24-02-2025, 03:44 PM
బ్రో మంచి రసపట్టులో ఆపేసారు...జాబిల్లి కవిత బావుంది...అంతే కదా, మనం చేసినవాటికి మనమే జవాబివ్వాలి ఎప్పటికైనా...
:
:ఉదయ్


Thriller నల్లమల నిధి రహస్యం - 11
|
24-02-2025, 03:44 PM
బ్రో మంచి రసపట్టులో ఆపేసారు...జాబిల్లి కవిత బావుంది...అంతే కదా, మనం చేసినవాటికి మనమే జవాబివ్వాలి ఎప్పటికైనా...
:
![]() ![]()
26-02-2025, 06:59 AM
08-03-2025, 10:13 AM
(This post was last modified: 08-03-2025, 10:14 AM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
నల్లమల నిధి పార్ట్ -7
' 7' రచన : రమ్య నముడూరి మీ నాన్నగారి స్టేషన్ లోనే దండలు మార్చుకుని, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. అది మా నాన్నకి ఇష్టంలేక, మమల్ని ఇంట్లోకి రానివ్వలేదు. అలా నెలలు గడిచిపోయాయి. అప్పుడే.. నేను వినకూడని ఒక మాట విన్నాను. అదేంటంటే.. మా నాన్న, నల్లమల అడవిలో దాగి ఉన్న నిధి కోసం ఎవరో ఒక అనాధ పిల్లాడిని బలి ఇచ్చాడని, కాటికాపరి సాయంతో,ఆ హత్యను సహజ మరణం గా చిత్రీకరించాడని, అందుకు సాయం చేసిన కాటికాపరి చనిపోయి ఉన్నాడని మీ నాన్నగారి ద్వారా తెలిసింది.. అది విన్న నేను అక్కడికక్కడే కూలబడిపోయాను. నన్ను ఎలాగో సముదాయించి, మా నాన్నను అరెస్ట్ చేయడం కోసం చాలా చోట్ల వెతికారు. ఎంత వెతికినా వాళ్ల ఆచూకీ దొరకలేదు. ఆ కేసు మీదే పనిచేస్తూ, ఒక ఏడాది కాలం శ్రీశైలంలోనే ఉన్నాము. తరువాత అక్కడ నుండి విజయనగరం ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడే మీ ఇద్దరూ ఒకేసారి నా కడుపున పడ్డారు.. మీ రహస్యం ఇద్దరినీ కన్న సంతోషం లో రోజులు ప్రశాంతంగా సాగిపోతున్న వేళ మీ నాన్నగారికి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడకి రావడం అవన్నీ మీకు తెలుసుగా.. మీ ఇద్దరూ బాగా చదువుకోవడంతో చీకు చింత లేకుండా హాయిగా 15 ఏళ్ళు గడిచిపోయాయి . ఇద్దరూ డిగ్రీలు పూర్తిచేసే టైంకి, స్పెషల్ ఆపరేషన్ పేరుతో. స్పెషల్ ఫోర్స్ గా నల్లమలలో జరిగిన కూంబింగ్ లో మీ నాన్నగారికి డ్యూటీ పడడం,ఆ మారణకాండలో మనము ఆయన్ని కోల్పోవడం అన్నీ జరిగిపోయాయి. ఆ నల్లమల అడవుల్లోనే నా తండ్రి అదృశ్యం అయిపోయాడు. అక్కడే నా భర్త కూడా బలైపోయాడు.. " అంటూ సీత వెక్కి వెక్కి ఏడవసాగింది.. "వద్దు అమ్మా ఏడవకు. ఇప్పుడు నాకూ అక్కడకి ట్రాన్స్ఫర్ అయిందని, నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతున్నావ్! అవునా?" అన్నాడు అజయ్.. అవునన్నట్టు తల ఊపింది సీత. "అమ్మా! ఎప్పుడో ఏదో అయింది అని, ఇప్పుడు కూడా అవుతుంది అని అనుకోకు. నాన్న పోయిన తరువాత, మనల్ని ఆదుకుంది ఆయన నుండి వచ్చిన ఈ సెక్యూరిటీ అధికారి జాబ్ కదా. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను జాబ్ లో చేరాను కనక, తమ్ముడైనా వాడు కోరుకున్న చదువు చదువుకోగలిగాడు. మంచిగా సెటిలయ్యాము. ఇది మనల్ని కాపాడే జాబ్ అమ్మా! అనవసరంగా నువ్వు భయపడి ఆరోగ్యం పాడు చేసుకోకు" అంటూ తల్లికి ధైర్యం చెప్పాడు అజయ్. "సరే నాన్నా! రండి టిఫిన్ చేద్దురుగానీ.." అంటూ కళ్ళు తుడుచుకుని, కిచెన్ లోకి వెళ్ళింది సీత. " ఒరేయ్ అన్నయ్యా! అమ్మ ఎన్నాళ్ళనుంచి ఇంత బాధ పడుతోందో.. ఏదేమైనా ఇవాళ తన బాధ బయటపెట్టింది. నువ్వు తనని నీతో తీసుకెళ్తా అన్నావ్ కదా. నేను అక్కడికి ఇంకో ఫైవ్ డేస్ లో వస్తాను.. ఒక త్రీ డేస్ ట్రిప్ మాది. నల్లమల అడవుల్లో ట్రెక్కింగ్.. మా స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ తో వచ్చి, వెళ్ళేటప్పుడు అమ్మని మళ్ళీ ఇక్కడికి తీస్కొచ్చేస్తాను. ఒకవేళ అమ్మ అక్కడ కొన్ని రోజులు నీతో ఉంటాను అంటే నేనొక్కడిని తిరిగి వస్తాను. అమ్మకి ఎలా అనిపిస్తే అలా చేద్దాం" అన్నాడు సంజయ్.. "అలాగేరా.." అన్నాడు అజయ్. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే టిఫిన్ తెచ్చింది సీత. కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురూ టిఫిన్ చేశారు.. సంజయ్ కాలేజీకి వెళ్ళిపోయాడు.అజయ్ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. కళ్ళు మూసుకుని,షవర్ కింద నుంచుని రాత్రి వచ్చిన కల గురించి, ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాడు.. ఇంతలో వెనక నుండి వచ్చి తనని గట్టిగా హత్తుకుని " ఏయ్! దొరికేసావ్ మార్తాండా..ఈ కోలకళ్ళ కోయ పిల్ల కౌగిలికి చిక్కేసావ్.. " అంటూ కిల కిలా నవ్వుతున్నట్టు అనిపించి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసాడు అజయ్. అక్కడ ఎవరూ లేరు. ఏంటిది.. ఇలా అనిపిస్తోంది రాత్రి నుంచి.. అనుకుంటూ ఎలాగో స్నానం చేసి, బయటకు వచ్చాడు అజయ్. మనసంతా ఏదో తెలియని అలజడి..తనకి జరుగుతున్నది ఎవరికీ చెప్పుకోలేక, అలాగని దాని గురించి ఆలోచన మానలేక పిచ్చి పట్టేస్తోంది అతనికి. తల్లికి చెప్పుకుందామంటే అసలే తను ట్రాన్స్ఫర్ విషయం గా టెన్షన్ పడిపోతోంది.. తమ్ముడా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఒకవేళ చెప్పినా, వాడు నమ్ముతాడో.. నమ్మడో.. ఇలా ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. ***సశేషం***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
08-03-2025, 09:05 PM
13-03-2025, 01:49 PM
నల్లమల నిధి రహస్యం పార్ట్ -8
' 8' రచన : రమ్య నముడూరి మనసంతా ఏదో తెలియని అలజడి. తనకి జరుగుతున్నది ఎవరికీ చెప్పుకోలేక, అలాగని దాని గురించి ఆలోచన మానలేక పిచ్చి పట్టేస్తోంది అతనికి. తల్లికి చెప్పుకుందామంటే అసలే తను ట్రాన్స్ఫర్ విషయం గా టెన్షన్ పడిపోతోంది. తమ్ముడా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఒకవేళ చెప్పినా వాడు నమ్ముతాడా ? ఇలా కాదు అని కాసేపు టీవీ చూద్దాం అని హాల్ లోకి వెళ్లి, టీవీ ఆన్ చేసి, న్యూస్ ఛానల్ పెట్టి, న్యూస్ చూస్తూ ఉన్నాడు. సీత, రాత్రి ప్రయాణం కోసం అన్నీ సర్దుకుంటోంది. వారం రోజుల పైగానే ఇంట్లో తను ఉండదు కాబట్టి, సంజయ్ కి ఇబ్బంది కలగకుండా దోసెల పిండి కోసం రెడీ చేస్తూ, గోంగూర పచ్చడికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త ప్లేస్ కి వెళ్ళగానే ఇబ్బంది కలగకుండా కొన్ని కారం పొడులు, పచ్చళ్లు సర్దుకుంటోంది. ఇద్దరు కొడుకులకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ బిజీ గా ఉంది. అజయ్ న్యూస్ చూస్తూ ఛానల్స్ మారుస్తూ ఉండగా ఒక ఛానల్ దగ్గరికి వచ్చాక రిమోట్ పనిచేయడం మానేసింది. అదే పీకే ఛానల్. బ్యాటరీ అయిపోయిందేమో అని రిమోట్ పక్కన పడేసి, మొబైల్ చూస్తూ ఉన్నాడు అజయ్. ఈలోగా ఆ ఛానల్ లో... మన చరిత్ర అనే ప్రోగ్రాం రన్ అవుతూ ఉంది. అందులో భాగంగా "మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర, ప్రతాప రుద్రుని సేనలకు, గిరిజనులకు మధ్య జరిగిన యుద్ధం గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తోంది. ఆ న్యూస్ రీడర్. అనుకోకుండా అజయ్ ఆ అమ్మాయి చెప్తోన్న వీరగాధ ఆసక్తిగా వినసాగాడు. " కాకతీయ సామ్రాజ్యపు ఆఖరి మహారాజు అయిన ప్రతాపరుద్రుని పాలనా కాలం 1289 నుండీ 1323 మధ్య కాలంలో.. మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరవు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు. కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమర శంఖం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు-కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవింద రాజులు (సమ్మక్క-పగిడిద్దరాజు అల్లుడు) వీరోచితంగా పోరాటం చేశారు. కానీ, కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగవాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతారు. తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాప రుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ, ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు. ఆ తర్వాత చెట్టుకింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణ కనిపించిందట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దుచేసి, సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలయ్యిందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ భరిణెలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకొనే సాంప్రదాయం ఏర్పడింది" అంటూ ఆసియాలోనే అతిపెద్ద జాతరగా చెప్పుకోబడే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర గురించి అత్యద్భుతం గా వివరించింది ఆ రీడర్. అదంతా వింటున్న అజయ్ కి కన్నుల వెంబడి తనకు తెలియకుండానే కన్నీరు కారింది. "ఏంటి! నేను ఇంత ఎమోషనల్ అయిపోతున్నాను?"అనుకుంటూ లేచి, టీవీ కట్టేసి కిచెన్ లోకి వెళ్ళాడు. అక్కడ సీత పని హడావిడిలో ఉంది. " అమ్మా! ఏం చేస్తున్నావ్? నేనూ హెల్ప్ చేస్తా. " అంటూ తల్లి పక్కన చేరాడు అజయ్. " ఏమీ వద్దు నాన్నా. నేను చేసుకుంటాలే కానీ నువ్వెళ్ళి కాసేపు పడుకో. నైట్ జర్నీ ఉంది కదా! మళ్ళీ రేపే డ్యూటీ లో చేరిపోవాలి కదా" అంది సీత. "సరే అమ్మా! తమ్ముడు వచ్చాక లేపు” అంటూ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. కాసేపటికే మత్తుగా నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో.. "మిత్రమా.. మరిచిపోకు! మాట ఇచ్చావు.. నా దేశ ప్రజలు.. ఈ నిధి, ఈ దేశ సంపద ఆ నీచులకి దక్కకూడదు. నా ప్రజలు ఆకలితో అలమటించకూడదు. నేను తిరిగి రావచ్చు.. రాకపోవచ్చు.. నా ప్రజల భవిష్యత్తు నువ్వు కావాలి మిత్రమా!" ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు అజయ్. పైకి లేవలేకపోతున్నాడు. వళ్ళంతా ఏదో తెలియని మైకం కమ్మేస్తోంది. కాళ్ళు, చేతులు కూడా కదపలేకపోతున్నాడు. ఇంతలో ఎవరో తనను బాణాలతో చిత్రవధ చేస్తున్నట్టు వళ్ళంతా రక్తం కారిపోతున్నట్టు బాధ పడుతున్నాడు. కానీ కళ్ళు తెరువలేకపోతున్నాడు. ఇంతలో తను తెల్లవారు ఝామున చూసిన అమ్మాయి! " మావా! మావా! అంటూ తనపై పడి ఏడుస్తూ తనని లేపడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది." ఈలోగా… సశేషం
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
13-03-2025, 10:26 PM
Hello Bro, nice thriller story and writing style, I love these kind of stories. Thank you
14-03-2025, 05:33 AM
21-03-2025, 09:41 AM
(This post was last modified: 21-03-2025, 09:44 AM by k3vv3. Edited 2 times in total. Edited 2 times in total.)
నల్లమల నిధి రహస్యం పార్ట్-9
[font=var(--ricos-font-family,unset)] [/font] [font=var(--ricos-font-family,unset)]' 9' [/font] రచన[font=var(--ricos-font-family,unset)] : [/font]రమ్య నముడూరి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు అజయ్. పైకి లేవలేకపోతున్నాడు. వళ్ళంతా ఏదో తెలియని మైకం కమ్మేస్తోంది. కాళ్ళు, చేతులు కూడా కదపలేకపోతున్నాడు. ఇంతలో ఎవరో తనను బాణాలతో చిత్రవధ చేస్తున్నట్టు వళ్ళంతా రక్తం కారిపోతున్నట్టు బాధ పడుతున్నాడు. కానీ కళ్ళు తెరువలేకపోతున్నాడు.. ఇంతలో తను తెల్లవారు ఝామున చూసిన అమ్మాయి.. " మావా.. మావా.." అంటూ తనపై పడి ఏడుస్తూ తనని లేపడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈలోగా సీత వచ్చి "అజయ్.. అజయ్ .. ఏమైంది నాన్నా? " అంటూ అతన్ని లేపడానికి ప్రయత్నం చేస్తోంది . అప్పటికే అతను ఏదేదో మాట్లాడేస్తున్నాడు. వళ్ళంతా చెమటలు పట్టేసి, నిలువెల్లా తడిసిపోతున్నాడు. కొడుకుని అలా చూసేసరికి, సీతకి కాళ్ళు, చేతులు ఆడట్లేదు. అలాగే అతన్ని లేపడానికి ప్రయత్నం చేస్తోంది. అతను ఇంకా ఆ కలలోనే ఉన్నాడు. "మాటివ్వు మరియా.. నీ శక్తులతో ఈ నిధిని కాపాడతాను అని! నేను మళ్ళీ జన్మ ఎత్తయినా, నా రాజుకి ఇచ్చిన మాట నెరవేరుస్తాను.. ఈ రాజ్యం కోసం, ఈ దేశం కోసం, నా మహారాజుకి ఇచ్చిన మాట కోసం మళ్ళీ పుడతాను. ఇది ఆ కొండదేవర పై ఆన.. మన ప్రేమ మీద ఆన!" అంటూ ఏదేదో మాట్లాడేస్తున్నాడు. సీత చాలా కంగారు పడిపోతోంది. లే నాన్నా! ఏమ్మాట్లాడుతున్నావు? అంటూ అజయ్ ని కుదిపేస్తోంది. ఒక్కసారిగా ఆ తల్లీకొడుకులు ఉన్న గది అంతా చల్లగా అయిపోయింది. కిటికీలు టప, టపా కొట్టేసుకుంటున్నాయి.. మిట్టమధ్యాహ్నం 12 అయింది అప్పటికి.. ఒక్కసారిగా కుక్కలు అరవడం మొదలుపెట్టాయి. సీత నిలువెల్లా వణికిపోతోంది. గది అంతా ఏదో గాలి. అటు, ఇటు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. సీతకీ కొడుకు చూస్తే ఇలా ఏదో కలవరిస్తున్నాడు. అది సరిపోనట్టు, ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం సీతలో భయాన్ని, గుండె వేగాన్ని పెంచేసింది. గాలి వేగం ఎంత పెరిగిపోయింది అంటే.. ఆ గది కిటికీలు పెళ్ళుమని శబ్దం చేస్తూ విరిగిపోయి, గాజు పెంకులు చెల్లాచెదురై పడిపోయాయి. అజయ్ లేవడం లేదు.. " మరియా.. మరియా.." అంటూ కలవరిస్తూనే ఉన్నాడు.. ఇంతలో సీత చూస్తూ ఉండగానే ఒక తెల్లటి ఆకారం అజయ్ మీద వాలిపోయి అతని మెడను గట్టిగా నులిమేస్తోంది. సీత అజయ్ ను లేపడానికి మొహంపై నీళ్లు కొడుతోంది. ఆ ఆకారం నుండి అజయ్ ని ఎలా కాపాడుకోవాలో తెలియక, గట్టిగా హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టింది.. అంతే! ఆ ఆకారం అజయ్ ని వదిలేసి.. " ఉంగిడే .. ఉంగిడే.."(ఆపవే.. ఆపవే..) అంటూ వికృతంగా అరుస్తోంది.. అజయ్ కి ఇంకా మెలుకువ రావట్లేదు. అతను ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాడు. తనని తాను పూర్తిగా కోయరాజు మార్తాండగా చూస్తున్నాడు ఆ కల్లో.. సీత ఇంకా గట్టిగా హనుమాన్ చాలీసా చదువుతూ ఉంది.. ఆ ఆకారం ఆ గదిలో ఉన్న గాజు గ్లాస్ ని సీత మీదకు విసిరింది . అది ఆమెను తాకే క్షణం లో అజయ్ కి మెలుకువ వచ్చింది. ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి, ఆ గాజు గ్లాస్ సీతను తాకక మునుపే దాన్ని పట్టుకుని ఆపాడు. "ఉఫియే.. కిరీగచ్చు.. అమ్మా కీ హకిలీయా .. ఇంద మార్తాండ. ముంగర్ల.. నీవెన్నడా.. ద్రోహి.. రాజద్రోహి..(వచ్చావా.. నీచుడా.. అమ్మకి హాని కలిగిస్తావా.. ఇక్కడ ఉన్నది మార్తాండ.. నువ్వు ఒక ద్రోహివి.. రాజద్రోహివి..)" అంటూ ఆ గాజు గ్లాస్ ని ఆ ఆకారం మీదకి తిరిగి విసిరాడు. అంతే! ఆ ఆకారం అక్కడనుండి పొగలా మారి పారిపోయింది. అజయ్ కళ్ళు నీలం రంగులో ఉన్నాయి. అది చూసి సీత ఇంకా భయపడిపోతూ, ఇంకా గట్టిగా హనుమాన్ చాలీసా చదువుతూ తనకి దగ్గరగా వస్తోన్న కొడుకుని చూస్తూ భయంతో కళ్ళు మూసుకుంది . "అమ్మా.. అమ్మా.. " అంటూ సీత భుజంపై చేతులు వేసి కుదుపుతున్నాడు అజయ్. సీత కళ్ళు తెరిచి చూసే సరికి అజయ్ మామూలు స్థితిలోనే ఉన్నాడు. అతని కళ్ళు నీలంగా కాక, ఎప్పటిలాగానే ఉన్నాయి.. "బాబూ! నువ్వు బాగానే ఉన్నావా?" అంటూ అజయ్ ని గట్టిగా హత్తుకుని ఏడుస్తోంది సీత. "నేను బానే ఉన్నా అమ్మా! ఏమైంది నీకు? నేను కళ్ళుతేరిచి చూసే సరికి నువ్వు భయపడుతూ, హనుమాన్ చాలీసా చదువుతున్నావ్.. ఏమైంది అమ్మా?" అంటూ కంగారుగా అడుగుతున్నాడు అజయ్. సీత ఏమీ చెప్పలేకపోతోంది. ఇందాక జరిగిన ఘటనలో పగిలిపోయిన కిటికీ అద్దాలు, ఇప్పుడు మామూలుగానే ఉన్నాయి. తన మీదకి విసిరిన గాజు గ్లాస్ ఎప్పుడూ ఉన్న చోటే ఉంది. మరి ఇప్పటివరకు జరిగింది అంతా ఏంటి? ఆ ఆకారం, అజయ్ ని చంపడానికి ఎందుకు ప్రయత్నం చేసింది? అసలు ఆ ఆకారం ఏంటి? అజయ్ కళ్ళు నీలంగా ఎందుకు మారిపోయాయి? తను మాట్లాడినది అంతా ఏంటి? అంతు చిక్కని ప్రశ్నలతో సీత మెదడు మొద్దుబారిపోయింది. ఏమీ మాట్లాడలేని, ఏం జరిగిందో చెప్పలేని స్థితిలో ఉండిపోయింది సీత. ఇంతలో.. [font=var(--ricos-font-family,unset)]***[/font]సశేషం[font=var(--ricos-font-family,unset)]***[/font]
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
21-03-2025, 07:09 PM
గురువుగారు, నావల్ల కాదండి, సస్పెన్స్ తట్టుకోలేక పోతున్నా...మీకు పుణ్యముంటుంది ఆ కథేదో ఒకేసారి ఇచ్చేయండి.
:
![]() ![]()
21-03-2025, 09:51 PM
మొత్తం ఒక్క సారే ఇచ్చేస్తే థ్రిల్లు, ఆసక్తి ఉండదుగా ఉదయ్ గారు
5/6 రోజులకో భాగం చదుతూ ఉండాల్సిందే ![]() ![]()
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
22-03-2025, 03:44 AM
(21-03-2025, 09:41 AM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్-9Super Suspense!!! Nice update... ![]() ![]() ![]()
27-03-2025, 12:43 PM
(This post was last modified: 27-03-2025, 12:44 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
నల్లమల నిధి రహస్యం పార్ట్-10
రచన[font=var(--ricos-font-family,unset)] : [/font]రమ్య నముడూరి [font=var(--ricos-font-family,unset)] [/font] అంతు చిక్కని ప్రశ్నలతో సీత మెదడు మొద్దుబారిపోయింది. ఏమీ మాట్లాడలేని, ఏం జరిగిందో చెప్పలేని స్థితిలో ఉండిపోయింది సీత. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అసలే భయంతో బిగుసుకుపోయిన సీత, ఒక్కసారిగా మోగిన బెల్ కి ఉలిక్కిపడింది. "ఆమ్మా.. తమ్ముడు వచ్చినట్టున్నాడు. కాలింగ్ బెల్ కి కూడా భయపడిపోతావేంటి? నీకు ఏదో అయింది" అంటూ హాల్ లోకి వెళ్ళాడు అజయ్. " నాకు ఏమైంది అంటాడేంటి.. ఇప్పటి వరకూ ఏం జరిగిందో వీడికి తెలియదా? ఎలా చెప్పాలి? నమ్ముతాడా? అసలు ఇదంతా నిజమా.. భ్రమా? " అనుకుంటూ నిలబడిపోయింది సీత. డోర్ ఓపెన్ చేయగానే సంజయ్ లోపలికి వచ్చి, " నేను హాఫ్ డే లీవ్ పెట్టేసాను అన్నయ్యా! ఈ పూట మీతో ఉంటాను. నైట్ నైన్ కి బస్సు కదా ! అన్నీ రెడీ చేసుకున్నావా? అమ్మ ఏది? " అంటూ తల్లి కోసం చుట్టూ చూస్తున్నాడు సంజయ్. "అమ్మ గదిలో ఉందిరా " అంటూ "అమ్మా! తమ్ముడు వచ్చాడు" అని సీతని పిలిచాడు అజయ్. సంజయ్ వచ్చాడని విన్న సీతకి కొంచెం ధైర్యం వచ్చింది. హాల్ లోకి వెళ్లి, ఏమీ జరగనట్టు మామూలుగానే ప్రవర్తిస్తోంది సీత. రండి అన్నం తిందురుగాని! అంటూ ఇద్దరికీ ప్రేమగా అన్నం తినిపిస్తోంది సీత. ఆ అన్నాతమ్ముళ్లు ఇద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. సీతకు అవేమి చెవికెక్కట్లేదు. ఆమె ఆలోచనలు అన్నీ ఇందాక జరిగిన ఘటన మీదే ఉన్నాయి. అలా ఆలోచిస్తూ ఉండగా. ఆమెకు ఒక విషయం గుర్తు వచ్చింది. అజయ్, సంజయ్ లు పుట్టినపుడు.. వాళ్ళు విజయనగరంలో ఉండే రోజుల్లో.. ఒక రోజు తను, తన భర్త, ఇద్దరు పిల్లల్ని తీసుకుని అక్కడ ఉన్నఅమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు.. వాళ్ళు దర్శనం చేసుకుని, గుడి మండపంలో కూర్చుని ఉన్నప్పుడు ఒక కోయదొర వచ్చి, తన ఇద్దరి పిల్లల వైపు చూస్తూ "పిల్లలు జర భద్రం తల్లే! నీ పెద్ద బిడ్డడు కారణజన్ముడు తల్లే! అయన ఎవురననుకునేవు తల్లే.. దొర!మా నల్లమలకే దొర! మళ్ళా పుట్టిండు తల్లే.." అంటూ ఉండగా తన భర్త అతడ్ని వారించి, డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళిపోమంటే "నాకు పైసలొద్దు దొర! నీ బిడ్డడు జర భద్రం! పాతికేళ్ల అప్పుడు గండం వచ్చును దొర. నూకలు చెల్లునో.. మిగులునో..అంతా ఆ అంబకే ఎరుక దొర! ఈయన ఇచ్చిన మాటకోసం మళ్ళీ పుట్టిండు దొర." అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే తన భర్త అతడిని తిట్టి ఇంకా ఎక్కువ మాట్లాడితే జైలులో పడేస్తా అంటూ అరవడం తో ఆ కోయదొర "నాపై కోపం చేయకు తండ్రే! నీ బిడ్డడు భద్రం..ఇది అంబ పలుకు దొర! ఆ జగదాంబ పలుకు దొర! వస్తను దొర!" అంటూ ఆ కోయదొర వెళ్లిపోవడం. అంతా సీత కళ్ళముందు కదలాడుతోంది. అప్రయత్నంగా ఆమె చేతులు వణికిపోతున్నాయి. తన కొడుకులిద్దరికీ ఇప్పుడు 25 ఏళ్ళు. "ఆ కోయదొర ఆనాడు ఏదో గండం వస్తుంది అని చెప్పాడు. అదేంటో పూర్తిగా చెప్పనివ్వలేదు అయన. పూర్తిగా వినిఉంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిసేది. అజయ్ కి ఏమీ జరిగిందో.. తను ఇందాక చూసినది అంతా ఏంటో తెలుసుకోవాలి అంటే.. ఒకసారి అజయ్ జాతకం సిద్ధాంతి గారికి చూపించాలి. జరిగినది అంతా ఆయనకి చెప్పాలి. ఇప్పుడు ఎలాగైనా ఆయనకి ఫోన్ చేయాలి. అనుకుంటూ ఉండగా.. [font=var(--ricos-font-family,unset)]***[/font]సశేషం[font=var(--ricos-font-family,unset)]***[/font]
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
27-03-2025, 01:35 PM
(21-03-2025, 09:51 PM)k3vv3 Wrote: మొత్తం ఒక్క సారే ఇచ్చేస్తే థ్రిల్లు, ఆసక్తి ఉండదుగా ఉదయ్ గారు తూచ్...ఇది అన్యాయం బ్రో, అయినా చేసేదేముంది...మీ దయ మా ప్రాప్తం. ఈ సారి కూడా మంచి సస్పెన్సులో ఆపారు...కోయదొర పలుకులు ఇన్నాళ్ళకు/ఇన్నేళ్ళకు గుర్తుకొచ్చాయన్నమాట...సిద్ధాంతిగారేమంటారో...
:
![]() ![]()
28-03-2025, 05:38 AM
(27-03-2025, 12:43 PM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్-10 Super Story Ramya N and K3vv3 garu!!! Very interesting... ![]() ![]() ![]() ![]() ![]()
Yesterday, 08:45 AM
నల్లమల నిధి రహస్యం పార్ట్ -11
రచన[font=var(--ricos-font-family,unset)] : [/font]రమ్య నముడూరి [font=var(--ricos-font-family,unset)] [/font] ‘అజయ్ కి ఏమి జరిగిందో తను ఇందాక చూసినది అంతా ఏంటో తెలుసుకోవాలి అంటే.. ఒకసారి అజయ్ జాతకం సిద్ధాంతి గారికి చూపించాలి. జరిగినది అంతా ఆయనకి చెప్పాలి. ఇప్పుడు ఎలాగైనా ఆయనకి ఫోన్ చేయాలి’ అనుకుంటూ ఉండగా " అమ్మా! ఏమి ఆలోచిస్తున్నావు? ఇందాకట్నుంచి చూస్తున్నా! అసలు నువ్వు మాలో లేవు. ఏమైంది నీకు? " అని అడిగాడు సంజయ్. "నేను నిద్రలేచే సరికి అమ్మ దేన్నో చూసి భయపడిపోయి, కళ్ళుమూసుకుంది. ఈలోగా నువ్వు వచ్చావు." అంటూ మాట్లాడుతున్న అజయ్ కి ఫోన్ వచ్చింది. అది అతని సుపీరియర్ ఫోన్ కావడంతో అజయ్ లేచి, ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు. "అమ్మా! అన్నయ్య చెప్పిందంతా ఏంటి ? నీకు ఎందుకు భయమేసింది? నువ్వు ఇప్పుడు దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? ఏమున్నా నాకు చెప్పు. నేను చూసుకుంటాను. నీ చిన్ని బంగారాన్ని కదా నేను. నాతో చెప్పమ్మా!" అంటూ అనునయంగా అడిగాడు సంజయ్. సీతకి కన్నీళ్లు ఆగలేదు. తను అజయ్ పడుకుని ఉన్నప్పుడు నిద్ర లోనే అతను మాట్లాడిన మాటలు, తను చూసిన ఆకారం, అజయ్ లో వచ్చిన మార్పు, అతని కళ్ళు నీలంగా మారడం, ఆ ఆకారాన్ని ఎదుర్కోవడం, అజయ్ వింత భాష మాట్లాడడం.. ఇంతలో తను భయపడి కళ్ళుమూసుకోవడం.. అంతా. చెప్పింది సీత సంజయ్ కి. అదంతా విన్న సంజయ్ కి గుండె వేగం పెరిగిపోయింది. ఇవాళ్టి వరకూ తనకి మాత్రమే తెలిసిన తన అన్నయ్య వింత ప్రవర్తన, ఈ రోజు తన తల్లికి కూడా తెలిసిపోయింది అని సంజయ్ కి అర్ధం అయింది. ఇంకా దాచి ఉపయోగం లేదు అనుకున్నాడో, ఏమో! " అమ్మా! ఇవాళ నీకు ఒక విషయం చెప్పాలి. ఇది విని నువ్వు భయపడకూడదు. అన్నయ్య ఇలా ప్రవర్తించడం ఇవాళ మొదటి సారి కాదు. ఆ ఆకారం అన్నయ్య పై దాడి చేయడం ఇవాళ మొదటి రోజూ కాదు. ఆరునెలల క్రితం మా ఇద్దరి బర్త్ డే రోజు. నువ్వు, నేను కూడా అన్నయ్య కోసం రాజమండ్రి వెళ్ళాము కదా. అప్పుడు అన్నయ్య అక్కడ ఎస్. ఐ గా పనిచేసేవాడు కదా! ఇద్దరం కలిసి మా 25 వ బర్త్డే కేక్ కట్ చేసి, ఆ రోజు అంతా ఎంతో ఎంజాయ్ చేసాం కదా.. నువ్వు మా ఇద్దరినీ చూసి మురిసిపోయిన ఆ రోజూ రాత్రి ఏమైందో తెలుసా అమ్మా! పార్టీ అయిపోయాక, అన్నయ్య స్టాఫ్ అందరూ భోజనం చేసి వెళ్లిపోయాక, నువ్వు పడుకున్నావ్. అప్పుడు మేము ఇద్దరం కూడా నిద్రపోయాం. అదోరాత్రి వేళ ఎందుకో నిద్రలోంచి సడన్ గా మెలుకువ వచ్చేసింది. చుట్టూ చూసాను. అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ ఉన్నట్టుండి గది అంతా చల్లగా అయిపోయింది. కిటికీలు టప, టపా శబ్దం చేస్తున్నాయి. నేను లేచి, కిటికీ వేసేలోగా. ఆ గాలి తీవ్రత కి నేను చూస్తుండగానే ఆ కిటికీ అద్దం పగిలిపోయింది. నేను ఆ గాజు ముక్కలు తీయబోతుంటే.. ఆ పగిలిన కిటికీ అద్దం లో ఒక నల్లటి ఆకారం, సీలింగ్ మీద ఫ్యాన్ చుట్టూ తిరుగుతున్నట్టు కనిపించి, వళ్ళు జలదరించింది. నేను పైకి లేచి, చూసేసరికి ఆ ఆకారం, అన్నయ్య పై పడి ఇందాక నువ్వు చెప్పినట్టుగానే వాడి పీక పిసికేస్తోంది. వాడు కనీసం కదలననన్నా కదలడం లేదు. నాకు భయం వేయలేదు. ఆ ఆకారాన్ని అన్నయ్య మీద నుంచి కిందకి తోయడానికి ప్రయత్నించి, నేనే అన్నయ్య మీద పడ్డాను. అయినా వాడు లేవలేదు. ఆ ఆకారం వాడ్ని వదలలేదు. నేను వాడ్ని ఎలాగైనా లేపాలి అని ప్రయత్నం చేసి, వాడు లేవకపోవడంతో మొహంపై నీళ్లు కొట్టాను. ఆ ఆకారం వాడ్ని వదిలేసి, నన్ను పీక పట్టుకుని గాలిలోకి లేపి, " ఉంగిలేయ్.. ఉంగిలియే! " సమ్థింగ్.. ఏదో డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఏదో అన్నది అమ్మా! అది నాకు గుర్తులేదు కానీ అది ఏదో వాగింది అమ్మా! నేను విడిపించుకునే ప్రయత్నం చేసా కానీ నా వల్ల కాలేదు. అప్పుడే అన్నయ్య ఒక్క ఉదుటున లేచి, వాడు కూడా అదే బాష మాట్లాడాడు అమ్మా.. అప్పుడే చూసాను నేను! వాడి కళ్ళు నీలం రంగులోకీ మారడమ్.. ఆ ఆకారం నన్ను వదిలేసింది. నేను కిందపడ్డాను. ఆ పడ్డం, పడ్డం, ఆ మరునాడు లేచాను. నేను కళ్ళు తెరిచే సరికి మంచం మీదే ఉన్నాను. అదంతా కలో.. నిజమో.. భ్రమో..ఏమీ అర్ధం కాలేదు నాకు. పగిలిన కిటికీ మళ్ళీ మామూలు అయిపోయింది. అన్నయ్యని అడిగితే “దెయ్యం సినిమాలు ఇంకా చూస్తూనే ఉన్నావా నువ్వు? జాబ్ వచ్చినా మారవా! పిచ్చి వాగుడు వాగుతున్నావ్?” అంటూ క్లాస్ పీకాడు. నేను అది నా కలే అనుకుని, ఆ విషయం ఆ రోజే వదిలేసాను. మళ్ళీ ఈరోజు నువ్వు చెబుతుంటే నాకూ అదంతా గుర్తొచ్చింది” అంటున్న సంజయ్ చెంప చెళ్లుమనిపించింది సీత. "అమ్మా!" అంటూ చెంప నిమురుకుంటూ చూస్తున్నాడు సంజయ్ . నీరు నిండిన కళ్ళతో సంజయ్ ని చూస్తూ " ఆరోజు నువ్వు నాకు చెప్పొచ్చు కదా! అంత నిర్లక్ష్యం ఏంటిరా నీకు.. అన్నయ్యకి గాని నీకు గాని ఏమైనా అయితే తట్టుకునే శక్తి ఇంక నాకు లేదు నాన్నా! " అంటూ సంజయ్ ని పట్టుకుని ఏడుస్తోంది సీత. "సారీ అమ్మా. ఇప్పుడు ఏమి చేద్దాం.. అసలు ఇదంతా ఏంటి?" అంటూ తల్లిని అడుగుతున్నాడు సంజయ్. " సిద్ధాంతి గారికి, అన్నయ్య జాతకం చూపించి అసలు ఇదంతా ఏంటో తెలుసుకోవాలి! అన్నయ్యకి ఏదోకటి చెప్పి, ఇప్పుడే మనము ఆయన్ని కలవడానికి వెళ్దాం!" అంది సీత. "కానీ అమ్మా! అసలు ఆయన ఊర్లో ఉన్నారో లేదో తెలుసుకుని, అప్పుడు వెళ్దాం! అంటూ ఫోన్ తీసుకుని, అజయ్ కి తెలీకుండా. మేడ మీదకి వెళ్లి సిద్ధాంతి గారి శిష్యుడికి ఫోన్ చేసాడు సంజయ్. *** అజయ్ బాల్కనీ లో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. అజయ్ వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారు. కింద ఫ్లోర్ లో ఇంటి ఓనర్ కుటుంబం ఉంటారు. వాళ్ళు ఉన్న ఇల్లు వీధికి చివర్లో ఉండటం, అది కూడా పొలాలకి అనుకుని ఆ వీధి ఉండడంతో ఆ ఇంటి చుట్టూ. చాలా మొక్కలు, చెట్లు ఉండి, ఆహ్లాదకరంగా ఉంటుంది. బాల్కనీలో నుంచుని , సుపీరియర్ తో మాట్లాడుతున్న అజయ్ కళ్ళు ఒకచోట ఆగిపోయాయి. ఆ వీధిలో కుంటుకుంటూ నడుస్తున్న ఒక ముష్టివాడు చూడ్డానికి చాలా నీరసంగా కనపడుతున్నాడు. ఎవరూ అతనికి ఆ రోజు ఏమీ పెట్టినట్టు లేరు. చాలా ఆకలిగా ఉన్నట్టు ఉన్నాడు. చెత్తకుండీ దగ్గరకు వెళ్లి, అందులో ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతున్నాడు. అది చూసిన అజయ్ చలించిపోయాడు. ఫోన్ మాట్లాడ్డం అయిపోగానే కిందకి వెళ్లి, ప్లేట్ లో అన్నం సర్ది, మంచినీళ్ళ బాటిల్ పట్టుకుని ఆ ముష్టివాడి దగ్గరికి వెళ్లి, అతనికి తను పట్టుకెళ్లిన అన్నం పెట్టాడు. అది చూసి సీత ఎంతగానో సంతోషించింది. తృప్తిగా అన్నం తిన్న ఆ ముష్టివాడు నీరు నిండిన కళ్ళతో. చల్లగా ఉండు తండ్రి.!అంటూ అజయ్ చేయ పట్టుకున్నాడు. ఇంతలోనే అతనికి షాక్ కొట్టినట్టు అనిపించి, చెయ్య వదిలేసాడు. అతను భయంతో వదిలేసాడు అనుకుని, అతని భుజం పై చేయేసి, “జాగ్రత్త! ఇదిగో ఈ డబ్బులు ఉంచు” అంటూ ఆ ముష్టివాడి చేతిలో డబ్బులు పెట్టి, పైకి మెట్లు ఎక్కుతున్నాడు అజయ్. "ఆగు సామీ!" అన్నాడు అతను అజయ్ ని పిలుస్తూ. ‘ఏంటి’ అన్నట్టు చూసాడు అజయ్. "సామీ! ఏమీ అనుకోకపోతే ఇది నీ కాడ ఉంచు సామి..ఇది హనుమన్న రక్ష. నీకు అవసరం పడతాది సామి.." అంటూ ఒక తాడు ఇచ్చాడు. "ఓయ్! నాకిలాంటివి నమ్మకాల్లేవ్. పోయి ఏదైనా పని చూసుకుని బతుకు " అంటూ విసురుగా పైకి వెళ్ళిపోయాడు అజయ్. "తెలుస్తది సామి! నమ్మకాలొస్తయి సామి.. అన్నం పెట్టినావని నీ మంచికోరా! చల్లగుండు సామి. " అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అజయ్ విసిరేసిన తాయత్తు అక్కడనుండి అదృశ్యం అయిపోయింది. అది ఎవరు తీశారో తరువాత చెప్తాన్లే? [font=var(--ricos-font-family,unset)]***********************************[/font] సశేషం
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
Yesterday, 12:29 PM
బావుంది బ్రో...ఆ వచ్చే ఆత్మో/దయ్యమో ఎవరిదో. ఆ ఇచ్చిన తాడు కట్టుకుంటే పోయేదేముంది, అజయ్ కి పడితేగాని తెలిసిరాదు. అన్నం పెట్టినప్పుడు చూసిన అమ్మ, తాయత్తు ఇచ్చేటప్పుడు లేకుండా పోయింది. కాస్త పేద్ద అప్డేట్
![]()
:
![]() ![]()
Today, 06:37 AM
(Yesterday, 08:45 AM)k3vv3 Wrote: నల్లమల నిధి రహస్యం పార్ట్ -11Very good Story!!! RamyaN/K3vv3 garu!!! ![]() ![]() ![]()
4 minutes ago
Nice update
|
« Next Oldest | Next Newest »
|