Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 13
మితృలు రేటింగ్ మాత్రం ఇవ్వడం లేదు, కొన్ని లైకులు మాత్రమే వస్తున్నాయి, నిరుత్సాహం కలుగుతుంది త్వరగా అప్డేట్ ఇవ్వడానికి
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Good update
[+] 1 user Likes sri7869's post
Like Reply
శంభల రాజ్యం – 10
సింహళ రాజ్య చరిత్ర
 
తురగ ప్రాకారంలో అనిలుడిపై నిరంతరాయంగా స్వారీ చేస్తోన్న విక్రమసింహుడు  అక్కడున్న అంకిత, సంజయ్ కళ్ళకు ఒక అద్భుతంలా కనిపిస్తున్నాడు. విక్రమసింహుడిలోని ఆలోచన మేల్కొందో అర్థం కావట్లేదు వారిరువురికీ. రుద్రసముద్భవ అది గమనించాడు.
 
"విక్రమసింహుడు అంతలా దేని గురించి ఆలోచిస్తున్నాడా అనుకుంటున్నారా?" అని అడిగాడు.
 
"అవును స్వామి. తనలో అంతర్మథనం జరుగుతోంది. కన్నీటి చుక్కలు రాలుతూ పక్కకు పడిపోతున్నాయి. మొదట్లో స్వేదం అనుకుని పొరబడ్డాను", అంది అంకిత.
 
అంకితలోని నిశితమైన పరిశీలనకు ఆశ్చర్యపోయాడు రుద్రసముద్భవ.
 
"ఒక యోధుడి స్వేదం ఏదో, కన్నీరేదో నీకు తెలిసిపోయిందంటే తురగ ప్రాకార చరిత్రలోని  కీలకమైన ఘట్టాలు చెప్పే సమయం ఆసన్నమైనట్టే. సంజయ్, నీ మౌనానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా?" అడిగాడు రుద్రసముద్భవ.
 
"విక్రమసింహుడి స్వారీ చూస్తూ, తనలోనే వాళ్ళ నాన్న సింహదత్తుడిని చూసుకుంటూ మీరు చెబుతున్న ఒక్కో గాథ వింటూ ఉంటే నా కళ్ళ ముందే అవన్నీ కదలాడుతూ ఉన్నాయి. ఏం చెప్పమంటారు నన్ను?
 
నా మౌనం నిర్లిప్తత కాదు. ధ్యానం....వీళ్ళ వీరత్వంలో ధ్యానం
నా మౌనం నిస్తేజం కాదు. గానం.....వీళ్ళ శౌర్యంతో గానం
నా మౌనం నిశ్శబ్దం కాదు. పానం.....వీళ్ళ సంకీర్తనా పానం"
అని ఇంకేం మాట్లాడలేకపోయాడు.
 
సంజయ్ మాటలలోని రుచి రుద్రసముద్భవ మనసును తాకితే, శక్తి గుండెను తాకింది.
 
సింహదత్తుడి గురించి తాను ఏమేం అనుకునేవాడో సరిగ్గా అవే ఈనాడు సంజయ్ నోటి వెంట వినబడ్డాయి. అందుకు అమితానందం పొందాడు.
"జజీరా విక్రమసింహుడికి ప్రాకారంలో పెట్టిన విషమ పరీక్ష గురించి మీకు చెప్పబోయే ముందు సింహదత్తుడి గురించి మీరు తెలుసుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన పూర్తిగా అవగతం కానిదే విక్రమసింహుడు మీకు అర్థం అవ్వడు", అంటూ రుద్రసముద్భవ సింహదత్తుడి జీవితంలోని ప్రముఖమైన ఘట్టాలు చెప్పటం మొదలు పెట్టాడిలా.
 
అది సింహళ రాజ్యం. శంభల రాజ్యంలోని  వరుణ ప్రాకారం ఎక్కడైతే ఉందో కొన్ని కోటానుకోట్ల సంవత్సరాల క్రిందట సరిగ్గా అక్కడే సింహళ రాజ్యం ఉండేదని శంభల శాస్త్రవేత్తలు అంచనా వేశారు. శంభల రాజ్య చరిత్ర గురించి తెలిసిన శాస్త్రజ్ఞులు వీళ్ళు. సింహళ రాజ్యం అప్పట్లో భూమిపైనే ఉండేది. భౌతికమైన దృష్టికి కనిపిస్తూ ఉండేది. అప్పుడెన్నో రాజ్యాలుండేవి. ఎన్ని రాజ్యాలున్నా సింహళ రాజ్యానిదే పై చేయి. ఎందుకంటే సింహళ రాజ్యం సింహదత్తుడిది. సింహదత్తుడి వంశస్థులు అధికారం కోసం ఎన్నడూ రాజ్యపాలన చేసి ఎరుగరు. వారి రాజ్యంలోని ప్రజలు వారి మంత్రులకంటే తెలివైనవారు. సింహళలోని సివంగికి కూడా నాద తరంగాలు అందేవని ఒక ప్రతీతి. అలాంటి సింహళ రాజ్యంలో ఒకానొక రోజు ఎడతెరపి లేకుండా వర్షం భోరున కురవటం మొదలయింది. సింహళ రాజ్యాన్ని పరిపాలించే సింహదత్తుడు తన పూర్వీకుల అన్వేషణలో ఎక్కడికో వెళ్లాడని మంత్రులు, సైన్యాధిపతులు మాట్లాడుకోవటం మొదలు పెట్టి అప్పటికి ముప్పై మూడు జాములు గడిచినవి. రాను రానూ వర్షం ఎక్కువయ్యిందే గాని తగ్గే సూచనలు మాత్రం ఎక్కడా లేవు.
 
అలాంటి సమయంలో సింహళలోని ఒక కవి పరుగు పరుగున ఆస్థానానికి వచ్చాడు. మంత్రులు, రాజ్యాధిపతులు తీవ్ర చర్చలలో తలమునకలై ఉండగా ఒక భటుడు అక్కడికొచ్చాడు.
"ప్రభూ, కవి సార్వభౌముడు మీతో ఏదో విన్నవించుకోవాలని తడుస్తూ ఇంత దూరం వచ్చాడు. అతను ఏం చెబుతాడో మరి", అంటూ భటుడు కవిని ప్రవేశపెట్టి అక్కడి నుండి నిష్క్రమించాడు.
 
"చెప్పండి మహాశయా ! ప్రజలెవ్వరినీ వారి వారి ఇళ్ల నుండి బయటకు రావద్దని వారి క్షేమం కోరి మేము జారీ చేసిన ఆజ్ఞను సైతం విస్మరించి శ్రమపడి ఇంత దూరం వచ్చారు. చెప్పండి", అన్నారు అక్కడి మంత్రివర్యులు.
 
"ఇప్పుడు మన రాజ్యంలో కురుస్తున్నది జడివాన కాదు. సింహదత్తుడి కన్నీరు", అన్నాడు కవి.
 
ఆస్థానంలోని ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆందోళన వెనువెంటనే భయం ఒకదాని తరువాత ఒకటి ప్రస్ఫుటముగా వెల్లడి అయ్యాయి.
 
"ఏమిటి మీరనేది? అదెలా సాధ్యం? ఆయనకు అంతగా బాధ కలిగించిన విషయం ఏది?
 
తెలిసో తెలియకో మనం ఏదైనా పాపం చేశామా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు మంత్రి.
 
"సింహ దత్తుడు తన పూర్వీకుల చరిత్ర తెలుసుకుంటూ వస్తున్నాడు. వారిలో కొందరు చేసిన పాపాలు సింహాళ రాజ్య చరిత్రలో లేకుండా కనుమరుగు అయినవి అని తెలుసుకున్నాడు. బాధలోనే చాలా రోజులు గడిపాడు.
 
ఇప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆయన మనసంతా మన రాజ్యం పైనే ఉంది. ప్రజల క్షేమం పైనే ఉంది. ఆయన పూర్వీకుల పాపాలు ఎక్కడ మన రాజ్యాన్ని కబళిస్తాయోనని ఆయన పడుతున్న వేదనకు సాక్ష్యం వర్షం. ఇది ఇప్పట్లో ఆగదు. ఎడతెరపి లేకుండా కనీసం రెండేళ్లయినా పడుతుంది."
 
ఒక్కసారిగా అంతటా నిశ్శబ్దం ఆవహించింది. సింహళ చరిత్రలో సింహళ రాజులు పాపాలు చెయ్యటమా ! ఇది అసలు నమ్మేలా లేదు. కొన్ని నిజాలు ఎవరు చెప్పినా నమ్మలేం. అలాంటి నిజంలా అనిపించిందిది.
 
అందరూ తీవ్ర మనోవేదనకు గురి అవ్వటం కవి శ్రేష్ఠుడు గమనించాడు.
 
"సింహళ పూర్వ రాజులు  కాలబంధనాలలో   చిక్కుకుని ఉండటం సింహ దత్తుడు కళ్లారా చూసాడు. వారి శక్తినంతా ధారబోసి   కాలబంధనాలను   వారే నిర్మించుకుని వారి పాపాలు మనల్ని తాకకుండా కఠోర దీక్షలో ఉన్నారు. అందుకే మన రాజ్యం ఇన్నాళ్ళూ సుభిక్షంగా ఉంది. సత్యం తెలుసుకున్న సింహ దత్తుడు మౌనంలోకి వెళ్ళిపోయాడు. అంతా సింహళ ప్రజల తెలివి, సింహళ ప్రభ అనుకునేవాడు. నిజం ఆయనను చాలా కుదిపేసింది. తన ఉనికి మీదే నమ్మకం కోల్పోయాడు. ఎవరో చేస్తున్న యుద్ధానికి గెలుపు తనది అనుకోవటం మూర్ఖత్వం అనిపించింది. అజ్ఞానం వీడింది. తన పూర్వీకుల పాపాలు త్యాగాల ముందు వెలవెలబోయాయి. అలాంటి వారిని  సింహదత్తుడు కళ్లారా వీక్షిస్తూ ఆయన నోట మాట రాక ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. మన క్షేమం గురించి అనుక్షణం తపన పడే ఆయన కన్నీటి జల్లు  ఇలా మన సింహళలో కురుస్తోంది", అని చెప్పటం ముగించాడు కవి.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
కవి శ్రేష్ఠుడు సామాన్యమైనవాడు కాదు. అతనికి సింహళ చరిత్ర మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. ఎన్నో కావ్యాల రచన చేసినవాడు. అలాంటి అతని మాట సింహళకు వేదప్రమాణం. ఆయన వర్షం పడుతున్నా సరే తడుస్తూ ఎందుకొచ్చాడో వివరించాడిలా.
 
"నేను సమయంలో మీతో నిజాన్ని పంచుకోకపోతే అటు పిమ్మట మీకు ఇదే విషయాన్ని ఇలాగే చెప్పినా మీరు నమ్మే పరిస్థితిలో ఉండరు", అన్నాడు.
 
"అదేంటి స్వామి ?" అని ఆశ్చర్యపోతూ అడిగాడు మంత్రి.
 
"కాలం చేసే మాయ అది. కాలంలో కనుమరుగు ఐపోయినవాళ్లు ఎందరో. మనమెంత? మన ఉనికెంత? అందుకే ముహూర్తం చూసుకుని బయలుదేరాను. మార్గంలో ఎన్నో ఆటంకాలొచ్చాయి. ఎన్నో విషనాగులు కనిపించాయి. నాకు హానీ తలపెట్టలేదు. కానీ భయపెట్టాయి. అప్పుడు మొదటిసారి అర్థం అయింది. భయం లేకుండా బ్రతికే నాకు కూడా భయం కలుగుతోంది అంటే రాజ్యంలో మునుముందు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నట్టు రూఢి అయ్యింది క్షణాన", అన్నాడా కవి.
 
మంత్రి కళ్ళల్లోని సంశయాన్ని గుర్తించి ఇలా వివరించాడు కవి
"ఒక రాజ్యంలో యోధుడు, కవి మాత్రమే భయం లేకుండా బ్రతుకుతారు. అలాంటి వారికి భయం కలుగుతోంది అంటే రాజ్యానికి అపాయమే కదా", అన్నాడు.
 
కవి శ్రేష్ఠుడికి పాదాభివందనం చేసుకుని మంత్రి ఆయనతో,
"సింహ దత్తుడు తిరిగొచ్చే లోపు మన కార్యాచరణను మీరే నిర్దేశించండి కవివర్యా!" అంటూ ప్రాధేయపడ్డాడు.
 
" వర్షంలో మన రాజ్య ప్రజలందరూ అంటే మనం అందరం బయటికొచ్చి మోకాళ్లపై నిలబడి తడవాల్సిందే. ఇదొక్కటే మార్గం. ఇది తప్ప మరో ఉపాయం కనిపించటం లేదు. సింహ దత్తుడి ఆనందం మన ఆనందం అయినప్పుడు ఆయన బాధ మన బాధ కాదా ?" అంటూ ఎదురు ప్రశ్న వెయ్యటంతో కవి చెప్పదలుచుకున్న విషయం సూటిగా దూసుకెళ్ళిపోయింది యోధుడి బాణంలా.
 
వృత్తాంతాన్ని మధ్యలో ఆపి
 
"అలా రెండేళ్లు ఒక రాజ్య ప్రజలందరూ మోకాళ్ళపై నిలబడి రాజు కన్నీటిలో తడిసిన నేల ఒకప్పటి సింహళ రాజ్యం....ఇప్పటి మన శంభలలోని వరుణ ప్రాకారం", అంటూ మాటరాని మౌనంలోకి వెళ్ళిపోయాడు రుద్రసముద్భవ.
 
విక్రమసింహుడి కన్నీటి బొట్టు సూటిగా ఒక బాణంలా అంకిత చెంపను తాకింది. తన వైపుగా దూసుకొస్తున్న కన్నీటి బిందువులో సింహళలోని ఒకానొక సన్నివేశం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఒక్క నిమిషం గగ్గుర్పాటుకు గురయింది అంకిత. సంజయ్ వైపు తిరిగి చూస్తే అక్కడ సంజయ్ లేడు.
 
మోకాళ్లపై నిలబడి ఆకాశం వైపు చూస్తూ, "ఇంత గొప్ప చరిత్ర ఉన్న శంభల రాజ్యంలోకి అడుగుపెట్టే అర్హతను నాకిచ్చిన నా పూర్వీకులు ఎంత గొప్పవారో. వారికి నేను చెయ్యగలిగింది ఏమైనా ఉందా !" అంటూ బాధపడ్డాడు.
 
"ఆదిత్యోపాసన చేసే నీకు పితృదేవతల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి సంజయ్", అన్నాడు రుద్రసముద్భవ.

సంజయ్ ఆశ్చర్యపోతూ రుద్రసముద్భవకు ప్రణామం చేసాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
Super update bro kasta pedda update ivu bro  horseride fight clps Heart  Heart Heart Heart
[+] 1 user Likes Ajayk's post
Like Reply
(22-12-2024, 10:03 AM)k3vv3 Wrote: సంజయ్ ఆశ్చర్యపోతూ రుద్రసముద్భవకు ప్రణామం చేసాడు.

K3vv3 garu!!! Very good update(s).

yourock yourock clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
(17-12-2024, 09:48 PM)k3vv3 Wrote: మితృలు రేటింగ్ మాత్రం ఇవ్వడం లేదు, కొన్ని లైకులు మాత్రమే వస్తున్నాయి, నిరుత్సాహం కలుగుతుంది త్వరగా అప్డేట్ ఇవ్వడానికి

మీ కథను లైక్ చేస్తే చాలనుకున్నాను బ్రో, రేటింగ్ కూడా కావాలన్నారుగా...మెచ్చుకున్నవాళ్ళం ఆ మాత్రం ఇచ్చుకోలేమా...ఇచ్చానండి.

కథలో 'ఒక రాజ్యంలో ఇద్దరే భయం లేకుండా వుండేవాళ్ళు, ఒకరు యోధుడు ఇంకోకరు కవి ' చక్కగా చెప్పారు..ఒకరు తనను తాను కాపాడుకోగలడు, ఇంకొరిదగ్గర భౌతికంగా పోగొట్టుకునేందుకు ఏముండదు....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
ఈ ధారావాహికం ఇంకా నాలుగు భాగాలున్నాయి.

10/11 జనవరికి  ఆఖరి భాగంతో స్వస్తి  చేద్దామని అనుకుంటున్నాను.

చదివి ఆదరించిన, రేటింగులు, లైకులు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదములు.  Namaskar
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
శంభల రాజ్యం – 11
సింహళ పూర్వీకుల చరిత్ర
 
"సింహళ రాజ్య ప్రజలలో ఆందోళన మొదలయ్యింది. సింహ దత్తుడి పూర్వీకులు చేసిన పాపాల గురించి చర్చ మొదలైంది. రాజ్యంలో విషయాన్నైనా గోప్యంగా ఉంచటం వీలుపడదు. ఎవరో ఒకరి వల్ల అది చేరవలసిన చోటికే చేరుతుంది. ఇలాగే సాగితే పరిస్థితి అదుపు తప్పిపోతుందేమోనని తీవ్రమైన ఆలోచనలలో నిమగ్నమై ఉన్నాడు మంత్రి."
 
అంతలో అక్కడికి కవిశ్రేష్ఠుడు చేరుకున్నాడు.
 
"మంత్రివర్యా ఏమిటి ఆలోచిస్తున్నారు?" అని అడిగాడు.
 
"మీరు మాకు చెప్పిన విషయాన్ని యథాతథముగా ప్రజలకు ఎలా సవివరముగా చెప్పాలో అంతుచిక్కటం లేదు", అన్నాడు.
 
"ప్రజల మనసుల గురించి ఆందోళన వద్దు. మనం నిమిత్తమాత్రులం. మన కర్తవ్యం కేవలం సత్యాన్ని చెప్పుట మాత్రమే. వారిని సంస్కరించుట కానే కాదు. అయినా సింహళ రాజుల గురించి వీరికి చెప్పినా నమ్మే స్థితిలో ఉండరు", అంటూ విచిత్రముగా నవ్వాడు కవి.
 
"అదేమిటి అలా అనేసారు?" అని ఆశ్చర్యపోతూ అడిగాడు మంత్రి.
 
"సూర్యుడి చుట్టూ తిరిగే భూమిని మాత్రమే చూసిన కళ్ళకు
మేరువు చుట్టూ తిరిగే సూర్యుడి గురించి చెబితే అర్థం అవుతుందా !" అన్నాడు కవి.
 
"అనగా ?" అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు మంత్రి.
 
"సూర్యుణ్ణి చూసేవాళ్ళం మనం. సింహళ రాజులు మేరువును చూసారు. ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సూర్యుణ్ణి సైతం దర్శించారు. అలాంటి వారు చేసే మంచి పనులే సరిగ్గా అర్థం కావు. ఇక వారి పాపాల గురించి మనం చెబుతూ పోతే రాజ్య ప్రజలను ఇంకా ఇంకా అయోమయస్థితిలోకి నెట్టిన వాళ్ళం అవుతాము", అన్నాడు కవి.
 
"మీకు తెలిసిన చరిత్రను నాతో పంచుకోగలరా?" అని సంశయిస్తూ అడిగాడు మంత్రి.
 
"అది చెప్పటానికే ఇక్కడికి వచ్చాను. సింహళ రాజులు జ్ఞాన సంపన్నులు. వారికున్న తెలివితేటలకు దేవతలు సైతం విస్తుపోయే రోజులవి. వీరి పూర్వీకుల రాజ్య పరిపాలనలో మానవులు సైతం దేవతలలా బ్రతికిన రోజులున్నాయి. సంగీత, సాహిత్య, నాట్య కళా కోవిదులు సింహళ రాజులు, సింహళ ప్రజలు. అమితమైన భక్తి తత్పరత కలవారు. భగవంతుని తత్వాన్ని ఆరాధించే వారు. వీరికున్న సునిశిత దృష్టికి దేవతలు, త్రిమూర్తులు హర్షించేవారు. వీరి కళ్ళకు సాక్షాత్కరించేవారు. అలాంటి సింహళలో కొన్ని క్రూర జంతువులు ఉద్భవించాయి. క్రూర జంతువుల నుండి ప్రజలను కాపాడటానికి సింహళ రాజులు యజ్ఞం చెయ్యటం ఆరంభించారు. యజ్ఞం ఆరంభించిన పదిహేను ఘడియలకు క్రూర జంతువు ఎక్కడున్నా సరే అగ్ని హోత్రం దగ్గరకు చేరుకునేది. జంతువు క్రూరత్వం తగ్గిపోయి చిన్న పరిమాణంలోకి మారిపోయి హవిస్సులో పడిపోయేది. దృశ్యాన్ని చూస్తున్నప్పుడు జంతువు చేసే అరుపులు, ఆర్తనాదాలు అక్కడ మార్మోగిపోయేవి. జంతువుల చివరి శ్వాసలు గాలిలోనే కలిసిపోయేవి. జంతువుల బలి ఎంతో అశాంతిని మిగిలించింది. వారికి తెలిసిన యజ్ఞ మంత్రాన్ని ఎన్నడూ ఉపయోగించని సింహళ రాజులు క్రూర జంతువుల నుండి ప్రజల్ని కాపాడటానికి మొట్టమొదటిసారి యజ్ఞాన్ని నిర్వహించి మంత్రం వాడి వాటిని లయం కావించారు.
 
ఇది దేవుని దృష్టిలో ఖచ్చితంగా మారణహోమమే. కానీ సింహళ రాజులకు ప్రజల పైనున్న పిచ్చి ప్రేమ వల్ల వారి జ్ఞానం మసకబడింది. ఆగ్రహించిన దేవుడు అదే రోజు రాత్రి వారికి కనిపించాడు.
 
'మీ కళ్ళకు మేరువు కనిపిస్తుంది కానీ నేను చేసిన మాయ కనిపించదా?' అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడిగాడు ప్రాంచద్రుద్రుడు.
 
మేరువులోని దేవతలలో ప్రముఖుడు ప్రాంచద్రుద్రుడు. ఆయన కోపం ప్రళయాగ్నిలా దహిస్తోంది.
 
అంతటా అయోమయం నెలకొని ఉంది.
 
'అవి క్రూర జంతువులు కావు. కలియుగంలో మిమ్మల్ని వెంటాడే అరిషడ్వర్గాలు. మీ సింహళలోని ప్రజలు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఉంటే సింహళను ఇందిరా పరిధికి చేర్చేవాడిని. జనన మరణాలకు దూరంగా దేవదేవునికి దగ్గరగా బ్రతికే అదృష్టం మన్వంతరంలో సింహళకు దక్కి ఉండేది. కానీ ప్రజలపై మీకున్న అతి ప్రేమతో మీరే మారణకాండకు పూనుకున్నారు. నేను చేసిన మాయారచన కాస్తా నిజం అయ్యింది. ఇందుకు నన్ను కూడా బాధ్యుణ్ణి చేశారు. మీకు పెట్టిన పరీక్ష నా పాలిట శాపం అయ్యింది. దేవతలను సైతం అబ్బురపరిచే మీ తెలివి ఏమైనట్టు? మంత్రాన్ని  ఇలా మారణహోమం చేయటానికా వినియోగించేది?' అంటూ ఆగ్రహజ్వాలలు కురిపించాడు ప్రాంచద్రుద్రుడు.
 
'మమ్మల్ని క్షమించండి స్వామి ! మీరు పెట్టిన పరీక్షలో విఫలమవ్వటమే కాక ఇందులో ఎలాంటి పాత్ర లేని సింహళ ప్రజలను, మిమ్మల్ని బాధ్యుల్ని చేసాము. ఇందుకు మాకు ఎలాంటి శిక్ష విధించినా ఆనందంగా స్వీకరిస్తాము కానీ సింహళను ఇందిరా పరిధికి చేర్చండి', అని ప్రాధేయపడ్డారు.
 
'అయితే మీకు కాలబంధనాలే గతి', అన్నాడు ప్రాంచద్రుద్రుడు.
 
'సింహళలో సింహ దత్తుడు పాలించే కాలం దాకా ఎన్నో జన్మలు తీసుకుంటూ ఎన్నో రూపాలు ధరిస్తూ పంచభూతాలను తృప్తి పరుస్తూ కాలబంధనాల్లో చిక్కుకుని సింహళను, సింహళ ప్రజలను విముక్తి చెయ్యాలి. అందుకు సిద్ధమైతేనే మీరు కర్మ నుండి ముక్తి పొందుతారు. లేదా కలి ప్రవేశించిన సింహళను చూస్తారు. కరువును చూస్తారు. కన్నీళ్లు చూస్తారు. మరణాలు చూస్తారు. వినాశనం, విలయం రెండింటినీ  మేరువును చూసిన కళ్ళతోటే మీరు చూస్తారు', అంటూ ఉగ్రుడైపోయాడు ప్రాంచద్రుద్రుడు.
 
సింహళ రాజులకున్న దూరదృష్టి చేత అలాంటి సింహళ ఎలా ఉంటుందో వెంటనే అర్థం అయిపోయింది.
 
ప్రాంచద్రుద్రుడు సింహళ రాజులకు కాలబంధనాలు విధించాడు.
 
ఒక్కొక్కరికి ఒక్కో బంధనం. వాటిల్లో సంగీత బంధనాలు కూడా ఉన్నాయి. అనగా నిరంతరం ఒకే రకమైన సంగీతం వినిపిస్తూ ఉంటుంది. హవిస్సులో బలి అయిపోయిన క్రూర జంతువుల ఆర్తనాదాలు లెక్కచెయ్యనందుకు శిక్ష.
సంగీత బంధనాలలో ఎలాంటి రాగాలు పలుకుతాయో ప్రాంచద్రుద్రుడికి మాత్రమే తెలిసున్న విషయం.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
ఎంతటి వారైనా సరే కాలానికి కట్టుబడక తప్పదు అనటానికి సింహళ రాజుల చరిత్రే తార్కాణం. ఏమంటే సింహళ రాజుల గొప్పతనమంతా వారికి ప్రజలపైనున్న ప్రేమలోనే ఉంది. సింహళను ఇందిరా పరిధికి చేర్చే వరకూ కష్టతరమైన శిక్షలన్నీ అనుభవిస్తూ వచ్చారు. వారికి ప్రజల క్షేమం తప్ప వేరే ధ్యాస లేదు. సింహళ తప్ప మరొకటి పట్టదు.
 
నిజం తెలుసుకున్న సింహ దత్తుడు తన పూర్వీకుల త్యాగాలన్నీ చూస్తూ వచ్చాడు. ఆయన కన్నీరే మనకు వర్షం అయ్యింది. సింహళ రాజులు నాడూ కంట తడి పెట్టలేదు. ఆనందంగా వారి భోగాలన్నీ  త్యజించారు. సింహ దత్తుడు రాజు అయ్యే సమయానికి వారి చరిత్ర తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సింహ దత్తుడి పాలనలోనే సింహళ ఇందిరా పరిధికి చేరుతుందని ప్రాంచద్రుద్రుడు మాటిచ్చాడు. సింహ దత్తుడికి వారి పూర్వీకుల గురించిన నిజం తెలియకుండానే ఇందిరా పరిధికి చేరుకొని రాజుగా భోగభాగ్యాలన్నీ అనుభవిస్తాడని పూర్వీకులు భావించారు. కానీ సింహ దత్తుడి అన్వేషణలో నిజాలన్నీ తనంతట తానుగానే తెలుసుకున్నాడు. మొదటగా మేరువుకు చేరుకున్నాడు. అటు పిమ్మట ప్రాంచద్రుద్రుడిని కలిసి చరిత్రను తెలుసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మేరువు పైనే మన సింహ దత్తుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు', అని చెప్పటం ముగించాడు కవి శ్రేష్ఠుడు.
 
చరిత్రను ఆసాంతం విన్న మంత్రి అదే రోజు రాత్రి తన సైన్యాన్ని నియమించి సింహళ రాజ్యంలోని ఇంటింటికీ వెళ్లి కవి శ్రేష్ఠుడు చెప్పిన విషయాన్ని పొల్లుపోకుండా వివరించమని ఆజ్ఞాపించాడు..
 
సింహళ రాజ్య ప్రజలకు ఇదంతా వివరంగా తెలియటానికి రెండు రోజుల సమయం పట్టింది. రెండు రోజులలో ప్రజలకు ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు. అయినా సరే ఏదో తెలియని నమ్మకం. ఇదంతా కట్టుకథలా వాళ్లకు అనిపించటం లేదు. సింహళ రాజులు ఇంతకు పదింతలు త్యాగాలు చేసుంటారు అనిపిస్తోంది. మంత్రి ఆలోచన ఫలించింది. కవి శ్రేష్ఠుడు చెప్పదలుచుకున్న సత్యం భద్రంగా వారి హృదయ స్థానాలకు చేరింది.  
 
ప్రజలందరూ ఇళ్ల నుండి బయటికొచ్చారు. ధారగా కురుస్తోన్న వర్షాన్ని చూస్తూ మోకాళ్లపై నిలబడి
 
"సింహదత్త మహారాజా తిరిగిరా
మేరువును చూసిన ధీరులారా మీకు నమస్సులు" అంటూ ఆకాశం వైపు చూస్తూ జయ జయ ధ్వానాలు చేస్తూ,
నేలపై తల పెట్టి ప్రార్థిస్తూ రెండేళ్లు వర్షంలోనే తడిసారు.
 
పుణ్యాన్ని అందరూ పంచుకుంటారు....కానీ పాపాన్ని సైతం పంచుకునే ప్రజల్ని చూస్తూ దేవతలు పూలవర్షం కురిపించారు.
 
వర్షం ఆగిపోయింది. సింహళ మాయమైపోయింది. చేరవలసిన చోటికే చేరింది.
సింహళ ఇప్పుడు ఇందిరా పరిధిపైనున్నది.
 
 
ఇందిరా పరిధి పై ఉండవలసిన సింహ దత్తుడు మన శంభలకు మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చాడని ఆలోచిస్తున్నారా, అని అడిగాడు రుద్రసముద్భవ.
 
"కర్మ శేషమా స్వామి ?", అన్నాడు సంజయ్.
 
"అవును సంజయ్. చెయ్యాల్సిన కర్మ నుండి ఎంతటివారైనా సరే తప్పించుకోలేరు ", అంటూ నిట్టూర్పుతో అన్నాడు రుద్రసముద్భవ.
 
“అలాంటి సింహ దత్తుడి రాకతో శంభలకు విక్రమసింహుడు దొరికాడు.
 
విక్రమసింహుడి వల్ల శంభలకే ఒక అందం వచ్చింది. అంతా పైవాడి రచన కాకపోతే మరేమిటి?" అంటూ నవ్వాడు రుద్రసముద్భవ.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
నిజమే కదా, అంతా ఆ పైవాడి లీల. ఇందిర పరిధి అంటే ఇంద్ర లోకానికి సమానంగానా? బావుంది బ్రో.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
[Image: 116828613.webp]
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
శంభల రాజ్యం – 12
యతిరాజు ప్రాంచద్రుద్రుడి ఆగమనం - వరుణ ప్రాకారం వైపుకు అభిజిత్  అడుగులు
 
సింహళ ఇందిరాపరిధికి వెళ్ళిపోయాక భూమ్మీద శాంతి భద్రతలకు లోటు ఏర్పడింది. సింహళ రాజుల త్యాగాలు సింహళను, సింహళ ప్రజలను సురక్షితంగా ఇందిరాపరిధికి చేర్చాయి. సింహళ రాజుల మారణహోమంలో బలి ఐన క్రూర జంతువుల అవశేషాలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. అవి భూమిపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. క్రూర జంతువుల అవశేషాలను రాబందులు, నక్కలు, వేటకుక్కలు తినటం మొదలు పెట్టాయి. ఒక చీకటి రాత్రి పూట అలా తిన్న రాబందొకటి ఇబ్బంది పడుతూ ఒక చెట్టు మీద వాలింది. అదే సమయంలో అటు వైపుగా వెళుతున్న వలకాడు రాబందును చూసి ఆగిపోయాడు. దూరంగా ఎక్కడినుంచో వస్తున్న వెలుగులో రాబందు కళ్ళు మెరిసాయి. కానీ వేటగాడైన వలకాడికి అది చకోర పక్షిలా కనిపించింది. అంతక్రితమే అతనికి చకోర పక్షిని వేటాడి భుజిద్దామనే దుర్బుద్ధి కలిగింది. చకోర పక్షి గురించి తన గురువు గొప్పగా పొగుడుతుంటే విన్నాడు. స్వతహాగా కాముకుడు అవ్వటం చేత గురువు చెబుతున్న మాటల్లోని భావం బోధపడక పెడబుద్ధి పుట్టింది. వెన్నెలను తాగి బతికే గొప్ప జీవి చకోర పక్షి. అలాంటి చకోర పక్షిని చంపాలనే ఆలోచనే వికృతి. అందుకే ఆలోచనకు తగ్గట్టే ఇప్పుడు రాబందే చకోర పక్షిలా అతనికి కనిపించి మాయకు గురి చేసింది. వెంటనే రాబందును అక్కడికక్కడే నేలకొరిగేలా చేసి దగ్గర్లో మంట కనపడితే ఒక గుడారం వైపుగా పరుగులు తీసాడు. వేటగాడి మనసులో ఇంకా అది చకోర పక్షి అన్న భ్రమే ఉంది. గుడారం బయట నలుగురున్నారు. వారు రాత్రి వేటకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆకలి మీదున్నారు.
వేటగాడు వాళ్ళని చూస్తూ ఇలా అన్నాడు,
 
"చకోర పక్షిని తెచ్చాను", కళ్ళు మెరిసిపోతూ అన్నాడు.
నలుగురిలో ఒకడికి ముచ్చెమటలు పట్టాయి.
 
"ఏం మాట్లాడుతున్నావ్? చకోర పక్షిని పూజిస్తాం మేము. అలాంటిది దాన్ని తుదముట్టించావా. నియతి లేని నాయాల" అంటూ కళ్ళెర్రజేశాడు.
 
వాళ్ళల్లో ఒకడు అతన్ని పక్కకు తీసుకెళ్లాడు.
 
"సరిగ్గా చూడు. అది రాబందు. చకోర పక్షి కాదు. వీడెవడో మిడిమిడి జ్ఞానిలా ఉన్నాడు.
 
ఇదే మంచి అవకాశం. తిందాం పద" అంటూ ఉండగా
"ఏమయిందిరా నీకు రాబందును తింటానంటున్నావ్?" అంటూ అడిగాడు.
 
"రాబందుకు నాకు వైరం. జాతి అంటేనే పడదు. మా తాత శవాన్ని పీక్కు తిని చంపిందది. వదిలిపెట్టమంటావా? మనం వేటాడలేదు. అదే మన దాకా వచ్చింది. ఎట్టా వదలమంటావు?"
 
"వైరం వద్దురా బాబు. మంచిది కాదు. నా మాట విను", అని ప్రాధేయపడ్డాడు.
 
అంతలో మరో ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా రాబందును తినటానికే  మొగ్గు చూపారు.
 
అలా రోజు రాత్రి వాళ్ళు ఆబగా రాబందు మాంసం భుజించారు. ఇలాగే క్రూర జంతువుల అవశేషాలు తిన్న నక్కలు, వేటకుక్కలు కూడా మనుషుల వేటకు బలి అయిపోయి వారిచే భుజించబడ్డాయి. ఇలా కొన్ని నెలల పాటు సాగింది. ఇవి తిన్న వారందరు కర్కశంగా తయారయ్యారు. క్రూర జంతువు అవశేషం వారిలో విధంగా చేరిందో తెలీదు గాని ఇప్పుడు భూమ్మీద ఇలాంటి వాళ్ళే క్రూర జంతువులలా మారిపోయారు. వీరు బహు కాముకులుగా పరివర్తనం చెందారు. సత్వరజస్తమో గుణాలున్న మనుష జన్మను సార్థకం చేసుకోకుండా నిరర్థకం చేసుకునే దిశగా ఇలా వీరు భూమ్మీదున్న తక్కిన వారిని భయాందోళనలకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. వీరి వల్ల ఆడవారికి భద్రత లేకుండా పోయింది. చిన్నపిల్లలకు రక్షణ లేదు. యువకులకు దిక్కుతోచడం లేదు.
 
అలాంటి సమయంలో ఒక నాటి రాత్రి ఆకాశంలో పూర్ణ చంద్రుడు ఉండగా తెల్లటి వృషభంపై ఆసీనుడై యతిలా ఖడ్గధారియై ప్రాంచద్రుద్రుడు భూమ్మీదకు వచ్చాడు.
 
 “ ఏవం వేదా 
యోపామాయతనం వేదా 
ఆయతనవాన్ భవతి
 
అంటూ తన ప్రభతో ఒక్కసారిగా మంత్రపుష్పం అందుకుంటూ ముందుకుసాగాడా యతీశ్వరుడైన ప్రాంచద్రుద్రుడు. ప్రాంచద్రుద్రుడి నడకే ఎంతో మంది శిష్యగణాల్ని జతచేస్తూ పోయింది. మంత్రపుష్పంలోని అదే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు ఎగసిపడే అగ్నిశిఖలా వెడుతున్నాడా యతిరాజు.
 
ఆయన కళ్ళల్లోని జ్వాలలు పఠించే మంత్రాల ద్వారా బయటికి పెల్లుబుకుతూ జ్వాలాతోరణంలా ఆయన చుట్టూ ఏర్పడి భూమిపైనున్న కాలుష్యాన్నంతా తగలబెట్టుకుంటూ పోతోందా ఏమిటి అన్నంత గంభీరంగా ఉంది దృశ్యం.
 
క్రూర జంతువుల అవశేషాలు భూమిపైనున్న 108 స్థానాలను కలుషితం చేశాయి. 108 పరిసరాలలోని అసురీ శక్తినంతా తెచ్చి 108 చిత్గుహలలో బంధించాడు ప్రాంచద్రుద్రుడు.
 
సరిగ్గా తురగ ప్రాకారం ఎక్కడైతే ఉందో అంతక ముందు 108 చిత్గుహలు ఉండేవని అంతక్రితం చెప్పాను కదా", అంటూ గుర్తుచేసాడు రుద్రసముద్భవ.
 
సంజయ్, అంకితలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
 
"మరిప్పుడు 108 చిత్గుహలు ఏమైపోయాయ్ స్వామి?" సంశయిస్తూ అడిగారు ఇద్దరూ.
 
" జజీరా తన స్వార్థంతో 108 చిత్గుహలను ధ్వంసం చేసాడు. విక్రమసింహుడొక్కడే జజీరాను, అసురీ సైన్యాన్ని ఎదుర్కొని శంభల రాజ్యాన్ని ఎలా కాపాడారో ముందు ముందు మీరే తెలుసుకుంటారు", అన్నాడు రుద్రసముద్భవ.
 
అనిలుడిపై స్వారీ చేస్తోన్న విక్రమసింహుడికి ఏదో జ్ఞప్తికి వచ్చి హఠాత్తుగా ఆగిపోయాడు.
 
తురగ ప్రాకారంలో జజీరాతో తను చేసిన సంగ్రామం గుర్తొచ్చింది. తన తల్లి విజయకుమారిని కోల్పోయాడు. తనెంతగానో ప్రేమించిన మిథిలాను కోల్పోయాడు. విక్రమసింహుడిలా ఉన్న అభిజిత్ అడుగులు ఆవేశంగా  వరుణ ప్రాకారం వైపుగా పడ్డాయి. సింహదత్తుడి త్యాగంతో పావనమైన వరుణ ప్రాకారాన్ని చూడనిదే తన స్వస్వరూపం పూర్తిగా అర్థం అవ్వదు అనిపించింది అభిజిత్ కి.
 
విక్రమసింహుడి హృదయం ఆనాడు సింహదత్తుడిలానే చెమర్చింది. కానీ విక్రమసింహుడికి నాడు సింహదత్తుడి పూర్తి చరిత్ర తెలియదు. ఎందుకంటే సింహదత్తుడు నాడూ విక్రమసింహుడికి తన గురించి తాను చెప్పుకోలేదు. ఒక యోధుడి బిడ్డగానే పెరిగాడు విక్రమసింహుడు.
 
సింహదత్తుడు తన పూర్వీకులను తెలుసుకుని కార్చిన కన్నీరనే వర్షంతో తడిసిముద్దైన నేల    వరుణ ప్రాకారం.

ఇన్నాళ్టికి సింహ దత్తుడి గొప్పతనం తెలుసుకుని అడుగుపెట్టబోతున్నాడు విక్రమసింహుడైన అభిజిత్.
---
PS: Please rate the episode
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
శంభల రాజ్యం – 13
సింహదత్తుడి ప్రాణ త్యాగం
 
వరుణ ప్రాకారంలోకి విక్రమసింహుడు అడుగుపెట్టగానే అక్కడున్న ఆకాశం గొడుగు పట్టింది.
 
శివుణ్ణి వ్యోమకేశి అంటారు. ఆకాశమే తన కేశములుగా కలవాడని అర్థం. కాలమే శివుడు. అలాంటి కాలం అనే ఆకాశం విక్రమసింహుడి రాకకై నిరీక్షిస్తూ ఇన్ని రోజులూ గడిపిందా అన్నంతగా నల్లబడింది కురుల లాంటి మేఘాలతో.
విక్రమసింహుడు జజీరాతో జరిగిన సంగ్రామంలో ఓడిపోయానని అనుకున్నాడు కానీ తన తండ్రి సింహదత్తుడి గొప్పతనం తెలుసుకోలేని కొడుకుగా ఓడిపోయాడని ఇప్పుడే తెలుసుకుంటున్నాడు. అది సింహదత్తుడి గొప్పతనం.
 
సింహదత్తుడికి తన పూర్వీకులు వదిలి వెళ్లిన గొప్పతనం. వాస్తవానికి సింహళను, సింహళ ప్రజలను ఇందిరాపరిధికి చేర్చటంతోనే సింహళ రాజుల బాధ్యతలన్నీ తీరిపోయాయి. కానీ, అలా చేతులు దులిపేసుకుని వెళ్లే వాళ్ళే అయితే వాళ్ళు సింహళ రాజులెందుకవుతారు? సింహదత్తుని పూర్వీకులు ప్రజలను క్రూరజంతువుల బారి నుండి కాపాడటానికి జరిపిన మారణహోమానికి ప్రాయశ్చిత్తంగా అన్నిశిక్షలనూ అనుభవించారు. ఎన్ని త్యాగాలు చెయ్యాలో అన్నీ చేశారు. అయినా ఇవేవీ సింహదత్తుడికి తెలియనివ్వలేదు. సింహ దత్తుడే స్వయంగా తెలుసుకున్నాడు. ఇప్పుడు విక్రమసింహుడు కూడా అంతే. తనే అభిజిత్ గా వచ్చి విక్రమసింహుడిగా ఆనాడు ఏమేం తెలుసుకోలేకపోయాడో అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్నాడు.
 
వరుణ ప్రాకారంలో సింహదత్తుడు తుదిశ్వాస విడిచాడు. అనలప్రాకారంలోని జ్వాలాజిహ్వుడి నుండి, మేఖలలోని భైరవి నుండి శంభలకు పూర్తిగా విముక్తి కల్పించాడు.
 
జ్వాలాజిహ్వుడు, భైరవి ఒకప్పుడు శంభల రాజ్యంలోని వరుణ ప్రాకారంలో మూడు అమావాస్యలు విచ్చలవిడిగా శృంగారం జరిపారు. విషయం తెలిసిన వ్యక్తి కూడా బతికి బయటపడినట్టు శంభల చరిత్రలోనే లేదు. కానీ కొన్ని విషయాలు దాచిపెడితే దాగేవి కావు. కంటితో చూస్తేనే తెలిసే సత్యాలు కూడా కావు. కొన్ని చర్యలకు విపరీతమైన పరిణామాలుంటాయి. అలాంటిదే జ్వాలా జిహ్వుడు,
 
భైరవిల రతిక్రీడ.  జ్వాలాజిహ్వుడు, భైరవిల ప్రేమ ఒకప్పుడు రెండు వంశాలనే నాశనం చేసింది. వారిరువురి రూపురేఖలను పూర్తిగా మార్చి వేసింది. అయినా సరే రూపాలకు అతీతంగా వారి మధ్యనున్న మోహం మరింత బలపడుతూ పోయింది. మోహమే ఎంతో మందిని భయపెడుతూ పోయింది. సరిగ్గా వరుణ ప్రాకారం ఉన్న చోటునే ఒకప్పుడు సింహళ ఉండేది. అదే సింహళలో కొన్ని క్రూర జంతువులను సింహళ రాజులు యజ్ఞానికి ఆహుతిచ్చి బలిచేశారు. అలాంటి చోటులో ఉన్న వరుణ ప్రాకారంలో  మరిన్ని క్రూరజంతువులు తయారవుతున్నాయని శంభల జ్యోతిష్యుడు కనిపెట్టి శంభల రాజులనూ, మంత్రులనూ హెచ్చరించాడు. కొత్తగా పుట్టుకొస్తున్న క్రూరజంతువులు ఎక్కడివా అని అంచనా వేస్తే అప్పుడు అర్థం అయింది ఏంటంటే అవి జ్వాలా జిహ్వుడు, భైరవిల ప్రేమకు ప్రతిరూపాలని. అలాంటి సమయంలో వారికి శంభలను కాపాడే యోధుడిగా సింహదత్తుడు మాత్రమే కనిపించాడు. విషయం తెలుసుకున్న సింహదత్తుడు ఇలా అన్నాడు.
 
"సింహళ ప్రజలు ఇందిరాపరిధికి వెళ్ళిపోయాక మళ్ళీ నేను తిరిగి శంభలకు ఎందుకు రావలసి వచ్చిందో నాకిన్ని రోజులూ బోధపడలేదు. ఇప్పుడు కార్యకారణ సంబంధం చాలా స్పష్టముగా నా కళ్లముందుంది. శంభలను కాపాడటం నా బాధ్యత", అన్నాడు.
 
శంభల రాజులు, మంత్రులు సంశయించారు.
 
మహామంత్రి ముందుకొచ్చి తన సంశయాన్ని ఇలా బయటపెట్టాడు.
 
"మీరిప్పుడు క్రూరజంతువులను చంపితే జ్వాలాజిహ్వుడు, భైరవి ఊరుకుంటారా?
 
శంభలను సజీవంగా దహనం చేస్తారు. క్రూరజంతువులను చంపకపోతే అవే మనల్ని సంహరిస్తాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిని మీరొక్కరే ఎలా ఎదుర్కుంటారు?"
 
"ప్రాంచద్రుద్రుడిచ్చిన యజ్ఞ మంత్రాన్ని ప్రజల శ్రేయస్సు కోసం వాడి వారి కంటే ముఖ్యమైనది మరొకటి లేదని చాటారు మా పూర్వీకులు. వారు పడ్డ కష్టాలను మేరు పర్వత దర్శనం జరిగినప్పుడు నా కళ్లారా నేను చూసాను. అలాంటి రక్తం పంచుకు పుట్టిన నేను సింహళ నేలపై ఉన్న శంభలను ఎలా వదిలేసి వెళ్లిపోగలను ! పైగా శంభల రాజకుమారి ఐన విజయకుమారి నా ధర్మపత్ని. విక్రమసింహుడు నా కొడుకు. నా పరాక్రమాన్నే శంభలకు కానుకగా ఇచ్చిన నేను నా ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపొమ్మంటున్నారా?" అని కన్నెర్రజేశాడు.
 
అంతవరకు సింహదత్తుడిలోని ఆగ్రహ జ్వాలను చూడని వాళ్లకు ప్రశ్నతో నోట మాటరాలేదు.
 
వరుణ ప్రాకారం ఉన్న చోటు సింహళ రాజుల, ప్రజల కన్నీళ్లతో పావనమైన స్థలం. అలాంటి నేలపై అరాచకం జరగాలన్నా జరగదు. విధ్వంసం మొదలు పెట్టాలన్నా కుదరదు. అందుకే జ్వాలా జిహ్వుడు, భైరవిల ప్రతిరూపాలైన  అంజీరణులను పూర్తిగా నశింపజేయ్యగలిగాడు  సింహదత్తుడు. సింహదత్తుడి కత్తికి బలైన   అంజీరణుల ఆర్తనాదాలు జ్వాలా జిహ్వుడికి, భైరవికి వినబడ్డాయి.
 
అనల నుండి కోపంగా నలుదిశలా జ్వాలలతో బయలుదేరిన యాళి  జ్వాలా జిహ్వుడు   అయితే, మేఖల నుండి ఉగ్రరూపం దాల్చి రెక్కలు పెద్దవిగా చేసి అడ్డొచ్చిన దాన్నల్లా తన్నుకుపోయే గరుడపక్షి  భైరవి.
 
వరుణ ప్రాకారంలో వీరిరువురి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు సింహదత్తుడు.
 
అంజీరణుల శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి అక్కడ. జ్వాలా జిహ్వుడు, భైరవి అల్లంత దూరం నుండే చూసారీ ఘోరాన్ని. అంత కోపంలో కూడా కన్నీరు మున్నీరయ్యారు. అంత ఘోరంగా అక్కడ చచ్చి పడున్న అంజీరణులను చూస్తూ బాధగా తన రెక్కలతో నిర్జీవంగా పడున్న వాటి శరీర భాగాలను ఒడిలోకి తీసుకుని కుమిలి కుమిలి ఏడ్చింది భైరవి. ఒక్క ప్రాణం అయినా మిగిలుందేమోనని ఆతృతగా వెతుకుతున్న  కళ్ళతో చుట్టూ చూస్తున్నాడు జ్వాలా జిహ్వుడు. హృదయవిదారకంగా ఉంది వారిరువురి పరిస్థితి. జ్వాలా జిహ్వుడిలో తండ్రి కనిపించాడు. భైరవిలో తల్లి కనిపించింది. భైరవి మాతృవేదన, జ్వాలాజిహ్వుడి పితృశోకం రెండూ సమయంలో అరణ్యరోదనే అయ్యాయి. ఏడ్చి ఏడ్చి కనులలో నీళ్లు ఇంకిపోయాయి భైరవికి. వెతికి వెతికి కనులలో ప్రేమ ఇంకిపోయింది జ్వాలా జిహ్వుడికి. ఇప్పుడు ఇద్దరూ సింహదత్తుడి కోసమే వెతుకుతున్నారు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
సరిగ్గా అదే సమయంలో ధీరునిలా వారికెదురొచ్చి నిలబడ్డాడు సింహ దత్తుడు.
 
"మా ప్రేమకు ప్రతిరూపాలని నామరూపాలు లేకుండా చేసావే. అసలు నీకు మనసంటూ ఉందా?" అని అడిగాడు జ్వాలా జిహ్వుడు.
 
"మీ ప్రేమకు ప్రతిరూపం ప్రపంచానికి ఆటంకం కాకూడదు కదా", అన్నాడు సింహ దత్తుడు.
 
"అంజీరణులు ఎవ్వరికైనా హాని తలపెట్టాయా?" రోదిస్తూ అంది భైరవి.
 
"అవి చంపే దాకా చూస్తూ ఉండమంటారా?" అని ఎదురు ప్రశ్న వేసాడు సింహ దత్తుడు.
 
"వాటిని లయం చెయ్యటానికి నువ్వెవరు? శివుడివా?" కోపంగా అడిగాడు జ్వాలా జిహ్వుడు.
 
"లయం చేసే ప్రతి వాడు శివుడే. లయం లేనిదే సృష్టి లేదు. సృష్టి అంటూ ఉంటే లయం అవ్వక తప్పదు. అది ధర్మం", అని ఎలాంటి బెదురు లేకుండా చెప్పాడు సింహ దత్తుడు.
 
"ఏది లయం చెయ్యాలో శివుడికి తెలుసు. కాలానికి తెలుసు. అసలు నువ్వెవరు?" అంటూ కోపంగా అడిగింది భైరవి.
 
"సింహదత్తుడిని. సింహళ రాజ్యం ఉన్న నేలపైనే రాజ్యపరిపాలన చేసిన రాజును", అంటూ బదులిచ్చాడు.
 
"అది ఒకప్పుడు. ఇప్పుడు కాదు కదా", అన్నాడు జ్వాలా జిహ్వుడు.
 
"నిజమే. కానీ ఇప్పుడు శంభల రాజకుమారి విజయకుమారి నా సతీమణి. శంభలను, శంభల ప్రజలనూ కాపాడే బాధ్యత నాదే", అన్నాడు సింహ దత్తుడు.
 
"మాకు పుత్రశోకం కలిగించిన నిన్ను ఊరికే వదిలిపెట్టము. మేము చచ్చినా సరే నీకు పుత్రశోకం కలిగితీరుతుంది" అంటూ శపించారు జ్వాలా జిహ్వుడు, భైరవిలు.
 
సింహ దత్తుడి నోట మాటరాలేదు. తను ఇంతవరకూ పరాక్రమం చూపించాను అనుకుంటున్నాడు. కానీ అది ఇంతటి దుఃఖం తెచ్చిపెడుతుందని అనుకోలేదు.
 
జ్వాలా జిహ్వుడు, భైరవిలు కేవలం కామ సుఖాలను అనుభవించారనుకున్నాడు. కానీ ఇప్పుడు వారు తల్లిదండ్రుల స్థానంలో తనను ప్రశ్నిస్తున్నారు. వారి బాధలో నిజముంది. వారి భావనలో ఎంత నిజమున్నదో వారికే తెలియాలి. ఇలాంటి ధర్మ సందిగ్ధంలోనే సరిగ్గా తన పూర్వీకులు కూడా నెట్టివేయబడ్డారు.
 
అప్పుడు సింహదత్తుడు ఆకాశం వైపుకు చూస్తూ ఇలా అన్నాడు.
 
"రాజుగా ధర్మాన్ని పాటించిన నన్ను శివుడివా అని వీళ్ళు అడుగుతున్నారు. రాక్షస సంహారం చేసిన నన్ను పుత్రశోకం కలిగించావు అంటున్నారు. నాకు పుత్రశోకం కలిగితే మాత్రం నా కొడుకు నిన్నే చేరుకుంటాడు శివా. నిన్నే చేరుకుంటాడు. నిన్నే ప్రశ్నిస్తాడు. నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడు. నిన్ను నిలదీస్తాడు శివా. గుర్తుపెట్టుకో", అంటూ సింహ దత్తుడు వజ్రమణి అనే ఆయుధాన్ని తీసి జ్వాలా జిహ్వుడిపై సంగ్రామానికి బయలుదేరాడు.
 
నిరంతరాయంగా రెండు గంటలు జరిగిన యుద్ధంలో చివరికి జ్వాలా జిహ్వుడు, భైరవి ప్రాణాలు విడిచారు. సింహదత్తుడు శంభల కోసం వారితో తలపడుతూ తన ప్రాణత్యాగం చేసాడు. చరిత్రకెక్కాడు. విక్రమసింహుణ్ణి శంభలకిచ్చాడు.
 
వరుణప్రాకారంలో నిల్చున్న అభిజిత్ కళ్ళముందు ఇదంతా ఆవిష్కృతం అయింది.
 
కుండపోతగా అక్కడ వర్షం కురుస్తోంది.
 
అది వర్షం కాదు సింహదత్తుడి కన్నీరే అని తెలుస్తోంది అభిజిత్ రూపంలో ఉన్న విక్రమసింహుడికి. ఇదంతా తెలుసుకున్న అంకిత, సంజయ్ లకు విక్రమసింహుడి వేదన మొదటి సారి అర్థం అయినట్టు అనిపించింది. సింహదత్తుడి పరాక్రమం ఎల్లలు లేనిదిగా తోచింది.
 
రుద్రసముద్భవ మీసం మెలేసాడు. సింహాన్ని చూస్తేనే కాదు తలచుకున్నా సరే ధైర్యం కలుగుతుంది. ధైర్యం అతని చేత చేయించిన చేష్ట అది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
వచ్చే ఆదివారం 12వ తారీఖు ఆఖరి అప్డేట్ ఇస్తాను, దానితో ఈ కథకు స్వస్తి
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Mari bolokam lo gora Kali nasanam gurinchi
[+] 1 user Likes Ajayk's post
Like Reply
12 వరకు వేచి ఉండండి
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: 1 Guest(s)