17-02-2026, 06:43 PM
సంతోషం తమ్ముడు
ఓ లైకు కొట్టు
ఓ లైకు కొట్టు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
|
Comedy హాస్య కథలు - కనురెప్ప
|
|
17-02-2026, 06:43 PM
సంతోషం తమ్ముడు
ఓ లైకు కొట్టు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
21-02-2026, 09:11 AM
భీమారావు తిండి - మద్దూరి నరసింహమూర్తి
![]() “బాబూ రెండు చేతులెత్తి దండమెడతన్నాను, మీకు మాత్రం నేను నా ఓటేలులో సాపాటు ఎట్టలేను” “అదేంటోయి ఆలాగంటావు. నేను నీతో ఏమైనా అసభ్యకరంగా వ్యవహరించేనా, లేదే. ఇంతవరకూ ఏరోజైనా నేను తిన్నదానికి డబ్బు ఇవ్వకుండా వెళ్లిపోయేనా, లేదే” భీమారావు భీకరంగా గర్జించేడు. “మీరు సెప్పినవన్నీ నిజమే. కానీ, మీరు తినే తిండికి నాకు ఇచ్చే దుడ్డు సరిపోదు. రెండింతలిస్తానంటేనే నేను మీకు తిండి పెట్టేది. లేదంటే ఇక పెట్టేది మాత్రం లేదు” “ఒక మనిషి తిన్నదానికి ఇద్దరు తినే తిండి ధర కావాలి అని అడగడం మరీ అన్యాయమోయ్” “మీకు మరొక రోజు అంటే రేపోక్కరోజు మాత్రం ఎప్పటిలాగే తిండి ఎడతాను. ఎల్లుండినుంచి మీరు నేను సెప్పినట్టు రెండింతలిస్తానంటే నా ఓటేలుకి రండి, లేకపోతే మరోదారి సూసుకోండి” ఓటేలువాడికి తెలుసు ఆ పల్లెటూరిలో మరో ఓటేలు లేదని. ఆ పల్లెటూరిలో ఉన్న సర్కారువారి కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురిలో ఒకరికి బదిలీ అయితే, అతని జాగాలో నూతనంగా నియమించబడిన గుమాస్తా భీమారావు. అతనితో కలిసి నలుగురూ తినే ఈ ఓటేలులో భోజనానికి పాతిక రూపాయలు. రెండు రోజులు భీమారావు చేసే భోజనం చూసిన ఓటేలువాడు చెప్పిన మాటలవి. ఒక మనిషి సాధారణంగా తినే తిండికి రెండింతలు పైన తింటాడు భీమారావు. అంతేకాక, అందరూ అన్నంలో కూర పచ్చడి పులుసు నంజుకొని తింటే, భీమారావు మాత్రం వాటిలో అన్నం నంజుకొని ఎక్కువ పరిమాణంలో తినే రకం. మస్తుగా తిండి తినగలిగిననాడే తనకు పెట్టిన పేరు సార్ధక నామధేయం అవుతుంది అనుకున్నాడేమో పాపం భీమారావు, పాండవ మధ్యముడి లెక్కన తినాలన్న నియమం పెట్టుకొని పెరిగేడు. భీమారావు తండ్రి పేరుకి కుబేరరావు అయినా, అబ్బాయి పుట్టి పెరిగే కొద్ది పిల్లాడు తినే తిండి పరిమాణం కోసం ధనం ఆర్జించే ప్రయత్నాలలో, తరిగే ఆస్తిపాస్తులతో కుబేరుడు కాస్తా కుచేలుడిలా మారిపోతున్నాడనిపించేడు. దైవ కృపతో అతను పూర్తిగా అలా మారిపోకముందే, భీమారావుకి ఉద్యోగం వచ్చి ఈ పల్లెటూరికి ప్రయాణం కట్టడంతో ఆయన ఊపిరి పీల్చుకోనారంభించేడు. అందరూ ఇచ్చేదానికంటే తాను ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? అలా ఇవ్వడం కానీ ఇవ్వమని అడగడం కానీ చట్టవిరుద్ధం అన్యాయం అని నమ్మిన భీమారావు, తండ్రికి కారణం తెలుపుతూ, ఒక వంట మనిషిని వెంటనే పంపమని ఫోన్ చేసేడు. అలా పంపకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి కొడుకు తనమీదకు దండెత్తుతాడన్న భయంతో, కుబేరరావు రెండోరోజు ఉదయానికే, భీమారావుకి అత్తవరసతో వితంతువైన అమ్మాయమ్మను నెలకు సరిపడా సరకులతో భీమారావు దగ్గరకు పంపేడు. భీమారావు తిండి భీముడి వ్యవహారం అని తెలియని అమ్మాయమ్మ రాగానే ఇద్దరికీ కలిపి ఇంత ఉప్మా చేసిపెట్టి మధ్యాహ్నం భోజనానికి పూర్తిగా వంట చేస్తానని చెప్పింది. ‘అలాగే’ అన్నట్టుగా తలాడించిన భీమారావు మొత్తం ఉప్మా తానొక్కడే తిని, టిఫిన్ గా తిన్నదే కదా అని మెల్లిగా వచ్చిన త్రేనుపుతో ఆఫీసుకు వెళ్లిపోయేడు. పిల్లాడు బాగా ఆకలిమీదున్నాడు కాబోలు మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి బాగా వండి పెట్టలనుకున్న అమాయకురాలు అమ్మాయమ్మ కొంచెం ఎక్కువగానే వండి పెట్టింది. ఎందుకైనా మంచిదన్న అంతరాత్మ ప్రభోదంతో, ఆమె ముందుగా భోజనం చేసేసి కూర్చుంది. ఆవురావురంటూ ఆకలితో భోజనానికి వచ్చిన భీమరావు అప్పుడు కూడా వడ్డించినందంతా తానొక్కడే తినేసి, ఆమె వంటను మెచ్చుకొని, “అత్తా నువ్వు తినడానికి ఏమైనా మిగిలిందా” అని అడిగేడు. ఏమీ మిగలకపోయినా -- మాటవరసకు ‘ఏదో కొంచెం మిగిలిందిలే’ అని చెప్దామనుకొన్న అమ్మాయమ్మ, అబద్ధమాడి వీడితో లేని పోని కష్టాలు తెచ్చుకున్నట్టుగా ‘ఆ మిగిలింది కూడా నాకే పెట్టు’ అంటాడనుకొని ఏమీ మిగల్లేదన్న నిజం చెప్పింది. “పోనీలే, మిగలకపోతే నువ్వు మాత్రం ఏమి చేస్తావత్తయ్యా. రాత్రి నుంచి ఇంకొంచెం ఎక్కువగా వండు” అని ఉచిత సలహా ఇచ్చి ఆఫీసుకు వెళ్లిపోయేడు. అమ్మాయమ్మకు అప్పుడు పూర్తిగా తెలిసివచ్చింది - మేనల్లుడు కేవలం తినడానికే పుట్టినట్టు తింటున్న సంగతి. అంతేకాక, వండిన దానిలో తనకోసం ముందునుంచీ తీసి వేరుగా ఉంచుకోకపోతే, తనకు ఏమీ మిగలదని కూడా తెలిసి వచ్చింది. అంతకన్నా, తాను ముందే తినేయడం ఉత్తమం అన్న ఆలోచన ఆమె అంతరంగాన్ని ఆవరించింది. అలా అత్త వండిన వంట, మేనల్లుడు తిండి కలిసి నెలకు సరిపడా తెచ్చిన సరుకులు పది రోజులకే పూర్తిగా నిండుకున్నాయి. “నాయనా భీమా, రేపుదయం వంటతో నేను తెచ్చిన సరుకులన్నీ అయిపోతాయి. కావలసిన సరకుల చిట్టా ఇస్తాను రేపు సాయంత్రం నువ్వు ఆఫీసునుంచి వచ్చేటప్పుడు కొని తీసుకొని రా” “అలాగా అత్తా. అయితే, రేపు ఉదయం వంట చేసి నువ్వు బస్సులో ఊరికి వెళ్ళు. నాన్నకు ఈరోజే ఫోన్ చేస్తాను. సరకులు కొని ఉంచుతాడు. అవి పట్టుకొని వెంటనే మరునాటి బస్సులో వచ్చేసేయి” అని సలహా ఇచ్చేడు భీమారావు, తన జీతం డబ్బులతో సరకులు కొనడం ఇష్టం లేక. “నీ ఇష్టం నీ నాన్న ఇష్టం నాయనా, నాదేముంది. తాడు బొంగరం లేని దాన్ని” అని – ఊరికి వెళ్ళిన అమ్మాయమ్మ, కుబేరరావు ఎంత మొత్తుకున్నా, తిరిగి భీమారావు దగ్గరకు వచ్చి వంట చేసి పెట్టే దుస్సాహసం మాత్రం చేయలేదు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
02-03-2026, 06:10 PM
(This post was last modified: 02-03-2026, 06:21 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
ప్యార్ ''ఖ/కరోనా"
![]() Raj Kumar [img=1x1]file:///C:/Users/user/AppData/Local/Temp/msohtmlclip1/01/clip_image001.gif[/img] కరోనా వైరస్ రావడానికి వారం ముందు నాకు(జీవన్) ప్రమోషన్ వచ్చింది,అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళి ఫారిన్ క్లయింట్ ని కలిసి రావాలని మా మేనేజర్ (ఆనంద్) చెప్పాడు. ఈ డీల్ ఒకే అయితే మన కంపెనీ కి చైనా క్లయింట్ వాళ్ళు ''మెడికల్ క్లెయిమ్ " ప్రాజెక్టు ఇస్తారని చెప్పారు.అదేంటో ఆ వారం అదృష్టం కలిసి వచ్చింది. ''పెళ్లి -ప్రమోషన్" ఒక్కసారిగా నా బ్రౌసింగ్ విండో లో మెయిల్ రూపం లో ఒక అందమైన ఫిమేల్ ప్రొఫైల్ పిక్ (రాగ) వచ్చాయి. మూడు నెలలు రీఛార్జి చేయిస్తే కానీ ''మ్యారేజి బ్యూరో" వాడికి నా మీద నమ్మకం కలగ లేధు.వెంటనే షాక్ ఎందుకంటే తనని కలుసుకోవాలి అనుకునే రోజు నేను క్లయింట్ తో మీటింగ్ ''ఒకే రోజు". ఇప్పుడు ఎలా అని ఆలోచించి మళ్ళీ బ్యూరో అతనికి రీఛార్జి చేయించి అమ్మాయి పర్సనల్ నెంబర్ తీసుకొని తనకి నా ఆఫీసు టైమింగ్ అయిపోయాక కాల్ చేశాను. మొదటి సారి తన(రాగ) మాటలు వింటుంటే నా గుండెల్లో ఏదో తెలియని భయం-సంతోషం-ఒక నర్వస్ నెస్ , ఎందుకంటే ఈ-కాలం లో ''అబ్బాయిలకి సరైయన టైమ్ లో పెళ్లిళ్లు జరక్క వచ్చిన ఒక డిజార్డర్ లో నేను డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను అని చెప్పాడు మా ఫ్యామిలి డాక్టర్ (మోహన్ ).ఎలాగో అలాగా తనో తో మాట్లాడి నా ప్రమోషన్ గురించి, బెంగళూరు ట్రిప్ గురించి చెప్పి తరువాత కలుద్దాం అని చెప్పాను. తను ఒప్పుకుంధి. కానీ ఒక కండిషన్ అని చెప్పింధి, మా వూరు లో , మా ఇంటి దగ్గర వున్న ఒక ప్లేస్ లో కలుద్దాం అని చెప్పింది ఎందుకంటే ఇప్పటివరకు తను ఏ పని మొదలు పెట్టిన అక్కడి నుండే అని చెప్పింధి. తనకు బాగా కలిసి వచ్చిన ప్లేస్ అని బలంగా నమ్ముతుంది.ఇప్పుడు తను అక్కడే వుండి తన డిస్టెన్స్ ఎంబీఏ కి ప్రిపేర్ అవుతున్న అని చెప్పింది. వారము రోజులు బెంగళూరులో చైనా క్లయింట్ తో వున్నా, నా ఆలోచనలు అన్నీ రాగ చుట్టూ తిరుగుతున్నాయి. ఆఫీసు మీటింగ్ లు లేట్ నైట్ అయినా తనకి కాల్ చేసి మీటింగ్ లో జరిగిన విషయాలు అన్నీ చెప్పాను.చాలా సంతోషంగా ప్రాజెక్టు వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చాను. రాగానే రాగ కి కాల్ చేసి తనికి కలిసి వచ్చిన ప్లేస్ లో నే కలుద్ధామని చెప్పాను. తనని కలుసుకునే రోజు, నేను తనని చాలా గాఢంగా ప్రేమించిన విషయం తెలియచేయాలని ఒక గిఫ్ట్ షాప్ కి వెళ్ళి తనకి రింగ్ కొని బయలు దేరి తను చెప్పిన ప్లేస్ కి వెళ్ళాను. అది ఒక మారు మూల పల్లెటూరు,అందమైన చెట్లు,దగ్గరి లో ''అమ్మ వారి" గుడి. రాగ అందముగా రెడీ అయి తన తో పాటు గా తన తమ్ముడు (గోవింద్) ని తీసుకొని వచ్చింది.రాగ ని చూడగానే నా మనస్సులో లవ్ ఫీలింగ్ ఇంకా పెరిగి పోయింది.కానీ గోవింద్ చాలా వింతగా వున్నాడు.చేతి లో ఎప్పుడు మొబైల్ చూస్తూ మధ్య మధ్య లో మాత్రమే చుట్టూ చూస్తున్నాడు. వాడు పుబ్ జి ఆడుతున్నాడు అనుకున్నా, నేను రాగ ని ప్రేమించిన విషయం చెప్పాలని ,అది గోవింద్ కి అర్ధం కాకూడదు అని రాగ తో ''ప్లీజ్ ముజే ప్యార్ కరోనా " అని రాగ ముందు నిలబడి తన చేతిని తీసుకొని రింగ్ పెట్టాను.అంతే తర్వాత ఏం జరిగిందో గుర్తు లేధు. లేచి చూసే సరికి చుట్టూ డాక్టర్ లు, రాగ ఒక వైపు ఏడుస్తూ,మరొక వైపు ఊళ్ళో జనాలు,లోకల్ మీడియా లో నా పేరు, లేవడానికి కూడా ఓపిక లేకుండా కొట్టేశారు ఆ ఊరి మనుషులు. అసలు ఏం జరుగుతుంది,నాకు ఏమైంది అని అడగాలని ఎవ్వరిని చూసిన కనిపించ లేదు.చివరిగా అప్పుడే అటు వైపు ముసుగు వేసుకొని వస్తున్న ఒక పెద్ద వయస్సు నర్స్ ని పిలిచి అడిగా ఎందుకు నన్ను ఇక్కడ వుంచారు అని ? దానికి తను చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాను ''బాబు నీకు కరోనా " జబ్బు వచ్చింది, నిన్ను అబ్జర్ వేషన్ లో పెట్టం, నీతో ఎవ్వరూ మాట్లాడరు అనగానే హీరో షాక్. అప్పుడే వచ్చిన లోకల్ మీడియా ముందు గోవింద్ తన స్టయిల్లో మా బావ గారి కి కరోనా వచ్చింది అని తనే మొదటి సారి నేనే తెలుసు కున్న అని చెప్పడం. ఆ మీడియా వాడు నా దగ్గరికి మాస్క్ వేసుకొని వచ్చి గుచ్చి గుచ్చి నా గురించి అడిగితే, నా కంపెనీ పేరు, నేను రీసెంట్ గా పని చేసి వచ్చిన ప్రాజెక్టు చైనా వాళ్ళతో అని తెలిసి ''రాత్రికి రాత్రి " ఆ ఊరి నుండి దేశం మొత్తం తెలిసేలా చేశారు. వారం రోజులు రకరకాలైన మెడికల్ పరీక్షలు ''ఫెయిల్" అయ్యి ,చివరిగా రాగ ని పెళ్లి చేసుకొని మొదటి రాత్రి కి ఏర్పాట్లు చేశారు మా ఫ్యామిలి వాళ్ళు. ఆ రాత్రి రాగ తో అడిగిన మొదటి ప్రశ్న ''ప్యార్ కరోనా " అని చెప్పితే మీ తమ్ముడు ఎందుకు అంతా గొడవ చేసి స్పృహ కోల్పోయే లా కొట్టారు ఎందుకు అనగానే, రాగ నవ్వింది, నాకు చాలా కోపం వచ్చింది, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాను.అప్పుడు తను నా దగ్గర ఒక ప్రామిస్ తీసుకొని ''మీరు మా తమ్ముడిని (గోవింద్)ని ఏం చేయను అంటే చెప్తా" అంది. ధానికి నేను ఒకే అని ప్రామిస్ చేశాను. రాగ అప్పుడు చెప్పింది గోవింద్ గత రెండు సార్లు ''హింది పరీక్షలో" ఫెయిల్ అవుతూ వున్నడాని , ఆ రోజు నువ్వు చెప్పింది వాడికి అర్ధం కాలేధు, వాడికి అర్ధమైంది ఒక్కటే ''కరోనా " అంటే ''రోగం" అని,ఆ రోజంతా వాడు మొబైల్ లో మీడియా లో వస్తున్న ''ఇండియా లో కి కరోనా " వచ్చింది అని . పాపం గోవింద్ పసి వాడు ,వాడికి ఏం తెలుసు మీరు కలుసుకునే రోజే ''కరోనా" వచ్చిన రోజు ఒక్కటే అని, మీరు అంటే ఎంత అభిమానమో- మీరు ఎక్కడ చనిపోతారో అని చాలా బాధ పడ్డాడు. ఆనంద్ కి గోవింద్ మీడియా ముందు చేసిన ''నవరస ఆక్టింగ్ " గుర్తుకు వచ్చింది, వెంటనే ''గోవింద్ " అని అరవగానే ఎదురుగా ''గోవింద్" తల దించుకొని నిల్చున్నాడు. రాగ, తన ఫ్యామిలి అందరూ షాక్ గా చూస్తున్నారు. గోవింద్ దగ్గరికి వచ్చి ఆనంద్ ''నాకు తెలిసిన మంచి హింది మాస్టర్ వున్నారు, నువ్వు అర్జెంట్ గా హింది పరీక్షలో పాస్ కావాలి, దానికి ఎంతైనా నేను ఖర్చు పెడుతా" అని ప్రామిస్ చేయడం. గోవింద్ చేయి తుడుచుకొని ఆనంద్ ని హగ్ చేసుకొని ''మా బావ బంగారము" అని అనడం తో అందరూ హ్యాపీ. రాగ వైపు చూసి ఆనంద్ ''అభి తో కుచ్ కరోనా" అనగానే లైట్ ఆఫ్ అవుతుంది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
17-03-2026, 01:46 PM
(This post was last modified: 17-03-2026, 02:02 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
రంగమ్మ వ్యాధి
[img=1x1]file:///C:/Users/user/AppData/Local/Temp/msohtmlclip1/01/clip_image003.gif[/img] ![]() ---జ్యోతి మువ్వల ఇంటిలోకి అడుగుపెట్టిన వెంటనే పక్కనున్న పెరటిలో బట్టలు ఉతుకుతూ అటుగా తిరిగి ముసుగు వేసుకున్న వ్యక్తిని చూసి ఎవరబ్బా? ఈ కొత్త వ్యక్తి అని అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టింది రంగమ్మ. కొంపదీసి అమ్మగారు కొత్త పనివాడిని పెట్టేసుకున్నారా ఏంటి? అని ఆలోచిస్తూ అయ్యో అయ్యో ఒక రెండు రోజులు రాకపోతే అప్పుడే కొత్తపని వాడిని పట్టేసుకుంటారా అమ్మగారు అంటూ శోకాలు పెట్టుకుని ఇంటిలోకి వచ్చింది రంగమ్మ! అప్పుడే పూజ ముగించుకొని పూజ గదిలో నుంచి బయటకు వస్తున్న భాగ్యం "అబ్బా! ఏంటే తెల్లారు నీ గోల" ముందు ఆ శోకాలు ఆపు వారం రోజుల నుంచి అడ్రస్ లేకుండా పోయావు. ఒక కబురు లేదు కాకరకాయ లేదు" అని మండిపడింది. "ఎన్నిసార్లు సెలవులు పడతావు. నేను చేసుకోలేక నిన్ను పెట్టుకున్నాను. నువ్వేమో వారంలో రెండు రోజులు రావు. ఇప్పుడు ఏకంగా వారం రోజులు డుమ్మా కొట్టావు. ఇలా అయితే నాకు కుదరదు అని గట్టిగా చెప్పింది భాగ్యం." "ఏం సేయను అమ్మ! రాత్రులు నిద్ర పట్టదు. ఒక్కోపాలి రేతిరంతా కళ్ళు నిలబడి పోతాయి. కాలు చేతులు ఒకటే సొలుపులు. ఆరోగ్యం బాగోలేక రాలేకపోతున్నాను గానీ కావాలని మానేతున్నానా? అర్థం చేసుకోండి అమ్మగారు అని అంది రంగమ్మ." "బాగుందే సంబరం అలాంటప్పుడు ఎందుకు నీకీ పని, చక్కగా ఇంటిపట్టునే ఉండి ఆరోగ్యం చూసుకో రాదు.నా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావ్ అంటూ మొఖం తిప్పుకుంది భాగ్యం". "ఇల్లు గడవాలంటే ఏదో పని చేసుకో పోతే ఎలా అమ్మగారు. నేను పడుకుంటే నాలుగు మెతుకులు పెట్టే నాధుడే లేడు. నా మొగుడు సక్కగుంటే నాకెందుకీ పాటులు. ఆ తాగుబోతు సచ్చినోడు తాగి ఎక్కడ పడిపోతాడో... ఎటో, కాయకష్టం చేసుకోకపోతే మా బతుకులు సాగేదేంట చెప్పండి. అస్సలు ఒంట్లో బాగోక ఇంటి దగ్గరే పడుకొని ఉంటే మా చెల్లెలు డాక్టర్ దగ్గరికి తోలుకొని పోయింది.డాక్టర్ బోలెడు టెస్ట్‌ల రాశాడు. రిపోర్ట్స్ అన్ని చూసి చక్కెర వ్యాధి అని చెప్పాడు. రక్తంలో ఏవో తగ్గిపోయాయి అంట. నాలుగురోజులు రెస్ట్ తీసుకోమని చెప్పాడు. అందుకే రాలేకపోయాను అమ్మ" అని దీనంగా మొహం పెట్టి చెప్పింది రంగమ్మ. భాగ్యం మాత్రం ఏమాత్రం కనికరించలేదు. "ఏవో సాకులు చెబుతావులే. నీ మాటలు ఎప్పుడు నమ్మాలి! అని నిష్టూరంగా మాట్లాడింది భాగ్యం." "ఈ ఒక్క పాలి క్షమించండి అమ్మా!" అని బతిమాలుతుంది రంగమ్మ. బయటనుండి భాగ్యం, రంగమ్మ సంభాషణంతా వింటున్నాడు దుర్గారావు. "సర్లే! ఇదే ఆఖరి సారి. మళ్లీ సెలవు పెట్టావ్ అనుకో ఊరుకునేది లేదు అని గదామాయించింది భాగ్యం. భాగ్యం మాటలకి చిన్నబుచ్చుకున్న ఎట్లాగోల కరుణించారు అంతే చాలు అని మనసులో అనుకుని గబగబా పేరటిలోకి వెళ్ళింది రంగమ్మ. అంతలోనే అవును ఈ ముసుగు మనిషి ఎవడు? ఇందాక ఇంట్లోకి వస్తున్నప్పుడు ఇక్కడే చూశాను. ఒక్క రెండు రోజులు పనికి రాకపోతే నా పనినే లాగేసుకుంటాడా? వీడి పని చెప్తాను చూడు ,ఈ రంగమ్మ పనిలోనే వేలు పెట్టాలి అంటే ఆడికి ఎన్ని గుండెలు ఉండాలా? అని చుట్టూ చూసింది. బన్నీలు వేసుకొని లింగి కట్టుకొని ముసుగులో బట్టలు ఉతుకుతున్న దుర్గారావుని వెనక నుండి వెళ్లి అమాంతం జబ్బ పైన చర్చింది రంగమ్మ. దెబ్బకి కళ్ళు వూడోచ్చినంత పనయింది దుర్గారావుకి. కోపంగా ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు దుర్గారావు. దుర్గారావుని చూసిన రంగమ్మకి పై ప్రాణాలు పైనే పోయాయి. పట్టపగలే చుక్కలు కనిపించాయి. "అయ్యగారు మీరా... తప్పై పోనాది! క్షమించండి అని కాళ్ళ మీద పడింది. ఎవడో కొత్త పని వాడు అనుకున్నాను." అని గజగజ వణికి పోసాగింది. "ఆ నీకేం, నీకు కావలసిన అన్ని రోజులు సెలవులు పెట్టుకుంటావ్". "ఇక్కడ బలైపోయింది నేనే కదా!నువ్వు సెలవు పెట్టి నప్పుడల్లా నాతో సెలవు పెట్టించి మొత్తం ఇంట్లో పని చేయిస్తుంది మీ అమ్మగారు పైగా నా జబ్బ ఉడివచ్చేలా నన్నే కొడతావా ?" అని బావురుమన్నాడు దుర్గారావు. దుర్గారావు పరిస్థితికి జాలిపడింది రంగమ్మ. ఊరుకొండి బాబు గారు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. "ఎప్పుడూ తెల్ల చొక్కా లాగు వేసుకొని రాజకీయ నాయకుడులాగా హుందాగా ఉండే మిమ్మల్ని ఈ బట్టల్లో చూసి పోల్చుకోలేక పోయాను అయ్యగారు అంది రంగమ్మ." అదా! ఏం చేయమంటావ్? మీ అమ్మగారికి తింటే ఆయాసం తినకపోతే నీరసం. మరి తప్పదు నాకు అందుకే ఎవరు గుర్తు పట్టకూడదని ఈ అవతారంలో పని చేసుకుంటున్నాను" అని వాపోయాడు దుర్గారావు. క్షమించండి బాబు గారు! తప్పై పోయింది. షుగరు వ్యాధి వల్ల ముడుకులు నొప్పులు, ఒళ్ళు నొప్పులు. మా అయ్యాకి ,అమ్మకి ఇదే జబ్బు ఉందంట. ఈ మధ్యే తెలిసింది. ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా రోగాలు మాత్రం వారసత్వంగా వస్తాయి అంట కదా! తెల్లారగట్ల లేవలేకపోతున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్లాను, అందుకే రాలేక పోయాను అని చెప్పింది రంగమ్మ. రంగమ్మ బాధను విన్న దుర్గారావు ఇంటి లోపలికి వెళ్లి ఒక మాత్రని తెచ్చి ఇదిగో రంగమ్మ అని ఇచ్చాడు. అది చూసి రంగమ్మా !" ఏంటి బాబు ఇది? ఎందుకు" అని అడిగింది. రోజు ముడుకులు నొప్పులు ఒళ్ళు నొప్పులుతో బాధపడుతున్నాను అంటున్నావు కదా. ఈ మాత్ర వేసుకుంటే నీకు ముడుకులు నొప్పులు ఒళ్ళు నొప్పులు పోతాయి. చక్కగా రాత్రి పూట నిద్ర పడుతుంది. మనిషికి మంచి నిద్రే ఆరోగ్యం. శరీరానికి తగినంత నిద్ర, వ్యాయామం లేకపోతే అనారోగ్యమే వస్తుంది. వేల పట్టున తిండి కూడా చాలా అవసరం. ఇళ్ళల్లో పని చేసుకొని సమయానికి తినక పోవడం వల్లే నీకు ఈ వ్యాధి వచ్చి ఉంటాది. వేల తప్పి భోజనం చేయడం కొవ్వు పదార్థాలు, మాంసాహారాలు తినటం వల్ల నీకు వచ్చి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వంశ పరంగా కొన్ని అనారోగ్యాలు సంక్రమించిన తగిన జాగ్రత్తలు తీసుకొని అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది అని చెప్పి ఆ మాత్ర రంగమ్మ కి ఇచ్చాడు. ఇంతలో భాగ్యం ఏంటి అక్కడ కబుర్లు పని అయిందా లేదా అని కేక వేసింది. టక్కున ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. అలా కొన్ని రోజులు పోయిన తర్వాత రంగమ్మ చాలా చలాకీగా పని చేసుకుంటుంది. ఈ మధ్య సెలవులు కూడా పెట్టడం లేదు. ఒకరోజు దుర్గారావు ఏంటి రంగమ్మ ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం అని అడిగాడు. మీరు ఇచ్చిన మందు బాగా పని చేసింది బాబు గారు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది. అని చెప్పింది. ఆ మాట విని దుర్గారావు ఫక్కున నవ్వాడు. దుర్గారావు అలా నవ్వడం చూసి ఎందుకు నవ్వుతున్నాడో రంగమ్మ కి అర్థం కాలేదు. ఎందుకు బాబు అలా నవ్వుతున్నావ్ అని అడిగింది. మరేం లేదు రంగమ్మ... నేను నీకు ఇచ్చింది ఒళ్ళు నొప్పులు మాత్ర! అది వేసుకోగానే నీ ఒళ్ళు నొప్పులు తగ్గి పోయాయి.దానికి తోడు సమయానికి ఆహారం తీసుకుంటున్నట్లు ఉన్నావ్, మంచిగా పడుకుంటున్నావు అందుకే నీకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. ఆరోగ్యం అనేది మన మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. మన మనసు దేనినైతే ఆలోచిస్తుందో అదే మనకి తిరిగి వస్తుంది. మానసిక ఆరోగ్యం మనిషిని కుంగదీస్తుంది. ఆ మాత్ర వేసుకోవడం వల్ల నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని భావిస్తున్నావు అందుకే నీకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. అని చెప్పాడు. ఆ మాట విని రంగమ్మ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టింది. మన శరీరానికి మన ఆరోగ్యాన్ని బాగుచేసుకునే శక్తి ఉంటుంది. ఈ మాత్రలు మన శరీరంలోని భాగాలకు తమ వంతు పని చేసుకునే శక్తిని కోల్పోతే పని చేసుకోవడానికి సాయంగా మాత్రమే నిలుస్తాయి. ఈ విషయం తెలియక చాలామంది మాత్రలు వేసుకోవడం వల్లే ఆరోగ్యం కుదుటపడిందని భావిస్తారు. నాచురల్‌గా శరీరం బాగు పడాల్సిన స్థితిని కోల్పోయి ఈ మందుల ఆధారంగానే శరీరభాగాలు పనిచేయడం మొదలుపెడతాయి. అందుకే ఎక్కువగా మందులు వాడకూడదు. డాక్టర్ పర్యవేక్షణలో మోతాదులో తీసుకోవడం మంచిది అని చెప్పాడు. అయ్యగారు మీరు చాలా గొప్పవారు అండి. ఈరోజు మీవల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి అని సంతోషపడింది. సర్లే మళ్లీ నా జబ్బా విరగకొట్టకుండా ఉంటే చాలు అన్నాడు దుర్గారావు. భాగ్యం, రంగమ్మ ఫక్కున నవ్వారు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
19-03-2026, 10:04 AM
షడ్రుచుల సమ్మేళనంలా మీ జీవితం తీపి, వగరు, చేదుల కలయికతో సాఫీగా సాగాలని..
ఈ ఉగాది మీకు సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
26-03-2026, 05:32 PM
మంత్ర తంత్రాల మాయల మరాఠీ
![]() రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు రైలు బోగీలో నుంచి అతి కష్టం మీద కిందకు దిగాడు చింతపిక్కల రామకుటుంబం. 90 ఏళ్ళకు దగ్గర పడుతున్నా.. గట్టిపిండం. తన కంచుకంఠం ఒక్కసారి నిమురుకున్నాడు. సమయం సాయంత్రం ఆరు గంటలు దాటి ఏడు గంటలకు దగ్గర కాబోతుంది.. వెలుతురు, చీకటి కలగలిపిన దోబూచుల వాతావరణం! సన్నగా జల్లు పడుతోంది. తన చంకలో ఉన్న కాకి రంగు గోతాంలాంటి సంచిలో నుండి.. దళసరి రగ్గులాంటి గుడ్డ పైకి తీశాడు. నెత్తిమీద నుండి కప్పి, ఎడంభుజం మీదనుండి చుట్టూ తిప్పాడు. రైలు పట్టాలకు అడ్డంగా దిగి.. అటు ఇటు పరికించి గబగబా నడుచుకుంటూ అవతల రోడ్డు కి వెళ్ళాడు.. తల పైకెత్తి చూసాడు.. దూరంగా నీలంరంగు మేడ.. అదే అదే.. అడ్రస్ సుఖంగానే దొరికినందుకు తనలో తానే.. 'ఇ హే హే' అని నవ్వుకున్నాడు. అతికష్టంగా బురదలో నడుచుకుంటూ.. చిన్న గా దగ్గుకొంటూ.. నీలంరంగు మేడ సమీపించాడు. అందమైన గేటు.. గేట్ కి అటుఇటు పొడవాటి అశోకవృక్షాలు. "అమ్మాయీ.. అమ్మాయీ".. గట్టిగా పిలిచాడు. ఎవరూ తలుపు తీయకపోవడంతో దబదబా బాదాడు. సత్యసుందరి తలుపు తీసింది. "నేనమ్మా.. నన్ను 'చిరాకు' అంటారు.. సత్య నారాయణమూర్తి గారి ఇల్లు ఇదే కదమ్మా" "అవునండి ఇదే.. కాళ్లు కడుక్కోండి. నాన్న గారు మీరు వస్తారని చెప్పారు..”అంది సత్యసుందరి. "అమ్మానాన్న అర్జెంట్ పని మీద అమలాపురం వెళ్లారట కదా.. నాకు ఫోన్ చేసి.. కొన్ని విషయాలు చెప్పారులే. నీతో మాట్లాడి అన్ని విషయాలు నన్ను తెలుసుకోమన్నారు. తెలుసుకునేది ఏముందమ్మా.. మామూలు రామాయణమే, మామూలు భారతమే!" అంటూ తను కప్పుకున్న దళసరి రగ్గులాంటి గుడ్డ ను మడిచి తన గోతాం లో పెట్టాడు. మాసినగడ్డం.. గారపళ్ళు.. పిచ్చుకగూడు లాంటి తల.. ఈ ఆకారంలో ఉన్న అతడిని చూడగానే ఏవగింపు కలిగింది సత్యసుందరికి. కొరియన్ సోఫా ఉన్నా, ప్లాస్టిక్కుర్చీ చూపించి కూర్చోమంది. "వద్దమ్మా తల్లి.. పెద్ద వయసు కదా.. ఇలా నేల మీద కూర్చున్నాను అనుకో.. చాలా సుఖంగా ఉంటుంది. కాళ్ళు చాపుకోవచ్చు, కావలసినప్పుడు బాచీమఠం వేసుకోవచ్చు. అది కొరియన్ సోఫా లాగా ఉంది.. చాలా ఖరీదు ఉంటుందటమ్మా.. నువ్వు మాత్రం ఆ కొరియన్ సోఫాలో కూర్చో.. చిట్టితల్లీ. "నీ పేరు సత్యసుందరి కదమ్మా.. ఎంత లక్షణంగా ఉన్నావు తల్లీ.. ముఖ్యంగా.. అందరిలా మధ్యపాపిడి కాకుండా ఎడమచెవి దగ్గర పాపిడి తీసావు చూడమ్మా.. అది నీ ముఖానికి చాలా అందం వచ్చింది రా.. నాకు ఎక్కడా ఈ స్టైలు కనబడలేదు.. !. సరే, నా గురించి ముందుగా రెండంటే రెండే రెండు ముక్కలుచెప్పి.. అసలు విషయానికి వస్తాను.. నా పేరు చింతపిక్కల రామకుటుంబం.. షార్ట్ కట్ లో అందరూ 'చిరాకు' అని పిలవడం మొదలు పెట్టారు.. ఇదేదో చాలా గమ్మత్తుగా వెరైటీగా ఉంటుందని నేను సర్దుకు పోతున్నాను. ఇప్పుడు బ్రీఫ్ కేసులు వాడుతున్నారు గానీ చిట్టి తల్లీ.. ఈ గోతాం అంత సుఖం ఇంకేమీ లేదమ్మా. " అంటూ.. తన గోతాంలో నుంచి కొన్ని సర్టిఫికెట్లు, మరికొన్ని ఆల్బమ్స్ తీసి.. పైన పెట్టాడు. "అమ్మాయి.. నువ్వు.. కాఫీ టీ మజ్జిగ ఏమీ ఇస్తానని అడగలేదు నన్ను.. అవసరం లేదమ్మా! నాకు అలాంటి మంచి అలవాట్లు లేవు.. ఎటొచ్చి చుట్టపీక మాత్రం నా ఆరో ప్రాణం అంటే నమ్ము. అందులోనూ బంకచుట్ట అంటే మరీ చచ్చి పడతానమ్మా.. " "ఏం తీసుకుంటారు?" "అబ్బబ్బే వద్దురా.. వద్దురా. ఏదైనా తాగినా తిన్నా.. తిండి లేక ఇలా తిరుగుతున్నాడు అనుకుంటారు.. మీ అమ్మమ్మ ఉంది చూసావూ.. ఇదిగో ఈ స్టీల్డబ్బాలో నిమ్మకాయరసం కలిపి ఇస్తుంది.. ఆవిడ పిచ్చి.. నేను ఇంకా చాలా కాలం బ్రతకాలంట.. మనవాళ్ల కుటుంబాల్లో సమస్యలన్నీ పెద్దమనిషిగా పరిష్కరించాలంటే నేను కలకాలం బ్రతికి బట్ట కట్టాలట!.. ఎలా కుదురు తుందమ్మా.. ఎప్పుడు బకెట్టు తన్ని పడేస్తానో.. ఎవరికి తెలుసు?.. సరే ఇదంతా చిరాకు గోల నీకు ఎందుకు కానీ.. ఇప్పుడు చెప్పమ్మా.. వైజాగులో మీ అత్తగారి ఇంటి దగ్గర సంవత్సరం క్రితం అసలు.. అసలు ఏం జరిగింది.. ఏం జరగబట్టి నువ్వు వాళ్ల మీద కోపపడి రైలు బండి ఎక్కి ఒంటరిగా పుట్టింటికి వచ్చావు ?.. అంతలా రావలసిన భయంకర పరిస్థితి నాకు వివరంగా చెప్పమ్మా.. ఈ ముసలిముండా కొడుకు నీకేం ఉపకారం చేస్తాడు అని సందేహించకు తల్లి.. " 'చిరాకు' నేల మీద బాచీమఠం వేసుకుంటూ అన్నాడు. "చాలాచాలా చెప్పాలి మీకు.. జరిగిన సంఘటనలు.. మరుపు రావడం లేదు. గుండెలోంచి తన్నుకొస్తు న్నాయి.. మనసు రగిలిపోతుంది. ఒకసారి ఏం జరిగిందంటే.. " ఉక్రోశం భళుక్కున కక్కబోయింది సత్య సుందరి. "ఉండమ్మా.. పిచ్చిముండాకొడుకుని.. ఇవన్నీ నీకు చూపించలేదు కదా.. ఈ పని పూర్తిచేద్దాం. మన వాళ్లు అందరూ కలిపి మన తెలుగు రాష్ట్రాలు మొత్తం మీదా నాకు 49 సన్మానాలు చేశారు అమ్మాయి.. నీ సమస్య పరిష్కరించ గలిగాను అనుకో.. మీరు కూడా నాకు సన్మానం చేశారు అనుకో.. ఆహా.. అలాగని నేను సన్మా నాల పిచ్చివాడిని కాదు అమ్మాయి.. అలాగనిసమస్య పరిష్కరించినందుకు డబ్బులు తీసుకునే మదపిచ్చి నాకు అసలులేదు.. ఏదో చచ్చేలోపు కొంచెం మంచి పనులు చేద్దామని.. ఇప్పుడు.. చస్తే ఎవరూ రావడంలేదమ్మా.. కనీసం పెళ్ళాం కూడా ఏడవడం లేదు.. అలా కాదు అమ్మాయి నా గురించి 100 మంది రావాలి 100 మంది ఏడవాలి.. అదీ.. నా సంకల్పం. నా నిర్ణయం 'తప్పు'.. అంటావా?మళ్లీ ఇంకో 'సోది'.. ఇదే నమ్మా నాతో వచ్చిన చిరాకు.. సరే ఈ ఆల్బమ్ చూడు.. పూలదండ లతో ఎలా మెరిసిపోతున్నానో.. ఈ సర్టిఫికెట్స్ చూడు.. నా గొప్పతనం నీకే తెలుస్తుంది. " అంటూ అవన్నీ చూపించి గోతాంలో పెట్టాడు చిరాకు. "అమ్మాయి.. మీ అమ్మమ్మ అంటుంది.. నేను.. జాగ్రత్తగా ఉండాలి అంట.. !ఆవిడ పిచ్చి కాక పోతే.. నేను చచ్చేలోపు అన్ని అనుభవించేశాను అమ్మాయి.. ముగ్గురు కూతుళ్లకు ఘనంగా పెళ్లిళ్లు చేశాను.. ఇద్దరు కొడుకులు పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. "అన్నట్టు.. ఇప్పటి వరకు నేను డీల్ చేసిన వ్యవ హారాలు అన్ని.. అన్నీ సక్సెస్ తల్లి.. ఒక్కటంటే ఒక్కటి ఫెయిల్యూర్ అవ్వలేదు. నేను ఆస్తి తగాదాలు తీరుస్తాను.. సరిహద్దు తగాదాలు తీరుస్తాను.. యాక్సి డెంట్ సమస్యలు కూడా రాజీ చేసి పెడతాను.. ముఖ్యం గా భార్యభర్తల గొడవలు తీర్చడంలో.. అలాగే ఓల్‌మొత్తం.. కుటుంబ సమస్యలు కూడా తీర్చ డంలో ఎక్స్పర్ట్ నమ్మా.. ఇదిగో.. మనలో మనమాట నువ్వు ఎవరికైనా నా గురించి రికమండ్ చెయ్యొచ్చు తల్లి.. ఎలాగోలాగా చచ్చేలోపు సెంచరీ కొట్టాలి.. అనేది ఈ ముండా కొడుకు తాపత్రయం.. చూద్దాం".. 'చిరాకు' తన స్టీల్ డబ్బాలోని నిమ్మరసం కొంచెం తాగుతూ ఓరగా సత్యసుందరి వైపు చూస్తూ.. ఆగాడు. ఆమె ముఖంలో నుంచి అగ్గిమెరుపులు బయ టకు వస్తున్నట్టు గ్రహించాడు. "కాస్త తమాయించుకుని ప్రశాంతంగా చెప్పు తల్లి.. ఆ.. ఇప్పుడు సావధానంగా చెప్పమ్మా.. అసలు వైజాగ్ లో.. మీఅత్తగారి ఇంటిదగ్గర.. ఏం జరిగింది ? మీ అత్తగారు ఎలాంటిది???" భృకుటి ముడిచి సత్యసుందరి వైపు.. చూస్తూ అడిగాడు 'చిరాకు. ' "మా అత్తగారు అస్సలు మంచిది కాదు.. ప్రతి దానికి.. " ఆవేశంగా ఆయాసంగా ఆతృతగా చెప్పుకు పోతుంది సత్యసుందరి. "ఆగమ్మా ఆగాగు ఆగు ఆగు తల్లి.. ఇక్కడేనమ్మా కథ మొదలవుతుంది.. ఈ అత్తగార్లు ఉన్నారు చూశావు.. వీళ్ళు ఉత్తి చాదస్తపు అల్లరి పిడుగులమ్మా.. ఈ అత్తగార్ల సమస్యలు ఈనాటివి కాదమ్మా. సతీసుమతి, సతీ సక్కుబాయి, సతీసులోచన, సతీ అరుంధతి.. వాళ్లు.. వాళ్లు పడ్డారు తల్లి.. అసలైన కర్మ !! "ఈ అత్తగార్లు తాము పట్టిన కుందేటికి మూడు కాదమ్మా ఒకటే కాలు అంటారు.. మనం తల ఆడించాలి.. తందానతాన.. అనాలి.. తిమ్మినిబెమ్మిని చేస్తారు.. బెమ్మిని తిమ్మిని చేస్తారు.. మనం నోరు ఎత్తకూడదు.. మన వాళ్లందర్నీ 24 గంటలు తిడుతూ ఉండాలి.. వాళ్ల వాళ్ళు వెధవలు అయినా పొగుడుతూ ఉండాలి.. వాళ్ళు పాటించే మూఢనమ్మకాలు, చాదస్తాలు మనమూ నేర్చుకుని.. చావాలి.. అలాగైతే కాపురం.. మహదానందంగా.. సాగిపోతుందమ్మా.. !!! ఛీ.. ఛీ అలాంటి బ్రతుకు బ్రతికే కన్నా.. ఉరిపోసుకు చావడం మంచిది తల్లి.. కిరసనాయిలు పోసుకొని అంటించుకోవడం మంచిది తల్లి.. నిద్రమాత్రలు మింగి చావడం బెటర్.. రైలు చక్రాలక్రింద తల పెట్టుకుని చావడం చాలా చాలా ఉత్తమం.. ముసలి ముండా కొడుకుని ఇన్నిన్ని మాటలు అనేస్తున్నాను అని అనుకోకమ్మా.. నీలా అష్టకష్టాలు పడ్డ వాళ్ళు చెప్పిన డైలాగులు అన్నీ విన్న మీదట.. నాకు వాగుడు అలవాటై పోయింది తల్లి..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
26-03-2026, 05:37 PM
నాకు 'చిరాకు' అనే పేరు తీసేసి.. 'వాగుడుకాయ' అనే పేరు పెట్టిన సంతోషిస్తాను. పోతే పోయింది నిండు నూరేళ్లు బతుకు ఎవరు భరించగలరు అమ్మాయి ఈ విధానం..
"అత్తగారికి ఏదో హోదా ఇవ్వాలట.. అత్తగారికి హక్కులు ఉంటాయట.. మాయదారి ముదనష్టపు హక్కులు.. వయసు వచ్చాక ఓ మూలన 'కృష్ణా రామా ' అని పడి ఉండొచ్చుకదా. ఏ.. పెత్తనం ఆవిడే తీసుకోవాలా? కోడలికి కాపురానికి వచ్చిన మర్నాడే తాళాలు ఇచ్చేసి పెత్తనం కూడా ఇవ్వొచ్చుకదా.. అలా ఇవ్వరు. తమ ఆచారవ్యవహారాలు, పూజాపునస్కారాలు, పడికట్లు.. నా మొఖం.. నా శ్రాద్ధం.. అన్ని.. అత్తగారు చెప్పినట్టు కోడలు అలవాటు చేసుకోవాలట. ఏ.. కోడలు చెప్పినట్టు అత్త గారు అలవాటు చేసు కుంటే కొంపలు మునిగి పోతాయా ??? వీలు కుదరక పోతే కోడలు బట్టే అత్తగారు మారాలి. కోడలు చెప్పినట్లు చేతులు కట్టుకు వినాలి.. అలా నేర్చుకోవాలి.. అలా చేయరు.. ప్రపంచ యుద్ధం తీసుకొచ్చేస్తారు. కూతురు కే కాదు కోడలికి కూడా.. ' గారం'.. ఇవ్వడం ఈ అత్తగార్లు నేర్చుకుంటేనే.. ఈ సమాజం బాగుపడుతుంది.. అంతవరకు ఇదిగో ఇలాగే ఏడుస్తుంది.. ఆవిడ అడుగులకు మడుగులొత్తాలట.. తల్లిలా అత్తగారిని ప్రేమించాలట.. గౌరవించాలట.. కాళ్ళకి దండం పెట్టాలట!!ఎందుకు పెడతారమ్మా.. కోడలు ఎందుకు పనికిరానిదా?అటున్న సూర్యుడు ఇటు పొడిచిన.. తల్లి అత్త అవ్వదు.. అత్త తల్లి అవ్వదు!!! వాళ్ళ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసినంత మాత్రాన.. అణిగి మణిగి.. తాబేలులా బ్రతకాలా???? వాళ్ళ అబ్బాయిని నీకు ఇవ్వకపోతే అసలు నీకు పెళ్లి కాదా అంట!!!! అక్కడినుంచి సంవ త్సరం క్రితం ఇక్క డకు వచ్చేసి.. చాలా మంచి పని చేసావమ్మా నువ్వు.. శభాష్.. !! "ఇలా నీలా.. పుట్టింటికి వచ్చేయడము అనేది ఉంది చూసావూ.. ఇది.. నీలాంటి, కోడళ్ళు అందరికీ ఆదర్శ ప్రాయ మైన పనమ్మా.. సర్దుకుపోవడం.. శాంతంగా బ్రతకడం.. అత్త మామలను భర్తను రోజూ గౌరవిస్తూనే జీవిత మంతా గడిపేయడం.. ఎవరు చెప్పారమ్మా ఈ పిచ్చి విధానాలు.. అసలు మన పెద్దలు అందర్నీ లైనుగా నుంచోపెట్టి కొరడాతో చితక బాదాలమ్మా ఇలాంటి పిచ్చి విధానాలు ఏర్పాటు చేసినందుకు.. నేనైతే అసలు ఒప్పుకోను తల్లి.. ఇప్పటికైనా మించి పోయింది లేదు అక్కడికి వెళ్లి మీ అత్తగారికి ఇంత పచ్చగడ్డి పెడతాను.. దాంట్లో కాస్త సున్నం కూడా కలుపుతాను.. అప్పుడు గాని ఆవిడకు బుద్ధి రాదు.. "నువ్వు ఇక్కడకు వచ్చేసిన కొత్తలో మీ ఆయన గారు నిన్ను తీసుకెళ్లడానికి వచ్చారట.. ఆ తర్వాత మీ మామయ్యగారు కూడా రెండసార్లు నిన్ను తీసుకెళ్ల డానికి ప్రయత్నించారట.. నువ్వు 'ససేమిరావెళ్ళను' అన్నావట!.. నీ మొగుడు నే ఇక్కడకు వచ్చేయమన్నావట.. లేదంటే వేరే కాపురం పెట్టమని అన్నావట.. ! ఆ నోటా ఈ నోటా నాకు తెలిసిందిలే కూతురా. ఈ రకంగా కోడళ్ళు మసలుకుంటే.. అత్తగార్లు అందరి కీళ్లుఒంగితీరతాయమ్మా.. కట్టు కున్నోడు కూడా నీ దారిలోకివచ్చి తీరతాడు. భలే వంచావమ్మా వాళ్ళ బుర్రకాయలు.. ఇలా బిగుతుగా ఉంటేనే.. మనకు గౌరవం ఉంటుంది.. లేకుంటే మనల్ని ఇంకా అణగదొక్కేస్తారు.. వద్దమ్మా.. నువ్వు అసలు అక్కడికి వెళ్లొద్దు.. ఏ నీ అత్త మామలు కొడుకు లేకుండా బ్రతకలేరా.. ??నేర్చుకోవాలి.. ఒకరి మీద ఆధారపడి బ్రతక కూడదు.. అని జాగ్రత్త పడాలి. అయినా.. వృద్ధా శ్రమాలు లాంటి అవకాశాలు ఇప్పు డు చాలా ఉన్నాయమ్మా.. చింత లేదు. కొడుక్కి పెళ్లిముహూర్తం ముందురోజు నాటికే దగ్గర లో ఉన్న అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాల లిస్టు సేకరించు కొని ఉండాలమ్మా.. నేటి తల్లిదండ్రులు. వాళ్లే తెలివైన వాళ్ళు.. ఏమో నీ కొడుక్కి పెళ్లి అయ్యేసరికి ఇంకా ఎలాంటి సులభమైన కొత్త కొత్త విధానాలు వస్తాయో.. చూద్దాం! "ఇక్కడ విషయం ఏమిటంటే.. జీవితాలు నాశనం అయిపోవడం కాదు తల్లి.. సమా జంలో మీ నాన్నగారు తలెత్తుకు ధైర్యంగా తిరిగేలా నువ్వు చేశావు చూడు.. ఇదమ్మా.. ఇదీ కుటుంబం పరువు ప్రతిష్టలు నిలబెట్టడం అంటే.. మనలో మనమాట.. ఎప్పటికైనా ఇదే నీ కుటుంబం గాని 'అది' ఎలా అవుతుంది.. ? మీ ఊరు ఏది అని ఎవరైనా అడిగితే.. మీ అమ్మ గారి ఊరు పేరే చెప్పాలి కానీ మీ అత్త గారి ఊరు చెప్ప కూడదమ్మా.. ఈ విషయా లన్నీ మీ అమ్మానాన్నలు నీకు చెప్పి పంపితే.. నీ సమస్య ఇప్పుడు ఇంతవరకు వచ్చి ఉండేదికాదు. చిన్న పిల్లవు.. బాగా చిన్న పిల్లవు 28 ఏళ్లు ఉండొచ్చు.. మరో విషయం.. నాన్నగారుచెప్పారు.. నువ్వు చాలా కష్టపడి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసేవట కదా.. బాగా అర్థం చేసుకో బిడ్డ.. అర్థంఅయ్యే వుంటుందిలే.. అర్థం కాక ఏమవుతుంది.. నా పిండాకూడు!!!.. "నేను కూడా నీలా పట్టు వదలను. నేను వాళ్ల అంతు చూస్తాను.. అవసరం అయితే భర్త, అత్తమామలు.. ముగ్గురు మీద సెక్యూరిటీ అధికారి కేసు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను.. కోర్టు కీడుస్తాను. పదేళ్లు పట్టినా పర్వాలేదు.. మనం మాత్రం ఒక అడుగు కిందకి దిగడానికి వీలు లేదు.. ఆడవాళ్లకు ఇప్పుడు చట్టాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వాట్లను ఉపయో గించుకుందాం. అసలు నీ మాట వినకుండా నేనే మాట్లాడుతున్నాను అని అనుకోకమ్మా.. నువ్వు బాణం దెబ్బతిన్న పెద్దపులి వి. నీ మనసులో ఏముందో నాకు తెలుసమ్మా.. అంతా నాకు వదిలేయ్. ఈ చిరాకు కు కోపం రానంతవరకే.. వచ్చిందంటే పిచ్చిముండా కొడుకైపోతాడు.. అమ్మాయి.. సత్యసుందరి.. నేను కరెక్ట్ గానే మాట్లా డుతున్నాను కదా.. లేదూ.. ఏదన్నా వెటకారంగా మాట్లాడినట్టు నీ కనిపిస్తుందా.. ??? అబ్బే నాకసలు వెటకారాలు, వేళా కోళాలు చాతకరావమ్మా.. ముక్కుసూటి మనిషిని.. అసలు.. నేనంటే ఎవరికీ పడదమ్మా.. చెప్పింది విన్నట్టే విని.. చాటు గుంట తిట్టుకుంటారు.. " చిరాకు ఊగిపోతూ మాట్లాడేసి గోతాం లో ఉన్న స్టీల్డబ్బా తీసుకుని.. నిమ్మరసం గడగడా తాగి జేబులో నుంచి రింగవుతున్న సెల్‌ఫోన్ ని తీశాడు.. తీస్తూ.. సత్యసుందరి వైపు చూశాడు.. ఆమె తల వంచుకుని మౌనంగా తన కాలి బొటన వేలు గోరుతో అందమైన గ్రానైట్ ఫ్లోర్ మీద గీత పెట్టడానికి ప్రయత్నిస్తుంది. "సత్య.. సత్య.. సత్యసుందరి కదమ్మా నీ పేరు.. ఈ సెల్ కట్టి పడేస్తాను.. నీ విషయం మొదలు పెట్టు బంగారు తల్లి.. ".. అంటూ ఆగాడు చిరాకు. "ఫర్వాలేదు మీరు మాట్లాడండి.. " తల పైకెత్త కుండానే అంది సత్యసుందరి. "మొఖం నీరసంగా ఉన్నట్టుంది.. లోపలికి వెళ్ళి కొంచెం టీ తాగి వస్తావా.. " "అవసరం లేదు. మీరు మాట్లాడండి.. " "నేను మాట్లాడేది ఏముంది తల్లి.. పనికిరాని ఫోన్ లు.. సరైన పనిలో ఉన్నప్పుడే హలో పొలో అంటారు.. ఉత్తప్పుడు ఒక్కడు మాట్లాడడు. ఈ ఫోను ఎవడు కనిపెట్టాడో కానీ ఇది ప్రాణాలు తీస్తుంది, ప్రాణాలు పోస్తోంది.. " అంటూ 'చిరాకు'.. చిరాకుగా సెల్‌ఫోన్ ఆన్ చేశాడు. "హలో.. ఈశ్వరరావుగారా.. ఎవరో అనుకున్నాను. కంగారు పడకండి సార్.. మీ తమ్ముడుగారి అమ్మాయి వెంకటలక్ష్మి కాపురం విషయం గురించే కదా మీరు మాట్లాడేది. కంగారు పడకండి.. నాగురించిమీకు తెలుసుకదా.. ఏ వ్యవహారమైనా నేను మూడు అధ్యా యాలలో చక్కబెట్టేస్తాను. అది కూడా ఒకే ఒక సిట్టింగ్ సరిపోతుంది.. ఎవరికో కానీ రెండో సిట్టింగ్ పడదు అంతే.. సమస్య క్లియర్.. మీ తమ్ముడు గారి అమ్మాయిది ఇప్పటికే ఒక అధ్యాయం పూర్తయిపోయింది.. బండి గాడిలో పడినట్టే.. నేను గుడివాడ లో ఉన్నాను.. చాలా ముఖ్యమైన వ్యవహారం చక్కబెట్టడానికి వచ్చాను ఎంత రాత్రయినా ఇంటికి వెళ్ళి పోవాలి.. అరగంటకు ఓ ట్రైన్.. ఫర్వాలేదు.. " ".. .. " "విషయం ఏమిటంటే.. ఎదుటివారికి ఉన్నది మనకి కూడా ఉండాలి.. అనేటటవంటి కుత్సితపు బుద్ధి.. ఎదవ ఏడుపు.. మీ తమ్ముడు గారి అమ్మాయిది.. ఈ ముదనష్టపు లగ్జరీల గురించి తాత్కాలికమైన సంతోషాలు, సుఖాలు, ఆనందాల గురించి.. నిండు నూరేళ్ల బతుకును నాశనం చేసుకుంటున్నారండి ఈనాటి పిచ్చిపిల్లలు.. వాళ్లను పూర్తిగా అనడానికి వీలు లేదు.. మీ పెద్దల పెంపకం అలా ఏడ్చింది మరి!! తప్పు కదా.. మీ అమ్మాయి అత్త వారికి 50 లక్షల రూపాయల బిల్డింగ్ ఉంది.. ఇంకా కొద్దిపాటి పొలం కూడా ఉంది. కానీ తన కొలీగ్ లలిత తో ప్రతిసారీ ఈ దిక్కుమాలిన ఫోన్లలో మాట్లాడు తూ.. వాళ్లకు కారు ఉంది అని తెలుసుకొని.. వాళ్లకు ఉన్న హోదా మనకు లేకపోవడం ఏమిటి.. ??? అన్న పిచ్చి ఆలోచనతో.. అనవసరంగా భర్తతో అత్తమామలతో గొడవ పెట్టు కుంటుంది.. మీ వెంకటలక్ష్మి.. తప్పుకదా.. ఇదేమైనా బాగుందా చెప్పండి ఈశ్వరరావు గారు. లలిత వాళ్ళు.. బాగా లేనివాళ్ళు అద్దె ఇంట్లో గడుపుతున్నారు. కానీ ఆ అమ్మాయి భర్త అవుట్ డోర్ కంపెనీ మేనేజర్ కనుక.. కారు అవసరం కనుక కారు ఉంది. మీఅమ్మాయి భర్తకు కారు అవసరం లేదు.. అతనిదిబిజినెస్.. అవసరమైతే సరదాగా కొంటాడు.. అవసరం లేదనుకుంటే కొనడు. అప్పటి వరకూ ఆగాలి.. లక్ష రూపాయల కారు గురించి.. కాపురం పాడు చేసుకుని ఇంటికివచ్చింది.. జీవితం నాశనమై పోయినా ఫర్వాలేదు కానీ.. కారు కొంటేనే ఈఅమ్మాయి కాపురానికి వెళ్తుందట. "ఈశ్వరరావు గారూ.. ఆశ ఉండొచ్చు.. అత్యాశ కూడా ఉండొచ్చు.. కానీ 'దురాశ' ఉండ కూడదు.. అట్లాగే.. కోరికలు ఉండొచ్చు.. మితిమీరిన కోరికలూ ఉండొచ్చు.. కానీ.. ఆ పిచ్చికోరికలు కాస్తా.. 'గుర్రాలై' పోకూడదు!!!! ఇక్కడ నాలుగు 'ఆశ్చర్యం' మార్కులు పెట్టాలి గుర్తు పెట్టుకోండి.. మనుషులు పుట్టిన దగ్గర నుండి ఉన్నటువంటి శాస్త్రాలనే చెబుతున్నాను కానీ.. నేనేదో స్పెషల్‌గా 'సరికొత్తకథ' చెప్పటం లేదండోయ్ ఈశ్వరరావుగారూ.. మిమ్మల్ని నా ట్రాక్‌లోకి లాగే ప్రయత్నం చేయడంలేదు. ఆ పిల్లకి కాస్త బుద్ధి, అట్లాగే ఎక్కడైనా దొరికితే కాస్త ఎండిపోయిన పచ్చిగడ్డికూడా పెట్టండిమరి. మిగిలితే మీరు, మీ తమ్ముడు కూడా తినండి.. నేను ' వద్దు ' అనను.. పైగా మీ తమ్ముడు గారి అమ్మాయి.. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిందటండి!!. ఛీ.. పనికిరాని చదువులు చదువుతున్నారు.. ఉబుసుపోని చదువులు చదువు తున్నారు.. నాకే కనక.. సెంట్రల్ లో విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తే మొత్తం ఈ దిక్కు మాలిన చదువులు అన్ని డిస్మిస్ చేసిపాడేస్తాను.. "కాస్త సంస్కారం.. కొంచెం మమకారం.. ఇంకొంచెం ప్రేమ, అభిమానం.. మరికాస్త ఓర్పు, నేర్పు.. ఇంకాస్త ప్రపంచ జ్ఞానం.. ఎవరూ పరిచయం లేని కొత్త ఇంట్లో ప్రవేశించాక ఒక అమ్మాయి మొగుడు తో అత్తమామలతో ఏ విధంగా ప్రవర్తించాలి.. ఇవి మాత్రమే నేర్పేలా చట్టసవరణ తీసుకువచ్చి పడేస్తాను.. "మీ అమ్మాయి మొగుడు తో విడాకులకు కూడా సిద్ధం అయిపోయిందండి బాబు.. విడాకులు అంటే బీడీ కట్ట మాదిరి చవక అయిపో యాయి కదా.. వెంటనే ఇంకొకరిని పెళ్లి చేసే సుకోవటం. సమాజం ఇలా బ్రష్టుపట్టిపోయింది. మీ పెద్దలకు బుద్ధి జ్ఞానం అసలు లేదు.. ఆ అమ్మాయి నోట్లో కాస్తంత ఎండిపోయిన పచ్చ గడ్డి పెట్టి.. 14 చీవాట్లు పెట్టి.. అత్తగారి ఇల్లే నీకు సరైనది.. పుట్టింటికి రాకు అని బయటకు గెంటి పడేస్తే బాగుండును. అలిగి అత్తవారి ఇంటి దగ్గర నుంచి వస్తే.. ఆరు నెలలు మీ నెత్తిమీద పెట్టుకున్నారు.. మీలాంటి వాళ్ళవల్లే కాపురాలు కూలి పోతున్నాయి.. ఇదిగో ఈశ్వర రావుగారు.. నేనసలే మంచి ముండా కొడుకుని కాదు.. మళ్లీ నేను ఎంటర్ అయ్యే లోపున వ్యవహారం చక్క పెట్టుకోండి. లేదంటే నేనే పెద్ద మనిషిగా మీ మీ అందరి మీద కంప్లైంట్ ఇవ్వ వలసి వస్తుంది. బీ కేర్‌ఫుల్.. మళ్లీ నాకు ఫోన్ చేయకండి.. " "చిరాకు" కసితో కూడిన అసహనంతో ఊగి పోతూ సెల్ ఆఫ్ చేసి తన గోతాంలోకి విసిరి కొట్టాడు. కాసంత నిమ్మరసం తాగి.. సత్యసుందరి వైపు ఓరగా చూశాడు.. ఆమె కొంచెం బుర్ర పైకెత్తి 'చిరాకు' వైపు కంపరంగా చూసింది "సత్యసుందరమ్మా.. నేను అసలు చాలా మంచో డునమ్మా.. ఈ ప్రజలే నా బుర్రపాడు చేసేస్తున్నారు. అంతా విన్నావు కదా.. ఇప్పటి పిల్లలకు.. ఎదుటి వారికి ఉన్నది మనకి ఉండాలి అన్న ఏడుపు.. జీవితానికి ఒక గోల్ పెట్టు కొని.. అది సాధించడం కోసం.. ప్రస్తుత సుఖమయ జీవితం నాశనం చేసుకోవడం.. పెద్దలను గౌరవించక పోవడం.. ఎదుటివారు చెప్పింది పూర్తిగా వినకపోవడం.. ఇదమ్మా.. ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్!!!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
26-03-2026, 05:42 PM
"అనవసరపు వెధవ ఫోన్ సంభాషణ తో నీ టైంపాడు చేశాను తల్లి.. నా పుణ్యకాలం కాస్తా అయిపోయింది కూడా.. అమ్మానాన్న వస్తే మళ్ళీ రెండు రోజుల్లో వస్తాను అని చెప్పమ్మా.. రాత్రి 12గంటల లోపు ఇంటి కి చేరకపోతే మీ అమ్మమ్మతో పెద్ద గొడవ అయిపో తుంది! ఇదిగో తల్లి నువ్వు నాకు చెప్పాలనుకున్నది పూర్తిగా గుర్తు పెట్టుకొని.. సిద్ధంగా ఉండు తల్లి..
"ఆఖరుగా ఇంకొక్కమాట చెపుతాను వింటావా.. అదేనమ్మా రోజులు. అసలు బాగుండ లేదు. కంగారు పడి నువ్వు మీ అత్తవారి ఇంటికి మాకు ఎవరికీ చెప్పకుండా సడన్‌గా వెళ్ళిపో మాకు. రేపు నీ పుట్టిన రోజు అని కూడా తెలి సింది తల్లి నాకు. నీకు ముందు గానే అడ్వాన్సు అభినందనలు.. ఇదిగో.. ఈ రాత్రికి ట్రైన్ ఎక్కేసి తెల్లవారేసరికి అక్కడికి వెళ్ళిపోయి.. వాళ్లు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసి.. నీ మీద వాళ్లకు ఉన్న కొద్దిపాటి కోపం పోయేలాఅక్కడే బర్త్ డే చేసేసుకుందామని.. తద్వారా నీ సమస్యను నీ అంతట నువ్వే క్లియర్ చేసేసుకుందామని.. రేపటి నుంచి కొత్త జీవితం మొదలు అయిపోతుందని.. ఇదిగో చూడు.. ఇలాంటి పిచ్చిపిచ్చి అయోమయపు ఆలోచనలతో.. మీ ఇంటికి అదేనమ్మా మీ అత్తవారి ఇంటికి.. వెళ్ళిపోయె ఆలోచన చేసావు.. అనుకో.. నువ్వు పూర్తిగా బురద గుంటలో పడ్డట్టే.. ఊబిలో కూరుకు పోయి నట్టే. రోజులు అస్సలు బాగుండలేదు సత్య సుందరి. "నేను మార్గాలన్నీ క్లియర్ చేస్తాను కదా.. మూసుకు పోయిన దారులు ఆన్ని తెరిపించి నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. గుడివాడ లో మన సచ్చిదానంద సిద్ధాంతి గారు ఉన్నారు కదా.. ఆయన చేత వర్జ్యం, దుర్ము హూర్తం.. ముఖ్యంగా.. యమగండం ఏమాత్రం లేనటు వంటి నిఖార్సైన ముహూర్తం పెట్టించుకుని.. ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి బయలుదేరి పిస్తా నుకదా.. అదమ్మా నాస్టైల్.. అంతవరకూ ఏసీ రూమ్స్ ఉన్నాయి కదా మీకు.. అందులో డబుల్ కాట్ స్లీప్‌వెల్ పరుపు మీద వెల్లకిలా పడుకొని.. ఏ టెన్షన్ లేకుండ చక్కగా.. ఎంచక్కా యూట్యూబ్చూడమ్మా.. రోజులు అలా అలాఅవే గడిచిపోతాయి.. సంవత్సరం ఈజీగా గడిచిపోయిందా.. రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు.. అలా అలా కాలం గడచి పోవడం పెద్ద గొప్పేమీ కాద మ్మాయి.. మన గురించి కాల చక్రం ఆగుతుందా.. ఈ కాలచక్రానికి నట్టులు లూజు అయినా టైటు అయినా తిరగటం మానదు బిడ్డా!!!! "చిరాకు బుజ్జగిస్తున్నట్లు చెప్పాడు సత్యసుందరి కి. "సరేనండి మీరు ఎన్ని గంటలకు బయలు దేరు తారు??? మీకు డబ్బు ఏమైనా కావాలా??" సత్య సుందరి పైకి నిలబడాలని ప్రయత్నిస్తూ.. ' చిరాకు' వైపు ఆయాసంగా ఆవేశంతో కూడిన చూపు చూస్తూ కోపంతో అడిగినట్లుగా అడిగింది. "కోప్పడకమ్మా.. వెళ్ళిపోతాను.. వెళ్ళిపోతాను ఇదిగో.. గోతం పూర్తిగా సదురుకున్నాను కదా. మళ్లి.. ఇదిగో మళ్లీ ఫోన్ రింగ్.. డుర్రు డుర్రు డుర్రు డుర్రు మంటూ గోల.. ఫోన్ రింగ్.. ఈ ఫోన్ ల గోల ఎక్కువై పోయింది.. పనిచేసుకో నివ్వరు.. మాట్లాడు కోనివ్వరు.. ఒక్కసారి ఫోన్లో మాట్లాడు కుంటా నమ్మా. ఇందాక లా గంటన్నర మాట్లాడను.. ఒక్క నిమిషంలో ముగించేస్తాను.. "హలో.. ఎవరండీ.. చక్రధరరావుగారా.. విజయనగరం నుంచే కదా.. మీ అమ్మాయి కేసు రెండవ అధ్యాయం కూడా పూర్తి అయిపోయింది. మూడవ అధ్యాయం వెంటనే మొదలు పెడతాను. నేనిప్పుడు గుడివాడలో సత్యనారాయణమూర్తి గారి ఇంటి దగ్గర ఉన్నాను.. రెండు రోజుల్లో వైజాగ్ వచ్చి.. అక్కడ ఓ అత్తమామలకు ఎండిపోయిన పచ్చిగడ్డి పెట్టి.. అట్నుంచి అటు మీ విజయ నగరం వస్తాను.. కంగారు పడకండి.. ఉంటాను. " 'కంగారు' సెల్ ఆఫ్ చేసి మరింత చిరాకుగా తన గోతాంలోకి విసిరికొట్టాడు. పైకిలేచి గుమ్మం వరకు వెళ్ళాడు.. మళ్లీ వెనక్కు వచ్చాడు. ‘చిరాకు' ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడు.. అని చూస్తున్న సత్యసుందరి అతను వెనక్కి తిరిగి.. లోపలికి వచ్చినా తలపైకెత్తి చూడలేదు.. అతని పాదాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోవాలి అన్నది ఆమె అభిప్రాయం గా అతని పాదాల వైపు చూస్తూ ఉండిపోయింది. "అమ్మాయి.. మళ్లీ వెనక్కివచ్చి ఇక్కడ కూర్చుండి పోయాను.. అని తప్పుగా భావించకమ్మా.. ట్రైను కి ఇంకా కొద్ది సమయం ఉంది.. ఇప్పుడు వెళ్లినా ఉసూరుమంటూ ప్లాట్‌ఫామ్ బల్ల మీద కూర్చుని ఏడాలి.. మరో అరగంటలో వైజాగ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ట్రైన్ వస్తుంది.. బండి చాలా ఖాళీగా ఉంటుంది. చాలా స్పీడ్‌గా కొడతాడమ్మా.. తెల్లారేసరికి వైజాగ్ వెళ్లిపోతుంది.. అది బయలు దేరితేనేకానీ.. నేను వెళ్ళవలసిన ప్యాసింజర్ ట్రైన్ రాదు.. అందుకని టైంపాస్ చేస్తున్నాను బిడ్డ. ఈ లోపులో అతి ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి. అది చెప్పకుండా వెళితే నేను వచ్చి నందుకు సార్థకత ఏర్పడదు. "విషయం ఏమిటంటే.. నువ్వు నిలబడే ఉన్నావ్ అమ్మా.. కూర్చోరాదు.. " "పర్వాలేదు త్వరగా అదేమిటో చెప్పి మీరు త్వరగా వెళ్ళండి.. నాకు వేరే పని ఉంది.. ".. సత్యసుందరి ఇంచుమించు బొంగురు పోయిన కంఠంతో మాట్లాడి నట్టుగానే అంది "రైల్లో ఆ మధ్య.. ఓ అమ్మాయి తారస పడిందమ్మా. వయసు 18 ఏళ్లు ఉండొచ్చు. అంటే నీ కన్నా 10 ఏళ్ల చిన్నది. ఆ అమ్మాయి తో మాటలు కలుపుతూ.. "పాపా మీది ఏ ఊరు".. అన్నాను.. "మా ఊరు విజయవాడ " అంది. "సరే మీ అత్తవారు ఊరు ఏది?" అని అడిగాను. " చెప్పాను కదా అంది. " "అదే.. కాస్త వివరంగా చెప్పు పాపా".. అని గుచ్చి గుచ్చి అడిగాను.. దానికి ఆఅమ్మాయి ఏమందో తెలుసా.. "తాతగారు.. నాకు పెళ్లి అయ్యింది.. అప్పటి నుండి మా అత్తవారి ఊరే నా ఊరు అవు తుంది కదా.. మా అమ్మగారి ఊరు నాకు ఇక పరాయి ఊరే అవుతుంది కదా.. వయసులో పెద్దవారు అయ్యుండి ఆ మాత్రం మీకు అర్థం కావడం లేదా..” అంటూ నా నోట్లో ఇంత ఎండి పోయిన పచ్చిగడ్డి పెట్టింది. "వింటున్నావా తల్లి సత్యసుందరి.. అటువంటి అమాయకపు ఆడవాళ్లవల్లనేనమ్మా.. నీలాంటి గడుసు అమ్మాయిల సంసారజీవితాలకి గండి పడుతుంది. "ఇంకా ఏమందో తెలుసా.. తాతగారు.. నాకు తల పోటు వస్తే ఎక్కడో కాకినాడ లో ఉన్న నా తల్లి దండ్రులు వచ్చి.. నాకు తలపోటు టాబ్లెట్ తెచ్చి ఇవ్వరు కదా.. తక్షణం నా బాగోగులు చూసేది.. నా అత్తమామ లే కదా.. అంటే.. వాళ్లే కదా నాకు ప్రత్యక్ష దైవాలు.. ".. అంది తల్లి. "ఆ.. ఆ దెబ్బతో నాబుర్ర గిర్రున తిరిగిందమ్మా.. నా బుర్ర ఎక్కడ పెట్టుకున్నాను.. చూసుకుంటే నాకే అర్థం కాలేదు.. ఇంతకీ ఆ అమ్మాయి పదవ తరగతి ఫెయిల్ ఆట!.. మరి ఆ బుర్రకు అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో నాకు అర్ధం కాలేదు.. ? ఆ అమ్మాయిని చూసి 'నీలాంటి అంగర తింగర పిల్లలు ఈ భూప్రపంచం మీద బతకలేరు.. ' అని మాత్రం నేను మనసులో అనుకున్నాను తల్లి.. ఇదిగో.. ఏదో ఆ వంక పెట్టి ఇలా నిన్ను తిడుతున్నాను అని.. అపార్థం చేసుకోమాకు. నిజంగా నేను తిట్టింది ఆ అమ్మా యినే. అంటే.. ఆ అమ్మాయి స్వభావం ప్రకారం మంచైనా చెడైనా.. వాళ్లతో సర్దుకు పోయే మనస్తత్వంతోనే.. జీవితం గడపడం.. ఈ స్పీడ్ యుగంలో, ఈ కంప్యూ టర్ కాలంలో ఎలా కుదురుతుందమ్మా.. తల్లి సత్య సుందరి?. నాన్సెన్స్.. ఏదో సమయం గడపడం గురించి చెప్పాను కానీ.. ఈ సన్నివేశం తాలూకు సారం అసలు నీకు పనికిరాదమ్మా.. ఇదో పనికి రాని పనికిమాలిన చిట్టచివరిఅధ్యాయం!.. నేను చెప్పడం అయిపోయింది తల్లి.. నాకు టైం కూడా కా వస్తుంది.. బయటకు పోయానంటే ఇక మళ్లీ వెనక్కు.. నువ్వు బతిమాలి పిలిచినా రానమ్మా.. అంత మొండిఘటం నేను” "లాస్ట్ అండ్ ఫైనల్ గా.. నేను చెప్పేది ఏమి టంటే సమస్య పరిష్కారం కోసం.. నేను సామ దానబేధ దండోపాయాలు ఉపయోగించను తల్లి.. బామాలి.. భయపెట్టి.. చెయ్యను తల్లి.. ఏమిటో నా ముఖం మీద ఏమి రాసిపెట్టి ఉందో.. నేను ఫీల్డులోకి దిగే సరికి.. రెండు పక్షాల వాళ్ళు ఒక రాజీకి వచ్చేసి సెట్ అయిపోతు న్నారు బిడ్డ.. !!?? నా చరిష్మా అలా వెలిగి పోతుందమ్మా.. 'అద్భుతం'.. జరుగుతుంది.. 'మహాద్భుతం!!".. జరుగుతుంది!!!!" చిరాకు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాడు. దబ్బున రెండు తలుపులు పెద్ద శబ్దంతో మూసు కున్నాయి.. అతను ఏమాత్రం కంగారు పడలేదు.. ఎందుకంటే అలాగే జరుగుతుందని అతనికి ముందే తెలుసు కనుక!! బయట ఇంకా చిన్నగా తుంపర పడుతోంది. తన చంకలోని కాఖీ రంగు గోతంలాంటి సంచి నుంచి దళసరి రగ్గులాంటి గుడ్డ బయటకు తీశాడు.. నెత్తి మీద నుండి కప్పి ఈసారి కుడి భుజం మీద నుంచి చుట్టూతిప్పాడు.. వడివడి గా నడుస్తూ.. బురద నీటిలో కూడా.. చాలా దూరం నడిచి.. రైలు పట్టాలు దాటి గబగబా అటువైపు కు వెళ్ళి పోయాడు. స్టేషన్లో పెద్దగా జనం లేరు.. ఖాళీ బల్ల మీద కూర్చుని.. పొడ వాటి బంకచుట్ట తన ఎడమ పక్క జేబీలోనుండి తీసి అంటించాడు.. పొగ గుప్పుగుప్పున వస్తుంది.. అర్ధగంటలో.. అద్భుతం!.. జరగాలి.. మహాద్భుతం!!.. జరగాలి.. జరుగుతుందా!!!!!????? జరగాలి.. జరగాలి.. జర గాలి.. ఖచ్చితంగా జరిగి తీరాలి! ''ఓo ఫట్.. హాo ఫట్.. ఫటాఫట్!! '' గొణుక్కున్నాడు చింతపిక్కల రామకుటుంబం అలియాస్ చిరాకు. కాసేపటికి వైజాగ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ వచ్చి ప్లాట్ ఫామ్ మీద ఆగింది.. అప్పటికే టికెట్ తీసుకున్న వాళ్ళందరూ బిలబిలమంటూ ఎక్కే సారు. ప్లాట్‌ఫామ్ ఇంచుమించు నిర్మానుష్యంగా ఉంది. 'చిరాకు'.. బల్లమీద కూర్చుని స్టేషన్ మెయిన్ గేటు రోడ్డు మీదే దృష్టి పెట్టాడు.. కాళ్లకు అంటుకున్న బురద దురద పెడుతున్నా అతనికి ఏమీ అనిపించడం లేదు.. 'కొద్దిసేపట్లో వైజాగ్ ఎక్స్‌ప్రెస్.. బయలు దేరబోతున్న అనౌన్స్మెంట్' కూడా వచ్చేసింది.. !!!! చిరాకు బంకచుట్ట పొగను గుప్పుగుప్పున వదులుతూ కళ్ళు పూర్తిగా మూసుకుని చాలా సేపు అలాగే ఉండి తెరిచాడు.. అతని దృష్టి స్టేషన్ మెయిన్ గేట్ దగ్గర అప్పుడే వచ్చి ఆగి ఉన్న పసుపు రంగు ఆటో మీద పడింది.. అందులో నుండి రెండు భుజాలకు బరువైన బ్యాగులతో ఒకామె దిగింది. ఏమాత్రం ఆయాస పడకుండా పరుగు పరుగున స్టేషన్లోకి వచ్చి.. కంగారుగా టికెట్ కౌంటర్ లో డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుని.. ప్లాట్ ఫామ్ మీద కదల బోతున్న వైజాగ్ ఎక్స్‌ప్రెస్ దగ్గరకు గబగబా వచ్చేసింది.. దట్టమైన చుట్టపొగలోంచి ఆమె ఆకారం 'అస్పష్టంగా' కన బడుతుంది.. 'చిరాకు' కు.. !. కానీ ఆమెమాత్రం ఖచ్చితంగా ఎడమ చెవి దగ్గర పాపిడి తీసుకున్నావిడే!!! అప్పటికే ట్రైన్ ఒక జెర్క్ ఇచ్చి కదిలింది.. ఆమె రెండు బ్యాగ్‌లను బోగిలోకి గిరాటుపెట్టి.. డోర్ రాడ్ పట్టుకొని.. అతి బలవంతంగా బోగి లో రెండు అడుగులు పెట్టి.. ఒక్క ఉదుటున పైకి ఎక్కేసింది.. ఎక్స్‌ప్రెస్ ఒక్కసారి చాలా స్పీడ్ అందుకుంది.. పెద్దగా కూత వేసుకుంటూ.. ! చింతపిక్కల రామకుటుంబం అలియాస్.. 'చిరాకు'.. నోట్లోంచి బంకచుట్టను తీయకుండా ఆకాశం వైపు ముఖం పెట్టి.. ' ఇ హే హే '.. అంటు గట్టిగా నవ్వేసాడు.. ఇంకా నవ్వుతూనే ఉన్నాడు.. అలా నవ్వుతూనే ఉన్నాడు!!!! **
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
29-03-2026, 06:31 PM
ఆనవాయితీతో ఆబ్దికం - మద్దూరి నరసింహమూర్తి
“విస్తట్లో చేయి పెట్టి తినకుండా అన్నాన్ని అలా కెలుకుతున్నారేమిటండీ, ఏమైనా సమస్య వచ్చి పడిందా”“సావిత్రీ, నాన్న ఆబ్దికానికి ఇంకా రెండు రోజులే మిగిలేయి అన్నది నీకు తెలుసు. ఇంతవరకూ ఆనవాయితీ తప్పకుండా పెడుతున్నాము కదా” “నిజమే. ఇప్పుడు ఎవరైనా కాదన్నారా” “అదికాదు. ఈ సారి ఆనవాయితీతో ఆబ్దికం పెట్టే సులువు కనిపించడం లేదు సావిత్రీ” “ఎందుకు అలా అనుకుంటున్నారు” “ఆనవాయితీ నెరవేర్చడానికి కావలసినది ఎక్కడా దొరకడం లేదు. అందుకే ఆబ్దికం ఆనవాయితీతో ఎప్పటిలా పెట్టగలనా అన్న భయం వేస్తూ మార్గం కనపడక నాకు దిగులుగా ఉంది” “ఇంకా రెండు రోజులు ఉన్నాయి కదా ఏదో దారి దొరుకుతుంది లెండి. ముందు మీరు భోజనం చేయండి” “అలాగే. అవునూ రవి ఏడీ” “ఆబ్దికం ఆనవాయితీ అంటూ తిరగడంతో మీకు సరిపోతుంది. బడికి సెలవలు కాబట్టి పది రోజులుగా పిల్లాడు నాలుగు మెతుకులు ఏదో ఇంత మింగి, వాడి స్నేహితుడు గోపాలం ఇంటికి ఆడుకుందికి పరిగెత్తుతూ చీకటి పడే వరకూ అక్కడే ఆడుకుంటున్నాడు. ఇంట్లో ఉండరా అంటే నా మాట వింటాడా ఏమిటి వాడు. మీరైనా కాస్త గట్టిగా చెప్పండి” ఇంతలో ఆకలి వేసి భోజనానికి వచ్చిన రవి లోపలికి పరిగెత్తుకొని వచ్చి, తండ్రిని చూసి భోజనాల గది ద్వారం దగ్గరే ఆగిపోయేడు. “ఏమిరా రవీ, చదువు చట్టబండలు ఏమీ లేక రోజంతా గోపాలం ఇంట్లో ఏమి చేస్తున్నావు” “నాన్నా మరి మరి...” “అక్కడ ఏమిటి చేస్తున్నావురా అంటే ఏమిటా నసుగుడు, అక్కడ ఏమిటి చేస్తున్నావో త్వరగా చెప్పు” భయపడుతూ తాపీగా రవి చెప్పినది విన్న రావుగారికి – ఒక్కసారిగా బుర్రలోని భారం అంతా చేత్తో తీసేసినట్టై మనసు తేలిక పడి – “చూసేవా సావిత్రీ, చంకలో పిల్లాడిని పెట్టుకొని ఊరంతా వెతికేడట నాలాంటి వెర్రివాడు వెనకటికి. మనకి కావలసినది రవితో ముందుగా చెప్పి ఉంటే, నాకు ఈ తిరుగుళ్లు తలనొప్పి తప్పి ఉండేవి” “పోనీండి ఇప్పటికైనా మీకు మనశ్శాంతి దొరికింది అదే పదివేలు, తాపీగా తృప్తిగా భోజనం చేయండిక” “ఒరే రవీ, దొడ్లోకి పోయి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రా, నాన్నగారి పక్కన నీకు కూడా వడ్డిస్తాను” “అలాగే అమ్మా” అంటూ ఉషారుగా దొడ్లోకి పరిగెడుతున్న రవి వంక ప్రేమగా చూడసాగేరు దంపతులు. ఆబ్దికం రోజున -- “ఏం సావిత్రమ్మా వంటకాలు ఎంత వరకూ వచ్చేయి, ఆబ్దికం పనులు ప్రారంభించుకోవచ్చా” “తక్కువలో ఇంకో అరగంట పడుతుంది పంతులుగారూ, కాఫీ కానీ మజ్జిగ కానీ త్రాగుతారా” “మజ్జిగ వద్దమ్మా, కాఫీ అయితేనే బండి హుషారుగా నడుస్తుంది” “అలా అయితే మీరు పై పనులు చూసుకుంటూండండి, పది నిమిషాల్లో వేడి వేడి కాఫీ త్రాగుదురుగాని” పంతులుగారు పై పనులు చూసుకుంటూ, రావుగారు అసహనంగా అటూ ఇటూ తిరగడం చూసి – “ఏమిటైంది రావుగారూ, అంత అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నారు” “మా అబ్బాయిని పంపి అరగంట దాటింది శాస్త్రీగరూ, ఏదీ ఇప్పటివరకూ తేలేదు. ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో” “ఏమిటి తేవడానికి పంపేరు, ఎక్కడికి పంపేరు, అగో మాటల్లోనే మీ వాడు ఏదో సంచీతో వచ్చేడు” రావుగారు ఆతృతగా “ఏమిరా రవీ తెచ్చేవా” “తెచ్చేను నాన్నా. సంచీలో పెట్టి సంచీ మూతిని త్రాడుతో బిగించి కట్టి మరీ తెచ్చేను. నువ్వు దాన్ని కట్టడానికి త్రాడు తెచ్చి ముందుగా ఒక కొస స్తంభానికి కట్టేయి. అప్పుడు సంచీమూతికి ఉన్న కట్టు విప్పి జాగ్రత్తగా దాన్ని తీస్తాను, ఆ త్రాడు చివర కొస దాని మెడకో కాలుకో వేసి గట్టిగా కట్టేస్తే సరి” “రావుగారూ ఏమిటి ఈ హడావిడి” “చూస్తూండండి, మీకే తెలుస్తుంది” అని రావుగారికి చెప్పిన రావుగారు -- “సావిత్రీ, పనిమనిషికి దొడ్లో ఉన్న గోనెపట్టాను ఇసకను పట్టుకొని రమ్మను” 5 నిమిషాల్లో పనిమనిషి గోనెపట్టా ఇసక పట్టుకొని వచ్చింది. వచ్చిన పనిమనిషితో రావుగారు ఒక స్తంభం దగ్గర గోనెపట్టాను పరచమని చెప్పి, తెచ్చిన ఇసకను ఆ పట్టాపై మందంగా పోయమన్నారు. ఆ తరువాత, పనిమనిషి సహాయంతో రవి సంచీలో ఉన్న కుక్కపిల్లని జాగ్రత్తగా తీసి దాని మెడకు త్రాడుకున్న ఒక కొసతో ముడి వేసి, అప్పటికే స్తంభానికి కట్టి ఉంచిన త్రాడు కొసతో కట్టివేసేడు. “ఇదేమిటి రావుగారూ, ఆబ్దికం జరిపించే చోట కుక్కపిల్లను స్తంభానికి వేసి కట్టేరు” “ఈ ఏడాది ఆబ్దికానికి మీరు కొత్తగా వచ్చేరు కాబట్టి మీకు తెలియదు” “ఏమిటి నాకు తెలియనిది” “కుక్కపిల్లను తాడుతో స్థంబానికి కట్టి ఉంచి, ఆబ్దికం పెట్టడం మా ఇంటి ఆనవాయితీ” “నా పిండా కూడు, అదేం ఆనవాయితీ రావుగారూ. ఎక్కడా వినలేదు కనలేదు ఈ వింత” “మీరు ఇంటికి వెళ్ళిన తరువాత మీ తాతగారిని అడగండి, ఆయనకు అంతా తెలుసు” “మీరు చెప్పొచ్చుగా” “నాకొకటి తెలిసి ఏడిస్తేగా మీకు చెప్పడానికి. మా పెద్దలు ఏర్పరచిన ఆనవాయితీని గుడ్డిగా ఆచరించడం ఒక్కటే నాకు తెలుసు” “పంతులుగారూ, ఇగో వేడి కాఫీ. సేవించి మీరు ఆబ్దికం పనులు ఆరంభించండి, ఏదైనా అవసరమైతే కేక వెయ్యండి, తెచ్చి పెడతాను” అంటూ సావిత్రిగారు కాఫీ ఇచ్చేరు. ఆమె ఇచ్చిన కాఫీ అందుకున్న పంతులుగారు “సావిత్రమ్మగారూ, ఆబ్దికానికి ఈ కుక్కపిల్లను తెచ్చి ఇక్కడ స్తంభానికి కట్టడమేమిటి, ఈ వెధవ ఆనవాయితీ వివరాలు ఏమిటో మీకేమైనా తెలుసా” “మా ఆయనకే తెలియనిది నాకెలా తెలుస్తుంది అనుకున్నారు” అంటూ సావిత్రిగారు సిగ్గు పడుతూ త్వర త్వరగా లోపలికి వెళ్లిపోయేరు. రెండు గంటలలో ఆబ్దికం పనులన్నీ యధాతధంగా జరిపించేరు రావుగారు. ఆబ్దికం జరుగుతున్నంత సేపూ – కుక్కపిల్ల ‘కుంయి కుంయి’ అని చిన్నగా అరుస్తూనే ఉంది. అలా అది అరుస్తున్నప్పుడల్లా, అక్కడే కూర్చొని ఉన్న రవి దానికి చిన్న బిస్కట్ ముక్క ఇస్తూనే ఉన్నాడు. భోక్తలతో పాటూ రావుగారి భోజనాలు కూడా అయిపోయేయి. రావుగారితో సహా బ్రాహ్మణులు అందరూ వెళ్ళిన తరువాత రావుగారు – “ఒరే రవీ, ఆ కుక్కపిల్లను గోపి ఇంట్లో ఇప్పుడే ఇచ్చి వస్తావా, లేక భోజనం చేసి వెళ్తావా” “అమ్మనడిగి గారె ఒకటి తిని, ఇప్పుడే వెళ్ళి గోపీకి కుక్కపిల్లను ఇచ్చి వస్తాను నాన్నా” “అయితే, త్వరగా వెళ్ళి దాన్ని ఇచ్చేసి గోపీని కూడా పిలుచుకొని రా. నీతో పాటూ ఇక్కడ భోజనం చేస్తాడు. కాదంటే, ఓ నాలుగు గారెలు తిని వెళ్తాడు” “అలాగే నాన్నా” అంటూ రవి లోపలికి వెళ్ళి అమ్మ దగ్గర గారె ఒకటి తీసుకొని నిక్కరు జేబులో కుక్కుకొని, కుక్కపిల్లను పెట్టి మూతి కట్టేసిన సంచీ పట్టుకొని గోపి ఇంటికి వెళ్ళేడు. వెనకనుంచి సావిత్రిగారు “త్వరగా గోపితో వచ్చేయి రవీ, భోజనం చేద్దురుగాని” “అలాగే అమ్మా” అంటూ రవి ఎక్కు పెట్టిన బాణంలా గోపి ఇంటి వైపుగా దూసుకొని వెళ్లిపోయేడు. సావిత్రిగారు రావుగారికి వడ్డించడం, ఆయన భోజనం అయిపోవడం కూడా అయిపోయింది. “ఆకలితో ఉన్న పిల్లాడు ఇంకా రాడేమిటండీ” అని సావిత్రిగారు కంగారు పడుతూండగా రవి గోపి కలిసి తాపీగా వచ్చేరు. “ఇద్దరూ దొడ్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి, వడ్డించేస్తున్నాను” వారిద్దరూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కబుర్లాడుకుంటూ అరటి ఆకులలో వడ్డించిన తద్దినం భోజనం పదార్ధాలను సరదాగా తృప్తిగా తినసాగేరు. ఇంటికి వెళ్ళిన రావుగారితో అతని తాతగారు – “ఏమిట్రా మనవడా పొట్ట అలా ఉబ్బరించుకొని వచ్చేవు. కొంపదీసి రావుగారి ఇంట్లో నాలుగు రోజులకు సరిపోయిన తిండి తిని చచ్చేవా ఏమిటి, చచ్చి ఊరుకుంటావు” “ఈ పొట్ట ఉబ్బరం రావుగారింట్లో తిండి తినడం వలన కాదు తాతయ్యా” “మరి ఏమైందో చెప్పి ఏడూ” “అక్కడ జరిగిన ఒక విడ్డూరం చూసి, ఆ వివరాలు ఏమిటో తెలిసి చావక, నా పొట్ట ఇలా ఉబ్బిపోతుంది” “అక్కడ నువ్వు ఏం విడ్డూరం చూసేవు” రావుగారు అతని తాతయ్యతో రావుగారింట్లో చూసిన కుక్కపిల్ల వ్యవహారం అంతా చెప్పి – “ఆబ్దికం జరిపించే చోట కుక్కపిల్లను స్తంభానికి వేసి కట్టడమేమిటి రావుగారూ అని అడిగితే – ‘నాకొకటి తెలిసి ఏడిస్తేగా మీకు చెప్పడానికి, ఆనవాయితీని గుడ్డిగా ఆచరించడం ఒక్కటే నాకు తెలుసు, మీకు అంతగా ఆ వివరాలు తెలుసుకోవాలంటే, మీ తాతగారిని అడగండి, ఆయనకు తెలుసు’ – అన్నారాయన” “అదా సంగతి” అంటూ ముసలాయన నవ్వసాగేరు. “ఇగో తాతయ్యా నవ్వింది చాలు కానీ, ఆ వివరాలు త్వరగా చెప్పి చావు, లేకపోతే నా పొట్ట ఇంకా ఉబ్బిపోతుంది” “ఇలా కూర్చో చెప్తాను” “ఉబ్బిపోయిన పొట్టతో నేను కూర్చోలేను. నేనిలా ఇక్కడే పచార్లు చేస్తూ ఉంటాను, నువ్వు చెప్పు” “అలాగే” అని తాతయ్యగారు గొంతుక సవరించుకొని – అగ్రహారంలో గోవిందురావుగారిది లంకంత లోగిలి, చుట్టూ చెట్లు చేమలతో పెద్ద తోట. ఇప్పుడైతే మనం ఈ ఊరికి వచ్చేసేము కానీ, అప్పుడు మన కుటుంబం కూడా అక్కడే ఉండేది. ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే, గోవిందురావుగారు తోటలోనే గాడి తవ్వించి, ఆయన భార్య అధ్వర్యంలో వంటలు చేయించేవారు. ఆ మహాతల్లి చేసిన గారెలు నోట్లో వేసుకుంటే, వెన్నలా కరిగిపోయి స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నామనిపించేది. పవిత్రమైన కార్యక్రమం జరిగే చోటుకి గభీమని ఎవరూ వచ్చేయకుండా వీధి తలుపు వేసినా, దొడ్డి వైపు తలుపు తీసి ఉంచక తప్పేది కాదు” “అసలు విషయం చెప్పకుండా ఈ ఉపోద్ఘాతమంతా దేనికి తాతయ్యా” “నువ్వు అడిగితే చెప్పడానికి అది కథ కాదురా, యదార్ధ గాధ. కాబట్టి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోకపోతే అర్ధం చేసుకోలేవు” “సరేలే, త్వరగా విషయానికి రా” “గోవిందురావుగారి అబ్బాయి గోపాలరావు నేను సహ విద్యార్ధులం స్నేహితులం. రోజులో సగభాగం పైన నేను గోపాలంతో కలిసి వాళ్ళ తోటలోనే ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ తోటలో ఒకటి రెండు కుక్క పిల్లలు కూడా మాతో పాటూ పరిగెడుతూ ఆడుతూ ఉండేవి. నాకు బాగా జ్ఞాపకం, అప్పుడు నాకు గోపాలంకి కూడా ఎనిమిదేళ్లు. రావుగారింట్లో ఆరోజు ఆబ్దికం జరిపించడానికి మా నాన్నగారు – అంటే నీ ముత్తాతగారు – వచ్చేరు. రావుగారింటి వీధి తలుపు వేసున్నా, దొడ్డి వైపు తలుపు తీసి ఉన్నందున, తోటలో తిరుగాడే ఒక కుక్కపిల్ల లోపలికి దూరి ఆబ్దికానికని వండి అక్కడ మడిగా పెట్టిన నువ్వుల పచ్చడి నాకింది. దాని నాలుక మండింది కాబోలు, ‘కుంయి కుంయి’ అని అరుస్తూ దొడ్లో పిచ్చి పరుగులు పెట్టసాగింది. దాంతో, మహాలక్ష్మమ్మగారు మా ఇద్దరినీ పిలిచి ఆ కుక్కపిల్లను పట్టుకొని ఒక చోట దూరంగా కూర్చోమని గట్టిగా కేకలు వేసేరు. పనిమనిషి చేత ఆ పచ్చడి ఆవల పారవేయించి, పాపం కష్టపడి ఆమె మరలా కొత్తగా పచ్చడి చేసేరు. ఆ హడావిడి అంతా విన్న రావుగారు గోపాలంతో – “ఒరే బడుద్ధాయి వెధవా, కుక్కపిల్ల ఇంట్లో దూరిపోతూ ఉంటే ఏమిటి చేస్తున్నావు, గాడిదలు కాస్తున్నావా” అని తిట్టి – “మీరిద్దరూ కలిసి ఇంట్లో ఒక స్తంభం దగ్గర గోనేపట్టా ఒకటి పరచి, దాని మీద మందంగా ఇసక పోసి, ఆ కుక్కపిల్లను ఆ ఇసక మీద పడుకో పెట్టి, ఒక త్రాడుతో దాన్ని ఆ స్తంభానికి వేసి కట్టేసి, అక్కడ నుంచి ఆ బుజ్జిముండ కదలకుండా కాపలా కాస్తూ కూర్చోండి” అని గట్టిగా కేకలు వేస్తూ చెప్పేరు. మేమిద్దరం జడిసి పోయి అలాగే చేసి, ఆ కుక్కపిల్ల దగ్గరే ఆబ్దికం జరుగుతున్నంత సేపూ కదలకుండా కూర్చునేందుకు వెళుతూ – ‘గోనేపట్టా ఇసక ఎందుకు నాన్నగారూ” అంటూ అడిగేడు గోపాలం. “ఆ బుజ్జిముండ ఏమైనా గలేజీ చేస్తే, ఆ చెత్త అంతా గోనెపట్టా మీద ఉన్న ఇసకమీద పడుతుంది. ఆబ్దికం పనులు అయిపోయిన తరువాత, ఇసకతో సహా ఆ గోనేపట్టా మన పనిమనిషి పారవేస్తుంది” అని బోధపరచి --- కుక్కపిల్ల విషయంలో ఆరోజు అలా జాగ్రత్తలు తీసుకోవడంతో, వంటలు తదితర పాత్రలు వస్తువులు మైలపడక ఆబ్దికం పనులు చక్కగా నెరవేరాయి. అది గుర్తు ఉంచుకున్న గోపాలం హయాంలో నేను జరిపించిన ఆబ్దికం సమయంలో కూడా, ఆ తోటలో తిరిగే కుక్కపిల్లను తెచ్చి స్తంభానికి కట్టేసి, ఆబ్దికం పనులు పవిత్రంగా జరిపించేవాళ్లం. గోపాలం కొడుకు కృష్ణ ఆ తతంగం అంతా జాగ్రత్తగా చూస్తూ, అతను హయాంలో మీ నాన్న జరిపించిన ఆబ్దికం అప్పుడు కూడా, కుక్కపిల్ల విషయంలో ఆ విధమైన జాగ్రత్తలతో ఆబ్దికం పనులు జరిగేవి. గోపాలం అతని తండ్రిని, కృష్ణ అతని తండ్రిని, రావు అతని తండ్రిని చూసి ఆ జాగ్రత్తలతోనే ఆబ్దికం జరిపిస్తూ పాటిస్తున్న ఆనవాయితీ అది” ఆ వివరాలు విన్న తరువాత రావుకి పొట్ట ఉబ్బరం అయితే తగ్గింది కానీ -- ఆరాత్రి కలలో నాలుగు కుక్కపిల్లలు రావు చుట్టూ తిరుగుతూ, అతని ఒళ్ళంతా గలేజీ చేసేయి. **శ్రీరామ**
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
06-04-2026, 04:40 PM
పాత చింతకాయపచ్చడి లాంటి కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు "హలో సుబ్రహ్మణ్యం బాగున్నావా.. పాత చింతకాయ పచ్చడి రుచి అదిరిపోద్ది. పంపమంటావా?”. ''ఎవరు మాట్లాడేది??” "నేనురా.. రామచంద్రపురం నుండే శివరామకృష్ణయ్యని మాట్లాడుతున్నాను. మీ ఇంటి దగ్గర పని చేసే ఆ బాగా పొడవాటి కుర్రాడు పొడుగురాజును పంపు. వాడిని అటక ఎక్కించి, పచ్చడి జాడి దింపించి, పాత చింతకాయ పచ్చడి వాడి చేతికిచ్చి నీకు కూడా పంపుతాను." "అరెరే.. వాడు నిన్ననే మానేశాడు రా'' "ఏడ్చావు.. ఆ సంగతి ముందుగానే చెప్పొచ్చు కదా. ఫోన్ పెట్టేయ్.. కాల్ వేస్ట్......" "మరి పచ్చడి ఎప్పుడు పంపుతావ్. అసలు నాకు తెలియకుండా మీ ఇంట్లో ఆ పచ్చడి ఎలా ఉంది'' "ఆపు నీ వెధవ అనుమానం. నీకు తెలియకుండా ఉండబట్టే ఇన్నేళ్లు ఉంది. ఇదిగో ఎల్లుండి మా కొడుకులు, కోడలు, కూతుళ్లు, అల్లుళ్లు.. వాళ్ల వాళ్ల పిల్లలు అందరూ వస్తున్నారు. అందరం తిన్నాక మిగిలితే పంపుతాలే వింటున్నావా... ' "మళ్లీ ఏదో అరకాసులో తిరకాసు పెడుతున్నావు. వాళ్లంతా వచ్చి రెండు నెలలే కదా అయింది. మళ్ళీ ఎలా వస్తారు?".. అనుమానం తీరక అడిగాడు సుబ్రహ్మణ్యం. "అదంతే.. నాకు చూడాలని ఉంది. పావులు కదుపుతున్నాను కదా.. వాళ్ళు వచ్చేస్తారు." ఫోన్ పెట్టేసాడు శివరామకృష్ణయ్య. ******** "వెన్నెల్లో పిండారపోసినట్లు, ఆ పిండితో చేగోడీలు చేసుకుతిన్నట్టు నీ ముఖం ఎంత కరకరలాడుతుంది.. సారీ.. కళకళలాడుతుంది. బాగుందా నా కవిత్వం.. లే.. తెల్లవారబోతుంది.” "కిర్రు కిర్రు కాలి చెప్పుల్లా కిసుక్కున నవ్వే నీ నవ్వు శబ్దం టెంక లేని తాటి పండులా పళ్ళు లేని నీ నోటి అందo'' “వహ్వా.. భలే కుదిరిందోయ్ ప్రాస.. కాత్యాయనీ నేను ఎన్ని కవితలు చదివినా నీకు మెలుకువ రాదేమిటి?''.. భార్యను లేపుతూ అన్నాడు శివరామకృష్ణయ్య. అతను యవ్వనంలో శ్రీకృష్ణదేవరాయలు అంత దిట్ట. అన్ని పత్రికలు అవి బ్రతికినన్నాళ్లు అతని కవిత్వాన్ని ప్రచురించాయి.. తన ఫోటోనే కాకుండా భార్య కాత్యాయని ఫోటోతో సహా. అతని కవిత్వ గంధం లో కాస్తంత సుగంధం ఆమెకు కూడా అంటుకుంది... అలా వాళ్ల కవిత్వాలు ఆ ఇద్దరు ఫోటోలతో సహా మారుమోగిపోయేవి అప్పట్లో.. ఇదంతా మూడు పుష్కరాలు నాటి మాట. ఇప్పుడు అతనికి తొమ్మిదిపదులు ఆమెకు పది తక్కువ. "లేచావా కూర్చో.. మన వాళ్ళందరినీ నీకు మళ్ళీ చూడాలని ఉందా?" ప్రశ్నించాడు. "మీకు మాత్రం ఉండదా.. మీ ఆశ కాకపోతే వాళ్లు మళ్లీ ఇప్పుడు ఎలా వస్తారు?'' "ముందు నువ్వు మంచం దిగు.. కొంపతీసి నడుంకాని పట్టేసిందా మళ్లీ?'' "నేను చెప్తే విన్నారూ, ఆ అటక మీద పాతచింతకాయపచ్చడి జాడి గురించి మీరు శ్రమ పడటం కాకుండా నా చేత కూడా ఎక్సర్సైజులు చేయించారాయె. ఆ ముదనష్టపు జాడి మాట ఎలా ఉన్నా నా ఒళ్ళంతా నొప్పులు పట్టేసాయి.".. అంది కాత్యాయని నెమ్మదిగా క్రిందకు దిగుతూ. "అది సరే కానీ ఎదురింటి అవతారం వచ్చాడా?.. ఖాళీ అయినప్పుడు వచ్చి అటక ఎక్కి చింతకాయ పచ్చడి జాడి కిందకు దింపుతానని మాట ఇచ్చాడు కదా." "అతనికి అటక ఎక్కిన అవతారం అనే బిరుదు కూడా ఇస్తానని నమ్మబలికారు కదా." "పచ్చడి జాడి కిందకి దింపుతాడని ఆశ పడి మాటిచ్చాను. ఆ ఆశ తీరకుండా నేను చస్తే మళ్లీ నిన్నే దెయ్యం అయిపోయి పీక్కుని తింటాను." "అమ్మో ఇన్నాళ్లు పీక్కుతిన్నది చాలదూ!!' "నీకేం తక్కువ చేశానోయ్'''' "అంతా తక్కువే.. చెప్పమంటారా.. పిల్లల్ని ఇంజనీర్లని చేశారు. కోడళ్ళు కూడా ఉద్యోగస్తులే. కూతుళ్ళని బ్యాంకు మేనేజర్లుగా చేశారు. బిజినెస్ మ్యాగ్నెట్లని అల్లుళ్ళుగా తెచ్చుకున్నారు. మనవలు కంప్యూటర్ మనుషులు అయిపోయారు. వాళ్ల పెళ్ళాళ్ళు కూడా జాబు హోల్డర్స్. అంతా బాగానే ఉంది నా బ్రతుకు మాత్రం ఇలా అయిపోయింది. చిన్నప్పుడు మా అమ్మగారు పెట్టిన వంటి రాయి పుడకని మూడురాళ్లు పుడకగా మార్చండి బాబోయ్ అంటే.. సుతారామూ వినిపించుకున్నారా?'' "దేనికైనా కాలం అంటూ ఒకటి కలిసి రావాలోయ్." "మరే నాకు తెలియదు సుమండీ…” "ఆ వెటకారం ఏంటి'' "మీ ఆశలన్నీ త్వర త్వరగా తీరిపోవాలి. లేకపోతే దయ్యమై పీక్కు తింటానంటున్నారు. నేను కోరుకునే దానికి మాత్రం కాలం అంటూ ఒకటి రావాలి అంటున్నారూ.. బాగుంది సంబడం'' భర్తతో సరదాగా పోట్లాడుతున్నట్టు అంది కాత్యాయని... శివరామ కృష్ణయ్య సంతానం, వాళ్ళ వాళ్ల సంతానం.. అందరూ జంటలయ్యారు. అంతేకాకుండా వాళ్లంతా జంట నగరవాసుల కావడం విశేషం. అందరివి క్షణం తీరికలేని 5 అంకెల జీతాల ఉద్యోగాలే. ఏసీ బ్రతుకులు.. వాళ్ళందరికీ శివరామకృష్ణయ్య దంపతులంటే అభిమానమే. ఎప్పటినుండో కాత్యాయని.. "పోనీ వాళ్లందరి దగ్గరికి వెళ్లి పోతే సరిపోతుంది కదా " అని భర్తతో అంటూ ఉండేది. ''నువ్వు వంద చెప్పు కాత్యాయని.. మీ అమ్మగారి ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న ఆ నల్లకావడి పెట్టె భూతంలా ఉంది భయమేస్తుంది దాన్ని అమ్మేస్తాను అంటే విన్నావా.. అదంటే నీకు అంత ప్రేమ మరి. అలాగే నాకు కూడా ఈ ఊరంటే అంత ప్రేమ... మన బ్రహ్మాండమైన చక్కని అంటే.. బీసీ బ్రతుకు వదిలి వాళ్ల.. ఏ. సీ. బ్రతుకులో ఇమడలేనోయ్.".. అంటూ ఆ ఆలోచన విరమింప చేసేవాడు. ఇలా ఆ చిన్ని టౌన్ లో శివరామకృష్ణయ్య దంపతులు పాత జ్ఞాపకాల భవంతిలో ముసలి జంట గువ్వల్లా కాలం గడిపేస్తున్నారు. అదే వారికి ఇష్టంగా ఉంది. ఎవరు రమ్మన్నా వెళ్లరు వెళ్లిన ఉండలేరు. "ముక్కుపుడక చేయించమన్నావుగా చేయిస్తాను. సరే ఆ టీపాయ్ మీద టాబ్లెట్లు ఉన్నాయి కాస్తంత తెచ్చి ఇస్తావా?'' "మీ ముక్కుపుడక కు ఒక దండం. నేను బలంగా ఉన్నాననుకుంటున్నారా? నా టాబ్లెట్లు బాక్స్ ముందు మీరు తెచ్చి ఇస్తే రెండు బిళ్ళలు మింగి మీ టాబ్లెట్లు తెచ్చి ఇవ్వగలను?'' "మా అమ్మ పెళ్లిరోజు నాడే అన్నది. ఒరేయ్ బడుద్దాయి.. ఈ పిల్ల వాలకం చూస్తుంటే నీ వార్ధక్యంలో నిన్ను సుఖ పెట్టేలా లేదురా అని. అన్నంత పని అయ్యింది. పోనీ ఆ మూలనున్న చేతి కర్ర తెచ్చి ఇస్తావు సహాయానికి." "సింహద్వారం పక్కన నా చేతికర్ర ఉంది. అది కాస్త మీరు తెచ్చిస్తే.. ఆ మూడు కాళ్లతో వెళ్లి మీ మూడో కాలు తెచ్చి ఇవ్వగలను. సరే సరే ఎలాగోలా లేచి టీ కాచి ఇస్తాను. కాస్తంత గుటకేసి మీ పనులు మీరు చూసుకోండి బాబు.".. అంది చిరు చిరాగ్గా కాత్యాయని. "నీకేo తెలుసు జీవితం అంటే దానికి కాచి వడబోసిన వాడిని." "రోజు టీ కాఫీలు కాచి వడబోస్తూనే ఉన్నాను మీ కన్నా నేను ఏం తక్కువ కాదు." "నీ సతాయింపు ఆపి కావలసిన కార్యక్రమం గురించి ఆలోచించరాదూ." "మీరనేది అటక మీద పాతచింతకాయ పచ్చడిజాడి విషయమే కదా. అసలు ఆ జాడీకి మన వాళ్ళందరూ ఇక్కడకు రావడానికి దగ్గర సంబంధం ఏమిటి అంట" చిత్రంగా ముఖం పెట్టి ప్రశ్నించింది. "కథ.. క్లైమాక్స్ లో అర్థమవుతుందిలే. మరీ అంత తెలివి తక్కువ వాడిని అనుకోకు." **** అటక మీద ఉన్న పాత చింతకాయ పచ్చడి జాడి క్రిందకు దింపడం కోసం వారం రోజులుగా ప్రయత్నిస్తున్నారు ఆ వృద్ధ దంపతులు. పాత చింతకాయ పచ్చడి పెడితే తాను కూడా రుచి చూడొచ్చు అన్న ఆశతో పాలుపోసే పోతురాజు నిచ్చెన ఎక్కబోయి నిచ్చెన కాలే కాదు, తన కాలు కూడా ఇరగొట్టుకున్నాడు. బట్టలు ఉతికే అప్పిగాడు అతి కష్టం మీద అటక ఎక్కేసి.. తేలు కుట్టింది బాబోయ్.. అని క్రిందపడ్డాడు. అతని నడుమూ విరిగింది. ఆ నడుము కింద పడ్డ ఆ తేలు నడుమూ విరిగింది. ఫోన్ రింగ్ అయ్యింది. శివరామకృష్ణయ్య రిసీవర్ అందుకున్నాడు. "హలో శివరామకృష్ణయ్య.. నేను రా.. సుబ్రహ్మణ్యాన్ని. నేను ఎంత ఆలోచించినా అటక మీద ఆ చింతకాయ పచ్చడి జాడీకీ మీ పటాలమంతా జంటనగరాల నుండి దిగిరావడానికి లింకు కనిపించడం లేదు. ఏమిటి కథ.. ఎందుకు ఈ సస్పెన్స్. "అడిగాడు సుబ్రహ్మణ్యం. "ఎవరు మాట్లాడేది. సారీ.. ఇది శివరామకృష్ణయ్యగారి ఇల్లు కాదు రాంగ్ నెంబర్. " రిసీవర్ కింద పెట్టేశాడు శివరామకృష్ణయ్య. "పాయింట్ లీకు చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. నేను లీక్ అవనిస్తానా?'' "ఇంతకీ ఎవరిది ఆ ఫోను." "ఎవడో ఏబ్రాసి సుబ్రహ్మణ్యం అంట." "అయ్యో.. అయ్యో.. వరుసకు మా అన్నయ్య కదా అతను... మన సుబ్రహ్మణ్యమే'' "ఎవడో ఒకడు.. అనవసరమైన కూపీ లాగాలని ప్రయత్నిస్తే రాంగ్ నెంబరే." "సర్లేండి నాకెందుకు. ఇంతకీ ఆ జాడీలో చింతకాయ పచ్చడి ఎన్ని సంవత్సరాల క్రితానిదట. ఎప్పుడు దాచారు. నాకు అసలు గుర్తులేదు''. ''నీకు పెళ్లి అవ్వని క్రితం మా తాతల కాలం నాటిది. నీకు ఇష్టం లేకపోతే తినడం మానేయి''. "నాకు ఖాళీ జాడి ఇచ్చేసారనుకోండి.. అందులో ఉప్పు వేసుకుందామని." "అది సరే కానీ కాత్యాయని.. మనిద్దరం మోడ్రన్ డ్రెస్సులో ఫోటో దిగడం గురించి ఏం ఆలోచించావు." "ముందు పాతచింతకాయపచ్చడి జాడి అన్నారు.. ఇప్పుడేమో మోడ్రన్ డ్రెస్సు అంటున్నారు. చిన్నపిల్ల వాడిలా ఏమిటి ఆ కోరికలు. ఫోటోకు నేను రెడీ అనుకోండి.. మీరైతే పౌడర్ పూసుకుంటారు, కట్టుడు పళ్ళు తగిలించుకుంటారు, జోళ్ళు తుడుచుకుంటారు, తెల్ల వెంట్రుకలకు నల్ల రంగు రుద్దుతారు.. నాదేం పోతుంది గనుక. ఫోటో లో నేను ముసలిదానిగా కనపడి మీరు పడుచు కుర్రాడిలా కనపడితే చూసిన వాళ్లు నవ్విపోరూ." "దాందేముంది.. నిన్ను పనిమనిషి తల్లివి.. అని చెప్తాలే. '... శివరామకృష్ణయ్య అలా అనడంతో కాత్యాయని మూతి ముడుచుకుంది. శివరామకృష్ణయ్య అదే అటక మీద పాత ట్రంకు పెట్టిలో దాచిన పాత మోడల్ బట్టలతో సరదా ఫోటో తీయించుకోవాలని అతని ఉద్దేశం. ఎవరైనా పచ్చడి జాడి కోసం అటక ఎక్కితే దానితోపాటు ఈ ట్రంకు పెట్టిన కూడా క్రిందకు దింపించుకోవచ్చు అన్నది అతని అభిప్రాయం. అది దృష్టిలో పెట్టుకునే తన ఫ్రెండ్ అబ్బిరాజు స్టూడియో లో పురమాయించాడు.. చాకులా బాగా పొడుగ్గా ఉండి.. ఫోటోలు బాగా తీసే వాడిని పంపమని. ఆ అబ్బాయి వచ్చే టైం అయింది. అతను వచ్చాక ఎలాగోలాగా ఒప్పించి ముందు అటక ఎక్కించి ఈశాన్యం మూలన దాచిన పొడుగు ఫ్యాంటు, కురుస కాలరు షర్టు తనేసుకుని.. తనకు పెళ్లి అయిన కొత్తలో కాత్యాయని వేసుకుని వదిలేసిన లంగాఓణి బుట్ట చేతుల జాకెట్టు ఆమెచే ధరింపజేసి సరదాగా ఫోటో తీయించుకుని రోజు దాన్ని చూసుకుంటూ పాత జ్ఞాపకాల ఆనందాన్ని అనుభవిం చాలని... అదో చిలిపి కోరిక శివరామకృష్ణయ్యది. ఆ తీసిన ఫోటో సీక్రెట్ గా ఉంచుతాను అని భర్త మాట ఇవ్వడంతో తను కూడా రెడీ అంది కాత్యాయని ఫోటోకి. శివరామకృష్ణయ్య స్నానం చేసి వచ్చేసరికి అబ్బిరాజు పంపిన ఫోటోఅబ్బాయి వీధిలో రెడీగా ఉన్నాడు. "నిన్నేనా మా అబ్బిరాజు గాడు పంపింది.. నీ పేరేంటి?'' "సత్తిపండు." "ఏడ్చినట్టు ఉంది. మామిడిపండు.. వెలగపండు.. అరటిపండు.. మరి ఈ సత్తిపండు ఏ చెట్టుకి పండు తుంది అబ్బాయ్. కొందరు పెద్దవాళ్ళకి బుద్ధులు ఉండవు అనడానికి ఇదే సాక్ష్యం. ఆలోచించి పెట్టాలి పేరు. ఆనందం అనో.. సంతోషం అనో పెట్టొచ్చు కదా. సరే మా అబ్బిరాజు గాడు.. ఆ వెధవ.. అదేనయ్యా ఏమవుతాడేంటి నీకు?.." "మీ వెధవాoడి.. నాకు గురువవుతాడండి." "అయ్యో అయ్యో నువ్వు కూడా వెధవా అని అంటావేంటి గౌరవం లేకుండా." "అలాగంటేనే మీకు అర్థమవుతుందేమోనని....." "సరే ఆ అప్రాచ్యుడు ఏం చెప్పాడేంటి నీకు??'' "మీరు చెప్పినట్టే నన్ను చేయమన్నారండి' "అదిగది.. నేను చెప్పానులే వాడికి. నువ్వు వెళ్లేట ప్పుడు నీ చేతికి పాతచింతకాయ పచ్చడి ఇచ్చి పంపుతాననిి. ఆ వెధవ చింతకాయ పచ్చడి పెడతాను.. అంటే పెళ్ళాన్ని కూడా అమ్మేస్తాడు. అంత ఇష్టం వాడికి... ముందు ఆ ఎత్తుపీట మీద ఈ ముక్కాలు పీట వేసుకుని అటక ఎక్కుతావ'' అంతే.. ఆ అబ్బాయి ఎత్తుపీట మీద చిన్నపీట వేసుకుని జంపు చేసి అటక ఎక్కేశాడు. బ్యాటరీలైట్ సహాయంతో జాడీ వెతికాడు అదెక్కడ కనిపించలేదు. "సత్తిపండు.. మా ఎదురింటి అవతారానికి అదృష్టం లేదు. అతనికిద్దామనుకున్నాను అటకెక్కిన అవతారం అనే బిరుదు.. ఇప్పుడు నీకు ఇస్తున్నాను అటక ఎక్కిన సత్తిపండు బిరుదు.. ఇదిగో అందుకో. పచ్చడి సువాసన మధురంగా ఉందా.. తొందరపడి నోట్లో వేసుకోకేే. క్రిందకు దించాక నీకు కొంచెం పెడతానని మాట ఇచ్చేగా'' అంటూ శివరామకృష్ణయ్య క్రింద నుండి డైరెక్షన్ ఇస్తున్న.. జాడి జాడ తెలుసుకోలేకపోయాడు సత్తిపండు. "సరే.. పచ్చడి అంతా ఎలుకలు తినేసి ఉంటాయేమో''. శివరామకృష్ణయ్య తనే సర్ది చెప్పాడు. "అవును కానీ జాడీ కనపడడం లేదంటున్నాడు. జాడీని కూడా ఎలుకలు తినేసి ఉంటాయంటారా?'' లోపల నుండి వస్తూ అంది కాత్యాయని. హైటెక్ యుగం. ఎలుకలు తినేసిన తినేసి ఉండొచ్చు. సత్తిపండు.. జాడి తీరిగ్గా వెతికించి మీకు అందరికీ పచ్చడి పంపుతాను కానీ.. ఎలాగూ ఎక్కావు కనుక ఓ చిన్న పని చేసి పెడుతూ. అదిగో ఆ తూర్పు వైపు ఈశాన్యం మూలన.. కొంచెం దూరంగా చూడు ఆ చీకట్లో దెయ్యంలా నల్ల ట్రంకు పెట్టె కనిపించడం లేదూ... దాన్ని పట్టుకుని వచ్చేయ్''' అంతే అతి కష్టం మీద సత్తిపండు ఆ పెట్టుతో సహా అటక దిగాడు. "పాత చింతకాయపచ్చడి అటక అటక అంటూ ఎక్కించారు.. చివరికి పాత ట్రంకు పెట్టుతో దింపించారు.. " చిరాకుపడ్డాడు సత్తిపండు. "ఇదిగో అబ్బాయి మాలాంటి పెద్ద వాళ్ళందరినీ నీలాంటి కుర్రకుంకలు ఇలాగే అపార్థం చేసుకుంటారు ముందు.. అర్థం అయ్యాక సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తారు. గోచి పెట్టుకోవడం తెలియని కూర్మాపురం కుర్రోడు లాంటోడివి నీకు ఇది అర్థం కాదులే." చివరికి శివరామకృష్ణయ్య దంపతులు ఆ పాత బట్టలు వేసుకొని రెడీ అయ్యారు. సత్తిపండుకి చాలా కోపం వచ్చింది వాళ్ళ డ్రస్ చూసి. తన గురువు అలాంటి ఫోటో తీస్తే కోప్పడతాడేమోనని అనుమానించాడు. శివరామకృష్ణయ్యకు అతని పరిస్థితి అర్థమైంది. "చూడు సత్తిపండు ఈ ఫోటో చాలా సీక్రెట్.. నీకు నాకు మా ఆవిడకు తప్పించి ఏడో కంటికి తెలియ కూడదు. ఇంకో మాట జాగ్రత్తగా విను.. మీ పక్క వీధిలో ఉన్న శ్రీ కౌముదిపేపర్ ఎడిటర్. అతను నాకు మీ గురువుకి ప్రాణ స్నేహితుడు. రాష్ట్రమంతా పెద్ద సర్కులేషన్ పత్రిక అది. ఆ పత్రిక ఎడిటర్ కి మాత్రం నువ్వు ఈ ఫోటోని చచ్చినా కనపడనివ్వకు.".. చెప్తున్నాడు శివరామకృష్ణయ్య. "మళ్లీ ఇంకో మలుపు తిప్పారు.. బుర్ర పగిలిపోతుంది సారూ " అన్నాడు సత్తిపండు. "వస్తున్నా వస్తున్నా పాయింటు కరెక్ట్ గానే ఉంది.. నేను ఊసుపోని కాకమ్మ కథ చెప్పడం లేదు. నీకే అర్థమయ్యే ఏడుస్తుందిలే చివర్లో. సరే.. అసలు విషయం ఏమిటoటే ఆ ఎడిటర్ ఇలాంటి గమ్మత్తైన ఫోటోలు అన్నీ సేకరించి తన పేపర్లో తీపి గుర్తు శీర్షికలో వేస్తుంటాడు. ఇలాంటి ఫోటోలు ఇచ్చిన వాళ్లకే వెయ్యి రూపాయలు.. వినబడుతుందా.. అక్షరాల వెయ్యి రూపాయలు బహుమతి ఇస్తుంటాడు. ఆ ఫోటో అతని పేపర్లో పడితే సర్కులేషన్ పెరిగిపో తుందన్నమాట. వింటున్నావా గొప్ప బిజినెస్ టెక్నిక్. నీకు తెలియదులే.. నిడదవోలు గేదెలపాలు పితికే కుర్రాడు వయసు నీది." సత్తిపండు వైపు వారగా చూస్తూ అన్నాడు శివరామకృష్ణయ్య. "అమ్మో ఫోటో ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తాడా!".. ఆశ్చర్యపడ్డాడు తనలోనే సత్తిపండు. "ఇదిగో ఆ వెయ్యి రూపాయలు కొట్టేయాలను కుంటున్నావా.. నీ ముఖం వాలకం చూస్తుంటే అలాగే చేస్తావనిపిస్తుంది... ఏది అలాంటి ఉద్దేశం నీకు లేదని నా కళ్ళలోకి చూసి చెప్ప.." "అబ్బే.. నేనెందుకు చేస్తానండి.. చచ్చిన అలాంటి పని చేయను. " మొఖం అడ్డంగా తిప్పుతూ అన్నాడు సత్తిపండు. "చచ్చాక నువ్వేంచేస్తావు.. ఏదైనా చేస్తే బ్రతికుండగానే చేయాలి. సత్తిపండు.. పోనీ నువ్వు ఫోటో ఆ ఎడిటర్ గారికి ఇచ్చిన పర్వాలేదు.. ఈ ఫోటో చిరాకుదంపతులది అని మాత్రం చెప్పకు." "చిరాకుదంపతులు అంటే.. " అమాయకంగా అడిగాడు సత్తిపండు. "అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్.. నా పేరు షార్టు కట్టులో.... శి.. రా.. కృ.. నా కవిత ఖండికలలో ఈ షార్ట్ కట్టు పేరుని శ్రీ కౌముది పేపర్ అతను తరచూ వేసేవాడు. రాను రాను నీలాంటి నోరు తిరగని కాకి ముక్కు రకం వెధవల వల్ల ఆ అందమైన పేరు కాస్త.. ' చిరాకు.. చిరాకు దంపతులు'.. గా రూపం మారిపోయి పెద్ద ప్రాచుర్యం పొందింది. ఇదంతా ఆ ఎడిటర్ కి గుర్తు చేసి మా ఫోటో అతనికిచ్చేసి అతనిచ్చే వెయ్యి రూపాయలు కొట్టే ద్దామని కచ్చితంగా నీ మనసులో తీర్మానం చేసు కున్నట్టు కనిపిస్తున్నావు. బాబ్బాబు అలా చేయకే" శివరామకృష్ణయ్య బ్రతిమలాడాడు. "అంత గొప్పవారా.. మీ పరువు నేనెందుకు తీస్తాను సార్. ఈ ఫోటో మీ తీపి వగరు కారం చేదు పులుపు.. వగైరా గుర్తు అని నాకు తెలుసు కదా." "హమ్మయ్య... సత్తిపండు.. అసలు ఆ ఎడిటర్ నీకు తెలుసా''.. "తెలుసండీ.. సత్యనారాయణగారు.. వాడ్రేవు వారి వీధి. మా వీధి చివర.. ప్రతిరోజు తెల్లవారకుండా కబుర్లాడుకుంటూ చెరో చెంబుడు నీళ్లతో ఊరవతల ద్రాక్షారామం మైలురాయి దగ్గరకి కలిసే వెళ్తాం మేమిద్దరం."... చెప్పాడు సత్తిపండు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
06-04-2026, 04:41 PM
"అతను ఫోటో ఎవరికి ఇవ్వనంటున్నాడు కదా. పాపం టైం వేస్ట్.. ఎందుకు అబ్బాయిని అలా సతాయిస్తారు. ఇదిగో నేను లంగావోణి బుట్టచేతులు జాకెట్టు వేసుకున్నాను. మీరు పొడుగు గొట్టం ప్యాంటు షర్టు వేసుకున్నరాయే. పాత జ్ఞాపకాలు ముసిరేస్తు న్నాయి.. మీరిలా వచ్చి నిలబడండి. ఫోటో అబ్బాయి త్వరగా స్విచ్ నొక్కు నాయనా.".. కంగారు పెట్టింది కాత్యాయని. దాంతో సత్తిపండు చాలా కష్టపడి చిరాకు చెత్త ఫోజులుతో ఒక ఫోటో తీసి వెళ్లబోయి వెనక్కి వచ్చాడు.
"చిరాకుగారూ... మరచిపోయాను ఆ ఎడిటర్ గారికి మీ ఫోటో ఇస్తే డబ్బులు వెయ్యి కన్నా ఎక్కువ ఇవ్వడా..” అంటూ ఆత్రుతగా అడిగాడు. "ఫోటో అతనికి నచ్చింది అనుకో.. డిమాండ్ చేస్తే రెండు వేలు ఇవ్వవచ్చు. అతనికి లాభం ఏమిటి అంటే సర్కులేషన్ పెరగడమే కాదు ఫోటో అవార్డులకు పంపి బోలెడు డబ్బు సంపాదిస్తాడు. ఇంతకీ నువ్వు ఇదే ప్లాన్ లో ఉన్నావా?''.. అనుమానం గా అడిగాడు శివరామకృష్ణయ్య. "అబ్బబ్బ.. మీరు నిశ్చింతగా ఉండండి చిరాకుగారు.. నేను పెద్దాపురం పర్ఫెక్ట్ పడుచు కుర్రాడు లాంటి వాడిని. ఇప్పుడు మీరు నాకు చెప్పినదంతా మరిచిపోండి మీరు నాకేం చెప్పలేదు. ఆ ఎడిటర్.. ఆ రెండు వేలు అంతా మాయ. జగమే మాయ.. ఒక కల" అనుకుంటూ వెళ్లిపోయాడు సత్తి పండు. ********** ఆ మర్నాడు.. ఫోన్ మోగింది రిసీవర్ అందుకున్నాడు శివరామకృష్ణయ్య. "రిసీవర్ పట్టుకున్నది చిరాకుగాడేనా..’ ఫోన్ చేసిన వ్యక్తి ప్రశ్నించాడు. "అవునురా శివరామకృష్ణయ్యనే. మాట్లాడేది సుబ్రహ్మణ్యం అని గుర్తుపట్టాను కూడా... ఏంటి విషయం ఇంత పొద్దుటే ఫోన్ చేశావు?''' "ఏరా నీకు మతి పోతుందా.. నువ్వు వెధవ వేషాలు వేసేది కాకుండా మా చెల్లెమ్మ చేత కూడా పిచ్చివేషాలు వేయిస్తున్నావన్నమాట. ఇప్పుడే పేపర్ చూశాను. చి చి ఆ పిచ్చి ఫోటోలు ఏమిటి.. ఉండు వస్తున్నాను వచ్చి డైరెక్ట్ గా తిడతాను. " అంటూ సుబ్రహ్మణ్యం రిసీవర్ పెట్టేసాడు. సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని నిమిషం నిమిషం కష్టంగా గడుపుతున్నారు.. ఆ వృద్ధ దంప తులు ఇద్దరూ. సాయంత్రం ఏమవుతుందో వాళ్లకు తెలుసు.. ఆ సమయం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సాయంత్రం అయ్యింది.. నాలుగు మారుతి కార్లు స్పీడుగా వచ్చి శివరామకృష్ణయ్య ఇంటి ముందు ఆగాయి. ఆ కార్లలోంచి తమ తమ సంతానo ఆసంతానo యొక్క సంతానం అందరూ శ్రీ కౌముది న్యూస్ పేపర్లు చేతితో పట్టుకొని కోపంగా దిగడం శివరామకృష్ణయ్య గమనించి సీన్ అర్థం అయిపోయి వీధిలో మెట్ల మీదే కూర్చుని చూస్తున్నాడు.. ఆనం దంగా. కాత్యాయని గుమ్మం పట్టుకొని నవ్వుతూ నిలబడుతూ ఉంది. అందరూ కలిసి ఇంటి లోపలికి వచ్చారు. "ఇలాంటి తలతిక్క ఫోటోలు న్యూస్ పేపర్ లో పడటం వల్ల తమ పరువు పోతుందని ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయవద్ద”ని చీవాట్లు వార్నింగులు లాంటివి గంటసేపు కడుపునిండా పెట్టారు ఆ దంపతులు ఇద్దరికీ వచ్చిన వాళ్ళు అందరూ. వాటితోపాటు వాళ్లు తెచ్చిన స్వీట్లు హాట్లు పళ్ళు పూర్తిగా లాగిన్ చేశారు ఆ దంపతులు.. అంతేకాకుండా వాళ్ళందరినీ పూర్తిగా తనివి తీరా చూసుకుంటూ పెద్దల్ని దీవిస్తూ పిల్లల్ని ముద్దాడుకుంటూ గడిపేశారు.. మహాఆనందంగా. ఆ రాత్రంతా వచ్చిన వాళ్ళందరితో చాలాసేపు తనివి తీరా మాట్లాడుకున్నారు ఆ దంపతులు. తెల్లవారుతుండగా వాళ్ళిద్దరి దగ్గర సెలవు తీసుకుని వచ్చిన మారుతీ కారులన్నీ కదలి వెళ్ళిపోయాయి జంట నగరాల వైపు. ''మనం తిరగలేమని తిరిగినా వీళ్లంతా ఒకచోట కనిపించరని, వీళ్ళందర్నీ ఇక్కడకు రప్పించడం కోస ప్లాను వేసి మీ కోరిక తీర్చుకున్నారు తనివి తీరా చూసుకొని తాదాత్మ్యం పొందారు. రెండు నెలల క్రితం వీళ్లందరినీ చూడాలని ఆశపడి నాకు అప్పుడు ఒంట్లో బాగుండలేదని నాటకం ఆడింప చేసి వీళ్ళందర్నీ ఇలాగే రప్పించారు.. ఇక ఇప్పుడు ఈ ఫోటో ప్లాన్ కూడా బాగానే వేశారు. " వాళ్లంతా వెళ్ళిపోయాక భర్తను పొగిడింది కాత్యాయని. "నువ్వు మాత్రం ఆ చిన్న పిల్లలతో ఆడుతూ ఆ పెద్దవాళ్లతో తిరుగుతూ ఎంత ఆనందించావో నేను గమనించాను. గుండె నిండా ఎంతో సంబరాన్ని నింపుకొని చిన్నపిల్లవై పోయావు. ఇలాంటి ఆనం దకరమైన సందర్భాలు చాలు మనం ఇంకో ఆరు నెలలు ఆనందంగా గడిపేయడానికి. కాటికి కాలు చాపిన మనకు వీళ్ళందరి రాకతో మళ్ళీ యవ్వనం వచ్చేసినట్టు ఉంది కదూ. " అన్నాడు మహదా నందభరితంగా శివరామకృష్ణయ్య. "ఇంతకీ అటక మీద ఆ పాతచింతకాయపచ్చడి విషయం ఏమిటండీ. " అనుమానం తీరక అడిగింది కాత్యాయని. "అదా.. పాత బట్టలు అటక మీద ఉన్నాయి.. అటక ఎక్కి ఆ ట్రంకు పెట్టి క్రిందకు దింపండి.. అని ఎవరితో చెప్పినా మన మాట వినరు. అందుకనే ఇలా పచ్చడి వంక పెట్టాను. పాత చింతకాయ పచ్చడి ఆశ పెడితేనే కదా మా అబ్బిరాజు గాడు ఫోటో సత్తిపండు ని పంపించింది. వాడొస్తేనే కదా అటక మీద ట్రంకు పెట్టి కాస్త క్రిందకు దిగింది. అందులోని పాత బట్టలు వేసుకుంటేనే కదా మన వాళ్లకు తిక్కరేగే ఫోటో తీసుకోగలిగింది. ఆ ఫోటో వస్తేనే కదా న్యూస్ పేపర్లో తీపి గుర్తు శీర్షికలో పడింది. అలా పడితేనే కదా.. అది చూచి కోపమొచ్చి మన వాళ్ళందరూ చీమలదండులా వచ్చింది. వాళ్లు సరదా పడే మంచి ఫోటో అయితే ఇలా వస్తారా? చాలా కోపం వస్తేనే కదా మనల్ని తిట్టడా నికైనా వాళ్లంతా వచ్చి తీర్తారు. ఎంతసేపు ఉన్న పర్వాలేదు.. ఎలాగోలా వాళ్ళంతా రావడమే నాకు కావలసింది. వాళ్లందరినీ కళ్ళ నిండా మరోమారు చూసుకోవాలన్న నా ఆశ తీరింది. " యుద్ధంలో విజయం సాధించిన వీరుడులా మాట్లాడాడు శివరామ కృష్ణయ్య. "అందరూ ఒకే చోట ఉంటే ఎంత ఆనందం.. కానీ ఎలా కుదురుతుంది. ఈ కంప్యూటర్ యుగంలో బంధాలు, అనుబంధాలు కాలగమనoలో అటకెక్కకుండా కుదు రుతుందా?''... భర్త వైపు నవ్వుతూ చూస్తూ అంది కాత్యాయని. "అందుకనే మన అటక ఎక్కిన ఆనందాన్ని ఓ రెండు నెలల్లో మరోమారు క్రిందకు దింపే ప్లాన్ సిద్ధం చేస్తున్నాను.".. అన్నాడు శివరామకృష్ణయ్య భార్య వైపు చిలిపిగా చూస్తూ. ''ఈసారి డైరెక్షన్ నాది.".. అంది కాత్యాయని. వృద్ధ దంపతులు ఇద్దరు నవ్వుకున్నారు మనసారా.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
13-04-2026, 09:32 AM
ఈ మనిషి రిపేరు చేయబడ్డాడు!
![]() రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు ఆనందరావు తన కొడుకును చదువు నిమిత్తం చెన్నై హాస్టల్ లో ఉంచడానికి వచ్చి, తగిన ఏర్పాట్లు చేసి... తను తిరిగి తన ఊరు కాకినాడ వెళ్ళిపోతూ.. కొడుకుకు చాలా విష యాలు చెప్పడం ఆరంభించాడు... ఆ ప్లాట్ ఫారం మీద. ఇది రమారమి మూడు సంవత్సరాల క్రితం సంఘటన...... *** జనవరి, 2020... "కోవిడ్".. ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమయమది. "ఒరేయ్.. రవీ.. నిన్ను ఈ చెన్నై లో ఉంచటం నాకసలు ఇష్టం లేదురా. ఏదో.. నీ ఫ్రెండ్స్ ఇక్కడే చదువుతున్నా రన్నావని 'సరే'... అన్నాను. నాకసలు ఏమాత్రం ఇష్టంలేని వ్యక్తి… అదేరా.. మీ బాబాయ్ వెధవ.. ఇక్కడే ఉంటున్న విషయం నీకూ తెలుసుగా... ఇక్కడకుదగ్గరే... అదే........ అది... అది... " చెట్టియార్ స్ట్రీట్ ".. ఏదో అను కుంటాను... అక్కడ ఏడుస్తున్నాడట. వాడు నాకు పరమశత్రువు. ఇరవైఏళ్ల క్రితం మాట.... నీకు అప్పుడు ఐదేళ్లు ఉండొచ్చు. విషయాలు నీకు గుర్తుండి వుండవులే. ఆస్తి పంపకాల్లో అప్పట్లో మాకు- మాకు, చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు వచ్చి విడిపోయాం. ఆ వెధవ సెక్యూరిటీ అధికారి స్టేషన్, కోర్టు ల వరకు నన్ను తిప్పాడు. తిట్టాలని కాదుగాని... వాడు దుర్మార్గుడు.. నీచుడు.. పాపాత్ముడు. సమయం వచ్చినప్పుడు వాడు.. రాక్షసుడిలా ఎలా ప్రవర్తించాడో నీకు చెప్తాను.. వాడి మీద కసి, పగ... నేను కాకపోయినా... నువ్వైనా.... తీర్చుకొని.. మగాడినని పించుకోవాలిరా. నీ మీద ఆ నమ్మకం నాకుంది.. నా దృష్టిలో వాడు ఆ రోజే చచ్చిపోయినట్టురా. వాడి అవసరం మనకు లేదు.. రాదు.. ఉండదు. మన అవసరం కూడా వాడికి లేదులే. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఈ రైల్వే ప్లాట్ ఫామ్ మీద నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు ఈ చెన్నై లో ఉండి చదువుకున్నన్నాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు.. ఆ... స్ట్రీట్.. ఏది ఆ చెట్టియార్ స్ట్రీట్ కు వెళ్ళడానికి వీలులేదు. వాడికో కొడుకున్నాడు.. వాడు కూడా మా తమ్ముడు వెధవ లాగే పెద్ద వెధవన్నర వెధవ అయ్యుంటాడు. ఆ వెధవలు ఇద్దరి దృష్టి లోనూ నువ్వు పడటం నాకసలు సుతారాము ఇష్టంలేదు. రక్త సంబంధీకుల మైనప్పటికీ మన సంప్రదాయం వేరే.... వాళ్ల సాంప్రదాయం వేరే. ఒకవేళ తేడా వచ్చింది అనుకో.... నీ చదువు మానిపించేస్తాను. బాగా అర్థమైందా. అదిగో ట్రైను వస్తున్నట్టుంది, నే వెళ్తాను. జాగ్రత్తగా అందరితో పాటు హాస్టల్లోనే ఉండు" అంటూ కొడుకు రవికి ఇంకా మిగిలిన విషయాలు కూడా చెప్పి.. వచ్చి ఆగిన తను ఎక్కవలసిన ట్రైన్ గబగబా ఎక్కి తన రిజర్వేషన్ లో కూర్చొని కొడుకుని హాస్టల్ కు వెళ్లి పొమ్మని చెప్పి పంపించేశాడు ఆనంద రావు. *** ట్రైన్ చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది... కాకినాడ వైపు ఆనందరావు బుర్రలో అంతకన్నా స్పీడుగా గతం తిరిగేస్తుంది. అతని కొడుకు రవికి అప్పుడు ఐదేళ్లు. అంటే.. 20 సంవత్సరాల క్రితం విషయం గుర్తు చేసుకుని పళ్ళు కొరుకుతున్నాడు కసితో ఆనందరావు. తన కొడుకు రవిని తప్పని పరిస్థితులలో తన శత్రువైన తమ్ముడు ఉండే చెన్నై లోనే చదివించ రావలసి కావడంతో ఈ సమస్య ఏర్పడింది అతనికి. రెండు దశాబ్దాల క్రితం..... తన తమ్ముడు... మూర్ఖుడు.. పద్మాకర్ తో గొడవలు.. తగువులు....... కొట్లాటలు...... పెద్ద మనుషులు... సెక్యూరిటీ ఆఫీసర్లు... లాయర్లు.... అలా అలా బుర్రలో గిర్రున జోరీగల తిరిగేస్తున్నాయి... అంతేనా.. విజృంభిస్తున్నాయి... బోగి లో కూర్చొని కళ్ళు మూసుకున్న ఆనందరావుకి. ఈ 20 ఏళ్లలో పద్మాకర్ చాలా చోట్ల,.. ఫంక్షన్లలో కూడా కన పడ్డాడు ఆనందరావుకు. మాట్లాడ ప్రయత్నించ మనస్కరించలేదు.... ఆనందరావుకి. పద్మాకర్ కాస్త తెగువ చూపించినా... ఆనందరావు చీదరించుకునే వాడు. మరి తన మనసుకు మానకుండా తగిలిన "గాయం "...... అలాంటిది..!!! పెద్దమనుషులకు లంచాలు ఎరచూపి ఆస్తిలో ఎక్కువ భాగం వచ్చేలా కూడా సెట్ చేయించుకుని తనను బెదిరించి, భయపెట్టి ఎలాగోలా ఆస్తి పంపకాలు చేయించేశాడు... పద్మాకర్. నరకయాతన అనుభవించలేక చిరాకు వచ్చి, చివరికి తమ్ముడికి కొంత భాగం ఆస్తి ఎక్కువైతే అయ్యిందని ఆనందరావు సర్దుబాటు చేసు కున్నాడు.... అతి కష్టం మీద. అప్పట్లో.. ఆ గొడవలలో... తనపై పద్మాకర్ గునపంతో హత్యాప్రయత్నం చేయటం... ఇంకా మర్చిపోలేక పోతున్నాడు ఆనందరావు. అదంతా తమ్ముడు దుర్మార్గత్వం, దుష్టత్వం. అందుకని వాడిని ఒక వెధవ గా జమ చేసి తన కుటుంబం లోంచే వెలివేసినట్టు..... నిర్ణయం చేసుకున్నాడు అప్పుడే.. ఆనందరావు! అప్పట్లోనే తమ్ముడు పద్మాకర్.. అతని ఆస్తి మొత్తం అమ్మేసుకుని... భార్య బిడ్డలతో చెన్నై పోయి బిజినెస్ లో బాగా సంపాదించినట్లు తన బంధువులు చెప్తుంటే వినేవాడు ఆనందరావు. అలా కొంత కాలం గడిచి పోయాక ఈమధ్యనాలుగేళ్ల క్రితం... తమ్ముడు పద్మాకర్ కొడుకు రాజారామ్ తను బాల్యంలో గడిపిన కాకినాడ వీధులు చూడా లని , అతను పెరిగిన ఆనాటి తన తాతగారి ఆ పాత ఇల్లు చూడాలని.. తన పెదనాన్న కు తన రాక ఇష్టం ఉండకపోవచ్చు కనుక కనీసం దూరంనుండి అయినా చూడాలనే... ఉద్దేశ్యంతో పండగ సెలవులకు సరదాగా కాకినాడ వచ్చాడు. ఆనందరావు తన వీధి అరుగుమీద అప్పటికే కూర్చుని ఉన్నాడు. దూరంనుండి.. అతనే తన పెదనాన్న అని ఎవరి ద్వారానో తెలుసుకున్న రాజారాం.. తనను చూసి ప్రేమగా నవ్వడం గమనించాడు.. ఆనందరావు. కానీ.. ఆ కుర్రోడు పద్మాకర్ కొడుకని గ్రహించలేకపోయాడు. అదే వీధిలోంచి తనను దాటుకుంటూ వెళ్తున్న తన బంధువు..... " ఇదిగో ఆనందరావూ... దూరంగా జీన్స్ ప్యాంట్ వేసుకొని ఒక కుర్రోడు కనిపిస్తున్నాడు చూడు.. అదే ఆ కిళ్ళీ కొట్టు పక్కన.... వాడు మీ తమ్ముడి కొడుకట! పండగ సెలవులు కదా.. ఇక్కడ మనందరినీ చూద్దామని వచ్చాడట... నీతో మాట్లాడటానికి భయపడు తున్నాడు. పిలువమంటావా ఏంటి?... "... అని అడిగాడు. ఉలిక్కిపడి పైకి లేచాడు ఆనందరావు. " ఇదిగో.. వాడు అడిగితే మా ఇంటికి పంపించకు. వాళ్లంతా ఎప్పుడో చచ్చిపోయారుకదా.. నీకు తెలుసు కదా.. మేమంతాకూడా చచ్చిపోయాము... అని చెప్పు... వచ్చిన దారినే వెళ్ళమని చెప్పు.. మళ్లీ ఎప్పుడైనా కాకినాడ రావద్దని చెప్పు... వచ్చిన.. ఈ రామారావుపేట రావద్దని చెప్పు.. " అంటూ... పెద్ద అడుగులతో ఇంటి లోపలకు వెళ్ళిపోయి చెక్కలు విరిగిపోయేలా తలుపు వేసుకున్నాడు ఆనందరావు.. ట్రైన్ జర్క్ ఇచ్చిన కుదుపు తో 20 సంవ త్సరాల క్రిందటి గత జ్ఞాపకాలన్నీ చెల్లాచెదురై పోయి... పరాయి లోకం నుండి ఈ లోకానికి వచ్చిన అనుభూతి పొందాడు... ఆనందరావు.. మొత్తానికి ఆ మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ తన ఇంటికి చేరాడు ఆనందరావు. ***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
13-04-2026, 09:33 AM
ఆనందరావు కొడుకు రవిని చెన్నై హాస్టల్ లో ఉంచి అప్పుడప్పుడు చూసి వస్తుండేవాడు తన భార్యతో.. అలా అలా కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా రవి చదువు ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది
రెండో సంవత్సరం... చెన్నై హాస్టల్, మే.. మొదటి వారం.. 2021, " కోవిడ్ రెండవ దశ "..... విజృంభణ.... విలయతాండవం చేస్తుంది!!! ఆక్సిజన్ దొరక్క ప్రజలు అల్లాడిపోతున్న సమయమది. నిండు ప్రాణాలు పిట్టల్లా గాల్లో కలిసిపోతున్నాయి. ఓ పక్క కోవిడ్ నిర్ధారణ పరీక్షలు లక్షల్లో జరుగు తున్నాయి.. ప్రతిరాష్ట్రం వేల సంఖ్యలో పోజిటివ్ కేసులు వస్తున్నాయి. దేశం మొత్తం మీద 24 గంటల్లో నాలుగు లక్షల పాజిటివ్ కేసులు!!!! ప్రపంచ దేశాల దృష్టంతా భారత్ మీదే ఉంది. మరోపక్క వ్యాక్సినేషన్. మొదటి దశ... రెండవ దశ... ఇంకా కొత్త కొత్త మందులు వస్తున్నాయి. అకాల మరణాలు తండ్రి చస్తే కొడుకు రాడు.. కూతురు చస్తే తల్లి రాదు... ప్రజా జీవన విధానం... దుర్భరం.. మహాదుర్భరం!!! ఇక్కడ... కాకినాడ రామారావు పేట నుండి తండ్రి ఆనందరావు ఫోన్ లో..... తన కొడుకు రవి తో ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు.... " ఒరేయ్ రవి... ఫోన్లో సరిగా వినపడు తుందా. పదిహేనురోజుల నుండి నేను రోజూ ఫోన్ చేస్తుంటే చెన్నై హాస్టల్లోనే జాగ్రత్తగా ఉన్నా నని అబద్ధం మాటలు చెప్తున్నావ్ ఏంటి?.. "... కోపంగా అరిచాడు ఆనందరావు. " అంటే... నాన్న... "రవి తడబడుతూ ఏదో చెప్పబోయాడు తన తండ్రికి. " నోర్ముయ్.. మీ కొలీగ్ వాళ్లనాన్న మార్కెట్లో ఇప్పుడే కనబడి చెప్పాడు. మీ హాస్టల్ లో ముగ్గురు కుర్రాళ్ళకి "కరోనా పాజిటివ్"... వస్తే..... క్వారంటైన్లో.... పెట్టారటగా... భయ పడిన మిగిలిన అందరూ తలో చోటికి వెళ్లి పోయారటగా. హాస్టల్ ని పదిహేను రోజుల క్రితమే లాక్ చేసేసారట కదా?!... నాకెందుకు ఇన్నాళ్లు అబద్దం చెప్పావు. అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు. ".. గర్జిస్తూ అడిగాడు కొడుకు రవి ని ఆనందరావు. కొడుకు భయపడి తన తండ్రికి ఇలా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. " నాన్నా.. నిజమే.. పదిహేను రోజుల క్రితం భయంతో.. చెట్టుకొకరు పుట్టకొకరుగా హాస్టల్ నుండి బయటకు వచ్చేసాము. బస్సులు, ట్రైన్ లు లేవు. కొందరు కుర్రాళ్ళు బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి పోయారు. నాకేం చెయ్యాలో తోచలేదు.... ఆ రాత్రి నేను... ఓ మూల సందులో అరుగుమీద ఎలాగోలా రాత్రంతా గడపాలని ఎవరికీ కనబడకుండా బిక్కుబిక్కుమంటూ పడుకొని ఉంటే... ఎవరో ఒకాయన వీధివీధి తిరుగుతూ అన్నం పొట్లాలు పంచుతూ నా దగ్గరకు వచ్చి నాకు ఇచ్చి నేనెవరో ఎక్కడ నుండి వచ్చానో... నా వాళ్ళు ఎవరో చాలా వివరంగా అడిగి తెలుసుకుని వెంటనే తను వచ్చిన ఆటోలోనే తన ఇంటికి తీసుకెళ్ళి పోయాడు.... ఇదంతా జరిగింది పదిహేను రోజుల క్రితం నాన్నా…” అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు తండ్రికి. ఆనందరావు కు తన కొడుకు విషయం అంతా దాచి పెట్టినందుకు కోపం నషాళానికి అంటింది. వెంటనే ఇలా అరిచాడు.... " చాలా తతంగం నడిపావు. రోజూ ఫోన్ చేస్తున్నాఇదంతా నాకెందుకు తెలియనివ్వ లేదు. ఏమిట్రా.. నీ డ్రామా. తండ్రంటే అసలు లెక్కలేదా నీకు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితు ల్లోనా నీ నాటకాలు. ఇప్పుడే ఇన్ని వేషాలు వేస్తే ఇకముందు ఎన్ని వేషాలు అయినా వేస్తావు. అసలు ఎవడువాడు... ?.. తీసుకెళ్లి పోయి నిన్ను ఓ గదిలో పెట్టి ఈ పదిహేను రోజులు కుక్కని చూసినట్టు చూశాడు కదూ.. తర్వాత ఏం జరిగిందో త్వరగాచెప్ప" మళ్లీ గర్జించినట్లే అడిగాడు ఆనందరావు. " లేదు నాన్నా నాకు పరీక్ష చేయించి కోవిడ్ పాజిటివ్ లేదని నిర్ధారించుకుని తనింట్లోనే వాళ్ళతో.... సమానంగానే చూశాడు. " అన్నాడు రవి ప్రశాంతంగా. " ఇంకేం జరిగింది.. ఇంకా ఏదైనా అడిగాడా?" అదే కోపంలో అడిగాడు ఆనందరావు. " నా గురించి తరచూ ఇంకేమీ అడగలేదు. ఎందుకో..... వాళ్ల పేర్లు కూడా నాకు తెలియ నివ్వలేదు నాన్నా........ చూడ్డానికి వాళ్లంతా చాలా మంచి మనుషులుగా కనిపించారు. నిజం డాడీ. ".. సరదాగా చెప్పినట్టు చెప్పాడు రవి. ఆనందరావుకి ఇంకా తన శరీరం మీద తేళ్ళు జెర్రులు పాకుతున్నట్టు గానే ఉంది.... " నోటితో కాకుండా ముక్కుతో ఏడ్చినట్టు ఉంది నీ వ్యవహారం. అసలు పేర్లు కూడా తెలుసుకోకుండా పదిహేను రోజులు ఒకరి ఇంట్లో ఎలా గడిపావు రా. వాళ్లు తెలుగు వాళ్లేనా??".. అరిచాడు ఫోన్ బద్దలు అయ్యేట్టు ఆనందరావు. దానికి కొడుకు రవి ఇలా చెప్పాడు. " ఆ.. ఆయన.. ఇంకా మరో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ కాని కుర్రాళ్ళని తీసుకువచ్చి నాకన్నా ముందే తన ఇంట్లో పెట్టుకున్నాడు. అతని బంధువుల పిల్లలట. మేమంతా కలసి వాళ్ళ అబ్బాయి తో సహా మొత్తం నలుగురం. ప్రపంచ మంతా కోవిడ్ తో భయపడుతున్నా.. మేం మాత్రం భలే హ్యాపీ గా ఎంజాయ్ చేసాం. అందరూ కలసి వాళ్ళ కిచెన్ లో భోజనాలు చేసే వాళ్ళం. దూరం దూరంగా కూర్చొని.. ఒకే గదిలో..... దూరం దూరంగా.. పడుకునే వాళ్ళం. " " ఏడ్చావు.. బోడి హ్యాపీ , బోడి ఎంజాయ్.. వాడు మన శత్రువు ఏమోనని నాకు అనుమానంగా ఉంది. కాదుగదా.!!!.. అయినా.. గతం అంతా మరచిపోయివాడు. నిన్ను... ఎందుకు అలా నెత్తి మీద పెట్టుకుంటాడు? వాడు ఏమైనా దేవుడా? మా తమ్ముడు వెధవ కి మరీ ఇంత గొప్ప మనసు లేదులే... అవును.. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ల ఆల్బంబుక్స్ ఏమైనా చూసావా? అందులో నీకు తెలిసిన వాళ్ళ బొమ్మలు ఏమైనా కనిపించాయా?".. లాజిక్కుగా అడిగాడు కొడుకుని ఆనందరావు.. సెల్ ఫోన్ లో. " చూడలేదు నాన్న.. వాళ్లు కూడా చూపించ లేదు. " " అది సరే.. నిన్ను తీసుకెళ్లినాయన పెళ్ళాం.. నీతో ఏమైనా మాట్లాడుతూ ఉండేదా?".. ఈసారి మరింత లాజిక్కు గా అడిగాడు ఆనందరావు. " లేదు నాన్నా.. నావైపు చూస్తూ ఆనందంగా నవ్వుతూ ఉండేది... అంతే.. నేను భోజనం చేస్తున్నప్పుడు మాత్రం అమ్మ లాగే కొసరి వడ్డించుతూ ఉండేది". "ఏరా... వాళ్ళు చాలా బాగా నీకు నచ్చినట్టు ఉన్నారు. గొప్ప ఏం కాదు గాని.. ఎవరైనా అలాగే వడ్డిస్తారు. అవును.. వాళ్లకు ఓ అబ్బాయి ఉన్నాడని అన్నావుగా... రేయ్.. నిన్నే.. ఫోన్ లో వినపడుతుందా సరిగా. అదే వాళ్ళ అబ్బాయిని ' రాజారాం '.. అంటూ పిలిచే వారా.. వాళ్లు?"... ఈసారి అనుమానం బలపడి అడిగాడు కొడుకుని.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
13-04-2026, 09:34 AM
" వినబడుతోంది నాన్నా.. వాళ్ళ అబ్బాయిని 'బాబు'.. అనే పిలిచేవారు......! నాన్నా.. ఒక విషయం చెప్పమంటావా ఆయన ఒకసారి.. ఫోన్ లో ఎవరితోనో చాలా బాగా మాట్లా డారు నాన్నా. అది.. గుర్తుండి పోయింది.. అది.. ఏంటంటే...
' తప్పులు అందరం చేస్తాం సార్. నేను కూడా చాలా తప్పులు చేశాను.. అయితే ఆ తప్పులు దిద్దుకునే అవకాశం కలిగినప్పుడు... దిద్దు కోవాలి.. అన్న స్పృహ కలిగించుకొని ముందుకు సాగాలి. గతంగతః.... అన్నట్టు అందరూ బ్రతికితే బాగుంటుంది సార్. '... అన్నారు నాన్నా. అదేంటో ఆ డైలాగులు నాకు చాలా బాగా నచ్చాయి. చిత్రంగానూ, చాలా గొప్ప గాను కూడా అనిపించాయి. " ఫోన్ లో రవి చాలా ఆర్తిగా చెప్పుకు పోతున్నాడు. అవతల వాళ్లు గురించి.. కొడుకు చెప్పే విధానం ఆనందరావు కు నచ్చక.. అతడి శరీరం మీద ఎవరో మరిగే నీళ్ళు పోసినట్లు ఉంది... " సర్లే ఆపు.. ఈ విషయాలన్నీ నాకు ఫోన్ లో చెప్పాలని నీకు ఎప్పుడూ అసలు అనిపించ లేదా?". నిష్టూరంగా అడిగినట్టు అడిగాడు ఆనందరావు. " సారీ నాన్న.. నేను చాలాసార్లు ప్రయత్నించా. కానీ ఆయన ఎవరిని ఫోన్ చెయ్యనివ్వలేదు. “ఈ విషయం తెలిస్తే దూరంగా ఉన్న మీ వాళ్ళందరూ కంగారు పడతారు. అయినా ఇక్కడకు రాలేరు. పెద్ద వాళ్లను బాధ పెట్టడం వద్దు. ఇప్పటి కోవిడ్ భయానక పరిస్థితుల్లో మీరు చేస్తున్నది ఎంతమాత్రం తప్పు కాదు. నా మాట వినండి. ఇక్కడి పరిస్థితులు కొంచెం చక్కబడ్డాక నేనే మిమ్మల్ని హాస్టల్ లో దిగపెడ తాను. ఆ తర్వాత వీలు చూసుకుని నెమ్మదిగా...... చెప్పండి”... అంటూ మమ్మల్ని ఆపేవారు. మీ పెద్దలు హడా వుడిగా మీ గురించి ఆలోచిస్తూ... ఉన్న ఆరోగ్యం పాడు చేసుకుంటారని కూడా.. చెబుతుండే వారు. అమ్మను దృష్టిలో పెట్టుకొని.. అమ్మ కంగారు పడిపోతుందని.. నాక్కూడా అదే మంచిదని పించింది నాన్నా. సారీ.. తప్పయితే క్షమించు నాన్నా. ".... చాలా ప్రాధేయ పూర్వకంగా చెప్పాడు కొడుకు రవి.. తన తండ్రికి సెల్ ఫోన్ లో. " అది సరే... ఇంతకీ ఎవడ్రా అతను.... ?". " ఎప్పుడన్నా ఎక్కడన్నా కనిపిస్తే ‘విష్’ చేయి చాలు అంటూ ఈ పదిహేను రోజుల తర్వాత నన్ను ఇదిగో... ఇప్పుడే.. జాగ్రత్తగా హాస్టల్ లో దిగవిడిచి.. అదిగో వెళ్ళిపోతున్నారు. " ''నువ్వు చెప్పింది అంతా వింటుంటే.... ఆ వెధవ మా తమ్ముడు అని అనిపిస్తుంది రా.. అసలు నీకు వాళ్ళు ఎవరూ గుర్తు రాలేదా?.. చిన్నప్పుడు చూసావు కదా.. ''... ప్రశ్నించాడు ఆనంద రావు'' '' అదేమిటి నాన్న.. నాకు నాలుగు.. అయిదు ఏళ్ల వయసున్నప్పుడు... ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వాళ్లను చూసాను.... ఎలా పోల్చుకో గలను నువ్వే చెప్పు.. ''... అంటూ వివరణ ఇచ్చాడు.. రవి. " ఆయన అసలు ఎలా ఉంటాడు? సెల్ లో ఫోటో తీసి నాకు పంపించలేకపోయావా ?" " లేదు నాన్న.. ఇటువంటి పరిస్థితిలో పద్ధతిగా ఉండదని ఫోటోలు తీసుకోలేదు. ఆ... అదేమిటో కానీ నాన్న.. ఆయన కొంచెం అటు ఇటు గా 'నీలాగే'.... ఉంటారు. వాళ్ళ అబ్బాయి కూడా అదేమిటో కొంచెం అటు ఇటు గా 'నాలాగే ' ఉంటాడు నాన్న. నిజం"... ఈసారి మహదానందంగా చెప్పాడు రవి. " ఆ.. చాల్లే.. సంబడం.. మనిషిని.. పోలిన మనుషులు ఉండరా ఏంటి? నీదో పెద్ద బడాయి. అన్నట్టు ఈ పదిహేను రోజులు ఏ స్ట్రీట్ లో ఉన్నావు... అదయినా.. తెలిసి ఏడిచిందా.. నీకు" " ఆ.. తెలుసు నాన్న.. ఈ రోజే ఆయన ఇప్పుడే మా హాస్టల్ లో దిగవిడిచారు కదా... ఆయన ఇంటి దగ్గర నుంచి హాస్టల్‌కు వస్తూ చూశాను.. ఆ స్ట్రీట్.. పేరు.. ఆ... అది.. అది.. చిట్టి.. కాదు కాదు చెట్టి...... చెట్టి...... " " ఏడ్చావు... కొంపతీసి "చెట్టియార్ స్ట్రీటా????" " ఆ... అ.. ఖచ్చితంగా అదే నాన్న. " అంతే.. ఆనందరావు చేతిలో సెల్ కిందపడి ముక్కలు కాలేదు. ఎవరో అతని గుండెల మీదకు పెద్ద కొబ్బరి బొండం విసిరితే అది.. అది తన గుండెల మీదే పగిలిపోయి పదహారు ముక్క లుగా చితికిపోయిన భావన కలిగింది..!!!. *** కాకినాడ.... రామారావు పేట,.. ఆనందరావు తన ఇంట్లోనే ఉన్నాడు... అతను కొడుకు తో మాట్లాడి నెల రోజులు అవుతుంది... ఆగస్టు మొదటి వారం... 