Posts: 203
Threads: 4
Likes Received: 1,876 in 166 posts
Likes Given: 292
Joined: Apr 2023
Reputation:
223
Second Half :- అందము
శనివారం అంతా మా ఇంట్లో అందరూ దిగులుగా ఉన్నారు. అమ్మ ఐతే మరీ ఎక్కువ. నన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేదు. తమ్ముడు మా కంపెనీ పనులు చూసుకోక తప్పదు, వాడి బిజిలో వాడు ఉన్నాడు.
ఆదివారం ప్రొద్దున్నే నా చెంపలు వెచ్చగా అనిపించాయి, అది మా ఇంటి తూర్పు దిక్కు కిటికీ నుంచి వచ్చే సూర్యరశ్మి.
లేచి బెల్లు నొక్కితే, “ కిరణ్ భయ్యా.... ” అని నా తలుపు తెరుచుకొని అన్నాడు ఇక్బాల్.
నేను: మంచి చొక్కా, ప్యాంటు తీసి పెట్టు స్నానం చేసి వస్తాను.
ఇక్బాల్: టీఖే భయ్య..
నేను పాదాలు నేల తాకించి, అడుగులు వేసి వెతుకుతూ గొడకి స్విచ్ బోర్డు రెండోది నొక్కాను, అది వేడినీళ్లు కాచే గీజర్ బటన్. తలుపు తీసి లోనికి పోయి, కుడి పక్కన నా భుజం ఎత్తులో ఉండే సెల్ఫులో బ్రష్, పేస్టు అందుకొని, పేస్టు కొంచెం నొక్కి, అది బ్రష్ కి అంటుకుందో లేదో నేను నోట్లో పెట్టుకుంటే గాని తెలీదు. పేస్టు పక్కన పెట్టి బ్రష్ నోట్లో పెట్టుకున్న. హా ఉంది. పళ్ళు తొమి, కిందకి వంగి ఎడమ దిక్కు నీళ్ల టాప్ తిప్పి నోట్లో పూకులించి ఉమ్మేశాను.
దానికి పైనే షవర్ ది ఉంటుంది.
నా t-shirt, ప్యాంటు విప్పి పక్కన వేసాను.
ఏంటో నేను పక్కన వేస్తాను, అవి ఎక్కడ పడతాయో తెలీదు. ఒకరోజు అమ్మ నన్ను తిట్టింది. డ్రెస్సు లెట్రిన్ కుండి మీద విసిరేసాను అని.
షవర్ తిప్పితే, కొంచెం కాగిన నీళ్ళు నా మీద వర్షంలో తడిచినట్టు అనిపించింది.
స్నానం చేసి, టవల్ చుట్టుకొని బయటకి అడుగేసి కుడికి ఐదు అడుగుల వేసి, బెడ్డు నా మోకాలి కింద తగిలింది. వొంగి వెతికితే డ్రెస్సు దొరికింది.
టవల్ ముడి విడిచేసాను. అది కింద పడిపోయింది.
ఎవరూ ఉండరు, ఇక్బాల్ ఎప్పుడూ అలా డ్రెస్సులు పెట్టి వెళ్ళిపోతాడు. నేను పిలిస్తేనే వస్తాడు.
నాకు తెలుసు, నా గదిలో ఒక అద్దం ఉంది. బెడ్డుకి ఆరగులుగా దూరంలో రెండో దక్షిణం దిక్కు కిటికీ పక్కన.
అటు అడుగేసి ముందుకి చెయ్యి చాచాను, నా మునివేళ్ళకు గాజుముక్క పలక తాగింది, అదే అద్దం.
అసలు నన్ను చూసుకుంటే ఎలా ఉంటాను? నేను కనీసం ఎలా ఉంటానో అని ఊహించుకోలేను కూడా.
అమ్మ నేను అందంగా ఉంటాను, నాన్న నేను ఆయనకంటే ఎత్తు అయ్యాను, తమ్ముడు నా కళ్ళు బాగుంటాయి అని చెప్పారేగాని, మిగతా ఎవ్వరూ నా గురించి చెప్పినవాళ్ళు లేరు.
నాగురించి నేను అనుకునేవి కొన్నే, కళ్ళ ముందు నల్లరంగు కన్నద్ధాలు, ఎడమ చేతికి ఒక గడియారం, జేబులో ఫోను, కుడి చేతికి కర్ర, కింద ఎత్తు భూట్లు, అమ్మ దువ్విన జుట్టు. అంతే.
చొక్కా ప్యాంటు వేసుకున్నాను. టవల్ తీసుకొని తల తుడుచుకున్నాను.
ఇక చాలు ఇంకేమి వద్దు.
గది నుంచి బయటకి వచ్చాను.
ఇక్బాల్: ఎక్కడికి?
నేను: బయటకి?
ఇక్బాల్: ఆగండి కార్ తెస్తాను.
నేను: అవసరం లేదు.
ఇక్బాల్: భయ్య స్టిక్కు?
నేను: ఏం అవసరం లేదు. అమ్మ ఎక్కడ?
ఇక్బాల్: మేడం పూజలో ఉన్నారు.
నేను: నేను కీఫ్ కి పోయ్ వస్తాను, అమ్మకి చెప్పు.
ఇక్బాల్: ఉండండి చెప్పి వస్తాను.
నేను: నేను ఒక్కడినే పోతున్న.
ఇక్బాల్: భయ్యా... లేదు నేను వస్తాను.
నేను: చెప్పింది చెయ్యి అంతే.
నా కుడి చేతి మోచేతి పట్టుకున్నారు.
ఇక్బాల్: నేను లేకుండా నువు బయటకి పోవు భయ్య.... పంపిస్తే అమ్మగారు తిడతారు. పదా నేను వస్తాను.
సర్లే అనుకున్న.
నా మోచేతికి ఇక్బాల్ చెయ్యి పట్టుకున్నాడు. నడుస్తూ ఇంటి బయటకి పోయాము.
ట్రాఫిక్ శబ్దం, చల్లని గాలి, నా నుదుట కాలుతున్న ఎండ, దూరంగా ఎవరో భార్య భర్తల గొడవ.
నడుస్తూ నా చెయ్యిని గట్టిగా పట్టుకొని నన్ను కుడికి తిప్పాడు.
ఇక్బాల్: భయ్య రోడ్డు దాటాలి.
కొన్ని క్షణాల నిల్చొని ఉన్నగా నా చెయ్యి లాగాడు. అలా ముందుకి నడిచి, “ మెట్టు ఎక్కు ” అన్నాడు, నేను కాలెత్తి పైకి ఎక్కాను.
అక్కడ కొందరి గుసగుసలు వినిపిస్తున్నాయి, ఇంకోసారి కిలకిలలు వినిపిస్తున్నాయి.
దాటుకొని పోయి, తలుపు చప్పుడు. లోపల అడుగు పెట్టాల ac చల్లదనం. నా భుజాలు పట్టుకొని తిప్పి, కుర్చీ లాగుతున్న చప్పుడు, “ బైటో భయ్యా” అన్నాడు. నేను కూర్చున్న. చేతులు ఆడిస్తూ ముందు టేబుల్ ఉందా అని వెతికాను, చల్లని గాజు తగిలింది. ఉంది అని టేబుల్ మీద మోచేతులు పెట్టాను.
నేను: ఇక్బాల్ బయట శంకర్ దగ్గర ఛాయి, ఉస్మాని బిస్కట్లు తేపో, నీకూ నాకూ.
ఇక్బాల్: హహ.... ఇంత కేఫ్ కి వచ్చి, బయట టీ స్టాల్ ఛాయి తాగేవాడివి నువ్వే. ఉండు లేకే ఆతాఊ
ఇక్బాల్ పోయాడు.
చుట్టూ మనుషుల మాటలు, కాఫీ మెషీన్ శబ్దం, ఏవో ప్లెట్స్ కదులుతున్న శబ్దం.
చిన్నగా ఎడమ దిక్కునుంచి, “ మౌనమేళనోయి ఇది మరపు రాని రేయి... ” అని గాణం వినిపిస్తుంది.
గట్టిగా ఊపిరి తీసుకుంటూ మౌనంగా ఆలోచనలో పడ్డాను.
తమ్ముడు మరో కంపనీ అంటున్నాడు, రెండు కంపెనీలు చూసుకోలేడు. అందుకే నాన్న దానికి నన్ను ఉండమని అంటున్నాడు. నాకేదో కనిపించదు, చదవాలంటే లిపిలో చదవాలి, మరి కంపనీ కాగితాలు అలా ఉండవు, ప్రింటెడ్ ఉంటాయి. నా పేరు నాకే రాసుకోవడం రాదు. తమ్ముడు నాతో కూర్చొని నా చెయ్యి పట్టి దిద్ధించీ దిద్ధించీ నా సంతకం ఎలా ఉంటుందో నేను ఊహిణుకోలేను గాని ఒక సంతకం ఐతే అలవాటు అయ్యింది.
అది కూడా చెయ్యి కదలడానికి నిమిషం పడుతుంది. ఒకవేళ ఎవరో ఒకరు నాచేత దొంగ కాగితాల మీద సంతకం పెట్టించుకుంటే, నా కళ్ళు కప్పి, అదే ఎలాగో ఏమీ కనిపించదు కదా, ఏదైనా చేసేస్తే? కిషన్ మూర్తి గారు నాన్నకి నమ్మకస్తుడిగా ఉన్నారు కానీ నా వరకు ఆయన నన్ను అంగీకారం కూడా తీసుకుంటారో లేదో తెలీదు.
“ ఏ మిస్టర్... ఏంటి ముందు కూర్చొని తెగ చూస్తున్నవ్. నేను చూస్తున్నాను అని తెలిసి కూడా అలాగే చూస్తున్నావు. సిగ్గులేదా అలా చూస్తే ఆడపిల్లకి ఇబ్బందిగా ఉంటుందని ఇంగిత జ్ఞానం లేదా? ” అని ఒక అమ్మాయి గట్టిగా గొంతెత్తి మాట్లాడుతుంది.
మా తమ్ముడు అంటుంటాడు, ఈ అమ్మాయిలని చూస్తే ఒక సమస్య, చూడకుంటే ఒక సమస్య అని, నేను బతికిపోయాను చూపు లేదు కదా.
నాలో నేను నవ్వుకొని మెడ పక్కకి తిప్పాను.
“ ఏయ్... నిన్నే మిస్టర్... ఇక్కడ అడుగుతుంటే అటు చూస్తున్నావు, గుడ్డి వాడివా? ”
ఏదో తేడా కొడుతుంది.
నేను: నన్నేనా అండి?
“ హ నిన్నే? ”
ఏంటి నా కళ్ళు అలా అనిపిస్తున్నాయా అమ్మాయికి?
నేను: సారి అండి నాకు కనిపించదు.
“ వాహ్... అబ్బ ఛా... ఇప్పటి దాకా చూసి ఇప్పుడే కళ్ళు కనిపించవు అంటావా? సిగ్గుండాలి తప్పించుకోడానికి అలా చెప్పుకోడానికి. ”
“ ఓహ్ మేడం మేడం... అయ్యో ఏంటి ”, ఇక్బాల్ గొంతు.
నాకు ముందు కప్పు టేబుల్ మీద పెట్టినట్టు వినిపించింది. టేబుల్ మీద చేతిని రుద్దుతూ కప్పు వెతికి పట్టుకున్న.
“ ఇద్దరూ ప్లానింగ్ తో ఉన్నారా కప్పు పెట్టడం, ఇతను యాక్టింగ్ స్టార్ట్ చేసాడు. ”
ఇక్బాల్: హెల్లో మేడం జి.... ఏంటి యాక్టింగ్, మా భయ్యా by birth blind.
“ నువ్వేంటి సపోర్ట్ ఆ. Blind ఐతే కళ్ళకు నల్ల కళ్ళద్దాలు, చేతిలో కర్రా, కనురెప్పలు కిందకి ఉంటాయి. నాకు తెలీదా? ”
నేను: అవును నీకు తెలీదు.
“ యూ.... నీకు అంటావా, నేనేమైనా మీకు ఫ్రెండ్ అనుకుంటున్నావా.”
ఇక్బాల్: అరె మేడం, మా భయ్యాకి సోకెక్కువ. అందుకే అవన్నీ ఉండవూ, మీరే తప్పుగా అనుకున్నారు.
“ లేదు ఇతన్ని చూస్తే అలా అనిపించట్లేదు, మీరు యాక్టింగ్ చేస్తున్నట్టే ఉంది. ఈ మధ్య ఇలాంటి వాళ్లు ఎక్కువౌతున్నారు. ”
నేను: అంటే నేను నా డిసెబిలిటీ సర్టిఫికేట్ జేబులో పెట్టుకొని తిరగాలా?
“ అసలుందా? ”
“ హెలొ మిస్.... ఏంటి problem? ” అని కేఫ్ మేనేజర్ మాట.
“ ఇతనే ప్రాబ్లం ” అంది.
ఇక్బాల్: కిరణ్ భయ్యాకి చూపులేదంటే నమ్మట్లేదు విక్రమ్ సాప్ ఈవిడ.
విక్రమ్: అవును మేడం, కిరణ్ సార్ ఎప్పటినుంచో ఇక్కడికే వస్తారు, ఆయనకు చూపు లేదు.
అమ్మాయి కాసేపేమి మాట్లాడలేదు.
విక్రమ్: మీరు అపార్థం చేసుకున్నారు.
“ సారి... సారి...”
నేను నవ్వాను.
ఇక్బాల్: తొందరపడి ఏదో ఏదో అనుకుంటే ఎలా మేడం.
“ సారి అండి... ”
నాలుగు క్షణాలకి అక్కడ రోజా పూల సువాసన దూరం అయ్యింది.
నేను: ఇక్బాల్ వెళ్ళిపోయిందా ఆమె?
ఇక్బాల్: హ... లేడీస్ కి మరీ ధైర్యం ఎక్కువైపోయింది భయ్యా... అయినా నిన్ను చూసి అలా ఎందుకు అనుకుంది.
నేను: నాకేం తెలుసురా
ఇక్బాల్: హహహ... ఏదైనా టెన్షన్ లో ఉందేమో భయ్య.
నేను: సర్లే కూర్చో.
ఆ అమ్మాయి ఏంటో, అలా ఎందుకు అనుకుందో, ఏమి తెలీదు.
తరువాత రోజు కూడా నేను ఆ కేఫ్ కి పోయాను. ఆ అమ్మాయి రాలేదేమో అనిపించింది.
మూడో రోజు పోయాను. బహుశా తను నాలాగా రోజూ వచ్చేది కాదేమో అనుకున్న.
నాలుగో రోజు పోయాను. అక్కడ నన్ను కూర్చో పెట్టి, “ భయ్యా మొన్న అమ్మాయి ఇవాళ కూడా ఉంది, సేమ్ టేబుల్ ” అని నన్ను వదిలేసి నాకోసం ఛాయికి పోయాడు.
నేను నా మొహం నిటారుగా పెట్టి కూర్చున్న.
క్షణాలు నిమిషాల్లా అనిపించాయి.
“ మీరు కొంచెం మెడ కుడికి తిప్పి కూర్చోండి మిస్టర్. ఏదో నన్నే సూటిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది ” అని అదే తీయని స్వరం మళ్ళీ వినిపించింది కాస్త వణుకుతో.
నాకు నవ్వొచ్చింది.
నేను: అది మీ సమస్య నా సమస్య కాదు.
తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వలేదు.
తరువాత నాకు కుర్చీ శబ్దం వినిపించింది. అదే గులాబి పరిమళం నా ముక్కుకి తెలుస్తుంది. ఆ అమ్మాయి నాకు దగ్గరగా వచ్చిందా?
“ సారి మొన్న నేను అనుకోకుండా అపార్ధం చేసుకున్నాను. ”
నాతో మాట్లాడుతుంది.
నేను: పర్లేదు. పొరపాట్లు మామూలే కదా అండి.
“ హ్మ్... మీరు నాకు అలా అనిపించలేదు. అంటే మామూలుగా చూపు లేకుంటే కళ్లద్దాలు పెట్టుకోవడం, లేదా కనురెప్పలు కిందకి ఉండడం చూసి... ”
నేను: నాకర్థమైంది. నేను అలాగే ఉండేవాడిని ఈ మధ్యే వదిలేసాను.
“ ఎందుకు అలా? ”
నేను: చూడ్డానికి నార్మల్ పర్సన్ లా కనిపించడానికి.
“ అవును, నేను ఫస్టు అలాగే అనుకున్నాను. అస్సలు నమ్మలేకపోయాను. మీ కళ్ళు నార్మల్ గా, అట్రాక్టీవ్ గా ఉన్నాయండీ. ”
నేను: హ్మ్.... థాంక్స్ అండి
“ ఓహ్... నా పేరు చెప్పలేదు. ఐ ఆమ్ హేశ్విత”
నేను: నేను కిరణ్... అంటూ చేతు ముందుకు చాచాను.
అప్పుడు సున్నితమైనా ముని వేళ్ళు నా చేతి రేఖలను తాగుతూ ఆమె మృదువైన చేతు నా చెయ్యికి కలపగానే ఏదో వణుకు వచ్చేసింది నాకు.
మీకో సలహా చెప్పాలా? ఎదుటి వారి దగ్గర ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేయ్యాలి అంటే వాళ్ళ పేరు మీద దృష్టి పెట్టాలి. పేరు చాలా ముఖ్యం.
నేను: మీ పేరుకి అర్థం ఏంటండీ, కొత్తగా ఉంది?
హేశ్విత: అదీ.... Person with knowledge అని అర్థం.
నేను: ఇలాంటి పేరు ఎప్పుడూ వినలేదు, చాలా కొత్తగా ఉంది. ఎవరు పెట్టారు మికీపేరు?
హేశ్విత: మా నాన్న.
నేను: హేశ్విత బాగుందండీ.
హేశ్విత: థాంక్స్ అండీ. మీ పేరు మీనింగ్ కిరణ్ అంటే లైట్ రేస్ అని.
నేను: అవును. నా పేరులో ఉన్న లైట్ నా జీవితంలో లేదు.
హేశ్విక: సారి మీరు అలా అనుకుంటారు అని చెప్పలేదు.
నేను: its ok హేశ్విత, నేను ఉన్న నిజం చెప్తున్న అంతే.
హేశ్విత: మీకు మీ మీద జాలి చూపిస్తే నచ్చదేమో కదా?
నేను: ఎలా తెలుసు?
హేశ్విత: మొన్న నేను మిమ్మల్ని అలా యాక్టింగ్ అంటుంటే నవ్వారు కానీ దిగులు పడలేదు కదా.
నేను: హహహ.... నిజమే.
ఇక్బాల్: అదేంటి మొన్న గుస్సా అయ్యిర్రు ఇవాళ నవ్వుతున్నారు.
ఇక్బాల్ వచ్చి టీ గ్లాసు టేబుల్ మీద పెట్టాడు.
హేశ్విత: ఏంటి టీ తెచ్చారా మీరు?
ఇక్బాల్: అవును, కూర్చోడానికి మాత్రమే ఈ కేఫ్, మేము తాగేది మాత్రం పక్కన టీ స్టాల్ ది.
మరో కుర్చీ జరిపిన శబ్దం, ఇక్బాల్ నా పక్కన కూర్చున్నట్టున్నాడు.
హేశ్విత: ఇదేంటి, ఇందులో కూడా ఉంటుంది కదా టీ?
నేను: ఇక్కడ శంకర్ చిచ్చా ఉండడు కదా?
హేశ్విత: ఈ శంకర్ ఎవరు?
ఇక్బాల్: ఆ టీ స్టాల్ బాబాయ్.
హేశ్విత: ఓ అర్థమైంది. అక్కడ మీకు కూర్చోడానికి ప్లేస్ లేదు. అందుకే ఇక్కడికి తెచ్చుకొని తాగుతారు. అవునూ ఇంతకీ మీరేం చేస్తుంటారు?
నేను: వీడికి పనులు చెప్తూ ఉంటాను.
ఇక్బాల్: నేను భయ్యా చెప్పిన పనులు చేస్తూ ఉంటాను.
హేశ్విత: అలా కాదు, మీరేం చేస్తూ ఉంటారు, ప్రొఫెషనల్ గా.
ఇక్బాల్ తనకి నేనెవరో చెప్పబోతాడు అనుకొని నా కప్పి టేబుల్ మీద పెట్టి మెచేతుని కదిలించాను. అనుకున్నట్టే నా మోచేతికి వాడి చెయ్యి తగిలింది.
నేను: ఏమీ చేయను హేశ్విత, ఇలా ఉంటాను అంతే. మీరేం చేస్తారు?
హేశ్విత: నేను యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో యాక్టింగ్ చేస్తాను.
నేను: ఓ మంచిదే.
హేశ్విత: ఇంకోటి చెప్పాలా, అది కూడా మా ఇంట్లో తెలీకుండా.
ఇక్బాల్: అదేంటి?
హేశ్విత: మా నాన్నకి ఇష్టం లేదు కాబట్టి. ప్రెసెంట్ మొన్నే ఒక ఇండస్ట్రీలో డ్రెస్సెస్ డిజైనర్ గా జాబ్ వచ్చింది. సో అది అలాగే ఉండగా పార్టైం లో ఇది కూడా.
నేను: హ్మ్... మంచిదే.
అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరిదో అనుకున్నాను, సంగీతం ఆగింది.
హేశ్విత: హా వైష్ణవి చెప్పు?
నేను మౌనంగా ఉన్నాను.
హేశ్విత: అవునా.... మరి ఎలా?
హేశ్విత: నాకేం తెలుసే, ఏం వేతుకుతాను, ఎవరు తెలుసు. ఇప్పటికిప్పుడు డబ్ చెప్పాలంటే అలా మంచి వాయిస్ ఎవరికైనా ఉండాలి కదా
హేశ్విత: సరే నేను సాయంత్రం చెప్తాను ఉండు.
బ్యాగ్ జిప్పు తీసి మూసిన శబ్దం వినిపించింది.
హేశ్విత: ఒకే నేను వెళ్తాను.
నేను: హా ఒకే.
తను దూరం నడుస్తున్నట్టు అడుగులు విపిస్తుంటే, గులాబి పూల వాసన సన్నగిల్లుతూ ఉంది.
రెండు క్షణాలకి మళ్ళీ పెరుగుతుంది.
నేను: ఇక్బాల్ ఆమె వెనక్కి వస్తుందా?
ఇక్బాల్: అవును భయ్యా...
నా గ్లాసులో ఛాయి ఒడిసింది అనుకుంటాను, పెదవికి అందట్లేదు.
హేశ్విత: మీ వాయిస్ బాగుంది కిరణ్.
నేను: హ్మ్... థాంక్స్.
హేశ్విత: డబ్బింగ్ చెప్తారా విలన్ కి.
డబ్బింగ్ ఆ నేనా? అదేంటి ఇలా అడిగింది.
నేను: బాగుంది అంటున్నారు, విలన్ అంటున్నారు.
హేశ్విత: హా... చెప్పండి మీరు చెప్తారా డబ్బింగ్. దానికి మీకు చూపు ఉండాల్సిన అవసరం లేదు.
నేను: నాకేం వస్తుంది అండి. ఇలాంటివి నాకొద్దు.
హేశ్విత: అది కాదండీ...
నా కుడి చేతుకి ఆ కొమలైన స్పర్శ మళ్ళీ కలిగింది.
హేశ్విత: ఇప్పటికిప్పుడు ఇంకొకరు దొరకరు.
నా చేయి వణుకుతూ ఉంది ఇక్బాల్ చూసాడేమో.
ఇక్బాల్: మేడం మీరు ఇబ్బంది పేస్తున్నారు?
హేశ్విత: సారీ... కానీ ఆలోచించండి మీరు ఒకే అంటే సాయంత్రం కలుద్దాము. నా ఫోన్ నెంబర్ ఇస్తాను.
ఏం చెప్పాలి? డబ్బింగ్ అవుతుందా? అయినా నాకెందుకు? ఏంటి అమ్మాయి అడిగింది చేయాలి అనిపిస్తుంది.
నేను: సర్లేండి చూద్దాం.
హేశ్విత: నా నెంబర్, 9866****00
ఇక్బాల్: ఒకే.
ఇక్బాల్ చేత తనకు ఫోన్ కలిపించాను.
హేశ్విత: హెలొ ఎవరూ?
నేను: నాకు ఆడియో కాల్ అంటేనే ఇష్టం, దీనిలో చూపు అవసరం లేదు కదా.
హేశ్విత: హహహ... అవును అవును. ఆరు తరువాత ఆ కేఫ్ దగ్గరకే రండి, అక్కడి నుంచి స్టూడియోకి పొదాము.
నేను: సరే
The following 19 users Like ITACHI639's post:19 users Like ITACHI639's post
• AB-the Unicorn, Babu_07, DasuLucky, gora, Iron man 0206, K.rahul, Manavaadu, Manoj1, murali1978, nomercy316sa, pandumsk, Ravi_sri, Saikarthik, shiva9, SHREDDER, sri7869, Uday, Uppi9848, yekalavyass
Posts: 203
Threads: 4
Likes Received: 1,876 in 166 posts
Likes Given: 292
Joined: Apr 2023
Reputation:
223
ఆరు తర్వాత నేను ఇక్బాల్ కేఫ్ కి పోయాము. కొన్ని నిమిషాలకి, “ హై కిరణ్, థాంక్స్ ఫర్ కమింగ్ ” అని హేశ్విత అనడం వినిపించింది.
నేను: హై హేశ్విత
హేశ్విత: ఇక్బాల్ మీరు అవసరం లేదు. నేను కిరణ్ వెళ్తాము.
ఇక్బాల్: మీరు ఆయనను చూస్కోలేరు. ఏమైనా అయితే అమ్మగారు నన్ను చంపేస్తారు.
ఇక్బాల్ మాట ముగిసేసరికి నా చేతికి వెచ్చగా అనిపించింది. నా చేతిరేఖలు ఆమె రేఖలను వేడిగా రుద్దుకున్నాయి.
హేశ్విత: ఏం కాదు నా స్కూటీ ఉంది. జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ ఇక్కడే దింపుతాను.
ఇక్బాల్ ఏదో తుత్తర్లో చెప్పేలోపు నేనే ఒప్పేసుకోవాలి.
నేను: ఓకే.
ఇక్బాల్: భయ్యా అదీ...
హేశ్విత: అరె నేను ఉన్నాను, మీ భయ్యాని విడిచి ఎక్కడికీ పోను.
ఆ మాట మనసుని గుచ్చుకుంది. నా చేతిని పట్టు పెంచాను, ఆమె చేతిని నమ్మకంగా పిసుకుతూ.
హేశ్విత: పదండి. నేను ఉన్నా కదా.
ఇక్బాల్: సరే కలుద్దాం.
నేను నిల్చిన. నా చేతిని వదలట్లేదు. నాకు ఆ టేబుల్, కెఫ్ ఎంట్రీ అలవాటే, అడుగులో అడుగు వేసి బయటకి వచ్చాను.
హేశ్విత: ఒక్క నిమిషం అలాగే నిల్చోండి.
నేను: హ్మ్...
ఇక్బాల్: సరే నేను పోతున్నా, అక్కడి నుంచి ఇక్కడి వచ్చేటప్పుడు ఫోన్ చెయ్యి భయ్యా.
నేను: సరే ఇక్బాల్.
స్కూటీ స్టార్ట్ అయినట్టు వినిపించింది.
హేశ్విత: ముందుకి రండి కిరణ్
నేను ముందుకి రెండు అడుగులు వేసాను.
హేశ్విత: కుడి కాలు ఎత్తాలి. ఎక్కండి.
నేను ఎక్కి కూర్చున్న. ఇక్కడ చెయ్యి పెట్టాలో తెలీలేదు. నా ఎడమ చేతిని ఆమె పట్టుకొని ఉంది. అప్పుడే నా చేతిని ఆమె భుజం మీద వేసుకుంది.
హేశ్విత: వెళ్దామా సరిగా కూర్చోండి.
నాకు వనుకొచ్చింది, నేనెప్పుడూ ఇలా బండి మీద కూర్చోలేదు, ఎక్కడికి పోయినా కార్ ఉండేది.
నేను: అంటే నేనిలా ఎప్పుడూ కూర్చోలేదు.
హేశ్విత: ఏం కాదు నన్ను పట్టుకోండి.
నా ఎడమ చేతు ఆమె భుజం మీద మెత్తగా పట్టుకున్న. కుడి చేతిని ఎక్కడ పెట్టాలో తెలీలేదు, నా మోకాళ్ళ ముందు రుద్దుకుంటూ కాస్త ముందుకని దొరికింది పట్టేసుకున్న.
నా చేతి ఏదోమృదువైన వెచ్చని వంక ఉన్న గుజ్జులంటి దాని మీద పడింది. ఒక చిన్న వణుకు పాకింది అక్కడ, అది నా అరచేతికి తెలిసింది.
హేశ్విత: కిరణ్ అది నా నడుము. కాస్త కింద పెట్టండి చేతిని.
అమ్మాయి నడుము. నా చేతు నా మాట వినట్లేదు, అక్కడే ఐస్కాంతంలా అతుక్కుంది. నాకు బలం రావట్లేదా, లేక నేను బలహీనం అయ్యాన అర్థం కాలేదు.
నా జ్ఞానం పెరకు, అమ్మాయిలు టాప్ వేసుకుంటే అది వాళ్ళ మొకాళ్ళ వరకూ, పంజాబీ డ్రెస్ వేసుకుంటే అది వాళ్ళ మోకాళ్ళ కిందకి, ఫ్రాక్ వేసుకుంటే నిండుగా ఉంటుంది. నడుము కనిపించేలా ఉండేది చీర అని మా తమ్ముడు కొన్నిసార్లు చెప్పాగా విన్నాను.
నేను: ఓహ్...
అలా కష్టంగా నా చేతిని కిందకి జారిస్తే కాటన్ బట్ట తగిలింది.
బండి కదిలింది. అలా బిగుసుకొని కూర్చునా.
నేను: చీర కట్టుకున్నారా మీరు?
హేశ్విత: అవును.... మీకెలా తెలుసు?
నేను: చీరలోనే కదా నడుము కనిపిస్తుంది.
హేశ్విత: ఏంటి మీకు కనిపిస్తుందా?
నేను: లేదండీ... మా తమ్ముడు చెప్పాడు, ఆడవాళ్ళ డ్రెస్ ఇలా ఉంటుంది అని.
హేశ్విత: ఓహో.... నేనింకా మీకు చూపిందేమో యాక్టింగ్ అనుకున్నాను.
నేను: ఊర్కో హేశ్విత, అసలే నాకు భయంగా ఉంది. స్కూటీ ఎక్కడం కొత్త.
హేశ్విత: హహ... భయం ఎందుకు, నాకు లైసెన్స్ ఉంది. మెల్లిగానే పోతున్నా.
నేను: హ్మ్...
స్టూడియోకి చేరుకున్నాము. అక్కడ నన్ను చెయ్యి పాటుకొని తీసుకెళ్ళి ఒక కుర్చీలో కూర్చోబెట్టింది. విజయ్ అని ఎవరో వచ్చారు, ఆయన ముందు నన్ను డబ్బింగ్ చెప్పమంది. ఏం చెప్పాలి అని అడిగితే ఒక డైలాగ్ చెప్పారు ఆ విజయ్.
విజయ్: రేయ్ గుండు గౌతమ్, ప్రజలకు నేను చేసే చెడు కనిపించేంతవరకే నీ మంచి కనిపిస్తుందిరా. నేను చెడు ఆపేస్తే నీ మంచికి విలువ ఉండదు. అందుకేరా నేను రే పులూ... ఎల్లుండులూ చేస్తున్నాను. ఆ రే పులే లేకుంటే, ఇక్కడ ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుందని ముందుకు వచ్చి గొంతు విప్పేవాడు ఎక్కడున్నాడురా. నేను లిక్కర్ ఫ్యాక్టరీ నడుపుతున్నా కాబట్టే మొగాళ్ళు తాగి ఇళ్లలోకి పోయి అందంగా లేని పెళ్ళాన్ని కూడా ఐశ్వర్యాలా ఊహించుకొని కాపురం చేస్తున్నారు, నా లిక్కరే లేకుంటే నెక్కర్లు వేసుకునే పొరగాళ్ళు వాళ్లకు పుట్టేవాల్లె కాదురా. చదువు పేరుతో ప్రైవేటు బడులు నడుపుతూ అధిక ఫీజులు దొబ్బుతూ కష్టపెట్టి మరీ ర్యాంకులు తెప్పిస్తున్నారా, నేను ర్యాంకులు తెప్పిస్తునా కాబట్టే ఇవాళ పిల్లల మధ్య పోటీ తత్వం పెరిగి, కేవలం ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు అని ఆశయాలు పెట్టుకుంటూ తల్లి తండ్రుల పేరు నిలపేస్తున్నారు, అవే లేకుంటే మన దేశంలో కూడా చాలా కథల పుస్తకాలు వచ్చి, జనాలు కథలు చదవడం అలవాటు పడి, ఎంతో మంది రచయితలుగా మారి ఈ ఉద్యోగాలకు పోటీలు తగ్గి విలువ ఉండేది కాదురా. నీమంచి కంటే నా చెడు గొప్పదిరా ఈ కాలం తల్లితండ్రుల దృష్టిలో....... ఇది చెప్పాలి కిరణ్ మీరు.
డెయ్య్.... అడివెయ్యమడియా, అది డైలాగ్ ఆ లేక ఇంగ్లీష్ లెసన్ సుమ్మరీనా.
నేను: భాలే చెప్పారు విజయ్ గారు ఆగకుండా. నాకు ఊపిరి ఆడదేమో అంత లెంగ్త్ చెప్పాలంటే?
నా కుడి భుజం మీద చెయ్యి పడింది.
హేశ్విత: పేపర్లో చూసుకుంటూ చెప్పడమే కిరణ్
అంతే చెప్పేసాను.
తిరిగి కేఫ్ దగ్గర నన్ను తొమ్మిది గంటలకు డ్రాప్ చేసింది.
ఆ యూట్యూబ్ సిరీస్ పుణ్యమా అని సిరీస్ అయిపోయేదాకా నేను హేశ్విత స్టూడియోకి కలిసే వెళ్ళాము, కలిసే వచ్చాము. అలా ఫిబ్రవరి దాటింది.
తను స్టూడియో విషయాలే ఎక్కువ మాట్లాడేది, మా కంపనీలో వర్క్ గురించి మాట్లాడుతూ ఉండేది. తను డ్రెస్ డిజైన్స్ చేసి చూపిస్తే spectruma ఓనర్, అదే సూర్యని తిట్టుకునేది. ఏంటో నేను సూర్య అన్నయ్యని అని చెప్పుకోకుండా నవ్వేవాడిని.
మార్చి రెండో తారీఖు, ఇక్బాల్ చెయ్యి పట్టుకొని ఇంటికి చేరుకున్నాక, అమ్మ నాకు ముద్దలు పెడుతూ ఎప్పుడు అడుగుతుందా అని నేను అనుకుంటున్న ప్రశ్న అడిగింది.
అమ్మ: ఎక్కడికెళ్తున్నావు రోజు?
సూర్య: అవును, సాయంత్రం ఆరుగంటలకు పోతున్నాడు, రాత్రి తొమ్మిదింటికి వస్తున్నాడు. ఇక్బాల్ ని అడిగితే చెప్పొద్దు అన్నావంటా ఏంట్రా?
నేను: ఏం లేదు. ఒక స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్న.
అమ్మ నవ్వింది.
అమ్మ: ఏంటి డబ్బింగ్ ఆ? నువ్వెందుకురా డబ్బింగ్ చెప్పడం. ఐతే ఈ విషయం మాతో చెప్పుకోడానికి నామూషి అనుకున్నావా?
సూర్య: కాదు కాదు అమ్మ, విషయం ఇంకోటి ఉంది.
అమ్మ: అవునా ?
సూర్య: అన్నగారిని ఎవరో అమ్మాయి కేఫ్ దగ్గరికి స్కూటీ మీద వచ్చి ఎక్కించుకొని పోతుంది.
అమ్మ: ఏంటి నిజమా?
సూర్య: హా మరీ... కొత్త స్నేహాలు వచ్చాయి నీ పెద్ద కొడుక్కి. మరి అది స్నేహమో లేక...
నేను: ఆపురా... ఏదో నా వాయిస్ బాగుంది, అదీ ఇదీ అంటే టైంపాస్కి పోతున్న. అయినా నీకెలా తెలుసురా?
సూర్య: బాబూ, నాకు ఒక కన్ను కంపనీ మీద, ఇంకో కన్ను నీమీద ఉంటది, అది మరచిపోకూ.
నేను: సర్లే.
సూర్య: అమ్మా... ఆ అమ్మాయి...
అమ్మ: హా అమ్మాయి...?
ఏంటి అమ్మేందుకు అంత ఉత్సాహపోతుంది. వీడు అలా ఎందుకు అంటున్నాడు.
సూర్య: కిషన్ మూర్తి కూతురు
అమ్మ: అవునా అయితే నీకు కోడలు వరుస అవుతుందిరా పెద్దోడా.
ఏంటి వీళ్ళు అసలు.
నేను: అయితే ఏంటే ఇప్పుడు?
అమ్మ: ఆ మూర్తీ మనం సంబంధం అడుగుతే కళ్ళు మూసుకొని అమ్మాయిని ఈ ఇంటికి పంపుతాడురా.
నేను: ఏంటమ్మా నువూ. ఏదో అవసరం అంటూ నన్ను పనికి తీసుకెళ్తుంది. అయినా స్నేహంగా ఉంటుంది అంతే. నా గుడ్డితనాన్ని ఎవరు మెచ్చుకుంటారు.
నా పెదవుల మీద అమ్మ వేళ్ళు రుద్దింది, అంటుకున్న అన్నం మెతుకులు తుడుస్తూ.
అమ్మ: నిన్ను నువ్వే ఎందుకు తక్కువ చేసుకుంటావు చింటూ?
నేను: నిజం అదే కదా.
-
తరువాత రోజు సాయంత్రం, స్టూడియోకి చేరుకున్నాక, నేను సరిగ్గా ఎక్క నిల్చున్నానో తెలీదు గానీ నన్ను ఒక్క ఎత్తు మీద కూర్చోబెట్టింది హేశ్విత. అది చెక్క స్టూల్ అనుకుంటాను, వెనక్కి ఒరగాడానికి ఏదీ లేదు.
హేశ్విత: కిరణ్ కొంచెం వెయిట్ చెయ్యవా.
నేను: దేనికి?
హేశ్విత: తెలుస్తుంది ఆగు.
అలా చెప్పి నా నుంచి దూరం వెళ్ళింది.
నేను అలా ఉన్నాను, నాకు ఆ స్టూడియో వ్యక్తుల ముచ్చట్లు వినిపిస్తూ ఉన్నాయి.
ఇన్నాళ్ళు ఇంట్లోనే ఉంటూ, లేదా తమ్ముడితో షికార్లు తిరుగుతూ, ఇంట్లో నాతో నలుగురు మాత్రమే నా స్నేహం అనుకొని కొత్త స్నేహాలు ఇక నాకు రావని ఉండగా, హేశ్విత కలిసింది. ఈ డబ్బింగ్ ఏంటో, ఈ స్టూడియో ఏంటో, ఇంట్లో బోర్ కొట్టకుండా బాగా ఆహ్లాదం అనిపిస్తుంది. నేను వీళ్ళని డబ్బులు అడగట్లేదు కూడా, ఐనా నాకెందుకు డబ్బులు. డబ్బింగ్ మాటలు చాలా సరదాగా అనిపించేవి. ఆ మాటలకు తప్పకుండా ఈ సిరీస్ బాగుంటుంది అనే అనిపించేది.
నా లోచనలో నేనుండగా, “ సతసత్సరి సధపద పదమప పదపదనీ...” అని మంచి నా కర్ణభేరిలో తేనె పోసినట్టు తియ్యని కోకిల గాణం మొదలైంది.
హేశ్విత: ఓ మనసా ఈ ఉరుకుల పరుగుల వయసులో నీకు పోటీనా. రెక్కలు కట్టుకు ఎగిరే కోరికలు ఆకాశం అంచులు తాగేనా.......
హేశ్విత పాట పాడుతుంది. నాలో నేను చిరునవ్వు చేసుకుంటూ, తన గాణం వింటూ కూర్చున్న.
ఐదు నిమిషాలు స్టూడియోలో ఏ చప్పుడూ వినిపించలేదు, తన గాణం, సంగీతం తప్ప.
ఆ సంగీత ఆగినాక, నేను నా రెండు చేతులూ కలుపుతూ చప్పట్లు కొట్టాను.
నేను: సూపర్ హేశ్విత.
నా చప్పట్లు ఆపుతూ నాకు శేఖండ్ ఇచ్చింది.
హేశ్విత: థాంక్స్ కిరణ్.
హేశ్విత: సుస్మితా నేను వెళ్తాను.
సుస్మితా: ఏంటి అప్పుడే?
హేశ్విత: హా వెళ్తానే ఇంట్లో పని ఉంది.
మేము బయటకి వచ్చాము. బండి ఎక్కాక, చాలా సమయం గడిస్తే ఆగల్సిన బండి, త్వరగానే ట్రాఫిక్ చప్పుళ్ళు నిండుకున్న చోట ఆగింది. నన్ను దిగమంది. నా చెయ్యి పెట్టుకుంది. వెంట తీసుకెళ్ళింది.
ఏదో తలుపు దాటుతున్నట్టు అనిపించింది, మొహానికి చల్లగా ac తగిలింది.
హేశ్విత: దో ఐస్ క్రీమ్స్ బట్టర్స్కాచ్.
నేను: ఎందుకు ఇక్కడ ఆగాము.
నా చేతిలో ఆమె మునివేళ్ళ సున్నితమైన స్పర్శ.
హేశ్విత: నిజంగా నచ్చిందా, లేక పాడింది నేనే అని తెలిసి చప్పట్లు కొట్టావా?
నేను: హహహ.... ఇలా అడుగుతావు అనుకోలేదు. ఆశ్చర్యం వేసింది నీ గొంతు విని. నీకు ఈ టాలెంట్ కూడా ఉందని చెప్పలేదు.
హేశ్విత: టాలెంట్ ఏమి లేదులే. ఏదో పాడటం అంటే ఇష్టం. విజయ్ అవకాశం ఇచ్చారు.
నేను: హ్మ్...
“ మేడం టూ బటర్స్కాచ్ ”
టేబుల్ మీద సిరామిక్ కప్పుల చప్పుడు వినిపించింది.
హేశ్విత: బాగుందా పాట.
నేను: హా బాగుంది బాగుంది. వింటూ కూర్చున్న.
హేశ్విత: హ...
టేబుల్ మీద చేతు దువ్వి కప్పు వెతుకుతుంటే, నా చేతి మధ్యకి వచ్చింది, తనే అందించింది. చేతి పైకి లేపి వేలి కోసలకు సన్నగా తగలగానే పట్టుకొని కొంచెం తీసుకుని తిన్న.
నేను: నువు సింగర్ కావచ్చు కదా మరి. నాకూ కొద్దిగా సంగీతం తెలుసు, ఇంట్లో ఖాళీగా కూర్చోడం ఎందుకులే అని అది కూడా విన్నాను.
హేశ్విత: అవునా... మంచిదే. నేను సింగర్ అంటే ఏమో ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు.
క్షణం ఆగింది, క్రీమ్ పెట్టుకుండేమో.
హేశ్విత: అయినా చెప్పినా కదా మా నాన్నకి నేను ఇవన్నీ చేయడం ఇష్టం ఉండదు. ఆయనకి ఒకటే ఆలోచన అంతే.
నేను: ఏంటో ఆ ఆలోచన?
హేశ్విత: spectruma చైర్మన్ కి ఇచ్చి నాకు పెళ్ళి చెయ్యాలి.
అంటే కిషన్ గారికి సూర్య మీద ఈ ఇష్టం ఉందా.
నేను: మరి నువ్వేం అంటావు?
హేశ్విత: ఏమంటాను. ఆ సూర్య అంటేనే నాకు నచ్చదు. నా ఒక్క డిజైన్ కూడా మెచ్చుకోడు. వాడి చూపు కూడా ప్లేబాయ్ లా ఉంటుంది. ఎంత మంది అమ్మాయిలని బుట్టలో వేస్కున్నాడో, ఎన్ని అకౌంట్లు పెట్టుకున్నాడో. ఈ మధ్య నేను వాడి క్యాబిన్ కి పోతే, నన్ను అదోలా చూస్తున్నాడు. సచ్చినోడు.
లేదే... మా వాడికి అమ్మాయిల పిచ్చి అని తెలుసు కానీ మరీ ఇబ్బంది పెట్టే రకం కాదేమో. తిను మరోలా అనుకుంటుంది వాడి గురించి. ఏదో ఒకటి లే.
నేను: హహ...అవునా... అలా ఉంటే నచ్చరా?
హేశ్విత: ఉహూ... నాకు నేనేం చెప్పేది వింటూ కూర్చునే వాడు కావాలి. సూర్య లాంటి వాళ్ళు మనం వాళ్ళు చెప్పిందే వినాలి అనుకునే రకం.
నేను: ఓహ్.... దొరుకుతాడా మరి అలాంటి వాడు?
హేశ్విత: ఉంటారులే. కనీసం నలభై నిమిషాలు నేను చెప్పేది వినేవాళ్ళు.
ఏంటి ఇప్పుడు నా గురించి చెప్తుందా. అంత లేదులే.
నేను: హేశ్విత నీ వాయిస్ అయితే బాగుంది. నువు మాట్లాడుతుంటే ఎవ్వరైనా అలా వింటూ కూర్చోవాల్సిందే.
ఏంటి ఇప్పుడు నేను ఇలా అంటున్నా ఏంటి. ఉష్....
నా ఎడమ భుజం కింద వేళ్ళు తాకి, నా తోలు మెలిపడి చిన్నగా నొప్పెట్టింది.
హేశ్విత: మరీ అంత పొగడకు కిరణ్
నేను: అబ సర్లే.
హేశ్విత: ఈవెనింగ్ స్టూడియోకి వస్తున్నావు కదా, డే టైం లో ఏం చేస్తావు?
నేను: ఏమీ లేదు. పాటలు వింటూ, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ, ఈ మధ్యే కీబోర్డ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న.
హేశ్విత: కీబోర్డ్ ఆ? మీకు టైపింగ్ వచ్చా? ఎలా?
నేను: మా తమ్ముడు నేర్పాడు.
హేశ్విత: అవునా, అలా ఎలా మీకు కనిపించదు కదా, లెటర్స్ ఎలా తెలుస్తాయి.
నేను: హ్మ్... మా తమ్ముడూ నేను చిన్నప్పుడు వీడియో గేమ్ ఆడేవాళ్ళం.
హేశ్విత: వీడియో గేమ్ మీరు?
నేను: నువు చెప్పేది వినాలి కానీ ఎదుటివారు చెప్తుంటే మధ్యలో మాట్లాడతవా?
హేశ్విత: సరే చెప్పండి
నేను: వీడియో గేమ్ రిమోట్ ఉంటుంది కదా, దానికి బట్టన్స్ నాతో నొక్కిస్తూ నాకు అలవాటు చేసాడు. వాడు స్క్రీన్ మీద కారు ఎడమకీ, కుడికీ పోతుంటే, అటు నొక్కూ ఇటు నొక్కూ అని చెపుతూ ఉంటే నేను ఆ బటన్స్ ప్రెస్ చేస్తాను అలా ఆడుతాము.
హేశ్విత: ఓ...
నేను: ఒకరోజు నన్ను కంప్యూటర్ ముందు కూర్చోపెట్టి కీబోర్డ్ నేర్పిస్తా అన్నాడు. నాకెలా అనుకున్నాను. అప్పుడేం చెప్పాడో తెలుసా?
హేశ్విత: చెప్పండి వింటున్న.
నేను: అబ్బో ఏంటి హేశ్విత అలా అంటే అలిగిందా?
హేశ్విత: అవును బుంగ మూతి పెట్టుకొని కూర్చుంది.
నేను: నువు ఏ మూతి పెట్టుకున్నా నాకు కనిపించదు.
హేశ్విత: అంతేలే. సర్లే, చెప్పండి ఏం చెప్పాడు?
నేను: అప్పడు రిమోట్ బటన్స్ కొన్నే, ఇప్పుడు కీబోర్డ్ బటన్స్ ఎక్కువ. ప్రాక్టీస్ చేస్తే ఇదీ అంతే అని, నా వేళ్ళని కీబోర్డ్ మీద పెట్టించి, అటు a s d f, ఇటు j k l , అని నేర్పాడు. అలా వెళ్ళని పైకి u I o p ఇటు q w e r అని నొక్కించాడు. రోజూ వాడికి తీరిక ఉన్నంతసేపు ఇదే నేర్పించి నేర్పించి ఆఖరికి నేను స్వతహాగా టైప్ చేస్తే తప్పులు దిద్దుతూ చెప్పాడు. అలా అలవాటు అయింది.
హేశ్విత: అంటే ఇప్పుడు మీకు ఏదైనా type చేయమని ఇస్తే చేసేస్తారా?
నేను: హా... చెప్పాలి. చెప్పింది వింటూ type చేస్తాను కానీ కేవలం పదాలు మాత్రమే, symbols రావు.
హేశ్విత: నిజంగా ?
నేను: అవును.
హేశ్విత: చెప్పాలంటే మంచి తమ్ముడే దొరికాడు మీకు.
నేను: హ్మ్...
హేశ్విత: సరే వెల్దాం ఇగ.
నేను: హా...
తరువాత నన్ను ఇక్బాల్ కి అప్పజెప్పి వెళ్ళింది.
The following 22 users Like ITACHI639's post:22 users Like ITACHI639's post
• aarya, AB-the Unicorn, Babu_07, DasuLucky, Donkrish011, gora, Iron man 0206, Manavaadu, Mohana69, murali1978, nomercy316sa, puku pichi, Rathnakar, Ravi_sri, Saikarthik, shiva9, SHREDDER, Sivakrishna, sri7869, sunilserene, Uday, Uppi9848
Posts: 203
Threads: 4
Likes Received: 1,876 in 166 posts
Likes Given: 292
Joined: Apr 2023
Reputation:
223
15-01-2025, 05:08 PM
(This post was last modified: 04-01-2026, 08:58 PM by ITACHI639. Edited 2 times in total. Edited 2 times in total.)
తరువాత మూడు రోజులు తను కాల్ చేయలేదు.
సోమవారం రోజు ప్రొద్దున్నే చేసింది.
హేశ్విత: హెలొ కిరణ్ గారు.
నేను: ఏంటి హేశ్విత... కాల్ చేయట్లేదు బాగా బిజీగా ఉన్నట్టున్నావు?
హేశ్విత: అవును.... ఆ సూర్య ఉన్నాడే నేను చూపించినవి ఫస్ట్ టైం మెచ్చుకున్నాడు. ఆ పని మీదే ఉన్నాను. అందుకే బిజీ.
నేను: ఓహో...
హేశ్విత: కిరణ్ గారు ఇవాళా ఫ్రీ గా ఉంటారా మీరు?
నేను: నాకు అసలు cost ఏ లేదు హేశ్విత.
హేశ్విత: హహ.... మరి పది గంటలకు కలుద్దామా?
నేను: హా ఒకే.
హేశ్విత: నేను ఒక లోకేషన్ పంపిస్తాను. అక్కడికి రండి.
అలా తను ఒక ఓవేషన్ షేర్ చేసింది. నేను ఇక్బాల్ అక్కడికి చేరుకున్నాము.
ఇక్బాల్: భయ్యా ఇది వికలాంగుల విద్యాకేంద్రం.
నేను: అవునా.
నాలాంటి వాళ్ళు చిన్నపిల్లలు, ఎలా ఉన్నారో చూడాలనే ఆత్రుత పెరిగింది నాకు. నేను బడికి పోయిన రోజులు తప్పితే, మళ్ళీ అలాంటి వాళ్ళని ఎవరినీ నేను కలిసింది లేదు.
కారు తలుపు తీసాడు, నేను దిగాను. అప్పుడే స్కూటీ అలికిడి వినిపించింది.
హేశ్విత: ఎంతసేపు అయింది వచ్చీ?
ఇక్బాల్: ఇప్పుడే..
నేను: హై హేశ్విత
హేశ్విత: కిరణ్ గాడు మీకు కార్ ఉందా?
నేను: నాది కాదండీ, ఇక్బాల్ ది ఈ కారు.
ఇక్బాల్ నవ్వాడు.
హేశ్విత: సరే నమ్మేస్తా ఈసారికి.
ఇక్బాల్ నన్ను పట్టుకొని లోనికి తీసుకెళ్ళాడు.
హేశ్విత: ఇది నా సీనియర్ స్రవంతి అక్క సొంతంగా నడుపుతుంది.
నేను: గ్రేట్.
“ గుడ్ ఆఫ్టర్నూన్ హేశ్విత అక్కా ”
హేశ్విత: గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలూ. స్రవంతి అక్కా, తను నా ఫ్రెండ్ కిరణ్.
స్రవంతి: నమస్తే బాబు.
నేను: నమస్తే అండీ.
హేశ్విత: అక్కా నేను చెప్పాను కదా, తనే తనకీ మన రవీ, కార్తీక్ లాగా చూపు లేదు.
నా మొహం ఎటు ఉందో నాకే తెలీదు. చిరునవ్వు చేసాను.
నా ఎడమ చేతికి చల్లని చిన్న వేళ్ళు తాకాయి.
“ మీకుడా ఏమీ కనిపించదా? ” అని చిన్న పాప అడిగింది.
నేను: అవును
“ మా తమ్ముడు కార్తీక్ కి కూడా అంతే. ఆపరేషన్ చేసినా చూపు రాదు అన్నారు. ”
నేను: మరి మీ తమ్ముడు అలా ఉన్నాడు అని నీకు బాధగా ఉందా?
ఉండదా మరి. నేను ఇలా ఉన్నాను మా కుటుంబానికి బాధ లేదా?
పూజ: ఉ అవును, వాడు నాలాగా చెస్ ఆడుకోలేడు కదా.
నేను: మరి క్యారం బోర్డు ఆడుకో.
పూజ: ఎలా వాడికి కనిపించదు కదా అంకుల్.
నేను: నీకోటి తెలుసా, నేను మా తమ్ముడు క్యారం బోర్డు, వీడియో గేమ్స్ కూడా ఆడుకుంటాము.
నా కుడి చేతికి ఇంకో చేతు తగిలింది.
“ నాకు మా అక్కతో ఆడుకోవాలని ఉంది? ”
నేను: పూజ నువు మీ తమ్ముడికి నేర్పించాలి. కనపడకపోతే ఏంటి, క్యారం బోర్డు మొత్తం వేలితో గీసినట్టు చూపించాలి, కోయిన్స్ పట్టుకొని చేత్తో వెతకాలి, అలా రోజూ చేస్తే కార్తీక్ నీకే తెలుస్తుంది క్యారం బోర్డు ఎలా ఉంటుందో. మా తమ్ముడు నాకు అలాగే నేర్పించాడు.
కార్తీక్: అవునా... ఐతే నేను నేర్చుకుంటాను.
నేను: మీ అమ్మానాన్న కూడా నేర్పిస్తారు.
అంతా నిశ్శబ్దంగా అయ్యింది. తిరుగు మాట రాలేదు.
హేశ్విత: వీళ్ళందరూ అనాథలు కిరణ్ గారు.
అనాథలకు, అదీ వికలాంగులకు చదువు చెప్పడం, ఆడించడం ఎంత గొప్పతనం.
నేను: హేశ్విత నన్ను స్రవంతి గారి దగ్గరకు తీస్కెళ్ళు.
మూడు అడుగులు ఎడమకి వేసాను.
నేను: స్రవంతి గారు. ఎంత గొప్పలండీ మీరు. ఇక్కడ ఎంత మంది పిల్లలు ఉన్నారు?
స్రవంతి: ఇరవై మూడు. కొందరికి ఫిజికల్ డిసబులిటీ, కొందరికి వినికిడి, ఇద్దరికీ చూపు, నలుగురుకి మాట.
నేను: మరి మీకు వీళ్ళని చూస్కోడానికి ఆర్థికంగా?
హేశ్విత: అక్క ఇంతకీ ముందు ఒక ప్రభుత్వ పాఠశాలలో చెప్పేది. వాళ్ళ హస్బెండ్ కి ఇంకో ఉద్యోగం వచ్చింది, ఇద్దరూ కలిసి వాళ్ళ సంపాదనతో ఇలా. ఎవరైనా ధాతలకోసం చూస్తున్నారు.
నేను: మీ భర్త గారికి కూడా చెప్పండి. ఈ మంచి ఆలోచన అందరికీ రాదు.
స్రవంతి: తప్పకుండా.
హేశ్విత: కిరణ్ గారు, మీరు ముందుంటే, మనం కలసి ఎవరైనా ఫైనాన్సియల్ డోనర్ తో మాట్లాడొచ్చు.
నాకనిపించింది ఎవరో ఎందుకు అని.
నేను: ఇక్బాల్ చెక్ బుక్ ఇవ్వు.
ఇక్బాల్: హా కారులో ఉంది తెస్తాను.
హేశ్విత: మీరు కాదు కిరణ్. మనం పెద్ద కంపనీ వాళ్ళని అడగొచ్చు.
నేను: అంటే ఇప్పుడు నేను ఇవ్వకూడదా?
హేశ్విత: లేదు అలా అనట్లేదు.
“ అంకుల్ మాకు మీ పేరు కిరణ్ ఆ? ” అని ఇంకో పిల్లాడు అడిగాడు.
నేను: అవును.
“ నా పేరు వినయ్. నా పక్కన కూర్చుంటాడు. కిరణ్. వాడికి చెవి వినిపించదు. నాకేమో ఒక చేతు పని చేయదు. వాడికి సైగతో చెప్పలేను. కానీ వాడికి మెషీన్ పెడితే ఒక చెవు వినిపిస్తుంది అని స్రవంతి మేడం చెప్పింది. ” అన్నాడు.
స్రవంతి: అవును కిరణ్.
ఇక్బాల్: భయ్యా ఇగో.
నా కుడి చేతికి పెన్ను అందించాడు.
నేను: హేశ్విత ఎంత అవసరం అంటావు?
హేశ్విత: ఒక నలభై ఐతే...
నేను: ఇక్బాల్ రాసివ్వు.
ఇక్బాల్ నా చెయ్యి పట్టుకొని పక్కన ఏదో గట్టి పల్లం మీద నా చేతిని పెట్టించాడు.
ఇక్బాల్: భయ్య ఇక్కడ సంతకం పెట్టు.
పెట్టేసాను.
ఇక్బాల్: తీస్కో స్రవంతి అక్క.
హేశ్విత: ఇక్బాల్ ఇక్కడ నలభై లక్షలు రాసావు?
నేను: నువ్వే కదా హేశ్విత నలభై అనావు?
హేశ్విత: ఏంటి కిరణ్ గారు. సహాయం అడిగింది, ఉన్నదంతా ఇవ్వమనలేదు. నలబై వేలు అంటున్న.
ఇక్బాల్: హేశ్విత జి, మీరేం ఆలోచించకండి. పర్లేదు.
తరువాత మేము ఇక పిల్లలకి బై చెప్పి బయటకి వచ్చాము.
హేశ్విత: కిరణ్ మీరేం చెయ్యను అన్నారు. అంత amount ఎలా ఉంది మీ బ్యాంకు అకౌంట్ లో?
ఇక్బాల్: spectruma industries chairman account లో నలభై కోట్లు ఉంటాయి మేడం.
హేశ్విత: spectruma owner సూర్యకిరణ్.
ఇక్బాల్: సూర్యకిరణ్ కాదు మేడం, సూర్య ఒకరు, కిరణ్ ఒకరు. అతను సూర్య. ఇక్కడ ఉన్నది కిరణ్.
హేశ్విత: ఒహ్ థాంక్స్ ఫర్ ది క్లారిటీ. బై.
నేను: అప్పుడే వెళ్తున్నావా?
స్కూటీ స్టార్ట్ చేసినట్టు వినిపించింది.
ఇక్బాల్: మళ్ళీ అలక. వెళ్ళిపోతుంది భయ్యా.
నేను: హేశ్వితా... డబ్బింగ్ ఉంటే చెప్పు స్టూడియోకి వెళ్దాము.
స్కూటీ శబ్దం మాయం అయ్యింది.
ఇక్బాల్: వినే ఉంటుందిలే.
సాయంత్రం కూడా కాల్ చేయలేదు. నేను ఇక్బాల్ తో కాల్ చేసినా, మేసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేదు.
ఇన్నాళ్లు మేము తను పని చేసే కంపెనీ నాదే అని చెప్పకుండా ఏదో మాములుగా ఒక స్నేహితుడిగా ఉండాలి అనుకున్న. ఆ విషయం దాచడం తనకి ఇష్టం కాలేదా. ముందే చెప్పుండలసింది. నేను కావాలనే ఇన్నిరోజులు తనతో ఇలా చెప్పకుండా ఉన్నాను అనుకుండేమో. నేను కేవలం తనతో చెప్పలేదు అంతే.
తెలిసో తెలీక ఇది ఒక పొరపాటే. ఎంతైనా ఏదో నాకు అవసరం ఉన్నట్టు స్టూడియోలో డబింగ్ చెప్పాను. తను కనీసం నాకు ఒక కారు ఉంది అని కూడా అనుకోలేదు, రోజూ నేను నడుచుకుంటూ కేఫ్ కి పోయాను కదా.
ఏంటో తెలీదు తను నా మీద అలక పెట్టుకుంటే ఒకరకంగా చాలా నచ్చేస్తున్నా, ఇంకొరకంగా తనకి ముందే చెప్పుండాల్సింది అనిపించింది.
రాత్రి నిద్ర పట్టలేదు. ఇక్బాల్ తో మళ్ళీ రెండు సార్లు ఫోన్ చెపించినా, “ రేపు మాట్లాడతాను మీతో ” అని రిప్లై పెట్టింది.
హేశ్వితని మా ఇంటికి రమ్మని ఆహ్వాణించలా? హేశ్వితని రోజూ కేఫ్ దగ్గర కలవడం కాకుండా నా పక్కనే ఉంటే? లేదు ఎందరో వద్దనుకున్న నన్ను తానెందుకు మెచ్చుతుంది. నాకు తను మంచి స్నేహితురాలు మాత్రమే, తనూ నన్ను ఒక స్నేహితుడిగా చూస్తుంది. నాకు తొడుంటూ, నన్ను పట్టుకొని సిటీలో తిరుగుతూ, అదృష్టం అనుకోవాలి, సరిగ్గా ఇల్లే దాటని నేను ఇన్నిరోజులు హేశ్వితతో సాయంత్రం సరదాగా తిరగేసాను.
నాకు కనిపించని నా మనసు, నా తపన, ఏదో తెలీదు. నాలో ఒక ప్రశ్న పుట్టించింది. “ హేశ్వితని ఒకసారి పెళ్ళి అని అడిగితే?”.
నాకు తన తోడు ఎప్పటికీ కావాలి అని నేను అడగగలనా? ఏ మొహం పెట్టుకొని అడగాలి, ఒక చూపులేని వ్యక్తిని చేస్కొని తను ఏం సుఖపడుతుంది? తమ చిరునవ్వుని చూడలేను, తన సిగ్గుని చూడలేను, తనకి ఏ డ్రెస్సు, చీర బాగుంటుంది అని ఏదైనా చెప్పగలనా? కనీసం తనని పొగడానికి నా ఏ ఊహగనం ఉంది?
ఆలోచనలతో నాకు నిద్రపట్టలేదు.
-
ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలీదు. నా చేతిని ఎవరో కొట్టారు.
అమ్మ: లేరా చింటూ... ఎవరో అమ్మాయి హేశ్వ్.. ఏదో చెప్పింది, కొత్తగా ఉంది పేరు. నీ దోస్త్ అంట వచ్చింది. లేగు లేసి స్నానం చేసి బయటకు రా. తనకి ఆగమని చెప్పిన.
హేశ్విత అని చెప్పగానే టక్కున నిద్ర ఎగిరిపోయింది.
నేను: ఏంటి హేశ్విత వచ్చిందా?
అమ్మ: అవును. నువ్వూ తనూ సూర్య ముగ్గురూ కలిసే ఆఫిస్ కి పోతున్నారు. తాయారవ్వు. అన్ని బెడ్ మీద పెట్టి పోతాను.
నేను: సరే.
నేను లేచి బ్రష్ చేసి, షవర్ కింద స్నానం చేసి టవల్ కట్టుకోకుండా నెత్తి తుడుచుకుంటూ బాత్రూం బయటకి వచ్చాను.
“ ఆఆ... అయ్యో చి.... సిగ్గులేని జన్మ ” అని అరుపు.
నేను: హేశ్విత...
చూసేసిందా...?
టక్కున టవల్ కట్టేసుకున్న.
హేశ్విత: అలా వస్తారా ఎవరైనా?
నేను: నువ్వేం చేస్తున్నావు నా గదిలో.
హేశ్విత: కట్టుకున్నవా టవల్.
నేను: హా...
హేశ్విత: స్నానం చేస్తున్నావు అంటే ఇక్కడే వెయిట్ చేద్దాం అని వచ్చాను. చి కిరణ్ నువు డైరెక్ట్ అలా వచ్చేస్తావా?
నేను: నువుంటావు అని నాకు తెలుసా. చప్పుడు లేకుండా కూర్చుంటావా అలా?
హేశ్విత: సారి.
నేను: మొత్తం చూసావా?
హేశ్విత: అడగకు బాబు... సిగ్గులేదు నీకు.
నేను: పో బయటకి వస్తాను.
హేశ్విత: హా పోతాను. నిన్ను చూస్కుంట ఉంటానా ఏంటి?
ఆఫిస్ కి పోయాము. అక్కడ నేను కిషన్ మూర్తి గారితో మాట్లాడాక ఇవాళ సిరిసిల్లాలో ఏదో చేనేత సంగం వాళ్ళతో మీటింగ్ ఉంది అని చెప్పారు. దానికి నేను ఆయనా వెళ్ళలేమో ఆన్నారు. ఆయన బయటకి వెళ్ళొస్తా అని చెప్పి పోయారు. తరువాత మళ్ళీ తలుపు చప్పుడు అయ్యింది. ఎవరివో అడుగులు వినిపించాయి.
సూర్య: అన్నయ్య కిషన్ గారు నేను ఫ్యాక్టరీకి పోతున్నాము. నువ్వు హేశ్విత సిరిసిల్ల యూనియన్ ని కలిసి రావాలి. అన్నీ హేశ్విత, ఇక్బాల్ చూస్కుంటారు.
నేను: మరి నేనేందుకూ?
సూర్య: నీ మొహం. నీ మొహం ఉండాలి అక్కడ. నువు పోతే వాళ్లకు ఒక నమ్మకం.
నేను: మంచిగా చెప్పొచ్చు కదా.
సూర్య: కొంచెం పెద్దమనిషిలా మాట్లాడు అక్కడ.
నేను: నువ్వే చెప్పాలి నాకు.
ఇక్బాల్: నేను చూసుకుంటా సూర్య భయ్యా... ఫీకర్ మత్..
పావుగంటలో సిరిసిల్ల బయల్దేరి, అక్కడ చేరి హేశ్విత మాట్లాడి, వాళ్ళకి ప్రింటెడ్ పేపర్స్ ఇచ్చి, నేను వాళ్ళతో భరోసాగా మాట్లాడి, వచ్చే నెల తమ్ముడు ఒకసారి వచ్చి అన్నీ చెప్తాడు అని చెప్పి తిరుగు దారి పట్టాము.
ఆఫీసు నుంచి వచ్చిన దగ్గర్నుంచి హేశ్విత ఇక్బాల్ తోనే మాట్లాడింది గాని నాతో ఒక్క ముక్క మాట్లాడలేదు. అది తలచుకోని నాకస్సలు మనసు ఒక చోట నిలువట్లేదు.
కారు బయట హైవే మీద వాహనాల శబ్దం వినిపిస్తుంది, లోపల చప్పుడే లేదు. ఆ నిశ్శబ్దాన్ని చేల్చుతూ ఇక్బాల్ నోరు విప్పాడు.
ఇక్బాల్: హేశ్విత మేడం, మీకోటి తెలుసా?
హేశ్విత: ఏంటి?
ఇక్బాల్: ముజ్కో ఏక ఇచ్ఛా హై జి?
హేశ్విత: క్యా హే వో?
ఇక్బాల్: హమేషా ఐసా రెహ్నేకా.
హేశ్విత: అంటే...?
ఏంటి వీడు అనేది.
హేశ్విత: చెప్పు ఏంటి?
ఇక్బాల్: ఏదైనా మాట్లాడుకొండి మేడం. అలా ఉండకండి చూడలేకపోతున్నాను.
హేశ్విత: ఎప్పుడూ నేనే అన్నీ చెప్పేసుకున్న. సార్ మాత్రం ఏవి చెప్పకుండా వింటూ కూర్చుచుంటారు.
నాకేం మాట్లాడాలో అర్థం కాలేదని మౌనంగా కూర్చున్న.
హేశ్విత: ముందే చెప్పాల్సింది కదా కిరణ్. మీముందే మీ తమ్ముడి గురించి అలా అనేసాను.
నేను: నువు అలా అంటుంటే నాకు నవ్వొచ్చింది. కోపం రాలేదు.
హేశ్విత: నేను ఇలా అంటున్నానని సూర్యకి చెప్పారా?
నేను: లేదు. దాని గురించి మర్చిపో.
హేశ్విత: స్టూడియోకి వస్తారా?
నేను: లేదు మనం సిటికీ పోయేసరికి ఆలస్యం అవుతుంది.
నా ఎడమ చేతిలో తన చేతి స్పర్శ. నాలుగు వెళ్ళు నలిగిపోయాయి.
హేశ్విత: ప్లీస్ కిరణ్. నేను మిమ్మల్ని ధింపేస్తాను ఇంటి దగ్గర.
ఇక్బాల్: కార్ ఉంది కదా జి
హేశ్విత: నాకు నీ కార్ నచ్చలేదు. స్కూటీ మీదే పోతాము.
ఇక్బాల్: జాగ్రత్త మరి మా భయ్యా అసలే....
హేశ్విత: హా తెలుసులే గుడ్డోడు. పక్కన ఒక మనిషి ఉండాలి. కర్ర పట్టుకోడు సోకెక్కువ.
నేను: ఏంటి అలక పోలేదా? ప్రొద్దున్న జరిగినదానికి కోపమా?
హేశ్విత: ఏం లేదు.
నేను: ఇక్బాల్ ఒకటి తెల్సా హేశ్విత మంచి సింగర్.
ఇక్బాల్: గానా... అరె మేడం నిజమా?
హేశ్విత: అంత లేదు ఏదో.
నేను: లేదు మొన్న మంచిగ పాడింది.
హేశ్విత: ఊర్కొండి.
ఇక్బాల్: ఒకసారి పాడండి.
హేశ్విత: నో నాకు రాదు.
నేను: సరే... పోనీ.
తరువాత ముగ్గురం మౌనంగా ఉన్నాము.
తోవలో ఉన్నట్టుండి చాలా ట్రాఫిక్ వినిపించింది. సిద్ధిపేట దాటేసాము అనుకుంటా.
మళ్ళీ మల్లెటూర్ల నుంచి పోతుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్బాల్ పాటలు పెడతాను అంటే హేశ్విత వద్దంది.
నా చేతికి కోమలంగా వేళ్ళు తగిలాయి. అవి నా వేళ్ళని పెనవేసుకొని, నా ఎడమ భుజానికి మెత్తగా ఆమె భుజం రాసుకుంది.
నా మొహం మీద కురులు తగిలాయి, వాటి పరిమలానికి నాకు గులాబి గుబాళింపు చుట్టేసుకుంది.
భుజం మీద తల వాలింది.
హేశ్విత: ఇక్బాల్ యెహి హై నా తుమ్హారా ఇచ్చా...?
నాకర్థం కాలేదు.
ఇక్బాల్: హా భాభీ...
నేను: భాభి ఆ?
హేశ్విత: నిన్న ఇంట్లో నాన్నకు నాకు గొడవ?
నేను: కాదు ముందు భాభి ఏంటో చెప్పు?
హేశ్విత: చెప్పేది విను లేకుంటే కారు దిగిపోతాను.
నేను: సరే సరే చెప్పు.
హేశ్విత: నాన్న సూర్యని పెళ్ళిచేసుకుంటవా అని అడిగాడు. నేను చేస్కొను అని చెప్పేసాను.
నేను: హ్మ్.
నా పెదవుల్లో చిరునవ్వు ఆగట్లేదు.
హేశ్విత: ప్రొద్దున్న మీ ఇంటికి వచ్చాను నికోటి చెప్పాలి అని, కానీ నువు అలా కనిపించేసరికి నీకు చెప్పలేదు.
నేను: ఏంటి?
నా చెంప మీద గులాబి రెమ్మల వంటి స్పర్శ, వెచ్చగా తగిలింది.
హేశ్విత: కిరణ్ ఎప్పుడైనా నువు ఆడవాళ్ళ లిప్స్ ఎలా ఉంటాయో చూసావా?
నేను: నాకు కనిపించదు.
హేశ్విత: చూస్తావా?
నేను: చూడలేను.
కారు ఆగింది.
ఇక్బాల్: మేనే ఆంక్ బంద్ కియా..
నేను: ఎందుకురా?
నా బుగ్గల మీద వేడి చేతురేఖలూ, నా తొడల మీద మెత్తని దూది వైనట్టు అయ్యంది. బరువుగా.
హేశ్విత: మా నాన్నకి చెప్పేసా, spectruma ఇండస్ట్రీస్ చైర్మన్ ని పెళ్ళి చేసుకుంటాను అని. ఆయనేమో సూర్యని అనుకున్నాడు. నేను చెప్పిన సూర్యని చేసుకుంటే నేను కోడలిగా ఉంటాను నాన్న, అదే కిరణ్ మీ చేసుకుంటే, కిరణ్ గుడ్డోడు, ఏమీ తెలీదు, నేనే ఒక చైర్మన్ అయిపోతాను అని.
నేను: హేశ్విత ఇంకోసారి నన్ను గుడ్డోడు అంటే...
హేశ్విత: హ అంటాను ఏం చేస్తావురా గుడ్డోడా.
తన మాటలు నా పెదాల మీద ద్వానిస్తుంటే, మత్తుగా మెడ పైకి పొడిచాను.
నా పెదాలకు తియ్యని, వేడి, రోజా పూరెమ్మలు గుచ్చుకున్నాయి. అవి నా కింది పెదవిని నలిపేస్తూ కొరికేసాయి.
హేశ్విత: నేను నీకు చూపుగా ఉంటాను.
నా కంట చెమ్మ పేరుకుంటూ, నా చెంపలు తడి అనిపించాయి.
చేతులు లేపి హేశ్వితని గట్టిగా వాటేసుకున్నాను.
దుఃఖం వచ్చేసింది.
నేను: ఇక్బాల్ భాభి మిల్గయా... అమ్మీ కో బతావో...
ఇక్బాల్: హహ... అమ్మీకో ఆజ్ సుభే హీ మాలూమ్ థి భయ్యా...
హేశ్విత: తనే నన్ను నీ గదిలోకి పంపింది. ఇల్లంతా చూస్కోమని.
నేను: అన్నీ చూసావా మరి?
హేశ్విత: హా నువ్వే ఏమీ చూడలేవు.
నేను: చూడలేను కానీ ముట్టుకోగలను కదా.
హేశ్విత: చి ఇక్బాల్ ఉన్నాడు నోరు మూస్కో.
ఇక్బాల్: హహహ.... నాకేం వినిపించట్లేదు, నాకేం వినిపించాట్లేదు.
మా కారు పక్కన నుంచి ఒక ఆటో పోయిన శబ్దం.
ఇక్బాల్: ఆటోకి పీచే కొటేషన్ అచ్చా హే. ప్రేమ గుడ్డిది. ఎవరు ఎవరిని ఎందుకు ప్రేమిస్తారో వాళ్ళకే తెలియాలి.
The End
|————————-—+++++++++++++++++++
The following 44 users Like ITACHI639's post:44 users Like ITACHI639's post
• aarya, AB-the Unicorn, ABC24, Babu_07, Bhanu1, BR0304, Chandra228, DasuLucky, Donkrish011, ghoshvk, Ghost Stories, gora, Iron man 0206, K.rahul, kish79, Koolguy2024, Mahesh12, Manavaadu, Manoj1, Mohana69, murali1978, nareN 2, Nautyking, nomercy316sa, pandumsk, prash426, puku pichi, ramd420, Rathnakar, Ravi_sri, Saikarthik, shekhadu, shiva9, SHREDDER, Sindhu Ram Singh, Sivakrishna, sri7869, Stsrv, sunilserene, TheCaptain1983, Uday, Uppi9848, Yar789, yekalavyass
Posts: 203
Threads: 4
Likes Received: 1,876 in 166 posts
Likes Given: 292
Joined: Apr 2023
Reputation:
223
15-01-2025, 05:11 PM
(This post was last modified: 15-01-2025, 05:34 PM by ITACHI639. Edited 1 time in total. Edited 1 time in total.)
Posts: 2,055
Threads: 4
Likes Received: 3,181 in 1,449 posts
Likes Given: 4,301
Joined: Nov 2018
Reputation:
70
కథను కొద్దిగా పొడిగించి వుంటే బావుడేదనిపించింది. మంచి కథ, ఆహ్లాదకరంగా ముగించారు. చుట్టు వున్నవాళ్ళందరూ మంచోల్లైతే ఎలా వుంటుందో అలా. నాకు కిరణ్ కన్నా సూర్య పాత్ర నచ్చింది అలాగే హశ్విత పేరు కూడా.
: :ఉదయ్
Posts: 547
Threads: 1
Likes Received: 226 in 200 posts
Likes Given: 683
Joined: May 2019
Reputation:
1
Posts: 3,070
Threads: 0
Likes Received: 2,171 in 1,686 posts
Likes Given: 9,087
Joined: Jun 2019
Reputation:
22
Nice feel good story chala baga rasaru
Posts: 3,310
Threads: 159
Likes Received: 10,445 in 2,069 posts
Likes Given: 6,705
Joined: Nov 2018
Reputation:
734
ఓ మాంచి కథను చక్కటి సందేశంతో ఇచ్చారు.
వికలాంగుల ప్రోత్సాహంతో పాటు ఎలా చూడాలో, ప్రవర్తించాలో వివరించారు.
ఆఖరిలో వారి పెళ్ళి, మరో మాంచి సూచన.
భేష్ Sweatlikker గారూ అభినందనలు :shy:
Posts: 872
Threads: 2
Likes Received: 821 in 574 posts
Likes Given: 831
Joined: Dec 2020
Reputation:
17
chala adbhutam ga undi katha….
Posts: 203
Threads: 4
Likes Received: 1,876 in 166 posts
Likes Given: 292
Joined: Apr 2023
Reputation:
223
(15-01-2025, 06:17 PM)Uday Wrote: కథను కొద్దిగా పొడిగించి వుంటే బావుడేదనిపించింది. మంచి కథ, ఆహ్లాదకరంగా ముగించారు. చుట్టు వున్నవాళ్ళందరూ మంచోల్లైతే ఎలా వుంటుందో అలా. నాకు కిరణ్ కన్నా సూర్య పాత్ర నచ్చింది అలాగే హశ్విత పేరు కూడా.
(15-01-2025, 09:08 PM)Hotyyhard Wrote: awesome narration bro
(15-01-2025, 10:09 PM)Saikarthik Wrote: Nice feel good story chala baga rasaru
(15-01-2025, 10:37 PM)k3vv3 Wrote: ఓ మాంచి కథను చక్కటి సందేశంతో ఇచ్చారు.
వికలాంగుల ప్రోత్సాహంతో పాటు ఎలా చూడాలో, ప్రవర్తించాలో వివరించారు.
ఆఖరిలో వారి పెళ్ళి, మరో మాంచి సూచన.
భేష్ Sweatlikker గారూ అభినందనలు :shy:
(15-01-2025, 11:40 PM)prash426 Wrote: chala adbhutam ga undi katha….
Thank you so much
Posts: 1,047
Threads: 0
Likes Received: 620 in 430 posts
Likes Given: 8,368
Joined: Dec 2018
Reputation:
5
Thank you for the heart touching story and Heshwitha
Writers are nothing but creators. Always respect them.
•
Posts: 76
Threads: 0
Likes Received: 33 in 27 posts
Likes Given: 232
Joined: Jul 2019
Reputation:
1
•
Posts: 5,496
Threads: 0
Likes Received: 4,615 in 3,434 posts
Likes Given: 17,161
Joined: Apr 2022
Reputation:
76
•
Posts: 2,185
Threads: 0
Likes Received: 1,654 in 1,283 posts
Likes Given: 2,844
Joined: Dec 2021
Reputation:
29
Superb keka fabulous thanks for story
Kane story podiginche unte bagundedhe anipinchindhe
Anyway thank you sooooooooooo muchhhhhh
•
Posts: 173
Threads: 0
Likes Received: 139 in 108 posts
Likes Given: 275
Joined: Jul 2024
Reputation:
2
Chala baaga rasaru.. Inka undi vunte baaguntundhi ani anipinchindhi...
•
Posts: 1,193
Threads: 0
Likes Received: 919 in 727 posts
Likes Given: 726
Joined: Sep 2021
Reputation:
9
Super andi.. chala baga rasaru excellent.. story , narration baga rasaru.. good andi
•
Posts: 242
Threads: 0
Likes Received: 190 in 129 posts
Likes Given: 1,030
Joined: Mar 2022
Reputation:
5
•
Posts: 115
Threads: 0
Likes Received: 133 in 92 posts
Likes Given: 278
Joined: Sep 2022
Reputation:
2
Super update
Story inkoncham unte bagundedi. But nice ?
clp);
yr):
•
Posts: 791
Threads: 0
Likes Received: 734 in 558 posts
Likes Given: 384
Joined: Jul 2021
Reputation:
15
What a story small but heart touching ❤️❤️❤️❤️
Posts: 499
Threads: 0
Likes Received: 266 in 200 posts
Likes Given: 32
Joined: Sep 2024
Reputation:
0
|