Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నల్లమల నిధి రహస్యం - సమాప్తం
ఎందుకో ఈ భాగం చ్దివిన తరువాత, రైటర్ తొందరగా ముగించేయాలని నిర్ణయం తీసుకున్నట్లనిపించింది.

కొసమెరుపు దుష్టాత్మ పీడ విరగడవ్వడం, అన్నతమ్ములిద్దరూ బతికే వుండడం...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
కథలు ఎక్కడో ఓ చోట ఆగాలిగా! పొడిగించికుంటూపోతే ఆసక్తి క్షీణిస్తుంది.

మరో మలుపు వచ్చే భాగంలో
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
నల్లమల నిధి రహస్యం
పార్ట్-37
"మహారాజా! మీ నిధి పదిలముగా ఉన్నది. మీకు ఆ నిధిని అప్పగించి, నా కర్తవ్యం పూర్తి చేసుకొనవలెను. నేనిక పరమాత్మలో ఐక్యం కావలెను. అందుచేత, మీ ఇరువురిని నాతో తీసుకు వెడుతున్నాను" అంటూ పూజారి గారికి నమస్కరించి, ఆ ఇష్టకామేశ్వరి అమ్మవారికి కన్నీటితోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన ఆత్మ శక్తితో, ఆ ఇరువురు కారణ జన్ములను నిధిని దాచి ఉంచిన నీలగిరి కొండ గుహలలోకి తీసుకువెళ్ళింది. వారు ముగ్గురూ మెరుపు వేగంతో అక్కడికి చేరిపోయారు.
 
ఆ నీలగిరి కొండల వరకూ తన ఆత్మ శక్తి తో తీసుకు వచ్చిన మరియా, వారిని అక్కడ నుండి నడిపించుకుని తీసుకు వెడుతోంది. ఆ ప్రాంతం అంతా దట్టమైన చెట్లు, గుబురైన పొదలు, లతలు, తీగలతో నిండిపోయి ఉంది. మరియా వారిరువురిని ‘నిధి ఉన్న ప్రాంతం ఇదే’ అంటూ లోపలికి తీసుకు వెళుతోంది.
 
అజయ్ కి, సంజయ్ ని విద్యుత్ ఘాతం నుండి కాపాడడానికి తాను చేసిన త్యాగానికి ఫలితం కొద్దికొద్దిగా తెలుస్తోంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కడుపులో పేగులు మెలి తిప్పుతున్నట్టు బాధ మొదలైంది. కానీ, తన కర్తవ్యం నెరవేరే వరకు, ప్రాణాలు ఉగ్గబెట్టుకుంటూ, మరియా చూపిస్తున్న దిశగా నడవసాగాడు. వారు ఆ కొండ గుహలలోకి అడుగు పెట్టేసరికి, అజయ్ కి ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కాసాగింది. కానీ అదేమీ బయట పడనివ్వకుండా, ఓపిక నటిస్తూ, నడుస్తున్నాడు అజయ్. ఎలాగో, ఆ నిధిని భద్రపరచిన స్థానానికి చేరుకున్నారు ముగ్గురూ.
 
మరియా తన ఆత్మ శక్తిని ప్రయోగించి, నిధిని దాచి ఉంచిన భోషాణాన్ని బయటకు తీసింది. ఆ క్రమంలో కొన్ని అస్థిపంజరాలు కూడా బయటపడ్డాయి. అవి ఈ జన్మలో అజయ్, సంజయ్ లకు తాత అయిన బసవయ్య, మరియు అతని పనివారివి. ఆ భోషాణాన్ని చూపిస్తూ, మరియా, సంజయ్ తో "మహారాజా! ఈ నిధి కోసమే ఆ నీచుడు పచ్చని మా బతుకులు బుగ్గిపాలు చేసాడు. ఈ నిధిని కాపాడే ప్రయత్నంలో వేల మంది ఆదివాసి వీరులు అమరులయ్యారు. నా పెనిమిటికి ఇచ్చిన మాట కోసం ఇన్ని జన్మలుగా నేను ఆత్మని అయినా కూడా, ఈ నిధికి కావలి ఉన్నాను" అని చెప్పి, అజయ్ వైపు తిరిగింది.
 
"మావా! ఆనాడు నీ ప్రాణం పోయే క్షణంలో నా దగ్గర మాట తీసుకున్నావు, నువ్వు వచ్చే వరకూ నిధికి కావలుండమని! ఆ నాడే నా ఊపిరి ఈ అనంత విశ్వంలో కలిసిపోయినా, అలసిపోని ఆకారాన్నై, అంతులేని శూన్యాన్నై, నీ రాక కోసం, జన్మలు వేచి, అలసి సొలసి ఉన్న నా ఆత్మఘోష, ఈ అరణ్యానికి మాత్రమే తెలుసు. నీ రాకతోనే నా తపస్సు ఫలించింది అనుకున్నా!
 
ఈనాటితో నా కర్తవ్యం తీరిపోయింది అని తెలుస్తున్నా.
నీ పరిష్వంగనకు సైతం నోచుకోని నేను నీలో ఎలా కలవగలను? మరు జన్మ కూడా కలుపలేని ఆగాథం మిగిల్చింది ఈ విధి. మన ప్రకృతి విరుద్ధమైన బంధంలో గాలిలా మిగిలిన నాకు తోడువై నువ్వు ఉంటాను అన్నా, ఉండనివ్వని విధి రాత, నన్ను చూసి హేళనగా నవ్వక మునుపే, పరమాత్మలో లీనం అయిపోతున్నా! మరువలేను నీ ప్రేమను! తిరిగిరాలేను నేను!" అంటూ తన పయనం మొదలు పెట్టబోయిన మరియా అజయ్ నోటిలోనుండి వస్తున్న రక్తాన్ని చూసి హతాశురాలు అయింది.
 
అంత వరకూ మౌనంగా మరియా మాటలు విన్న సంజయ్. అజయ్ ని ఆ పరిస్థితుల్లో చూసి, గుండె పగిలేలా ఏడుస్తూ " మిత్రమా! ఏమైంది నీకు.. ఈ రక్తం ఏమిటి? " అంటూ బోరున విలపించసాగాడు.
 
