Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇంకెంత సేపు
#81
"మౌనం పూర్ణాంగీకారం కాదహే! మౌనం అర్ధాంగీకారం అంటారు." అన్నాడు సామెతల్రావు అనబడే సన్యాసిరావు. సామెత తప్పు పలికేసరికి అతనికి అప్పారావుమీద పీకమొయ్యా కోపం వచ్చింది మరి.
"ఉండహే! అసలే టెన్షన్‌తో, సస్పెన్స్‌తో చస్తుంటే మధ్యలో నీ సామెతల గోలేంటి? ఇక్కడేం సామెతలమీద చర్చా వేదిక పెట్టలేదు." సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు కామేశం.
"కిందటి సారిలాగే ఈ సారికూడా నా మాటలమీద నమ్మకముంచి ఆ రోజున ఇదే సమయానికి రండి. మీ బాకీ అణాపైసలతో వసూలు చేసుకోండి." అన్నాడు అప్పారావు ఇంట్లోకి వెళ్తూ మరో మాటకి తావియ్యకుండా.
ఎనిమిదో తారీఖంటే సరిగ్గా పదిహేనురోజులుంది. అసలు ఆ రోజు ఎలా అప్పు తీర్చబోతాడో, అసలు అప్పు తీర్చకుండా ఇంకా ఎవైనా కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటాడో ఊహించలేకున్నారెవరూ. ఎందుకైనా మంచిదని అప్పులాళ్ళందరూ కలసి ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని, అప్పారావు అన్నదాంట్లో లొసుగులేవైనా ఉన్నాయేమోనని క్షుణ్ణంగా చర్చించసాగారు.
ఎంత చర్చించినా ఏ మాత్రం లాభం లేకపోయింది. కొందరేమో బహుశా అప్పారావు ఏ బ్యాంక్‌నుండో అప్పు తీసుకొని అందరి బాకీలు తీర్చుతాడని ఊహిస్తే, మరికొందరు ఏ పెద్ద చేపకో గేలం వేసి అందరి అప్పులు తీరుస్తాడేమోనని ఊహించారు. అతనికేమైనా దూరపు బంధువుల ఆస్థి కలిసొచ్చిందో లేక లంకెబిందెలేమైనా దొరికాయేమోనని అభిప్రాయపడ్డారు మరికొందరు. కొందరు నిరాశావాదులు మాత్రం మళ్ళీ ఈ సారి కూడా ఏదో మాయ చేసి అప్పు ఎగ్గొడుతాడేమోనని అనుకున్నారు. మొత్తానికి ఎంత అలోచించినా ఇంతకుమించి ఏవిధమైన క్లూ కూడా దొరకలేదెవరికీ. ఆ రోజు నుండి వాళ్ళందరికీ ఒకటే ఆలోచన అప్పారావు తమ అప్పు ఎలా తీరుస్తాడోనని. అసలింతకీ తీరుస్తాడా, లేదా అన్నది కూడా ఓ మిలియన్ డాలర్ ప్రశ్నై కూర్చుంది.
రోజులు గడిచేకొద్దీ అందరి నరాలు టెన్షన్‌తో చిట్లిపోతున్నాయి. అందరిలోనూ ఒకటే ఆతృత. రక్తపోటు పెరిగిందేమోనని మాటిమాటికీ డాక్టర్‌వద్దకి వెళుతున్నారు అప్పటికే బిపి ఉన్నవాళ్ళు. అదిలేనివాళ్ళు కొత్తగా ఏమైనా రక్తపోటు వచ్చిందేమోనని భయపడుతూ ఆస్పత్రికి వెళుతున్నారు. అయితే ఇందరి రక్తపోటుకి కారకుడైన అప్పారావు మాత్రం చిద్విలాసంగా రోజులు గడుపుతున్నాడు.
చివరాఖరికి ఆ రోజు, అదే ఆ నెల ఎనిమిదో తారీఖు, అప్పులాళ్ళందరూ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఎందుకైనా మంచిదని ఆ ముందు రోజు రాత్రి పన్నెండు గంటలవరకూ వచ్చే అన్ని ఛానెళ్ళ వార్తలు, ఆ రోజు ఉదయంవరకు అన్ని వార్తలు చూసి ఊపిరి పీల్చుకున్నారు కామేశం తదితరులు. 'అమ్మయ్య! పెద్దనోట్లు రద్దు లేదు!' అని సంతోషించి అప్పారావు ఇంటి వైపు పరిగెట్టారందరూ. పదిగంటలకల్లా అందరూ అప్పారావు ఇంటిముందు గుమిగూడారు. అందరి ముఖాలు అంతులేని ఆతృత, ఆందోళనతో నిండి ఉన్నాయి.
అప్పారావు చిరునవ్వు ముఖంతో ఇంటి వరండాలోనే వీరందరికోసం వేచి ఉన్నాడు. అందర్నీ చూస్తూనే, "రండి! రండి!! మీ అందరి అప్పు తీర్చడంకోసమే ఎదురు చూస్తున్నాను. దయచేసి అందరూ క్యూలో రండి. మీ వంతు వచ్చేవరకు క్యూలోనే ఉండండి." అన్నాడు అప్పారావు.
చేసేదిలేక అందరూ క్యూ కట్టారు. అప్పుడు అప్పారావు, "వినండి. లోపల గదిలో నా మిత్రుడు పాపారావు ఉన్నాడు. నా అప్త మిత్రుడైన పాపారావే నా అప్పు మిత్రులైన మీ అందరి అప్పు పూర్తిగా అణాపైసలతో సహా చెల్లిస్తాడు. అతను అప్పు తీర్చిన వెంటనే అతనికి చెల్లుచీటి ఇచ్చి పెరటి గుమ్మం నుండి మీ దారిన పొండి. మళ్ళీ మీకు అప్పు ఇవ్వాలనిపిస్తే మాత్రం ఈ అప్పారావుని మరువకండేం! సదా మీ అప్పు సేవలో ఈ అప్పారావెప్పుడూ తయారుగానే ఉంటాడు. అప్పుదేవో భవ!" అన్నాడు.
ఆ క్యూలైను మెల్లమెల్లగా కదులుతోంది. బయట ఉండి అప్పారావు ఒకొక్కళ్ళనే లోపలికి పంపిస్తున్నాడు. అందరికన్న ముందు కామేశం ఉన్నాడు. చివర సుందర్రావు ఉన్నాడు. సుందర్రావుకి తొందరెక్కువైనా, ఈ రోజు కొద్దిగా లేటైన పాపానికో లేక పుణ్యానికో క్యూలో చివరన ఉన్నాడు. ఒక్క కామేశం పని పూర్తవడానికి అరగంట సమయం పట్టింది.
"ఒక్కకరికి ఇంత సమయం ఎందుకు పడుతోందో?" సుందర్రావు సందేహం బయటపెట్టాడు, ఎందుకంటే తనవంతు వచ్చేసరికి డబ్బు మిగులుతుందో లేదోనని అతని గుబులు అతనిది.
"మరి లెక్క సరిగ్గా చూడొద్దేమిటి?" రామేశం సమాధానం.
"కొంపతీసి కిందటి సారి పెద్దనోట్లకి రివెర్స్‌గా ఈ సారి చెల్లని చిల్లర నాణాలు ఇవ్వటం లేదుకదా! అసలే మన అప్పు అణాపైసలతో తీరుస్తానన్నాడు కదా!" శంకర్రావు సందేహం.
"నిశ్శబ్డం." అని హెచ్చరించాడు అప్పారావు. ఆ తర్వాత ఎవరికి వారు ఊహాగానాలు చేస్తూ మెల్లగా తమలోతాము గుసగుస లాడుకోసాగారు.
ఈ లోపున క్యూలైన్ మెల్లమెల్లగా కదులుతోంది. సమయం పెరిగేకొద్దీ అందరిలోను అసహనం చోటు చేసుకుంది. అయితే అప్పారావు నుండి అప్పు వసూలవుతుందన్న ఆనందంలో ఆ అసహనాన్ని లోలోపలే దాచుకున్నారు, ఒక్క సుందర్రావు తప్ప. క్యూలో చివరనున్న కారణంగా ఎక్కువ అసహనానికి గురవసాగాడు అతను.
క్యూలైన్ మెల్లగా తరగసాగింది. అప్పు ఏవిధంగా తీరుస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆతృత సుందర్రావుని నిలబడనియ్యలేదు. అతని ముందు మరో ఇద్దరు ఉండగా మెల్లగా అక్కడ్నుంచి బయటపడి అప్పారావు ఇంటి వెనకవైపు వెళ్ళాడు. అక్కడ కిటికీలోంచి లోపలి దృశ్యం చూసి నిశ్చేష్టుడైయ్యాడు. లోపల ఉన్న ముకుందరావు అతని ఎదురుగా ఉన్న అప్పారావు మిత్రుడైన పాపారావుతో తీరుబాటుగా పేకాడుతున్నాడు. 'ముకుందరావు తన అప్పు వసూలు చేసుకొని తన దారిన పోకుండా, ఈ పేకాటేమిటి మధ్యలో?' అని మనసులో అనుకొని చూడసాగాడు. ఓ పదినిమిషాల తర్వాత పాపారావు, "ఈ సారి కూడా నువ్వే ఓడిపోయావు. ఈ ఆటతో నా మిత్రుడైన అప్పారావు అప్పు పూర్తిగా తీరిపోవడమేకాక నువ్వే అతనికి ఓ అయిదువేలు బాకీ పడ్డావు. ఆ అయిదువేలకి నాకు నోటురాసి నీ చెల్లుచీటీ నువ్వు తీసుకుపో! ఈ ఐదువేలు అప్పారావుకి నెమ్మదిమీద తీర్చుదుగానిలే!" అని ఏడుపు మొహం పెట్టుకు కూర్చున్న ముకుందరావు వైపుకి తత్సంబంధమైన కాగితాలు తోసాడు పాపారావు.
విధిలేక ఆ ఏడుపుమొహంతోనే ఆ కాగితాలు తీసుకొని సంతకం పెట్టాడు ముకుందరావు. అదంతా చూసాక అసలు సంగతి అప్పుడు అర్ధమైంది సుందర్రావుకి. 'ఇదా అప్పారావు ఎత్తు!' అనుకున్నాడు. అప్పారావు తన అప్పు తీర్చడానికి తన మిత్రుడైన పేకాట పాపారావు సహాయం తీసుకున్నాడు. పేకాట పాపారావు పేకాటలో ఉద్దండుడు. అప్పులాళ్ళందరితో పేకాట ఆడి వాళ్ళందర్ని ఓడించి అప్పారావు అప్పు ఆ విధంగా తీర్చడమే కాకుండా తిరిగి వాళ్ళని అప్పారావుకి బాకీ పడేటట్లు చేస్తున్నాడు. ఈ విషయం గ్రహించి పరుగుపరుగున తిరిగివచ్చాడు క్యూలో ఉన్నవాళ్ళని హెచ్చరించడానికి. అయితే అప్పటికే తన ముందు ఉన్న ఒక్కడు కూడా ఆ ఇంట్లోకి దూరాడు పాపారావు బారిన పడటానికి
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
"మోసం! కుట్ర! దగా!" అన్నాడు అప్పారావుని చూసి రొప్పుతూ.
"ఏమిటి మోసం అంటున్నావు?! నేను అప్పు తీర్చడం కుట్ర, దగానా? నీ గురించే నేను కాచుకున్నాను ఎక్కడికి వెళ్ళావోనని. ఇక నీ ఒక్కడి అప్పే మిగిలిపోయింది. పద లోపలికి, నీ బాకీ నా మిత్రుడు పాపారావు తీరుస్తాడు” అని సుందర్రావు గింజుకుంటున్నా వినక ఇంట్లోకి లాక్కెళ్ళి బయట గడియవేసాడు అప్పారావు.
ఈ విధంగా అప్పారావు తన అప్పులోళ్ళందరి బాకీ తన మిత్రుడైన పేకాట పాపారావు ద్వారా చెల్లు వేయడమే కాక వాళ్ళందరూ కూడా తిరిగి తనకి బాకీ పడేటట్లు చేసాడు. అయితే ఆ తరవాత మన సుందర్రావుకో సందేహం వచ్చింది, 'మరి మొదట పాపారావు పేకాట ద్వారా మోసపోయినవాళ్ళు తిరిగివచ్చి క్యూలో తమవంతు మోసపోవడానికి కోసం ఓపిగ్గా నిలబడ్డవాళ్ళకి హెచ్చరించలేదెందుకు?' అని. అయితే, తను మోసపోయిన తర్వాత మిగతా వాళ్ళెందుకు మోసపోకూడదూ, పక్కవాడెందుకు బాగుపడాలి అన్న సగటు మనిషి బలహీనత మనసుకి తట్టి ఆ చిన్నపాటి సందేహం కూడా ఎవర్నీ అడగకుండానే తీరిపోయింది సుందర్రావుకి. మరి అప్పులాళ్ళ అనైక్యతే కదా అప్పారావు బలం.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#83
(28-07-2025, 04:25 PM)k3vv3 Wrote: అయితే, తను మోసపోయిన తర్వాత మిగతా వాళ్ళెందుకు మోసపోకూడదూ, పక్కవాడెందుకు బాగుపడాలి అన్న సగటు మనిషి బలహీనత మనసుకి తట్టి ఆ చిన్నపాటి సందేహం కూడా ఎవర్నీ అడగకుండానే తీరిపోయింది సుందర్రావుకి. మరి అప్పులాళ్ళ అనైక్యతే కదా అప్పారావు బలం.

Nice update, K3vv3 garu!!! Hope you had a good foreign trip...
clp); clp);
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#84
(29-07-2025, 08:28 AM)TheCaptain1983 Wrote: Nice update, K3vv3 garu!!! Hope you had a good foreign trip...
clp); clp);

Thank you captain garu, I am still abroad and back to India in 45 days
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#85
నయన విన్యాసం - వారణాసి రామకృష్ణ
[Image: image-2025-08-02-084126680.png]
పొద్దున్నే పనేమీ లేక కళ్ళు నులుముకుంటుంటే సెల్ మోగింది.,చూస్తె డాక్టర్ కన్నారావు!

అతనూ అమెరికాలో నా లాగే కంటి డాక్టరు. ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయాడు. దాదాపు ఏడాది క్రిందట కాల్ చేసి ఇండియా వచ్చేసి బోలెడు సంపాయించుకుంటా అన్నాడు. అప్పుడు నేను

“అమెరికా లో కంటే హైడ్రా బాడ్లో ఎక్కువ ఏం సంపాదిస్తావురా? ఇక్కడ పని లేక నేనే కళ్ళు నులుము కుంటున్నా” నవ్వుతూ అన్నాను. ఆ తర్వాత ఇదిగోమళ్ళిపొద్దున్నేకాల్!

“ ఇప్పుడు నేనూ హైడ్రాబాదీ నే! ” కన్నారావు హుషారుగా చెప్పాడు.

“అవునా!ఎప్పుడొచ్చావు?” అడిగితె, “ వచ్చి రెండు నెలలు దాటీంది” అన్నాడు

“హార్ని! ప్రాక్టీస్ ఎలా ఉంది” అంటే “ సూపరో సూపరు! ఫ్లాటు,ఆడి కారు కొన్నా! హహహ “ గట్టిగా నవ్వేడు. “ఓర్ని! అమెరికా లో లేని ప్రాక్టీస్ హైద్రాబాద్ లో ఎక్కడ్రా నేత్రావధాని! “ అనుమానంగా అడిగితే “ ఓరి పిచ్చోడా! హైడ్రా బాడ్లో కళ్ళ సమస్యలు ఎక్కువని ఉహించిందే నిజమైంది” అన్నాడు. “ఉహించావా? ఎలా? “

“ అదేరా నీ మంద బుద్దికి నా పాదరసం బుర్రకి ఉన్న తేడా!”“సరే ఒప్పుకుంటా! ఐతే మందబుద్ది తల్లోకి కొంచెం పాదరసం పారబోయ్యి ” “ పోస్తా .. నా క్లినిక్కి వచ్చెయ్యి” అంటూ అడ్రస్ చెప్పాడు. వెళితే మై గాడ్! ఆస్పత్రి నిండా బోలెడు మంది పేషెంట్లు! కన్నారావు చాల బిజీ గా ఉన్నాడు, నన్ను చూసి “రారా కూర్చో “ అనేసి సీరియస్ గా పేషంట్లని చూడసాగాడు. రద్దీ తగ్గాక నా వైపు తిరిగి

“చూశావా ఎంత మంది కంటి జబ్బుల వాళ్లు నీ హైడ్రాబ్యాడ్లో ? “ అన్నాడు .

“ ఇదేంటి గురూ ఇంతమంది కంటి జబ్బుల వాళ్ళు ఉన్నారని నేను ఉహించనేలేదు”

“ హహహ” మని నవ్వి కన్నారావు “ అసలు వచ్చిన పేషంట్లని గమనించావా” అడిగాడు. ఈలోగా మరింత మంది దూసుకొచ్చారు. అంతా మయోఅయంగా (అంటే అయోమయానికి తర్వాతి స్టేజిఅన్నమాట) ఉంటె వెర్రి మొహం పెట్టా. నా వెర్రి ఫేసు చూసి వెక్కిరింతతో నవ్వి
“పిచ్చోడా! మన చుట్టూ జరిగే పరిస్థితుల్ని గమనిస్తే అన్నీ అర్ధం అవుతాయ్! నువ్వు ఇక్కడి టీవీ లో డైలీ సేరియళ్ళు చూడవా?” అడిగాడు
“వామ్మో! డైలీ సీరియళ్ళా !” బాంబు బాడి మీద పడ్డట్టు తుళ్ళి పడ్డాను.

“అదేంట్రా అంతలా భయపడ్డావు ?”

“భయమా?భయమున్నరా? మా బామ్మకాశీ వెళ్తూ జీవితం మీద విరక్తి పుట్టాలనుకుంటేనే టీవీ చూడరా బడుద్దాయి అని చెప్పెళ్ళింది. అప్పట్నించి అస్సలు టీవీ ఆన్ చెయ్యలేదు! “

“నీ మొహం! అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వెర్రి మొర్రి కొత్త ఉహాలు రావాలంటే టీవీ డైలీ సీరియళ్ళు గమనించాలి, కానీ చూడకూడదు!” కన్ను గీటి చెప్పాడు

“ వల్ల కాదుగానీ ఇంకో మాట చెప్పు! “

“ కంటి డాక్టరువి అయి ఉండి కంటికి కనిపించేది గమనించవన్నమాట! “

“ సుత్తి కొట్టకుండా సూటిగా చెప్పు!”

“చెప్తా! నీకో క్లూ ఇస్తా .. ముందు ఇంటి కెళ్లి డైలీ సీరియల్సు గమనించు” అన్నాడు .

ఈలోగా మరో పేషంట్ వస్తే బగబగా ( అంటే గబాగబా కంటే ఎక్కువ స్పీడన్నమాట) ఇల్లు చేరి టీవీ ఆన్ చేసి అదేదో దిక్కు మాలిన ఛానల్ లో “కూతురా కూతురా నా ప్రియుడి పెళ్ళామా “ అనేడైలీ సీరియల్ వస్తుంటే చూడసాగాను...

**** **** *****

తల్లి పాత్రధారిణి కొడుక్కి కాఫీ కప్పు చేతిలో పెట్టగానే కోడలు పాత్రధారిణి మరో టీ కప్పు తో వచ్చి

“ ఆగవే అత్తమ్మా!” గట్టిగా అరిచింది.కొడుకు హతాశుడై చూసాడు. కోడలు కళ్ళు ఎరుపెక్కాయి. గుడ్ల్లు గుండ్రంగా తిరిగాయి. కను బొమ్మలు పైకి కిందికి ఊగేయి. విసవిసా చూస్తూ “ కాఫీ లో విషమెందుకు కలిపావు అత్తమ్మా!” కళ్ళు చిట్లించింది. మళ్ళీ కళ్ళు గుండ్రంగా తిప్పి తల వంచి అత్తమ్మని వోరగా చూసిoది. వికటాట్టహాసం చేసింది. అత్తమ్మా ఏమి తక్కువ తినలేదు ఆమె కూడా కనుగుడ్లు గిరగిరా తిప్పింది కళ్ళు చిట్లించింది. నల్ల గుడ్లు ముక్కు మీదకి రప్పించి రౌండు గా తిప్పింది . ఇలా అరగంట సేపు అత్తాకోడళ్ళ నయనవిన్యాసాలు ముగిసాక కోడలు హు అంటూ కోపంగా తిరస్కారంగా ముక్కు పుటలు ఎగురేసి కళ్ళు అగ్ని గోళాల్లా నిప్పులు కురిపిస్తూ గబుక్కున మొగుడి చేతిలో అత్తమ్మ పెట్టిన కప్పు ఒక్క లాగు లాగి నేల కేసి కొట్టి “కాఫీ లో ఏం కలిపావో చెప్పవే” అంటూ వికటంగా నవ్వింది. అత్తమ్మ కోడలు చేతిలోని కాఫీ కప్పు లాక్కుని గోడ కేసి విసిరి కొట్టి కళ్ళు తాటికాయలంత చేసి ఆవేశంతో “నా కొడుకు ప్రాణాలు తీద్దామని కుట్ర చేశావే రాక్షసీ “అంటూ అరిచింది.

అంత సేపూ బిగదీసుకుని కూచున్నకొడుకు కళ్ళు ఎర్ర బడ్డాయి.కనుగుడ్లు రివ్వు రివ్వున తిప్పుతూ చెయ్యి గాల్లోకి లేపి పెళ్ళాన్ని చాచి కొట్టాడు. కోడలుచేత్తోబుగ్గ పట్టుకునిఅత్తమ్మని కొరకొరాచూసింది.అత్తమ్మకళ్ళలోపైశాచిక నవ్వుస్పష్టంగాకనిపించింది. ఇంతలో కొడుకు వేగంగా తల్లి వైపు దూసుకొచ్చి బాక్సర్ లా ముక్కు మీద బలంగా పంచ్ ఇచ్చాడు. ముక్కు ఈ లావున వాచింది. అత్తమ్మ కళ్ళు అవమానం భారం తో షాక్ తిన్నట్టు చూశాయి. కోడలు క్రౌర్యం నిండిన చూపులతోచూసింది. కొడుకు కొరకొరా ఇద్దర్నీ చూసి ”పొద్దున్నేకాఫీచుక్కపొట్టలో పడక పొతేచస్తాను! చంపేద్దామని అత్తాకోడళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారా?”అంటూ జేబులోంచి కత్తి తీసి పెళ్ళాం పొట్టలో ఒక్క ఉదుటున పొడిచి భయంకరంగా నవ్వుతు గుడ్లుతిప్పాడు . తల్లి మంచి పనిచేసావురాఅబ్బాయ్ అన్నట్టు కళ్ళుఆడించింది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#86
ఈసారి కొడుకు కత్తితోతల్లిగుండెల్లోబలంగాపొడిచాడు.అత్తాకోడళ్ళిద్దరూహాహాకారాలుపెడుతూ గుడ్లు మిటకరించారు.ఆతను హేళనగా నవ్వి పక్కకి జరిగితే..అక్కడ మరో ఇద్దరు ఆడ వాళ్ళు. ఒక పడుచు అమ్మాయి, ఇంకో పెద్దావిడ! ఇద్దరూ గార పళ్ళు బైట పెట్టి కళ్ళ తో నవ్వేరు. కొడుకు పెద్దావిడ తో

“ అత్తా! నా పెళ్ళాం చచ్చిన మరుక్షణం నీ డాటర్ మెళ్ళో తాళి కడతా” అంటుండగానే అక్కడమరో కుర్రాడు పిచ్చినవ్వులు నవ్వుతూ రక్తంమడుగులోఉన్నకోడలికిపిస్టల్ అందిస్తే కోడలు మొగుడికి గురిపెట్టిగుడ్లుమిటకరించింది. పడుచు అమ్మాయి మొహం లో రంగులు తిరిగాయి.కళ్ళు భయంతో పెద్దవి అయినాయి. కెమెరా స్లో మోషన్ తో ఆ ఇద్దరి మొహల్లోకి జూమ్ అవుతుండగా “సుమతి పతి సుమంత్ ని చంపుతుందా లేక సవితి రేవతిని కాలుస్తుందా? రేపటి భాగం లో..’ అన్నఅక్షరాలు కనిపించాయి. తర్వాత ఆ సీరియల్ లక్షా పాతిక వేల భాగాలు పూర్తి చేసుకున్నట్టు చూపించి మళ్ళి తర్వాతి భాగం రేపు మధ్యాహ్నం ఇదే టైం కి అంటూ ముగించారు. నేను “మయ్యా-అ” అనుకుని( అంటే అమ్మయ్యా కంటే ఎక్కువ రిలీఫ్) ఛానల్ మారిస్తే- “ సావిత్రిగారి సావిట్లో సంపెంగ చెట్టు” డైలీ సీరియల్ వస్తోంది

***** **** *****

పెళ్లి కొడుకు విసురుగా జీలకర్ర బెల్లం పెళ్లి కూతురి నెత్తి మీద పెట్టాడు. పెళ్లి కూతురూ కోపంగా అతని నెత్తి మొత్తి మొట్టికాయ వేసింది. పెళ్లి కొడుకు తల వంచిన వాడల్ల్లా నలభై ఇదు డిగ్రీలు తిప్పి కళ్ళెర్ర జేశాడు. గుడ్ల్లు గుండ్రంగా తిప్పాడు.కను బొమ్మలు పైకి కిందికి ఊపాడు. చేతి కంటిన బెల్లంపాకం నాకుతూ “ఇకనుంచి నీకు పిచ్చిపట్టిస్తానే! పెళ్లి అయ్యిందనిసంబరమా!సంక నాకిపోతావ్! చిత్ర హింసలు భరించలేక పిచ్చికుక్కలా రోడ్డున పడతావ్!” అంటూ భయంకరంగా నవ్వుతూ కళ్ళు రౌండు రౌండు గా గిర గిరా తిప్పేడు. ఈలోగా కెమెరా పెళ్లి కూతురి మొహం మీద జూమ్ అయ్యింది. ముందు నవ్వి ఆనక కళ్ళు నిప్పుకణికల్లా ఎర్రగా చేసింది. ఒక్కసారిగా గాల్లోకి లేచింది. జుట్టు విరబోసి కళ్ళు నిప్పుల్లా మెరుస్తుంటే వికటాట్టహాసం చేసి “వదలనురానిన్ను! పెళ్లి అయిపోయింది ఇక నన్నోఆటఆడిద్దా మనుకుంటున్నావా ..ఆట! హహహా! శోభనం గది లో నీకు..” అంటూ చిటికెన వేలు పైకెత్తి చూపించి “నాలుగు లీటర్లు పోయిస్తా! తోలి రేయే.నీకిక ఆఖరి రేయి! హహహ్హ!! “ అంటూ వంకర తలతో కళ్ళు గిర గిర తిప్పింది.

హర్నయనోయ్! నేను బెంబేలెత్తిపోతూ ఛానల్ తిప్పితే మరోమాయదారి డబ్బింగ్ సీరియల్ -

“మామగారింట్లోమందేది” వస్తుంటే పెట్టా. నా కర్మ కొద్దీ అది మరింత దారుణం ..

**** **** *****

బోలెడు మంది నంగిరి నంగిరిగా నవ్వుతూ వెర్రి వెర్రిగా ఎగుర్తూ గంతులేస్తున్నారు బ్యాక్ గ్రౌండ్ లో ఏదో పిచ్చి పాట: హిందూస్తాన్ మే సబ్ సే అచ్చా డాడీ, ప్యార్ సనం తుజుకో ముజుకో సలాం కరుంగా డాడీ అంటూ చిరిగిన జీన్స్ వేస్కుని ఒక పిల్ల పాడుతూ డాడీ డాడీ అంటూ బఫూన్ లా ఉన్న అతనితో ఏదేదో బడబడా వాగుడు పండులా వాగుతూ (అంటే వాగుడుకాయ కన్నాఎక్కువన్న మాట)కస్సుకస్సు మంటూ నవ్వింది. సదరు డాడీ అంత దాకా మాములుగా చూసిన వాడల్లా వికటంగా కళ్ళు చిట్లించాడు. కనుబొమలు దగ్గరగా చేసి కనురెప్పలు టపటపా లాడించి కూతురు చేతిలో కొత్త కారు తాళాలు పెట్టేడు. కారు తాళం గాల్లోకి ఎగరేసి అమ్మాయి నడుస్తుంటే స్లో మోషన్ లో చూపించారు. డోర్ తీసి ఇంజిన్ ఆన్ చేసింది. ఈసారిసదరు డాడీకూతుర్నిశత్రువుని చూసినట్టు చూస్తుంటేమళ్ళిబ్యాక్ గ్రౌండ్ లో పిచ్చిపాట:
”ఈ కారు ప్రయాణం నీకు అంతిమప్రయాణం! అనంత లోకాలకి పయనం ” అంటూ! అంతలోనే కెమెరా డింగు డింగు మని కుదుపులతో జూమ్ చేసి కూతుర్ని చూపగానే మొహం లో పైశాచిక నవ్వు ప్రత్యక్షమైంది. కారు వేగంగా ముందుకుపోగానే వెనక ఆమె ప్రియుడు రాకేశ్ ఉన్నాడు. కూతురు క్షణం లోనే రూట్ మార్చి డాడీని గుర్రుగా చూసి కళ్ళు ఎర్రగా చేసి “ సారీ డాడీ!నువ్వు నా తండ్రివి కాదనీ ప్రియుడు రాకేశ్ చెప్పాడు ఇన్నాళ్ళు మోసం చేసినందుకు నీకిదే శిక్ష” అంటూ డాడీ మీదకి అతివేగంగా కారు నడపసాగింది. మిగతా జనాలు కెవ్వు కెవ్వు మని అరుస్తూ కళ్ళుగిర్రు గిర్రున తిప్పేరు ఒకళ్ళ వంక మరొకళ్ళు ఎందుకో వింత వింత చూపులు చూసుకున్నారు. దూసుకోస్తున్న కారునిచూసిడాడీకనుగుడ్లు భయం తో పెద్దవయి చావు భయం కళ్ళల్లోస్పష్టంగాకనిపించిందిఇంతలోసదరు ప్రియుడు రాకేశ్ తల తిప్పికారుకి అమర్చిన బాంబురిమోట్ చేత్తోతడిమి నవ్వి“నువ్వుమాంగారిని డీకొట్టిన క్షణమేనీ ఆఖరిక్షణం” అనేసి పక్కనేఉన్న డాడీ భార్యతో “ఒక్క దెబ్బకి రెండు పిట్టలు” గొప్ప పని చేసినట్టు చెప్పాడు అంతపెద్దావిడ రాకేశ్ ని కౌగలించుకుని “ఆస్తి మన చేతికి రాగేనే ఫారిన్ పోదాం “ అంది. కార్లో అమ్మాయి కళ్ళు చికిలిస్తూoడగా తెర మీద సీరియల్ పాతిక లక్షలా తొంభై తొమ్మిదోభాగం పూర్తి అయినట్టు అంకెలు కనిపించాయి!

అయిపోయిందా? వామ్మో! ఇవేం మాయదారి సీరియల్స్! తలదిమ్మెక్కి నిద్ర మాత్రలు వేస్కుంటే గాని నిద్ర పట్టి చావలేదు. మర్నాడు పొద్ద్దున్నే కంటిడాక్టరు కన్నారావు గుర్తొచ్చి ‘అయినా నన్ను ఇవన్ని ఎందుకు చూడమన్నాడో?’ అర్ధం కాక ఆస్పత్రికి మళ్ళీ వెళ్ళా!
నన్ను చూడగానే కన్నారావు “ ఊ! టీవీ సీరియళ్ళు చూశావా” అడిగాడు

“ చూశాలే గానీ ఈ తుక్కు సీరియళ్ళకి నువ్వు హైదరాబాద్ రావటానికీ ఏంటి సంబంధం?

“చెప్తా, ఇంతకీ అందులో నటించిన వాళ్ళగురించి ఎప్పుడైనా ఆలోచించావా? “ ఆ ప్రశ్నకి విస్తూపోయాను.

” లేదు! కానీ ప్రతీరోజూ సిరియల్స్ చూసే ప్రేక్షకులని తలచుకుంటే కడుపు తరుక్కుపోతోంది.”

