Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నల్లమల నిధి రహస్యం-5
#1
నల్లమల నిధి రహస్యం పార్ట్ -1
రచన: రమ్య నముడూరి

[Image: image-2024-12-17-133216352.png]

1980  సంవత్సరం.. బలభద్రపురం...  కైలాస భూమి

మకర సంక్రాంతి నుండి, మీ(మన)కోసం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Waiting sir
[+] 1 user Likes sri7869's post
Like Reply
#3
మిత్రమా మకర సంక్రాంతికి ఇంకా చాలా దూరముంది, ఈ లోగా కాస్త ఉపోధ్ఘాతం, పరిచయాలు లాంటివి ఏమన్నా Big Grin Tongue ...  
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#4
అడిగారు కాబట్టి

ఓ చిన్న ఉపోద్ఘాతం Shy



1980 వ సంవత్సరం..బలభద్రపురం...కైలాస భూమి...
 
రాత్రి ఒంటిగంట ఇరవై నిముషాలు...కటిక అమావాస్య...వీధి దీపాలు వెలుగుతూ..ఉన్నాయి..!గాలి వేగం పెరిగిపోతోంది...!
 
---
 
నల్లమల అడవి...అదేరోజు....రాత్రి రెండుగంటల, పదకొండు నిముషాలు... నీలగిరి కొండగుహల లోపల... " తవ్వండ్రా .. తొందరగా తవ్వండి ... సాములోరు చెప్పిండు
 
---
రెండు అడుగులు ముందుకు వేసాడో లేదో...! " ఊహఫీ.. ఊహఫీ... కిర.. కిర... కిర... మరియా... ఉగిచా.. గోరి... గోరి... గోరి... " అంటూ ఏదో వింత భాషలో.. వికృతమైన గొంతుతో... ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది... 
 
---
 
తమ్ముని వంటిపై ఉన్నరక్ష ఆ నీచుడ్ని మీ తమ్ముడిని తాకనివ్వక పోవడంతో, వేరొక వాహకాన్ని ఎంచుకున్నాడు
 
---
 
ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి, "షీ ఈజ్ అవుట్ అఫ్ డేంజర్! నథింగ్ టు వర్రీ. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల హార్ట్ ఎటాక్ లాగా వచ్చింది. బట్ నథింగ్ సీరియస్.
 
---
 
విధి ముందు ప్రేమ ఓడిపోయినట్టు కనిపిస్తూ ఉన్నా, మరణమే లేని ప్రేమను ఓడించేందుకు విధి చేసే ప్రయత్నం ఎప్పుడూ విఫలమే.

మరణమనేది లేని దానికి ఓటమా? అది అసాధ్యం!

