Posts: 2,272
Threads: 149
Likes Received: 7,533 in 1,503 posts
Likes Given: 4,303
Joined: Nov 2018
Reputation:
566
కోతి అప్పడాల కర్ర - మీగడ.వీరభద్రస్వామి
సింగినాధం అడవి నుండి దారి తప్పి ఒక కోతి సుప్పనాతి ఊర్లోకి వచ్చింది, సుప్పనాతి ఊర్లో పిట్టగాడు అనే ఒక పెంకి కుర్రాడు ఉండేవాడు, పిట్టగాడు వయసు పదహారు సంవత్సరాలు ఆలోచన చూస్గ్తే ముప్పై ఆరు సంవత్సరాలు, బడికి వెళ్తే చదువు తప్ప వెంటనే రాబడి రాదని అరకొర చదువులు చదివేసి, బడి మానేసి ‘తిమ్మిని బొమ్మని బొమ్మని తిమ్మిని’ చేసి, లోకానికి మసిబూసి మారేడు కాయ చూపి డబ్బు సంపాదించాలనే ఆలోచనలే ఎక్కువ ఆలోసించేవాడు, చిత్తుకాగితం దొరికినా దాన్ని ఉపయోగించి ఒక చేతి కవరు చేసి దాన్ని అమ్మి పది పైసలైనా సంపాదించే రకం పిట్టగాడు, పొరపాటున సింగినాధం అడవి కోతి పిట్టగాడికి తారసపడింది, దాన్ని మచ్చిక చేసుకున్నాడు పిట్టగాడు ఎందుకైనా పనికి వస్తుందని. “కోతిని ఊర్లో వుంచడం మంచిదికాదు దాన్ని అడవిలోకి తరిమేద్దాం” అని ఊర్లో వాళ్ళు అందరూ అన్నారు, “కోతి వల్ల కోటి లాభాలు” అనే నినాదం ఎత్తుకున్నాడు పిట్టగాడు, “కథలు చెప్పకు!ఈ కోతిని నువ్వు తరుముతావా లేక మమ్మల్నే తరిమేయమంటావా! ”అని ఊర్లోవాళ్ళు గట్టిగా అనేసరికి,అప్పటికప్పుడు సరైన ఆలోచనతోచక కోతిని తీసుకొని అడవి వైపు బయలుదేరాడు పిట్టగాడు, దార్లో ఒక చెట్టు క్రింద కూర్చొని ఈ కోతిని వృదాగా వదిలేయకూడదు దీన్ని ఉపయోగించుకొని కనీసం రోజుకి వందరూపాయులైనా సంపాదించుకోవాలి అనుకుంటూ...అందుకు మార్గం ఆలోచించాడు.
అదే దారిలో ఒక ముసలి మంగలి కనిపించాడు పిట్టగాడికి, అతనికి ఐదు రూపాయులు ఆశ చూపి, కోతికి ఆంజనేయస్వామి మాదిరిగా ముస్తాభు చెయ్యడానికి దాని తల గొరిగించి ఒక చిన్న పిలక ఉంచాడు, నుదుటపై మూడు నిడువు నామాలు వచ్చేటట్లు కటింగ్ చేయించాడు,“కోతి తల గొరుగుడు గురుంచి ఎవ్వరికీ చెప్పకు”అని ముసలి మంగలికి మరో పది రూపాయలు ఇచ్చాడు పిట్టగాడు, “వీడే కోతి వెదవలా వున్నాడు! వీడికి తోడూ మరో కోతి! బాగుంది సంబరం, ఎదో పొట్టకూటికి వేషాలు వేసుకునేవాడిలా వున్నాడు, వీడి గుట్టు ఎందుకు ఇప్పడం!” అనుకుంటూ “సరే” అంటూ “నువ్వు నీ వేషాలను లోకానికి పనికి వచ్చేటట్లు ఉపయోగించుకో..లోకానికి కీడు జరిగితే నీ బండారం నేనే బయట పెడతాను” అని హెచ్చిరించి అక్కడనుండి వెళ్ళిపోయాడు ముసలి మంగలి.
పిట్టగాడు కోతిని ఎత్తుకొని కొంత దూరం పోయేసరికి అక్కడ పోలేరమ్మ గుడి కనిపించింది, అక్కడ ఎక్కువగా వున్న పసుపు కుంకుమ తీసుకొని కోతికి ఒంటి నిండా పూసాడు, ఒంటి నిండా పసుపు కుంకుమ, నుదుటన మూడు నామాలు, తల వెనుక పిలక అచ్చం హనుమంతుడులా వుంది కోతి ,”ఇక మన పాచిక పారవచ్చు” అనుకున్నాడు పిట్టగాడు, కొంతదూరం పోయేసరికి ఒకవూరు కనిపించింది, “ఇక డ్రామా మొదలు పెట్టవచ్చు” అనుకోని రావి చెట్టు, వేపచెట్టు కలిసి పెరిగిన చోటు ఎంచుకొని అక్కడ కోతిని కూర్చోబెట్టి దానికి సాష్టాంగ నమస్కారం చేస్తూ హనుమంతుడి వీరభక్తుడు ఫోజ్ పెట్టాడు,కొంత సమయానికి అక్కడకు దగ్గరలో వున్న వూరు జనం తండోప తండాలుగా రావడం మొదలు పెట్టారు, అక్కడ హనుమాన్ కీర్తనలు మారు మ్రోగాయి, భజనలు ప్రారంభమయ్యాయి, పిట్టగాడు కళ్ళు తెరిచాడు, అతడు అనుకున్నదే జరిగింది, కోతిని భగవాన్ హనుమాన్ అవతారమని అందరూ నమ్మినట్లు వున్నారు,తనని హనుమాను భక్తుడు అని అందరూ మెచ్చుకుంటున్నారని పిట్టగాడికి అర్ధమయ్యింది, మనసులోనే ముసలి మంగలికి దండం పెట్టుకున్నాడు, ఆ తాత తన అనుభవాన్ని రంగరించి కోతిని హనుమంతుడులా క్షవరం ద్వారా తయారు చేయబట్టే తన పాచిక పారిందని ముచ్చట పడిపోయాడు పిట్టగాడు.
పిట్టగాడ్ని, కోతిని ఊర్లోకి తీసుకొని పోయారు ఆ వూరువాళ్ళు, అక్కడ సామాజిక భవనంలో తాత్కాలికంగా పిట్టగాడికి ఆశ్రమం ఏర్పాటుచేశారు, “హనుమాన్ సహిత హనుమాన్ భక్త బాలయోగి నిలయం” అని ఆ ఆశ్రమానికి పేరు పెట్టారు ఊర్లోని పరమ భక్తులు, ఇంకేముంది పిట్టగాడి పంటపండింది, కోతికి తిండి, పిట్టగాడికి దండిగా దక్షిణలు వచ్చి పడుతున్నాయి, అక్కడ ఒక యాత్రా స్థలం అయిపోయింది,కొన్నాళ్ళుకు అక్కడ ఒక గుడి వెలసింది, అది ఒక చిన్న సైజు పుణ్య క్షేత్రం అయ్యింది.
కోతిని పట్టుకొని అడవి వైపు పోయిన పిట్టగాడు రోజులు గడిచినా తిరిగి ఊరుకి రాలేదని సుప్పనాతి వూరు వాళ్ళు కంగారు పడ్డారు “అయినా మనోడు అమాయకుడు కాదు ఏదోఒక ఘన కార్యం చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు ,పర్వాలేదు “అనుకొంటూ కొందరు ధీమాగా వున్నారు, అయితే పిట్టాగాడి తలిదండ్రులు కంగారు పడుతుండటంతో కొంత మంది యువకులు పిట్టగాడ్ని వెదకడానికి బయలుదేరారు, ఎట్టకేలకుఆ యువకులు పిట్టగాడి చిరునామా తెలుసుకొని పిట్టగాడి ఆశ్రమానికి చేరుకున్నారు, అక్కడ పిట్టగాడి దర్జా, హోదా చూసి అతని వూరు యువకులు ఆశ్చర్యపోయారు, పిట్టగాడు ఆ యువకుల్ని చూసి చూడనట్లు నటించి అసలు సిసలు బాలయోగిలా చాలా పోజు కొట్టాడు,”ఓరి వీడి వేషాలూ” అని మొదట్లో అనుకున్న పిట్టగాడి వూరు యువకులూ ఆ తరువాత పిట్టగాడి బుట్టలో పడిపోయారు,అక్కడ పిట్టగాడ్ని అందరూ బాబాలా కొలుస్తున్నారు, కోతి కోతిలా లేదు నిజంగా హనుమంతుడులాగే వుంది, గతంలో పిట్టగాడు “ఈ కోతి వల్ల మనవూరుకి మేలు జరుగుతుందని చెబితే మనం వినలేదు పిట్టగాడు అన్నట్లు ఈ కోతి నిజంగా హనుమాన్ నిజరూపమే” అని అనుకుంటూ సుప్పనాతి యువకులూ పిట్టగాడి భక్తులు అయిపోయారు, విషయమంతా తెలుసుకొని సుప్పనాతి వూరు వారు పిట్టగాడి ఆశ్రమానికి వచ్చి “నిజానికి ఈ బాలయోగి మా వూరు వాడు అతన్ని మా వూరు తీసుకుపోయి పెద్ద గుడి కట్టి సంబరాలు చేసుకుంటాము మీరు మాకు సహకరించాలి” అని ప్రాదేయ పడటంతో..అవతల వూరువాళ్ళు ఒప్పుకున్నారు, పిట్టగాడు కోతి సమేతుడై తన సొంత వూరు సుప్పనాతి చేరుకున్నాడు, అక్కడ ఒక పేదరాసి పెద్దమ్మ అప్పడాలు చేస్తూ చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి పిట్టగాడి ఆశ్రమానికి వచ్చి అప్పడాల కర్ర వదలకుండానే కోతికి కళ్ళు మూసుకొని మరీదండం పెట్టింది,కోతి గబాలున పెద్దమ్మ చేతిలోని అప్పడాల కర్రను లాక్కొని పుట్టుకతో వచ్చిన బుద్ధి పోదు కాబట్టి అప్పడాల కర్రతో అక్కడున్న భక్తులకు బలంగా మోదడం చేసింది, భక్తులు పరమానందబరితులయ్యారు, పెద్దమ్మ మురిసిపోయింది, అప్పటి నుండి పిట్టగాడు కొత్త పల్లవి ఎత్తుకున్నాడు, హనుమంతుడు అప్పడాల కర్రతో ఎన్నిదెబ్బలు వేస్తె అన్ని వందలు రూపాయలు దక్షిణగా ఇవ్వాలని షరతులు పెట్టాడు, భక్తులు సందడి ఇంకా పెరిగిపోయింది, “కోతి అప్పడాల కర్ర” ప్రచారం బాగా పెరిగి పిట్టగాడి రాబడి బాగా పెరిగింది.
గతంలో కోతికి క్షవరం చేసిన పెద్దయానికి పిట్టగాడి కథ తెలిసింది ,అసలు పిట్టగాడు కోతిని ఏవిధంగా ఉపయోగించుకుంటున్నాడో తెలుసుకుందామని పిట్టగాడి ఆశ్రమానికి వచ్చాడు, పిట్టగాడు ముసలి మంగలి మేలు మరచిపోయాడు,అతన్ని పట్టించుకోలేదు, అందుకు భాద పడలేదు కానీ..తాను కోతికి చేసిన క్షవరాన్ని వాడుకొని, దాన్ని హనుమంతుడు రూపంగా చూపి, అమాయకులను మోసం చేసి డబ్బులును పిట్టగాడు గుంజుకుంటున్నాడని తెలుసుకొని , పిట్టగాడి వద్దకు పోయి అతని చెవిలో “ఇకనైనా నీనాటకం చాలించి, కోతిని మర్యాదగా అడవికి పంపు దాన్ని స్వేచ్చగా బ్రతకనీ, నువ్వూ కస్టపడి పని చేసుకొని నిజాయితీగా బ్రతుకు లేకపోతె నీ బండారం బయిట పెడతాను” అని పిట్టగాడ్ని హెచ్చిరించాడు. పిట్టగాడు మంగలి మాట వినలేదు నిర్లక్ష్యంగా కోతికి ఆదేశాలు ఇస్తూ “ఈ మూర్ఖుడుకి అప్పడాల కర్రతో వందదెబ్బలు కొట్టు” అని చెప్పాడు, కోతి మంగలి తలపై అప్పడాల కర్రతో మోదడం మొదలు పెట్టింది, మంగలికి ఒళ్ళు మండింది, వెంటనే తన మంగలి పోదిలోని కత్తి తీసి ముందు కోతి పిలక కత్తిరించి, తరువాత కోతి నుదుటపై వున్న నిడువు నామాలు గొరిగేసాడు, భక్తులు కోపంతో మంగలిని కొట్టబోయారు, మంగలి వాళ్ళను శాంత పరిచి పిట్టగాడు కోతికి తనచేత చేయించిన ముస్తాభు, తరువాత పిట్టగాడు అమాయక భక్తులను మోసం చేసిన తీరు వివరించాడు, అంతే.... పిట్టగాడి ఆశ్రమం కూలిపోయింది, కోతి అడవికి చేరింది, పిట్టగాడు క్షమించమని కోరగా అతన్ని క్షమించిన వూరు వాళ్ళు పేదరాసి పెద్దమ్మ ఇంట్లో పని మనిషిగా చేర్చి అప్పడాలు చేసే పని అప్పగించి “అప్పడాలు పిట్టగాడు”గా పేరుని స్థిరపరిచారు, చదువు మధ్యలోనే ఆపేసాడు కాబట్టి వయోజన విద్య విద్యార్ధిగా చేర్చి మంచి బుద్దిమంతుడుగా, కష్టజీవిగా తయారుచేసారు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,374
Threads: 0
Likes Received: 6,814 in 5,173 posts
Likes Given: 70,137
Joined: Feb 2022
Reputation:
87
Posts: 2,272
Threads: 149
Likes Received: 7,533 in 1,503 posts
Likes Given: 4,303
Joined: Nov 2018
Reputation:
566
తోటకూర - మల్లాది ఉష
తోటకూర మీద కథ ఏంటి అని ఆశ్చర్య పోకండి.నిజమే మా తోట కూర .ఆ రోజుల్లో ఊరంతా కథలు కథలు గా చెపు కునే వారు.పెద్డ మేడ వాళ్ల కథ విన్నారా? తోట కూర తిని పిచ్చెక్కిందిట.పాపం పెద్ద ఆవిడతో ఆడపిల్లలు ఉన్నరుట. ఈ విథంగా రకరకాల కథలు
2. అసలు జరిగిందేమిటంటే ,నేను ఇంటర్మీడియట్ చదువు తున్నరోజులు.మాఅమ్మ ,మా అన్నయ డిల్లి వెళారు. మాఅమ్మమ్మ మాకు కాపలా. మేము ఐదుగురు అక్కచెళ్లెళ్ళం.ఇంట్లో కూరలు లేవు ఎవరెయ్డినా తెండిరా అని అందరిని అడిగింది. అందరికి ఏదో కారణాలు,సాకులు.ఎవరికి వాళ్లం బిజీ పాపం.. ఆవిడ మాటలు ఎవ్వరం పట్టించు కోలేదు. ఇంతలో మా తోటమాలి వచ్చాడు వయస్సు లో పెద్దవాడు, వాడికి ఎవరూ లేరు, మా అమ్మ వాడికి పని ఇచ్చి డబ్బులిచ్చేది. మా తోట పని చేసే వాడు వాడు అమ్మమ్మ సమస్య తీర్చాడు .పెద్దమ్మ గారూ తోటలో తోటకూర ఉంది తేనా అని అడిగాడుట ఆవిడ సమస్య తీరింది.అమ్మమ్మ కూర చేసింది
మేమందరం బోజనానికి ఇంటికి వచ్చాము.వాళ్ళు గబగబా తిని వెళ్ళారు నాకు వెధవ అలవాటు నెమ్మదిగా తినేదాన్ని,మా అమ్మమ్మ నా కు కబుర్లు చెప్పుతూ అన్నం నోటో్్ల కుక్కేది , ఆ రోజు కూడా అదే చేసింది.నేను ఆ రోజు మినిస్టరు గారు వసు్తన్నారు కాలేజిలో పాట పాడాలి హడావిడి మరి అమ్మమ్మ వినకుండా గిన్న కాళి చేసి వదిలంది
4. ఇంకేముంది సోఫాలో కుార్చున్న దాన్ని అక్కడే తూలి పోయాను. మా అక్కలు విపరీతంగా నవ్వులట. అమ్మమ్మ తల తిరుగుతోంది అని మంచం మీద వాలి పోయ్దిుందిట చూసి మా అక్కలు పక్కింటికి వెళ్లి డాక్టరు కి ఫోను చేస్తామని వెాళ్ళారుట. పాపం ఆవిడికి వీళ్ల స్తితి చూసి నీళ్లిద్దామని వెళ్లేటప్పటికి వీళ్లు వాళ్ల ఇంట్లో పుస్తకా లు చింపి ఇంటికి వచ్చారుట.
5. ఇంతలో మా చెల్లెలు కాలేజీ నించి వచ్చిఇంట్లో అందరిని చూసి కంగారు పడి ముందు అద్దె కున్నవాళ్లకి చెప్పి ఊళ్లో ఉన్న మా బాబా్య్ గారి అబ్బాయ్య కి చెప్పిందిట. మా కింద అద్దెకున్న వాళ్లు వచ్చి వెండి సామాను బీరువాలో పెట్టి తాళం వేసి ఇంటికి తాళం వేసి కూర్చున్నారుట
6. మా కజ్జిన్ వచ్చి అమ్మమ్మని ఆసుపత్రి కి ఎడ్మిట్ చేసి అమ్మకి ఫోను చేసారుట. వాళ్లు రైలు లో వచ్చేటప్పటికి రెండు రోజులు పట్టింది.నాకు మెలుకువ వచ్చింది కానీ చేతులూ కాళ్లు కదల్లేదు
7. అన్నయ్య మామయ్యకి ఫోను చేసాడు.మా మామయ్య లాయరు.సహజంగా వ్రుత్తి పరంగా లాయరు అవ్వటంతో ఏం తింటే ఇలా అయ్యంది అని ఆరా తీసారు. ఇలా ఎందుకయ్యిందని రిసర్చ్ చేసారు
8. మా పక్క మేడలో ఫార్మా కంపెనీ ఉండేది వాళ్లు మందులు ఎండ పెట్టేవారు. వాళ్ళ మందులు ఏమయ్యనా మా తోటలో పడ్డాయా? తోటకూర వేసిన చోట కలుపు మొక్కలు మొలిచాయా?అవి చూడకుండా మాలి కోసాడా?
9. మా మామయ్య రిసర్చలో తేలిందేమిటంటే తోట కూరలో ఉమ్మెత్తాకు కలిసిందిట.ఉమ్మెత్త ఆకు మెదడు మీద పని చేస్తుందట. శారీరిక ఆరోగ్యంలో మెదడు కీలక పాత్ర వహిస్తుంది. అందుకే అది మా అందర్నీ రక రకాలుగా హింసించింది.
10. మా అమ్మమ్మ మైకం లోకి వెళ్లింది, నాకు రెండేళ్లు నరాల బలహీనతతో కాలి వేళ్లు మెలి తిరిగేవి నడవలేక పోయే దాన్ని.భగవంతుడి దయ వలన మా అక్కలు కోరుకున్నారు.ఉమ్మెత్త చాలా డేంజరండోయ్. మా మామయ్య చెప్పిన విషయం ఏమిటంటే కోర్టు కేసుల్లో తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ఉమ్మెత్త ఇస్తారుట. ఇదండీ మా తోట కూరకధ
11. ఇదంతా చదివి తోటకూర తినటం మానలేదండోయ్ ఇవ్వాళ మా ఇంట్లో తోట కూర పులుసేనండోయ్.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,374
Threads: 0
Likes Received: 6,814 in 5,173 posts
Likes Given: 70,137
Joined: Feb 2022
Reputation:
87
Posts: 2,272
Threads: 149
Likes Received: 7,533 in 1,503 posts
Likes Given: 4,303
Joined: Nov 2018
Reputation:
566
తార్మార్ తక్కడమార్ - వి.వి.వి.కామేశ్వరి (v³k)
"తార్ మార్ తక్కడమార్ "
"అరే ! ఏం చేస్తున్నారర్రా లోపల"బయట నుండీ పెద్ద పెట్టున కేకలు వినిపించి బయటికొచ్చింది సౌమ్య .
"ఒక్కసారి ఇలా రామ్మా పద్మ , అనూషా, భూలక్ష్మి అదే అదే ..."
"సరేలే అత్తయ్యా సౌమ్య "అని గుర్తు చేసింది సౌమ్య .
"అదేలే సౌమ్య ,దిక్కుమాలిన గాలి ఇప్పుడే తగలడింది . చూడు ఏం చేస్తున్నాడో నీ కొడుకు విరాజ్ , ఒడియాల్లో నీళ్ళు గుమ్మరిస్తున్నాడు భడవాఖానా అల్లరి వెధవ అయ్యాడు" అంది కామాక్షి .
"అబ్బా ! అమ్మా ఒక్కరోజైనా ఎవరి పేరుతో సరిగ్గా వాళ్ళనే పిలుస్తావేమో అనుకుంటాను . వాడు విభాస్ అమ్మా ! " అన్నాడు కొడుకు రవి.
"చాల్లే భడాయి , నువ్వేమో పేర్లు రైమింగో , రోమింగో ఏదో పెట్టి ఏడిశావ్ నా ప్రాణానికి తగలాటంలా " అంది ముసిముసి నవ్వులతో .
పక్క నుంచీ సన్నగా నవ్వుతూ , "ఇంకా నయం , నన్నైతే పద్మక్కా, అనూషా , చివరాకరికి పనిమనిషి భూలక్ష్మి పేర్లు అన్నీ పిలుస్తారు అత్తయ్య నా పేరొక్కటి తప్ప " అంది సౌమ్య.
"అయినా అక్కడ విభాస్ నీళ్ళు పోసేది మిరపకాయల్లో , ఒడియాల్లో కాదు" అంటూ పరుగెత్తింది సౌమ్య పిల్లాడి దగ్గరకు చెంబు లాక్కోటానికి.
"చాల్లే సంబడం, ఏడ్చి మొత్తుకున్నట్లుంది నేనూ నా మతిమరుపూ ,మీ గోలతో ఆ విషయమే మరిచిపోయాను. ముందు వాడి చేతులు కడుగు . అదే సోమలేజరో ఏదో ఉందిగా గుర్తొచ్చి చావటంలా"అంది మనవడి వంక చూస్తూ కామాక్షి .
"శానిటైజర్ అమ్మా , సరే గానీ నువ్వు ముందు అర్థరాత్రి దాకా కవితలు గ్రూపులు అంటూ నిద్ర లేకుండా ఆరోగ్యం పాడుచేసుకుంటున్నావు. చూడు! ఎలా తయారవుతున్నావో ? నీ ఈడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు ? నువ్వెలా వున్నావు? అందుకే నీకు ఇంత మతిమరుపు . అదే నీకిష్టమైన పూజలు, కవితలు మాత్రం బాగా గుర్తుంటాయి" అన్నాడు కొడుకు రవి.
"అవును రవీ, అలా చెప్పు మీ అమ్మకి , టైం కి తినదు , నిద్రపోదు. లాక్డౌన్ లో కవితలు రాయటం ఆపెయ్యమను . నేను చెబితే అలుగుతుంది మళ్ళీ " అక్కడికి ఎప్పుడొచ్చారో శంకరం గారు.
"సర్లే , అందరూ ఏకమయ్యి నా మీద పడ్డారు " బుంగమూతి పెట్టి చేతిలో మామిడిపండు జ్యూస్ గ్లాసులతో వచ్చిన కామాక్షి.
"ఇదుగోండి తీసుకోండి అంటూ కొడుకుని , ఇదుగో నాన్నా తాగరా అంటూ భర్త వంకా చూస్తూ అందిస్తున్న అత్తయ్యని చూసి , అత్తయ్యా! మీ అబ్బాయిని మావయ్య , మావయ్యని మీ అబ్బాయి అంటున్నారు "అని నవ్వింది కోడలు సౌమ్య.
"సరేలే , తార్ మార్ తక్కడ మార్ మార్చుకోండి పేర్లు మీరే నా ప్రియ బంధువులారా !" అంటుంటే అందరూ నవ్వేసుకున్నారు హాయిగా .
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,374
Threads: 0
Likes Received: 6,814 in 5,173 posts
Likes Given: 70,137
Joined: Feb 2022
Reputation:
87
Posts: 2,272
Threads: 149
Likes Received: 7,533 in 1,503 posts
Likes Given: 4,303
Joined: Nov 2018
Reputation:
566
ఆదివారం అగచాట్లు ( హాస్య కథ) - రచన : వారణాసి భానుమూర్తి రావు
బ్రహ్మానందం రెండు పాల పాకెట్లు కొని 100 రూపాయలు ఇచ్చాడు. పాలు అమ్మే వ్యాపారి 50 రూపాయలు పట్టుకొని పరధ్యానంలో 150 రూపాయలు ఎక్కువ ఇచ్చేశాడు.
అది తెలిసి గూడా ఆ నోట్లను జోబీలో కుక్కుకొన్నాడు బ్రహ్మానందం. వెంటనే పూలు కొనుక్కోవడానికి వంద రూపాయల నోటు ఇచ్చాడు. పరధ్యానంలో పూల అమ్మాయి ఇచ్చిన చినిగి పోయిన 50 రూపాయల నోటు తీసుకొని జోబీలో పెట్టుకొని తరువాత చూసి బాధపడ్డాడు.
ఆ చినిగి పోయిన నోటును ఎలాగైనా ఎవరికైనా అంట గట్టాలని నిమ్మ పళ్ళు కొన్నాడు. వాడు పరధ్యానంలో ఆ చినిగి పోయిన 50 రూపాయల నోటును తీసుకొని పది నిమ్మపళ్ళకు ఇరవై పట్టుకొని 30 రూ.లు వాపస్ ఇచ్చాడు.
బ్రహ్మానందం అక్కడున్న దానిమ్మ పళ్ళను చూసి మూడు దానిమ్మ పళ్ళను కొన్నాడు. సంతోషంగా తన తెలివికి మురిసి పొయ్యాడు బ్రహ్మానందం. ఈ రోజు నక్కను తొక్కి వచ్చాడనుకొని సంతోష పడి పొయ్యాడు.
ఇంటికి వచ్చిన తను దానిమ్మ పళ్ళను కట్ చేస్తే అన్నీ పుచ్చులే..పనికి రానివి తగల గట్టాడు వాడు. అవన్నీ డస్ట్ బిన్ లో పడేశాడు.
" ఏమండీ పాలు విరిగి పొయ్యాయి..ఎప్పటి పాలో ఏమో ! ఫ్రెష్ పాలు తీసుకు రండి " అని శ్రీమతి వంటింట్లోంచి అరుపు.
పాంట్ జోబీలో పెట్టుకొన్న 500 రూపాయల కోసం వెతికాడు.. గుండె వేగంగా కొట్టుకొనింది.
" కనబడ లేదు..సుశీ ..నా జోబీలో 500 రూపాయల నోటు చూశావా? " అని గట్టిగా అరచాడు..."
లేదండీ ..నేను చూడ లేదు..మీ పరధ్యానం పాడు గానూ..ఆ రైతు బజార్ లో పోగొట్టు కొన్నారేమో! పోయి వెతకండి..లేదంటే ఏ పిక్ పాకెట్ గాడు కొట్టేశాడేమో " అంది శ్రీమతి బ్రహ్మానందం వైపు కొర కొర చూస్తూ..
" వెళ్ళి వెతికి వస్తా..ఎక్కడైనా పడి పోయిందేమో నని..ఈ రోజు లేచిన వేళా విశేషం బాగా లేదు. అన్నట్టు..పాలు కావాలన్నావు కదా? "
బ్రహ్మానందం మళ్ళీ బయటకు వెళ్ళి పొయ్యాడు.
ఒక అర్థ గంట తరువాత రొప్పుతూ ఆయాసంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి భయ పడింది సుశీల.
" ఏమైయ్యిందండీ" అంది పాల పాకెట్లు ఉన్న సంచీని తీసుకొంటూ..
గ్లాసు మంచి నీళ్ళు తీసి భర్తకు అందించింది.
" 500 రూపాయల నోటు కోసం వెతక డానికి స్కూటర్లో వెళ్ళానా? ఈ రోజు ఎవరి ముహం చూశానో ఏమో..అన్నీ కష్టాలే...రైతు బజారు కెళ్ళాక స్కూటర్ పంచరయి చచ్చింది.ఈ రోజు ఆదివారం గదా! పంచర్ వేసే వాడు ఎవ్వడూ కనబడ లేదు..అలాగే రొప్పుతూ తోసుకొని వచ్చే సరికి నా ప్రాణం పోయింది" అని గ్లాసు లోని నీళ్ళు గడ గడ మని త్రాగేశాడు.
" పోతే పోయింది పాడు 500 రూపాయలు.. ఈ మధ్య మీకు మతి మరుపు ఎక్కువయ్యింది" అంది సుశీల.
" మతి మరుపా ..నా బొందా.. పొద్దున్నే పాల వాడ్ని మోసం చేశాను..తెలిసి గూడా వాడిచ్చిన డబ్బును నా జోబీలో తెలీనట్లు కుక్కు కొన్నాను. వున్నదీ పోయే..వుంచుకొన్నదీ పోయె " అన్నట్లు అయింది నా బ్రతుకు ఈ రోజు
" అంతే ..150 రూపాయలు కు కక్కుర్తి పడితే వేయి రూపాయలు బొక్క పడింది.ఇక నైనా నిజాయితీగా ఉండండి..బీదా బిక్కీ..చిరు చిరు వ్యాపారస్థులకు మోసం చెయ్యకండి" అంది సుశీల.
" ఉండండి..కాఫీ ఇస్తాను" అంటూ వంటింట్లోకి వెళ్ళి పోయింది సుశీల.
" అలాగే" అంటూ వెంకటేశ్వర స్వామి ఫోటో కేసి చూస్తూ లెంప లేసుకొన్నాడు బ్రహ్మానందం.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,374
Threads: 0
Likes Received: 6,814 in 5,173 posts
Likes Given: 70,137
Joined: Feb 2022
Reputation:
87
Posts: 2,272
Threads: 149
Likes Received: 7,533 in 1,503 posts
Likes Given: 4,303
Joined: Nov 2018
Reputation:
566
తారుమారు మారుతారు - బుద్ధవరవు కామేశ్వరరావు
"ఏం నాంచారక్కా, అందరూ ఎలా ఉన్నారు? కెనడా వెళ్లి ఓ సంవత్సరం ఉండి, మా అమ్మాయికి పురుడు పోసి, నిన్ననే వచ్చాను" నాంచారి ఇంటికి వచ్చి చెప్పింది, అదే ఊర్లో ఉంటున్న ఆమె బాల్య స్నేహితురాలు చూడామణి. "అంతా బాగానే వలన దయ ఉన్నాము దేవుని. మీ ఢిల్లీ బావగారు వెళ్లారు మొన్ననే" చెప్పింది నాంచారి. బిత్తరపోయిన చూడామణి, బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ, "అక్కా అదేం భాష? మళ్లీ ఓ సారి చెప్పు" అనగానే, నాంచారి రిపీట్ చేసిన ఆ పదాలు పక్కనే ఉన్న ఓ పుస్తకం మీద రాసుకుని, అర్థం చేసుకొని, "దేవుని దయ వలన అంతా బాగానే ఉన్నాము. మీ బావగారు మొన్ననే ఢిల్లీ వెళ్లారు.....అనే కదా అక్కా! నువ్వు చెప్పాలనుకున్నది" అడిగింది చూడామణి పుస్తకం, పెన్సిల్ పక్కన పెట్టి. "అర్థం సమయంలో ఔను బాగానే తక్కువ చేసుకున్నావు" చెప్పింది నాంచారి. "ఔను తక్కువ సమయంలో బాగానే అర్థం చేసుకున్నావు..అనే కదా దాని అర్థం" అడిగింది చూడామణి రాసుకున్న పుస్తకం వంక ఓసారి పరిశీలనగా చూస్తూ. "ఈ అనుమానం అనే జబ్బు ఏమిటి నీ మాటలు కదా ఎవరు ఇదేం నేర్పారు" చూడామణి వంక చూస్తూ అడిగింది నాంచారి. వెంటనే, ఆ పదాలను అటూఇటూ మార్చి నాలుగైదు సార్లు పుస్తకం మీద రాసుకున్న చూడామణి, చివరకు 'ఏమిటి ఈ మాటలు? ఇదేం జబ్బు ? ఎవరు నేర్పారు అనే కదా నీ అనుమానం'.... ఇదే కదా నాంచారక్కా నువ్వు అన్నది. ఔనక్కా! నేను ఇదే అడగాలనుకుంటున్నా. ఏడాది తర్వాత కలుసుకున్నాం. ప్రయాణం చేసి అలసిపోయాను. ఏం జరిగిందో మన మానవ భాషలో చెప్పక్కా" నాంచారి కాళ్ళ మీద పడినంత పని చేసింది చూడామణి. ఎంతో ఆశతో తనను చూడాలని వచ్చిన చూడామణిని ఇంక బాధపెట్టకూడదని నిశ్చయించుకుని, ఓ ఐదు నిమిషాలు పాటు ధ్యాన ముద్రలోకి వెళ్లి, తిరిగి వచ్చి మామూలు భాషలో చెప్పసాగింది నాంచారి. "చూడా! నీకు తెలిసిందే కదా? మీ బావగారు నెలలో ఓ పది రోజులు ఉత్తర భారతం లోనే ఉంటారని. ఓ ఎనిమిది నెలల క్రితం ఇలాగే ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ తరువాత ఏం జరిగిందో చెబుతా విను" అని చూడామణి ని ప్లాష్ బాక్ లోకి తీసుకుని పోయింది నాంచారి.
"ఎమండీ! ఎలా ఉన్నారు ?ప్రయాణం బాగా జరిగిందా?" అడిగింది నాంచారి ఢిల్లీ నుంచి వచ్చిన తన భర్త, అందరూ ముద్దుగా మూర్ఖ శిఖామణి అని పిలుచుకునే యమ్.ఆర్. కె. శిఖామణి ని. "కాఫీ కొంచెం బాగానే జరిగింది కానీ ముందు ప్రయాణం తగలెయ్యి" అన్నాడు శిఖామణి. ఏమీ అర్థం కాక కాసేపు జుట్టు పీక్కుంది నాంచారి. తర్వాత ఏమనుకున్నాడో కానీ, ''ఓ కాగితం మీద రాసుకుని పదాలు అటూఇటూ మార్చి చదువుకో" అన్నట్లుగా సైగలు చేసాడు శిఖామణి. ఓ పావుగంట కుస్తీ పట్టిన తర్వాత అర్థమయ్యింది నాంచారికి, అది "ప్రయాణం బాగానే జరిగింది కానీ ముందు కొంచెం కాఫీ తగలెయ్యి" అన్నారని. కాసేపటికి తేరుకుని, "ఏమండీ! ఏమిటి ఈ భాష? ఇలా మాట్లాడాలని మీకెందుకు అనిపించింది? మీకు తెలిసి కూడా మనం మాట్లాడుకునే భాషలో చెప్పకపోతే నా తల వెయ్యి చెక్కలవుతుంది, టెన్షన్ భరించలేక" అని బెదిరించింది నాంచారి. "నాచూ! ఏముంది సింపుల్, హిందీలో చూడు. కొన్ని వాక్యాలలోని పదాలు ఎలా మార్చి చదివినా ఒకే అర్థం వస్తుంది. ఉదాహరణకు "ఆప్ లోగ్ క్యా కర్తే హై" అన్నా "క్యా కర్తే హై ఆప్ లోగ్" అన్నా, అలాగే "క్యా హువా ఆప్ కో" అన్నా "ఆప్ కో క్యా హువా" అన్నా ఒకటే అర్థం వస్తుంది. అందుకే ఈరోజు నుంచి మనం కూడా తెలుగులో అలా పదాలు మార్చి మాట్లాడడం ప్రారంభిద్దాం. దీనికి తారుమారు తెలుగు అనే పేరు పెడదాం" చెప్పాడు మూర్ఖ శిఖామణి. "ఏమండీ, ఆ భాషలో అది కుదురుతుందేమో కానీ, మన తెలుగు భాషలో సాధ్యం కాదండీ. మన భాషకు ఓ వ్యకరణం, కర్త కర్మ క్రియ లాంటి బోలెడు పద్దతులు ఉంటాయి" చెప్పి చూసింది నాంచారి, శంకరాభరణం శంకర రావు గారిలా. అయినా అదేం పట్టించుకోకుండా, "ఎప్పుడో ఎవరో కరణం గారు చెప్పిన ఆ వ్యాకరణం ఇప్పటికీ మనం ఫాలో అవ్వాలని ఏముంది? మనం మొదలు పెడితే కొన్నాళ్ళకి అందరికీ అదే అలవాటు అవుతుంది. ఇప్పటి పిల్లలు చూడు ప్రేమించుకున్నాం అనడానికి బదులు లవ్వాడుకున్నాం అంటున్నారు. స్పందించారు అనడానికి ఫీలయ్యారు అంటున్నారు. మరి అవి అచ్చ తెలుగు పదాలా? అందుకే ఈ తారుమారు భాషను మనం అందరికీ అలవాటు చేద్దాం! ఇదే ఫైనల్" వితండవాదం లేవదీసాడు ఆ మూర్ఖ శిఖామణి.
"చూడా! అదిగో అలా మీ బావగారి కోసం ఆ తారుమారు భాష అలవాటు చేసుకున్నానే. మొదట్లో నీలాగే నోట్ బుక్ మీద రాసుకుని ఆ సంధర్భానికి తగ్గట్టుగా అర్థం చేసుకొనే దాన్ని. ఇప్పుడిప్పుడే కొంచెం దారిలో పడ్డానే" మామూలు భాషలో చెప్పింది నాంచారి. "అక్కా! మరి ఈ భాష నేర్చుకున్న మొదట్లో నీకు ఏమీ ఇబ్బందులు ఎదురుకాలేదా?" ఆశ్చర్యంగా అడిగింది చూడామణి. "భలేదానివే చూడా! చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇప్పటికీ ఎదుర్కొంటున్నా" చెప్పింది నాంచారి. "మచ్చుకు ఓ రెండు చెప్పు నాంచారక్కా!" కుతూహలంగా అడిగింది చూడామణి. "ఓ రోజు మా పనిమనిషి 'అమ్మగారూ! అన్ని పనులు చేసేసాను, ఇంకా ఏమైనా ఉన్నాయా' అని అడిగింది. దానికి నేను, మామూలు మన భాషలో "ముందు పాత గలేబులు విప్పేయ్, తరువాత ఆ కొత్త చీర అందరికీ కనబడేలా అరేయ్" అని చెప్పడానికి బదులు, "అందరికీ కనబడేలా ఆ పాత చీర విప్పేయ్ ముందు, తరువాత కొత్త గలేబులు అరేయ్" అని మా వారు చెప్పిన తారుమారు భాషలో చెప్పానే! పాపం తప్పుగా అర్థం చేసుకుంది కామోసు, ఆ రోజు నుంచి పనిలోకి రావడం మానేసిందే" ముక్కు చీదుతూ చెప్పింది నాంచారి. "అయ్యో! ఎంత కష్టం వచ్చింది అక్కా నీకు. వీలైతే ఇంకో సంఘటన కూడా.." సందేహంగా అడిగింది చూడామణి. "అలాగే మా లాండ్రీ కుర్రాడు ఓరోజు ఫోన్ చేసి 'అయ్యగారు లేరా అమ్మా? బట్టలు ఏమైనా ఉన్నాయా?' అని ఫోన్ చేసాడే నేను మన భాషలో "అయ్యగారు ఇంట్లో లేరు పాత ఫాంట్ షర్ట్ విప్పేసి పడేసారు. తీసుకుని వెళ్లు. తొందరగా రా!" అని చెప్పడానికి బదులు ఆ దిక్కుమాలిన తారుమారు భాషలో "షర్ట్ ఫాంట్ విప్పేసి రా తొందరగా, పాత ఇంట్లో పడేసారు అయ్యగారు లేరు వెళ్లు తీసుకుని" అని చెప్పానే! అంతే ఆ కుర్రాడు ఈరోజు వరకూ మళ్ళీ ఫోన్ చేయలేదే" చీరతో కంట నీరు తుడుచుకుంటూ చెప్పింది నాంచారి. "నాంచారక్కా! నీ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఇంకా కాసేపు ఉంటే ఆ తారుమారు భాష నాకు అంటుకునేలా ఉంది. అనుకోకు ఏమీ ఇంకో మళ్ళీ వస్తా సారి" అని తాను కూడా ఆ తారుమారు భాష కొంచెం అంటించుకుని అక్కడ నుంచి బయలుదేరింది చూడామణి. *****
ఆరు నెలలు గిర్రున తిరిగాయి. ఆరోజు చూడామణిని చూద్దామని వాళ్ళ ఇంటికి వచ్చిన నాంచారి, "ఏమే చూడా! బొత్తిగా రావడం మానేసావ్. ఫోన్ కూడా చేయటం లేదు" అడిగింది చూడామణి ని. "నీకు తెలియనిదేముంది అక్కా! ఆ తారుమారు భాషకు భయపడే దూరంగా ఉన్నాను. ఔనూ అదేంటీ నువ్వు మన భాషలో మామూలుగా మాట్లాడేస్తున్నావ్" విస్తుపోతూ అడిగింది చూడామణి. "ఓహో! అదా? అదో పెద్ద కథలే!" తెరలు తెరలుగా నవ్వుతూ చెప్పింది నాంచారి. "కొంచెం చిన్న కథగా చెప్పక్కా" వేడుకుంది చూడామణి. "సరే పద మరి ప్లాష్ బాక్ లోకి" అని గతంలోకి తీసుకుని వెళ్లింది నాంచారి.
ఈమధ్య తరచూ శిఖామణి ఆఫీసు వాళ్లు ఫోన్ చేసి "అక్కయ్య గారూ, ఈయనతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఆయన మాట్లాడుతోంటే స్టెనోగ్రాఫర్లలా ఓ నోటు బుక్, పెన్సిల్ పట్టుకుని ఆయన వెనకాల తిరగవలసి వస్తోంది. మీరే ఏదో పరిష్కారం చూడాలి" అని కంటనీరు పెట్టుకోవడంతో దీనికి ముగింపు పలకాలని ధృడంగా నిశ్చయించుకుంది నాంచారి. ఆరోజు భోపాల్ నుంచి వచ్చిన శిఖామణి ని గుమ్మంలోనే, "మంఏడీ లోయాప్రణం అసిలపోరుయా అకుంనుటా" అడిగింది నాంచారి. తనకు తెలిసిన తారుమారు తెలుగు భాషలో పదిసార్లు ఆ పదాలను అటూఇటూ మార్చి చూసుకున్నాడు శిఖామణి. ఇంక వేరే దారిలేక "అది ఒక్క ఒట్టు భాష అయితే ఏ అర్థం ముక్క" అన్నాడు తన తారుమారు భాషలో. మళ్లీ "మంఏడీ లోయాప్రణం అసిలపోరుయా అకుంనుటా" చెప్పింది నాంచారి. బ్రష్ చేసుకుంటూ, స్నానం చేస్తూ, టిఫిన్ చేస్తూ ఆ పదాలకు అర్థం ఏమిటా అని తెగ ఆలోచించిన శిఖామణి, ఇక గత్యంతరం లేక, "ఏ భాష అది? ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు" అని ఇందాక తాను చెప్పిన తారుమారు భాషను మన తెలుగు భాషలో చెప్పి, తరువాత "నాచూ! నిన్ను తగలెయ్యా అదేం భాషే? పిశాచి భాష. ఇందాకటి నుంచి ఛస్తున్నా అర్థం కాక. మన మామూలు భాషలో చెప్పవే" భార్యను వేడుకున్నాడు శిఖామణి. "ఏమండీ ప్రయాణంలో అలసిపోయారు అనుకుంటా.... అని దాని అర్థం" మామూలు భాషలో చెప్పింది నాంచారి. "ఈ భాష ఎవరు కనిపెట్టారే? భేతాళ మాంత్రికుడు చదివే మంత్రాల్లా ఉన్నాయి. వాళ్ళ మొహాలు మండా" విసుక్కున్నాడు శిఖామణి. "మీగేలాకు కూనుడానే కొరిగాత్తస నిట్టిపెనక షత్తభాకొ గుంబాడీదాం" చెప్పింది నాంచారి, మొహం మటమటలాడిస్తున్న శిఖామణి వైపు చూస్తూ. "ఒసేయ్! చూస్తూంటే ఇదేదో నా తారుమారు తెలుగుకు పోటీగా ఎవడో తీసుకుని వచ్చిన భాషలా అనిపిస్తోంది. ఇంక నన్ను చంపక అదేంటో మన మామూలు భాషలో చెప్పి చావవే" భార్య వంక జాలిగా చూస్తూ వేడుకున్నాడు శిఖామణి. "మీకులాగే నేనుకూడా సరికొత్తగా కనిపెట్టిన కొత్తభాష, బాగుందాండీ!'.. అని దాని అర్థం. అయినా ఇదేం పెద్ద కష్టం కాదండీ. కొంచెం మెదడు పెడితే అదే అర్థం అవుతుంది" చెప్పింది నాంచారి శిఖామణి మోకాలు వైపు చూస్తూ. "ఇది ఏ భాష? కొంచెం వివరంగా చెప్పి తగలడు" విసుక్కున్నాడు శిఖామణి. "ఈ భాష పేరు మారుతారు భాష. మీరు కనిపెట్టిన తారుమారు భాషలో పదాలు అటూఇటూ మారతాయి. దాని వలన కొన్ని అనర్ధాలు, అపార్ధాలూ ఉన్నాయి. అయితే ఈ మారుతారు భాషలో ఆ పదాలలోని అక్షరాలు మాత్రమే ఇటూఅటూ మారతాయి. అంతే తేడా. మనం ఈ మారుతారు భాష కంటిన్యూ చేద్దామండీ" భర్తను ఉడికిస్తూ చెప్పింది నాంచారి. "నీకు దణ్ణమే తల్లీ, నా తారుమారు భాషా వద్దు, నీ మారుతారు భాషా వద్దు. ఒకరి భాషను చూసి వాతలు పెట్టుకోవడం నేను చేసిన తప్పు. ఈరోజు నుంచి హాయిగా మన స్వచ్ఛమైన, మనకిష్టమైన మన తెలుగులోనే మాట్లాడుకుందాం" నాంచారిని బుజ్జగిస్తూ అన్నాడు శిఖామణి. "గారసదా రిన్నికొమ జురోలు......" అని నాంచారి చెప్పబోతోంటే, "అదిగో అదే వద్దు" అన్నాడు శిఖామణి నవ్వుతున్న ఆమె నోరును సుతారంగా మూస్తూ.
"అదిగో అలా మీ బావగారి తారుమారు భాషకి అడ్డుకట్ట వేసానే" చెప్పింది నాంచారి. "బాగుంది అక్కా! నీ మారుతారు భాషకు తారుమారు బావగారు మారతారు అన్న నీ నమ్మకం వృధా కాలేదన్న మాట" నాంచారక్కను అభినందిస్తూ చెప్పింది చూడామణి.
***** **శుభం** *****
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,374
Threads: 0
Likes Received: 6,814 in 5,173 posts
Likes Given: 70,137
Joined: Feb 2022
Reputation:
87
Posts: 2,272
Threads: 149
Likes Received: 7,533 in 1,503 posts
Likes Given: 4,303
Joined: Nov 2018
Reputation:
566
18-10-2024, 12:14 PM
(This post was last modified: 18-10-2024, 12:16 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
వామన రావు - విమానయానం
రచన: వీరేశ్వర రావు మూల
చిన్నప్పుడు అందరిలా మా వామనరావు కి చదువు అబ్బ లేదు. బండి పదవతరగతి దగ్గరే ఆగి పోయింది.
ఏమవుతాడో అని తల్లితండ్రి బెంగ పెట్టుకున్నారు.
కాని వామనరావు మేనమామ వెంకట్రావు వామనరావు లో స్పార్క్ ని గమినించి "అక్కా! నువ్వు బెంగ పెట్టుకోకు. నేను వీడిని చాకులా తయారు చేస్తాగా" అని చెప్పి తనతో పాటు హైదరాబాద్ తీసుకుపోయాడు.
ఐదేళ్ళ వరకూ వామనరావు గురించి వివరాలు మనకు తెలియలేదు. వామనరావు తల్లి కి మాత్రం పిల్లాడు క్షేమమని సమాచారం వచ్చింది.
ఆరోజు పేపర్లో ప్రకటన వచ్చింది.
ప్రముఖ వాస్తు, జ్యోతిష్య విద్వాన్ వామనరావు గారు మీ పట్టణానికి విచ్చేయుచున్నారు. మీ వాస్తు సమస్యలు పరిష్కారానికి సంప్రదించు వేళలు: ఉదయం పది నుండి ఐదు వరకూ..
ఆ ప్రకటన చూసి వామనరావు తల్లీ, తండ్రీ సంతోషించారు కొడుకు ప్రయోజకత్వాన్ని చూసి.
*******
వామనరావు ఆందోళన గా ఉన్నాడు.
అర్జంటు గా వైజాగ్ వెళ్ళాలి. మంత్రి గారు కొన్న కొత్త ఇంటి వాస్తు చూడాలి. ఏం చెయ్యాలో తెలియక ఫ్రెండు కి ఫోన్ చేసాడు.
"ఇందులో వర్రీ అవడానికి ఏముంది ? విమానం ఎక్కు "
"విమానమా !" అన్నాడు సందేహం గా
"ఆరు నెలల గుడ్డు కూడా విమానం ఎక్కుతోంది. రేపు ఉదయం ఫ్లైట్ కి టిక్కెట్ పంపుతా. హేపి గా వెళ్ళండి. "
**********
వామన రావు విమానం లో కూర్చుని లిప్ స్టిక్, స్కర్ట్ పిల్ల ని పిలిచాడు బెల్ట్ పెట్టమని. నెమ్మది గా విమానం గాలి లోకి లేచింది. వామన రావు లో కవి నిద్ర లేచాడు.
చిన్నప్పటి కవిత నెమరువేసు కున్నాడు. చేపలు పట్టే ఆడ పిల్ల ని చూసి అశువు గా అల్లాడు.
"నీ చేతి లో కొరమీను
నల్లగా మెరిసింది నీ మేను "
వామనరావు కాస్సేపు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచే సరికి పానీ పూరి బండి లాంటి దాన్ని తోసుకు వచ్చి "స్నాక్స్ కావాలా ? " అడిగింది క్రూ మెంబర్.
"కాఫీ ? "
"టు హండ్రెండ్ "
"మా ఊళ్ళో ఇరవై మంది తాగుతారు " అని గ్లాసుడు నీళ్ళు తాగాడు.
కొంచెం సేపయ్యాక కెప్టెన్ ప్రకటన వినబడింది. మా విమానం ఎక్కినందుకు కృతజ్ఞతలు. మీరు హాయిగా గమ్య స్ధానం చేరతారు మా విమాన సర్వీసు తో..
పది నిమిషాల తర్వాత.. విమానం లో కలకలం..
పిస్తోలు పట్టు కున్న వ్యక్తి వచ్చి
"ఈ విమానం ను హైజాక్ చేసాను. ఇది ఇప్పడు పాకిస్థాన్ పోతోంది. గోల చెయ్య కుండా కూర్చోండి. మా డిమాండ్ జలీలూద్దీన్, ను ప్రభుత్వం విడిస్తే మీరు బయట పడతారు " అన్నాడు అబ్దుల్.
"మంత్రి గారిని అర్జంటు గా కలవాలంటే పాకిస్ధాన్ అంటాడేమిటి నా పిండాకూడు " అన్నాడు వామనరావు.
"వాడు చేసింది హైజాక్ తినే క్రాక్ జాక్ కాదు. మిమ్మల్ని తాపి గా వైజాగ్ లో దింపి, RK బీచ్ లో తిప్పి ఆ తరువాత కరాచి తీసుకెడతాడు. గోల చెయ్యకు " అన్నాడు పక్కనున్న ప్రయాణికుడు విసుగ్గా.
ఏం చెయ్యాలి ? ఏం చెయ్యాలి ఆలోచించగా వామనరావు మెదడు లో ఫ్లాష్..
కదిలేది కదిలించేది
పెను నిద్దర వదిలించేదయిన నా అక్షరాయుధం
కవిత్వం ఉండగా ఆ హైజాకర్ కి భయపడటమా ?
చూపిస్తా నా పెన్ పవర్..
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,272
Threads: 149
Likes Received: 7,533 in 1,503 posts
Likes Given: 4,303
Joined: Nov 2018
Reputation:
566
18-10-2024, 12:16 PM
(This post was last modified: 18-10-2024, 12:17 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
అబ్దుల్ వామనరావు దగ్గరికి వచ్చి..
"ఏంటి గోల. " అన్నాడు.
వామనరావు లో కవితావేశం పొంగి పొర్లింది.
"ఇది కాదు గోల
ఆ జగన్నాధుడి లీల
కదిలే మృత్యు హేల
ఎగిసే అగ్ని కీల "
కొద్దిగా వామనరావు కవిత్వ ప్రభావం హైజాకర్ మీద
చూపిస్తోంది.
"నువ్వు అంటున్నది అర్ధం కావడం లేదు "
"అర్ధమయితే నా కవిత్వం తంతా
అస్వాదించరా నా చెంత
వీడరా నీ చింత
అదిగో దూరాన్న పాలపుంత
ఇది పొంతన లేని అతుకుల బొంత "
ఈ త కవిత్వం తో హైజాకర్ వణికిపోతున్నాడు. ఐనా ధైర్యం తెచ్ఛుకుని, "హు" అని పిస్తోలు చూపించి "గోల చెయ్యకండి "
"గురువు గారు మరొకటి వదలండి " అన్నాడొక ప్రయాణికుడు వామనరావుని చూసి.
వామనరావు లో ఉగాది కవిత మెరిసింది.
"ఇది ఉగాది
మామిడి పునాది
సమస్యల సమాధి
కోయిల పాట అనాది
తెస్తుంది క్రోది
అతను వస్తే అంతర్వేది
వచ్చింది త్రివేది
తెచ్చింది ఉగాది పచ్చడి
గచ్చ కాయల పుప్పొడి
వసంతాల పూబోడి
నాకు కాదు సరిజోడి "
---
ఇలా చెలరేగిపోయాడు వామనరావు. దెబ్బకి హైజాకర్ స్పృహ తప్పి పోయాడు. వెంటనే మిగిలిన వాళ్ళు ఎలర్టయి పిస్తోలు లాక్కుని, చేతులు కట్టేసి కెప్టెన్ తో ఎమర్జెన్సీ లాండింగ్ చేయించారు.
భారత ప్రభుత్వం వామనరావు కవితా శక్తి ని పొగిడి,
నగదు బహుమతి తో సత్కరించింది.
వామనరావుని సొంత ఊరిలో కూడా సన్మానించారు.
పాకిస్ధాన్, చైనా వాళ్ళ తో సరిహద్దు సమస్యలు వచ్చినప్పుడల్లా వామనరావు తన వంతు కవితా సేవలు అందిస్తున్నాడు. ఎవరన్నారు కవిత్వానికి సామాజిక ప్రయోజనం లేదనీ?
********
తరువాత వామన రావు పది వేల పేజీలలో కవిత్వాన్ని సృష్టించాడు. 20 పుస్తకాలలో వచ్చింది. పుస్తకాల జోలికి ఎవరూ వెళ్ళక పోవటం వామనరావు కవిత్వమంతా అటక మీదే ఉండి చెద పురుగులకు శాశ్వత ఆహార పధకం గా మారింది. చెద పురుగులు రాలి నప్పుడల్లా, భార్య నుండి తిట్లు తింటున్నాడు.
ఎదో ఒకటి చెయ్యాలని, చిన్న నాటి స్నేహితుడు అధికార భాషా సంఘ అధ్యక్షుడు గా ఉన్నాడని తెలుసుకుని, అతనికీ పులస ఇష్టమని ప్రత్యేకం గా వండించి పులస తో కలిసాడు. అంతే మరుసటీ నెలలోనే వామనరావు రచన "రుధిర సదనం" కి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చింది.
కొంతమంది పాఠకులు ఊరికే అవార్డ్ వస్తుందా? అందులో విషయం ఉండి ఉంటుంది అని ఎగబడి కొన్నారు. ఆ తరువాత ప్రభుత్వం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం నాన్ డిటెయిల్డ్ టెక్స్ట్ గా నిర్ణయించింది. అలా వామనరావు సాహిత్యానికి అటక నుండి విముక్తి లభించింది. ఇంటర్మీడియట్ విద్యార్ధులు రుధిర సదనం రాసిన రఛయిత మీద పగ పట్టారు.
******
ఎన్నికలు వచ్చి వామనరావు ఊరి వాడికే కేంద్ర మంత్రి పదవి దొరికింది. అదీ కూడా బొగ్గు లో. బొగ్గయితేనేం, నా జీవితం లో ముగ్గు గా మారదా అని బొగ్గు మంత్రిని కలిసాడు. తన పుస్తకం గురించి చెప్పాడు. మాటల సందర్భంలో చెప్పాడు బొగ్గు మంత్రి తను కూడా పులస బ్యాచ్ అని. దాంతో వామనరావు పని సులువయింది.
కేంద్ర సాహిత్య అకాడమీ లో అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. గోవర్కర్ లు, సావార్కర్ లు, సాహు లు ఉన్నారు. తెలుగు లో పరమేశ్వర రావు ఉన్నాడు. ఆయన కీ అర సున్న కనబడక పోతే పిచ్చెక్కి పోతుందీ. "అన్యంబొకండు", దవ్వు లాంటి పదాలు కనబడక పోతే తెలుగు భాష కి అన్యాయం జరిగినట్టు బాధపడతాడు. పరమేశ్వర రావు అర సున్నలు కనబడలేదని వామనరావు పుస్తకాన్ని ఎంపిక చెయ్యలేదు.
బొగ్గు మంత్రి ఒత్తిడి తో చెయ్యక తప్ప లేదు. ఆ సంవత్సరం వామన రావు పుస్తకానికీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కొంత మందీ పాఠకులు ఊరికే అవార్డ్ ఇస్తారా అని భ్రమ పడి కొనేసారు.
ప్రభుత్వం గ్రూపు 2 పరీక్షలకీ పాఠ్య గ్రంథం గా నిర్ణయించింది. తిట్టుకుంటూ చదివారు పోటీ పరీక్షల కీ వెళ్ళే వాళ్ళు.
కవి గాంచని చోట "పైరవి" గాంచున్ అని అర్ధమయ్యింది వామనరావు కి!
సమాప్తం
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,374
Threads: 0
Likes Received: 6,814 in 5,173 posts
Likes Given: 70,137
Joined: Feb 2022
Reputation:
87
Posts: 2,272
Threads: 149
Likes Received: 7,533 in 1,503 posts
Likes Given: 4,303
Joined: Nov 2018
Reputation:
566
సినిమా సుబ్బారావు - Achanta gopalakrishna
ఏమోయ్ వంట అయ్యిందా?
కాలేజ్ కి టైం అవుతోంది అంటూ అరిచాడు సుబ్బారావు. .
సుబ్బారావు ప్రైమరీ కాలేజ్లో టీచర్ గా పని చేస్తున్నాడు . పొద్దున్నే ట్యూషన్స్ చెప్పి కాలేజ్ కి వెళతాడు ప్రతి రోజు . సాయంత్రం ఇంట్లోనే ఉంటాడు . అసమయమంతా యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు .
అతనికి సినిమా పిచ్చి .ఎప్పటికైనా సినిమాలలో చేయాలని కోరిక .
అందుకే అద్దం ముందు నుంచుని డైలాగ్స్ అవీ ప్రాక్టీసు చేస్తూ ఉంటాడు.
ఒక్కోసారి భార్యని కూర్చోమని. సినిమాలలో డైలాగ్స్ చెప్తూ ఉంటాడు . ఆవిడకి ఇవేమీ నచ్చవు. కానీ వినేదాకా వదలడు అని వింటూ ఉంటుంది.
ఆ రోజు సాయంత్రం ఇంటికి రాగానే ఏమోయ్ ఒక కప్పు కాఫీ పడేయి .
ఇవాళ అన్నగారి డైలాగ్స్ దానవీరసూరకర్ణ సినిమాలోవి ప్రాక్టీస్ చెయ్యాలి అన్నాడు . ఓరి దేవుడా , ఈయనికి ఈ సినిమా పిచ్చి ఎందుకు తగిలించావు స్వామీ ...
అంటూ తల కొట్టుకుని ,
కాఫీ తో వచ్చింది.
ఇదిగో కాఫీ మీ మాటలు వింటూ కూర్చుంటే , అవతల నా పని ఎవరు చేస్తారు, వంట అవ్వాలి కదా అంటూ విసుక్కుంది .
నన్ను ఏమైనా అంటే అను కానీ నా సినిమాని ఏమైనా అన్నావంటే ఊరుకోను . అదొక దైవదత్తమైనటువంటి కళ అంటూ, శంకర రావు లా ఓ డైలాగ్ చెపుతూ,
కాఫీ తాగాడు .
అబ్బా అంటూ అరిచాడు .. నోరు... కాలిపోయింది .
ఇంత వేడిగా ఇచ్చావేమిటి నీ దుంప తెగ , అంటూ అరిచాడు. .
ఆ డైలాగ్స్ లో పడి ఎలాగూ మర్చి పోవడం , నేను మళ్ళీ వెచ్చబెట్టి తేవడం రోజు అలవాటు అయ్యిపోయింది అందుకే ఏకంగా వేడి చేసేసా ముందు జాగ్రత్త కోసం అంది.
నీ జాగ్రత్త తగలెయ్య ,
నోరు కాలిపోయింది.
ఇప్పుడు డైలాగు సరిగా వస్తుందో రాదో అంటూ ఊదుకుని తాగేసాడు .
ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
ఏమంటివి ఏమంటివి అంటూ. .ఇంతలో ఫోన్ మోగింది .... ఏమోయ్ ఫోన్ చూడు అన్నాడు.
విసుక్కుంటూ వచ్చింది. మీ పక్కనే ఉందిగా కాస్త తీసి మాట్లాడొచ్చుకదా అంది .
అయ్యగారు బిజీ గా వున్నారు కనబడడం లేదా ... తొందరగా తియ్యి .
వాళ్ళు కట్ చేస్తే మళ్ళీ మనం చెయ్యాలి. మనకెందుకు బిల్లు అంటూ మళ్ళీ ప్రాక్టీసులోకి వెళ్లి పోయాడు .
ఫోన్ కూతురి దగ్గరనుంచి .
అమ్మా ఎలా వున్నావే అడిగింది.
ఇదిగో ఇలా ఆ కాలేజ్ కి వెళ్ళినప్పుడే కాస్త ప్రశాంతత .
సాయంత్రం అయితే చాలు ఇదే గోల .
పైగా నన్ను కూర్చోపెట్టి వాయించేస్తాడు . ఆయన దెబ్బకి భయపడి ఫ్రెండ్స్ కూడా ఇంటికి రావడం మానేశారు.
ఎవరికీ చెప్పుకోను ......... ఈ వయసులో మీకిదేం పిచ్చండి అంటే . కళకు వయసుతో పని లేదు అని చెప్పాడట ఎవడో .
వాడు గానీ కనబడితే ఉతికి ఆరేయాలని ఉంది ...
మొన్నటికిమొన్న పాలవాడు పాలు పట్టుకు వస్తే , ఆపి నాలుగు డైలాగులు వినిపించారు .పాపం ఈ లోగా ఆ సైకిల్ ని ఎవరో గుద్దేసి పోయారు పాలన్నీ ఒలికిపోయాయి అంటూ గోల పెట్టాడు. ఒలికిపోయిన పాలడబ్బులు ఇస్తారా ,చస్తారా అని కూర్చుంటే ఒక 500 ఇచ్చి పంపించారు.
నిన్నటికి నిన్న
రాత్రివేళ ఇంటికి వస్తూ ఉంటే ఈయనిని చూసి పక్కింటి వాళ్ళ కుక్క మొరిగిందని దానికి చెలియో చెల్లకో అని పద్యం వినిపించారట , ఆదెబ్బకు కుక్క మొరగడమే , మానేసిందట దాంతో ఈయనే ఎదో చేశారని గొడవకి వచ్చారు.
ఇలా వుందే అమ్మడు నా బతుకు .
ఈ సమస్యకు పరిష్కారం ఏమైనా ఉంటే చూడవే అంటూ అడిగింది.
అలాగేలే ఇది రోజు వుండే భాగోతమేగా.
నీ వంట్లో ఎలావుందీ.
ఆ కళ్ళు చూపించుకున్నావా అని అడిగింది .
ఎక్కడ పొద్దున్న ట్యూషన్స్ సాయంత్రం ఈగోల ... ఆదివారం డాక్టర్ ఉండడు.. ఏదో పని జరిగిపోతోందిలే .
అల్లుడుగారిని అడిగానని చెప్పు . వుంటాను మరి అంటూ ఫోన్ పెట్టేసింది . ఎవరూ అమ్మాయా అని అడిగాడు . అవును అంటే మరి పెట్టేసావేమి . నాకు ఇచ్చి ఉంటే రెండు డైలాగులు వినిపించేవాడిని కదా అన్నాడు. ఆ చాల్లెండి సంబరం దానినైన సుఖము గా ఉండనివ్వడి అంటూ వంటింట్లోకి వెళ్ళబొయింది , ఇదిగో ఒక్క డైలాగు వినేసి వెళ్లు అంటూ ఆపేసాడు డైలాగు చెప్తూ ముక్కు ఎగరేసాడు నేను డైలాగు చెప్తే ఎదుటి వాళ్లకి కోపం వస్తుంది అని తెలుసు గానీ మాడువాసన కూడా వస్తుందనుకోలేదు .
అది మీ డైలాగు ది కాదు. స్టో మీద కూర మాడిపోయిన వాసన అంటూ వంటింట్లోకి పరిగెత్తింది. మన ప్రాక్టీస్ దెబ్బకి కూర
మాడిపోయిందా లేక మరిచి పోవడం వలన మడిపోయిందా.... ఆ గాడిద గుడ్డు...ఇవాళ్టి కి చాలు గాని...ఎమోయ్ భోజనం వడ్డించేస్తావా..అంటూ అరిచాడు... ఇదిగో వడ్డించేస్తున్నా...రండి అంది....భోజనానికి కూర్చున్నాడు...
ఇవాళ భోజనాలు ,వింతైన వంటకాలు ..తాయారు వారి విందు ...ఒహోహో మాడిపోయే... అంటూ పాట అందుకున్నాడు...
అంతా మీ మూలంగానే... నా తప్పేమి లేదు అంటూ వడ్డించింది.అబ్బా చారు ఇలాగ ఉందే మీటే బాబు...నీళ్లు చింత పండు... తప్ప ఇంకేమి ఉన్నాయి... అన్నాడు..ఇవాళ చారు పౌడర్ అయిపోయింది.... రేపు బాగా చేస్తా నండి...అలాగే అంటున్నావు ప్రతిసారి... నీకు నామీద ప్రేమ తగ్గిందోయ్... అన్నాడు.ఏం దీనికి పాట లేదా...అంటూ వెటకారం గా అడిగింది.... ఎందుకు లేదు... ఇది గో విసురుతున్న...ప్రేమనగర్....పేరడీ...
" నీకు నేనంటే ప్రేమ లేదు...నాకు చావంటే భయం లేదు...ఈ చారు తో మరణిస్తాను...ఎవరికోసం... ఎవరికోసం
అంటూ పాట అందుకున్నాడు...
ఏమండీ... మీరు మరీనూ... ఆపండి మహాప్రభో...మీ జోలికి రాను... అంటూ దండం పెట్టింది...
ఇద్దరు నవ్వుకున్నారు...
ఆ మరునాడు ఉదయం పిల్లలు ట్యూషన్ కి వచ్చారు... సుబ్బారావు పడక కుర్చీ లో కూర్చుని పాఠం చెప్పేసి... హోమ్ వర్క్ లు చేసారో లేదో చూసి... ఇంక బయలుదేరండి... కాలేజీకి టైం అవుతోంది... అని పంపేశాడు. ఎమోయ్ కొంచెం కాఫీ ఇస్తావు.... కాలేజీకి టైం అవుతోంది... అని అన్నాడు...ఇదిగో ఇస్తున్నా...వేడిగా ఉంది చూసుకోండి... మళ్ళీ చెప్పలేదు అంటారు..అంది నాకు తెలుసు లేవోయ్...అంటూ ఉదుకుని తాగ బోయాడు. అంతలో పాము పాము అంటూ అరిచింది.పామా ఎక్కడే... అన్నాడు కంగారుగా... అక్కడే కాలు కింద పెట్టకండి... మీ కుర్చీ కిందే... ఉంది అంటూ అరిచింది. ఈ కంగారులో కాఫీ నోట్లో పొసుకుని నోరు కాలిపోయింది... చచ్చాన్రో బాబు అంటూ...అరిచాడు... ఈ లోగా గుండెల మీద పడింది కొంచెం....దీని కాఫీ తగలెయ్య ..ఇంత వేడిగా తగలేస్తుంది....తగలబడి పోయింది ఇక్కడ...నోరు..వళ్ళు... గ్లాసు వేడిగా ఉంది.... కాలు కింద పెట్టలేని పరిస్థితి....గ్లాస్ వేడిగా ఉంది..కింద పాము ఉంది...ఏదో ఒకటి చేయవే...నీ దుంప తెగ..అంటూ అరిచాడు...వణికి పోతూ... నేనేం చేయను...కావాలంటే కర్ర ఇస్తా...మీరే కొట్టండి.. అంది.నా కుర్చీ కింద నేనే ఎలా కొట్టనే...ఎవరి నైనా పిలు అన్నాడు...ఇంతలో పక్కింటి వెంకట్రావ్ వచ్చాడు....రండి అన్నయ్య గారు సమయానికి వచ్చారు... ఇదిగో ఈ కర్ర తీసుకుని మావారి కుర్చీ కింద పాము ఉంది కొంచెం కొట్టండి..అంది. నేనా..పామునా...నావల్లకాదు... అది వెళ్లి పోయాక వస్తాలే సుబ్బారావు...అంటూ పారిపోయాడు.... వెధవ ఈ సారి రాని... వాడి సంగతి చెపుతా....అనుకున్నాడు....
ఇంతలో మిలటరీ రంగనాధం అలా వెళుతుంటే ,అన్నయ్యా గారూ అంటూ పిలిచింది... ఎమ్మా పిలిచావు అంటూ వచ్చాడు.. జరిగింది చెప్పింది. ఏది ఆ కర్ర ఇటు ఇవ్వు నేను చూస్తాను అంటూ కర్ర తీసుకుని చూసాడు... తొందరగా దీన్ని తరిమేసి పుణ్యం కట్టుకోవయ్యా రంగనాధం.. అన్నాడు దీనంగా.. నువ్వు ఉండవయ్యా నన్ను చూడని ముందు... అంటూ కర్ర.తో కొట్టాడు...అది కదలలేదు.. దగ్గరికి వెళ్లి చూస్తే అది తాడు...ఓరిని తాడుని చూసి ఇంత రాద్ధాంతం చేసారా...అనిచేతితో తీసి పట్టుకుని చూపాడు...
చూసుకోవక్కర లేదా...ఎంత కంగారు పెట్టావు.... వొళ్ళు కాలింది కూడా...అన్నాడు గుండెలు రాసుకుంటూ....
ఆ నాకేం తెలుసు... నాకు సరిగా కనబడదు గా...
కళ్ళజోడు చేయించరు...నేనేమి చేసేది
..అంది...అమాయకంగా.
నువ్వు మరీనూ సుబ్బారావు... రేపే ఆ కళ్ళజోడు పని చూడు అంటూ క్లాస్ పీకి వెళ్లి పోయాడు...
ఇంతలో గడియారం గంట కొట్టింది... హమ్మో ఈ హడావిడి లో కాలేజ్ సంగతే మరచిపోయి నాను... ఇప్పుడు హెడ్ మాస్టారు తో తిట్లు తప్పవు... ముందు టిఫిన్ పెట్టు... తినేసి తొందరగా వెళ్ళాలి అంటూ పెళ్ళాన్ని తొందర పెట్టాడు... ఆదరా బాదరా గా తినేసి బయలు దేరాడు...
స్టాఫ్ రూమ్ లోకి అడుగు పెట్టిన సుబ్బారావు కి...రిజిస్టర్ బుక్ హెడ్ మాస్టర్ గారి టేబుల్ మీదకి వెళ్ళిపోయింది... మిమ్మలిని ఒకసారి రమ్మన్నారు....అన్నారు. ఎక్సపెక్ట్ చేశా...ఇంకా నిండా ములిగిన తరువాత చలి ఏమిటి అనుకుంటూ ఆయన గది లోకి అడుగు పెట్టాడు రండి సుబ్బారావు గారు కూర్చోండి అన్నాడు.
మర్యాద కొంచెం ఎక్కువ అయింది... డోస్ కూడా ఎక్కువే ఉండొచ్చు... అనుకున్నాడు... రిజిస్టర్ ముందుకి తోసాడు సంతకం పెట్టండి... అన్నాడు ఆశర్య పోయాడు... సారి సర్...ఇక ముందు ఇలా ఆలస్యంగా రాను అన్నాడు...నేను పిలిచింది అందుకు కాదు...మీ కల నెరవేరే రోజు వచ్చింది... ఎవరో సినిమా వాళ్ళు ట... మీ గురించి వచ్చారు. ఇదిగో కార్డ్...మధ్యాన్నం సెలవు పెట్టి వెళ్ళండి అన్నాడు.చాలా థాంక్స్ సర్...అంటూ కార్డ్ తీసుకుని క్లాస్ కి వెళ్ళాడు...సినిమా పేరు గౌతమ బుద్ధ ట తనకు చిన్న కారెక్టర్ ఉంది చేస్తారా అని అడిగారు... మొదటి సినిమా కదా...అని ఆలోచించకుండా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేసాడు.... వాళ్ళు చెక్ ఇచ్చారు అడ్వాన్స్ గా....మీకు టికెట్స్ పంపిస్తాం... ఆరోజు బయలుదేరి హైదరాబాద్ రావాలి... అన్నారు. సరే సర్...అంటూ ఇంటికి వెళ్ళాడు...
తయారు ఒసే తయారు అంటూ పిలిచాడు... లోపల పిండి రుబ్బుతోంది... వినబడలేదు.... ఒసే తారు అంటూ లోపలికి వచ్చి పిలిచాడు... మిమ్మలిని అలా పిలవద్దన్నానా...అంది కోపం గా... ఏదో ముద్దు వచ్చినప్పుడు అలా పిలుస్తా లే వే... అన్నాడు....ఇప్పుడు ముద్దు ఎందుకు వచ్చానో... అంతగా అంది...చెక్ తీసి చూపించాడు... సినిమా ఛాన్స్ వచ్చిందే...ఇది అడ్వాన్స్...అన్నాడు...నిజమా ...ఈ విషయం అంత మందికి చెప్పాలి...అంటూ బైటకి పరిగెత్తింది....కొంచెం కాఫీ ఇచ్చి వెల్లవే అన్నాడు....తరువాత ఇస్తా....అంటూ బైటకి వెళ్ళిపోయింది..దీనికి ఆనందం వచ్చిన...పట్టలేము
కోపం వచ్చినా పట్టలేము...అనుకున్నాడు..
అందరూ వచ్చి అభినందించారు...
ఆ పక్కింటాయన ఇంకా ఉన్నాడు...
ఒక్క మాట అండీ అన్నాడు...
ఇప్పుడు ఆటోగ్రాఫ్ లు అవి ...ఇంకా సినిమా మొదలు అవలేదు కదండీ అన్నాడు... అదికాదు ...
మీరు మా కుక్కని ఏం చేశారు... ఇప్పటికి వారం అయింది.... ఒక్కసారి కూడా భౌ మని ఆరవ ట్లేదు... పైగా మీ గొంతు విన్నా మీపేరు విన్నా.... మంచం కింద దాక్కుంటోంది... అన్నాడు...ఏమో నాకేమి తెలుసు... నేనేమి చేయలేదు ...అన్నాడు...బింకంగా... చూద్దాం... అంటూ వెళ్ళిపోయాడు.
సినిమా వాళ్ళనించి ఫోన్ వచ్చింది... అందరూ ట్రైన్ ఎక్కించి వెళ్లారు...లొకేషన్ చేరుకున్నాడు...
అక్కడ అంతా హడావిడిగా ఉంది...సుబ్బారావు ని చూసి రండి ఇదిగో మీ డైలాగ్ పేపర్...రెండే రెండు...బాగాచెప్పాలి...మేకప్ వచ్చాడు...
ఇదిగో అబ్బాయి బాగా వేయాలి...ఫస్ట్ లుక్ అదిరిపోవాలి... అన్నాడు...ఓకసారి జాలిగా చూసి నేను ఇప్పుడే వస్తా...అని వెళ్ళాడు... దర్శకుడు వచ్చి ఏది ఆ డైలాగ్ చెప్పండి...అన్నాడు...చెప్పాడు... బాగా వచ్చింది...ఇంకా మిగతా అంత ఏక్షన్ ...మీ ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి అన్నాడు...మీరే చూస్తారు గా...అన్నాడు....
మేకప్ మాన్ వచ్చి నల్ల రంగు పుసాడు.... ఇదేమిటి ఇలా ..
అది అంతే... హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం పడిపోయాక ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అన్న పాత్ర మీది... ఒంటినిండా ఇలా రాసుకుంటే నేను ఎక్కడ కనపడతాను... అప్పటికి వాడు చెప్పాడు ..
మీ క్యారెక్టర్ కనబడుతోంది కానీ మీరు కనబడరు అని ...నేనె అర్థం చేసుకో లేక పోయాను....
తొందర గా మీ సీన్ చేయమనండి... లేక పోతే... కడుక్కోవడానికి గంట పట్టుద్ది అన్నాడు మేకప్ మాన్...
.ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడు...మేకప్ భలే కుదిరింది అండీ అన్నాడు....నవ్వుతూ...
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే....ఏదో సామెత చెప్పినట్లు... కధ వినకుండా సంతకం పెట్టడం నా తప్పు... ఇప్పుడు
నేను ఈ సినిమా చేయను అన్నాడు....
అయితే మీరే డబ్బు ఎదురు ఇవ్వాలి...
అగ్రిమెంట్ సంతకం పెట్టారుగా... అన్నాడు...
చేసేది ఏమి లేక మూసుకుని వారం రోజులు, అరగంట మేకప్ వేసుకోవడానికి, గంట తీసుకోవడానికి...సరిపోయేది...
ఏదో అయింది అనిపించాడు..ఇంక జన్మ లో సినిమా జోలికి పోకూడదు అనుకున్నాడు..
ప్రొడ్యూసర్ పిలిచి ఇదిగో అండీ మీ బాలన్స్ చెక్....
మళ్ళీ ఏదైనా పాత్ర ఉంటే పిలుస్తా అంటూ వెళ్లిపోయారు.
ట్రైన్ లో ఊరు చేరాడు...అక్కడ అంతా కోలాహలం...దండలతో రిసీవ్ చేసు కున్నారు...వీళ్ళకి తెలియదు...నేనేం చేసానో..తెలిస్తే పరువు పోతుంది....అనుకున్నాడు.
.సినిమా రిలీజ్ రోజు నా అందరికి టికెట్స్ తీసాడు... మొదలు అయింది...సుబ్బారావు సీన్ రాలేదు... ఇంటర్వెల్ తరవాత వస్తుంది లే అన్నారు ఎవరో...అప్పుడు రాలేదు.. మొత్తం అయిపోయింది అయినా రాలేదు... అయ్యో ఎంత మోసం ...పాపం సుబ్బారావు నటించింది అంత తీసేసారు... అని జాలి చూపించారు...బ్రతికాను రా భగవంతుడా...అని ఇల్లు చేరుకున్నాడు...
.ప్రొడక్షన్ వాళ్ళకి ఫోన్ చేసాడు....ఏమి జరిగింది అని....
బురద తో కూడిన బుద్ధుని సీను లు భక్తుల మనో భావాలు దెబ్బ తిన్నాయని మొత్తం తీసేశారుట....
క్షమించండి అని అడిగారు...
థాంక్స్ అని పెట్టాశాడు....
వాళ్ళకి అర్థం కాలేదు , ఇదేమిటి సారి చెపితే థాంక్స్ అంటాడు....అనుకున్నారు....
హమ్మయ్య ఈ గండం గడిచింది..
ఇంక జన్మ లో సినిమా పేరు ఎత్తను...అనుకున్నాడు...
అప్పటి నుంచి సాయంత్రం కూడా ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించాడు...తయారు కి కళ్ళజోడు చేయించాడు....అతని లో వచ్చిన మార్పు కి
తయారు ఆశ్చర్యం పోయింది...
ఏమిటండి ఈ మార్పు...అని అడిగింది...ఒక్క సినిమా చేయాలని అనుకున్నా... చేసేసా....ఇంక నాకు ఆ మోజు లేదు...
అందుకే మనకి కలిసి వచ్చిన అధ్యాపక పనిని చేసుకుంటున్నా అన్నాడు...
తన భర్త లో వచ్చిన మార్పుకి చాలా... సంతోషించింది
ఒక ఆదివారం ఉదయం భార్య
చేసిన జీడిపప్పు ఉప్మా తింటుండగా...
ఫోన్ మోగింది... హలొ ఎవరు సుబ్బారావు గారేనా...
మేము ప్రొడక్షన్ హౌస్ నించి మాట్లాడుతున్నాం....
ఒక పాత్ర ఉంది చేస్తారా అని అడిగారు....
ఒక సెకను ఆలోచించి....
రాంగ్ నంబర్ అంటూ పెట్టెసాడు....
ప్రశాంతంగా ఉప్మా తినడం కొనసాగించాడు...
మళ్ళీ సినిమా లు చెయ్యక పోయినా....
సుబ్బారావు కు జరిగిన అన్యాయానికి....
కాలనీ లో "సినిమా సుబ్బారావు" అన్న పేరు మాత్రం స్థిరపడిపోయింది....
....శుభం....
(ఇది కేవలం కల్పితం... పాత్రలు సన్నివేశాలు.... కల్పించి రాయబడినవి)
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,374
Threads: 0
Likes Received: 6,814 in 5,173 posts
Likes Given: 70,137
Joined: Feb 2022
Reputation:
87
Posts: 2,272
Threads: 149
Likes Received: 7,533 in 1,503 posts
Likes Given: 4,303
Joined: Nov 2018
Reputation:
566
*కఱ్ఱిసోమూ---లాయర్ పిట్ట* - Bhagavathula Bharathi
కఱ్ఱిసోము ,కూసుమంచిలోని ఎప్పుడూ చొంగ కారుస్తూ ఉమ్ములేస్తుండే, చొంగ కరీమ్ కొట్లో పని చేస్తున్నాడు. కరీమ్ నోట్లోంచి నిత్యం చొంగ కారుతూనే ఉంటుంది,అందుకే ఆ పేరు. అది పల్లెటూరు కావటాన, ఆ ఊళ్ళో కరీమ్ షాపే సూపర్ మార్కెట్ లాంటిది. ఐతే దుకాణానికి కావాల్సిన సరుకంతా ఖమ్మం నుండే తెచ్చి మారుబేరానికి అమ్ముతుంటాడు,కరీమ్.
ఆరోజు కరీమ్ కఱ్ఱి సోమును పిలిచి "రేయ్! కఱ్ఱోడా! కొట్లో సరుకు నిండుకుంది. తీసుకురావాల. ఇదిగో! ! డబ్బులు! ఖమ్మంయెల్లి తేవాలి .గోనెసంచులు ఎత్తుకెల్లి ,సరుకంతా కొని అన్నీ లెక్కచూసుకుని,పెందరకాడ వచ్చేయ్! నేను మిల్లు కాడికి ఎడతండా!" అని కఱ్ఱి సోము కు పని పురమాయించి, చొంగ కారుస్తూ ఉమ్ము లేసుకుంటూ వెళ్ళిపోయాడు కరీమ్. కఱ్ఱిసోము, ఖమ్మం వచ్చాడు. సరుకంతా కొని, గోనెసంచులన్నీ,లెక్కపెడుతుండగా వెంకటాయపాలెం నుండి 'లాయరు పిట్ట' అదే షాప్ కి వచ్చాడుసరుకులు కొంటానికి. ప్రతీ విషయాన్నీ 'లా' పాయింట్లతో మాట్లాడుతూ ఉంటాడుఅతను. తానే తెలివైన వాడిననీ, ప్రపంచం లోని అన్ని విషయాలు మెుత్తం తనకే తెలిసినట్లూ "లా" పాయింట్లతో మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల అందరూ అతనికి నిక్ నేమ్ పెట్టేసారు. 'లాయర్ పిట్ట' అనే తప్ప అసలు పేరు మర్చిపోయారందరూ.
ముఖం సింకిచాటంత చేసుకుని ,"ఏరా! పిట్టలాయరూ! నిన్ను సూడక చాన్నాళ్ళయిందిరా! " అన్నాడు కఱ్ఱి సోము
"ఏరా! కఱ్ఱోడా! నేను కొన్న లగేజ్ అంతా ఈడనే పెట్టా! నువ్వూ పెట్టూ! అలా యెళ్ళి మాట్లాడుకుందాం!" అన్నాడు పిట్ట లాయరు కఱ్ఱోడికర్ధమైంది.మాట్లాడుకోటం అంటే ఏంటో. ఇద్దరూ ఇకిలించుకుంటూ కల్లుపాకలో దూరారు. పీకలదాకా తాగారూ, తూలారూ వాగారూ ! దొర్లారు, చీకటి పడుతుండగా తూలుకుంటూ ,ఎవరి లగేజ్ తో వాళ్ళు ఊరు చేరారు. చొంగ కరీమ్ ఖమ్మం నుండి , కఱ్ఱి సోము తెచ్చిన సరుకుల మూటలు విప్పి సరుకు లెక్కచూసుకుని సొల్లు నోటితో బూతులు లంకించుకున్నాడు. "కఱ్ఱి నా~~ ఏందిరా యిదీ! ఎండు సేపలు తెమ్మన్నానుగా!ఎండు సేపల మూటలు ఎయ్యిరా? మరి యియ్యేంటీ బూడిద సంచులేందిరా.? అందులోనూ అంట్లుతోమేబూడిదా! తాగుబోతు నాయాలా? ఏం చేసావురా? " తిట్ల ప్రవాహం సాగిపోతూనే ఉంది.
అవతల వెంకటాయపాలెంలో మడిబట్ట మంగతాయారమ్మ లాయర్ పిట్ట తెచ్చిన మూట విప్పటానికి సమాయత్తం అయింది. సంచిలోంచి ఏదో చెడు వాసన వస్తుంటే, "ఏదో వాసనా ఏంటో! "అనుకుంటూ . మూట ఊడదీసి ఎండు చేపల వాసనకి తట్టుకోలేక అవతలికి దూకి,వాంతిచేసుకునిమూర్ఛపోయి, మళ్ళీ తేరుకుని.. " ఏరా! పిట్టగా! నీ నోట్లో కాకిరెట్టెయ్యా! దొంగ సచ్చినోడా! నీ శ్రాద్ధం పెట్టా! నా మడినంతా మంటగలిపావుగదరా ఏదో పనిమీద ఖమ్మం వెడుతున్నావూ! అక్కడ అంట్లుతోముకోటానికి బస్తాడు బూడిద దొరికితే తేరా! అనడిగా నా బుధ్దితక్కువై ! మరి ఈ మూటలో ఎండు చేపలేమిట్రా ముదనష్టపోడా! ఇప్పుడు నేను ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఈ కంపు వదిలించుకోవాలిరా?! తాగుబోతుచచ్చినోడా? ఇప్పుడు నేనేం చేసేదిరా?! అయ్యయ్యో! నీ జిమ్మడిపోనూ!" తిట్లపురాణం కొనసాగిస్తూనే ఉంది. అటు కఱ్ఱి సోము కీ, ఇటు లాయర్ పిట్టకీ తాగుడు మైకం లో పొరబాటు ఎక్కడ జరిగిందో అర్ధంకాక తలపట్టుక్కూర్చున్నారు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,374
Threads: 0
Likes Received: 6,814 in 5,173 posts
Likes Given: 70,137
Joined: Feb 2022
Reputation:
87
Posts: 2,272
Threads: 149
Likes Received: 7,533 in 1,503 posts
Likes Given: 4,303
Joined: Nov 2018
Reputation:
566
Maikasura colony - దుర్గమ్ భైతి
" మీరు ఎన్నైనా చెప్పండి,ఈసారి అతడు వేదిక దగ్గరికి రాకూడదు అంతే! " సుబ్బారావు ఖరాఖండిగా అన్నాడు.
"అది…" కృష్ణమూర్తి ఏదో చెప్పబోయాడు.
"మీరు ఏమి చెప్పకండి ప్రెసిడెంట్ గారు,అతని వలన మన కాలనీ ఎన్ని ఇబ్బందులు పడుతుందో మీరు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు.ఈసారి మనం ఏదో ఒకటి చేయాలి "
పతంజలి ఆవేశం కట్టలు తెంచుకుంది. "ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం పైనే మన కాలనీ భవితవ్యం ఆధారపడి ఉంది.ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుందాం " సముదాయించాడు రఘునాథం.
బయట వర్షానికి వాతావరణం చల్లగా ఉన్నది కాని మధుబాల కాలనీ ప్రెసిడెంట్ ఇంట్లో మాత్రం వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి.దీనికంతటికీ కారణం రాబోయే దసరా వేడుకలు.మధుబాల కాలనీలో రెండు వందల ఇళ్ళు ఉన్నాయి.కాలనీలో సంవత్సరానికి మూడు సార్లు అంటే,సంక్రాంతి,దసరా, కాలనీ వార్షికోత్సవం రోజున భారీగా వేడుకలు నిర్వహిస్తున్నారు.పెద్దలకు,పిల్లలకు రకరకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందచేస్తారు.వేడుకల చివరి రోజున నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమ వేదిక నే పెద్ద సమస్య గా మారింది. కాలనీ వాసులు అంతగా భయపడే విషయం బండ రాజు.అతడు కాలనీ పాలక వర్గంలో కార్యదర్శి. పైగా అన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాత గా తనే ఉంటాడు. ఐదేళ్ళు గా అక్కడ జరిగే ఏ వేడుకలో నైనా మైకుని ఎవరికి ఇవ్వడు. బండ రాజు వ్యాఖ్యానం వినసొంపుగా లేదని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోడు. కార్యక్రమం ప్రారంభంలో మైకు పట్టుకుని తన పాండిత్యం, లేని గొప్పలు చెప్పుకుంటూ అరగంట దాకా మైకు విడిచిపెట్టడు.ప్రెసిడెంట్ ఎన్నో సైగలు చేసినా పట్టించుకోడు. ఇతని అనవసర సుత్తి భరించలేక సగం మంది ఇంటికెళ్లుతారు. బండరాజు ప్రవర్తన కు విసుగు చెంది ఒకసారి ముఖ్య అతిథి గా వచ్చిన కార్పొరేటర్ మధ్యలోనే తిట్టి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులతో హాజరై ఆనందంగా చూడాలనుకున్న కాలనీవాసుల గుండెల్లో బండరాజు తన వ్యాఖ్యానం తో రైళ్లు పరుగెట్టేలా చేసాడు. పసి పిల్లలను తీసుకురావడం మాని వేసారు. ముసలి వారి ని బంధువుల ఇంటికి పంపిస్తున్నారు. కొందరు చెవుల్లో దూది పెట్టుకుని వస్తున్నారు.గతంలో ఈయన గారి మైకు స్వరానికి తట్టుకోలేక ఒక వృద్ధుడు వేదిక ముందే కుప్పకూలాడు.అందరు అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.అంబులెన్స్ తిరిగి వచ్చే వరకు అతని మైకు ఆగలేదు.బండ రాజు ని పాలక వర్గం నుండి తొలగించాలని వేడుకలప్పుడు అందరు గొంతెత్తి అరుస్తారు.ఎన్నికలప్పుడు అతనికున్న పలుకుబడిని ఉపయోగించుకుని ఓట్లు వేసి మరీ గెలిపిస్తారు. సాంస్కృతిక పోటీలో గెలిచిన బహుమతులు ప్రశాంతంగా తీసుకుందామనుకున్న కాలనీ వాసుల కు బండ రాజు మైకాసురుడిగా ప్రతి సారి అడ్డు తగులుతున్నాడు.పాలక వర్గం ఎన్నోసార్లు నచ్చ చెప్పి చూసింది.అతడు పద్ధతి మార్చుకోలేదు.అతడు మంత్రి గారికి సమీప బంధువు కావడంతో ప్రెసిడెంట్ మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు.మధుబాల కాలనీ ని మైకాసుర కాలనీ గా మార్చిన బండ రాజు భరతం పట్టాలని కోర్ కమిటీ ఈసారి గట్టి నిర్ణయం తీసుకుంది. ** *
దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి.వేదిక పైకి బండరాజు రాగానే అందరు గోల చేసారు. కోర్ కమిటీ సైగ చేసారు. ఒక్కసారిగా ఒక అపరిచిత వ్యక్తి వచ్చి బండరాజు చేతిలోని మైకు లాక్కొని అరవడం మొదలు పెట్టాడు.తనకు పోటీగా వ్యాఖ్యాత ను తెచ్చారని ఆలస్యంగా గమనించిన బండరాజు మరొక మైకు తీసుకొని అరిచాడు.వారి అరుపులకు పిల్లలు ఏడుస్తూ పారిపోయారు. పెద్దలు తిట్టుకుంటూ వెళ్లారు.కొందరు చోద్యం చూస్తూ నిలబడినారు.ఇద్దరు మైకాసురుల అరుపులకు వేదిక నిలువునా కూలింది.అంబులెన్స్ ల కూతలతో మధుబాల కాలనీ ప్రతిధ్వనించింది.ముల్లు ను ముల్లు తో తీయాలనే ప్రయత్నం బెడిసికొట్టగానే పాలక వర్గం వేడుకలకు చరమ గీతం పాడింది.
------/////--------
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,374
Threads: 0
Likes Received: 6,814 in 5,173 posts
Likes Given: 70,137
Joined: Feb 2022
Reputation:
87
Nice story
Posts: 2,272
Threads: 149
Likes Received: 7,533 in 1,503 posts
Likes Given: 4,303
Joined: Nov 2018
Reputation:
566
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
|