“అక్కడే దాల్ లో లెగ్గేశావు! నువ్వు గమనిస్తే- ఆ నటీనటులు క్షణానికోసారి కళ్ళు తిప్పాలి! నిమిషానికి నాలుగుమాట్లు గుడ్లు మిటకరించాలి!అదేంత కష్టమో అసలు అలా నటించడం వల్ల వాళ్ళ కళ్ళు ఎంత దెబ్బతింటాయో ఊహించావా??” అతని ప్రశ్నకి ఉలిక్కిపడ్డాను. వరండా లో ఉన్న పేషంట్లు టీవీనటులు అన్నసంగతిఅర్ధమైంది! “అంటే. అంటే” నోటెమ్మట మాట రాక నిర్ఘాంతపోయి తేరుకుని అడిగే లోగా బిలబిలమంటూ ఇద్దరు పెషంట్లు వచ్చేరు. వాళ్ళు ఎవరో కాదు నిన్న చూసిన “కూతురా కూతురా ప్రియుడి పెళ్ళామా” సీరియల్ లో అత్తాకోడళ్ళు! పాపం ఇద్దరి కళ్ళు ఇంతలావున వాచిపోయి ఉన్నాయి. కళ్ళక్రింద ఉబ్బెత్తుగా ఉంది. కన్నారావు నవ్వుతు” ఎలాఉంది కన్ను తగ్గిందా?” అడిగితే ఇద్దరూ బొంగురు గొంతు పెట్టి “ ఏం తగ్గడమో నా బొంద! మీ ట్రీట్మెంట్ తో కాస్త కళ్ళ వాపు తగ్గుతుండగానే నిన్నమళ్ళీఇంకో ఎపిసోడ్ చెయ్యాల్సివచ్చింది” చెప్పారు. వెంటనే నేను కుతూహలంగా

ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#87
“దీన్లో కూడా మీరు కళ్ళు తిప్పట మేనా?” అడిగితే నన్ను వింతగా చూసి “కూడా అని అడగటం దేనికీ? నా బొంద! దేనిలో అయినా కళ్ళు గిర గిరా తిప్పాల్సిందే! నా బొంద ..గుడ్లు మిటకరించలేక చచ్చిపోతున్నాం బాబూ ” అంది. కన్నారావు డ్రాప్స్ వేసి అత్త క్యారక్టర్ ఆవిడతో

“ వచ్చే నెల లేజర్ ట్రీట్మెంట్ చెస్తానమ్మ” అన్నాడు. ఆమె బోలెదు ఫీజిచ్చి వెళ్లి పోయింది.

“నీ పనే బావుందిరా! మొత్తానికి భలే ప్లాన్ వేసావు! అసలు ఈ ఐడియా నీకెలా వచ్చిందిరా?”

“అమెరికాలో రాత్రి మీకిక్కడ పగలు!ఓరోజు నిద్రపట్టక ఇండియా టీవీఛానళ్ళు చూద్దాం అని పెడితే మై గాడ్, మించుఇంచు ... అన్నీ “ కన్నారావు చెప్పబోతే ఆపి “‘మించుఇంచు అంటే?” అడిగాను.

“ఇంచుమించుకి ఎక్కువన్నమాట!నువ్వు పదాల్నికాయినిoగ్ చెయ్యటం నచ్చినీదగ్గర్నుంచే నేర్చుకున్నా!”

“గురువుని ‘ముంచిన’ శిష్యుడివి! తర్వాతి సంగతి చెప్పు”

“ఇలాసీరియల్స్ లో కళ్ళు గిరగిరా తిప్పటం, గుడ్లుఉరమటం,కనుబొమలు మడవటం, రెప్పలు కొట్టడం మొత్తం నయనవిన్యాసాలే! దాంతో ఒక కంటి డాక్టర్ గా వెంటనే నాకీ ఆలోచన వచ్చింది హైడ్రాబ్యాడ్లో ఉండే బోలెడుమంది నటీనటులు ఇలాసీరియల్స్ లోనటించడంవల్ల వాళ్ళ కళ్ళు గ్యారెంటీగా దెబ్బతింటాయికదా! అంటే ఇక్కడ కంటి డాక్టర్లకి మంచి ప్రాక్టీస్ ఉంటుందని ఉహించి వచ్చేసా!రాగానే వీళ్ళందర్నీ కలిసి మీటింగ్ పెట్టి కంటిజబ్బుల గురించి హెచ్చరించా!అంతే తక్కిన కధoతా నీకు తెలిసిందే”

తల వంకరగా పెట్టి గుడ్లుమిటకరించి నవ్వుతూ అచ్చంగా సీరియల్స్ లో లాగే చెప్పాడు.

సీరియళ్ళ లో నటించే వాళ్ళ గురించి డాక్టర్ కన్నారావు ఆలోచించాడు బానే ఉంది కానీ రోజు చూసే వీక్షకుల సంగతి? అక్రమ సంబంధాల్ని ఆసక్తికరంగా, చవకబారు కధనాల్నినేత్రజాలపర్వంగా చూపెడితే చూసే జనం మెదళ్ల లోకి ఇంద్రజాలంలా విషం ఎక్కినేలబారుతనం పెరిగిపోదూ?! సీరియళ్ళలోఒకరుఇంకోర్నిచంపుతూ కుట్రలు పన్నుతూ..మరీ అన్యాయంగా కాక పోతే మానవసంబంధాలు

మట్టికొట్టుకుపోయినట్టుఇవేం కధనాలు? సాధారణ జనం వీటిని చూస్తే సానుకూల దృక్పధం నశిస్తుంది. ఒకరంటే ఒకరికి భయం! ఆందోళన! ఒకరి పట్ల మరొకరికి అపనమ్మకం! కాపురాల్లో అనుమానాలు పెరిగి మనస్పర్ధలు ఎక్కువై పోతాయి! చిన్న చిన్నసంఘటనలే పెను ఘర్షణలు గా మారి సమాజంలో అశాంతి పెరగటం గ్యారెంటీ ! తీసేవాళ్ళు ఏమైపోతున్నారో గాని చూసేవాళ్ళు నాశనమైపోతూ పరోక్షంగా వాళ్ళ జీవితాలు అతలాకుతలమై సమాజంలో సభ్యత సంస్కారాల స్థాయి ఎలా దిగాజారుతోందో ఎవరు ఆలోచించాలి?ఎవరు పట్టించుకోవాలి? ఆలోచిస్తూ నేను లేవగానే

“ సడెన్ గా లేచేవేంటి ? “ కన్నారావు అడిగాడు.

“ అర్జెంటు గా ‘నయన విన్యాసం ’ కథ రాయాలి! ఎవరూ పట్టించుకోని ఈ సమస్యని ప్రజలoదరి దృష్టికి తీసుకెళ్ళాలి“ సాలోచనతో చెబితే వింతగా చూసి అన్నాడిలా-

“చక్కగా అవకాశం ఉపయోగించుకుని ప్రాక్టిసు చేసుకోక ఈ నయనవిన్యాసాలు మనకెందుకు రా?”

“ అందరూ అలానే అనుకుంటే ఎలా? పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి కదా! “

అచ్చంగాసీరియల్స్ లోలాగే గుడ్లుమిటకరించి నయనవిన్యాసాలు చెయ్యబోయి భయంతో ఆపేశాను.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#88
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా - శ్రీనివాస్ మంత్రిప్రగడ
 