 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#5
ధన్యవాదాలు బ్రో, అడగ్గానే అందించినందుకు. ఇటువంటి కథను పూర్తిగా ఒకేసారి చదివితే వుండే మజానే వేరు, వాయిదా పద్దతిలో కొద్దిగా కష్టమే. పర్లేదు లెండి, సంక్రాంతి వరకు ఎదురు చూస్తాము.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#6
Nice Intro
[+] 1 user Likes sri7869's post
Like Reply
#7
నల్లమల నిధి రహస్యం -1
[Image: image-2025-01-14-084913819.png]
రచన[font=var(--ricos-font-family,unset)]:[/font]రమ్య నముడూరి
1980 వ సంవత్సరం.. బలభద్రపురం... కైలాస భూమి...
రాత్రి ఒంటిగంట ఇరవై నిముషాలు... కటిక అమావాస్య... వీధి దీపాలు వెలుగుతూ.. ఉన్నాయి..! గాలి వేగం పెరిగిపోతోంది...! జీవం లేకుండా పడిఉన్న ఎండుటాకులు... ఆ గాలి వేగానికి పైకి లేచి... ఆ గాలిలో గిర గిరా తిరుగుతున్నాయి..! దూరంగా ఎక్కడో... నక్కల ఆరుపులు వినిపిస్తున్నాయి..! ఆ గాలి వేగానికి, చెట్లు, జడలు విప్పుకున్న పిశాచిలాగా.. ఊగిపోతున్నాయి... ఆరోజే చనిపోయిన ఒక అనాధ శవం దహనం చేసిన ప్రదేశం నుండి వస్తోన్న పొగ... ఒక వింత ఆకారం గా మారి.. గాలి వేగానికి అనుగుణంగా కదులుతూ... వింత శబ్దం చేస్తోంది..! ఆ శబ్దం ఏమిటా అని బయటకు వచ్చి చూసిన, కాటికాపరి గుండె జారిపోయింది..! అంతలోనే తేరుకొని... " ఏమీ కాదు...ఏమీ కాదు..!" అనుకుంటూ తనకి తానే ధైర్యం చెప్పుకుని.. అక్కడనుండి కొద్దిగా దూరం జరిగి.. చుట్ట కాల్చడం మొదలు పెట్టాడు..! ఇంతలో.. అతని వెనకనుండి ఒక ఆకారం వేగంగా వెళ్ళిపోయింది..! ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగిచూస్తే... అక్కడ ఏమీ లేదు..! సరే అని రెండు అడుగులు ముందుకు వేసాడో.. లేదో... మళ్ళీ అదే అనుభవం..! ఈసారి ఏదో వింత భాషలో మాట్లాడుతూ... వెనకనుండి...తనకు దగ్గరగా వచ్చినట్టే వచ్చి, వెనక్కి తిరిగేసరికి కనిపించకుండా మాయం అయిపోయింది ..! అదంతా చూస్తోన్న కాటికాపరికి గుండె వేగం పెరిగిపోతోంది..! కానీ పైకి ధైర్యం నటిస్తూ..! " వామ్మో..! ఎవరో నా ఎనకమాట్లే.. తిరుగుతున్నట్టుండాది..! ఏందిది... అ.. ఎవురది..? దమ్ముంటే ముందుకురా..! ఇలా ఎనకమాట్లే తిరుగుతా... భయపెట్టాలని సూడమాకా..! నాకసలే మా చెడ్డ కోపం..! ఈ రంగడంటే.. ఏతనుకున్నావో.. ఏమో..!" అంటూ మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ... చుట్టూ చూస్తూ ఉండగా..! ఒక వింత ఆకరం..! అతని వెనకనే నిలబడి.... " అసైయే ఇసునకీర్ కిర కిర మరియ కిలిగిచు గోరి... గోరి... గోరి.. " అంటూ... ఏదో వింత భాష మాట్లాడుతూ.. వికృతంగా నవ్వుతోంది..! ఆ మాటలు, నవ్వులు వినిపించే సరికి రంగా.. భయం భయంగా.. వెనక్కి తిరిగి చూస్తూ.. ఉండగానే...! ఆ ఆకారం ఇంకా వికృతంగా నవ్వుతూ... కాటికాపరి రంగా మెడను విరిచేసింది..! *****
నల్లమల అడవి... అదేరోజు.... రాత్రి రెండుగంటల, పదకొండు నిముషాలు... నీలగిరి కొండగుహల లోపల... " తవ్వండ్రా .. తొందరగా తవ్వండి ... సాములోరు చెప్పిండు.. అంజనం వేసి మరీ చెప్పిండు... ఈడనే.. గా మారాజు బోలెడంత బంగారం, వజ్రాలు దాచుంచినాడంట..! ఇయాల అయి మనము ఎట్టాగైన... సంపాదించాలి..! బేగా తవ్వు రా...!" పనివాడి మీద అరుస్తున్నాడు బసవయ్య...!
"అయ్యగారు..! ఈడ ఏమీ లేదు...! సానా లోతు తవ్వేసాం..! " అన్నారు ఆ పనివాళ్ళు "ఏందిరా..! తవ్వింది..! ఇంకా తవ్వండి, ఆ సామూలోరు సామాన్యుడు కాడు..! అయన సెప్పిండు అంటే..! ఈడ కచ్చితంగా... ఆ రాజు దాచిన నిధి ఉండే ఉంటాది...! చెప్పింది చేయండి..! ఇంకా లోతుకి తవ్వండి..!" అంటూ గర్జించాడు బసవయ్య..!
వాళ్ళు మళ్ళీ తవ్వడం మొదలు పెట్టారు...! అలా ఇంకో అరగంట సేపు తవ్విన తరువాత... టంగ్ మని శబ్దం వచ్చింది..! అంతే..! బసవయ్య ఎగిరి గంతేసాడు..!
"దొరికింది....! కాకతీయ సామ్రాజ్యపు ఆఖరి మహారాజు ప్రతాపరుద్రుడు ...బలభద్రపురం సామంత కోయరాజు మార్తాండ చేత దాచి పెట్టించిన సంపద దొరికింది...! నేను చేసిన పూజలు, ఇచ్చిన బలులు... ఫలించినాయి...!" అంటూ... సంతోషపడిపోతున్నాడు..!
ఆ పనివాళ్ళు...అక్కడ పూర్తిగా మట్టిని వేరు చేసి చూస్తే..! అక్కడ ఒక పెట్టి కనిపించింది..! "దాన్ని పైకి తీయండ్రా..! " అంటూ సంతోషంతో అరిచాడు బసవయ్య..! వాళ్ళు ఆ పెట్టెను పైకి తీసే ప్రయత్నం చేస్తున్నారు...! ఇంతలో... అక్కడ వాతావరణం అంతా మారిపోయింది...! గాలి వేగం పెరిగిపోయింది... చెట్లు పూనకమ్ వచ్చినట్టు ఊగిపోతున్నాయి..! వాతావరణంలో వచ్చిన మార్పుకి బసవయ్యతో సహా... అక్కడ పని వారికి కూడా భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి..!
"ఒరేయ్..! తొందరగా తీయండ్రా..! వర్షం వచ్చేసేటట్టు ఉంది..! " అంటూ వారిని తొందరపెట్టాడు బసవయ్య..! వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా... ఆ పెట్టెను పైకి తీయలేకపోతున్నారు..! ఆ పనివాళ్ళు అప్రయత్నం గా పైకి చూసేసరికి... ఒక వికృతమైన ఆకారం... బసవయ్య వెనకనే నించుని ఉంది..!
వాళ్ళు.. " అయగోరు...! మీ ఎనకాతలా....!" అంటూ చెప్పబోయి...! గుండె ఆగిపోయి.. అక్కడే పడి చచ్చిపోయారు..! అది పైనుండి చూసిన బసవయ్య...! భయం.. భయం గా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఏమీ లేదు..! రెండు అడుగులు ముందుకు వేసాడో లేదో...! " ఊహఫీ.. ఊహఫీ... కిర.. కిర... కిర... మరియా... ఉగిచా.. గోరి... గోరి... గోరి... " అంటూ ఏదో వింత భాషలో.. వికృతమైన గొంతుతో... ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది... వెనక్కి తిరిగి చూసేసరికి... అక్కడ ఉన్న వికృతమైన ఆకారాన్ని చూసేసరికి... బసవయ్య కొయ్యబారిపోయాడు..! ఆ ఆకారం ఒక్కసారిగా బసవయ్య మీదకి దూకి... బసవయ్య గుండెను పెకలించేసి.. "ఉఫియే... గోరి.. కిరాచియా... ..థు...బసవయ్యా..! అమ్మా... ఇష్టకామేశ్వరి... మరియా... ఆన...! ఈ.. మరియా... ఆన... అమ్మా...!" అంటూ.. కోయ భాషలో ఏవో అంటూ... ఆ నల్లమలలో కొలువై ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడివైపు వెళ్లిపోతు... ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది..! ఆ బసవయ్య మనుషులు తవ్విన గుంత లోనే ఆ బసవయ్య శరీరం ఎగిరి వెళ్లి పడింది..! ఆ గుంత మొత్తం మట్టితో పూడుకు పోయింది...! ఆ ఆకారం ఇప్పుడు ఒక అందమైన పదహారెళ్ల అమ్మాయి ఆకృతి దాల్చింది...! ఆ అమావాస్య చీకటిలో... చందమామలా వెలిగిపోతున్న ఆ అమ్మాయి ఆత్మ.. అక్కడనుండి దూరంగా వెళ్ళిపోతోంది..!
సశేషం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#8
థ్యాంక్స్ మిత్రమా అన్నట్లే మొదలెట్టినందుకు. మీకు నా సంక్రాంతి శుభాకాంక్షలు.



ఈ కథను మెయిన్ కేటగిరిలోనే పెట్టండి...రెస్పాన్సెస్ బావుంటాది.
కథ విషయానికి వస్తే..కిరి...కిరి...కిర్రాకు గా వుంది.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#9
ధన్యవాదములు ఉదయ్ గారు, మీకు కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు

మెయిన్ కేటగిరీలో మార్చడం సరిత్ గారి చేతిలో ఉంది.

