Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నల్లమల నిధి రహస్యం - 34
#81
రేపటి మీ కథకో‌సం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ 
[+] 1 user Likes Satya9's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
(28-07-2025, 03:33 PM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్-22

 

అదేంటి అంటే..(? రేపు చెపుతాను )
***సశేషం***

Nice Update, RamyaN /K3vv3 garu!!!

clp); clp); clp);
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#83
నల్లమల నిధి రహస్యం పార్ట్ - 23
 
రచన : రమ్య నముడూరి
 
నిద్రలోకి జారుకున్న అంజలికి ఒక కల వస్తోంది. ఆ కలలో ఒక ముష్టివాడు కనిపిస్తున్నాడు. అతను అంజలికి ఏదో చెబుతున్నాడు. అదేమీ అంజలికి అర్ధం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అంజలికి స్పష్టంగా వినిపిస్తోంది, అర్ధం అవుతోంది!
 
"ఓయ్ పిల్లా! ఆ రక్ష తీసి నీ ప్రియుడికి కట్టు. ప్రమాదం నీ ప్రేమను బలి తీసుకోబోతోంది. నీ ప్రియుడే ఆ దుష్టాత్మకి వాహకం కాబోతున్నాడు. వాడికి రక్ష కట్టు. నీ ఇంటి పొదల్లో నేనిచ్చిన రక్ష ఉంది. అది నీ ప్రియుడికి కట్టు. రెండు ప్రాణాలను కాపాడు" అంటూ ఆర్తిగా చెప్తూ ఉన్నాడు ఆ ముష్టివాడు.
 
అంజలికి వళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి.తన గొంతు తడి ఆరిపోతోంది. ఊపిరి ఆగి పోతున్నట్టుగా అనిపించి, ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. తను తన గదిలోనే ఉన్నాను అని ఊపిరి పీల్చుకుంది. హాల్ లోకి వెళ్లి, వాటర్ తాగి, కాస్త ప్రాణం కుదుటపడింది అనిపించాక, తనకొచ్చిన కల గురించి ఆలోచించసాగింది.
 
 
తనని తాను కోయరాజు రూపంలో చూస్తున్న అతని కళ్ళు, ఒక వెన్నెల బొమ్మని చూస్తూ ఆగిపోయాయి. అందమైన ఆ నల్లమల అడవి, ఉదయిస్తున్న సూర్యకిరణాల కాంతులతో వెలిగిపోతున్న వేళ..పచ్చని ఆ అరణ్యంలో కోయిలమ్మ గానానికి, నెమళ్లు పురి విప్పి నాట్యం చేస్తున్నాయి.
 
ఆ కోయిల గానం కంటే ముగ్ద మనోహరమైన గానంతో
"ప్రియతమా! నా ప్రియతమా! నీ రాకకై నా కన్నులు కాయలు కాసేనురా..
జగడాన గెలుపొంది రావేలరా..
నీ ప్రేమకై.. నీ ప్రేమకై.. జన్మలు వేచి ఉండనా.. మళ్ళీ మళ్ళీ జన్మించి నిన్నే చేరనా.."
అంటూ పాడుకుంటూ కొండలమీద నుండి జాలువారుతున్న జలపాతం కింద జలకాలాడుతోంది, పాలరాతి బొమ్మకు ప్రాణం పోసినట్టు ఉన్న కోయ పిల్ల.
 
వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ సెలయేరులో కాలు పెట్టాడు మార్తాండ. నెమ్మదిగా ఆమెను చేరి వెనుక నుండి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఒక్కసారిగా అదిరిపడ్డ మరియా అంతలోనే మురిపెంగా సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి, మార్తాండను గట్టిగా హత్తుకుని,
 
"ప్రియా. నీకు నూరేళ్లు. నిన్నే తలుచుకుంటూ ఉన్నాను. మన లగ్గం అయిన మరునాడే నువ్వు మేడారం పోతివి. ఆ జగడాన నీకేటైతాదొ అని దిగులుబడితిని. ఆ అమ్మ ఇష్టకామేశ్వరి.. నిన్ను క్షేమంగా నాకిచ్చింది" అంటూ కలువల్లాంటి కళ్ళనిండా నీరుతో సూటిగా చూస్తూ చెప్పింది మరియా.
 
"ఏడవమాకు మరియా! నీ రాజు వచ్చేసాడుగా! ఇక ఎన్నటికీ నిన్ను వీడి పోను. అరే! ఒకేల నా పానం పోయినా నీకోసమే మళ్ళీ పుట్టొస్తా గదే! " అంటూ మరియాను గట్టిగా హత్తుకున్నాడు.
 
"ఓ! ఉకో మామ! నీ పానం బోతే నే మాత్రం ఆయువుతో ఉంటనా? ఏంది నీ యాలాకోలం.." అంటూ కన్నీరు పెట్టుకుంది మరియా.
 
ఆ కన్నీరు తుడుస్తూ "ఇక ఏ ఉపద్రవాలు రావు. ఆ మారాజు మారిపోయి, తప్పు తెలుసుకుని, సమ్మక్క భక్తుడయ్యిండు. అంతే గాదు. మన కోయ రాజులందరికీ కప్పం రద్దు చేసిండు. ఇక మనకి, ఆ మారాజుకి స్నేహం అయినాది. మన అమరవీరుల త్యాగ ఫలం వృధా పోలేదు మరియా. ఇక మన ప్రజలు సంతోషంగా సంబరాలు చేసుకునే రోజులు వచ్చినాయి " అంటూ మరియాకి ధైర్యం చెప్పి, స్నానం చేసి, ఇద్దరూ కలిసి, సుచిగా ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి వెళ్లి, భక్తిగా దండం పెట్టుకున్నారు.
 
మరియా అమ్మవారి ఉపాసకురాలు. ఆమె చిన్నప్పటి నుంచి ఆ అడవిలో ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా తన చేత్తో పసరు మందు ఇస్తే తగ్గిపోయేది. ఆ గూడెం లోని ప్రజలు ఆమెను ఒక దేవతగా చూసేవారు. ఇప్పుడు ఆమె ఆ కోయదొర భార్య. మరి ఇప్పుడు ఆమెను మరింత గొప్పగా చూసుకునేవారు ఆ ప్రజలు. ఆ తల్లి ఆశీర్వాదం తీసుకుని, కోయ ప్రజలను సమావేశ పరిచాడు మార్తాండ.
 
ఆదివాసులు యుద్ధంలో అమరులయ్యారు కనుక మన మహారాజు ప్రతాపరుద్రుని ఆదేశం ప్రకారం ఈనాటి నుంచి రెండేళ్లకి ఒకసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర కోసం మన అదివాసులం అందరం కూడా బెల్లం ముద్దలు, సమర్పించుకోవాలని తీర్మానం చేసి సంబరం జరిపించాడు. ఆరోజు అంతా ఆ కోయ ప్రజలు, తమ రాజు క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంబరాలు చేసుకున్నారు. ఆరోజురాత్రే కోయసంప్రదాయంలో మరియా, మార్తాండ ఒక్కటి అయ్యారు. ఒకటే ప్రాణం, ఒకటే లోకంగా ప్రేమగా సాగిపోతోంది వారి జీవితం.
 
***
 
‘విధి రూపంలో పెను విషాదం దాపరించబోతోంది’ అని తెలియక ఎంతో ఉల్లాసంగా ఉన్న మార్తాండ దగ్గరికి ఒక రోజు రాత్రి అనుకోని పరిస్థితుల్లో మహారాజు ప్రతాపరుద్రుడు, అతని అంతరంగిక సైన్యం ఒక పెద్ద భోషాణంతో వచ్చారు.
 
ఢిల్లీ సుల్తానుతో జరగబోయే యుద్ధంలో తనకి జరగరానిది ఏమైనా జరిగితే ఆ నిధిని తన రాజ్య ప్రజల క్షేమం కోసం ఉపయోగించమని మాట తీసుకుని వెళ్లిన ఆ మహారాజు, నమ్మక ద్రోహి కారణంగా ఆ యుద్ధంలో పరాజయుడయి, బంధీగా ఢిల్లీకి తరలించబడుతుండగా మరణించాడు.
 
ఆ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న మార్తాండ. ఆ నమ్మక ద్రోహి నరేంద్రుడు, నీతి మంతుడైన ప్రతాపరుద్రుని మరణానికి కారణం అని తెలుసుకుని కోపంతో రగిలిపోయాడు. నిధి కోసం ఆ నరేంద్రుడు నల్లమల అడవుల్లోకి వస్తున్నాడు అని తెలుసుకున్న మార్తాండ కనీవినీ ఎరుగని రీతిలోతనదైన ఒక కొత్త పద్ధతిలో ఒక కొత్త యుద్ధ వ్యూహాన్ని రూపొందించి, తన మిత్రుని మరణానికి బదులు తీర్చుకునేందుకు, ఆ నరేంద్రుని రాక కోసం ఎదురు చూస్తున్నాడు.
 
***
 
ఇదంతా అజయ్ కళ్లలో కనిపిస్తూ ఉంది.
 
అలాగే సిద్ధాంతి గారికి కూడా నరేంద్రుడు నల్లమల అడవుల వైపుగా తన సైన్యంతో దండెత్తడానికి వెళ్లడం కనిపిస్తోంది.
 
***
 
యుద్ధభూమిలో కలుద్దాం.?
లెట్స్ బ్యాంగ్ విత్ ద వార్ ఎపిసోడ్.?
[color=#996633]***సశేషం[color=#996633]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
#84
(02-08-2025, 06:41 PM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్ - 23
 
రచన : రమ్య నముడూరి

***
 యుద్ధభూమిలో కలుద్దాం.?
లెట్స్ బ్యాంగ్ విత్ ద వార్ ఎపిసోడ్.?
***సశేషం
Superb Update!!! RamyaN/K3vv3 garu.
yr): yr): clp); clp); clp);
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#85
Nice story
[+] 1 user Likes anaamika's post
Like Reply
#86
నల్లమల నిధి రహస్యం పార్ట్ - 24



‘నిధి కోసం ఆ నరేంద్రుడు నల్లమల అడవుల్లోకి వస్తున్నాడు’ అని తెలుసుకున్న మార్తాండ కనీవినీ ఎరుగని రీతిలో తనదైన ఒక కొత్త పద్ధతిలో ఒక కొత్త యుద్ధ వ్యూహాన్ని రూపొందించి, తన మిత్రుని మరణానికి బదులు తీర్చుకునేందుకు, ఆ నరేంద్రుని రాక కోసం ఎదురు చూస్తున్నాడు.
 
కత్తులు, ఈటెలు, బల్లెములు, గునపాలు, బాణాలు అన్నీ సిద్ధం చేసుకుని మగవారు, కారం పొడులు, కత్తి పీటలు, ఇంకా ఆ ఆదిమ వాసుల సంప్రదాయ పనిముట్లు చేతబట్టి ఆడవారు రాబోతున్న ప్రమాదాన్ని ఎదుర్కొడానికి సిద్దమయ్యారు.
 
ఆ కోయరాజు రాబోయే నరేంద్రుని సైన్యాన్ని ఎదుర్కోడానికి తాను రూపొందించిన ప్రత్యేకమైన వ్యూహం ప్రకారం తన ప్రజల్ని కొంతమందిని, శత్రుసైన్యం అడవుల్లోకి ప్రవేశించే మార్గం దగ్గర ఉన్న కొండ గుహలలో మాటు వేసి, శత్రుసైన్యం లోనికి రాగానే చేయవలిసిన పని చెప్పి, ఏమి జరిగినా సరే ధైర్యంగా పని పూర్తి చేయాలని చెప్పి, వారిని అక్కడికి పంపాడు. మిగిలిన వారిని దళాలు గా విభజించి, తన వ్యూహాన్ని వివరించాడు.
 
ఉత్తర, దక్షిణ దిక్కుల నుండి మార్తాండ స్నేహితులైన దళపతులు కూడా మార్తాండ వ్యూహం ప్రకారం శత్రువు సైన్యం రాక కోసం మాటు వేసి ఉన్నారు.
 
ఆ అడవిలో ఆణువణువూ తెలిసిన మెరుపులాంటి వేగం కలిగిన ఆ ఆదివాసి వీరులు ప్రాణాలకు తెగించి అయినా ఈ యుద్ధంలో ధర్మాన్ని గెలిపించాలని నిర్ణయించుకున్నారు.
 
***
 
కోయరాజు ఆదేశం ప్రకారం ఆ అడవుల్లోకి శత్రుసైన్యం ప్రవేశించే దారిలో ఉన్న కొండ గుహల్లో మాటువేసుకుని ఉన్న ఆదివాసులు, నరేంద్రుని సైన్యం లోపలికి వస్తూ ఉండగానే బాణాల వర్షం కురిపించేశారు.
 
కొండపైన ఉన్న మార్తాండ సైన్యం కింద ఉన్న నరేంద్రుని సైన్యంపై, తైలం కురిపించి, అగ్గి బాణాలు వేసేసారు. అలా ఆ నరేంద్రుని సైన్యం కొంత మంది అక్కడే చనిపోయారు.
 
వాళ్ళని వెంబడిస్తూ దాడి చేస్తూ ఉన్న వీరులు, ఆ నరేంద్రుని సైన్యం చేసే ప్రతిదాడికి సమాధానం చెబుతూనే వారి చివరి ఊపిరి వరకూ పోరాడి చాలా మందిని హతమార్చి, వారు కూడా వీరమరణం పొందారు.
 
నరేంద్రుని సైన్యం ఆ అడవిలో ముందుకు సాగింది. ఒక పది యోజనాలు వెళ్లారో లేదో ఒక్కొక్కరుగా గుర్రాలతో సహా ఊబిలోకి దిగబడిపోయి కొందరు, కర్రలు పాతిన గోతుల్లో పడి కొందరు మరణించారు. నరేంద్రుడు సైన్యానికి మధ్యగా ఉండడం వల్ల, వాడి చుట్టూ సైన్యం జాగరూకులై కాపాడడం వల్ల, ఆ నీచుడికి మాత్రం ఏమీ కాలేదు.
 
వారందరు ఆ ఊబిని దాటుకుని ముందుకు వెళ్లారు. వారు ఇంకో యాభై యోజనాలు వెళ్లగా..
మార్తాండ వ్యూహం ప్రకారం ఉత్తర, దక్షిణ దిశల నుంచి ఆ నరేంద్రుని సైన్యానికి వెనకనుండి గొరిల్లా యుద్ధం చేసుకుంటూ మరికొందరు ఆదివాసులు, వారి సాంప్రదాయ ఆయుధాలైన విల్లంబులు, దంతాలు, వేట కత్తులు, కొడవళ్ళతో కర్కశంగా విరుచుకుపడ్డారు. వేల సంఖ్యలో ఉన్న నరేంద్రుని సైన్యంతో పదుల సంఖ్యలో ఉన్న మార్తాండుడి దళపతుల సైన్యం వీరోచితంగా పోరాడి, అసువులు బాసారు. అప్పటికే చాలా మంది వనం వీరులు వీర మరణం చెందారు. అయిదొందల మంది శత్రుసైన్యంతో వంద మంది సైన్యం కూడా లేని మార్తాండ తలపడనున్నాడు.
 
శత్రు సైన్యం, ఇంకా ఆ గూడేనికి రెండు యోజనాలు దూరంలోకి వచ్చేసరికి, ముందుగానే చెట్లపై మాటు వేసుకుని ఉన్న మార్తాండుడి సైన్యం బాణాలు సంధించారు. నరేంద్రుని సైన్యం కూడా ప్రతి దాడి చేస్తూ వారందరిని చంపేశారు. ఇక నరేంద్రుని సైన్యం మార్తాండుని వ్యూహాన్ని అంతా ఛేదించేశాం అనుకుంటూ గూడేనికి వెడుతూ ఉన్నారు. కానీ వారి రాజు నరేంద్రుని మనసులో మాత్రం భయం మొదలు అయింది. ఆ నీచుడి బుర్రలో కొత్త ఆలోచన తట్టింది.
 
"రెండు వేల మంది సైన్యంతో వచ్చిన నేను, ఐదువందల మంది సైన్యంతో మిగిలాను. మిగిలిన సైన్యంతో ముందుకు పోతున్నాను . కానీ, ఇప్పుడు కోపానికంటే, కుతంత్రమే సరి అయినది కదా!" అనుకుంటూ తన క్రూర స్వభావాన్ని అణుచుకొని, ఆలోచనలో మునిగాడు నరేంద్రుడు.
 
"ఇప్పుడు కావాల్సింది వాడి తల కాదు, నిధి! ఆ కోయరాజుని చంపేస్తే నిధి ఎక్కడ ఉందో తెలియదు. సైన్యాన్ని చూసి భయపడి నిధిని అప్పగించేస్తాడు అనుకున్న ఆ నరేంద్రునికి మార్తాండ యుద్ధ వ్యూహం చూసి ముచ్చెమటలు పట్టాయి.
 
"అయ్యారే! వీడి ప్రజలు తిరగబడితేనే నా సైన్యం సగానికి మించి ఎక్కువే పోయారు. అలాంటిది ఆ మార్తాండుడే దిగితే నేనైనా బ్రతుకుతానా? ప్రాణాలతో తిరిగి వెడతానా? ఇది నేను ఊహించని పరిణామం. ఇప్పుడు పట్టుకోవలిసింది జుట్టు కాదు. కాళ్ళు!" అనుకుంటూ ముందుకు సాగాడు నరేంద్రుడు సైన్యం పరిరక్షణలో.
అప్పుడే వారికి ఊహించని రీతిలో ఉగ్రరూపంతో ఎదురు నిలబడ్డాడు మార్తాండ. నరేంద్రుడు గుర్రం పై నుండి దిగి, మార్తాండ దగ్గరికి వెళ్లి,
 
"మిత్రమా. ఎందుకు మనకీ జగడం చెప్పు! నిధి ఎక్కడ ఉందొ చెప్పి, నన్ను శరణు కోరు. మిగిలి ఉన్న ఈ ప్రజల్ని అయినా కాపాడుకో..ఢిల్లీ సుల్తాను మంచివాడు కానే కాదు. ఈ నిధి తెమ్మని ఆయనే పంపాడు. నేను నిమిత్త మాత్రుడను. మర్చిపోయావా.. నిధిని నీకు అప్పగించే రోజు నేను ఉన్నాను. మన స్వర్గస్తుడైన మహారాజు నన్నే నమ్మేవారు. ఆయన మరణం నన్ను ఇలా సామంతుడిగా మార్చేసింది. మనము ఒకరికొకరం సహాయం చేసుకుందాం. నిధిని నాకు అప్పగించు, నీ గూడెం ప్రజల్ని, నల్లమలలోని అన్ని వర్గాల కోయ దళపతుల్ని, మేడారం కోయ రాజుల్ని. స్వాతంత్రులని చేసేస్తాము. నిధిని మాకు అప్పగించేసేయ్. ఇక మనకి విరోధం వద్దు!" అంటూ మార్థండను నమ్మించే ప్రయత్నం చేసాడు.
 
అందుకు బదులుగా "ఉంగిలియే.. ఐనా కీర్చు.. ద్రోహి..తూ! నీ బ్రతుకు.. ఓరి ద్రోహి! రాజద్రోహి! నా పానం పోయినా గాని నీ పానం తీసే బోతా! తెలియదనుకుంటివా? నువ్ జేసిన ద్రోహం నే ఎరుగననుకుంటివా? ఆ మహారాజు నిన్నే గదరా నమ్మేటోడు! అన్నం పెట్టిన చేతినే నరికేటోడా! నిన్నేలరా బ్రతకనిచ్చేది? ఇదే నా ఆన! నీ పానం తీసి నా మారాజుకి ఇచ్చిన మాట తీరుస్తా " అంటూ నరేంద్రుని పై దాడి చేయబోయాడు.
 
అంతే! ఆ నీచుడి సైన్యం నరేంద్రుడిని తప్పించి, మార్తాండపై బాణాలు వేయసాగారు. ఆ కోయ ప్రజలు కూడా తమ రాజుకి రక్షణగా నిలిచి యుద్ధం మొదలు పెట్టారు. అయిదు వందల మంది నరేంద్రుని సైన్యం వేసే బాణాలకు ధీటుగా సమాధానం చెబుతూనే ఆ కోయ ప్రజలు మరణిస్తూ ఉన్నారు.
 
రామాయణంలో రాముడు, శూర్పణఖ తీసుకువచ్చిన పద్నాలుగు వేల మంది రాక్షసులను హతమార్చిన రీతిలో మార్తాండ గుండ్రంగా తిరుగుతూ బాణాలు సంధిస్తూనే ఉన్నాడు.
 
ఎలాగైతే రామచంద్రమూర్తి, తాను గాయపడుతూనే ఆ రాక్షసులను మట్టి కరిపించాడో అదే విధంగా మార్తాండ కూడా తనకి గాయాలు అవుతున్నా పట్టించుకోకుండా, వళ్ళంతా బాణాలతో రక్తం కారుతున్నా తన మిత్రుని మరణానికి బదులు కోరుకుంటూ.. ఐదు వందల మంది సైన్యాన్ని మట్టి కరిపించాడు.
 
ఇక అప్పటి వరకు సైన్యం మాటున నక్కి, ప్రాణాలు కాపాడుకున్న ఆ నరేంద్రుని బయటకు లాగి, చిత్రవధ చేసి, హింసించి, హింసించి అతని గుండెల్లో గునపం దింపేసాడు మార్తాండ!
 
"మిత్రమా! నీ చావుకి బదులు తీర్చుకున్నాను. కానీ నా ఊపిరి కూడా ఆగిపోతోంది. నిధిని నీ రాజ్యానికి చేర్చినా, ఆ నీచుల పాలు అవుతుంది . నువ్వే తిరిగి రావాలి. నువ్వొచ్చే నాడే నేనొస్తా! మళ్ళీ పుట్టొస్తా" అంటూ కుప్పకూలిపోబోతున్న మార్తాండను పొదివి పట్టుకుంది మరియా.
 
 
"మామ.. మామ..ఉన్ పానం.. నిల కుండా.. మామా! మామా! ఉన్ కురియా!” (మామా . మామా. నేను వచ్చేస్తా. నేను సచ్చిపోతా!)" అంటూ మరియా మార్థండ పై పడి ఏడుస్తోంది.
 
"ఉఫియే.. కింగలిచ్చు.. ఐనా. పుట్టి్యోవ్హ్. హ కెజిఫ్. సఫుజీవ్.. గుజగ్బక్, ఊహజకజేన్ క్కలజూహబ్ కాల్కమ్.
 
(మళ్ళీ పుడతా. నే నిధి కోసం తిరిగి వస్తా! నీ శక్తులతో నిధి కి కాపలా ఉంటాను అని మాట ఇవ్వు మరియా. ఇప్పుడు మన రాజ్యం ఆ నీచుల చేతిలోకి వెళ్ళిపోయింది. నిధి ఇప్పుడు బయటకు రాకూడదు. మన మహారాజు ఆశయం ఈ దేశ భవిష్యత్తు! తిరిగి వస్తాం. దేశం కోసం మళ్ళీ పుడతా! అంతవరకు నీలగిరి కొండ గుహలలో సొరంగ మార్గాన దాచి ఉంచిన నిధిని నీవు కావలి కాయాలి. మాటివ్వు మరియా!" అంటూ కన్నుమూశాడు ఆ యోధుడు.
 
 
“మామ.. మామా!” అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్న మరియాకి మాత్రమే ఇప్పుడు ఆ నిధి రహస్యం తెలుసు.

మార్తాండ మరియాకు చెప్పిన మాటలు కొన ఊపిరితో ఉండగా విన్న నరేంద్రుడు తనకి ఆ కోయ భాష వచ్చు కనుక వాళ్లు మాట్లాడుకున్న మాటల్లో దాగి ఉన్న నిధి రహస్యం, తన పెంపుడు పావురంతో ఎవరికో వర్తమానం పంపాడు. అది గమనించిన మరియా ఆ నిధి రహస్యం తెలియకూడదు అని ఆ పావురాన్ని పట్టుకోవడానికి పరిగెడుతుండగా అక్కడే ఉన్న బల్లెముతో మరియా కడుపులో పొడిచి, తను చనిపోయాడు నరేంద్రుడు.
చనిపోతూ చనిపోతూ ఆ నీచుడు నరేంద్రుడిని శపించింది మరియా.
 
"ఓ దుష్ఠుడా! నమ్మకద్రోహీ! నేను చనిపోయినా ఆత్మనై నిధికి రక్షణగా నిలిచెదను. నీవునూ నా వలె ఆత్మవై సంచరించెదవు గాక! నీ ఆత్మకి విముక్తి కలగాలంటే నా నాధుని మరు జన్మములో అతని చేతిలోనే..ఇది ఆ ఇష్టకామేశ్వరి అమ్మవారిపై ఆన !" అంటూ మరణించింది మరియా.
 
పచ్చని ఆ అరణ్యం నెత్తుటి రంగు పులుముకుని, వైతరణి నదిలా ప్రవహిస్తూ ఆదిమ వాసుల స్వామి భక్తికి, ఎనలేని తెగువకు, నమ్మకద్రోహి దురాశకు , మధ్య జరిగిన యుద్దానికి సాక్షిగా నిలుస్తూ అమరులైన ఆ అడవి బిడ్డలకి కన్న తల్లి లాంటి ఆ వనదేవత పెడుతున్న కన్నీరే అరణ్య రోదనగా నిలిచిపోయింది.
***సశేషం***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply
#87
(08-08-2025, 08:36 PM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్ - 24



పచ్చని ఆ అరణ్యం నెత్తుటి రంగు పులుముకుని, వైతరణి నదిలా ప్రవహిస్తూ ఆదిమ వాసుల స్వామి భక్తికి, ఎనలేని తెగువకు, నమ్మకద్రోహి దురాశకు , మధ్య జరిగిన యుద్దానికి సాక్షిగా నిలుస్తూ అమరులైన ఆ అడవి బిడ్డలకి కన్న తల్లి లాంటి ఆ వనదేవత పెడుతున్న కన్నీరే అరణ్య రోదనగా నిలిచిపోయింది.
***సశేషం***

Very good and Interesting update, RamyaN and K3vv3 garu!!!

yr): yr): yr): clp); clp); clp);
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#88
నల్లమల నిధి రహస్యం పార్ట్ - 25



పచ్చని ఆ అరణ్యం నెత్తుటి రంగు పులుముకుని, వైతరణి నదిలా ప్రవహిస్తూ..
 
 
ఆదిమ వాసుల స్వామి భక్తికి, ఎనలేని తెగువకు, నమ్మక ద్రోహి దురాశకు మధ్య జరిగిన యుద్దానికి సాక్షిగా నిలుస్తూ, అమరులైన ఆ అడవి బిడ్డలకి కన్న తల్లి లాంటి ఆ వన దేవత పెడుతున్న కన్నీరే అరణ్య రోదనగా నిలిచిపోయింది.
ఆ యుద్ధం అంతా తన కళ్ళ ముందరే కదలాడుతుంటే నిద్రలోనే అదే ట్రాన్స్ లో ఉండే, ఆవేశంతో రగిలి పోతున్నాడు అజయ్.
 
"మరియా! నా మరియా! " అంటూ కలవరిస్తున్న అతని కంటి వెంబడి కన్నీటి వర్షం కురుస్తోంది.
 
పక్కనే ఉండి అజయ్ తలను నిమురుతున్న మరియా
"ప్రియా! నే ఉన్నా. ఆత్మనై నీ పక్కనే ఉన్నా.. జన్మలు వేచి నీకై మిగిలిఉన్నా..
ఒకప్పటి మన ప్రణయ కావ్యాన్నే పదే పదే చదువుకుంటూ.. ఆనాటి మన ప్రేమ మాధుర్యాన్ని ఆలాపనగా మళ్ళీ మళ్ళీ పాడుకుంటూ.. నీకిచ్చిన మాటకై వేచి ఉన్నా..
ఇది ప్రకృతి విరుద్ధం అని తెలిసినా నీలో కలిసిపోయే వరం కోరుకుంటున్నా!" అంటూ ఆ ఆత్మ ఘోషిస్తూనే ఉంది.
 
***
 
తనకి వచ్చిన కల గురించే ఆలోచిస్తూ ఉన్న అంజలి ఎలాగో ధైర్యం చేసుకుని పెద్దగా శబ్దం రాకుండా మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళింది. చుట్టూ చూస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెడుతోంది అంజలి. గాలి వేగంగా వీస్తూ ఆమెను ఇంకా భయపెడుతోంది. కీచురాళ్ళు అరుస్తూనే ఉన్నాయి. ఆ ఇంటి చుట్టూ ఉన్న చెట్లు ఆ గాలి వేగానికి అటు ఇటు ఊగుతూ భయానికే భయాన్ని రుచి చూపించేటట్టు ఉంది ఆ వాతావరణం. ఆ తాయత్తు కోసం, ఇంటి పొదల్లో వెతుకుతున్న అంజలిపై ఒక్కసారిగా నల్లని పిల్లి వచ్చి పడింది. ఒక్కసారిగా జరిగిన ఆ ఘటనకి హడలిపోయిన అంజలి. కెవ్ మని అరుస్తూ ఆ పొదల్లోకి పడిపోయింది. ఆ అరుపుకి భయపడి అంజలి తల్లి బయటకు వచ్చింది.
 
అలాగే, నిద్ర పోకుండా కూర్చున్న సంజయ్ కూడా కిందకి వచ్చాడు. వాళ్లిద్దరూ వచ్చి చూసేసరికి పొదల్లో పడి ఉన్న అంజలి కనిపించింది.
 
అంజలి వాళ్ళ అమ్మ అంజలిని పైకి లేపి, "ఏమైందే! నువ్వు ఇక్కడ పడి ఉన్నావేంటి?" అని అడిగింది.
 
అంజలిని ఆ టైం లో అక్కడ చూసిన సంజయ్ కి కూడా ఒక్క నిమషం గుండె జారిపోయింది.
 
సంజయ్ వైపు చూస్తోన్న అంజలి భుజాలు పట్టుకుని ఊపేస్తూ "ఏమైందో చెప్పమంటే అలా నిలబడి చూస్తావేంటే?" అంటూ అడుగుతోంది ఆ అమ్మాయి తల్లి.
 
"ఏదో అలికిడి ఐతే దొంగోడు వచ్చాడేమో! అని చూస్తుంటే నన్ను ఈ పొదల్లోకి తోసేసి , పారిపోయాడమ్మా" అని అబద్ధం చెప్పింది అంజలి.
 
సంజయ్ కి అంజలి చెంప పగల కొట్టాలనిపించింది. దొంగోడు వస్తే ఈ ఝాన్సీ రాణి గారు పట్టుకోడానికి వచ్చినట్టుంది అనుకుంటూ "ఏంటి అంజలి! ఒక ఫోన్ చేసి చెప్తే నేనొచ్చి చూసేవాడ్ని కదా. నువ్విలా బయటకు రావడం ఏంటి? వాడు నిన్ను ఏమైనా చేసి ఉంటే.." అంటూ కోప్పడ్డాడు సంజయ్.
 
"అలా అడుగు బాబూ! ఏదో టైం బాగుండి, దీనికి ఏమీ కాలేదు బాబూ! ఏమీ అనుకోకపోతే ఈ పూటకి నువ్వు హాల్ లో పడుకోకూడదుకూడదూ! వాడు మళ్ళీ వస్తాడేమో. "అంది పాపం ఆ పిచ్చి తల్లి.
 
సంజయ్ కి అర్ధం అయింది. ఇది అంజలి ప్లానే అని. కానీ ఎందుకు అనేది అర్ధం కాలేదు.
 
అందరూ లోపలికి వెళ్లిపోయారు. తల్లి పూర్తిగా నిద్రలోకి జారుకుంది అని నిర్ధారించుకుని, తను వెళ్లి సంజయ్ ని లేపి, అతని చేతికి రక్ష కట్టేసింది. సంజయ్ కి ఏమీ అర్ధం కాలేదు.
 
"ఏంటి అంజలి! ఏంటి ఇది? నాకెందుకు కట్టావ్?" అంటూ ఉండగానే
 
"నువ్వు ఇంకేమి మాట్లాడకు సంజయ్. ఇది నువ్వు ఎప్పుడూ తీయకు. అసలు ఏమి జరిగిందో తెలుసా! నీతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా నాకు ఏదో మత్తు గాలి సోకినట్టుగా నిద్రపట్టింది.
 
ఆ నిద్రలో నాకు ఒక ముష్టివాడు కనిపించాడు. అతనేదో చాలా చెప్పాడు. నాకు అవేమీ స్పష్టంగా వినిపించలేదు. కానీ కొన్ని మాటలు వినిపించాయి, అర్ధం అయ్యాయి.

"నీ ప్రియునికి రక్ష కట్టు. ఇప్పుడే వెళ్లి వెతుకు. నీ ఇంటి పొదల్లో పదిలంగా ఉన్న ఆ రక్ష తీసి నీ ప్రియునికి కట్టు. రెండు ప్రాణాలు కాపాడు. ఆ దుష్ట శక్తికి నీ ప్రియుడు వాహకం అయిపోతే ప్రళయం తప్పదు. వెళ్ళు! తులసి కోట మీదకు విసిరివెయబడ్డ ఆ రక్ష నీ తల్లి తీసి, పొదల్లోకి విసిరేసింది. వెళ్ళు. వెతికి తీయి. నీ ప్రియుడ్ని కాపాడుకో! తెలవారకుండా ఆ రక్ష కట్టకపోతే ప్రళయం! సర్వ నాశనం! సృష్టి వినాశనం!" అంటూ చెప్తూ చెప్తూ అదృశ్యం అయిపోయాడు. వెంటనే ఆ కలలోనే నిన్ను ఒక నల్లటి ఆకారం ఆవహించినట్టు నీ కళ్ళు ఎర్రటి నిప్పుల్లా అయిపోయినట్టు, నువ్వు మీ అన్నయ్య పీక కొరికి రక్తం తాగేస్తున్నట్టు..ఇంకా నా నోటితో చెప్పలేను. అలా కనిపించింది ఆ కలలో. వెంటనే ఉలిక్కి పడి లేచాను.
 
అదంతా కలే అని వదిలేద్దామన్నా.అందులో ఆ మనిషి నీకు ప్రమాదం అని చెప్పడంతో అసలు ఆ తాయత్తు ఉందొ లేదో చూద్దామని బయటకు వచ్చాను. ఉంటే పైకి వచ్చి, నీకు రక్ష కట్టొచ్చు అనుకున్నాను. ఇంతలోనే ఒక నల్లని పిల్లి వచ్చి మీద పడడంతో భయపడి అరుస్తూ పొదల్లోకి పడిపోయాను. అప్పుడే నా చేతికి ఈ రక్ష దొరికింది.
 
వెంటనే పైకి వచ్చి నీకు రక్ష కడదాం అనుకున్నాను. కానీ నే అరిచిన అరుపుకి, మీ ఇద్దరూ వచ్చేసారు. దేవుని దయ వల్ల నీకు రక్ష కట్టేసాను. సంజూ! నాకు వచ్చిన కల నిజం. మరి మీ అన్నయ్య పరిస్థితి ఏంటి?" అంటూ ఉన్న అంజలి మాటలకి
 
"రేపటి సూర్యోదయం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది " అని బదులిచ్చాడు సంజయ్.

రేపటి సూర్యోదయం కోసం ఎదురుచూద్దాం!?
 
***సశేషం***
** నచ్చిన వారు, మెచ్చిన వారు లైకులు లేదా రేటింగులు ఇస్తే ప్రొత్సాహకరంగా ఉంటుంది. 

ఆలోచించండి మితృలారా!**
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 9 users Like k3vv3's post
Like Reply
#89
తరువాత అప్డేట్, ఈ భాగం కనీసం 125 మంది చదివాక మాత్రమే ఇస్తాను.

ఈ విభాగానికి పాఠక మితృలెవరూ రావడం లేదు Dodgy Sleepy
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#90
(14-08-2025, 05:11 PM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్ - 25




"రేపటి సూర్యోదయం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది " అని బదులిచ్చాడు సంజయ్.

రేపటి సూర్యోదయం కోసం ఎదురుచూద్దాం!?
 
***సశేషం***
** నచ్చిన వారు, మెచ్చిన వారు లైకులు లేదా రేటింగులు ఇస్తే ప్రొత్సాహకరంగా ఉంటుంది. 

ఆలోచించండి మితృలారా!**

Very good update, RamyaN/K3vv3 garu!!!

yr): yr): yr): clp); clp); clp);
Like Reply
#91
(14-08-2025, 05:13 PM)k3vv3 Wrote: తరువాత అప్డేట్, ఈ భాగం కనీసం 125 మంది చదివాక మాత్రమే ఇస్తాను.

ఈ విభాగానికి పాఠక మితృలెవరూ రావడం లేదు Dodgy Sleepy

అలగకండి మిత్రమా..నేనే ఆ 125 పాఠకుడ్ని...అప్డేట్స్ ఆపకుండా ఇవ్వండి....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#92
నల్లమల నిధి రహస్యం పార్ట్ - 26



"రేపటి సూర్యోదయం అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది" అని గంభీరంగా బదులిచ్చాడు సంజయ్.
 
" సూర్యోదయం ఏమో కానీ సంజూ! తలచుకుంటుంటుంటే ఒళ్ళు జలదరిస్తోంది. నా జీవితంలో ఎప్పుడూ ఇంత భయంకరమైన కల రాలేదు. ఆ బిచ్చగాడు చెప్పినట్టే నీకు రక్ష కట్ట గలిగాను. ఇది ఎప్పటికీ తీయకు సంజూ! నీకేమైనా ఐతే మాత్రం నేను బ్రతకలేను" అంటూ సంజయ్ చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది అంజలి.
 
" అంజలీ! నువ్వు మానసికంగా సిద్ధంగా ఉండు. నేను చెప్పే మాటలు గుర్తు పెట్టుకో. నాకూ నువ్వంటే చాలా ఇష్టం. కానీ మా అన్నయ్య అంటే ప్రాణం. ఒకవేళ వాడిని కాపాడే ప్రయత్నంలో నాకు ఏమైనా అయితే మాత్రం, నువ్వు నన్ను మర్చిపోయి, ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంజలీ! ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది అని ముందే తెలిసి ఉంటే అసలు నేను నీ జీవితంలోకి వచ్చేవాడినే కాదు. తెలియదు కదా, విధి ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో! మళ్ళీ ఎప్పుడు విడదీసేస్తుందో ! అందుకే ముందుగానే చెప్తున్నా. నాకు ఏమైనా ఐతే.." అంటూ ఉన్న సంజయ్ పెదవులను తన పెదవులతో మూసేసింది అంజలి.
 
కాసేపు మౌనం తరువాత "నీకు ఏమీ కాదు సంజయ్! మీ అన్నయ్యకీ ఏమీ కాదు. అన్నిటికీ ఆ అమ్మవారే రక్ష. పైగా నీకు హనుమన్న రక్ష కూడా ఉంది. దయచేసి ఇంకెప్పుడూ ఇలా అనకు. ఏం జరిగినా నీతోటే నేనూను! నువ్వు లేని జీవితం నాకూ వద్దు. నువ్వు ఇలా మాట్లాడితే ఇప్పుడే నేను చచ్చిపోతాను " అంటున్న అంజలి మోముని చేతుల్లోకి తీసుకుంటూ
 
" ఐ లవ్ యూ అంజలి" అంటూ అంజలి కన్నీటిని తుడిచి, " వెళ్లు..కాసేపు పడుకో. రేపు మనము సిద్ధాంతి గారిని కలిసి, అటునుండి శ్రీశైలం వెళదాము. అన్ని సమస్యలకీ ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఎక్కువ ఆలోచించి, నీ చిన్ని బుర్ర బద్దలు కొట్టుకోకు. వెళ్ళు!" అంటున్న సంజయ్ ని పక్కనే ఉన్న దిండుతో కొట్టి,
 
"నాది చిన్ని బుర్రా?" అంది అంజలి చిరుకోపం ప్రదర్శిస్తూ.
 
" ఇంత చెప్తే నీకు ఈ లాస్ట్ లైన్స్ మాత్రమే బాగా వినిపించాయి చూడు! హా హా హా" అంటూ నవ్వాడు సంజయ్.
 
"హమ్మయ్యా! నువ్వు నవ్వావు కదా! ఇంక హ్యాపీ నేను. సరే పడుకో. గుడ్ నైట్" అంటూ పైకి లేచి, సంజయ్ జుట్టు మొత్తం చేరిపేసి, ఒక్క పరుగులో తన గదిలోకి వెళ్ళిపోయింది అంజలి.
 
"పిచ్చి పిల్ల! " అనుకుంటూ తాను నిద్రపోయాడు సంజయ్.
 
***
 
"మరియా! నా మరియా! " అని కలవరిస్తూనే ఉన్న అజయ్ కి పక్కనే కూర్చుని తలనిమురుతూ తన బాధనంతా పాటగా మార్చి తన అమృత గళం నుండి వినిపిస్తోంది.
 
ట్రాన్స్ లోనే ఉండి, వారందరూ యుద్ధంలో చనిపోయిన తరువాత, ఆత్మగా మారిన మరియానే ఇప్పుడు చూస్తూ కన్నీరు కారుస్తున్న అజయ్ ని ఆ గంధర్వ గానం స్వర్గపుటంచుల్లో ఓలలాడిస్తూ, తన గుండెల్లో రేగే అగ్ని కీలల ఎడారి గ్రీష్మాన్ని చల్లబరుస్తోంది.
 
"ఓ.. నా.. ప్రాణమా!
నీకై నే వేచిఉంటినిరా..
చెరిగిపోని బాసనై.. చెదిరిపోని కలనై..
ప్రాణం లేని శిలనై.. కరిగిపోని కాలాన్నై..
ఓ ..నా.. ప్రాణమా!
నీ ప్రేమను బంధించుకున్న నా హృదయం ఇక స్పందించలేదురా..
నీ రూపం దాచుకున్న నా కన్నులు ఇక చూడలేవురా..
నీ కౌగిలిలో కరిగిపోయే నా దేహం ఇక కదలలేదురా..
మనము కలిసి నడిచిన ఈ అడవి నేడు చిన్నబోయెరా..
మన జంటని దీవించిన ఆ అమ్మవారు మూగబోయెరా..
ఆ సెలయేరు మన కోసం ఎదురు చూసేరా..
ఆ పూదోట పూలన్నీ రాలిపోయేరా..
రాకాసి కాలం విడదీసేరా.. పచ్చని అడవి తల్లి ఎర్రబడెనురా..
ఓ.. నా.. ప్రాణమా!
నేను మాత్రం నీకోసం వేచి ఉంటిరా..
నీ బాస కోసం ఎదురుచూస్తారా..
జన్మాలు వేచయినా కావలుంటరా..
మరి నాకోసం జన్మనెత్తి రావేలరా..
ఈ చిన్నదాన్ని ప్రేమనే మరిచినావురా..
ఓ..ఓ..ఓ.. నా.. ప్రాణమా! రా.. రా.. రావేలరా!రావేలరా!రావేలరా!"
 
అంటూ ఆ అడవి అంతా వినిపించేలా పాడుకుంటూ తిరుగుతున్న మరియా కనిపిస్తోంది అజయ్ కళ్లలో.
 
ఇంతలో నరేంద్రుని కొడుకు, ఒక వంద మంది సైన్యంతో ఆ అడవిలోకి వచ్చాడు. నిధి ఉన్న నీలగిరి కొండల వైపుగా వెడుతున్నాడు. అప్పుడు మరియాకి గుర్తు వచ్చింది,
 
చనిపోయే ముందు నరేంద్రుడు తన పెంపుడు పావురంతో నిధి తాలూకు రహస్యాన్ని ఎవరికో వర్తమానం పంపడం!
 
ఒక్క సారిగా మరియా ఆత్మ దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది. ఆ గర్జనకి ఆ అరణ్యంలో వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. పున్నమి వెన్నెల బొమ్మలా బంగారు కాంతితో వెలిగిపోయే మరియా ఒక్కసారిగా భయంకరమైన ఆకారంలోకి మారిపోయింది. ఆ అకారాన్ని చూస్తుంటే అజయ్ కి గుండె వేగం పెరిగిపోతోంది. వికృత రూపంలోకి మారిపోయిన మరియా ఆ సైన్యాన్ని మొత్తం చిత్తు చిత్తు చేసి, వాళ్లందరినీ పరిగెత్తించింది. ఎవర్నీ ఆ అడవి దాటనీయకుండా సమాధి చేసేసింది.
 
అలా ఆనాటి నుండి ఈనాటి వరకూ ఆ నల్లమల అడవుల్లో దాగిన ఆ నిధిని దక్కించుకోవాలని దురుద్దేశంతో వచ్చిన వారందరని మృత్యుదేవతకి కానుకగా ఇచ్చి, ఆ నిధికి కాపు కాస్తున్న మరియా కనిపించింది అజయ్ కళ్ళకి. తను ఆత్మగా మారినా తన శక్తితో నిధికి కావలి ఉండి, జన్మలుగా తనకోసం ఎదురు చూస్తోంది అని అజయ్ గా జన్మించిన మార్తాండకు అర్ధం అయింది.
 
ఇదంతా చూస్తున్న అజయ్ కళ్ళకి ఒక దుష్టాత్మ కూడా కనిపించింది. మరియా చావుకి కారణం అయిన నరేంద్రుడిని చనిపోయే ముందు మరియా శాపం పెట్టడం కనిపిస్తోంది. కొన ఊపిరితో ఉన్న మరియా మాటలు అస్పష్టంగా వినిపిస్తూ ఉండగా వళ్లంతా చెమటలు పట్టేస్తూ
తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతున్నాడు.
 
"రేయ్! నిన్ను వదలనురా.. నిన్ను వదలను. నిన్ను నాశనం చేస్తా! నీ అంతు చూస్తా" అంటూ ఊగిపోతున్న అజయ్ చేతులు తన మంచానికి ఆనుకుని ఉన్న టేబుల్ పై ఉన్న గ్లాస్ ని తాకి, ఆ గ్లాస్ కింద పడిపోయింది.
 
ఆ శబ్దానికి అక్కడికి వచ్చిన సీత కొడుకు పరిస్థితి చూసి చాలా కంగారు పడిపోయింది.
 
అప్పటికి టైం 5 :30 అవుతోంది. సూర్యుడు అప్పుడే కొద్ది కొద్దిగా చీకటి నిండిన లోకంలో వెలుగు దారులు వేసుకుంటూ ఉదయిస్తున్నాడు.
 
సీత అజయ్ ని గట్టిగా ఊపుతూ లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.
 
కాసేపటికి అజయ్ ట్రాన్స్ లోంచి బయటకొచ్చి “మరియా!” అంటూ ఉలిక్కి పడి లేచాడు.
 
"మరియా ఏంటి నాన్నా! ఏమైనా పీడ కల వచ్చిందా?" అంటూ కంగారుగా అడుగుతోంది సీత.
కళ్ళ ముందు కనిపిస్తున్న సీతను చూసి ప్రస్తుతం లోకి వచ్చాడు అజయ్. ఇప్పుడు అతనికి తన గత జన్మ పూర్తిగా గుర్తు ఉంది.
 
***
 
అప్పటికే సంజయ్, సిధాంతి గారి ఇంటికి చేరిపోయాడు.
తను ఇప్పుడు శ్రీశైలం వెళ్ళబోతున్నాడు కాబట్టి, ముందుగా తనని కలవమన్నారని, సిద్ధాంతి గారిని కలవడానికి వెళ్లాడు. సూర్యోదయం అయ్యేందుకు ఇంకా ఒక్క నిమషం ఉంది అనగానే సంజయ్ ని లోపలికి పిలిచి, అన్ని విషయాలు వివరంగా చెప్పారు.
 
"నరేంద్రుని ఆత్మ పగతో నీ అన్న కోసం ఎదురుచూస్తోంది.
మీ అన్నయ్య జాతకం ప్రకారం పాతికో ఏడాది వచ్చిన నాటి నుండి మృత్యు గండం పొంచి ఉంది. ఆ గండాన్ని తనకు అనువుగా మార్చుకుని, ఆ దుష్టాత్మ, మీ అన్నయ్యను అంతం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ ఇప్పటి వరకూ అది మీ అన్నయ్యను ఏమీ చేయకుండా నీడలా వెంటాడుతూ ఉంది. ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన ఘడియ కోసం ఎదురుచూస్తూ ఉంది కాబట్టి” అని కొన్ని విషయాలు సంజయ్ కి చెప్పారు సిద్ధాంతి గారు.
 
ఆ విషయాలు వింటూ ఉంటే సంజయ్ కి వళ్ళు జలదరించింది.
 
"మృత్యు గండం, అతన్ని మృత్యు దిశగా నడిపిస్తోంది. ఆ మృత్యువును ఎదుర్కునేందుకు తగిన విధానం అంతా సంజయ్ కి చెప్పి,
 
"నీ అన్నను కాపాడుకోడానికి నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి. నా ప్రయత్నం నేను చేస్తా!" అని చెప్పారు సిద్దాంతి గారు.
 
సిద్ధాంతి గారు చెప్పిన విషయాలు పదే పదే మననం చేసుకుంటూ తన అన్నను కాపాడుకునేందుకు శ్రీశైలం బయలుదేరాడు సంజయ్.. అంజలి, అంజలి తల్లితో కలసి.
 
***
 
సంజయ్ వెళ్ళగానే సిద్దాంతి గారి శిష్యుడు
"గురువుగారూ! ఇప్పుడు ఆ అన్నాతమ్ములు ఇద్దరూ ప్రమాదం నుండి గట్టెక్కుతారు కదా " అని అడిగాడు.
 
"బ్రహ్మ రాతను తప్పించడం ఎవరి తరం కాదు. అజయ్ జాతకంలో మృత్యువు తాండవం చేస్తోంది. కాపాడుకోవాలని ఆ తమ్ముడి ఆరాటం, మంచిని గెలిపించేందుకు మన పోరాటం.
 
అంతా విధి లిఖితం. ఇద్దరూ రక్షించబడతారో, ఇద్దరూ బలి అయిపోతారో లేక ఇద్దరిలో ఒకరే మిగులుతారో..అంతా విధి నిర్ణయం. మానవ మాత్రులుగా మనము చేయగలిగినది మనము చేద్దాం. ఆపైన ఆ జగన్మాత కరుణ!" అంటూ తను చేయవలసిన క్రతువు గురించి శిష్యులకు ఆదేశాలు ఇచ్చి, తను ధ్యానం లోకి మునిగిపోయారు.
 
పూర్తిగా సూర్యోదయం అయింది.
 
ఆ దుష్టాత్మ బంధనలు అన్నీ తెంచుకుని, వికటాట్టహాసం చేస్తూ తన పగ తీర్చుకునేందుకు బయలుదేరింది.
 
***సశేషం***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply
#93
(20-08-2025, 06:24 PM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్ - 26

పూర్తిగా సూర్యోదయం అయింది.
 
ఆ దుష్టాత్మ బంధనలు అన్నీ తెంచుకుని, వికటాట్టహాసం చేస్తూ తన పగ తీర్చుకునేందుకు బయలుదేరింది.
 
***సశేషం***
Super Story!!! Nice Update.

yr): yr): yr): yr):
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#94
ఆత్మలు...అవే దయ్యాలు అన్నీ రాత్రులలోనే సంచరిస్తాయి, చీకటి వాటికి బలానిస్తాది అనుకునేవాన్ని...ఈ దుష్టాత్మ పగలే బయలు దేరింది....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#95
కథ చాలా బాగుంది.
[+] 1 user Likes kramsbabu's post
Like Reply
#96
నల్లమల నిధి రహస్యం పార్ట్ - 27



 
పూర్తిగా సూర్యోదయం అయింది.
 
ఆ దుష్టాత్మ బంధనాలు అన్నీ తెంచుకుని, వికటాట్టహాసం చేస్తూ తన పగ తీర్చుకునేందుకు బయలుదేరింది. శ్రీశైలం బయలుదేరిన సంజయ్ ను నీడలా వెంటాడుతూ వస్తూ ఉన్న ఆ దుష్టాత్మ సంజయ్ ను తాకడానికి ప్రయత్నం చేసి, సంజయ్ చేతికి ఉన్న రక్ష వలన అతన్ని తాకగానే నిస్తేజమై నిలబడిపోయింది.
 
సంజయ్ వేగంగా శ్రీశైలం వైపుగా సాగిపోతూనే ఉన్నాడు. ఒక నిమిషం తరువాత కోలుకున్న ఆ దుష్టాత్మ "అయ్యారే! వీనికి ఈ రక్ష ఉన్న కారణం చేత వీడిని నే తాకలేక పోతిని కదా! నేను వేరొక వాహకాన్ని ఎంచుకోవలేనా?” అనుకుంటూ తన దుష్ట శక్తి తో అజయ్ రక్త సంబంధీకులను చూస్తూ వారిలోని ఒకరిని తన వాహకంగా ఎంచుకుని, ఆ దిశగా తన పయనం మొదలు పెట్టింది.
 
***
 
 
సిద్ధాంతి గారు చెప్పిన విషయాలే సంజయ్ చెవుల్లో మారుమ్రోగుతూ ఉన్నాయి."రేపు రాబోయే సూర్యగ్రహణం 500 ఏళ్లకు ఒకసారి వచ్చే సంపూర్ణ సూర్య గ్రహణం. ఆ దుష్టాత్మ. మీ రక్త సంబంధీకులలో ఒకరిని ఆవహిస్తుంది. అలా ఆ దుష్టాత్మకి వాహకం అయిన వ్యక్తితో నీ అన్నయ్య తలపడనున్నాడు. అ ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడిలో ఉన్న ఖడ్గం మాత్రమే మీ అన్నయ్యని కాపాడగలదు" అంటూ సిద్ధాంతి గారు చెప్పిన ఒక్కోమాటను మననం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు సంజయ్.
 
***
 
కళ్ళముందర కనిపిస్తున్న సీతను చూసి, ప్రస్తుతంలోకి వచ్చాడు అజయ్. ఇప్పుడు అతనికి తన గత జన్మ అంతా గుర్తు ఉంది.
 
 
"ఏరా నాన్నా! ఏమైంది? మరియా.. మరియా.. అంటూ కలవరించావు? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా?" అంటూ అడిగింది సీత.
 
"ప్రేమించానమ్మా! తనంటే నాకు ప్రాణం. తనకి నేనే లోకం. నాకోసమే.. కేవలం నాకిచ్చిన మాటకొసమే.. తను ఇన్ని జన్మలుగా నాకోసం ఆ అడవిలోనే ఎదురుచూస్తూ ఉంది" అంటూ కన్నీరు పెట్టుకుంటున్న అజయ్ ని దగ్గరకు తీసుకుని
 
"ఏమంటున్నావ్ నాన్నా.. జన్మలుగా వేచి ఉండడం ఏంటి? కల ఏమైనా వచ్చిందా?" అంటూ అనునయంగా అడుగుతోంది సీత.
 
ఇంతలో అజయ్ కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ తో ఈ లోకంలోకి వచ్చాడు అజయ్.
 
ఫోన్ లిఫ్ట్ చేయగానే. " హలో సార్! నేను సెక్యూరిటీ సూర్యం ని మాట్లాడుతున్నా..ఆ సింగా మన వాళ్ళని కొట్టి, అడవిలోకి పారిపోయాడు సార్" అన్నాడు.
 
" ఏం మాట్లాడుతున్నారు? వాడు అసలు కదల లేని పరిస్థితుల్లో పడి ఉంటే ఎలా లేచి పారిపోయాడు?" అంటూ గద్దించాడు అజయ్.
 
"అదే మాకు అర్ధం కావట్లేదు సార్. ఒక్కసారిగా వాడికి ఏదో బలం వచ్చేసింది. వంకర పోయిన చేయ కూడా సరి అయిపోయింది. హాస్పిటల్ లోని స్టాఫ్ ని, నన్ను,మన కానిస్టేబుల్స్ ని కూడా కొట్టేసి, అడవిలోకి పారిపోయాడు సార్!" అంటూ చెప్పాడు సూర్యం.
 
"నేను వస్తున్నా.. " అంటూ అజయ్ లేచి మొహం కడిగేసుకుని, సీత వారిస్తున్నా వినకుండా హ్యాంగర్ కున్న చొక్కా వేసేసుకుని, గన్ తీసుకుని జీప్ ఎక్కి నల్లమల అడవుల వైపు బయలుదేరాడు.
 
అజయ్ కి తోడుగా. అతన్ని అనుసరిస్తూ మరియా కూడా ఉంది. సీత ప్రాణం విలవిలలాడుతోంది.
 
"దేముడా! నా బిడ్డని నువ్వే కాపాడాలి. తలకి గాయం అయినా లెక్క చేయకుండా ఆ క్రూరుడిని పట్టుకునేందుకు వెళ్ళిపోయాడు. ఆ సింగా తో నా కొడుకుకి విరోధం పెట్టావేంటి స్వామీ! విధి ఆడే ఆటకి నేను అలిసిపోయాను. నువ్వే నా బిడ్డని కాపాడాలి మల్లన్నా. " అంటూ ఏడుస్తోంది సీత.
 
ఇంతలో ఆమెకి సంజయ్ ఫోన్ చేసాడు. ఎలాగో ఓపిక తెచ్చుకుని, ఫోన్ లిఫ్ట్ చేసింది సీత.
 
"అమ్మా! నేను బయలుదేరాను. అన్నయ్యకి ఎలా ఉంది ఇప్పుడు?" అని అడిగాడు సంజయ్ డ్రైవింగ్ చేస్తూనే.
ప్రయాణంలో ఉన్న వాడికి ఈ విషయం చెప్తే కంగారు పడతాడని, కన్నీరు బలవంతంగా ఆపుకుని" బానే ఉన్నాడు నాన్నా! మీరు జాగ్రత్తగా రండి" అని చెప్తూ ఉండగానే
 
"అమ్మా! అన్నయ్యని బయటకు పంపకు. ఇవాళ, రేపు వాడ్ని ఇంట్లో ఉండేలా చూడు. నేను వచ్చేస్తున్నా కదా. అంతా నేను చూసుకుంటాను. వాడిని మాత్రం బయటకు వెళ్లనివ్వకుండా ఆపు అమ్మా!" అన్నాడు సంజయ్.
 
"అయ్యో. నీకు ఎలా చెప్పనురా! వాడు పొద్దున్నే వెళ్ళిపోయాడు. అది కూడా చాలా ప్రమాదకారి అయిన సింగా ని పట్టుకోడానికి!" అంటూ కూలబడి ఏడుస్తోంది.
 
 
ఆ మాట విన్న సంజయ్ కార్ ని కంట్రోల్ చేయలేక అదుపు తప్పాడు. ఆ ప్రమాదం లో అతని చేతిలో ఉన్న ఫోన్ కార్ లోనే కింద పడిపోయింది.
 
ఒక్కసారిగా సంజయ్ ఫోను కింద పడిపోయి, పెద్దగా శబ్దం వినిపించేసరికి. సీతకి గుండె ఆగిపోయినంత పని అయింది.
 
"సంజయ్! సంజయ్!” అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంది సీత. ఒక కొడుకు ప్రమాదాన్ని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళి పోయాడు. ఇంకో కొడుకు ఏదో ప్రమాదంలో చిక్కుకుపోయాడు.
 
"భగవంతుడా! నా బిడ్డలు.." అంటూ సొమ్మసిల్లి పడిపోయింది సీత.
 
***సశేషం***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply
#97
(29-08-2025, 08:57 PM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్ - 27



 
పూర్తిగా సూర్యోదయం అయింది.
 
ఆ దుష్టాత్మ బంధనాలు అన్నీ తెంచుకుని, వికటాట్టహాసం చేస్తూ తన పగ తీర్చుకునేందుకు బయలుదేరింది. శ్రీశైలం బయలుదేరిన సంజయ్ ను నీడలా వెంటాడుతూ వస్తూ ఉన్న ఆ దుష్టాత్మ సంజయ్ ను తాకడానికి ప్రయత్నం చేసి, సంజయ్ చేతికి ఉన్న రక్ష వలన అతన్ని తాకగానే నిస్తేజమై నిలబడిపోయింది.
 
సంజయ్ వేగంగా శ్రీశైలం వైపుగా సాగిపోతూనే ఉన్నాడు. ఒక నిమిషం తరువాత కోలుకున్న ఆ దుష్టాత్మ "అయ్యారే! వీనికి ఈ రక్ష ఉన్న కారణం చేత వీడిని నే తాకలేక పోతిని కదా! నేను వేరొక వాహకాన్ని ఎంచుకోవలేనా?” అనుకుంటూ తన దుష్ట శక్తి తో అజయ్ రక్త సంబంధీకులను చూస్తూ వారిలోని ఒకరిని తన వాహకంగా ఎంచుకుని, ఆ దిశగా తన పయనం మొదలు పెట్టింది.
 
***
 
 
సిద్ధాంతి గారు చెప్పిన విషయాలే సంజయ్ చెవుల్లో మారుమ్రోగుతూ ఉన్నాయి."రేపు రాబోయే సూర్యగ్రహణం 500 ఏళ్లకు ఒకసారి వచ్చే సంపూర్ణ సూర్య గ్రహణం. ఆ దుష్టాత్మ. మీ రక్త సంబంధీకులలో ఒకరిని ఆవహిస్తుంది. అలా ఆ దుష్టాత్మకి వాహకం అయిన వ్యక్తితో నీ అన్నయ్య తలపడనున్నాడు. అ ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడిలో ఉన్న ఖడ్గం మాత్రమే మీ అన్నయ్యని కాపాడగలదు" అంటూ సిద్ధాంతి గారు చెప్పిన ఒక్కోమాటను మననం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు సంజయ్.
 
***
 
కళ్ళముందర కనిపిస్తున్న సీతను చూసి, ప్రస్తుతంలోకి వచ్చాడు అజయ్. ఇప్పుడు అతనికి తన గత జన్మ అంతా గుర్తు ఉంది.
 
 
"ఏరా నాన్నా! ఏమైంది? మరియా.. మరియా.. అంటూ కలవరించావు? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా?" అంటూ అడిగింది సీత.
 
"ప్రేమించానమ్మా! తనంటే నాకు ప్రాణం. తనకి నేనే లోకం. నాకోసమే.. కేవలం నాకిచ్చిన మాటకొసమే.. తను ఇన్ని జన్మలుగా నాకోసం ఆ అడవిలోనే ఎదురుచూస్తూ ఉంది" అంటూ కన్నీరు పెట్టుకుంటున్న అజయ్ ని దగ్గరకు తీసుకుని
 
"ఏమంటున్నావ్ నాన్నా.. జన్మలుగా వేచి ఉండడం ఏంటి? కల ఏమైనా వచ్చిందా?" అంటూ అనునయంగా అడుగుతోంది సీత.
 
ఇంతలో అజయ్ కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ తో ఈ లోకంలోకి వచ్చాడు అజయ్.
 
ఫోన్ లిఫ్ట్ చేయగానే. " హలో సార్! నేను సెక్యూరిటీ సూర్యం ని మాట్లాడుతున్నా..ఆ సింగా మన వాళ్ళని కొట్టి, అడవిలోకి పారిపోయాడు సార్" అన్నాడు.
 
" ఏం మాట్లాడుతున్నారు? వాడు అసలు కదల లేని పరిస్థితుల్లో పడి ఉంటే ఎలా లేచి పారిపోయాడు?" అంటూ గద్దించాడు అజయ్.
 
"అదే మాకు అర్ధం కావట్లేదు సార్. ఒక్కసారిగా వాడికి ఏదో బలం వచ్చేసింది. వంకర పోయిన చేయ కూడా సరి అయిపోయింది. హాస్పిటల్ లోని స్టాఫ్ ని, నన్ను,మన కానిస్టేబుల్స్ ని కూడా కొట్టేసి, అడవిలోకి పారిపోయాడు సార్!" అంటూ చెప్పాడు సూర్యం.
 
"నేను వస్తున్నా.. " అంటూ అజయ్ లేచి మొహం కడిగేసుకుని, సీత వారిస్తున్నా వినకుండా హ్యాంగర్ కున్న చొక్కా వేసేసుకుని, గన్ తీసుకుని జీప్ ఎక్కి నల్లమల అడవుల వైపు బయలుదేరాడు.
 
అజయ్ కి తోడుగా. అతన్ని అనుసరిస్తూ మరియా కూడా ఉంది. సీత ప్రాణం విలవిలలాడుతోంది.
 
"దేముడా! నా బిడ్డని నువ్వే కాపాడాలి. తలకి గాయం అయినా లెక్క చేయకుండా ఆ క్రూరుడిని పట్టుకునేందుకు వెళ్ళిపోయాడు. ఆ సింగా తో నా కొడుకుకి విరోధం పెట్టావేంటి స్వామీ! విధి ఆడే ఆటకి నేను అలిసిపోయాను. నువ్వే నా బిడ్డని కాపాడాలి మల్లన్నా. " అంటూ ఏడుస్తోంది సీత.
 
ఇంతలో ఆమెకి సంజయ్ ఫోన్ చేసాడు. ఎలాగో ఓపిక తెచ్చుకుని, ఫోన్ లిఫ్ట్ చేసింది సీత.
 
"అమ్మా! నేను బయలుదేరాను. అన్నయ్యకి ఎలా ఉంది ఇప్పుడు?" అని అడిగాడు సంజయ్ డ్రైవింగ్ చేస్తూనే.
ప్రయాణంలో ఉన్న వాడికి ఈ విషయం చెప్తే కంగారు పడతాడని, కన్నీరు బలవంతంగా ఆపుకుని" బానే ఉన్నాడు నాన్నా! మీరు జాగ్రత్తగా రండి" అని చెప్తూ ఉండగానే
 
"అమ్మా! అన్నయ్యని బయటకు పంపకు. ఇవాళ, రేపు వాడ్ని ఇంట్లో ఉండేలా చూడు. నేను వచ్చేస్తున్నా కదా. అంతా నేను చూసుకుంటాను. వాడిని మాత్రం బయటకు వెళ్లనివ్వకుండా ఆపు అమ్మా!" అన్నాడు సంజయ్.
 
"అయ్యో. నీకు ఎలా చెప్పనురా! వాడు పొద్దున్నే వెళ్ళిపోయాడు. అది కూడా చాలా ప్రమాదకారి అయిన సింగా ని పట్టుకోడానికి!" అంటూ కూలబడి ఏడుస్తోంది.
 
 
ఆ మాట విన్న సంజయ్ కార్ ని కంట్రోల్ చేయలేక అదుపు తప్పాడు. ఆ ప్రమాదం లో అతని చేతిలో ఉన్న ఫోన్ కార్ లోనే కింద పడిపోయింది.
 
ఒక్కసారిగా సంజయ్ ఫోను కింద పడిపోయి, పెద్దగా శబ్దం వినిపించేసరికి. సీతకి గుండె ఆగిపోయినంత పని అయింది.
 
"సంజయ్! సంజయ్!” అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంది సీత. ఒక కొడుకు ప్రమాదాన్ని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళి పోయాడు. ఇంకో కొడుకు ఏదో ప్రమాదంలో చిక్కుకుపోయాడు.
 
"భగవంతుడా! నా బిడ్డలు.." అంటూ సొమ్మసిల్లి పడిపోయింది సీత.
 
***సశేషం***

Very good update Andi!!!

yr): yr): yr): yr):
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#98
నల్లమల నిధి రహస్యం పార్ట్ - 28



"సంజయ్! సంజయ్!” అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంది సీత. ఒక కొడుకు ప్రమాదాన్ని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఇంకో కొడుకు ఏదో ప్రమాదంలో చిక్కుకుపోయాడు.
 
"భగవంతుడా! నా బిడ్డలు.." అంటూ సొమ్మసిల్లి పడిపోయింది సీత. ఒక నిమిషం తరువాత ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చిన మల్లి, సీతను చూసి "అమ్మమ్మా! అమ్మమ్మా! లే.." అంటూ లేపడానికి ప్రయత్నం చేసి, సీత లేవకపోయేసరికి పరుగున వెళ్లి, వాళ్ళ అమ్మని తీసుకువచ్చింది. కమల సీత పరిస్థితి చూసి, మొహంపై నీళ్లు జల్లి, పైకి లేపి కూర్చోబెట్టింది.
 
"ఏమైంది అమ్మా! ఇలా పడిపోయారే? వంట్లో బాగోలేదా? హాస్పిటల్ కి వెళ్దామా? మీ అబ్బాయికి ఫోన్ చేయమంటారా?" అంటూ అడుగుతోంది కమల.
 
 
 
" ఎవరికి చేస్తావమ్మా కమలా! ఒక కొడుకేమో ఆ నీచుడ్ని వెతికి పట్టుకునేందుకు అడవుల్లోకి వెళ్ళి పోయాడు. ఇక్కడికి వస్తున్న నా చిన్న కొడుకు నాతో ఫోన్ మాట్లాడుతూ కారు నడుపుతూ ఉండగా కారుకి ఏదో ప్రమాదం జరిగినట్టు శబ్దం వినిపించిందమ్మా! " అంటూ బోరుమని ఏడుస్తోంది సీత.
 
"అయ్యో! మీరు ఏడవకండి అమ్మా! ఏమీ కాదు. ఉండండి.." అంటూ గబగబా వెళ్లి గ్లూకోస్ కలిపి తెచ్చి, సీతకు బలవంతంగా తాగించింది. సీత కొద్దిగా కోలుకుని సంజయ్ కి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతోంది. సీత గుండె వేగంగా కొట్టుకుంటోంది.
 
"ఫోన్ తియ్యి నాన్నా! సంజయ్.. "అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది సీత. ఒక్కో రింగ్ కీ సీత గుండె ఆగి, ఆగి కొట్టుకుంటోంది.
 
ఆమె మొర దేముడు ఆలకించినట్టు ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో." అంటూ ఒక గొంతు వినిపించింది.
 
సీతకి కన్నీరు రెట్టింపు అయింది.
 
ఆ దేవునికి మనసులోనే వేల వేల నమస్కారాలు తెలుపుకుంది ఆ తల్లి మనసు.
 
"హలో! అమ్మా! హలో.. వినిపిస్తోందా?" అంటూ రెట్టించిన గొంతు విని "చిన్నాడా! నా బంగారు తండ్రీ! నీకేం కాలేదుగా నాన్నా?" అంటున్న ఆ తల్లి గొంతులోని దుఃఖాన్ని అర్థం చేసుకున్న సంజయ్ " అమ్మా. నాకేమి కాలేదు. కార్ కంట్రోల్ తప్పి లారీని గుద్దేయబోయి. నేను టర్న్ తిప్పేసరికి చెట్టును గుద్దేయబోయాను. కానీ ఏదో మాయ చేసినట్టు ఒక్క క్షణంలో బ్రేక్ షార్ప్ గా పడి, తప్పించుకున్నాం" అంటూ చెప్పాడు.
 
" మరి.. ఆ శబ్దం వినే సరికి నీకు ఏమైందో అని.." అంటూ ఆ మాట ఇంక పూర్తి చేయలేక గొంతు పూడుకుపోయింది పాపం ఆ తల్లికి.
 
"అమ్మా! నేను బాగానే ఉన్నాను. మేము మళ్లీ స్టార్ట్ అవుతున్నాం. అన్నయ్య కి ఫోన్ చేస్తూనే ఉన్నాను. వాడి ఫోన్ కలవట్లేదు. వాడు ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కట్టేసైనా సరే! ఇంట్లోనే ఉండేలా చేయి. వాడికి రేపు సూర్య గ్రహణం చాలా ప్రమాదకరం. అదంతా నేను వచ్చాక చెప్తాను. అవును గానీ అమ్మా.. వాడి చేతికి నేను కట్టిన రక్ష ఉంది కదా?" అని అడిగాడు సంజయ్.
 
"ఉంది నాన్నా! కానీ ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు?" అని అడిగింది సీత.
 
"అమ్మా! ఐతే ఇంక కంగారు పడకు. ఆ రక్ష ఉన్నంతవరకూ వాడికి ఏమీ కాదు. నేను సాయంత్రానికల్లా ఇంట్లో ఉంటాను. రేపటి గ్రహణంలోగా నేను వచ్చేస్తాను కాబట్టి, వాడి మీద ఈగని కూడా వాలనివ్వను. నేను వస్తున్నా అమ్మా!" అంటూ ఫోన్ పెట్టేసి, తన పయనం మొదలుపెట్టాడు సంజయ్.
 
అతని మాటలు ఆ తల్లికి ధైర్యాన్ని ఇస్తే అతనే ప్రాణంగా బ్రతుకుతున్న అంజలి మాత్రం తన సంజయ్ కి ఏమవుతుందో అన్న భయంతో బిగుసుకుపోయింది.
అంజలి తల్లి మాత్రం "మనము అసలు శ్రీశైలం చేరుతామా? లేక దారిలోనే కైలాసానికి పోతామా? పోయి పోయి ఇతన్ని కార్ నడపమన్నాను చూడు. దేముడా!"అనుకుంటోంది మనసులో.
 
***
 
ఒక కొడుకు క్షేమంగా ఉన్నాడు అని తెలిసిన ఆ తల్లి కొద్దిగా కోలుకుని దేవుని పటం చూస్తూ "మల్లన్నా! నా బిడ్డలని చల్లగా చూడు స్వామి. చిన్నోడు క్షేమంగా ఇంటికి రావాలి.పెద్దోడికి ఆ సింగా నుంచి ప్రమాదం తప్పాలి." అంటూ మొక్కుకుంటోంది. కమల, ఆమెకు ధైర్యం చెపుతూ సాయంగా కూర్చుంది.
 
***
 
సింగాని వెతుకుతూ దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాడు అజయ్.
 
ఆ అడవి అంతా చూస్తూ ఉంటే అజయ్ కి తన గత జన్మ జ్ఞాపకాలన్నీ.. గత జన్మలో యుద్ధంలో జరిగిన దారుణమైన ఘటనలు ఒక్కొక్కటిగా కళ్ళముందు కదలాడుతున్నాయి.
ఆదివాసి వీరుల, వీరోచిత యుద్ధం.. నరేంద్రుని సేనల కుతంత్రం..ఆనాటి మారణహోమానికి రక్తసిక్తమైన ఆ పచ్చని అరణ్యం, అన్నీ తనకి ఇప్పుడే జరుగుతుందా అన్నట్టుగా. తను చూస్తోంది అంతా నిజమా.. భ్రమా అన్నట్టుగా ఒక విధమైన ఉద్వేగంతో ఉన్న అజయ్ నోటి నుండి. "ఉంగిలియర్! ఉఫిచిట్ హులెకర్! అంగలియా కోచత్! టీజెలక్సవ్.." అంటూ ఆ గత జన్మలో తన మాతృ భాష అయిన ఒకనాటి శక్తి కోయల భాష మాట్లాడుతూ ఉగిపోతున్నాడు.
 
అజయ్ కళ్ళు నీలంగా మారాయి. ఒక్కసారిగా వాతావరణం అంతా భయంకరంగా మారిపోయింది. నల్లటి మబ్బులు ఆకాశాన్ని కప్పేసాయి. ఈదురు గాలులతో ఆ అరణ్యం అత్యంత భయానకంగా మారిపోయింది. దానికి తోడు నక్కల ఏడుపు ఇంకా భయంకరంగా వినిపిస్తోంది. ఉద్వేగంతో ఉగిపోతున్న అజయ్ వెనకనే నీడగా నిలబడి వికృతంగా నవ్వుతోంది సింగా ని ఆవహించిన దుష్టాత్మ.
 
***సశేషం***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 9 users Like k3vv3's post
Like Reply
#99
వెనకున్న ప్రమాదాన్ని గుర్తించలేదా అజయ్...మల్లి ఎక్కడ?
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
Very nice update
[+] 1 user Likes King1969's post
Like Reply




Users browsing this thread: