Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - పొడుపు కధ తెచ్చిన జడుపు
భూలోకవాసుల స్వర్గలోక ఆవాసము - మద్దూరి నరసింహమూర్తి
[Image: B.jpg]
“ప్రభూ ఇతడు అనుమతి లేకుండా మన లోకానికి రావడమే కాక, ఏవో పరికరాలు కూడా పట్టుకొని అటూ ఇటూ చూస్తూ తిరుగుతూంటే గమనించి పట్టుకొని వచ్చేము” అని ఒక వ్యక్తిని చెరో వైపు పట్టుకొని సభలో ప్రవేశపెట్టిన భటులను చూసి – “మంచి పని చేసేరు, మీరు ఇక వెళ్లవచ్చు”
“ఓయీ ఎవరవీవు? మా లోకమునకు ఏల వచ్చితివి?”
“మహేంద్రులవారికి శుభాభివందనములు. ఒక సత్వర కార్య నిర్వహణలో మీకొక విన్నపము చేయవలెనని మా గురువులు పనుపున వచ్చిన నేనొక మానవుడను. భూలోకములోని భారతదేశవాసిని. ఆ కార్య నిర్వహణలో భాగముగా మీ సముఖమునకు ఎటుల పోవలెనని నలుదిక్కులా పర్యవేక్షిస్తూ తిరగుతున్న నన్ను పట్టుకొని, నా మాటలు వినిపించుకోకుండా, మీ భటులు నేనేదో నేరం చేసినట్టు ప్రవేశపెట్టడంతో మీ దర్శన భాగ్యం సునాయాసంగా కలిగింది. సంతోషం”
“నీవు ఇచ్చటకు వచ్చి మాకు చేయదలచిన విన్నపమేమి”
“అతిథిని ఇలా నిలబెట్టి మాట్లాడించడం సహస్రాక్షులైన మీకు శోభస్కరంగా లేదు”
“మమ్ము మహేంద్రులుగా గుర్తించిన చాలును, సహస్రాక్షునిగా సంబోధించ పని లేదు. ఇగో ఈ ఆసనం గ్రహించి అన్ని వివరములు ప్రశాంతముగా విశదీకరించుము”
“మండుటెండలో తిరుగుటచే గొంతుక ఎండి పోయినది ప్రభూ. మీకు అభ్యంతరం లేకపోతే, కొబ్బరి బొండం ఒకటి కొట్టించి ఆ తాజా నీరు ఇప్పించండి”
“అనగా సలిల నారికేళ పానీయమనియే కదా నీ భావము”
“అవును”
“అవశ్యం ఇప్పించెదము”
సలిల నారికేళ పానీయము మానవుడు గ్రహించిన పిదప –
“మా భూలోకవాసులు మీ లోకములో నివసించుటకై తగిన వసతి సదుపాయముల వివరములు తెలుసుకొని రమ్మని మా గురువులు నిర్దేశించగా నేను ఇక్కడికి వచ్చితిని. మీరు అనుమతించిన, మీ లోకమున పరిభ్రమించి ఆ సమాచారము గ్రహించి నేను తిరుగు ప్రయాణమవగలను”
“ఎంతో పుణ్యం చేసుకున్న మానవులు మాత్రమే మరణించిన తదుపరి మా లోకమునకు రాగలరు. అందుకు విరుద్ధముగా నీవు బొందితోనే స్వర్గలోకప్రవేశము చేయుట మాకు కడు వింతగానూ ఆశ్చర్యముగనూ ఉన్నది. నీవు ఇక్కడికి ఎటుల రాగలిగినాడవు”
“మేము ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళేందుకు అతి శీఘ్రముగా నడిచే ‘రాకెట్’ అన్న వాహనములో ప్రయాణం చేస్తూ ఉంటాము. ఆ సాధనముతోనే నేను ఇక్కడికి రాగలిగితిని”
“బాగు బాగు, మీ మానవులు కడు సమర్ధులైతిరని తెలిసి చాలా సంతసించితిమి. మీ మానవులకు ఇక్కడ నివాస ఆవశ్యకమెందులకు”
“మీ బహుముఖ పాలనా ఆధ్వర్యాన మీ లోకవాసులు పాటించే కుటుంబ నియంత్రణ రహస్యం ఏమో కానీ, కొన్ని యుగాలుగా మీ జనసంఖ్య 33 కోట్లతో ఆగిపోయింది. అందుకు భిన్నముగా, మా దేశ జనసంఖ్య పెరిగి పెరిగి ఇప్పుడు 140 కోట్లకు చేరుకుంది, ఇంకా పెరుగుతుంది కూడా. అందువలన మా జనానికి ఆవాసం ఒక క్లిష్ట సమస్యగా పరిణమించింది. ఆ సమస్య నివారణకై మాలో కొందరు చంద్రగ్రహానికి మరి కొందరు కుజగ్రహానికి వెళ్ళి అక్కడ జనావాసానికి ఉన్న సదుపాయాలు సంగ్రహిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే నన్ను ఇక్కడికి పంపినారు”
“మీ జనావాసానికి మా లోకంలో స్థలం ఇచ్చిన మాకు ఏమి లాభము”
“మాకు అవసర సమయంలో సహాయం చేసేరన్న కీర్తి మీ దివ్య చరితలో కలికితురాయిలా నిలిచిపోతుంది. కాబట్టి మీరు మా వినతిని ఆమోదించి మాకు కొంత స్థలం ఇచ్చినచో మేము ఆవాస సదుపాయాలు ఏర్పరచుకుంటాము”
“స్వర్గం అంటే అప్సరసల నాట్యానికి పెట్టింది పేరు అని నేను వేరుగా చెప్పనక్కరలేదు. మీ మానవులు ఇక్కడ ఆవాసాలు ఏర్పరచుకుంటే, మా అప్సరసల నాట్యం చూసేందుకు ఎగబడి నానా రభసా చేస్తారేమో”
“మీ అప్సరసలు అంటే రంభ, ఊర్వశి, మేనక మరియు తిలోత్తమలే కదా”
“అవును, వారు నలుగురూ ఎంత అందగత్తెలో అంతకు మించిన నాట్యశిరోమణులు”
“తమరు కరుణావేశమున వారినొకసారి నేను చూడవచ్చా”
“చూడడమేమిటి, నీవు మా అతిథివి కనుక వారి నాట్యవిలాసాలే తిలకిద్దువుగాని” అని –
ఆ నలుగురు అప్సరసల నాట్యం మానవుడు వీక్షించే ఏర్పాటు చేసేరు మహేంద్రులవారు.
రంభ, ఊర్వశి, మేనక మరియు తిలోత్తమ నలుగురూ నృత్యం చేసి నిష్క్రమించేరు.
“ఏమి మానవా, మా అప్సరసాంగణుల అందము వారి నాట్య విలాసములు ఎటులున్నవి”
“క్షమించాలి, వారి అందం అంతంత మాత్రమే. పైగా, వారి నాట్యము నాకు ఎంత మాత్రమూ ఉత్సాహం కలిగించలేదు. ఇన్ని ఏళ్ళుగా మీరు వారి నాట్యం ఎలా భరిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు”
“మునులు సైతం మోహించి కామించే మా అప్సరసల అందం వారి నాట్యవిన్యాసములు నీకు నచ్చలేదా. ఆశ్చర్యముగా ఉన్నది. నీ మాటలు మమ్ము కించపరచుచున్నవి”
“మిమ్మల్ని కించపరిచే ఉద్దేశము నాకు ఎంతమాత్రమూ లేదు ప్రభూ. నిజము నిష్టూరముగానే ఉండునన్నది మీరెరుగని ఆర్యోక్తి కాదు”
“ఏమా నిజము”
“మా భూలోకమందలి నాట్యమణుల విన్యాసములు వారి అందచందాలు చూసినచో మీరు నా అభిప్రాయంతో తప్పక ఏకీభవించెదరని నా విశ్వాసము”
“అంతటి గొప్ప అందగత్తెలు నాట్యమయూరులా మీ భూలోకవాసులు”
“మీ దగ్గర ఉన్నది ఈ నలుగురు అప్సరసలే. మా దగ్గరైతే లెక్కలేనంతమంది నాట్యకత్తెలున్నారు. ఉదాహరణకు – జ్యోతిలక్ష్మి, జయమాలిని, హలం, ఎల్.విజయలక్ష్మి, హెలెన్, బిందు, పద్మాఖన్నా. ఇంకనూ ప్రత్యేక నృత్యం పేరిట రసికశిఖామణుల వలె నాట్య విన్యాసాలు చేసే చిత్రసీమ కథానాయికలు”
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
“మీ భూలోకంలో ఇంతమంది నాట్యమణులుండుట అతి శ్లాఘనీయం. వారి నృత్యం అందం మా అప్సరసల నృత్యం అందం కంటే గొప్పగా ఉండునని మేము నమ్మేదెలా”
“ఇప్పుడే మీకు మచ్చుకు ఒకరి నాట్యం చూపించమందురా”
“అనగా, ఆమెను ఇచ్చటకు పిలిపించెదవా ఏమి”
“అవసరం లేదు”
“మరి ఎటుల”
వెంటనే, ఆ మానవుడు తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ లో యు ట్యూబు చానెల్ తెరిచి ‘లే లే నా రాజా’ అన్న పాట చూపించేడు.
“నీవు వచించినటులే ఆ నర్తకి అందము ఆమె సలిపిన నృత్యం మా అప్సరసల అందమే కాక నృత్యం కంటే కూడా బహు గొప్పగా ఉన్నది. మాచే ఇంతటి మంచి నృత్యం వీక్షింపచేసిన నీకు ధన్యవాదములు. నిన్ను మా ఘనిష్ట మితృనిగా గ్రహించినారము”
“నేనెంతో అదృష్టవంతుడిని ప్రభూ”
“మా సమక్షమున లేని నర్తకీమణి చేస్తున్న నాట్యం మేము వీక్షించుటయా! అహో, మీ మానవులు ఎంతగా పురోగమించితిరి! ఆమె నాట్యము బహు మనోహరముగానూ ఉండి మాకు నయనానందము కావించినది. సత్యము వచింపవలెనన్న, ఆ పాటతో ఆ నాట్య విన్యాసముతో ఆమె మమ్మల్నే తట్టి లేపుతున్న అనుభూతి కలిగినది”
“ఆమె అందమెటులున్నది ప్రభూ”
“ఏమని వర్ణింతును ఆమె అందచందాలు. అహో ఏమి ఆమె శరీర సౌష్టము, జఘన సౌందర్యము, మహోన్నత వక్ష సంపద, మేని విరుపులు, శృంగార విన్యాసములు. ఎటువంటి వానిలోనైననూ నిదురపోవు కామ నాడులను కోర్కెలను తక్షణమే మేల్కొలిపి, మనసంతా రసికత నింపుతూ, తక్షణ ప్రియ సమాగము కాంక్షింప చేసే ఆమె అందచందాలు ఆమె నాట్య విన్యాసములు ప్రత్యక్షముగా కనులవిందుగా కానని ఈ ఇంద్ర పదవి వ్యర్ధము”
“మీరు ఆనతిచ్చిన మా నర్తకీ సముదాయమును మీ ముందర నిలబెట్టుటకు నేను సిద్ధము ప్రభూ. కానీ, ఒక సత్యము మీతో చెప్పక తప్పదు”
“ఏమా సత్యము”
“మేము జరా బాధలు తప్పని మానవులము కదా. మీ దివ్య ఆశీస్సులతో మా నాట్యరాణులకు పూర్వ యవ్వనము ప్రసాదించిన, మీరు వారి నాట్యమును చక్కగా తిలకించి మిక్కిలి సంతోషించగలరు”
“అదొక సమస్యయే కాదు, మా ఆనందమునకై వారికి ఆ అనుగ్రహము తక్షణమే ప్రసాదించితిమి. నీవు సత్వరమే మీ లోకమునకు పోయి వారిని మా అతిథులుగా సకల మర్యాదలతో కొని రమ్ము”
“మా నాట్యకత్తెల తరఫున నేను మీకు ధన్యవాదములు సమర్పించుకొనుచున్నాను. వారిని త్వరలో మీముందర ప్రవేశపెట్టే ప్రయత్నం చేసేదను. పనిలో పని, నేను కోరినట్టు మా మానవులు ఆవాసము ఏర్పరచుకొనుటకు మీ లోకంలో స్థలం ఇచ్చునటుల మీ అంగీకార పత్రము ప్రసాదించమని నా విన్నపం”
ఎంతటి వారలైనా కాంత దాసులే కనుక – అప్పటికే చలించిన మనము కలవారైన మహేంద్రులు ---
“మా అంగీకార ముద్ర నిర్దేశించిన శూన్య పత్రము ఒకటి నీకు ప్రదానము చేసేదను. నీవు మా లోకమున విహరించి, మీకు అవసరమైనంత స్థలము గుర్తించి, మీకు కావలసిన విధముగా ఆ శూన్య పత్రమున మా ప్రమాణములను లిఖియించి, నీతో కొనిపొమ్ము. అతి శీఘ్రముగా మీ భూలోకవాసుల నర్తకీమణులను మా సమక్షమున ప్రవేశపెట్టుట మాత్రము మరువక మసులుకొమ్ము. నీవు చూపిన నృత్య విలాసము వీక్షించిన మాకు, సత్వరమే మా దేవేరితో సరసములాడవలెనన్న బలీయమైన కోరికతో ఆమె సముఖమునకు ఇదే పోవుచున్నాము. నీవు పోయి శీఘ్రముగా రమ్ము. ఇష్ట కామ్యార్ధ సిద్ధిరస్తు, కళ్యాణమస్తు”
తన మీద చిలకరింపబడ్డ నీళ్ళతో తెలివొచ్చి –
“ఏంటమ్మా, కలలో దేవేంద్రుడితో ముఖ్య విషయాలు చర్చిస్తూంటే, కొంపలు మునిగిపోయేటట్టు మధ్యలో లేపేసేవు” అని చిరాకు పడుతున్న కుమార్ తో –
“త్వరగా లేద్దాం ఏదో ఉద్యోగం చూసుకుందాం అని లేదు. ఎంతసేపూ తిని మంచానికి అడ్డంగా తొంగుంటే, కలలు రాక ఇంకేమొస్తాయి నా శ్రాద్ధం పిండాకూడు కాకపోతే” –
అంటూ కురిపిస్తున్న అమ్మ తిట్ల వర్షం తప్పించుకుందుకి లేచిన కుమార్ స్నానాల గదిలోకి పరిగెత్తేడు.
** శ్రీరామ**
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఇట్లు, నీ తమ్ముడు! - అంతర్వాహిని
[Image: i.jpg]
ప్రియమైన అన్నయ్యకు, మీ ప్రియాతి ప్రియమైన తమ్ముడు, అనగా నేనే నమస్కరిస్తూ వ్రాయునది ...మేము చాలా బాగా వున్నాము, మీరంతా చాలా బాగా వున్నారని తలుస్తున్నాను.
పిల్లలు పెదనాన్న ఇంటికి ఎప్పుడు వెళతాము, అని కళ్ళూ కాయలు కాచేలాగ ఎదురు చూస్తున్నారు. మా చిన్నిరాముడికైతే కిందటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు వెట్ గ్రైండర్ లో ఇటుకురాళ్ళు & తుమ్మ జిగురు వేసి రుబ్బి చేసికున్న మజా అస్సలు మర్చిపోలెకపోతున్నాడు. ఈసారి అక్కడికి వచ్చి నప్పుడు, దాంట్లో ఫెవిక్విక్ కూడా వేసి ఏమవుతుందో చూడాలని ఉవ్విళ్ళూరూతున్నాడు. అయ్యో అన్నయ్యా, కిందటి సారి వెట్ గ్రైండర్ పాడైపోయిందని వదిన కేకలేసిందని మేమేమి అనుకోవటంలేదు. అలాగని, పిల్లల ఉత్సాహాన్ని కాదనలేము కద. మీ పెద్దల తిట్లు కూడా మాకు దీవనలే. ఏది ఏమైనా గాని, రుబ్బు రోలులో వదిన రుబ్బి వేసిన గారెలూ దూది పింజల్లా అద్భుతంగా వున్నాయి. కేవలం మేము ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు కలిసి నాలుగు దజన్లు ఎలా ఊదేశామో ఇంక అర్థం కావడంలేదు. పోతే పోయిందిలే వెధవ వెట్ గ్రైండర్, వదిన చేతుల్లో అద్భుతం వుంది. ఇంతమందికి పిండి రుబ్బాలంటే, జబ్బలు పడిపోతాయి, కష్టమే. అందుకనే, నెను పిల్లలకి ముందే చెప్పి వుంచాను, గారెలు తిన్న తరువాత పెద్దమ్మ చేతులకి జండుబాం రాస్తామని, పిల్లలు ప్రామిస్ చేసారు.
మా పిల్లది, ఈసారి బోల్డు పుస్తకాలు చదివి, చాలా పేపర్ కటింగ్స్ తయారు చేసి పెట్టుకుంది. పాపం కిందటి సారి, అది పక్కింటి పమేలా గారి బొచ్చుకుక్క పిల్లకి చేసిన హెయిర్ కటింగ్ సరిగ్గా రాలేదని, ఆ అస్తవ్యస్త కత్తెర విన్యాసానికి, పామెలా గారు చాల చిరాకు పడ్డారని, వారి అర్థ(భాగం?) పద్మారావు గారు పావు సీసా మందుతాగి విషయం వెళ్ళగక్కారు. హూ! ఏమి మనుషులు అన్నయ్యా వీళ్ళు, పిల్లలో పర్ఫెక్షన్ ఆశిస్తారు. అదీకాక, అదే కత్తెరతో పమేలా గారి చెల్లి కొడుక్కి కూడా హెయిర్ కటింగ్ చేసారని శ్రీమతి బోడెస్ గారు విరుచుకు పడ్డారు. ఆ బొచ్చు కుక్క కంచంలో నే కద, ఆ పిల్లాడు కూడా బువ్వ తింటాడు. ఆ ఎంగిలి వాళ్ళకి బావుంది కాని, హెయిర్ కటింగ్ కి ఒకే కత్తెర వాడితే, అంత గత్తర ఎందుకో?. వదిలెయ్ అన్నయ్య, ఈ సారి పిల్లది రెండు వేరే వేరే కత్తెర్లు వాడతానని మాట ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే, గత నెలలో కొత్త రకం పద్దతి నేర్చుకుంది, 'హెయిర్ బర్నింగ్' ట, కొవ్వొత్తి తో జుత్తు కాలుస్తారుట. అలా అయితే, కత్తెర్ల గొడవేలేదు. పిల్లకూడా, రెండు కొవ్వొత్తులు రెడీగా పెట్టుకుంది, ఒకటి బొచ్చుకుక్కకి, రెండొవది ఆ పిల్లాడికి.
పెద్దన్నయ్య & పెద్దొదిన వాళ్ళూ బావున్నారు. మొన్నా వాళ్ళింటికి క్తి వెళ్ళీనప్పుడు, పెద్దొదిన అద్భుతమైన అల్లంపచ్చడితో అరటికాయ బజ్జీలు పెట్టింది, కానీ, బజ్జీలు వేడిగా వుంటే బావుండేది.
అన్నయ్యా! మరే నువ్వు పంపించిన అరటి పువ్వు, మన పెద్దన్నయ్య వాళ్ళింటినుంచి తెచ్చుకున్నాను. అరటిప్ పువ్వు చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. “అబ్బ్బా భలే వుంది, భలే వుంది!”, అని వాళ్ళ స్నేహితులని పిలిచిచూపించారు. మీ మరదలు కూడా, "ఎంతైనా బావగారి మనసు పువ్వులాగ మెత్తనిది అని తెలుసుగాని, అరటిపువ్వంత పెద్దదని ఈరోజే తెలిసింది" అని మురిసిపోయింది.
పిల్లలు ఈ పువ్వుని ఫ్లవర్ వాజ్ లో పెట్టాలా లేక గిన్నెలో పెట్టి నీళు పొయ్యాలా అని ఏకాభిప్రాయానికి రాలేక, పువ్వు మా మొహాన పడేసిపోయారు. అరటి పువ్వుని ఏలా వొండాలో తెలియక కొంచెం తికమక పడ్డాము. ఈసారి, అరటి పువ్వు వడలు వేయించి పంపించు. వదిన చేతి వంట అమృతం. ఈ సారి వచ్చినపుడు, బొబ్బట్లు కావాలని అడిగానని, వదినకు చెప్పు. అన్నయ్య, ఈ విషయం మర్చిపోకు, నాకు నూనే & డాల్డా పడవు, మంచి నెయ్యి తెప్పించి వుంచు.
కాలి ఫ్లవర్ కి అరటి పువ్వుకి వున్న తేడ-అతేడాలమీద ఇంక చర్చ జరుగుతూనే వుంది. మన రామి గాడు, యు ట్యుబ్ తెరిచి భారత దేశ అరటి పువ్వులు పెద్దవా లేక ఆఫ్రికావి పెద్దవా అని పరిశొధన మొదలుపెట్టాడు. ఆఫ్రికా అంటే గుర్తుకువచ్చింది, ఈ నెల చివరికి మా పెద్ద బావమరిది ఆఫ్రికా వెళుతున్నాడు. వాళ్ళు సిటికి వచ్చి ఒక పది రోజులు వుండి సామాను అవి పాకింగ్ చేసుకోవాలట. హోటల్ లో వుంటాము అంటే, "మీకు ఊరూ అదీ పెద్దగా తెలియదు, ఎందుకు మా అన్నయ్య ఇంట్లోనే వుండాలి”, అని చెప్పా. ఈ నెల ఇరవయ్యో తారీఖున మా పెద్దబావమరిది, వాళ్ళ ఆవిడా, మా అత్తగారు, మా బావమరిది అత్తగారు & మావగారు వస్తున్నారు. వాళ్ళకు ముందే చెప్పా, మా అన్నయ్య అంటే, అతిధి సత్కారంలో అభ్యుదయవాది, ఏమి మొహమాట పడొద్దు అని. ఈ మందనంతా నీ మీదకు తోలుతున్నా. కానీ, నువ్వు కాకపొతే మాకు మాత్రం ఎవరు వున్నారు,
అన్నయ్యా! ఒక్క విషయం, మా బావమరిదికి వడియాలు, అప్పడాలు, ఊరుమిరపకాయలు లేకపోతె ముద్ద దిగదు, వాళ్ళ ఆవిడకి ఇంగువ పడదు. ఇంఖొకటి వాళ్ళ అత్తగారికి & మావగారికి కొద్దిగా మడి - ఆచారం పట్టింపు ఎక్కువ, బాత్రూం కూడా పసుపునీళ్ళతో శుద్ధి పెట్టెంత సదాచార సంపన్నులు. పనిమనిషి ఇంట్లోకి రానివ్వరు. ఎదో ఒకలాగ, అడ్జస్ట్ చేసుకోండి, అయినా ఇలాంటివన్ని వదిన చూసుకుంటుందిలే. మా అత్తగారికి, పాపం ఇలాంటి పట్టింపులు ఏమిలేవుగాని, ఒకళ్ళు వాడిన పరుపులు, దుప్పట్లు ఆవిడకి నిషిద్ధం, కొంచెం కొత్త పరుపులు దిళ్ళూ అవి .....అయినా ఇన్వన్ని నేను చెప్పాలా, మనిషిని చూడగానే మనస్తత్వం తెలుసుకునే గొప్ప అనుభవం కలవాడివి. అందరూ పెద్దవాళ్ళు కదా, వాళ్ళూ సిటిలో తిరగడానికి కారు అయితే ఇబ్బంది పడకుండా వుంటారు.
ఈ మధ్య ఊరేళ్ళినఫ్ఫుడు, మన పదమూడో ఎక్కం లెక్కల మాస్టారు కనిపించారు. వీధి అరుగు మీద కూర్చుని, చుట్ట కాల్చుకుంటూ హాయిగా వున్నారు. చుట్ట అంటే, గుర్తుకువచ్చింది, అంబర్పేటలో కొత్తలంక నాటు పుగాకు చుట్టలు దొరుకుతాయిత, ఒక పది పాకెట్లు మా మావగారికి పంపించె ఏర్పాటు చెయ్యి. మా అత్తగారు తిరిగి వెళ్ళేటప్పుడు, ఇంకొ పాతిక తెప్పిస్టే చాలు, ఆవిడె తీసుకు వెళ్తుంది.
అన్నయ్యో!! అసలు విషయం మర్చేపోయాను, తాతారావు దగ్గిర కౌలు డబ్బులు వసూలుచేసికొని వచ్చా! బాంకిలో వెయ్యొచ్చులే అనుకుంటూ, మా పెళ్ళి రోజున మీ మరదలికి వడ్డాణం కొనిపెట్టి సర్ప్రైజ్ చేశా, చాల థ్రిల్లైపోయింది. అయ్యో పంట డబ్బులన్నీ మనమే వాడేస్తున్నాము, మూడెళ్ళుగా ఇలాగె చేస్తున్నము, ఇదేమి పద్దతి కాదు అని బాగ చీవట్లేసింది. అక్కయ్యకి & బావగారికి ఎమైనా తీసుకోవాలని పట్టుబట్టింది. అంతే, నాకు కొద్దిగా సిగ్గనిపించి వదినకి ఒక మాంచ్ఛి కాటన్ చీర, నీకు ఒక రాం రాజ్ పంచె కొన్న, అదికూడా పాలతెలుపుది. నాకు తెలుసుగా అన్నయ్య నీ నిరాడంబరత్వం , వదిన అభిరుచి. ఆ తెల్లటి కొత్త బట్టల్లో మీరిద్దరు బ్రహ్మ & సరస్వతి లాగ బావుంటారని, పిల్లలు కూడా వూహించుకుని మురిసిపోయారు. నిజమే అన్నయ్య, నువ్వు ఆ తెల్లని పంచె కట్టుకుని, తలకి హెల్మెట్ పెట్టుకుని బండి మీద కూర్చుంటే, బ్రహ్మదేవుడు బజాజ్ స్కూటర్ తోలుతున్నట్లుంది. (ఏమిటో, నేనుకూడా ఊహల్లోకి వెళ్ళిపోయాను)
నా స్నేహితుడు, స్కూటర్ సుబ్బారావు నీకు గుర్తున్నాడా? అదే అడ్డరోడ్డు దగ్గిర సోడా కొట్టు శంకరం గారి అబ్బాయి, కిందటి వారం ఏడ్చుకుంటూ వచ్చాడు. వాడి వ్యాపారం దెబ్బతిని ఇంట్లో నానా గొడవలు అయ్యి, పాపం కుంగిపోయాడు. కష్టాల్లో వున్న స్నేహితుడిని ఆదుకోవడం ధర్మం కదా! నువ్వు మామిడితోటకి కంచె వెఏయించమని నువ్వు పంపించిన మూడు లక్షలు వాడికి ఇచ్చి పంపించాను. వడ్డి ఇస్తానంటే, "వద్దు, మా అన్నయ్య కి అలా అన్యాయంగా సంపాదించడం ఇష్టం వుండదు" అని చెప్పి వాడికి వీలైయినప్పుడే అసలు ఇమ్మని ధైర్యం చెప్పి పంపించాను. వాడు కూడా నీకు కోటి, కోటి దణ్ణాలు చెప్పమన్నాడు. నీ ఋణం ఈజన్మలో తీర్చలేనన్నాడు, వచ్చే జన్మలో నీకూ కాలి చెప్పునై పుడతానన్నాడు. ఇంతకి వాడి వ్యాపారం ఏంటి అంటావా? స్వయం ఊపాధి పధకం కింద బాంకిలో అప్పు తీసుకుని, చిన్న పేకాట క్లబ్బు పెట్టుకున్నాడు. ఇంటికి భోజనానినికి పిలిచి, మనం తినకపోతే బావుండదు కదా! అలాగే వాడు కూడా కొద్దిగా చెయ్యి కలిపి, వెర్రి వెధవ మోసపోయాడు. పులి మీద పుట్రలాగ, సెక్యూరిటీ ఆఫీసర్ల రైడింగ్ ఒకటి. పూర్తిగా నలిగిపోయాడు. నువ్వే వాడిని ఎలాగైనా ఆదు కొవాలి. నీ స్నేహితుడు సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్పీ రెడ్డిగారితో కొద్దిగా చెప్పించు. నీ తరఫున, లాయర్ రావు గారితో నేను మాట్లాడేసాను.
అన్నయ్యా! నన్ను క్షమించు! నీకు ఏమైనా కోర్టు సమన్లు వచ్చివుంటే. క్రిందటి నెల డ్రంక్ & డ్రైవ్ లో పోలిసులు పట్టుకుంటే, నేనే నీ పేరు చెప్పి, నీ పాత డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేసా. నీ చిన్నప్పటి ఫోటో కదా, వాళ్ళు కూడా నమ్మేసారు. కొర్టు ఫైన్లు అవి ఇప్పుడు మాములే, పెద్దగా పట్టించుకోకు. నువ్వు అసలే సున్నిత మనస్కుడువి. డబ్బు కట్టి వదిలించేసుకో.
వారం వారం నీకు ఉత్తరాలు రాయాలని, ఇంకా నీతో ఎన్నో ఎన్నో పంచుకోవాలని తహ తహలాడుతున్నాను.
ఇట్లు,
నీ తమ్ముడు!
PS: వదినమ్మకు వేల వేల వందనాలు. ఈ ఉత్తరం అందగానే, నీ క్షేమ సమాచారాలు తెలియచేయడం మర్చిపోకు.

ఈ కథ నేను రాసినది... కాదు - భాస్కరచంద్ర
[Image: E.jpg]
"హలో".అంటూ మొబైల్ కాల్ తీసుకున్నాను.
"కంగ్రాట్స్ కన్ఫ్యూషన్" అన్నది అవతలి గొంతు.
నన్ను కన్ఫ్యూషన్ అని పిలి చేoత సాన్నిహిత్యం ఉన్న ఒకే ఒక వ్యక్తి గురునాధం.
"ఏమిట్రా! గురునాధం సరిగ్గా తెల్లవారను లేదు అప్పుడే కాల్ చేసావ్ , ఎంటో చెప్పు" అన్నాను నిద్ర కళ్ళను నలుపుకుంటూ.
"ఇంకా నిద్ర మబ్బు లోనే ఉన్నట్లున్నావే , ఎనీహౌ కంగ్రాట్స్ రా, పార్టీ ఎప్పుడో, ఎక్కడో చెప్పు "అన్నాడు.
"పార్టీ దేనికి రా? ముందు విషయం ఏంటో చెప్పి చావు" అన్నాను చిరాగ్గా , మంచం మీది నుంచి కిందికి దిగుతూ.
"ఈ రోజు పేపరు ఇంకా చూసి నట్టు లేవు!? అదేరా సండే మ్యాగజీన్ చూసావా ?" అని ఆతృతగా అడిగాడు.
గురునాధం కూడా నాలాగే ఏవో రాస్తూ ఉంటాడు.రాసి ఆయా పేపర్లకు, వీక్లీలకు పంపిస్తూ ఉంటాడు.అవి అచ్చయినప్పుడల్లా నాకు ఫోను చేసి చెప్పడం చేస్తూ ఉంటాడు.
నిజానికి నాలో రాయాలనే కోరికను నాటింది వాడే.
ఇలా రాయి,ఆ పేపరు కు పంపించు, కథ అంటే ఇది,కథానిక అంటే అది , కథా వస్తువు, సన్నివేశం, పార్శ్వాలు ఇలా ఎన్నో విషయాల గూర్చి చర్చించే వాడు.అయితే నాకు ఇవన్నీ అంతగా తెలిసేవి కావు, కాని ఏదో విషయం చూసినప్పుడు మాత్రం దాని గురించి రాయాలని అనిపించేది.అలా ఒకటి రెండు సార్లు రాసి గురునాధం కు చూపిస్తే ,చాలా బాగా రాశానని మెచ్చు కొన్నాడు.అతని మెచ్చుకోలు నన్ను ఇంకా ఇంకా రాసేలా చేసింది .ఈ విషయంలో నన్ను బాగా ప్రోత్సహించే వ్యక్తి అంటే వాడే.
అతను చెప్పినట్టే కొన్ని కథలు రాసాను, వాటిని సామాజిక మాధ్యమాలలో షేర్ కూడా చేసాను.కొందరు లైక్ చేస్తే మరి కొందరు కామెంట్స్ పెట్టేవారు.
వాళ్ళు పెట్టే కామెంట్స్ , పొగడ్తలు నన్ను మరింత రాసే లాగా ఉసి గొలిపేవి. దాంట్లో ఏదో తెలియని కిక్కు ఉండేది.
ఈ రోజు గురునాధం పొద్దున్నే కాల్ చేశాడు అంటే ,అతని కథేదో అచ్చయిఉంటుంది, అయితే ఈ సారి మాత్రం నాకు కంగ్రాట్స్ చెప్పడం వింతగా ఉంది.ఏమిటో అంతా కన్ఫ్యూషన్ గా ఉంది.
ఏ విషయాన్ని క్లియర్ గా చెప్పడు, పైగా నన్నే కన్ఫ్యూషన్ గాడినని హేళన చేస్తుంటాడు. వీడి తో వచ్చి పడే గొడవే అది.
నిద్ర తేలిపోయింది.అద్దం ముందు నిలబడి జుట్టూ సరి చేసుకొంటూ,"ఇంతకీ విషయం ఎంటో చెప్పరా బాబు " అన్నాను.
"ఏమి లేదురా ,నీ కథ ఆదివారం అనుబంధంలో అచ్చయింది అంతే." అన్నాడు ఆనందంగా.
ఇంకా ఏదో మాటాడుతున్నాడు.
అంతే నాకేమి అర్థం కాలేదు. షాక్ కు గురైనట్లు అనిపిస్తుంది.ఫోను కట్ చేసి అద్దo లో నన్ను నేను చూసుకున్నా. అది నేనే. ఇది నిజమే.కల అయితే కాదు అన్న నిర్ధారణకు వచ్చాను.
ఇది మొదటి సారిగా అచ్చయిన కథ.ఏదో సామాజిక మాధ్యమాల్లో,వాట్సాప్ గ్రూపుల్లో చిన్న చిన్న రచనలు చేశాను. కానీ ఒక ప్రముఖ పత్రిక అదివారం అనుభందం లో అచ్చవడం అంటే నాకు మాత్రం గొప్పే.ఇది ఆషామాషీ విషయం అయితే కాదు.
శరీరం అంతా గాల్లో తేలినట్లు అనిపించ సాగింది.గొంతు కూడా ఎండిపోయినట్లని పించ సాగింది.
ముందుగా, తొందరగా వెళ్ళి పేపరు తెచ్చుకోవాలి.ముందే
మా కాలనీ కొంచం రిమోట్ ఏరియాలో ఉంటుంది.ఇక్కడి నుండి స్టేషనరీ షాప్ రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.అక్కడ కూడా చాలా తక్కువగా వార్త పేపర్లను అమ్మకానికి పెడతారు.
కిచెన్ లోకి వెళ్ళి ఓ గ్లాసు నీరు తాగి ఎండీ పోతున్న గొంతుని తడిపి,అలాగే బైక్ తీసుకుని స్టేషనరీ షాప్ కేసి బయలు దేరాను .
బైక్ మీద వెళుతూ ఉంటే గాల్లో తేలినట్లు అనిపించ సాగింది.మనసులో ఏదో చెప్పలేని అనుభూతి.
లక్షల్లో సర్కులేషన్ ఉన్న పత్రిక అది.రాష్ట్రంలో నే పెద్ద పత్రిక. నిజంగా అలాంటి పత్రికలో నా కథ రావడం అదృష్టమే?!
బైకు పక్కనే పార్కింగ్ చేసి , పక్కనే ఉన్న బుక్ స్టాల్ కి వెళ్ళాను.ఆదివారం కావడం మూలాన సెంటర్లో రద్దీ తక్కువగానే ఉంది.
"పేపరు ఇవ్వమని" పది రూపాయలు నోటు అతనికి ఇవ్బబోయాను, అతను నేనడిగిన పేపర్ స్టాక్ అయిపోయిందన్నాడు.అది తప్ప అన్ని ఉన్నాయి. ఏవేవో పత్రికల పేర్లు చెప్పుతున్నాడు, కానీ అవేవీ నాకు అవసరం లేదు.
అక్కడ కాక మరెక్కడా వార్తా పత్రికలు దొరకవని నాకు తెలుసు. కొంచం నిరాశ కలిగింది. అయినా వేరే మార్గ లేదు.
కాలి చేతుల్తో ఇంటికి రావాల్సి వచ్చింది.
అయినా ఈ పత్రికల వారు కూడా అంతే,'అయ్యా మీ రచన పలాన తేదీన అచ్చవుతున్నది అని ఇంటిమేషన్ ఇస్తే వీరి ముల్లేం పోతుంది.ఓ మెయిల్ మా ముఖాన పడేస్తే ,మా ఏర్పాట్లు ఏవో మేం చూసుకుంటాం కదా! అని లోలోన గొణుక్కుని వాలు కుర్చీలో కూలబడ్డాను.
నా పరిస్తితి అంతను గమనిస్తున్న మా చిన్నోడు కారణ మడిగాడు.
"ఈ రోజు పేపర్లో నా కథ ప్రచురించారట.ఇప్పుడే గురునాధం అంకుల్ ఫోన్ చేసి చెప్పారు.తీర ప్రయాస పడి స్టేషనరీ షాపుకని అంత దూరం వెళితే, అక్కడ పేపర్స్ అయిపో యాయట" అని నిరాశగా చెప్పాను.
దానినీ వాడు చాలా తేలికగా తీసుకొని, "ఇంత దానికి బాధ పడటం ఎందుకు? నన్నడిగితే ఇంకో మార్గం చూపేవాన్నీ " కదా అన్నాడు.
"అ మార్గం మేదో చెప్పరా బాబు " బ్రతిమాలుకోలు గా అడిగా.
నన్ను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి, తన సిస్టమ్ ఆన్ చేశాడు.సదరు పేపరు ఈ ప్రతిని స్క్రీన్ పై ఇట్టే చూపించి నా సమస్యను పరిష్కరించాడు.
సరాసరి కథ ఉన్న పేజీని క్లిక్ల్ చేశాను.
'అచ్చు కానీ కథ" అన్న శీర్షికతో కథ ఉంది.
నిజానికి ఈ శీర్షికతో నేను కథ రాసినట్టు నాకైతే గుర్తుకు రావడం లేదు.
కింద మాత్రం రచయితగా నా పేరే ఉంది .ఒకటికి రెండు మార్లు చదివి చూసాను, కచ్చితంగా అది నా పేరే.
" ఈ మధ్య ఎన్నో రాసా ,ఎన్నో పేపర్లకు పంపా , ఏ పేరు తో ఏ పత్రికకు పంపానో ఏమీ గుర్తు ఉంటుందిలే "అని సర్దుకున్నాను.ఏది ఏమైతేనేం నా పేరుతో కథ అచ్చయింది అదే పది వేలు.
అదేమైనా చిన్న పత్రికా ,పెద్ద పేరున్న పత్రిక.నే పెట్టిన పేరు స్టోరీ కి సరిపోలేదని వారికి నచ్చిన లేదా కథకి అనుగుణంగా ఉన్న పేరు పెట్టి ఉంటారు.నే పెట్టిన పేరే పెట్టాలని రూల్ ఉందా అని సముదాయించుకొన్నాను.
పేరులో ఏముంది..కథ ముఖ్యం. సబ్జెక్ట్ అదే విషయం మనది అయితే చాలు, ఏ పేరు పెడితే మనకేంటి నష్టం అని మనసును కుదుట పరుచు కొన్నాను.
రచయిత పేరును మల్లీ ఒక్కసారి సరిచూసుకున్నా. అక్కడ అచ్చయింది నా పేరే.దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు.
నాకేమో కాగితం పేపర్ చదివితేనే తృప్తి.ఈ స్క్రీన్ పై చదవాలంటే నాతో కాని పని.అయినా కొంచం చదివి చూద్దామని ,కళ్ళని అక్షరాలు వెంట పరిగెత్తించా.
విషయం నాకైతే అర్థమైనట్టు లేదు. కథ మొదలు మాత్రం ఆసక్తికరంగా ఉంది. కానీ ఏ విషయం పై ఈ కథ అన్నది ఇంకా స్పురించడం లేదు.మొదటి పేర చదివాను.కానీ కథా వస్తువు ఏమిటో అర్థం కాలేదు..

