15-04-2025, 11:00 AM
Please update...
Any interest girls or auntys Massage me in ,.,...id..@V_chanduy
Any interest girls or auntys Massage me in ,.,...id..@V_chanduy
Adultery బావ నచ్చాడు (Completed)
|
15-04-2025, 11:00 AM
Please update...
Any interest girls or auntys Massage me in ,.,...id..@V_chanduy
15-04-2025, 12:32 PM
Episode - 18
మరుసటిరోజు ఉదయం స్పందన లేట్ గా లేచింది. టైం తొమ్మిది అయింది. బయటకి వచ్చింది. ఇంట్లో ఎవ్వరు కనిపించలేదు. అంతా సైలెంట్ గా ఉంది. అక్క అమ్మ ఎక్కడికి వెళ్లారు అని చెప్పి ఇల్లంతా చూసింది. ఖాళీగా ఉంది. పొద్దున్నే ఎటెళ్లి ఉంటారు అని అనుకుంది. సరిగ్గా అప్పుడే గుర్తొచ్చింది. ఆరోజు వాళ్ళ అపార్ట్మెంట్ లో కింద మొబైల్ కూరగాయల వాన్ వస్తుంది. బహుశా కిందకి వెళ్లారు అని అనుకుంది. స్విచ్ ఆఫ్ అయిపోయిన తన ఫోన్ ఛార్జింగ్ కి పెట్టి బాత్రూం లోకి వెళ్ళింది ఫ్రెష్ అవుదామని. నోట్లో బ్రష్ పెట్టుకుని అద్దంలో చూస్తూ బ్రష్ చేసుకుంటోంది. కానీ మనసులో అలజడి ఏమి తగ్గలేదు. ఇంకా నిర్ణయానికి రాలేదు. కిట్టు తో జీవితం ఎలా ఉంటుందా అని ఆలోచిద్దాము అనుకున్న ప్రతిసారి అక్క జీవితం గుర్తొచ్చింది. అయినా అంత త్వరగా కిట్టు మనసు మార్చేసుకుంటాడా? అలా అక్క విషయంలో మార్చేసుకుంటే తన విషయంలో మార్చుకోడు అని గారంటీ ఏంటి? ఆ ఆలోచన వస్తేనే భయం వేసింది. ఇంతలో ఫోన్ మోగింది. టింగ్ టింగ్ టింగ్ అని మెసేజ్ లు కూడా వస్తున్నాయి. ఫోన్ అయినట్టుంది అనుకుని వచ్చి ఫోన్ చూసింది. సమీర నుంచి మెసేజెస్ ఉన్నాయి. నేను అమ్మ కూరగాయలు కొనడానికి వెళ్తున్నాము. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని తెలుసు. కానీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. వెయిటింగ్. అక్క మెసేజ్ చూసాక స్పందన కి ఇంకా టెన్షన్ పెరిగింది. ఏమి చెప్పాలి రా దేవుడా. ఒక సరి కిట్టుతో మాట్లాడాలి అనుకుంది. కిట్టుకి మెసేజ్ చేసింది. లేచావా? కాల్ చేయనా? ఏమి రిప్లై రాలేదు. ఇంకా వెయిటింగ్ ఎందుకు అని తానే ఫోన్ చేసింది. కిట్టు ఫోన్ ఎత్తలేదు. వీడెంటి పడుకున్నాడు అనుకుంది. అయినా అర్జెంటు విషయం కాబట్టి మళ్ళీ ఫోన్ చేసింది. ఈసారి ఎత్తాడు. స్పందన: బిజీ ఆ? కిట్టు: మా నాన్న కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాసిపిటల్ లో ఉన్నాము. నేను మళ్ళీ చేస్తాను. స్పందన కి చేతులు కాళ్ళు వోణికాయి. ఇదేంటి? ఇలా ఎలా జరిగింది అని చెప్పి భయపడింది. వెంటనే అక్కకి ఫోన్ చేసి చెప్పింది. సమీర సరోజ వెంటనే పరిగెత్తుకుంటూ పైకి వచ్చారు. సమీరా: ఏమైంది? స్పందన: నేను కాల్ చేసాను. అప్పుడు చెప్పాడు. కాంటినెంటల్ హాస్పిటల్ లో ఉన్నారంట. సరోజ: పది నిమిషాలలో రెడీ అవ్వండి. వెళదాము. స్పందన కి పికెక్కతుతోంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? నాలుగు రోజుల క్రితం వరకు అంత బాగానే ఉంది. ఉన్నట్టుండి ఇదంతా జరుగుతోంది. అక్క సమీర మీద కోపం వచ్చింది. కానీ అక్క మీద కోపం చూపడానికి ఇది సమయం కాదు అని ఊరుకుంది. పది నిమిషాలలో ముగ్గురు ఎవరి రూమ్ లోకి వారు వెళ్లారు. స్నానాలు చేసి రెడీ అయి వచ్చారు. ఇద్దరు కూతుళ్ళకి మైండ్ బ్లాక్ అయింది అని అర్థం అయినా సరోజ తానే డ్రైవ్ చేసింది. గంటలో గచ్చిబౌలి చేరారు. హాస్పిటల్ కి వెళ్లి వెయిటింగ్ ఏరియా కి వెళ్లారు. అక్కడ కిట్టు వాళ్ళ అమ్మ రాజమ్మ ఉంది. సరోజ: నమస్తే వదినగారు. ఎలా ఉంది? రాజమ్మ: ICU లో పెట్టారు వదినగారు. ఇంకా ఏమి చెప్పలేదు. సరోజ: అసలు ఏమి జరిగింది. రాజమ్మ: పొద్దున్నే వచ్చాము అమ్మ. రాగానే కిట్టు ఈ పెళ్లి కాన్సల్ చెయ్యాలి అని చెప్పాడు. ఎందుకు రా అంటే వాడికి అమ్మాయి నచ్చలేదు అని చెప్పాడు. ఆయనకి కోపం వచ్చి అరిచాడు. అమ్మాయి తో తనకి సైనిక్ కుదరలేదు అని ఏంటేంటో చెప్పాడమ్మా. సరోజ స్పందన సమీర మొహాలు చూసుకున్నారు. సమీర లో కళ్ళలోంచి నీళ్లు వచ్చేసాయి. ఇదంతా తన వల్లనే అన్న బాధ తనని దహించేస్తోంది. అక్కని అలా చూసి స్పందన అక్క భుజం మీద చెయ్యి వేసి నీళ్లు ఇచ్చింది. రాజమ్మ: ఇలా అడుగుతున్నాను అని ఏమి అనుకోకు అమ్మ. అడగకూడదు అని తెలుసు కానీ తప్పట్లేదు. నీకు మా అబ్బాయికి ఎమన్నా గొడవలు అయినాయా? సమీర ఏమి అనలేదు. ఏడుస్తోంది. రాజమ్మ: ఎంత గొడవలు అయినా ఇలా పెళ్లి రద్దు చేయడం ఏంటమ్మా? ఆడపిల్ల ఉసురు తగిలితే మంచిది కాదు. ఇలానే అవుతుంది. నా కొడుకు తరపున నన్ను క్షమించు తల్లి అని రెండు చేతులు జోడించింది. సమీరా బిగ్గరగా ఏడిచింది. వెంటనే సరోజ కలుగచేసుకుంది. కిట్టు అమ్మ రాజమ్మ చదువుకోలేదు. కిట్టు నాన్న రిటైర్ అయిపోయిన టీచర్. ఉదయం పూట పదెకరాల మావిడి తోటకి వెళ్లి రావడం. మధ్యాహ్నం రిలాక్స్ అవ్వడం. పేద పిల్లలకి చదువు చెప్తూ సాయంత్రం కాలక్షేపం చేయడం. తిండి కి ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళ ఇంట్లోనే వంట చేసి పెడుతూ భర్తకి సహాయం చేయడం. ఇదే ఆవిడకి తెలుసు. అంతే. అలాంటి మనిషి కొడుకు ఇలా చేస్తున్నాడు అంటే జీర్ణించుకోలేకపోయింది. సరోజ: ఇప్పుడు అంత పెద్ద మాటలు వద్దు వదినగారు. మనము దీని గురించి తరువాత మాట్లాడుదాము. కానీ కిట్టు తప్పు లేదు. తప్పు మా అమ్మాయిదే. రాజమ్మ కి అర్థం కాలేదు. తెల్ల మొహం వేసి చూసింది. స్పందన ఖంగారుగా తల్లి వైపు చూసింది. అక్క మెడికల్ కండిషన్ గురించి చెప్పేస్తుందేమో అని. కానీ సరోజ చెప్పలేదు. సరోజ: మా అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదు. అందుకే కిట్టు మీరు బాధ పడకూడదు అని అలా చెప్పాడు. రాజమ్మ: అదేంటమ్మా. నాకు అర్థం కావట్లేదు. సరోజ: చెప్పను కదా. మీరు అవన్నీ ఆలోచించకండి. మనము తరువాత మాట్లాడుదాము. ముందు అన్నయ్యగారు కోలుకోవాలి. స్పందన సమీరని తీసుకుని పక్కకి వెళ్ళింది. సమీర: అంతా నా వల్లే. (వెక్కి వెక్కి ఏడుస్తోంది) స్పందన: నీ వాళ్ళ కాదు. అయన మొదటి నుంచి హార్ట్ పేషెంట్ అక్క. ఇది రెండోసారి ఆయనకి ఎటాక్ అవ్వడం. నీ మీద వేసుకోకు తప్పుని. సమీరా: కానీ ట్రిగ్గర్ అయింది నా వల్లే కదా. స్పందన కి తెలుసు అక్క అనేది నిజమని. కానీ బాధ పడుతుంది అని ఎదో సముదాయించే ప్రయత్నం చేస్తోంది. ఇంతలో కిట్టు వచ్చాడు. అందరు వాడి దెగ్గరికి వచ్చారు. సరోజని పలకరించి కళ్ళకి దణ్ణం పెట్టాడు. సమీరని చూసి చిన్నగా తలా ఊపాడు. స్పందన మొహంకేసి చూసాడు కానీ ఏమి మాట్లాడలేదు. కిట్టు మొహం పీక్కుపోయింది. రాత్రంతా నిద్రపోలేదు అని తెలిసిపోతోంది. సరోజ: ఎలా ఉంది బాబు. డాక్టర్లు ఏమన్నారు. కిట్టు: కళ్ళు తెరిచారు. ICU లోనే ఇంకా రెండు మూడు రోజులు ఉంచాలి అన్నారు. స్ట్రెస్ పడకూడదు అని చెప్పి. ఒకళ్ళు మాత్రమే వెళ్లుచు.అమ్మ నువ్వు వెళ్ళు. రాజమ్మ ICU కి వెళ్ళింది. ఇంతలో కిట్టు అక్కడ కుర్చీల కూర్చున్నాడు. సరోజ: ఎందుకు బాబు అలా అబద్ధం చెప్పావు? కిట్టు: తప్పలేదు అండి. మా అమ్మ నాన్నకి చెప్పిన అర్థం కాదు. అయినా మెడికల్ కండిషన్ అందరికి చెప్పుకునేది కాదు కదా. నేను ఒకటి చెప్పి వాళ్ళకి ఇంకోటి అర్థం అయ్యి అటొచ్చి ఇటొచ్చి ఏదోకటి అంటే కష్టం. అందుకే. సరోజ: మరి నీ మీద చెడ్డ ఒపీనియన్ వస్తుంది కదా. కిట్టు: అమ్మ నాన్న కదండీ. క్షమించేస్తారు. నేను వాళ్ళకి మెల్లిగా నచ్చచెప్తాను. సరోజ: మీ నాన్నగారు టీచర్ కదా. ఆయనకి అయినా నిజం చెప్పాల్సింది. కిట్టు: ఊర్లో పుట్టి అక్కడే పెరిగిన మనిషి. నిశ్చితార్ధం అయితే పెళ్లి అయినట్టే. ఇలా మెడికల్ రీసన్ అని చెప్పి పెళ్లి కాన్సల్ అంటే ఒప్పుకోరు. పెళ్లి చేసుకుని ట్రీట్మెంట్ ఇప్పించమని అంటారు. కానీ అలా చేస్తే కొన్నాళ్ళయ్యాకా పిల్లలు అది అని గోల మొదలవుతుంది. అందుకే, ఇప్పుడు కట్ చేసేస్తే అయిపోతుంది. సరోజ సైలెంట్ గా ఆలోచించింది. కిట్టు లాజిక్ అర్థం అయింది. కానీ ఇదొక్కటే మార్గమా? ఏమో? కిట్టు: కానీ మా నాన్న హైపర్ అవుతారని నేను ఊహించలేదు. అదొక్కటే అనుకోకుండా జరిగింది. సమీర: సారీ కిట్టు. కిట్టు సమీర వైపు చూసాడు. ఏడుస్తోంది. కిట్టు: ఏడవకండి. మీ నిర్ణయం తప్పు కాదు. చెప్పిన టైం కలిసిరాలేదు. అంతే. దీనికి కారణం మీరు కాదు. సరోజ సమీర చెయ్యి పట్టుకుంది. కిట్టు: పెళ్లి కాన్సల్ చేసేద్దాము ఆంటీ. మా అమ్మ నాన్న గురించి ఖంగారు పడకండి. వాళ్లకి కావాల్సింది నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. నేను హాపీగా ఉంటానో లేదో తెలీదు కానీ వాళ్ళకి కావలసినట్టు పెళ్లి చేసుకుని వాళ్ళని హ్యాపీగా ఉంచగలను అని నమ్మకం నాకుంది. మీరు వర్రీ అవ్వకని. ఇంటికెళ్ళండి. ఇక్కడ ఉంది చేసేది కూడా లేదు. డిశ్చార్జ్ అయ్యాక చెప్తాను. ఒకసారి వచ్చి చూడచ్చు. ఈలోగా రాజమ్మ వచ్చింది. కళ్ళల్లో నీళ్లు. కుర్చీలో కూర్చుంది. కిట్టు వెళ్లి పక్కనే కూర్చున్నాడు. రాజమ్మ: మాట్లాడుతున్నారు. నీతో మాట్లాడాలి అంటున్నారు. కిట్టు మళ్ళీ లోపలి వెళ్ళాడు. సరోజ: ఏడవకండి వదినగారు. ఏమి కాదు. రాజమ్మ: వాడి పెళ్లి అయిపోతే మాకు ఏమైనా పర్లేదు అమ్మ. వాడు వాడి భార్య ఒకరికి ఒకరు తోడు ఉంటారు. ఇప్పుడు కూడా అయన మీకు సారీ చెప్పమంటున్నారు. సరోజకి బాధేసింది. పెద్ద కూతురు ఏడుస్తోంది. చిన్న కూతురు ఓదారుస్తోంది. ఇంత మంచి కుటుంబాన్ని బాధ పెట్టాము అని బాధ ఉంది సరోజకి. కాకపోతే తన కూతుర్ని ఏమి అనలేని పరిస్థితి. దీర్ఘాలోచనలో పడింది. **** ముగ్గురు ఇంటికి వచ్చారు. సమీర బాధతో లోపలికి వెళ్ళింది. స్పందన లోపలి వెళ్ళబొయింది. సరోజ: స్పందన. నీతో మాట్లాడాలి. స్పందన: నీ పీక మీద కత్తి పెట్టి నిన్ను పెళ్ళికి ఒప్పించాలి అని కాదు. వాళ్ళది నిజంగా మంచి ఫామిలీ. అక్క చెప్పింది ఆలోచించు. స్పందన: అమ్మ నువ్వు కూడా ఏంటి? సరోజ స్పందన పక్కన కూర్చుంది. సరోజ: అక్క కాన్సల్ చేసింది అని నిన్ను బలివ్వడానికి అడగట్లేదు. అక్క నిన్ను అడిగిన టైం పద్ధతి అలా అనిపించి ఉండచ్చు. కానీ నా ఉద్దేశం మాత్రం అది కాదు. అక్క పెళ్లి చేసుకునే మానసిక స్థితిలో లేదు. ఆ పెళ్లి కాన్సల్ అయిపోయినట్టే. కాకపోతే ఆ కుటుంబం, ఆ అబ్బాయి నిజంగా చాల మంచివారు. నాకు నచ్చారు. అక్క జీవితం గురించి నువ్వు ఆలోచించకు. నేను చూసుకుంటాను. కానీ నువ్వు కూడా నా కూతురివే. నీ పెళ్లి కూడా నా బాధ్యతే. అందుకే అడుగుతున్నాను. స్పందన తల్లి మొహంలోకి చూసింది. సరోజ చాలా శాంతంగా ఉంది. తల్లి అంతా శాంతంగా మాట్లాడుతోంది అంటే చాలా క్లారిటీ తో ఉందని అర్థం. అందుకే స్పందన వింటోంది. సరోజ: అక్క చేసుకోవట్లేదు. పెళ్లి కాన్సల్ చేసి వదిలేయచ్చు. కానీ నువ్వు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటె చొన్సిదెర్ చేయమంటున్నాను. తల్లి చెప్పిన మాటలు విని రూమ్ లోకి వెళ్ళిపోయింది. రెండు రోజులు గడిచాయి. ఆరోజు సాయంత్రం కిట్టు తండ్రిని డిశ్చార్జ్ చేశారు. కలవడానికి ఇంటికి వెళ్లారు సరోజ ఇంకా పిల్లలు. రాజమ్మ స్పందన ఇంక సమీరతో మాట్లాడుతోంది. సరోజ: నీతో ఒకసారి మాట్లాడాలి బాబు. కిట్టు: చెప్పండి ఆంటీ. సరోజ: ఇది సరైన సమయం కాదు అని తెలుసు. కానీ అడగాలి. నీకు స్పందనని చేసుకోవడానికి ఎమన్నా అభ్యంతరం వుందా? కిట్టు: అదేంటండి? సరోజ: నాకు నువ్వు మీ కుటుంబం బాగా నచ్చారు. సమీర విషయం అనుకోనిది. కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలి ఎవరైనా పర్లేదు అంటున్నావు. నేను నా కూతురు అయితే బావుంటుంది అని అడుగుతున్నాను. కిట్టుకి సంకోచం. ఇలాంటి టైం లో వెయిట్ చేసి ఇంట్లో వారిని ఇంకా వెయిటింగ్ లో పెట్టాలా? లేక పెళ్లి చేసుకుని ముందు వారిని సంతోషపరచాల. సరోజ: తప్పొప్పులు ఆలోచించకు. నువ్వు ఏమి తప్పు చెయ్యట్లేదు. ఒక సంబంధం తప్పితే ఇంకో సంబంధం అన్నావు. అలానే అనుకో. అయిదు నిమిషాలు ఆలోచించాడు. లోపల పడుకుని ఉన్న తండ్రిని చూసాడు. బాల్కనీలో మాట్లాడుతున్న తల్లిని చూసాడు. తనతో పెళ్లిని కాన్సల్ చేసుకున్న సమీర ని చూసాడు. ఆ పక్కనే పసుపు పచ్చ చుడిదార్ ఎర్రటి చున్నీ వేసుకుని జడ వేసుకుని ఉన్న స్పందనని చూసాడు. అలానే ఒక రెండు మూడు నిమిషాలు చూసాడు. తన హావభావాలు గమనించాడు. కొంచం డల్ గా ఉంది. తాను కూడా స్ట్రెస్ లో ఉంది. కిట్టు: స్పందనని అడిగారా? సరోజ: అడిగాను. ఇంకా సమాధానం చెప్పలేదు. ఆలోచించమన్నాను. అందుకే నిన్ను కుడి అడుగుతున్నాను. ఒకసారి దానితో మాట్లాడతాను అంటే చెప్పు. మీ అమ్మగారితో నేను మాట్లాడతాను. కిట్టు: నేను ముందు స్పందనతో మాట్లాడాలి. ఆ తరువాతే మా అమ్మతో అన్నాడు. సరోజకి చిన్న ఆశ చిగురించింది. సరోజ: సరే. మీ ఇష్టం. సరోజ కిట్టుతో మాట్లాడటం స్పందన గమనించింది. తల్లి ఏమి అంటోంది అని కుతూహలంగా ఉంది. అదే సమయంలో కిట్టు తల్లి అయినా రాజమ్మతో మాట్లాడుతుంటే స్పందనకి ఎదో తెలియని ఒక మంచి ఫీలింగ్. ఆవిడ అమాయకత్వం, మంచితనం, భోళాతనం, కల్మషంలేని మాటలు బాగా నచ్చాయి. తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అవును చాల మంచి మనుషులు అనుకుంది. ముగ్గురు రాత్రికి ఇంటికి చేరుకున్నారు. సరోజ ఇద్దరు కూతుళ్ళని కూర్చోబెట్టి కిట్టుతో మాట్లాడింది చెప్పింది. సమీర తల్లివైపు మమకారంగా చూసింది. తనని తల్లి అర్థం చేసుకుంటుంది అని తెలుసు. ముందే చెప్పుంటే బహుశా విషయం ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కాదేమో. కానీ ఏమి చేస్తాము, అందరు తప్పులు చేస్తారు. తన వాళ్ళ జరిగిన పొరపాటు ఇది. స్పందన: మరి అక్క సంగతి ఏంటి? సరోజ: అక్కకి ఏమి కాదు. అక్కకి మనము అందరమూ ఉన్నాము. ఏమి కాదు. స్పందన: అలా కాదమ్మా. సరోజ: చూడు చిన్న తల్లి. సరోజ ఎప్పుడైనా ఇద్దరి పిల్లలకి బాగా నచ్చజెప్పేడప్పుడు అలా పెద్ద తల్లి చిన్న తల్లి అని పిలుస్తుంది. సరోజ: అక్కకి ఏమి కాదు. ఇలాంటి మెడికల్ కండిషన్ తగ్గాలి అంటే స్ట్రెస్ ఉండకూడదు. పెళ్లి చేసుకుంటే ఎంత కాదన్నా స్ట్రెస్ ఉంటుంది. లైంగికంగా ఎప్పుడోకప్పుడు కలవాలి. అలాంటి పరిస్థితులు వస్తాయి. మీరు చిన్న పిల్లలు కాదు. అందుకే చెప్తున్నాను. రొమాన్స్ అనేది ఉంటుంది. అలాంటి సమయంలో మన మనసు అండ్ బాడీ రియాక్ట్ అవుతాయి. అది ఒకరికి అయ్యి ఇంకొకకిరికి అవ్వకపోతే ఇబ్బంది. అందుకే, అక్క ఎప్పుడు అయితే పెళ్ళికి రెడీ అవుతుందో అప్పుడే చేసుకుంటుంది. ఈలోగా దాని ఇష్టం. అలాగే నీకు ఇష్టం లేకపోతే చెయ్యను. కానీ అక్క ఏమనుకుంటుందో, అక్కకి అన్యాయం చేస్తానేమో అని పిచ్చి ఆలోచనలు వద్దు అంటున్నాను. కిట్టుతో మాట్లాడు. నిర్ణయం చెప్పు. నేను చేయాల్సింది అప్పుడు చేస్తాను. ముగ్గురు ఎవరి రూమ్ లోకి వారు వెళ్లిపోయారు. ఇంకా ఉంది.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)
15-04-2025, 12:34 PM
(15-04-2025, 11:00 AM)Chchandu Wrote: Please update... బాబు నీకో దండం. ఇక్కడ స్పాం చెయ్యకు. ఇది స్టోరీ ప్లాట్ఫారం. ఇంతక ముందు కూడా ఇలాంటివే పెట్టారు మీరు. కథలు చదవండి, కుదిరితే కామెంట్స్ పెట్టండి.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)
15-04-2025, 12:35 PM
(13-04-2025, 12:35 AM)prash426 Wrote: మీలో ఒక్క గొప్పా రచయిత ఉన్నాడు sir.... excellent update Thank you andi! ![]()
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)
15-04-2025, 02:42 PM
Superb update fabulous thanks, but asala expect cheyaledhu e lopu kittu intlo chepe intha serious ayudhe anne morning lopu spandhana samera answer chepudhe emo anukunte inko la rachincharu meru superb
15-04-2025, 02:48 PM
Naku oka doubt undhe , kittu valla oka family vide poyaru ah ammaye kuda ebandhilo hospital lo unnaru kadha valla character mugalisinatte na ah papa kane kittu vallatho malle spandhicha ledha
15-04-2025, 03:16 PM
(15-04-2025, 02:48 PM)Manoj1 Wrote: Naku oka doubt undhe , kittu valla oka family vide poyaru ah ammaye kuda ebandhilo hospital lo unnaru kadha valla character mugalisinatte na ah papa kane kittu vallatho malle spandhicha ledha కేరక్టర్స్ గుర్తుంచుకుని అడుగుతుంటే చాల హ్యాపీగా ఉండండి మనోజ్ గారు. ఆ ఎఫైర్ పెట్టుకున్న ఆవిడ ప్రస్తుతానికి కిట్టుతో టచ్ లో లేదు. ఆవిడని marala మనవాడు లైఫ్ లోకి తేవాలి అంటే ఫండమెంటల్ గా కేరక్టర్స్ ని కొంచం చేంజ్ చెయ్యాలి. స్టోరీ టోన్, టోనాలిటీ, అన్ని మారిపోతాయి. మిగతా మిత్రులు అందరు కూడా కోరితే అప్పుడు పార్ట్ 2 కింద ఆలోచించవచ్చు.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)
15-04-2025, 04:12 PM
Wahh, emanna rasara, oka trance loki vellinattundhi..
15-04-2025, 06:27 PM
(15-04-2025, 12:32 PM)JustRandom Wrote: Episode - 18చాలా బాగా వర్ణించారు sir.......... స్టోరీ లో ఈ ట్విస్ట్ ఎవరము కూడా ఊహించలేదు....... But హీరో క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అ సాఫ్ట్ కార్నర్. Wetting for suspense. కాకపోతే ఈ స్టోరీ లో " అంగీకారం " మాత్రం తెలియడం లేదు.
15-04-2025, 07:05 PM
(15-04-2025, 04:12 PM)Mahesh12 Wrote: Wahh, emanna rasara, oka trance loki vellinattundhi.. I am so glad andi. Mee andarini ilaane entertain cheyyali ani anukuntunnanu.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)
15-04-2025, 07:06 PM
(15-04-2025, 06:27 PM)ALOK_ALLU Wrote: చాలా బాగా వర్ణించారు sir.......... ఇంకా కథ ఉంది మిత్రమా. అంగీకారం వస్తుందో లేదో చుడండి.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)
15-04-2025, 10:05 PM
Nice update bro
|
« Next Oldest | Next Newest »
|