నేను ఏమీ చేయలేను
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#10
సరిత్ భయ్యా ఆ ఫోరం మార్చేదేదో చేయండి ప్లీజ్. non-erotic నుంచి general main కేటగిరికి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
#11
నల్లమల నిధి రహస్యం -2
2012 వ సంవత్సరం,
విశాఖపట్నం
ఉదయం 7 గంటల.... ఎన్నో నిముషాలు....
మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని, ఇంటికి వచ్చాడు సంజయ్...
" వచ్చావా... వెళ్లి స్నానం చేసి రా... టిఫిన్ చేసి కాలేజీకి వెళ్దువుగాని...." అంటూ కొడుకు తలపై ప్రేమగా చేయి వేసి నిమురుతూ చెప్పింది సీత...
"ఓకే... మామ్... 10 మినిట్స్... న్యూస్ చూసి వెళ్తా...." అంటూ న్యూస్ ఛానల్ పెట్టాడు సంజయ్...
" నల్లమల అడవుల్లో... గుప్తనిధుల కోసం కేటుగాళ్ళ వల... అటవీ ప్రాంతాన్ని... టూరిస్ట్ ప్లేస్ గా మారుస్తున్నట్టుగా హై డ్రామా... 14 వ శతాబ్దానికి చెందిన కాకతీయుల ఆఖరి మహారాజు ప్రతాపరుద్రుని కోట పై కేటు గాళ్ళ కన్ను...
"ఈ సమాచారం పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు...
“చెప్పండి రాంబాబు.... నల్లమలలో ఏమి జరుగుతోంది..?"
" వనజ... ప్రస్తుతం మనము నల్లమల అడవి లో ఉన్నాము...
నల్లమల అడవి అంటేనే నిధులు, నిక్షేపాలకు నిలయం. అలాంటి అడవిని టార్గెట్ చేశారు కొందరు వ్యక్తులు. టూరిజం పేరుతో గుప్తనిధుల వేట సాగిస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్‌లో గుప్తనిధుల వేటను సాగిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే..
దక్షిణ తెలంగాణా లోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్నూరు గ్రామ సమీపంలోని... నల్లమల అడవిలో కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన కోట ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతం వెంబడి నల్లమల అడవిలో దాదాపు 300 కిలోమీటర్ల పొడవున ప్రతాపరుద్రుని కోట ఉంది. ఇది దాదాపు14 వ శతాబ్దానికి చెందిన పురాతనమైన కట్టడం.
రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ కోటలోకి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా అధికారులు రోడ్డు మార్గం కూడా నిర్మించారు. అంతేకాదు.. టూరిజం పేరుతో స్థానిక అధికారులు కోట మరమ్మతులకు చర్యలు చేపట్టారు. అయితే, ఈ టూరిజం అభివృద్ధి ముసుగులో పలువురు అధికారులు గుప్తనిధుల తవ్వకాలకు తెరలేపారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
వాస్తవానికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోకి అడుగు పెట్టాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. అయితే, అంత ఈజీగా అటవీశాఖ అనుమతులు లంభించవు. మేతకోసం పశువులను అడవిలోకి తీసుకెళ్తేనే రైతులపై అటవీశాఖ అధికారులు కేసులు పెడతారు. స్థానికులు వంట చేయడానికి కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్లినా వదిలిపెట్టకుండా భారీ జరిమానాలు విధిస్తుంటారు. కానీ, సామాన్యుల పట్ల ఇంత కఠినంగా వ్యవహరించే అధికారులు.. అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడుతున్న వారిపట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక కొందరు ప్రజా ప్రతినిధుల అండదండలతో అటవీశాఖ అధికారులు ప్రతాపరుద్రుని కోటపై ఉన్న గుప్తనిధులను స్వాహా చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధి ముసుగులో అధికారులే.. గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారని స్థానిక ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. టూరిజం అభివృద్ధి పనులు చేస్తున్నారా? లేక నిధులు, నిక్షేపాలను వెలికి తీసే పనిలో పడ్డారా? అనే సందేహాలను స్థానిక గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తిస్థాయి విచారణ జరిపించాలని నల్లమల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరికొన్ని వివరాలు ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం..." అంటూ...అప్పటివరకు అనర్గళంగా మాట్లాడిన టీవీ రిపోర్టర్.... ఒక స్థానికుడితో అక్కడి పరిస్థితి గురించి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు...
" చెప్పండి సార్... ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడం మీరు ఎప్పుడైనా చూసారా? "
" అవునండి... ఇక్కడ ఉన్న పురాతన శివాలయంలో చాలా గుంతలు తవ్వేసి ఉన్నాయి... మా ఊరు నుండి చాలా మంది పశువుల్ని మేపడానికి ఈ అడవిలోకి వస్తూ ఉంటారు... అయితే కొంత కాలం బట్టి .. ఇక్కడికి ఎవరినీ రానియ్యట్లేదు....ఇక్కడ పశువుల మేతకి, కట్టెలు కొట్టుకోవడానికి కూడా మా వాళ్ళని రానియ్యడం లేదు...
ఏమంటే... అటవీ శాఖ అధికారులు కేసులు పెట్టేస్తున్నారు... మా ఊరోళ్ళు ఇటు పక్క రావడానికే జంకుతున్నారు...
ఇదంతా... ఆ గుప్త నిధుల తవ్వకాలకోసం... ఎవరో పెద్దమనుషులు... చేస్తున్న పనండి... ఇందులో ఆ అధికారులు కూడా కుమ్మక్కయ్యుంటారండి..."
అంటూ ఆ స్థానికుడు చెప్పడం, అంతా పూర్తయ్యాక.
“ఇది వనజా ఇక్కడి పరిస్థితి...
కెమెరామెన్ గంగతో... రాంబాబు... పీకే ఛానల్”
అంటూ ఆ రిపోర్టర్ చెప్తూ ఉన్నాడు...
ఈలోగా... సంజయ్... టీవీ ఆఫ్ చేసి...
"ఈ న్యూసే... నాన్సెన్స్ మామ్... ఈ కాలంలో కూడా గుప్త నిధులు... తవ్వకాలు ఏంటి మామ్... బుల్ షిట్....
అనవసరంగా టైం వేస్ట్... ఇవాళ నేను చాలా క్లాసెస్ తీసుకోవాలి... ఉహ్హ్... బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది.... ఫ్రెష్ అయి వస్తా..." అంటూ... రెడీ అవడానికి వెళ్ళిపోయాడు....
సీత మనసంతా... కకావికాలం అయిపోయింది... ఆ ప్రోగ్రాం చూసి....
టిఫిన్ రెడీ చేస్తోంది, కానీ.. తన దృష్టి అంతా... ఆ న్యూస్ రీడర్ చెప్పిన దాని మీదే ఉంది...
ఎందుకంటే..... తన తండ్రి కూడా ఆ నిధిని దక్కించుకునే ప్రయత్నం చేసే... ఆ అడవిలోనే అదృశ్యం అయిపోయాడు కాబట్టి...
ప్రేమ పెళ్లి చేసుకుందని తనని ఇంట్లోకి రానివ్వకపోయినా...
తన తండ్రి ఎంత దుర్మార్గుడు అయినా కూడా....
ఏ కూతురికి అయినా సహజంగా ఉండే ప్రేమ..
సీత మనసుని మెలిపెడుతుంటే....
ఆనాటి చేదు జ్ఞాపకాల అలల, సుడులు... తన కంట కన్నీరై కరుగుతుండగా...
వెనకనుండి వచ్చి సీత కళ్ళు మూశాయి రెండు చేతులు....
************************************
సశేషం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#12
Good starting
[+] 1 user Likes sri7869's post
Like Reply
#13
నల్లమల నిధి రహస్యం పార్ట్ -3



[font=var(--ricos-font-family,unset)] [/font]
ఆనాటి చేదు జ్ఞాపకాల అలల, సుడులు..
తన కంట కన్నీరై కరుగుతుండగా..
వెనక నుంచి వచ్చి సీత కళ్ళు మూసాయి రెండు చేతులు!
ఒక్కసారిగా ఉలిక్కిపడి సీత వెనక్కి తిరిగి చూసేసరికి..
సీత కన్నీరు తన చేతికి అంటుకోవడంతో,తన చేతుల్ని వెనక్కి తీసుకుని, సీత వైపు ఆందోళనగా చూస్తున్నాడు , సీత పెద్దకొడుకు అజయ్.
"నాన్నా..అజయ్! ఏంటి సర్ప్రైజ్? " అంటూ కొడుకుని ప్రేమగా హత్తుకుంది సీత.
" అమ్మా! నాకు శ్రీశైలంకి ట్రాన్స్ఫర్ అయింది. డ్యూటీ లో జాయిన్ అయ్యేముందు ఒకసారి నిన్నూ, తమ్ముడ్ని చూడాలనిపించింది. అందుకే మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వచ్చేసాను.
కానీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్.. ఏం జరిగింది అమ్మా?" అంటూ అడిగాడు అజయ్.
'అరే.. ఏం లేదు నాన్నా! దోసెల్లోకి ఉల్లిపాయలు తరుగుతున్నా కదా! అందుకే! నేను ఎందుకు ఏడుస్తాను నాన్నా.." అంటూ నోటికొచ్చిన అబద్దాన్ని చెప్పేసింది సీత.
" వెళ్లి ఫ్రెష్ అయిరా నాన్నా! టిఫిన్ తిందువు గానీ." అంటూ ఉండగానే
" ఒరేయ్ అన్నయ్యా! ఎప్పుడొచ్చావురా? " అంటూ అజయ్ ని ఎత్తుకుని, గిర గిరా తిప్పేసాడు సంజయ్.
ఇద్దరు కొడుకుల్ని చూస్తూ సంతోష పడిపోతోంది సీత.
******
నల్లమల అడవులు,
సూర్యకిరణాలు కొద్ది కొద్దిగా. ఆ అడవిలోని చెట్ల మధ్యగా. దారి చేసుకుని. తమ వెలుగును ప్రసరిస్తున్న వేళ..
పక్షుల కిలకిలా రవాలతో. సెలయేరుల సరిగమలతో. వన్య ప్రాణుల సందడితో, ఆ అరణ్యం ప్రకృతి అందాలతో శోభాయమానంగా వెలిగిపోతున్న వేళ..
ఒక కుటుంబం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకుని, అక్కడ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహామహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి గాను నంది సర్కిల్ దగ్గర జీప్ మాట్లాడుకుని, ఎక్కి కూర్చున్నారు.
వారు మొత్తం నలుగురు.. మొగుడు పెళ్ళాలు, ఒక పిల్లాడు, ఆ పిల్లాడి నాయనమ్మ.
ఆ కుటుంబం తో పాటు. ఇంకో నలుగురు వ్యక్తులు కూడా ఆ జీప్ లో ఎక్కేసారు.
ఆ అమ్మవారిని దర్శించుకోవాలి అంటే ఉదయం 6 గంటల నుండి. మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే అనుమతి ఇస్తారు.
ఆ తరువాత ఎవరినీ ఆ ప్రదేశానికి వెళ్లడానికి అనుమతించరు.
చెక్ పోస్ట్ దగ్గర, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి అనుమతి తీసుకుని, ముందుకు నడిచారు వారు.
మొత్తానికి వారి ప్రయాణం మొదలు అయింది.
కానీ ఈ కుటుంబానికి తెలియదు ఆ వ్యక్తులు దర్శనం కోసం కాదు వారితో కలసి అడవిలోకి వస్తున్నది అని..
వారు కూడా తోటి భక్తులు అని అనుకుంటూ వారితో
మాట కలిపింది ఆ కుర్రాడి నాయనమ్మ.
"ఏం బాబూ! . మీరు ఇదివరకు అమ్మవారిని దర్శించుకున్నారా? లేక మాకు లాగే మొదటిసారా?" అని అడిగింది ఆ అమాయకురాలు.
"మొదటి సారి కాదు బామ్మ గారు.. మేము చాలా సార్లు వచ్చాము అమ్మవారి దర్శనానికి" అంటూ చెప్పాడు అందులో ఒకడు.
"అవునా బాబూ! . మాకు ఈ ప్రాంతం అంతగా తెలీదు. మేము మొదటిసారి వస్తున్నాం. ఈ జీప్ కొంత దూరమే వస్తుందట కదా. ఆ తరువాత ఎలా వెళ్లాలో. దారి చూపుతూ బోర్డులు ఉంటాయి అని చెప్పారు. మీరు కూడా ఉన్నారు. అమ్మవారి దయవల్ల ఇంకేమి భయం లేదులే!"
అంటూ ఆ బామ్మ వారితో చెబుతూ తనకి తానే ఆపద కొని తెచ్చుకున్నట్టు అయింది.
వారి ప్రయాణం సాగుతూ ఉంది.
శ్రీశైలం నుండి ఈ ప్రదేశానికి,12 కిలోమీటర్ల వరకూ తారు రోడ్డు ఉంది. ఆ రోడ్డు చాలా గతుకులుగా ఉండి పెద్ద పెద్ద మలుపులు తిరుగుతూ. ఒక్కొక్కసారి అయితే జీప్ తిరగబడిపోతుందా అన్నట్టుగా ఉంది.
కొంత దూరం వెళ్ళాక, జీప్ లు ముందుకు వెళ్లవు.
అక్కడ నుంచి సుమారు 16 కిలోమీటర్ల మేర కాలి నడకన నడవాల్సి ఉంటుంది.
ఒకసారి అడవిలోకి తిరిగాక, మట్టి రోడ్డు, పెద్ద పెద్ద పాము పుట్టలు, నీటి గుంతలు తారసపడతాయి.
ఆ ప్రయాణం సాధారణంగా ఉండదు. అందుకే ఆరోగ్యవంతులు మాత్రమే వెళ్ళగలరు.
కానీ బామ్మ అమ్మవారిని చూసి తీరాలి అని పట్టుపట్టడంతో వారు కాదనలేక తీసుకు వచ్చారు.
ఆ పిల్లాడు నడవలేకపోవడం తో వాడి తల్లిదండ్రులు వాడిని ఒకరి తరువాత ఒకరు ఎత్తుకుని నడుస్తున్నారు.
అంత అలసటలోనూ ఆ ప్రకృతి అందం, ఆ చల్లదనం. వారిని సేద తీరుస్తూ ఉంది.
ఆ కుటుంబం వాళ్ళతో వచ్చిన ఆ నలుగురు వ్యక్తుల్లో ఒకడు ఇంకొకడి చెవిలో
"ఒరేయ్! ఎందుకురా.. ఇక్కడే పని కానిచ్చేద్దాం. మళ్ళీ అక్కడ దాక నడిచి వెళ్లడం దేనికిరా? " అన్నాడు.
"నువ్వుండెహే.. మంగి సార్ చెప్పిండు గదా.. పట్రమ్మని గా పోరడ్ని.. గిప్పుడే ఎత్తుక పోతే. ఆగమాగం. ఐపోద్ది. మూసుకుని నే చెప్పేవరకు గా బామ్మని మన మాటల్లో పెడతా ఉండు.దర్శనం అయిపోయినాక. ఎత్తుక పోదాం."
అంటూ గొణిగాడు వాడు.
పాపం ఆ కుటుంబానికి తెలియక, ఆ వ్యక్తులకి కూడా వారు తెచ్చుకున్న, ఆహారం, నీళ్లు ఇచ్చారు.
వారు అలా చాలా సేపు నడిచాక.
గిరిజనుల నివాసాల మధ్య. బండరాళ్ళతో నిర్మించబడిన, చిన్న పాక. కనిపించింది.
ఆ వ్యక్తుల్లో ఒకడు. ఆ బామ్మ కుటుంబం తో మాట్లాడుతూ .
" రండమ్మా. ఇదే ఆ మహిమన్వితమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి." అంటూ చూపించాడు.
ఆ అమ్మవారి గుడిని చూస్తూనే. అప్రయత్నం గా ఆ కుటుంబం ఆనందభాష్పాలు రాల్చారు.
" అమ్మా. ఇష్టకామేశ్వరీ!" అంటూ ఆ జగన్మాత ముందు మోకరిల్లారు.
కుడి వైపు గణపతి విగ్రహం, ఎదురుగా నంది విగ్రహం.
చుట్టూ జంట నాగులతో కొలువై ఉన్నఅమ్మవారి దర్శనం అయింది.
గుడికి ఎదురుగా సెలయేరు, ఒక బావి ఉన్నాయి .
చిన్న ద్వారం గుండా లోపలికి పాకుతూ వెడితే నూనె దీపం వెలుగులో నాలుగు చేతులతో అమ్మవారు దర్శనం ఇస్తారు.
అక్కడే పద్మాసనం వేసుకుని కూర్చున్న పూజారి గారు బొట్టు పెట్టి అమ్మవారిని కోరిక కోరుకోమని చెప్పారు.
ఆ కుటుంబం అయన చెప్పినట్టుగా అమ్మవారికి బొట్టుపెట్టి, తమ కోర్కెలు తెలుపుకున్నారు.
రవికలగుడ్డ, గాజులు ఇవ్వగా. పూజారి గారు అవి ఉంచి అమ్మవారికి పూజ చేశారు .
ఆ పిల్లవాడు "అమ్మా! నాన్నా! ఇక్కడ అమ్మవారి గురించి చెప్పండి" అని అడిగాడు . అక్కడే ఉన్న పూజారి గారు కల్పించుకుని
"బాబూ! ఈ అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవి. ఈమె నాలుగు చేతులతో దర్శనం ఇస్తారు.
వెనుక రెండు చేతులలో శంఖాలు పట్టుకుని ఉంటారు.
కుడి చేతిన జపమాల, ఎడమ చేతిన శివలింగం పట్టుకుని ఉంటారు.
ఇన్నో ఏళ్ల క్రిత్రం శివుడ్ని తన నాథునిగా చేసుకునేందుకు సాక్షాత్తు పర్వత రాజు పుత్రిక, జపమాలని, శివలింగాన్ని చేతబట్టి తపస్సు చేసింది. ఆ పార్వతి దేవి ఇంకో పేరు ఇష్టకామేశ్వరి దేవి.
భక్తిగా దండం పెట్టుకుని ఆమెకు బొట్టు పెట్టి, కోరిక కోరుకుంటే తప్పకుండా తీరుతుంది." అంటూ ఆ పిల్లాడితో పాటు అక్కడున్న వారందరికీ ఆ అమ్మవారి మహత్యం తెలియజేసారు పూజారి గారు.
దర్శనం అయిన తరువాత అక్కడ ఆదివాసులు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించి, ఆ అమ్మవారికి మళ్ళీ మళ్ళీ నమస్కరించుకుని, తిరుగు ప్రయాణం మొదలు పెట్టింది ఆ కుటుంబం. వారితో పాటుగా ఆ వ్యక్తులు కూడా బయలుదేరారు.
కానీ వారి ప్లాన్ వేరు. ఆ కుటుంబం లోని చిన్నపిల్లాడిని వారి నుంచి ఎత్తుకు పోవాలి. ఆ దిశగా. వారి ప్రణాళిక మొదలుపెట్టారు.
*****
సశేషం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#14
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#15
నల్లమల నిధి రహస్యం పార్ట్ -4

