Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
update Pls...
Like Reply
మిత్రమా

ఇక్కడ అప్డేట్లు 15-20 రోజులకొకసారి, చదువరులు తక్కువ గనుక

గమనించగలరు.

ఐనా ఇది అప్డేట్ ఇచ్చి రెండు రోజులేగా అయ్దింది!
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
మిత్రమా

ఇక్కడ అప్డేట్లు 15-20 రోజులకొకసారి, చదువరులు తక్కువ గనుక

గమనించగలరు.

ఐనా ఇది అప్డేట్ ఇచ్చి రెండు రోజులేగా అయ్దింది!
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
శంభల రాజ్యం – 7
తురగ ప్రాకార చరిత్ర
 
తురగ ప్రాకారం చరిత్ర అంకిత, సంజయ్ కళ్ళ ఎదుటే ప్రారంభమయ్యింది.
 
శంభల రాజ్యంలో ప్రాకారం ఏర్పడక మునుపు 108 పర్వత శ్రేణులుండేవి. పర్వత శ్రేణులు ఒక్కొక్కటీ ఒక్కో శక్తి రూపానికి ప్రతీకగా శంభలలో చూసేవారు. ప్రతీ పర్వతమునందు ఒక చిద్గుహ ఉండేది. చిత్ అంటే తెలివి. చిదానందం అంటే జ్ఞానంలోనే ఆనందాన్ని పొందేవాడు అని అర్థం. చిద్గుహ అనగా జ్ఞానాన్ని ఇచ్చే క్షేత్రం లాంటిదన్నమాట. అంతవరకు శంభలలో 108 చిద్గుహలనూ సందర్శించినవారెవ్వరూ లేరు. అలా వెళ్ళటం కూడా శంభల రాజ్య నిబంధనలకు విరుద్ధం. ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే శంభల రాజు అంగీకారంతో చిద్గుహలలో అడుగు పెట్టవచ్చు. అలాంటి సందర్భం రావటం కోసమే ఎదురుచూసేవాడు  జజీరా
 
జజీరా విక్రమసింహుడికి ప్రతీ విషయంలో సమవుజ్జీని అనుకుంటూ ఉండేవాడు.
 
శంభల రాజ్యంలోని యోధులలో  జజీరాది ఒక విలక్షణమైన ఘట్టం. శంభల రాజ్యంలోనే పుట్టిన యోధుడు విక్రమసింహుడైతే ఐదు జన్మల తరువాత ఒక ద్వీపంలో పుట్టిన యోధుడు  జజీరా. ద్వీపం పేరు శాంకరి. భూమిపై ఉన్న ద్వీపాన్ని జజీరా అని బాహ్య ప్రపంచంలో  పిలుస్తారు. ద్వీపంపై ఎంతో మంది మనుషులు జన్మించినా ఎవ్వరికీ మాటలు రాలేదు. మామూలు మనుషులలానే అన్ని పనులూ  చేస్తారు కానీ వారి కుటుంబాలలో జన్మించిన వారికి మాట్లాడే యోగాన్ని మాత్రం దేవుడు ఇవ్వలేదు. అలాంటి సమయంలో పుట్టినవాడే   జజీరా. అతను జన్మించిన తరువాత అతనికి పేరు పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేకపోవటంతో యవ్వన దశ వరకూ పేరూ లేకుండానే ద్వీపంలో బతికాడు అతనుఇతని వల్లే ద్వీపం ఒకటుంది అన్న విషయం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఒక అరబ్ ప్రయాణికుడు ద్వీపాన్ని కనుగొని  జజీరా అనటంతో  జజీరా నామధేయంగా స్థిరపడిపోయింది ఇతనికి. ద్వీపానికున్న శాంకరి అను పేరు పోయి ఇతగాడి వల్లే  జజీరా అన్న కొత్త పేరొచ్చింది. ప్రపంచానికి ద్వీపం  జజీరా గా ప్రసిద్ధికెక్కితే శాంకరిలోని వారికి మాత్రం ఇతడే  జజీరా అయ్యాడు. శాంకరి ద్వీపంలో నివసించే   జజీరా అమ్మ కోరిక మేరకు తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించి శంభల రాజ్యానికి యోధుడిగా వచ్చేసాడు
 
జజీరా అలా శంభలకు యోధుడిగా వెళ్ళటం వలన శాంకరి ద్వీపంలోని తరువాతి తరం వాళ్లందరికీ మాటలొచ్చేస్తాయి. అలా వారికి శాప విమోచనం కలుగుతుంది. తరువాతి రోజుల్లో ప్రపంచానికి ద్వీపం పేరు శాంకరిగా వెలుగులోకొస్తుంది. జజీరా అన్న పేరు స్మృతిపథంలో నుండి కనుమరుగైపోతుంది.
 
శంభల రాజ్యంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి జజీరా దృష్టి మొత్తం విక్రమసింహుడి పైనే. ఎందుకంటే శంభల రాజ్యంలో విక్రమసింహుడి గురించే ప్రతీ ఒక్కరూ మాట్లాడుకునేవారు.
 
విక్రమసింహుడికి అమ్మపైనున్న అమితమైన ప్రేమ, భక్తి గురించి చెప్పుకునేవాళ్ళు. విక్రమసింహుడితో ఏకాంతంగా గడపటానికి శంభల అందగత్తెలు అందరూ వెన్నెల ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారు. విక్రమసింహుడి శౌర్యం కంటికి ఇంపుగా కనబడే వారి సొంపుగల సోయగాలని చూస్తూ జజీరా ఈర్ష్యపడేవాడు. విక్రమసింహుడికి తను ఎందులోనూ తక్కువ కాదన్న స్వాభిమానం తనని కుదురుగా ఉండనిచ్చేది కాదు. అలాంటి జజీరా వేసిన ఒక ఎత్తుగడ విక్రమసింహుడి జీవితాన్నే శాశ్వతంగా మార్చేసింది. తనకిష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది.
 
ఇదంతా చూస్తూ విస్తుపోతున్న అంకిత, సంజయ్ లను రుద్రసముద్భవ ఒక ప్రశ్న వేసాడు.
 
"జజీరా ఎవరో తెలుసా?" అని అడిగాడు. ఎవరు ? అన్నట్టు సంశయంతో చూసారు వాళ్లిద్దరూ.
 
"ఇప్పుడు మీ భూలోకాన్ని వణికిస్తున్నాడే ఘోర కలి. వాడే. ఘోర కలిది ఇప్పుడు ఏడో జన్మ. వాడి అసలు రూపమే జజీరా", అన్నాడు ఆగ్రహజ్వాలలతో నిండిన కళ్ళతో చూస్తోన్న రుద్రసముద్భవ.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
Good update
[+] 1 user Likes sri7869's post
Like Reply
(26-11-2024, 01:07 PM)k3vv3 Wrote: శంభల రాజ్యం – 7
తురగ ప్రాకార చరిత్ర
 

"ఇప్పుడు మీ భూలోకాన్ని వణికిస్తున్నాడే ఘోర కలి. వాడే. ఘోర కలిది ఇప్పుడు ఏడో జన్మ. వాడి అసలు రూపమే జజీరా", అన్నాడు ఆగ్రహజ్వాలలతో నిండిన కళ్ళతో చూస్తోన్న రుద్రసముద్భవ.

K3vv3 garu,  Very interesting!!!

yourock yourock clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
శంభల రాజ్యం – 8
సింహ దత్తుడి వృత్తాంతము
 
"విక్రమసింహుడి గురించి తెలుసుకోవాలనే తపన జజీరాలో రోజురోజుకీ పెరుగుతూ పోయింది. విక్రమసింహుడి పుట్టు పూర్వోత్తరాల గురించి విచారించే దాకా వెళ్ళిందది.
 
విక్రమసింహుడి పుట్టుక గురించి శంభలలో తెలిసింది ఇద్దరికే. ఒకటి నాకు. రెండు శంభల రాజుకు. జజీరాకు తానొక గొప్ప యోధుడిని అని ప్రపంచానికి తెలిసేలా చెయ్యాలనే తహతహ ఎక్కువ అవుతున్న రోజులవి. అందుకు కారణాలు లేకపోలేదు.
 
శంభలలో జరిగే ఎన్నో పోటీలలో జజీరా ఎప్పటికప్పుడు గెలుస్తూ వచ్చేవాడు. పోటీలలో విక్రమసింహుడి జాడ కూడా కనబడేది కాదు. ఎవరైనా విక్రమసింహుడి ప్రస్తావన తెస్తే మాత్రం జజీరా తట్టుకోలేకపోయేవాడు. విక్రమసింహుడి పరాక్రమం ఏంటో శంభల చూసింది. జజీరా ఇంకా చూడలేదు.
 
ఎంత గొప్ప యోధుడికైనా సరే అవతల ఉన్న వాడి సామర్థ్యం పైన చిన్న చూపు ఉండకూడదు. తానే గొప్ప అనే అహం భావం తగదు. ఒక్కసారి అహం ఆక్రమిస్తే మన చేత ఎంతటి పనినైనా చేయిస్తుంది. సరిగ్గా జజీరా విషయంలో జరిగింది ఇదే", అంటూ చెప్పటం ముగించాడు రుద్ర సముద్భవ.
 
అప్పుడే అక్కడొక విచిత్రం జరిగింది. అనిలుడి పై స్వారీ చేస్తూ వస్తోన్న విక్రమసింహుడు అంకిత, సంజయ్ కంటికి వేరే రూపంలో కనిపించాడు. అనిలుడు కూడా వృద్ధ అశ్వంలా మారిపోయాడు. అసలక్కడ ఏం జరుగుతోందో అంతుబట్టడం లేదు వాళ్లకు. కానీ కళ్ళ ముందే ఏదో చరిత్ర ఆవిష్కృతం అవుతోందని అర్థం అయ్యింది.
 
"అతనే సింహదత్తుడు. విక్రమసింహుడి తండ్రి", అన్నాడు రుద్రసముద్భవ.
 
"శంభలలోని ప్రాకారానికి విచ్చేసిన సింహళ ద్వీప రాజు. సింహళ అనగానే భూలోకంలోని రావణాసురుని లంక అనుకుని పొరబడతారేమో. అది కాదు. ఇందిరా పరిధి అనే గ్రహవాసి. మనది సౌర కుటుంబం. అలాంటి మరొక సౌర కుటుంబంలోని మరొక గ్రహం అది. మానవుల కంటే ఎన్నో వేల రెట్లు శక్తివంతులైన వారు నివసించే గ్రహం అది. అక్కడి నుండి శంభలకు ఎలా వచ్చాడో తెలీదు కానీ ఒక వృద్ధ అశ్వంపై మొట్టమొదటి సారి ప్రత్యక్షం అయ్యాడు. అశ్వం పైనే వచ్చాడేమోనని మా ఊహ. అశ్వాన్ని చూసిన అదృష్టవంతులలో నేనొకడ్ని. ఇప్పుడు మీరు చూస్తున్న అనిలుడ్ని శంభలకు బహుమతిగా ఇచ్చేసి తన దారిన తాను వెళ్లిపోయిన ధీశాలి సమర. అలాంటి సమర సింహ దత్తుడిని విడిచి వెళుతూ వెళుతూ కంట తడి పెట్టింది. అనిలుడ్ని ఇచ్చేటప్పుడు కూడా నవ్వుతూ ఉన్న సమర తన స్వామి సింహ దత్తుడిని విడిచిపెడుతున్నందుకు బాధపడింది.
 
సింహ దత్తుడి రాకతో శంభలకు పరాక్రమం పరిచయం అయింది. అంతవరకూ తెలియని యుద్ధ విద్యా మెళకువలెన్నో నేర్పాడు సింహ దత్తుడు. అతనిలో ఎన్నడూ లేశమాత్రమైన గర్వాన్ని నేను చూడలేదు. సింహ దత్తుడిని శంభలలోని విజయకుమారి అనే రాజపుత్రిక ఇష్టపడింది. విజయకుమారి శంభల రాజపుత్రిక. ఆమెకు వివాహం విధి లిఖితం కాదు. అందుకని శంభలలో అంజనము వేసి చూసారు. అప్పుడు అందులో అశ్వం పై వస్తున్న ఒక యోధుడి ఆకారంలో ఉన్న జ్వాల శంభల రాజులకూ, నాకూ రోజు కనిపించింది. సింహ దత్తుడి రాకను సూచిస్తూ మరెన్నో విషయాలు తెలిసాయి. సింహ దత్తుడి రాకతో విజయకుమారి జాతకం మారిపోయిందని జ్యోతిష్య శాస్త్రం తెలిసిన పండితుడు చెప్పాడు. అందుకే అందరి అంగీకారంతో సింహ దత్తుడితో విజయకుమారి వివాహం లాంఛనంగా జరిగింది.”
 
సింహ దత్తుడిలా కనిపిస్తోన్న విక్రమసింహుడిని, సమరలా అనిపిస్తోన్న అనిలుడిని చూస్తూ ఇదంతా వింటున్న అంకిత, సంజయ్ లకు ఇదంతా ఎలా సాధ్యం అన్న ప్రశ్న ఉదయించింది.
 
"మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే చేరాలి కదా. విక్రమసింహుడి పరాక్రమం నేర్చుకుంటే అబ్బిన విద్య కాదు. సింహ దత్తుడు పంచి ఇచ్చిన రక్తం. అనిలుడి స్వామి భక్తి అతని గొప్పతనం కాదు సమర నుండి వస్తోన్న పరంపర.
 
అందుకే వాళ్ళల్లో వీళ్ళు కనిపిస్తారు. అవి పోలికలు కావు. వారి బలమైన జీవితపు ముద్రలు", అంటూ
"ఎన్ని జన్మలెత్తినా పేరు, రూపం మారతాయేమో కానీ పరాక్రమం ఎక్కడికి పోతుంది?
విక్రమసింహుడు అన్నా...అభిజిత్ అన్నా అది సింహ దత్తుడి రక్తమే. సింహ దత్తుడి సంకల్పమే", అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు రుద్రసముద్భవ.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
భ్రో మీరు రాసిన కథ చదువుతుంటే ఏదో తెలియని ఆశక్తి కలుగుతుంది
మీరు ఎప్పుడూ అప్డేట్ ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను

మీ కథకు ప్యాన్
Like Reply
ధన్యవాదములు మిత్రమా మీ ఆసక్తికి.

మీరు చదివిన తరువాత ఓ లైకు లేదా రేటింగ్ ఇవ్వగలరు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
ధన్యవాదములు మిత్రమా మీ ఆసక్తికి.

మీరు చదివిన తరువాత ఓ లైకు లేదా రేటింగ్ ఇవ్వగలరు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
(09-12-2024, 10:10 PM)k3vv3 Wrote: ధన్యవాదములు మిత్రమా మీ ఆసక్తికి.

మీరు చదివిన తరువాత ఓ లైకు లేదా రేటింగ్ ఇవ్వగలరు.

banana banana clps fight horseride devil2
[+] 1 user Likes Ajayk's post
Like Reply
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
(09-12-2024, 02:27 PM)k3vv3 Wrote: శంభల రాజ్యం – 8
సింహ దత్తుడి వృత్తాంతము

విక్రమసింహుడు అన్నా...అభిజిత్ అన్నా అది సింహ దత్తుడి రక్తమే. సింహ దత్తుడి సంకల్పమే", అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు రుద్రసముద్భవ.

Very good story andi, K3vv3 garu!!!

yourock yourock clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
రెండు పరస్పర విరుద్ధ శక్తుల మధ్య జరిగే నిరంతర ఘర్షణ...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
Bro what happened please update
[+] 1 user Likes Ajayk's post
Like Reply
శంభల రాజ్యం – 9
జ్వాలా జిహ్వుడు - భైరవిల పూర్వజన్మ కథ
 
"సింహదత్తుడు శంభల రాజ్యంలోనే ఉన్నాడా స్వామి?" అడిగింది అంకిత విక్రమసింహుడిలో సింహదత్తుడిని చూసి ఆశ్చర్యపోతూ.
 
"సింహదత్తుడు విజయకుమారిని వివాహం చేసుకున్న తర్వాత శంభలకే పరిమితం అయిపోయాడు. విక్రమసింహుడు పుట్టిన కొద్ది కాలానికి సింహదత్తుడు తనకున్న శక్తులన్నీ విక్రమసింహుడికి ధారబోసి తన దేహం విడిచివెళ్లిపోయాడు", అనేసి అంతకంటే ఇక చెప్పటం ఇష్టం లేదేమో అన్నట్టు ఆగిపోయాడు రుద్రసముద్భవ.
 
"ఏమైంది స్వామి?" అడిగాడు సంజయ్.
 
"సింహదత్తుడిది మామూలు మరణం కాదు. పోరాడుతూ వీరమరణం పొందాడు", అన్నాడు బాధగా రుద్రసముద్భవ.
వీరగాథను చెప్పాలనిపించి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు రుద్రసముద్భవ.
 
జ్వాలా జిహ్వుడు అనే ఒక ప్రమాదకరమైన వ్యాళి శంభలలోని అనల ప్రాకారంలో ఉండేవాడు.
భైరవి అనే ఒక భయంకరమైన గరుడపక్షి మేఖల అనే ప్రాకారంలో ఉండేది.
 
జ్వాలా జిహ్వుడు, భైరవి ఇద్దరికీ పరస్పర వైరం ఉంది. అది ఈనాటిది కాదు.
 
జ్వాలా జిహ్వుడు పూర్వ జన్మలో ఒక యువరాజు. భైరవి గతజన్మలో అదే రాజ్యంలో ఒక సేవకుని ఇంట్లోని అమ్మాయి. యువరాజు ఒకనాడు వేటకు తన రాజ్యం నుండి కొన్ని యోజనాల దూరంలో ఉన్న ఝర్ఝరీ అనే అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో వేటకు వచ్చిన ఎవ్వరైనా సరే ఝర్ఝరీ శబ్దానికి భయభ్రాంతులకు లోనయ్యి దృష్టి నిలపలేక వేటను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఇది తెలిసే అక్కడికి వచ్చాడు యువరాజు. వేటకు వెళ్లే ముందు అక్కడున్న సింధు నదీ తీరంలో మంచి నీరు తాగటానికి తన గుర్రం పై నుండి కిందకు దిగాడు. మంచినీరు తాగుతున్నప్పుడే నీటిలో ఒక అందమైన యువతి ప్రతిబింబం కనిపించింది. యువరాజు అందాన్ని చూస్తూ మైమరచిపోయి అక్కడే నిలబడి ఉన్నది యువతి. మంచినీరు తాగటం అయిపోయాక తల పైకెత్తి యువతినే చూస్తూ ఉన్నాడు యువరాజు. ఇద్దరూ అలా కాసేపు ఒకరిని ఒకరు చూసుకున్నారు.
 
యువతి మొట్టమొదట ఎవరినైతే చూస్తుందో అతను ఆమె మోహానికి వశం ఐపోతాడని తన జాతకంలో ఉన్నది. మోహాగ్నిలో రగిలిపోతూ ఎన్నో తప్పులు చేస్తూ విచిత్రమైన జంతు జన్మను పొందుతాడని కూడా జ్యోతిష్యుడు హెచ్చరించాడు. అతను అలా జంతు జన్మను పొందిన వెంటనే యువతి కూడా పక్షిగా మారిపోతుందని సూచించాడు. అందుకే రోజు నుండి యువతిని ఎవ్వరి కంట పడకుండా కాపాడుకుంటూ ఒక ఇంట్లోనే నిర్బంధించి ఉంచారు. కానీ అన్ని రోజులూ ఒకలా ఉండవు కదా. సరిగ్గా యువరాజు వేటకు బయలుదేరిన రోజే యువతి సింధు నదీ తీరం దాకా వెళ్ళొస్తానని వాళ్ళ నాన్న గారిని అడగటం, యువరాజును చూడటం సంభవించాయి.
 
యువరాజు రోజు రాత్రి యువతి ఇంట బస చేసాడు. అదొక సేవకుని ఇల్లు అనుకున్నాడు. కానీ ఇంట్లో కొన్ని గదులు మూసివెయ్యబడి ఉన్నాయి. యువతి నాన్నకు విషయం మొత్తం అర్థం అయిపోయింది. ఇప్పుడు యువరాజుకు నిజం చెప్పటం ఒక్కటే మార్గం అనుకున్నాడు. భోజనానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాడు. అంతలో యువరాజు ఒక గదిలోకి వెళ్ళాడు. అక్కడున్న వాద్యములని చూసాక అవి ఎలాంటి శబ్దాలు చేస్తాయన్న కుతూహలం పెరిగి ఒక చెయ్యి వేసాడు. విచిత్రంగా తాను రాజ్యంలో చిన్నప్పటి నుండి కథలు కథలుగా వింటూ వచ్చిన ఝర్ఝరీ శబ్దం ప్రతిధ్వనించింది. తన పూర్వీకులు ఎందరో ఝర్ఝరీ శబ్దం విని హడలిపోయి ప్రాణాలు వదిలారు. వారు ఏదో భయంకరమైన ప్రాణిని అక్కడ చూసారని చెప్పేవారు. అది అంతవరకూ చూడనిది, విననిది అంటూ భయం గొలిపే కథలు చెబుతూ వచ్చారు ఇన్నిరోజులూ. శబ్దాలు ఇక్కడి నుంచే వస్తున్నాయని తన పూర్వీకులు తెలుసుకోలేకపోయారని అమితంగా బాధపడి కంటతడి పెట్టాడా యువరాజు. తన తాతగారిని, నాన్నగారిని ఎందుకు కోల్పోయాడో ఇప్పుడర్థం అయింది. వెంటనే కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ అక్కడ సమయంలో మాట్లాడటం భావ్యం కాదని మౌనం వహించాడు. రోజు రాత్రి యువతితో రతిలో పాల్గొన్నాడు. ప్రేమతో కాదు. రకమైన ప్రతీకార వాంఛలతో. ప్రతీకార జ్వాలలు యువతిని తాకాయి. తెల్లవారగానే యువరాజు మాయమైపోయాడు. యువతి నాన్నకు ఆందోళన మొదలైంది.
 
యువరాజు తన రాజ్యంలో కొంత మంది సైనికులను ఆజ్ఞాపించి గ్రామానికి పంపించి వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చెయ్యమన్నాడు. అక్కడి ఆడవారిపై కూడా అమానుషంగా ప్రవర్తించారు సైనికులు. ఇది యువరాజు ఊహించని పరిణామం. దాంతో యువతి కళ్ళ ఎదుటే ఒక గ్రామం మొత్తం దహించుకుపోయింది. వాళ్ళ నాన్న గారు యువతి కళ్ళల్లోకి నిరసనగా చూస్తూ ప్రాణాలు వదిలాడు. యువతి మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎటు వెళ్లిపోయిందో ఎవ్వరికీ తెలియలేదు.
 
యువరాజు రోజు నుండి పిచ్చివాడు అయిపోయాడు. యువతి గురించి కలలు కంటూ తనతో గడిపిన రాత్రినే మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుంటూ మోహాగ్నిలో భస్మం అయిపోతూ పోతున్నాడు. కొన్ని రోజులకు యువరాజు కూడా ఎవ్వరికీ కనిపించకుండా మాయమైపోయాడు, అంటూ అమాంతం చెప్పటం ఆపేసాడు రుద్రసముద్భవ.
 
“అంటే యువరాజు, యువతి ఇద్దరూ...."అంటూ నీళ్లు నమిలారు అంకిత, సంజయ్ లు .
 
"అవును. మీరు ఊహించినది నిక్కమే. యువరాజు జ్వాలా జిహ్వుడు అయ్యాడు. యువతి భైరవిగా మారిపోయింది. ఒకరు అనలలో. మరొకరు మేఖలలో. అనంతమైన శక్తి సంపన్నులు. అతి భయంకరులు కూడా. అలాంటి ఇద్దరి నుండి శంభలను రక్షించిన బలశాలి సింహదత్తుడు. సింహ దత్తుడి రక్తమే విక్రమసింహుడు", అంటూ అనిలుడిపై నిరంతరంగా స్వారీ చేస్తూ అలసట అన్నది లేకుండా ఆలోచనలతో పరిగెడుతున్న విక్రమసింహుడిని  రుద్రసముద్భవ  వారికి చూపిస్తూ గర్వం నిండిన కళ్ళతో మాటలు చెప్పాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
వారా శబ్దాన్ని ఎందుకు సృష్టిస్తున్నారో యువరాజుగా అడిగి తెలుసుకునుంటే బావుండే, అన్ని ఘోరాలు జరిగేవి కావేమో. అయినా యువరాజు మోహాగ్నిలో పడి కదా కనిపించక పోయాడు, మరి ఆ యువతి పై శతృత్వమెందుకు?...కొనసాగించండి. 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
Bro update Kumar chala gap tisukunnaru
Kasta tondharaga update evandi
Like Reply
మితృలు రేటింగ్ మాత్రం ఇవ్వడం లేదు, కొన్ని లైకులు మాత్రమే వస్తున్నాయి, నిరుత్సాహం కలుగుతుంది త్వరగా అప్డేట్ ఇవ్వడానికి
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)