Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
[Image: image-2024-09-07-152549762.png]
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
జోసెఫ్ సెబాస్టియన్ - అశుతోష్ మీటింగ్
జోసెఫ్ సెబాస్టియన్ వాళ్ళ నాన్న గారిని గుర్తు చేసుకోవటం
 
అశుతోష్ చీకటి రాజ్యంలో బందీగా ఉన్నాడు. సరైన తిండి లేక కృశించిపోయి ఉన్నాడు.
 
తనని ఒక డార్క్ రూంలో బంధించి ఉండటంతో అక్కడికొచ్చే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేదు. ఘోర కలి చెప్పినట్టుగా టైం కి ఫుడ్, మంచి నీళ్లు, స్నానం చెయ్యటానికి ఒక పది నిమిషాలు, కాలకృత్యాలు తీర్చుకోవటానికి మరో పది నిమిషాలు మాత్రమే కేటాయిస్తూ తనను ఒక ఖైదీ కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారక్కడ. కాంటాక్ట్ డివైస్ కూడా అశుతోష్ కి అందుబాటులో లేకపోవటంతో అసలు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
 
కానీ అశుతోష్ జేబులో మాత్రం ఒక పాత హ్యాండ్సెట్ ఒకటి ఉండిపోయింది. నెంబర్ ప్రస్తుతం అతను వాడుతున్నది కాదు. పైగా అదొక బేసిక్ హ్యాండ్సెట్. సంజయ్ జోసెఫ్ సెబాస్టియన్ కి మొబైల్ నెంబర్ ని ఒకప్పుడు షేర్ చేసాడు. అశుతోష్ తో ఫోన్ కాల్ లో జోసెఫ్ గురించి సంజయ్ మాట్లాడిన తర్వాత సంజయ్ బై మిస్టేక్ అశుతోష్ పాత నెంబర్ ని జోసెఫ్ కు ఫార్వర్డ్ చేసాడు. జోసెఫ్ మొబైల్ లో అశుతోష్ పేరు మీద నెంబర్ స్టోర్ అయ్యి ఉంది.  అలా ఇప్పుడీ అశుతోష్ పాత మొబైల్ కి కొత్త నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది.
 
"హాయ్....అశుతోష్
జోసెఫ్ సెబాస్టియన్ హియర్"
 
మెసేజ్ చూడగానే అశుతోష్ కళ్ళు మెరిసిపోయాయి. ఇన్ని రోజులూ హోప్ వదిలేసి బతుకుతున్నాడు. ఇప్పుడు కొత్తగా డార్క్ రూమ్ లో ఎగ్జిట్ పాయింట్స్ వెతకటం మొదలు పెట్టాడు. కిటికీలు ఏవీ తెరుచుకోవటం లేదు. పైన ఒక హాపర్ విండో ఒకటుంది. హాపర్ విండో లో నుండి చూస్తే తను ఎక్కడున్నాడో  అర్థం అవుతుందేమోనన్న చిన్న ఆశ చిగురించింది. అక్కడ చాలా పెద్ద పెద్ద టేబుల్స్ ఉన్నాయి. పెద్ద కుర్చీలు కూడా ఉన్నాయి. అంతకముందు అక్కడ కార్పెంటరీ మరియు ఎలక్ట్రికల్ వర్క్స్ ఏవైనా జరిగాయేమో అనిపించేలా వుడెన్ ఫర్నిచర్, డ్రిల్లింగ్ మెషీన్లు ఉన్నాయి. అక్కడున్న పెద్ద టేబుల్ ని జరిపి మధ్యలో ఒక కుర్చీ వేసుకుని దాని పైకెక్కాడు అశుతోష్. టేబుల్ జరుపుతున్నప్పుడే అక్కడ బైనాక్యూలర్స్ దొరికింది. దాని సాయంతో హాపర్ విండో తెరిచి చూసాడు. జీకే నేషనల్ ఆయిల్ కంపెనీ అని కనబడింది. వెంటనే జోసెఫ్ కు మెసేజ్ చేసాడు.
 
"జీకే నేషనల్ ఆయిల్ కంపెనీ...
కమ్యూనిటీ 309
జీకే స్ట్రీట్"
 
అన్న మెసేజ్ వచ్చింది జోసెఫ్ మొబైల్ కు.
 
జోసెఫ్ సెబాస్టియన్ అదే ముత్తుస్వామి అయ్యర్ జీకే కార్పొరేషన్ లో జాయిన్ అయిన మొదటి రోజే జీషాన్ అన్న వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. జీషాన్ జీకే కార్పొరేషన్ మొదలైనప్పటి నుండి అక్కడే పని చేస్తున్నాడు. జీషాన్ కి జాబ్ వాళ్ళ పెద్దనాన్న ద్వారా వచ్చింది. వాళ్ళ పెద్దనాన్న జీకే కార్పొరేషన్ దుబాయ్ బోర్డు డైరెక్టర్. ఆయన ప్రస్తుతం అక్కడ లేరు. చీకటి రాజ్యంలో ఉన్నాడు.
 
జీషాన్ ని అడ్రస్ గురించి వాకబు చేసాడు జోసెఫ్. జీషాన్ కి జీకే స్ట్రీట్ మొత్తం బాగా తెలిసుండటంతో
 
"జీకే స్ట్రీట్ లో జీకే కార్పొరేషన్ ఎంప్లాయిస్ కి తప్ప బయటి వారికి చోటు లేదు. జీకే స్ట్రీట్ లోని కమ్యూనిటీకి వెళ్లాలన్నా సరే నీకొక ఐడి కార్డు కావాలి. నేను అరేంజ్ చేస్తాను. బట్ బీ కేర్ఫుల్. అక్కడ ఎవరిని కలవటానికి వెళుతున్నావ్?" అని అడిగాడు జీషాన్.
 
"మా మావయ్య. తనే నాకీ జాబ్ వచ్చేలా చేసాడు", అని వెంటనే సమాధానం ఇచ్చాడు జోసెఫ్.
 
"ఇంటరెస్టింగ్. మీ మావయ్య ఎక్కడుంటాడు?" అని అడిగాడు.
" కమ్యూనిటీ 309..."అని చెప్పి సంశయించాడు జోసెఫ్.
 
"హే, ఇట్స్ ఓకే. జస్ట్ అడిగాను. డీటెయిల్స్ చెప్పటం ఇష్టం లేకపోతే ఇబ్బందేం లేదు", అన్నాడు జీషాన్.
 
కమ్యూనిటీ 309 లో జీకే కార్పొరేషన్ ఎంప్లాయిస్ ఇళ్ళు చాలా ఉన్నాయి. అందుకే జీషాన్ పెద్దగా అనుమాన పడలేదు. వెంటనే జోసెఫ్ అక్కడికి వెళ్లేందుకు కావలసిన ఐడి కార్డును నిమిషాల్లో అరేంజ్ చేసిచ్చాడు.
 
కానీ అశుతోష్ ఉన్న డార్క్ రూమ్   కమ్యూనిటీ 309  లో లేదు. అశుతోష్ హాపర్ విండో లో నుండి చూస్తూ తన కంటికి ఏదైతే సైన్ బోర్డు కనబడిందో వెంటనే అదే చెప్పేసాడు తొందర్లో. డార్క్ రూమ్ కి  సరిగ్గా వెనక వైపున ఉందది.
 
ఇప్పుడు  కమ్యూనిటీ 309 కి వెళ్ళాక అశుతోష్ ఎక్కడున్నాడో వెతకాల్సిన పజిల్ మాత్రం జోసెఫ్ దే. ఎందుకంటే డార్క్ రూమ్ వేరే కమ్యూనిటీ పరిధి కిందకు వస్తుంది. డార్క్ రూమ్ బ్యాక్ సైడ్ నుండి చూసినప్పుడు ఎదురుగా కనబడే సైన్ బోర్డు మీద కమ్యూనిటీ 309 అని ఉందంటే డార్క్ రూమ్ ఉండేది 310 అయినా అయ్యి ఉండాలి లేదా 308 అయినా అయ్యుండాలి.
 
పైగా అశుతోష్ కి కేటాయించిన డార్క్ రూమ్ జీకే కార్పొరేషన్ ఎంప్లాయిస్ నివసించే కమ్యూనిటీలో ఉందో లేదోనన్నది అసలైన పజిల్. జీకే కార్పొరేషన్ ఎంప్లాయిస్ లేని కమ్యూనిటీ లలో ఎంటర్ అవ్వటం చాలా కష్టమని జీషాన్ హెచ్చరించడంతో జోసెఫ్ ఆలోచనలో పడ్డాడిప్పుడు. సరే ఏదైతే అదైంది అనుకుని ముందుగా   కమ్యూనిటీ 309 చేరుకున్నాడు జోసెఫ్.
 
జోసెఫ్ తను వచ్చే టైం అండ్ ప్లేస్ మెసేజ్ చెయ్యటంతో సరిగ్గా అదే టైంకి అశుతోష్ అలెర్ట్ అయ్యాడు. జోసెఫ్ కమ్యూనిటీ 309 సైన్ బోర్డు దగ్గరే నిల్చుని ఉన్నాడు. హాపర్ విండో లో నుండి జోసెఫ్ ను అశుతోష్ చూసాడు. ఎలా సైగ చెయ్యాలో తెలియట్లేదు.
 
అలాంటి టైంలో అశుతోష్ అక్కడున్న వుడెన్ ప్లాంక్ ని, డ్రిల్లింగ్ మెషిన్ ని తీసుకుని హాపర్ విండో పైన పెట్టి డ్రిల్ల్ చెయ్యటం మొదలు పెట్టాడు. వెంటనే గాలికి పొట్టు అంతా వ్యాపించింది. డ్రిల్లింగ్ సౌండ్ ని, గాలికి ఎగసి పడి తన వైపుగా వస్తోన్న పొట్టును రెంటిని ఒకేసారి గమనించిన జోసెఫ్ అశుతోష్ ఎక్కడున్నాడో కనిపెట్టగలిగాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
కమ్యూనిటీ 310 పరిధిలోని డార్క్ రూమ్ అది.
జోసెఫ్  కమ్యూనిటీ 310   లోకి అడుగుపెట్టాడు. అక్కడున్న బాడీ గార్డ్స్ కి తన ఐడి కార్డు చూపించాడు. తను జీకే కార్పొరేషన్ ఎంప్లాయ్ ని అని చెప్పాడు. అయితే నీకు ఇక్కడేం పని అన్నట్టు వాళ్ళు చూసారు. తన మావయ్యను కలవటానికి ఇటు వైపు వచ్చానని చెప్పాడు. కలిసాక తిరిగి బయలుదేరబోతూ మధ్యలో లఘుశంక కోసం తనకు దారిలో రెస్ట్ రూమ్స్ ఏవీ కనబడకపోవడంతో ఇటొచ్చానని చెప్పాడు. బాడీ గార్డ్స్ పైన నుండి కింద దాకా ఎగాదిగా చూసి ఒకరితో ఒకరు మాట్లాడుకుని జోసెఫ్ కు పర్మిషన్ ఇచ్చారు. జోసెఫ్ వెంటనే లేట్ చెయ్యకుండా అశుతోష్ డార్క్ రూమ్ ఉన్న వైపుగా వెళ్ళాడు. అశుతోష్ డార్క్ రూమ్ బయట బాడీ గార్డ్ ఎవ్వడూ లేదు. పైగా అక్కడున్న బెంచ్ పైన కీస్ ఉన్నాయి. వెంటనే జోసెఫ్ అక్కడున్న కీ తో డార్క్ రూమ్ డోర్ తెరిచాడు. తెరవగానే అశుతోష్ బయటకొచ్చేసాడు. అశుతోష్, జోసెఫ్ వెంటనే అక్కడున్న రెస్ట్ రూమ్ వైపుగా వెళ్లారు.
 
అశుతోష్, "నువ్వు వెంటనే నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లే ప్లాన్ చెయ్యాలి....ప్లీజ్ హెల్ప్ మీ" అంటూ ప్రాధేయపడ్డాడు.
 
జోసెఫ్, "సర్ నా దగ్గర రెండు జీపీఎస్ ట్రాకింగ్ డివైజెస్ ఉన్నాయి. ఒకటి వ్యక్తికీ, మరొకటి వెహికల్ కి ఫిక్స్ చెయ్యొచ్చు", అంటూ తన దగ్గరున్న డివైజెస్ ని అశుతోష్ కిచ్చేసాడు.
 
అశుతోష్,"థాంక్ యూ జోసెఫ్. ఘోర కలి ఇక్కడి నుండి వెళుతూ చివరి సారిగా నాతో మాట్లాడి వెళ్ళాడు. మళ్ళీ కనబడలేదు. ఘోర కలికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని బాడీ గార్డ్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. సురా అతని పేరు. అతనికి ఒక జీపీఎస్ ట్రాకర్ ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అతనికి ఎలాంటి సెక్యూరిటీ చెక్ అప్స్ లేవంట. మిగతా అందరికీ టైట్ సెక్యూరిటీ చెక్ ఉందిక్కడ. అండ్ ఇంకో డివైజ్ ని నేను టైం చూసి ఒక వెహికల్ కి ఫిక్స్ చేస్తాను. ట్రాకింగ్ డివైజెస్ తో వీళ్ళ మూవ్ మెంట్స్ తెలిసినా చాలు మనం ఏదైనా ప్లాన్ చెయ్యొచ్చు"
 
జోసెఫ్, "ఘోర కలి ఇంకా ఇక్కడికి రాలేదు సర్. చీకటి రాజ్యంలోనే ఉన్నాడు. మీ బేసిక్ హ్యాండ్సెట్ కోసం చార్జర్ అడిగారు కదా ఇదిగో", అంటూ తను తెచ్చిన చార్జర్ ఇచ్చాడు.
 
అశుతోష్,"హమ్మయ్య థాంక్ యూ జోసెఫ్. డార్క్ రూమ్ లో ఒక డొక్కు చార్జర్ ఉంది. ఇన్ని రోజులూ దానితోనే నెట్టుకొచ్చా", అంటూ జోసెఫ్ ను హగ్ చేసుకుని అశుతోష్ ఎమోషనల్ అయిపోయాడు.
 
"అసలు డార్క్ రూమ్ లోనే చచ్చిపోతానేమో అనిపించింది. నా లైఫ్....నా లైఫ్ ఎవ్వరికీ పనికిరాకుండా చీకట్లోనే అంతమైపోతుందేమో అనిపించింది. నాకు ఇలాంటి గతి పట్టించిన ఘోర కలిని ఊరికే వదలను. విల్ టీచ్ హిం వాల్యూబిల్ లెసన్", అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
 
అశుతోష్ తిరిగి డార్క్ రూమ్ లోకి వెళ్తూ, "జోసెఫ్ నీ గురించి నాకు సంజయ్ చెప్పాడు. కానీ నా పాత మొబైల్ నెంబర్ నీకెవరిచ్చారు?"
జోసెఫ్,"సంజయ్ రోజు మీతో ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత నెంబర్ ఫార్వర్డ్ చేసాడు. అది మీ పాత మొబైల్ నెంబర్ అని నాకు తెలీదు. లైఫ్ ఈజ్ సో స్ట్రేంజ్ కదా",అంటూ డోర్ క్లోజ్ చేస్తూ అన్నాడు.
 
అశుతోష్ జోసెఫ్ వైపు చూస్తూ ఒక నవ్వు నవ్వాడు. లైఫ్ లోని ఫిలాసఫీ అంతా అర్థం ఐపోయేలా ఉందా చిరునవ్వు.
 
డార్క్ రూమ్ కి తాళం వేసి కీ ని అక్కడే బెంచ్ మీద పెట్టేసి జోసెఫ్ తను వచ్చిన దారినే వెళ్ళిపోయాడు.
జోసెఫ్  కమ్యూనిటీ 310   నుండి బయటపడ్డాడు.
 
రోడ్ మీద నడుస్తూ ముందుకు వెళుతున్నాడు.
 
ఇప్పుడిప్పుడే తను దుబాయ్ లో చెయ్యాల్సిన పనులు క్రిస్టల్ క్లియర్ గా కళ్ళ ముందు కనబడుతున్నాయి.
 
అశుతోష్ కెరీర్ లో సాధించిన ఎన్నో విజయాలను సంజయ్ ద్వారా విని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో తిరుగులేని ఆర్టికల్స్ ఎన్నింటినో రాసాడు.
 
అవార్డ్స్ కూడా అందుకున్నాడు జోసెఫ్. అలాంటి గొప్ప ఆఫీసర్ ఇప్పుడు తనను ప్రాధేయపడుతున్నాడు.
అలాంటి సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ లో దైన్యం చూడటం చాలా బాధేసింది.
 
విధి మరీ ఇంత బలీయమైనదా ! మానవ యత్నం చెయ్యటం తప్ప మన చేతుల్లో ఏమీ లేదా అన్న వేదాంతం జీర్ణం కావటం లేదు.
 
జీవితపు లోతు తెలిసే కొద్దీ మనిషి మరింత కృషి చేస్తాడు విధిని తనకు నచ్చినట్టుగా మలచుకోవటానికి. కానీ ఇప్పుడు జోసెఫ్ విధిని మార్చాలి అనుకోవటం లేదు. ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ గౌరవాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎందుకంటే జోసెఫ్ వాళ్ళ నాన్న కూడా ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కాబట్టి. జోసెఫ్ కి వాళ్ళ నాన్న గుర్తుకొచ్చి రోడ్ నడిమధ్యలో మోకాళ్ళ మీద కూర్చుని ఆకాశం దిక్కు చూస్తూ ఏడ్చాడు. జోసెఫ్ వాళ్ళ నాన్న గారు చనిపోయారు. ఒక రెస్క్యూ ఆపరేషన్ లో టెర్రరిస్ట్ బందీలో ఇలాగే అశుతోష్ లా చీకటి గదిలో నిర్బంధింపబడి అతి కిరాతకంగా వాళ్ళ చేతుల్లో చనిపోయాడు. వాళ్ళ నాన్న రోజున ఎంతటి వేదనను అనుభవించి ఉంటాడో రోజున అశుతోష్ ను చూసాక జోసెఫ్ కు సరిగ్గా అర్థం అయ్యింది. అందుకే కన్నీటి రూపంలో తన ఆవేదనను, ఆవేశాన్ని వ్యక్తపరుస్తున్నాడు.
 
అశుతోష్ లో ఇప్పుడొక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ ని కాదు. వాళ్ళ నాన్నగారిని చూసుకుంటున్నాడు జోసెఫ్.
 
వాళ్ళ నాన్న గారిని కాపాడుకోలేకపోయానని ప్రతీ ఆదివారం చర్చిలో జీసస్ తో ఎన్నో సార్లు వేడుకున్నాడు. దేవుడు తన మొర ఆలకించినట్టున్నాడు. ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడేమో అనిపించింది. ఇప్పుడు అశుతోష్ ని నిండు ప్రాణాలతో ఇంటికి చేర్చటం జోసెఫ్ ముందున్న మిషన్.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
(22-09-2024, 12:31 PM)k3vv3 Wrote: వాళ్ళ నాన్న గారిని కాపాడుకోలేకపోయానని ప్రతీ ఆదివారం చర్చిలో జీసస్ తో ఎన్నో సార్లు వేడుకున్నాడు. దేవుడు తన మొర ఆలకించినట్టున్నాడు. ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడేమో అనిపించింది. ఇప్పుడు అశుతోష్ ని నిండు ప్రాణాలతో ఇంటికి చేర్చటం జోసెఫ్ ముందున్న మిషన్.

Very good updates, K3vv3 garu!!!.

yourock yourock clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
శంభల రాజ్యం – 4
విక్రమసింహుడి పరాక్రమం
 
అభిజిత్ సింహాల వెంట పర్వత శ్రేణులపై ఉన్న శిక్షణా కేంద్రాన్ని సమీపిస్తున్నాడు. ముందుగా వెళ్తున్న సింహం ఒక్కసారి ఆగి అభిజిత్ వైపు తిరిగి చూసింది. చూపు స్పర్శ అభిజిత్ ని బలంగా తాకింది. అలాంటి సన్నివేశం ఎన్నో సార్లు అక్కడ జరిగినట్టు అనిపించింది. తన స్మృతి పథంలోకి వెళ్ళిపోయాడు. ఇదే సింహం అలా ఎన్నో సార్లు వెనక్కి తిరిగి చూసేది. కానీ అప్పుడున్నదేదో ఇక్కడ కనబడటం లేదు. అసలేంటది ? ఒక వస్తువా? మనిషా? అభిజిత్ చుట్టూ ఉన్న సింహాలు కూడా ఇప్పుడు అభిజిత్ నే చూస్తూ ఉన్నాయి అదేదో గుర్తించు అన్నట్టు. ఒకే సారి ఎనిమిది సింహాల వంక చూస్తూ ఉన్నాడు అభిజిత్. ప్రతీ సింహం తనను ఒకేలా చూస్తోంది. వాటి చూపుల స్పర్శ తాలూకు గాంభీర్యం అదే. మాత్రం తేడా లేదందులో. అభిజిత్ కే తెలియకుండా కన్నీళ్ళొచ్చేస్తున్నాయి. ఏం చెప్పాలని చూస్తున్నాయో అంతుబట్టక కలిగే బాధ నుండి వస్తున్న కన్నీటి అలలవి. కన్నీళ్లు తుడుచుకుని మళ్ళీ ఒకసారి వాటి వంక చూసాడు. ఇప్పుడు సరిగ్గా అర్థం అవుతోంది. అక్కడ ఒకప్పుడు ఉండే మనిషి ఎవరో కాదు. తనే అని. ఇప్పుడు అభిజిత్ లా కాదు. విక్రమసింహుడిలా ఆలోచించాడు. విక్రమసింహ చూపు ఎలా ఉంటుందో అలా చూసాడు అక్కడున్న సింహాసనం వైపు.
 
ఎదురుగా ఉన్న అడ్డంకులు అన్నీ గుర్తుకొచ్చాయి. ఇదొకప్పుడు తన శిక్షణా కేంద్రమే. సింహాసనం పై తన గురువు  సమవర్తి ఉండేవాడు. సింహాసనం వైపుగా నడుచుకుంటూ వెళ్లి గురువును గుర్తుచేసుకోగానే ఆయన రూపం మెదిలింది అక్కడ. ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తున్నప్పుడు కన్నీటి బొట్లు అక్కడ పడ్డాయి. కన్నీటి చుక్కలు నేలపై పడ్డాయి. అంటే ఆయన అక్కడ లేకపోయినా తనకు కనిపిస్తున్నాడు అన్న దానికి సంకేతం అది.
 
"విక్రమసింహా....జయించు....జయించు....జయించు 
నీలో ఉన్న ఆవరణలు దాటు
నీ ముందున్నదేదీ నీకు అడ్డు కాదు....నీలో ఉన్నది మాత్రం ఖచ్చితంగా నీకు అడ్డుపడుతోందని తెలుసుకో 
విక్రమసింహా......జయించు.....జయించు....విజయం నీదే తెగించు
 
అవే మాటలు. ఎన్నో సార్లు తన చెవులతో తనే విన్న విజయ డంకాలు.
 
అగాధపు అంచుల్లోకి తను పడిపోతున్నప్పుడు పైకి తీసుకొచ్చిన చేతులలాంటి మాటలవి.
 
ఓటమి అంటే భయపడే విక్రముడిని విజయం తప్ప మరొకటి తెలియని విక్రమసింహుడిగా మార్చిన మంత్రాలవి.
 
విక్రముడు విక్రమసింహుడిగా మారితే అతని నడక చాలు సింహాలు కనిపెట్టేస్తాయి. ఒక నిఖార్సయిన యోధుడిని అదీ విక్రమసింహుడి లాంటి ప్రాణాలకు తెగించైనా వీరత్వాన్ని ప్రదర్శించే యోధుడిని అవి ఎప్పటికీ మరిచిపోవు. అందుకే అవి మామూలు సింహాలు కావు అన్నది.
 
అభిజిత్ ఇప్పుడు విక్రమసింహుడైపోయాడు. తన ఎదురుగా ఉన్న అడ్డంకులు ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాయి.
 
అగ్ని వలయం కనిపించింది మొదటగా. మరో ఆలోచన లేకుండా దూకేసాడు. దాన్ని చూసిన సింహాలు గర్జిస్తూ వచ్చాయి. ఒక దాని వెంట మరొకటి అదే అగ్ని వలయంలో విక్రమసింహ ఆజ్ఞ జారీ చేసినట్టు కళ్ళు మూసుకుని దూకేశాయి. అగ్ని వలయం మాయమై   సుడి గుండం ప్రత్యక్షం అయ్యింది. మరో ఆలోచన లేకుండా సుడి గుండంలో దూకేసాడు. సుడి గుండాన్ని చూస్తే గుండె ఆగిపోయే భయం వేస్తుంది ఎవ్వరికైనా. అలాంటి సుడి గుండం విక్రమసింహుడికి కనిపించట్లేదు. మరేదో కనిపిస్తోంది. ఆపద కనిపిస్తే ఎవ్వరైనా ఆగిపోతారు. ఒక యోధుడికి మామూలు వాడికి సరిగ్గా ఇక్కడే వ్యత్యాసం ఉంటుంది. యోధుడికి ఆపద చివరన ఉన్న ఉపాయం కనిపిస్తుంది. అందుకే కళ్ళ ముందున్న ఉపద్రవం అపాయంలా అనిపించదు. విక్రమసింహుడి వెంట సుడి గుండంలోకి సింహాలు రక్షక భటులలా వెంట వచ్చేసాయి. అనుకున్నట్టే సుడిగుండం కూడా ఆగిపోయింది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
 
ఇప్పుడు కళ్ళ ముందు  కత్తుల వలయం ఉంది. వలయంలో అడుగుపెడితే కత్తుల మీదే నడక. ఒక్క ఘడియ అయినా అవి కత్తులు అన్న స్పృహ కలిగితే మరుక్షణమే చచ్చినట్టు లెక్క. నొప్పి తెలిస్తే నడక ఆగిపోతుంది. నొప్పి తెలిసేలోపు వలయం ఆగిపోవాలనుకున్నాడు విక్రమసింహుడు. పరుగులో వేగం కాలాన్ని సైతం ఓడిస్తుంది. విక్రమసింహుడి దగ్గర మాత్రమే ఉన్న నైపుణ్యం ఇది. అలాంటి పరుగు అతనిది. లిప్తకాలంలో జయించుకు రాగలడు. కత్తులు తోరణాలలా, బాటలలా, గోడలలా చుట్టూ ఉన్న వలయంలోకి ఎప్పుడు వెళ్ళాడో ఎప్పుడు వచ్చాడో తెలియని వేగంతో పరిగెత్తాడు. సింహాలు గర్జిస్తూ వెళ్లాయి. ఏనుగులలా ఘీంకరిస్తూ బయట పడ్డాయి. కత్తుల వలయం పోయి  శబ్దారావం మొదలయింది.
 
ధ్వని యోధుడి దృష్టిని మార్చేస్తుంది. శబ్దారావంలోకి అడుగుపెడితే మాత్రం రకరకాల భావనలు కలిగించే శబ్దాలు మార్మోగుతుంటాయి. అవి కొంతసేపు మాత్రమే. అసలైన ప్రమాదం ముందున్నది. నిషాదం మొదలయ్యిందంటే ముందు ఏడుపొస్తుంది తర్వాత బాధ తర్వాత మనో వ్యథ తర్వాత బలహీనపడిపోయి అనంతమైన విషాదంలోకి మనల్ని ఎవరో నెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. నిషాదం అనగా ఏనుగు ఘీంకారం. తర్వాత గాంధార, మధ్యమ, రిషభ, దైవత రాగాలు మొదలవుతాయి. వీటిని ఉపయోగించి ఏమైనా చెయ్యొచ్చు. అంతటి శక్తి కలిగిన సంగీతం ఉంది వీటిలో. బాధనే ఆయుధంగా చేసుకున్న శబ్దారావంలోకి బాధ లేకుండా అడుగు పెట్టాడు విక్రమసింహుడు. అన్నీ క్షణికాలే అన్న స్పృహతో ఎల్లప్పుడూ బతికే వాడు, దాన్ని బలంగా నమ్మేవాడు నిజమైన యోధుడు. ఒక యోధుడు భావోద్వేగాలకు లోనవ్వడు. వాటికి అతీతమైన వాడే. ఎన్నో దాటొచ్చిన వాడు. ధైర్యంతోనే విక్రమసింహుడు కదిలాడు.
 
సింహాలు కదిలాయి.
 
శబ్దారావం దాటేసరికి విక్రమసింహుడికి కన్నీళ్లు వచ్చేసాయి. బాధతో కడుపులో మెలి తిప్పినట్టయ్యింది. గతంలోని బాధంతా బయటికొచ్చేసింది. ఓడిపోయానేమోనని ఆగిపోయాడు అక్కడే.
 
సమవర్తి ప్రత్యక్షం అయ్యాడు. తలదించుకున్న విక్రమసింహుడి వైపు చూస్తూ ఇలా మాట్లాడాడు.
 
"బాధనెప్పుడూ జయించలేవు విక్రమా...బాధ అనేది ఎప్పుడూ మనతో ఉండిపోయే గాయమే.
 
కాలం మాత్రమే బాధను తీసివెయ్యగలదు. మన చేతుల్లో లేనిదది. నీ బాధకు కాలమే పరిష్కారం చూపిస్తుంది. నువ్వు ఓటమి అని దేన్నైతే అనుకుంటున్నావో అది నీలో ఉన్న బాధ మాత్రమే. బాధ కలగటం ఎప్పుడూ ఓటమి కాదు. అసలు ఓటమి అన్నదే నీకు కలగకపోతే అప్పుడు నిజంగా బాధపడాలి. ఎందుకంటే అనంత విశ్వంలో ఓడిపోకుండా గెలిచిన యోధుడే లేడు. ఓటమి లేదంటే గెలుపు లేనట్టే", అనేసి అంతర్ధానం అయిపోయాడు.
 
జటిలలో మూసివున్న సింహ ద్వారం తెరుచుకుంది.
అంకిత, సంజయ్ అలెర్ట్ అయ్యారు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
 
"విక్రమసింహుడు గెలిచాడు. తురగము పై మెరుపులు మెరిపించటానికి వస్తున్నాడు.
 
తురగ ప్రాకారానికి సమాయత్తం కండి. విక్రమసింహుడి అశ్వహృదయ విద్య చూద్దురు గాని. నలుడు నేర్పిన విద్య", అంటూ మందహాసం చేస్తూ ముందుకు కదిలాడు రుద్రసముద్భవ.
 
విక్రమసింహుడే అభిజిత్ అని తెలియక తికమక పడ్డారు అంకిత, సంజయ్ లు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
అప్డేట్ బావుంది k3vv3 గారు, కానీ సెప్టెంబర్ లో పోస్ట్ చేసిన కథనే మళ్ళీ రిపీట్ పోస్ట్ చేసారు
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
నా తప్పిదం

రేపు మారుస్తాను, ఇదే స్థానంలో

ధన్యవాదములు ఉదయ్ గారు
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
కథ ఇపుడు సరిగానే వచ్చింది.

మార్చాను, పునరుక్తమైన భాగాలను.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
చాలా చక్కగా వివరించారి ఒక యోధుడికుండవలసిన లక్షణాలను, బహుశా అర్జునుడికి కూడా ఇలాంటి ఉపదేశమే లభించివుంటుంది శ్రీకృష్నుడి మూలంగా తనను కార్యోణ్ముఖుడ్ని చేయడానికి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
[Image: image-2024-10-12-092753099.png]
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
[Image: image-2024-10-12-092753099.png]
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
(09-10-2024, 09:57 AM)k3vv3 Wrote:  
"విక్రమసింహుడు గెలిచాడు. తురగము పై మెరుపులు మెరిపించటానికి వస్తున్నాడు.
 
తురగ ప్రాకారానికి సమాయత్తం కండి. విక్రమసింహుడి అశ్వహృదయ విద్య చూద్దురు గాని. నలుడు నేర్పిన విద్య", అంటూ మందహాసం చేస్తూ ముందుకు కదిలాడు రుద్రసముద్భవ.
 
విక్రమసింహుడే అభిజిత్ అని తెలియక తికమక పడ్డారు అంకిత, సంజయ్ లు.

K3VV3 garu! Story is v
ery Interesting !!!

yourock yourock clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
శంభల రాజ్యం – 5
తురగ ప్రాకారానికి పయనం
 
విక్రమసింహుడు సింహద్వారం దగ్గరకు వచ్చాడు. అంకిత, సంజయ్ అతన్ని విచిత్రంగా చూస్తున్నారు.
 
"అభిజిత్..." అని కాసేపు పాజ్ ఇచ్చింది అంకిత.
 
విక్రమసింహుడి వైపు నుండి స్పందన లేదు.
 
రుద్రసముద్భవ, "విక్రమసింహా నీ కోసం అనిలుడు ఎదురుచూస్తున్నాడు" అనగానే అక్కడున్న సింహద్వారం నుండి బలంగా గాలి వీచింది ఎవరో అటుగా వస్తున్నట్టు.
 
భూలోకంలో అంకిత, సంజయ్ లు అంతక ముందు గుర్రపు డెక్కల చప్పుడును ఎన్నో సార్లు విని ఉన్నారు. కానీ ఇప్పుడొచ్చేది శబ్దమో, చప్పుడో కాదు. హోరు. హోరెత్తిస్తూ వచ్చే అనిలుడు. తురగ ప్రాకారంలోని అశ్వమే అనిలుడు. అనిలుడికి విక్రమసింహుడు వస్తాడని తెలుసు. తనను అధిరోహిస్తాడనీ తెలుసు. అది తన స్వామి భక్తికి నిదర్శనం. తన ఉనికికి దర్పణం. నల్లటి చీకటిలో నుండి తెల్లటి ధూపము ఏదో వస్తోంది. సింహద్వారం నుండి తురగ ప్రాకారం కనిపించట్లేదు కానీ అనిలుడి రాకను తెలియజేసేలా ధూపము చీకటిని చీల్చుకుంటూ వస్తోంది.
 
తనను సమీపిస్తున్న కొద్దీ అనిలుడి శ్వాసను కూడా వినగలుగుతున్నాడు విక్రమసింహుడు. అంకిత, సంజయ్ లకు గుండెలు అదిరిపోతున్నాయి. అంతలోనే సింహద్వారం పైన నుండి డంకా మోగటం మొదలైంది.
 
"అనిలుడి రాకకు సూచన", అన్నాడు రుద్రసముద్భవ.
 
సింహద్వారం దాకా వచ్చిన అనిలుడు ఆగిపోయాడేమో అన్నట్టు అప్పటి దాకా ఉన్న తెల్లటి ధూపం ఆగిపోయింది. అంతా చీకటే అన్నట్టుంది ఇప్పుడు. సింహద్వారం ఆవల అంతా చీకటి సముద్రమేమో అన్న భ్రమను కలిగిస్తోంది. సరిగ్గా అప్పుడే రెండు కళ్ళు విక్రమసింహుడిని చూస్తున్నట్టు మెరిసాయి.
 
చిక్కటి చీకట్లో తళుక్కున మెరిసిన కళ్ళను చూసేసరికి అంకిత, సంజయ్ లకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
విక్రమసింహుడే అని తెలిసిందో ఏమో కుడి కాలు పెట్టి సింహద్వారానికి ఈవలననున్న జటిలలోకి ఇలా అడుగుపెట్టిందో లేదో పెద్ద ఉరుము ఒకటి ఇటు పడ్డట్టు అక్కడ ఒకటే మోత. ఒక కాంతి పుంజమేదో అక్కడ వెలిసినట్టు ఎంతో వెలుగు. వెలుగు ఎప్పుడాగిపోతుందా అన్నట్టు నొప్పెడుతున్న కళ్ళతో చూస్తున్నారు అంకిత, సంజయ్ లు.
 
అంతలో అక్కడ అనిలుడు ప్రత్యక్షం అయ్యాడు. తెల్లటి మేనిఛాయ. విగ్రహం చూస్తే అది మామూలు లాకలూకాయలు నడిపే అశ్వం కాదని ఎవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది. దేవతా మూర్తిలా అనిపిస్తుంది. ఎత్తే ఏడు అడుగులు పైన ఉంటుందేమో.
 
అనిలుడి చూపులు అక్కడున్న విక్రమసింహుడి మీద తప్ప ఎవ్వరి మీద పడటం లేదు. విధేయుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మనం అనిలుడినే చూపించాలి. కొంత మందిని చూస్తే చాలు మళ్ళీ ప్రత్యేకించి వారి గుణగణాలని విడమరచి చెప్పఖ్ఖర్లేదు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న దేవతా అశ్వం అనిలుడు. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ విక్రమసింహుడి దగ్గరికొచ్చి నిలబడ్డ అనిలుడు తల వంచి రెండు కన్నీటి బొట్లను కార్చాడు. అవి సరిగ్గా విక్రమసింహుడి పాదాల్ని తడిపాయి. తన రాజుకు క్షణానే జరిగిన అభిషేకం అది. విక్రమసింహుడేమైనా తక్కువా !
 
ముంచుకొస్తున్న సంద్రాన్ని ఆపగలమా అలాంటి కన్నీటిని ఆపే ధైర్యం విక్రమసింహుడికి కూడా లేదు. కన్నీరు నిండిన మొహంతో తన రెండు చేతులతో అనిలుడి తల పట్టుకుని కళ్ళు మూసి కన్నీటిని మాత్రం చెంపల కిందకు జారవిడిచారు ఇద్దరూ. దృశ్యాన్ని చూస్తున్న రుద్రసముద్భవ కూడా తన కన్నీటిని ఆపుకోలేకపోయాడు. అంకిత, సంజయ్ లకు ఇదంతా అర్థం కాకపోయినా ఏదో అంతుబట్టని బలమైన కారణం చేత కన్నీరొచ్చేసింది. అలా ఉంది అక్కడి పరిస్థితి.
 
లోకాల్ని చుట్టే అశ్వమా 
శంభల రాజ్య మకుటమా
అనిలా 
 
అందుకో రుద్రసముద్భవుని వందనాలు అంటూ రుద్రసముద్భవుడు నమస్కారం చేసాడు.
 
ఎరుకగలిగినట్టు అనిలుడు తల ఊపాడు. ఆనందంగా రుద్రసముద్భవ తల ఆడించాడు.
 
చాకచక్యంగా అనిలుడిని అధిరోహిస్తున్న విక్రమసింహుడిని చూస్తూ విస్తుపోతున్నారు అంకిత, సంజయ్ లు.
 
వాళ్ళు చూస్తూ ఉండగానే వాయువేగంతో జటిల దాటేసి తురగ ప్రాకారం వెళ్ళిపోయాడు  విక్రమసింహుడు అనిలుడితో.
 
అక్కడున్న ధూళి కొంత పైకెగసింది. రుద్రసముద్భవకు ఏదో గుర్తొచ్చినట్టు గట్టిగా నవ్వాడు.
 
"పదండి వెళదాం", అంటూ రుద్రసముద్భవ అంకిత, సంజయ్ లను చూస్తూ అన్నాడు.
 
ఇప్పటికీ సింహద్వారం ఆవల మొత్తం చిక్కటి చీకటితో దారే కనిపించకుండా ఉంటే ఎలా వెళ్ళాలిరా దేవుడా అని భయపడుతూ బిక్కుబిక్కు మంటున్న అంకిత, సంజయ్ లను తీసుకుని రుద్రసముద్భవ జటిల దాటాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
(25-10-2024, 01:44 PM)k3vv3 Wrote: శంభల రాజ్యం – 5
తురగ ప్రాకారానికి పయనం
 

ఇప్పటికీ సింహద్వారం ఆవల మొత్తం చిక్కటి చీకటితో దారే కనిపించకుండా ఉంటే ఎలా వెళ్ళాలిరా దేవుడా అని భయపడుతూ బిక్కుబిక్కు మంటున్న అంకిత, సంజయ్ లను తీసుకుని రుద్రసముద్భవ జటిల దాటాడు.

K3vv3 Garu, This story is so interesting. From one episode to the next episode, the story is building upon nicely!!!

yourock yourock clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
శంభల రాజ్యం – 6
విక్రమసింహుడి అంతర్మథనం
 
రుద్రసముద్భవ నేతృత్వంలో జటిల నుండి అనంతమైన చీకటి సముద్రంలోకి దూకేశారు అంకిత, సంజయ్ లు. తురగ ప్రాకారం మొత్తం ఇంకా చీకటిమయంగానే ఉంది.
 
అడుగులు అయితే పడుతున్నాయి గానీ ఎటు వెళుతున్నారో తెలియట్లేదు అంకిత, సంజయ్ లకు.
 
"అంతా చీకటిగానే ఉంది స్వామి", అన్నాడు సంజయ్.
 
"అది చీకటి కాదు. మీ కంటికి కనిపించని వెలుగు. విక్రమసింహుడి పరాక్రమాన్ని చూసిన ప్రాకారంలో శౌర్యం చూడని కన్నులు మీవి. మీకు అలాగే ఉంటుంది. అందులో మీ తప్పేం లేదు. ప్రాకార చరిత్రని తెలియజేసే  గమన వాహిని ఇక్కడొకటి ఉండాలి. దానికోసమే వెతుకుతున్నాను."
 
అంతలో అక్కడొక సుడిగాడ్పు వీచింది. అదేదో శక్తి అనిపించేలా వీళ్ళ చుట్టూతా తిరుగుతోంది. వీళ్ళకేదో చెప్పాలి అనుకుంటుందేమో అన్నట్టుంది. అలా ఒక ఐదు నిమిషాల పాటు సాగింది. రుద్ర సముద్భవ కాళ్ళ దగ్గర ఆగిపోయిన పెనుగాలి చివరికి వెళుతూ వెళుతూ   గమన వాహినిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది.
 
"ఇదే మనకు కావలసిన  గమన వాహిని. మీకీ ప్రాకారాన్ని చూపించి దిశానిర్దేశం చేసేది ఇదే", అంటూ తన రెండు చేతులతో గమన వాహినిని తీసుకున్నాడు.
 
అది పైకి చూడటానికి ఒక బంగారం దాచే పెట్టెలా ఉంది. బయటికి మెరిసిపోతూ ఉంది. రుద్రసముద్భవ గమన వాహినిని తెరిచాడు. తెరవగానే గమన వాహిని లో నుండి వెలుగులు విరజిమ్ముతూ తురగ ప్రాకార ఆవిష్కరణ వాళ్ళ కళ్ళ ముందే జరుగుతుందేమోనన్నట్టు ఒక దాని వెంట మరొకటి ప్రాకారంలో జరిగిన విశేషాలన్నీ వారి ఎదుటే తెర మీద కనిపించే బొమ్మలలా కదిలిపోతూ ఉన్నాయి. ఇదంతా చూస్తూ అంకిత, సంజయ్ లు ఆశ్చర్యపోయారు.
 
అంతలో   గమన వాహిని నుండి ఒక స్వరం వినిపించింది. చాలా గాంభీర్యం నిండిన స్వరమది.
 
"కాలగమనంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే ఎప్పటికీ చిరస్థాయిలో గుర్తుండిపోతాయి. అదేదో నిన్నే జరిగిందేమోనన్నట్టు మిగిలిపోతాయి. అలాంటి అశ్వహృదయ విద్యా ప్రదర్శన శంభల రాజ్యంలోని తురగ ప్రాకారంలో మాత్రమే జరిగింది. ఎందరో యోధులు పాల్గొన్నారు. విక్రమసింహుడు జయించి ఓడిన చోటిది. ఒక గొప్ప యోధుడు గెలిచి ఓటమితో వెనుదిరిగిన చరిత్ర ఇది. అందుకే చరిత్ర మీకు  భౌమ్యభూమిక నందు కనబడదు. ప్రాకారం ఒక యుద్ధభూమిక. భూమికలోకి మీరు అడుగుపెడితే కానీ చరిత్ర మీకు కనబడదు. భూమిక మీకు పూర్తిగా కనబడాలంటే రుద్రసముద్భవ వేసే మంత్రంతో మాత్రమే అది సాధ్యపడుతుంది", అంటూ అంతటితో స్వరం ఆగిపోయింది.
 
"స్వామీ,   గమన వాహిని   నుండి వెలువడిన కంఠం ఎవరిది?" అడిగాడు సంజయ్.
 
"గమన వాహిని ఒక సేన. సేనాధిపతి స్వరమే మీరు విన్నది", అన్నాడు రుద్రసముద్భవ.
 
"కాలం ఒక నిరంతర సంగ్రామం. సంగ్రామంలో ఎప్పటికప్పుడు గెలుస్తూ మన గొప్ప చరిత్రను కాపుడుతూ మనకందించే సైన్యమే   గమన వాహిని. సత్యం, అసత్యం అనే రెండు వర్గాల మధ్య జరిగే పోరు. కాలం అనే యుద్ధభూమిలో తలపడినప్పుడు మీకు వినబడే స్వరం ఇది", అంటూ గర్వంగా గమన వాహిని వైపు చూసాడు రుద్రసముద్భవ.
 
అప్పుడు ఒక యోధుడి ఆకారంలో గమన వాహిని సైన్యాధిపతి రుద్రసముద్భవకు నమస్కరిస్తూ కనిపించాడు. ఒక్క నిమిషం గగ్గుర్పాటుకు గురయ్యారు అంకిత, సంజయ్ లు.
 
"భౌమ్య భూమిక అంటే ఏంటి స్వామి?" అని అడిగింది అంకిత.
"భూమి నుండి వచ్చిన మీ చూపుకు అందే భూమిక. అంటే భూలోక ప్రదేశంలా కనబడే చోటు. అలాంటి భౌమ్యభూమిక లు కానివి మీకు కనబడవు. అంతా చీకటి మయంలా అనిపిస్తుంది. అందుకే ప్రస్తుతం మీ చుట్టూ పెను చీకటి నిండి ఉంది", అన్నాడు రుద్రసముద్భవ.
 
"నేనిప్పుడు మనసులో ఒక మంత్రం స్మరిస్తాను. అలా అనుకోగానే మీ చుట్టూ ఉన్న చీకటి మాయమైపోయి మీకీ ప్రాకారం అసలు స్వరూపం కళ్లముందుంటుంది. అప్పుడు ఎంతో వేగంగా అనిలుడితో వస్తున్న విక్రమసింహుడు మీకు కనిపిస్తాడు. భయపడకండి. అశ్వహృదయ విద్యలో ఆరితేరిన వాడతను. అతని గమన వేగానికి దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. మీరు తప్పకుండా భయపడతారు. అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాను", అనేసి మంత్రాన్ని మనసులో మననం చేసుకోవటానికి రెండు కన్నులు మూసి ఏదో స్మరించటం మొదలు పెట్టాడు రుద్రసముద్భవ.
 
మెల్లగా ఒక పక్క నుండి చీకటి తొలగిపోతూ వస్తోంది. చీకటి చెదరిపోతోందేమో అన్నంత వేగంతో అనిలుడిపై వస్తున్నాడు విక్రమసింహుడు.
 
అనిలుడి పరుగుతో పోటీ పడే సత్తా లేక చీకటి అమాంతం ఎగిరిపోయింది. ప్రాకారంలో మొట్టమొదటగా వారికి త్రివిక్రమ స్వరూపంలో ధీరత్వానికి ప్రతీకగా కనిపించింది అనిలుడిపై నున్న విక్రమసింహుడే. అలా మెరిసాడో లేదో అలా మాయమైపోతున్నాడు. అంతటి గమన వేగం అనిలుడిది. అలుపు లేని పరుగు. అదుపు లేని పరుగు. మెరుపు లాంటి పరుగు. మరువలేని పరుగు. అలా వెళ్ళిపోతున్న అనిలుడినీ, విక్రమసింహుడినీ చూస్తూ చూస్తూ అలా ఒకసారి ప్రాకారాన్ని చూసేసరికి అది ఎంత పెద్ద యుద్ధభూమో అర్థం అయ్యిండప్పుడు. లోకాలన్నీ పరుచుకున్నంత పెద్దగా ఉందది. అలా ఎలా నిర్మించారో అంతుబట్టడం లేదు. ఒక్కటి మాత్రం నిజం. అదొక పద్మ వ్యూహం లాంటిది. అక్కడి నుండి బయటపడటానికి గెలుపు తప్ప వేరొక మార్గం లేదు. బరిలో ఎవ్వరూ లేనప్పుడే ఇంత దడ పుట్టిస్తోందంటే అంత మంది యోధుల ముందు విక్రమసింహుడు తన పరాక్రమాన్ని ఎలా చూపించాడా, ఎలా గెలిచాడా అని అంకిత ఆశ్చర్యపోయి చూస్తోంది.
 
విక్రమసింహుడు అలా అనిలుడిపై స్వారీ చేస్తూ  ఎంత సేపు పరిగెట్టాడో తెలీదు.
 
విక్రమసింహుణ్ణి తదేకంగా అలా చూస్తున్న అంకిత, సంజయ్ లకు వారి కళ్ళ ముందే విక్రమసింహుడి చరిత్ర పరుచుకుంటోంది. తురగ ప్రాకారంలోని విక్రమసింహుడి చరిత్ర కళ్ళ ముందే ఆవిష్కృతం అయ్యే సమయం ఆసన్నమయింది. అదేంటో తెలుసుకుందామనే ఆదుర్దా ఘడియ, ఘడియకూ రెట్టింపు అవుతోంది అంకితలో.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)