Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - తార్మార్ తక్కడమార్
#21
కోతి అప్పడాల కర్ర - మీగడ.వీరభద్రస్వామి
 
[Image: image-2024-08-31-100714259.png]
 
సింగినాధం అడవి నుండి దారి తప్పి ఒక కోతి సుప్పనాతి ఊర్లోకి వచ్చింది, సుప్పనాతి ఊర్లో పిట్టగాడు అనే ఒక పెంకి కుర్రాడు ఉండేవాడు, పిట్టగాడు వయసు పదహారు సంవత్సరాలు ఆలోచన చూస్గ్తే ముప్పై ఆరు సంవత్సరాలు, బడికి వెళ్తే చదువు తప్ప వెంటనే రాబడి రాదని అరకొర చదువులు చదివేసి, బడి మానేసి ‘తిమ్మిని బొమ్మని బొమ్మని తిమ్మిని’ చేసి, లోకానికి మసిబూసి మారేడు కాయ చూపి డబ్బు సంపాదించాలనే ఆలోచనలే ఎక్కువ ఆలోసించేవాడు, చిత్తుకాగితం దొరికినా దాన్ని ఉపయోగించి ఒక చేతి కవరు చేసి దాన్ని అమ్మి పది పైసలైనా సంపాదించే రకం పిట్టగాడు, పొరపాటున సింగినాధం అడవి కోతి పిట్టగాడికి తారసపడింది, దాన్ని మచ్చిక చేసుకున్నాడు పిట్టగాడు ఎందుకైనా పనికి వస్తుందని. “కోతిని ఊర్లో వుంచడం మంచిదికాదు దాన్ని అడవిలోకి తరిమేద్దాం” అని ఊర్లో వాళ్ళు అందరూ అన్నారు, “కోతి వల్ల కోటి లాభాలు” అనే నినాదం ఎత్తుకున్నాడు పిట్టగాడు, “కథలు చెప్పకు!ఈ కోతిని నువ్వు తరుముతావా లేక మమ్మల్నే తరిమేయమంటావా! ”అని ఊర్లోవాళ్ళు గట్టిగా అనేసరికి,అప్పటికప్పుడు సరైన ఆలోచనతోచక కోతిని తీసుకొని అడవి వైపు బయలుదేరాడు పిట్టగాడు, దార్లో ఒక చెట్టు క్రింద కూర్చొని ఈ కోతిని వృదాగా వదిలేయకూడదు దీన్ని ఉపయోగించుకొని కనీసం రోజుకి వందరూపాయులైనా సంపాదించుకోవాలి అనుకుంటూ...అందుకు మార్గం ఆలోచించాడు.
అదే దారిలో ఒక ముసలి మంగలి కనిపించాడు పిట్టగాడికి, అతనికి ఐదు రూపాయులు ఆశ చూపి, కోతికి ఆంజనేయస్వామి మాదిరిగా ముస్తాభు చెయ్యడానికి దాని తల గొరిగించి ఒక చిన్న పిలక ఉంచాడు, నుదుటపై మూడు నిడువు నామాలు వచ్చేటట్లు కటింగ్ చేయించాడు,“కోతి తల గొరుగుడు గురుంచి ఎవ్వరికీ చెప్పకు”అని ముసలి మంగలికి మరో పది రూపాయలు ఇచ్చాడు పిట్టగాడు, “వీడే కోతి వెదవలా వున్నాడు! వీడికి తోడూ మరో కోతి! బాగుంది సంబరం, ఎదో పొట్టకూటికి వేషాలు వేసుకునేవాడిలా వున్నాడు, వీడి గుట్టు ఎందుకు ఇప్పడం!” అనుకుంటూ “సరే” అంటూ “నువ్వు నీ వేషాలను లోకానికి పనికి వచ్చేటట్లు ఉపయోగించుకో..లోకానికి కీడు జరిగితే నీ బండారం నేనే బయట పెడతాను” అని హెచ్చిరించి అక్కడనుండి వెళ్ళిపోయాడు ముసలి మంగలి.