" మహారాజా! ఆ దివ్య ఖడ్గమును పొందదలచిన వ్యక్తి శివ లింగానికి అభిషేకం చేసి, ఆ అభిషేక జలమును తాను త్రాగి, ఆపై ఆ శిల్పంపై ఆ జలాన్ని చిలకరించి, ఖడ్గమును తీసుకొనవలెను. అభిషేకం చేసినను, ఆ అభిషేక జలాన్ని త్రాగకుండా, శిల్పంపై చిలకరించినను, ఖడ్గమును పొందవచ్చు. కానీ ఆ వ్యక్తి కొన్ని ఘడియల కంటే బ్రతకలేడు. అలా అని ఆ గ్రంధములో రాసి ఉంది. కానీ మీరు ఉన్న పరిస్థితుల్లో, ఆ నీటిని మీకు త్రాగించాను. అటుపై శిల్పం పై చిలకరించి, ఖడ్గమును తీసుకొన్నాను. మిమ్మల్ని కాపాడుకో గలిగాను . ఆ నీచుడ్ని అంతం చేయగలిగాను. నిధిని మీకు అప్పగించ గలిగాను. ఇదే నా పుట్టుకకు పరమార్ధం. మీకు నిధిని అప్పగించుట కొరకే నేను జన్మించాను. నా వాగ్దానం నేటితో నెరవేరింది. ఇక నా పయనం నా ప్రేమ కోసం జన్మలుగా వేచి ఉన్న నా ప్రేయసి కోసమే" అంటూ మరియా వైపు చూస్తూ
 
" నా ప్రేమ కోసం, నేను తీసుకున్న మాట కోసం జన్మలుగా నా కోసం ఎదురుచూసిన ఓ ప్రేమ మూర్తి! మరణం విడదీసిన మన ప్రేమను, మరణమే కలుపుతుంది. నాకోసం జన్మలు వేచి ఉన్న నీ ప్రేమకు, నా ప్రాణాన్నే కానుకగా ఇస్తాను. అని ఆన చేసాను. ఇది కూడా విధి లిఖితమే ప్రియా! నా అంతట నేనే మరణాన్ని ఆహ్వానించైనా నిను చేరుతాను అని ఆన చేసాను. కానీ, నా ఈ మరణం, నా గత జన్మలోని మిత్రునికి, ఈ జన్మలోని సహోదరునికి పునర్జన్మని ఇస్తూ, అన్నగా నా బాధ్యతను, ప్రియునిగా నా ప్రతిజ్ఞను రెండిటిని నెరవేరుస్తోంది. అని చెప్తూనే సంజయ్ వైపు తిరిగి,
 
" మిత్రమా! ఈ చరాచర సృష్టిని సృష్టించి, పాలించి, లయం చేయు , ఆ దేవాది దేవుని అనుజ్ఞ మేరకు, మీకిచ్చిన వాగ్దానం మేరకు, ఈ నిధిని మీకు అప్పగించు వరకు మాత్రమే నా పాత్రకి ప్రాణం ఉంది. ఈ జగన్నాటకంలో నా పాత్ర ముగియక తప్పదు. చివరిగా నాదొక విన్నపం. ఇచ్చిన మాటకోసం, గురు దక్షిణగా బొటనవేలు నరుక్కున్న ఏకలవ్యుని వారసులం! ఇచ్చిన మాట కోసం పుట్టుటలో ఆశ్చర్యం ఏమీ లేదు. నిజాయితీకి, స్వామిభక్తికి ప్రాణం పెట్టే మా ఆదిమవాసులు, ఆనాడు నరేంద్రునితో యుద్ధం జరిగినప్పుడు వారి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు.

ఈనాడు ధర్మానికి, దుష్ట ఆత్మకీ జరిగిన యుద్ధంలో ఎందరో అమాయకపు గిరిజనులు తమ ఆవాసాలను సైతం కోల్పోయారు. వారికి న్యాయం చేయండి మహారాజా!. మీ ప్రాణం కాపాడాను అనే అధికారంతో కాదు, అభం శుభం తెలియని ఆ అమాయకుల కోసం అడుగుతున్నాను. ఈ నిధి ఇంకా ప్రభుత్వం ఆధీనం చేసుకోక మునుపే, వారికి కొంత సాయం అందించండి. ఈ జన్మలో నేను మీకు అన్నగా పుట్టాను. ఆ బాధ్యత తోనే నేను మీ ప్రాణం కోసం నా ప్రాణాన్ని అడ్డుపెట్టాను. నేను చనిపోతున్నాను. అందుకు నాకు బాధగా లేదు. అమ్మ గురించే నా బాధ! అమ్మని మీరు బాగా చూసుకుంటారు. నాకంటే గొప్పగా చూసుకుంటారు. అమ్మా జాగ్రత్త!" అంటూ అజయ్, సంజయ్ ఒడిలోనే కన్నుమూసాడు.
 
 
అతని ఆత్మ పూర్తిగా కోయరాజు మార్తాండగా మారింది. మరియా కన్నీటి సంద్రం అయింది.
 
"మావా! నీ ఆన ఇలా నెరవేర్చుకున్నావా? దీనిని ఏమనాలి మావా? నీ త్యాగం అనాలా? బ్రహ్మ రాత అనాలా? నా ఆత్మ రూపం నీకు కనిపించిన రోజు, ప్రేమోన్మాదంతో నువ్వు చేసిన ఆన నేను మర్చిపోలేదు.
 
"ఈ హృదయంలో నీ ప్రేమే నిలిచి ఉంటుంది.
ఈ కన్నుల్లో నీ రూపం కదలాడుతూనే ఉంటుంది.
నన్ను నీలో, నిన్ను నాలో కలిపేది మరణమే అయితే,
నా పునర్జన్మకి కారణమైన నా వాగ్దానాన్ని నెరవేర్చిన మరు క్షణం, నా ఊపిరి నీ ఆత్మకు నేను ఇస్తున్న కానుక అవుతుంది. ఇది ఆ కొండదేవర పై ఆన!
నేను ప్రేమించే నీ పై ఆన! నా ప్రపంచమైన ఈ నల్లమల పై ఆన!" అంటూ నీ మరణం నా ప్రేమకు కానుక అవుతుందని ఆన చేసావు. ఆ ఆన ఈ రూపంలో నిలబెట్టుకున్నావా?" అంటూ మార్తాండ ఆత్మను గాఢంగా కౌగిలించుకుంది మరియా. ఆ ఇద్దరి పవిత్ర ఆత్మలకీ బోరున విలపిస్తూ చేతులు జోడించి దండం పెట్టాడు సంజయ్. ఆ పవిత్ర ఆత్మలు ఒకరినొకరు గట్టిగా హత్తుకుని, పరమాత్మలో లీనం అయిపోయాయి.
 
