Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
బర్రున ఆటో ఆ యింటి ముందు ఆగింది. ఆటో దిగి డబ్బులు చెల్లించి సామాన్ల సంచులు బరువుగా, అలసటగా మోసుకుంటూ మెట్లెక్కి యింట్లోకి తీసుకువచ్చాడు రామపాదం.
"యిదిగో చూసుకో నువ్వు రాసిచ్చిన లిస్టులో ఉన్న సామానులన్నీ తీసుకొ... కాదు కాదు మోసుకొచ్చాను" ఆయాస పడుతూ చెప్పేడు రామపాదం సామాన్ల సంచులు జాగ్రత్తగా నేల మీద పెడుతూ. పగిలిపోయే గాజు సామాన్లు కూడా ఉన్నాయి వాటిలో మరి.
కాసేపు తరువాత -
"నేను రాసిందేమిటి - మీరు చేసుకొచ్చిందేమిటీ" వస్తువులు ఒక్కొక్కటీ చెక్ చేసుకుంటూ ఒంటి కాలి మీద లేచింది రామపాదం భార్య సుమతి. అంటే అవిడకో కాలు లేదని కాదు. కోపం వచ్చినప్పుడు అలా ఒంటి కాలు మీద లేవాలని ఆవిడ ఎక్కడో ఏదో పుస్తకంలో చదివిందట.
పండక్కి అమ్మ గారి ఊరికి వెళుతూ అక్కడి వారికి తీసుకు వెళ్లాల్సిన వస్తువులూ, బహుమతులూ అంటూ ఓ పొడుగాటి లిస్ట్ రాసిచ్చింది భర్త అనే ఆ మహానుభావుడికి సుమతి.
"నువ్వు చెప్పినట్టే నువ్వు రాసిన వస్తువులన్నీ తీసుకు వచ్చానుగా? ఇంకా ఏమిటిట లోటు? అసలు చెరువులో చేపల కోసం ఎదురుచూసే దొంగ కొంగలా ఆ కాలెత్తడమేమిటీ? దింపు. పడిపోగలవు" గాబరా నటించాడు రామపాదం ఆమె పడిపోకుండా పట్టుకుంటూ.
ముక్కుకి చేపను చిక్కించుకున్న కొంగలా చటుక్కున కాలు దించిన సుమతి "చూడండి! నేను రాసిచ్చిన లిస్ట్ లో సగం వస్తువులే తీసుకొచ్చారు తమరు. ఎందుకని?" అంటూ ఎగిరి ఈ సారి కయ్యానికి కాలు దువ్వింది.
రామపాదం జేబులోంచి సుమతి రాసిచ్చిన లిస్ట్ బయటికి లాగేడు. "చూసుకో నువ్వు నీ స్వహస్తాలతో రాసిచ్చిన లిస్ట్. ఇందులో ఉన్నవన్నీ తెచ్చాను కదా" లిస్ట్ ఆమె మీదికి విసురుతూ అన్నాడు.
కిటికీ లోంచి బయటికి పారి పోవడానికి ప్రయత్నించిన ఆ లిస్ట్ ని ఒడుపుగా ఒడిసి పట్టుకుని చెక్ చేసింది సుమతి. లిస్టు ముందు వైపు రాసి ఉన్న వస్తువులన్నీ వచ్చాయి గానీ వెనుక పక్క రాసిన వస్తువుల్లో ఒక్కటి కూడా లేదు ఆ సంచుల్లో ఎంత గాలించినా.
"చూడండి! ఈ వెనుక పక్కన రాసిన వస్తువుల్లో ఒక్కటంటే ఒక్కటి పట్టుకొచ్చారా తమరు?" అంటూ ఈ సారి అప్పడంలా విరుచుకు పడింది సుమతి.
"ఏదీ చూడనీ" అంటూ లిస్ట్ అందుకుని పరిశీలనగా చూసి "ఓహో వెనక పక్కన రాశావా!" అన్నాడు రామపాదం తేలిగ్గా.
"మీకింత మతిమరుపేమిటండీ బాబూ? ఖర్మ ఖర్మ" నెత్తీ నోరూ బాదుకుంది సుమతి సుతారంగా.
'నాకు మతిమరుపా' మనసులో స్వగతంలా అనుకున్నాడే తప్ప నోరెత్త లేదు రామపాదం. అందుకే మళ్లీ సుమతే నోరు చేసుకుంది -
"ఇలాగే మొన్నటికి మొన్న..." అంటూ ఉపోద్ఘతించింది.
"మొన్న...? మొన్న ఏం చేశానూ నేనూ?" అమాయకమైన ముఖంతో అడిగేడు రామపాదం.
"అప్పుడే మర్చి పోయారా లేక మర్చిపోయినట్టు నటిస్తున్నారా?" తీక్షణంగా అడిగింది.
"గుర్తు చేస్తే నీ సొమ్మేం పోదుగా" ఈ సారి రామపాదం ముఖం బేలగా మారిపోయింది.
"అదే ... మొన్న గురువారం ఆ రాధిక మనింటికి వచ్చినప్పుడు....." యింకా ఏదో చెప్పబోతుండగా ఆవిణ్ణి మధ్యలోనే ఆపేసి -
"ఎవరూ? మన ఎదురింటి డాబా యింట్లో ఉండే ఆ తెల్లగా పొడుగ్గా బూరె బుగ్గలతో కోటేరేసిన ముక్కుతో అందంగా మెరిసిపోతూ..." పరవశంగా చెప్పుకుపోతున్న మొగుణ్ణి ఒక్క గసురుతో బ్రేక్ వేసి ఆపింది సుమతి.
"ఆపండి మీ పొగడ్తలు. నేను చెప్పేది ఆ రాధిక గురించి కాదు. మన వెనుక వీధిలో ఉండే తెలుగు టీచర్ రాధిక మేడమ్ గురించి..." విశదీకరించి, విడమరిచి, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పింది సుమతి.
అప్పటికే గాలి తీసిన బెలూన్లా ముడుచుకుపోయిన రామపాదం "ఆ అమ్మాయా?" అన్నాడు నీరసంగా.
"అవును ఆ అమ్మాయే! ఇంకా చెప్పాలంటే చింపిరి జుట్టుతో, చికిలి కళ్ళతో, కాటుక రంగులో..." కొనసాగించింది సుమతి.
"ఇంక చాల్లే అపు నీ వర్ణన - గుర్తొచ్చింది గానీ! ఇంతకీ ఆ వెనక వీధి రాధిక వచ్చినప్పుడు నేనేం వెలగబెట్టేనో అది చెప్పు ముందు" అన్నాడు చిరాగ్గా.
"ఏమిటా? ఆ అమ్మాయి వచ్చి - 'సార్ మీరు కథలు రాస్తారు కదా. నేనూ ఓ చిన్న కథ రాశాను. చదివి ఎలా ఉందో చెప్పండి' అని అడిగితే - పూర్తిగా చదవకుండానే కథ అసంపూర్తిగా ఉందని తేల్చి చెప్ప లేదా తమరు?" నిలదీసింది సుమతి.
"మరి? కథ పూర్తి కాకుండా సగంలో అపేసినట్టుగా ఉంటే ఆ విషయం తెలియ చెప్పకపోతే ఎలా? యిలాంటి లోపాలు తెలియపరచకపోతే ఆ అమ్మాయి రచయిత్రిగా ఎలా రాణిస్తుందనుకున్నావు?" అన్నాడు రామపాదం.
"అదే విషయం నేనా పిల్లని అడిగితే 'మిగతా సగం కథ ఆ పేజీ వెనుక పక్క రాశాను కదా వదినా' అని నా దగ్గర ఎంతలా వాపోయిందో తెలుసా?" జాలితో కూడిన ఆ రాధిక ముఖం కళ్ళ ముందు మెదలగా మెల్లగా చెప్పింది సుమతి.
"ఏమిటీ? పేజీకి రెండో వైపున రాసిందా? అదీ సంగతి!" అన్నాడు రామపాదం విషయం అర్థమై.
"ఆ సంగతలా ఉంచండి. మొన్నటికి మొన్న హాఫ్ యియర్లీ పరీక్షల్లో లెక్కల్లో వందకి వంద మార్కులు తెచ్చుకున్న మన పండుగాడి ఆన్సర్ పేపర్ పూర్తిగా చూడకుండానే నలభై అయిదు మార్కులేనా వెధవా అని వాణ్ణి నానా తిట్లూ తిట్టేరు గుర్తు లేదా తమరికి?" కొశ్నించింది సుమతి.
"అవును! వాడి ఆన్సర్ పేపర్ కౌంట్ చేస్తే నలభై అయిదు మార్కులే కదా వచ్చింది టోటల్?" అయోమయంగా అడిగేడు రామపాదం.
"చాల్లెండి. వాడి పేపర్ వెనుక పేజీలో మిగతా యాభై అయిదు మార్కులు ఉన్నాయన్న విషయం తమరసలు పరిశీలనగా చూసి ఏడిస్తే కదా?" అంటూ ఈసడించింది సుమతి.
"పేపర్ వెనుక వైపు రాశాడా?" ఆశ్చర్య పోయాడు
రామపాదం.
"రాయడా మరి ముందు పేజీలో చోటు సరిపోకపోతే?" నాలుగు పెద్ద సూట్ కేసులూ, రెండు బిగ్ షాపర్ సంచీలూ సర్దడం పూర్తి చేస్తూ అంది సుమతి.
సుమతి గుర్తు చెయ్యక పోయినా - మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలూ, రామపాదం మనసులో కదలాడుతున్న సంగతులూ మరి కొన్ని యిక్కడ ప్రస్తావించుకోక తప్పదు మనకు.
ఓ సారి యిలాగే -
ఓ రచయితల సాహితీ సమావేశం ప్లస్ బహుమతుల ప్రదానోత్సవానికి అతిథిగా పిలిచారు రామపాదాన్ని. ఆ నాటి కార్యక్రమంలో ముందుగా సమోసా, తేనీటి సేవల అనంతరం స్టేజ్ మీద ముఖ్య అతిథి ప్రసంగం, ఆ తరువాత మరి కొందరు మైకాసురుల అధిక ప్రసంగాల అనంతరం -
రామపాదం చేతికి ఆ నాటి కార్యక్రమంలో బహుమతులు స్వీకరించవలసిన - అంతగా పేరు ప్రఖ్యాతలు లేని ప్రముఖ రచయితల పేర్లతో నిండి ఉన్న పెద్ద జాబితా అందించ బడింది నిర్వాహకుల నుండి.
లిస్టును పై నుంచి కిందికి ఓ సారి పరిశీలించి చూశాడు రామపాదం. ఆ లిస్టులో ఉన్న వాళ్ళు అందరూ ఆ రోజు ఆ సభలో అవార్డులూ, సన్మానాలు, ప్రశంసా పత్రాలు అందుకోవలసి ఉంది.
ఆ శుభ సమయం కోసం వాళ్ళు అందరూ స్టేజి దిగువన పిల్లా పీచూ, బంధుమిత్ర సపరివార సమేతంగా ఆత్రంగా వేచి చూస్తున్నారు. సభ నిండుగా కనిపించడం కోసం రచనలు పంపిన వారందరికీ ఆహ్వానాలు పంపబడ్డాయి. వారిలో ఎవరికి బహుమతి లేదా అవార్డు వచ్చిందో నిర్వాహకులకు తప్ప వేరే వారెవరికీ తెలియదన్న మాట.
అందుకే ఎవరికి వారు తమకు మాత్రం అవార్డు, సన్మానం తప్పదనే ధీమాలో ఉండి తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమ పేరు మైకులో వినబడగానే స్టేజి మీదకు పరుగు పెట్టడానికి రన్నింగ్ రేసుకు సిద్ధపడ్డ అభ్యర్థుల్లా ఎదురు చూపులు చూస్తూ కళ్ళకు కాయలు, చెవులకు పళ్ళు కాయించుకుంటున్నారు.
లిస్టు చూసి రామపాదం పేర్లు పిలిచిన కవులూ, రచయితలూ ఒక్కొక్కరుగా ఆనందంగా స్టేజి మీదకు వచ్చి సన్మానం, అవార్డు అందుకుని ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలియజేసి శాలువాలు, చెక్క ముక్క
జ్ఞాపిక, పూలదండల బరువుతో స్టేజి దిగుతున్నారు.
ఆ లిస్ట్ లో ఉన్న వారందరి పేర్లూ పిలిచిన తరువాత రామపాదం తన ప్రసంగ పాఠం ఉన్న కాగితాల బొత్తి లాల్చీ జేబులోంచి బయటికి లాగి తన ప్రసంగం మొదలు పెట్టేశాడు.
"వేదిక మీద ఉన్న పెద్దలకూ, వేదిక ముందున్న పెద్దలూ, కవులూ, రచయితలూ, ఫోటోల వాళ్ళు అందరికీ నమస్కారం. ఈ నాటి సభలో బహుమతులూ, అవార్డులూ, సన్మానాలు అందుకున్న...." అంటూ మొదలు పెట్టబోతుండగా స్టేజి మీద ఉన్న ముఖ్య అతిధులు మరియూ స్టేజి దిగువన ఉన్న సభాసదుల్లో కలకలం, కలవరం బయలు దేరింది. తమ పేరు బహుమతి గ్రహీతల జాబితాలో ఉందని ముందుగానే పేపర్ లీక్ అయి తెలిసిపోయిన వాళ్ళు పెట్టిన హాహాకారాలు హాలు స్లాబు ముట్టేయి.
తన ప్రసంగానికి అడ్డు తగులుతున్న వారిని చూసి రామపాదం చిరాకు ప్రదర్శించి ప్రసంగం కొనసాగించబోతుండగా - లాల్చీకి పిన్నీసుతో బాడ్జ్ గుచ్చుకున్న సభ నిర్వాహకుల్లో ఒకాయన వడివడిగా, హడావిడిగా స్టేజి మీదకు దూసుకు వచ్చాడు. రామపాదం చెవిలో నోరు పెట్టేసి గుసగుసగా 'అయ్యా లిస్టు యింకా పూర్తి కాలేదు. బహుమతులు అందుకోవలసిన వారి జాబితా యింకా పూర్తి కాలేదు. ఇంకా సన్మానం అందుకోవలసిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. పి టి వో అనగా పేజీ త్రిప్పి చూడుడు' అని చెప్పిన మాటలు రామపాదం చేతిలో ఆన్ లో ఉన్న మైకులోకి జొరబడిపోయి హాలు హాలంతా ప్రతిధ్వనించాయి.
'పేజీ వెనుక రాశారా' అంటూ పేజీ తిప్పి చూసి - తతిమా వాళ్ల పేర్లు చదువుతూ మిగతా కార్యక్రమం కొనసాగించి పూర్తి చేశాడు. తరువాత తన ప్రసంగ పాఠం ఉన్న కాగితాల బొత్తి మరో సారి జేబులోంచి పైకి లాగి -
"వేదిక మీద ఉన్న పెద్దలకూ, వేదిక ముందున్న పెద్దలూ, కవులూ, రచయితలూ, ఫోటోల వాళ్ళు అందరికీ నమస్కారం. ఈ నాటి సభలో బహుమతులూ, అవార్డులూ, సన్మానాలు అందుకున్న...." అంటూ పునరుద్ఘాటించాడు ఆ నాడు.
"ఏంటలా బెల్లం కొట్టిన రాయిలా ఉలుకూ పలుకూ లేకుండా చూస్తూ ఊరుకున్నారు? యేమిటాలోచిస్తున్నారు?" అన్న భార్య కేకతో ఉలిక్కి పడి గత లోకం లోంచి ఇహ లోకంలోకి తిరిగి వచ్చాడు రామపాదం.
"సరే సరే యింక మాటలెందుకు గానీ ట్రైన్ కి టైం అవుతోంది. బయలుదేరింక" మాట మార్చేశాడు రామపాదం.
రామపాదం ఓ మోస్తరు రచయితే కాక ఓ చిన్న మాస పత్రికకు సంపాదన లేని సంపాదకుడు కూడా. అతని భార్య సుమతి గడుసుదే కానీ వాళ్ళ అమ్మమ్మ కాలం నాటి పాత కాలం మనిషి. ఈ కాలానికి సంబంధించిన సెల్ ఫోన్లు, వాట్సాపులు అవీ ఉపయోగించడం ఆమెకు యిష్టం లేదనే కంటే తెలియదు అనే చెప్పాలి.
పండక్కి ఒంటరిగా రైలెక్కింది సుమతి - రామపాదం తీసుకు వచ్చిన అరకొర సరుకులతోటే సణుక్కుంటూ. 'పత్రిక ఈ వారంలో విడుదల చెయ్యాలి. నేన్రాను నువ్వెళ్ళి వచ్చేయ్' అని రామపాదం ముందే టలాయించడంతో ఒక్కతే బయలుదేరి వెళ్ళింది అమ్మ గారింటికి సుమతి.
సుమతి పుట్టింటికి వెళ్లిన సమయంలో కట్టలు కట్టలుగా పోస్ట్ లో వచ్చిన కథలు చదివి - ప్రచురణకు సెలెక్ట్ అయిన కథలు ఫోల్డర్లలో జాగ్రత్త చేయడంలోనూ, ఎన్నిక కాని కథలను తిరుగు టపా కవర్లలో ఉంచి వెనక్కి తిప్పి పంపే పనిలోనూ బిజీ బిజీ అయి పోయాడు ఎడిటర్ రామపాదం.
ఎన్నిక కాక తిరుగుటపా కవర్లు లేని హాస్య కథలతో నాలుగు పొడి చెత్త డబ్బాలూ, పనికిరాని ఏడుపు గొట్టు కథలతో నాలుగు తడి చెత్త డబ్బాలు నిండిపోయాయి.
పది రోజుల తరువాత పోస్టులో వచ్చిన కథల కవర్లతో కలిసిపోయి వచ్చిన భార్య రాసిన కవరు గమనించి తెరిచి ఆమె రాసిన ఉత్తరం బయటికి లాగి చదవసాగేడు రామపాదం.
ఆ పేజీ నిండా వాళ్ళ పుట్టింట్లో పండగ ఎంత వైభవంగా జరుపుకున్నారో, వాళ్ల అన్నయ్యలు వదినలు, వాళ్ల పిల్లలతో తను ఎంత సరదాగా ఎంజాయ్ చేసిందో, వాళ్ళ అమ్మ ఏమేమి పిండివంటలు వండిందో నోరూరించేలా రాసి నింపేసింది శ్రీమతి. ఉత్తరం మడిచి కవర్లో పెట్టేసి తిరిగి రచనల కవర్లు తెరిచి కథలు సెలెక్ట్ చేసే పనిలో నిండా మునిగి పోయాడు రామపాదం.
ఆ రోజు తెల్లవారు జామునే కాలింగ్ బెల్ మోగడంతో లేచి తలుపు తెరిచాడు రామపాదం నిద్ర కళ్ళతో.
ఎదురుగా ఉగ్రరూపంలో సుమతి!
"స్టేషన్ కి రమ్మని ఉత్తరం రాస్తే ఎందుకు రాలేద"ని అరిచింది ఆవేశంగా - రెండు చేతుల నిండుగా ఉన్న నాలుగు చేతులకు సరిపడా సామాన్ల సంచులు కింద పెట్టి కందిపోయిన అరచేతులూ, వేళ్ళూ ఊదుకుంటూ.
'నువ్వు అరిస్తే ఎంత ముద్దుగా ఉంటావో తెల్సా' అని ఎప్పటిలా ఆవిణ్ణి ఉబ్బేద్దామనుకున్నాడు గానీ దానికిది సమయం కాదని తనకు తానే సర్దిచెప్పుకొని -
"పండగ ఎంత వైభవంగా జరిగిందో రాశావు గానీ ఏ రోజు ఏ బండికి వస్తున్నదీ రాయక పోతే స్టేషన్ కి ఎలా రాగలను?" తనూ అంతే అవేశంగా అరిచేడు రామపాదం 'తగ్గేదేలే' అన్నట్టుగా.
"ఆ ఉత్తరంలో రాశానుగా? ఏదీ నా ఉత్తరం?" అంటూ రామపాదం టేబుల్ డ్రాయర్ లోంచి ఉత్తరం వెతికి తీసి - "ఇదిగో ఈ రైలుకి వస్తున్నాను. స్టేషన్ కి రావలెను - యిట్లు మీ పాదదాసి అని స్పష్టంగా రాశానుగా" అంటూ పొందికైన అక్షరాల్లో రాసిన వైనం చూపించింది సుమతి.
ఆ ఉత్తరం అందుకుని పరిశీలిస్తే ఉత్తరం వెనుక వైపు స్పష్టంగా ఎప్పుడు, ఏ రైలుకి వచ్చేదీ సుమతి స్వహస్తాలతో రాసిన వివరం ఉంది.
"అదీ సంగతి. ఓ పత్రికా సంపాదకుడి భార్యవై ఉండి నువ్వు కూడా యిలా పేజీకి వెనుక వైపు రాస్తే ఎలా బంగారూ? పేజీకి ఒకవైపే కదా రాయాల్సింది. అది కథైనా, ఉత్తరమైనా, మరేదైనా పేజీకి రెండో వైపున రాసింది ఏదీ నేను చూడనని ఇన్నేళ్ళ నా సాహచర్యంలో నీకు తెలిసిన విషయమేగా?" తన తప్పేం లేక పోవడంతో బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు ఎడిటర్ రామపాదం.
చేసేది లేక గతంలో జరిగిన అనుభవాల్ని గుర్తు తెచ్చుకుని ఓ దీర్ఘమైన నిట్టూర్పు, ఓ పత్రికా సంపాదకుడి భార్యగా మెట్టినందుకు మరో గాఢమైన నిట్టూర్పు విడిచి వంట గదిలోకి వెళ్ళి గిన్నెల మీద తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది సంపాదన లేని సంపాదకుడు రామపాదం అర్ధాంగి శ్రీమతి సుమతి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 1,968
Threads: 4
Likes Received: 3,089 in 1,410 posts
Likes Given: 4,102
Joined: Nov 2018
Reputation:
61
పత్రికా సంపాదకుడా, పేజీకి ఒక పక్క అంటే అర్థమిదా  ...బావుంది k3vv3 గారు
: :ఉదయ్
The following 1 user Likes Uday's post:1 user Likes Uday's post
• k3vv3
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
రామారావు మనసంతా అల్లకల్లోలంగా ఉంది.
"వెధవ క్యాంపు. బాస్ కు ఎందుకు పడుతుందో, ఏమోకానీ మా ప్రాణాలు తోడేస్తున్నాడు" — క్యాంపు కెళుతున్న మేనేజరును శాపనార్ధాలు పెట్టుకుంటూ మోటార్ బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లాడు. ఎంత చేసి నా ఓగదెగని వర్క్ వలన ఈ వారం రో జల నుంచి ఇంటికెళ్ళేటప్పటికి రాత్రి ఎనిమిది అపుతోంది రామారావుకు
ఇంట్లో అడుగుపెట్టిన రామారావు కోపం ఒక్కసారిగా తారా స్తాయి కు వెళ్ళింది. . పిల్లల ఆట బొమ్మలు, వంటసామాను, బట్టలు ఇల్లంతా చల్లినట్లు పడిఉన్నాయి. ఆఫీసులోని విసుగు, ఆవేశం దశలు మారి కోపంలా మారింది రామారావులో.
"ఛీ ఛీ. ముదనష్టపు ఇల్లు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండదుకదా, ఏన్ని సార్లు చెప్పినా అంతే, ఇల్లు సర్డుదామని లేదు. చీ. సంసారంకూడా ఒక నరకమనిపిస్తుంది. ఏ సుఖమూ లేదు. పాడూలేదు ఉండదుగదా. ఎన్ని సార్లు చెప్పి నా జ్ఞానం లేదు " విసుగు కోపం తో చైర్లో కూర్చున్నాడు.
"వచ్చి అర్ధగంట అయింది, ఎక్కడకు వెళ్ళిందో ఏమో. కట్టుకొన్న వాడోకడు వస్తాడని, వాడి ముఖాస అన్ని కాఫీ నీళ్ళు కొట్టాలని ఇంగిత జ్ఞానమైనా ఉంటేగదా" అసహనంగా లేచి షర్ట్ విప్పి హాంగరుకు తగిలించను వెళ్లాడు. "తెచ్చేవరకు హేంగరు లేధని ఒకటే గోల. తెచ్చి పది రోజులు అయినా ఇంతవరకు గోడకు కొట్టి ఏడ్చిందిలేదు. ఇంతకీ ఏ యింట్లో చచ్చిందో సినిమా కబుర్లు, బెండకాయ పీచులని. ఇంతవరకు తగలడిందిలేదు. ఇంత పొద్దుపోయినా పిల్లలు వచ్చింది లేదు. వీళ్ళు ఏ ఊరిమీద షికారు కొడుతున్నారో ఛీ ఛీ... ఏం ఇల్లో ఏం సంసార మో" షర్టును తను మామూలుగా తగిలించే కిటికీ రెక్కికు తగిలించను వెళ్లాడు .
ఇంతలోనే వెనుకనుంచి రాధ…
"ఏమండీ రామారావుగారూ....” "నోర్ముయ్ తిరిగి పేరు పెట్టి పిలుస్తున్నావు "
"ఏమండో య్ రామారావుగారూ. ఒక్కసారి ఇటు తిరిగి చూడండి.
"నేను ఎక్కడికి వెళ్ల లేదు. స్నానం చేసి ఇప్పుడే వస్తున్నాను. పిల్ల లు కూడా ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని, మీ కేకల్ని విని భయపడి వంటింట్లో దాక్కొని ఉన్నారు. అన్నట్టు - మీరు ఈ ఇల్లు కాళీ చేసి వెనుక వీధిలో చేరి మూడు రో జులయింది. ఏదొ వ్యాపకంలో, అలవాటులో ఇక్కడికి వచ్చి చూసుకోకుండ ఎగురుతున్నారు.
షర్టు తగిలించిన రా మా రా పు కరంటు షాక్ కొట్టినట్టు వెనుకకు తిరిగి చూసాడు.
"తన భార్యకాదు. తన పిల్లలూ కాదు.”
కళ్ళు ఒక్క సారిగా బైర్లు కమ్మికట్టు అయ్యాయి రామారావుకు. అడు గులు వడివడిగా బ య ట కు నడిచాయి.
"ఏమండోయ్ బనియన్ తో నే వెళుతున్నారే. ఆ కిటికీకి తగిలించిన షర్ట్ మీదే "
షర్ట్ వేసుకొని తల చేతుల్లో కప్పుకొని ఎలా ఇంటిలో పడ్డాడో ఇ ప్ప టి కీ రామారావు అర్ధం కాలేదు .
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
"ఏమండీ, దీపావళి పండగ దెగ్గర పడుతోంది", అంది శకుంతల.
"అవును, నువ్వు చెప్తే కానీ మాకు తెలియదు మరి", అన్నడు భర్త నరసింహం, వెటకారంగా.వారిది ఎంత అన్యోన్య దాంపత్యమో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వెటకారం ఆయన ఇంటి పేరు. నిజమే అనుకున్నారా? కాదు అది శకుంతల ఆయనతో అనే అతి పెద్ద పరుషమైన మాట,అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఆమె ఎంత సౌమ్యమో. ఇంటి పేరు అవధానం లెండి. నరసింహానికి పేరుకు తగ్గ కోపం, కోపానికి మించిన భక్తి, దాని కి మించిన క్రమశిక్షణ, మంచి బ్యాంకు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ ,నలుగురు పిల్లలను పెంచి ప్రయోజకులని చేసారు దంపతులు.
ఇవన్నీ చేసాక ,బీపీ -షుగర్ లాంటివి కదా రావాలి? అవి రేలేదు కానీ “చాదస్తం బాగా పెరిగిందండి” అంటుంది ఆవిడ.
"పండగ దగ్గర పడుతోంది, తెలుసు! ఈసారి విజయని, గోపాల్ నీ, పిల్లల తో పాటు రమ్మని వాట్సప్ లో పెడితే, అల్లుడు గారు మనల్నే అక్కడకి రమ్మంటూ ఒకే పట్టు పట్టాడు. పండక్కి పిల్లలు రావటం కాదా నే ఆనవాయితీ? మన ఇంటా- వంట ఉందా ఆ ఆచారం? కాస్త ఆలోచించి అడగాలి గా?" అసహనం తో
అన్నడు నరసింహం,
" అయ్యో రామా! ఏమబ్బా మీ చాదస్తం? పిల్లలు వాళ్ళ కొత్త ఇల్లు మనకు చూపించాలని ముచ్చట పడుతున్నారు. ఇంతకన్నా మంచి సంప్రదాయం ఏముంటుంది?" అంది శకుంతల.
"ఓ! మీరు ముందే మాట్లాడు కున్నారు అన్నమాట. అందుకే నే నిన్ను కలువశ్రీ అనేది" వ్యంగంగా అన్నాడు నరసింహం.
అన్ని విషయాలూ పిల్లలకు కల్వం లో పోసి నూరే లాగ , నూరి పోస్తుందనే బ్రహ్మ తో, శకుంతలకు ఆయన ఇచ్చిన కితాబు “కల్వశ్రీ “.
"సరే, కానీయండీ, అన్నీ ప్లాన్ చేసుకున్నాక నేను ఎందుకు మాట్లాడడం? అయినా ఎవరన్నా ఇంటికి వెళ్ళడం అంటే క్యూలో ముందు నువ్వే ఉంటావ్ గా , బట్టలు సర్దు మరి", అన్నాడు చిరు నవ్వు తో నరసింహం.
"ముందు మీరు స్వగృహా కి వెళ్లి , నే చెప్పాను అని చెప్పి అరిసెలు, లడ్డూ, బూందీ , అలాగే జోషి దెగ్గరికి వెళ్లి గోంగూరా…." ఇంకా శకుంతల పూర్తి కూడా చేయలేదు తన మాట
"నీ పేరు చెప్పి తేవాలా? ఏ, మా మామా గారి షాపా అది? మాకు తెలుసు ఎలా బేరం ఆడాలో " అంటూ తన ఈవెనింగ్ వాక్ కి వెళ్లి పోయాడు నరసింహం.
తెల్లవారు జామున బీబీసీ వార్తలు రేడియో లో వినడం, పాలు, కాఫీ వ్యవహారం, ఓ గంట అనుష్టానం, నలభై సంవత్సరాలు పై చిలుకుగా రాస్తున్న డైరీ రాయటం, బాగా చదవడం, ఈవినింగు వాక్ వెళ్ళటం, దారి మధ్య వచ్చిన ఆంజనేయ స్వామి గుడి , శివాలయం ముందర చెప్పులు విప్పటం, బయట నుండే నమస్కారం , నల్ల కుంట మార్కెట్ వైపు ప్రయాణం, ఇదీ నరసింహం దినచర్య .
కానీ ఈ రోజు మాత్రం, పోయిన సంవత్సర దీపావళి విశేషాలు తన బుర్రలో తిరుగు తున్నాయి. మొహం పై చిరునవ్వు, మనవడు అనురాగ్ మనుమరాలు నీహారికల అల్లరి, అన్నిటికీ మించి క్రాకర్స్ అంటే బయపడే అనురాగ్. ఎందుకో అంత భయం? అందరు పిల్లలు ఒకే రకం కాదు కదా” లాంటి ఆలోచనలతో జోషి పికెల్స్ చేరుకున్నాడు నరసింహం.
దంపతులు తమ కూతురు,అల్లుడి ఇంటికి చేరారు. సరదా పలకరింపులు , పిల్లల ముచ్చట్లు, అనురాగ్ తను నేర్చుకున్న శ్లోకాలు వినిపించటం, రైమ్స్ చెప్పటం, అలా సాగిపోయింది ఆ సాయంకాలం .
"మరి లక్ష్మీ పూజకి కి సామాగ్రి? క్రాకర్స్? గోపాల్ , సాయంత్రం వెళదామా?" అడిగాడు నరసింహం.
" లక్ష్మీ పూజా? అమ్మ పేరు విజయలక్ష్మి గా , మరి అమ్మకు పూజా?" ఆడిగాడు అనురాగ్ అర్థం కాక.
“ఈ పూజ లక్ష్మి దేవికి అనురాగ్! అయినా ఇంటి ఆడపడుచు ఎవరైనా లక్షీదేవి సమానులే" అంది శకుంతల, అనురాగ్ తల నిమురుతు.
ఒకరకమైన వ్యంగ్య ముఖ కవలళిక పెట్టరు , మామా అల్లుడు.
క్రాకర్స్ అన గానే ,అనురాగ్ కళ్లలో ఆందోళన మొదలైంది.
మరు దినం వాళ్ళు పూజకు సిద్ధమవుతుండగా, అనురాగ్ కాస్త కంగారుగా చూస్తూ గదిలోకి ప్రవేశించాడు.అమ్మమ్మ చీరను లాగుతూ " అమ్మమ్మా, నేను రేపు క్రాకర్స్ పేల్చాలా?"
మెల్లిగా నవ్వింది శకుంతల. "డోంట్ వర్రీ, డియర్, తాతయ్యా నీ పక్కనే ఉంటారు".
కానీ అనురాగ్ అంతటి తో ఆగలేదు ,"అయితే... పెద్ద శబ్దాలు... నాకు భయం అమ్మమ్మ!"
" ఏంటి? నా మనవడు క్రాకర్స్‌కి భయపడుతున్నాడా? మా కాలం లో మేము, ఇలా చేతుల్లో పట్టుకొని పేల్చే వాళ్లం , ఈ క్రాకెర్స్" అన్నాడు నరసింహం.
పక్కనే నిల్చున్న గోపాల్ పరిస్థితిని గమనించి, "పెద్ద శబ్దాలకు కొంచెం అనురాగ్ సెన్సిటివ్ , మామగారు. ఇది కొంతమంది పిల్లలకు సాధారణం కదా" అన్నాడు.
"సాధారణమా? అనురాగ్, మై బాయ్, మీరు మీ భయాలను జయించాలి. క్రాకర్స్ శబ్దం లేని దీపావళి అంటే అది స్వీట్ గా లేని చాక్లెట్ లాంటిది!
మనం కలిసి క్రాకర్స్ కలుద్దాం, సరదాగా!”
ఈ సంభాషణ అనురాగ్‌కి అంత అర్ధం కాలేదు, కానీ, తాతను నిరాశపరచకూడదని తల ఊపాడు.
నరసింహం కు ఈ దీపావళి పండగ చాల బిన్నంగా ఉంది. మాములుగా పండక్కు తన ఇంటికి పిల్లని పిలవడం ఆయన ఆచారం , కానీ తానే కూతురు ఇంటికి రావడం అంత నచ్చక పోయినా, ఇదోక థ్రిల్లింగ్ బ్రేక్ గా బావించాడు.
"బాబు భయం పోగొట్టుకోవాలి, బహుశా అందుకే మనం ఇక్కడ ఉన్నామేమో"
తనలో నే తను అనుకున్నాడు, నర్సింహం.
"మీరు బాబు తో కాస్త సమయం గడపండి, కౌన్సెలింగ్ లో మీరు అది-ఇది అని చెప్పుకుంటారుగా” , నవ్వుతో అంది శకుంతల.
అనురాగ్ కి భయం పోగొట్టే బాధ్యతగ తీసుకున్నాడు, నరసింహం తాతయ్య .
అనురాగ్, తన గదిలో కూర్చొని, తన బొమ్మలతో నిశ్శబ్దంగా ఆడుకుంటూ కనిపించాడు.
“మనం అలా వాక్ కు వెల్దామా? హాయిగా కబుర్లు చెప్పుకుంటూ?” పిలిచాడు నరసింహం ప్రేమగా
అనురాగ్, సిగ్గుతో నవ్వాడు, ఇద్దరు వాక్కు కు బయలుదేరారు.
"చెప్పు అనురాగ్, “నీకు క్రాకర్స్ అంటే ఎందుకు అంత భయం?"
“బాగా గట్టిగ చప్పుడు చేస్తాయ్ , తాత! పేలే దాకా, చూస్తూ ఉండాలి,ఇంకా అవి ఎప్పుడు పేలుతాయో తెలియదు , ఎలా పేలుతాయో తెలియదు, అవి సడన్ గా గట్టిగ శబ్దం చేస్తాయ్ తాత! అందుకే భయం!" అన్నాడు మెల్లగా ,ముద్దుగా.
"అయ్యో" అన్నాడు నరసింహం ఆలోచనగా నవ్వుతూ. "నీకు తెలుసా? భయం తరచుగా తెలియని విషయాల నుండి వస్తుంది. మనకు ఏదైనా అర్థం కానప్పుడు, అది భయంగా ఉన్నదానికంటే కూడా భయంకరంగా అనిపించవచ్చు, నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను"
ఇద్దరూ ఒక బెంచీ మీద కూర్చున్నారు.
"మొదట ఆశ్చర్యం వల్ల భయం కలుగుతుంది. అకస్మాత్తుగా ఏదైనా జరిగితే, పటాకులు పేలినట్లు, అది మనల్ని భయపెడుతింది . కానీ అది జరుగుతుందని మనకు ముందే తెలిస్తే, మనం తక్కువ గా భయ పడతాం, అందుకే మనం ఎప్పుడూ క్రాకెర్స్ వెలిగించే ముందు ఒక అడుగు వెనక్కి వేస్తాం, కాబట్టి సౌండు ని ఎప్పుడు ఎక్సపెక్ట్ చేయాలో మనకు తెలుస్తుంది."
అనురాగ్ కళ్ళు పెద్దవి చేసుకుని శ్రద్ధగా వింటున్నాడు.
"రెండవది, ఐడియా లేకపోవడం వల్ల, విషయాలు భయంగా అనిపించవచ్చు. కానీ క్రాకెర్స్ జస్ట్ కాగితంలో చుట్టబడిన కొంచెం కెమికల్ మాత్రమే. మనం జాగ్రత్తగా ఉంటే, అవి అస్సలు ప్రమాదకరం కాదు. ఇది ఒక మాయాజాలం లాంటిది. ఒకసారి ఇది ఎలా పనిచేస్తుందో తెలిస్తే, అది అంత ఆహ్లాదంగా ఉంటుంది."
అనురాగ్ నెమ్మదిగా నవ్వాడు.
" మూడవది, కొన్నిసార్లు ఏదైనా ఇన్సిడెంట్ ట్రోమా తో ముడిపెట్టడం వల్ల భయం వస్తుంది. బహుశా నువ్వు ఎప్పుడో ఒకసారి పెద్ద శబ్దం విని ఏదో బాడ్ గా అనుకుంటుంటావు. కానీ , అన్ని పెద్ద శబ్దాలు ప్రమాదకరమైనవి కావు. సింహం గర్జించేది, ఉరుము చప్పుడు చేసేది గట్టి గానే, వాటి కమ్యూనికేషన్ అదే !”
సింహం గర్జించడం అనగానే అనురాగ్ నవ్వాడు. అనురాగ్ తన ఛాతీని ముందుకు పెట్టి " Yes! I am Lion " అన్నాడు.
"చివరిగా, భయం కొన్నిసార్ల మనం పెరిగే కొద్ది, అది తగ్గుతూ వస్తుంది, మనం భయపడిన చాలా విషయాలు ఫ్యూచర్ లో అంత భయం గా అనిపించవు. ఇది సైకిల్ తొక్కడం నేర్చుకున్నట్లే - మొదట, పడిపోతారని భయపడతాం, కానీ ఒకటికి రెండు సార్లు పడుతూ, లేస్తూ ప్రాక్టీస్ చేస్తే , You will relaize that, it's just a balance. ”
" Thank You తాతయ్యాయి! I want to try that soon" అనురాగ్ నవ్వుతూ అన్నా డు .
“క్రాకర్స్ ఒక్కటే కాదు అనురాగ్, జీవితం లో ఏ విషయం అయిన ఇంతే. దీన్ని లైఫ్ లెసన్ గా ట్రీట్ చెయ్యాలి” అన్నా డు నరసింహం ఎమోషనల్ గా .
శకుంతల , ఇంటిల్లిపా దుల కు నునేతో తలంటి, అందరికి తిలకంబొట్టు పెట్టి , ఆమె తయారుచేసిన మైసూర్పాక్‌ను వారికి అందించింది. పండక్కి వారు కొన్నా కొత బట్టలూ అందరికి ఇచ్చారు దంపతులు.
చిన్నవారంతా పెద్ద వారికి నమస్కారాలు చేసి ఆశీర్వచనాలు అందు కున్నారు.
మరుసటి రోజు సాయంత్రం, కుటుంబం అంతా క్రాకర్స్ పేల్చడానికి గుమిగూడగా, నరసింహం అనురాగ్ పక్కనే నిలబడి, చిన్న స్పార్క్లర్తో ప్రారంభించారు, అనురాగ్ వణుకుతున్న చేతులతో దానిని పట్టుకున్నాడు.
"ఫర్వాలేదు,నేను ఇక్కడే ఉన్నాను" మెల్లిగా అన్నాడు నరసింహం.
మెరుపులు మెరిసిపోతుంటే, అనురాగ్ సంభ్రమాశ్చర్యాలతో చూశాడు. అతనికి ఇక భయం అనిపించలేదు. వారు ఒక భూ చక్రానికి, ఆపై పూల కుండకు వెళ్లారు. అలా ఒక్కో క్రాకర్‌తో అనురాగ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది.
చివరగా, వారు పెద్ద బాంబు ని తీసుకున్నారు -అనురాగ్ ఎప్పుడూ భయపడే బిగ్గరగా సౌండు వచ్చె క్రాకర్ అది ! అయితే ఈసారి తాతయ్య భుజంపై చేయి వేసుకుని సిద్ధమయ్యాడు. వారు ఫ్యూజ్ వెలిగించి, ఇద్దరూ కలిసి వెనక్కి అడుగులు వేశారు.
”బ్యాంగ్!” గట్టిగా క్రాకర్ పేలింది, అనురాగ్ తడబడ్డాడు, కానీ అతను పరుగెత్తలేదు. పైగా , తాతను చూసి గర్వంగా నవ్వాడు.
"You did it అనురాగ్!" గట్టి గా అన్నాడు నరసింహం.
ఆ రెండు రోజులు నరసింహం , సంప్రదాయం గురించి దాని కానీ, దాని తాలూకా పట్టింపుల గురించి కానీ ఆలోచించలేదు. మనవడికి భయాన్ని పోగొట్టడం లో తన పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉన్నాడు. అందరు బోజనాలకి కూర్చున్నారు. సందడిగా నవ్వులు,మాటలతో గది నిండిపోయింది.
నరసింహం తనలోతాను అనుకుంటున్నాడు" కొన్నిసార్లు మార్పు అవసరం,అది కొత్త సవాళ్లను వాటితో పాటు కొత్త అనుభూతిని తెచ్చిపెడుతుంది ”.
తనదైన నవ్వు తో, శకుంతల వైపు చూశాడు కృతజ్ఞ తా భావంతో, ఆమె అదే నవ్వుతో అలాగే జవాబు ఇచ్చింది.
"వచ్చే సంవత్సరం, మనం మళ్ళీ దీపావళికి కలుద్దాం” అనుకున్నాడు మనసులో.
"సాంప్రదాయాలు మారొచ్చు కానీ, ప్రే మా ను రాగాలు మారకూడదు"
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
దీపావళి పండక్కి అల్లుడికి రావడం కుదరదుట. మనల్నే వాళ్ళింటికి రమ్మని ఫోన్ చేశాడు అని చెప్పాడు భార్యతో కృష్ణమూర్తి.
అదేంటి! కొత్తల్లుడు కదా, పండక్కి తను అత్తారింటికి రావడం మానేసి, మనల్ని రమ్మనమనడం ఏమిటి? పిలిచాడు కదాని.. మనం అల్లుడింటికి వెళ్ళడం ఏమిటి? ఏం బావుంటుంది? అంది రుక్మిణి.
“అదేమాట నేనూఅన్నాను. ఆ! అవన్నీ పాతకాలం పద్ధతులు మామయ్యగారు. మీరు నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా ఇక్కడివచ్చేయండి. పన్లోపనిగా మా అమ్మానాన్నగార్లని, చెల్లెలు బావగారిని కూడా ఇక్కడికే పిలిపిస్తాను. మా బావమరిది, చెల్లెలు...అదే మీఅబ్బాయి,కోడల్ని కూడా పిలిచేస్తాను. గ్రాండ్ గాలాదీపావళి సెలెబ్రేట్ చేస్కుందాం అన్నాడు.” అని అల్లుడితో జరిగిన మొత్తం సంభాషణ చెప్పాడు కృష్ణమూర్తి.
“ఇది మరీన్నీ! మనమే ఎక్కువ అనుకుంటే వాళ్లందర్నీనా? వియ్యాలవారు ఏం అనుకుంటారు?” అంది రుక్మిణి.
“వాళ్లనుకోవడం సంగతి సరే! ఒకవేళ వెళ్లామే అనుకో. ఎంత వాళ్ళింట్లో మనం ఉన్నా, మనమే అల్లుడికి అమ్మాయికి బట్టలు పెట్టాలి. ఇంక అల్లుడన్నట్టు మిగతవారందరూ వస్తే కనుక, వియ్యాలవారికీ, అల్లుడి చెల్లెలు బావగారికీ, వాళ్ళ పిల్లలకీ మనమే బట్టలు పెట్టాలి. ఇంక మనబ్బాయి,కోడలు, మనవడే కనుక వాళ్ళకీ మనమే బట్టలుపెట్టాలి. పోనీ, వాడిబట్టలు వాడే కొనుక్కుంటాడనుకుందాం. అయినాగానీ అందరి బట్టలఖర్చు మనదే. ఇవన్నీఒకెత్తు. దీపావళి సామాన్లఖర్చు ఒకటి. అల్లుడి ఈ ఆహ్వానంవెనుక ఇంత పెట్టకుట్ర ఉందంటావా!?” అన్నాడు కృష్ణమూర్తి.
“మీరూ! మీ పిచ్చిమాటలూనూ!? కుట్ర ఏమిటండీ? వాళ్లేమన్నా శత్రువులా? లేక ప్రతిపక్షాలా? పెట్టేబట్టలకికూడా అలా మొహంమాడ్చుకుంటూ పెడతారా? ఇందులో ఎవరుపరాయివాళ్ళు? అసలునిజానికి మొదటిపండక్కి అల్లుడితోపాటు, వియ్యాలవారు, అల్లుడి అక్కచెల్లెలు కుటుంబాన్నికూడా పిలిచాం. వాళ్ళకి కుదరక, మొదటి పండక్కి వాళ్ళెవరూ రానేలేదు, అమ్మాయి,అల్లుడు మాత్రమేవచ్చారు. ఒకవేళ వాళ్ళందరూ వచ్చుంటే కనుక అప్పుడు ఈ బట్టలన్నీ వాళ్ళకి పెట్టుండేవారుకదా. అప్పుడు తప్పిపోయినఖర్చు ఇప్పుడు పెడుతున్నాం అనుకోండి. అంతే కానీ, ఇలా ఏడుస్తూ పెట్టకండి. మంచిది కాదు. అన్నట్టు మర్చిపోయాను. ఒకవేళ మనబ్బాయి, కోడలు వస్తే కనుక, వాళ్ళ నెత్తిన ఈ మొత్తం ఖర్చు వేసేయకండి. ఇప్పటికే వాడు ఇక్కడికి ఎప్పుడొచ్చినా ఏవో కొని తెస్తూంటాడు.” అని మొగుడికి ఓ క్లాస్ పీకింది రుక్మిణి.
==============
నిజానికి కృష్ణమూర్తి కాస్త పిసినారి మనిషి. వచ్చేచోట రూపాయి వదలడు. ఇవ్వాల్సివస్తే.. ఏదో మెలిక పెట్టి, వీలైనంతవరకు ఇవ్వకుండా తప్పించుకుంటాడు. రైతు బజార్ కి వెళ్తే.. వాళ్ళు “పావుకేజీ 12 రూపాయలు, చిల్లర లేదు 15 కి వేసేస్తా” అని ఏ వంకాయల గురించో అంటే, వద్దు పావుకేజీనే తూచు, చిల్లర 12రూ. నేనిస్తా అని కూడా చిల్లర పట్టుకు తిరిగేరకం. ఏ షాపులోనైనా చిల్లరలేక, రిటర్న్ వాళ్ళు ఏ చాక్లెట్టో ఇస్తే, ఒప్పుకునేవాడు కాదు. నాకు సుగరయ్యా. ఈ చాక్లెట్ నేనేం చేస్కోనూ? అని ఇవ్వాల్సిన చిల్లర ఇచ్చేవరకు వదిలేవాడు కాదు. ఒకవేళ తప్పనిసరై అలాతీసుకున్న చాక్లెట్స్ అన్నీ పోగేసి, అవి మెత్తబడిపోకుండా ఫ్రిజ్ లో పెట్టి, అవి ఓ ఇరవైయ్యో ముప్ఫైయ్యో అయ్యాక, తనకవి అంటగట్టిన షాపులకేవెళ్ళి ఏవో సరుకులుకొని, ఇవ్వాల్సినడబ్బుల్లో కొంత కోతపెట్టి, “ఇదిగో, ఆ బేలన్స్ డబ్బులకు ఈ ముప్ఫై చాక్లెట్స్ తీసుకో. ఇవి రూపాయి చొప్పున ముప్ఫైరూపాయలు. ఇవి చిల్లరలేదంటూ మొన్నటిదాకా నువ్వు నాకు అంటగట్టినవే. లెక్కసరిపోయిందా!” అని అలా దాచి ఉంచిన చాక్లెట్స్ వాళ్ళకే తిరిగి అంటగట్టేవాడు. ఇక బజార్లోకి ఎప్పుడెళ్లినా, వీలైనంత వరకు పక్కింటి పాపారావు గారి బండి మీద వెనక సవారీ తనదే. తను ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వాల్సివస్తే.. నేను అలా ఇంకొకర్ని వెనక కూర్చొబెట్టుకు డ్రైవ్ చెయ్యలేనని చెప్పి తప్పించుకునే రకం.
అలాంటి కృష్ణమూర్తి కూతురిపెళ్లి కూడా ఓ రెండొందల కార్డులే ప్రింట్ చేయించి, చాలామందిని పిలవకుండా, ఎక్కువ భోజనాలఖర్చులేకుండా కానిచ్చేశాడు. తర్వాత విషయంతెల్సి, నీకూతురిపెళ్లి చేసేశావటగా. పిలవలేదేం!? అని ఎవరైనా అడిగితే.. చాలా తక్కువ టైమ్ లో కుదిరింది. మా వియ్యంకుడేమో “మా అమ్మగారి పరిస్థితేం బాలేదు. ఆవిడేమో మనవడిపెళ్లి చూస్తేగానీ చావనని యమభటులెన్నిసార్లొచ్చినా తరిమేస్తోంది. వెంటనే పెళ్లి చేసేయాలీ” అని హడావుడి చేస్తే.. తొందర్లోనే ఓ ముహూర్తం చూసి, హడావుడిగా చేసేసాం. ఎవర్ని పిలిచానో, ఎవర్ని మరిచానో కూడా తెలీలేదు. అయ్యో! మిమ్మల్నే మర్చిపోయానా!? సారీ!?” అని తప్పించుకునేవాడు.
ఇలాంటి కృష్ణమూర్తి దీపావళిపండక్కి అల్లుడు తమతోసహా అందర్నీ పిలవాలనుకోవడంతో , ఈ దీపావళి ఏ టపాసులు కాల్చకుండానే చేతులుకాలేలాఉందే అనుకున్నాడు. దీన్నుండి ఎలాగైనా తప్పించుకుందామని బెంగళూరులోఉన్న కొడుకు సుదీప్ తో మాట్లాడాడు. “నీ బావగారే మనందర్నీ దీపావళికి వాళ్ళ హైదరాబాద్ రమ్మని పిలిచాడురా. వాళ్ళు ఇక్కడికిరాకుండా, మేమే వెళ్తే ఏం బాగుంటుందని రామన్నాను. నీకు కూడా సెలవులు దొరకడం కష్టమేమో కదరా? పైగా ట్రైన్ లో రిజర్వేషన్ దొరకద్దూ?” అని ముందరికాళ్ళకి బంధం వేసినట్టు, నువ్వు రావు కదూ.. రావు.. రావు...రావడం లేదు... అని హిప్నటైజ్ చేసినట్టు మాట్లాడాడు.
“అబ్బ! ఎందుకు సెలవు దొరకదు నాన్నా. దీపావళికి ఎలాగూ సెలవే. పైగా మర్నాడు శని ఆదివారాలు. అంచేత మేం హైదరాబాద్ వెళ్లడానికి ఏఇబ్బందీలేదు. రిజర్వేషన్ దొరక్కపోతే.. కార్లో వచ్చేస్తాం. మీరూ వచ్చేయండి. అక్కడే అందరం సరదాగా దీపావళి చేసుకుందాం.” అని సుదీప్ చెప్పేసరికి నోట్లో సిగరెట్ అనుకుని బాంబు పెట్టుకు కాల్చుకున్నట్టైంది కృష్ణమూర్తి కి.
ఇక హైదరాబాద్ వెళ్ళక తప్పేట్టులేదు. తను విజయవాడలో ఉంటున్నాడు కనుక, రిజర్వేషన్ దొరకదు అని చెప్పి తప్పించుకునే వీలు లేదు. అయిదు గంటల ప్రయాణంలో బోల్దన్ని బస్సులు, రైళ్లున్నాయి. సర్లే! ఏం చేస్తాం! ఈ ఖర్చు ఇంకెక్కడో తగ్గించుకోవచ్చు అని సమాధానపడి హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధపడ్డాడు
===============
వియ్యాలవారు, అల్లుడు, అమ్మాయి విజయవాడ వస్తే తను చెయ్యాల్సిన మర్యాదలన్నీ, హైదరాబాద్ లో అల్లుడింట్లో తాము పొందారు కృష్ణమూర్తి, రుక్మిణీ. మామగారికి, అత్తగారికి తానే బట్టలు పెట్టాడు అల్లుడు. అయ్యో! ఇది మర్యాదకాదు అల్లుడు గారు, మేం మీకు పెట్టాల్సిందిపోయి, మీరే మాకు బట్టలుపెట్టడం ఏమిటి?” అని మొహమాటపడింది రుక్మిణి. కృష్ణమూర్తి మాత్రం కలిసొచ్చేకాలానికి ఖర్చు త(ప్పిం)గ్గించే అల్లుడు దొరికాడు అని మురిసిపోయాడు. కృష్ణమూర్తి కొడుకు సుదీప్, భార్య సునందతో బెంగళూరు నుండి వస్తూ.. బావగారికి, చెల్లికీ మంచి బట్టలు తీసుకొచ్చాడు. ఈ కాలం పిల్లలు ఆడైనా, మగైనా ఎప్పుడు షార్ట్స్, టీ షర్ట్స్ వేసుకునే బజార్లమ్మట కూడా తిరుగుతారు కనుక, బావగారికి, చెల్లెలికీ అవే కొనుక్కొచ్చాడు. బావగారు, చెల్లి “ఓహ్! సూపర్ సెలెక్షన్!” అని సంతోషించినా, పెద్దవాళ్ళుమాత్రం..అదే కృష్ణమూర్తి వియ్యంకుడు,వియ్యపురాలు “హవ్వ! ఇదేం పెట్టుపోతలూ!?లక్షణంగా చీరా, జాకెట్టు ముక్క ఓ బొట్టెట్టి ఇవ్వకుండా!?” అని రహస్యంగా నోళ్ళు నొక్కుకున్నారు. ఇలాంటి పెద్దమనిషి బుద్ధుల్లేని, కృష్ణమూర్తి మాత్రం ఏం బట్టలు అల్లుడికి కూతురికీ పెట్టారు అన్నది కాకుండా, తనకెంత ఖర్చు తప్పిందీ అన్నది లెక్కవేసి, దాదాపు ఓ అయిదువేలు లాభం అని లోలోన సంతోషపడ్డాడు. భార్య రుక్మిణి దగ్గరమాత్రం బయటికే సంతోషం వ్యక్తంచేశాడు. ఎవరూ చూడకుండా మొగుడిడొక్కలో ఓ పోటు పొడిచింది రుక్మిణి.
దీపావళిరోజు ఉదయం కృష్ణమూర్తి కుటుంబసభ్యులంతా దీపావళి మతాబుల సామాన్ల కొనుగోలుకు బయల్దేరబోతుంటే. కృష్ణమూర్తి “మీరాగండి.ఏ షాప్ లో కొనాలో నేను సర్వచేసి వస్తాను, అప్పుడు అందరం అక్కడికే వెళ్దాం” అని ముందుగా ఒక్కడే బయల్దేరాడు, “ఎందుకు మామగారూ.. అందరం వెళ్ళి నచ్చినవి కొనుక్కువద్దాం” అని సుదీప్ వారించినా వినలేదు. దీపావళిసామగ్రి అమ్మేషాపుల్లో ఓ ముప్ఫైషాపులు కలయతిరిగి, ధరవరలు అడిగి. వాటిలో ఓ ఇరవై మంది దాదాపు ఒకే రేటు చెప్తూండంతో.. వాటిలో ఓ మూడింటిలో ఫైనల్ రిబేట్ ఎంత అన్నది పదిసార్లు బేరమాడి ఖరారు చేసుకుని, ఇప్పుడే వస్తా... అని ఇంటికొచ్చి అందర్నీ బయల్దేరదీశాడు. మేమెందుకూ? మీ మగాళ్ళంతా వెళ్లిరండి సరదాగా అని ఆడవాళ్ళు తప్పించుకున్నారు. సరే అని కృష్ణమూర్తి, ఆయన వియ్యంకుడు, సుదీప్, కిరణ్ బయలుదేరాడు.
దార్లో “అసలు ఈ వూర్లో మీకు ఈ షాపుల గురించి ఏం తెల్సు మామగారూ? ఇక్కడా మీ బేరాలు సాగించారా ఏం!?” అనడిగాడు అల్లుడు కిరణ్
“ఇందులో తెలిసేది ఏం లేదు అల్లుడూ. నీకు తెలుసో లేదో?ఈ దీపావళి సామానుల అమ్మకాల్లో వీళ్ళు లక్ష మదుపు పెట్టి... అయిదు లక్షలు దాకా సంపాదిస్తారు. ఓ అగ్గిపెట్టెల పేక్ మీద డజన్ 350 రూ అని ఉంటుంది.. కానీ అరవై శాతం డిస్కౌంట్ అని 140 కే అమ్ముతారు. కానీ మనం వదలకుండా బేరమాడితే అది 75 కే వస్తుంది. అసలు వాళ్ళు దాన్ని కొనేదే 35 రూ లకి.. దానికి పది రెట్లు పెంచి 350 కి అమ్ముతారు. మనం గీసి గీసి బేరాలాడితే.. లాభం లో నష్టం అని 75 కే ఇచ్చేస్తారు. ఐతే మరీ నాలాగ గీసిగీసి బేరాలాడేవాళ్లు ఎక్కువమంది ఉండరు కనుక 350 చెప్పి.. ఏ 250 కో అమ్మేస్తారు. అలా అయినా వాళ్ళకి భారీగాలాభాలే కదా. అసలు అక్కడున్న బోర్డులు చూశావా? 60%, 70% డిస్కౌంట్ అని ఎలా పెట్టేరో!? దాన్ని బట్టే నీకు అర్ధమై ఉంటుంది.. ఈ దీపావళీ సామగ్రి అమ్మకం ఎంత లాభసాటి అనేది.” అన్నాడు కృష్ణమూర్తి.
“మీకోదండం మామగారూ! ఇన్ని తెలిసిన మీరే ఓ షాపుపెట్టి ఉండాల్సింది. బోల్డు లాభాలార్జించుండేవారు.” అన్నాడు కిరణ్ నవ్వుతూ.
“అయ్యో! అవును సుమీ! అల్లుడూ. నాకీ ఆలోచనే రాలేదు. ఎంతపనైంది!” అని వాపోయాడు కృష్ణమూర్తి. ఇదంతా వింటున్న మిగతావారు ఘొల్లున నవ్వేశారు.
=================
మొత్తానికి కృష్ణమూర్తి చూపించిన షాపుల్లోనే దీపావళి సామగ్రి కొన్నారు. “మీరేం డబ్బులు తీయకండి మామగారూ. దీపావళి సామానుల ఖర్చునాదే” అని కిరణ్ మామగార్నీ, నేను పే చేస్తా అని ఫోన్ పే తో సిద్ధపడ్డ బావమరిదిని అడ్డుకున్నాడు. కృష్ణమూర్తి మహదానందపడిపోగా, సుదీప్ నొచ్చుకున్నాడు. మన సొమ్ముకాదు కదా అని, కృష్ణమూర్తి తాటాకు పటాసులు, లక్ష్మీ బాంబులు కొనిపించబోయాడు.
“అబ్బే! అవన్నీ వద్దు మామగారూ. ఇప్పుడంతా సౌండ్ పొల్యూషన్, స్మోక్ పొల్యూషన్ ఉండరాదని, పైగా అవి ఎప్పుడు పడితే అప్పుడు కాల్చరాదని, రాత్రి 8 నుండి 10 గం లోపలే కాల్చాలని కోర్ట్ ఆర్డర్లున్నాయి. మనం కాదు కూడదని కొని,కాల్చితే సెక్యూరిటీ అధికారి కేసవుతుంది. ఎందుకొచ్చినగొడవ!?”అని సుదీప్ సున్నితంగా అడ్డుకున్నాడు. అయితే ఈ మతాబులు, చిచ్చు బుడ్లే మరికొన్ని కొను. బాగుంటాయి అని అవి కొంచెం ఎక్కువ కొనిపించాడు కృష్ణమూర్తి.
మొత్తానికి ఏవో మతాబాసామన్లు కొన్నామనిపించుకుని, ఇంటికొచ్చారు. పిల్లలు దీపావళి పిస్తోళ్ళతో ఢమఢమలు మొదలెట్టేశారు. చీకటిపడ్డాక, సంప్రదాయబద్ధంగా ఆడవాళ్ళు ఇంట్లో లక్ష్మీపూజ, దీపారాధన చేసి, ఇంటి ముంగిట్లో దీపాలు పెట్టారు. ఆతర్వాత అంతా తెచ్చిన మతాబా సామాన్లు కాల్చడం మొదలెట్టారు.
“మీరూ రండి, ఈ మతాబులు కాల్చండి బావగారు అని వియ్యంకుణ్ణి పిలవబోతే.. ఆయన సున్నితంగా వద్దని, “చిన్నతనంలో తెగకాల్చి ఆనందించాంగా బావగారు. ఇప్పుడుకూడా ఏంటి!? పిల్లలు కాలుస్తూంటేచూసి ఆనందించాలిగానీ!”అని పరోక్షంగా కృష్ణమూర్తినికూడా వారించాడు. “నీకు ఈవయసులో అవసరమా ఈ మతాబులు కాల్చడాలు అవీ!” అన్నట్టు చూస్తూ.
కృష్ణమూర్తికి ఆ చూపుఅర్ధమైనా, దులిపేసుకుని, “నాకుమాత్రం ఈ దీపావళి టపాకాయలు, మతాబులు అంటే మహాప్రీతి బావగారు. ఈరోజు చిన్నపిల్లాడ్నైపోతానంటే నమ్మండి. అసలు వీళ్ళు బాంబులు కొనద్దన్నారు గానీ, నాకైతే అవే ఎక్కువిష్టం. తాటాకు టపాకాయలు ఇలా చేత్తో అంటించి అలా విసిరేస్తుంటే భలే మజాగా ఉంటుంది. పోన్లెండి! ఏంచేస్తాం! ఈసారికిలా ఈ మతాబులు, చిచ్చుబుడ్లుతో కానిచ్చేస్తాను అని వియ్యంకుణ్ణి పట్టించుకోకుండా.. కొన్ని కాకర్లు, భూచక్రాలు వెలిగించి ఆనందించాడు. పిల్లలూ.. మీరు ఈ విష్ణుచక్రాలు కాల్చలేరు. ఇటివ్వండి నేను కాల్చి చూపిస్తాను అని వాటిని తీసుకు కాల్చాడు. అసలు కృష్ణమూర్తి ప్రతీ దీపావళిపండక్కి తాను కొనేసామాన్లు తక్కువ, పక్కింటివాళ్ళతో చేరి, వాళ్ళ కాకర్లు, భూచక్రాలు, విష్ణుచక్రాలు వంటివి సాయం చేస్తున్నట్టు నటిస్తూ.. కాల్చేవి ఎక్కువ.
పిల్లల చేతిలోంచి తీసుకున్న విష్ణుచక్రం కాలుస్తూంటే “జాగ్రత్తండీ. షర్ట్ పై ఆ రవ్వలు పడతాయి” అని రుక్మిణి హెచ్చరించింది. “ఏం పర్లేదులే! నాకు తెలీని విద్యలా ఇవి!” అని ఓ రెండు విష్ణు చక్రాలు కాల్చాడు. పిల్లలు కేరింతలు కొడుతుంటే.. రెచ్చి పోయి చిచ్చుబుడ్డి ఒకటి చేత్తోనే వెలిగించి దాన్ని ఇంటి కాంపౌండ్ గేటుపైన పెట్టాడు. “ఏంటినాన్నగారు! మీరు మరీనీ!” అని కిరణ్ కోప్పడ్డాడు. కొడుకు కోపాన్ని లెక్కచేయ్యకుండా, విజయగర్వంతో వియ్యంకుణ్ణి చూస్తూ ఇంకో చిచ్చుబుడ్డీ అలానే చేత్తో వెలిగించి గేటుపైన పెట్టాడు. అలా పెడుతూండగానే ఆ చిచ్చుబుడ్డీకాస్తా ఢాం అని పెద్దశబ్ధం చేస్తూ అతని చేతిలోనే పేలిపోయింది. అరచెయ్యి వెంటనే బొబ్బలెక్కిపోయింది. దాని రవ్వలు కృష్ణమూర్తి షర్ట్ పైపడి చిన్నచిన్నగా కాలి కన్నాలు పడ్డాయి. ఒక్క క్షణం చెవులు దిబ్బడవేసి, ఏం వినబడలేదు. కళ్ళు బైర్లుకమ్మి కాసేపు మసకబారాయి. అందరూ వెంటవెంటనే.. “ఏమండీ!..నాన్నగారూ.. మామయ్య గారూ... బావగారూ... అన్నయ్యగారూ.. అంకుల్... అంకుల్... తాతగారూ...! అంటూ టీవీసీరియల్లో పాత్రల్లా తమ తమ ఆందోళనాపూర్వక హావభావాలు వ్యక్తపరిచారు.
రెండు నిమిషాల తర్వాత, తేరుకున్న కృష్ణమూర్తి, పెద్ద ప్రమాదం ఏం లేదని తెల్సుకుని, “దొంగ వెధవలు! ఈ చిచ్చుబుడ్లమందులో రాళ్ళు కూడా ఏరకుండా దట్టించేశారు. దాంతో అవి ఇలా పేలి చచ్చాయి!” వాళ్ళని తిట్టి, “ఏం పర్లేదు. ఐ యాం ఆల్ రైట్!” అన్నాడు బొబ్బలెక్కిన అరచేతిని చూసుకుంటూ, మనసులో “వామ్మో! వాయ్యో! అమ్మోయ్! నానయోయ్!” అని ఏడుస్తూ. గబగబా ఇంత వెన్న పట్టుకొచ్చిన వియ్యపురాలు, రుక్మిణికి ఇచ్చింది అరచేతికి రాయమని. ఆ వెన్నపూతకి ఇంకాస్త ఉపశమనంపొందిన కృష్ణమూర్తి అందర్నీ చూసి ఓ ఏడవలేనినవ్వు నవ్వాడు.
“మీరు కాల్చాలనుకున్నబాంబు ఇలా చిచ్చుబుడ్డిరూపంలో మీచేతిలో కాలింది..అదే పేలింది. మీకోరికానెరవేరింది. ఇప్పుడు చేతవెన్నముద్దపట్టిన కృష్ణమూర్తిలా ఉన్నారు నాన్నగారు” అన్నాడు నవ్వుతూ కిరణ్, వాతావరణాన్ని తేలిక చేస్తూ. మొత్తానికి ఏ టపాసులూ కాల్చకుండానే చేతులు కాల్చుకున్న కృష్ణమూర్తి దీపావళి పండగ అల్లుడింట అలా జరిగింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
దీపావళి మజా – రాగతి రమ
"ఏమండోయ్ దీపావళికి నాకు కొత్తచీర తెచ్చారా"? అడిగింది శ్రీలత తన భర్త గోపాల్ ని"అయ్యో మర్చిపోయానే" అన్నాడు నాలికర్చుకుంటూ గోపాల్. రేపు తేకపోతే మీతో మాటలు బంద్" అంటు వార్నింగ్ ఇచ్చింది. "అది కాదే వారం తర్వాత మాట్లాడతావు కదా హమ్మయ్య ఫర్వాలేదు .."అన్నాడు "పర్వాలేదా... ఏమంటున్నారు..? మళ్లి మాట్లాడితే నెలంతా మాట్లాడను.!
"ఓసి ఓసి .. ఓసి ఎంత మంచిమాటన్నావు - గోపాల్ నీదేరా - అదృష్టం అంటే.!. మనసులో అనుకోబోయి పైకే అనేసాడు.
"నోరు మూసుకోండి " గట్టిగా అరచింది శ్రీలత. గోపాల్ నోటికి చేయి అడ్డంగా పెట్టుకొని లోనికి నడిచాడు. "ఏమండీ.." గట్టిగా అరిచింది శ్రీలత. గతుక్కుమన్నాడు గోపాల్ "ఏమిటి ఆ?"అన్నాడు దగ్గిరగా వచ్చి... మళ్లీ ఏంచావొచ్చిందిరా బాబూ అనుకుంటూ.
"ఏమండి దీపావళి దగ్గరగా వచ్చేస్తోంది - ఇల్లు దులపాల ఇల్లంతా కడగాల - పండక్కి తీపి బూందీ జంతికలూ చేయులనుకుంటున్నా ... ఆ సామగ్రంతా తోమాలి ఇంకా బోల్డన్ని పనులున్నాయి.. అందుకని వారం రోజులు "ఆఫీసుకు సెలవు పెట్టండి" గోముగా అడిగింది. "అమ్మ బాబోయ్ నా వల్ల కాదు .. కావలిస్తే ఆఫీసులొ
గొడ్డు చాకిరీ చేస్తాను గానీ ఇంట్లో ఈ గాడిద చాకిరీ నేను చేయలేనే !"
"అయితే నాకేనా పట్టింది బాధ గాడిద చాకిరీ చెయ్యడానికి మీరు హెల్ప్ చేయక పోతే *నోపండగ*
'అబ్బ రాక్షసీ నా ప్రాణాలు తీస్తున్నావు కదే!"అంటూ గొణుక్కున్నాడు
"ఏమంటున్నారు? నన్ను రాక్షసి అంటున్నారు కదూ అనండి అనండి మరేం పర్వాలే
దీనికేంటి మనసులో మాట తెలిసి పోతోంది . అనుకుంటూ బెడ్ రూం లోకి నడిచాడు.
డాడీ డాడీ అంటూ వాళ్ల పిల్లలిద్దరూ పరిగెత్తు కుంటూ వచ్చారు. "డాడీ మాకు మందుగుండు సామాను తెచ్చారా?" అన్నాజు దిలీప్. దిలీప్ 9 వ తరగతి చదువు తున్నాడు . "తొందరగా కొని తెండి నాన్నా" అంది స్వర్ణ 7వ తరగతి చదువుతోంది.
రేపు తప్పదర్రా - కొనేస్తా అన్నాడు. పిల్లలిద్దరూ సంతోషపడ్డారు.
మర్నాడు ఆపీసుకు లీవ్ పెట్టాడు. ఉదయాన్నేలేచి స్నానపానాలు కానిచ్చి కాఫీ టిఫెన్ కడుపులో పడేసుకొని - 8 గంటలకల్లా మందు గుండు సామాన్లు అమ్మెషాపుకి. అన్నిరకాలు కొని 5 వేలు కొట్టు వాడికి సమర్పించి సంచితో పాటు ఇంటికొచ్చాడు. పిల్ల లిద్దరూ సంచి లాక్కొని బోర్లించారు - కాకరపువ్వొత్తులు, మతాబాలు ,భూ చక్రాలు, టపాసులు, పాంబిళ్లలు బైట పడ్డాయి "ఏరా నచ్చిందా" అని అడిగాడు గోపాల్ "నచ్చ లేదు" అరిచింది స్వర్ణ .
"నచ్చలేదా క్రిందటి సారి లాగే అన్నీ తెచ్చానుగా....?" అన్నాడు గోపాల్ విస్తుపోతూ.
మేం బాంబులు కాలుస్తాం. మాకు తారా జువ్వలు, బాంబులే కావాలి. చిన్నపిల్లల్లగా పాం బిళ్లలూ కాకరపువ్వొత్తులు ఏంటిడాడి అవి మేం కాల్చం " అన్నాడు దిలీప్.
అవును డాడీ నేనూ అవే కాలుస్తాను. సీమటపాసులు కూడా కాలుస్తాను. అంది అంది స్వర్ణ .
ఔరా పిల్లలు 7 వ క్లాసుకే ఎంత ఎదిగి పోయారు అన్న గోపాల్ మాటకు గలగలా నవ్వింది శ్రీలత. మీలాగ బాంబులు కాల్చడం భయమనుకుంటే ఎలా...? బాంబులూ, జువ్వలు తీసుకురండి స్వర్ణ బాంబులు అవీ తీసుకు వచ్చే వరకూ ఏమీ తిననని అలిగి కూర్చుంది" అంది శ్రీలత. అంతా తల్లి పోలికే మనసులోనే అనుకున్నాడు. అంతా తల్లి పోలికే అంటూ నన్ను తిట్టు కుంటున్నారు కదూ ఉంటూ శ్రీలత నవ్వింది గతుక్కుమన్నాడు గోపాల్. శ్రీలత కెలా తెలిసి పోతోంది నా మనసులోని మాట అనుకుంటూ సంచి తీసుకొని బాంబులు తేవడానికి బయలు దేరాడు
బాంబులు, తారాజువ్వలు కొనుక్కొని పనిలో పనిగా మెగా బట్టల షాపులలో దూరి తన కిష్టమైన ఎల్లో కలర్ అద్దాల చీర కొనుక్కొని ఇంటి కొచ్చాడు గోపాల్. పిల్లలిద్దరూ సంతోషపడి పోయారు అవి చూసి“నీ చీర "అంటూ భార్యకు అందించాడు బ్యాగ్. శ్రీలత ప్యాకెట్టులో వున్న చీరని తీసి చూసింది.
విసురుగా అతని వేపు విసిరింది "పట్టు చీర తెస్తారనుకున్నా. పక్కింటి పంకజాక్షి, ఎదురింటి ఎల్లాదేవి చీరల కంటే నా చీర ధగాధగా మెరిసి పోవాలి,సరే శ్రీలతా ఈ చీరెచ్చేసి, పట్టు చీర తెస్తా అన్నాడు ఏడుపు మొఖం తో.
సరే ఈ చీర తిరిగి ఏమిస్తారు గానీ -ఈ చీరని పండగ ముందు రోజు కట్టుకుంటా సరేనా" అంటూ అతని చేతి లోని చీరను లాక్కుంది.
ఓరి శ్రీమతి ఎన్నివేషాలే అనుకుంటూ బైటికి నడిచాడు.ఆరోజే దీపావళి. ఇంటి అందరూ స్నానాదులు పూర్తి చేసారు. శ్రీలత, గోపాల్ కలిసి బొబ్బట్లు చేసారు. ఇంకా పాయసం, పులి హోర పూర్తి అయ్యాయి. శ్రీలత గ్రీన్ పట్టు చీర గోపాల్ పండక్కి- కొన్నది కట్టుకుంది. పక్కింట్లో ఎదురిల్లు ఇంకా చాలానుంది దగ్గర నుంచి గ్రీన్ పట్టుచీరకు చాలా బాగుందని ప్రశంసలు లభించాయి. గాల్లో తేలిపోతోంది శ్రీలత. సాయంత్రం లక్ష్మీ పూజ చేసారు. ఇద్దరూ కలిసి ప్రమిదలు వెలిగించి ఇల్లంతా పేర్చారు. బైట పిల్లలు అప్పుడే బాంబులు, తారాజువ్వలు కాల్లేస్తు న్నారు .
"*ఏనుండి* ఆ పెద్ద బాంబు మీరు కాల్చవలసిందే." హూంక రించింది శ్రీలత. "ఒన్ మినిట్ అంటూ పాడవైన వెదురు కర్రకి కాకరపువ్వొత్తి తాడుతో కట్టి పెద్ద బాంబూ వెలిగించ బోయడు.
"ఏమండి పక్కింటి పంకజాక్షి మిమ్మల్ని చూసి నవ్వుతోం దండి నేను సహించను. మీరు అగ్గిపుల్లతోనే బాంబూ కాల్చాలి అంటు
వెదురుకర్రను దూరంగా విసిరేసి భర్తని లాక్కుంటూ పోయింది బాంబు దగ్గిరకు. బాంబు వెలిగించగానే-ఢాం అంది. బాబోయ్ అంటూ ఎగిరి పడ్డాడు. వీరవనితలా పట్టు వదలని విక్రమార్కుడిలా బాంబులు కాల్పించింది. శ్రీలత. భయం తగ్గింది గోపాల్కి. పంకజాక్షి మూతి ముడచుకుంది. అది చూసి కిలకిలా నవ్వింది శ్రీలత. పండగ చాలా బాగా గడిచింది అంతా భార్య వల్లే అని అనుకుంటూ పైకి అన్నాడు. మరో సారి కిలకిల నవ్వింది శ్రీలత.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
బాంబు పేలింది - జీడిగుంట నరసింహ మూర్తి
"నువ్వు ఖాళీగా ఉంటే ఒకసారి నాతో వస్తావా ? నువ్వు నా పక్కన ఉంటే నేను వెళ్ళిన పని దిగ్విజయంగా జరుగుతుందని నా నమ్మకం " అన్నాడు గోపాలం తమ్ముడు నారాయణకు ఫోన్ చేసి.
“ఇప్పుడా ఏమిటి సడన్ గా ? “ అనుమానంగా అడిగాడు నారాయణ .
" అదేలే. మన మాధవికి ఎవరో ఒక సంబంధం చెపితే వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాను. నువ్వు ఓకే అంటే ఇద్దరం కలిసి వెళ్దాం " అన్నాడు మళ్ళీ.
“నో ప్రాబ్లం. అయితే రేపు పండగ ఉంది కదా ఈ రోజు సాయంత్రం వీళ్ళ దగ్గర చుట్టాల వాళ్ళింటికి వెళ్తున్నాం. మళ్ళీ ఎల్లుండికల్లా ఇంటికొచ్చేస్తాం. అప్పుడు నేను ఖాళీనే. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నీతో ఎంత టైమ్ గడపడానికైనా సిద్దం. “ అన్నాడు నారాయణ హడావిడిగా మాట్లాడుతూ.
“ఆదేలే. నేను కూడా అడ్వాన్స్ గా చెపుదామని ఫోన్ చేశాను .మాక్కూడా రేపు పండగేగా ! పండగ అయ్యాక విషయమే నేను మాట్లాడేది. .. అయితే వెళ్ళే ముందు మీ ఇంటికి వచ్చి తీసుకునే వెళతాను సరేనా.. అంటూ ఫోన్ పెట్టేశాడు గోపాలం.
గోపాలం చాలా కాలంగా తన పెద్ద కూతురు మాధవికి పెళ్లి చేయాలని ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం తో విసుగెత్తిపోయాడు. సంబంధం కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళి వెళ్ళిపోతూ ఉండటం అతనిలో రోజు రోజుకు నైరాశ్యం పెరుగుతూ వచ్చింది. పిల్లకు పెళ్లి చేయలేకపోతున్నాననే అపరాధ భావం అతన్ని వెంటాడసాగింది. పెళ్ళికి ఎదిగిన పిల్ల రోజూ కళ్ల ముందు తచ్చాడుతూ ఉంటే చూడలేక బేషిజాలు పక్కన పెట్టి ఏదో ఒక సంబంధం తన స్టేటస్ కు తగిన వాళ్ళు కాకపోయినా ముడిపెట్టేయ్యాలని ఒక నిర్ణయానికొచ్చేశాడు. .
పెళ్లి కొడుకు తండ్రి ఇచ్చిన అడ్రసు వెతుక్కుంటూ అన్నదమ్ములిద్దరూ లోపలకు జొరపడ్డారు .ఇంతకు ముందు ఎన్నో సంబంధాలు చూడటానికి వెళ్ళాడు కానీ ఈ సారి మాత్రం ఏదో అవక్తమైన బెదురూ, నీరసం ఆవహించాయి.
వీళ్ళు వస్తున్నట్టు ముందే తెలిసిన ఆ ఇంట్లో ఒక ఒక నడివయసు ఆవిడ రెండు స్టీలు గ్లాసులలో ఏదో ద్రవ పదార్ధంతో అక్కడ నిలబడి ఉంది.
"ఎండన పడి వచ్చారు. ముందు ఆ నిమ్మకాయ నీళ్ళు తాగండి మాష్టారు. . తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం .." అంటున్నాడు అప్పుడే లోపల నుండి బయటకు వచ్చిన ఒక అరవై ఏళ్ల పెద్ద మనిషి భుజంమీద టవల్ కప్పుకుంటూ . ఆయనే పెళ్లి కొడుకు తండ్రి అని తెలుస్తూనే ఉంది.
ఇంతలో ఎవరో చామన ఛాయగా , పొట్టిగా లావుగా ఉన్న వ్యక్తి మొహం నిండా జిడ్డోడిపోతూ ఉసూరుమంటూ బయట నుండి లోపలకు వచ్చాడు.
" నువ్వు ఇంత ఆలస్యంగా వస్తే ఎలా రా అబ్బాయి ? కాస్త దొడ్డి దారిన వచ్చి ఉంటే బాగుండేది. వీళ్ళు నిన్ను చూసుకోవడానికి వచ్చారు. . కాస్త బాత్ రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కుని పౌడర్ బాగా పట్టించుకుని రా ..." అన్నాడు ఆయన ఆ వ్యక్తికి మాత్రమే వినపడేటట్టుగా సైగలు చేస్తూ.
ఒక అరగంట తర్వాత ఆయన కలిపించుకుంటూ "వీడేనండీ మా అబ్బాయి సుధాకర్ .. ఈ వూళ్లోనే ఒక ప్రైవేట్ కాలేజీలో తెలుగు తెలుగు లెక్చరర్ గా చేస్తున్నాడు . ...ఈ రోజు కాలేజీకు సెలవు అని బయటకు వెళ్ళి వచ్చాడు .. నా కొడుకు అని కాదు కానీ చాలా అణుకువ , పెద్దలంటే గౌరవం వీడిలో ఉట్టి పడుతూ ఉంటాయి. “అంటూ గర్వంగా కొడుకు వైపు చూస్తూ పరిచయం చేశాడు. .
గోపాలం మొహంలో రంగులు మారుతున్నాయి క్రమం క్రమంగా. సుధాకర్ని చూడగానే మొహం చిట్లించాడు
పెళ్లి కొడుకు మొహంలో ఎక్కడా కళ , కాంతులు కనిపించడం లేదు. జుట్టు కూడా చాలా వరకు పైకి వెళ్ళి పోయింది.
ఆ క్షణంలో పెళ్లి కొడుకును చూడగానే అంతకు ముందు ఇక నుండి ఎవరి దగ్గరా తన స్టేటస్ ప్రదర్శించకూడదు అని గట్టిగా తీర్మానించుకున్న గోపాలం ఆ విషయం ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయి "ఏమిటీ మీ అబ్బాయి తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నాడా ? మరి మా అమ్మాయి ప్రభుత్వ కళాశాలలో ఆంగ్లంలో ఉన్నత ఉన్నత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది కదా ! ఇద్దరికీ ఎలా మ్యాచ్ అవుతుంది ? తెలుగు టీచర్లను అవమానించడం కాదు కానీ, ఎందుకో మా అమ్మాయి వాళ్ళను చేసుకోవడానికి ససేమిరా ఇష్టపడటం లేదు . . ఇంతకుముందు ఇలాంటి సంబంధాలు ఎన్నో తిరగగొట్టింది. ఏమైనా చివరి ఛాన్స్ గా మా అమ్మాయికి ఒకసారి చెప్పి చూస్తాను. ఇక అంతా ఆమె ఇష్టం. తన మనోభావాలను నేను ఎటువంటి పరిస్తితుఆలోనూ కించపర్చ దల్చుకోలేదు. ..... " అంటూ అసహనంగా లేచాడు గోపాలం. . నిజానికి గోపాలం కూతురికి అటువంటి అభిప్రాయం లేదు. తండ్రి ఏదో ఒక సంబంధాన్ని వెతికి త్వరగా పెళ్లి చూపుల వరకు తీసుకెళతాడని చాలా కాలం నుండి ఎదురుచూస్తోంది.
కానీ గోపాలం లోని అహంభావం, అతిశయం అతడిని ఎప్పుడూ అవతలి వాడి కన్నా అధికం అని అనిపించుకునేలా చేస్తూ ఉంటుంది. .
కనీసం పెళ్లి కొడుకు తండ్రి ఏదో చెప్పబోతున్నా వినకుండా అక్కడ నుండి కోపంగా లేచి పోయాడు గోపాలం.
“ మనం ఈ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం లెండి. కనీసం ఆ నిమ్మకాయ రసం అయినా తాగండి మాకు సంతృప్తిగా ఉంటుంది “ అని పెళ్లి కొడుకు తండ్రి అన్నాడు కానీ డోకు వచ్చేటట్టుగా వేళ్ళు పెట్టి తీసుకొచ్చిన నిమ్మకాయ రసం గ్లాసులు అన్నదమ్ములిద్దరిలో ఎవరూ తాగడానికి సాహసించకపోవడంతో ఆ నడి వయసు ఆవిడ అవకాశం దొరికింది కదా అని పక్కకు వెళ్ళి గటగటా తాగేసింది.
గోపాలం అక్కడనుండి లేచి పోయి బయటకు వచ్చేసి అప్పటికప్పుడు సంబంధం గురించి కూతురుకు ఫోన్ చేయడం మొదలు పెట్టాడు.
నారాయణ మాత్రం ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు.
" సార్. మీరేమీ అనుకోక పోతే నాకు కూడా ఒక అమ్మాయి ఉంది. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నదే మా అమ్మాయి. మా అన్నయ్యకు మీ అబ్బాయి నచ్చకపోతే నచ్చకపోయాడు. నాకు బాగా నచ్చాడు. మా అన్నయ్య తన తొందరపాటు చర్యలతో ఎన్నో సంబంధాలు చెడగొట్టుకున్నాడు. నేను మా అమ్మాయికి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాను. దయచేసి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి. ఒక రెండు రోజులలో మా ఇంట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాను. మీరు అడిగిన కట్నం అంతా కూడా ఇస్తాను..." అని నారాయణ పెళ్లి కొడుకు తండ్రి రెండు చేతులు పట్టుకుని బ్రతిమాలడంతో ఆయన కూడా సుముఖంగా చేతులు కలిపాడు.
తన అన్నగారు ఎన్నో సంబంధాలు వెతుకుతూ ఉండటం, ఒక్క సంబంధం కూడా కుదరకపోవడం కళ్ళారా చూస్తున్న నారాయణ తను తన కూతురు విషయంలో అవే పొరపాట్లు చేయడం ఇష్టం లేక అన్నగారి కోసం వచ్చిన సంబంధాన్ని తన తెలివి తేటలతో సులువుగా చేజిక్కించుకుంటే , ఎన్నో సంబంధాలు వచ్చినా తన కొడుకు అందచందాలు చూసి పెదవి విరిచేసి వెళ్ళి పోతున్న పెళ్లి కొడుకు సుధాకర్ తండ్రికి కష్టపడకుండానే కొడుక్కి పెళ్లి కుదరడంతో నెత్తి మీద పాలు పోసినట్లయ్యింది.
నారాయణ ఇంట్లో పెళ్లి చూపులలో సుధాకర్ని, అతని తండ్రిని చూసిన గోపాలం ,అంతకు ముందు తనకు తోడుగా వచ్చిన తన తమ్ముడు నారాయణ తెలివిగా, చాకచక్యంగా తన కూతురు కోసం చూడటానికి వెళ్ళిన సంబంధాన్ని కాప్చర్ చేసుకోవడం చూశాక తన అతి తెలివితేటలతో, మూర్ఖత్వంతో ఎన్నో సంబంధాలు చేచేతులా చెడగొట్టుకుంటున్నానన్న పశ్చాత్తాపం గోపాలంలో అనువణువూ ఆవరించింది.
తన బాబాయి కూతురికి పెళ్లి సంబంధం తనకన్నా ముందే కుదిరిపోయిందని తెలుసుకున్న గోపాలం కూతురు మాధవి ఒక రోజు రాత్రి తీవ్ర కోపంతో మండిపడుతూ "నువ్వు నీ జీవితంలో ఎప్పటికైనా నాకు పెళ్లి చెయ్యగలవా ? లేదంటే నా దారి నన్ను చూసుకోమంటావా ?" అని బెదిరించడంతో గోపాలం వణికిపోతూ చూస్తూ “ అలాగే తల్లీ నాదేముంది ఏ అనామకుడినో , వెర్రివాడినో ఇచ్చి వారం రోజుల్లో పెళ్లి చేసేస్తాను . ఇక నీ ఖర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. “ అంటూ అక్కడ నుండి మనస్తాపంతో వెళ్ళి పోయాడు.
తండ్రి మాట మీద ఏ మాత్రం నమ్మకం లేని గోపాలం కూతురు కొన్నాళ్ళకు తను కాలేజీలో తనని బాగా ఇష్టపడుతూ వచ్చిన తన స్తాయి కన్నా తక్కువైన ఒక తెలుగు డిమానిస్ట్రేటర్ని పెళ్లి చేసుకుని జీవితంలో హాయిగా స్తిరపడిపోయింది. ..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
మళ్లీ వచ్చే దీపావళి - తన్నీరు శశికళ
"ఏమండీ,నాన్న ఫోన్ చేసారు" చెప్పింది కావ్య.
ఎడమకన్ను టపీ టపీ మని కొట్టుకుంది సూర్యానికి.
"బాగున్నారా మావయ్య" అడిగాడు.
"బాగున్నామోయ్! ఇక బయలుదేరి రండి మా ఇంటికి."అన్నాడు మావయ్య.
"దేనికి" టపటపా కొట్టుకుంటున్న ఎడమ కంటిని నులుముకుంటూ.
"దేనికేమిటోయ్.దీపావళికి.అమ్మాయికి నీకు పెళ్లి తరువాత ఫస్ట్ దీపావళి కదా. ఏలూరంతా మోత మోగిపోవాలి." చెప్పాడు మావయ్య.
"అల్లుడు గారండి మీరు,అమ్మాయి ఒక పదిరోజులు ముందుగా రావాలి." ప్రేమగా పిలిచారు అత్తగారు.
ఏదో ఒకటి చెప్పేలోగా గడప దాటబోయి తూలి పడ్డాడు....కెవ్వుమంటూ.
"ఏమిటి బాబు ఆ కేకలు?"భయంగా అంది అత్తగారు.
క్రింద పడిన సూర్యం చేతిలో నుండి ఫోన్ తీసుకొని "ఏమి కాలేదు లేమ్మా.మేము వస్తాము. మీరు ఏర్పాట్లు చూసుకోండి." చెప్పింది కావ్య.
**********
కారు ఊరు పొలిమేరలోకి రాగానే ఏదో ఊరేగింపు.
"ఏమిటిది?" అనుకుంటూ కార్ దిగాడు సూర్యం.అటు నుండి కావ్య దిగింది.
వెంటనే సర్ మంటు ఆకాశ చువ్వ పైకెగిరి "డాం" అంటూ పేలింది. ఉలిక్కిపడి గెంతాడు సూర్యం.
"అటు కాదు అల్లుడు ఇటు" లాగాడు మావయ్య.
సరిగ్గా సూర్యం నిలబడిన చోట పడింది ఆకాశచువ్వ కాలిన వెదురుకర్ర.
"నయం.మామగారు లాగకుంటే బుర్ర బొక్కపడిపోయేది." తల రుద్దుకుంటూ వెర్రి నవ్వు నవ్వాడు.
ఉన్నట్లుండి బ్యాండ్ మేళం మొదలు. ఎన్ని స్పీకర్ లు పెట్టారో మోత మోగిపోతుంది.
"ఏమిటిది?" అడిగాడు సూర్యం.
ఆ శబ్దాల్లో మావయ్య చెప్పేది వినబటంలేదు. ఉన్నట్లుండి మామగారు గజమాల అల్లుడి మెడలో వేసారు.
"ఈ జిల్లాలో ఈ మాలను మించిన మాల వేసుకున్న అల్లుడు లేడు."గర్వం గా అన్నాడు మావయ్య.
కావ్య ముసి ముసి నవ్వులు నవ్వుతుంది.
"సరే" మాల తీసేయ్యపోయాడు సూర్యం.
"ఏమిటి తీసేది అల్లుడుగారు.ఇంటికి వెళ్ళేదాకా ఉండాల్సిందే మెడలో మాల." చెపుతూ ఉంటే ఊరేగింపు ముందుకు నడిచింది.
మేళాలు,తాళాలు, టపాసుల మోతలు, వెనుక మాలలో మునిగిపోయిన సూర్యం తల. రెండు కిలోమీటర్లు నడిచేసరికి వీధి మొదులుకు వచ్చారు.వంగిపోయిన మెడని కొంచెం పైకెత్తి చూసాడు సూర్యం. మాల పూల సందుల్లోంచి దూరంగా అత్తగారిల్లు కనపడింది.
"హమ్మయ్య,ఈ నాలుగు అడుగులు వేసేస్తే చాలు.ఈ మాల బరువు పూర్తి అవుతుంది." అనుకోని వేగంగా అడుగెయ్యబోయాడు సూర్యం.
"డాం" అన్న శబ్దానికి ఉలిక్కిపడి వెనక్కి గెంతాడు. పూలమాల బరువుకి బ్యాలెన్స్ తప్పి మావయ్య మీద పడ్డాడు.
"అద్గది లెక్క.అల్లుడంటే అలా వీధి ఆదరాలి.నీ కోసం 20000 సరం తెప్పించాము అల్లుడు.గంట కాలుతుంది." మీసం మెలేస్తూ అన్నాడు మావయ్య.
"ఇంకో గంట దీనిని మెడలో మొయ్యాలా?" దిగులుగా అనుకున్నాడు సూర్యం.
కావ్య ఆనందం గా టపాసుల శబ్దం వింటూ వీధిలో వాళ్ళు అందరూ బయటకు వచ్చి చూస్తున్నారో లేదో గమనించింది.
"అందరూ వచ్చారు." నవ్వుకుంది.
మెల్లిగా మెడతో పాటు సూర్యం మోకాళ్ళు కూడా కుంగిపోతున్నాయి.
"పదండి అల్లుడుగారు" అన్నాడు మావయ్య.
ఇంటికి చేరి గుమ్మడికాయ దిష్టి,హారతి తీసేసరికి...
"ఏరి అల్లుడుగారు?" వెతికింది అత్త.
మెల్లిగా మాలతో సహా పాక్కుంటూ లోపలికి వెళ్లి మాల పక్కనపడేసి కుర్చీలో కూర్చున్నాడు సూర్యం.
"బాగున్నారా బాబు" పలకరించింది అత్తగారు.పక్కన పళ్ళాలలో 100 రకాల కూల్ డ్రింక్స్,కొబ్బరి నీళ్లు,మజ్జిగ,లస్సి.
"ఇవన్నీ వదలకుండా తాగాలి అల్లుడుగారు. మీ కోసమే మావయ్య తెప్పించారు."చెప్పింది అత్తగారు.
తల ఎత్తకుండా తల ఊపుతున్న అల్లుడిని చూసి "ఎంత గౌరవమో మా అల్లుడుగారికి." మురిసిపోయింది.
"ఏమిటి నాన్న అన్నీ ఆయనకేనా! నాకు లేవా?" అడిగింది కావ్య.
"నీకు కావాలంటే లోపలికి వెళ్లి త్రాగు.ఇవన్నీ అల్లుడుగారికే." చెప్పాడు మావయ్య.
కొంగ మెడలాగా జారిపోయిన తలని మెల్లిగా ఎత్తి చూసాడు సూర్యం. అన్ని కూల్ డ్రింక్స్ చూసేసరికి తల సర్రున వాలిపోయింది.
"అల్లుడు మోహమాటపడుతున్నారు.మీరే త్రాగించండి." వెండి గ్లాస్ లో కొబ్బరినీళ్లు ఇచ్చింది అత్తగారు.
"త్రాగండి అల్లుడుగారు."బలవంతంగా మెడ పైకి ఎత్తి నోటిలో పోసాడు మావగారు.
గింజుకుంటున్న సూర్యాన్ని"మోహమాటపడకండి.అన్నీ త్రాగాలి." మెల్లిగా ఒక్కొక్కటి నోట్లో
పోసారు.
అన్ని కలిసిన కడుపులో కథాకళి. ఒక్కసారిగా డొక్కున్నాడు. భళ్ళుమంటూ మావగారి నోట్లో పడింది. కెవ్వుమంటూ వెనక్కి జరిగాడు మామగారు.
"అయ్యో ఊరంతా దిష్టి పెట్టారు అల్లుడుగారికి." అత్తగారు పరిగెత్తుకెళ్లి గుప్పెడు మిరక్కాయలు తెచ్చి దిష్టి తీసి కుంపట్లో వేసింది.
ఇల్లంతా "ఖళ్లు"మంటూ దగ్గులు.మధ్యలో ఎలాగో బెడ్ రూమ్ లోకి జారుకున్నాడు సూర్యం.
**********
"ఏమండీ,అమ్మవాళ్ళు భోజనానికి పిలుస్తున్నారు." మెల్లిగా సూర్యం మెడ నిమురుతూ చెప్పింది కావ్య.
కాస్త భార్య స్పర్శతో మెడ కుదుటపడి మెల్లిగా నవ్వాడు సూర్యం.
"ఏమండీ,ఇందాక ఏమి త్రాగలేదు. ఇప్పుడైనా కొంచెం బాగా తినండి. వాళ్ళకి గౌరవం కదా!" మెల్లిగా అంది.
సరే అన్నట్లు తల ఊపాడు.
కావ్య ముందు నడిచింది.
"ఇదేమిటి భోజనాల బల్ల ఇటు కదా?" అన్నాడు సూర్యం.
"అది మాకు.కొత్త అల్లుడికి వేరే ఉంది." నవ్వుతూ హాల్ లోకి తీసుకొని వెళ్ళింది కావ్య.
హాల్ లో పది బల్లలు కలిపి మంచి క్లాత్ వేసి పూలతో డెకరేషన్ చేసి ఉన్నారు. మొత్తం వెయ్యి రకాల పైనే వంటకాలు పెద్ద వెండి ఆకు చుట్టూ ఉన్నాయి.
"కూర్చోండి అల్లుడుగారు.మీరు ఒక్కటి కూడా వదలకుండా అన్నీ తినాలి.ఇవన్నీ నెల రోజుల నుండి చేయించారు మీ మామగారు." ప్రేమగా వడ్డించింది అత్తయ్య.
భార్య వైపు దీనంగా చూసాడు సూర్యం. అంతకన్నా దీనంగా చూసి తినమన్నట్లు సైగ చేసింది కావ్య.
"సరే కొంచెం పులిహార పెట్టండి."అడిగాడు సూర్యం.
"ఏ పులిహోర? నిమ్నకాయ,చింతాపండా,దబ్బకాయా, మామిడి కాయా,దానిమ్మ కాయా?" ఇరవై రకాల పేర్లు చదువుతూ కొంచెం వడ్డించింది అత్తగారు.
"ఇదిగోండి మీకోసం స్పెషల్ గా చేయించారు పనసకాయ పులిహోర." వడ్డించింది.
"పనసకాయ?" ఉలిక్కిపడ్డాడు.
"అది ఆవపెట్టి చేస్తారు కదా?"అడిగాడు సూర్యం.
"అయ్యో అది పాత మోడల్.ఐపొడు దానితో బిర్యానీ,మంచూరియా,పులిహోర,తద్దోజనం ఇంకా పనసపండు పాయసం కూడా చేయించాము."గర్వంగా అన్నాడు మావగారు.
మెల్లిగా వడ్డన మొదలు అయింది.పది మంది ఆ చివర నుండి ఈ చివరకు తిరుగుతూ వడ్డిస్తూనే ఉన్నారు.
"ఇంకొంచెం ఇంకొంచెం" అనే మాట తప్ప వేరేమాట లేదు. కడుపు ఉబ్బిపోయి కంచం కనపడటం లేదు సూర్యానికి. భార్యకు సైగ చేసి స్పృహ తప్పి పడిపోయాడు సూర్యం.
*********
మెల్లిగా కళ్ళు తెరిచేసరికి బయటి నుండి మావగారి మాటలు వినపడుతూ ఉన్నాయి.
"ఏమి అల్లుడొ.పట్టుమని పదహారు రకాలు తినేసరికి పటాసులాగా పగిలిపోయాడు. ఇక టపాసులు ఏమి కాలుస్తాడు? ఈ ఏడాది ఇక ఇంతే.ఈసారి ఏడాది అన్నా వేయి వంటకాలతో కొత్త పండుగ చేయుస్తాను." అంటున్నాడు.
"దేవుడా" మళ్లీ స్పృహ తప్పిపోయింది సూర్యానికి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
మళ్లీ వచ్చే దీపావళి - తన్నీరు శశికళ
"ఏమండీ,నాన్న ఫోన్ చేసారు" చెప్పింది కావ్య.
ఎడమకన్ను టపీ టపీ మని కొట్టుకుంది సూర్యానికి.
"బాగున్నారా మావయ్య" అడిగాడు.
"బాగున్నామోయ్! ఇక బయలుదేరి రండి మా ఇంటికి."అన్నాడు మావయ్య.
"దేనికి" టపటపా కొట్టుకుంటున్న ఎడమ కంటిని నులుముకుంటూ.
"దేనికేమిటోయ్.దీపావళికి.అమ్మాయికి నీకు పెళ్లి తరువాత ఫస్ట్ దీపావళి కదా. ఏలూరంతా మోత మోగిపోవాలి." చెప్పాడు మావయ్య.
"అల్లుడు గారండి మీరు,అమ్మాయి ఒక పదిరోజులు ముందుగా రావాలి." ప్రేమగా పిలిచారు అత్తగారు.
ఏదో ఒకటి చెప్పేలోగా గడప దాటబోయి తూలి పడ్డాడు....కెవ్వుమంటూ.
"ఏమిటి బాబు ఆ కేకలు?"భయంగా అంది అత్తగారు.
క్రింద పడిన సూర్యం చేతిలో నుండి ఫోన్ తీసుకొని "ఏమి కాలేదు లేమ్మా.మేము వస్తాము. మీరు ఏర్పాట్లు చూసుకోండి." చెప్పింది కావ్య.
**********
కారు ఊరు పొలిమేరలోకి రాగానే ఏదో ఊరేగింపు.
"ఏమిటిది?" అనుకుంటూ కార్ దిగాడు సూర్యం.అటు నుండి కావ్య దిగింది.
వెంటనే సర్ మంటు ఆకాశ చువ్వ పైకెగిరి "డాం" అంటూ పేలింది. ఉలిక్కిపడి గెంతాడు సూర్యం.
"అటు కాదు అల్లుడు ఇటు" లాగాడు మావయ్య.
సరిగ్గా సూర్యం నిలబడిన చోట పడింది ఆకాశచువ్వ కాలిన వెదురుకర్ర.
"నయం.మామగారు లాగకుంటే బుర్ర బొక్కపడిపోయేది." తల రుద్దుకుంటూ వెర్రి నవ్వు నవ్వాడు.
ఉన్నట్లుండి బ్యాండ్ మేళం మొదలు. ఎన్ని స్పీకర్ లు పెట్టారో మోత మోగిపోతుంది.
"ఏమిటిది?" అడిగాడు సూర్యం.
ఆ శబ్దాల్లో మావయ్య చెప్పేది వినబటంలేదు. ఉన్నట్లుండి మామగారు గజమాల అల్లుడి మెడలో వేసారు.
"ఈ జిల్లాలో ఈ మాలను మించిన మాల వేసుకున్న అల్లుడు లేడు."గర్వం గా అన్నాడు మావయ్య.
కావ్య ముసి ముసి నవ్వులు నవ్వుతుంది.
"సరే" మాల తీసేయ్యపోయాడు సూర్యం.
"ఏమిటి తీసేది అల్లుడుగారు.ఇంటికి వెళ్ళేదాకా ఉండాల్సిందే మెడలో మాల." చెపుతూ ఉంటే ఊరేగింపు ముందుకు నడిచింది.
మేళాలు,తాళాలు, టపాసుల మోతలు, వెనుక మాలలో మునిగిపోయిన సూర్యం తల. రెండు కిలోమీటర్లు నడిచేసరికి వీధి మొదులుకు వచ్చారు.వంగిపోయిన మెడని కొంచెం పైకెత్తి చూసాడు సూర్యం. మాల పూల సందుల్లోంచి దూరంగా అత్తగారిల్లు కనపడింది.
"హమ్మయ్య,ఈ నాలుగు అడుగులు వేసేస్తే చాలు.ఈ మాల బరువు పూర్తి అవుతుంది." అనుకోని వేగంగా అడుగెయ్యబోయాడు సూర్యం.
"డాం" అన్న శబ్దానికి ఉలిక్కిపడి వెనక్కి గెంతాడు. పూలమాల బరువుకి బ్యాలెన్స్ తప్పి మావయ్య మీద పడ్డాడు.
"అద్గది లెక్క.అల్లుడంటే అలా వీధి ఆదరాలి.నీ కోసం 20000 సరం తెప్పించాము అల్లుడు.గంట కాలుతుంది." మీసం మెలేస్తూ అన్నాడు మావయ్య.
"ఇంకో గంట దీనిని మెడలో మొయ్యాలా?" దిగులుగా అనుకున్నాడు సూర్యం.
కావ్య ఆనందం గా టపాసుల శబ్దం వింటూ వీధిలో వాళ్ళు అందరూ బయటకు వచ్చి చూస్తున్నారో లేదో గమనించింది.
"అందరూ వచ్చారు." నవ్వుకుంది.
మెల్లిగా మెడతో పాటు సూర్యం మోకాళ్ళు కూడా కుంగిపోతున్నాయి.
"పదండి అల్లుడుగారు" అన్నాడు మావయ్య.
ఇంటికి చేరి గుమ్మడికాయ దిష్టి,హారతి తీసేసరికి...
"ఏరి అల్లుడుగారు?" వెతికింది అత్త.
మెల్లిగా మాలతో సహా పాక్కుంటూ లోపలికి వెళ్లి మాల పక్కనపడేసి కుర్చీలో కూర్చున్నాడు సూర్యం.
"బాగున్నారా బాబు" పలకరించింది అత్తగారు.పక్కన పళ్ళాలలో 100 రకాల కూల్ డ్రింక్స్,కొబ్బరి నీళ్లు,మజ్జిగ,లస్సి.
"ఇవన్నీ వదలకుండా తాగాలి అల్లుడుగారు. మీ కోసమే మావయ్య తెప్పించారు."చెప్పింది అత్తగారు.
తల ఎత్తకుండా తల ఊపుతున్న అల్లుడిని చూసి "ఎంత గౌరవమో మా అల్లుడుగారికి." మురిసిపోయింది.
"ఏమిటి నాన్న అన్నీ ఆయనకేనా! నాకు లేవా?" అడిగింది కావ్య.
"నీకు కావాలంటే లోపలికి వెళ్లి త్రాగు.ఇవన్నీ అల్లుడుగారికే." చెప్పాడు మావయ్య.
కొంగ మెడలాగా జారిపోయిన తలని మెల్లిగా ఎత్తి చూసాడు సూర్యం. అన్ని కూల్ డ్రింక్స్ చూసేసరికి తల సర్రున వాలిపోయింది.
"అల్లుడు మోహమాటపడుతున్నారు.మీరే త్రాగించండి." వెండి గ్లాస్ లో కొబ్బరినీళ్లు ఇచ్చింది అత్తగారు.
"త్రాగండి అల్లుడుగారు."బలవంతంగా మెడ పైకి ఎత్తి నోటిలో పోసాడు మావగారు.
గింజుకుంటున్న సూర్యాన్ని"మోహమాటపడకండి.అన్నీ త్రాగాలి." మెల్లిగా ఒక్కొక్కటి నోట్లో
పోసారు.
అన్ని కలిసిన కడుపులో కథాకళి. ఒక్కసారిగా డొక్కున్నాడు. భళ్ళుమంటూ మావగారి నోట్లో పడింది. కెవ్వుమంటూ వెనక్కి జరిగాడు మామగారు.
"అయ్యో ఊరంతా దిష్టి పెట్టారు అల్లుడుగారికి." అత్తగారు పరిగెత్తుకెళ్లి గుప్పెడు మిరక్కాయలు తెచ్చి దిష్టి తీసి కుంపట్లో వేసింది.
ఇల్లంతా "ఖళ్లు"మంటూ దగ్గులు.మధ్యలో ఎలాగో బెడ్ రూమ్ లోకి జారుకున్నాడు సూర్యం.
**********
"ఏమండీ,అమ్మవాళ్ళు భోజనానికి పిలుస్తున్నారు." మెల్లిగా సూర్యం మెడ నిమురుతూ చెప్పింది కావ్య.
కాస్త భార్య స్పర్శతో మెడ కుదుటపడి మెల్లిగా నవ్వాడు సూర్యం.
"ఏమండీ,ఇందాక ఏమి త్రాగలేదు. ఇప్పుడైనా కొంచెం బాగా తినండి. వాళ్ళకి గౌరవం కదా!" మెల్లిగా అంది.
సరే అన్నట్లు తల ఊపాడు.
కావ్య ముందు నడిచింది.
"ఇదేమిటి భోజనాల బల్ల ఇటు కదా?" అన్నాడు సూర్యం.
"అది మాకు.కొత్త అల్లుడికి వేరే ఉంది." నవ్వుతూ హాల్ లోకి తీసుకొని వెళ్ళింది కావ్య.
హాల్ లో పది బల్లలు కలిపి మంచి క్లాత్ వేసి పూలతో డెకరేషన్ చేసి ఉన్నారు. మొత్తం వెయ్యి రకాల పైనే వంటకాలు పెద్ద వెండి ఆకు చుట్టూ ఉన్నాయి.
"కూర్చోండి అల్లుడుగారు.మీరు ఒక్కటి కూడా వదలకుండా అన్నీ తినాలి.ఇవన్నీ నెల రోజుల నుండి చేయించారు మీ మామగారు." ప్రేమగా వడ్డించింది అత్తయ్య.
భార్య వైపు దీనంగా చూసాడు సూర్యం. అంతకన్నా దీనంగా చూసి తినమన్నట్లు సైగ చేసింది కావ్య.
"సరే కొంచెం పులిహార పెట్టండి."అడిగాడు సూర్యం.
"ఏ పులిహోర? నిమ్నకాయ,చింతాపండా,దబ్బకాయా, మామిడి కాయా,దానిమ్మ కాయా?" ఇరవై రకాల పేర్లు చదువుతూ కొంచెం వడ్డించింది అత్తగారు.
"ఇదిగోండి మీకోసం స్పెషల్ గా చేయించారు పనసకాయ పులిహోర." వడ్డించింది.
"పనసకాయ?" ఉలిక్కిపడ్డాడు.
"అది ఆవపెట్టి చేస్తారు కదా?"అడిగాడు సూర్యం.
"అయ్యో అది పాత మోడల్.ఐపొడు దానితో బిర్యానీ,మంచూరియా,పులిహోర,తద్దోజనం ఇంకా పనసపండు పాయసం కూడా చేయించాము."గర్వంగా అన్నాడు మావగారు.
మెల్లిగా వడ్డన మొదలు అయింది.పది మంది ఆ చివర నుండి ఈ చివరకు తిరుగుతూ వడ్డిస్తూనే ఉన్నారు.
"ఇంకొంచెం ఇంకొంచెం" అనే మాట తప్ప వేరేమాట లేదు. కడుపు ఉబ్బిపోయి కంచం కనపడటం లేదు సూర్యానికి. భార్యకు సైగ చేసి స్పృహ తప్పి పడిపోయాడు సూర్యం.
*********
మెల్లిగా కళ్ళు తెరిచేసరికి బయటి నుండి మావగారి మాటలు వినపడుతూ ఉన్నాయి.
"ఏమి అల్లుడొ.పట్టుమని పదహారు రకాలు తినేసరికి పటాసులాగా పగిలిపోయాడు. ఇక టపాసులు ఏమి కాలుస్తాడు? ఈ ఏడాది ఇక ఇంతే.ఈసారి ఏడాది అన్నా వేయి వంటకాలతో కొత్త పండుగ చేయుస్తాను." అంటున్నాడు.
"దేవుడా" మళ్లీ స్పృహ తప్పిపోయింది సూర్యానికి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
మళ్లీ వచ్చే దీపావళి - తన్నీరు శశికళ
"ఏమండీ,నాన్న ఫోన్ చేసారు" చెప్పింది కావ్య.
ఎడమకన్ను టపీ టపీ మని కొట్టుకుంది సూర్యానికి.
"బాగున్నారా మావయ్య" అడిగాడు.
"బాగున్నామోయ్! ఇక బయలుదేరి రండి మా ఇంటికి."అన్నాడు మావయ్య.
"దేనికి" టపటపా కొట్టుకుంటున్న ఎడమ కంటిని నులుముకుంటూ.
"దేనికేమిటోయ్.దీపావళికి.అమ్మాయికి నీకు పెళ్లి తరువాత ఫస్ట్ దీపావళి కదా. ఏలూరంతా మోత మోగిపోవాలి." చెప్పాడు మావయ్య.
"అల్లుడు గారండి మీరు,అమ్మాయి ఒక పదిరోజులు ముందుగా రావాలి." ప్రేమగా పిలిచారు అత్తగారు.
ఏదో ఒకటి చెప్పేలోగా గడప దాటబోయి తూలి పడ్డాడు....కెవ్వుమంటూ.
"ఏమిటి బాబు ఆ కేకలు?"భయంగా అంది అత్తగారు.
క్రింద పడిన సూర్యం చేతిలో నుండి ఫోన్ తీసుకొని "ఏమి కాలేదు లేమ్మా.మేము వస్తాము. మీరు ఏర్పాట్లు చూసుకోండి." చెప్పింది కావ్య.
**********
కారు ఊరు పొలిమేరలోకి రాగానే ఏదో ఊరేగింపు.
"ఏమిటిది?" అనుకుంటూ కార్ దిగాడు సూర్యం.అటు నుండి కావ్య దిగింది.
వెంటనే సర్ మంటు ఆకాశ చువ్వ పైకెగిరి "డాం" అంటూ పేలింది. ఉలిక్కిపడి గెంతాడు సూర్యం.
"అటు కాదు అల్లుడు ఇటు" లాగాడు మావయ్య.
సరిగ్గా సూర్యం నిలబడిన చోట పడింది ఆకాశచువ్వ కాలిన వెదురుకర్ర.
"నయం.మామగారు లాగకుంటే బుర్ర బొక్కపడిపోయేది." తల రుద్దుకుంటూ వెర్రి నవ్వు నవ్వాడు.
ఉన్నట్లుండి బ్యాండ్ మేళం మొదలు. ఎన్ని స్పీకర్ లు పెట్టారో మోత మోగిపోతుంది.
"ఏమిటిది?" అడిగాడు సూర్యం.
ఆ శబ్దాల్లో మావయ్య చెప్పేది వినబటంలేదు. ఉన్నట్లుండి మామగారు గజమాల అల్లుడి మెడలో వేసారు.
"ఈ జిల్లాలో ఈ మాలను మించిన మాల వేసుకున్న అల్లుడు లేడు."గర్వం గా అన్నాడు మావయ్య.
కావ్య ముసి ముసి నవ్వులు నవ్వుతుంది.
"సరే" మాల తీసేయ్యపోయాడు సూర్యం.
"ఏమిటి తీసేది అల్లుడుగారు.ఇంటికి వెళ్ళేదాకా ఉండాల్సిందే మెడలో మాల." చెపుతూ ఉంటే ఊరేగింపు ముందుకు నడిచింది.
మేళాలు,తాళాలు, టపాసుల మోతలు, వెనుక మాలలో మునిగిపోయిన సూర్యం తల. రెండు కిలోమీటర్లు నడిచేసరికి వీధి మొదులుకు వచ్చారు.వంగిపోయిన మెడని కొంచెం పైకెత్తి చూసాడు సూర్యం. మాల పూల సందుల్లోంచి దూరంగా అత్తగారిల్లు కనపడింది.
"హమ్మయ్య,ఈ నాలుగు అడుగులు వేసేస్తే చాలు.ఈ మాల బరువు పూర్తి అవుతుంది." అనుకోని వేగంగా అడుగెయ్యబోయాడు సూర్యం.
"డాం" అన్న శబ్దానికి ఉలిక్కిపడి వెనక్కి గెంతాడు. పూలమాల బరువుకి బ్యాలెన్స్ తప్పి మావయ్య మీద పడ్డాడు.
"అద్గది లెక్క.అల్లుడంటే అలా వీధి ఆదరాలి.నీ కోసం 20000 సరం తెప్పించాము అల్లుడు.గంట కాలుతుంది." మీసం మెలేస్తూ అన్నాడు మావయ్య.
"ఇంకో గంట దీనిని మెడలో మొయ్యాలా?" దిగులుగా అనుకున్నాడు సూర్యం.
కావ్య ఆనందం గా టపాసుల శబ్దం వింటూ వీధిలో వాళ్ళు అందరూ బయటకు వచ్చి చూస్తున్నారో లేదో గమనించింది.
"అందరూ వచ్చారు." నవ్వుకుంది.
మెల్లిగా మెడతో పాటు సూర్యం మోకాళ్ళు కూడా కుంగిపోతున్నాయి.
"పదండి అల్లుడుగారు" అన్నాడు మావయ్య.
ఇంటికి చేరి గుమ్మడికాయ దిష్టి,హారతి తీసేసరికి...
"ఏరి అల్లుడుగారు?" వెతికింది అత్త.
మెల్లిగా మాలతో సహా పాక్కుంటూ లోపలికి వెళ్లి మాల పక్కనపడేసి కుర్చీలో కూర్చున్నాడు సూర్యం.
"బాగున్నారా బాబు" పలకరించింది అత్తగారు.పక్కన పళ్ళాలలో 100 రకాల కూల్ డ్రింక్స్,కొబ్బరి నీళ్లు,మజ్జిగ,లస్సి.
"ఇవన్నీ వదలకుండా తాగాలి అల్లుడుగారు. మీ కోసమే మావయ్య తెప్పించారు."చెప్పింది అత్తగారు.
తల ఎత్తకుండా తల ఊపుతున్న అల్లుడిని చూసి "ఎంత గౌరవమో మా అల్లుడుగారికి." మురిసిపోయింది.
"ఏమిటి నాన్న అన్నీ ఆయనకేనా! నాకు లేవా?" అడిగింది కావ్య.
"నీకు కావాలంటే లోపలికి వెళ్లి త్రాగు.ఇవన్నీ అల్లుడుగారికే." చెప్పాడు మావయ్య.
కొంగ మెడలాగా జారిపోయిన తలని మెల్లిగా ఎత్తి చూసాడు సూర్యం. అన్ని కూల్ డ్రింక్స్ చూసేసరికి తల సర్రున వాలిపోయింది.
"అల్లుడు మోహమాటపడుతున్నారు.మీరే త్రాగించండి." వెండి గ్లాస్ లో కొబ్బరినీళ్లు ఇచ్చింది అత్తగారు.
"త్రాగండి అల్లుడుగారు."బలవంతంగా మెడ పైకి ఎత్తి నోటిలో పోసాడు మావగారు.
గింజుకుంటున్న సూర్యాన్ని"మోహమాటపడకండి.అన్నీ త్రాగాలి." మెల్లిగా ఒక్కొక్కటి నోట్లో
పోసారు.
అన్ని కలిసిన కడుపులో కథాకళి. ఒక్కసారిగా డొక్కున్నాడు. భళ్ళుమంటూ మావగారి నోట్లో పడింది. కెవ్వుమంటూ వెనక్కి జరిగాడు మామగారు.
"అయ్యో ఊరంతా దిష్టి పెట్టారు అల్లుడుగారికి." అత్తగారు పరిగెత్తుకెళ్లి గుప్పెడు మిరక్కాయలు తెచ్చి దిష్టి తీసి కుంపట్లో వేసింది.
ఇల్లంతా "ఖళ్లు"మంటూ దగ్గులు.మధ్యలో ఎలాగో బెడ్ రూమ్ లోకి జారుకున్నాడు సూర్యం.
**********
"ఏమండీ,అమ్మవాళ్ళు భోజనానికి పిలుస్తున్నారు." మెల్లిగా సూర్యం మెడ నిమురుతూ చెప్పింది కావ్య.
కాస్త భార్య స్పర్శతో మెడ కుదుటపడి మెల్లిగా నవ్వాడు సూర్యం.
"ఏమండీ,ఇందాక ఏమి త్రాగలేదు. ఇప్పుడైనా కొంచెం బాగా తినండి. వాళ్ళకి గౌరవం కదా!" మెల్లిగా అంది.
సరే అన్నట్లు తల ఊపాడు.
కావ్య ముందు నడిచింది.
"ఇదేమిటి భోజనాల బల్ల ఇటు కదా?" అన్నాడు సూర్యం.
"అది మాకు.కొత్త అల్లుడికి వేరే ఉంది." నవ్వుతూ హాల్ లోకి తీసుకొని వెళ్ళింది కావ్య.
హాల్ లో పది బల్లలు కలిపి మంచి క్లాత్ వేసి పూలతో డెకరేషన్ చేసి ఉన్నారు. మొత్తం వెయ్యి రకాల పైనే వంటకాలు పెద్ద వెండి ఆకు చుట్టూ ఉన్నాయి.
"కూర్చోండి అల్లుడుగారు.మీరు ఒక్కటి కూడా వదలకుండా అన్నీ తినాలి.ఇవన్నీ నెల రోజుల నుండి చేయించారు మీ మామగారు." ప్రేమగా వడ్డించింది అత్తయ్య.
భార్య వైపు దీనంగా చూసాడు సూర్యం. అంతకన్నా దీనంగా చూసి తినమన్నట్లు సైగ చేసింది కావ్య.
"సరే కొంచెం పులిహార పెట్టండి."అడిగాడు సూర్యం.
"ఏ పులిహోర? నిమ్నకాయ,చింతాపండా,దబ్బకాయా, మామిడి కాయా,దానిమ్మ కాయా?" ఇరవై రకాల పేర్లు చదువుతూ కొంచెం వడ్డించింది అత్తగారు.
"ఇదిగోండి మీకోసం స్పెషల్ గా చేయించారు పనసకాయ పులిహోర." వడ్డించింది.
"పనసకాయ?" ఉలిక్కిపడ్డాడు.
"అది ఆవపెట్టి చేస్తారు కదా?"అడిగాడు సూర్యం.
"అయ్యో అది పాత మోడల్.ఐపొడు దానితో బిర్యానీ,మంచూరియా,పులిహోర,తద్దోజనం ఇంకా పనసపండు పాయసం కూడా చేయించాము."గర్వంగా అన్నాడు మావగారు.
మెల్లిగా వడ్డన మొదలు అయింది.పది మంది ఆ చివర నుండి ఈ చివరకు తిరుగుతూ వడ్డిస్తూనే ఉన్నారు.
"ఇంకొంచెం ఇంకొంచెం" అనే మాట తప్ప వేరేమాట లేదు. కడుపు ఉబ్బిపోయి కంచం కనపడటం లేదు సూర్యానికి. భార్యకు సైగ చేసి స్పృహ తప్పి పడిపోయాడు సూర్యం.
*********
మెల్లిగా కళ్ళు తెరిచేసరికి బయటి నుండి మావగారి మాటలు వినపడుతూ ఉన్నాయి.
"ఏమి అల్లుడొ.పట్టుమని పదహారు రకాలు తినేసరికి పటాసులాగా పగిలిపోయాడు. ఇక టపాసులు ఏమి కాలుస్తాడు? ఈ ఏడాది ఇక ఇంతే.ఈసారి ఏడాది అన్నా వేయి వంటకాలతో కొత్త పండుగ చేయుస్తాను." అంటున్నాడు.
"దేవుడా" మళ్లీ స్పృహ తప్పిపోయింది సూర్యానికి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
ఆంతర్యం - P.L.N. మంగారత్నం
ఆ రోజు పేపర్లో వచ్చిన ‘మాట్రిమొనీ’ కాలం పరిశీలిస్తున్నాడు నచికేత్.
వయసు వచ్చినప్పటి నుంచీ అమ్మానాన్నా చూపించిన పెళ్ళి సంబందాని కల్లా వెళ్లి వస్తున్నాడే గాని ఒక్కటీ కుదరడం లేదు.
వీళ్ళకి పిల్ల నచ్చడం అనే మాట అలా ఉంచి .. అవతలివాళ్ళకే తన ఉద్యోగం నచ్చకుండా పోవడం ఓ వింత అయిపొయింది. గవర్నమెంటు ఆఫీసులో ‘అటెండరు’ అయినా ఫర్వాలేదు. గాల్లో దీపం లాంటి ‘సాఫ్ట్వేర్’ ఉద్యోగం ఎందుకు? అనడంతో.
తను మాత్రం ఏం చెయ్యగలడు? .. చదువుకున్న ఇంజనీరింగు చదువుకి వచ్చిన కొలువు అది.
అలా అని జరిగే కాలం ఆగుతుందా? అప్పుడే వయస్సు ముప్పై ఏళ్ళుకి వచ్చి .. జుట్టు పలచబడడమే కాదు అక్కడక్కడా తెల్లబడుతుంది కూడా.
అలా ఓ ప్రకటన చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు.
అప్పుడే మనవడి కోసం కాపీ గ్లాసుతో .. వచ్చిన బామ్మకు మనవడు పేపర్లో పెళ్ళిపందిరి ప్రకటనలు చూసి నవ్వుకోవడం కంటపడింది.
“ ఏరా! పిచ్చి సన్నాసీ, పేపరు చూస్తూ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఎవరైనా పిల్ల దొరికిందా? ఏమిటీ? కనీసం నువ్వు‘ ఇలా ‘అయినా ఓ ఇంటి వాడివి అయితే చూసి పోవాలని ఉందిరా! ”
“ పొదువు గాని లేవే. పోకుండా ఇక్కడే ఉట్టి కట్టుకుని ఉండిపోయేవాళ్ళు ఎవరు? ఈ ప్రకటన చూస్తే నవ్వు వచ్చింది. నువ్వూ ఓసారి చూసి తరించు ” అంటూ కాఫీ గ్లాసు అందుకుని, పేపరు బామ్మ చేతిలో పెట్టాడు. బాక్స్ లో వేసిన ప్రకటనను చూపిస్తూ.
కళ్ళజోడు సవరించుకుంటూ సోఫాలో కూలబడి .. పైకే చదవసాగింది బామ్మ “ ఉద్యోగం చేస్తూ, వంటావార్పూ తెలిసి .. పిల్లల్ని చూడగలిగే వరుడు కావలెను “ అని.
“ మా యమ్మే! ఇక నీకు పెళ్లెందుకే తల్లీ. ముందు ముందు పిల్లల్ని అయినా కంటావా? లేదా!” అంటూ బుగ్గలు నొక్కుకుంది.
బామ్మ వాలకానికి నచికేత నవ్వుకుంటుంటే ..
ఆ మాటలకి ప్రక్కగదిలోనే ఉన్న కోడలు సింధూరి గుమ్మం వరకూ వచ్చి “ ఏమిటి? అత్తయ్యా! అప్పుడే ‘పిల్లల్ని కనడం’ అంటున్నారు .. ముందు వాడికి పెళ్ళి రాత ఉందో! లేదో! కదా! మొన్ననే ‘ ఇరవైనాలుగో ’ పెళ్ళి చూపులకు కూడా వెళ్లి వచ్చామాయే. వీడి తరువాతి వాడు ‘నితిన్’ అప్పుడే ప్రేమా.. దోమా అంటూ తొందర పడుతుంటే, వాడి తరువాతి పిల్ల ‘ తేజస్విని ’ కీ పెళ్ళికి ఎదిగింది. అప్పుడే సెల్ఫోన్ చాటింగులతో బిజీ అయిపోతుంది. అక్కడ బ్రేకులు వేద్దామనుకున్నా .. ఇక్కడేమో విషయం కదలకుండా ఉంది “ అంది కాస్త స్వగతంలా ,, మరి కాస్త నిష్టూరంగా.
హాలులో ఉండి .. పేపరు చదువుతున్నట్లు దాన్ని ముఖానికి అడ్డం పెట్టుకుని, అన్నీ వింటున్నాడు నచికేత్ తండ్రి పరమశివం.
కాస్సేపటికి ఏమనుకుందో గాని బామ్మ..
“ ఓ సారి ఫోన్ కలిపి ఇవ్వరా! మాట్లాడతాను. ఏ పుట్టలో ఏ పాము ఉందో! ఓ రాయేసి చూస్తే పోయేదేముంది? ” అనడంతో ఫోన్ కలిపి ఇచ్చాడు నచికేత్. తను చెయ్యాలనుకున్న పనికి .. బామ్మ పూనుకోవడంతో సంబరంగా.
ముందు కాస్త ఆషామాషీగానే మాట్లాడిన బామ్మ కాస్సేపటికి “ అలాగా బాబూ! అలాగా! మా మనవడు సాఫ్ట్వేర్ అయినా ఫర్వాలేదా? ఈ హైదరాబాదే కదా! మీ ఇంటి ఎడ్రస్సు లొకేషను పెట్టండి. మంచిరోజు చూసుకుని వస్తాంలెండి” అంటూ పెట్టేయ్యడంతో అంతా నోరెళ్ళబెట్టుకుని చూసారు.
పిల్ల తండ్రికి కొడుకు ఉద్యోగం మీద అభ్యంతరాలు లేకపోవడం సంతోషించింది సింధూరి.
***
అది ..
ఊరిలొ పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయిన భాను ప్రకాష్ గారి ఇల్లు. అందం, ఐశ్వర్యం కలబోసినట్లు ఉంది కాబోయే పెళ్ళికూతురు ‘ అభిజ్న ’
అందరికీ నచ్చింది పిల్ల.
పిల్లకు ,, పిల్లాడి ఉద్యోగమూ, వంటల కబుర్లూ కూడా నచ్చేయ్యడం .. కలలో జరిగినట్లు జరిగి పోయింది పెళ్ళి. తనకు లైను క్లియర్ అయినందుకు సంతోషపడ్డారు నితిన్, తేజస్వినిలు.
అభిజ్ఞా .. నచికేత్ అనుకున్నా, నచికేత్ .. అభిజ్ఞా అనుకున్నా జంట బాగానే ఉంది.
అయినా నచికేత్ ఆ ‘కల’ నుంచి .. ఇల లోనికి అంత త్వరగా రాలేకపోతున్నాడు.
అభిజ్నను కళ్ళలోనే నింపుకుని ఉద్యోగానికి వెళ్లి వస్తున్నా .. మనసులో సందేహాలు అలానే ఉండి పోయాయి. నేనెక్కడ? తనెక్కడ? అన్నట్లు.
నెల తరువాత .. తన ప్రమేయం లేకుండా నచికేత్ మకాం ఓ కొత్త ఇంటికి మారిపోయింది.
***
అక్కడ .. ఇద్దరూ ఆడుతూ పాడుతూ పనులు పంచుకుని ఉద్యోగాలకు వెళ్లి వస్తున్నా నచికేత్ మనసు ఆలోచిస్తూనే ఉంది.
ఎన్నాళ్ళీ ముసుగులో గుద్దులాట అనుకుంటూ ఓ రోజు అడిగేసాడు.
“ నేను ఏం ఉద్యోగం చేస్తున్నానో! మీకు సరిగా తెలీదా?” అడిగింది అభిజ్న ఆశ్చర్యంగా.
“ మీ నాన్న కంపెనీ లోనేగా ”
“ అవును. మా నాన్న కంపెనీ లోనే .. ఇప్పటికి క్లార్కునే. ఒక్కతే కూతుర్ని కావడంతో .. ముందు ముందు కంపెనీ పగ్గాలు కూడా నావే. దీని కోసం ‘ అమెరికా’ వెళ్లి కూడా బిజినెస్ మనేజిమెంటు కోర్సు కూడా నేర్చుకున్నాను. ఎన్ని చేసినా చివరికి ఆడది కోరుకునేది .. సుఖ సంసారం. అందుకే, భవిష్యత్తులో ఏ ఇబ్బందీ రాకూడదని, నేను చూసుకోలేక పోయినా .. ఇంటినీ, పిల్లల భాధ్యతనీ తీసుకునే వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలని .. నేనే అలా ప్రకటన ఇచ్చాను” చెప్పింది అభిజ్న.
“ మరి అలాంటపుడు .. ఉద్యోగం చేస్తూ ఉండేవాడే కావాలన్నావు కదా! ఇన్ని పనులు ఒక్కడే ఎవరైనా చెయ్యగలరా? “ అన్నాడు బుంగమూతి పెడుతూ.
“ అన్నాను. ఉద్యోగం పురుష లక్షణం .. కాబట్టి. చిన్నదో! పెద్దదో! ఎదో పని అంటూ ఉండాలికదా అని. ఖాళీగా ఉండేవాడి బుర్ర డెవిల్స్ ఖార్ఖానా లాంటిదని, చేతి నిండా పని ఉంటే అనవసరపు ఆలోచనలు రావు కదా! అని ” చెప్పింది అభిజ్న నవ్వుతూ.
పైకి మాత్రం ఉడుక్కున్నా .. లోలోన భార్య దూరద్రుష్టికి సంతోష పడ్డాడు నచికేత్.
మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
దీపావళి విడుదల - కోటమర్తి రాధా హిమబిందు
వీరేశానికి కొడుకు నుండి ఫోన్ వచ్చింది. కల్పవల్లి ఫోన్ తీసుకొని పరిగెత్తుకుంటూ భర్త దగ్గరికి వచ్చింది.
“ఏంది” వరండాలో పడకుర్చీలో కూర్చుని దినపత్రిక చూస్తున్న వీరేశం వెలుగులు చిమ్ముతున్న భార్య ముఖం చూసాడు.
“సతీషు ఫోన్ చేస్తున్నడు” అంటూ ఫోన్ ఇచ్చి కుర్చీలో కూర్చొని కొడుకు ఏం మాట్లాడతాడా అని ఆరాటంగా చూసింది.
“నాన్నా.. స్పీకర్ పెట్టండి.. అమ్మ కూడా వింటుంది.. అమ్మా.. సినిమా దాదాపుగా అయిపోయింది. దీపాలళి సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. పదిరోజుల్లో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. నాన్నా.. అమ్మా.. మీకు సంతోషంగా వుందా?”
“ఇద్దరికీ చాలా చాలా సంతోషంగా వుందిరా.. సతీషూ.. యాంకరు అమ్మకూ నాకూ ఎంతో ఇష్టమైన ఉమే కదా”
“ఆమే నాన్నా. సినిమా అనుకున్నప్పటినుండే ఆమే ఖచ్చితంగా వుండాలని అమ్మా మీరు కోరారు కదా”
“ఆమెను టీవీలో చూడటమే. ఇప్పుడు ఎదురుగా చూడటం అంటే భలే బాగుందిరా” ఉత్సాహంగా అంది కల్పవల్లి.
“అమ్మా. నా సినిమా రిలీజ్ కాబోతుంది. నా గురించి మాట్లాడకుండా యాంకర్ గురించి మాట్లాడతావేంటమ్మా?”
“నా కొడుకు గురించి వేరే మాట్లాడాలా? నువ్వు ఉద్యోగం వద్దనుకుని అమెరికా నుంచి వచ్చినవు సినిమా తీయటానికి”
“అమ్మా..వీలు చూసుకుని మళ్ళీ మాట్లాడతా. హీరోగారు వచ్చారు. నాన్న.. మీరు ఈ లోపే ఒకసారి నన్ను అక్కడికి రమ్మన్నారు. కానీ నాకు కుదిరేట్టు లేదు. పాసులు పంపించినప్పుడు మీరే రండి. వుంటాను” కాల్ కట్ చేశాడు సతీష్.
“ఎంత ప్రాణమేంటే కొడుకంటే నీకు? అంతగా ఉరుక్కుంటూ వచ్చావు. సినిమా దర్శకుడిగా తొందరలో నీ కొడుకు పేరు వెండితెర మీద కనపడబోతదని సంతోషం..అంతేనా? దర్శకుడు గారి అమ్మ. సినిమా దర్శకుడిని కన్నతల్లి. ఇప్పుడే ఇట్లా ఉన్నవు. రేపటి రోజున ఎంత గొప్పలు పోతవో?” నవ్వుతూ అన్నాడు వీరేశం.
“అట్లాంటి గొప్పలన్నీ నీకే..నాకేం లేవు. ఒక్కగానొక్క కొడుకుని ఇక్కడ బాగా చదివించినవు. ఆ తర్వాత అమెరికా పంపినవు. అక్కడ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేసుకుంటున్నొడ్ని సినిమా తీస్తా అంటే ఒప్పుకొని ఇక్కడికి రప్పించినవు. వాడు ఏది చేస్తనన్నా నువ్వు సరే అంటవు. మధ్యలో నాదేమన్నా వుంటదా? వాడిపై నీకు చచ్చేంత ప్రేమ. నీకు సినిమాలంటే ఇష్టం. నీ కొడుకు సినిమా తీస్తానంటే ఎగిరిగంతేసినవు”
“ఎగిరినా చతికిలపడనులే. నలభైఎకరాల పొలం ఉంది. సినిమా తీస్తా అంటే. నిర్మాతతోపాటు ఇంకో నిర్మాతగా వాడు నన్ను పెట్టాడు. సరే అన్నాను. నేను సంపాదించిందంతా వాడి కోసం కాదా.. ధైర్యంచేసి వాడు అడిగినంత డబ్బు ఇచ్చినా. అంతకంత లాభమే మనకు వస్తది” అంటున్న వీరేశాన్ని కళ్ళనిండుగా ప్రేమగా చూసుకుంది కల్పవల్లి.
***** *****
కొడుకు సతీష్ వి చంద్ర సినిమా డైరెక్టర్ కావటం..ప్రీ రిలీజ్ ఫంక్షనుకు పదిపాసులు పంపటం తండ్రి వీరేశానికి ఎనలేని సంతోషం కలిగించింది. తన వాళ్లందరికీ ఫోన్ చేసి చెప్పుకున్నాడు.. పక్క వీధిలో ఉండే బావమరిదిని పిలిచి విషయం చెప్పాడు. బావమరిది మల్లేష్ ఆనందంతో ఊగిపోయాడు. ఊరంతటికీ ఈ వార్త చెప్పాడు. రెండు రోజుల్లో హైదరాబాద్ పోతున్నట్లు కొన్ని పాసులే ఉన్నాయి కాబట్టి అందర్నీ తీసుకోపోలేకపోతున్నామని.. సినిమా రిలీజు కాగానే అందరికీ తన డబ్బులతో సినిమా చూపిస్తానని బావ చెప్పమన్నాడని చెప్పాడు.
ప్రతీ ఒక్కరూ తమ ఇంట్లో వేడుక అన్నట్లు సంతోషంగా వచ్చి వీరేశాన్ని కల్పవల్లిని అభినందించారు. సతీష్ వి చంద్ర అక్కడ లేకున్నా పొగడ్తలతో ముంచెత్తారు. కల్పవల్లి వంటమనిషిని మాట్లాడి రుచికరమైన వంటకాలు వండించి పరండాలో అరిటాకులు వేసి భోజనాలు పెట్టించింది ఆ తర్వాత కొడుకు గురించి ముచ్చట్లు పెట్టింది. సాయంత్రం వేళ టీ కాఫీలు ఇచ్చి అప్పుడు కానీ అందర్నీ పంపలేదు.
***** *****
ఒక వ్యాను మాట్లాడుకుని తన ఇంటి సభ్యులలో ముఖ్యమైన వారితో ఊరినుండి బయలుదేరి హైదరాబాదుకు వచ్చి అనుకున్న సమయానికి ఇండోర్ స్టేడియంకు చేరుకున్నారు వీరేశం కల్పవల్లి మిగతావాళ్ళు. కొడుకును స్టేజీమీద చూసి పొంగిపోయారు వీరేశం కల్పవల్లి.. తనకు తన భార్యకు ఎంతో ఇష్టమైన యాంకరు ఉమ హుషారుగా వేదిక మీద అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతుంటే ఆమెకు తామిద్దరినీ కొడుకు ఎప్పుడు పరిచయం చేస్తాడా అని తహతహలాడారు.
యాంకరు ఉమ తన మాటల చాతుర్యంతో తెగ మాట్లాడుతోంది. ముందుగా సినిమాలోని పాటలను పాడారు గాయని గాయకులు. మధ్య మధ్య కొంతమందిపై సెటైర్లు వేస్తూ జోకులు పేలుస్తూ అందర్నీ ఉత్సాహపరుస్తూ నవ్వించసాగింది యాంకరు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రిని సాదరంగా ఇంగ్లీష్ లో వేదిక మీదికి ఆహ్వానించింది. మంత్రి ఇంగ్లీషులో చాలాసేపు మాట్లాడుతుంటే ఏమీ అర్థం కాలేదు వీరేశానికి.. కల్పవల్లి కూడా అయోమయంగా భర్తను చూడసాగింది.
“ఏందిరా..మల్లేసూ..మంత్రి తెలుగోడే కదా.. ఇంగ్లీషులో మాట్లాడుతున్నడేంది? ఇదేంగోల? మనకేం అర్థమై చస్తదిరా”
“ఏమో..అదోరకమైన స్టయిలేమో?” నవ్వాడు ప్రక్కనే వున్న బావమరిది.
తర్వాత సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ముంబైకి చెందిన అమ్మాయి “అందరికీ నమస్కారం” అనేసరికి అంతా గొల్లుమంటూ అరిచారు. ఆ తర్వాత ఆమె అంతా ఇంగ్లీషులోనే మాట్లాడింది. హీరో కూడా ఇంగ్లీషులోనే మాట్లాడాడు. ఏమాత్రం అర్థంకాకున్నావినక తప్పలేదు వీరేశానికి, కల్పవల్లికి, వాళ్ల వెంట వచ్చిన మిగతావారికి… ఏదో కళ్ళప్పగించి చూడటం తప్ప వాళ్ళందరికీ ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. మంత్రిగారు ఏదో అర్జెంట్ పనివుందని వెళ్ళిపోయాడు. చివరాఖరికి సతీష్ వి చంద్ర కూడా ఇంగ్లీషే మాట్లాడటంతో వీరేశానికి పిచ్చి కోపం వచ్చింది.
అదే సమయంలో తల్లి తండ్రిని వేదిక మీదికి పిలిచాడు కొడుకు. భార్యతో వేదిక మీదికి వచ్చాడు వీరేశం. ఇంగ్లీషులో వాళ్ళను పరిచయం చేస్తూ వాళ్ల గురించి చెప్పాడు సతీష్ వి చంద్ర.
“ఎందుకొచ్చినట్లు మనం? నీకేమన్నా అర్థం అవుతుందా?” ప్రక్కనున్నకల్పవల్లిని గుసగుసగా అడిగాడు వీరేశం.
“నాకా?నీకే అర్థంకావడం లేదు. ఇంగ నాకేం అర్థమవుతది ఇంగ్లీషు? నువ్వు మూడు చదివితే నేను ఐదు చదివాను. అంత మాత్రాన నాకు ఇంగ్లీషు అర్థమైతదా? కొంటెగా నవ్వుతూ చూసింది కల్పవల్లి. వీరేశానికి తానేం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో చాలా చిరాగ్గా కొడుకు చేతిలోంచి మైక్ లాక్కున్నాడు.
“యాంకరమ్మా..ఇన్ని జోకులు వేస్తవు..చెప్పిన మాట చెప్పకుండా చెప్తవు..ఏం..నువ్వు వీళ్ళను మన తెలుగుభాషలో మాట్లాడమని చెప్పలేవా? అబ్బబ్బ..టీవీలలో చూపించే సినిమా ఇంటర్యూలలో ఇదే గోల..ఇక్కడ ఇలాంటి చోట అంతే.. ఎవరు చూడు ఇంగ్లీషులో మాట్లాడటమే, ఒక్క ముక్క మాకు అర్థం కాకపోయే, ఇది తెలుగుసినిమా, ఇంగ్లీష్ సినిమా కాదు. మీరంతా తెలుగోళ్ళు.. ఇంగ్లీషోళ్లు కాదు. హీరోయిన్ ముంబయి పిల్లకంటే తెలుగు రాదు..పోనీ అని అనుకుందాం. హీరోకు ఏమైంది? మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయే.. ఇప్పుడంటే సినిమాలు చేసి బాగా సంపాదించిండు.. ఏమాత్రం మేము తెలవనట్లే వుంటడు. అయినా మేం ఏమీ అనుకోం.. నేను చెప్పేదేంటంటే, మన భాష తెలుగు.. నాలుగు పైసలు వచ్చినంత మాత్రాన భాష మార్చుకోవాలా? నా కొడుక్కి ముందే నేను చెప్పిన.. ఎప్పుడు నువ్వు తెలుగులోనే మాట్లాడాలి అని..వాడికీ వీళ్ళందరి జిడ్డు అంటుకుందేమో.. వాడూ ఇంగ్లీషులోనే మాట్లాడుతుంటే నా పరిస్థితి ఏంది? అరెరే.. నా కొడుకు సినిమా డైరెక్ట్ చేసే.. ఏం చేశాడో.. ఎట్లా చేశాడో నాకు మా వాళ్ళకు అర్ధం అవొద్దా? మాకు పాసులు ఎందుకు పంపినట్టు? మేం ఎందుకు వచ్చినట్టు? ఏం విని పోతున్నట్లు? ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీషులోనే గొప్పలుపోతూ మాట్లాడుతున్నరు. మంత్రిగారికి తెలుగు వచ్చు.. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తెలుగులోనే మాట్లాడతడు కదా.. మరి ఇప్పుడేమైంది? ఎబ్బెబ్బే..అస్సలు బాగోలేదు.. యాంకరమ్మా.. నువ్వు చాలా తప్పు చేసినవు” ఎర్రటి కళ్ళతో యాంకరును వేలితో బెదిరిస్తూ అన్నాడు వీరేశం.
గలగల గోదారిలా మాట్లాడే యాంకరు ఉమకు అవమానంగా అనిపించి ఏం చెప్పాలో అర్థంకాక దొంగచూపులు చూసింది. కొడుకు తండ్రి చేతిలో మైకు లాక్కుని బాధగా ఉమకు ఇచ్చాడు.
“ఇప్పుడు మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్తాను. డైరెక్టర్ అసలు పేరు సతీష్ చంద్ర..మధ్యలో వి అంటే మీకు తెలియదు కదా..నేను చెప్తాను.. వీరేశంగారూ” అంటూ వాతావరణాన్ని తేలిక పరిచేందుకు పెద్దగా అరిచి అందరి చేత చప్పట్లు కొట్టించింది.
తన మాటల ప్రవాహ ఉధృతంలో సతీష్ వి చంద్ర తల్లిదండ్రులని వేదిక నుండి కిందికి పంపింది. ఆ తర్వాత వీరేశాన్ని కల్పవల్లిని మిగతా వాళ్ళను కలిసింది.
“వీరేశంగారూ.. మీరు మేడమ్ గారు మిగతా వీళ్ళు నా అభిమానులు అని సతీష్ చెప్పాడు..నేను కూడా నిజంగా చస్తున్నాననుకోండి..మన భాష ఏంటి? మన సంస్కృతి ఏంటి? మీరు నన్ను నిలదీసి మరీ అడిగారు కానీ.. ఇంగ్లీషు మాట్లాడకండి అని నేను చెప్పటం పద్ధతి కాదు. నేను చెప్పలేనిది మీరు చెప్పారు.. థాంక్యూ.. ఇలా అంతా ఇంగ్లీషు మాట్లాడుకుంటూ పోతే మన తెలుగు భాష ఏమైపోతుంది? మీరు మాత్రం భలేగా బుద్ధి చెప్పారు. మీకు ఈ కడుపులో మంట ఎప్పటినుండి వుందో.. మొత్తం మీద చల్లార్చుకున్నారు. ఎవరో ఒకరు కంకణం కట్టుకొని ఇలా ధైర్యం చేయాలి” అంటూ కాసేపు వాళ్ళతో, అతని వెంట వచ్చిన మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి నవ్వుముఖంతో వాళ్ళను పంపించింది యాంకరు ఉమ. సరిగ్గా అదే సమయంలో డైరెక్టర్ సతీష్ వి చంద్ర తండ్రి మాటలకు అవమానభారంతో కినుక వహించిన హీరో వెంటపడి బ్రతిమాలుతున్నాడు. అతనికి కోపం తగ్గలేదు. నీతో ఇంకో సినిమా ఎప్పటికీ చేయనని వెళ్లిపోయాడు.
***** *****
సతీష్ వి చంద్ర సినిమా అనుకున్నట్లుగా దీపావళికి విడుదల అయింది. ఉదయం ఆటతోనే ప్రతి ఒక్కరూ సినిమాని పొగడ్తలతో ముంచెత్తారు. కొడుకు ఫోన్ చేసి చెప్పిన మాటలకు మరింతగా ఉబ్బితబ్బిబ్బయ్యారు వీరేశం కల్పవల్లి.
“ఇండస్ట్రీలో టాప్ లో వున్న హీరోతో నేను పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను. మీరు చెప్పిన మాటలు వారికి బాగా నచ్చాయట..తను ఇకనుండి మీలాంటి వాళ్ళకు అర్థమయ్యేలా తెలుగులో మాట్లాడతానన్నారు.. కొత్తకథ రెడీగా వుంది కదా..అది హీరోగారికి బాగా నచ్చింది. దీపావళికే విడుదల కావాలని హీరో అన్నారు. దీపావళి వారికి సెంటిమెంట్ అట”
“అవునా..అయితే రాబోయే సినిమా బొమ్మ విడుదలకు కూడా యాంకర్, ఉమే ఉండాలి. మనకు అచ్చి వచ్చింది” అన్నారు ఆనందంగా వీరేశం కల్పవల్లి. ఆ మాటలకు ఖుషిగా సరే అంటూ అభయం ఇచ్చాడు సతీష్ వి చంద్ర.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
వంటాయన
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
కంచంలో అన్నం పెడుతో, “పది రోజులనుండి నడుము నమిలేస్తోంది. కింద పడ్డ పట్టకారు కూడా వొంగుని తీయలేకపోతున్నాను. మన డబ్బు పిల్లలకి వద్దన్నారు, కావాలంటే మేమే పంపుతాము, హాయిగా మీకు కావలిసినట్లు ఖర్చు పెట్టుకోండి, తీర్ధయాత్రలకి ఫ్లైట్ లో వెళ్ళండి అన్నారు గా, తీర్థయాత్రల సంగతి తరువాత, ముందు ఒక వంట మనిషి ని పెట్టండి” అని గొడవ పెడుతోంది తను.
"ఈ కరోనా కాలం లో వంటమనిషి ఎక్కడ దొరుకుతుంది, నేను బయటికి వెళ్ళి కరోనా అంటించుకోమంటావా" చెప్పు అన్నాడు రావు గారు.
"మరి అయితే, ఈ నడుము నొప్పితోనే, మీకు, కందిపప్పు పచ్చళ్ళు, దూట కూరలు, వంకాయ బండ పచ్చడి చేస్తో, చచ్చిపోమంటా రా" అంటూ రావు గారు తింటున్న కంచం లో చారు పోసింది వర్ధనం.
"నీ దుంపతెగా, నేను యింకా కూర కలుపుకోలేదు, చారు వడ్డించావేమిటే" దీని బట్టి నీకు నిజంగానే నడుము నొప్పి వుంది అన్నమాట అన్నాడు రావు గారు.
"అంటే నిజంగా కాక నాటకాలు ఆడుతున్నా ననుకుంటున్నారా.. నడుము నొప్పి కంటే మీ మాటలే నన్ను ఎక్కువ బాధ పెడుతున్నాయి, చారుపోసిన కంచం పక్కన పెట్టి, ఈ కంచం లో కూర కలుపుకు తినండి” అని వెళ్ళి మంచం మీద పడుకుంది వర్ధనం.
"అన్నం తిని పడుకో, నడుము నొప్పికి మందు వంట మనిషి కాదు. సాయంత్రం హాస్పిటల్ కి తీసుకువెళ్తాను. తరువాత ఒక వంట మనిషి ని వెతికి పంపమని మా తమ్ముడికి చెప్తాలే. రా, వచ్చి అన్నం తిను” అని భార్య ని పిలిచాడు.
సాయంత్రం కారులో దగ్గరలో వున్న హాస్పిటల్ కి వెళ్లి, కారు తాళం పార్కింగ్ కుర్రాడుకి యిస్తోవుంటే, వాడు, "ఆఛ్ " అని ఒక తుమ్ము తుమ్మి, ‘సారి సార్’ అంటూ కీ తీసుకున్నాడు. రావు గారికి ఈ తుమ్ముతో మనసుకు ఎందుకో అపశకునంలాగా అనిపించింది.
మొత్తానికి ఒక గంట తరువాత డాక్టర్ గారి పిలుపు వచ్చింది. ఆయన వర్ధనమ్మను దూరం నుంచే చూసి, అక్కడే తలుపు దగ్గర స్టూల్ మీద కూర్చొని “నేను అడిగిన వాటికి జవాబు చెప్పండి” అని, దగ్గరికి రావటానికి కూడా బయపడి పోతో కొన్ని ప్రశ్నలు అడిగి, బరబరా ఆరు రకాల మందులు, ఒక రకం స్ప్రై రాసి, "యివి వాడి, పదిరోజుల తరువాత రండి” అన్నాడు డాక్టర్.
బయటకు వచ్చిన తరువాత "అదేంటి అండి, నొప్పి ఎక్కడో నొక్కి చూడలేదు, బీపీ చూడలేదు, సినిమా లో కదలని పాము వేసుకున్న శివుడిలాగా, మెళ్ళో సేతస్కోప్ వేసుకున్నాడు, దానితో పరీక్ష చేయకుండా" అంది రావు గారి భార్య.
"సేతస్కోప్" వాడటం ఎప్పుడో మర్చిపోయారు, వాళ్ళు డాక్టర్స్ అని తెలుసుకోవటానికి మాత్రమే అది మెళ్ళో వేసుకుంటారు. అదిసరే, యిప్పుడు నీ నడుంనొప్పి ఎలా వుంది” అన్నాడు రావు గారు.
"ఎందుకు అలా అడుగుతున్నారు, మందులు కొనక్కర లేదనా " అంది భార్య.
“అదికాదు, డాక్టర్ ని చూడగానే సగం జబ్బు తగ్గింది అంటారు కదా, అందుకని, నీకు ఏమైనా కొద్దిగా తగ్గిందా అని” అన్నాడు రావు గారు.
“నిజమే నండోయ్. కొద్దిగా బాగానే వున్నట్లుంది. మందులు అయిదు రోజులకే తీసుకోండి. కావాలంటే తరువాత కొందురు గాని” అంది వర్ధనమ్మ.
ఇంటికి చేరిన తరువాత, భార్య కి ఏ మందు ఎలా వేసుకోవాలో చెప్పి, “రాత్రికి నేను టమోటా ఉప్మా చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో” అని భార్య తో చెప్పి, రావు గారు ఉప్మా చెయ్యటానికి ఉపక్రమించారు.
ముందుగా కొద్దిగా కేబేజి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నారు, తరువాత ఒకటి చిన్న బంగాళాదుంప, ఒక వంకాయి, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి ముక్కలు తరిగి పెట్టుకుని, స్టవ్ మీద మూకుడు పెట్టి, తగినంత నూని వేసి, బాగా కాగిన తరువాత, పోపు సామాను, ఒకటి గుప్పెడు జీడిపప్పు వేసి దోరగా వేయించుకుని, వాటిని ఒకటి ప్లేట్ లో వేసుకున్నాడు.
తరువాత, యింకొద్దిగా నూని వేసి తరిగిన ముక్కలు వేసి సగం వేగిన తరువాత రెండు పెద్ద టమోటాలు బాగా నలిపి, సగం వేగిన ముక్కలలో వేసి, సరిపడ ఉప్పు వేసి సన్నటి సెగ మీద మగ్గ నిచ్చాడు. ఈలోపున బాగా వేగిన రెండు జీడిపప్పు పలుకులు నోట్లో వేసుకుని, భార్య దగ్గరికి వచ్చి “యింకో అయిదు నిమిషాలలో ఉప్మా రెడీ అవుతుంది” అన్నాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
“యిదిగో, మీరు న్యూస్ చూసుకుంటూ కూర్చుంటే, అక్కడ ఉప్మా నీళ్లు పొంగి, స్టవ్ అంతా నాశనం అవుతుంది, తరువాత నా మీద వదిలేస్తారు, స్టవ్ దగ్గర నిలబడి చూస్తో వుండండి” అంది భార్య.
"నువ్వు చెయ్యలేవు, నన్ను చేయనివ్వవు. ఒకటే నస. పడుకో హాయిగా. రెండు నిముషాలు లో వేడి వేడి ఉప్మా రెడీ చేసి పిలుస్తాను" అన్నాడు చిరాగ్గా రావు గారు.
మొత్తానికి తినగా మిగిలిన నాలుగు జీడిపప్పు పలుకులు, పోపు వేసి, బొంబాయి రవ్వ మెల్లిగా పోస్తో ఉండలు చుట్టకుండా కలిపి ఉప్మా చేయటం ముగించాడు.
బల్ల మీదనున్న ఆరాటకు ముక్క చించి, కడిగి ఒక ప్లేట్ లో వేసి దానిమీద రెండు పెద్ద గరిటెల గుమగుమ లాడుతున్న ఉప్మా ని వేసి, భార్య కి యిచ్చాడు.
ఒకటి చెంచా ఉప్మా నోట్లో వేసుకొని "అబ్బా చాలా రుచిగా చేసారండీ, యింతోటి వంటకి వంటమనిషి ఎందుకు, పగలు నేను వండుతాను, రాత్రి మీకు కావలిసిన టిఫిన్ మీరు చేసుకుని నాకు యింత పెట్టండి, సరిపోతుంది. రాత్రి కాబట్టి మీరు వంట చేస్తున్నట్లు ఎవరికి తెలియనుకూడా తెలియదు. ఏమంటారు?” అని అంటున్న భార్య వంక తెల్లబోయి చూసాడు రావు గారు.
*********శుభం **********
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
మద్యప్రదేశ్ (కామెడీ కథ) - శీనా
ఇప్పుడున్న స్థాయిలో మద్య వినియోగం కొనసాగితే...తదుపరి సంవత్సరాలలో మార్పులు ఎలా ఉంటాయంటే...
రాష్ట్రం పేరు: మద్యప్రదేశ్
రూలింగ్ పార్టీ పేరు : పార్టీ
పార్టీ సింబల్ : వైన్ గ్లాస్( ఇది మరీ అభ్యంతరకరంగా ఉందనిపిస్తే...బాటిల్...)
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:
1. ప్రభుత్వానికి అత్యధిక అదాయం లభించేది...మద్యం అమ్మకం ద్వారా కాబట్టి మద్యం కొనేవారికీ, వాడే వారికీ అన్ని స్థాయిల్లో రిజర్వేషన్లూ రాయితీలు..
2. నీళ్ళు, పాలు న్యూస్ పేపర్లు ఇళ్ళకు ఉదయాన్నే సరఫరా చేసే విధంగానే మద్యం కూడా సప్లయ్ చేయడానికి ఏర్పాట్లు
3. డ్రాట్ బీరు పైప్ లైన్స్ లో ఇంటింటికి సరఫరా చేయడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం కోసం ఫ్రాన్స్ కంపెనీతో ఒప్పందం.
4. మద్యం ఇంటికే సరఫరా అవడం వలన ఎవరూ తాగి డ్రైవ్ చెయ్యరు కనుక రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయి.
5. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ : లివర్ ఆపరేషనూ, లివర్ ట్రాన్స్ ప్లాంటూ ఉచితం. (గత ఆర్ధిక సంవత్సరంలో రోజుకు కనీసం ఆరు పెగ్గులు తాగిన వారికే ఈ సదుపాయం.)
మద్యప్రదేశ్ పాలక మండలి సభ్యులు:
1. కబీర్ దాస్
2. సుందరమ్
3. మహర్షీ వైన్ తేయ
4. సారాభయ్ దేష్ ముఖ్
5. కల్లూ భాయ్ లల్లూరం
6. స్వామీ జిన్ మయానంద
తాజా వార్త
ఈ సభ్యులందరూ స్కూళ్ళలో గ్లాస్ మేట్స్ అని ఓ పత్రిక హేళన చేస్తూ రాసింది. ఆ వార్తని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన వివరణ:
" ఇది తప్పుడు వార్త ..మా మీద బురద చల్లడానికే చేసిన ప్రయత్నం.
మా పార్టీ లోని సభ్యులెవరూ ఒకరోజు కూడా కాలేజ్ లో అడుగు పెట్టనప్పుడు ఈ వార్త ఎలా నిజమవుతుంది?..ప్రజలే ఆలోచించాలి..
స్ఫూర్తి:1966 జ్యోతి మాస పత్రిక లో రమణ గారు వ్రాసిన ఒక ఐటం!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
కామెడీ దెయ్యాలు - సాయి సోమయాజులు
దెయ్యాల్లో కామెడీదెయ్యాలుంటాయా?... ఉంటాయండి బాబు. తల్చుకుంటే కిత కితలు పెట్టినట్టు నవ్వొస్తూంది.
మరేమో ఇప్పటిదాకా గుండెలరచేత పెట్టుకుని... కళ్ళు విప్పార్చుకుని... వెంట్రుకలు నిక్కబొడుచుకునుండగా హిచ్ కాక్ కథలు చదివి రామ్ గోపాల్ వర్మ హారర్ సినిమాలు చూసి ధడుసుకున్న మనం దెయ్యం అనగానే భయపడ్డం మామూలే!
కాని నేను చెప్పేది వింటే మీకూ నవ్వు రావడం ఖాయం. దెయ్యపు భయాన్ని మీ డిక్షనరీలోంచి తుడిచెయ్యడం డబుల్ ఖాయం.
మరి చదవండి.
*****
నేను ఊరికి దూరంగా వున్న ఆ ఇంటిలోకి అద్దె చాలా తక్కువని దిగాను. ఇల్లు కూడా ఐసోలేటేడ్ గా వుండేది. సాయంత్రం ఏడయిందంటే అంతా నిర్మానుష్యం. చెప్పొద్దూ నాకూ భయంగానే వుండేది.
ఒకరోజు రాత్రి నేను కప్పుకున్న దుప్పటి పక్కకి తొలగించినట్టనిపించింది. నేను మీదకి లాక్కున్నాను. మళ్ళీ తొలగింది. నేను మళ్ళీ లాక్కున్నాను. కాని ఈసారి భయంతో. "ఎన్నిసార్లు దుప్పటి లాగాలిరా" అని కీచు గొంతు వినిపించింది. అంతే ఒక్కసారిగా ముచ్చెమటలు పట్టేశాయి. నాలుక దాహంతో పిడచకట్టుకు పోయింది.
నేను ఇహ తప్పదని దుప్పటి తెరిచి చూద్దును కదా... నా పక్కగా తెల్లని దుస్తుల్లో జుట్టు విరబోసుకున్న దెయ్యం కూర్చునుంది. నా పై ప్రాణాలు పైకే పోయాయి.
"అహ్హహా... నన్ను చూస్తే భయం వేసింది కదూ" అంది కిచ కిచ నవ్వుతూ.
"వే..స్తోం..ది" పొడి పొడిగా అన్నాను.
"నేను నిన్నేమీ చేయను... నేను చెప్పినట్టు వింటే!" అంది.
"అలాగే" అన్నాను నీరసంగా.
"నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం. నన్ను నవ్వించాలి. నన్ను ఎంత నవ్విస్తే నీకు అంత ఉపకారం చేస్తాను" అంది.
"దీని దుంపతెగా... దీనికి జోక్స్ ఇష్టమా? నాకు హాస్యరచనలు చాలా ఇష్టం. వాటి కలెక్షన్ నా మెదడు మెమరీలో ఎప్పుడూ భద్రంగా వుంటుంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ మేరేజెస్ కి... ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణాన్ని నవ్వులమయంచేస్తా. అందుకే నన్నందరూ ఆహ్వానిస్తారు. నా అదృష్టం బాగుండి అదే అభిరుచి వున్న దెయ్యం తటస్థపడింది." అనుకుని రెండు జోక్స్ చెప్పాను. నవ్వింది. మరో రెండు వదిలాను పడీ పడీ నవ్వింది. "మ..ళ్ళీ రే.పొస్తా..ను". అని పొట్టచేతపట్టుకుని నవ్వుతో లుంగ చుట్టుకుపోతూ అంది.
చెప్పొద్దూ నాక్కాస్త ధైర్యం చిక్కింది. "రా..కానీ రోజుకో అరగంట మాత్రమే చెబుతాను. నాకు విశ్రాంతి కావాలి కదా మళ్ళీ మరుసటిరోజు పనిచెయ్యడానికి" అన్నాను.
"నేను వరమిస్తున్నాను. అలాగే" అంది.
హమ్మయ్య దెయ్యంవదిలింది. అనుకుని నిద్రపోయాను.
*****
మరుసటి రోజు తన తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళతో పాటు సకుటుంబ సపరివారంగా వచ్చింది.
అన్ని దెయ్యాల్ని ఒక్కసారి చూసేసరికి నాకు గుండె జారిపోయింది.
కాని అవన్నీ నన్నేం చేయవని మాటిచ్చేసరికి కాస్త ధైర్యం వచ్చింది.
నేను జోక్స్ చెప్పడం ప్రారంభించాను. అవి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాయి.
అలా ఒక వారం రోజులు గడిచాయి. ఒక రాత్రి నాకు దాహం వేసి నీళ్ళు తాగడానికి లేవబోయాను. అవి "ఎక్కడికీ?" అన్నాయి. నేను దాహం వేస్తోందనగానే అందులోంచి ఒకటెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. అంతే కాదు "నీకేం కావలసి వచ్చినా మమ్మల్ని అడుగు మేము తెచ్చి పెడతాం... జోక్స్ చెప్పవా ఫ్లీజ్" అన్నాయి.
అర్థమయింది. అవి నా జోక్స్ కి అట్ట్రాక్ట్ అయి... అడిక్ట్ అయి లొంగి పోయాయి. ఇప్పుడు నాలో భయం చచ్చి ధైర్యం చోటు చేసుకుంది. నెమ్మది నెమ్మదిగా ఇల్లు ఊడవడం... బట్టలుతకడం... వంట వండడం అప్పజెప్పాను. అవి చిటికెలో చేసి నా ముందు బుద్ధిగా కూర్చోసాగాయి జోక్స్ చెప్పమని.
ఆ తర్వాత, రోజు కింతని డబ్బు అడగడం మొదలెట్టాను. అవి తీసుకొచ్చి ఇయ్యసాగాయి. ఇప్పుడు లోకం కోసం ఉద్యోగం చేస్తున్నాను. కాని నేను లగ్జరీగా గడుపుతున్నది మాత్రం వాటిదయవల్లనే.
నా జోక్స్ విని విని జనంతో కామెడీ చెయ్యడం మొదలెట్టి తెగ ఎంజాయ్ చేస్తున్నాయట అవి. చెప్పి నన్నూ నవ్విస్తున్నాయి. ఇంతకు ముందు అహర్నీశలూ టెన్షన్ తో వాటికీ బి పీ, సుగర్ లు వచ్చి తెగ బాధపడిపోయాయట. ఇప్పుడవి రిలాక్స్ డ్ గా హాప్పీగా కాలంగడుపుతున్నాయట. నాకు పెళ్లయింది. నేనూ నా పెళ్ళాం కూడా ఇంటి పనేం చేయం. టీ వీ సీరియల్ లా ఇప్పుడు వాటికోసం 2500 వ ఎపిసోడ్ జరుగుతోంది.
మనిషి తెలివయినవాడు. సమస్త జంతుజాలాన్ని ప్రకృతిని లొంగదీసుకున్నాడు. రోదసీకి వెళ్ళాడు. పాతాళపు రహస్యాలు అవగతం చేసుకున్నాడు. అలాంటిది దెయ్యాలకీ భూతాలకీ భయపడటమేమిటి? నాన్సెన్స్. బలహీనతలు మనుషులతో పాటు దెయ్యాలకీ ఉంటాయి. తెలుసుకుని తడిగినతోం చెయ్యాలి అంతే! ఓకే మరి టైమయ్యింది వాటిని ఎంటర్ టైన్ చెయ్యాలి కదా. కామెడీ దెయ్యాలుంటాయని నమ్మారు కదా మీరు! ఇప్పుడు మీరు దెయ్యం కనిపిస్తే భయపడరు ఇన్ ఫాక్ట్ కనపడాలని కోరుకుంటున్నారు నాకు తెలుసు దాని బలహీనత తెలుసుకుని మీరు లాభపడదామని. ఒకే ప్రొసీడ్... బెస్టాఫ్ లక్!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
బుచ్చిబాబు ఆరోగ్యం - బొందల నాగేశ్వరరావు
“ఏరా!ఇంకా టీఫన్ తింటున్నావా! వ్యానోడు తొందర చేస్తున్నాడు.త్వరగా కానీయ్ !"అన్నాడు బుచ్చిబాబుతో స్నేహితుడు శ్యాం ప్రసాదు.
"మీరైనా చెప్పండన్నయ్యగారూ!ఇప్పటికి నాలుగు దోశెల్ను సాంబారు,చట్నితో తిని ఇంకేమైనా వుందా జానూ అంటే...ఇవిగో ఆలూ కూరతో ఈ నాలుగు పూరీలను తెస్తున్నాను"అంటూ పళ్ళెన్ని మొగుడి ముందుంచింది జానకి.
"ఏం తిండిలేరా !మరో గంటలో అరిగిపోయి మళ్ళీ ప్రేవులు ఆవురావురంటూ అరుస్తాయి. అందుకే అతి కష్టం మీద ఈ టిఫన్నుకడుపులోకి పంపిస్తున్నాను..ఏం తప్పా?"
"అబ్బే! తప్పని నేనంటానా?అన్నా... నువ్వూరుకొంటావా?రాజకీయనాయకుడిలా రాగాలు తీసి లా పాయింట్సు మాట్లాడి నా నోరు మూయించవూ!త్వరగా కానీయ్ "
"అయిపోయిందిరా!నీ వెంటనే వస్తున్నా.పద"అంటూ నాలుగు పూరీలను ఆలూ కూరతో రెండు నిముషాల్లో తిని ప్యాంటును తగిలించుకొని,బిర్రుగా బెల్టును బిగించి హాంకరుకున్న షర్టును వేసుకొంటూ వెళ్ళి వ్యానులో కూర్చొన్నాడు బుచ్చిబాబు.ఆయన వెంట ,నాటికి కావలసిన తిండి బాక్సులు,పళ్ళు వగైరాలతో భార్య, పిల్లలూ ఎక్కారు.
"సార్ ! మీరు అపమన్న చోటల్లా వ్యాను ఆగదు. ఒంటికి,రెంటికి ఇక్కడే ముగించుకొని ఎక్కండి"డ్రయివర్ హెచ్చరించాడు.
"తెలుసులేవోయ్ !ఇలాంటి కండిషన్లు మాకు పెట్టకు.చెప్పు ఓనరుతో మాట్లాడమంటావా?" అతికష్టంమీద లేచి నిలబడి అన్నాడు బుచ్చిబాబు హీరోలా పోజెట్టి భార్య వంక చూస్తూ,
డ్రయివరు కూడా తన సీట్లో నుంచి లేచి పైకి దూకినట్టు" ఏంటండీ మీరంటుంది? మహాబలిపురం దగ్గరేమి కాదు.రెండున్నర గంటలు ప్రయాణం.వెళ్ళి సైట్ సీయింగ్ అయిన తరువాత మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ దిగబెట్టి పదిగంటలకల్లా వ్యాను షెడ్లోకి చేర్చాలి"అన్నాడు కోపంతో.
"ఒరేయ్ బుచ్చీ...నువ్వాగు!గొడవ పడకుండా నువ్వు కదలవయ్యా బాబూ!"తొందరచేశాడు శ్యాం ప్రసాదు.
"అయినా ఇది గవర్నమెంటు బస్సు కాదు. మేము అద్దెకు తీసుకున్న ప్రయివేటు వ్యాను. ఓనరుతో మాట్లాడుతాం.మేము చెప్పినట్టు పోనీయ్ !ఏమంటారు అన్నయ్యగారూ?"అంది జానకి.
"నువ్వంది కరక్టేనమ్మా.పోనీవయ్యా!"అన్నాడు మళ్ళీ శ్యాం ప్రసాదు. వ్యాను కదిలింది.
బుజ్జిబాబు,శ్యాంప్రసాదులు మంచి న్నేహితులు.ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. ఒకే అపార్టుమెంటులో ప్రక్క ప్రక్క వాటాల్లో అద్దెకుంటున్నారు .ఇద్దరికి ఇద్దరేసి పిల్లలు.వాళ్ళు అయిదు,మూడవ తరగతులు ఒకే కాలేజ్లో చదువుతున్నారు.
ఇద్దరి తరపున పెద్దలంటూ లేని కారణాన వాళ్ళకు వాళ్ళే పెద్దలు,డిషిషన్ మేకర్సు కూడా! పిల్లలకు దసరా సెలవులు కనుక రెండు కుటుంబాలు ఫ్యామిలీ పిక్నికని మహాబలిపురానికి వెళుతున్నారు . వ్యాన్ తిరువాన్మియూరు దాటింది.
వ్యాన్లో ముందు సీట్లలో కూర్చొన్న పిల్లలు నలుగురూ కేరింతలు కొడుతూ కిటికిలలోంచి బయట కనబడే మల్టీ స్టోరేజ్ బిల్డింగులను, రిసార్ట్సును, విల్లాస్ ను,ప్రకృతి దృశ్యాలను,చూస్తూ ఆనందిస్తూ మాట్లాడుకొంటున్నారు.అదేవిధంగా బుచ్చిబాబు,శ్యాంప్రసాదు దంపతులు కూడా పిచ్చాపాటి మాట్లాడుకొంటున్నారు.కాస్త దూరం వెళుతూనే"డ్రయివరబ్బాయ్ !వ్యాన్ను కాస్త వి.జి,పి గోల్డన్ బీచ్ లో ఆపు.పిల్లలు చూడాలంటున్నారు"అంది జానకి.
"అది కుదరదమ్మా!నాకు ఓనరు చెప్పలేదు"డ్రయివర్ జవాబు.
"ఇదిగో! ఓనరు చెప్పని క్రొకడైల్ పార్కు కూడా ఇప్పుడు లిస్టులో చేర్చాను.నువ్వు చెప్పింది చేయవయ్యా"బుచ్చిబాబు వ్యంగ్యంగా అన్నాడు.
కోపం వచ్చింది డ్రయివర్కు."అది కుదరదండి.నేను స్ట్రెయిట్ గా మహాబలిపురానికే తీసుకువెళతాను"అన్నాడు.
"ఇదిగో! ఓనరుతో మేం మాట్లాడుకొంటాం.పదో పరకో ఎక్కువ ఇచ్చుకొంటాం.నువ్వు చెప్పింది చెయ్యవయ్యా "అన్నాడు శ్యాం ప్రసాదు.
ఇక నోరు విప్పలేదు డ్రయివర్ .వ్యాన్ను పరుగులు తీయిస్తున్నాడు.
ఉదయాన్నే లేచి వంట చేసుకొని బయలుదేరడం వల్ల శ్యాం ప్రసాదు,అతని భార్య సుందరి, జానకిలు బడలికతో అలా మాగన్నుగా కళ్ళు మూశారు.పది నిముషాల తరువాత మెల్లగా జానకి చేతిని గిల్లాడు బుచ్చిబాబు.ఉలిక్కి పడ్డట్టు కళ్ళు తెరచి భర్తవంక చూసిందామె 'ఏమిటీ?' అన్నట్టు.
"ఇంట్లో పిల్లలకని బోలెడు పళ్ళు,చక్రాలు,చకోడీలు సర్దుతుంటే చూశాను.నాకు ఆకలిగా వుంది. ఏదైనా పెట్టవా?"మెల్లగా చెవిలో అన్నాడు బుచ్చిబాబు.
"అయ్యోరామ ! పిల్లలకన్నా అద్వానమండీ మీరు.చూడండి వాళ్ళు నన్నేమీ అడక్కుండా ఎంచక్కా మాట్లాడు కొంటూ వస్తున్నారో!ఉదయం టిఫన్ ఎక్కువ తిన్న మీకు అప్పుడే ఆకలా" అంటూ సంచిలోనుంచి ఆపిల్ ,బనానా,బత్తాయి పళ్ళతో పాటు కొంచం చక్రాలు తీసి భర్త బుచ్చిబాబుకు అందించి అటు పిల్లల్నీ చూసిందామె!పాపమనుకొందేమో వాళ్ళకు తలా ఓ ఆపిల్ ఇచ్చింది.పిల్లలు తింటున్నారు. బుచ్చిబాబు కూడా చిన్న పిల్లాడిలా శబ్దం చేస్తూ తింటుంటే ఆ చప్పుడికి శ్యాం ప్రసాదు మేల్కొని చూశాడు.
"ఏమీ లేదన్నయ్యగారూ!కాసిన్ని చక్రాలను పెడితే వాటిని నములుతున్నారాయన.కదండీ?" అంది జానకి .అవునన్నట్టు గంగిరెద్దులా తలూపాడు బుచ్చిబాబు.
నవ్వొచ్చింది శ్యాం ప్రసాదుకు."వాడ్ని గూర్చి నాకు చెప్పకమ్మా.వాడి నోరు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ వుండాలి.అందుకే వాడలా స్థూలకాయంతో వుంటూ షుగరు,బి.పి లను వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు.పోనీ...వుదయాన నాలా వాక్ చేస్తాడా అంటే అదీలేదు. పార్కుకొచ్చి అక్కడున్న బెంచీకి అతుక్కు పోతాడు.వాడి వైటు ఎంతో తెలుసా? వంద కిలోలు."అన్నాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
"వాడికి నామీద కుళ్ళులేవే జానూ! నేను బలంగా వున్నానని ఎప్పుడు ఏడుస్తుంటాడు" చక్రాలను పరపరా నములుతూ అన్నాడు బుచ్చిబాబు.నవ్వి వూరుకున్నాడు శ్యాంప్రసాదు. పావుగంట వ్యవధిలో వి.జి.పి గోల్జెన్ బీచ్లో ఆగింది వ్యాను.అందరూ దిగారు. బుచ్చిబాబుకూడా మెల్లగా దిగాడు.టిక్కెట్లు తీసుకొని లోనికెళ్ళారు.క్యాంటీన్ వద్ద ఆగి పోయాడు బుచ్చిబాబు.
"ఏరా ఆగిపోయావ్ !తిరిగి చూడ్డానికి మాతో రావట్లేదా?"అడిగాడు శ్యాం ప్రసాదు.
"అక్కడేముందిరా బొంద.పిల్లల్ని తీసుకొని నువ్వెళ్ళిరా! నేనిక్కడ కూర్చొంటాను"అంటూ అక్కడున్న బెంచిమీద కూర్చొన్నాడు బుచ్చిబాబు.
'అయ్యోరామ'అంటూ తలమీద కొట్టుకొంది జానకి. నవ్వుకొంటూ ముందుకు నడిచారు అందరూ.
అటు క్యాంటీన్లోకి చూశాడు బుచ్చిబాబు.అక్కడ చాలామంది స్పెషల్ అనిపించుకొనే పెద్ద దోశెల్ను ముందుంచుకొని తింటున్మారు.నోట నీళ్ళూరాయి బుచ్చిబాబుకు.ఓ అర్థ గంటైన తరువాత అందరూ తిరుగు ముఖం పట్టి క్యాంటీన్ వద్దకొచ్చారు."టైమైంది పదరా! మహాబలిపురం వెళ్ళి తిరిగి చూసిన తరువాత భోంచేద్దాం"అన్నాడు శ్యాం ప్రసాదు.
శ్యాం ప్రసాదు మాటల్ని పట్టించుకోని బుచ్చిబాబు"ఒరేయ్ !అక్కడ రోలుగా చుట్టి ప్లేటులో వున్న ఆ దోశెను,దాన్ని నాలా బొద్దుగా వుండి తింటున్న ఆ పిల్లాడ్ని చూడు.అలాంటి దోశెను మీకు తినాలనిపించట్లేదా?" గుటకలు మింగుతూ అన్నాడు బుచ్చిబాబు.
"అయితే మీరిప్పుడు దోశె తినాలంటారు,అంతేగాండీ?"అంది జానకి.
"అవును.నాకొక్కడికే ఒక్క దోశ కావాలి"అని గట్టిగా తలూపాడు బుజ్జిబాబు.
"అయ్యోరామ.తప్పుతుందా పదండి"అంటూ లోనికి నడిచారు.నాలుగు దోశెలను తీసుకున్నారు.ఒకటి బుచ్చిబాబు ముందుంచి తతిమ్మా మూడు దోశెల్ను ఏడుగురు తిన్నారు. చెయ్యి కడుక్కొని వ్యానెక్కి కూర్చొన్నారు. కొంతదూరం వెళ్ళింది వ్యాను.
"ఇంకేమన్నా వున్నాయా తినటానికి?"ఉన్నట్టుండి అడిగాడు బుచ్చిబాబు భార్యను.
"అయ్యో రామ!ఇదిగో అన్ని వున్నై.అయితే ఇప్పుడు పెట్టను.భోజనాలైయ్యాకే!ఓ గంటసేపు ఆ నోటికి తాళం వెయ్యండి"అంటూ విసుక్కొంది జానకి.కిమ్మనకుండా కూర్చొన్నాడు బుచ్చిబాబు . కాస్సేపటికి మహాబలిపురమొచ్చింది. అందరూ దిగారు.బుచ్చి బాబు దిగి అక్కడ చెట్టుక్రింద వున్న బండమీద కూర్చొన్నాడు.
"ఏంట్రా?తిరిగి చూడ్డానికి నువ్వు రావట్లేదా?"అడిగాడు శ్యాంప్రసాద్ .
"ఏముందక్కడ బొంద!?మీరెళ్ళి చూసిరండి"అయాసపడుతూ అన్నాడు బుచ్చిబాబు.
"ఇక్కడే కూర్చొని వుండు.ఓ గంటలో తిరిగొస్తాం .ఇదిగో!అకలౌతోందని ఆ పల్లీలు, ,బొండాలు, బజ్జీలని తిని కడుపును పాడు చేసుకోకండి.మీరు పదండన్నయ్యగారూ!"అంటూ ముందుకు నడిచింది జానకి.
'అక్కడికి వీడేదో పుడ్డు విషయంలో కంట్రోలుగా వున్నట్టు.ఆ బోండాలు,బజ్జీలను తినకపోతే సరి'అని మనసులో అనుకొని నవ్వుకొంటూ"పదండి...పదండి"అంటూ వాళ్ళను వెంబడించాడు శ్యాం ప్రసాదు.
"వొదినా !నాకు తెలీకడుగుతున్నాను.మీ వారు ఎప్పుడూ ఇంతేనా?కడుపుకు తినడం ఓ పనిగా చేసుకొన్నారు.అలా తింటే ఊబకాయం రాక సన్నబడతారా?అందునా షుగర్ పేషంటని చెపుతున్నారాయే.పార్కులో కూడా ఒక్క రౌండుకూడా నడవరట.అర్థగంటో లేక నలభై నిముషాలో మా వారు నడిచేవరకూ వీరు బల్లమీద పడుకొని నిద్రపోతారట.అలా అయితే ఆరోగ్యం కుంటు పడదూ?"అంది శ్యాం ప్రసాదు భార్య సుందరి.
"ఏమిటోలేమ్మా!అది నా ఖర్మనుకొంటున్నాను.మరి కన్నానుగా వారికి ఇద్దరు పిల్లల్ని" ముఖం మూడు వంకలు తిప్పుతూ అంది జానకి.
"అమ్మాయ్ !మాట్లాడకుండా రావా!ఇప్పుడు నీకు వాడి సంగతి అవసరమా!నోరుమూసుకొని పద"మందలించినట్టు అన్నాడు భార్య సుందరిని శ్యాం ప్రసాదు.
"వదినమ్మగారు వున్నదే అడిగారు అన్నయ్యగారూ!అది నా ఖర్మేగా మరి.ఆయనంతే! ఒక్కోసారి నేనే ఆయన్ను తినటానికే పుట్టాడేమోననుకొంటా"ముక్కు చీదింది జానకి పిల్లలతో నడుస్తూ.
వాళ్ళటు కనుమరుగౌతూనే రెండు బజ్జీలు,రెండు బోండాలు ,బాటిల్ నీళ్ళను కొనుక్కొని శుభ్రంగా తిని నీళ్ళు తాగి వెళ్ళిన వాళ్ళకోసం ఎదురు చూస్తూ కూర్చొన్నాడు బుచ్చిబాబు.
మధ్యాహ్నం వరకూ తిరిగి చూసి రెండు గంటల ప్రాంతంలో బుచ్చిబాబు దగ్గరకు వచ్చారు. చెట్టుక్రింద దుప్పటి పరిచి అందరూ కూర్చొన్నారు బచ్చిబాబు తప్ప.ఎందుకంటే తను క్రింద కూర్చొంటే లేవలేడు పాపం.
రెండిళ్ళలో నుంచి తెచ్చిన పులిహోరా,పెరుగన్నం,దుంప వేపుడు,ఆవకాయతో డ్రయివరుతో పాటు అందరూ భోంచేశారు. పళ్ళు,చక్రాలు,చకోడీలను కూడా కాజేశారు.గంట రెస్టు తీసుకొని బ్యాక్ టు హోమని ముడున్నర గంటలకు కదిలారు.ఏటూ దారిలో క్రొకడైల్ పార్కును కూడా చూడాలిగా మరి.
సమయం నాలుగు గంటలు.వ్యాను వేగంగా వెళుతోంది.అందరూ అలా కన్ను మూశారు జానకితో పాటు.అమె ప్రక్కన కూర్చొన్న బుచ్చిబాబుకు స్టమక్ అప్ సెట్టయ్యిందేమో కడుపు పట్టుకొని కళ్ళు మూసుకొని ఇబ్బంది పడుతూ మెలికలు తిరిగి పోతున్నాడు.అప్పటికే తనకు ముచ్చెమటలు పోసి మైకం వచ్చేట్టువుంది.ఇక లాభం లేదనుకొన్న బుచ్చిబాబు మెల్లగా భార్యను గిల్లాడు.
"ఏమైందండీ?"అని టక్కున మేల్కొని అడిగింది జానకి.
"స్టమక్ అప్సెట్ అయినట్టుంది జానూ!.వీపరీతమైన నొప్పి .షుగర్ , బి.పిలు రైజై మైకం వచ్చేట్టు వుంది.దగ్గర్లో ఆసుపత్రి వుంటే వెళదాం"అన్నాడు ఇబ్బంది పడుతూ బుచ్చిబాబు.
జానక్కి ఏమీ పాలు పోలేదు.ఆమెకు భయం పట్టుకొంది.వెంటనే "అన్నయ్యగారూ!వీరు అదోలా అయిపోతున్నారు.ఆసుపత్రికి తీసుకెళ్ళాలి"అంది శ్యాం ప్రసాదుతో.శ్యాం ప్రసాదు
గూగుల్ మ్యాప్లో ఆసుపత్రిని వెతికాడు.కిలో మీటరుకవతల ఓ మల్డీ స్పెసాలిటీ హాస్పిటల్ వున్నట్టు గుర్తించి డ్రయివర్తో చెప్పి అక్కడికి వెళ్ళ మన్నాడు.పాపం బుచ్చిబాబు పిల్లలు ఏడ్పులంఖించుకున్నారు.జానకి కళ్ళనుంచి కన్నీళ్ళు కారుతూనే వున్నాయ్ !
కాసువాలిటీకి తీసుకు వెళ్ళారు బుజ్జిబాబును. డాక్టరుగారు పరిశీలించిన తరువాత స్ట్రెచ్చర్లో తీసుకెళ్ళి బెడ్డు మీద పడుకోబెట్టి ఇ.సి.జి.తీశారు.బి.పి.చూశారు. బ్లెడ్ టెస్టు చేశారు. అర్థగంటలో అన్ని రిపోర్టులు డాక్టరు వద్దకొచ్చాయి.అన్నిటిని పరిశీలనగా చూసి మెల్లగా నవ్వాడు డాక్టర్.ఈ లోపు రెండు సూదులు వేసి,సెలైన్ ఎక్కిస్తున్నారు బుచ్చిబాబుకు.
"ఏం భయపడకండి.మరో మూడు గంటల్లో తను బాగా కోలుకొంటాడు.ఏదో పనికిరాని పుడ్డును మితిమీరి తిన్నందున అది కాస్తా పాయిజనై స్టమక్ అప్ సెట్ అయ్యింది.ఇక పర్వాలేదు.పల్స్ రేట్ ,హార్టు బీటింగ్ క్రమంగానే వున్నాయి.కాని బి.పి.,షుగరు అంతగా కంట్రోల్లో లేవు. ఆ విషయంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి.ముఖ్యంగా తను తినే డైట్ కంట్రోల్గా వుండాలి" అన్నాడు డాక్టరు.
"అడుగో!కదులు తున్నాడు,అందర్ని చూస్తున్నాడు. ఇప్పుడు మామూలుగా వుందేమో!ఆ సంగతి వాడికే చెప్పండి డాక్టరుగారూ!"అన్నాడు శ్యాంప్రసాదు.
తండ్రి కదలికలను చూస్తూనే పిల్లలు శోకాలు పెట్టటం ఆపేశారు.డాక్టరు మాటలు జానక్కి ధైర్యాన్నిచ్చాయి.
"మీ పేరేమిటండీ?"డాక్టురుగారు బుచ్చిబాబును అడిగాడు.
"బుచ్చిబాబు సార్ "దీనంగా చెప్పాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
"ఇక మీ ఆరోగ్యానికి డోకా లేదు.అయినా తప్పకుండా షుగర్ ,బి.పి లను కంట్రోల్లో వుంచుకోవడం ఎంతైనా అవసరం.ఉబకాయాన్ని తగ్గించుకోవడం కూడా అంతే అవసరం. లేకుంటే త్వరగా చెల్లు కుంటారు.మీ ఫ్యామిలీ డాక్టరు చెప్పిన విధంగా ఉదయం టిఫన్ కు రెండు ఇడ్లీలు,మధ్యహ్నానం భోజనానికి ఓ కప్పు అన్నం సాంబారుతో, కాసిన్ని మజ్జిగ,ఇక రాత్రి డిన్నరుకు రెండు చిన్న చపాతీలు ఏదేని కాయకూరలతోనో లేక ఆకు కూరలతోనో తీసుకొండి. పడుకోబోయే ముందు ఓ కప్పు పాలు తాగండి.ఆ డైటును కంటిన్యూ చేస్తూ రోజూ కంపల్సరిగా ముఫ్ఫైనుంచి నలభై నిముషాలు వాక్ చేయండి. ఓకే" అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ .బుచ్చిబాబు నోటికి తాళం వేయడంతో నోట్లో వెలక్కాయ పడ్డట్టయ్యింది.ఆ సమయానే రెండు వేలు బిల్లుకట్టమని కౌంటరునుంచి పిలిచారు. వెంటనే శ్యాం ప్లసాదు వెళ్ళి బిల్లుకట్టొచ్చి అందరికి రాత్రి డిన్నర్కు ఏం కావాలో చెప్పమని మెను అడిగాడు.అందరూ రకరకాలుగా చెప్పుకున్నారు. "ఓకే"అంటూ అటు తిరిగి "నీకురా బుచ్చీ!"అన్నాడు శ్యాంప్రసాదు.
"నాకు ఒక్క చపాతీ"అని చూపుడు వ్రేలితో చూపి తల దించుకున్నాడు బుచ్చిబాబు.మరది సిగ్గుతోనో లేక దిగులుతోనోనన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
28-07-2025, 04:22 PM
(This post was last modified: 28-07-2025, 04:23 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్పు తీర్చిన అప్పారావు! - పద్మావతి దివాకర్ల
"అప్పారావ్! అప్పు తీర్చుతానని చెప్పి నాలుగేళ్ళనుండి మమ్మల్నందర్నీ నీ వెంట తిప్పుతున్నావు. ఇంకెన్నాళ్ళు తిప్పుతావయ్యా?" శంకర్రావు గట్టిగా అడిగాడు.
"అలాగే నా నాలుగేళ్ళ ఇంటి అద్దె బాకీ కూడా ఎప్పుడు తీరుస్తావు అప్పారావూ?" అడిగాడు ఇంటి ఓనర్ పురుషోత్తం అప్పారావుని నిలదీస్తూ.
"నా వద్ద తీసుకున్న సరుకల బాకీ సంగతో?" అన్నాడు రామేశం.
"మరి నా హొటల్‌లో పద్దు మాటేమిటి?" కడిగేయసాగాడు కామేశం.
అప్పారావుని ముప్పేట దాడి చేయసాగారు అతనికి అప్పులిచ్చినవాళ్ళు. అప్పారావు ఇంటిముందు గుమిగూడిన అప్పులాళ్ళందరూ అప్పారావుని ఇలా స్త్రోత్ర పాఠాలతో ముంచెత్తసాగారు.
వాతావరణ హెచ్చరిక లేకుండా వచ్చిన సునామిలాగా అప్పులాళ్ళందరూ అప్పారావుని చుట్టుముట్టినా కొంచెంకూడా బెదరకుండా నిమ్మకు నీరెత్తినట్లు నిలబడ్డాడు అప్పారావు. అతని సంగతి అందరికీ తెలిసిందే కదా మరి! ఎప్పుడూ ఏదో సాకు చెప్పి అప్పటికప్పుడు తప్పించుకోవడం అతనికి అప్పుతో పుట్టిన విద్య మరి!
“అసలు అప్పు తీసుకోవడమే కానీ తీర్చడం ఎప్పుడైనా చేసావా ఏమిటి? అసలు అప్పుతీర్చడం నీ చరిత్రలోనే లేదే? ఈ సారి తాడో పేడో తేల్చుకోవాలి. నీతో ఇలా కాదు, ఈసారి కోర్ట్‌కి వెళ్ళాల్సిందే, మరి తప్పేట్టు లేదు." అన్నాడు బాగా మండిన సుందర్రావు.
"ఉరుకోరా నాయనా! అప్పారావుతో తగువు పెట్టుకోకు, అసలుకే మోసం వస్తుంది చూసుకో!" అంటూ వెనక్కు లాగేడు కామేశం.
సుందర్రావు మాటలు చెవికెక్కించుకున్న అప్పారావు, "ఏమిటి తొందర్రావూ! సారీ, సుందర్రావూ, నిజం చెప్పు, గుండెలమీద చెయ్యేసి మరీ చెప్పు? నేనెప్పుడూ అప్పు తీర్చలేదా? నాలుగేళ్ళ కిందటి సంగతి గుర్తు లేదా ఏంటి??" అన్నాడు.
అప్పుడు అందరికీ సినిమా రీళ్లలాగ నాలుగేళ్ళ క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. అప్పుడూ ఇలాగే అప్పారావు అందరి అప్పు తీరుస్తానని తన ఇంటికి పిలిపించుకున్నాడు. 'అప్పారావేంటి అప్పుతీర్చడమేమిటి? మన భ్రమ కాకపోతే?' అనుకుంటూనే అప్పారావు ఇంటిముందు గుమిగూడారు. అయితే అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేస్తూ, ఆ రోజు అందరూ తెల్లబోయేలా అప్పారావు తన బ్రీఫ్ కేస్ తెరిచి అందరికి వాళ్ళ వాళ్ళ అప్పులు తీర్చాడు. అది కలో, వైష్ణవ మాయో అర్ధం కాలేదు అప్పులాళ్ళందరికీ.
అయితే, అప్పు తీర్చే ముందు అప్పారావు అందరివద్దనుండి లిఖితమైన హామీ తీసుకున్నాడు. అదేమిటంటే, మళ్ళీ ఎప్పుడైనా తనకి అప్పు కావలసి వస్తే మాత్రం తప్పకుండా అప్పు ఇచ్చేట్లు పత్రం రాయించుకున్నాడు. ఏమైతే అయింది, ముందు పాత బాకీ వసూలైతే చాలని, అందరూ కళ్ళు మూసుకొని హామీ పత్రం మీద సంతకం చేసి వాళ్ళవాళ్ళ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత తెలిసిందేమిటంటే, అవన్నీ ఆ రోజే ప్రభుత్వం ద్వారా రద్దైన వెయ్యి, అయిదువందల రూపాయల నోట్లు. అప్పారావుకి ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేక, మరేం చేయలేక, ఆ నోట్లు పట్టుకొని నెలల తరబడి బ్యాంక్ వద్ద క్యూలో నిలబడి మార్చుకున్నారు పాపం. ఆ దృశ్యాలన్నీ కళ్ళముందు మెదిలి అందరికీ ఆ నవంబర్ నెల చలిలో కూడా చెమట్లు పట్టాయి.
అందరికన్న ముకుందరావే ముందుగా తేరుకున్నాడు.
"గుర్తులేకపోవడమేమిటి? భేషుగ్గా గుర్తుంది! తీర్చకతీర్చక అప్పు పెద్ద నోట్ల రద్దు సమయంలో తీర్చావు. అన్నీ రద్దైన ఐదువందలు, వెయ్యరూపాయల నోట్లు ఇచ్చావు మరి. పోనీ అప్పు వసులైందే చాలని అవి పుచ్చుకొని చచ్చేము. ఆ నోట్లు మార్చుకోవడానికి బ్యాంక్‌క్యూలో ఇంటిల్లపాదీ నెలలతరబడి నిలబడ్డాము. బ్యాంక్‌ఖాతాలో జమ చేసినందుకు ఆదాయపు పన్ను శాఖ అధికార్లనుండి శ్రీముఖాలు కూడా అందాయి. వాళ్ళబారినుండి తప్పించుకొనేసరికి మా తలప్రాణం తోకకొచ్చింది. మా బుద్ధి గడ్డితిని మళ్ళీ నీకు అప్పు ఇచ్చేం!" అన్నాడు అప్పటివరకు నోరు విప్పని ముకుందరావు ఆ పాత దృశ్యాలు గుర్తుకుతెచ్చుకొని బెంబేలెత్తిపోతూ.
"మరి గుర్తుందికదా! ఏమైతేనేమి అప్పు తీర్చానా లేదా అన్నదే పాయింట్! మరి నాకు మాటిచ్చినట్లు మళ్ళీ అప్పు ఇస్తిరే! ఈ సారి కూడా నేను కచ్చితంగా అప్పు తీర్చబోతున్నాను. సరిగ్గా వినండి. వచ్చే నెల ఎనిమిదో తారీఖున మీ అందరి అప్పు తీర్చడానికి మంచి ముహూర్తం నిశ్చయించాను. ఆ రోజు అందరూ కట్ట కట్టుకొని రండి. మీ అందరి బాకీ అణాపైసలతో సహా చెల్లించకపోతే అప్పుడు నన్నడగండి." అన్నాడు అప్పారావు జంకు గొంకు లేకుండా.
అంత నిబ్బరంగా అప్పారావు మాట ఇచ్చేసరికి అక్కడ గుమిగూడిన అప్పులాళ్ళందరూ ఖంగు తిన్నారు. కొందరికి నిజంగానే మతులు పోయినై!
'కొంపతీసి మళ్ళీ పెద్దనోట్లు రద్దుగానీ ప్రభుత్వం ప్రకటించలేదు కదా. అసలే ఇంట్లో వాళ్ళు ఎడతెరిపిలేకుండా సీరియల్సు చూడటంవల్ల మనకి వార్తలు కూడా వినడానికి వీలు కావడం లేదుకదా!' స్వగతంగా కామేశం అనుకున్నా పైకి వినబడనే వినబడింది.
అయితే అందరికీ ఈ అనుమానమే కలిగింది కూడా. అయితే ఇవాళ అలాంటి వార్తేమీ లేదే! ఏమో ఈ ఎనిమిదో తారీఖన మళ్ళీ పెద్ద నోట్లు రద్దవుతాయేమో? అప్పుడప్పుడు పనీపాటా లేనివాళ్ళు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు లేవదీస్తున్నారు కదామరి అవి నిజమవుతాయేమో? కొంపదీసి మన అప్పారావుకి దివ్యదృష్టి గానీ ఉందేమో? ఇలా పరిపరి విధాల పోయాయి వారివారి ఆలోచనలు.
అయితే నోరు మెదపడానికి జంకారందరూ. 'ఏమో ఎవరు చెప్పొచ్చారు, తము నిత్యం మొక్కే ముక్కొటి దేవతల్లో ఏ దేముడో మన అప్పారావుకి సద్బుద్ధి గానీ ప్రసాదించారేమో?' అనుకున్నాడు రామేశం. అక్కడున్న వాళ్ళందరూ ఇంచుమించు అలాగే అనుకున్నారు మనసులో.
అందరూ నిశ్శబ్దంగా ఉండటం చూసి, "మౌనం పూర్ణ అంగీకారమంటారు కదా! అందరూ క్షేమంగా వెళ్ళి వచ్చే నెల ఎనిమిదో తారీఖకల్లా వచ్చేయండి. మీమీ బాకీలు ఆ రోజు వసూలు చేద్దురుగాని." అన్నాడు అప్పారావు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|