"నాకంటే పత్రికల వాళ్లకు అనుభవం ఎక్కువ. వాళ్ల దగ్గర ఎంతో అనుభవస్తులైన ఎడిటర్లు, పాత్రికేయులు కంటెంట్ రైటర్స్ ఉంటారు .కథలో కొత్తదనం ఉండాలని తమ సృజనాత్మకత ఉపయోగించి కథను భిన్న కోణం నుంచి రాశారేమో .
"వారు ఎంతైనా ఉద్ధండులు ఏమైనా చేయగలరు" అని మనసుకు మళ్ళీ నచ్చచెప్పకున్నా.ఇంతలో మొబైల్ రింగ్ అయ్యింది. మొబైల్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ చూస్తే అదే గురునాధం కాల్. కాల్ రిసీవ్ చేసుకుంటూ
" హలో,ఏంటోయ్ " అన్నాను.
"చూసుకున్నావా "అని అడిగాడు గురునాధం.
"లేదు రా! పత్రిక దొరకలేదు.అయినా మా వాడు నెట్ లో చూపించాడు..కానీ...."అని ఏదో అనే లోపు మళ్ళీ అతడే ఆశ్చర్యం గా చెప్పడం మొదలు పెట్టాడు."అబ్బా ఈ కాలంలో ఎవడ్రా పేపరు చదివేది ? అన్నీ స్క్రీన్ మయమే.సిస్టమ్ లో చూచావు కదా "అన్నాడు.
అవును అనీ వింటున్నట్లు ఉ అన్నాను.
"కథ బలే రాశావ్.శిల్పం బాగుంది.కథ నడిపించే విధానం బ్రహ్మాండం.ఇక ముగింపు అంటావా అదిరింది. .."ఇంకా ఏమేమో అంటున్నాడు.నాకేమో ఏమి అర్థం కాలేదు.
ఇంతకీ అది ఏ కథ?.దాని సబ్జెక్ట్ ఏంటి ? అస్సలే నాకు ఈ శిల్పాలు , కథనాలు ముగింపులు అస్సలే తెలియవు.
అసలు ఏమి రాశానో నాకే అర్థం కావట్లేదు.
.
వాడు ఏదో చెపుతూనే ఉన్నాడు.
నేను మాత్రం ఇంకా కన్ఫ్యూషన్ మోడ్ లోనే ఉన్నాను.వాడే మళ్ళీ కల్పించుకొని, "వాట్స్ అప్ చూడు, కథని పిడిఎఫ్ లో పంపించా. తెలిసిన అందరికీ , వాళ్ళ వాళ్ళకి, గ్రూపులో ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసేయి. లైకులు, కామెంట్స్ ఇంకా ..."ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతున్నాడు గురునాధం.
వాడు చెప్పినట్టే, దాన్ని తెలిసిన బంధువులకు, సహోద్యోగులకు, తెలిసిన గ్రూప్ లకి ఫార్వర్డ్ చేశా.కాకుంటే చాలా సింపుల్ గా వాడు ఎలా పంపించాడు అలా గే అందరికి పంపించాను.
ఇది నా కథ అని ,ఎలాంటి వివరణ లేకుండానే సింపుల్ గా పేస్ట్ చేశా.కారణం నాకు కూడా సబ్జెక్ట్ తెలియదు కాబట్టి.
ఏదో గురునాధం చెప్పాడు,నే చేశాను అన్నట్టు ఉంది నా వ్యవహారం.
ఆ రోజు అంతా ఇదే సందడితో గడచి పోయింది.
కనీసం ఈ కథ పైi వచ్చే సమీక్షలు, కామెంట్స్ అయినా నాకు పంపుతారో లేదో ! వాటికి కూడా వారే జవాబులు రాస్తారేమో ! ఒక వారం వేచి చూస్తే గాని అర్థం కాదు.
మరు నాడు ఆఫీసుకి వెళ్ళాను.ఒకరిద్దరు తప్ప మిగతా స్టాఫ్ అంతా ,ఏదో ఒక సందర్భంలో అభినందించారు.
వారం మధ్యలో, ఓరోజు ఆఫీసు లో కాలిగా ఉన్నాను.
ఎన్నో కథలు రాసా, కానీ ప్రింటయినది మాత్రం ఇది ఒక్కటే.ఇంతకీ నేనేమి రాశాను ,ఈ పత్రికల వాళ్ళకి ఎందుకు నచ్చింది., ఇంతకీ నేను రాసిన కథలో ఏమేమి మార్పులు చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మున్ముందు రాసే కథల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చని కథను ప్రింటు తీసుకొని చదవడం మొదలు పెట్టా.
కథలో పెద్దగా గొప్పదనం ఏమి కనిపించ లేదు.ముగింపు నచ్చలేదు.కథకి ,కథ పేరుకు ఎలాంటి సంబంధం లేదు. కథను నడిపిన తీరు కూడా ఏమంత రుచించలేదు.
ఈ కథ నేనే రాసానా అన్న అనుమానం వచ్చింది.
ఇంతకీ నేను ఈ కథను,ఈ పత్రికకు పంపించాన అన్న అనుమానం వస్తుంది.
ఒక్క సారి ఔట్ బాక్స్ లోకి వెళ్ళి చెక్ చేస్తే, ఈ మధ్యన పంపిన కథల్లో అలాటి వేవి కనిపించలేదు.
అసలు ఈ పత్రికకు పంపిన ఆనవాళ్లే లేవు.ఒక సారి ఇన్
బాక్స్ చూసా, సదరు పత్రిక నుండి వచ్చిన ,నమస్కారం మీ కథ ప్రచురణకు స్వీకరించబడలేదు ,గమనించగలరు.
లాంటి రిగ్రెట్ సమాధానాలే ఎక్కువగా ఉన్నాయి.
అయితే, ఎక్కడో పొరపాటు జరిగింది.
రాజులు గడిచి, మరో ఆదివారం ముందుకు వచ్చింది.
పోయిన వారం ఉన్నంత ఉత్సాహం మాత్రం లేదు.పత్రికను తెచ్చుకోవడానికి పరిగెత్తాలని కూడా అనించలేదు.
ఇంతలో గురునాధం కాల్ వచ్చింది.
కాల్ తీసుకొని హలో అన్నాను.గొంతులో మెతకథనం.
"సారీరా, నేనే కన్ఫ్యూషన్ అయ్యాను.నిన్ను కూడా కన్ఫ్యూస్ చేశాను..."
వాడు ఏమీ చెప్పలను కుంటున్నాడో చూచాయగా అర్థం అవసాగింది.
మౌనంగా వింటున్నాను.
"ఆ కథ నీది కాదు రా! నీ పేరుతో నే ఉన్న మరో రచయితది. నేనే ముందు వెనుక చూడకుండా ,నిన్ను కన్ఫ్యూస్ చేయడమే కాకుండా అంతటా ప్రచారం చేసేలా ఉసిగొలిపాను"
మౌనంగా వినడం నా వంతయ్యింది.
"నిన్న ఆ కథకు సమీక్ష రాసి అదే పత్రికకు రాసి పంపాను. సమీక్ష తో పాటు,రచయిత జవాబు కూడా ప్రింటు చేయబడింది.అప్పుడు గాని నాకు నిజం బోధపడలేదు. సారి " అన్నాడు గురునాధం.
నేను ఏం జవాబు చెప్పలేదు .మౌనంగా వింటున్నాను.
"సరే లేరా??!! కనీసం ఒక్క రోజైనా ఏదో సంతోషంలో మునిగి తేలాం కదా,అదే చాలులే "అని సర్ది చెప్పాను.
సామాజిక మాధ్యమాల లో,ఫేస్ బుక్ పేజీల్లో
కంగ్రాట్స్ ,లైకులు కామెంట్స్ పెట్టిన వారందరికీ రిప్లై ఇస్తూ, "ఇది నే రాసిన కథ కాదు, నా పేరు తో ఉన్న మరో రచయిత రాసిన కథ ,ఏదో బాగుందని మీ అందరితో షేర్ చేసుకున్నాను.ధన్యవాదాలు" అని పోస్ట్ చేశాను.
మనసు ఇప్పుడు ఎందుకో నిజంగా తేలికగా ఉంది. లేకున్నా చేసుకోవాల్సిందే అదే జీవితం...
___సమాప్తం___

భామనే... సత్య... బామ్మ నే - కొడవంటి ఉషా కుమారి
[Image: B.jpg]
“ఒరేయ్! చందు! మాట్రిమోనీ కి పేరు పంపిద్దాం అనుకుంటున్నాను! నువ్వు ఏమంటావ్?” అంది బామ్మ చందుతో.
 “నువ్వు మరీనుబామ్మ! ఈ మధ్యనేగాడిగ్రీ పూర్తయింది! సిగ్గుతో నేలమీద బొటకన వేలితోరాస్తూ అన్నాడు.
 “ నీ మొహం! నీ పేరు కాదు నేను ఇచ్చేది!”
“ మరి ఎవరిది?” ఆశ్చర్యంగా అన్నాడు చందు.
 “ నాదే!” గర్వంగాఅంది బామ్మ. ఏంఅందుకు నేను తగనా!” మేకప్ సరి చేసుకుంటూ అంది బామ్మ.
 “ నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి! పెళ్లి కావలసిన కుర్రాడిని చెట్టంత మనవడిని నేనుఉండగా!” అంటూ ఆశ్చర్యంగా అన్నాడు.
 “సరేలే నువ్వు ఎలా ఫీల్ అయితే నాకేంటి! నేను మాత్రం పంపిస్తాను నా వివరాలు!” “అబ్బా! పరువు పోతుంది బామ్మ!” చేత్తో తల కొట్టుకుంటూ అన్నాడు.
 “సరేలే! నీకు పరువు ఎక్కడ ఏడ్చింది!” “అయినా నాకు తెలియక అడుగుతాను! నీకు ఈ వయసులో పెళ్ళి అవసరమా! ఎవరు వస్తారు!” కోపంగా అన్నాడు చందు.
 “చూస్తూ ఉండరా! ఎంతమంది వస్తారో!” అనింది బామ్మ.
మర్నాటికల్లా చాలా మంది కాంటాక్ట్ లోకి వచ్చేసారు.
చందు ఆశ్చర్యపోయాడు
. “నిన్నఏదో అన్నావుగా!” వెటకారంగా అంది బామ్మ.
 “ఇదేంటి! ఇది నిజమా! కలా!” ఆశ్చర్యంగా అన్నాడు.
 “ నిజంగా నిజం! ఇప్పుడు నాకు చేతి నిండా పని!” అంటూ వివరాలు చూడటం మొదలుపెట్టింది. మొత్తాన్ని ఫిల్టర్ చేసిఐదుగురిని ఎంచింది బామ్మ.
 “ఇదేంటి బామ్మ! అయిదుగురిని ఎంచావు! కొంపతీసి ఐదుగురిని!” అంటున్నమనవడినెత్తిమీదఒకమొట్టికాయ వేసింది.
 “మాట్లాడకుండా చూస్తూ ఉండు అంది.” ఐదుగురిని ఇంటికి ఆహ్వానించారు కానీ ముగ్గురు మాత్రమే వచ్చారు. బామ్మ దర్జాకి అంతే లేదు. తానేదో శివగామి అయినట్లు బోల్డంత బిల్డప్పు.
 “సరే! మీ ముగ్గురు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి! పెళ్ళికి నన్నే నిర్ణయించుకోవడానికి కారణం చెప్పండి?” అంది బామ్మ.
మొదటి వ్యక్తి: “మీరు ఎక్కువ ఏజ్ లో ఉన్నారు! పైగా మీ వెనక బోలెడంత ఆస్తి ఉంది! అదంతా నాకేగా!” నేలచూపులు చూస్తూ సిగ్గుగా అన్నాడు.
“ నువ్వు తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపో! అంది బామ్మ.
“ ఏమైంది?” అయోమయంగా అన్నాడు మొదటి వ్యక్తి.
“నా మనోభావాలు దెబ్బతిన్నాయి!” కోపంగా అంది బామ్మ.
 రెండవ వ్యక్తి: “నేను జీవితంలో చాలా అవకాశాలు కోల్పోయాను! ఇప్పుడు నాకున్న అవకాశం మీరు!” అన్నాడు.
 “ అలాగా!” కొద్దిగా రిలాక్స్ అయింది బామ్మ.
మూడో వ్యక్తి: “నా మనసులో ఏ భావాలు లేవు! మీరు ఎప్పుడు తాళికట్టమంటే అప్పుడు సిద్ధంగా ఉన్నాను.
 “ కానీ…..!” అంటూ దీర్ఘంగా ఆలోచించింది బామ్మ.
“ నా కోసం మీరు ఏం చేయగలరు?
” “ మీకోసం మల్లెపూలు మాలలు అల్లగలను!” అన్నాడు ఒక వ్యక్తి.
 “ నేను మీ ఇల్లు శుభ్రం చేస్తాను!” అన్నాడు మరొక వ్యక్తి.
బామ్మ ఆనందంగా చప్పట్లు కొట్టింది. “ నేను నీలాంటి వాడి కోసమే చూస్తున్నాను!” అనింది బామ్మ.
రెండో వ్యక్తి నిరాశగా వెనుతిరిగాడు.
“ ఇదిగో అబ్బాయి! నీ పేరు ఏమిటి?”
 “ మాధవ్! అందరూ మధు! అని పిలుస్తారు!”
 “ అవునా! నేను కూడా మధు! అనే పిలుస్తాను. ఇంట్లో బూజులు దులిపి శుభ్రం చేసి, ఇల్లంతా మాప్ పెట్టాలి.నీ పనితనం చూసి నీ విషయంలో నేనొక నిర్ణయం తీసుకుంటాను. నేనైతే కాసేపు నడుము వాలుస్తాను” అంది బామ్మ.
ఒక రెండు గంటల తర్వాత ఇల్లంతాపరిశీలనగా చూసింది. ఇల్లంతా తళ తళలాడిపోతోంది.
 “ నిజంగా నువ్వు గొప్ప పనివంతుడివి!కానీ చిన్న చిక్కు వచ్చి పడింది మధు!” అంది బామ్మ. “ఏమైంది!”మాధర్ అడిగాడు.
ఏం అవడం ఏముంది ఇందాక అలా కునుకు తీసానా! వీళ్ళ తాతగారు కలలోకి వచ్చారు! వచ్చారా!..... వచ్చి!....ఏమే! సత్య! నేను పోగానే మరో పెళ్లి చేసుకుంటావా! చేసుకున్నావంటే ఆ మాధుర్ని నిన్ను పట్టిపీడిస్తాను! అంటూ బెదిరించారు! అది సంగతి! ఏమైనా ఇల్లంతా శుభ్రం చేసావుగా! ఈ రెండు వేలు ఉంచు!” అంది బామ్మ.
 “ థాంక్యూ!” అన్నాడు మధు.
“ మధు! మీరేం ఫీల్ అవ్వడం లేదా!” అడిగాడు చందు.
“ నేను ముందే చెప్పానుగా! నాకు ఏ ఫీలింగ్స్ లేవని! రెండు వేలు సంపాదించానుగా! హ్యాపీ!” అన్నాడు మాధుర్ నవ్వుతూ.
అతను వెళ్ళాక “ఏంటి బామ్మ! ఏంటీ ట్విస్ట్!” అన్నాడు చందు.
“ ఏం లేదురా మనవడా! సంక్రాంతి పండగ వస్తోంది ఇల్లు శుభ్రం చేయాలి! పని వాళ్ళని పిలిస్తే ఎవరికి వాళ్లే ఖాళీ లేదంటున్నారు! అందుకే ఈప్లానువేసానన్నమాట! అటు కాలక్షేపం అయింది! ఇటు ఇల్లు శుభ్రపడింది! నా ఇగో కూడా సాటిస్ఫై అయింది!” అంది బామ్మ కళ్ళు మిటమిటలాడిస్తూ!
“బామ్మా! ఇంత ప్లాన్ ఉందా! నీ కడుపులో!” గట్టిగా నవ్వుతూ అన్నాడు. చందు.
 “ భామనే సత్య బామ్మనే!” అంటూ చిన్నగా కూని రాగం తీసింది బామ్మ.

ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఇట్లు, నీ తమ్ముడు! - అంతర్వాహిని
[Image: i.jpg]
ప్రియమైన అన్నయ్యకు, మీ ప్రియాతి ప్రియమైన తమ్ముడు, అనగా నేనే నమస్కరిస్తూ వ్రాయునది ...మేము చాలా బాగా వున్నాము, మీరంతా చాలా బాగా వున్నారని తలుస్తున్నాను.
పిల్లలు పెదనాన్న ఇంటికి ఎప్పుడు వెళతాము, అని కళ్ళూ కాయలు కాచేలాగ ఎదురు చూస్తున్నారు. మా చిన్నిరాముడికైతే కిందటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు వెట్ గ్రైండర్ లో ఇటుకురాళ్ళు & తుమ్మ జిగురు వేసి రుబ్బి చేసికున్న మజా అస్సలు మర్చిపోలెకపోతున్నాడు. ఈసారి అక్కడికి వచ్చి నప్పుడు, దాంట్లో ఫెవిక్విక్ కూడా వేసి ఏమవుతుందో చూడాలని ఉవ్విళ్ళూరూతున్నాడు. అయ్యో అన్నయ్యా, కిందటి సారి వెట్ గ్రైండర్ పాడైపోయిందని వదిన కేకలేసిందని మేమేమి అనుకోవటంలేదు. అలాగని, పిల్లల ఉత్సాహాన్ని కాదనలేము కద. మీ పెద్దల తిట్లు కూడా మాకు దీవనలే. ఏది ఏమైనా గాని, రుబ్బు రోలులో వదిన రుబ్బి వేసిన గారెలూ దూది పింజల్లా అద్భుతంగా వున్నాయి. కేవలం మేము ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు కలిసి నాలుగు దజన్లు ఎలా ఊదేశామో ఇంక అర్థం కావడంలేదు. పోతే పోయిందిలే వెధవ వెట్ గ్రైండర్, వదిన చేతుల్లో అద్భుతం వుంది. ఇంతమందికి పిండి రుబ్బాలంటే, జబ్బలు పడిపోతాయి, కష్టమే. అందుకనే, నెను పిల్లలకి ముందే చెప్పి వుంచాను, గారెలు తిన్న తరువాత పెద్దమ్మ చేతులకి జండుబాం రాస్తామని, పిల్లలు ప్రామిస్ చేసారు.
మా పిల్లది, ఈసారి బోల్డు పుస్తకాలు చదివి, చాలా పేపర్ కటింగ్స్ తయారు చేసి పెట్టుకుంది. పాపం కిందటి సారి, అది పక్కింటి పమేలా గారి బొచ్చుకుక్క పిల్లకి చేసిన హెయిర్ కటింగ్ సరిగ్గా రాలేదని, ఆ అస్తవ్యస్త కత్తెర విన్యాసానికి, పామెలా గారు చాల చిరాకు పడ్డారని, వారి అర్థ(భాగం?) పద్మారావు గారు పావు సీసా మందుతాగి విషయం వెళ్ళగక్కారు. హూ! ఏమి మనుషులు అన్నయ్యా వీళ్ళు, పిల్లలో పర్ఫెక్షన్ ఆశిస్తారు. అదీకాక, అదే కత్తెరతో పమేలా గారి చెల్లి కొడుక్కి కూడా హెయిర్ కటింగ్ చేసారని శ్రీమతి బోడెస్ గారు విరుచుకు పడ్డారు. ఆ బొచ్చు కుక్క కంచంలో నే కద, ఆ పిల్లాడు కూడా బువ్వ తింటాడు. ఆ ఎంగిలి వాళ్ళకి బావుంది కాని, హెయిర్ కటింగ్ కి ఒకే కత్తెర వాడితే, అంత గత్తర ఎందుకో?. వదిలెయ్ అన్నయ్య, ఈ సారి పిల్లది రెండు వేరే వేరే కత్తెర్లు వాడతానని మాట ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే, గత నెలలో కొత్త రకం పద్దతి నేర్చుకుంది, 'హెయిర్ బర్నింగ్' ట, కొవ్వొత్తి తో జుత్తు కాలుస్తారుట. అలా అయితే, కత్తెర్ల గొడవేలేదు. పిల్లకూడా, రెండు కొవ్వొత్తులు రెడీగా పెట్టుకుంది, ఒకటి బొచ్చుకుక్కకి, రెండొవది ఆ పిల్లాడికి.
పెద్దన్నయ్య & పెద్దొదిన వాళ్ళూ బావున్నారు. మొన్నా వాళ్ళింటికి క్తి వెళ్ళీనప్పుడు, పెద్దొదిన అద్భుతమైన అల్లంపచ్చడితో అరటికాయ బజ్జీలు పెట్టింది, కానీ, బజ్జీలు వేడిగా వుంటే బావుండేది.
అన్నయ్యా! మరే నువ్వు పంపించిన అరటి పువ్వు, మన పెద్దన్నయ్య వాళ్ళింటినుంచి తెచ్చుకున్నాను. అరటిప్ పువ్వు చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. “అబ్బ్బా భలే వుంది, భలే వుంది!”, అని వాళ్ళ స్నేహితులని పిలిచిచూపించారు. మీ మరదలు కూడా, "ఎంతైనా బావగారి మనసు పువ్వులాగ మెత్తనిది అని తెలుసుగాని, అరటిపువ్వంత పెద్దదని ఈరోజే తెలిసింది" అని మురిసిపోయింది.
పిల్లలు ఈ పువ్వుని ఫ్లవర్ వాజ్ లో పెట్టాలా లేక గిన్నెలో పెట్టి నీళు పొయ్యాలా అని ఏకాభిప్రాయానికి రాలేక, పువ్వు మా మొహాన పడేసిపోయారు. అరటి పువ్వుని ఏలా వొండాలో తెలియక కొంచెం తికమక పడ్డాము. ఈసారి, అరటి పువ్వు వడలు వేయించి పంపించు. వదిన చేతి వంట అమృతం. ఈ సారి వచ్చినపుడు, బొబ్బట్లు కావాలని అడిగానని, వదినకు చెప్పు. అన్నయ్య, ఈ విషయం మర్చిపోకు, నాకు నూనే & డాల్డా పడవు, మంచి నెయ్యి తెప్పించి వుంచు.
కాలి ఫ్లవర్ కి అరటి పువ్వుకి వున్న తేడ-అతేడాలమీద ఇంక చర్చ జరుగుతూనే వుంది. మన రామి గాడు, యు ట్యుబ్ తెరిచి భారత దేశ అరటి పువ్వులు పెద్దవా లేక ఆఫ్రికావి పెద్దవా అని పరిశొధన మొదలుపెట్టాడు. ఆఫ్రికా అంటే గుర్తుకువచ్చింది, ఈ నెల చివరికి మా పెద్ద బావమరిది ఆఫ్రికా వెళుతున్నాడు. వాళ్ళు సిటికి వచ్చి ఒక పది రోజులు వుండి సామాను అవి పాకింగ్ చేసుకోవాలట. హోటల్ లో వుంటాము అంటే, "మీకు ఊరూ అదీ పెద్దగా తెలియదు, ఎందుకు మా అన్నయ్య ఇంట్లోనే వుండాలి”, అని చెప్పా. ఈ నెల ఇరవయ్యో తారీఖున మా పెద్దబావమరిది, వాళ్ళ ఆవిడా, మా అత్తగారు, మా బావమరిది అత్తగారు & మావగారు వస్తున్నారు. వాళ్ళకు ముందే చెప్పా, మా అన్నయ్య అంటే, అతిధి సత్కారంలో అభ్యుదయవాది, ఏమి మొహమాట పడొద్దు అని. ఈ మందనంతా నీ మీదకు తోలుతున్నా. కానీ, నువ్వు కాకపొతే మాకు మాత్రం ఎవరు వున్నారు,
అన్నయ్యా! ఒక్క విషయం, మా బావమరిదికి వడియాలు, అప్పడాలు, ఊరుమిరపకాయలు లేకపోతె ముద్ద దిగదు, వాళ్ళ ఆవిడకి ఇంగువ పడదు. ఇంఖొకటి వాళ్ళ అత్తగారికి & మావగారికి కొద్దిగా మడి - ఆచారం పట్టింపు ఎక్కువ, బాత్రూం కూడా పసుపునీళ్ళతో శుద్ధి పెట్టెంత సదాచార సంపన్నులు. పనిమనిషి ఇంట్లోకి రానివ్వరు. ఎదో ఒకలాగ, అడ్జస్ట్ చేసుకోండి, అయినా ఇలాంటివన్ని వదిన చూసుకుంటుందిలే. మా అత్తగారికి, పాపం ఇలాంటి పట్టింపులు ఏమిలేవుగాని, ఒకళ్ళు వాడిన పరుపులు, దుప్పట్లు ఆవిడకి నిషిద్ధం, కొంచెం కొత్త పరుపులు దిళ్ళూ అవి .....అయినా ఇన్వన్ని నేను చెప్పాలా, మనిషిని చూడగానే మనస్తత్వం తెలుసుకునే గొప్ప అనుభవం కలవాడివి. అందరూ పెద్దవాళ్ళు కదా, వాళ్ళూ సిటిలో తిరగడానికి కారు అయితే ఇబ్బంది పడకుండా వుంటారు.
ఈ మధ్య ఊరేళ్ళినఫ్ఫుడు, మన పదమూడో ఎక్కం లెక్కల మాస్టారు కనిపించారు. వీధి అరుగు మీద కూర్చుని, చుట్ట కాల్చుకుంటూ హాయిగా వున్నారు. చుట్ట అంటే, గుర్తుకువచ్చింది, అంబర్పేటలో కొత్తలంక నాటు పుగాకు చుట్టలు దొరుకుతాయిత, ఒక పది పాకెట్లు మా మావగారికి పంపించె ఏర్పాటు చెయ్యి. మా అత్తగారు తిరిగి వెళ్ళేటప్పుడు, ఇంకొ పాతిక తెప్పిస్టే చాలు, ఆవిడె తీసుకు వెళ్తుంది.
అన్నయ్యో!! అసలు విషయం మర్చేపోయాను, తాతారావు దగ్గిర కౌలు డబ్బులు వసూలుచేసికొని వచ్చా! బాంకిలో వెయ్యొచ్చులే అనుకుంటూ, మా పెళ్ళి రోజున మీ మరదలికి వడ్డాణం కొనిపెట్టి సర్ప్రైజ్ చేశా, చాల థ్రిల్లైపోయింది. అయ్యో పంట డబ్బులన్నీ మనమే వాడేస్తున్నాము, మూడెళ్ళుగా ఇలాగె చేస్తున్నము, ఇదేమి పద్దతి కాదు అని బాగ చీవట్లేసింది. అక్కయ్యకి & బావగారికి ఎమైనా తీసుకోవాలని పట్టుబట్టింది. అంతే, నాకు కొద్దిగా సిగ్గనిపించి వదినకి ఒక మాంచ్ఛి కాటన్ చీర, నీకు ఒక రాం రాజ్ పంచె కొన్న, అదికూడా పాలతెలుపుది. నాకు తెలుసుగా అన్నయ్య నీ నిరాడంబరత్వం , వదిన అభిరుచి. ఆ తెల్లటి కొత్త బట్టల్లో మీరిద్దరు బ్రహ్మ & సరస్వతి లాగ బావుంటారని, పిల్లలు కూడా వూహించుకుని మురిసిపోయారు. నిజమే అన్నయ్య, నువ్వు ఆ తెల్లని పంచె కట్టుకుని, తలకి హెల్మెట్ పెట్టుకుని బండి మీద కూర్చుంటే, బ్రహ్మదేవుడు బజాజ్ స్కూటర్ తోలుతున్నట్లుంది. (ఏమిటో, నేనుకూడా ఊహల్లోకి వెళ్ళిపోయాను)
నా స్నేహితుడు, స్కూటర్ సుబ్బారావు నీకు గుర్తున్నాడా? అదే అడ్డరోడ్డు దగ్గిర సోడా కొట్టు శంకరం గారి అబ్బాయి, కిందటి వారం ఏడ్చుకుంటూ వచ్చాడు. వాడి వ్యాపారం దెబ్బతిని ఇంట్లో నానా గొడవలు అయ్యి, పాపం కుంగిపోయాడు. కష్టాల్లో వున్న స్నేహితుడిని ఆదుకోవడం ధర్మం కదా! నువ్వు మామిడితోటకి కంచె వెఏయించమని నువ్వు పంపించిన మూడు లక్షలు వాడికి ఇచ్చి పంపించాను. వడ్డి ఇస్తానంటే, "వద్దు, మా అన్నయ్య కి అలా అన్యాయంగా సంపాదించడం ఇష్టం వుండదు" అని చెప్పి వాడికి వీలైయినప్పుడే అసలు ఇమ్మని ధైర్యం చెప్పి పంపించాను. వాడు కూడా నీకు కోటి, కోటి దణ్ణాలు చెప్పమన్నాడు. నీ ఋణం ఈజన్మలో తీర్చలేనన్నాడు, వచ్చే జన్మలో నీకూ కాలి చెప్పునై పుడతానన్నాడు. ఇంతకి వాడి వ్యాపారం ఏంటి అంటావా? స్వయం ఊపాధి పధకం కింద బాంకిలో అప్పు తీసుకుని, చిన్న పేకాట క్లబ్బు పెట్టుకున్నాడు. ఇంటికి భోజనానినికి పిలిచి, మనం తినకపోతే బావుండదు కదా! అలాగే వాడు కూడా కొద్దిగా చెయ్యి కలిపి, వెర్రి వెధవ మోసపోయాడు. పులి మీద పుట్రలాగ, సెక్యూరిటీ ఆఫీసర్ల రైడింగ్ ఒకటి. పూర్తిగా నలిగిపోయాడు. నువ్వే వాడిని ఎలాగైనా ఆదు కొవాలి. నీ స్నేహితుడు సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్పీ రెడ్డిగారితో కొద్దిగా చెప్పించు. నీ తరఫున, లాయర్ రావు గారితో నేను మాట్లాడేసాను.
అన్నయ్యా! నన్ను క్షమించు! నీకు ఏమైనా కోర్టు సమన్లు వచ్చివుంటే. క్రిందటి నెల డ్రంక్ & డ్రైవ్ లో పోలిసులు పట్టుకుంటే, నేనే నీ పేరు చెప్పి, నీ పాత డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేసా. నీ చిన్నప్పటి ఫోటో కదా, వాళ్ళు కూడా నమ్మేసారు. కొర్టు ఫైన్లు అవి ఇప్పుడు మాములే, పెద్దగా పట్టించుకోకు. నువ్వు అసలే సున్నిత మనస్కుడువి. డబ్బు కట్టి వదిలించేసుకో.
వారం వారం నీకు ఉత్తరాలు రాయాలని, ఇంకా నీతో ఎన్నో ఎన్నో పంచుకోవాలని తహ తహలాడుతున్నాను.
ఇట్లు,
నీ తమ్ముడు!
PS: వదినమ్మకు వేల వేల వందనాలు. ఈ ఉత్తరం అందగానే, నీ క్షేమ సమాచారాలు తెలియచేయడం మర్చిపోకు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఈ కథ నేను రాసినది... కాదు - భాస్కరచంద్ర
[Image: I.jpg]
"హలో".అంటూ మొబైల్ కాల్ తీసుకున్నాను.
"కంగ్రాట్స్ కన్ఫ్యూషన్" అన్నది అవతలి గొంతు.
నన్ను కన్ఫ్యూషన్ అని పిలి చేoత సాన్నిహిత్యం ఉన్న ఒకే ఒక వ్యక్తి గురునాధం.
"ఏమిట్రా! గురునాధం సరిగ్గా తెల్లవారను లేదు అప్పుడే కాల్ చేసావ్ , ఎంటో చెప్పు" అన్నాను నిద్ర కళ్ళను నలుపుకుంటూ.
"ఇంకా నిద్ర మబ్బు లోనే ఉన్నట్లున్నావే , ఎనీహౌ కంగ్రాట్స్ రా, పార్టీ ఎప్పుడో, ఎక్కడో చెప్పు "అన్నాడు.
"పార్టీ దేనికి రా? ముందు విషయం ఏంటో చెప్పి చావు" అన్నాను చిరాగ్గా , మంచం మీది నుంచి కిందికి దిగుతూ.
"ఈ రోజు పేపరు ఇంకా చూసి నట్టు లేవు!? అదేరా సండే మ్యాగజీన్ చూసావా ?" అని ఆతృతగా అడిగాడు.
గురునాధం కూడా నాలాగే ఏవో రాస్తూ ఉంటాడు.రాసి ఆయా పేపర్లకు, వీక్లీలకు పంపిస్తూ ఉంటాడు.అవి అచ్చయినప్పుడల్లా నాకు ఫోను చేసి చెప్పడం చేస్తూ ఉంటాడు.
నిజానికి నాలో రాయాలనే కోరికను నాటింది వాడే.
ఇలా రాయి,ఆ పేపరు కు పంపించు, కథ అంటే ఇది,కథానిక అంటే అది , కథా వస్తువు, సన్నివేశం, పార్శ్వాలు ఇలా ఎన్నో విషయాల గూర్చి చర్చించే వాడు.అయితే నాకు ఇవన్నీ అంతగా తెలిసేవి కావు, కాని ఏదో విషయం చూసినప్పుడు మాత్రం దాని గురించి రాయాలని అనిపించేది.అలా ఒకటి రెండు సార్లు రాసి గురునాధం కు చూపిస్తే ,చాలా బాగా రాశానని మెచ్చు కొన్నాడు.అతని మెచ్చుకోలు నన్ను ఇంకా ఇంకా రాసేలా చేసింది .ఈ విషయంలో నన్ను బాగా ప్రోత్సహించే వ్యక్తి అంటే వాడే.
అతను చెప్పినట్టే కొన్ని కథలు రాసాను, వాటిని సామాజిక మాధ్యమాలలో షేర్ కూడా చేసాను.కొందరు లైక్ చేస్తే మరి కొందరు కామెంట్స్ పెట్టేవారు.
వాళ్ళు పెట్టే కామెంట్స్ , పొగడ్తలు నన్ను మరింత రాసే లాగా ఉసి గొలిపేవి. దాంట్లో ఏదో తెలియని కిక్కు ఉండేది.
ఈ రోజు గురునాధం పొద్దున్నే కాల్ చేశాడు అంటే ,అతని కథేదో అచ్చయిఉంటుంది, అయితే ఈ సారి మాత్రం నాకు కంగ్రాట్స్ చెప్పడం వింతగా ఉంది.ఏమిటో అంతా కన్ఫ్యూషన్ గా ఉంది.
ఏ విషయాన్ని క్లియర్ గా చెప్పడు, పైగా నన్నే కన్ఫ్యూషన్ గాడినని హేళన చేస్తుంటాడు. వీడి తో వచ్చి పడే గొడవే అది.
నిద్ర తేలిపోయింది.అద్దం ముందు నిలబడి జుట్టూ సరి చేసుకొంటూ,"ఇంతకీ విషయం ఎంటో చెప్పరా బాబు " అన్నాను.
"ఏమి లేదురా ,నీ కథ ఆదివారం అనుబంధంలో అచ్చయింది అంతే." అన్నాడు ఆనందంగా.
ఇంకా ఏదో మాటాడుతున్నాడు.
అంతే నాకేమి అర్థం కాలేదు. షాక్ కు గురైనట్లు అనిపిస్తుంది.ఫోను కట్ చేసి అద్దo లో నన్ను నేను చూసుకున్నా. అది నేనే. ఇది నిజమే.కల అయితే కాదు అన్న నిర్ధారణకు వచ్చాను.
ఇది మొదటి సారిగా అచ్చయిన కథ.ఏదో సామాజిక మాధ్యమాల్లో,వాట్సాప్ గ్రూపుల్లో చిన్న చిన్న రచనలు చేశాను. కానీ ఒక ప్రముఖ పత్రిక అదివారం అనుభందం లో అచ్చవడం అంటే నాకు మాత్రం గొప్పే.ఇది ఆషామాషీ విషయం అయితే కాదు.
శరీరం అంతా గాల్లో తేలినట్లు అనిపించ సాగింది.గొంతు కూడా ఎండిపోయినట్లని పించ సాగింది.
ముందుగా, తొందరగా వెళ్ళి పేపరు తెచ్చుకోవాలి.ముందే
మా కాలనీ కొంచం రిమోట్ ఏరియాలో ఉంటుంది.ఇక్కడి నుండి స్టేషనరీ షాప్ రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.అక్కడ కూడా చాలా తక్కువగా వార్త పేపర్లను అమ్మకానికి పెడతారు.
కిచెన్ లోకి వెళ్ళి ఓ గ్లాసు నీరు తాగి ఎండీ పోతున్న గొంతుని తడిపి,అలాగే బైక్ తీసుకుని స్టేషనరీ షాప్ కేసి బయలు దేరాను .
బైక్ మీద వెళుతూ ఉంటే గాల్లో తేలినట్లు అనిపించ సాగింది.మనసులో ఏదో చెప్పలేని అనుభూతి.
లక్షల్లో సర్కులేషన్ ఉన్న పత్రిక అది.రాష్ట్రంలో నే పెద్ద పత్రిక. నిజంగా అలాంటి పత్రికలో నా కథ రావడం అదృష్టమే?!
బైకు పక్కనే పార్కింగ్ చేసి , పక్కనే ఉన్న బుక్ స్టాల్ కి వెళ్ళాను.ఆదివారం కావడం మూలాన సెంటర్లో రద్దీ తక్కువగానే ఉంది.
"పేపరు ఇవ్వమని" పది రూపాయలు నోటు అతనికి ఇవ్బబోయాను, అతను నేనడిగిన పేపర్ స్టాక్ అయిపోయిందన్నాడు.అది తప్ప అన్ని ఉన్నాయి. ఏవేవో పత్రికల పేర్లు చెప్పుతున్నాడు, కానీ అవేవీ నాకు అవసరం లేదు.
అక్కడ కాక మరెక్కడా వార్తా పత్రికలు దొరకవని నాకు తెలుసు. కొంచం నిరాశ కలిగింది. అయినా వేరే మార్గ లేదు.
కాలి చేతుల్తో ఇంటికి రావాల్సి వచ్చింది.
అయినా ఈ పత్రికల వారు కూడా అంతే,'అయ్యా మీ రచన పలాన తేదీన అచ్చవుతున్నది అని ఇంటిమేషన్ ఇస్తే వీరి ముల్లేం పోతుంది.ఓ మెయిల్ మా ముఖాన పడేస్తే ,మా ఏర్పాట్లు ఏవో మేం చూసుకుంటాం కదా! అని లోలోన గొణుక్కుని వాలు కుర్చీలో కూలబడ్డాను.
నా పరిస్తితి అంతను గమనిస్తున్న మా చిన్నోడు కారణ మడిగాడు.
"ఈ రోజు పేపర్లో నా కథ ప్రచురించారట.ఇప్పుడే గురునాధం అంకుల్ ఫోన్ చేసి చెప్పారు.తీర ప్రయాస పడి స్టేషనరీ షాపుకని అంత దూరం వెళితే, అక్కడ పేపర్స్ అయిపో యాయట" అని నిరాశగా చెప్పాను.
దానినీ వాడు చాలా తేలికగా తీసుకొని, "ఇంత దానికి బాధ పడటం ఎందుకు? నన్నడిగితే ఇంకో మార్గం చూపేవాన్నీ " కదా అన్నాడు.
"అ మార్గం మేదో చెప్పరా బాబు " బ్రతిమాలుకోలు గా అడిగా.
నన్ను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి, తన సిస్టమ్ ఆన్ చేశాడు.సదరు పేపరు ఈ ప్రతిని స్క్రీన్ పై ఇట్టే చూపించి నా సమస్యను పరిష్కరించాడు.
సరాసరి కథ ఉన్న పేజీని క్లిక్ల్ చేశాను.
'అచ్చు కానీ కథ" అన్న శీర్షికతో కథ ఉంది.
నిజానికి ఈ శీర్షికతో నేను కథ రాసినట్టు నాకైతే గుర్తుకు రావడం లేదు.
కింద మాత్రం రచయితగా నా పేరే ఉంది .ఒకటికి రెండు మార్లు చదివి చూసాను, కచ్చితంగా అది నా పేరే.
" ఈ మధ్య ఎన్నో రాసా ,ఎన్నో పేపర్లకు పంపా , ఏ పేరు తో ఏ పత్రికకు పంపానో ఏమీ గుర్తు ఉంటుందిలే "అని సర్దుకున్నాను.ఏది ఏమైతేనేం నా పేరుతో కథ అచ్చయింది అదే పది వేలు.
అదేమైనా చిన్న పత్రికా ,పెద్ద పేరున్న పత్రిక.నే పెట్టిన పేరు స్టోరీ కి సరిపోలేదని వారికి నచ్చిన లేదా కథకి అనుగుణంగా ఉన్న పేరు పెట్టి ఉంటారు.నే పెట్టిన పేరే పెట్టాలని రూల్ ఉందా అని సముదాయించుకొన్నాను.
పేరులో ఏముంది..కథ ముఖ్యం. సబ్జెక్ట్ అదే విషయం మనది అయితే చాలు, ఏ పేరు పెడితే మనకేంటి నష్టం అని మనసును కుదుట పరుచు కొన్నాను.
రచయిత పేరును మల్లీ ఒక్కసారి సరిచూసుకున్నా. అక్కడ అచ్చయింది నా పేరే.దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు.
నాకేమో కాగితం పేపర్ చదివితేనే తృప్తి.ఈ స్క్రీన్ పై చదవాలంటే నాతో కాని పని.అయినా కొంచం చదివి చూద్దామని ,కళ్ళని అక్షరాలు వెంట పరిగెత్తించా.
విషయం నాకైతే అర్థమైనట్టు లేదు. కథ మొదలు మాత్రం ఆసక్తికరంగా ఉంది. కానీ ఏ విషయం పై ఈ కథ అన్నది ఇంకా స్పురించడం లేదు.మొదటి పేర చదివాను.కానీ కథా వస్తువు ఏమిటో అర్థం కాలేదు..
"నాకంటే పత్రికల వాళ్లకు అనుభవం ఎక్కువ. వాళ్ల దగ్గర ఎంతో అనుభవస్తులైన ఎడిటర్లు, పాత్రికేయులు కంటెంట్ రైటర్స్ ఉంటారు .కథలో కొత్తదనం ఉండాలని తమ సృజనాత్మకత ఉపయోగించి కథను భిన్న కోణం నుంచి రాశారేమో .
"వారు ఎంతైనా ఉద్ధండులు ఏమైనా చేయగలరు" అని మనసుకు మళ్ళీ నచ్చచెప్పకున్నా.ఇంతలో మొబైల్ రింగ్ అయ్యింది. మొబైల్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ చూస్తే అదే గురునాధం కాల్. కాల్ రిసీవ్ చేసుకుంటూ
" హలో,ఏంటోయ్ " అన్నాను.
"చూసుకున్నావా "అని అడిగాడు గురునాధం.
"లేదు రా! పత్రిక దొరకలేదు.అయినా మా వాడు నెట్ లో చూపించాడు..కానీ...."అని ఏదో అనే లోపు మళ్ళీ అతడే ఆశ్చర్యం గా చెప్పడం మొదలు పెట్టాడు."అబ్బా ఈ కాలంలో ఎవడ్రా పేపరు చదివేది ? అన్నీ స్క్రీన్ మయమే.సిస్టమ్ లో చూచావు కదా "అన్నాడు.
అవును అనీ వింటున్నట్లు ఉ అన్నాను.
"కథ బలే రాశావ్.శిల్పం బాగుంది.కథ నడిపించే విధానం బ్రహ్మాండం.ఇక ముగింపు అంటావా అదిరింది. .."ఇంకా ఏమేమో అంటున్నాడు.నాకేమో ఏమి అర్థం కాలేదు.
ఇంతకీ అది ఏ కథ?.దాని సబ్జెక్ట్ ఏంటి ? అస్సలే నాకు ఈ శిల్పాలు , కథనాలు ముగింపులు అస్సలే తెలియవు.
అసలు ఏమి రాశానో నాకే అర్థం కావట్లేదు.
.
వాడు ఏదో చెపుతూనే ఉన్నాడు.
నేను మాత్రం ఇంకా కన్ఫ్యూషన్ మోడ్ లోనే ఉన్నాను.వాడే మళ్ళీ కల్పించుకొని, "వాట్స్ అప్ చూడు, కథని పిడిఎఫ్ లో పంపించా. తెలిసిన అందరికీ , వాళ్ళ వాళ్ళకి, గ్రూపులో ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసేయి. లైకులు, కామెంట్స్ ఇంకా ..."ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతున్నాడు గురునాధం.
వాడు చెప్పినట్టే, దాన్ని తెలిసిన బంధువులకు, సహోద్యోగులకు, తెలిసిన గ్రూప్ లకి ఫార్వర్డ్ చేశా.కాకుంటే చాలా సింపుల్ గా వాడు ఎలా పంపించాడు అలా గే అందరికి పంపించాను.
ఇది నా కథ అని ,ఎలాంటి వివరణ లేకుండానే సింపుల్ గా పేస్ట్ చేశా.కారణం నాకు కూడా సబ్జెక్ట్ తెలియదు కాబట్టి.
ఏదో గురునాధం చెప్పాడు,నే చేశాను అన్నట్టు ఉంది నా వ్యవహారం.
ఆ రోజు అంతా ఇదే సందడితో గడచి పోయింది.
కనీసం ఈ కథ పైi వచ్చే సమీక్షలు, కామెంట్స్ అయినా నాకు పంపుతారో లేదో ! వాటికి కూడా వారే జవాబులు రాస్తారేమో ! ఒక వారం వేచి చూస్తే గాని అర్థం కాదు.
మరు నాడు ఆఫీసుకి వెళ్ళాను.ఒకరిద్దరు తప్ప మిగతా స్టాఫ్ అంతా ,ఏదో ఒక సందర్భంలో అభినందించారు.
వారం మధ్యలో, ఓరోజు ఆఫీసు లో కాలిగా ఉన్నాను.
ఎన్నో కథలు రాసా, కానీ ప్రింటయినది మాత్రం ఇది ఒక్కటే.ఇంతకీ నేనేమి రాశాను ,ఈ పత్రికల వాళ్ళకి ఎందుకు నచ్చింది., ఇంతకీ నేను రాసిన కథలో ఏమేమి మార్పులు చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మున్ముందు రాసే కథల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చని కథను ప్రింటు తీసుకొని చదవడం మొదలు పెట్టా.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
కథలో పెద్దగా గొప్పదనం ఏమి కనిపించ లేదు.ముగింపు నచ్చలేదు.కథకి ,కథ పేరుకు ఎలాంటి సంబంధం లేదు. కథను నడిపిన తీరు కూడా ఏమంత రుచించలేదు.
ఈ కథ నేనే రాసానా అన్న అనుమానం వచ్చింది.
ఇంతకీ నేను ఈ కథను,ఈ పత్రికకు పంపించాన అన్న అనుమానం వస్తుంది.
ఒక్క సారి ఔట్ బాక్స్ లోకి వెళ్ళి చెక్ చేస్తే, ఈ మధ్యన పంపిన కథల్లో అలాటి వేవి కనిపించలేదు.
అసలు ఈ పత్రికకు పంపిన ఆనవాళ్లే లేవు.ఒక సారి ఇన్
బాక్స్ చూసా, సదరు పత్రిక నుండి వచ్చిన ,నమస్కారం మీ కథ ప్రచురణకు స్వీకరించబడలేదు ,గమనించగలరు.
లాంటి రిగ్రెట్ సమాధానాలే ఎక్కువగా ఉన్నాయి.
అయితే, ఎక్కడో పొరపాటు జరిగింది.
రాజులు గడిచి, మరో ఆదివారం ముందుకు వచ్చింది.
పోయిన వారం ఉన్నంత ఉత్సాహం మాత్రం లేదు.పత్రికను తెచ్చుకోవడానికి పరిగెత్తాలని కూడా అనించలేదు.
ఇంతలో గురునాధం కాల్ వచ్చింది.
కాల్ తీసుకొని హలో అన్నాను.గొంతులో మెతకథనం.
"సారీరా, నేనే కన్ఫ్యూషన్ అయ్యాను.నిన్ను కూడా కన్ఫ్యూస్ చేశాను..."
వాడు ఏమీ చెప్పలను కుంటున్నాడో చూచాయగా అర్థం అవసాగింది.
మౌనంగా వింటున్నాను.
"ఆ కథ నీది కాదు రా! నీ పేరుతో నే ఉన్న మరో రచయితది. నేనే ముందు వెనుక చూడకుండా ,నిన్ను కన్ఫ్యూస్ చేయడమే కాకుండా అంతటా ప్రచారం చేసేలా ఉసిగొలిపాను"
మౌనంగా వినడం నా వంతయ్యింది.
"నిన్న ఆ కథకు సమీక్ష రాసి అదే పత్రికకు రాసి పంపాను. సమీక్ష తో పాటు,రచయిత జవాబు కూడా ప్రింటు చేయబడింది.అప్పుడు గాని నాకు నిజం బోధపడలేదు. సారి " అన్నాడు గురునాధం.
నేను ఏం జవాబు చెప్పలేదు .మౌనంగా వింటున్నాను.
"సరే లేరా??!! కనీసం ఒక్క రోజైనా ఏదో సంతోషంలో మునిగి తేలాం కదా,అదే చాలులే "అని సర్ది చెప్పాను.
సామాజిక మాధ్యమాల లో,ఫేస్ బుక్ పేజీల్లో
కంగ్రాట్స్ ,లైకులు కామెంట్స్ పెట్టిన వారందరికీ రిప్లై ఇస్తూ, "ఇది నే రాసిన కథ కాదు, నా పేరు తో ఉన్న మరో రచయిత రాసిన కథ ,ఏదో బాగుందని మీ అందరితో షేర్ చేసుకున్నాను.ధన్యవాదాలు" అని పోస్ట్ చేశాను.
మనసు ఇప్పుడు ఎందుకో నిజంగా తేలికగా ఉంది. లేకున్నా చేసుకోవాల్సిందే అదే జీవితం...
___సమాప్తం___

ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
దెయ్యాల పొరుగు - నిర్మలాదేవి గవ్వల
[Image: D.jpg]
సుబ్బమ్మ ఒక పట్టాన ఎవర్నీ నమ్మదు.ఇక కొత్త వాళ్లనయితే మరీనూ.సుబ్బమ్మ తమ్ముడు శివరాం ఆ మధ్య రామాపురం లో ఒక పెద్ద ఇల్లు కొనుగోలు చేశాడు.వీలు చూసుకుని సుబ్బమ్మ ని రామాపురం రావలసింది గా మనిషి తొ కబురు చేసాడు.పొలం పనులు అవి ఉండటంతో సుబ్బమ్మ అప్పటికి తత్సారం చేసింది.తరువాత ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని బాడుగబండి కట్టించుకుని రామాపురం బయలుదేరింది.శివరాం కబురు పంపిన మనిషి తొ రామాపురంలో తన ఇంటి ఉనికి గట్రా చెప్పి పంపివున్నాడు సుబ్బమ్మ ఆ మేరకు బండి వాడికి సూచనలిస్తూ ఎలా అయితేనేం రామాపురం చేరుకుంది.కానీ అక్కడ శివరాం ఇల్లు కనుక్కోవడం కాస్త కష్టమే అయింది.బండి వాడు వూరంతా ఒక చుట్టు చుట్టపెట్టేసి ఆఖరికి వూరికి పెడగా వున్నఒక పెద్దింటి వద్ద సుబ్బమ్మ ని దించి వెళ్లి పోయాడు.

శివరాం ,అతని భార్య రాణి సుబ్బమ్మ ని సాదరంగా ఆహ్వానించారు.

సుబ్బమ్మ ఇల్లంతా కలయతిరిగి పెదవి విరుస్తూ, “ఇల్లన్నాక కాస్త ఇరుగూ పొరుగూ వుండాలి. మరీ విసిరేసి నట్టు వూరికి పెడగా మంచి ఇల్లే కొన్నావురా..”అంటూ ఎద్దేవా చేసింది.ఆమె తత్వం తెలిసిన శివరాం నవ్వి తనపని మీద బయటికి వెళ్లి పోయాడు.ఇంతలొ రాణి సుబ్బమ్మ తో ,”వదినగారూ ఇలా ఒకసారి మేడమీదకి రండి,”అంటూ సుబ్బమ్మ నీ మేడ మీదకి తీసుకెళ్లి కాస్త దూరం లొ వున్న ఒక పెంకుటింటిని చూపిస్తూ ,”ఆ ఇంట్లో ఎవరో కాపురం వున్నట్టున్నారు చూడండి,”అన్నది.సుబ్బమ్మ తేరపార చూసి,”అవునేవ్ పెరట్లో బట్టలవీ ఆరేసి వున్నాయి ఎవరొ సాంప్రదాయస్తులె వున్నట్టున్నారు వుండు నేనెళ్లి వాళ్లెవరొ ఏంటో కనుక్కొని వస్తాను,”అంటూ హడావిడిగా అటువైపుచెట్ల మథ్య దారి చూసుకుంటూ బయలుదేరింది.

అదిపాత పెంకుటిల్లు ఇంటి చుట్టు దడి,ఇంటిముందు చక్కగా అలికి ముగ్గు వేసినట్టుంది ,పూలమొక్కలు ఏవో కూరగాయ మొక్కలూ వున్నాయి. ఇంటి తలుపు దగ్గరికి వేసివుంది.సుబ్బమ్మ దడి నెట్టుకొని లోనికిప్రవేశించి తలుపు తట్ట పోయింది ,ఇంతలో లోపల నుండి ఒక కర్ణ కఠోరమయిన మగ గొంతు,”ఏమే రంగీ,ఈ రోజు అమావాస్య అదీకాక మన నాయకుడి పుట్టినరోజు కూడాను.చీకటి పడక ముందే మనం అడవి చేరు కోవాలి.నీ ముస్తాబు త్వరగా తెముల్చు,”అన్న మాటలకి వెంటనే ఒక ఆడగొంతు ,”అవును మావా మన నాయకుడి పుట్టినరోజు ఈరాత్రంతా పాటలూ నాట్యాలు,ఆ పైన విందులు బహుమతులూను ,భలేగుంటుంది,”అనికిలకిలా నవ్వు..ఆనవ్వు డబ్బా లో గులకరాళ్ళు వేసి కుదిపి నట్లుంది.

అంతా విన్న సుబ్బమ్మకి ముచ్చెమటలు పోసి స్తాణువులా నిలబడి పోయింది.ఇంతలో తలుపు తెరుచుకుని తుమ్మ మొద్దులాంటి ఆడ మనిషి బయటి కొచ్చి సుబ్బమ్మ ని చూసి,”ఎవరు మీరు,”అన్నది.సుబ్బమ్మ గొంతు తడారి పోతుండగా మాటలు కూడ తీసుకుంటూ,”శివరాం ఇంటి వైపు చేయి చూపిస్తూ ,”ఆఇంట్లో వుంటున్నాం,మీతో పరిచయం చేసుకుందామని…”అంటూ వుండగా లోనుండి గడ కొయ్యలా అంతెత్తు వున్న మగ మనిషి బయటి కొచ్చి,”అలాగా అమ్మా సంతోషం.మాకూ ఇంతకాలం మాటా మంచికి ఇరుగున ఎవరూ లేక ఇబ్బంది పడ్డాం.ఇకనేం మీరొచ్చారుగా,” అంటూ గార పట్టిన పార పళ్లు బయటపెట్టి నవ్వుతూ అన్నాడు.సుబ్బమ్మ ఒక్కక్షణంఅక్కడ నిలబడ లేక పోయింది ఒక్క ఉదుటన ఇంటి కొచ్చి రాణి ముందు ఒగరుస్తూ కూలబడింది.

“కొంప మునిగిందే అమ్మాయి.వచ్చి వచ్చిదయ్యాల పొరుగు న చేరారే మీరు.మిమ్మల్ని ఇక ఆ దేవుడే కాపాడాలి.మీ సంగతేమో గాని నేనిక్కడ ఒక్క క్షణం కూడా వుండను.ఏడి నీ మొగుడు బండి కి పురమాయించమను”అంటూ గగ్గోలు పెట్ట సాగింది.అప్పుడే బయటనుండి వచ్చిన శివరాం,
సుబ్బమ్మ తో,”అసలేం జరిగింది ఎందుకింత కంగారు,”అన్నాడు.సుబ్బమ్మ ,ఒరే శివుడూ,మనుషులన్న వాళ్లెవరైన అమావాస్య అర్ధరాత్రి అడవులట్టక తిరుగుతారట్రా,అప్పుడెప్పుడో చిన్నతనంలో చందమామ కధల్లోతమ నాయకుడి చుట్టు నాట్యాలు చేసి బహుమతులు తెచ్చుకునే దయ్యాల గురించి చదివాం గుర్తుందా.ముమ్మాటికి వీళ్లు దెయ్యాలేరా బాబూ వాళ్లూ వాళ్ల వాలకం చూస్తే కంపరం పుట్టింది.ఇక నా వల్ల కాదు.మా వూరికి నన్ను తక్షణం పంపే ఏర్పాటు చూడు,అని పెంకుటింటి వద్ద జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరంగా చెప్పింది.అంతా విన్న శివరాం తేలిగ్గా నవ్వుతూ,” నీ అనుమానపు గుణం మానవు కదా. ఇంకా దెయ్యాలేమిటె నీ చాదస్తం కాకపోతే.తెల్లవారాక నేను వాళ్ల గురించి వాకబు చేస్చచేస్తాలే, భోంచేసి విశ్రాంతి తీసుకో.'”అన్నాడు

సుబ్బమ్మ కి ఆకలి నిద్ర ఆమడదూరం అయి పోయాయి .మేడ మీద కెళ్లి కిటికీలొ నుండి ఆఇంటి వైపు నిఘా పెట్టింది.కాస్త చీకటి పడ్డాక పెంకుటింటి దంపతులిద్దరూ చిన్న దీపం పట్టుకొనితుప్పల్లో పడి దూరంగా వున్న కొండ చరియల వైపు వెళ్లడం చూసింది.సుబ్బమ్మకి ఇక కంటి మీద కునుకు పడలేదు.

ఇంకా చీకట్లు తెరిపిన పడ లేదు.తూర్పున సన్నగా వెలుగు రేఖ కనపడవా వద్దా అన్నట్టు పొడచూపుతోంది.సుబ్బమ్మ తన సంచి చంకన పెట్టుకొని,రాణీని రహస్యంగా పిలిచి తను వూరెళుతున్నట్టు చెప్పింది.అందుకు రాణి,”అయ్యో ,అలా ఎలా వెళ్తారు,ఈయన లేచాక బండి కట్టించు కొస్తారులెండి,”అన్నది.అందుకు సుబ్బమ్మ,”వాడు ఏదో మాయమాటలు చెప్పి వెళ్లడం పడనివ్వడు.నేను వచ్చే టప్పుడు దారులన్నీ గుర్తు పెట్టుకున్నాలె.ఇలా పొలాల కడ్డం పడి వెళితే రహదారి వస్తుంది పోయే బండి వచ్చే బండ్లు ఏదో ఒక బండి పట్టుకుని మావూరెళతా.నువ్వు జాగ్రత్త తల్లీ.

అంటూ వడివడిగా పొలాల వైపు అడుగులు వేసింది. రాణి చేసేది లేక చూస్తూ వుండి పోయింది. నిద్ర లేచిన శివరాం విషయం తెలుసుకొని,ఈజన్మకి మారదు ఈవిడఅనుకున్నాడు.

తెలతెలవారుతుండగా స్పృహ లో లేని సుబ్బమ్మ ని భుజాల మీద మోసుకుంటూ పెంకుటింటి దంపతులు శివరాం ఇంటికి వచ్చారు.శివరాం,రాణీ కంగారు పడుతూ,”ఏంజరిగిందంటూ ప్రశ్నించారు.అందుకు వాళ్లు,”అమ్మగారు పొలంగట్టు మీద స్పృహ తప్పి పడి వున్నారు.ఏ నీరుగడ్డి పామొ ముట్టి నట్టుంది.మాకు తెలిసిన పసరు పిండాము.కాసేపట్లో తేరుకుంటారు మరేంభయంలేదు.మేము ప్రక్కనున్న పెంకుటింట్లొ వుంటున్నాము”అన్నారు

ఆ మాటలకు శివరాం కాస్త కుదుట పడి,”ఇంతకీ మీరు ఏంచేస్తుంటారు.ఎన్నాళ్లనుండి ఇక్కడు న్నారు,”అంటూ అడిగాడు.

అందుకు ఆ మగమనిషి,”నా పేరు రంగడు,దీని పేరు రంగి మేము దాపులో వున్న కొండ చరియల కిందనున్న పొలాల్లో కూలికి వెళుతుంటాము ఆ పొలాలన్ని వినాయకుడనే పేరున్న కొండ దొరవి.కొండకిఆవల నుండి కూడా చాలా మంది కూలీలు వస్తుంటారు.అసలే కోతల సమయం వన్యమృగాలు పంట పాడు చేయకుండా రాత్రుళ్ళు కాపలాకి వెళ్తంటాము.నిన్న మా నాయకుడి పుట్టిన రోజు ."ప్రతి ఏటా మేము ఇదొక పండగలా జరుపుకుంటాం.మా నాయకుడు కూడా మాకు మంచి విందు ఏర్పాటు చేస్తాడు నెగళ్లు వేసుకొని సరదాగా ఆడుతూ పాడుతూ రాత్రంతా గడిపేస్తాం.తగిన బహుమతి డబ్బు రూపంలో నాయకుడు మాకందిస్తాడు."అన్నాడు.