" అయ్యో మిత్రమా! నాకోసం, నీ ప్రాణాలు పణం పెట్టావు. అన్నగా, నీ బాధ్యతగా నన్ను కాపాడి, నువ్వు మృత్యువుకి బలి అయిపోయావు. నిన్ను కాపాడటానికి వచ్చిన నన్ను కాపాడడం కోసం, నువ్వు బలి అయిపోయావు. అమ్మకి నేను ఏమని చెప్పను?" అంటూ శోకసంద్రంలో మునిగిపోయాడు సంజయ్.
సశేషం
*ఈ భాగం చదివిన పాఠకమిత్రులు వారి అభిప్రాయాలను, రేటింగులు, లైకులు లేదా వ్యాఖ్యల ద్వార తెలియజేయమని మనవి
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply
If you could change the font colour, it will be easy to read. The green colour font is very bright and a little bit hard to read.

Its just a suggestion.
[+] 1 user Likes anaamika's post
Like Reply
నేను లాప్ టాప్ లోచదువుతాను, అప్డేట్ కూడా ఇక్కడనుండే

రంగులు నాకు బానే ఉన్నా మీ సూచన ప్రకారం మార్చాను.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
నేను లాప్ టాప్ లోచదువుతాను, అప్డేట్ కూడా ఇక్కడనుండే

రంగులు నాకు బానే ఉన్నా మీ సూచన ప్రకారం మార్చాను.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఇప్పుడు చాలా బావుంది. చదువుకోవడానికి వీలుగా వుంది.

సూచనకి స్పందించినందుకు ధన్యవాదాలు.
[+] 1 user Likes anaamika's post
Like Reply
meeru raasina kadhaa, kadhaa gamanam, chaalaa baagundhi K3vv3 gaaru. thank you so much
[+] 1 user Likes meeabhimaani's post
Like Reply
Thank you meeabhimaani garu
meccukunnaaru gaani rating, like ivvalEdu Blush
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
K3vv3 gaariki, other updates choosukuntoo, ratings ichi vasthunnappudu, chaalaa saarlu rating quotaa ayipothunnadhandi. gurthu chasinandhuku thanks andi. 3 ratings ichaanandee.
[+] 1 user Likes meeabhimaani's post
Like Reply
(31-10-2025, 07:53 PM)meeabhimaani Wrote: K3vv3 gaariki, other updates choosukuntoo, ratings ichi vasthunnappudu, chaalaa saarlu rating quotaa ayipothunnadhandi. gurthu chasinandhuku thanks andi. 3 ratings ichaanandee.

Thank you meeabhimaani garu
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
(30-10-2025, 09:13 AM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం
పార్ట్-37
నువ్వు బలి అయిపోయావు. అమ్మకి నేను ఏమని చెప్పను?" అంటూ శోకసంద్రంలో మునిగిపోయాడు సంజయ్.
సశేషం
*ఈ భాగం చదివిన పాఠకమిత్రులు వారి అభిప్రాయాలను, రేటింగులు, లైకులు లేదా వ్యాఖ్యల ద్వార తెలియజేయమని మనవి
What to say! Super update. Didn't like the ending to Ajay's character. Nice Story, K3vv3 and Ramya N garu.
thanks thanks thanks
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
నల్లమల నిధి రహస్యం
పార్ట్-38

నిర్జీవంగా పడి ఉన్న అజయ్ ని చూస్తూ, గుండెలవిసిపోయేలా రోదిస్తున్నాడు సంజయ్. తన అన్నగా మళ్ళీ పుట్టిన తన మిత్రుడ్ని గుండెలకు హత్తుకుని, "నిన్ను ఎలాగైనా కాపాడి తీరాలి అన్న కంగారులో నేను చేసిన తప్పుకి, నీ ప్రాణాలు పణంగా పెట్టావే! నిన్ను తీసుకు వస్తాను అని అమ్మకి చెప్పి ఇక్కడికి వచ్చిన నేను, ఇప్పుడు నీ శవాన్ని తీసుకు వెళ్ళాలా? అన్నయ్యా! అమ్మకి నేను ఏమని చెప్పాలిరా? ఎందుకు ఇంత త్యాగం చేసావురా?" అంటూ కన్నీటికే కన్నీరు పెట్టించేంతగా విలపిస్తున్నాడు సంజయ్. అప్పుడే అతని బుజం పై ఒక చేయ పడింది. అదిరిపడి పైకి చూసాడు సంజయ్. సంజయ్ నే చూస్తూ నిలబడ్డారు పూజారి గారు.
 
" పూజారిగారూ! చూడండి. మా అన్నయ్య.." అంటూ బోరుమని విలపించసాగాడు సంజయ్.
 
" ఏడవకు నాయనా! ఆ ఖడ్గమును సంపాదించాలి అని ఎంతో మంది ప్రయత్నం చేశారు. వారెవరు ప్రాణాలతో తిరిగి రాలేదు. మీరు కారణ జన్ములు కాబట్టే, బయటకు రాగలిగారు. ఈ జన్మలో నీకు అన్నగా పుట్టిన, నీ మిత్రుని మరణం బ్రహ్మ రాత నాయనా! ఇందులో నీ తప్పు ఏ మాత్రం లేదు" అంటున్న పూజారిగారి వైపు ఆశ్చర్యంగా చూస్తున్న సంజయ్ తో
 
" నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? మీరిరువురు లోపలికి వెళ్ళింది మొదలు, బయటకు వచ్చు వరకూ లోపల ఏమి జరిగింది అనేది నా దృష్టికి కనిపిస్తూనే ఉంది. అన్నను కాపాడుకోవాలని నువ్వు ఊబిలోకి దిగిపోవడం తెలుసు. మీ ఇద్దరూ అక్కడ నుండి బయటకు వస్తారు అని తెలుసు. ఇద్దరిలో ఒకరే మిగులుతారు అని కూడా తెలుసు. అసలు అక్కడే పోవాల్సిన నీ ప్రాణం, నిలబడింది. నిన్ను కాపాడి, మీ అన్నయ్య మృత్యువుకి బలి అయ్యాడు. కానీ ఇదే విధి! దీన్ని నువ్వు ఒప్పుకుని తీరాలి. నువ్వు ఇక్కడే ఎంత ఏడ్చినా, నీ అన్న తిరిగిరాడు. జరగవలసింది చూడు!" అంటూ సంజయ్ ను ఓదార్చసాగారు పూజారి గారు. ఆయన ఇంకా మాట్లాడుతూ
 
"సంజయ్! ఆ సింగా శవం కూడా కాలి బూడిద అయిపోయింది. జరిగిన దాన్ని ఋజువు చేసేందుకు మన దగ్గర ఏ విధమైన సాక్ష్యాలు లేవు. అలాగే నీ అన్న మరణానికి కూడా ఏ రకమైన సాక్ష్యాలు లేవు. సెక్యూరిటీ ఆఫీసర్లు అడవి అంతా జల్లెడ పడుతున్నారు. ఏ నిమిషం అయినా మా గూడేనికి రావచ్చు. అందుకే నేను అక్కడ జరిగినది సెక్యూరిటీ అధికారి లకు చెప్పవద్దు అని మా గూడెం వారికి చెప్పాను. అక్కడ అంత జరిగినట్లు ఆనవాళ్లు ఏమీ లేకుండా చేశాను. ఆ ఖడ్గం అమ్మవారి అనుగ్రహంగా మళ్ళీ దాని స్థానం లోకి వెళ్ళిపోయింది.
 