2021సంవత్సరం.. పూర్తి లాక్ డౌన్..... మినీ లాక్ డౌన్... ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్ పరిస్థితులు కొంచెం చక్కబడి చక్కబడనట్లు ఉన్నాయి. సర్దుకున్నట్టు కనిపించి విజృం భిస్తున్నాయి. అయినా.... ప్రజా అవసరం, అభివృద్ధి కుంటుపడకుండా ఉండడం రీత్యా ముఖ్యమైన కొన్నిబస్సులు, ట్రైన్ లు తిరుగు తాయని... ఆన్ లైన్ బుకింగ్ మళ్లీ మొదల వుతుందని... టీవీన్యూస్ విన్నాడు ఆనంద రావు. కొడుకు నుండి యధార్థ విషయం తెలుసుకొని నెల రోజులు గడిచింది. ఈ నెల రోజులు దీక్షగా, తదేకంగా ఆలోచించిన ఆనందరావు ఒక నిర్ణయానికి వచ్చాడు.. అనే కన్నా "వచ్చేసాడు".. అనొచ్చు!!! "" నా దృష్టిలో నా తమ్ముడు "వెధవ".!!..... నా తమ్ముడు దృష్టిలో.. నేను.. " పెద్దవెధవ నేమో"!!!.... ఏ సమస్యనైనా ఎదుటివారి కోణంనుంచి ఆలోచించాలి అన్నారు పెద్దలు. నిజమే.. ఖచ్చితంగా నిజం!"" ఇదీ.. ప్రస్తుతం ఆనందరావు.. ఆలోచనా ధోరణి. '"అవును.. తప్పులు అందరం చేస్తాం. అయితే ఆ తప్పులుదిద్దుకునే అవకాశం కలిగినప్పుడు ... ""దిద్దుకోవాలి""..... అన్న స్పృహ కలిగించు కొని ముందుకు సాగాలి. గతం గతః... అన్నట్టు అందరూ బ్రతికితే బాగుంటుంది!! రెండు దశాబ్దాలు.. 20 సంవత్సరాలు.. చాలా సుదీర్ఘం! ఇరవై సంక్రాంతులు.. ఇరవై ఉగాదులు.. ఇరవై దీపావళిలు! ఎలా నిస్సత్తువుగా గడిచి పోయాయి. గభాలున కుర్చీలోంచి లేచి.. 'సిస్టం' దగ్గర కూర్చున్నాడు ఆనందరావు. రెండు టికెట్లు.. తనకు , తనభార్యకు.. అన్ లైన్ బుకింగ్ చేసుకున్నాడు... చెన్నై వెళ్లడానికి...! చెన్నైలో తన కొడుకును చూడాలి.. అంతేనా.. అందరూ కలసి సర్ ప్రైజ్ చేసేలా " చెట్టియార్ స్ట్రీట్ " సడన్ గా వెళ్లి వారంరోజులు ఆనందంగా గడపాలి.... ఆ ఇంట్లో.. తమ్ముడు ఇంట్లో!!!!!! తిరుగులేని తన నిర్ణయంతో.. మహమ్మారి కోవిడ్ ఈ భూప్రపంచం వదిలి పారిపోయినంతగా... ఇప్పుడు.. ఆనందరావు.... పరమానంద భరితుడైపోతున్నాడు.!!! * సమాప్తం *
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
24-04-2026, 09:01 AM
కనురెప్ప
![]() రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు సత్యకీర్తి గొప్ప సాహితీవేత్త. ఎన్నో గ్రంథాలు రాసి ఎన్నో అవార్డులు రివార్డులు సత్కారాలు కూడా పొందిన దిట్ట. అతను రచించి ప్రచురింపబడిన.... మహోన్నత గ్రంధాలు రమారమి రెండువందల వరకు ఉంటాయి. అవన్నీ అతని ఇంటిలో తనకోసం కేటాయించు కొన్న 2 గదుల్లో పాతకాలం నాటి టేకు బీరువాల్లో అమర్చుకున్నాడు.... అలాగే తన బిడ్డలు జయేంద్ర, లలితశ్రీ. వాళ్ళిద్దరికీ చెరో గది ప్రత్యేకంగా కేటాయించాడు. అయితే వాళ్లు పెద్దవాళ్లు అయినప్పటికీ, తన పుస్తకాలు భద్ర పరచుకున్న గదుల్లోకి మాత్రం వెళ్లనివ్వడు. కుటుంబం కన్నా పుస్తకాలని అంతలా ప్రేమి స్తాడు అతను. ఇప్పుడు అతను ఓ మహాగ్రంథం వ్రాస్తూ, తనకన్నా ఘనాపాటి గ్రంథకర్తల స్ఫూర్తి వాక్యాలు అందులో పొందుపరిచి, ఆ గ్రంథాన్ని ముద్రించాలని అనుకున్నాడు. అందుకోసం తనకు దైవసమానులు, గురు తుల్యులులాంటి చాలా మందిని కలిసి, కావలసిన విషయ సేకరణ పొందాడు. చిట్టచివరగా తను హైకాలేజ్ లో చదువుకునే టప్పటి తన తెలుగుమాస్టారు .. విశిష్ట గ్రంధ కర్త అయిన పద్మప్రభాకరం గారు ఉంటున్న చెల్లూరు అనే గ్రామం బయలుదేరాడు. ఆరోజు.. సాయంకాలం వరకు చాలా కష్టపడి ప్రయాణించి పద్మప్రభాకరo గారు నివసించే ఊరు వెళ్లి ఆయనకు నమస్కరించి, విషయం వివరంగా వివరించి, ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు సత్యకీర్తి. మాస్టారు పద్మప్రభాకరం గారికి 90 ఏళ్లు వయస్సు పైబడి ఉంటుంది. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. దేశ విదేశాల్లో సైతం ఆయన సన్మానాలు సత్కారాలు పొందారు. అన్ని దేశాలలోనూ ఈయనకు అభిమానులు ఉన్నారు. లెక్కకు మించిన బిరుదులు పొందారు. తన శిష్యుడు చెప్పింది విని అతని మీద అభిమానంతో కాదనలేక నీరసంగా అడుగులు వేసుకుంటూ … లోపలకెళ్లి తను రచించిన.. కట్టలు కట్టబడి ఉన్న పాత కొత్త గ్రంధాలన్నీ జాగ్రత్తగా ఏరిఏరి, దుమ్ము దులుపుతూ, చివరికి ఓ గ్రంథం చేతులతో పట్టుకుంటూ బయటకు వచ్చారు. '' సత్యకీర్తీ! ఇది నేను రాసిన గ్రంథం నాయనా. ఇది ఎప్పుడో 1990 సంవత్సరంలో ప్రచురింప బడింది. నువ్వు కూడా చాలా గ్రంథాలు రాశావు కదా. నువ్వు సామాన్యుడివి కాదు.. నీ గురించి నాకు తెలుసు.. అయితే నువ్వే నా శిష్యుడు అని మాత్రం ఇంతవరకూ తెలియదు.. నా శిష్యుడు ఇంత గొప్పవాడు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది నాయనా. చాలా సంతోషం '' అంటూ లోపల్నుంచి వచ్చిన మాస్టారు బయట కుర్చీలో కూర్చున్నారు. శిష్యుని ఎదురుగా... చాలా పేజీలు తిరగేసి .. ' దొరికింది' .. అంటూ ఒకచోట ఆగారు. '' సత్యకీర్తీ! ' విజ్ఞానసాగరం ' అనే ఈ ఆధ్యా త్మిక గ్రంథములోని ఈ రెండు పేజీల ముఖ్యమైన మేటర్ నీకు ఇస్తాను. అందులో నుంచి నీకు పనికి వచ్చిన వాక్యాలు నువ్వు ఇప్పుడు రాస్తున్న గ్రంథంలో ఎక్కడైనా అన్వయించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. దాంతో నీ గ్రంథానికి బలం వస్తుంది... నా శిష్యుడు అయిన నీకు సహాయ పడ్డ తృప్తి నాకు కలుగుతుంది. నువ్వు వచ్చింది దీనికోసమే.. నేను చదువుతాను. నువ్వు రాసుకో నాయనా....'' అంటూ చదవడం ఆరంభించారు మాస్టారు. “చాలా ఆనందం మాస్టారు! ఈ మీ విజ్ఞానసాగరం గ్రంథంలో నాకు పనికి వచ్చే ఈ రెండు పేజీలు రోడ్డు అవతలకు వెళ్లి ఫోటోస్టాట్ తీయించుకుని.. 10 నిమిషాలలో మీ గ్రంథం మీకు పట్టుకుని వచ్చి ఇస్తాను. మీకు చదివే శ్రమ ఇవ్వడం నాకు ఇష్టం లేదు.. పైగా నాకు కూడా చాలా లేట్ అవుతుంది. ఆ గ్రంథం ఒకసారి ఇవ్వండి మాస్టారు..'' అంటూ వినయంగా అడిగాడు సత్యకీర్తి. '' పుస్తకం బయటకు పట్టుకుని వెళ్తానంటే ఎవరికీ ఇవ్వను నాయనా. నీ సెల్ కెమెరాతో కాపీ వస్తుం దేమో.. ప్రయత్నించరాదూ.'' '' అలారాదు మాస్టారు. నాది చిన్న సెల్.. కెమెరా కి అనువైనదికాదు.. '' ''ఏమీ అనుకోవద్దు నాయనా. ఇదిగో పేపరుపెన్ను... వ్యాసం చదువుతాను రాసుకో ...'' అంటూ చదవడం ఆరంభించారు పద్మప్రభాకరం మాస్టారు గారు. సత్యకీర్తి చాలాసేపు పూర్తిగా రాసుకున్నాడు ''వయసు చూస్తే 90 పైపడినట్టు ఉన్నారు. మనిషి మీద నమ్మకం లేని బ్రతుకు ఎందుకు..?'' అంటూ మాస్టారుని ఒకపక్క మనసులో చీదరించుకుంటూ, మరోపక్క పుస్తకాల పట్ల ఆయన వాత్సల్యానికి పొగడకుండా ఉండలేకపోయాడు సత్యకీర్తి. అంతా బాగానే ఉంది కానీ.. మాస్టారు తన.. ప్రచురింపబడిన పుస్తకాలను బీరువాల్లో .. అలమరలలో చక్కగా పేర్చలేకపోయారు కట్టలుకట్టి..పోగులుగా పడేశారు. కొన్నిబూజులు పట్టి ఉన్నాయి.. మరికొన్ని అట్టలు ఊడిపోయి చిందరవందరగా ఉన్నాయి. కావలసిన పుస్తకం వెంటనే తీసుకునేటట్లు ఇండెక్స్ అమరిక లేదు. ఇన్ని వందలాది మహత్తరమైన గ్రంథాల పట్ల ఎందుకు మాస్టారు సరైన శ్రద్ధ తీసుకోలేకపోయారు ..!? వయసు భారమా..? అయ్యుండొచ్చు... పోనీ ఆయన కుటుంబ సభ్యులు..?.. ఏమో ..?.. ఎవరి కుటుంబ విధానాలు ఎలాంటివో...!! కిటికీలోంచి పుస్తకాలు ఉన్న గదులను పరికిస్తూ కించిత్తు బాధ పడ్డాడు సత్యకీర్తి. '' ఈ నా విజ్ఞానసాగరం పుస్తకం ఇప్పుడు ఎక్కడ అమ్మటం లేదు.. అని తెలిసింది నాయనా. ఏ కారణం చేతనైనా ఈ పుస్తకం పోతే మళ్లీ నేను కొనుక్కుందాం అన్నా దొరకదు కదా. అందుకనే ఎవరికీ ఇవ్వటం లేదు. మిగిలిన అన్ని పుస్తకాలలోకి ఈ పుస్తకం నా ప్రాణం. .. మరో విషయం .. నీకు వినిపించిన ఈ రెండుపేజీల ''దిగువనే '.. ఇదిగో ఈ ఖాళీ లో ఈరోజు జరిగింది సింపుల్ గా రాసి తారీకు కూడా వేసి సంతకం పెట్టుకుంటాను. ఇది నా అలవాటు అన్నమాట.. ఇంకో మాట వయసు పైబడిన వాడిని కదా.. నీ పుస్తకావిష్కరణకు రాలేను. నువ్వు నీ గ్రంథం ప్రింట్ చేశాక వీలు పడితే ఓ పుస్తకం పోస్టులో పంపు.''.. . అంటూ మాస్టారు పద్మ ప్రభాకరo గారు.. తన పుస్తకాన్ని లోపలకు తీసుకెళ్ళిపోయి భద్రపరుచుకున్నారు. సత్య కీర్తి మాస్టారు నుండి సెలవు తీసుకుని ఇంటికి వచ్చాడు ఆయన నుండి తెచ్చిన కొన్ని వాక్యాలను తన గ్రంథంలో కొన్నిచోట్ల అమర్చి గ్రంథం ప్రచురించి పుస్తకావిష్కరణ కూడా కావించి తెలుగు మాస్టారు కోరినట్టు ఆయనకు కూడా ఒక పుస్తకం బుక్ పోస్టులో పంపడం కూడా జరిగిపోయింది. మూడు నెలలు గడిచి పోయింది. ఈరోజు.. సత్యకీర్తి మళ్లీ తన తెలుగుమాస్టార్ని కలవడానికి చెల్లూరు బయలుదేరాడు. తను పోస్టులో పంపిన తన గ్రంథం మీద పద్మ ప్రభాకరం మాస్టారు గారి అభిప్రాయం తెలుసు కోవాలి అన్నది సత్యకీర్తి ..ప్రయాణ ఉద్దేశం. చెల్లూరు వచ్చి ఊరు బయట టీ బడ్డీ కొట్టు దగ్గర ఆగాడు సత్యకీర్తి. '' ఓ రెండు మసాలా గారెలు ఇవ్వవోయి. '' అడిగాడు బడ్డీకొట్టు అతన్ని. వెంటనే బడ్డీవాల తన దగ్గరున్న దళసరి బైండ్ పుస్తకంలోంచి ఓ డబల్ పేపర్ కసక్కన లాగి అందులో రెండు మసాలాగారెలు కొంచెం చెట్నీ వేసి సత్యకీర్తి కి అందించాడు. ఆకలి మీద ఉన్న సత్యకీర్తి బడ్డీవాల అందించిన మసాలాగారెలు తింటూ ఆ గారెలు పెట్టి బడ్డీవాల ఇచ్చిన.. పేపర్లోని అక్షరాలు స్పష్టంగా కనబడటం తో చదవనారంభించాడు ఆత్రుతగా. '' అందుచేత.. ప్రతిమనిషి.... జాగ్రత్తగా విని, గుండె పుటల్లో చెక్కుకోవలసిన చివరిమాట ఒకటే..!! మనం ఒక చెట్టు నాటడం ముఖ్యం కాదు!!. అలాగని.. దానికి నీళ్లు పోసి.. పెంచి పోషించడం అది కూడా ముఖ్యం కాదు.!! మనకు వీలు కానప్పుడు.. ఆ.. ''చెట్టు పట్ల''' మనం నెరవేరుస్తున్న..'' బాధ్యత ''..ఆపకుండా.. దీక్షతో నిర్వహించే వారసుడిని కానీ వారసురాలిని కానీ '' నియమించడం '' .. అదే అదే అతి ముఖ్యం..!!! '' '' కంటి కన్నా.. ' కనురెప్ప' ముఖ్యం.. ఆ కను రెప్పకు కంటిని 'రక్షించే బాధ్యత' మనిషి అప్ప చెప్పకపోతే....కన్ను చీకటై పోతుంది....!! '' ఆ వాక్యాలు చదివి ఆశ్చర్యం నుంచి తేరుకోలేక పోయాడు సత్యకీర్తి. చూస్తే.. బడ్డీవాలా బల్లమీద తెలుగుమాస్టారి... ''విజ్ఞానసాగరం'' గ్రంథం ఉంది....! ఆ పుస్తకంలో నుంచి చాలా కాగితాలు చింపి అతను మసాలాగారెలు పొట్లాలు కట్టగాకట్టగా .. ఇంకొన్ని... కాగితాలు మాత్రమే మిగిలిఉన్నాయి. విచిత్రం ఏమిటంటే.. తను చేతిలో పెట్టుకు తింటున్న.. '' మసాలాగారెలు '' పేపర్లో బాగా దిగువన మాస్టారు సంతకం కూడా ఉంది. అది… ఇదివరలో తను మాస్టార్ ని... కలిసినప్పుడు... ఆ రోజు తనతో జరిగిన సంఘటన, పేపరు దిగువ ఖాళీలో తారీకుతో సహా సింపుల్ గా రాసి.. క్రింద పెట్టిన సంతకమే!!! ఈ రెండు పేజీలలోని వాక్యాలే... సత్యకీర్తి తన గ్రంథంలో పెట్టుకోవడం కూడా జరిగింది. !!! ఎంత చిత్రం?? మాస్టారి ఇంట్లోని తనకు ఓ ఐదు నిమిషాలు ఇవ్వడానికి నిరాకరించిన ఒరిజినల్ గ్రంథం పేపర్ కటింగ్లోనే తను మసాలాగారెలు తినటమా? సత్యకీర్తి.. వెంటనే మసాలాగారెలు కింద పడేసి పరుగులాంటి నడకతో.. మాస్టారు ఇంటిని సమీపించి ఆ ఇల్లు తాళం వేసి ఉండటంతో ఇరుగు పొరుగు వారిని విచారించాడు. తెలుగు మాస్టారు పద్మప్రభాకరoగారు నెలక్రితం చనిపోయారట!! అతని కొడుకులు... కోడళ్ళు కూతుళ్ళు...అల్లుళ్ళు ఇతర దేశాల్లో పెద్దపెద్ద ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారట!!! మాస్టారు భార్య సామాన్య చదవరి. ఆయన కాలంచేయడంతో కర్మకాండలు అయిన వెంటనే ఆ ఇంటిని అమ్మేసి కొడుకులతో పాటు '' ఆమె'' అమెరికా వెళ్ళిపోతూ తన లగేజీతో పాటు మాస్టారి పుస్తకాలన్నీ మోయలేక.. కొడుకులు కూడా ఆ పుస్తకాలను చీదరించుకుని చిరాకుపడటంతో తూకానికి చిత్తుకాగితాల వాడికి ఆవిడ '' ఆయన మహోన్నత మహోజ్జ్వల గ్రంథాలన్నీ'' అమ్మేసిందట!!!!! అలా వచ్చిపడిందన్నమాట మసాలాగారెల బడ్డీకొట్టు లోకి... మాస్టారి...'' విజ్ఞానసాగరం '' గ్రంథం!.. ఈ విషయం గ్రహించిన సత్యకీర్తి మరొక్కక్షణం అక్కడ ఉండలేక వెంటనే తన ఊరు వచ్చి ఇంటికి వెళ్లి గాబరాగా ఆతృతగా తన పిల్లలిద్దర్ని పిలి చాడు..జయేంద్ర.. లలితశ్రీ...ఇద్దరూ వచ్చి తండ్రి ఎదురుగా నిలబడ్డారు. '' ఇన్నాళ్లు మీరిద్దరూ నా రూముల్లోకి వస్తుంటే..' వద్దు ' అనే వాడిని. నా గ్రంథాలు.. మీరు చదువు తుంటే...'మీ చదువు ఏదో మీరు చదువుకుంటూ గొప్పవాళ్ళు కండి..నా పుస్తకాల జోలికి రాకండి ' అంటూ కసురుకునే వాడిని. తప్పుచేశాను.. నాకిప్పుడు జ్ఞానోదయమయింది. గతం గతః.. ఇప్పుడు మీ ఇద్దరికీ చిన్న పరీక్ష పెడుతున్నానర్ర'' అన్నాడు.. పిల్లలు ఇద్దరి వైపు చూస్తూ సత్యకీర్తి. పిల్లలిద్దరికీ విషయం అర్థం కాలేదు. సత్యకీర్తి తను రాసిన గ్రంథాలు ఉన్న చెరో రూమ్ లోకి ఆ ఇద్దరినీ విడివిడిగా పంపిస్తూ.. ఒకరోజు గడపమన్నాడు.... ఆ సమయంలో తను రచించిన ' వంద పేజీల' పుస్తకాలు మాత్రమే చదవడానికి ప్రయత్నించమని అన్నాడు. “ఎవరు ఎక్కువ పుస్త కాలు చదువుతారో దాన్నిబట్టి నేను ఒక నిర్ణయా నికి కూడా వస్తాను.'' అంటూ చెప్పాడు. ఈసారి సత్యకీర్తి మనసు తేలికపడింది. ఎక్కువ పుస్తకాలు చదివిన వారికి పుస్తకాలమీద ప్రీతి ఎక్కువగా ఉన్నట్టు నిర్ణయించి, వారికి తన కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన పుస్తకాల ఆస్తి బాధ్యత అప్పచెప్పాలన్నది అతని ఉద్దేశ్యం. తను ఇచ్చిన సమయం గడిచాక .. సత్యకీర్తి వాళ్లు ఉన్న రూముల్లోకి వెళ్ళాడు. ఇంజనీర్ చదువుతున్న జయేంద్ర వెళ్ళిన రూమ్ లోని పుస్తకాలు..ఇదివరకటిలా సక్రమంగా కాకుండా చాలా చిందరవందరగా పడిఉన్నాయి.. అతడిని పిలిచి అడగగా... 3 పుస్తకాలు చదివేసినట్టు గర్వంగా చెప్పుకున్నాడు.. 100 పేజీల పుస్తకాల గురించి వెతకటంతో.. గత్తర అయిన పుస్త కాల్ని మళ్లీ పేర్చడానికి సమయం సరిపోలేదని.. చెప్పాడు.. తండ్రితో. ఇక.. కూతురు లలితశ్రీ మెడిసన్.. ఆమె ఒక పుస్తకం మాత్రమే చదివిందట.. సత్యకీర్తి కోపంగా ఆమె గడిపిన రూమ్‌లోకి వెళ్లి అంతా పరికించాడు అయితే..ఆమె చెప్పిన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. లలితశ్రీ ముందుగా తనకు తండ్రి ఇచ్చిన రూమ్ లో ..బీరువాలో ..అలమరలో ఉన్న పుస్తకాలు సక్రమమైన పద్ధతిలో పెట్టింది.. దులుపు గుడ్డకర్ర తో దుమ్ములన్నీ దులిపి రూమంతా శుభ్రం చేసింది. పుస్తకాలు చెదలు పట్టకుండా ఉపయోగించడానికి తండ్రి కిటికీ లో పెట్టిన స్ప్రే కూడా తీసి...రూమంతా స్ప్రే చేసింది. అంతేనా కొన్ని పుస్తకాలు చిరుగు పడితే కిటికీలో ఉన్న గమ్ము బాటిల్ తీసి అంటించి ఆరబెట్టండి.. ఇవన్నీ చేయడంలో తను కేవలం ఒక పుస్తకం మాత్రమే చదవగలిగాను అని సమయం చాలలేదని తనను క్షమించమని చేతులు కట్టుకు కోరింది తండ్రిని. దాంతో ఒక నిర్ణయానికి వచ్చిన సత్యకీర్తి కుమార్తె లలితశ్రీని దగ్గరగా తీసుకొని నుదుటిపై ముద్దాడి ''అమ్మా.. లలితశ్రీ మా తెలుగుమాస్టారు చనిపోయి నాకొక ' జీవితరహస్యం' పాఠం లా నేర్పారు. తన ఆస్తులనే కాదు తన కీర్తి ప్రతిష్టలను కూడా వెనుక ఉన్నవారు నిలుపగలిగేలా .. రక్షించ గలిగేలా ఎవరో ఒకరిని తయారు చేసుకోవడం ప్రతి మనిషికి చాలా ' ముఖ్యం' అన్నది...ఆయన నేర్పిన పాఠం తల్లి.. కవులకు.. రచయితలకు.. చిత్రకారులకు.... వ్యాపారస్తులకు.. ఇంకా చాలా మందికి.. ఇది వర్తిస్తుంది. ఇకపోతే నేను పెట్టిన పరీక్షలో నా ' కీర్తిప్రతిష్టల వారసత్వం' నిలబెట్టే వారసురాలువి..'' నువ్వే '' అని.. నీలో క్రమశిక్షణను బట్టి నేను నిర్ణయించు కున్నానమ్మ. నేను కష్టపడి రచించిన నా గ్రంథాలన్ని.. నా అనంతరం చెదపట్టకుండా...అగ్నికి ఆహుతి కాకుండా.. అనామకుల పరం కాకుండా.. తడిచి ముద్దవ్వ కుండా... చివరికి చిత్తుకాగితాల వాడి తూకానికి బలి కాకుండా... చూడవలసిన రక్షణ బాధ్యత నీకు అప్పచెబుతున్నానమ్మా.''..... అంటూ తన గ్రంథాలున్న రెండురూమ్ ల తాళాలగుత్తి కూతురు లలితశ్రీ కి అందించాడు ప్రేమతో సత్యకీర్తి. నిజమే... మనం ఒక చెట్టు నాటడం ముఖ్యం కాదు!!. అలాగని.. దానికి నీళ్లు పోసి.. పెంచి పోషించడం.. అది కూడా ముఖ్యం కాదు.!! మనకు వీలు కానప్పుడు.. ఆ.. ''చెట్టు పట్ల''' మనం నెరవేరుస్తున్న..''బాధ్యత'' ఆపకుండా, దీక్షతో నిర్వహించే వారసుడిని కానీ వారసురాలిని కానీ '' నియమించడం '' .. అదే అదే అతి ముఖ్యం..!!! '' '' కంటి కన్నా.. ' కనురెప్ప' ముఖ్యం.. ఆ కను రెప్పకు కంటిని 'రక్షించే బాధ్యత' మనిషి అప్ప చెప్పకపోతే....కన్ను చీకటై పోతుంది....!! '' తన తెలుగు మాస్టారి మహోన్నత గ్రంథంలోని వాక్యాలు మరొక్కసారి గుర్తు చేసుకున్నాడు ... సత్యకీర్తి! ****
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
|
|
« Next Oldest | Next Newest »
|