పిట్టగాడు కోతిని ఎత్తుకొని కొంత దూరం పోయేసరికి అక్కడ పోలేరమ్మ గుడి కనిపించింది, అక్కడ ఎక్కువగా వున్న పసుపు కుంకుమ తీసుకొని కోతికి ఒంటి నిండా పూసాడు, ఒంటి నిండా పసుపు కుంకుమ, నుదుటన మూడు నామాలు, తల వెనుక పిలక అచ్చం హనుమంతుడులా వుంది కోతి ,”ఇక మన పాచిక పారవచ్చు” అనుకున్నాడు పిట్టగాడు, కొంతదూరం పోయేసరికి ఒకవూరు కనిపించింది, “ఇక డ్రామా మొదలు పెట్టవచ్చు” అనుకోని రావి చెట్టు, వేపచెట్టు కలిసి పెరిగిన చోటు ఎంచుకొని అక్కడ కోతిని కూర్చోబెట్టి దానికి సాష్టాంగ నమస్కారం చేస్తూ హనుమంతుడి వీరభక్తుడు ఫోజ్ పెట్టాడు,కొంత సమయానికి అక్కడకు దగ్గరలో వున్న వూరు జనం తండోప తండాలుగా రావడం మొదలు పెట్టారు, అక్కడ హనుమాన్ కీర్తనలు మారు మ్రోగాయి, భజనలు ప్రారంభమయ్యాయి, పిట్టగాడు కళ్ళు తెరిచాడు, అతడు అనుకున్నదే జరిగింది, కోతిని భగవాన్ హనుమాన్ అవతారమని అందరూ నమ్మినట్లు వున్నారు,తనని హనుమాను భక్తుడు అని అందరూ మెచ్చుకుంటున్నారని పిట్టగాడికి అర్ధమయ్యింది, మనసులోనే ముసలి మంగలికి దండం పెట్టుకున్నాడు, ఆ తాత తన అనుభవాన్ని రంగరించి కోతిని హనుమంతుడులా క్షవరం ద్వారా తయారు చేయబట్టే తన పాచిక పారిందని ముచ్చట పడిపోయాడు పిట్టగాడు.
పిట్టగాడ్ని, కోతిని ఊర్లోకి తీసుకొని పోయారు ఆ వూరువాళ్ళు, అక్కడ సామాజిక భవనంలో తాత్కాలికంగా పిట్టగాడికి ఆశ్రమం ఏర్పాటుచేశారు, “హనుమాన్ సహిత హనుమాన్ భక్త బాలయోగి నిలయం” అని ఆ ఆశ్రమానికి పేరు పెట్టారు ఊర్లోని పరమ భక్తులు, ఇంకేముంది పిట్టగాడి పంటపండింది, కోతికి తిండి, పిట్టగాడికి దండిగా దక్షిణలు వచ్చి పడుతున్నాయి, అక్కడ ఒక యాత్రా స్థలం అయిపోయింది,కొన్నాళ్ళుకు అక్కడ ఒక గుడి వెలసింది, అది ఒక చిన్న సైజు పుణ్య క్షేత్రం అయ్యింది.
కోతిని పట్టుకొని అడవి వైపు పోయిన పిట్టగాడు రోజులు గడిచినా తిరిగి ఊరుకి రాలేదని సుప్పనాతి వూరు వాళ్ళు కంగారు పడ్డారు “అయినా మనోడు అమాయకుడు కాదు ఏదోఒక ఘన కార్యం చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు ,పర్వాలేదు “అనుకొంటూ కొందరు ధీమాగా వున్నారు, అయితే పిట్టాగాడి తలిదండ్రులు కంగారు పడుతుండటంతో కొంత మంది యువకులు పిట్టగాడ్ని వెదకడానికి బయలుదేరారు, ఎట్టకేలకుఆ యువకులు పిట్టగాడి చిరునామా తెలుసుకొని పిట్టగాడి ఆశ్రమానికి చేరుకున్నారు, అక్కడ పిట్టగాడి దర్జా, హోదా చూసి అతని వూరు యువకులు ఆశ్చర్యపోయారు, పిట్టగాడు ఆ యువకుల్ని చూసి చూడనట్లు నటించి అసలు సిసలు బాలయోగిలా చాలా పోజు కొట్టాడు,”ఓరి వీడి వేషాలూ” అని మొదట్లో అనుకున్న పిట్టగాడి వూరు యువకులూ ఆ తరువాత పిట్టగాడి బుట్టలో పడిపోయారు,అక్కడ పిట్టగాడ్ని అందరూ బాబాలా కొలుస్తున్నారు, కోతి కోతిలా లేదు నిజంగా హనుమంతుడులాగే వుంది, గతంలో పిట్టగాడు “ఈ కోతి వల్ల మనవూరుకి మేలు జరుగుతుందని చెబితే మనం వినలేదు పిట్టగాడు అన్నట్లు ఈ కోతి నిజంగా హనుమాన్ నిజరూపమే” అని అనుకుంటూ సుప్పనాతి యువకులూ పిట్టగాడి భక్తులు అయిపోయారు, విషయమంతా తెలుసుకొని సుప్పనాతి వూరు వారు పిట్టగాడి ఆశ్రమానికి వచ్చి “నిజానికి ఈ బాలయోగి మా వూరు వాడు అతన్ని మా వూరు తీసుకుపోయి పెద్ద గుడి కట్టి సంబరాలు చేసుకుంటాము మీరు మాకు సహకరించాలి” అని ప్రాదేయ పడటంతో..అవతల వూరువాళ్ళు ఒప్పుకున్నారు, పిట్టగాడు కోతి సమేతుడై తన సొంత వూరు సుప్పనాతి చేరుకున్నాడు, అక్కడ ఒక పేదరాసి పెద్దమ్మ అప్పడాలు చేస్తూ చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి పిట్టగాడి ఆశ్రమానికి వచ్చి అప్పడాల కర్ర వదలకుండానే కోతికి కళ్ళు మూసుకొని మరీదండం పెట్టింది,కోతి గబాలున పెద్దమ్మ చేతిలోని అప్పడాల కర్రను లాక్కొని పుట్టుకతో వచ్చిన బుద్ధి పోదు కాబట్టి అప్పడాల కర్రతో అక్కడున్న భక్తులకు బలంగా మోదడం చేసింది, భక్తులు పరమానందబరితులయ్యారు, పెద్దమ్మ మురిసిపోయింది, అప్పటి నుండి పిట్టగాడు కొత్త పల్లవి ఎత్తుకున్నాడు, హనుమంతుడు అప్పడాల కర్రతో ఎన్నిదెబ్బలు వేస్తె అన్ని వందలు రూపాయలు దక్షిణగా ఇవ్వాలని షరతులు పెట్టాడు, భక్తులు సందడి ఇంకా పెరిగిపోయింది, “కోతి అప్పడాల కర్ర” ప్రచారం బాగా పెరిగి పిట్టగాడి రాబడి బాగా పెరిగింది.
గతంలో కోతికి క్షవరం చేసిన పెద్దయానికి పిట్టగాడి కథ తెలిసింది ,అసలు పిట్టగాడు కోతిని ఏవిధంగా ఉపయోగించుకుంటున్నాడో తెలుసుకుందామని పిట్టగాడి ఆశ్రమానికి వచ్చాడు, పిట్టగాడు ముసలి మంగలి మేలు మరచిపోయాడు,అతన్ని పట్టించుకోలేదు, అందుకు భాద పడలేదు కానీ..తాను కోతికి చేసిన క్షవరాన్ని వాడుకొని, దాన్ని హనుమంతుడు రూపంగా చూపి, అమాయకులను మోసం చేసి డబ్బులును పిట్టగాడు గుంజుకుంటున్నాడని తెలుసుకొని , పిట్టగాడి వద్దకు పోయి అతని చెవిలో “ఇకనైనా నీనాటకం చాలించి, కోతిని మర్యాదగా అడవికి పంపు దాన్ని స్వేచ్చగా బ్రతకనీ, నువ్వూ కస్టపడి పని చేసుకొని నిజాయితీగా బ్రతుకు లేకపోతె నీ బండారం బయిట పెడతాను” అని పిట్టగాడ్ని హెచ్చిరించాడు. పిట్టగాడు మంగలి మాట వినలేదు నిర్లక్ష్యంగా కోతికి ఆదేశాలు ఇస్తూ “ఈ మూర్ఖుడుకి అప్పడాల కర్రతో వందదెబ్బలు కొట్టు” అని చెప్పాడు, కోతి మంగలి తలపై అప్పడాల కర్రతో మోదడం మొదలు పెట్టింది, మంగలికి ఒళ్ళు మండింది, వెంటనే తన మంగలి పోదిలోని కత్తి తీసి ముందు కోతి పిలక కత్తిరించి, తరువాత కోతి నుదుటపై వున్న నిడువు నామాలు గొరిగేసాడు, భక్తులు కోపంతో మంగలిని కొట్టబోయారు, మంగలి వాళ్ళను శాంత పరిచి పిట్టగాడు కోతికి తనచేత చేయించిన ముస్తాభు, తరువాత పిట్టగాడు అమాయక భక్తులను మోసం చేసిన తీరు వివరించాడు, అంతే.... పిట్టగాడి ఆశ్రమం కూలిపోయింది, కోతి అడవికి చేరింది, పిట్టగాడు క్షమించమని కోరగా అతన్ని క్షమించిన వూరు వాళ్ళు పేదరాసి పెద్దమ్మ ఇంట్లో పని మనిషిగా చేర్చి అప్పడాలు చేసే పని అప్పగించి “అప్పడాలు పిట్టగాడు”గా పేరుని స్థిరపరిచారు, చదువు మధ్యలోనే ఆపేసాడు కాబట్టి వయోజన విద్య విద్యార్ధిగా చేర్చి మంచి బుద్దిమంతుడుగా, కష్టజీవిగా తయారుచేసారు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#23
తోటకూర - మల్లాది ఉష
[Image: image-2024-09-13-130927801.png]
తోటకూర మీద కథ ఏంటి అని ఆశ్చర్య పోకండి.నిజమే మా తోట కూర .ఆ రోజుల్లో ఊరంతా కథలు కథలు గా చెపు కునే వారు.పెద్డ మేడ వాళ్ల కథ విన్నారా? తోట కూర తిని పిచ్చెక్కిందిట.పాపం పెద్ద ఆవిడతో ఆడపిల్లలు ఉన్నరుట. ఈ విథంగా రకరకాల కథలు
2.     అసలు జరిగిందేమిటంటే ,నేను ఇంటర్మీడియట్ చదువు తున్నరోజులు.మాఅమ్మ ,మా అన్నయ డిల్లి వెళారు. మాఅమ్మమ్మ మాకు కాపలా. మేము ఐదుగురు అక్కచెళ్లెళ్ళం.ఇంట్లో కూరలు లేవు ఎవరెయ్డినా తెండిరా అని అందరిని అడిగింది. అందరికి ఏదో కారణాలు,సాకులు.ఎవరికి వాళ్లం బిజీ పాపం.. ఆవిడ మాటలు ఎవ్వరం పట్టించు కోలేదు. ఇంతలో మా తోటమాలి వచ్చాడు వయస్సు లో పెద్దవాడు, వాడికి ఎవరూ లేరు, మా అమ్మ వాడికి పని ఇచ్చి డబ్బులిచ్చేది. మా తోట పని చేసే వాడు వాడు అమ్మమ్మ సమస్య తీర్చాడు .పెద్దమ్మ గారూ తోటలో తోటకూర ఉంది తేనా అని అడిగాడుట ఆవిడ సమస్య తీరింది.అమ్మమ్మ కూర చేసింది
మేమందరం బోజనానికి ఇంటికి వచ్చాము.వాళ్ళు గబగబా తిని వెళ్ళారు నాకు వెధవ అలవాటు నెమ్మదిగా తినేదాన్ని,మా అమ్మమ్మ నా కు కబుర్లు చెప్పుతూ అన్నం నోటో్్ల కుక్కేది , ఆ రోజు కూడా అదే చేసింది.నేను ఆ రోజు మినిస్టరు గారు వసు్తన్నారు కాలేజిలో పాట పాడాలి హడావిడి మరి అమ్మమ్మ వినకుండా గిన్న కాళి చేసి వదిలంది
4.     ఇంకేముంది సోఫాలో కుార్చున్న దాన్ని అక్కడే తూలి పోయాను. మా అక్కలు విపరీతంగా నవ్వులట. అమ్మమ్మ తల తిరుగుతోంది అని మంచం మీద వాలి పోయ్దిుందిట చూసి మా అక్కలు పక్కింటికి వెళ్లి డాక్టరు కి ఫోను చేస్తామని వెాళ్ళారుట. పాపం ఆవిడికి వీళ్ల స్తితి చూసి నీళ్లిద్దామని వెళ్లేటప్పటికి వీళ్లు వాళ్ల ఇంట్లో పుస్తకా లు చింపి ఇంటికి వచ్చారుట.
5.      ఇంతలో మా చెల్లెలు స్కూలు నించి వచ్చిఇంట్లో అందరిని చూసి కంగారు పడి ముందు అద్దె కున్నవాళ్లకి చెప్పి ఊళ్లో ఉన్న మా బాబా్య్ గారి అబ్బాయ్య కి చెప్పిందిట. మా కింద అద్దెకున్న వాళ్లు వచ్చి వెండి సామాను బీరువాలో పెట్టి తాళం వేసి ఇంటికి తాళం వేసి కూర్చున్నారుట
6.      మా కజ్జిన్ వచ్చి అమ్మమ్మని ఆసుపత్రి కి ఎడ్మిట్ చేసి అమ్మకి ఫోను చేసారుట. వాళ్లు రైలు లో వచ్చేటప్పటికి రెండు రోజులు పట్టింది.నాకు మెలుకువ వచ్చింది కానీ చేతులూ కాళ్లు కదల్లేదు
7.      అన్నయ్య మామయ్యకి ఫోను చేసాడు.మా మామయ్య లాయరు.సహజంగా వ్రుత్తి పరంగా లాయరు అవ్వటంతో ఏం తింటే ఇలా అయ్యంది అని ఆరా తీసారు. ఇలా ఎందుకయ్యిందని రిసర్చ్ చేసారు
8.      మా పక్క మేడలో ఫార్మా కంపెనీ ఉండేది వాళ్లు మందులు ఎండ పెట్టేవారు. వాళ్ళ మందులు ఏమయ్యనా మా తోటలో పడ్డాయా? తోటకూర వేసిన చోట కలుపు మొక్కలు మొలిచాయా?అవి చూడకుండా మాలి కోసాడా?
9.      మా మామయ్య రిసర్చలో తేలిందేమిటంటే తోట కూరలో ఉమ్మెత్తాకు కలిసిందిట.ఉమ్మెత్త ఆకు మెదడు మీద పని చేస్తుందట. శారీరిక ఆరోగ్యంలో మెదడు కీలక పాత్ర వహిస్తుంది. అందుకే అది మా అందర్నీ రక రకాలుగా హింసించింది.
10.   మా అమ్మమ్మ మైకం లోకి వెళ్లింది, నాకు రెండేళ్లు నరాల బలహీనతతో కాలి వేళ్లు మెలి తిరిగేవి నడవలేక పోయే దాన్ని.భగవంతుడి దయ వలన మా అక్కలు కోరుకున్నారు.ఉమ్మెత్త చాలా డేంజరండోయ్. మా మామయ్య చెప్పిన విషయం ఏమిటంటే కోర్టు కేసుల్లో తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ఉమ్మెత్త ఇస్తారుట. ఇదండీ మా తోట కూరకధ
11.     ఇదంతా చదివి తోటకూర తినటం మానలేదండోయ్ ఇవ్వాళ మా ఇంట్లో తోట కూర పులుసేనండోయ్.
 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#24
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#25
తార్మార్ తక్కడమార్ - వి.వి.వి.కామేశ్వరి (v³k)
[Image: image-2024-09-23-145716398.png]
"తార్ మార్ తక్కడమార్ "

"అరే ! ఏం చేస్తున్నారర్రా లోపల"బయట నుండీ పెద్ద పెట్టున కేకలు వినిపించి బయటికొచ్చింది సౌమ్య .
"ఒక్కసారి ఇలా రామ్మా పద్మ , అనూషా, భూలక్ష్మి అదే అదే ..."
"సరేలే అత్తయ్యా సౌమ్య "అని గుర్తు చేసింది సౌమ్య .
"అదేలే సౌమ్య ,దిక్కుమాలిన గాలి ఇప్పుడే తగలడింది . చూడు ఏం చేస్తున్నాడో నీ కొడుకు విరాజ్ , ఒడియాల్లో నీళ్ళు గుమ్మరిస్తున్నాడు భడవాఖానా అల్లరి వెధవ అయ్యాడు" అంది కామాక్షి .
"అబ్బా ! అమ్మా ఒక్కరోజైనా ఎవరి పేరుతో సరిగ్గా వాళ్ళనే పిలుస్తావేమో అనుకుంటాను . వాడు విభాస్ అమ్మా ! " అన్నాడు కొడుకు రవి.
"చాల్లే భడాయి , నువ్వేమో పేర్లు రైమింగో , రోమింగో ఏదో పెట్టి ఏడిశావ్ నా ప్రాణానికి తగలాటంలా " అంది ముసిముసి నవ్వులతో .
పక్క నుంచీ సన్నగా నవ్వుతూ , "ఇంకా నయం , నన్నైతే పద్మక్కా, అనూషా , చివరాకరికి పనిమనిషి భూలక్ష్మి పేర్లు అన్నీ పిలుస్తారు అత్తయ్య నా పేరొక్కటి తప్ప " అంది సౌమ్య.
"అయినా అక్కడ విభాస్ నీళ్ళు పోసేది మిరపకాయల్లో , ఒడియాల్లో కాదు" అంటూ పరుగెత్తింది సౌమ్య పిల్లాడి దగ్గరకు చెంబు లాక్కోటానికి.
"చాల్లే సంబడం, ఏడ్చి మొత్తుకున్నట్లుంది నేనూ నా మతిమరుపూ ,మీ గోలతో ఆ విషయమే మరిచిపోయాను. ముందు వాడి చేతులు కడుగు . అదే సోమలేజరో ఏదో ఉందిగా గుర్తొచ్చి చావటంలా"అంది మనవడి వంక చూస్తూ కామాక్షి .
"శానిటైజర్ అమ్మా , సరే గానీ నువ్వు ముందు అర్థరాత్రి దాకా కవితలు గ్రూపులు అంటూ నిద్ర లేకుండా ఆరోగ్యం పాడుచేసుకుంటున్నావు. చూడు! ఎలా తయారవుతున్నావో ? నీ ఈడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు ? నువ్వెలా వున్నావు? అందుకే నీకు ఇంత మతిమరుపు . అదే నీకిష్టమైన పూజలు, కవితలు మాత్రం బాగా గుర్తుంటాయి" అన్నాడు కొడుకు రవి.
"అవును రవీ, అలా చెప్పు మీ అమ్మకి , టైం కి తినదు , నిద్రపోదు. లాక్డౌన్ లో కవితలు రాయటం ఆపెయ్యమను . నేను చెబితే అలుగుతుంది మళ్ళీ " అక్కడికి ఎప్పుడొచ్చారో శంకరం గారు.
"సర్లే , అందరూ ఏకమయ్యి నా మీద పడ్డారు " బుంగమూతి పెట్టి చేతిలో మామిడిపండు జ్యూస్ గ్లాసులతో వచ్చిన కామాక్షి.
"ఇదుగోండి తీసుకోండి అంటూ కొడుకుని , ఇదుగో నాన్నా తాగరా అంటూ భర్త వంకా చూస్తూ అందిస్తున్న అత్తయ్యని చూసి , అత్తయ్యా! మీ అబ్బాయిని మావయ్య , మావయ్యని మీ అబ్బాయి అంటున్నారు "అని నవ్వింది కోడలు సౌమ్య.
"సరేలే , తార్ మార్ తక్కడ మార్ మార్చుకోండి పేర్లు మీరే నా ప్రియ బంధువులారా !" అంటుంటే అందరూ నవ్వేసుకున్నారు హాయిగా .

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#26
Nice story
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 9 Guest(s)