ఆ సింగా ని వెతుకుతున్న మీ అన్నయ్య ఇక్కడికి వచ్చినట్లు సెక్యూరిటీ అధికారి లకు చెప్పమన్నాను. వారు ఏ నిముషంలో అయినా ఇక్కడికి చేరవచ్చు. సింగా చనిపోలేదు. పారిపోయాడు. వాడిని వెతుకుతు ఇక్కడికి మీ అన్నయ్య వచ్చాడు. ఆ క్రమంలో ఈ నిధి మీ అన్నయ్యకు దొరికింది. ఇక మీ అన్నయ్య విష వాయువు వల్లే కదా చనిపోయాడు! అదే చెప్పు. ఇంత నాటకం ఎందుకు. నిజం చెప్పేయొచ్చు కదా అంటావా? నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. నీ అన్న మరణానికి నిన్నూ బలి చేస్తారు. అందుకే ఇలా చెప్పు" అంటూ తన ఉద్దేశం చెప్పారు పూజారి గారు.
 
అప్పుడు సంజయ్ కి తన అన్న మాట్లాడిన చివరి మాటలు గుర్తుకు వచ్చాయి.
 
వెంటనే ఆ నిధిని తెరిచి, అందులో విలువైన వజ్రాల మూటను పూజారి గారికి ఇచ్చి, "అయ్యా. ఇది మా అన్నయ్య చివరి కోరిక. ఆవాసాలను కోల్పోయిన నిరుపేద గిరిజనుల కోసం దీన్ని మీకు ఇస్తున్నాను. దీన్ని వారి అభివృద్ధి కోసం ఉపయోగించండి" అని చెప్పాడు.
 
" తప్పకుండా. అలాగే వారి కోసం ఉపయోగిస్తాను. అంటూ ఆ వజ్రాల మూటను తన దగ్గర భద్రపరుచుకుంటూ కన్నీరు తుడుచుకుంటూ, సంజయ్ ని ఓదార్చుతున్నారు పూజారి గారు.
 
***
 
"రిపోర్టర్ అనే వాడు ఎప్పుడూ మౌనంగా ఒకే చోట ఉండిపోకుడదు గంగా! ఏ విషయం అయినా ప్రపంచం ముందు నిలబెట్టే వృత్తి జర్నలిజం అంటే! అదే పనిని దైవం లాగా తీసుకుంటే ఎలా ఉంటుందో చూపించే వ్యక్తే ఈ రాంబాబు" అంటూ ఆ వర్షంలోనే రైన్ కోట్లు, గొడుగుల సాయంతో ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ, చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసారు కెమెరా పట్టుకుని గంగ, ఆవిడతో పాటు పీకే ఛానల్ ప్రతినిధి రాంబాబు. అలా నడుస్తూ, నడుస్తూ గూడెం దాకా వచ్చేసారు వాళ్లు. అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా అక్కడ గిరిజన గూడేనికి చేరుకున్నారు. వర్షం తగ్గడంతో సిగ్నల్ దొరికింది. ఇక లైవ్ స్టార్ట్ చేశారు పీకే ఛానల్ వారు.
 
" ఇన్స్పెక్టర్ అజయ్ కనిపించకుండా పోయి 24 గంటలు దాటి పోయినా, ఇంకా చిక్కని ఆచూకీ! నేరస్తుడు సింగా, అడవిలోనే ఉన్నట్టు సమాచారం అందుకున్న అజయ్, ఆ నేరస్థుడిని పట్టుకోవడానికి గాను అడవిలో, ఒంటరిగా రావడం జరిగింది. సెక్యూరిటీ ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన పై అధికారులు.. అజయ్, నేరస్తుడు సింగా లను పట్టుకునేందుకు అడవి మొత్తం జల్లెడ పడుతున్నా లభ్యం కానీ ఆచూకీ.. ఎన్నో నేరాలకు పాల్పడిన సింగా, తాజాగా ఫారెస్ట్ ఆఫీసర్స్ ని కూడా చంపినట్లు సెక్యూరిటీ ఆఫీసర్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు సేకరించడం జరిగింది. వర్షం కారణంగా గాలింపు చర్యలు వేగంగా చెప్పలేక పోవడం విచారకరం. ఐతే అక్కడ పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి రాంబాబు లైవ్ లో ఉన్నారు.

“చెప్పండి రాంబాబు, అక్కడ ఏమి జరుగుతోంది? " అంటూ అప్పటి వరకూ అనర్గళంగా మాట్లాడిన న్యూస్ రీడర్, మాటలు అందుకుంటూ. రాంబాబు మాట్లాడటం మొదలుపెట్టాడు.
 
" సంధ్యా! 24 గంటలు దాటుతున్నా ఇన్స్పెక్టర్ అజయ్, ఇంకా ఆ నేరస్తుడు సింగా ఆచూకీ లభ్యం కాలేదు. సెక్యూరిటీ అధికారి లు గాలింపు చర్యలు చేపడుతూ ఇక్కడ గూడెం ప్రజలను వారి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఆ దృశ్యాలు లైవ్ లో చూడండి" అంటూ అక్కడి ప్రజలకు అజయ్, సింగాల ఫొటోస్ చూపిస్తూ, వారి గురించి సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రశ్నించడం చూపిస్తున్నారు.
 
అది టీవీ లో చూస్తూ ఉన్న సీత ఊపిరి బిగపట్టి, వారి సమాధానం వినడం కోసం ఎదురుచూస్తోంది.

సెక్యూరిటీ అధికారి లు చూపించిన ఫోటోలు చూస్తూ,
"నాకు ఎరుక సార్! ఈ కూనడు ఇంకో మనిషిని తరుముకుంటూ నీలగిరి కొండగులవైపు పరుగెత్తక పోవడం మేము జూసినామ్ సారూ! ఆ తరువాత, అతని తమ్ముడు కూడా మా అయ్యోరుని ఎంటబెట్టుకుని, కొండల కానికి పోయిండు సారూ1 " అంటూ చెప్పాడు ఆ వ్యక్తి.

అంతే! ఆ వ్యక్తి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నీలగిరి కొండగుహలవైపు పరుగు అందుకున్నారు సెక్యూరిటీ అధికారి లు.

వారి వెనుకనే కెమెరా మాన్ గంగతో, రాంబాబు కూడా లైవ్ ఇస్తూ, సెక్యూరిటీ అధికారి లను వెంబడిస్తూ, వారి కర్తవ్యంగా ప్రపంచానికి అక్కడ విషయాలు తెలియజేస్తున్నారు. అది టీవీ లో చూస్తూ ఉన్న సీత గుండె వేగంగా కొట్టుకుంటోంది. తన కొడుకు దొరుకుతాడా? లేదా అనే టెన్షన్ తో ఆమె నిలువెల్లా వణికిపోతున్న చిగురుటాకుని తలపిస్తోంది.
 
***
 
సెక్యూరిటీ అధికారి వాళ్ళు, మీడియా వాళ్ళు అక్కడికి చేరే సరికి విగత జీవిగా పడి ఉన్న అజయ్, గూడెం వాళ్ళు చెప్పినట్టుగా అజయ్ కోసం పూజారి గారిని వెంటపెట్టుకుని వెళ్లిన అజయ్ తమ్ముడు సంజయ్ కనిపించారు. అజయ్ మరణించాడు అనే వార్త మీడియా ద్వారా ప్రపంచం అంతా తెలిసిపోయింది. అలాగే అక్కడ ఉన్న నిధి గురించి కూడా ప్రపంచానికి తెలిసింది. సింగా ఆ అడవిలో తప్పించుకు పోయాడు అని, అజయ్ ఆ నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఇక్కడికి వచ్చాడు, ఆ సమయంలో నిధిని కనుగొన్నాడు అని, అతన్ని వెతుకుతూ వచ్చిన అతని తమ్ముడు, పూజారిగారు ఇక్కడికి వచ్చేసరికే అజయ్ చనిపోయి ఉన్నాడు అని పూర్తి వివరాలు ఇంకా సేకరించవలసి ఉన్నాయని మీడియాకి చెప్పారు సెక్యూరిటీ అధికారి అధికారులు.

అందంతా టీవీ లో చూస్తున్న సీత అంతులేని గుండె మంటలను తన అశృ వర్షంతో ఇంకా ఇంకా మండిస్తూ, ‘పుత్ర శోకం మిగల్చకు దేముడా!’ అని మొరపెట్టుకుంటూ, ఊపిరి బిగపట్టి, టీవీనే చూస్తూ ఉన్న ఆమె కళ్ళు, దేన్ని అయితే చూడకూడదు అని ఇంతలా మొక్కిందో, అదే ఆమెకు కనిపించింది. ఏదైతే వినకూడదు అని ఇంత వేదన పడిందో, అదే ఆమె చెవులకు వినిపిస్తూ ఉంటే. ఆమె కన్నులు వాలిపోయాయి. గుండె ఆ భారం మోయలేక, బ్రద్దలైపోతొందా అన్నంతగా నొప్పి వచ్చి, అమాంతంగా కుప్పకూలిపోయింది.
 
కానీ అంజలి డాక్టర్ కావడంతో వెంటనే ఆమెకు ప్రాధమిక చికిత్స అందించింది. కమల భర్త అంబులెన్సుకు కాల్ చేయడంతో, వెంటనే ఆమెను హాస్పిటల్ కి తరలించారు.
 
***
 
ఆ కొండ గుహల నుంచి అజయ్ మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించారు. ఆ నిధిని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంది. అజయ్ మరణానికి చింతిస్తూ, అతని తల్లికి ప్రెసిడెంట్ మెడల్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

కానీ సీత పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అన్నయ్య చనిపోయాడు అన్న బాధ ఒక పక్క, తల్లికి ఏమవుతుందో అన్న బాధ ఒక పక్క. సంజయ్ జీవచ్చవంలా హాస్పిటల్ లో పడి కుమిలిపోయి ఏడుస్తుంటే, అతని పక్కనే, అతనికి అండగా అంజలి కూర్చుని ఉంది. చీకటైపోయిన అతని జీవితంలో వెలుగుని తెచ్చే ఉషోదయ కిరణంలా, అమావాస్య కటిక చీకట్లలో వెలుగును చిందించే చిరు దీపంలా, గాయపడిన హృదయానికి చేరికగా, విధి చిమ్మిన విషానికి విచ్చిన్నమైన తన కుటుంబ జ్యోతిని తిరిగి వెలిగించగలిగే ఆశాజ్యోతిలా.. ఆమె అతనికి అండగా నిలిచింది.
సశేషం

*ఈ భాగం చదివిన పాఠకమిత్రులు వారి అభిప్రాయాలను, రేటింగులు, లైకులు లేదా వ్యాఖ్యల ద్వార తెలియజేయమని మనవి
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 9 users Like k3vv3's post
Like Reply
37వ బాగాన్ని ఎమోషనల్ గాను, 38వ బాగాన్ని ముగింపును కాస్త బరువుగా ముగించారు. ఇటువంటి ముగింపు కథను పాఠకులకు చాలా కాలం గుర్తుండిపోయేలా చేస్తుంది. బావుందండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
(05-11-2025, 11:34 AM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం
పార్ట్-38
 విధి చిమ్మిన విషానికి విచ్చిన్నమైన తన కుటుంబ జ్యోతిని తిరిగి వెలిగించగలిగే ఆశాజ్యోతిలా.. ఆమె అతనికి అండగా నిలిచింది.
సశేషం

*ఈ భాగం చదివిన పాఠకమిత్రులు వారి అభిప్రాయాలను, రేటింగులు, లైకులు లేదా వ్యాఖ్యల ద్వార తెలియజేయమని మనవి
Very good Andi! K3vv3 garu/Ramya N garu!!!

thanks thanks thanks
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
నల్లమల నిధి రహస్యం
పార్ట్ – 39
 
హాస్పిటల్ లో వైద్యుల పర్యవేక్షణలో తల్లి కోసం ఎదురుచూస్తూ, చనిపోయిన తన అన్ననే తలుచుకుంటూ ఏడుస్తోన్న సంజయ్ కి తోడుగా ఉండి, ధైర్యం చెప్తోంది అంజలి. అదే హాస్పిటల్ లో అజయ్ మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. సంజయ్ గుండె పగిలేలా ఏడుస్తూనే ఉన్నాడు.
 
ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి, "షీ ఈజ్ అవుట్ అఫ్ డేంజర్! నథింగ్ టు వర్రీ. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల హార్ట్ ఎటాక్ లాగా వచ్చింది. బట్ నథింగ్ సీరియస్. కొన్ని మెడిసిన్స్ రాసి ఇస్తాను. అవి వాడండి. ఆమె ఇంకో గంటలో స్పృహలోకి వచ్చేస్తారు. డోంట్ వర్రీ!" అని చెప్పి, సీత విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్లారు.
 
తల్లిని దూరం నుండే చూసుకుంటూ, కన్నీరు మున్నీరు అవుతున్న సంజయ్ ని ఓదారుస్తూ, "ఆంటీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు జరగవలసింది చూడు" అని ధైర్యం చెప్పింది అంజలి. అజయ్ మరణానికి కారణం అతని ఊపిరితిత్తులలో చేరిన విష వాయువే అని రిపోర్ట్స్ వచ్చాయి. అతని భౌతిక దేహాన్ని ఇంటికి తరలించారు.
 
సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ వారు. అజయ్ మృతికి సంతాపం తెలియజేసారు. ఆ రోజంతా, అజయ్ ని చివరి చూపు చూసుకోవడం కోసం గాజు బాక్స్ లో పెట్టి ఉంచారు.
 
"తమ పిల్లల్ని ప్రాణాలకు తెగించి కాపాడి తెచ్చిన దేవుడే, ఇవాళ దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడే!"అంటూ అజయ్ కాపాడిన పిల్లల తల్లితండ్రులంతా, అజయ్ పార్ధివ దేహం దగ్గర కూలబడి ఏడుస్తున్నారు.
 
" మా పిల్లలను ఇక జన్మలో చూడలేము అనుకున్నాం. దేముడిలా వచ్చావయ్యా! దేవుడు పంపినట్టే వచ్చావు. ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోవాలి మేమంతా.." అంటూ ఆ పిల్లల తల్లులు, గుండెలవిసేలా ఏడుస్తున్నారు. అజయ్ స్నేహితులు, డిపార్ట్మెంట్ వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ వస్తున్నారు.
 
అజయ్ తో వారి బంధాన్ని గుర్తు చేసుకుంటూ, వారంతా కన్నీటి పర్యంతం అవుతుంటే, సంజయ్ మాత్రం ఏడ్చి, ఏడ్చి నీరు ఇంకిపోయిన సంద్రంలా, శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు.
 
***
 
సీతకి స్పృహ రాగానే, " నాన్నా.. అజయ్!" అంటూ లేవడానికి ప్రయత్నం చేసింది. అంజలి ఆమెను ఓదారుస్తూ, డాక్టర్స్, నర్స్ ల సాయంతో అంబులెన్సులో సీతను ఇంటికి తీసుకు వచ్చింది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకుని విగత జీవిగా చూసిన ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
 
" మల్లన్న స్వామీ! నా బిడ్డని కాపాడమని ఎన్ని మొక్కులు మొక్కాను నీకు? జీవితంలో ఏమి చూసాడు వాడు! కాటికి కాళ్ళు జాపుకుని కూర్చున్న నన్ను వదిలేసి, నా బిడ్డను తీసుకెళ్లిపోయావే!
 
నీకూ ఒక తల్లి ఉండి ఉంటే తెలిసేది ఈ తల్లి బాధ! నీకు ప్రాణాలే కావాలంటే నా బిడ్డ ప్రాణానికి బదులు నా ప్రాణం తీసుకోవచ్చు కదా! అయ్యో.." అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆ తల్లిని ఓదార్చడానికి అంజలి, అంజలి తల్లీ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు.
 
ఆమె ఈ పరిస్థితుల్లో అంతగా స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు అని, అంజలి ఆమెకు సడేషన్ ఇంజక్ట్ చేసింది. ఆమెను గదిలో పడుకోబెట్టి, సంజయ్ దగ్గరే కూర్చుంది అంజలి. కమల, కమల భర్త కూడా సంజయ్ కి ధైర్యం చెప్తూ, రేపు జరగవలసిన కార్యములకు ఏర్పాట్లు చేస్తూ, వచ్చిన వారందరికీ కావాల్సినవి అమరుస్తూ ఉన్నారు.
అజయ్ మరణం గురించి మీడియా ద్వారా ప్రపంచమంతా తెలిసింది. అజయ్ చూపించిన ధైర్య సాహసలకు, ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ అందించనున్నట్లు సమాచారం, అందరికీ తెలిసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరిన నిధిని గురించిన వార్తలు కూడా మీడియాలో రావడం జరుగుతోంది.
 
***
 
జరిగినది అంతా తన తపోబలంతో తెలుసుకున్న సిద్ధాంతి గారు కూడా " తమ్ముడి కోసం ప్రాణ త్యాగం చేశాడా ఆ అన్నయ్య! అమ్మా, జగన్మాతా! ఏమి నీ లీలా? " అంటూ అజయ్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థన చేస్తూ ఉండిపోయారు.
 
***
 
మరునాడు ఉదయం, అజయ్ అంతిమ యాత్ర మొదలైంది. అతని డిపార్ట్మెంట్ వాళ్ళు, స్నేహితులతో పాటు, అజయ్ వల్ల మేలు పొందిన ప్రజలంతా, ఆ యాత్రలో పాల్గొన్నారు. సెక్యూరిటీ అధికారి లాంచనాలతో అజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అతని మరణానికి సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వ పెద్దలు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
ఎన్నో దారుణాలను, సంబరాలను, వికృతాలను, విపరీతాలను ప్రతి నిత్యం చూస్తూ ఉన్న సూర్యనారాయణ మూర్తి, ఇవాళ జరిగింది కూడా చూస్తూనే, చూడటమే తన పని అంటూ, సాక్ష్యం చెప్పని ప్రత్యక్షసాక్షిలా, తానొక కర్మ సాక్షిని మాత్రమే అన్నట్టు భారంగా అస్తమించాడు.
 
ఆ అస్తమిస్తున్న సూర్యునిలాగే తన బిడ్డ కూడా అస్తమించి తనని శోక సంద్రపు సుడిలో, నావలా వదిలేసి వెళ్ళిపోయాడు అంటూ, సీత కన్నీరు మున్నీరు అవుతోంది.
 
"ఈ చరాచర సృష్టిలో పుట్టడం సహజం, గిట్టడం సహజం, అనివార్యం.
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।।
పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి పుట్టుట తప్పదు. అనివార్యమగు ఈ విషయం కొరకు చింతించుట తగదు. చావు, పుట్టుకల అంతులేని, అలుపెరగని కాల చక్రపు ఇరుసులలో పడి నలిగిపోయే ఓ జీవీ! మరణం అనేది అనివార్యం అని గుర్తెరిగి మసలుకో. నువ్వు పుట్టినప్పుడే, నీ మరణం కూడా లిఖింపబడి ఉంటుంది. ఏనాడు అయినా అది నిన్ను వరింపక మానదు. అని గుర్తెరిగి మసలుకో. మరణించినంత మాత్రాన్న ఆ ఆత్మ నశించి పోయింది అని కాదు. మరణం అనేది శరీరానికే కానీ ఆత్మకు కాదు. మరణించిన వ్యక్తి శరీరం నుండి వేరైనా, ఆత్మ వేరొక కొత్త జన్మ ఎత్తి తీరుతుంది. ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరు చేస్తుందే కానీ ఆత్మను చంపదు"
 
అంటూ గీతా సారాంశం చదివి వినిపిస్తూ, సీతకి, సంజయ్ కి ధైర్యం చెప్పడం కోసం తన ప్రయత్నం తాను చేస్తూ ఉంది అంజలి. అది అంజలి తల్లికి ఏ మాత్రం అభ్యంతరం లేదు. అప్పటికే ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది.
ఇక ఏమి జరిగినా, తన కూతురి జీవితం సంజయ్ తోనే అని ఆమెకి అర్ధం అయిపోయింది కాబట్టి.
సశేషం
*ఈ భాగం చదివిన పాఠకమిత్రులు వారి అభిప్రాయాలను, రేటింగులు, లైకులు లేదా వ్యాఖ్యల ద్వార తెలియజేయమని మనవి
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
కథను అంజలి సంజయ్ ని చూస్కుంటూ వుండడంతో ఆపేసుంటే బావుండేదని నా వ్యక్తిగత అభిప్రాయం, మరి రచయిత్రి గారి మనసులో ఏముందో....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
(11-11-2025, 09:15 AM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం
పార్ట్ – 39
తన కూతురి జీవితం సంజయ్ తోనే అని ఆమెకి అర్ధం అయిపోయింది కాబట్టి.
సశేషం
*ఈ భాగం చదివిన పాఠకమిత్రులు వారి అభిప్రాయాలను, రేటింగులు, లైకులు లేదా వ్యాఖ్యల ద్వార తెలియజేయమని మనవి
Nice!!!
Like Reply
నల్లమల నిధి రహస్యం
పార్ట్ - 40 
సంజయ్ తన అన్ననే తల్చుకుంటూ, శున్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. అతనికి కాఫీ అందిస్తూ, "ఇంకా మనకి ఈ ఊరిలో ఏమి పని? మళ్ళీ మనము వైజాగ్ వెళ్ళిపోదాం. నువ్వు కూడా కాలేజీకి వెళ్లివస్తుంటే కాస్త దృష్టి మారుతుంది. ఆంటీని అమ్మ చూసుకుంటుంది. కార్యక్రమాలు అన్నీ అయిపోయాయిగా సంజయ్" అంటూ అంజలి, వైజాగ్ తిరిగి వెళ్లిపోవడం గురించి మాట్లాడుతూ ఉండగా
 
ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ " ఇక మీదట ఇదే నా ఊరు. నా అన్న ఊపిరి తనలో కలిపేసుకున్న ఈ ఆడవే ఇక మీదట నా ప్రపంచం. మా అన్నయ్య శ్వాస ఆగిపోయిన ఆ ఆడవే ఇకపై నా ఆవాసం, నా జీవితం, నా సర్వస్వం" అంటూ సూటిగా చెప్పాడు సంజయ్. ఆ మాటలు విన్న సీత స్థాణువులా ఉండిపోయింది. అంజలికి సంజయ్ మనసు అర్ధం అయింది.
 
కానీ అంజలి తల్లి సంజయ్ మాటకు అడ్డు వస్తూ, " ఏం మాట్లాడుతున్నావు బాబూ! ఇక్కడ ఎలా ఉంటావు? నీకు బోలెడంత మంచి భవిష్యత్తు ఉంది. ఇక్కడ ఈ అడవిలో నువ్వు ఏమి చేస్తావు? " అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే
 
సంజయ్ లేచి నుంచుని, చేతులు జోడించి," ఆంటీ! మా అన్నయ్య నాతో భౌతికంగా లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఉంటే, ఇంకా వాడు నాతో ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. మా అన్నయ్య జ్ఞాపకాలు నన్ను కాల్చేస్తున్నాయి. నేను మా అన్నయ్య ఉనికిని తనలో కలిపేసుకున్న ఈ నల్లమలలోనే బ్రతకాలి అనుకుంటున్నాను.
 
ఇక్కడే ఉంటూ, వెనుకబడి బ్రతుకుతున్న అదివాసుల పిల్లలకు ఉచితంగా చదువు చెప్తూ, వారి యోగక్షేమాలు చూస్తూ నా జీవితాన్ని వారి అభివృద్ధి కోసం ధారపోయాలి అనుకుంటున్నాను. నాకు ఈ అడవిలో ఉంటే, మా అన్నయ్య నాతో ఉన్నట్టు ఉంటుంది. ఇందులో మార్పు లేదు. రాదు" అంటూ సూటిగా, స్పష్టంగా చెప్పేసాడు. అంజలి ఏమీ మాట్లాడకుండా, సంజయ్ నే చూస్తూ ఉండిపోయింది.
 
సీతకి సంజయ్ మాటల్లో, అతనికి తన అన్న మీద ఉన్న ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఆ తల్లి మనసు ఇంకేమీ మాట్లాడలేక గొంతు పూడుకుపోయి, కన్నుల వెంబడి కారుతున్న కన్నీరు తుడుచుకుంటూ, తన అంగీకారం మౌనంగానే తెలిపింది. కొంత సేపు మౌనం రాజ్యం ఏలిన ఆ ఇంట్లో
 
" నేను నీతోటే, నీ వెంటే ఉంటాను." అన్న అంజలి మాటతో ఆ మౌనం మాటల రూపం దాల్చింది.
 
గాడాంధకారంలో నిండిపోయిన అమావాస్య నిశీధి నింగిలోని చీకట్లను చీల్చుకుంటూ, వెలుగును చిందిస్తూ, ఉదయిస్తున్న సూర్యుని కిరణంలా ఆమె మాట్లాడిన ఆ ఒక్క మాట, సీత గుండెల్లో రేగుతున్న ఆవేదన మంటల అగ్నికీలలపై మంచు కురిసినంత చల్లదనాన్ని ఇస్తే, సంజయ్ మాత్రం, తన జీవితం ఇక ఆ అడవిలోనే అని, నాకోసం, నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు అని స్పష్టంగా చెప్పి, ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు.
 
అంజలి మాత్రం " నేనూ నా నిర్ణయాన్ని మార్చుకోను. నేను సంజయ్ తోనే బ్రతుకుతాను. సంజయ్ లేకపోతే చచ్చిపోతాను. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే నేనూ ఉంటాను. ఆయన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. కాదు, కూడదు అని నువ్వు అంటే మాత్రం, నాన్న లేకుండా బ్రతుకుతున్నావ్ కదా! నేను కూడా చచ్చిపోయాను అనుకుని బ్రతుకు" అంటూ నిష్ఠురంగా మాట్లాడి, గది లోకి వెళ్లిపోయింది. అంజలి మాట్లాడిన మాటలు ఆమె తల్లి గుండెల్ని బాణాల్లా చీల్చేశాయి.సీత ఆమెను ఓదార్చబోతే, " చూసావా సీతమ్మా! నా కూతురు ఎంత మాట ఆందో.. అది మీ సంజయ్ ని ఇష్టపడుతోంది అని నాకు ఎప్పుడో తెలుసు. కానీ అది దానంతట అదే చెప్పాలి అనుకుంటూ ఎదురుచూశాను. సంజయ్ కి నా కూతుర్ని ఇవ్వడం నాకూ ఇష్టమేనమ్మా! కానీ, చూస్తూ, చూస్తూ, అడవుల్లో బతుకుతాను అంటున్నవాడికి నా కూతుర్ని ఎలా ఇవ్వగలను చెప్పమ్మా? " అంటూ ఏడుస్తుంటే,
 
ఆ మాటలు విన్న అంజలి బయటకు వచ్చి, "అమ్మా. సారీ అమ్మా!
 
నేను అలా మాట్లాడి ఉండకూడదు. కానీ నేను సంజయ్ లేకపొతే బ్రతకలేను అమ్మా! దయచేసి అర్ధం చేసుకో. నేనూ సంజయ్ ని పెళ్లి చేసుకుని, ఆయనతో పాటు ఆ అడవిలో ఉంటాను. ఆయన ఆ గిరిజన పిల్లలకు చదువు చెప్తే, నేనూ వైద్యురాలిగా, వారికి వైద్యం చేస్తూ, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాను. నిజానికి నాకూ అందులోనే సంతోషం ఉంది" అంటూ తల్లిని ఒప్పించింది అంజలి.
 
****
 
ఇంట్లో నుంచి నడుచుకుంటూ వచ్చిన సంజయ్
నేరుగా ఆ గిరిజన గూడేనికి చేరుకున్నాడు. పూజారి గారిని కలుసుకుని, తన సంకల్పం గురించి చెప్పాడు. ఆయన ఎంతగానో సంతోషిస్తూ, సంజయ్ ఇచ్చిన వజ్రాలు అమ్మగా వచ్చిన డబ్బులతో, అక్కడి ప్రజలకు ఇళ్ళు కట్టిస్తున్నట్టు తెలిపారు. అక్కడి ప్రజలంతా కూడా, తమకు సాయం అందించినది సంజయ్ అని తెలుసుకుని అతన్ని ఎంతగానో అభినందిస్తూ, వారి అభిమానం చాటుకున్నారు. ‘ఇక మీదట నేనూ మీతోనే ఉంటాను’ అని సంజయ్ అన్న మాటకి వారంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు.
 
సంజయ్ వారందరితోను మాట్లాడుతూ, వారి జీవన విధానం గురించి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాడు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా, కొంత మంది ఆ అడవిలోకి వస్తున్నారు. వారిని చూస్తూనే, సంజయ్ మొహంలో రంగులు మారిపోతున్నాయి. సంతోషం, దుఃఖం కలగలిపిన వింత భావమేదో తన హృదయాన్ని మెలిపెడుతుంటే, ఆ వస్తున్న వారినే చూస్తూ ఒక ప్రశ్నలా నిలబడి చూస్తున్నాడు సంజయ్.
 
***
 
గుండె పగిలే బాధ అనుభవించిన మనిషికి జీవితంలో ఆశలు చెదిరిపోయిన క్షణంలో పుట్టిన ఆశయం, ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందిస్తుంది. నిప్పుల కొలిమిలో కాలిన తరువాతే బంగారమైనా మెరుస్తుంది. ఉలి దెబ్బలు తిన్నాకే రాయి గుడిలో దేవుని ఆకృతి సంతరించుకుంటుంది. నమ్మి కొలిచే భక్తులకు అండై నిలుస్తుంది. విధి చేసే గాయాలకు జీవితం ఛిద్రమైన ఒక వ్యక్తి '’తను పడ్డ కష్టం పగవాడికి కూడా రాకూడదు’ అనుకుంటే 'మనిషి' అవుతాడు. 'తను పడిన కష్టం ఏమిటో ఎదుటివాడికి కూడా తెలియాలి' అనుకుంటే రాక్షసుడవుతాడు. ఏదైనా ఆ వ్యక్తి, వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది.
 
ఒక్కోసారి మనిషి జీవితంలో, తన గమ్యాన్ని మలుపు తిప్పే పరిస్థితి ఎదురవుతుంది. ఆ పరిస్థితుల్లో ఆ మనిషి తీసుకునే నిర్ణయం అతన్ని ముందుకు నడిపిస్తుంది. అది మంచి దారిలో నైనా కావచ్చు, చెడు దారిలో నైనా కావచ్చు.
ఇప్పుడు సంజయ్ తీసుకున్న నిర్ణయం కూడా అతని జీవితాన్ని ఏవిధంగా మార్చనుందో!
సశేషం

*ఈ భాగం చదివిన పాఠకమిత్రులు వారి అభిప్రాయాలను, రేటింగులు, లైకులు లేదా వ్యాఖ్యల ద్వార తెలియజేయమని మనవి
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
(17-11-2025, 04:34 PM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం
పార్ట్ - 40 
సంజయ్ తీసుకున్న నిర్ణయం కూడా అతని జీవితాన్ని ఏవిధంగా మార్చనుందో!
సశేషం

*ఈ భాగం చదివిన పాఠకమిత్రులు వారి అభిప్రాయాలను, రేటింగులు, లైకులు లేదా వ్యాఖ్యల ద్వార తెలియజేయమని మనవి
Very good update, K3vv3 and Ramya N garu.
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply




Users browsing this thread: