Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నల్లమల నిధి రహస్యం - 34
(04-09-2025, 02:01 PM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్ - 28



ఉద్వేగంతో ఉగిపోతున్న అజయ్ వెనకనే నీడగా నిలబడి వికృతంగా నవ్వుతోంది సింగా ని ఆవహించిన దుష్టాత్మ.
 
***సశేషం***
Very Good Suspense thriller!!!

yr): yr): yr): clp); clp);
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Good morning K3VV3 ji నాకు భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర పుస్తకం అందుబాటులో ఉంటే కావాలి సార్ సురేష్ సోనీ ది తెలుగు లో ఉన్నది 
[+] 1 user Likes Satya9's post
Like Reply
సూపర్ స్టొరీ మాస్టర్... సస్పెన్స్ తో నడుపుతున్నారు..
[+] 1 user Likes Vasuk's post
Like Reply
(07-09-2025, 01:28 PM)Satya9 Wrote: Good morning K3VV3 ji నాకు భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర పుస్తకం అందుబాటులో ఉంటే కావాలి సార్ సురేష్ సోనీ ది తెలుగు లో ఉన్నది 

ఈ పుస్తకం నాకు అందుబాటులో లేదు సత్య గారు

సరిత్ గారిని అడగండి, ఉండవచ్చు!
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
నల్లమల నిధి రహస్యం పార్ట్ - 29



 
ఉద్రేకంతో ఊగిపోతున్న అజయ్ వెనకనే నీడగా నిలబడి వికృతంగా నవ్వుతోంది సింగాని ఆవహించిన దుష్టాత్మ.
 
అజయ్ తన వెనక ఉన్నది సింగానే అనుకుని ఒక్కసారిగా పిడికిలి బిగించి, వెనక్కి తిరిగి సింగా మొహంపై ఒక్క గుద్దు గుద్దాడు. మాములు మనిషి అయ్యుంటే ఆ ఫోర్స్ కి చచ్చిపోయేవాడు. కానీ ఇప్పుడు సింగా లాంటి నీచుడి వంట్లో ఇంకా నీచమైన నరేంద్రుని ఆత్మ ఆవహించి ఉండడం వల్లవాడికి ఏమీ కాలేదు.
 
వాడు ఇంకా వికృతంగా నవ్వుతూ గాలిలోకి ఎగిరిపోయి గిరగిరా తిరుగుతూ వికృతంగా నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఎలా ఉంది అంటే ఓ మాదిరి గుండె ధైర్యం కలవారికి అక్కడే గుండె ఆగిపోతుంది. అంత వికృతంగా, అత్యంత పాశవికంగా ఉంది ఆ నవ్వు.
 
"ఫగ్గబ్జ్ గ్బజ్జా, హుఖబిక్ జక్కమన్గగ్ హిజంగ్గు (పిరికి వెధవ! ధైర్యం ఉంటే నేరుగా నాతో తలపడరా!)” అన్నాడు అజయ్. తను ఇప్పుడు మార్తాండగా తనని తాను పూర్తిగా నమ్ముతూ! సింగా ఒక్కసారిగా నేల మీదకి దూకి, నేరుగా అజయ్ మీదకు దూసుకు వచ్చి, అజయ్ పీక పట్టుకోబోయి, గాలిలో ఎగిరి పడ్డాడు.
 
అంతలోనే తేరుకొని, "అయ్యారే! సిద్ధాంతి తెలివైన వాడురా! ముందే బంధనాలన్నీ బిగించేసాడు. ఐనా ఇంకెంతలే! రేపటి సూర్యగ్రహణం ఒక ఘడియ పాటు అన్ని శక్తుల్ని నిర్వీర్యం చేసేస్తుంది. అప్పుడు నా పగ తీర్చుకుంటా. నిన్ను మృత్యుదేవతకి కానుకిచ్చి , మళ్లీ నా వీర విహారం ఆరంభించెద!" అంటూ వికటాట్టహాసం చేస్తూ గాలిలో ఎగిరి మాయమైపోయింది.
 
ఇదే జరుగుతుంది అని ముందే ఊహించిన మరియా అక్కడే మౌనంగా అదంతా చూస్తూ ఉండిపోయింది.
 
మార్తండగా తనని తాను ఊహించుకుంటున్న అజయ్ కి, తనకు నీడలా కావలికాస్తూ ఉన్న మరియా కనిపించింది.
 
"మరియా! ఓ నా ప్రాణమా!" అంటూ మరియా వైపుగా అడుగులు వేస్తున్నాడు అజయ్.
 
"ఆగు మామా! నీవు నన్ను తాకలేవు. నేను ఇప్పుడు ఆత్మను. నీకిచ్చిన మాట కోసం జన్మలుగా ఎదురుచూశాను. ఏ ఒక్కరినీ ఆ నిధిని తాకనివ్వలేదు. నీ మిత్రునికి నువ్వు మాటిచ్చావు. నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు. ఆనాటి నుండి ఈనాటి వరకూ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నీ రాకకై వేచి ఉండి, విధి విధించిన వింత పయనంలో కల్లోల కడలిలోని నావలా, ఎడారి మంటల గ్రీష్మాన్ని గుండెల్లో దాచుకున్న ఆయువు లేని ఆకారాన్నయి నిలుచున్నా! ఏనాటికైనా నువ్వు తిరిగొస్తావని, మన ప్రేమ నిండిన ప్రణయ గీతికనే పాటలుగా పాడుకుంటూ..నీ అనురాగపు మాధుర్యంలోని మధురానుభూతులను కావ్యంగా మలుచుకుంటూ..ఆత్మనై మిగిలున్నా!
పున్నమి చంద్రుని సాక్షిగా, పచ్చని ప్రకృతి సాక్షిగా, సెలయేరుల సాక్షిగా ఈ అడవితల్లి నీడలో ఒక్కటైన మన జంట, పది కాలాలు పచ్చగా ఉండాలి అన్న మన గూడెం పెద్దల దీవెనలు ఫలించలేదు మామా! విధి వక్ర దృష్టి . మన జంటపై పడి, మనము విడిపోయాము. రెండు దేహాలు, ఒకటే ప్రాణం అనుకున్నాము మనము, మరణం కూడా మనల్ని విడదీయలేదు అనుకున్నాము. కానీ జాలి లేని విధి మరణం రూపంలో మనల్ని వేరు చేసింది.
 
ఊపిరి ఆగే క్షణం లో నీ ఆత్మ లోనే నా ఆత్మ కూడా కలిసి, పరమాత్మలో లీనం ఆయిపోవాలి అనిపించింది. కానీ నీకిచ్చిన మాట నాకు ఆ వరాన్ని కూడా దూరం చేసింది. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేని నేను.. నువ్వు లేకుండా నీ కోసమే ఎదురుచూస్తూ వందల సంవత్సరాల నుండి ఎదురు చూస్తూనే ఉన్నాను.
 
నీరాక నాకు విముక్తిని కల్పించనుంది. ఆత్మ రూపం నుండి పరమాత్మలోకి కలిసిపోయే సమయం వచ్చింది" అంటున్న మరియా మాటలకూ అడ్డువస్తూ
 
" నేనూ నీ దగ్గరికి వచ్చేస్తా ప్రియా! నన్ను వదిలి వెళ్ళకు" అంటూ భోరున విలపిస్తున్నాడు అజయ్.
 
" వద్దు మామా! నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. కానీ నా బాధ్యత పూర్తిచేసుకునే వెళ్తాను. ముందు నేను చెప్పబోయేది పూర్తిగా విను" అంటూ అజయ్ ని ఊరడిస్తూ, మరియా మాట్లాడడం ప్రారంభించింది.
 
***
 
సంజయ్ కారు వేగంగా పోనిస్తున్నాడు. అప్పటికే సంజయ్ డ్రైవింగ్ చూసి, అంజలి వాళ్ళ అమ్మ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, దేవుడిని ప్రార్థిస్తూ కూర్చుంది. అంజలి,సంజయ్ కి ధైర్యం చెప్తోంది. సంజయ్ మాత్రం కార్ చాలా స్పీడ్ గా నడుపుతున్నాడు. అతని ధ్యాస అంతా తన అన్న మీదనే. అతనికి ఎప్పుడెప్పుడు తన అన్నని చూస్తానా.. ఎలా అతన్ని కాపాడతానా.. అనే ఆలోచనలు! అది గమనించిన అంజలి, సంజయ్ కి ధైర్యం చెబుతూ ఉంది.
 
అంజలి తల్లి మాత్రం "పోయి పోయి, ఇతన్ని డ్రైవ్ చేసి పెట్టమని అడిగాను. ఈ స్పీడేంటో? శ్రీశైలం తీసుకెడతాడో? డైరెక్ట్ గా శివుడి దగ్గరే నిలబెట్టేస్తాడో? ఓరి నాయనో! పూర్వ జన్మలో గుర్రాలెక్కి, యుద్ధాలు చేసేవాడేమో! ఓరి దేముడా.. నువ్వే దిక్కు మల్లన్నా! మమ్మల్ని కాపాడు స్వామి.." అంటూ మనసులోనే మొక్కుకుంటోంది. మరి ఆవిడకి పూర్తిగా తెలియదు కదా సంజయ్ దేని గురించి భయపడుతున్నాడు అనేది! ఆవిడ భయంలో ఆవిడ ఉంది పాపం. అంజలికి మాత్రం రేపు అజయ్ ని కాపాడే ప్రయత్నంలో తన సంజయ్ కి ఏమవుతుందో అన్న భయం వెంటాడుతూ ఉన్నా పైకి మాత్రం గంభీరంగా ఉండి, సంజయ్ ని కాచుకుంటోంది.
 
***
 
సీత మనసు మాత్రం కీడుని శంకిస్తూ ఉంది. ఆమె కుడి కన్ను విపరీతంగా అదురుతోంది. 'మా పెళ్లి విషయంలో జోక్యం చేసుకుని, కయ్యానికి కాలు దువ్విన ఆ సింగాతో అజయ్ కి విరోధం రావడం విధి నిర్ణయమా? ఇన్నేళ్ల తరువాత కూడా పాత పగను మనసులో పెట్టుకుని, నా కొడుకు జీవితంలోకి, ఆ సింగా కావాలనే వచ్చాడా? కాదు! అజయ్ నా కొడుకు అని సింగా కి ఎలా తెలుస్తుంది? కాదు. నా కొడుకు అని తెలిసి ఉండదు. ఇదంతా యాదృచ్చికంగానే జరిగి ఉంటుంది' అనుకుంటూ పరి పరి విధాలుగా ఆలోచిస్తూ కలవరపడిపోతోంది సీత. ఆమెకు ఉన్న ఒకే ఒక్క ధైర్యం ఆ మల్లన్న స్వామే! ఆయన్నే స్మరించుకుంటూ తన కొడుకులిద్దరూ క్షేమంగా ఇంటికి చేరాలని తపిస్తోంది ఆ తల్లి హృదయం.
 
***సశేషం***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
Mithramaa, nee rachana chaalaa baagunnadhi. Mariyaa kosam Ajay chanipothaadu ani anipisthunnadhi. waiting for your next update. thank you so much.
[+] 1 user Likes meeabhimaani's post
Like Reply
(10-09-2025, 01:40 PM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్ - 29


 ఆయన్నే స్మరించుకుంటూ తన కొడుకులిద్దరూ క్షేమంగా ఇంటికి చేరాలని తపిస్తోంది ఆ తల్లి హృదయం.
 
***సశేషం***
Very good andi RamyaN/K3vv3 garu!!!

yr): yr): yr): clp); clp); clp);
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
రేపు అప్డేట్ ఇస్తాను
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
రేపు అప్డేట్ ఇస్తాను
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
ఇంటర్నెట్ సమస్య వల్ల ఆలస్యం అయింది

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 30

 
నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. కానీ నా బాధ్యత పూర్తి చేసుకునే వెళ్తాను. ముందు నేను చెప్పబోయేది పూర్తిగా విను!" అంటూ అజయ్ ని ఊరడిస్తూ మరియా మాట్లాడడం ప్రారంభించింది.
 
"మామా! ఆనాటి మన ప్రేమ కన్నా, నిన్ను నమ్మి, నీ సాయం కోరిన మహారాజుకి నువ్వు ఇచ్చిన మాటే విలువైనది. నీకు గుర్తు ఉందో లేదో కానీ, నువ్వు నీచుడైన నరేంద్రుడిని చంపిన క్షణంలో,నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా నా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
 
"మిత్రమా! నీ చావుకి బదులు తీర్చుకున్నాను. కానీ నా ఊపిరి కూడా ఆగిపోతోంది. నిధిని నీ రాజ్యానికి చేర్చినా, ఆ నీచుల పాలు ఐపోతుంది. నువ్వే తిరిగి రావాలి. నువ్వొచ్చే నాడే నేనొస్తా! మళ్ళీ పుట్టొస్తా!" అన్న నీ మాటలు, నువ్వు మహారాజుకి చేసిన వాగ్దానమే నిన్ను మళ్ళీ పుట్టించింది. నువ్వు పుట్టినట్టే, మన మహారాజు ప్రతాపరుద్రుల వారు కూడా మళ్ళీ పుట్టారు.నీతో పాటే పుట్టిన, నీ కవల తమ్ముడు ఎవరనుకుంటున్నావ్? నువ్వు ఎవరికోసమైతే ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి బదులు తీర్చుకున్నావో, ఆ మహారాజే నీ తమ్ముడు సంజయ్!" అంటున్న మరియా వైపు ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో చూస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు అజయ్.
 
"ఏంటి మరియా? నువ్వు చెప్తుంది నేను నమ్మలేకపోతున్నాను. నా తమ్ముడు సంజయ్, పూర్వజన్మలో ఆ మహారాజా? అయ్యో! ఎంత తప్పు చేసాను. ఆయన్ని నేను, నాకన్నా చిన్నవాడేగా, తమ్ముడే కదా అని ఎన్నో సార్లు ఆయనపై ఆధిపత్యం చూపించేవాడ్ని" అంటూ అజయ్ కుమిలి పోతుంటే, మరియా " జరగబోయే ప్రమాదం గురించి తెలిస్తే, ఇంకేమైపోతావ్ మామా!? " అంది. ఆ మాట విన్న అజయ్ సూటిగా మరియా కళ్ళలోకి చూసాడు. ఆమె మొహంలో బాధ, భయమే చెప్తోంది, రాబోయే ఉపద్రవం తీవ్రత.
 
మరియా, అజయ్ నే చూస్తూ "మామా! రేపు సూర్య గ్రహణం. దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చే గ్రహ కూటమి, రేపు రానుంది. ఇది మీ అన్నదమ్ములు ఇద్దరి జాతకంలోనూ కీడును కలిగిస్తుంది. ఇద్దరిలో ఎవరికైనా, ఏమైనా కావొచ్చు. లేదా ఇద్దరికీ హాని కలగవచ్చు! ఈ ఘడియ కోసమే ఆ నరేంద్రుడి దుష్టాత్మ మీరు పుట్టినరోజు నుండీ మీ 25 వ పుట్టినరోజు వరకూ మిమ్మల్ని ఏమీ చేయలేకుండా, రేపటి గ్రహణం రోజు కోసం ఎదురు చూస్తోంది. మీ 25వ పుట్టినరోజు రాత్రి నుండీ, కేవలం నీ మీద మాత్రమే దాడి చేస్తూ, నిన్ను హింసించాలని ప్రయత్నం చేస్తూ వచ్చేది. నీకన్నా రెండు నిముషాలే తేడాతో పుట్టిన నీ తమ్ముడిని మాత్రం ఏమీ చేసేది కాదు. నువ్వు మరల జన్మించి ఉండి ఉంటే, ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి, నా చెంతకు త్వరగా రావాలి అని నేను నిరంతరం ఆ ఇష్టకామేశ్వరి అమ్మవారిని ప్రార్ధించడం వల్ల, నీ జాతక ప్రభావం వలన, వాడు నీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినప్పుడల్లా, నీవే వాడిని ఎదుర్కొనే వాడివి. కానీ అది నీకు గుర్తు ఉండేది కాదు. వాడికి 25 వ ఏట నీ జాతకంలో పొంచి ఉన్న మృత్యు గండం, ఇప్పుడు అనుకూలంగా మారింది. వాడు మీ రక్త సంబంధీకులలో ఒకరిని తన ఒక వాహకంగా మార్చుకుని, రేపటి గ్రహణ ఘడియలలో నిన్ను వధించి, ఆ వాహకంలోనే అమరుడై జీవిస్తూ, నిధిని కైవసం చేసుకుని, ఈ లోకాన్ని ఏలాలి అని పధకం రూపొందించాడు.
 
నేను చనిపోతూ వాడికి పెట్టిన శాపాన్నే, వాడు వరంగా మార్చుకోబోతున్నాడు మామా! అదే జరిగితే, ఈ ప్రపంచాన్నే తన చెప్పుచేతల్లో పెట్టుకోగలడు, ఆ నిధిని సొంతం చేసుకుని. మన మహారాజు ఆ నిధిని దేశం కోసం, దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఉపయోగించాలని కోరాడు. ఆ కోరికతోనే, మళ్ళీ పుట్టాడు. ఆయనికి ఇదంతా గుర్తు లేకపోవచ్చు. కానీ ఆయన నీ తమ్ముడిగా మళ్ళీ పుట్టడానికి కారణం మాత్రం, ఆయన ఆశయమే. దేశం కోసమే మళ్ళీ పుట్టాడు ఆయన!అలాంటి మనిషిని, నీ నాశనం కోసం, తన వాహకంగా ఎంచుకున్నాడు ఆ నరేంద్రుడు. కానీ, మీ తమ్ముని వంటిపై ఉన్న రక్ష ఆ నీచుడ్ని మీ తమ్ముడిని తాకనివ్వక పోవడంతో, వేరొక వాహకాన్ని ఎంచుకున్నాడు. ఆ వేరొక వాహకమే, ఈ సింగా!" అంటూ మరియా చెప్తూ ఉంది.
 
"నువ్వు ఏమి చెప్తున్నావ్ మరియా? సింగా నాకు రక్త సంబంధీకుడు ఎలా అవుతాడు? " అంటూ అడిగాడు అజయ్.
 
"ఆవును మామా! సింగా ఈ జన్మలో నీకు రక్త సంబంధీకుడే." అంటూ మరియా సింగా గురించిన నిజం చెప్పనారంభించింది.
 
***
 
కారుని వాయువేగంలో నడుపుతూ, ఇంటికి చేరే సరికి మధ్యాహ్నం అయిపోయింది సంజయ్ వాళ్ళకి.ఇంటి ముందు కారు ఆగగానే, సీత పరుగున వెళ్ళింది.సంజయ్ ని చూస్తూనే, ఏడుస్తూ వెళ్లి గట్టిగా పట్టేసుకుని, "వచ్చేసావా చిన్నోడా! " అంటూ భోరుమంది సీత.
 
అంజలి ఆమెను ఊరడిస్తూ, " మేము వచ్చేసాముగా ఆంటీ! ఇంక అంతా సంజయ్ చూసుకుంటాడు. మీరు ఏడవకండి." అంటూ ధైర్యం చెబుతూ లోపలికి తీసుకు వెళ్ళింది.
 
సంజయ్ మాత్రం, తనకి ఎక్కువ సమయం లేకపోవడం వల్ల, అక్కడనుండే " అమ్మా! నువ్వు కంగారు పడకు. నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు " అని చెప్పి అంజలితో "అమ్మని నేను వచ్చే వరకూ జాగ్రత్తగా చూసుకో" అని చెప్పి, సిద్ధాంతి గారు చెప్పిన పని పూర్తి చేసేందుకు బయలుదేరాడు. సంజయ్ వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది అంజలి. ఆమె కంట వస్తున్న కన్నీటిని బలవంతంగా అదుపు చేసుకుంటూ..
సశేషం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply
(15-09-2025, 09:20 PM)k3vv3 Wrote: ఇంటర్నెట్ సమస్య వల్ల ఆలస్యం అయింది

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 30

[font=var(--ricos-font-family,unset)] [/font]ఆమె కంట వస్తున్న కన్నీటిని బలవంతంగా అదుపు చేసుకుంటూ..
[font=var(--ricos-font-family,unset)] [/font]
[font=var(--ricos-font-family,unset)]***[/font]సశేషం[font=var(--ricos-font-family,unset)]***[/font]
 

Very good update. Curious to know how the story unfolds!!!

yr): yr): clp); clp); clp); yr):
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
కథలో ఎన్ని కథలో...screenplay బావుంది tempo పెంచుతూ
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
రైటర్ గారికి నమస్తే. అద్భుతమైన కథ, కథనం. నిన్నటి నుంచే ఈ కథ ని చదువుతున్నాను. ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఉత్సుకత పెంచేశారు. మధ్యమధ్యలో ఎంత టెన్షన్ వచ్చింది అంటే బెల్ట్ తో కొట్టుకోవాలి అనేంత. చాలా బాగా రాస్తున్నారు. ఇలాగే కొనసాగించండి.
[+] 1 user Likes iamrsg's post
Like Reply
నల్లమల నిధి రహస్యం పార్ట్ - 31



సిద్ధాంతి గారు చెప్పినట్టుగానే, ఆ ఖడ్గమును సంపాదించడం కోసం, నల్లమల అడవులలో కొలువై ఉన్న మహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి బయలుదేరాడు సంజయ్. అప్పటికే టైం రెండు అయిపోయింది. మూడింటి తరువాత, ఎవరినీ అడవిలోకి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వరు. సంజయ్ కార్ ని స్పీడ్ గా నడిపి, నంది సర్కిల్ కి చేరుకున్నాడు.
 
 
కార్ పక్కకి పార్క్ చేసుకుని, జీప్ మాట్లాడుకోడానికి వెడితే, ఎవ్వరూ ‘మేము రాము. ఇంక గంట తరువాత ఎవరిని లోపలికి అనుమతించరు, మీరు రేపు వెళ్ళండి’ అన్నారు. కానీ ఒక జీప్ అతను మాత్రం, సంజయ్ దగ్గరికి వచ్చి, "మిమ్మల్ని నేను తీసుకుపోతా! రండి, ఫారెస్ట్ ఆఫీసర్స్ ని నేను మేనేజ్ చేస్తాను " అంటూ నమ్మించి, జీప్ ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ వచ్చింది.
 
" మీరు కూర్చోండి. నేను వెళ్లి పర్మిషన్ తీసుకుని వస్తా!" అంటూ వెళ్ళాడు ఆ జీప్ నడిపే వ్యక్తి. సంజయ్ ఉన్న కంగారులో, అక్కడ ఏమి జరుగుతోందో గమనించలేదు.

ఆ జీప్ అతను వెళ్లి, "అయ్యా! అమ్మవారి గుడి కాడికి పోవాల! పర్మిషన్ ఇయ్యుండ్రి " అన్నాడు.
 
" ఇవాళ టైం అయిపోయింది. లోపలికి ఇంక అనుమతించం. రేపు రండి" అన్నారు అక్కడ ఆఫీసర్స్.

అంతే! ఆ జీప్ నడిపే వ్యక్తి, అక్కడ ఉన్న ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్స్ పీకల్ని చెరో చేత్తో గట్టిగా పట్టుకుని, గాలిలో పైకి లేపి, " అయ్యారే. ఈ నరేంద్రుని మాటకే ఎదురు చెప్తారా? వాడు పోవాలి. అడవిలోనే పోవాలి. మీకభ్యన్తరమా? " అంటూ గొంతు వికృతంగా మార్చి, ఆ ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిపేసాడు.
 
మళ్ళీ వచ్చి జీప్ స్టార్ట్ చేసి, "పర్మిషన్ ఇచ్చిన్రు. " అంటూ వేగంగా అడవిలోకి పోనిచ్చాడు జీప్ ని. కొంత దూరం వెళ్ళాక జీప్ అడవిలోకి తిరిగాక, కొంత దూరం తీసుకెళ్లి జీప్ ఆపేసి, "ఇక్కడ నుండి నడుస్తూ పోవాలి. నువ్వు వచ్చే వరకూ నేను ఈడనే ఉంటా" అని చెప్పాడు ఆ జీప్ నడిపిన వ్యక్తి.

"చాలా థాంక్స్ అన్నా! " అంటూ అడవిలో ముందుకు సాగాడు సంజయ్.
 
 
"జన్మలు మారినా, నన్ను నమ్ముతూనే ఉంటావా ప్రతాప!" అంటూ వికృతంగా నవ్వాడు జీప్ వాడిలా సంజయ్ ని అడవిలోకి తీసుకువచ్చిన సింగా. కాదు..కాదు! సింగాలోని నరేంద్రుడు.
 
సంజయ్ అడవి మార్గంలో, దారులు చూపించే బోర్డుల సాయంతో ముందుకు వెడుతున్నాడు. అతని వెనకనే ఎవరో వస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసాడు. అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ నడక ప్రారంభించాడు. "రేపు ఉదయం ఏడింటికి ప్రారంభం అయ్యే సూర్యగ్రహణం లోపు ఖడ్గాన్ని సంపాదించాలి "అనుకుంటూ నడకలో వేగం పెంచాడు సంజయ్. అతన్ని నీడలా అదృశ్యంగా వెంటాడుతున్నాడు నరేంద్రుడు.
 
"వెళ్ళు మహారాజా! నువ్వు ఖడ్గాన్ని వెలికి తీయి. నాకు కావాల్సింది కూడా అదే" అనుకుంటూ సంజయ్ ని అనుసరిస్తూ గాలిలో ఎగురుతున్నాడు సింగాని ఆవహించి ఉన్న నరేంద్రుడు.
 
***
 
" అవును మావా! ఆ సింగా, ఈ జన్మలో నీకు రక్త సంబంధీకుడే. నీకు జన్మనిచ్చిన నీ తల్లి సీతకి స్వయానా బాబయ్య కొడుకు. నీకు మేనమామ అవుతాడు. అందుకే, ఆ నరేంద్రుని దుష్టాత్మ అతన్ని వాహకంగా మార్చుకుంది. ఆనాడు చనిపోయే క్షణం ముందు, నా నోటి నుంచి అలాంటి శాపం రావడానికి కారణం లేకపోలేదు. ఆ అమ్మవారే నా నోటి నుండి అలా పలికించింది.
 
వాడికి అంతం ఉంది. అది కూడా మళ్ళీ పుట్టిన నీ చేతిలోనే అని నా నోటి నుండీ అమ్మవారు పలికించుటకు కారణం, ఆ నీచుడి ఆత్మ, ప్రళయంగా మార కూడదు అనే!" అంటున్న మరియా వైపు ఆశ్చర్యంగా చూసాడు అజయ్.
 
" అర్ధం కాలేదా మావా! ఈ సృష్టిలో ఏదీ ఊరికే జరగదు మావా! అన్నిటికి కార్యాకారణ సంబంధం ఉంటుంది. ఆ నరేంద్రుని అంతం, మళ్ళీ పుట్టిన నీ చేతిలోనే, అని నేను శపించడం కూడా విధి లిఖితం. అందులో ఉన్న అంతరార్థం మానవమాత్రులకు అర్ధం కాదు. నిధి కోసం ఎందరో అమాయకులను బలి చేసిన ఆ క్రూరుడు, చివరికి ఆ నిధిని సొంతం చేసుకోకుండానే చనిపోయాడు. చనిపోయే క్షణంలో వాడు తీరని పగతో, నిధి మీద తీరని వ్యామోహంతో ఉన్నాడు. పగతో చనిపోయిన వాడు ప్రేతాత్మ గా మారతాడు. అలాంటి వాడి ఆత్మకు అంతం ఉండదు. అది సృష్టించే వినాశనానికి హద్దే ఉండదు. అందుకే, వాడి ఊపిరి పూర్తిగా ఆగక ముందే, వాడికి అంతం, నీ పుట్టుకతో ముడిపెట్టి, నా నోటితో చెప్పించింది ఆ జగన్మాత!" అంటూ చెప్తున్న మరియా మాటలు అజయ్ ని ఆలోచింపజేస్తున్నాయి.
 
 
"రేపటి సూర్యగ్రహణం మొదలు అయ్యేలోగా, మనము ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి చేరుకోవాలి. అక్కడ అమ్మవారి గుడి లోపల నుంచి సొరంగ మార్గం గుండా లోపలికి వెళితే, అక్కడ ఒక శిల్పం ఉంటుంది. ఆ శిల్పం చేతిలో ఉన్న దివ్య ఖడ్గం మనకు చాలా అవసరం. దానితో మాత్రమే ఆ సింగాని ఆవహించి ఉన్న ఆ దుష్ఠుడ్ని నాశనం చేయగలం. మనము బయలుదేరాలి మావా!" అంటున్న మరియా వైపు చూస్తూ.
 
"వెళ్దాం మరియా! నేనూ వాడిని అంతం చేసి తీరుతాను. నిధిని మహారాజుకి అందించి, నా వాగ్దానాన్ని నిలబెట్టుకుని, నీతో వచ్చేస్తాను." అంటున్న అజయ్ ని వారించింది మరియా.
 
"అలా అనద్దు మావా! నేనూ ఆత్మని, నీవు మనిషివి. మన మధ్య ప్రేమ సృష్టికి విరుద్ధం!" అంటూ అజయ్ కి దూరంగా జరిగింది మరియా.
 
"సృష్టి ప్రేమతోనే మొదలైంది మరియా! మన ప్రేమ విధి ముందు ఓడిపోయింది అనుకుంటున్నావేమో, అది ఎప్పుడూ గెలుస్తూనే ఉంది. దానికి నిదర్శనం, నీ. దర్శనం.
మరణం విడదీసిన ప్రేమ. మరణమే కలిపే ప్రేమ. మన ప్రేమ అమర ప్రేమ. " అంటూ మరియాకి దగ్గరగా జరిగి, ఆమెను దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నం చేసి, గాలి లాంటి ఆమెను తనలో కలుపుకోలేక, చిన్నబోయాడు.
 
"ఇదే జరుగుతుంది మావా! ఇక మన పయనం ఇదే అవుతుంది. అందుకే చెబుతున్నా. నే వెళ్ళక తప్పదు. నువ్వు నిలవక తప్పదు. " అంటున్న మరియా కళ్ళలోకి సూటిగా చూస్తూ
 
"ఈ హృదయంలో నీ ప్రేమే నిలిచి ఉంటుంది.
ఈ కన్నుల్లో నీ రూపం కదలాడుతూనే ఉంటుంది.
నన్ను నీలో, నిన్ను నాలో కలిపేది మరణమే అయితే,
నా పునర్జన్మకి కారణమైన నా వాగ్దానాన్ని నెరవేర్చిన మరు క్షణం, నా ఊపిరి నీ ఆత్మకు నేను ఇస్తున్న కానుక అవుతుంది. ఇది ఆ కొండదేవరపై ఆన!
నేను ప్రేమించే నీ ఆన! నా ప్రపంచమైన ఈ నల్లమలపై ఆన!" అంటూ ప్రేమోన్మాదంతో, ఒక భగ్న ప్రేమికుడిగా ఆన చేసిన అజయ్ కి ఆ నిమిషం, తన ప్రేయసితో కలిసి జీవించిన గత జన్మ లోని మధుర క్షణాల వలన కలిగిన భావోద్రేగం, ఈ జన్మలో తానొక తల్లికి బిడ్డని అనే విజ్ఞతను చెరిపేసింది. ఇప్పుడు తన లక్ష్యం వైపుగా అడుగులు వేయనారంభించాడు అజయ్, మరియా తో కలిసి.
 
***
 
ఆ ఇద్దరు అన్నదమ్ముల క్షేమం కోరి, ఆయుష్ హోమం చేస్తున్న సిద్ధాంతి గారి దివ్య దృష్టికి అజయ్, తన పునర్జన్మకు కారణమైన వాగ్దానాన్ని నిలబెట్టుకుని, అది నెరవేరిన మరు క్షణం, మరియా కోసం చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు అని అర్ధం అయింది.
 
"అమ్మా, జగన్మాతా! ఏమి నీ లీల? ఆ తల్లికి గర్భశోకం తప్పదా?" అనుకుంటూ ఉండిపోయారు.సిద్ధాంతి గారు.
 సశేషం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
కథతో మమ్మల్ని Roller Coaster రైడింగ్ చేయిస్తున్నారు.
[+] 1 user Likes anaamika's post
Like Reply
(21-09-2025, 12:58 PM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్ - 31


"అమ్మా, జగన్మాతా! ఏమి నీ లీల? ఆ తల్లికి గర్భశోకం తప్పదా?" అనుకుంటూ ఉండిపోయారు.సిద్ధాంతి గారు.
 సశేషం

ఈ కధని చాలా బాగా వ్రాస్తున్నారు, రమ్య N / K3vv3 గారు!!! తరువాత ఏమవుతుందో!!!

yr): yr): yr): clp); clp); clp);
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
[quote pid='6039756' dateline='1758439705']
"అమ్మా, జగన్మాతా! ఏమి నీ లీల? ఆ తల్లికి గర్భశోకం తప్పదా?" అనుకుంటూ ఉండిపోయారు.సిద్ధాంతి గారు.
 సశేషం
[/quote]

భలే సంధిగ్దంలో పడేసారు. గెలిస్తేను / ఓడిపోతేను తల్లికి గర్భశోకం తప్పదా...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
నల్లమల నిధి రహస్యం పార్ట్ - 32
 
ఆ అడవిలో, పరుగు లాంటి నడకతో వేగంగా నడుస్తూ వెళ్తున్న సంజయ్ కి, తాను ఇదివరకు ఎప్పుడో, ఈ అడవి ప్రాంతంలో తిరిగినట్టుగా అనిపించసాగింది. వేగంగా నడుస్తూ, మధ్య మధ్యలో ఇంకా వేగంగా పరిగెడుతూ, ఆగి ఆగి రొప్పుతూ, ఆ అడవి మార్గంలో వెడుతూ ఉన్న అతనికి ఓపిక అంతా సన్నగిల్లుతోంది.
 
ముందు రోజు రాత్రంతా నిద్రలేకపోవడం, పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం వల్ల, అలుపెరగని ప్రయాణం వల్ల, అతన్ని నిస్సత్తువ ఆవరిస్తోంది. అయినా, తన అన్నకోసం ఓపిక కూడగట్టుకుని, ఒక్కో అడుగు వేస్తూ, నడుస్తూ ఉన్న సంజయ్ కి గొంతు తడి ఆరిపోతోంది. ఆకలితో కడుపులోని పేగులు మెలితిరిగి పోతున్నాయి. ఇంకా ఒక ఫర్లాంగు దూరం ఉంది అనగా, సంజయ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. సంజయ్ నే నీడలా వెంబడిస్తూ వచ్చిన నరేంద్రుని దుష్టాత్మ వికృతంగా నవ్వసాగింది.
 
" అయ్యారే.. మహారాజా! అయిపోయిందా నీ ఓపికా? లే! లేచి వెళ్ళు. ఆ ఖడ్గం నాకూ అవసరమే. అది నువ్వు బయటకు తేవాలి, నేనూ దాన్ని నీ నుండి సొంతం చేసుకుని, నా అంతాన్నే అంతం చేసి, నాకు ఏనాడో సొంతం కావాల్సిన నిధిని సొంతం చేసుకుని, నా తీరని కోరిక తీర్చుకుంటా!
 
నాకిక అంతం ఉండదు. ఈ వాహకం నుండి ఇంకో వాహకంలోకి, మరో వాహకంలోకి మారుతూ, ఆత్మని అయినా హాయిగా మళ్ళీ మళ్ళీ కొత్త రూపాలను పొందుతూ, ఈ నిధితో ఈ ప్రపంచంలోని అన్నీ విలాసాలను అనుభవిస్తూ, అపర కుబేరుడనయి వెలిగిపోతాను" అంటూ వికృతంగా నవ్వుతూ, తన దుష్టశక్తితో వర్షం కురిపించసాగాడు. ఆ వర్షపు నీరు, సంజయ్ ని స్పృహలోకి వచ్చేలా చేసింది.
 
స్పృహలోకి రాగానే, కళ్ళు మసక మసకగా అవుతున్నా మళ్ళీ తన పయనం ప్రారంభించాడు సంజయ్.
 
తను చనిపోయినా పర్వాలేదు. ఎలాగైనా ఖడ్గాన్ని సంపాదించి, తన అన్నకు ఇచ్చి, సిద్ధాంతి గారు చెప్పిన విషయాలు అన్నీ చెప్పి, అన్నను కాపాడుకోవాలని ఒక తమ్ముడిగా, తన శక్తికి మించి, తన ప్రాణాలను పణం పెట్టి ఆ అడవిలో, విధికి ఎదురీదుతున్నాడు సంజయ్.
 
***
 
సీత మనసంతా గందరగోళంగా ఉంది.
అంజలి, అంజలి వాళ్ళ అమ్మా, సీతకు ధైర్యం చెప్పి, కొద్దిగా అన్నం తినిపించగలిగారు. సంజయ్, అజయ్ లను తలుచుకుంటూ సీత, వాళ్ళిద్దరి క్షేమం కోసం మల్లన్న స్వామిని వేడుకుంటూ ఉంది.
 
"కంగారు పడకండి ఆంటీ! సంజయ్ వెళ్లాడు కదా! వాళ్ళ అన్నయ్యతోనే తిరిగివస్తాడు చూడండి. మీరు బాధపడకండి" అంటున్న అంజలితో
 
" అజయ్ వెతుక్కుంటూ వెళ్లిన సింగా, స్వయానా నా బాబాయి కొడుకు. నాకు తమ్ముడు, వీళ్ళకి మేనమామ.
నీకు తెలీదు అంజలీ! నేను ప్రేమ వివాహాం చేసుకున్నాను అని! మా తండ్రి మమల్ని ఇంట్లోకి రానివ్వకపోతే, మేము ఇదే ఊరిలో విడిగా ఉండేవాళ్ళం. మా వల్ల మా నాన్న పరువు పోయింది అంటూ ఈ సింగా, నన్ను నా భర్తని చాలా సార్లు చంపాలని ప్రయత్నం చేసేవాడు. మా నాన్న చనిపోయిన తరువాత, ఆయన ఆస్తిని, ఇంటిని స్వాధీనం చేసుకుని, చాలా అరాచకాలకు పాల్పడేవాడు.
 
నా భర్త వాడిని ఎదుర్కొనే క్రమంలో, మాకు విజయనగరం ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలా చేయించింది కూడా సింగానే. ఊరు విడిచి వెళ్లిపోతున్నప్పుడు కూడా మమ్మల్ని అవమానకరంగా మాట్లాడాడు. ఇక ఈ జన్మలో సింగాతో మాకిక సంబంధం ఉండదు అనుకున్నాను. కానీ విధి మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది. ఎవరి మొహం జీవితంలో చూడకూడదు అనుకున్నానో, వాడితో, నా కొడుకుకి వైరం వచ్చింది. వాడు చాలా క్రూరుడు అంజలీ! ఏ జన్మలో ఏమి పాపం చేసానో తెలియదు. 'నా' అన్నవారిని మింగేసింది ఈ అడవి" అంటూ, ఒక తండ్రిని కోల్పోయిన కూతురిగా, భర్తను పోగొట్టుకున్న భార్యగా, ఇప్పుడు బిడ్డలకి కూడా ఆ అడవిలో ఏం జరగబోతోందో అనే బాధతో ఒక తల్లిగా ఆమె పడుతున్న వేదన చూసి అంజలికి, అంజలి తల్లికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి.
 
***
 
మరియాతో కలిసి, అమ్మవారి గుడికి బయలుదేరిన అజయ్, ఒక్కసారిగా పడుతున్న వర్షంలో తడిసి ముద్దయిపోతున్నాడు.
 
"ఇదేంటి? ఇప్పటి వరకూ లేని వాన, ఇప్పుడు మొదలైంది.." అని అజయ్ అంటూ ఉండగా.
" మావా! ఇది సహజంగా కురుస్తున్న వర్షం కాదు. ఇది ఆ దుష్టుడి పని" అంది మరియా.
 
"వాడి పనా! కానీ ఎందుకు?" అన్నాడు అజయ్.
మరియా ఒక్క నిమషం కళ్ళు మూసుకుంది. ఆమె ముఖంలో హావభావాలు మారిపోతున్నాయి. మూసి ఉన్న ఆమె కనురెప్పల మాటుగా, అటు, ఇటు తిరుగుతున్న ఆమె కను గుడ్లు, ఆమెలోని కలవరాన్ని తెలియజేస్తున్నాయి.
 
ఆమె తన ఆత్మ శక్తితో ఏమి చూస్తోందో తెలియని అజయ్ కి ఆందోళన పెరిగిపోతోంది.
 
ఒక్కసారిగా కళ్ళు తెరిచిన మరియా.
 
"మావా! నీ తమ్ముడు సంజయ్ ప్రమాదంలో ఉన్నాడు. అతను ఇప్పుడు నీకోసమే, ఆ ఖడ్గాన్ని సంపాదించాలని అమ్మవారి గుడికి చేరుకోబోతున్నాడు. కానీ." అంటూ ఇంకా ఏదో చెప్పబోయి, ఆగిపోయింది మరియా.
 
" హా! చెప్పు మరియా.. కానీ ఏంటి? " అంటున్న అజయ్ తో.
 
" మావా! మాట్లాడేందుకు సమయం లేదు. ఆ గుడి ఇక్కడికి చాలా దూరం. ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకోవాలి. లేకుంటే నీ తమ్ముడి ప్రాణానికే ప్రమాదం. నేను నీలో ఆవహిస్తాను. ఆ తాయత్తు నన్ను ఏమీ చేయదు. నేను అమ్మవారి ఉపాసకురాలిని కదా! " అంటూ అజయ్ ని పూర్తిగా మాట్లాడనివ్వకుండా, అజయ్ శరీరంలోకి మరియా ఆవహించింది.
 
ఒక్కసారిగా అజయ్ గాలిలోకి ఎగిరి, అమ్మవారి గుడి వైపుగా పయనమయ్యాడు.
సశేషం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
[quote pid='6043377' dateline='1758859772']
అజయ్ శరీరంలోకి మరియా ఆవహించింది.
 
ఒక్కసారిగా అజయ్ గాలిలోకి ఎగిరి, అమ్మవారి గుడి వైపుగా పయనమయ్యాడు.
సశేషం

[/quote]

ఈ పని ఎప్పుడో చేసుండాల్సింది Big Grin
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
(26-09-2025, 09:39 AM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్ - 32
 
ఒక్కసారిగా అజయ్ గాలిలోకి ఎగిరి, అమ్మవారి గుడి వైపుగా పయనమయ్యాడు.
సశేషం

Nice Update !!!

yr): yr): yr): clp); clp); clp);
Like Reply




Users browsing this thread: 1 Guest(s)