపోయాడు. ఊహించని ఆ దృశ్యం చూసి బ్లాక్ కోబ్రా టీం మొత్తం షాక్ అయ్యింది. ఈలోగా ఆ తలుపు దగ్గర తుపాకీల చప్పుడు మొదలయింది.

ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు, వారి దగ్గర అసలు సమయం లేదు అని అనిపించింది. రూహి వెంటనే తన ఫోన్లో ఎదురుగా చనిపోయిన వాళ్ళ ఫోటోలు తీసుకుంది. ఆ తరువాత వాడి జేబులు వెతికింది. ఒక పర్స్ దొరికితే . దాన్ని తీసుకుంది. అలాగే ఆ రౌడీల దగ్గర ఉన్న తుపాకీలు కూడా బ్లాక్ కోబ్రా టీం స్వాధీనం చేసుకున్నారు.

రూహి ఒక్కసారి ఆ గది మొత్తం తీక్షణంగా చూసింది. ఎదురుగా ఉన్న గోడ మీద ఒక బొమ్మ కనిపించింది.
[Image: image?pratilipiId=6755373531337776&name=...0&type=jpg]


అది ఎందుకో తనకు చాలా అనుమానంగా అనిపించింది. దాని ఫోటో కూడా ఒకటి తీసుకుంది.

ఇంతలో తలుపు దాటి లోపలకు రావడానికి ఆ రౌడీలు దగ్గరపడినట్టు అనిపించింది.

"మేడమ్, ఇప్పుడు తలుపుకు అటువైపు ఎంత మంది రౌడీలు ఉన్నారో తెలీదు. వారిని దాటుకొని బయటకు వెళ్లడం ఎలా?" అని వంశీ సందేహంగా అడిగాడు.

దానికి రూహి నవ్వుతూ,
"గాల్లో ఎగురుకుంటూ తప్పించుకుందాం..." అని సమాధానం ఇచ్చింది.

అందరూ తన వంక ఆశ్చర్యంగా చూసారు. రూహి బృందం ఇప్పుడు పదో అంతస్తులో ఉంది. అక్కడి నుంచి కిందకు దూకితే ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే వారిలో ఆ ఆశ్చర్యం...

రూహి అందరి వంక చూస్తూ నవ్వుతూ... ఆ పక్కనే ఉన్న ఫైర్ ఎక్సటింగ్యూషర్ పైప్ చేతిలోకి తీసుకుంది. ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఎదురుగా అద్దాలు కనిపించాయి. పరిగెత్తుకుంటూ దాన్ని బద్దలు కొట్టుకొని కిందకు దూకింది. అక్కడున్న పైప్ వేగంగా సుడులు తిరుగుతూ దూసుకొని వెళ్ళింది.

బ్లాక్ కోబ్రా టీం షాక్ లో ఉన్నారు. అయాన్ తేరుకొని పరిగెత్తుకుంటూ ఆ అద్దాల దగ్గరకు వెళ్ళి కిందకు తొంగి చూసాడు. కింద రూహి సురక్షితంగా కనిపించడం తో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తరువాత మిగతా బృందం కూడా వేగంగా ఆ పైప్ పట్టుకొని కిందకు దుకారు.

అక్కడ ఎక్కువ సేవు నిలబడి ఉండటం మంచిది కాదు అని అందరూ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఆ సిటీ సెంటర్ కి చేరుకున్నారు. తమని ఎవరూ తరమడం లేదని నిర్దారణ చేసుకొని, అప్పుడు కాస్త కుదుటపడ్డారు. వెంటనే అందరికీ బాగా ఆకలిగా ఉండటం తో ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ లోకి వెళ్లారు. పార్వతి, వంశీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే... రూహి, అయాన్ టేబుల్ దగ్గరే కూర్చొని ఉన్నారు.

రూహి ఒకసారి అయాన్ వంక చూసింది. తన మోహం లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది.
"మోహం మాడిపోయిన మసాలా దోసె లాగా పెట్టావ్. ఏమైంది అలా ఉన్నావ్ అయాన్" అని అడిగింది.

అయాన్ కోపంగా రూహి వంక చూసాడు.

"అయ్య బాబోయ్... అదంతా కోపమే... కాస్త కోపం పక్కనపెట్టి మాట్లాడండి సార్.." అని నవ్వుతూ అడిగింది.

"ఏంటి మేడమ్ మీరు. మీ మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తారా? ఒక్కసారి కూడా ముందు వెనుక ఆలోచించరా... అంత ఎత్తు నుంచి కిందకు దూకారు. పొరపాటున మీకేమైనా అయితే?" అని ఆవేశంగా అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కళ్ళలో సన్నని నీటి పొర కనిపించింది.

"నష్టం గురించి ఆలోచిస్తే వ్యాపారి, మరణం గురించి ఆలోచిస్తే సైనికుడు ముందుకు అడుగు వేయలేరు అయాన్. అయినా నాకేమైనా అయితే ఏమవుతుంది" అని అతని వంక చూస్తూ అడిగింది.

"మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వారు ఏమవుతారు?"

"నన్ను నమ్ముకొని ఎవరున్నారు."

"ఎవరు అంటే నేను..."

ఆ మాటకు రూహి తన వంక ఆశ్చర్యంగా చూసింది.

అయాన్ తేరుకొని...
"నేను అంటే.. అది.. అది.. మన బృందం, మన దేశం" అంటూ తడబడుతూ చెప్పాడు.

"అయినా ఇలాంటి సాహసాలు చేస్తే ఏమవుతుంది. మహా అంటే నేను చచ్చిపోతాను. అంతే కదా..." అని రూహి అంటుంటే అయాన్ టక్కున చేతులతో తన నోటిని మూసేసాడు.

"కలలో కూడా అలా మాట్లాడకండి మేడమ్..." అని అన్నాడు.

రూహి తన కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోయింది. ఆ కళ్ళలో తనకు ఏమైనా అవుతుందేమో అని కంగారు, భయం కనిపిస్తున్నాయి. మనకోసం అలా తపించే వ్యక్తిని చూస్తే మనసులో ఒక విధమైన వింత భావం చెలరేగుతుంది. అలాంటిదే రూహి మదిలో కూడా కలిగింది.
ఇంతలో అక్కడికి పార్వతి, వంశీ రావడం తో ఇద్దరూ సర్దుకొని కూర్చున్నారు.

అయాన్ కు తనంటే ఇష్టమని రూహికి ఎప్పుడో తెలుసు, కాని తను ఇప్పటిదాకా అలా ఎప్పుడూ ఆలోచించలేదు. కాని నేడు మాత్రం రూహి మదిలో మొదటిసారి వింత అలజడి రేగింది. ఆ అలజడి మాత్రం బాగుంది అనిపించింది. ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయింది.

ఆ క్షణం వారికి తెలియని విషయం ఏంటంటే... రూహి బృందం కూర్చన్న చోటుకు రెండు టేబుల్స్ వెనకాల ఒకరు వారినే గమనిస్తూ ఉన్నారు. అతను మరెవరో కాదు... రూహి బృందం ఇండియా నుంచి నార్త్ కొరియా బయలుదేరినప్పుడు విమానం లో వారిని వెంబడించిన అతనే.. అతని చూపులు ప్రతి క్షణం బ్లాక్ కోబ్రా బృందం మీదే ఉన్నాయి.

-------------------------------------------------------------

సరిగ్గా అదే సమయంలో...

ఇండియా లోని ఒక కిరాయి ముఠా కు ఫోన్ వచ్చింది. ఆ ముఠా నాయకుడు జలంధర్...

ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు.

"నీతో ఒక ముఖ్యమైన పని పడింది." అని అటు వైపు నుంచి ఓ గొంతు వినిపించింది.

"చెప్పండి భాయ్..." అని జలంధర్ అన్నాడు.

"ఒకరి ఫోటో పంపిస్తాను. ఇప్పుడు తను ఎక్కడుందో కనుక్కోవాలి. ఆ తరువాత నా నుంచి ఆదేశాలు రాగానే తనని పైకి పంపాలి."

"అంత చిన్న పనికి నేనేందుకు. మా కుర్రాళ్ళు ఉన్నారు. వారే చూసుకుంటారు."

"మొత్తం విషయం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మీరు వెతకబోయే వ్యక్తి సామాన్యురాలు కాదు. ధైర్య సాహసాలు తన నర నరాల్లో ఉన్నాయి. ఇది చాలా రహస్యంగా చేయాలి. ఏ మాత్రం ఎవరికైనా అనుమానం వచ్చినా నీతో పాటు, నేను కూడ మిగలను."

"సరే భాయ్.. ముందైతే ఫోటో పెట్టండి. మూడు రోజుల్లో  పని పూర్తి చేస్తాను." అని జలంధర్ అన్నాడు.

"సరే..." అని అటు వైపు నుంచి ఫోన్ కట్ అయ్యింది.

కాసేపటికి జలంధర్ ఫోన్ కి ఒక ఫోటో వచ్చింది. మెల్లగా దాన్ని ఓపెన్ చేశాడు. అందులో విక్రమ్ వాసుదేవ్ భార్య సుజిత ఫోటో ఉంది. తనని చూస్తూ ఒకసారి వెకిలిగా నవ్వాడు. ఆ తరువాత తన దగ్గర పనిచేసే కుర్రాళ్లను పిలిచి ఆ ఫోటో లో ఉన్న తనని నగరంలో ఎక్కడున్నా సరే వెతకమని చెప్పి పంపించాడు....
[+] 6 users Like SivaSai's post
Like Reply
#6
[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]
ఏజెంట్ రూహి వాసుదేవ్...4



బ్లాక్ కొబ్రా బృందం సిటీ సెంటర్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లో తమ ఆకలి తీర్చుకున్నారు. ఆ తరువాత అటు నుంచి అటే ఆ నగరం లో ఉన్న ప్రముఖ హోటల్ కి చేరుకున్నారు. నిజానికి రూహి బృందం అక్కడికి వచ్చే ముందే ఆ హోటల్ లో రెండు గదులు బుక్ చేసుకున్నారు. నార్త్ కొరియా లోకి అడుగు పెట్టె ప్రతి ఒక్క పర్యాటకులు, ఇక్కడ తాము ఎక్కడ ఉంటారో ముందే బుక్ చేసుకొని వాటిని విమానాశ్రయం లో ఇమిగ్రేషన్ అధికారులకు చూపించాలి. అందుకని వారు ముందే చేసుకోక తప్పలేదు.

అందరూ హోటల్ లోకి ప్రవేశించారు. రూహి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి తన పేరు చెప్పింది. తన పేరు వినగానే రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి కళ్ళు ఒక రెండు క్షణాలు పాటు పెద్దవి అయ్యాయి. ఆ దృశ్యం రూహి చూపు దాటి పోలేదు.
ఏదైనా ఎదురుచూస్తుంది విన్నప్పుడు, ఊహించనిది చూసినప్పుడు మాత్రమే అలా కళ్ళు కొన్ని అంగుళాలు పెద్దవి అవుతాయని తనకు తెలియంది కాదు.

ఇంతలో ఆ అమ్మాయి నవ్వుతూ ఒకసారి తన ముందున్న సిస్టమ్ లో వారి పేర్లు చెక్ చేసింది. ఆ తరువాత వారి పాసుపోర్టు లు కూడా వేరిఫై చేసుకుంది.

"నార్త్ కొరియా కు స్వాగతం మేడమ్. మీ రూమ్ నంబర్లు 304, 305 " అని ఇంగ్లీష్ లో చెప్పి ఒక హోటల్ బాయ్ ని పిలిచింది.

తను ఆ గదుల కీస్, లగేజ్ తీసుకొని వారికి దారి చూపించాడు. అందరూ తనని అనుసరించారు. వారు అలా ముందుకు వెళ్ళగానే...
ఆ రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి వెంటనే ఫోన్ తీసి ఎవరి నంబర్ కో ఫోన్ చేసింది.
"వాళ్లు ఇక్కడికి వచ్చారు." అనే సందేశం పంపించింది.

కాసేపటికి రూహి బృందం తమ గదుల ముందుకు చేరుకున్నారు. వారికి ఇచ్చింది ఎదురెదురుగా ఉండే రెండు గదులు. రూహి, పార్వతి 304 లోకి వెళ్తే...
వంశీ, అయాన్ 305 లోకి వెళ్లారు. వాళ్లు అలా లోపలకు వెళ్లి తలుపు వేసుకోగానే అక్కడికి వారిని తీసుకొని వచ్చిన హోటల్ బాయ్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

బాగా ప్రయాణం చేయడం, విమానాశ్రయం లో నుంచి బయటకు రాగానే యాక్షన్ లోకి దిగడం తో రూహి బృందం బాగా అలిసిపోయారు. దాంతో అలా పడుకోగానే మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.

-------------------------------------------------------

అర్ధరాత్రి అవుతుండగా... ఆ హోటల్ వెనుక వైపు ఉన్న తలుపు తెరుచుకుంది. అందులో నుంచి మొహానికి ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి చిన్న బాక్స్ పట్టుకొని లోపలకు వచ్చాడు. అతని కోసమే ఎదురుచూస్తున్న హోటల్ బాయ్, అతను రాగానే సెల్యూట్ చేశాడు.

"మీరు అడిగిన లేడీ 304 లో ఉంది." అని చెప్పి ఒక తాళం చెవి అతని చేతిలో పెట్టాడు.

వెంటనే ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి నవ్వుతూ, ఆ హోటల్ బాయ్ చేతిలో కొంత డబ్బు పెట్టాడు. దాన్ని చూడగానే అతని మోహం వెలిగిపోయింది. ముసుగు మనిషి మెల్లగా ఆ వంట గది నుంచి బయటకు వచ్చి, మెట్ల మార్గం ద్వారా మూడో అంతస్తుకు చేరుకున్నాడు.

అప్పటికే ఆ హోటల్ సెక్యూరిటి లో ఉన్న ఇద్దరికి డబ్బులు అందడం తో ఆ అంతస్తులో ఉన్న సీసీ టీవీ లు రికార్డు అవ్వకుండా చేసారు. అందుకే ధైర్యంగా ఆ ముసుగు మనిషి ముందుకు నడిచాడు. అర్ధరాత్రి కావడం తో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఎక్కడా ఎలాంటి అలికిడి లేదు. అతను అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు.  మెల్లగా 304 ముందుకు చేరుకున్నాడు.

ఒకసారి అటు ఇటు చూసాడు. ఎవరూ లేరని నిర్దారించుకొని మెల్లగా తన దగ్గర ఉన్న డూప్లికేట్ తాళం తో ఆ గది తలుపులు తెరిచాడు. బెడ్ లైట్ వెలుతురులో ఎదురుగా మంచం మీద ఇద్దరు దుప్పటి కప్పుకొని నిద్రపోతు కనిపించారు. వారిని అలా చూడగానే అతని కళ్ళలో ఆనందం కలిగింది. వెంటనే తను తెచ్చిన బాక్స్ లో నుంచి ఒక పెద్ద తుపాకీ బయటకు తీసి లోడ్ చేశాడు. ఆ తుపాకీ చివర సైలెన్సర్ ఉంది. కాబట్టి కాల్చినా పెద్దగా శబ్దం రాదు.

ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకున్నాడు. ఆ తరువాత తన చేతిలో ఉన్న తుపాకీ తో కసి తీరా కాల్చాడు. ఆ తుపాకీలో ఉన్న గుళ్ళు అన్ని మంచం మీద ఉన్న ఇద్దరిలో దూసుకొని వెళ్లాయి. అలా కొన్ని క్షణాలు పాటు అతని తుపాకీ ఆగకుండా తూటాల వర్షం కురిపిస్తూనే ఉంది. తుపాకీలో గుళ్ళు అన్ని అయిపోయాక ఒకసారి బెడ్ మీద చూసాడు. ఎలాంటి ఉలుకు పలుకు లేదు. కచ్చితంగా చచ్చి ఉంటారు అనుకొని మనసులోనే సంతోషించి, ఆ గదిలో ఉన్న లైట్లు వేసాడు.

ఆ తరువాత మంచం వైపు చూసి షాక్ అయ్యి అలా నోరు తెరిచి ఉండిపోయాడు. ఎందుకంటే అప్పటిదాకా తను కాల్చింది మనుషులను కాదు, తలగడలను.. మంచం మీద ఒద్దిగ్గా వాటిని మనుషులు మాదిరి పేర్చారు.

అది చూసి అతని నుదుటి మీద నుంచి చమట జారింది. చేతులు వణికాయి. గుటకలు మింగుతున్నాడు. సరిగ్గా అప్పుడే అతని భుజం మీద ఒక చెయ్యి పడింది. టక్కున వెనక్కి తిరిగి చూసాడు. ఎదురుగా ఎరుపెక్కిన కళ్ళతో ఏజెంట్ రూహి వాసుదేవ్ నిలుచొని ఉంది.

"అడవిలో జూలు విదిల్చిన సింహాన్ని పట్టుకోవడం, నన్ను చంపడం రెండు అంత తేలిక కాదు. అయినా దొంగ దెబ్బ తీసే మీకే అంత తెలివి ఉంటే, దొరలా మీ దేశానికి వచ్చిన నాకెంత ఉండాలి..." అంటూ వాడి మోహం మీద ఒక్క గుద్దు గుద్దింది. దెబ్బకు అతను అలాగే మంచం మీద పడిపోయాడు. ఈలోగా మిగతా బృందం తనని అక్కడే ఉన్న కుర్చీలో కట్టేసారు.

నిజానికి పడుకునే ముందు రూహి అప్పటిదాకా జరిగింది మొత్తం ఒకసారి గుర్తు చేసుకుంది. తన వంక ఆశ్చర్యంగా చూసిన రిసెప్షనిస్ట్, అలాగే తమని 304 లోకి మాత్రమే వెళ్ళాలి అని చెప్పిన ఆఫీస్ బాయ్.. ఇలా ప్రతి ఒక్కటి తనలో అనుమానం రేపాయి. అందుకే ఎందుకైనా మంచిది అని వారి గదిలో తలగడలను మనుషులు మాదిరి పేర్చి ఇద్దరూ అయాన్ రూమ్ లోకి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ వారి గది ముందు ఒక చిన్న పాకెట్ కెమెరా అమర్చారు. దాని సాయం తో బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. ఆ తరువాత ముసుగు మనిషి రావడం, వీరి చేతికి దొరకడం చక చకా జరిగిపోయాయి.

రూహి మెల్లగా వెళ్లి కట్టేసిన అతని ముందు కూర్చుంది.

"ఒక విషయం గుర్తుంచుకో. సాధారణంగా సైనికులు రెండు రకాలు.
మొదటి రకం, శత్రువు ఎదురుగా వస్తే ఏం చేయాలా అని ఆలోచించే వాళ్లు...
నేను రెండో రకం, శత్రువుకు ఎదురుగా వెళ్లి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాను.
నాలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి."

ఆ మాటకు ముసుగు మనిషికి ఏమని సమాధానం చెప్పాలో మౌనంగా ఉండిపోయాడు.

"సరే... మమ్మల్ని చంపమని నిన్ను ఎవరు పంపించారో  చెప్పు.." అని సూటిగా చూస్తూ అడిగింది.

ముసుగు మనిషి ఏమీ మాట్లాడటం లేదు. రూహిలో సహనం తగ్గింది. పక్కనే టేబుల్ మీద ఉన్న చిన్న పాటి కత్తి తీసుకొని నేరుగా అతని తోడ మీద పొడిచింది. రక్తం చిమ్మింది. గట్టిగా అరవకుండా వంశీ వాడి నోట్లో గుడ్డ కుక్కాడు.

వాడిని అలా కాసేపు నొప్పికి విల విల లాడేలా చేసాక, మెల్లగా నోటికి అడ్డం తీశారు.

"కాలి నుంచి రక్తం కారుతుంది. వెంటనే ఆపాలి. ఇంకాసేపు దాన్ని అలాగే వదిలేస్తే రక్తం కారడం ఎక్కువై శ్వాస ఆడటం కష్టంగా మారుతుంది. మెల్లగా స్పృహ తప్పుతావు. ఆ తరువాత నిద్రలోనే ప్రాణాలు కోల్పోతావు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే నువ్వు నిజం చెప్పాలి. చెప్తావా? లేక చస్తావా?" రూహి వాడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది.

"చెప్తాను... చెప్తాను.." అని వేడుకున్నాడు.

సరే చెప్పు అన్నట్టు రూహి అతని వంక చూసింది.

"నా పేరు జాన్. నేను సుఫారి తీసుకొని మర్డర్లు చేస్తూ ఉంటాను. అలాగే నిన్ను చంపమని ఒకరు అడిగారు. బదులుగా చాలా డబ్బు ఆశ చూపారు. నిజానికి అతని పేరు కూడా నాకు తెలీదు. అతని మోహం కూడా నేను చూడలేదు. ఎందుకంటే నన్ను కలవడానికి వచ్చినప్పుడు అతని మొహానికి ముసుగు ఉంది. ఇదే నిజం. నన్ను వదిలేయండి." అని బ్రతిమాలాడు.

"బాగా ఆలోచించుకో... అతని మోహం చూడకపోయినా అతని దగ్గర ఏదైనా గుర్తించేలా చూసావా.." అని అడిగింది. జాన్ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు.

రూహి కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరు పంపించారో తెలియకుండా ముందుకు వెళ్లడం అసాధ్యం అనిపించింది. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన ఫోన్ లో ఒక ఫోటో చూపించింది.
[Image: image?pratilipiId=6755373531364534&name=...0&type=jpg]

అది నిన్న ఆ నకిలీ అధికారుల ఆఫీస్ లో చూసిన బొమ్మ...

"దీన్ని ఎక్కడైనా చూసావా " అని అడిగింది.

కాసేపు ఆలోచించి...
"గుర్తొచ్చింది. మిమ్మల్ని చంపమని చెప్పడానికి వచ్చినప్పుడు, అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. దాని మీద ఇదే బొమ్మ ఉంది." అని అన్నాడు.

రూహి వెంటనే ఆ బొమ్మ, దాని వెనుక ఉన్న కథ ఏంటో కనిపెట్టాలి అనుకుంది. దానికంటే ముందు ఇక ఆ హోటల్ లో ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు అని నిర్ణయించుకుంది.

"మేడమ్, వీడిని ఇప్పుడు ఏం చేద్దాం " అని వంశీ అడిగాడు.

"ఇలాంటి వాడు కచ్చితంగా ఇక్కడి సెక్యూరిటీ ఆఫీసర్ల క్రిమినల్ రికార్డ్స్ లో ఉండే ఉంటాడు. వీడిని ఇక్కడే కట్టేసి లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేయండి. వాళ్లే చూసుకుంటారు. దానికంటే ముందు వాడి రెండు చేతులకు బొటనవేళ్లు తీసేయండి. ఒకవేళ సెక్యూరిటీ ఆఫీసర్లు వదిలినా, జన్మలో వీడు ఇంకెవరిని మర్డర్ చేయకూడదు." అని రూహి చెప్పింది.

రూహి చెప్పింది విని మిగతా బృందం కాసేపు షాక్ అయినా సరే, తన సమయస్ఫూర్తి ని మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తరువాత తను చెప్పినట్టుగానే చేసారు. రక్తం కారకుండా వాటికి బ్యాండేజ్ కూడా కట్టి, అక్కడి లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసారు.

"మేడమ్ సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి." అని పార్వతి అంది.

"నేను అదే అనుకుంటున్నాను. కాని ఒకసారి ఆలోచించు.. ఈ రౌడీ ఇంత దర్జాగా ఈ హోటల్ లోకి వచ్చాడు అంటే కచ్చితంగా వీడికి సహాయం చేసే వాళ్లు ఈ హోటల్ లో ఉన్నారని అనిపిస్తుంది. అలాగే కనిపించని మన శత్రువుకు సహాయం చేసేవాళ్ళు కూడా ఉండచ్చేమో.. మనం బయటకి వెళ్లడం వారు చూస్తే మన సమాచారం వారికి అందుతుంది."

"మరి ఎవరికీ తెలియకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలం మేడమ్.."

"దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది." అని రూహి వెంటనే రిసెప్షన్ కి ఫోన్ చేసి డిన్నర్ ఆర్డర్ చేసింది. అలాగే రూమ్ క్లీనింగ్ కూడా చేయాలి అని చెప్పింది.

అంత అర్ధరాత్రి వేళ ఇదేంటి అని రిసెప్షనిస్ట్ మనసులో అనుకున్నా సరే , కస్టమర్స్ చెప్పింది చేయక తప్పదు అనుకొని వెంటనే సంబంధిత పనివారి ని పైకి పంపించింది. వాళ్లు ఒక వీల్ చైర్ లాంటి దాంట్లో అన్ని పెట్టుకొని తోసుకుంటూ వచ్చారు.
[Image: image?pratilipiId=6755373531364534&name=...0&type=jpg]

వాళ్లు రాగానే రూహి వారి మీద మత్తు మందు స్ప్రే చేసింది. దాని వల్ల వారు మరో గంట దాకా నిద్ర లేవరు. రూహి, అయాన్ వెంటనే వారి దుస్తుల్లోకి మారిపోయారు.

పార్వతి, వంశీ వారి లగేజ్ పెట్టుకొని ఆ బండ్లో కింద కూర్చొని ఉంటే... రూహి, అయాన్ తోసుకుంటూ కిందకు వెళ్లారు. జాగ్రత్తగా హోటల్ కిందకు చేరుకున్నారు. రిసెప్షన్ లో ఉన్న వారు కూడా వారి మొహాలు సరిగా చూడకపోవడం తో వీరి మీద అనుమానం రాలేదు.

వెంటనే హోటల్ స్టోర్ రూమ్ లోకి వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఒక డోర్ కనిపించింది. ఇదే సరైన సమయం అనుకొని అందులో నుంచి తప్పించుకొని బయటకు వచ్చేసారు.

ఆ క్షణం వారు ఆ హోటల్ నుంచి బయటపడ్డాం అని సంతోషించారు. కాని ఒక పెద్ద పద్మవ్యూహం లో అడుగుపెడుతున్నామని అని వారికి తెలీదు.


గమనిక : ఈ కథ మొత్తం నార్త్ కొరియాలో జరుగుతుంది.
అక్కడి వారి మాటలు ఇంగ్లిష్ లోనే ఉంటాయి. కథ కోసం వారి సంభాషణలు తెలుగులో జరుగుతున్నట్టు రాస్తున్నాను. దయచేసి గమనించగలరు.



" ఏజెంట్ రూహి వాసుదేవ్...4 " రచనకు రేటింగ్ ఇవ్వండి....
[+] 8 users Like SivaSai's post
Like Reply
#7
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#8
Sooper awesome story so far.
Just started reading.. excellent storyline.. patriotic thriller with hints of romance!!

Keka combination!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#9
Nice start
[+] 1 user Likes Sunny73's post
Like Reply
#10
ఏజెంట్ రూహి వాసుదేవ్...5



"మేడమ్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం" అని పార్వతి అడిగింది.

బ్లాక్ కోబ్రా బృందం అంతా అర్ధరాత్రి ఆ హోటల్ నుంచి ఎవరికీ తెలియకుండా తప్పించుకొని బయటకు వచ్చేసారు. కాని ఇక్కడి నుంచి ఎటు వెళ్లాలో వారికి తెలియడం లేదు.

"దగ్గరలో ఏదైనా వేరే హోటల్ ఉందేమో చూస్తాను. అక్కడికి వెళ్దాం " అని వంశీ అన్నాడు.

"మనం ఈ నగరం లో ఏ హోటల్ కి వెళ్లినా మన శత్రువులకు ఆ సమాచారం తెలిసిపోతుంది వంశీ. ఎందుకంటే ఏ హోటల్ లో అయినా సరే ప్రూఫ్ లాగా మన పాస్ పోర్టు ఇవ్వాలి. దాని సాయం తో వారు సులభంగా మనల్ని కనిపెట్టచ్చు."

"మరి ఇప్పుడెలా మేడమ్" అని పార్వతి మరోసారి అడిగింది.

రూహి కాసేపు ఆలోచనలో పడింది. అలా ఆలోచిస్తూ ఉండగానే సడెన్ గా తనకు ఒక విషయం గుర్తొచ్చింది. అది గుర్తుకురాగానే తన కళ్ళు మెరిసాయి.
"మనం సురక్షితంగా ఈ నగరం లో ఉండాలి అంటే ఒకటే మార్గం ఉంది."

"ఏంటి మేడమ్ అది " అని అందరూ ఆసక్తిగా అడిగారు.

"అదే... జాంగ్ గ్వాన్.
ప్రస్తుతం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అని మన అందరికీ తెలుసు. వారి తాతలు పాలించే సమయంలో, అధ్యక్షుడి కి బాగా దగ్గర మనుషులు, బంధువులు, స్నేహితులు అప్పుడప్పుడు వీరిని కలవడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. అలా వచ్చే దారిలో చాలా సార్లు విశ్రాంతికి చోటు దొరకక చాలా ఇబ్బందులు పడేవారు. అది గమనించి అధ్యక్షుడు ఒక చట్టం జారి చేశాడు. అదే జాంగ్ గ్వాన్...
అంటే అధ్యక్షుడి బొమ్మ, సంతకం, సీల్ తో ఒక లెటర్ లాంటిది ఉంటుంది. దానిని ఈ దేశం లో ఏ మూలన ఉన్న ఇంట్లో చూపించినా సరే... వారు ఎటువంటి ప్రశ్న వేయకుండా చూపించిన వారిని లోపలకు పిలిచి అతిధ్యం ఇవ్వాలి. గౌరవంగా చూసుకోవాలి. అలా చేయకపోతే మరణ శిక్ష తప్పదు."

రూహి చెప్పింది విని అందరూ అర్థమైంది అన్నట్టు తల ఆడించారు.

"మీరు చెప్పింది సరే, కాని ఇప్పుడు మనకు ఆ లెటర్ ఎక్కడ దొరుకుతుంది" అని అయాన్ సందేహంగా అడిగాడు.

"అది మనమే సృష్టించాలి. ఇండియా కు ఫోన్ చేసి కిమ్ ఫోటో, అతని పేరు మీద ఒక సంతకం, దొంగ సీల్ ఒకటి వేసి... అర్జెంటు గా ఆ ఫోటో మనకు మెయిల్ చేయమని చెప్పాలి. దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ జిరాక్స్ మెషిన్ ఉండే అవకాశం ఉంది. అక్కడికెళ్లి ప్రింట్ అవుట్ తీసుకొని రండి." అని రూహి చెప్పింది.

"మేడమ్, దొంగ డాక్యుమెంట్ సృష్టిస్తున్నాం. దాన్ని ఎవరైనా కనిపెడితే?" అని పార్వతి అంది.

"మనలాంటి మధ్యతరగతి జీవితాల్లో... రోజుకు వంద సమస్యలు, వెయ్యి ఆలోచనలు.. వాటన్నిటి మధ్య ఒక్కోసారి మనల్ని పాలించే నాయకులే గుర్తు ఉండరు. ఇక వారి సంతకాలు ఎక్కడ గుర్తుంటాయి."

"కాని ఇలా దొంగ పత్రం సృష్టించడం తప్పు కాదంటారా?" వంశీ సందేహంగా అడిగాడు.

"రాముడు రాజులగా వాలి రాజ్యానికి అయితే వెళ్ళాడు. కాని తనని సంహారించింది మాత్రం చెట్టు చాటు నుంచే...
మనం కూడా శత్రువుల రాజ్యానికి వచ్చాం. కాని మన ముందు అలాంటి చెట్టు లేదు. అందుకే దానిని మనమే సృష్టిస్తున్నాం. అంతే...
కొన్ని సార్లు శత్రువును ఓడించాలి అంటే కండ బలం మాత్రమే ఉంటే సరిపోదు. అదును కోసం ఎదురుచూసే సహనం కూడా ఉండాలి. "

రూహి మాటలతో మిగతా బృందం ఏకిభవిస్తూ తల ఆడించారు.

"సరే మేడమ్.. మీరు ఇక్కడే ఉండండి. మేము వెళ్లి ఆ పని చూసుకొని వస్తాం." అంటూ వంశీ, పార్వతి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రూహి, అయాన్ అక్కడే రోడ్డు పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు. సమయం అర్ధరాత్రి దాటింది. పైన వెన్నెల జలపాతం లో తడుస్తూ చుక్కల చెలికత్తెల నడుమ చందమామ మెరిసిపోతున్నాడు.

చల్లని గాలి వీస్తుంది. రూహి కి కొంచెం చలిగా అనిపించింది. అది అయాన్ గమనించి, తన దగ్గర ఉన్న జాకెట్ తెచ్చి రూహి చుట్టూ కప్పాడు. రూహి కళ్ళతోనే థాంక్స్ చెప్పింది.

కాసేపు వారి ఇద్దరి నడుమ మౌనం చేరింది. దాని చేదిస్తూ మెల్లగా..
"మేడమ్... మీరు ఏమిఅనుకోను అంటే ఒకటి అడగచ్చా" అని అయాన్ ధైర్యం తెచ్చుకుంటూ మెల్లగా పలికాడు.

"అడుగు పర్లేదు." అని రూహి అంది.

"మన బ్లాక్ కోబ్రా టీం లో అందరికంటే మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం "

"ఇంకెవరు నేనే.. నేనంటే నాకు చాలా ఇష్టం " రూహి నవ్వుతూ చెప్పింది.

"అది తెలుసు. అలా కాదు మేడమ్.. మిగతా ముగ్గురిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం."

రూహి కి అయాన్ ఎలాంటి సమాధానం ఎదురుచూస్తున్నాడో బాగా తెలుసు. అయినా సరే తెలియనట్టే నటిస్తూ...
"అలా ఒకరు అని చెప్పలేను. నాకు ముగ్గురూ సమానమే. ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అని అనలేను "

"ఎప్పుడో ఒకసారి అలా అనుకొని ఉంటారు కదా... మా ముగ్గురిని మీకు ఇష్టమైన వారి లాగా ఒక ఆర్డర్ లో పెట్టాలి అంటే ఎలా పెడతారు."

రూహి ఆలోచనలో పడింది. తను ఏం చెప్తుందా అని అయాన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అతని గుండె వేగం వంద దాటేసింది.

ఇంతలో రూహి మెల్లగా పెదవి విప్పింది.
"మీ ముగ్గురిని అలా క్రమంలో పెట్టాలి అంటే. ముందు పార్వతి.. తరువాత వంశీ... చివర్లో నువ్వు." అని అంది.

ఆ మాటకు అయాన్ మోహం లో రంగులు మారాయి. రూహి మనసులో తన స్థానం చివర్లో ఉందా అని చెప్పలేని బాధ కలిగింది.

తనని అలా చూసి రూహి కాసేపు మనసులోనే నవ్వుకుంది. ఇంకా బాధపెట్టడం ఎందుకని..
"అయాన్..." అని పిలిచింది.

"చెప్పండి మేడమ్.." అని అయాన్ రూహి వంక కూడా చూడకుండా అన్నాడు.

"నువ్వు చిన్నప్పుడు ఎప్పుడైనా క్రీం బిస్కెట్ తిన్నావా " అని అడిగింది.

తిన్నాను అన్నట్టు ఆశ్చర్యంగా తల ఆడించాడు.

"నాకు అందులో క్రీం అంటే చాలా ఇష్టం. అందుకని ముందు ఆ క్రీం చుట్టూ ఉన్న బిస్కెట్ మొత్తం తినేసి, ఆఖరికి మిగిలిన క్రీం ని ఆస్వాదిస్తూ తినేదాన్ని.. అలా నాకు ఇష్టమైనవి అన్ని చివర్లో ఉంచడం అలవాటు." అని అంది.

కొన్ని క్షణాలు అయాన్ కి తను ఏం చెప్పిందో అర్థం కాలేదు. అర్థమవగానే తన మదిలో రంగుల హరివిల్లు విరిసింది. ఆనందం తో ఎగిరి గంతులు వేయాలి అనిపించింది. ప్రేమగా రూహి వంక చూసాడు. రూహి కూడా అయాన్ కళ్ళలోకి చూస్తుంది. తన మోహం లో అంతకు ముందు ఎప్పుడూ చూడని చిరునవ్వు ఒకటి వచ్చి చేరింది.

సరిగ్గా అప్పుడే...
వంశీ పార్వతి అక్కడికి రావడం తో ఇద్దరూ తేరుకొని సర్దుకొని కూర్చున్నారు.

"మేడమ్, మీరు చెప్పినట్టే చేసాం." అని వంశీ ఒక డాక్యుమెంట్ రూహికి ఇచ్చాడు. రూహి ఒకసారి దానిని చూసి అంతా సరిగ్గా ఉందని అంది. ఇక ఆ రోడ్డు మీదే ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు అని, ఆ సిటీ సెంటర్ కి కాస్త దూరం లో ఉన్న ఒక కాలనీ లోకి వెళ్లారు.

చూడగానే అది అక్కడి సాధారణ ప్రజలు నివసించే చోటు అని అర్థమైంది. అలాంటి చోటులో ఉంటేనే తమ మీద ఎవరికీ అనుమానం రాదని అనిపించింది. ఒక్కో ఇంటిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. అప్పుడే వారు అక్కడున్న అపార్టుమెంట్ కి కాస్త దూరంలో ఉన్న ఒక అందమైన ఇంటిని చూసారు. ఆ ఇంటి చుట్టూ పెద్దగా ఇళ్లులు కూడా లేవు. అదే అనువైన చోటు అని ఒక నిర్ణయానికి వచ్చారు.

నెమ్మదిగా వెళ్లి ఆ ఇంటి తలుపు తట్టారు. కొద్ది సేపు అటు వైపు నుంచి ఎలాంటి అలికిడి లేదు. ఇక వేరే ఇంటికి వెళ్దాం అనుకునే సమయానికి ఆ తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఒక నడి వయస్కుడు నుంచొని ఉన్నాడు.

అతను వీరిని చూసి...
"నా భార్య, కూతురు ఇంట్లో లేరు. ఊరెళ్లారు" అంటూ మోకాళ్ళ మీద కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు.

ఆయన ఎందుకలా అంటున్నాడో బ్లాక్ కోబ్రా టీం కి కాసేపు ఏమీ అర్థం కాలేదు. రూహి ఆయన్ని పైకి లేపి తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్ చూపించింది. దాని మీద జాంగ్ గ్వాన్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. దానిని చూసిన తరువాత అతని కళ్ళు ఆశ్చర్యం తో పెద్దగా అయ్యాయి. అలాంటిది ఉందని తెలుసు కాని, మొదటిసారి చూడటం తో కాసేపు అలాగే షాక్ లో ఉన్నాడు.

తరువాత తేరుకొని తన కన్నీళ్లు తుడుచుకుంటూ అందరినీ లోపలకు రమ్మని ఆహ్వానించాడు. అందరినీ సోఫా లో కూర్చోమని చెప్పాడు. తాగడానికి మంచి నీరు కూడా అందించాడు.

"మేము మీకు ఎలాంటి హాని చేయము. దయచేసి భయపడకండి." అని రూహి అతనితో చెప్పింది.

ఆ మాటకు అతను కొంచెం స్థిమిత పడ్డాడు. ఆ హాల్ లో ఒక మూలన ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఇచ్చే పెద్ద అట్ట పెట్టె లాంటిది ఉంది. అతను వెళ్లి దానిని పైకి లేపాడు. అందులో నుంచి ఒక ఆవిడ, చిన్న పాప బయటకు వచ్చారు. రూహి బృందం వారిని ఆశ్చర్యంగా చూసింది.

"నా భార్య, కూతురు..." అని చెప్పాడు.

"ఎందుకని వారిని అలా దాచి పెట్టావు."అని రూహి అడిగింది.

కాసేపు తడబడి, ఆ తర్వాత అతను మెల్లగా పెదవి విప్పాడు.

"ఇక్కడ సైనికులు రోజు అర్ధరాత్రి దాటిన తరువాత, నచ్చిన ఇంటికి వెళ్లి తలుపు కొడతారు. ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎత్తుకొని పోతారు. అడ్డుగా వెళ్తే, అధ్యక్షుడి ప్రాణానికి హాని చేయబోయాము అని తప్పుడు కేసు పెట్టి కాల్చి పడేస్తారు. ఇందాక మీరు తలుపు కొట్టగానే వారే వచ్చారేమో అని వాళ్ళని ఇలా దాచి పెట్టి తలుపు తీశాను." అంటూ మెల్లగా ఒక్కో మాట చెప్పాడు.

ఆ దేశంలోని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వారే ఇలా మృగాలు మాదిరి మీద పడుతుంటే, ఏమీ చేయలేని నిస్సహాయ ప్రజల దుస్థితి ని చూసి... బ్లాక్ కోబ్రా బృందం మనసును కలిచి వేసింది.

"ఇదంతా మీరు వెళ్లి మీ దేశ అధ్యక్షుడు కిమ్ కి చెప్పండి..." అని వంశీ అన్నాడు.

ఆ మాటకు ఆ వ్యక్తి నవ్వుతూ...
"ఇదంతా ఆయనకు తెలియకుండానే జరుగుతుంది అంటారా... " అని ఎదురు ప్రశ్నించాడు.

"అలాంటప్పుడు మీరు ఎన్నికలలో వేరే అధ్యక్షుడిని ఎంచుకోవచ్చు కదా.."

అప్పుడు ఆ వ్యక్తి పక్కనే షెల్ఫ్ లో నుంచి ఒక పేపర్ తీసి తన ముందు ఉంచాడు. చూడగానే అది ఎన్నికల బ్యాలెట్ పేపర్ అని అర్థమవుతుంది. ఆశ్చర్యంగా అందులో పోటీ చేస్తున్న వ్యక్తి ఒక్కరే ఉన్నారు.

"ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. కాని అందులో పోటీ చేసేది అధ్యక్షుడు చెప్పిన ఒక్కరు మాత్రమే.. ఇంకొకరు ఎవరైనా పోటీ చేస్తాము అని ముందుకు వస్తే వారి శవాలు కూడా దొరకవు.
మా దేశంలో ఎన్నికల్లో నిలబడేది ఒకరే... మేము ఓటు వేయాల్సింది వారికే... గెలిచేది కూడా వారే..."

అతను చెప్పింది విని అందరూ కాసేపు అలాగే ఉండిపోయారు. ఆ దేశ ప్రజల పరిస్థితి వారిని మరింతగా బాధపెట్టింది. కాని వారు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇలాంటి దుశ్చర్యలు ఈ నగరం లో ఒక్కటే కాదు, మొత్తం దేశమంతా ఉన్నాయి. పాలకులే అలా ఉంటే ప్రజలు మాత్రం ఏం చేయగలరు.

అభివృద్ధి అంకెల్లో ముందున్నామని చూపించే ఇలాంటి దేశాల కంటే... అంకెల్లో వెనుక పడినా సరే, ప్రజల అభిప్రాయం గౌరవించే నా భారత దేశమే చాలా నయమని బ్లాక్ కోబ్రా బృందం అంతా అనుకున్నారు.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#11
[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]

ఏజెంట్ రూహి వాసుదేవ్...6





రూహి బృందం ఆ అర్ధరాత్రి వేళ జాంగ్ గ్వాన్ అనే అస్త్రం ఉపయోగించి సురక్షితంగా ఒక మధ్య తరగతి ఇంట్లోకి చేరుకున్నారు. అక్కడి ప్రజలు మిలిటరీ వాళ్ల చేతిలో పడుతున్న బాధలు విని కరిగిపోయారు. కాని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.

సరిగ్గా అప్పుడే వారికి ఒక అమ్మాయి ఆర్త నాదాలు వినిపించాయి. ఆ అరుపులు వినగానే అందరూ కిటికీ లో నుంచి బయటకు తొంగి చూసారు. అక్కడ ఇద్దరు సైనికులు ఒక చిన్న పిల్లని లాక్కొని వెళ్తున్నారు. ఆ పాప వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ పాప తల్లి దండ్రులు నిస్సహాయంగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. మిగతా వారు దాన్ని చోద్యం లా చూస్తున్నారు

"ఇందాక చెప్పా కదా. ఆ రాక్షసులు ఈరోజు కూడా వచ్చారు. ఆ పాపకు సరిగ్గా 6 సంవత్సరాలు ఉంటాయేమో.. ఈరోజు ఆ మృగాల చేతిలో బలి అవుతుంది. " అని బ్లాక్ కోబ్రా టీం కి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి అన్నాడు. ఆ మాట అందరి మనసులని మరింతగా కలిచి వేసింది. రూహి రక్తం మరిగిపోయింది.

"ఈ దుర్మార్గులను ఆపాలంటే ఆ దేవుడే మరో అవతారం ఎత్తి రావాలేమో..." అని అతను మాట పూర్తి చేసే లోగా ఢాం అంటూ తూటా పేలింది.

ఒక్క క్షణం అక్కడ నుంచున్న అందరూ ఏమైందో అర్థం కాక ఆశ్చర్యం తో బిగుసుకొని ఉండిపోయారు. కాని వారు తేరుకునేలోగా మరో సారి రూహి చేతిలోని తుపాకీ నుంచి తూటా దూసుకొని వెళ్ళింది. అందరూ భయం భయంగా కిటికీ లో నుంచి బయటకు చూసారు. అక్కడ నార్త్ కొరియా సైనికులు ఇద్దరు అచేతనంగా పడి ఉన్నారు. వారి తలలో నుంచి నెత్తురు ధారగా కారుతుంది.

ఆ ఇంట్లో ఉన్న అందరూ రూహి వంక అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు. ఒక్క నిమిషం అక్కడ ఏం జరిగిందొ వారికి అర్థం కాలేదు. అర్థమయ్యాక నోట మాట పడిపోయింది.

రూహి మెల్లగా ఆ ఇంట్లో ఉన్న అతని వైపు తిరిగింది.
"దుర్మార్గులను చంపడానికి ప్రతి సారి దేవుడు మనిషి అవతారంలోనే పుట్టడు. కొన్ని సార్లు మనలో ధైర్యం, తెగింపు అనే ఆలోచనలలో పుడతాడు. " అని అంది. అతను రూహి వంక అలా చూస్తూ ఉండిపోయాడు.

రూహి మెల్లగా తలుపు తెరిచి బయటకు అడుగుపెట్టింది. ఆ సైనికులను చంపిన చోటుకు వెళ్ళింది. అక్కడ ఉన్న పాప తల్లిదండ్రులు రూహి చేతిలో ఉన్న తుపాకీ వంక చూసారు. తమ పాపను తనే కాపాడింది అని అర్థమై చేతులు ఎత్తి నమస్కారం చేసారు.

అప్పటికే అక్కడ చాలా మంది ఆ కాలనీ ప్రజలు గుమి గుడారు. అందరూ రూహి వాసుదేవ్ నే చూస్తున్నారు. వారి మొహాల్లో ఆ సైనికులు చచ్చారు అనే ఆనందం కనిపిస్తుంది. అదే సమయంలో ఇప్పుడు ఏమవుతుందా అనే భయం కూడా కనిపిస్తుంది.

రూహి వారి అందరి వంక చూస్తూ మెల్లగా పెదవి విప్పింది.
"చచ్చిన ఈ మృగాలను చూడటానికి చనిపోయిన మనుషులు చాలా మంది వచ్చారే..." అని నవ్వింది.

అక్కడున్న ప్రజలు అందరూ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.

"నిజమే కదా.. కళ్ళ ముంది ఇంత అన్యాయం జరుగుతున్నా సరే నోరు మెదపక మౌనంగా ఉండిపోయిన మీరు బ్రతికి ఉన్నారని ఎలా అనుకోమంటారు. " అని ప్రశ్నించింది.

ఆ మాట వినగానే కొంతమంది తప్పు చేసిన వారి లాగా తల దించుకున్నారు.
"వారికి ఎదురు తిరిగితే మా ప్రాణాలు పోతాయి." అంటూ ఒకరు ధైర్యం తెచ్చుకొని బయటకు అన్నారు.

"భరిస్తే బ్రతుకంతా చావే. తెగిస్తే చావైనా విజయమే... పోరాడండి. మీరంతా కలిసి ఎదురుతిరిగితే మీ ముందు ఈ  దుర్మార్గులు అర క్షణమైనా నిలువ గలరా..."

"మా దగ్గర ఆయుధాలు లేవుగా ." ఇంకొకరు సందేహంగా అన్నారు.

"నీ భార్యను, కూతురుని నీ ముందే తీసుకొనివెళ్తుంటే నీ గుండెల్లో మంట రగులుతుంది చూడు... దాన్నే ఆయుధంగా చేసుకో.. శత్రువును ఆ మంటల్లో కాల్చేయ్.
భయపడే వాడి ముందు ఎన్ని ఉన్నా వృధానే,
అదే తెగించిన వాడికి వాడి చెయ్యే ఓ ఆయుధం.
రాళ్లు విసరండి. కర్రలతో కొట్టండి. ఇంట్లో కూరగాయలు బదులు ఈ దుర్మార్గుల తలలు నరకండి. అంతే కాని చేత కాదని, చేవ లేదని మౌనంగా మాత్రం ఉండకండి." అంటూ రూహి మరింత ఆవేశంగా పలికింది.

ఇంతలో రూహి కి ఆ కాలని లో పక్కనే ఉన్న పాడు బడ్డ బావి కనిపించింది. ఆ సైనికులను అందులోకి విసిరేసింది. తరువాత అక్కడున్న బండిలో నుంచి పెట్రోల్ తీసి వారి మీద చల్లింది.

"తెల్లారే సరికి ఈ సైనికుల శవాలు కూడా మిగలవు. ఎవరూ ఏమీ తెలియనట్టు మీ పనుల్లో మీరు మునిగిపోండి. ఎవడూ వీరి గురించి పట్టించుకోరు. ఈ దేశం లో మనిషి ప్రాణానికి ఎంత విలువ ఇస్తారో నాకంటే బాగా మీకే తెలుసు. ఒకవేళ రేపు కూడా ఎవరైనా ఇలాగే మీ ఇంట్లో ఆడవాళ్ళ కోసం వస్తే... ఏం చేయాలో మీకు అర్థమైంది అనుకుంటా. ఒక్క నాకొడుకును కూడా వదలకండి. నేను రగల్చిన ఈ మంటను మీ గుండెల్లో వెలిగించండి.." అంటూ అగ్గిపుల్ల గీసి అందులోకి వేసింది. ఆ మంటల్లో ఆ సైనికుల శవాలు కాలిపోతున్నాయి.

రూహి అక్కడి నుంచి మెల్లగా ముందుకు నడిచింది. ఆ కాలనీ వాసులు అందరికి రూహి ఆ క్షణం తమ ప్రాణాలు కాపాడడానికి వచ్చిన ఓ అపర భద్ర కాళీ లాగా కనిపించింది. అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్లో స్ఫూర్తి నిండింది. దాంతో ఇక ఎవరు వచ్చినా తెగించి పోరాడగలం అనే నమ్మకం అయితే కలిగింది.

రూహి ఇంట్లోకి రాగానే...
"ఏంటి మేడమ్ మీరు చేసింది." అని పార్వతి అదురుతున్న గుండె తో అడిగింది.

రూహి తన వంక నేనేం చేసానో చూడలేదా అన్నట్టు చూసింది.

"అది కాదు మేడమ్.. ఇక్కడికి మన దేశం పని మీద వచ్చాం. ఈ దేశ ప్రజలు ఎటు పోతే మనకెందుకు.. ఇవన్నీ మనకు అవసరమా..." అని అంది.

రూహి తన కళ్ళలోకి చూస్తూ...
"మనిషికి సరిహద్దులు ఉంటాయేమో, మానవత్వానికి కాదు.
అయినా నీకొక విషయం చెప్పనా...
మన దేశం లో సాటి మనిషికి సహాయం చేస్తే.. నన్ను రూహి అని పిలుస్తారు.
అదే పరాయి దేశం లో ఒకరికి సహాయం చేస్తే నన్ను ఏమంటారో తెలుసా.. ఒక ఇండియన్ అని అంటారు.
అది కూడా మన దేశానికే కదా గర్వ కారణం.
నా భారత దేశం అంటే మన ప్రజల మనసులోనే కాదు, ప్రపంచం దేశాల గుండెల్లో కూడా ఒక గౌరవం రావాలి."

రూహి చెప్పింది విని బ్లాక్ కోబ్రా టీం లో ఉన్న అందరి గుండెలు గర్వం తో ఉప్పొంగాయి. రూహి ని ఎలా పొగడాలో అర్థం కాలేదు. తన మీద గౌరవం మరింతగా పెరిగింది. గుండెల నిండా గాలి పీల్చుకొని సెల్యూట్ చేసారు. రూహి ఒక చిన్న చిరునవ్వు నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయింది. అందరూ తన వంకే చూస్తూ ఉండిపోయారు.

ఆకాశం లో రూహి ని చూస్తూ విక్రమ్ వాసుదేవ్ మనస్ఫూర్తిగా మురిసిపోయాడు.

---------------------------------------------------------------

తరువాతి రోజు...

రూహి ఉదయం లేచే సమయానికి ఆ ఇంట్లో ఉండే పాప కాలేజ్ కి రెడీ అవుతుంది. రూహి లేవడం చూసి, మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి తనకు ఒక కాఫీ కప్పు ఇచ్చింది. రూహి కి ఆ పాప చాలా ముద్దుగా అనిపించింది. దగ్గరకు పిలిచింది.

ఆ పిల్ల కళ్ళు ఆశ్చర్యమో, భయమో తెలీదు కానీ టప టపమని మూసుకుంటున్నాయి. ఆ పాప తనని చూసి భయపడుతుంది అని రూహి కి అర్ధమై తన బ్యాగ్ లో నుంచి ఒక చాకొలేట్ తీసి ఇచ్చింది. ఆ పాప మెరుస్తున్న కళ్ళతో తీసుకుంది.

"నీ పేరేంటి?" అని రూహి చిన్నగా అడిగింది.

"Soo-A (సూయా) " అని ముద్దు ముద్దు మాటలతో చెప్పింది.

"అంటే అర్థం ఏంటి " అని రూహి ప్రశ్నించింది

"కలువ పువ్వు "అని ఆనందంగా చెప్పింది.

"అందమైన పేరు. నీ పేరు నీ కన్నులు చూసి పెట్టరేమో... నిజంగా అలాగే ఉన్నాయి. " అని రూహి అంటే ఆ పాప నవ్వుతూ సిగ్గు పడింది. తనని అలా చూస్తూ రూహి ముచ్చట పడింది. వెంటనే తన ఫోన్ లో ఆ పాప ఫోటో తీసింది. ఆ తరువాత ఆ పాపకు తన ఫోటో చూపించగానే, సూయా కళ్ళు నక్షత్రాలు మాదిరి మెరిసిపోయాయి. రూహి నవ్వుతూ ఆ పాపను చూస్తుంది.

ఇంతలో మేడమ్ అని పిలవడం తో రూహి వెంటనే వంశీ వైపు తిరిగి ఏమైంది అన్నట్టు చూసింది.

"మనల్ని విమానాశ్రయం దగ్గర నకిలీ అధికారుల వేషం లో వెంబడించిన వాళ్లు, అలాగే హోటల్ లో దాడి చేసిన వాడి దగ్గర ఒక గుర్తు చూసాం కదా.."
[Image: image?pratilipiId=6755373531477026&name=...0&type=jpg]

రూహి అవును అన్నట్టు తల ఊపింది.

"ఆ ఇద్దరి ఫోన్లు చెక్ చేశాను. వారికి చివరగా ఫోన్ వచ్చింది ఒకే నంబర్ నుంచి..."

"ఎవరిదా నంబర్?" అని రూహి ఆశ్చర్యంగా అడిగింది.

"ఎవరో లీ జాంగ్ అని ఉంది మేడమ్. అంతకు మించి మరే వివరాలు లేవు."

రూహి ఆలోచనలో పడిపోయింది. ఇంత పెద్ద నగరం లో ఆ పేరు, ఆ బొమ్మ తో వాడిని ఎలా వెతకాలో అర్థం కాలేదు. తను ఇలా ఆలోచనలో ఉండగానే... సూయా పాప పరుగున రూహి దగ్గరకు వచ్చింది. ఆ పాప రూహి ఫోన్ లో తన ఫోటో చూస్తూ... మరిన్ని ఫోటోల కోసం స్క్రీన్ పక్కకు జరిపింది. అప్పుడే... రూహి బృందం మాట్లాడుతున్న బొమ్మను చూసింది.

"ఇది నాకు తెలుసు.. " అని అంది.

అది వినగానే రూహి కళ్ళు పెద్దవి అయ్యాయి. నిటారుగా అయ్యింది.

"ఈ బొమ్మ నీకు తెలుసా? ఎక్కడ చూసావ్? " అని ప్రశ్నించింది.

ఇప్పుడే వస్తాను అని ఆ పాప ఇంట్లోకి పరుగు తీసింది. ఆ పాప ఏం చేస్తుందా అని రూహి ఎదురుచూస్తూ ఉంది. కాసేపటికి ఆ పాప పరిగెత్తుకుంటూ ఒక ఐడి కార్డు తీసుకొని వచ్చింది. ఆ ఐడి కార్డు లో అదే బొమ్మ ఉంది. దాన్ని చూడగానే బ్లాక్ కోబ్రా బృందం కళ్ళు ఆశ్చర్యపోయాయి.

"ఇది మా నాన్న ఐడి కార్డు... మా నాన్న ఆ కంపెనీ లోనే పని చేస్తాడు." అని అంది.

అయాన్ వెంటనే ఆ ఐడి కార్డు తన చేతిలోకి తీసుకొని ఆ కంపెనీ పేరు చదివాడు.
"లీజా ఆటోమొబైల్స్..." అని ఉంది. వెంటనే ఆ కంపెనీ గురించి నెట్ లో వెతికాడు. అందులో ఉన్నది చదివే కొద్ది తన నుదుటి మీద నుంచి చమట జారింది. అందరూ ఏమైంది అని అడిగారు.

"ఈ దేశం లో అత్యంత సంపన్నమైన కంపెనీ ఇది. దీని ఓనరే లీ జాంగ్.. అతని అపాయింట్మెంట్ కావాలి అన్నా సరే రెండు నెలలు ఆగాలి. తన చుట్టు పటిష్టమైన భద్రత ఉంటుంది. వాటి అన్నిటిని దాటి తనను చేరుకోవడం దాదాపు అసాధ్యం."

అది విని రూహి చిన్నగా నవ్వింది. అందరూ తన వంక ఆశ్చర్యంగా చూసారు.

"మన శత్రువు రావణుడంత బలవంతుడు అయినా, తన చుట్టు లంకంత కోట కట్టినా...
సీతమ్మను చేరాలనే రాముడి ప్రేమ ముందు, దేశాన్ని కాపాడాలనే మన ఆశయం ముందు క్షణం కూడా నిలువలేవు." అని దృడంగా పలికింది.

తన ధైర్యం చూసి బ్లాక్ కోబ్రా బృందం కూడా కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా నిలబడిపోయారు.


" ఏజెంట్ రూహి వాసుదేవ్...6 " రచనకు రేటింగ్ ఇవ్వండి...
[+] 8 users Like SivaSai's post
Like Reply
#12
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#13
Story చాలా బాగా ముందుకు పోతుంది
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#14
Great story and nice writing
[+] 1 user Likes Sunny73's post
Like Reply
#15
ఏజెంట్ రూహి వాసుదేవ్...7




నార్త్ కొరియా లో రూహి వాసుదేవ్ ని చంపడానికి ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించారు. ఆ రెండిటి వెనుక ఉన్నది ఒకరే అని రూహి కి అర్థమైంది. ఆ వ్యక్తే లీ జాంగ్.. లీజా ఆటోమొబైల్స్ సీఈఓ. ఆ దేశం లోనే అత్యంత గొప్ప సంపన్నుల్లో అతనూ ఒకడు. ఎప్పుడూ అతని చుట్టు చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా వారు తన వెంటే ఉంటారు. అతని అనుమతి లేకుండా, ఆ సెక్యూరిటీని దాటి అతన్ని చేరడం దాదాపు అసాధ్యం. అది తెలిసి బ్లాక్ కోబ్రా బృందం మొత్తం భయపడ్డారు.

"ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయాయి. ఇక మనం అతన్ని ఎప్పటికీ చేరుకోలేము." అంటూ పార్వతి నిరాశగా పలికింది.

"నువ్వు అన్నది నిజమే. లీ జాంగ్ చుట్టు పటిష్టమైన ప్రైవేట్ సైన్యం ఉంది. అనుక్షణం అతన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. వారి కళ్ళు కప్పి అతని దగ్గరకు వెళ్లడం అసాధ్యం." అని వంశీ కూడా అన్నాడు.

"ఒక పని చేద్దాం. వాడినే మన దగ్గరకు ఎత్తుకొని వచ్చేద్దాం."

బృందం మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యి, ఆ మాట పలికిన రూహి వాసుదేవ్ వంక చూసారు. తన కళ్లలో ఎలాంటి బెరుకు లేదు. పైగా శత్రువును ఎంత త్వరగా పట్టుకుంటానా అనే ఆత్రుత కనిపిస్తుంది. తన అణువణువునా ఆత్మ విశ్వాసం మెండుగా తొణికిసలాడుతుంది.

"ఏంటి మేడమ్ మీరు అనేది?" అని వంశీ అడిగాడు.

"అవును. వాడిని ఎత్తుకొచ్చేద్దాం." అని రూహి మరోసారి దృడంగా పలికింది.

తన ధైర్యం చూసి అందరిలో ఆశ్చర్యం కలిగింది. రూహి అవేవి పట్టనట్టు తమకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ని పిలిచింది. అతను లీజా ఆటోమొబైల్స్ లోనే పనిచేస్తున్నాడు. రూహి అతని తో చాలా సేపు మాట్లాడింది. లోపల కంపెనీ ఎలా ఉంటుంది, సీఈఓ ఎప్పుడెప్పుడు వస్తాడు, ఎంత మంది సెక్యూరుటీ ఉంటారు ఇలాంటి చాలా ప్రశ్నలు వేసింది. రూహి రాత్రి తమకు చేసిన సహాయం అతను మర్చిపోలేదు. అందుకే తను అడిగిన ప్రతి దానికి, తనకు తెలిసింది సమాధానం ఇచ్చాడు.

రూహి అతను చెప్పిన దాని ప్రకారం కంపెనీ బ్లూ ప్రింట్ లాంటిది గీసింది. తరువాత ఇంటర్నెట్ లో లీ జాంగ్ గురించి, అతని కుటుంబం గురించి కాసేపు వెతికింది. వాటిని నోట్ చేసుకుంది. అలా లీ జాంగ్ గురించి పూర్తి వివరాలు సేకరించడం తో పాటు, అతని దినచర్యను కూడా ఫాలో అయ్యింది.

మొత్తం అయ్యాక రూహి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టింది. తన మెదుడు పాదరసం లాగా పనిచేస్తుంది. చివరకు ఆ ఆలోచనల్లో నుంచి అతన్ని ఎత్తుకురావడానికి ఒక అద్భుతమైన పథకమైతే సిద్ధం చేసింది.

రూహి బ్లాక్ కోబ్రా బృందం మొత్తాన్ని పిలిచింది. ఎవరెవరు ఏమేమి చేయాలో విడమరచి అర్థమయ్యేలా చెప్పింది. అందరూ తను చెప్పింది శ్రద్దగా విన్నారు.

అంతా చెప్పాక రూహి అందరి వంక చూస్తూ...
"రేపు సాయంత్రమే లీ జాంగ్ కిడ్నాప్ కి ముహూర్తం. ఇది చాలా ప్రమాదకరమైన సాహసమని నాకు బాగా తెలుసు. కానీ దేశం కోసం పని చేసే సైనికుడి కాళ్లకు ముందుకు దూకడమే తప్ప వెనక్కి అడుగు వేయడం తెలియకూడదు. కచ్చితంగా ఈ పోరాటం లో గెలిచి తీరుదాం." అని స్ఫూర్తి నింపింది. తన మాటకు అందరూ గుండెల నిండా శ్వాస పీల్చుకొని సాధిద్దాం అని అరిచారు. తరువాత కాసేపు మాట్లాడి అందరూ ఎవరి గదుల్లోకి వారు చేరారు.

రూహి వాసుదేవ్ మనసులోనే... లీ జాంగ్, నీ మరణం రేపు నిన్ను పలకరిస్తుంది అని అనుకుంది.

ఇంతలో మేడమ్ అనే పిలుపు వినిపించడం తో రూహి ఈ లోకం లోకి వచ్చింది. తల తిప్పి చూస్తే ఎదురుగా అయాన్ ఉన్నాడు. ఏంటి అన్నట్టు కళ్ళతోనే అడిగింది.

"రేవు మన మిషన్ లో చాలా ముఖ్యమైన రోజు కదా. మా బామ్మ ఎంతో ఇష్టం తో నాకు ఇది ఇచ్చింది. నాకెందుకో దీన్ని మీకు ఇవ్వాలి అనిపిస్తుంది. ఇది మీ చేతికి ఉంటే విజయం తప్పకుండా మనదే.."  అంటూ ఒక త్రిశులం ఉన్న దారం బయటకు తీసాడు.

రూహి అప్రయత్నంగానే చేతిని ముందుకు చాపింది. తనకు ఇలాంటి నమ్మకాలు అస్సలు ఇష్టం ఉండవు. అయినా సరే ఎందుకో ఆ క్షణం అయాన్ కోరిక కు ఎదురుచెప్పలేక పోయింది. అయాన్ తన చేతికి దాన్ని కట్టాడు. రూహి చేతికి ఆ దారం అందంగా అనిపించింది. అయాన్ నవ్వుతుంటే, రూహి తన వంక అలా చూస్తూ ఉండిపోయింది. ఇంతకాలం వేరువేరుగా వారు నడుస్తున్న దారులు రెండు నేడే ఒకటిగా కలిసాయేమో అన్నట్టు ఉండిపోయారు.

వారిరువురి మధ్య భాషకు అందని అందమైన భావం ఏదో మధురంగా ఒదిగిపోయింది. చిరుగాలి అది చూసి మురుస్తూ ఓ చిరునవ్వు విరిసింది. చందమామ సడి చేయక మెల్లగా మబ్బుల చాటుకు చేరిపోయాడు.
వారి గమ్యం ఏటో, ప్రయాణం ఏ చివరకి చేరుతుందో కాలమే నిర్ణయించాలి.

--------------------------------------------------------

తరువాతి రోజు...
లీజా ఆటోమొబైల్స్...

సమయం సరిగ్గా 2:30 గంటలు అవుతుంది. కాసేపటి ముందే భోజనం చేయడం తో అందులో పని చేసే చాలా మంది కాస్త నిద్ర మత్తుగా ఉన్నారు. అందరిలో ఉదయం కనిపించిన చురుకుదనం ఇప్పుడు కనిపించడం లేదు.

సరిగ్గా అప్పుడే కంపెనీ యూనిఫామ్ వేసుకొని, మొహానికి మాస్క్, నల్ల కళ్ళజోడు ధరించిన ఒక వ్యక్తి కంపెనీ ముందుకు వచ్చాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. లోపల చాలా కంగారుగా ఉంది. కానీ అదేమీ కనిపించకుండా, గట్టిగా శ్వాస పీల్చుకొని ముందుకు అడుగువేశాడు.

ఆ కంపెనీ లోపలకు వెళ్ళాలి అంటే అందరూ ముందుగా తలుపు పక్కనే ఉన్న మెషిన్ లో వేలి ముద్ర పెట్టాలి. అది ఆ కంపెనీ లో పని చేసే వ్యక్తిదే అని నిర్దారణ అయితేనే తలుపులు తెరుచుకుంటాయి. అతను కూడా ఆ బయోమెట్రిక్ మెషిన్ మీద చెయ్యి పెట్టాడు. కొన్ని క్షణాల తరువాత తలుపు మెల్లగా తెరుచుకుంది.

అతను నవ్వుతూ లోపలకు అడుగు పెట్టాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, బ్లాక్ కోబ్రా టీం సభ్యుడు అయాన్...
రూహి వారు ఉంటున్న ఇంట్లోని వ్యక్తి వేలిముద్రలు సేకరించి, దాంతో ఒక డూప్లికేట్ వేలు ను తయారు చేసి అయాన్ కి ఇచ్చింది. దాన్ని ధరించిన అయాన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కంపెనీ లోపలకు అయితే చేరుకున్నాడు. అయాన్ అప్పటికే ఆ కంపెనీ బ్లూ ప్రింట్ చూడటం తో అందులో ఎక్కడ ఏముందో తనకు బాగా తెలుసు.

ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా స్థిరంగా నడుస్తున్నాడు. తను వెళ్ళాల్సింది ఎడమ వైపు. కానీ అటు వైపు వెళ్లకుండా కుడి వైపున ఉన్న వాష్ రూమ్స్ లోకి వెళ్ళాడు. అక్కడ ఒక టాయిలెట్ లోకి వెళ్లి తలుపు వేసాడు. తరువాత వెంట తెచ్చిన టూల్ కిట్ సాయం తో అక్కడ ఉన్న కిటికీ తలుపులు తెరిచాడు. అందులో నుంచి బయటకు రాగానే ఒక వాటర్ పైప్ కనిపించింది. ఒకసారి చుట్టూ చూసాడు. ఎక్కడా ఎవరూ కనిపించకపోవడం తో మెల్లగా ఆ పైప్ పట్టుకొని పైకి ప్రాకాడు. అలా కాసేపటికి ఒక గది దగ్గరకు చేరుకున్నాడు. మెల్లగా ఆ గది ముందున్న వరండా లాంటి చోటుకు దూకాడు.

అది ఆ కంపెనీ లో ఉన్న సర్వర్ రూమ్. దాని ముందు వైపు ఇద్దరు సెక్యూరిటీ వాళ్లు కాపలా ఉంటారు. కానీ వెనుక వైపు మాత్రం ఎవరూ ఉండరు. ఎందుకంటే అటు నుంచి ఎవరూ రారని నమ్మకం. వారి నమ్మకమే ఈరోజు అయాన్ కి బాగా ఉపయోగపడింది. అయాన్ మెల్లగా తన దగ్గర ఉన్న కిట్ సాయం తో కాసేపు కష్టపడి చివరకు ఎలాగోలా ఆ గది తలుపులు తెరిచి లోపలకు వెళ్ళాడు.

అక్కడ చాలా సర్వర్స్ ఉన్నాయి. కంపెనీలో జరిగే మొత్తం డేటా ఇక్కడే స్టోర్ అవుతుంది. కాసేపు అక్కడంతా తిరిగి చివరకు ఒక మెయిన్ సర్వర్ ని కనిపెట్టాడు. దానికి ఒక చిప్ అమర్చాడు. వచ్చిన పని అయిపోవడం తో మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఎలా అయితే లోపలకు వచ్చాడో, అలాగే బయటకు చేరుకున్నాడు. అక్కడ తన కోసం రూహి కారులో ఎదురుచూస్తూ ఉండటం తో ఎక్కి అందులో కూర్చున్నాడు.

"మేడమ్ మీరు చెప్పినట్టుగానే మెయిన్ సర్వర్ కి మీరు ఇచ్చిన చిప్ పెట్టాను. ఇప్పుడు ఏం చేయబోతున్నారు. అసలు ఇంతకీ అదేంటి." అని అడిగాడు.

రూహి నవ్వుతూ...
"ఇప్పుడు మనం ఈ బటన్ నొక్కితే, ఆ చిప్ లో ఉన్న వైరస్ మెయిన్ సర్వర్ లోకి చేరి, మొత్తం సర్వర్స్ అన్ని క్రాష్ అవుతాయి.
తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టి, ఆ తరువాత మొత్తం సర్వర్లు తిరిగి పని చేసేలా చేయాలంటే వారికి కనీసం ఒక రోజైనా సమయం పడుతుంది." అని చెప్పి వెంటనే తన ఫోన్ లో ఉన్న బటన్ నొక్కెసింది.

"ఈ కంపెనీ సర్వర్లు చెడగొట్టడానికి, లీ జాంగ్ ను కిడ్నాప్ చేయడానికి ఏమిటి సంబంధం.." అని అయాన్ ఆశ్చర్యంగా అడిగాడు.

"కాసేపు జరిగేది చూడు. మొత్తం నీకే తెలుస్తుంది.." అని రూహి నవ్వింది.

దాంతో అయాన్ మౌనంగా ఉండిపోయాడు. ఒక అరగంట తరువాత రూహి అక్కడి నుంచి వేగంగా కారును కదిలించింది. దారిలో పార్వతి, వంశీ ఒక చోట నిలబడి ఉన్నారు.
"చెప్పిన పని సరిగ్గా పూర్తి చేసాం మేడమ్" అని వారు సమాధానం ఇచ్చారు. రూహి చిరునవ్వు నవ్వింది.

తరువాత కారును ఒక ఐస్ క్రీం షాప్ దగ్గర ఆపి లోపలకు వెళ్ళి అందరికి ఐస్ క్రీం ఆర్డర్ చేసింది. ఇక్కడ ఇంత పెద్ద మిషన్ చేస్తుంటే రూహి కూల్ గా ఐస్ క్రీం తినడం చూసి షాక్ అయ్యారు. అసలు ఆ లీ జాంగ్ ని ఎలా కిడ్నాప్ చేయబోతున్నారా అని అందరిలో టెన్షన్ పెరిగిపోతుంది. ఒళ్ళంతా చమటలు పడుతున్నాయి. కాని రూహి ని అడగలేక మౌనంగా ఉండిపోయారు.

అక్కడ అందరూ ఐస్ క్రీం తిన్న తరువాత... రూహి తిరిగి కారును నడుపుతూ ఒక గోల్ఫ్ కోర్ట్ దగ్గర ఆపింది. అందరూ కిందకు దిగారు.

"సరదాగా కాసేపు గోల్ఫ్ ఆడుదామా..." అని రూహి అందరిని చూస్తూ నవ్వుతూ అడిగింది.

ఆ మాటకు బృందం మొత్తం ఆశ్చర్యపోయారు.

"ఏంటి మేడమ్ మీరు. అసలు ఆ లీ జాంగ్ ని ఎలా కిడ్నాప్ చేస్తారా అని ఇక్కడ మేము టెన్షన్ పడుతూ ఉంటే..  మీరు మాత్రం ప్రశాంతంగా గోల్ఫ్ ఆడుదామా అని అడుగుతున్నారు" అని వంశీ అడిగాడు.

దానికి రూహి నవ్వుతూ...
"ఒకసారి అటు చూడండి." అంటూ ఒక గోల్ఫ్ కోర్టు వైపు చూపించింది.

అక్కడ వారికి దూరంగా కొందరి సెక్యూరిటీ మధ్య లీ జాంగ్ గోల్ఫ్ ఆడుతూ కనిపించాడు. అతన్ని చూడగానే అందరికీ ఫ్యూజు లు ఎగిరిపోయాయి. షాక్ లో బిగుసుకుపోయారు. కొన్ని క్షణాలు వారి కళ్ళను వారే నమ్మలేక పోయారు.

"ఇదెలా సాధ్యం మేడమ్ " అని ఆశ్చర్యంగా అడిగారు.

అప్పుడు రూహి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టింది.

"మొదటగా... అయాన్ లీజా ఆటోమొబైల్స్ లోకి అడుగు పెట్టి అక్కడున్న సర్వర్స్ అన్ని క్రాష్ అయ్యేలా చేశాడు. సర్వర్స్ పని చేయకపోతే లీ జాంగ్ అక్కడ ఎలాంటి పని చేయలేడు. దాంతో రాత్రి 7 గంటల దాకా కంపెనీ లో ఉండాల్సిన అతను, మధ్యాహ్నం 3 గంటలకే ఆఫీస్ నుంచి బయటకు వచ్చేలా చేసాం.

సరిగ్గా అదే సమయం లో లీ జాంగ్ భార్యకు ప్రతి బుధవారం మధ్యాహ్నం బ్యూటీ పార్లర్ కి వెళ్లడం అలవాటు. ఈ విషయం తనే ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది. అది చూసే ఆ విషయం తెలుసుకున్నాను. అందుకే పార్వతి కి ఒక పని చేయమని అప్పగించాను. అదేంటంటే లీ జాంగ్ భార్య వెళ్లే పార్లర్ కి ఒక పది మంది కొరియన్ అమ్మాయిలను తీసుకొని వెళ్లమని.. దాని వల్ల ఏం జరిగింది అంటే... ఆ పార్లర్ దగ్గర రష్ పెరిగింది. దాంతో లీ జాంగ్ భార్య ఎక్కువ సేపు అక్కడ ఎదురుచూడాల్సి వచ్చింది.

అప్పటికే సర్వర్లు క్రాష్ అవ్వడం తో, ఇంటికి బయలుదేరిన లీ జాంగ్ కు తన భార్య ఇంటి దగ్గర లేదు, రావడానికి ఆలస్యం అవుతుంది అని తెలిసింది. సరిగ్గా అదే సమయం లో లీ జాంగ్ ఇంటికి వెళ్లే రోడ్డు మీద వంశీ కొంతమందికి డబ్బులు ఇచ్చి కావాలనే ఒక డమ్మీ ఆక్సిడెంట్ ని సృష్టించాడు.

ట్రాఫిక్ జామ్ వల్ల కాసేపు లీ జాంగ్ కారు అక్కడ ఆగాల్సి వచ్చింది. అప్పటికే అసహనంగా ఉన్న లీ జాంగ్ కి ఆ సంఘటన మరింత చిరాకును తెప్పించింది. విసుగ్గా కిటికీ లో నుంచి బయటకు తొంగి చూసాడు. అలా చూస్తాడని నాకు బాగా తెలిసే... వారు ఆగిన చోటుకు బాగా కనిపించేలా ఒక పెద్ద గోల్ఫ్ హోర్డింగ్ పెట్టించాను. దాన్ని చూడగానే లీ జాంగ్ కళ్ళు మెరిసాయి.

లీ జాంగ్ కు గోల్ఫ్ ఆడటం అంటే చాలా ఇష్టం. కానీ ప్రతి రోజు కంపెనీ పనుల్లో బిజిగా ఉండటం తో ఎప్పుడో ఒకసారి ఆడటానికి వెళ్తుంటాడు.

ఈరోజు ఆఫీస్ లేదు.. ఇంటి దగ్గర ఎలాగూ భార్య కూడా లేదు. కాబట్టి సరదాగా గోల్ఫ్ ఆడాలి అనే ఆశ అతనిలో కలిగేలా చేశాను. దాని ఫలితమే... ఇప్పుడు అతను ఇక్కడ నిలబడి ఉన్నాడు." అని రూహి చెప్పడం ఆపి అందరి వంక చూసింది.

అందరూ ఇంకా ఆశ్చర్యం లోనే ఉన్నారు. ఎక్కడో ఆఫీస్ లో ఉండాల్సిన లీ జాంగ్ ను ఇక్కడికి రప్పించిన రూహి అద్భుతమైన తెలివిని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

కాసేపటికి తేరుకొని, ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడమ్ అని అడిగారు.

"పొగ పెట్టి కలుగులో ఉన్న ఎలుకను బయటకు రప్పించాము. ఇక అది బోను లో పడటమే తరువాయి..." అని రూహి స్థిరంగా పలికింది.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#16
ఏజెంట్ రూహి వాసుదేవ్...8



రూహి వాసుదేవ్ తన తెలివి తో లీజా ఆటోమొబైల్స్ సీఈఓ లీ జాంగ్ ని ఆఫీస్ నుంచి గోల్ఫ్ కోర్టుకు వచ్చేలా చేసింది. అది చూసి బ్లాక్ కోబ్రా బృందం మొత్తం ఆశ్చర్యం లో మునిగిపోయారు.

"పొగ పెట్టి కలుగులో ఉన్న ఎలుకను బయటకు తీసుకొని వచ్చాం. ఇక దాన్ని బోనులో బందించడమే తరువాయి..." అని రూహి అనడం తో అందరూ ఈలోకం లోకి వచ్చారు.

"మేడమ్, ఇప్పుడు కూడా ఆ లీ జాంగ్ చుట్టూ చాలా మంది సెక్యూరిటీ వాళ్లు ఉన్నారు కదా.. వారిని దాటి అతన్ని ఎలా కిడ్నాప్ చేస్తాం. అది అసలు జరిగే పనేనా. వారికి దొరికితే మన ప్రాణాలు పోతాయి" అని వంశీ సందేహంగా తడబడుతూ చెప్పాడు.

"మీకొక విషయం చెప్పాలి. రావణాసురుడు సీతమ్మవారిని దండకారణ్యం నుంచి లంకకు ఎత్తుకొని వెళ్ళాడు. ఆ రెండిటి మధ్య దూరం సుమారు 2000 కిలోమీటర్లు... రాముడు అన్ని కిలోమీటర్లు దాటి వెళ్తే.. ఎదురుగా లంకను చేరాలి అంటే మధ్యలో ఓ పెద్ద సముద్రం అడ్డుగా ఉంది.
దాని లోతు తెలీదు. అందులో ఎలాంటి ప్రమాదం ఉందో తెలీదు. ఎంత దూరం విస్తరించి ఉందో తెలీదు.
కానీ తన గుండెల్లో మాత్రం సీతమ్మని చేరాలనే దృఢ సంకల్పం మాత్రం అలానే ఉంది. ఆ సంకల్పమే... ఎగసి పడే సముద్రపు అలల మీద నడిచి వెళ్లే రాజ మార్గం సృష్టించింది.

ఆనాడు ఆ సంద్రం చూసి ఆగిపోయి ఉంటే రామాయణం పూర్తి అయ్యేదా? రాముడు దేవుడు అయ్యేవాడా?
మన సంకల్పం బలంగా ఉంటే మనల్ని ఆపేది ఎవరు? మనకు అడ్డుగా నిలిచేది ఎవరు?"

రూహి చెప్పింది విని బృందం మొత్తం అవును అన్నట్టు తల ఆడించారు. అందరిలోనూ స్ఫూర్తి రగిలింది.

ఆ తరువాత రూహి అందరి వైపు తిరిగి, ఎవరెవరు ఏమేమి చేయాలో మొత్తం వివరంగా చెప్పింది.

"ఇప్పుడు ఈ లీ జాంగ్ కనీసం మరో గంట పాటు గోల్ఫ్ ఆడుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి అన్నా సరే ఈ గంట లోనే చేయాలి.
మనం ఆ లీ జాంగ్ ని ఈ సెక్యూరిటీ కళ్ళు గప్పి కిడ్నాప్ చేయడం చాలా కష్టం. కానీ ఒకే ఒక దారి ఉంది. అదే సొరంగం...
లీ జాంగ్ ఈ గోల్ఫ్ కోర్టు నుంచి ఇంటికి వెళ్లే దారిలో ఒక సొరంగం వస్తుంది.  అతని వాహనాలు అన్ని ఆ సొరంగం గుండానే వెళ్ళాలి. సుమారు 45 సెకండ్లు పాటు అవి అందులో ఉంటాయి. అంతకు మించిన అవకాశం మరొకటి దొరకదు. ఆ చీకటి లో మన పని ముగించేద్దాం."

అని అందరి వంక చూసింది. ఆ తర్వాత రూహి మిగతా వారికి కూడా ఏమేమి చేయాలో మొత్తం వివరంగా చెప్పింది. అందరూ చాలా శ్రద్దగా తను ఏం చెప్పిందో విని, అర్థమైంది అన్నట్టు తల ఆడించారు.

"గుర్తుంచుకోండి... మరో అవకాశం ఇవ్వడానికి మనం గెలుపు ఓటమి ఆట ఆడటం లేదు. చావు బ్రతుకుల ఆట ఆడుతున్నాం. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండండి" అని రూహి హెచ్చరించింది. అందరూ సరే అంటూ అక్కడి నుంచి ఎవరికి అప్పగించిన పని వారు చేయడం కోసం విడిపోయారు.

ముందుగా... పార్వతి ఆ గోల్ఫ్ కోర్ట్ లో ఉన్న హోటల్ లోకి అడుగు పెట్టింది. అక్కడ ఉన్న సోఫా లో కాసేపు కూర్చొని అక్కడ పని చేసే వెయిటర్స్ ని గమనిస్తూ ఉంది. ఇంతలో ఒక వెయిటర్ మెట్ల మార్గం గుండా పైకి వెళ్లడం గమనించి మెల్లగా తన వెనుక వెళ్ళింది. ఒకసారి చుట్టూ చూసింది. సమీపంలో ఎవరూ కనిపించలేదు. అదే సరైన సమయం అని ఆ వెయిటర్ భుజం మీద చెయ్యి వేసి పిలిచింది. తను మెల్లగా వెనక్కి తిరిగింది. ఈలోగా పార్వతి తన దగ్గర ఉన్న మత్తు మందు చల్లిన కర్చీఫ్ తో ఆ వెయిటర్ ముక్కును గట్టిగా అదిమింది. కొన్ని క్షణాల్లోనే తను స్పృహ తప్పి పడిపోయింది. పార్వతి మెల్లగా తనని పక్కనే ఉన్న స్టోర్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళింది. ఆ తరువాత తన బట్టలు వెయిటర్ కు, వెయిటర్ బట్టలు తనకు మార్చింది. ఇప్పుడు పార్వతి అచ్చం వెయిటర్ లాగా తయారు అయ్యింది.

అక్కడి నుంచి నేరుగా క్యాంటీన్ లోకి వెళ్ళింది. అక్కడ చాలా రకాల జ్యూసులు ఉన్నాయి. వెంటనే వాటిని కొన్ని గ్లాసులలోకి పోసుకొని ఒక గ్లాస్ లో మాత్రం తన వెంట తెచ్చిన పౌడర్ కొంచెం కలిపింది. ఆ తరువాత మెల్లగా నడుస్తూ బయటకు వచ్చింది. తనకు కాస్త దూరం లో కొంతమంది యూనిఫామ్ వేసుకొని వరుసగా కూర్చున్నారు. వారికి ఆ గ్లాసులు ఇస్తూ వెళ్ళింది. తను పౌడర్ కలిపిన గ్లాస్ మాత్రం అందులో కూర్చున్న ఆరో వ్యక్తికి అందేలా చేసింది. ఆ వ్యక్తి మరెవరో కాదు... లీ జాంగ్ కారు డ్రైవర్.

అతను పార్వతి ఇచ్చిన జ్యూస్ తాగాడు. మొదట కొన్ని నిమిషాలు బాగానే ఉన్నాడు. కానీ ఆ తరువాత అతని కడుపులో గుడ గుడ మొదలైంది. ఇక ఆపుకోలేక లేచి బాత్ రూమ్ వైపు పరుగున వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే బాత్రూం బయట పార్వతి నిలబడింది.

"సార్.. ఇక్కడ వాష్ రూమ్స్ క్లీన్ చేస్తున్నారు. దయచేసి పై అంతస్తులో ఉన్న వాటిని ఉపయోగించండి. " అని అంది.

ఆ డ్రైవర్ పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు. వాష్ రూమ్ లోపలకు అడుగు పెట్టి తలుపు వేసాడు. సరిగ్గా అప్పుడే ఆ తలుపు వెనుక ఒకరు నిలబడి కనిపించారు. తను ఎవరో కాదు.. రూహి వాసుదేవ్..

తనని చూడగానే డ్రైవర్ కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవి అయ్యాయి. అలా చూస్తూ ఉండిపోయాడు. అరుద్దామని నోరు తెరవబోయాడు. కానీ రూహి వాడికి మరో అవకాశం ఇవ్వకుండా అతని మెడ దగ్గర తన చూపుడి వేలు, మధ్య వేలి తో కలిపి ఓ పోటు పొడిచింది. దెబ్బకు ఆ డ్రైవర్ వెనక్కి విరుచుకుంటూ అలాగే స్పృహ తప్పి పడిపోయాడు.
అది చూసి రూహి వెంటనే ఫోన్ చేసి అయాన్ ని పిలిచింది.
అయాన్ వేగంగా అక్కడికి వచ్చి, ఆలస్యం చేయకుండా ఆ డ్రైవర్ బట్టలు తను వేసుకొని మొహాం సరిగా కనపడకుండా మాస్క్ పెట్టుకున్నాడు.

అలా చూస్తూ ఉండగానే గంట సమయం గడిచిపోయింది. ఇక లీ జాంగ్ గోల్ఫ్ కోర్ట్ ని వదిలి ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది. బ్లాక్ కోబ్రా బృందం కూడా దాని కోసమే ఎదురుచూస్తూ ఉన్నారు.

మోహం పూర్తిగా కనపడకపోవడం తో అయాన్ ని ఎవరూ గుర్తుపట్టలేదు. తను కూడా చాలా ధైర్యంగా, ఎక్కడా తొనకకుండా వెళ్లి లీ జాంగ్ కారు లో డ్రైవర్ లాగా కూర్చున్నాడు. అలా అతని కన్వాయ్ మొదలైంది. ముందు మూడు కార్లు, వెనుక మూడు కార్లు... మధ్యలో లీ జాంగ్ కారు వెళ్తుంది.

లీ జాంగ్ కారులో కూర్చొని ఫోన్ చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో తాము ఎదురుచూస్తున్న సొరంగం రానే వచ్చింది. ఆ కారు నడుపుతున్న అయాన్ గుండె వేగం అమాంతం పెరిగింది. ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. కారు వేగం కొంచెం తగ్గించాడు. దాంతో తన వెనుక వస్తున్న కార్ల వేగం కూడా తగ్గాయి. అలా కార్లు అన్ని మెల్లగా ఆ సొరంగం లోకి వెళ్లాయి.

సరిగ్గా దాని కోసమే ఎదురుచూస్తున్న వంశీ... తన కంప్యూటర్ తో ఆ సొరంగం లో విద్యుత్ దీపాలను ఆపరేట్ చేసే సిస్టమ్ ని హ్యాక్ చేసి ఉన్నపళంగా లైట్లు అన్ని ఆఫ్ చేశాడు. మొత్తం చీకటిగా మారిపోవడం తో ఒక్కసారిగా అందరికీ ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ కార్లు అన్ని ఆధునిక టెక్నాలజీ తో తయారు చేసినవి అవ్వడం కూడా బ్లాక్ కోబ్రా బృందానికి కలిసివచ్చింది. ఎందుకంటే వంశీ వాటిని కూడా హ్యాక్ చేసి కారు లైట్లు ఆన్ అవ్వకుండా చేశాడు.

సరిగ్గా అదే సమయం లో... లీ జాంగ్ ప్రయాణం చేసే కారును పోలిన ఓ కారు వేగంగా సొరంగం లోకి వచ్చింది.
ఆ కారును రూహి నే ఏర్పాటు చేసింది.  లీ జాంగ్ కారు నడుపుతున్న అయాన్ తన కారును వరుస లో నుంచి పక్కకు తప్పించడం, అలాంటి నకిలీ కారు వరుసలోకి రావడం... రెండు చక చకా జరిగిపోయాయి.

ఈలోగా కార్లు అన్ని సొరంగం నుంచి బయటకు వచ్చాయి. ముందు కారు కనిపించడం తో సెక్యూరిటీ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే... అది డూప్లికేట్ కారు... నిజమైన లీ జాంగ్ కారు ని రూహి బృందం అప్పటికే కిడ్నాప్ చేసింది అని...

అయాన్ తను నడుపుతున్న కారును వేరే దారిలోకి తీసుకొని వెళ్ళాడు. నగరానికి కొంచెం దూరం లో పాడుబడి ఉన్న ఓ భవంతి ముందు కారును ఆపాడు. లీ జాంగ్ అప్పటిదాకా ఫోన్ లో పడి దారి కూడా చూసుకోలేదు.కారు ఆగడం తో ఇంటికి వచ్చామేమో అని మెల్లగా కారు దిగి చుట్టూ చూసి షాక్ అయ్యాడు. కొన్ని క్షణాలు అలాగే కదలకుండా ఉండిపోయాడు.

సరిగ్గా అప్పుడే
"ప్రయాణం ఎలా జరిగింది..." అని ఓ గొంతు వినిపించింది.

లీ జాంగ్ ఉలిక్కిపడుతూ వెనక్కి తిరిగి చూసాడు. తన ముందున్న రూపం చూసి అతని గుండె కొన్ని క్షణాలు ఆగిపోయింది. ఒళ్ళంతా చమటలు పట్టేసాయి.
తన ముందు నవ్వుతూ నిలబడింది మరెవరో కాదు...
ఏజెంట్ రూహి వాసుదేవ్...

-----------------------------------------------------------

హైదరాబాద్ ...

సరిగ్గా అదే సమయం లో కిరాయి రౌడీ జలంధర్ ప్రశాంతంగా టీవీ చూస్తూ ఉండగా... అతని మనుషులు పరుగున తన దగ్గరకు వచ్చారు.

వారిని అలా చూసి..
"ఏమైంది రా " అని కటువుగా అడిగాడు

"మనం ఇప్పటిదాకా వెతుకుతున్న అమ్మాయి, అదే సుజిత ఎక్కడ ఉంటుందో తెలిసింది బాస్..." అని ఆయాసపడుతూ సమాధానం ఇచ్చారు.

ఆ మాట వినగానే జలంధర్ మోహం లో మెరుపు వచ్చింది. వెంటనే తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. కొన్ని క్షణాలు పాటు వారితో మాట్లాడాడు. ఆ తరువాత తన మనుషుల వైపు తిరిగాడు.

"మీరు వెంటనే వెళ్లి దాన్ని చంపేయండి రా..." అని ఆదేశించాడు.

ఆ మాట వినగానే నలుగురు రౌడీలు సరే అని తల ఊపుతూ కత్తులతో సుజితను చంపడానికి బయలుదేరారు. జలంధర్ తన మనిషులు వెళ్లిన వైపు చూసి తృప్తిగా నిట్టూర్చాడు.

" ఏజెంట్ రూహి వాసుదేవ్...8 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 8 users Like SivaSai's post
Like Reply
#17
Mastu thrilling ga undi story..

.. ఇటు మాతృమూర్తిని.. అటు మాతృభూమిని .. ఎలా కాపాడుకొంటుందో..!!

sooper excited
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#18
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#19
Nice update
[+] 1 user Likes Sunny73's post
Like Reply
#20
ఏజెంట్ రూహి వాసుదేవ్...9



[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]





బ్లాక్ కోబ్రా బృందం తమ తెలివితో లీ జాంగ్ సెక్యూరిటీ కళ్ళు గప్పి తనని తమ స్థావరానికి తీసుకొని వచ్చారు. ఇంటికి చేరుకున్నానేమో అని కారు దిగిన లీ జాంగ్... ఎదురుగా తన ఇళ్ళు కాకుండా ఒక పాడుబడిన భవనం కనిపించడం తో షాక్ అయ్యి నోరు అలా తెరిచి ఉండిపోయాడు.

ఇంతలో...
"ప్రయాణం ఎలా జరిగింది." అనే గొంతు వినిపించి తల తిప్పి చూసాడు. తనకు ఎదురుగా ఏజెంట్ రూహి వాసుదేవ్ నిలుచొని ఉంది. తనని చూడగానే లీ జాంగ్ తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. భయం తో రెప్పలు మూయడం కూడా మర్చిపోయాడు. ఇదెలా సాధ్యం అని బిగుసుకొని ఉండిపోయాడు.

"ఎలా ఇక్కడికి వచ్చాను అని ఆశ్చర్యపోతున్నావా లీ జాంగ్... నేను నీలాగా దొంగతనంగా, దొడ్డి దారిలో చంపాలని చూడలేదు. దొర లాగా నేరుగా నీ సైన్యం కళ్ళ ముందు నుంచే నిన్ను నా దగ్గరకు తీసుకొని వచ్చాను. ఇప్పుడైనా అర్థమైందా నా సత్తా ఏంటో " అని రూహి నవ్వుతూ పలికింది.

"రూహి, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావ్. నేనెవరో నీకు పూర్తిగా తెలీదు."

"నువ్వేమైనా రాముడివనుకుంటున్నావా, రామాయణం చదివి తెలుసుకోడానికి... రాక్షసుడివే గా...
నాకు ఎదురుగా నీలాంటి ఎదవల కనిపిస్తే తెలుసుకోవడాలు ఉండవు, తెగనరకడాలు మాత్రమే ఉంటాయి."

"మీ నాన్న చనిపోయినా సరే నీలో పొగరు ఇంకా తగ్గలేదు అనుకుంటా."

"పొగరనేది వేసుకునే చొక్కా కాదు, మార్చేస్తే పోవడానికి.. అది నా రక్తంలోనే ఉంది. మట్టిలో కలిసేదాకా పోదు."

"మీ భారతీయులు ఇంకా ఇలా ఎన్ని రోజులు ఎగిరిపడతారో నేనూ చూస్తానుగా... సరిగ్గా ఇంకో పది రోజుల్లో మీ దేశపు వెన్నులో వణుకు పుట్టిస్తాము. మీరు ఎప్పటికీ మా దేశం కిందే ఉండాలి."

"రేయ్ లుచ్చా.. మా భారతీయుల శాంతి సంకెళ్లు తెంచుకుంటే, అదే పది రోజుల్లో మీరంతా మా కాళ్ళ కింద నేలలో ఏనాడో కలిసిపోయి ఉంటారు. అయినా నువ్వు అనుకున్నది జరగాలి అంటే ముందు నన్ను దాటాలి కదా..." అంటూ రూహి వేగంగా వచ్చి లీ జాంగ్ మోహం మీద గుద్దింది.

దెబ్బకు వాడి కళ్ళు బైర్లు కమ్మాయి. ముక్కు పగిలి రక్తం వచ్చింది. కాసేపటికి తేరుకొని అక్కడి నుంచి పారిపోవాలని చూసాడు. కానీ వంశీ, పార్వతి వచ్చి.. ఆ లీ జాంగ్ ని ఆ భవనం లోకి లాక్కొని వెళ్లి కుర్చీలో కట్టేసారు. రూహి వెళ్లి వాడికి ఎదురుగా కూర్చుంది.

"నా పేరు రూహి... అంటే అర్థం ఏంటో తెలుసా.. ప్రశాంతత.. నేను అలాగే ఉంటాను.
కానీ నా గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఒక్కసారి ఆ ప్రశాంతతను దాటి తొంగి చూస్తే... ఓ ప్రళయమే దాగి ఉంది. దాన్ని చూడాలని మాత్రం అనుకోకు.
అందుకే... నువ్వు నన్ను ఎందుకు చంపాలని చూసావు? అసలు మీరు ఆ చైనా తో కలిసి ఏం చేయాలని ప్లాన్ చేసారు? తొందరగా అన్ని చెప్పేస్తే బిర్యానీ తినిపిస్తా.. లేదంటే నరకం చూపిస్తా.. ఏది కావాలో నువ్వే తేల్చుకో.. నువ్వు ఏది ఎంచుకున్నా సరే నా అతిధ్యం లో మాత్రం అస్సలు లోటు ఉండదు" అని రూహి వాడి కళ్ళల్లోకి చూస్తూ పలికింది.

"నా ప్రాణం పోయినా నా నుంచి నిజాలు కక్కించలేవు." అని లీ జాంగ్ కోపంగా పలికాడు.

"అయినా మీరు మంచిగా చెప్తే వినరు రా.." అంటూ రూహి వేగంగా పక్కనే ఉన్న ఒక స్క్రు డ్రైవర్ తీసుకొని లీ జాంగ్ అరి కాలి లోకి దింపింది. అది కాలి లో నుంచి దూరి నేల లోకి దిగింది. ఎర్రని రక్తం పైకి చిమ్మింది. నొప్పి తో లీ జాంగ్ విల విల లాడిపోయాడు. గొంతు చించుకొని అరిచాడు. ప్రాణాలు పోతున్నంత నొప్పి కలిగింది. విడిపించుకోవాలని గింజుకుంటున్నాడు. అందరూ కాసేపు తనని అలాగే వదిలేసారు.

కొన్ని క్షణాల తరువాత రూహి వాడి కాలి లో నుంచి స్క్రు డ్రైవర్ బయటకు లాగింది. లీ జాంగ్ నొప్పితో గిల గిలా తన్నుకున్నాడు. వాడి కాలి నుంచి రక్తం ధారాలంగా కారుతుంది.

"ఇప్పుడైనా నిజం చెప్తావా... లేక ఈసారి నీ కళ్ళలో పొడవమంటావా?" అని రూహి తన చేతిలోని ఆయుధాన్ని పైకి లేపింది.

అది చూడగానే లీ జాంగ్ గజ గజ వణికిపోయాడు. తను అన్నంత పని చేస్తుంది అని అర్థమై...
"వద్దు.. అంతపని చేయకు. మొత్తం చెప్తాను." అని అరిచాడు.

దాంతో రూహి తన చేతిని గాల్లోనే ఆపేసి ఆ స్క్రు డ్రైవర్ పక్కన పడేసింది. ఇప్పుడు చెప్పు అన్నట్టు వాడి కళ్ళలోకి చూసింది.

లీ జాంగ్ కాసేపు అటు ఇటు చూసాడు. ఇక చెప్పక తప్పదని అర్థమై మెల్లగా గొంతు సవరించుకొని పెదవి విప్పాడు.

"మీ భారత దేశం ఇంకొన్ని రోజుల్లో అమెరికా తో చేసుకోబోయే ఒప్పందం గురించి చైనా కు తెలిసింది. అదే జరిగితే మీరు మరింత వేగంగా ఎదుగుతారు. మీ దేశం అభివృద్ధి చెందడమే కాదు మరింత శక్తివంతమైన దేశం గా మారేలా అడుగులు కూడా వేస్తారు. అది తెలిసినప్పటి నుంచి చైనా కు కంటి మీద కునుకు లేదు. ఎందుకంటే మీరు ఎప్పటికీ ఎదగకుండా ఇలాగే ఉండటమే వారికి కావాలి.

అందుకే ఎలాగైనా సరే ఆ ఒప్పందం జరగకుండా చేయాలని ఓ పథకం పన్నింది. చరిత్రలో ఎన్నడూ ఊహించని వినాశనం సృష్టించడానికి సిద్దమైంది. కానీ అది చైనా నుంచి చేస్తే అక్కడున్న మీ ఏజెంట్ల ద్వారా మీకు ముందే తెలిసిపోతుందని ఊహించి... అందుకు చైనా మిత్ర దేశమైన మా నార్త్ కొరియా ను వేదిక చేసుకున్నారు.

ఆ పథకం ఏంటో, ఏం చేయబోతున్నారో మాకు అస్సలు తెలీదు. కానీ దానికోసం రసాయన, విజ్ఞాన, పరిశోధన, ఆటోమొబైల్స్ మొదలైన రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు అలాగే కాలేజ్ ల లో బాగా చదివే వారిని ఎంపిక చేసి ఇక్కడి నుంచి పంపించేవాళ్ళం. వాళ్లు అక్కడ పది రోజులు పాటు పనిచేస్తారు. ఆ తరువాత మరో కొత్త బ్యాచ్ ని ఇక్కడి నుంచి పంపించేవాళ్ళం. ఇలా ఎందుకంటే... ఎవరికీ ఆ ప్లాన్ గురించి పూర్తిగా తెలియకూడదు అని వారి ఆలోచన.

అలాగే అక్కడ పది రోజుల పని చేసిన వారు ఆ విషయం ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం కోసం... వారు తిరిగి వచ్చే సమయం లో కళ్ళు తీసేసి, నాలుక కోసేసేవాళ్ళం...
అలా అక్కడ పని చేసి వచ్చిన వారి నోళ్లు మూయించేవాళ్ళం.

ఈ రోజు రాత్రికే చివరి బ్యాచ్ ఇక్కడి నుంచి వెళ్తుంది. మేము ఎంపిక చేసిన వారిని ఒక వ్యాన్ లోకి ఎక్కించి, దాన్ని సిటీ సెంటర్ పక్కనే ఉన్న బస్టాప్ దగ్గర పార్క్ చేస్తాం. అక్కడి నుంచి చైనా బృందం వచ్చి వారిని తీసుకొని వెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారో అనేది మాకు అస్సలు తెలీదు. తెలుసుకోవాలని చూస్తే మా ప్రాణాలు కూడా మిగలవు అని హెచ్చరించారు.

అలాగే నువ్వు దీని గురించి తెలుసుకోవడం కోసం నార్త్ కొరియా వచ్చావని తెలిసి, నిన్ను చంపించమని కూడా నాకు ఒక కవర్ వచ్చింది. అందుకని నా మనుషుల ద్వారా విమానాశ్రయం దగ్గర, అలాగే హోటల్ లో నిన్ను చంపడానికి ప్రయత్నించాను. కానీ తృటిలో తప్పించుకున్నావు.

నాకు ఇంతే తెలుసు.. ఇంతకు మించి నాకేమి తెలీదు. నన్ను వదిలేసేయ్.. " అని లీ జాంగ్ బ్రతిమాలాడు.

లీ జాంగ్ చెప్పింది విన్న తరువాత రూహి ఆలోచనలో పడింది. అంతమంది ని ఉపయోగిస్తున్నారు అంటే కచ్చితంగా చైనా మన దేశం మీద ఊహకు అందని ఉన్మాదం ఏదో సృష్టించనుంది అని అర్థమైంది. ఎలాగైనా దాన్ని ఆపాలి అని బలంగా అనుకుంది.

సరిగ్గా అప్పుడే... ఆ భవనం కిటికీ లో నుంచి బయటకు చూస్తున్న పార్వతి పరిగెత్తుకుంటూ రూహి దగ్గరకు వచ్చింది.

"మేడమ్... ఈ లీ జాంగ్ ఇక్కడ ఉన్నట్టు వాడి సెక్యూరిటీ కి తెలిసిపోయినట్టుంది. వారంతా వస్తున్నారు. మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి." అని కంగారుగా పలికింది.

అది వినగానే రూహి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి కిటికీ లో నుంచి బయటకు చూసింది. దూరంగా లీ జాంగ్ సెక్యూరిటీ కి చెందిన చాలా కార్లు వారు ఉన్న భవనం వైపే వస్తున్నాయి. తాము ఇక్కడున్న విషయం వారికి ఎలా తెలిసిందో తనకు అస్సలు అర్థం కాలేదు. ఎలాగూ తమకు రావాల్సిన సమాచారం వచ్చింది. ఇక అక్కడ ఉండటం మంచిది కాదు అని నిశ్చయించుకొని వెంటనే వెళ్ళిపోదాం అని బ్లాక్ కోబ్రా టీం కు సైగ చేసింది.

అప్పుడే రూహి కి తన ముందు కూర్చున్న లీ జాంగ్ కళ్ళలో నవ్వు కనిపించింది. నా వాళ్లు వస్తున్నారు, నేను తప్పించుకుంటున్నాను అనే ధైర్యం వాడిలో తొణికిసలాడుతుంది. రూహి వేగంగా వాడి దగ్గరకు వచ్చింది.

"అంత మంది అమాయకుల జీవితాలు నాశనం చేసావు. అలాంటి నిన్ను ఇలా ఎలా వదిలేస్తాను అనుకున్నావ్. వారికి ఎలాంటి అన్యాయం చేసావో... నీకు కూడా అలాంటి శిక్షే పడాలి.." అని పలికింది.

అది వినగానే లీ జాంగ్ ఆశ్చర్యంగా తన వంక చూసాడు.
రూహి వెంటనే తన బృందం వైపు తిరిగింది. తన కళ్ళలోకి చూడగానే వారు చేయాల్సిన కర్తవ్యం ఏంటో అర్థమైంది.

ఎంతో మంది మేధావుల కళ్ళు, నాలుక తీసేసిన లీ జాంగ్ కు కూడా అదే శిక్ష వేశారు. పైగా వాడు ఇక రాయకుండా ఉండటం కోసం బొటనవేలు కూడా తీసేసారు. లీ జాంగ్ ప్రాణాలు పోతున్నట్టు పెద్దగా అరుస్తున్నాడు. వాడి ఆర్త నాదాల తో ఆ భవనం మొత్తం దద్దరిల్లింది.

"స్వేచ్ఛగా తిరిగే ప్రతి మనిషి వెనుక... తొమ్మిది నెలల కష్టం.. ఎన్నో కలలు... మరెన్నో బంధాలు పెనవేసుకొని ఉంటాయి. అలాంటి వాటిని క్షణం లో విరిచేసే నీలాంటి రాక్షసుడికి ఇదే తగిన శిక్ష.. ఇక నుంచి ప్రాణమున్న శవం లాగా బ్రతుకు..." అని రూహి చెప్పి అక్కడి నుంచి బయటకు నడిచింది. తన వెనుకే బ్లాక్ కోబ్రా బృందం కూడా అడుగులు వేశారు.

వేగంగా తాము వచ్చిన కారు లోనే వెనుక వైపు నుంచి వెళ్లిపోయారు. రూహి మెదడు లో ఆలోచనలు వేగంగా వెళ్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎలా ఇండియా మీద జరగబోయే ప్రమాదం ఆపాలో తెలియక ఆలోచనలలో మునిగిపోయింది.

సరిగ్గా అప్పుడే... తన పక్కనే కూర్చున్న అయాన్.. మెల్లగా నిద్ర లోకి జారుకుంటూ రూహి భుజం మీద తల వాల్చాడు. అది చూసి రూహి టక్కున తన వైపు చూసింది. ఎందుకో అప్పటిదాకా తన మనసులో చెలరేగిన ఆందోళన అంతా మెల్లగా కరిగింది. అయాన్ తన చెంతనే కూర్చొని ఉంటే మది నిండా సంతోషం నిండింది. తన మనసులో తొలిసారి ప్రేమ మధురిమలు మోగడం మొదలయింది.



" ఏజెంట్ రూహి వాసుదేవ్...9 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 5 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: Rakeeallu, 1 Guest(s)