దర్శనం అయిన తరువాత, అక్కడి ఆదిమవాసులు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించి, ఆ అమ్మవారికి మళ్ళీ మళ్ళీ నమస్కరించుకుని, తిరుగు ప్రయాణం మొదలు పెట్టింది ఆ కుటుంబం. వారితో పాటుగా ఆ వ్యక్తులు కూడా బయలుదేరారు.
కానీ వారి ప్లాన్ వేరు. ఆ కుటుంబం లోని చిన్న పిల్లాడిని వారి నుంచి ఎత్తుకుపోవాలి. ఆ దిశగా, వారి ప్రణాళిక మొదలుపెట్టారు.
"బామ్మ గారు.. మీరు లడ్డు ప్రసాదం తీసుకున్నారా?" అడిగాడు ఒకడు.
"లడ్డు ప్రసాదం ఏంటి? అక్కడ వారు ప్రసాదం ఇచ్చారుగా. అది కాక లడ్డులు కూడా ఉన్నాయా? మేము చూడలేదే!” అన్నాడు ఆ పిల్లాడి తండ్రి.
"అరే.. ఇవే ఇక్కడ ఫేమస్. కోరిన కోరిక తీరాలి అంటే, ఈ లడ్డు ప్రసాదం కూడా తీసుకోవాలి" అన్నాడు వాడు.
"అయ్యో! మాకు తెలియదు. మళ్ళీ వెనక్కి వెళ్లి తెస్తాను." అంటూ అతను వెళ్లబోతుంటే
"అయ్యో.. వద్దు అండి.ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మూడింటి తరువాత ఇక్కడ ఎవరూ ఉండకూడదు.ఇదిగో, మేము కొన్నాము కదా. తీసుకోండి, పర్లేదు" అంటూ వాళ్లు ఒక లడ్డు, ఆ కుటుంబం చేత తినిపించారు.
ఒక పది నిముషాల తరువాత, ఆ కుటుంబం అందరూ స్పృహతప్పి పడిపోయారు.
అప్పుడు ఆ నలుగురు వ్యక్తులు హైఫై లు కొట్టుకొని ,
"పని అయిపోయింది. ఈ పిల్లాడ్ని తీసుకెళ్లి, మంగి సార్ కి అప్పచెప్తే, సార్ మనకి డబల్ పేమెంట్ ఇస్తాడు."అనుకుంటూ, ఆ పిల్లాడిని భుజాన వేసుకుని, అడవిలో వేరే మార్గంలో ముందుకు నడిచారు.
*****
ఇద్దరు కొడుకులను చూస్తూ, సంతోషంతో ఉప్పొంగిపోతోంది సీత.
"అన్నయ్యా! ఏంటి చెప్పకుండా వచ్చేసావ్?" అంటూ అజయ్ ని ఎత్తుకుని, గిర గిరా తిప్పేస్తున్నాడు సంజయ్.
"ఒరేయ్.. దింపరా బాబు. నాకు శ్రీశైలం వన్ టౌన్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయింది. డ్యూటీ లో జాయిన్ అయ్యే ముందు నిన్నూ, అమ్మని చూసి వెళదామని, సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చేసాను." అంటూ ఉండగా, అజయ్ ని కిందకి దింపి,
" ఏంటిరా.. శ్రీశైలం ట్రాన్స్ఫర్ అయిందా? సూపర్ రా అన్నయ్యా. ఇంకో వన్ వీక్ లో మా కాలేజీ ఫాకల్టీ, స్టూడెంట్స్ కల్సి, అక్కడికి ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. నువ్వు ఎప్పుడు జాయిన్ అవ్వాలిరా? " అని అడిగాడు సంజయ్, అజయ్ ని.
"ఎల్లుండి జాయిన్ అవ్వాలి. అక్కడ క్వార్టర్స్ లేవు. నా జూనియర్ ఒకరు రూమ్ చూసి పెడతాను అన్నాడు. రేపు నైట్ వెళ్తాను" అన్నాడు అజయ్..
"సూపర్ రా.. అన్నయ్య.. అయితే నీతో పాటు అమ్మని తీసుకెళ్ళు. నేను ఎలాగూ వన్ వీక్ లో అక్కడికే వస్తా మా కొలీగ్స్, స్టూడెంట్స్ తో కలిసి" అంటూ ఉండగా..
"ముందు టిఫిన్ తినండి నాన్నా. తరువాత మాట్లాడుకుందురు" అంది సీత.
"నేను ఫ్రెష్ అయి వస్తా.." అంటూ అజయ్ వాష్ రూమ్ కి వెళ్ళిపోయాడు.
"అమ్మా! ఇవాళ నేను లీవ్ పెట్టేస్తా అన్నయ్యతో టైం స్పెండ్ చేస్తా. లీవ్ మెయిల్ చేసి వస్తా" అంటూ రూం లోకి వెళ్ళిపోయాడు సంజయ్.
సీతకి, 'అజయ్ కి శ్రీశైలం ట్రాన్స్ఫర్ అయింది' అన్నవిషయంగా సంతోషం, భయం అనే రెండు విభిన్న అనుభూతులు కలగలిసి, ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదు.
భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్టుగా.. 'తన తండ్రి, తన భర్త లాగే, తన పెద్ద కొడుకు జీవితం కూడా ఆ నల్లమల అడవులలో బలైపోదు కదా!' అని ఒక నిమిషం అనిపిస్తుంది.
అంతలోనే ఆ రోజులు వేరు,ఈ రోజులు వేరు. అప్పుడేదో అయింది అని, ఇప్పుడు భయం దేనికి. అని ఒక నిమిషం..ఇలా ఏవేవో ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
‘ఏదేమైనా సరే.. నా కొడుకులకి ఆ మల్లన్న స్వామి అనుగ్రహం ఉంది. ఆయనే అన్నీ చూసుకుంటాడు’ అనుకుంటూ ఉండిపోయింది సీత.
ఈలోగా కొడుకులు ఇద్దరూ, వాళ్ల పనులు పూర్తి చేసుకుని వచ్చారు. ముగ్గురూ కలిసి, టిఫిన్ చేస్తూ. కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.
"అమ్మా! శ్రీశైలం దగ్గర మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?" అన్నాడు అజయ్..
" ఉండేవారు.ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు..నేను, మీ నాన్నగారు ప్రేమించుకున్న రోజుల్లో మీ నాన్న గారు అదే సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో పనిచేస్తూ ఉండేవారు. అప్పుడు.." అంటూ ఏదో చెప్పబోయి,
"కానీ .. మనము అక్కడ నుండి వచ్చేసి ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు మనకి అక్కడ, నా అన్న వాళ్ళు ఎవరూ ఉండి ఉండరు." అంది సీత బాధగా..
"అమ్మా.. అంటే.. మీది కూడా అక్కడేనా?" అడిగాడు సంజయ్.
"అవును. బలభద్రపురం.. శ్రీశైలం పక్క ఊరు.. మీ నాన్నగార్ని పెళ్లి చేసుకున్న తరువాత ఆ ఊర్లోంచి వచ్చేసాం. మా వాళ్ళు అంతా చనిపోయారు. ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. అయినా అదంతా ఇప్పుడు ఎందుకు?" అంటూ మాట మార్చేసింది సీత.
అలా ఆ రోజంతా ఆ తల్లీ కొడుకులు ఎంతో సంతోషంగా గడిపారు.
*****
రాత్రి 7గంటల, పది నిముషాలు..
నల్లమల అడవి..
ఆ పిల్లాడ్ని ఎత్తుకెళ్లి, ఆ నిర్మానుష్యమైన అడవిలో, ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఎప్పుడో, ఎవరో, కట్టిన కూలిపోయే పరిస్థితిలో ఉన్న పాత రేకుల షెడ్ లో ఒక మూలగా. చేతులు, కాళ్ళు కట్టి పడేసారు.
వాళ్ళు ఇచ్చిన మత్తు మందు ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతూ వస్తోంది.
ఆ పిల్లాడు మత్తుగా..కళ్ళు కొద్దిగా తెరిచి చూస్తున్నాడు..
మసక మసక గా కనిపిస్తున్నాయి అక్కడ జరుగుతున్న దృశ్యాలు ఒక్కొకటిగా..
ఒక లావు పాటి మనిషి.. చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడు.. వళ్ళంతా బూడిద రాసుకుని.. పుర్రెలదండ వేసుకుని కళ్ళకి కాటుక పెట్టుకుని ఉన్నాడు. నుదుటిన ఎర్రటిరంగులో పెద్ద బొట్టు పెట్టుకుని ఏవో మంత్రాలు చదువుతున్నాడు.
అక్కడ వెలుగుతోన్న కట్టెల వెలుగులో అదంతా ఆ పిల్లాడికి మసక, మసక గా కనిపిస్తూ ఉంది..
ఆ మనిషి తో పాటు. పొద్దున్న వాళ్ళతో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తులు, ఇంకో కొత్త వ్యక్తి కూడా ఉన్నారు..
ఆ పిల్లాడు కొద్దిగా పైకి లేచి, " అంకుల్.. మా మమ్మీ, డాడీ.. బామ్మా ఏరి? నన్ను ఎందుకు ఇక్కడ కట్టి పడేసారు?" అంటూ ఏడుపు మొదలు పెట్టాడు..
అంతే.. అందులో ఒకడు వచ్చి. ఆ పిల్లాడ్ని చాచిపెట్టి ఒక్కటి కొట్టి, “నోరు మూసుకో..” అని గద్దించాడు.
వాడు కొట్టిన దెబ్బకు, ఆ పిల్లాడు స్పృహ తప్పి పడిపోయాడు..
ఆ పిల్లాడ్ని కొట్టేసరికి అప్పటి వరకు ప్రశాంతం గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది..
ఉరుములు, మెరుపులతో భయంకరమైన తుఫాను గాలితో, ఆ అడవి అంతా ఇంకా భయంకరంగా మారిపోయింది. చెట్లు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాయి. దూరంగా ఎక్కడో నక్కలు ఏడుపు మొదలు పెట్టాయి..
ఆ వాతావరణం చాలా భయంకరంగా మారిపోయింది..
ఆ పిల్లాడ్ని కొట్టినవాడు దూరంగా ఎగిరిపడి నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు.
వాడికి దగ్గరగా ఒక భయంకరమైన ఆకారం వచ్చి,
" ఉఫియే.. కిరిగిచి.. చంటి కూన.. ఉఫియే.. నిధి ఎల్లారు. బలియా.. ఉఫియే. కిరి కిరిక.. నీళ్ల ఉద్ద.. నాడ్.. బతల్.. కీకాట్.." అంటూ వికృతంగా నవ్వుతూ.. వాడి శరీరం మీద ఎక్కి వాడ్ని భూమిలోకి తొక్కేసింది. అక్కడ నుండి ఒక్క ఎగురు పైకి ఎగిరి మంత్రాలు చదువుతున్న మంత్రగాడి ముందు వాలిపోయింది.
ఆ ఆకారాన్ని చూస్తూనే వాడు ఇంకా గట్టిగా క్షుద్ర మంత్రాలు చదువుతూ ఆ అకారాన్ని తరిమేందుకు తన క్షుద్ర శక్తి ని ప్రయోగిస్తున్నాడు. కానీ అవేం ఆ ఆకారం పై పనిచేయడం లేదు. ఒక్కసారిగా ఆ ఆకారం. వికృతంగా నవ్వుతూ
"గోరి.. గోరి. కిరాచియా.. మరియా. ఆన.." అంటూ. ఆ మంత్రగాడి తల, మొండెం వేరు చేసేసి అదే మంటల్లో పడేసింది.
అదంతా చూస్తూ పారిపోడానికి కాళ్ళు, చేతులు పనిచేయకుండా పడి ఉన్న వారందరి వైపు నెత్తురోడుతున్న కళ్ళతో క్రూరంగా చూస్తోంది ఆ ఆకారం..
***************************************
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#16
(03-02-2025, 10:15 AM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్ -4


అదంతా చూస్తూ పారిపోడానికి కాళ్ళు, చేతులు పనిచేయకుండా పడి ఉన్న వారందరి వైపు నెత్తురోడుతున్న కళ్ళతో క్రూరంగా చూస్తోంది ఆ ఆకారం..
***************************************

Nice Story, Ramya Namuduri garu and K3vv3 garu!!!


clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#17
నల్లమల నిధి రహస్యం పార్ట్ -5






[font=var(--ricos-font-family,unset)] [/font]
అదంతా చూస్తూ, పారిపోడానికి కాళ్ళు, చేతులు పనిచేయకుండా పడి ఉన్న వారందరి వైపు నెత్తురోడుతున్న కళ్ళతో, క్రూరంగా చూస్తోంది ఆ ఆకారం.
"వదిలేయ్.. మమల్ని వదిలేయ్.." అంటూ ఆ మనుషులు అతి కష్టం మీద తడపడుతూ, ఆ ఆకారాన్ని బ్రతిమలాడుతున్నారు.
" ఉఫియే.. చంటి కూన ప్రాణం.. బలి ఎన్నాయా? నిధి ఎన్నయు బలియా? అమ్మమ్మా.. ఇన్నారు ప్రాణం.. పసి కూన ప్రాణం.. ఆఆఆ.."
అంటూ ఆ మనుషులను పైకి ఎత్తి, గాలిలో గిర గిరా తిప్పి, దూరంగా విసిరికొట్టింది.
ఎక్కడ పడ్డ వారు అక్కడే అలాగే భూమిలోకి దిగబడిపోయి ప్రాణాలు వదిలేసారు.
అక్కడ అంత జరిగినట్టు ఆనవాళ్లు లేకుండా.,ఆ శవాలన్నీ భూమిలోకి దిగబడిపోయాయి.
అక్కడ క్షుద్రపూజ కోసం చేసిన ఏర్పాట్లు అన్నీ మాయం అయిపోయాయి.
ఆ అడవి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం లోకి మారిపోయింది.
ఆ ఆకారం వికృతరూపం నుంచి మానవ రూపం దాల్చింది.
పదహారేళ్ళ అందమైన కోయ పిల్ల లాగా మారింది.
చందమామ అమ్మాయి రూపంలో కిందికి వచ్చిందా అన్నట్లు వెన్నెల కురిపించే అందమైన మోము, చారడేసి కళ్ళు, దొండపండులాంటి పెదవులు,
బంగారు మేని ఛాయతో మెరిసిపోతోంది.
ఆ అమ్మాయి.. ఆ పిల్లవాడికి దగ్గరగా వెళ్లి, తలపై ప్రేమగా నిమిరింది. ఆమె చేతి నుండి వచ్చిన బంగారు కాంతి ఆ పిల్లాడి శరీరం అంతా ప్రసరించింది.
కాళ్లకు, చేతులకు ఉన్న కట్లు వాటంతట అవే తొలగిపోయాయి.
పెదవి చివర చిట్లిన గాయం మానిపోయింది.
ఆ పిల్లాడు స్పృహలోకి వచ్చాడు.
తనను ప్రేమగా నిమురుతున్న ఆమెను చూస్తూనే, పైకి లేచి. "ఎవరు అక్కా నువ్వు.? మా అమ్మ, నాన్నా, బామ్మా కావాలి. ఈ అంకుల్ వాళ్లు బాడ్.. అంటూ చూపించబోయి, ఏరి వాళ్లు? " అంటూ చుట్టూ చూస్తున్నాడు..
" వాళ్లు పోయినారులే.. ఇంకేంటి భయం లేదు కూన.. నిన్నూ మీ అమ్మా, అయ్యల కాడికి చేరుస్తలే.. కలవరపడకు.. ఈ అక్క ఉండాదిగా.. " అంటూ అలికిల్లాంతరు పట్టుకుని, ఆ పిల్లాడిని ఎత్తుకుని, కొంత దూరం వెళ్లేసరికి ..
అక్కడ ఆ పిల్లాడి అమ్మా, నాన్నా, బామ్మా చుట్టూ చూస్తూ అ పిల్లాడి కోసం ఏడుస్తున్నారు..
ఆ దీపపు వెలుతురులో తన మనవడిని ఎత్తుకుని వస్తున్న ఆ అమ్మాయిని చూస్తూ ఆ బామ్మ సంతోషం తో ‘ఒరేయ్ రాజూ!’ అంటూ వాళ్ళకి ఎదురువెళ్లి, ఆ పిల్లాడ్ని ఆ అమ్మాయి నుండి తీసుకుని, ముద్దులు పెట్టేసుకుంటోంది..
ఆ పిల్లాడి తల్లీ, తండ్రి కూడా ఆ పిల్లాడ్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తున్నారు..
ఏమైపోయావురా.? నా తండ్రీ! అంటూ ఆ తల్లి వాడిని గట్టిగా హత్తుకుని గుండె పగిలేలా ఏడుస్తోంది.
ఆ పిల్లాడి తండ్రి ఆ అమ్మాయికి చేతులు జోడించి, దండం పెడుతూ " అమ్మా! నువ్వు ఎవరో మాకు తెలియదు. కానీ జన్మ, జన్మలకు నీకు ఋణపడి ఉంటాం" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
"ఓ అయ్యో! ఏడవమాకండి.. మీ కూనడు మీకు దక్కినడు గదా. ఈడ ఉండగూడదు. బేగా జరుగుర్రి. జర నడి రాతిరి అయినదునుకో. గీ అడవిలా అంత మంచిది గాదు. నా ఎంబడి రండి. అడ్డదారిలా మీగూటికి చేరుస్తా. అవు మల్ల. తిన్నంగా నడువురి. ఎనక్కి తిరిగి చూడమాకూర్రి." అంటూ ఆమె ముందుకు నడిచింది.
ఆమెను వెంబడిస్తూ. ఆ అమ్మవారిని తలుచుకుంటూ.. వాళ్ళు ముందుకుసాగారు..
ఆశ్చర్యం.. వాళ్లు ఒక అరగంట నడిచేసరికే వాళ్ళు ఉన్న కాలేజీ వచ్చేసింది..
" వెళ్ళిరండి. వెనక్కి తిరిగి చూడకుండా. మీ గదికి వెళ్లిపోండి" అని ఆ కుటుంబానికి చెప్పి, ఆ బాబు తలపై ప్రేమగా నిమిరి, ఆ అమ్మాయి వెనుతిరిగి వెళ్ళిపోతోంది.
వాళ్లు "మీ మేలు మరచిపోలేము తల్లీ.. " అని ఆమెకు చెప్తూ ఆమె చెప్పినట్టే వెనక్కి తిరిగి చూడకుండా గదిలోకి వెళ్లి తలుపు వేసేస్కుని " హమ్మయ్యా.." అని ఊపిరి పీల్చుకుంటూ ఉండగా
ఆ పిల్లాడి తల్లి అనుకోకుండా ఆ గది కిటికీ లోంచి బయటకు చూసేసరికి కళ్లు తిరిగి కిందపడిపోయింది..
ఆమె భర్త ఆమె ముఖంపై నీళ్లు చెల్లి పైకి లేపి, “ఏం అలా పడిపోయావ్?” అని అడిగితే " ఏమీ లేదు. నీరసంతో కళ్ళు తిరిగాయి" అంది. ఆమెకు తను ఏమి చూసి, పడిపోయిందో.. గుర్తులేదు..
ఆ పూట అంతా ఆ కుటుంబం జాగారం ఉండి, ‘ఆ మల్లన్న, భ్రమరాంబ అమ్మవారి దయవల్ల బతికి బయటపడ్డాం’ అనుకుంటూ భక్తిగా ఆ మల్లన్న స్వామిని ప్రార్ధిస్తూ ఉండిపోయారు.
ఆ అమ్మాయి.అలా నడుచుకుంటూ మళ్ళీ దట్టమైన అడవిలోకి వెళ్లిపోతూ
"ఇంకెన్నాళ్ళు ఈ నిరీక్షణ? ఇంకెన్నాళ్ళు నీ రాక కోసం ఎదురుచూపులు? ఇంకెన్ని ప్రాణాలు.. ఇంకెన్ని మరణాలు.. ఈ రూపం ఇంకెన్నాళ్ళు?
జన్మలు వేచి ఉంటాను నీ ప్రేమ కోసం..
నీకిచ్చిన మాట కోసం..
ఈ బాధ్యత నుండి బయట పడి, నీ ఎదుటే అమ్మవారిలో కలిసిపోతాను. నాకు విముక్తి కలిగించు మార్తాండా!
నీ ప్రేయసిని ఇలా జన్మ జన్మలుగా వేచి వుంచుట భావ్యమా? నువ్వు మళ్ళీ పుట్టి ఉంటే నా ఆత్మ ఘోష నీకు వినిపిస్తూ ఉంటే..ఆనాటి మన ప్రేమే నిజమైతే.. నన్ను చేరగా రా.. ఈ నిధి బాధ్యత నుండి నాకు విముక్తి ని ప్రసాదించు..
నీ మహారాజుకి నువ్వు సామంతుడవు. నా ప్రేమ సామ్రాజ్యపు మహారాజువు. " అనుకుంటూ ఆ అందమైన అమ్మాయి తన అడుగులు ముందుకు వేస్తూ చీకటికే కాటుక పులిమిన ఆ నిశీధి అరణ్యం లో కలిసిపోయింది..
*****
గదిలో ఏసీ ఉన్నా, ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో తిరుగుతూ ఉన్నా..
వళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి అజయ్ కి.
"ఎవరో తనను దూరం నుండి పిలుస్తున్నట్టు.. తన కోసం ఎవరో ఏడుస్తున్నట్టు.. " వినిపిస్తోంది..
"తను పూర్తిగా కోయరాజు వేషంలో ఉన్నట్టు..
ఎవరో మహారాజుకి మాట ఇస్తున్నట్టు.. ఒక అందమైన అమ్మాయి ని గట్టిగా హత్తుకుని ఉన్నట్టు..
ఛావు బ్రతుకుల మధ్య ఉన్న తను.. ఆ అమ్మాయి చేతిలో చేయ వేసి.. నేను వస్తా.. మళ్లి పుట్టి నీకోసం వస్తా! మన మహారాజుకి మాట ఇచ్చాను. నా ప్రాణం పోయినా నువ్వు ఉండాలి. నే వచ్చేవరకు ఈ నిధిని కాపాడాలి. పేద ప్రజలకోసం మన మహారాజు.. " అంటూ ఏదో చెప్తున్నట్టుగా..
ఇలా ఏవేవో దృశ్యాలు .
కనిపించీ , కనిపించినట్టుగా..
కల లాగా వస్తూ ఉండగా పరిగెడుతున్న ఆ అమ్మాయిని ఎవరో గునపంతో గుచ్చినట్టు అనిపించి
"మరియా!" అంటూ ఉలిక్కిపడి లేచాడు అజయ్.
*****
ఇంకా ఉంది
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#18
(14-02-2025, 10:34 PM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్ -5


[font=var(--ricos-font-family,unset)] [/font]
"మరియా!" అంటూ ఉలిక్కిపడి లేచాడు అజయ్.
*****
ఇంకా ఉంది
Oh, Interesting !...Very good update !
clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#19
అప్డేట్ బావుంది k3vv3 గారు...అజయ్ ది మరుజన్మ అయితే మరి సంజయ్ ది?...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)