[Image: image-2025-08-07-121025256.png]
సాయంత్రమయ్యింది...కోవిడ్ మూలంగా కొంచం తక్కువగా హడావిడి పడుతున్న నగరం ఇంకొంచం సద్దుమణుగుతోంది...
నిర్బంధం నుంచి స్వేచ్ఛ దొరికింది కదా అని ఊరికే తిరిగేద్దామా లేక ఇంట్లో కూర్చుని ఎదో పని చేస్తూ కలం గడుపుదామా అనే ఆలోచనలు తెగక కొట్టు మిట్టాడుతున్న వాళ్లందరికీ ఇంట్లో ఉండడం అనే జవాబు దొరికి కొంచం కుదుట పడ్డారు...
ఆసక్తి ఉన్నవాళ్లు వంటగదిలో ప్రయోగాలు ప్రారంభిస్తున్నారు..
ప్రభుత్వ ఖజానాకు ఎక్సయిజ్ ద్వారా విరాళాలిచ్చే దాతలు..బార్ లో కూర్చుని తరవాత భార్యల చేత లేక తల్లుల చేత తిట్లు తిందామా లేక ఇంట్లోనే కూర్చుని తిట్లు తింటూ తాగుదామా అనే ఆలోచన తెగక అవస్థ పడుతున్నారు
ఈ రెండు కోవలకి చెందని వీర్రాజు ఇంట్లో కుదురుగా కూర్చుని పాటలు వింటున్నాడు
మధ్యాహ్నమే రాత్రికుడా సరిపడా వండేసుకోవడంతో తిండి సమస్య వేధించటంలేదు
ఆరోజే వాళ్ళ పినతండ్రి మోహన్ గారు పంపిన లలిత గీతాలు పెట్టాడు...బాల సరస్వతి గారి “నల్లని వాడా”...రాజేశ్వర రావు గారి “పాట పాడుమా” ..ఆలా వింటూ వింటూ విషాద గీతాలలోకి వెళ్ళాడు ...శ్రీరంగం గోపాలరాట్నం గారి “కనుపించు నా గతము” వింటూ కళ్ళు తుడుచుకున్నాడు...ఇంతటి అద్భుతమైన పాటలు వదిలి మనం గజళ్ళు అంటూ పాకులాడతాం అనుకున్నాడు
మెల్లిగా తనకెంతో ఇష్టమైన మదన్ భయ్యా పాటలు పెట్టాడు...”ఫిర్ ఆప్ కె నసీబ్ మీ ఏ రాత్ హో న హో” ..అబ్బా అద్భుతం అనుకున్నాడు..వీళ్ళందరూ గంధర్వులే... వీళ్ళెంతగా మన మనసులమీద ప్రభావం చుపిస్తారంటే మనకేమి వియోగ బాధలేమి లేకపోయినా దుఃఖం వచ్చేస్తుంది అనుకున్నాడు..ఎప్పుడు దిగులుగా ఉండే ముళ్ళపూడి వారి దిలీప్ త్రీ గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు
ఈ పరస్పర విరుద్ధ భావాలతో సతమతమౌతుండగా ఫోన్లో మెహిదీ హాసన్ గారి “రంజిష్ హి సహి”..ఫరీదా ఖానుం గారి “ఆజ్ జానే కి జిద్ నా కరో” వచ్చాయి ...ఇవికూడా కృష్ణుడి మీద మధుర భక్తి థీమ్ కు సరిపోతాయి అనుకున్నాడు
పాకిస్తాన్ కళాకారుల్ని మనం ఇష్ట పడొచ్చా?...మీడియా నుంచి ఇంకా వీర దేశ భక్తుల నుంచి వచ్చే భావాల్ని నమ్మితే మనకి పాకిస్తాన్ అంతా ఒక పెద్ద బందిపోటుల గుహలా ఉంటుందని.. అందరు నల్లగా..పెద్ద పెద్ద బొజ్జలతో మీసాలతో జిడ్డు ఓడుతూ ఉంటారని అనిపిస్తుంది ...ఆ భూమి నుంచి ఇలాంటి మధురమైన భావాలూ ఎలా వస్తున్నాయో?...ఆలోచనలో పడ్డాడు వీర్రాజు
అసలు వాళ్ళు కూడా మన ప్రజలే కదా...మతం పేరుతొ మంట పెట్టిన వాళ్ళ మీద కోపం వచ్చింది
ఫైజాన్ ముస్తఫా గారు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు...స్వాతంత్య్రానికి ముందు ఎవ్వరికి చివరకు జిన్నగారిక్కూడా మతం రాజకీయాలు కలపడం ఇష్టం లేదని...
మరి ఈ వేరే దేశం అనే ఆలోచన ఎలా ఎవరికీ వచ్చిందో అనుకున్నాడు
తలా విదిల్చాడు...ప్రస్తుత సాంప్రదాయ వాదుల్లా జరిగిన విషయాలని తవ్వి తీసి రంగులేసే ఆసక్తి గాని సమయం గాని లేవు అతని దగ్గర...చారిత్రక సంఘటలని ఇప్పటి కళ్ళద్దాలతో చుస్తే వేరే రకంగా కనిపిస్తాయి..వాటిని అలానే వదిలి ఇప్పుడీ ఈ ప్రపంచాన్ని అందరకి ఉపయోగ పడేలా చెయ్యడం ఎలా అనేదే అతనికి నచ్చిన పని...”హీల్ ది వరల్డ్...మాక్ ఇట్ ఏ బెటర్ ప్లేస్” అనే మైఖేల్ జాక్సన్ పాట అతనికి చాల ఇష్టం
ఈ విచారం నుంచి బయటపడానికి లేచి లైట్ వేసాడు...కొంచం తాజాగా అనిపించింది ...మళ్ళీ మాములు ప్రపంచం లోకి వచ్చినట్టు అనిపించింది...
తిండి తందామనుకున్న వీర్రాజుకి ఎదో అనుమానం వచ్చింది...లోపల్నించి బరువు తూచే బల్ల లాంటి త్రాసు తీసి బరువు చూసుకున్నాడు ...ఈ రెండు నెలల్లో ఆరు కేజీలు పెరిగాడు...గుండె గుభేలు మంది...
ఈ లెక్కన కరోనా సమస్య తీరే టప్పడికి ఏమౌతుందో...”నావికా ఎచటికోయి నీ పయనం అనుకున్నాడు”...ఘంటసాల వారి సిన్సియర్ గొంతు గుర్తొచ్చి ముచ్చటేసింది
అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చి రామరాజుకి ఫోన్ చేసాడు "ఒరేయ్ ఈ మధ్య బరువు చూసుకున్నావా?" అడిగాడు
"ఇప్పుడా బరువు ముచ్చటెందుకు గుర్తుకొచ్చింది? భోజనాల టైము కూడానూ" అన్నాడు రామరాజు నవ్వుతూ
"నేనో ఆరు కేజీలు పెరిగాను...తిండి తగ్గించడం మన వల్ల అయ్యే పని కాదు...అందుకని రేపట్నుంచి పొద్దున్నే వాకింగ్ చేద్దామనుకుంటున్నాను....నీ నుంచి ఏమైనా ప్రేరణ దొరుకుందేమో అని" అన్నాడు వీర్రాజు తాను కూడా నవ్వుతూ
"సరే, పొద్దున్న ఏడు నుంచి ఎనిమిది వరకు చేద్దాం...ఓ పని చేస్తాను...శాంతారాం కూడా వస్తాడేమో అడుగుతాను..బావుంటుంది" అన్నాడు రామరాజు
ఫోన్ పెట్టేసి భోజనం చేసి పడుకున్నాడు వీర్రాజు తరవాత రోజు ప్రారంభించబోయే వాకింగ్ గురించి ఉత్సాహ పడుతూ...ఈ కరోనా జీవితంలో అంతకన్నా ఆసక్తి కరమైన విషయాలేమి లేవు అనుకున్నాడు
తరువాత రోజు పొద్దున్నే లేచి వెళ్ళేటప్పడికి రామరాజు లేచి మేడమీద కుర్చీ వేసుక్కూచుని పేపర్ చదువు కుంటూ నవ్వు కుంటున్నాడు
"ఈ మధ్య వార్తలు హాస్య కదలకేమి తీసి పోవటంలేదు...ఇవాళ్టి కథ ఏమిటి?" అడిగాడు వీర్రాజు ముసుగు కొంచం వదులు చేసుకుంటూ
"సినిమా వార్తల్లే...కూచో" అన్నాడు రామరాజు పక్క కుర్చీ చూపిస్తూ "శాంతారాం రాగానే బయల్దేరుదాం" అన్నాడు
"దాదాపుగా రాజకీయాలే అనుకో..మరీ అంత ఇది కాకపోయినా వట తరువాత పెద్ద జూదం గందరగోళం సినిమాయే" అనే ముళ్లపూడి వారి డైలాగు గుర్తు చేసుకున్నాడు వీర్రాజు
అదివిని రామరాజు కూడా పగల బడి నవ్వాడు "తర తరాలుగా నొప్పించక తానొవ్వక అనే పధ్ధతి పాటించడానికి వాళ్ళు ఒక త్రిశంకు స్వర్గంలో వేళ్ళాడుతూ ఉన్నారు" అన్నాడు
"అంటే?" అడిగాడు వీర్రాజు...ఈ ఉపమానాలు అతని తలా పైనుంచి పోతున్నాయి
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#89
"సినిమా కళా వ్యాపారమా అనే విషయం తేల్చ కుండా కొన్ని తరాలు గడిచి పోయాయి....అందువల్ల ఒక స్థిరమైన ఆలోచన పధ్ధతి లేకుండా పోయింది" అన్నాడు రామరాజు
"వర్మ గారికి కాస్త కనిపిస్తున్నట్టుంది...ఇది తప్పనిసరిగా వ్యాపారమే అంటున్నాడాయన" అన్నాడు వీర్రాజు
"ఆయనది విజ్ఞాన వాదం వల్ల కలిగిన నైతిక అహం" అన్నాడు రామరాజు
"ఏమిటో రా...ఈ మాటల కన్నా వర్మ గార్ని అర్ధం చేసుకోవడమే సులభమేమో" అన్నాడు వీర్రాజు
"సర్లే...అయన వ్యాపారం అని ఖరారు చేసాడు కదా...అయన మనికిప్పుడు అవసరమైన సరుకు కాదు...అందుచేత ఆవిషయం వదిలి ముందుకి వెళ్దాం...ఆయనలాగే మన పని మనం చేసుకుంటూ పోదాం" అన్నాడు రామరాజు
"ఇంతకీ ఇవాళ్టి హాస్యం ఏమిటి?" అడిగాడు వీర్రాజు.."అంటే నా ఉద్దేశ్యం జోక్ ఆఫ్ డి డే ఏమిటి అని" ...తన తెలుగు మీద ధైర్యం లేక ఇంగ్లిష్ లో చెప్పాడు
"ఒక గొప్ప కదా నాయకుడికి అతని భార్య అయిన ఒక గొప్ప నాయిక వల్ల పుట్టిన పిల్లవాడికి దొరుకుతున్నంత ప్రచారం కూడా తనకు వార్తల్లో రావటల్లేదని వాపోతోంది ఒక వర్ధమాన నటి" అన్నాడు రామరాజు
"ఆ గొప్ప నాయిక నాయకులకు సొంత పత్రికలున్నాయేమో" అన్నాడు వీర్రాజు
"లేవు...అందుకే ఆ వర్ధమాన నటి ఎందుకు ఆలా వాపోతోందో అర్ధం కావటం లేదు" అన్నాడు రామరాజు
"ఆ బుల్లివాడికి ప్రచారం ఇవ్వడం వల్ల ఆ పత్రికలకు లేదా చానళ్లకు ఏమైనా లాభం దొరుకుండా వాళ్ళ నుంచి" అడిగాడు వీర్రాజు
"అలాంటిదేమి ఉన్నట్టు లేదు..ఒక ఛానల్ వాళ్ళామధ్య చాల బాధ పడ్డారు...మేము ఆ చిన్నవాడికి వారమంతా ప్రచారం చేసాం...కానీ ఆ నాయిక మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించింది... మా ఛానల్ అంత ప్రచారం ఉన్నది కాదని...చాలా మంది చూడరని అందుకే ఇవ్వనని అంది" అన్నాడు రామరాజు
"అలాంటప్పుడు ఆ చిన్నవాడి కి అంత ప్రచారం ఎందుకు?" అడిగాడు వీర్రాజు
"దాని వల్ల పత్రికలు ఎక్కువ అమ్ముడౌతాయని, టీవీ చాన్నాళ్లకు రేటింగ్లు పెరుగుతాయని వాళ్ళ నమ్మకం ...అందుకనే" అన్నాడు రామరాజు
"అది ఆ పత్రికలు , ఛానెళ్ల సమస్య...దీన్లో ఆ నాయకి నాయకుల తప్పేంటి? ఈ వర్ధమాన నటి కొచ్చిన కష్టం ఏమిటి? ఆవిడకు కేటాయించని పేజీలు వాడికి పోతున్నాయనా " అడిగాడు వీర్రాజు
"పత్రికలూ ఛానళ్ళు కూడా వ్యాపారాలే...వాళ్ళకేది ఎక్కువ అమ్ముడౌతుందో అదే చూపిస్తారు...ఇక్కడ నాకు చాలా ప్రతిభ ఉంది అనడం వల్ల ఏమీ లాభం లేదు" అన్నాడు రామరాజు
"అంతే కదా...వాళ్ళు వ్యాపారం చేసేదే టైం ఒక వస్తువుగా చేసి...ప్రతిభ కోసమో లేక పొగడ్తల కోసమో వాళ్ళేమీ చెయ్యరు" అన్నాడు వీర్రాజు
"రాజకీయాల్లో కూడా అదే తంతుట...ఈ మధ్య దేశమంతా చిన్నబాబులే కదా..పెద్ద బాబులని సంతోష పెట్ట డానికి ఈ చిన్న బాబుల బూట్లు తుడిచినా ...అవకాశాలు మాత్రం బాగా చదివింపులిచిన వాళ్ళకి...గెలుపు గుర్రాలకే ట...ఈ బూట్ల గాళ్ళు అటు చదివింపులూ చెయ్యలేక...బూట్ల భ్రమలో ప్రజా మద్దతు సమకూర్చుకో లేక రెండిటికి చెడ్డ రేవడిలా అయ్యారు " అన్నాడు రామరాజు
"తెలుగు న్యూస్ చూడడం తగ్గించు...నీ మాటలు కొన్ని గోడ మీద గోళ్ళతో గీకుతూన్న భావన కలిగిస్తున్నాయి " అన్నాడు వీర్రాజు
నవ్వాడు రామరాజు."సారీ...తక్కువ మాటల్లో చెప్పాలని ప్రయత్నం...పుస్తకాలూ చదవడం తగ్గించాం...ఇళ్లల్లో మాటల్లో చాలా ఇతర భాషా పదాలు వాడేస్తున్నాం..ఇంకా మన తెలుగు సినిమాల వల్లనో లేక టీవీ ఛానెళ్ల వల్లనో మాత్రమే అభివృద్ధి చేసుకొవాలి" అన్నాడు
"ఇప్పుడు చాలా తెలుగు పుస్తకాలు వినిపించే ఏర్పాట్లు చేస్తున్నారు...మనం ఇంటి నుంచి ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు వినొచ్చు" అన్నాడు వీర్రాజు
"చూద్దాం...వాటి నాణ్యత ఎలావుంటుందో చూసి గాని ఆవేశ పడదలుచుకో లేదు" అన్నాడు రామరాజు
అవునన్నట్టు తలాడించాడు వీర్రాజు
"ఈ బూట్ల వ్యవహారం ...దానివల్ల భంగ పడటం అన్ని చోట్ల ఉంటుందనుకుంటాను ...ఇంతకు పూర్వం నేను ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసాను కదా...మా ఆఫీసులో ఒకడుండేవాడు...
నా జీవిత లక్ష్యం మీ సేవ చేసుకోవడమే అనే మొహం పెట్టి వల్ల ఆఫిసర్ కి అడ్డమైన చాకిరీ చేసేవాడు...అయన రవాణా..అయన భార్య చేత కూరలు వగైరాలు కొనిపించడం, పిల్లల్ని కాలేజ్ కి ట్యూషన్ కి దింపడం లాంటివెన్నో చేసేవాడు...
వాడు చాలా శ్రద్ధ గా ఈ పనులన్నీ ప్లాన్ చేసుకుని చేసేవాడు" అన్నాడు వీర్రాజు
"అవును, అప్పట్లో వాడి శ్రద్ధ చూసి ను ముగ్ధుడవైపోవడం గుర్తుంది" అన్నాడు రామరాజు నవ్వుతూ
"ఇంకా వినూ...ఓసారి ప్రమోషన్లు వచ్చాయి...అందరం వీడికి ప్రమోషన్ తప్పనిసరిగా వస్తుంది అనుకున్నాం...కానీ వాడి పేరైనా ఆ లిస్ట్ లో లేదు...మేమందరం అవాక్కయ్యాం...వాడైతే షాక్ అయిపోయాడు...
ఏమిటా విషయం అని ఆరా తీస్తే తాను అడ్డమైన చాకిరీ చేస్తుంటే వాడుకున్న ఆఫీసర్ గారు వాడికి సంవత్సర సీ ఆర్ లో చాలా తక్కువ రేటింగు ఇచ్చారు...ఇది ఒకటో రెండో ఏళ్ళు కాదు...వరసగా ఆరేళ్ళు అధ్వాన్నపు రేటింగులు ఇచ్చారు..వాడి గుండె బద్దలైపోయింది" అన్నాడు వీర్రాజు
"అది అన్యాయం కదా..ఎలాగూ గవర్నమెంట్ ఆఫీసుల్లో పని కన్నా మంది ఎక్కువ కదా..ఆ పరిస్థితుల్లో కూడా వీడు ఎదో ఒక పనికొచ్చే పని చేసాడు కదా" అన్నాడు రామరాజు
"ఆఫీసర్ తనకు సుఖంగా ఉన్నంత వరకు వీడ్ని సిగ్గులేకుండా వాడేసు కున్నాడు..కొన్ని సార్లు వాడు ఆదివారం కూడా వాళ్ళింటికి వెళ్లి సాయం చేసేవాడు...
కానీ సి ఆర్ రాసేటప్పుడు ఐడియాలిస్టిక్ గా ఆలోచించాడు...వీడు పని చేయడానికి పనికిరాడు అందుకే నా బూట్లు నాకుతున్నాడు అనే భావన ఆఫీసర్ కి" అన్నాడు వీర్రాజు
"బూట్ల దగ్గర నుంచి అవకాశాలు సంపాదించడం చాలా కష్టం...ఆఫీసర్ కి వాడి స్థానం బూట్ల దగ్గిరే అని అనిపిస్తుంది...చులకనైపోతాడు....బూట్లు మనకెంత సేవ చేసిన వాట్లి చోటు వీధి గదిలోనే" అన్నాడు రామరాజు
"అదే జీవిత సత్యం....నేననేది ఏమిటంటే బూట్ల గాళ్ళు చేసే పని సరైనదని కాదు...ఈ ఆఫీసర్లు ముందే వాళ్ళని బూట్ల నుంచి దూరం చెయ్యాలి..
ఏ అవకాశాలైన నీ స్వశక్తి తోనే సంపాదించుకోవాలని చెప్పాలి...వీళ్ళెవరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు...ఎదో ఒక బలహీనమైన క్షణం లో మనో ధైర్యం పోగొట్టుకుంటారు...జ్యేష్ట గారన్నట్టు వాళ్ళక్కొంచం నమ్మకమివ్వాలి" అన్నాడు వీర్రాజు
"ఇదంతా ఆదర్శవాదం....నేను మేనేజర్ అయినా కొత్తలో రోజు ఆఫీస్ గుమ్మం నుంచి నా ఛాంబర్ వరకు వెళ్ళేటప్పుడు అందరు లేచి గుడ్ మార్నింగ్ చెప్పేవారు...ఒక రోజు ఒకడు ఎదో పనిలో ఉంది చూసుకో లేదు...నాకు మనసు చివుక్కు మంది
...అప్పుడర్థమైంది ఎలాటివాళ్ళకైనా కాలు జారవచ్చు అని...నాక్కొంచెం భయం వేసింది ఈ పతనం ఎక్కడికో అని... ఊరికే చాకిరి చేసే వాడిని నాయనా ఇది కాదు నీ పని అనడం చాలా కష్టం" అన్నాడు రామరాజు