స్పృహ లోకి వచ్చిన సుబ్బమ్మ కళ్లు తెరవకుండా పడకుని సాంతం విన్నది.మీరు దెయ్యాలు కాదు నాపాలిట దేవతలు అని మనసులో అనుకుంది.కాని కళ్లు తెరిచి ధైర్యం చేయలేకపోయింది.ఇంతలో వాళ్లు శివరాం వద్ద శెలవు తీసుకొని వెళ్లి పోయారు.సుబ్బమ్మ మెల్లగా కళ్లు తెరిచి శివరాం వైపు చూస్తూ,”అంతా విన్నారా శివుడూ నాఅనుమానపు బుధ్ది కి సిగ్గు పడుతున్నా.”,అన్నది తల వంచుకొని.ఇక నుంచి అయినా నీ అనుమానపు బుద్ధి మానుకునిఎదుటి వాళ్లని నమ్మడం నేర్చుకో ,”అన్నాడు."చిన్నవాడి వయినా నాకు బుద్ధొచ్చేలా హితవు చెప్పావురా తమ్ముడూ " అంటూ సుబ్బమ్మ సంతోషంగా కొన్నాళ్లు గడిపి, ఈలోగా రంగడూ రంగికి తన చేతులతో నవకాయ పిండి వంటలు వండి విందు భోజనం పెట్టింది.వాళ్లతో మీలాటి పొరుగు , తపస్సు చేసినా దొరకదు .ఒకరి కొకరు మావాళ్లకి చేదోడు వాదోడుగా వుండండి అని చెప్పి బండెక్కి తన వూరు కి ప్రయాణమయింది.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఇంకెంత సేపు - గరిమెళ్ళ సురేష్
[Image: image-2025-12-13-144300559.png]
అది,1990-99 మధ్య కాలం అనుకుంటా! పంజగుట్ట, సాయంత్రం ఆరు- ఆరున్నర నడుమ కావచ్చు! శివరావు గారు ఓచేత్తో వెలిగించిన సిగెరెట్టు, మరో చేత్తో స్టీరింగ్ పట్టుకోని, హుషారుగా సుశీల- ఘంటసాలల ‘రేపంటి రూపం కంటి’ పాట రేడియోలో వింటూ, కారు నడుపుతున్నారు. జూబ్లీ హిల్సలో పని చూసుకొని, సికందరాబాద్ వైపుకి వెడెతున్నారు. ఆయన ప్రక్కన, పాతికేళ్ళ కుర్రవాడు, వారి అబ్బయి, గంగాధర్ కూర్చునాడు. ‘ఏంనాన్న ఇది! ఇలా సిగెరెట్టు కాలుస్తూ బండి నడపడం! మీ ధ్యస కూడా ఎక్కడో ఉంటోంది’, అన్నాడు గంగాధరం, విసుక్కుంటూ. ‘ఏమోయ్! నా డ్రైవింగ్ పైనే వ్యాఖ్యానమా! నువ్వు పుట్టక ముందు నుంచి కారు నడుపుతున్నాను. ఒక్క యాక్సిడెంటు జేసి గానీ, ఫైన్ కట్టి గాని యెరగను’, రావు గారి జబర్దస్తీ జవాబు కాని జవాబు! ‘అప్పట్లో, ఇంత ట్రాఫిక్ కాని, ఇన్ని సిగ్నల్సు గానీ లేవు నాన్నా. మీదే రాజ్యం, మీరే రాజు’, అంటూ కొడుకు మళ్ళీ విసుక్కున్నాడు! ‘అవునోయ్! ఈ స్టైలు చూసే గా మీ అమ్మ నన్ను చేసుకుంది’, తండ్రి గొప్పలు చాటుకుంటుంన్నాడు! ఆమాట వాస్తవమే! అప్టట్లో, సిగిరెట్టు కాలుస్తూ కారు నడపడం, ఓ స్టైల్! సినిమాలలో ANR ని అలాగున చూపించేవారు కూడాను. ఆ మునుపటి నవలా నాయకుల్ని కూడా, ప్రత్యేకించి, రచయిత్రులు, ఆలాగునే చిత్రించేవారు.
ఏసి వాహనాలు మన దేశంలో అప్పుడప్పుడే ప్రచూర్యంలోకి వస్తున్నాయి. రావుగారి కారులో ఏసి లేనందున, కిటికీ అద్దాలు క్రిందికి ఉంచి, నడపడమే వారి అలవాటు. బేగంపేట్ వైపుకి వెళ్ళే బళ్ళు రెడ్ సిగ్నలకని ఆగాయి! కాని, శివరావు తన గొప్పతనాన్ని తానే మెచ్చుకుంటూ, బ్రేకు కాస్త ఆలస్యంగ వేయడంతో, ముందున్న కొత్త మారుతి కారును రావు గారి కారు నెమ్మదిగా తాకింది. పెద్దగా ఏ కారుకీ, ఎవ్వరికీ ఎటువంటి గాయం కాలేదు. కాని, మారుతి కారు నడపుతున్న అరవై ఐదేళ్ల సరస్వతి గారు, ప్రక్కన కూర్చున్న, ఆవిడ భర్త శ్రీనివాస మూర్తి గారు ఒకింత ఉలిక్కి పడ్డారు! సరస్వతి గారు కారు దిగి, కారు వెనక వైపు ఏమన్నా బలమైన దెబ్బ తగిలిందేమోనని చూచి, శివరావు గారి తో ‘ కొంచెం చూసుకోని రావాలండి’, అని కసురుకున్నారు. శివరావు గారు ఉరుకుంటే, సరి పోను. ‘మీ కారే వెనక్కి వచ్చిందండి, నన్నంటారే’, అంటూ వాదనకు దిగారు. సరస్వతి మామూలుగా సౌమ్యురాలే కాని, వాళ్ళ ఆయన కంటి పరీక్ష చేయించుకున్నదున ఆయన కారు నడపలేడు. మనవరాలు, వైష్ణవి ఆసుపత్రికి, వస్తానన్నది. ఆఫీస్లో హటాత్తుగ ఏదో పని బడి రానందున, అయిష్టంగానే కారు, సరస్వతి గారే నడుపుతున్నారు. శ్రీనివాస మూర్తి గారు ఆర్మి లో ఆఫీసర్ గా చేసి, పదిహేనేళ్ళ క్రితం సైనిక్ పురి లో ఇల్లు కట్టుకొని భార్య, కొడుకు, కోడలు, మనుమరాలితో ఉంటున్నారు. కొడుకు, కోడలు ఎవరిదో పెళ్ళికని మద్రాసు వెళ్ళారు. ఆ కారణాన, సరస్వతి గారు, కారు నడుపుతున్నారు. ఆ విసుగుకు తోడు, కార్లు గుద్దుకోవడం ఆమె అసహానానికి ఆజ్యం పోసినట్టయ్యింది. ఇప్పుడ శివరావుగారు తనది తప్పనందుకు, ఇంకింత కోపం హెచ్చి అక్కడే ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ను రమ్మని పిలిచారు, సరస్వతిగారు. దగ్గరకు వచ్చిన ఇన్స్పెక్టర్ కి జరిగింది అర్థమైంది. ప్రక్కనే ఉన్న సెక్యూరిటీ అధికారి స్టేషణ్ కి అందరినీ తీసుకెళ్ళాడు, వారి వాహనాలతో బాటు. శివరావు గారిని, సరస్వతి గార్లను లోపలి గదిలో కూర్చో బెట్టి, అక్కడున్న కానిస్టేబల్ తో ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళారు ఇన్స్పెక్టర్. ఇన్నేళ్ళకి సెక్యూరిటీ అధికారిటేషన్ మెట్లెక్కినందుకు లోలోపల మధన పడుతున్నారు శివరావు. గోచారంలోని కారాగృహ యోగం, ఈ విధంగ రూపందుకున్నదని ఆయన మనసులోనే అనుకున్నాడు. తన పంతం నెగ్గి ఎదుటి వ్యక్తిని స్టషన్ గుమ్మం దాటించినందుకు ఒకింత గర్వం ఉన్ననూ, పొరపాటున సెక్యూరిటీ అధికారిను పిలిచి, తానుకూడా స్టేషణ్లో కూర్చున్నందుకు బాధగాను ఉన్నది సరస్వతిగారికి. ఆర్మీ ఆఫీసర్ భార్యగా, ఎన్నసార్లు సెక్యూరిటీ అధికారి స్టేషన్లకు వెళ్ళినా, ఈలాగు ట్రాఫక్ సమస్య వలన రావడం అదే మొదటి సారి. శ్రీనివాస మూర్తి గారు, గంగాధరం బయట ఓ బల్ల మీద కూర్చున్నారు. ఎదురుగా నించున్న హోమ్గార్డ్ని జూచి, ‘ఇంకెంత సేపు అవుతుంది’ అని అడిగారు శ్రీనివాసమూర్తి. ‘ఏమో, సార్, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ లో ఉన్నారు కదండి. చెప్పలేము. ఒక్కో సారి తొమ్మిది కూడా అవ్వొచ్చు’, అన్నాడతను.
గంగాధరం, మూర్తి గార్లు, ఒకర్నొకరు చేసుకున్నారు. ఇద్దరి లోనూ,ఒకటే యోచన. అనవసరంగా, పిలిచి, దుఃఖం కొనుక్కుంటిమన్న భావన. ఎంత సేపైనా ఇన్స్పెక్టర్ రాలేదు. ఆ మాటనకుండా ఉంటే బాగుండేదేమోనని శివరావు గారు, సెక్యూరిటీ అధికారిని పిలవకుంటే బాగుండేదని సరస్వతి గారు అనుకుంటున్నారు. అయినా ఇద్దరి మధ్యా మాటలు సూన్యం. బయట బల్ల వద్ద పరిస్థితి అదో మాదిరి. మనసులో తండ్రిని, గంగాధరం, భార్యను మూర్తిగారు బాగా ఉతికేస్తున్నారు. పైకి మాత్రం వెర్రి నవ్వుల అలంకారం! ఇక, హోమ్గార్డు, జరగ బోయేది ఎరిగున్నట్టు వీళ్ళను పట్టించుకోవడంలేదు. బయట హోమ్గార్డు కి మల్లే, లోపలున్న కానిస్టేబుల్ కూడా అన్నీఎరిగున్నట్టే ఉన్నాడు. ‘మా పరిస్థితి ఏవిటి’ కానిస్టేబెల్ని అడిగారు రావు గారు. జవాబు తనకీ అవసరమన్నట్టు సరస్వతి గారు, కానిస్టేబుల్ వైపె చూస్తున్నారు. ‘సిఐ గారు వచ్చాక కంప్లైంటు రాయించి కోర్టుకి తీసుకెళతాంమండి’, అన్నారు కానిస్టేబుల్. ‘ఇంకెంత సేపు అవుతుంది ఆయనకి’ , సరస్వతి గారి, అనుబంధ ప్రశ్న. జోడు కట్టి వినడం, రావు గారి వంతు. ‘ ఏదో వి ఐ పి కదలిక ఉందండి. కా స్సేపే, అవ్వొచ్చు. అయినా ఏవిటండి కేసు’ తెలియనట్టు అడిగాడు కానిస్టేబుల్. ‘పొరపాటున, నా కారు ఆవిడ కారుకి తాకింది’, అన్నారు రావు గారు, బాగా నెమ్మదిగ. ‘ఓ!, ఏవైనా, డామేజ్ అయ్యిందా, అమ్మ’, అడిగాడు, కానిస్టేబుల్. ‘పెద్దగా, ఏమీ లేదయ్యా’, అన్నారు సరస్వతి గారు. ‘బాగా,చదువకున్న వారిలా వున్నారు! కొట్లాడిర్రా!’ అసహ్యించుకుంటునట్టు ప్రశ్నించాడు. ‘అబ్బే, అట్లాండిది ఏమీ లేదయ్యా’, ముక్త కంఠంగా ఇద్దరూ అన్నారు. ‘ఛాయ్ తీసుకుంటారా సర్’, అంటూ ఓ కుర్రాడు గాజు గ్లాసులు, థర్మాసు పట్టుకొచ్చాడు. ‘ముగ్గురికీ, యిచ్చేసేయ్! గంట సేపైంది,ఇక్కడ కూర్చోని’, అన్నారు రావు గారు ఆ కుర్రాడికి డబ్బులిస్తూ. ‘బయట బల్ల మీద, ఓ అబ్బాయి, ఓ పెద్దాయన ఉన్నారు. వాళ్లని కూడా అడుగు’, అన్నారు సరస్వతి గారు. వాతావరణం, కాస్త ప్రశాంతంగా మారడం గమనించిన కానిస్టేబుల్, ‘డ్యామేజీ లేదు, కొట్లాడుకుందీ కాదు. ఇంకేవిటి కేసు! కాంప్రమైస్ చేసుకోని, చక్కగా వెళ్ళండి’, అన్నాడు. బయట బల్ల మీద టీ తాగుతున్న ఇద్దరి అసహనాన్నీ గమనించన హోమ్గార్డు, ‘ఇంకో ఐదు నిమిషాల్లో బయటికి వచ్చేస్తార్లెండీ! ఎంత మందిని చూడ్లేదు సార్’ అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా! ఇంకా ఐదు నిమిషాలు కూడా అవలేదు. శివరావు గారు, సరస్వతి గారు నవ్వుకుంటూ బయటికి వచ్చారు. అదే సమయానికి, ఇన్స్పెక్టర్ లోపలికి వస్తూండడం గమనించి, సంగతి ఏమీ లేనట్టు, ఇన్స్పెక్టర్ కి ఇద్దరూ ఒకే సారి Thank You చెప్పేసారు. కంటి చూపుతోనే సంగతి తెలుసుకున్నా ఇనస్పెక్టర్కి చిరు నవ్వు దాగలేదు!
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
పొడుపు కధ తెచ్చిన జడుపు - నిర్మలాదేవి గవ్వల

[Image: podupu_1753686817.jpg]శ్యామల వేసవి సెలవులకి అమ్మమ్మ గారి వూరెళ్లింది.అసలే వాగుడు కాయ పైగా దానికీ మధ్య పొడుపు కధల పిచ్చి బాగా పెరిగింది.పారంపర్యంగా వచ్చిన పాత పొడుపు కథలతో పాటు,నేటి కాలమాన వ్యవహారాలకు అనుగుణంగా స్వకపోల కల్పనతో క్రొత్త క్రొత్త పొడుపు కధలను సృష్టించి ఎదుటివారి మీదకి సంధిస్తుండేది.దానికి తాతగారి ప్రోత్సాహం మెండుగా వుండేది.
ఒకరోజు తాతయ్య కి బాగా తలపోటు వచ్చింది.శ్యామల అమ్మమ్మ తో,”ఇంట్లో వంకర టింకర సోము వున్నాడా?,వుంటే పట్రా వాణ్నిఅరగ దీసి తాతయ్య తలకి పట్టు వేద్దాం,” అన్నది.
అమ్మమ్మ కి అర్ధం కాక తల పట్టు కున్నది.అప్పుడు తాతయ్య,”శొంఠి కొమ్ము తెచ్చి అరగ దీసి తలకి పట్టు వెయ్యి.చిన్న పిల్లకున్న పాటి జ్ఞానం లేదు,” అని అమ్మమ్మ ని దెప్పి పొడిచాడు.శ్యామల నవ్వింది.అమ్మమ్మ ఉడుక్కుని ,”ఈ బోడి సామెతలు మీ ఇద్దరి కే చెల్లింది లెండి “,అని శొంఠి ని తెచ్చి తాతయ్య తలకి పట్టు వేసింది.అప్పుడు తాతయ్య అమ్మమ్మ తో “పొడుపు కథలన్నవి మన ఆలోచనా విధానాన్ని పెంపొందింప చేసి మానసిక వికాసాన్ని కలిగిస్తాయి,”అన్నాడు.తర్వాత విశ్రాంతి తీసుకోడానికి గదిలోకి వెళ్లి పోయాడు.
ఈ లోగా అమ్మమ్మ శ్యామలతో,”సాయంత్రం పక్కింటి పంకజంతో కలసి ఓ పేరంటానికి వెళుతున్నాను.వచ్చే సరికి ఆలశ్యం కావచ్చు,రాత్రికి వంట వండి నువ్వూ తాతయ్య భోంచేసేయండి”అన్నది. తర్వాత ఆమె గదిలోకెళ్లి ముస్తాబవడం ప్రారంభించింది.ఇంతలో పక్కింటి పంకజం పిలవడంతో అమ్మమ్మ బయలు దేరుతూ శ్యామలతో కుంపటిలో వేడి పాలు మరుగు తున్నాయి తాతయ్యకి వెండి లోటాలో పోసిఇవ్వు,”అని చెప్పి అంతే హడావుడిగా వీధి తలుపు దగ్గరికి వేయడం కూడా మరిచి పంకజంతొ కలసి పేరంటానికి వెళ్లి పోయింది.
శ్యామల వెండి లోటాలో పాలు పోసుకొచ్చి తాతయ్య పడుకున్న మంచం పక్కనున్న బల్లమీద వుంచి తిరిగి వంటగదిలోకి వెళ్లి పోయింది.
పట్టపగలు తలుపులు తెరిచివున్న ఇళ్లలో జొరబడి దొరికింది దోచుకెళ్ళే దొంగొకడు వీధిలో తచ్చాడుతూ అమ్మమ్మ తలుపు చేరవేయకుండా హడావిడిగా వెళ్లడం గమనించి ఇంట్లోకి తొంగి చూసాడు.వాడికి వీధి కి నేరుగా వున్న గదిలో ముసుగు దన్ని పడుకున్న తాతయ్య ,పక్కనే బల్ల మీదున్న వెండి లోటా కన పడ్డాయి.ఇంట్లో మరే అలికిడి లేక పోవడంతో వాడు నేరుగా తాతయ్య గదిలోకి ప్రవేశించాడు.ఇంతలొ వెనక ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడు కావడం తో వాడు చప్పున గదిలోని తలుపు వెనక నక్కాడు.శ్యామల గదిలోకి వచ్చి,”నాలుగు వస్తువులు తనలో దాచుకున్న నంగనాచి కుర్రోడు నీ పక్కన వున్నాడు తాతయ్యా కాస్త చూసుకో,”అని తిరిగి వంట పని చూసు కోడానికి వంట గదిలోకి వెళ్లి పోయింది .
శ్యామల మాటలు విన్న దొంగకి పై ప్రాణాలు అమాంతం పైకెళ్లాయి.వాడు అంతకు ముందే ఒక ఇంట్లో నాలుగు విలువైన వస్తువులు దొంగిలించి తన దట్టీ లో దాచుకుని వున్నాడు,వాడు తనలో తను,ఈ పిల్లెవరో అసాధ్యురాల్లా వుంది.తను రావడం పసిగట్టడమే కాకుండా నాదగ్గరున్న నాలుగు వస్తువుల ఆచూకి కూడా కని పెట్టేసింది.ఇప్పుడు ఎలారా దేవుడా అని తలుపు వెనక చేరి కొట్టు మిట్టాడ సాగాడు.
శ్యామల అన్నమాటలు తాతయ్యకి మాత్రం బాగా అర్థం అయ్యాయి.ఆమె తన కోసం పాలు తెచ్చి పక్కన బల్ల మీద పెట్టిందని,ఎందు కంటె,పెరుగు,మజ్జిగ,వెన్న,నెయ్యి లాంటి నాలుగు రకాలను తనలో దాచుకుని ఒకటిగా కనిపించేది పాలే కదా!
తాతయ్య బధ్దకం వదిలించుకుని లేచి పాలు త్రాగాడు.తనూ మనమరాలికి ధీటుగా ఓ పొడుపు కధ వేయాలని ఆయనకనిపించింది.ఆయన వంట గదిలో వున్న శ్యామల కి వినిపించేలా ఇలా అన్నాడు,” సందుగు పెట్టెలో వున్న ఏడుగురు సక్రమంగా వున్నారా తల్లీ,”అందుకు శ్యామల వెంటనే,”వున్నారు తాతయ్య,మిడిగ్రుడ్లోడె కాస్త మొరాయిస్తుంటె రోకలితొ నాలుగు వాయించా,”అని గట్టిగా తాతయ్యకి వినపడేలా అన్నది.తాతయ్య మళ్లీ పడుకొని ముసుగు బిగించాడు.
ఇంతకీ వీళ్ళు మాట్లాడు కున్నదేమంటే,పోపుల డబ్బాలో జీలకర్ర,ఆవాలు లాంటి తదితర ఏడు వస్తువులు సక్రమంగా వున్నాయా అని తాతయ్య అడిగాడు. అర్ధంచేసుకున్న శ్యామల మిరియాలను చారు కాయడానికి రోట్లొ వేసి రోకలితొ దంచుతున్నట్లు సమాధానమిచ్చింది.
కాని ,తలుపు వెనక నక్కిన దొంగకి మాత్రం ఈ తాత మనవరాలి , మాటలు మరోలా అర్థం అయ్యాయి.వీళ్లు కాక ఇంట్లో మరో ఏడుగురు వున్నారన్నమాట .వాడికి నిలువునా వణుకు వచ్చింది .ఏక్షణం లో అయి నా ఆ పిల్ల ఆ ఏడుగురిని రోకలి తో సహ తీసుకుని వచ్చి తనమీద దాడికి దిగొచ్చు.అంతకంటే ముందు తనిక్కడ నుండి చల్లగ జారు కోవడం మేలు.ఉన్న ఆ నాలుగు వస్తువులైనా దక్కుతాయి.ఇలా ఆలోచించిన దొంగ ఒక్క ఉదుటన బైట పడి పారిపోయాడు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply

Users browsing this thread: