Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 13
#81
 
ఇంతలో సంజయ్ ని వెనక నుండి ఎవరో భుజం తట్టినట్టు అనిపించింది. హనుమద్గాయత్రిలో నిమగ్నమై ఉండటంతో సంజయ్ కి స్పర్శ కూడా తెలియలేదు. పదే పదే అదే స్పర్శ కలగటంతో కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక వృద్ధుడైన సాధువు కనిపించాడు.
 
"ఏమయ్యా వాళ్లంతా చక్కగా రామనామ జపం చేస్తుంటే నువ్వేమిటయ్యా హనుమ, హనుమ అంటావు?" అన్నాడా సాధువు.
 
ఒక్క నిమిషం సంజయ్ కి ఏం అర్థం కాలేదు.
 
"ఏమిటి అలా బిక్కమొహము వేస్తావు? నేనే హనుమంతుడిని అనుకో ఒక్క నిమిషం. హనుమంతుడికి రామనామ జపం చేసేవాళ్ళే ఇష్టం. విషయం తెలుసా నీకు?" అన్నాడు సాధువు.
 
"స్వామీ...మైనాకుడు", అని సంజయ్ అంటూ ఉండగా
 
"ఇదిగో రాముడు నాకు అన్ని విషయాలూ చెప్పే పంపించాడులే కానీ.....ఒక్క సారి నాకోసం రామనామ జపం చెయ్యవయ్యా....ఇంతగా అడుగుతుంటే అర్థం చేసుకోవెందుకు?" అన్నాడు.
 
సంజయ్ వెంటనే రామనామ జపంలో లీనమయ్యాడు. సాధువు కూడా ఆనందంగా రామనామ జపం చేస్తూ గడిపాడు.
 
అలా రామనామ జపంతో ప్రదేశం అంతా పరమ పావనం అయినది.
 
వీరి రామనామ జపంతో  సముద్రుడు ప్రత్యక్షం అయ్యాడు.
సిద్ధపురుషుడు, అభిజిత్, సంజయ్, అంకితలు అచేతన స్థితిలోకి వెళ్లిపోయారు. వృద్ధుడైన సాధువు రూపంలో ఉన్న ఆంజనేయుడు సముద్రుడితో ఇలా మాట్లాడాడు.
 
"ఆనాడు నా రాముడు 3 రోజుల పాటు నిన్ను ఉపాసించినా నీవు ఆయన ఎదుట నిలువలేదు. ఈనాడు నా రాముడి పేరు వినగానే వచ్చితివే ? సముద్రా నీలో ఎంత మార్పు?" అని అడిగాడు హనుమ.
 
" దోషమును బాపుకొనుటకే ఈనాడు నీ ముందు ఇలా నిలిచితిని, హనుమ. ఆజ్ఞాపించు. నేనే విధముగా ఉపయోగపడగలనో విన్నవించు", అన్నాడా సముద్రుడు.
 
"సిద్ధపురుషుడు అయిన సమర్థ రాఘవుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని శ్వేతద్వీపవైకుంఠవాసి. ఆయనను, ఆయనతోటి వచ్చిన పరివారమును సముద్రగర్భంలో ఉన్న మైనాకుడి ద్వారా శంభల నగరానికి క్షేమంగా చేర్చే బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను", అన్నాడు హనుమంతుడు.
 
"ఆఘమేఘాలమీద కార్యాన్ని మైనాకుడికి ఇచ్చెదను. శ్రీరామ జయరామ", అంటూ సముద్రుడు అంతర్ధానమయ్యాడు.
 
వృద్ధుడైన సాధువు రూపంలో ఉన్న హనుమంతుడు అచేతనులై ఉన్న నలుగురి వంక ఒక్కసారి చూసి వారి నుదుటన సింధూరం దిద్ది, "జై శ్రీరామ్" అంటూ అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు.
 
కొంతసేపటికి నలుగురూ కళ్ళు తెరిచి చుట్టూ చూసారు.
 
"హే...అక్కడ చూడండి...మిస్టర్ మైనాక అనుకుంటా", అన్నాడు అభిజిత్.
 
కొండ అంచు చివర మానవరూపంలో ఉన్న మైనాకుడితో సిద్ధపురుషుడు ఇలా అన్నాడు," ప్రణామములు మైనాక ! శంభల రాజ్యానికి చేరుటకు నీ సహాయము లేనిదే మా ప్రయత్నము సర్వమూ వ్యర్థమగును."
 
"శ్రీరాముడి సాక్షాత్కారము కలిగిన మీ నలుగురికీ సహాయపడుట నా అదృష్టముగా భావించెదను. విధముగానైనను వాయుదేవుని ఋణము కొంత తీర్చుకున్నవాడిని అవుతాను", అన్నాడు మైనాకుడు.
 
మానవరూపంలో ఉన్న మైనాకుడు వెంటనే పర్వతరూపం ధరించాడు.
 
సిద్ధపురుషుడు, సంజయ్, అభిజిత్, అంకితలు నలుగురూ పర్వతాన్ని అధిరోహించగానే స్వతః సిద్ధముగా కల రెక్కలతో మైనాకుడు గరుడపక్షి వలె వాయువేగంతో మహాసముద్రాన్ని లంఘించాడు.
 
కొన్ని ఘడియలలోనే సముద్రాన్ని దాటి శంభల నగరానికి చేరుకున్నాడు.
 
శంభల నగరానికి ఉన్న ప్రవేశ ద్వారానికి దగ్గరలో వారిని సురక్షితంగా చేర్చి తన దారిన తాను వెళ్లిపోయాడా మైనాకుడు.
 
శంభల నగర ప్రవేశ ద్వారాన్ని చూస్తూ అలానే నోరెళ్ళబెట్టుకుని ఉండిపోయారు సంజయ్, అభిజిత్, అంకితలు.
 
ప్రవేశ ద్వారం వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాడా సిద్ధపురుషుడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
Nice writer keep it up
[+] 1 user Likes 9652138080's post
Like Reply
#83
భలే కోయిన్సైడ్ అయ్యిందండి అయోద్యలో శ్రీరామ ప్రాణపతిష్ట మీ కథలో రాములోరు మాకందరికి దర్శనమివ్వడం...బావుంది, కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#84
అప్డేట్ చాల బాగుంది clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
#85
శంభల నగర ప్రవేశం
దేవశిల్పి విశ్వకర్మ వృత్తాంతము

శంభల నగర ప్రవేశ ద్వారం దగ్గరికెళ్ళాక సిద్ధపురుషుడు వెనక్కి తిరిగి చూసాడు. సంజయ్, అభిజిత్, అంకితలు ఆశ్చర్యంగా మైమరచిపోయి ముఖద్వారాన్నే చూస్తూ ఉండటం గమనించాడు. 1500 అడుగులకు పైనే ఉన్న ద్వారాన్ని ఇంతవరకూ భూలోకంలో ఎప్పుడూ, ఎక్కడా చూసి ఉండరనుకున్నాడు సిద్ధపురుషుడు. సింహద్వారంతో పాటు  సమానమైన ఎత్తులో వున్న ప్రహరీ గోడ కూడా అనంతంగా అన్ని వైపులకూ వ్యాపించి ఉండటంతో అందనంత ఎత్తులో వున్న ఆకాశాన్నే తాకుతోందేమో అన్నట్టుగా కళ్ళను మాయ చేస్తోందా రాజప్రాకారం.
 
సిద్ధపురుషుడు దూరం నుంచి తన చేతులతో సైగ చెయ్యటంతో సంజయ్, అభిజిత్, అంకితలు లోకంలో కొచ్చారు. పరుగులాంటి నడకతో నగర ద్వారం వైపుగా వెళ్లారు.
 
అక్కడికి చేరుకోగానే వాళ్లకు ద్వారాన్ని దగ్గరి నుండి చూసే అవకాశం దొరికింది. సింహద్వారం మధ్యలో ఐదు ముఖాలతో, పది చేతులతో వున్న ఒక ఋషిలాంటి వ్యక్తి యొక్క చిత్రపటము కనిపించింది. దూరం నుండి చూసినప్పుడు శంభల రాజ్యానికి రాజేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు దగ్గరగా చూసేసరికి చిత్రంలో వున్న వ్యక్తి రాజులా అనిపించలేదు.
 
"ఎవరు స్వామి ఆయన?" అని తన చూపుడు వేలితో చిత్రం వైపుగా చూపిస్తూ సిద్ధపురుషుణ్ణి అడిగాడు అభిజిత్.
 
"అలా వేలితో చూపించకు, అభిజిత్. అది మంచి పధ్ధతి కాదు. చిత్రాన్నే కాదు, ఒక వ్యక్తిని అయినా సరే చూపుడువేలితో అలా చూపిస్తూ మాట్లాడటం సంస్కారం కాదు",అన్నాడా సిద్ధపురుషుడు. "ఇది మానవలోకం కాదు. శంభల నగరం. ఇచట మన ప్రతీ కదలికనీ గమనించే దేవతాగణాలుంటాయి. అందుకే ప్రత్యేకించి   విషయాన్ని చెబుతున్నాను", అన్నాడు.
 
"తెలియక అలా చేసాను స్వామి. ఆయన ఎవరో తెలుసుకుందామనే తొందరపాటులో అలా ప్రవర్తించాను. క్షమించగలరు", అని వినమ్రంగా అడిగాడు అభిజిత్.
 
"ఆయన దేవశిల్పి విశ్వకర్మ", అన్నాడు సిద్ధపురుషుడు.
 
"మనోడికి దేవశిల్పి అంటే అర్థం అయినట్టు లేదు", అని అంకితతో సంజయ్ అంటూనే అభిజిత్ తో,"అభిజిత్, దేవతలకు  ఆర్కిటెక్ట్ ఆయనే", అన్నాడు.
 
స్వామి, మనం లోపలికి వెళ్ళటానికి  ఇంకా చాలా టైం పట్టేలా ఉన్నది. అంతలోపల విశ్వకర్మ గురించి చెప్తారా?" అడిగాడు అభిజిత్.
 
"అవును స్వామి. చూస్తుంటే ఇప్పట్లో మనకు లోపలికి వెళ్లే అనుమతి దొరికేలా లేదు.
 
విశ్వకర్మ మాకు తెలియని విషయాలన్నీ చెప్పండి", అని అడిగాడు సంజయ్.
 
"ఏంటి నీకు కూడా ఆయన గురించి తెలీదా సంజయ్?" అడిగింది అంకిత.
 
"తెలీదు. నేనేం మైథాలజీ ప్రొఫెసర్ రాధాకృష్ణన్ ని కాదు కదా. సిబిఐలో వర్క్ చేసే ఆఫీసర్ ని అంతే", అన్నాడు సంజయ్.
 
"కదా. నాకూ అలాగే దేవశిల్పి అంటే ఏంటో తెలీదు. నాకంటే నీకు కాస్తెక్కువ తెలుసంతే. స్టార్టింగ్ లో నీ నాలెడ్జ్ చూసి అనవసరంగా టెన్షన్ పడిపోయా. ఇప్పుడర్థం అయిపోయింది", అన్నాడు అభిజిత్.
 
"ఏమర్థం అయింది?" అన్నాడు సంజయ్.
 
"సమర్థ రాఘవుడి లాంటి గురువు ఉంటే నీకంటే నేనే బ్రైట్ స్టూడెంట్ ని అని", కాన్ఫిడెంట్ గా కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పాడు అభిజిత్.
 
"స్పర్థయా వర్ధతే విద్యా అని మన పెద్దలెప్పుడో చెప్పారు", అంటూ నవ్వాడు సిద్ధపురుషుడు. "సరే మీరు అడిగినట్టే విశ్వకర్మ గురించి క్లుప్తముగా చెప్తాను. శ్రద్ధగా వినండి", అంటూ ఇలా చెప్పసాగాడు సిద్ధపురుషుడు.
 
"విశ్వకర్మకు మూడు రూపాలున్నాయి. వాటిల్లో మొదటిది విరాట్ స్వరూపమైన  పరమాత్మ తత్వము
. పరమాత్మ ఐన విశ్వకర్మనే ప్రవేశ ద్వారం మీదున్న చిత్రంలో మీరు చూస్తున్నారు. తన సంకల్ప బలంతో పునఃసృష్టి చేసి సమస్త జీవకోటినీ సృష్టించాడని ఋగ్వేదం చెబుతోంది. స్వయంభువుగా ఉద్భవించిన ఆయనకు ఐదు ముఖాలు, పది చేతులని వేదాలలో చెప్పబడి వున్నది.
 
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠ స్థవిరో ధ్రువః
అని విష్ణుసహస్రనామ స్తోత్రంలో వుంది. అంటే ఆయన పరమాత్మ స్వరూపం అన్నట్టే కదా.
 
రెండవది 
భౌవనపుత్ర విశ్వకర్మ. ఇతను భువనుడు అనే రాజర్షి యొక్క పుత్రుడు. ఒక శిరస్సు, నాలుగు హస్తములు మరియు ఏనుగును వాహనంగా కలవాడు. ఇతను వేదకాలంలోనే తన తండ్రిలా చక్రవర్తి పట్టాభిషేకం జరిపించుకున్న శిల్పర్షి, రాజర్షి. ఇతను భూమి నుండి జన్మించినటువంటి సువర్ణరత్న శిల్పి యని మహాభారతములో చెప్పబడి వుంది. సహస్ర శిల్పముల కర్త అని కూడా మహాభారతమునందు చెప్పబడి వున్నది. శ్రీమహావిష్ణువు యొక్క రూపమని విశ్వకర్మసంహితలో వున్నది.
 
మూడవదైనటువంటి రూపమే మనం ఎక్కువగా వినే 
 దేవశిల్పి విశ్వకర్మ . దేవతలకు, మానవులకు శిల్ప గురువు ఇతడే. తన తపో శక్తితో భౌవన పుత్ర విశ్వకర్మ సాక్షాత్కారం పొందటం చేత ఆయన నుండి సర్వశక్తులను పొందినవాడయ్యాడు దేవశిల్పి విశ్వకర్మ. ఒక శిరస్సు, రెండు భుజములు మరియు హంసను వాహనంగా కలవాడు.పార్వతీదేవిని పరిణయమాడిన తర్వాత శివుడు ఒక అందమైన భవనాన్ని నిర్మించమని విశ్వకర్మను అడగటంతో ఆయన   స్వర్ణలంకను సృజించాడు. తర్వాతి రోజుల్లో ఇదే రావణాసురుని దగ్గరికి చేరింది. దధీచి వెన్నెముకతో ఇంద్రునికి 
వజ్రాయుధాన్ని తయారు చేసిచ్చింది కూడా విశ్వకర్మే.
 
సత్యయుగంలో దేవతల  స్వర్గలోకమును , ద్వాపరయుగంలో 
ద్వారకా నగరాన్ని , కలియుగంలో  హస్తినాపురాన్ని
ఇంద్రప్రస్థాన్ని కూడా దేవశిల్పి విశ్వకర్మే సృజన చేసాడు.
శ్రీమహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని కూడా ఈయనే చేసిచ్చాడు. ఇలా ఎన్నెన్నో చేసాడు. మీరిప్పుడు చూడబోయే శంభల నగరాన్ని, శంభల రాజ్యాన్ని కూడా విశ్వకర్మ సంతానమే సృజించి ఉంటారు. అందులో ఎటువంటి సందేహము లేదు, అని అక్కడితో ముగించాడు సిద్ధపురుషుడు.
 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply
#86
ఇంతలో సూర్యోదయా సమయం కావటంతో ప్రవేశ ద్వారం తలుపులు ఒక యోజనం మేర తెరుచుకున్నాయి. తలుపుల మధ్యలో నుంచి వాళ్లకు అందమైన శంభల నగరం కనిపించింది. అనంతమైన సింహద్వారంలో ఒక యోజనం మేర తెరుచుకున్న తలుపులు కూడా కిటికీలలా అనిపించాయి. రాజప్రాకారమే అంత పెద్దగా ఉంటే ఇక శంభల నగరం ఎంత పెద్దగా ఉంటుందో ఊహించుకోవటానికి కూడా హద్దు లేకుండా పోయింది.
 
శంభల రాజ్యం నుండి వచ్చిన ఇద్దరు సైనికులు మాత్రం వాళ్ళ కళ్ళ ముందే నిలబడి ఉన్నారక్కడ.
 
"శంభల నగరాన్ని మీకు చూపించిన తరువాతే శంభల రాజ్యానికి మిమ్మల్ని తీసుకురమ్మని అనిరుద్ధుల వారి ఆజ్ఞ. శంభల నగరం మొత్తం చూడటానికి మీకొక రోజు పడుతుంది", అని చెప్పి మౌనంగా ఉండిపోయారు సైనికులు.
 
"అబ్బో....అంతా వీళ్లిష్టమేనా ఇక్కడ? మన ఒపీనియన్ కి వేల్యూ లేదన్నమాట", అన్నాడు అభిజిత్.
 
"శంభల నగరాన్ని చూస్తే జీవితాంతం మీకు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది", అంటూ చిరునవ్వు చిందిస్తూ అన్నాడా సిద్ధపురుషుడు.
 
"అయితే డెఫినిట్ గా చూడాల్సిందే అంటూ ఎగ్జైట్ అయ్యాడు అభిజిత్.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 10 users Like k3vv3's post
Like Reply
#87
Wonderful update sir  clps

Thank you
[+] 1 user Likes sri7869's post
Like Reply
#88
Nice,.,.,.,.,.,
[+] 1 user Likes 9652138080's post
Like Reply
#89
భయ్యా ఒక చిన్న అనుమానం, అసలు కలియుగం శ్రీకృష్ణ నిర్యాయణంతో కదా మొదలైంది. మీరేమో హస్తినాపురం, ఇంద్రప్రశ్థము కలియుగంలో నిర్మించినట్లు రాశారు, అవి అంతకు మునుపే ద్వాపరయుగంలోనే ఉన్నాయి కదా?
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#90
GOOD UPDATE AND PL PROVIDE THE NEXT UPDATES AND WAITING
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#91
శంభల నగరం – 2
స్వర్వాహినీ క్షేత్రం

శంభల నగరానికి నాలుగు వైపులా పర్వత శ్రేణులే ఉంటాయి. శంభలలో మొత్తం 18 ప్రాకారాలు ఉంటాయి. 9 ప్రాకారాలు శంభల నగరంలో ఉంటే మిగిలిన 9 శంభల రాజ్యంలో ఉంటాయి. శంభల నగరం, శంభల రాజ్యం వేటికవే రెండూ భిన్న లోకాలలా ఉంటాయి. శంభల నగరంలో జ్ఞానసముపార్జన, దైవసంకీర్తన, శివారాధన ప్రముఖంగా కనిపిస్తే శంభల రాజ్యంలో యుద్ధవిద్యా బోధన, నైపుణ్య పరీక్ష, ధర్మ శాస్త్రాలపై అవగాహన ప్రధానంగా ఉంటాయి.
 
శంభల నగరంలోని మొదటి ప్రాకారం ఐన  స్వర్వాహినీ క్షేత్రంలో ఉన్నారు సంజయ్, అభిజిత్, అంకితలు.
సిద్ధపురుషుడికి కూడా శంభల నగరానికి రావటం ఇదే మొట్టమొదటి సారి కావటంతో చుట్టూ ఒకసారి పరిశీలనగా చూస్తున్నాడు. సైనికులు వీరితో పాటే అక్కడున్నారు.
 
"  స్వర్వాహినీ క్షేత్రానికి ఎందరో సిద్ధులు, శంభల రాజ్యంలోని రాజులు, మంత్రులు, యోగులు వస్తూ ఉంటారు. ఇదొక నది అంటారు. శంభల చుట్టూతా ఉంటుంది. కానీ మనకు ఇదొక పుష్కరిణిలా కనిపిస్తుంది. ప్రాకారాన్ని అలా నిర్మించారు. శంభల నగరంలోకి అడుగుపెట్టేవారికి ఇది మొట్టమొదటి ప్రాకారంలా అనిపిస్తుందేమో కానీ ఇది చిట్టచివరిదైన 9 ప్రాకారం. వికసించిన పద్మానికి ఎలా అయితే దళాలు విచ్చుకుని ఉంటాయో అలానే 9 ప్రాకారాలు శంభల నగరం మధ్యలో కేంద్రీకృతం అయ్యి ఉన్న శక్తిని ఆలంబనగా చేసుకుని చుట్టూ రక్షణ కవచాలలా వృత్తాకారంలో ఉంటాయి", అని చెప్పాడు వాళ్లలో ఒక సైనికుడు.
 
" క్షేత్రం ప్రాముఖ్యత ఏంటి?" అని అభిజిత్ అడిగాడు.
 
"వాక్కులో ఎలాంటి దోషాలు, అపశబ్దాలు లేకుండా అనవసరమైన ప్రసంగాలు చెయ్యకుండా ఉండాలంటే ఇక్కడికొచ్చి  స్వర్వాహినీ దేవిని ప్రార్థించి ఇక్కడి జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే చాలునని అంటూ ఉంటారు శంభలలో", అన్నాడొక సైనికుడు.
"మానవులకు వాక్కులో దోషాలు సహజం. శంభలలో కూడా ఇలాంటివి ఉంటాయా స్వామి?" అంటూ సిద్ధపురుషుణ్ణి అడిగాడు సంజయ్.
 
"ఎంతటి వారికైనా సరే భగవంతుని గుణగణాల కీర్తన చెయ్యనిదే వాక్కులో పరిపూర్ణమైన శుద్ధి అనేది అసంభవం. అందుకే మనకు  అచ్యుతా...అనంతా...గోవిందా అని స్మరించమంటారు", అన్నాడా సిద్ధపురుషుడు.
 
స్వర్వాహినీ క్షేత్రంలోని నీటిని తీర్థంలా సేవించి అక్కడే కాసేపు ఆసీనులయి వాక్కులో పరిపూర్ణమైన శుద్ధి కొరకు స్వర్వాహినీ దేవిని ప్రార్థించారు.
"స్వామీ  కనకధారాస్తోత్రంలో
…..
స్వర్వాహినీ విమలచారు జల ప్లుతాంగీమ్
అని వస్తుంది కదా. అక్కడ ప్రస్తావించినది నది గురించేనా?" అని అడిగాడు సంజయ్.
 
స్వర్గలోకంలో ఉన్న ఆకాశగంగ  మందాకినీ
అనే పేరుతో నదిగా ప్రవహిస్తోంది. శంభల శివుని క్షేత్రం కావటంతో ఇక్కడ అదే ఆకాశగంగ స్వర్వాహినీ 
పేరుతో ప్రవహిస్తోంది. ఆదిశంకరుని కనకధారా స్తోత్రంలో చెప్పిన స్వర్వాహినీ విమల చారు జలం ఇదే. నీ ఆలోచనలో ఉన్న లోతు నాకెంతగానో నచ్చింది. ఇలాగే ప్రతీ విషయాన్ని వివేకంతో ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ ఉంటే ఏదో ఒకరోజు నీకు బ్రహ్మజ్ఞానం తప్పక లభిస్తుంది, అంటూ ఆనందంతో సంజయ్ ని చూస్తూ చిరునవ్వు చిందించాడు సిద్ధపురుషుడు.
 
రెండవ ప్రాకారం ఐన  ధనుః ప్రాకారం వైపుగా అడుగులు వేస్తున్నారు సంజయ్, అభిజిత్, అంకితలు. సైనికులు వీళ్లకు దారి చూపిస్తూ ముందుకు వెళుతున్నారు. సిద్ధపురుషుడు సైనికులని అనుసరిస్తూ వారి వెనకే వస్తున్నాడు. సిద్ధపురుషుణ్ణి అనుసరిస్తూ మిగతా ముగ్గురూ తమ అడుగులు ముందుకేస్తున్నారు.
 
శంభల నగరంలోని ప్రతీ ప్రాకారం వెడల్పు 3 యోజనాలు. 3 యోజనాల దూరం నడిస్తే గాని మరొక ప్రాకారానికి వెళ్లలేము. ప్రతీ ప్రాకారం యొక్క చుట్టుకొలత తగ్గుతూ పోతుంది. లెక్కన చూస్తే శంభల నగరంలో వున్న 9 ప్రాకారాలలో  
స్వర్వాహినీ క్షేత్రమే అతి పెద్ద చుట్టుకొలత గల ప్రాకారం.
 
మధ్యలో కేంద్రీకృతం అయ్యి ఉన్న శక్తిపీఠం కిందుండే భూగృహములో చింతామణి అనే దేవమణి ఉంటుంది. దేవమణిని కోరుకుంటే దొరకని శక్తి లేదు. దేవమణి కాంతి ప్రసరిస్తే చాలుననుకునే రాజులు ఎందరో ఉన్నారు శంభల చరిత్రలో. ఇంతవరకూ అలాంటి అవసరం కానీ, సందర్భం కానీ   కల్కి రాజుకీ రాలేదు. అనిరుద్ధుల వారికి అలాంటి అరుదైన సువర్ణావకాశాన్ని ఇచ్చేది బహుశా ముగ్గురేనేమోనని.సంజయ్, అభిజిత్, అంకితలను చూస్తూ మనసులో అనుకుంటున్నాడు సిద్ధపురుషుడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
#92
శంభల నగరం – 3
ధనుః ప్రాకారం
"మనస్సును అదుపులో పెట్టుకోవటం అన్నది తేలికగా అబ్బే విద్య కాదు. మనలో ఒక్క రోజులో కొన్ని వేల ఆలోచనలు అలా సముద్రంలోని కెరటాలలా వస్తూ పోతూ ఉంటాయి. మనసుని అలజడికి గురి చేసే విషయాల్ని కట్టడి చేస్తే మరింత ప్రమాదం. దేన్నైనా సరే ఛేదించి, సాధించాలి. అలా ఛేదించాలి అంటే మనలో వుండే అలజడిని తగ్గించే దిశగా మనం అడుగులు వెయ్యాలి. అదొక సాధనలా నిరంతరం సాగాలి. అంతే కానీ మనసుని బలవంతంగా కట్టడి చేస్తే మాత్రం అది పదింతలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. ఇలాంటి మనసును జ్ఞాన మార్గం వైపుకు నడిపించేదే   ధనుః ప్రాకారం .
 
శంభల రాజ్యం లోని యోధులు, యోగులు, రాజులు ఎందరో   ధనుః ప్రాకారానికి వచ్చి ఇక్కడ ధనుస్సు ఆకారంలో నిర్మించబడ్డ ప్రాంగణం అంతా తిరుగుతూ మంత్రాన్ని మననం చేసుకుంటూ 18 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తర్వాత  ఎక్కు పెట్టిన బాణంలా మధ్యలో ఉన్న దారి వెంట నడుస్తూ చివరిదాకా వెళ్లి అక్కడున్న  ధ్యాన పీఠము
మీద ఆసీనులవుతారు. బాణంలా వున్న దారికి ఇరు వైపులా 
పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణిలోని నీళ్లు స్వర్వాహినీ క్షేత్రానివే అయినా శివుని ఆలయంలోని భస్మమును ఎప్పటికప్పుడు తెచ్చి ఇక్కడి నీటితో జత చేస్తూ వుంటారు. సృష్టి, స్థితి, లయము లకు అతీతమైన ఒక ప్రపంచం శంభల నగరం. శివుని ఆజ్ఞను అనుసరించటమే ఇక్కడ పరమావధి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ధ్యాన పీఠాన్ని ఏర్పాటు చేసిన వేదికకు నలుదిక్కులా  శివోహం
అని వ్రాయబడి ఉంటుంది. అంటే దానర్థం నీ దారి ఆయన వేసిన దారి. నీ ప్రయాణానికి ఆయనే గమ్యం. నీ ఉనికికి ఆయనే మూలం. నీ లోని జ్ఞానమే ఆయన. ఆయనలోని జ్ఞానమే అనంతమైన విశ్వం అని.
 
 
చిదానంద రూపః శివోహం శివోహం
ధ్యాన పీఠము
మీద ఆసీనులయిన తర్వాత ఉపాసకుడు తన సంకల్పాన్ని, లక్ష్యాన్ని, గమ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పటికే పూర్తిగా మనసును తాను అనుకున్న లక్ష్యం వైపుగా దిశానిర్దేశం చేసి ఉండటంతో పరిపూర్ణమైన ఏకాగ్రత కుదురుతుంది.   ధ్యాన పీఠము మీదున్నప్పుడే అతనికి అన్ని సమాధానాలు దొరుకుతాయి. అతని ఇచ్చాశక్తిని బట్టి అతనికి  కలిగే అనుభూతి ఆధారపడి ఉంటుంది. తీవ్రమైన కోరిక వున్నప్పుడు మాత్రం ఇరువైపులా ఉన్న పుష్కరిణి లోని నీళ్లు 6 అడుగుల ఎత్తుకు ఎగసి పడుతూ ధ్యాన పీఠము మీదున్న ఉపాసకుడిని పునీతం చేస్తాయి. అనగా ఉపాసకుడు పవిత్రమైన పుష్కరిణి జలంతో ప్రోక్షణ చెయ్యబడ్డట్టు అన్నమాట. సంకల్ప సిద్ధి దొరికినట్టే అనుకోవచ్చు, అంటూ చెప్పటం ముగించాడు 
ధనుః ప్రాకారంలో ఉన్న ఉద్ధారకుడు.
 
"స్వామి ఇక్కడ ఆడవారికి కూడా ప్రవేశం ఉన్నదా?" అడిగింది అంకిత.
 
"సంకల్ప సిద్ధి కోసం చేసే ధ్యానానికి స్త్రీ, పురుష భేదం లేదు తల్లి", అన్నాడా ఉద్ధారకుడు.
 
"ఇంత క్రితం మీరు ఉపాసకుడు అని మాత్రమే సంబోధించారు. అందుకే ఇంతవరకు ఉపాసకురాలు ఇక్కడికి రాలేదేమోనని అనుకున్నాను", అని చమత్కారంగా అన్నది అంకిత.
 
"చాలా సరైన విషయాన్ని ప్రస్తావనకు తెచ్చావమ్మా. ఇక్కడ ఉపాసకుడు అంటే అర్థం పురుషుడు అని కాదు. శివుడు అని. ఎందుకంటే ధ్యాన పీఠము మీద ఆసీనులై ఎవరు ఉపాసన చేసినా సరే వారిలోని శివుడే జాగృతం అవుతాడు. సర్వం శివుడికే చెందుతుంది అన్న భావన అది.
 
శివుడే కర్త, కర్మ, క్రియ అన్న అంతరార్థం", అన్నాడు ఉద్ధారకుడు.
 
"ధనుస్సు ఆకారంలో ఉన్న ప్రాంగణం మొత్తం తిరుగుతూ పఠించే మంత్రం ఏమిటి స్వామి?" అడిగాడు సంజయ్
 
"
 
సర్వ చైతన్య రూపాంతాం 
 
 
ఆద్యాం విద్యాంచ ధీమహి 
 
 
బుద్ధిం యాన: ప్రచోదయాత్‌ 
 
 
మంత్రాన్ని మనసులోనే సరిగ్గా 18 సార్లు జపించిన తరువాత మాత్రమే   ధ్యాన పీఠము దగ్గరికి వెళ్లే అర్హత మీకు దొరుకుతుంది", అన్నాడు ఉద్ధారకుడు.
 
"మాకు ఇవన్నీ చెయ్యటానికి ఇప్పుడు అనుమతి ఉన్నదా స్వామి?" అని అడిగాడు అభిజిత్.
 
"దృఢమైన సంకల్పంతో శంభల రాజు అనిరుద్ధుల వారు ఒక రోజు ముందుగానే శివుని ఆలయానికి వచ్చి ఇక్కడి శాస్త్రం ప్రకారం  దేవప్రశ్నము వేసిన తర్వాత ఒక శుభ ముహూర్తాన  ‘ధనుః ప్రాకారానికి విచ్చేసి సంకల్ప సిద్ధి కొరకు ఇవన్నీ చెయ్యటం జరుగుతుంది. ఎవ్వరైనా పద్ధతిని అనుసరించాల్సిందే" అని నిర్మొహమాటంగా చెప్పాడు ఉద్ధారకుడు.
 
ఒక ముహూర్తం, ఒక దృఢమైన సంకల్పం, గ్రహబలం లేకుండా ఇక్కడ ప్రదక్షిణలు చెయ్యటానికి వీలు లేదు, అని కాస్త ఘాటుగానే చెప్పాడాయన.
 
దీంతో అభిజిత్ వైపు నిరసనగా చూసారు సంజయ్, అంకితలు. సిద్ధపురుషుడు తనకి అలవాటైన నవ్వునే ధరించాడు.
 
తన ప్రశ్నలతో ఉద్ధారకుడికి కోపం తెప్పించి తనేమైనా అనుచితంగా ప్రవర్తించానేమోనని అభిజిత్ దిగాలుగా మొహం పెట్టి నిట్టూర్చాడు.
 
సిద్ధపురుషుడు విషయాన్ని గ్రహించి, "అభిజిత్ అడగటం వల్లనే కదా ప్రాకారానికి ఎవరి అనుమతితో రావాలో తెలిసింది. మీరు ఘోర కలిని ఎదుర్కోవటానికి శంభల రాజ్యంలో  ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎన్ని శాస్త్రాలు పఠించినా భూలోకం కెళ్ళాక అవన్నీ మీకు గుర్తుండాలి అన్నా, శక్తులన్నీ మీకు సహకరించాలి అన్నా మనం శంభల నుండి బయలుదేరే ముందు ఖచ్చితంగా   ధనుః ప్రాకారానికే రావాలి. అభిజిత్ ప్రశ్న అడగటం మంచిదే అయ్యింది" అంటూ ముగించాడు సిద్ధపురుషుడు.
 
ఉద్ధారకుడి నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి ముందుకు కదిలారు. ఒక ప్రాకారానికీ మరొక ప్రాకారానికి మధ్యనున్న దూరం 3 యోజనాలైనా నడుస్తూ వెళ్తున్నప్పుడు అలసట లేదు. కాళ్ళ నొప్పి లేదు. దూరం, దగ్గర అన్న వ్యత్యాసమే తెలియటం లేదు. దారి పొడవునా ఉన్న  పాదుకాతీర్థం  మహిమో మరేంటో కానీ శంభల నగరంలో ఎంత సేపు నడిచినా, ఎంత దూరం నడిచినా నడుస్తున్నట్టే లేదు. ఏదో శక్తి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నట్టు ఉంది.
 
వాళ్ళు అక్కడి నుండి  సమరః ప్రాకారానికి బయలుదేరారు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#93
Super fantastic update  clps clps clps

Thanks for update sir
[+] 1 user Likes sri7869's post
Like Reply
#94
Nice update writer garu
[+] 1 user Likes 9652138080's post
Like Reply
#95
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#96
శంభల నగరం – 4
సమర విజయ రాముని సమరః ప్రాకారం

చేరుకోగానే అక్కడ వారికి ఒక యోధుడి మూర్తి కనిపించింది. ప్రతిమ  ధ్యానం  చేస్తున్న భంగిమలో పద్మాసనంలో ఉంది. చూడటానికి  ఉగ్రరూపంలో ఉన్న యోధుడిలా ఉంది. యోధుడి కళ్ళను చూస్తే కేవలం ధ్యానం చేస్తున్నట్టు మాత్రమే లేదు. ఏదో యుద్ధంలో నిర్విరామంగా శత్రువులతో పోరాడుతూ తన ఆగ్రహ జ్వాలలని కళ్ళ నిండా నింపుకున్నట్టు ఉంది. ఎందుకంటే అతను అర్ధనిమీలితనేత్రాలతో ఉన్నాడు. తీక్షణమైన చూపులను బట్టి అతను ఎవరినో అంతం చెయ్యటానికే దీక్ష పూనాడనిపిస్తోంది. ఎన్నో గాయాలతో రక్తసిక్తమై వున్న అతని దేహాన్ని చూస్తే చురకత్తులతో, బాణాలతో యోధుడిని దాడి చేసినట్టు అర్థం అవుతోంది. అయినా అది తనపై మాత్రం ప్రభావం చూపించలేదని అతని ధీరత్వం మనతో చెబుతున్నట్టు ఉంటుంది. అణువణువూ ధైర్యంతో, వీరత్వంతో, అమరత్వంతో నిండిపోయి మృత్యుదేవతకు ముచ్చెమటలు పట్టించే పోరాటపటిమ తన సొంతం అన్నట్టు ఉన్నాయి అతని చూపులు.
 
ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా వుంది. అక్కడున్న నిశ్శబ్దాన్ని చూస్తే ఇప్పటికీ యోధుని వీరత్వానికి అర్పిస్తున్న నివాళి అదేమో అనిపించేలా ఉంది. సమరః ప్రాకారం మొత్తం యోధుడిదే అనిపించేలా ఉంది నిశ్శబ్దం. అక్కడున్న ప్రతీ అంగుళానికి యోధుడి పరాక్రమం తెలుసేమో అనిపించే నిశ్శబ్దం.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లు యోధుడినే కన్నార్పకుండా చూస్తున్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు కొంచెం దూరంగా నిలబడి ఉన్నారు.
 
అంతలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. వృద్ధుడిని చూడగానే సైనికులిద్దరూ ప్రణామం చేశారు. సిద్ధపురుషుడు కూడా నమస్కరించాడు.
 
వృద్ధుడు ఎప్పటిలానే యథావిధిగా తన ఆసనం చూసుకుని అక్కడే స్థిరపడి యోధుడి ప్రతిమను చూస్తూ ఏదో మంత్రం జపిస్తూ వున్నాడు. ఇంతలో ఏదో జ్ఞప్తికి వచ్చినట్టు అనిపించి
 
సమరవిజయ రామా 
సమరవిజయ రామా
సమరవిజయ రామా 
అంటూ తన్మయత్వంతో  తన కళ్ళ ముందే యుద్ధరంగం కనిపించినట్టు అనిపించి యోధుని ప్రతిమ దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి అక్కడున్న పూలను మూర్తీభవించిన వీరత్వానికి ప్రతీకగా సమర్పించి అక్కడున్న గంధపు జలంతో యోధుని పాదాలను పరిశుద్ధి చేసాడు వృద్ధుడు.
తిరిగి తన ఆసనం దగ్గరికి వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అభిజిత్, అంకిత, సంజయ్ లను ఇటు రమ్మని సైగ చేసాడు. సిద్ధపురుషుని వైపు భక్తి భావంతో చూస్తూ ఆహ్వానించాడు. అక్కడున్న ఇద్దరు సైనికులకు విషయం అర్థం అయిపోయి ప్రాంగణం నుండి బయటికి వెళ్లిపోయారు.
 
వృద్ధుడు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు.
 
"నా పేరు  మహిభార్గవుడు. శంభల నగరంలో మీకు కనిపించే భూలోకవాసిని నేను. ఇక్కడ మీరు చూస్తున్న యోధుడిని గాయాలతో రక్తసిక్తమై వున్న స్థితిలో పార్థివ శరీరంగా వున్న తనని భూలోకం నుండి ఇక్కడకు  తీసుకునివచ్చే మహాభాగ్యాన్ని పొందాను. శంభలకు వచ్చి నేనూ అమరుణ్ణి ఐపోయాను. నాకు ఆనాడు కురుక్షేత్ర సంగ్రామంలో అవకాశాన్ని ఇచ్చిన దేవదేవుడు శ్రీకృష్ణుడే", అన్నాడు వృద్ధుడు.
 
"స్వామీ యోధుడి వీరగాథను సవివరంగా మాకు చెప్తారా?" అని అడిగాడు సంజయ్.
 
"అది చెప్పటానికే మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాను.
మీరు చూస్తున్న యోధుడి విగ్రహం సామాన్యమైనది కాదు. అది లోహంతో నిర్మితమైందో ఇప్పటిదాకా శంభలలో ఎవ్వరికీ తెలీదు
 
దేవశిల్పి విశ్వకర్మ ప్రత్యేకంగా 3 మాసములు కేటాయించి యోధుని మూర్తిని సృజించాడు. మూర్తీభవించిన వీరత్వానికి ప్రాణప్రతిష్ట చేసాడు మాహానుభావుడు.
 
మీకిప్పుడు యోధుడి గురించి చెబుతాను. జాగ్రత్తగా వినండి", అంటూ ఇలా యోధుని వీరగాథను చెప్పసాగాడు మహిభార్గవుడు.
 
సమరవిజయ రాముడు శంభల నగరంలోని ప్రాకారంలోనే పెరిగాడు. అతని తల్లి రామ భక్తురాలు. యోధుడి సమరవిజయ రామ అన్న నామధేయం వెనుక ఉన్న బలమైన శక్తికి మూలం ఆవిడ మాతృ ప్రేమ, భక్తి.
 
సమరవిజయుడు కూడా తన తల్లిలానే రామభక్తుడు. అతి చిన్న వయసులోనే యుద్ధవిద్యలన్నీ నేర్చుకుని ఆరితేరిన వాడు. తనకు రాముని దర్శన భాగ్యం కావాలని పరితపించిపోయేవాడు. రామనామం జపిస్తూ ఎంతో కఠినమైన తపస్సును ఆచరించాడు. ఆహారం, నిద్ర ఏవీ  లేకుండా కొన్ని నెలలు గడిపాడు. అయినా రాముడు కరుణించలేదు. అప్పుడు ఒక యోగి సమరవిజయుని చెంతకు వచ్చి శివుణ్ణి తపస్సు చెయ్యమని కోరాడు.
 
శివుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ తపం ఆచరించాడు.
ఒక రోజు శివుడు ప్రత్యక్షం అయ్యి సమరవిజయుణ్ణి ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు సమరవిజయుడు తనకు రాముని దర్శన భాగ్యం కలగాలనీ, అలాగే తన యుద్ధవిద్యా నైపుణ్యం వ్యర్థం అవ్వకుండా అదంతా రాముడికే ఉపయుక్తం అవ్వాలనీ, యుద్ధంలోనే అమరుడై శంభల చరిత్రలో తాను యోధుడిగానే మిగిలిపోవాలనీ కోరాడు.
 
రామదర్శనం తప్పక దొరుకుతుందని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. రోజు నుండి రామదర్శనం కోసమే ఎదురు చూస్తూ ఎన్నో ఏళ్ళు గడిపాడు సమరవిజయ రాముడు. అన్ని ఏళ్లలో అతను నాడూ రామనామ జపాన్ని వదిలిపెట్టలేదు.
 
కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు శ్రీ కృష్ణుడు శంభల నగరానికి విచ్చేశాడు. సమరవిజయ రాముణ్ణి కలవటం కోసమే ఆయన ఇంత దూరం వచ్చాడు.
 
శ్రీకృష్ణుడిని చూడగానే సమరవిజయ రాముడు కంటతడి పెట్టుకున్నాడు. రాముడి దర్శనం తను కోరుకుంటే శ్రీ కృష్ణుని రూపంలో తన జన్మ తరింపజెయ్యటానికి వచ్చినందుకు భావోద్వేగానికి లోనయ్యాడు సమరవిజయుడు.
 
"మా అమ్మ తన జన్మను మీకే ధారబోసింది స్వామీ. మీ నామస్మరణే నా అంతిమ లక్ష్యంగా నన్ను పెంచింది. ఇన్నాళ్టికి నన్ను కరుణించారా స్వామీ", అంటూ శ్రీ కృష్ణుని పాదారవిందములకు శిరస్సువంచి నమస్కరించాడు సమరవిజయుడు.
 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#97
"నీ అంతిమ లక్ష్యం నేను కాదు సమరవిజయా. ఇన్నాళ్లూ నీ చేత నా నామ స్మరణ చేయించింది నీలోని యోధుడికి పెట్టిన పరీక్ష. నీలోని భక్తుడికి ఎలాంటి పరీక్షా లేదు. మీ అమ్మ గారి ద్వారా నీకు సంక్రమించిన ఆస్తి విష్ణు పథము. అసలైన పరీక్షలో నువ్వు ఇప్పుడు నెగ్గావు కాబట్టే నిన్ను వెతుక్కుంటూ భూలోకం నుండి నేను వచ్చాను.
 
కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల సైన్యాన్ని ఎదుర్కోవటం అంత సులభమైన పని కాదు. అందుకు నాకొక యోధుడు కావాలి. శివుణ్ణి నువ్వు కోరుకున్న మూడు కోరికల్లో మొదటిది నా దర్శనంతో ఈనాడు తీరిపోయింది. మిగిలిన రెండు కోరికలూ తీరే అవకాశం నీకిప్పుడు దొరికింది. నిన్ను కురుక్షేత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టమని ఆదేశించను. నా భక్తుడవు నీవు. నేను నిన్ను అర్థిస్తున్నాను. నీకు సమ్మతం అయితేనే రా. లేనిచో ఆనందంగా తిరిగి వచ్చిన దారినే నే వెళ్లెదను", అన్నాడు శ్రీ కృష్ణుడు.
 
"స్వామీ, మీరు సమరవిజయుణ్ణి అర్థించటం ఏంటి? మీ కోసం యుద్ధంలో నా ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడిన వాణ్ణి. నన్ను ఆజ్ఞాపించండి", అన్నాడు సమరవిజయుడు.
 
అలా కురుక్షేత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టాడు సమరవిజయుడు. శంభల నుండి భూలోకంలోకి వచ్చిన సమరవిజయుడు ఒక్క యోధుడిగా కాక 100 మంది యోధులలా రూపాంతరం చెందాడు. సమరవిజయునికి ఉన్న శక్తికి 1000 మందిని ఒకేసారి ఎదుర్కోగలడు.
 
సమరవిజయుణ్ణి ఒకే యోధుడిగా రంగంలోకి తెస్తే దుర్యోధనుడికి అనుమానం వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నది. అందుకే శ్రీ కృష్ణుడు తెలివిగా సమరవిజయుని నుండి 100 మంది వేర్వేరు యోధులను సృష్టించాడు. సమరవిజయుని యుద్ధశక్తిని 100 భాగాలుగా విభజించి 100 మందినీ సృజించాడు. 100 మందికీ వేర్వేరు ముఖాలు, వేర్వేరు యుద్ధ నైపుణ్యాలు ఉన్నా వారిలో ఉండే ఆత్మచైతన్యం ఒక్కటే. అదే  సమరవిజయ రామ.
 
కదనరంగంలో 100 మంది 1000 మందితో  సమానం.
అనగా ఒకే ఒక్కడైన సమరవిజయ రాముడే వెయ్యి మంది వున్న   సైన్యాన్ని చీల్చి  చెండాడగలడని  దానర్థం.
 
రోజు కురుక్షేత్రంలో సమరవిజయుడు చూపించిన తెగువకి ఎవ్వరికీ నోట మాట రాలేదు. 1000 మందిని మట్టి కరిపించటం అంటే మాటలా!
 
రోజున 1000 మంది కౌరవ సైన్యానికీ యుద్ధభూమిలో  వారి ఎదుటనున్న 100 మంది యోధులలోనూ సమరవిజయుడొక్కడే కనిపించటంతో  మాయకు గురయ్యారు. వాళ్లకేం తెలుసు ఒక్కడిలోనే 100 మంది ఉన్నారని.... వంద మంది ఒక్కడి నుంచే వచ్చారని.
 
శంభల నగరంలోని అతి పెద్ద రహస్యం ఇది. ఎవరికైనా చెప్పినా నమ్మశక్యం కాని వీరత్వం సమరవిజయ రాముడిది. అలాంటి యోధుడు మరొకడు పుట్టడు. ధీరత్వాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కళ్లారా చూసిన నేనే నా కళ్ళను నమ్మలేకపోయా. నేను అంతవరకు ఇలాంటి ధీరుని గురించి ఇలలో వినలేదు. కలలో కనలేదు. అందుకే సమరవిజయున్నే చూస్తూ ఉండిపోయా. రోజు సంగ్రామం పరిసమాప్తి అయినది. 1000 మందినీ మట్టికరిపించాడు. వారి సైన్యం అలా వారి కళ్ళముందే కుప్పకూలిపోవటం తట్టుకోలేక కౌరవులు యుద్ధభూమి నుండి నిష్క్రమించారు. 1000 మంది వున్న కౌరవుల సైన్యాన్ని హతమార్చిన తర్వాత 100 మంది యోధులు తమ ఉనికిని కోల్పోతూ వచ్చారు. యుద్ధభూమి యందు 100 మందికి బదులుగా ఇప్పుడు ఒక్కడే మిగిలాడు. అతనే ఇప్పుడు మీరిక్కడ ప్రతిమలో చూస్తున్న   సమరవిజయ రాముడు. మీరిక్కడ చూస్తున్నట్టే నాకు నాడు యుద్ధభూమిలో కనిపించాడు. తన ముఖం నిండా గాయాలతో, కత్తులు, బాణాలతో రక్తసిక్తమై కనిపించిన వీరాధి వీరుడు. నా హృదయం ద్రవించిపోయింది. ఆయన పాదాల మీద పడ్డాను. నీ లాంటి యోధుడిని  నేనెక్కడా  చూడలేదని చెప్పాను. ఉద్వేగానికి గురయ్యాను. అంతలో అక్కడికి శ్రీ కృష్ణుడు విచ్చేశాడు. శంభల నగరానికి సమరవిజయుణ్ణి తీసుకుని వెళ్లే అదృష్టాన్ని నాకిచ్చాడు. అక్కడి వారికి సమరుని వీరత్వాన్ని చాటి చెబుతూ 
సమరః ప్రాకారాన్ని నిర్మించే ప్రతిపాదనను శంభల రాజు ముందు పెట్టాను. అలా నాడు సమరవిజయుడు తన బాల్యం నుండి ఎదుగుతూ వచ్చిన చోటే 
సమరః ప్రాకారంగా మారిపోయింది. ఎంతో ఖ్యాతిని గడించింది", అంటూ చెప్పటం ముగించాడు మహిభార్గవుడు.
 
జీవితంలో అలాంటి యోధుడి గురించి ఎప్పుడూ వినని అభిజిత్, అంకిత, సంజయ్ లకు కళ్ళనిండా నీరు నిండిపోయింది. ఉద్వేగంతో. ఇంకేం మాట్లాడాలో తెలియని స్థితి అది.
 
ధైర్యానికీ, వీరత్వానికీ, యుద్ధనైపుణ్యానికీ పరాకాష్ఠ రోజు కురుక్షేత్ర మహాసంగ్రామంలో  సమరవిజయ రాముడు సృష్టించిన చరిత్ర. అలాంటి అరుదైన రహస్యాన్ని మహిభార్గవుడి ద్వారా తెలుసుకోవటం పూర్వజన్మ సుకృతమే అని వాళ్లకు అనిపించింది.
 
సిద్ధపురుషుడితో కాసేపు ముచ్చటించాడు మహిభార్గవుడు.
తర్వాత అక్కడినుండి సెలవు తీసుకున్నారు సిద్ధపురుషుడు, అభిజిత్, అంకిత, సంజయ్ లు.
 
ప్రాంగణం బయటే ఉన్న సైనికుల దగ్గరికొచ్చి సిద్ధపురుషుడు ఇలా అడిగాడు.
 
"తరువాతి ప్రాకారం ఏది?"
 
" సూర్యః ప్రాకారం. అతి ముఖ్యమైనది ఇదే. శంభల నగరంలోని   సూర్యః ప్రాకారానికి సూర్యుణ్ణి అమితంగా ఆరాధించే దేవతలు కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి బ్రహ్మ ముహూర్తాన విచ్చేసి పూజలు నిర్వహించి వెళ్తూ ఉంటారు", అని చెప్పాడు వాళ్లలో ఒక సైనికుడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#98
(24-01-2024, 06:11 PM)k3vv3 Wrote: శంభల రాజ్యానికి పయనం – 4
మైనాకుని సహాయంతో సముద్ర లంఘనము....శంభల నగరానికి ఆగమనం
 
ఓం అంజనీ సుతాయ విద్మహే,
 
వాయుపుత్రాయ ధీమహి
 
తన్నో మారుతిః ప్రచోదయాత్ ||
 
సిద్ధపురుషుడు 
శ్రీ రామ రామ రామేతి
మంత్రాన్ని పఠించాడు. అభిజిత్, అంకితలు కూడా అదే మంత్రాన్ని పఠించారు.
 
సిద్ధపురుషుడు, అభిజిత్, అంకితలు ముగ్గురూ రామ నామ జపంలో ఉన్నారు. సంజయ్ హనుమద్గాయత్రి చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. అలా ఎంతసేపు గడిచిందో తెల
K3VV3 garu!!! Nice update.
clps yourock
Like Reply
#99
(24-01-2024, 06:12 PM)k3vv3 Wrote:  

ప్రవేశ ద్వారం వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాడా సిద్ధపురుషుడు.

Nice update, K3VV3 garu!!!.
Like Reply
(09-03-2024, 01:23 PM)k3vv3 Wrote:  
" సూర్యః ప్రాకారం. అతి ముఖ్యమైనది ఇదే. శంభల నగరంలోని   సూర్యః ప్రాకారానికి సూర్యుణ్ణి అమితంగా ఆరాధించే దేవతలు కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి బ్రహ్మ ముహూర్తాన విచ్చేసి పూజలు నిర్వహించి వెళ్తూ ఉంటారు", అని చెప్పాడు వాళ్లలో ఒక సైనికుడు.

k3VV3 garu!!! Very well written update!!!

clps clps clps
Like Reply




Users browsing this thread: 1 Guest(s)