"ఇలాంటి పరిస్థితులు సగటు మనుషులు మాత్రమే సృష్టించు కుంటారు...మనలాంటి జ్ఞాన పరిశ్రమల్లో కుదరవు" అన్నాడు వీర్రాజు
"నీ తలకాయ...మన జుట్టు రామ్మోహన్ గాడు ఇలాంటి ప్రయత్నమే చేసి భంగ పడ్డాడు తెలుసా" అన్నాడు రామరాజు
"అవునా...ఇదెప్పుడ్రా" అడిగాడు వీర్రాజు ఆశ్చర్యంగా
"ఇంతకు ముందో కంపెనీలో జుట్టు గాడు ఒక పెద్ద పోసిషన్ లో ఉండే వాడు కదా ...అప్పుడు వాడి తో బాటు ఒక తోకలాంటి వాడుండే వాడు కళ్యాణ్ అని గుర్తున్నాడా?" అనడిగాడు రామరాజు
"మజ్రు అనే వారు వాడే కదా?" అడిగాడు వీర్రాజు
"అవును వాడే...వాడ్ని ఎప్పుడు పొగుడుతూ...మంచి మంచి అవకాశాలు ఇస్తుండే వాడు జుట్టు గాడు" అన్నాడు రామరాజు
"అవును...వాడొక అద్భుతం అనుకునే వాళ్ళం...ఓసారి వాడితో బార్లొ ఒక బీర్ తాగే అవకాశం దొరికింది...అప్పుడు తెలిసింది వాడొక వాసనా గాడని...అయినా జుట్టు మీద గౌరవం తో మనకి తెలియని విద్యలేమైనా ఉన్నాయేమో అనుకున్నాను " అన్నాడు
వీర్రాజు "అయినా వాడ్ని మజ్రు అనేందుకనేవారు...మజ్ను కేమైనా వికృతా అది?" అడిగాడు
"కాదు...మజ్రు సుల్తాన్ పూరి అనే ఒక హిందీ కవి..ఆయనో అద్భుతమైన పాట రాసాడు...బార్ బార్ దేఖో అని ...వీడు ఆఫీసులో తక్కువ బార్లో ఎక్కువ కనిపిస్తాడు కదా...అందుకని ఆ పేరు" అన్నాడు రామరాజు...అంత దుర్భరమైన జోకు చెప్పడం అతనికీ రోత కలిగించింది
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#90
"అదే ట్యూన్ తో ఒక పాట తెలుగు లో భలే తమ్ముడు లో ఉంటుంది" అన్నాడు వీర్రాజు
"ఇంతకీ వాడెవడనుకున్నావ్?" అడిగాడు రామరాజు
"ఎవడో మాన్యుడే అయ్యుంటాడు" అన్నాడు వీర్రాజు
"మనకి మొదటి మేనేజర్ కుల శేఖర్ గారుండేవారు కదా...అయన తమ్ముడే వీడు" అన్నాడు రామరాజు
"ఓర్నీ" ఆశ్చర్య పోయాడు వీర్రాజు "అయితే" అనడిగాడు
"మన కులశేఖరుల వారు ఆ కుల శేఖర ఆళ్వార్ లాగ ఎందరి జీవితాలకో పునాది రాయి అయ్యాడు ..దారి చూపించాడు...
మన జుట్టు గాడు కూడా తనకేమైనా సమస్య వస్తే అయన అభయం ఉండడం మంచిది అనుకున్నాడు" అన్నాడు రామరాజు
"అయన వాడి కంటే చాలా సీనియర్ కదా...పైపెచ్చు నమస్కారాలకు పడే మనిషి కూడా కాదు..ఆయనకి నచ్చితే ఎవరికైనా సాయం చేసేస్తారు" అన్నాడు వీర్రాజు ‘
"అవునుకదా...అయినా ఆయనకు కొంచం కొంచం దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యొచ్చు...కానీ జుట్టు గాడి బుర్ర కొంచం వక్రం కదా..ఆయన్ని ఆకట్టుకోవడానికి అయన తమ్ముడ్ని పోషించడం ప్రారంభించాడు...
మరీ బూట్ల వరకు వెళ్ళాక పోయినా...తన స్థాయి నుంచి కొంచం దిగజారాడు" అన్నాడు రామరాజు
"ఆమధ్య జుట్టు గాడేదో సమస్య లో పడి నట్టున్నాడు కదా...అప్పుడు ఈ కులశేఖర పడి సాయం చేసిందా?" అడిగాడు వీర్రాజు
"లేదు...వీడు సాయం అడిగేటప్పడికి అయన దగ్గర ఒక ఉద్యోగం ఉంది కూడా...నాలుగైదు రోజులు ఆ ఉద్యోగం వచ్చేసినట్టు...దాని వల్ల వాడు మనకు సాయం చేస్తున్నట్టు భ్రమించి మాట్లాడే వాడు" అన్నాడు రామరాజు
"అవునురా...నాక్కూడా ఫోన్ చేసాడు...ఈ సారి నీకు కాకుండా శంకర్ కి అవకాశం ఇస్తాను..లాంటి మాటలు చెప్పాడు...వడ్డించే వాడు వాళ్ల వాడే కదా అని నేను కూడా చాలా ఫీల్ అయ్యాను" అన్నాడు వీర్రాజు
తీరా ఆయన్నడిగితే ...వాడి వీపుమీద వడ్డించాడు ...ఆ ఉద్యోగానికి కావలసిన నైపుణ్యం నీకు లేదు ..నీ పేరు నేను ప్రతిపాదించ లేను అనేశాడు" అన్నాడు రామరాజు
"అయన నిజంగానే కులశేఖరుడు రా" మెచ్చు కోలుగా అన్నాడు వీర్రాజు
"అందుచేత ...మన దారిన మనం ఎదురుగుతూ పోవడమే...ఇక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చోటుకి వెళ్ళడానికి అరగంట పట్టొచ్చు...కానీ ఆ చోటుకి పక్కనే ఉన్న ప్రాంతం వాళ్ళకి అయిదు నిముషాలే పట్టవచ్చు ... దానర్ధం దగ్గర గా ఉన్న వాళ్ళకి లాభం అని కాదు...చేరడం...చేరేక మనమేం చేస్తాం అనేది మన విజయానికి కారణమౌతుంది...మన భవిష్యత్తు దానిమీదే ఆధారపడి ఉంటుంది" అన్నాడు రామరాజు
"మరీ కొందరు అడ్డదారి గాళ్ళు లాభం పొందుతున్నారు కదా" అడిగేది వీర్రాజు
"తసమదీయుల్ని పోషించడానికి చాలా ఊక తయారు చేసారు...ఇది అన్ని రంగాల్లోనూ ఉంటుంది ...ఒక్కసారి నిజమైన గాలి వీస్తే ఎవ్వరు నిజంగా విలువున్నవారో తెలుస్తుంది...
ప్రపంచ వ్యాప్తం గా నాయకత్వ సమస్యలు ఎక్కువయ్యాయి....కానీ నేననుకోవడం అది ఒక తాత్కాలిక పరిస్థితి మాత్రమే...అందుచేత మనం నిరాశ పడకుండా ముందు కెళ్ళి పోవడమే" అన్నాడు రామరాజు
"వీర తాళ్ల కోసం ఎదురు చూడకుండా విలువల కోసం వెతకాలంటావు" అన్నాడు వీర్రాజు
"అవును...ఈ మధ్య సీఎం గా ఎన్నికైన ఒక చినబాబు వాళ్ల వంశం, తండ్రి కీర్తి ఇవేవి వాడుకోకుండా మూడువేల ఆరువందల కిలోమీటర్లు నడిచి...ప్రజల గురించి
తెలుసుకున్నాడు...దాని వల్ల ప్రజలకు కూడా అతని మీద గురి కుదిరింది...అలాగే అతను గెలవగలిగాడు...
ఒక చినబాబు మంత్రిగా ఉంది కూడా ప్రజా క్షేత్రంలో ఓడి పోయాడు ...మరో చిన బాబు పదేళ్లు పైన ప్రజా ప్రతినిధిగా ఉంది కూడా ఇంకా పెద్ద అక్షరాల నుంచి చిన్న అక్షరాలకి రాలేక పోయాడు" అన్నాడు రామరాజు
"ఈ చిన బాబులకు అవకాశాలు సులభంగా వస్తాయి...వాడుకో లేక పోయినా చాలా సమయం వ్యర్ధమైపోతోంది కదా" అన్నాడు వీర్రాజు
"అది తప్పదు...వాళ్లకు ఏ విలువ లేదని మనం కొట్టి పడెయ్యలేం...అవకాశం ఇవ్వాల్సిందే...
కానీ బంధు ప్రీతి వల్లనే అవకాశాలు వస్తాయని...అందుకోసం మనం కూడా ఏర్పాట్లు చేసుకోవాలని అనుకోవడం వల్ల మన స్వాభిమానం తగ్గి పోతుంది...అది చాలా ప్రమాదం...
అలంటి ఆలోచనలు ప్రజా బాహుళ్యంలో వస్తే..ఏంటో ముందుకి వెళ్లాల్సిన దేశం కట్టు బానిసల సామర్జ్యం అయిపోతుంది " అన్నాడు రామరాజు
"నిజమే ...ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు" అన్నాడు వీర్రాజు
"తాత్కాలికంగా తప్పులు జరగొచ్చు...కానీ కొన్ని అయినా సరైన పనులు జరగక పొతే మనం ప్రగతి సాధించలేము...గత ఇరవై ఏళ్ళ లో మనం సాధించిన ప్రగతి మనకేం చెబుతుందంటే ...మనలాంటి ఎందరో చేసిన విలువైన పనుల వల్లే అని" అన్నాడు రామరాజు కుర్చీలోంచి లేస్తూ
శాంతారాం వచ్చాడు...ముగ్గురు వాకింగ్ కి బయల్దేరారు
రేడియోలో "దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా" అనే పంచరత్నం బాలమురళి గారి గాత్రంలో శ్రావ్యంగా వినిపిస్తోంది
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#91
ఐ హేట్ మై రూమ్మేట్ - గంగాధర్ వడ్లమన్నాటి
[Image: i.jpg]
“హలో,హలో లలితా ఎక్కడున్నావ్”అడిగింది సునంద.
“వచ్చేస్తున్నా,అయిపోయింది పని.ఆఫీస్ గట్టు దిగి నడిచి, ఇపుడే రెస్టారెంట్ మెట్లెక్కుతున్నా” చెప్పి ఫోన్ పెట్టేసింది లలిత.
లలిత రెస్టారెంట్ కి రాగానే, “ఏంటి అప్పుడప్పుడూ నాకీ టార్చర్. మనం ఎంత మరీ పక్క,పక్క ఆఫీసులలో పని చేస్తే మాత్రం,ఎంత మరీ స్నేహితురాళ్ళమైతే మాత్రం,నన్నిలా టెన్నిస్ బంతిలా ఆడుకోవడం బాలేదు. వారంలో కొన్ని సార్లు నువ్వు మీ ఆఫీస్ అయిపోగానే నన్ను ఇలా రెస్టారెంట్ కి రమ్మని ఫోన్ చేయడం.నువ్వొచ్చాక ఇద్దరం కలిసి బోంచేయడం.లేదా ఇద్దరం కలిసి ఏదోటి మెక్కడం,ఆ తర్వాత కొంతసేపటికి నువ్వు నీ హాస్టల్ కి, నేను మా ఇంటికీ వెళ్లడం. ఏవైనా అంటే మీ హాస్టల్లో ఫుడ్ బాగోదని తల బాదుకుంటావ్. పోనీ ప్యాక్ చేయించుకుని మీ రూమ్ కి వెళ్లి తినొచ్చు కదా అంటే,చచ్చు మొహం పెట్టి,విచ్చలవిడిగా నన్ను తిట్టి , భూమి బద్దలయ్యేట్టు నా మీద విరుచుకు పడిపోతావ్.పోనీ ఏకంగా హాస్టల్ మారిపో తల్లీ అంటే,మన ఆఫీసుకి దగ్గర ఉన్న ఏకైక హాస్టల్ ఇదొక్కటే ,వేరే హాస్టల్స్ లేవు అంటావ్. నాకు మాత్రం రోజూ నీకీలా చెప్పి,చెప్పి నా గాత్రం పోతోంది. నీ కోసం వెయిట్ చేయడంతో మా కొంపకి వెళ్లడం ఆలస్యం అయిపోతోంది.ఇక నీతో కలిసి తినడంతో, ఇంట్లో సరిగా తినడం లేదని మా అమ్మ నా మొహాన తిట్టేస్తూ ,నెత్తిన మొట్టేస్తోంది. అయినా నాకు తెలియక అడుగుతానూ, ఎంతకాలం నాకీ తిప్పలు . నువ్వు విషయం ఏంటో కూడా క్లియర్ గా చెప్పవు. అసలు ఏవిటి ప్రాబ్లం. నువ్వు హాస్టల్ కి ఫుడ్డు పట్టుకు వెళితే నీ రూమ్మేట్ తిడుతుందా? లేక హాస్టల్ వాళ్ళు చేసిన ఫుడ్ కాదని ఇలా బయటి నుండి తెచ్చుకు తినడం వల్ల మిగతా వాళ్ళు కూడా అలా తయారవుతారు అని మీ హాస్టల్ వాళ్ళు నిన్ను ఏమైనా అంటున్నారా. ఎందుకంటే నువ్వు అప్పుడప్పుడు ఇలా బయట తిని హాస్టల్ కి వెళ్లడం ఏవిటో నాకు అర్ధమై చావడం లేదు. ఏవైనా అంటే నాకిష్టమైనవి అన్నీ బయటే తింటాను, రూమ్ కు మాత్రం తీసుకు వెళ్ళను అని అంటావు. ఈరోజు నాకు అసలు విషయం అంతా క్రికెట్ స్లో మోషన్ రిప్లే అంత స్పష్టంగా తెలియాల్సిందే.” .పట్టుబట్టింది సునంద.
“చెప్తాను సునందా చెప్తాను” అని తల వంచుకుని “ఈ గుండెల్లోని నా బాధ, ఊర పిచ్చుకలు కట్టుకున్న గూడులా అలానే ఉండిపోయింది.ఆ బాదం పప్పంత బాధ కాస్తా పెరిగి పెరిగి పందికొక్కంత అయింది. ఈరోజు అది నీతో పంచుకుంటాను.గ్యాస్ బండంత పెరిగిన నా గుండె బరువుని తల దిండులా తేలిక చేసుకుంటాను”. అని లలిత మరేదో ఏదో చెప్పేలోపు.
“ ఇలాంటి అర్ధం పర్ధం లేని అనవసర పాత చింతకాయ వర్ణనలు వద్దు.నేరుగా జోరుగా చెప్పు”.విసిగిందామె.
“ సర్లే కోప్పడకు.సింపుల్గా చెబుతా విను.నా రూమ్మేట్ మంచిదే. కానీ కొంచెం స్వార్థం. నేను ఏదైనా కొని తీసుకుని వెళితే, ఆమే తీసుకుని తినేస్తుంది. మొహమాటం అనే పదం ఆమెకి తెలీదు.పైగా ఆ హాస్టల్ వాళ్ళకి దూరపు బంధువు.అలా అని ఎప్పుడూ ఆమెకీ,నాకు సరిపోయే అంత కొని పట్టుకెళ్లడం అంటే అసాధ్యం కదా. అందుకనే ఇలాంటి ఏ ఇబ్బందీ లేకుండా నాకు నచ్చినవి హాయిగా బయట తినేసి హాస్టల్ రూమ్ కి వెళ్తాను. పోనీ ఆమె తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా నన్ను కనీసం తింటావా అని కూడా అడగదు. అడగడం మాట అటుంచు,కనీసం వాసన కూడా చూడనివ్వదు. పైగా నా ఒక్క దానికే కొని తెచ్చుకున్నాను, ఏమీ అనుకోవద్దూ, నేను నీకు ఇవ్వలేను అని నా ఎదురుగానే లబ,లాబా లైలా తుఫాను బాధితురాల్లా తినేస్తుంది.దాంతో నాలో ఓ హూద్ ,హూద్ తుఫాన్ చెలరేగుతుంది. ఆ తరువాత నా ఒళ్ళు మేలో ఎండల్లా సల సలా మండిపోతుంది. పోనీ ఈ హాస్టల్ రూమ్ లో ఈ ఫుడ్ ఘోస్ట్ తో ఇబ్బందని కనీసం వేరే రూము తీసుకుందావంటే ,ఆ రూముల్లో ముగ్గురు నలుగురు అమ్మాయిలు కలిసి ఉంటున్నారు. ఈమె ఆ హాస్టల్ వాళ్ళ బంధువు కావడంతో ఆ రూంలో ఇద్దరినే ఉంచారు.పైగా రూమ్ కూడా కొంత బావుంటుందిలే.అందుకే తప్పక ,తప్పించుకోలేక,ఆమెని ఓ మాట అని నొప్పించే ధైర్యం చేయలేక ఇలా మౌత్ మూసుకుని ఈ మార్గం అనుసరిస్తున్నాను” అని చెప్పి ఓ క్షణం తర్వాత “నా బాధ నీతో పంచుకున్నాక , పనసపండంత బరువుగా ఉన్న నా మనసు... ఇపుడు ఈతపండులా తేలిగ్గా అనిపిస్తోంది.నా మనసు ఇపుడు బూజు దులిపిన గాజు అద్దంలా” అని లలిత మరేదో చెప్పేంతలో.
“వద్దు మళ్ళీ వద్దు .ఇప్పటికే నీ దిక్కుమాలిన వర్ణనలు విని నా బుర్ర బద్దలైంది. నా సమయం చాలా వ్యర్ధమైంది.నీ బాధా అర్ధమైంది.కానీ నీ ఆలోచన బావుంది.అయితే ఇలా ఎంతకాలం ఇబ్బంది పడతావ్”.అడిగింది సునంద.
“ఎంతే? ఇంకా వన్ మంతే .ఆ తరువాత మా వసంతరావ్ బాబాయి బదిలీ మీద ఈ ఊరే వచ్చేస్తున్నాడు.నన్ను వాళ్లతోనే ఉండమన్నారు కూడా”.చెప్పింది లలిత ఉత్సాహంగా.
“అలాగా? సూపర్” అనేసి ,లలిత చేతిలోని స్వీట్స్, బేకరీ కవర్స్, ప్యాకెట్స్ చూసి,. “ఇదేంటి, ఇప్పటిదాకా హాస్టల్ రూమ్ కి ఏవైనా తీసుకు వెళితే , అన్నీ మీ రూమ్మేట్ తినేస్తుంది అని నా బుర్ర తినేసావు. మళ్లీ ఇప్పుడు ఇలా స్వీట్లు, కేకులు ,బేకరీ ఐటమ్స్ పట్టుకెళుతున్నావు! నాకేం అర్థం కావడంలేదు” అడిగింది సునంద.
“అదా! ఏం లేదు సునందా, ఇందాకనే మా రూమ్మేట్ ఫోన్ చేసింది. ఈరోజు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్లిందట. ఒక పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారట. రెండు మూడు రోజులు లిక్విడ్ డైట్ లోనే ఉండమని చెప్పారట. అందుకే నేను ఇలా రెండు ,మూడు రోజులు రెచ్చిపోవచ్చు మరి”. చెప్పింది లలిత నవ్వుతూ.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#92
Bsc - శ్రీనివాసరావు జీడిగుంట
[Image: b.jpg]
ఎందుకో రెండు రోజులు నుంచి కళ్ళు తిరుగుగుతున్నట్లు గా అనిపించడం తో ఎందుకైనా మంచిది అని కాలనీలో క్లినిక్ పెట్టిన కొత్త డాక్టర్ దగ్గరికి బయలుదేరాడు పద్మనాభం. కొత్త హాస్పిటల్ అయినా జనం బాగానే వున్నారు. డాక్టర్ గారు బాగా చాదస్తుడు అనుకుంట, ఒక్కొక్కరు ని యిరవై నిముషాలు పైన చూస్తున్నాడు. ఒక గంట తరువాత పద్మనాభం వంతు రావడం తో తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. డాక్టర్ చాలా చిన్నవాడు లాగా వున్నాడు అనుకుంటూ ఆయనకు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. 
అప్పటి వరకు ఎవరితోనో సెల్ లో మాట్లాడి, నన్ను చూసి "ఏమిటి problem"అన్నాడు డాక్టర్. 
"BSC " అన్నాడు పద్మనాభం. 
డాక్టర్ మొహం చిత్తలించుకుని, మీరు ఏమి చదివారని కాదు, ఏమిటి రోగం అనబోయి, ప్రాబ్లెమ్ అన్నాడు. 
దానికి పద్మనాభం అదేనండి, BSC. BP, షుగర్, cholesteral అన్నాడు. 
దాంతో డాక్టర్ గారు ఒక్కసారిగా విరగబడి నవ్వుతు, బలేవారండి, మీ పేరు కి తగ్గట్టు గానే మాట్లాడుతున్నారు, అంటూ బీపీ చూసి కొద్దిగా ఎక్కువ వుంది, మీ వయసు కి పరవాలేదు. కొత్త మందులు ఏమిరాయటం లేదు, యిప్పుడు వాడుతున్నవి చాలని, ప్రిస్క్రిప్షన్ చేతికి యిచ్చాడు. 
"యింతోటిదానికి ఫీజు నష్టం "అనుకుంటూ పై జేబులో రెడీ గా పెట్టుకున్న అయిదు వందల నోటు బయటకి తీస్తో "మీ ఫీజు "అన్నాడు పద్మనాభం. 
అప్పటి వరకు, రాబోయే పేషెంట్ కేసు షీట్ చూస్తూ, కొద్దిగా వాకింగ్ చేస్తోవుండండి, డబ్బు తీసుతున్న పద్మనాభంతో, NCC అన్నాడు డాక్టర్ గారు. 
నడక పరవాలేదు గానీ, NCC ఈవయసులోనా అన్నాడు పద్మనాభం. దానికి డాక్టర్ హాయిగా నవ్వుతు NCC అంటే మీకు "No కన్సల్టెన్సీ charges " అన్నాడు. 
దానికి పద్మనాభం విరగబడి నవ్వుతు "బలే వాడివి, నీ పేరు కి తగ్గుట్టు గా అన్నావు సుధాకర్ అని లేచి నుంచున్నాడు. 
డాక్టర్ దగ్గర కి రమ్మని పిలవటం correct అవునో కాదో నాకు తెలియదు, మీరు మాత్రం అప్పుడప్పుడు తప్పకుండా రండి సరదాగా నవ్విద్దురుగాని, 
నాకూ ఫ్యూచర్ లో BSC రాకుండా వుండటానికి అంటూ, next పేషెంట్ ని పిలిచాడు డాక్టర్.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#93
ఫేస్ బుక్ రాజా -వాట్సప్ రాణీ - భాగవతుల భారతి
[Image: f.jpg]
"హాయ్!రాజా!" "హోయ్ రాణీ!" "ఏంటి సంగతులూ! ఏంచేస్తున్నారు రాణీగారూ! " "ఏంచేస్తాం!రొటీనే! మాకు ఏంఉంటాయ్? టిఫిన్ లు రెడీ చేయటాలూ! వంటలు చేయటాలూ! పిల్లలకు, భర్తలకు పెట్టుకోటాలూ! పైగా వంకలు పెడితే భరించటాలూ " "భలే చెప్పావ్! మీ టైగర్ ఇంటికొచ్చే టైం అయిందనుకుంటా! ఏంప్రిపేర్ చేస్తున్నావ్!" "పెసరట్టు,ఉప్మా!" "అబ్బ! నాకెంత ఇష్టమో!వచ్చేయనా! అయినా దేవిగారి అనుగ్రహం మామీద లేదుగా! ఎప్పుడూ ఇలా ఛాటింగ్ లో కలుసుకోటమే గానీ నేరుగా కలవనీయవుగా! ప్లీజ్! రానా! ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళిపోతానూ! ఏం? " "అమ్మో! అదేం కుదరదనేగా! ప్రతిరోజూ అనేక కోణాల లో నావీ మా ఫామిలీ ఫొటోలు పెడుతూనేఉన్నా! తృప్తి లేదా? "లేదు! నీ మాటలు వింటుంటే ఎప్పుడెప్పుడు, నీ ఎదురుగా కూర్చుని కళ్ళల్లోకి చూస్తూ, కబుర్లు చెప్పలా అనిపిస్తోంది. అందులోనూ నీ ఫొటోలు మరీ ఊరించేస్తునాయ్. " "అహా! ఈ మాటలు మీ ఆవిడ విన్నదనుకో అప్పుడు అవుతుంది అయ్యగారి పెళ్ళి" "అబ్బా! మధ్యలో మీ ఆయన, మా ఆవిడ గోల ఎందుకూ? ఎప్పుడు కలుద్దాం చెప్పు" "వచ్చేనెల మా ఏలూరులో ఓ పెళ్ళి ఉంది. వెడతాను. నీది రాజమండ్రి అన్నావుగా! మధ్యలో విజయవాడ లో రైలు దిగేస్తాను. అక్కడ కొన్నిగంటలు నీతోనే ఉంటా !తర్వాత నీదారినీది నాదారినాది ,ఏమంటావ్! " "దేవిగారు వరమిచ్చారు అదేచాలు, ఇకనుండీ కలలుగంటూ క్షణమెుక యుగం గా గడుపుతా! నా మందాకినీని ఎప్పుడెప్పుడు చూస్తానా!? అనే ఆరాటంలో! "సరే బై! మా ఆయన వచ్చినట్లున్నారు ఉంటా! శ్యామ్ " "ఆయ్ ఆగు మళ్ళెప్పుడూ !ఛాటింగ్ దేవిగారు " "మళ్ళీ ఇదే సమయానికి సరే బై" ఛాటింగ్ క్లోజ్ చేసి తలుపుతీసింది మందాకిని. మందాకిని భర్త లోపలి కొస్తూ "ఏం చేస్తున్నావోయ్! "అన్నాడు. "ఆ~!ఏలూరు నుండి నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పెళ్ళి. ఇదిగో శుభలేఖ! అదే విషయం గురించి ఫోన్ లో ఫ్రెండ్ తో చర్చిస్తున్నాను. ఏమండీ వెడతానండీ! ప్లీజ్ రెండు రోజులే పిల్లలేం పసిపిల్లలు కాదు. వాళ్ళ పనులు వాళ్ళే చూసుకోగలరు. ఆరెండు రోజులకు కావాల్సిన ఏర్పాట్లు చేసే వెడతానూ, ~ఏమండీ! " "సరేనోయ్! నీ యిష్టం నేనెప్పుడైనా కాదన్నానా? " "అబ్బ!మావారు ఎంత మంచివారో! " అన్నదే కానీ, ఆసమయంలో మందాకిని మనసులో శ్యాం మెదిలాడు. ఏడాది క్రితం సెల్ ఫోన్ ఫేస్ బుక్ లో కలిసాడు శ్యామ్ .రోజూ పర్సనల్ వాట్సప్లో ఛాటింగ్ లో గంటలుగంటలు గడిపేయటం మెుదలు పెట్టారు.తెగ ముద్దులు, ముచ్చట్లు ఇంట్లో భర్త ఆఫీస్ కు పిల్లలు కాలేజ్ కీ వెళ్ళగానే . ఇద్దరూ వివాహితులే, పిల్లలున్నవాళ్ళే. నడివయస్సు వాళ్ళే.బంగారం లాంటి సంసారాలు. పండంటి కాపురాలూ ఆరోజు అనుకున్నట్లుగానే ~ మందాకిని శ్యామ్ కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టి, పిల్లలకు జాగ్రత్తగా అన్నీ అమర్చి బయలు దేరుతూ,భర్త ముఖంలోకి చూసింది. అలా ఎందుకు చూసిందో అర్ధంకాక భృకుటి ముడివేసి చూసాడు మందాకిని భర్తకూడా. రైలు ఎక్కబోతుంటే భయంతో కాళ్ళు ఒణికినాయ్. మనసు పరిపరి విధాల పోతోంది. ఎంత ఫోన్ లో ఛాటింగ్ లో గంటలుగంటలు గడిపినా, అతడు అపరిచితుడు. ఉన్నచోట ఉండక ఇంకో నలుగురిని వేసుకొచ్చి ఏదైనా అల్లరి పెడితే దిక్కా! మెుక్కా!? లేదూ! తనే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే? ఎన్ని వినలేదూ? చూళ్ళేదూ ఆన్ లైన్ మోసాలూ, నేరాలూ, తనదాక రాకపోతే, ఎవరూ దేనినీ, లెక్కపెట్టరా? జరిగాక నెత్తీ, నోరూ బాదుకుని, నేరమంతా అవతల వాళ్ళ మీదికి నెట్టేసీ, పోనీ రైలు దిగేస్తే?! అమ్మో అదీ రిస్కే. ఇదంతా నేనెందుకు చేస్తున్నాట్టూ! ఇంత ధైర్యం, తెగింపూ నాలో ఉన్నాయా! అశ్చర్యంగా ఉందే! ఆలోచిస్తూ ఉండగానే విజయవాడ వచ్చేసింది. స్టేషన్ లో దిగింది. శ్యామ్ వచ్చాడు. ఓ క్షణం తడబడ్డారు. ఓక్షణం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని, నవ్వుకున్నారు. ఎవరో దారిచూపినట్లు. స్టేషన్ బయటకు నడిచి, ఓ రెస్టారెంట్ లో కూర్చున్నారు. "ఇప్పుడు చెప్పండి ఏమిటీ విశేషాలూ!" శ్యామ్ మెుదటిగా నోరు విప్పాడు. "మీరు చెబితే నేను వింటాను" అంది మందాకిని. "మా ఆవిడా అంతే! నేను మాట్లాడితే తను వింటాఅంటుంది. ఆడవాళ్ళంతా ఒకటే అనుకుంటా! గంటల తరబడి నేనే మాట్లాడాలి.తనకదే ఆనందం " నవ్వాడు శ్యామ్. "మా వారూ అంతే! ఆఫీసు నుండి రాగానే ముచ్చట్లు మెుదలెడతారు.ఆయన మాట్లాడుతూ ఉంటే భలేఉటుంది కాలమే తెలీదు. " అంది మందాకిని. "మెుదటిసారిగా కలిసాం !ఏం తీసుకుంటారూ!" శ్యాం అడిగాడు. "మంచినీళ్ళు తీసుకుంటా! " అని మందాకిని తనే స్వయంగా తెచ్చుకున్న వాటర్ బాటిల్ లోని నీళ్ళు తాగింది. "మా ఆవిడా అంతే! ఎక్కడి కెళ్ళినా వాటర్ బాటిల్ ఉండాల్సిందే నేను ఇడ్లీ ఆర్డర్ ఇస్తానూ " అంటూ బేరర్ అని కేకేసాడు శ్యామ్. "మా వారూ అంతే! బయటి ఎక్కడి కెళ్ళినా ఇడ్లీ తప్ప, ఆయిలీ ఫుడ్ తినరు. " అంది మందాకిని . ఇదిగో ఇలా సాంబారు లో ఇడ్లీ ముంచుకుని తినటం అంటే మా ఆవిడ భలే ఇష్టపడుతుంది." "అబ్బో సూపర్!మా ఆయన గారైతే చట్నీలేకుండా, ఇడ్లీ అస్సలు తినరు. చట్నీ లేని ఇడ్లీ, మందాకిని లేని ఇల్లూ అని చమత్కరిస్తారు. " "మా ఆవిడైతే! ఏమండీ మీరు లేకపోతే ఇల్లు నిద్రపోతుందండీ అంటుంది" అన్నాడతను. ఇలా మందాకినీ, శ్యామ్ మాట్లాడుతూనే గమనించారు,వాళ్ళు వాళ్ళ గురించి కన్నా, తమ జీవిత భాగస్వాముల గురించే మాట్లాడుతున్నారు తప్ప విషయం ముందుకు సాగట్లా.పరిధిని ఇద్దరూ దాటే ప్రయత్నం చేయట్లేదనీ. బిల్ కట్టేసి, "నేను విజయవాడ లో పనిచూసుకుని వెడతాను మరిమీరూ" అన్నాడు. "నేను బస్టాండ్ కెళ్ళి,మా ఊరు వెళ్ళే బస్ ఎక్కేస్తాను.ఏలూరు పెళ్ళికెళ్ళే మూడ్ లేదు. వెనక్కి వెళ్ళిపోతాను." అంది మందాకిని. ఆటో ఎక్కుతూ అనుకుంది "హమ్మయ్య! అవాంఛనీయ సంఘటనలేం జరగలా!జరగాలనా? కూడదనా? ఏంఆశించితను ఇంత దూరం వచ్చినట్లూ!? ఐనా దొంగవెధవ! పెళ్ళాం గురించి తప్ప ఇంకే విషయమూ మాట్లాడడేం! జీడిపాకం ఫోన్ లో తెగ ప్రేమ ఒలకపోసి ఒకటివ్వరాదూ! ఏమీ గిఫ్ట్ లు లేవా! అని ఏమేమో ! " వెళ్ళిపోతున్న మందాకిని ఎక్కిన ఆటోను చూస్తూ శ్యాం ఇలా అనుకున్నాడు. " అబ్బో!పెద్ద ముదురుకేసు మెుగుడి గురించి తప్ప ఏం మాట్లాడదే! విషయం ముందుకు జరగనీయదే!టెక్కు! మనం కొంచెం ముందడుగు వేసామనుకో! నన్ను వెధవను చేద్దామనేగా!ఐనాఫోన్ లో అంత శృంగారం ఒలికించేదిగా గుంటనక్క" ఐతే ఇద్దరూ ఏకకాలంలో చేసినపని ఒకటి ఉంది,వాట్సప్ లో పరస్పరం ఎదుటివారి నెంబర్ డిలిట్ చేసేయటం.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#94
పాపం తెలుగు ఉపాధ్యాయుడు, తెలుగు భాష - ambadipudi syamasundar rao
[Image: image.jpg]
సాధారణముగా స్కూళ్లలో తెలుగు ఉపాధ్యాయులు పిల్లలను భాషాపరమైన దోషాలు ఉచ్చరించి నప్పుడు లేదా వ్రాసినప్పుడు తప్పనిసరిగా ఎదో ఒక రకమైన శిక్ష వేస్తారు ఒక తెలుగు ఉపాధ్యాయుడు ఆ రకంగా విద్యార్థిని శిక్షించి తానూ ఇబ్బందుల పాలైన కధ ఇది .ప్రస్తుతం స్కూళ్లలో పిల్లలను దండించటం అనేది పూర్తిగా నిషిద్ధం అనుకోండి పొరపాటున కొడితే వెంటనే తల్లిదండ్రులు వచ్చి ఆ సదరు ఉపాధ్యాయుడితో గొడవ పడతారు కొన్ని సందర్భాలలో సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ దాకా వెళతాయి ప్రస్తుత పరిస్థితి ఇది పాతరోజుల్లో అయితే టీచర్ కొడితే తల్లిదండ్రులు ఎవరు కాలేజ్ కి వచ్చి కంప్లైంట్ చేసేవారు కాదు పిల్లవాడికి చదువు రావడానికి కొట్టారు అని సర్దుకు పోయేవారు ప్రస్తుతం రోజులు మారిపోయాయి కదా పిల్లలను తప్పు ఇంక కథ లోకి వద్దాము.
ఒక చిన్న ఊరిలో కాలేజ్లో తెలుగు క్లాసులో ఉపాధ్యాయుడు 5వ తరగతి పిల్లలకు డిక్టేషన్ చెప్పాడు రాసిన పిల్లలు వాళ్ళ నోట్ పుస్తకాలతో కరెక్షన్ కు వచ్చారు తప్పులుంటే ఒక దెబ్బ వేసి కరెక్షన్ చేస్తున్నాడు పిల్లలు దెబ్బలు తిని వాళ్ళ నోట్సులు తీసుకొని వెళుతున్నారు ఆ వరుసలో ఆ ఊళ్లోని పంచాయతీ ప్రెసిడెంట్ గారి కొడుకు కూడా ఉన్నాడు వాడు ఇంటికి వెళ్లి తెలుగు మేష్టారు కొట్టారు అని చెప్పాడు
మర్నాడు ఆ పంచాయతీ ప్రెసిడెంట్ మా పిల్లడ్ని ఎందుకు కొట్టావు అని తెలుగు ఉపాధ్యాయుడిని అడిగాడు అయన తెలుగు డిక్టేషన్ తప్పు రాస్తే కొట్టాను అని జవాబు ఇచ్చాడు వెంటనే ఏమి తప్పు రాసాడు అని ఆ ఉపాధ్యాయుడిని అడిగాడు దానికి జవాబుగా ఏమిటా తప్పు అని ఆ తండ్రి అడిగాడు "విద్యార్థి" కి ఒత్తు పెట్టాడు అది తప్పు కాబట్టి నేను కొట్టాను అని ఉపాధ్యాయుడు చెపుతాడు ఆ తండ్రి "ఉపాధ్యాయుడికి" వత్తు ఉన్నప్పుడు విద్యార్థికి పెడితే తప్పేంటి అని లాజిక్ లేవదీసి అనవసరంగా మా అబ్బాయిని కొట్టారు అని అల్లరి చేయడం మొదలు పెట్టాడు.
ఈ గొడవ చేసేది సాక్షాత్తు ఆ ఊరి ప్రెసిడెంట్ ఏదో విధముగా ఆ గొడవను సర్దుబాటు చేయాలనే ఉద్దేశ్యంతో హెడ్ మాష్టారు గారు ఒక నిజ నిర్ధారణ కమిటీని వేసి విచారణ చేద్దాం అని అన్నాడు ఆ ప్రెసిడెంట్ ఒప్పుకున్నాక ఓ కమిటీ ఏర్పాటు అయింది ఆ కమిటీ లో ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ ,ఒక లాయర్ ,ఒక తెలుగు పండితుడు సభ్యులు ఒక నెల తరువాత ఆ కమిటీ వారు వారి తీర్పులను ప్రకటించారు ఇంజనీర్ ఇచ్చిన తీర్పు ఏమిటి అంటే బిల్డింగ్ కు పునాదులు ఎలాంటివో అలాగే పదాలకు ఒత్తులు అలాంటివే కాబట్టి రెంటికి ఒత్తులు ఉండాల్సిందే అన్నాడు లాయర్ చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి ఉపాధ్యాయుడికి ఒత్తు ఉన్నప్పుడు విద్యార్థికి ఉంటే తప్పేంటి అని తీర్పు ఇచ్చాడు లేదా రెండు పదాలకు ఒత్తులు తీసెయ్యాలి అన్నాడు. డాక్టర్ ఒత్తులు పలికేటప్పుడు ఊపిరి తిత్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒత్తులు నిషిద్దము కాబట్టి ఒత్తులు లేకపోయినా ఫర్వాలేదు అని తీర్పు ఇచ్చాడు తెలుగు పండితుడు భాష శాస్త్ర శాస్త్ర ప్రకారం విద్యార్థికి ఒత్తు ఉండరాదు ఉపాధ్యాయుడికి ఒత్తు ఉండాలి అని తీర్పు ఇచ్చాడు నలుగురిలో ఇద్దరు వత్తులు తీసేయమని అన్నారు మూడో వ్యక్తి వత్తులు ఉంటె రెంటికి ఉండాలి లేదా రెంటికి లేకుండా ఉండాలి అన్నాడు కాబట్టి ఒక్క తెలుగు ఉపాధ్యాయుడు మాత్రం విద్యార్థికి ఒత్తు ఉండకూడదు అని గ్రామర్ ప్రకారము చెప్పాడు కానీ మెజారిటీ సభ్యులు అది తప్పు కాదని అభిప్రాయం పడ్డారు కాబట్టి తెలుగు ఉపాధ్యాయుడికి ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు తప్పును తప్పు అని చెప్పడం కూడా ఈ రోజుల్లో నేరమే ప్రస్తుతం మనము వింటూనే ఉన్నాము టీవీలలో సినిమాలలో ఉపయోగించే తెలుగులో ఒత్తులు పలకడం మానేశారు సినిమాల్లో కామెడీ కోసం మాత్రమే వాడుతున్నారు ఇదండీ ప్రస్తుత తెలుగు భాషా పరిస్థితి


 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#95
మన ఔదార్యం - సిహెచ్. వెంకట సత్య సాయి పుల్లంరాజు
[Image: m.jpg]
“ఒరేయ్, ఒరేయ్ చవటా! ఆ చదవడం ఏమిట్రా?”
“బామ్మా! మరీ అంత డామేజింగ్ గా? …”
“తిట్టనా మరి! పుస్తకం చూస్తూ కూడా తప్పు చదువుతావా?”
“బామ్మా! మా కాలేజ్ లో నేను టెలుగు సూపర్ గా చదువుతానని…”
“నీ స్నేహితులు, గురువులు…?”
“అవును. వాళ్ళు నన్ను ఎంత మెచ్చుకొంటారో టెలుసా?”
“అబ్బో! నువ్వు సత్య హరిశ్చంద్రుడవనీ తెలుసు.”
“మరి నా గొప్పతనం తెలిసి కూడా…”
“అక్కడే ఉందిరా నీతో చిక్కు.”
“ వాట్చిక్కు? బామ్మ!”
“అదే…ఇందాక చదివినదే…”
“మల్లీ చదవాలా?”
“అవును. అఘోరించు.”
“అంటే… చదవమనా?”
“ఊ…”
“బామ్మా! టివి చూడటం ఆపి, సరీగ్గా విను. మల్లీ చదవను.” “వన్డే విష్ణుం. బావ భయం, హారం…”
“ హరి హరీ... మళ్ళీ అదే…”
“బామ్మా! నీ నవ్వు లెంపలేసుకోవడం ఆపి…”
“నీ తప్పు ఏమిటో చెబుతా, అది వన్డే కాదురా. వందే. తెలిసిందా?”
“అంతేనా!”
“బావ భయం…హారం కాదు.”
“కాదా? వాట్?”
“కాదు. భవ భయ హరం.” ఇప్పుడు పుస్తకం సరిగ్గా చూస్తూ మళ్ళీ సరిగ్గా ఏడు.”
“ఏడ్వనా? వై బామ్మా?”
“ఆ ఏడ్పు ఏదో నేనే ఏడుస్తా గానీ…నువ్వు చదువు నాయనా.”
“సరే బామ్మ. టాంక్ యు.”
“ఏం చేస్తాం నాయనా! ఇంగ్లీషు మీడియం చదువుల ప్రభావం. అదే నా ఏడుపు. అందుకే ఈ ఏడ్పు.” ********
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#96
కాయ్.. కాయ్ ( కథ ) - హరి వెంకట రమణ
[Image: k.jpg]
"అలా... యూ ట్యూబులో వీడియోలు చూసి జ్ఞానం సంపాదించకపొతే వెళ్లి కారం ఆడించుకురండి" అంది మోహన సుందరంతో భార్య సూర్యకళ.
ఒక్క నిముషం ఈ లోకంలోకి వొచ్చి " అలాగే" అని పైకి అని నీకు సూర్యకళ కాదు, సూర్యకాంతం అని పేరు పెట్టాల్సింది అనుకున్నాడు.
భార్య ఇచ్చిన ఎండు మిరపలు,ధనియాలు తీసుకొని పిండి మరకి బయలుదేరాడు.
అక్కడ మొన్న ఎలక్షన్ లో ఉన్నంత క్యూ వుంది.
రకరకాల లుంగీవాళ్ళు, నైటీల వాళ్ళు, హాఫ్ నిక్కర్ వాలాలు అందరూ వరసలో వున్నారు.
ఇంటికెళ్లి తిట్లు తినడం కంటే ఇక్కడే కాలక్షేపం చేయడం మంచిదని ఫోను చూసుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ చాలా గంటలు గడిపాక మోహన సుందరం వొంతు వొచ్చింది.
కారం ఆడుతుంటే ఆ కమ్మని వాసనకి " హాచ్హ్ ... హాచ్హ్ ... " అని తుమ్మాడు.
"పనికి మాలిన ఎదవా " అంది మెల్లగా లైన్ లో తన వెనక వున్న నైటీ బ్యూటీ.
* * *
"ఏంటి కారం ఇంతే వొచ్చింది, కారం సరిగ్గా ఆడించారా లేదా ?నిజం చెప్పండి అక్కడ ఇచ్చేసి బలాదూర్ తిరిగారు కదూ? "
" అయ్యో లేదే ? అక్కడే నుంచున్నాను ఇంతసేపూ ".. అని కాళ్ళీడ్చుకుంటూ వెళ్లి సోఫా లో కూలబడ్డాడు.
" అప్పుడే అలా కాళ్ళీడ్చేస్తే ఎలాగండీ ? వెళ్లి కోలంగోవా మామిడి కాయలు పట్రండి ఆవకాయ్ ముక్కలు కట్ చేద్దాం. "
ఆవకాయ్ అన్న మాటకు బేగు తీసుకొని బయటకు తుర్రుమన్నాడు మోహన సుందరం.
బజార్లో వున్న కాయలు సూర్యకళకి వాట్సాప్ పెట్టి, వీడియో కాల్స్ లో చూపించి కొనేసరికి తల ప్రాణం తోకలోకి వొచ్చింది.
జాగ్రత్తగా ఇంటికొచ్చాక " అయ్యో నువ్వులనూనె తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయానండీ.. ప్లీజ్.. ప్లీజ్.. తెచ్చేయండి " అంది గోముగా.
ఆ గోముతనానికి బండి వేసుకెళ్ళకుండా పరిగెత్తుకెళ్లి నూనె కూడా తెచ్చేసి, మంచం మీదకు వెళ్లే ఓపికలేక వరండాలోనే పడి నిద్దరపోయాడు.
పొద్దున్నే వొళ్ళు నొప్పులన్నా వినకుండా నిద్దురలేపి మామిడి కాయలన్నీ తుడిపించి కోయించింది సూర్యకళ.
* * *
"ఒక చిన్న సీసాడు ఆవకాయ ఇయ్యవే, మా బాస్ కి ఇస్తాను " బతిమిలాడాడు మోహన సుందరం.
" బాసూ లేదు పీసూ లేదు , మీ అమ్మకు కూడా ఒక్క ఆవకాయ బద్ద ఇవ్వని దానిని మీ ముష్టి మొహం బాస్ కి ఎలా ఇస్తాననుకున్నావ్ " అని ఉతికి పారేసింది.
* * *
మరుసటి రోజు స్నానం పాణం అన్నీ సమయానికి ముగించి, సమయానికి బుద్ధి మంతుడిలా టిఫిన్ కానిచ్చేసి సూర్యకళ ని తెగ బతిమాలుకొని, ఒక చిన్న ప్లాస్టిక్ సీసాడు ఆవకాయ్ పట్టుకెళ్ళాడు.
ఆఫీసుకు చేరి సరాసరి బాస్ రూమ్ లో దూరి ఒక కాకా నవ్వుతో " షార్ .. గుడ్ మార్నింగ్ సార్ ర్ మన తెలుగు ఆవకాయ సార్... మీ కోసం నేను స్వయంగా నా స్వహస్తాలతో పెట్టింది సర్ " అన్నాడు హొయలు పోతూ.
అంతే అప్పటికప్పుడు తాను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న టిఫిన్ బాక్సు తీసి దోసెల్లో ఆవకాయ వేసుకొని తన ముందే ఆత్రంగా తినేయసాగాడు బాస్.
టిఫిన్ తినేసాక చేతులు కూడా నాకేస్తూ " బాగుందయ్యా అద్భుతం ... అమోఘం... నువ్వొక పని చేయి , ఈ సంవత్సరం మా ఆవిడకు వొంట్లో బాగోలేక మేము ఆవకాయ పెట్టుకోలేక పోయాము, సమయానికి నువ్వు దేవుడిలా వొచ్చావు, నీ హస్తవాసి అదుర్స్.. "
అని చిన్నగా ఒక సారి త్రేనించి ... " నువ్వొక జాడీడు ఆవకాయ పెట్టేసి నాకు జాడీ తో సహా ఇచ్చేయాలన్నమాట .. ఇదే ఈ సంవత్సరం నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్, అన్నట్టు మొన్న న్యూ ఇయర్ కు నువ్వు నాకు ఏమీ గిఫ్టు ఇవ్వలేదు కదా " అన్నాడు.
అలా చెప్పేసిన బాసు కళ్ళు మూసుకొని మంచి నీళ్లు గట గటా తాగేసి, ఎదురుగా చూస్తే, అక్కడ మోహన సుందరం లేడు.
అప్పటికే " ధబ్ " మన్న శబ్దంతో కిందపడి వున్నాడు,
కాయ్.. కాయ్ .. ఆవకాయ్ ..ధరల కాయ్ ..అంటూ సీలింగు వైపు వెర్రి చూపులు చూస్తూ గిలా.. గిలా కొట్టుకుంటున్నాడు ,పాపం సూర్యకళ గుర్తొచ్చి.

సమాప్తం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#97
 
చాదస్తం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
[Image: c.jpg]
ఉదయం తొమ్మిది గంటలకే ఇంటర్ వ్యుకి వెళ్ళడానికి సిధ్ధమైనాడు బాబురావు. కాఫీ కప్పు అందిస్తున్న సుబ్బరావమ్మ "అదేమిట్రా శుభమా అంటు వెళుతూ ఇప్పుడే బయలుదేరావు ఇప్పుడు రాహుకాలం యమగండమూన్ను ఉంది పది గంటలకు బయలుదేరు అమృత ఘడియలు అమోఘం వెళ్ళిన పని విజయవంతం ఔతుంది "అన్నది బామ్మ .అక్కడే ఉన్న కుర్చిలో చతికిలబడుతూ "నీ చాదస్తంతో చంపుతున్నావే అక్కడ సరిగ్గా పదిగంటలకు ఉండాలి "అన్నాడు బాబురావు. "ఏంకొంపలు మునిగిపోవులే ఆపని దొరకకపోయినా మరో రెండు తరలకు సరీపడా మీతాతగారు సంపాదించి ఇచ్చివెళ్ళారు "అన్నది బామ్మ .మారుమాట్లాడకుండా తలపట్టుకు కూర్చున్నాడు బాబురావు.
తాతగారి గోడగడియారం పదిమార్లు మోగడంతో బండి తాళాం తీసుకుని "వెళ్ళేస్తానే బామ్మా తలుపు వేసుకో "అన్నాడు. "క్షేమంగావెళ్ళి లాభంగా రాతండ్రి " అంటూ తలుపులు వేసి గడిపెట్టుకుంది సుబ్బరావమ్మ.
తన బండిని వేగంగా నడుపుతూ ఎదరుగా వస్తున్న లారిని చూసి తన వాహనాన్ని ఆపేలోపే లారిని గుద్దుకున్నాడు ,బాబురావుని వైద్యశాలకి, బండిని సెక్యూరిటీ అధికారిటేషన్ కు తరలించారు .
వారం తరువాత ఇల్లు చేరిన బాబురావుకు కోర్టు జరిమాన ,బండి రిపేరు మొత్తం ముఫైవేలు అయింది. " దీనంతటికి నీచాదస్తమే కారణం " అన్నాడు బామ్మను బాబురావు. "బాగుంది నువ్వు ఒన్ వేలో వెళ్ళి ప్రమాదం కొనితెచ్చుకుని నన్ను అంటున్నావా ?" అన్నది బామ్మ. " అలా వెళితే సమయం కలసివస్తుందని వెళ్ళాను అదినాతప్పే ,అయినా ఈదుర్మహుర్తం, యమగండాల సమయంలో ప్రపంచం అంతటా లక్షలాది వాహనాలు బయలుదేరి వెళుతున్నాయి కదా , అదేసమయంలో ఏదైనా అపద సంభవిస్తే వెంటనే వైద్యశాలకు పరుగులు తీస్తాం కాని అమృత ఘడియలకోసం ఎదురుచూడం కదా? "అన్నాడు బాబురావు. అతని మాటల్లో నిజం గ్రహించి మౌనందాల్చింది బామ్మ
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#98
దిల్ పసంద్ - కొడవంటి ఉషా కుమారి
[Image: d.jpg]
అరే ఈ షాపు నేనెప్పుడూ చూడలేదే షాప్ పేరు ‘దిల్ పసంద్ ‘భలే ఉందే !ఎప్పుడో చిన్నప్పుడు నాన్నతో బయటకు వెళ్ళేటప్పుడు తిన్నానేమో! సరే వెళ్లి చూద్దాం!అనుకుంటూ హుషారుగా ముందుకు నడిచాడు మాధవ్.
“రండి సార్ !మీరు వెయిట్ చేయండి! నేను లోపలికి పంపిస్తాను” అంది రిసెప్షన్ లో కూర్చున్న అమ్మాయి. “దిల్ పసంద్ తినడానికి వెయిట్ చేయడం ఎందుకు అయోమయంగా అనుకున్నాడు మాధవ్. “మీరు వెళ్ళండి సార్!” అన్నారు ఎవరో వచ్చి.లోపల చాలామంది ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కో టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు
సుమారుగా పది టేబుళ్ళ వరకూఉన్నాయి. “ఇక్కడ దిల్ పసంద్ ఎక్కడ ఉంది” పక్కన ఉన్నతన్ని అడిగాడు మాధవ్. “మీకు దిల్ ఉన్నది కదా సార్! “దిల్ అంటే మనసు! ఉంది !ఉంది!” “అది పసందుగా ఉంటది సార్ ఇక్కడికి వస్తే గంభీరంగా అన్నాడు పక్కన ఉన్న వ్యక్తి. “ ఎలా!” ఆశ్చర్యంగా అన్నాడు మాధవ్. “ఇలా!”అంటూ ఒక లాగులాగాడు ఒక టేబుల్ దగ్గర ఉన్న మనిషి. “చెప్పండి సార్ !మీకు టీవీ సీరియల్ స్టోరీ కావాలా! సినిమా స్టోరీ కావాలా !ఇక్కడ ఏదైనా దొరుకుతది సార్!ఒక సంవత్సరం పాటు కొనసాగే సీరియల్స్ ఉంటాయి సార్! ఇంకా…..” “అరే!సార్!ఆడోహౌలా గాడు!నా దగ్గర చాలా కథలు ఉన్నాయి సార్!సీరియల్ మొదలయితే మూడు సంవత్సరాలు గ్యారెంటీ సార్!” “నీకు నేను ఉన్నాను సార్ మన హీరోయిన్ మస్తు త్యాగాలు చేస్తాది సార్. రండి సార్ మరొకళ్ళు పిలిచారు.
“సార్ నా దగ్గర ఉన్నది చెబితే మీకే ఆశ్చర్యం వేస్తది సార్! థౌజండ్ వాలా సార్!వెయ్యి రోజులు ఖుషి ఇస్తాది సార్!నా సీరియల్ !ఇంకా ఇందులో హీరో గరీబోడు సార్!చాలామంది ఉంటారు సార్! హీరో ఇంట్లో!మస్తు త్యాగాలు ఉంటాయి సార్! హీరో ని చూస్తే చాలా బాధగా ఉంటది సార్! ఏడుపు కూడా వస్తాది సార్!” కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు మరొకడు.
“అరే భాయ్ ఇట్లా రా!మా హీరోయిన్ మస్తు ఫైట్లు చేస్తది సార్! ఒక్క చేత్తో వందమందిని కొడతాది సార్!ప్రతి ఎపిసోడ్లోనూ కాలు స్లిప్పయి కింద పడిపోతుంది సార్! ఆమె పడకుండా హీరో పట్టుకుంటాడు సార్! మస్తు ఉంటది సార్!”అంటూ చెయ్యి పట్టుకుని లాగాడు. “అరే!సార్ నివదలరా!ఆయన నా కథ వింటే ఫిదా అయితడు !ఇంకా ఖుషిగా కూడా అవుతాడు!” అంటూ తనవైపులాగాడు లాగి కుర్చీలో కూర్చో పెట్టాడు.
“చూడండి సార్!హీరో బాగా డబ్బు ఉన్నోడు.వాడు ఏమి చేయడు సార్!” “ ఏం చెయ్యడా !మరి స్టోరీ ఎలా?” అన్నాడు మాధవ్. “అక్కడే ఉంటాది సార్ ట్విస్ట్! వాడికి అనుకోకుండా హీరోయిన్ తో పెళ్లి అయితది సార్!ఇకచూడండి సార్! వాడు పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయితాడు సార్!హీరోయిన్ అంతగొప్పగా తయారుచేస్తుంది సార్!తను మాత్రం ఇంట్లో ఉండిపోతాదిసార్!బయట ఫైటు చేస్తాది సార్ ఇంటికి వచ్చి ఏడుస్తాది సార్! ఇంట్లో అందరూ ఆమెని తిడతారు సార్!” “ ఎందుకు?” “అరే!అడ్డు రాకండి సార్! వాళ్ళందరికీ ఆమె నితిట్టడం అలవాటు సార్! ఆమె మాత్రం త్యాగాల మీద త్యాగాలు చేస్తాది సార్! ఆమె బాధనంత మనతో పంచుకుంటాది సార్! ఆమె ఏడుపు చూసి మనమూ ఏడుస్తాం సార్! ఇది ఇట్లా 500 ఎపిసోడ్లు సాగుతుంది సార్!”చెప్తూనే కళ్ళు తుడుచుకున్నాడు.
“ అరే! ఇట్లా రండి సార్! ఇక్కడ భూతాలు, దెయ్యాలు, పాములు ,దేవుళ్ళు ,దేవతలు ఉంటాయి సార్! హీరోయిన్ కి గొప్ప శక్తులు ఉంటాయి సార్! కానీ మనిషే! చాలా మామూలు స్టోరీ సార్! కానీ దేవుడు,దేవతలు కూడా వచ్చేస్తారు సార్!ఇంకా చాలా రకాలు మిక్స్ చేస్తాను సార్! “సార్! నా కథసార్!” “సార్!ఇలా రండి సార్!” “రండి!బాబు! రండి!” “టెన్ థౌ జెండ్ వాలా! సార్!” “సార్ ఐదుగురు చెల్లెళ్ళు,ఇద్దరు అత్తలు సార్!హీరో ఒక్కడే సార్!” “ హీరో అనుకోకుండా అందరికీ మంచి చేస్తాడు సార్!ఆ విషయం ఆయనకు తెలియదు సార్!” అందరూ రకరకాలుగా చెప్తున్నారు. బుర్రంతా పిచ్చిగా ఉంది
వీపు మీద గట్టిగా చరిచినట్లు అనిపిస్తే ఉలిక్కిపడి నిద్రలేచాడు మాధవ్. “ఒరేయ్ మధు!హాయిగా కలలు కంటున్నావా!నాకు ఒక టీవీ సీరియల్ కథ రాయమన్నానుగా! రాయడం మానేసి హాయిగా కలలు కంటున్నావా! గట్టిగా గదమాయించాడు హరి. “ఇదంతా కలా!”గట్టిగా అన్నాడు మాధవ్. “ఆ!కలే! కథ రాయడం మానేసి కలలు కంటున్నావా!” “ఇప్పుడే రాసి పెడతా! వెయ్యి ఎపిసోడ్లకా,రెండువేల ఎపిసోడ్లక చెప్పు ఎలా కావాలో అలా రాసి పెడతా!” ఉషారుగా అన్నాడు మాధవ్. “ ఇంతకాలం కథ రాయాలంటే చాలా టైం పడుతుందన్నావుగా!
మరి ఇప్పుడేంటి ఇలా!” ఆశ్చర్యంగా అన్నాడు హరి. “అదంతా దిల్ పసంద్ మహిమ! పద!నీకు మంచి స్టోరీ రాసిస్తా! నవ్వుతూ అన్నాడు మాధవ్. “దిల్ పసందా! నాకేం అర్థం కావడం లేదు!అయోమయంగా అన్నాడు హరి. “అదంతా తరువాత చెప్తాలే!”అంటూ మాధవ్ ముందుకు నడిచాడు. అక్కడ మరో అద్భుతమైన సీరియల్ మరో లోకంలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.మరో సీరియల్ ప్రపంచం పిలుస్తోంది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#99
ఇంకెంత సేపు - గరిమెళ్ళ సురేష్
[Image: i.jpg]
అది,1990-99 మధ్య కాలం అనుకుంటా! పంజగుట్ట, సాయంత్రం ఆరు- ఆరున్నర నడుమ కావచ్చు! శివరావు గారు ఓచేత్తో వెలిగించిన సిగెరెట్టు, మరో చేత్తో స్టీరింగ్ పట్టుకోని, హుషారుగా సుశీల- ఘంటసాలల ‘రేపంటి రూపం కంటి’ పాట రేడియోలో వింటూ, కారు నడుపుతున్నారు. జూబ్లీ హిల్సలో పని చూసుకొని, సికందరాబాద్ వైపుకి వెడెతున్నారు. ఆయన ప్రక్కన, పాతికేళ్ళ కుర్రవాడు, వారి అబ్బయి, గంగాధర్ కూర్చునాడు. ‘ఏంనాన్న ఇది! ఇలా సిగెరెట్టు కాలుస్తూ బండి నడపడం! మీ ధ్యస కూడా ఎక్కడో ఉంటోంది’, అన్నాడు గంగాధరం, విసుక్కుంటూ. ‘ఏమోయ్! నా డ్రైవింగ్ పైనే వ్యాఖ్యానమా! నువ్వు పుట్టక ముందు నుంచి కారు నడుపుతున్నాను. ఒక్క యాక్సిడెంటు జేసి గానీ, ఫైన్ కట్టి గాని యెరగను’, రావు గారి జబర్దస్తీ జవాబు కాని జవాబు! ‘అప్పట్లో, ఇంత ట్రాఫిక్ కాని, ఇన్ని సిగ్నల్సు గానీ లేవు నాన్నా. మీదే రాజ్యం, మీరే రాజు’, అంటూ కొడుకు మళ్ళీ విసుక్కున్నాడు! ‘అవునోయ్! ఈ స్టైలు చూసే గా మీ అమ్మ నన్ను చేసుకుంది’, తండ్రి గొప్పలు చాటుకుంటుంన్నాడు! ఆమాట వాస్తవమే! అప్టట్లో, సిగిరెట్టు కాలుస్తూ కారు నడపడం, ఓ స్టైల్! సినిమాలలో ANR ని అలాగున చూపించేవారు కూడాను. ఆ మునుపటి నవలా నాయకుల్ని కూడా, ప్రత్యేకించి, రచయిత్రులు, ఆలాగునే చిత్రించేవారు.
ఏసి వాహనాలు మన దేశంలో అప్పుడప్పుడే ప్రచూర్యంలోకి వస్తున్నాయి. రావుగారి కారులో ఏసి లేనందున, కిటికీ అద్దాలు క్రిందికి ఉంచి, నడపడమే వారి అలవాటు. బేగంపేట్ వైపుకి వెళ్ళే బళ్ళు రెడ్ సిగ్నలకని ఆగాయి! కాని, శివరావు తన గొప్పతనాన్ని తానే మెచ్చుకుంటూ, బ్రేకు కాస్త ఆలస్యంగ వేయడంతో, ముందున్న కొత్త మారుతి కారును రావు గారి కారు నెమ్మదిగా తాకింది. పెద్దగా ఏ కారుకీ, ఎవ్వరికీ ఎటువంటి గాయం కాలేదు. కాని, మారుతి కారు నడపుతున్న అరవై ఐదేళ్ల సరస్వతి గారు, ప్రక్కన కూర్చున్న, ఆవిడ భర్త శ్రీనివాస మూర్తి గారు ఒకింత ఉలిక్కి పడ్డారు! సరస్వతి గారు కారు దిగి, కారు వెనక వైపు ఏమన్నా బలమైన దెబ్బ తగిలిందేమోనని చూచి, శివరావు గారి తో ‘ కొంచెం చూసుకోని రావాలండి’, అని కసురుకున్నారు. శివరావు గారు ఉరుకుంటే, సరి పోను. ‘మీ కారే వెనక్కి వచ్చిందండి, నన్నంటారే’, అంటూ వాదనకు దిగారు. సరస్వతి మామూలుగా సౌమ్యురాలే కాని, వాళ్ళ ఆయన కంటి పరీక్ష చేయించుకున్నదున ఆయన కారు నడపలేడు. మనవరాలు, వైష్ణవి ఆసుపత్రికి, వస్తానన్నది. ఆఫీస్లో హటాత్తుగ ఏదో పని బడి రానందున, అయిష్టంగానే కారు, సరస్వతి గారే నడుపుతున్నారు. శ్రీనివాస మూర్తి గారు ఆర్మి లో ఆఫీసర్ గా చేసి, పదిహేనేళ్ళ క్రితం సైనిక్ పురి లో ఇల్లు కట్టుకొని భార్య, కొడుకు, కోడలు, మనుమరాలితో ఉంటున్నారు. కొడుకు, కోడలు ఎవరిదో పెళ్ళికని మద్రాసు వెళ్ళారు. ఆ కారణాన, సరస్వతి గారు, కారు నడుపుతున్నారు. ఆ విసుగుకు తోడు, కార్లు గుద్దుకోవడం ఆమె అసహానానికి ఆజ్యం పోసినట్టయ్యింది. ఇప్పుడ శివరావుగారు తనది తప్పనందుకు, ఇంకింత కోపం హెచ్చి అక్కడే ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ను రమ్మని పిలిచారు, సరస్వతిగారు. దగ్గరకు వచ్చిన ఇన్స్పెక్టర్ కి జరిగింది అర్థమైంది. ప్రక్కనే ఉన్న సెక్యూరిటీ అధికారి స్టేషణ్ కి అందరినీ తీసుకెళ్ళాడు, వారి వాహనాలతో బాటు. శివరావు గారిని, సరస్వతి గార్లను లోపలి గదిలో కూర్చో బెట్టి, అక్కడున్న కానిస్టేబల్ తో ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళారు ఇన్స్పెక్టర్. ఇన్నేళ్ళకి సెక్యూరిటీ అధికారిటేషన్ మెట్లెక్కినందుకు లోలోపల మధన పడుతున్నారు శివరావు. గోచారంలోని కారాగృహ యోగం, ఈ విధంగ రూపందుకున్నదని ఆయన మనసులోనే అనుకున్నాడు. తన పంతం నెగ్గి ఎదుటి వ్యక్తిని స్టషన్ గుమ్మం దాటించినందుకు ఒకింత గర్వం ఉన్ననూ, పొరపాటున సెక్యూరిటీ అధికారిను పిలిచి, తానుకూడా స్టేషణ్లో కూర్చున్నందుకు బాధగాను ఉన్నది సరస్వతిగారికి. ఆర్మీ ఆఫీసర్ భార్యగా, ఎన్నసార్లు సెక్యూరిటీ అధికారి స్టేషన్లకు వెళ్ళినా, ఈలాగు ట్రాఫక్ సమస్య వలన రావడం అదే మొదటి సారి. శ్రీనివాస మూర్తి గారు, గంగాధరం బయట ఓ బల్ల మీద కూర్చున్నారు. ఎదురుగా నించున్న హోమ్గార్డ్ని జూచి, ‘ఇంకెంత సేపు అవుతుంది’ అని అడిగారు శ్రీనివాసమూర్తి. ‘ఏమో, సార్, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ లో ఉన్నారు కదండి. చెప్పలేము. ఒక్కో సారి తొమ్మిది కూడా అవ్వొచ్చు’, అన్నాడతను.
గంగాధరం, మూర్తి గార్లు, ఒకర్నొకరు చేసుకున్నారు. ఇద్దరి లోనూ,ఒకటే యోచన. అనవసరంగా, పిలిచి, దుఃఖం కొనుక్కుంటిమన్న భావన. ఎంత సేపైనా ఇన్స్పెక్టర్ రాలేదు. ఆ మాటనకుండా ఉంటే బాగుండేదేమోనని శివరావు గారు, సెక్యూరిటీ అధికారిని పిలవకుంటే బాగుండేదని సరస్వతి గారు అనుకుంటున్నారు. అయినా ఇద్దరి మధ్యా మాటలు సూన్యం. బయట బల్ల వద్ద పరిస్థితి అదో మాదిరి. మనసులో తండ్రిని, గంగాధరం, భార్యను మూర్తిగారు బాగా ఉతికేస్తున్నారు. పైకి మాత్రం వెర్రి నవ్వుల అలంకారం! ఇక, హోమ్గార్డు, జరగ బోయేది ఎరిగున్నట్టు వీళ్ళను పట్టించుకోవడంలేదు. బయట హోమ్గార్డు కి మల్లే, లోపలున్న కానిస్టేబుల్ కూడా అన్నీఎరిగున్నట్టే ఉన్నాడు. ‘మా పరిస్థితి ఏవిటి’ కానిస్టేబెల్ని అడిగారు రావు గారు. జవాబు తనకీ అవసరమన్నట్టు సరస్వతి గారు, కానిస్టేబుల్ వైపె చూస్తున్నారు. ‘సిఐ గారు వచ్చాక కంప్లైంటు రాయించి కోర్టుకి తీసుకెళతాంమండి’, అన్నారు కానిస్టేబుల్. ‘ఇంకెంత సేపు అవుతుంది ఆయనకి’ , సరస్వతి గారి, అనుబంధ ప్రశ్న. జోడు కట్టి వినడం, రావు గారి వంతు. ‘ ఏదో వి ఐ పి కదలిక ఉందండి. కా స్సేపే, అవ్వొచ్చు. అయినా ఏవిటండి కేసు’ తెలియనట్టు అడిగాడు కానిస్టేబుల్. ‘పొరపాటున, నా కారు ఆవిడ కారుకి తాకింది’, అన్నారు రావు గారు, బాగా నెమ్మదిగ. ‘ఓ!, ఏవైనా, డామేజ్ అయ్యిందా, అమ్మ’, అడిగాడు, కానిస్టేబుల్. ‘పెద్దగా, ఏమీ లేదయ్యా’, అన్నారు సరస్వతి గారు. ‘బాగా,చదువకున్న వారిలా వున్నారు! కొట్లాడిర్రా!’ అసహ్యించుకుంటునట్టు ప్రశ్నించాడు. ‘అబ్బే, అట్లాండిది ఏమీ లేదయ్యా’, ముక్త కంఠంగా ఇద్దరూ అన్నారు. ‘ఛాయ్ తీసుకుంటారా సర్’, అంటూ ఓ కుర్రాడు గాజు గ్లాసులు, థర్మాసు పట్టుకొచ్చాడు. ‘ముగ్గురికీ, యిచ్చేసేయ్! గంట సేపైంది,ఇక్కడ కూర్చోని’, అన్నారు రావు గారు ఆ కుర్రాడికి డబ్బులిస్తూ. ‘బయట బల్ల మీద, ఓ అబ్బాయి, ఓ పెద్దాయన ఉన్నారు. వాళ్లని కూడా అడుగు’, అన్నారు సరస్వతి గారు. వాతావరణం, కాస్త ప్రశాంతంగా మారడం గమనించిన కానిస్టేబుల్, ‘డ్యామేజీ లేదు, కొట్లాడుకుందీ కాదు. ఇంకేవిటి కేసు! కాంప్రమైస్ చేసుకోని, చక్కగా వెళ్ళండి’, అన్నాడు. బయట బల్ల మీద టీ తాగుతున్న ఇద్దరి అసహనాన్నీ గమనించన హోమ్గార్డు, ‘ఇంకో ఐదు నిమిషాల్లో బయటికి వచ్చేస్తార్లెండీ! ఎంత మందిని చూడ్లేదు సార్’ అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా! ఇంకా ఐదు నిమిషాలు కూడా అవలేదు. శివరావు గారు, సరస్వతి గారు నవ్వుకుంటూ బయటికి వచ్చారు. అదే సమయానికి, ఇన్స్పెక్టర్ లోపలికి వస్తూండడం గమనించి, సంగతి ఏమీ లేనట్టు, ఇన్స్పెక్టర్ కి ఇద్దరూ ఒకే సారి Thank You చెప్పేసారు. కంటి చూపుతోనే సంగతి తెలుసుకున్నా ఇనస్పెక్టర్కి చిరు నవ్వు దాగలేదు!
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: