Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
శంభల నగరం – 9
ఇందుః ప్రాకారం
ఇందుః ప్రాకారంలోకి అడుగుపెట్టగానే వారికి అమితాశ్చర్యం కలిగింది. భూలోకంలో మనం చూసే పరస్పర విరుద్ధమైన స్వభావం కల జీవులన్నీ ఒకే చోట కలిసి ఉంటున్నాయి ఇక్కడ. పాము-ముంగిస. శునకము-మార్జాలము. సింహము-జింక. ఇలా అన్నీ సాధు స్వభావంతో చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. పైగా వాటి కళ్ళను చూస్తే పాశవిక లక్షణాలు కనిపించకపోగా, దైవీ కాంతులను విరజిమ్ముతున్నాయి.
వాటిని అలానే చూస్తూ విస్తుపోయిన అభిజిత్, అంకిత, సంజయ్ లతో సిద్ధపురుషుడు ఇలా అన్నాడు.
"ఈ ఇందుః ప్రాకారంలో మనసు చంద్రుని ఆధీనములో ఉంటుంది. చంద్రుడు అంటే భూమి చుట్టూ తిరిగే చంద్రుడు కాదు. భూలోక వాసుల కంటికి కనిపించే చంద్ర రూపం అది. సూర్య మండలం పైన నిజమైన శీతల, జల లక్షణాలు కలిగిన ఒక భూమిక ఉన్నదని చెబుతోంది వేదం. ఆ భూమికనే చంద్ర మండలంగా గుర్తించారు మన వేదాలలో. భౌతిక దృష్టికి అందని చంద్రుని రూపం అది అని చెబుతారు. వేద ఋషులు దర్శించిన చంద్ర మండలం అదే. ఆచంద్రతారార్కం అన్న పదం వినే ఉంటారు. చంద్రుడూ, తారలూ, సూర్యుడు ఉన్నంతవరకూ అని అనటంలో ఉన్న పరమార్థం ఇదే.
ఆ చంద్రుణ్ణి ప్రార్థిస్తే మనసును నిర్మలంగా, ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వకుండా ఒక సరోవరం వలే ప్రశాంతముగా ఉంచుతాడు. అందుకే భూలోకంలో పరస్పర వైరంతో ఉండే జంతువులు సైతం ఇక్కడ కలిసి మెలసి జీవిస్తాయి.
అంతే కాదు, ఈ ప్రాకారంలో మీ మనసుకు ఎన్నో పరీక్షలు ఎదురవ్వబోతున్నాయి. అందుకు సంసిద్ధంగా ఉండండి", అని వారిని హెచ్చరించాడా సిద్ధపురుషుడు.
"స్వామి, భూలోకంలో అడవుల్లో మనకు కనిపించే జంతువులన్నీ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదెలా సాధ్యం?" అని అడిగాడు సంజయ్.
"భూలోకంలోని మనుషులే ఇక్కడ ముముక్షువులుగా మీకెలా అయితే దర్శనం ఇచ్చారో, ఇదీ అంతే. భూలోకంలో జంతువుగా జన్మించినప్పటికీ ఆ జన్మలో చేసిన సాధన వల్ల ఉత్కృష్టమైన స్థితికి చేరుకున్న అన్ని జంతువులూ ఇక్కడ ముముక్షువులలా అవే శరీరాలు ధరించి కేవలం మోక్ష సాధన కోసమే తపించిపోతూ ఉంటాయి. వాటికి మరొక జన్మ అంటూ ఉండదని అర్థం", అన్నాడా సిద్ధపురుషుడు.
“ఇక్కడున్న ఆ సింహాన్ని చూసారా? అది శంభల నగరానికి కేంద్రబిందువు ఐన శక్తి పీఠమునందున్న అమ్మవారికి నిర్వహించే అన్ని పూజలలో కర్మసాక్షిగా ఉంటుంది. అమ్మవారిని పూజించే రోజున ఆ అమ్మకు వాహనంగా ఈ సింహం ఎన్నో సేవలను అందుకుంటుంది”, అన్నాడు సైనికులలో ఒకడు.
"ఆ సింహం పేరేమిటి?" అని అడిగాడు అభిజిత్.
" కేశనామ ", అన్నాడు ఆ సైనికుడు.
"ఆ పేరుకి అర్థం చెప్పగలరా?" అని అడిగాడు అభిజిత్.
"ఆ సింహం యొక్క కేశాలు సుగంధాన్ని వెదజల్లే మూలికలలా ఉంటాయి. ఎలాంటి దుష్ట పీడిత శక్తి దరిచేరకుండా ఉండటానికి చింతామణి గృహమునందు ఈ సింహ కేశాలను నీటితో కలిపి ప్రోక్షణ కూడా చేస్తారు. అంతటి ఓషధీ శక్తి ఉన్నదా కేశాలకు", అని వివరించాడు ఆ సైనికుడు.
అక్కడి నుండి అభిజిత్, అంకిత, సంజయ్ లు ముందుకు వెళుతూ ఉన్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు మాత్రం అక్కడే ఆగిపోయారు. అభిజిత్, అంకిత, సంజయ్ లు వెనక్కి తిరిగి చూసారు.
అప్పుడు ఆ ఇద్దరు సైనికులు, "మీరు ముందుకు వెళ్ళండి. మేమిక్కడే ఉంటాము", అన్నారు.
సిద్ధపురుషుడు,"మీకు అక్కడ ఎదురయ్యే పరీక్షలు ఎంతో విలువైనవి. మీ జీవితాంతం మీరు గుర్తుపెట్టుకోవలసిన ఎన్నో పాఠాలను మీరక్కడ నేర్చుకోబోతున్నారు", అని చెప్పాడు.
అసిధారావ్రతం అని రాసి ఉన్న ప్రాంగణంలోకి అడుగుపెట్టారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
అక్కడ ఎందరో అందమైన యువతీ, యువకులు జంటగా కనిపించారు. అందమైన దుస్తులు ధరించి, సుగంధ ద్రవ్యాలను వెదజల్లుతూ చేతిలో చెయ్యేసి ఒకరి సాహచర్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ ఆ ప్రాంగణం అంతా తిరుగుతున్నారు. వాళ్ళల్లో కొంత మంది ఒకరిని ఒకరు ఆటపట్టిస్తూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. మరి కొంత మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొంత మంది నడుస్తూ మౌనంగా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ ఏదో తెలియని అనుభూతితో ఊహాలోకాల్లో విహరిస్తున్నారేమో అన్నట్టుగా కదులుతూ ముందుకెళుతున్నారు.
అంతలో అక్కడికి ఒక అందమైన శంఖినీ జాతి స్త్రీ వచ్చింది.
"మీ భూలోక వాసులకు ఇక్కడేం పని?" అని కొంటెగా అభిజిత్ వంక చూస్తూ సంజయ్ ని, అంకితని అడిగింది.
"శంభల రాజు అనిరుద్ధుల వారి ఆజ్ఞ మేరకు శంభల నగర సందర్శనం చేస్తూ ఈ ఇందుః ప్రాకారానికి వచ్చాము", తడబడుతూ అన్నాడు అభిజిత్.
"తను నీ ప్రేయసి కదా", అని అంకితని చూపిస్తూ అభిజిత్ తో నవ్వుతూ అన్నదా శంఖినీ జాతి స్త్రీ.
"అవన్నీ నీకెందుకు?" అని పైకి కోపం నటిస్తూ అన్నాడు అభిజిత్.
"మంచి అభినయం దాగుంది నీలో. మంచి రసికుడివే కదా", అంటూ అభిజిత్ బుగ్గను చుంబించినది.
"ఇదిగో అమ్మాయి, ఇదేం బాగోలేదు.పద్ధతి కాదిది", అన్నాడు అభిజిత్.
"నీ ప్రేయసి కోపంగా నన్నే చూస్తోంది", అంటూ గట్టిగా నవ్విందా శంఖినీ జాతి స్త్రీ.
"ఇక్కడ ఇంతమంది అందమైన జంటలను చూస్తుంటే నీకేం అనిపిస్తోంది?" అని అభిజిత్ ని అడిగింది ఆ శంఖినీ జాతి స్త్రీ.
అభిజిత్ అంకిత వైపు చూసాడు ఏం చెప్పాలి? అన్నట్టు. అంకిత కోపంగా చూసింది.
"అబ్బో...ఆ అమ్మాయి కనుసైగ చేస్తే గాని తమరి నోటి నుండి ముత్యాల మాటలు రావే?" అంటూ నవ్వింది ఆ శంఖినీ జాతి స్త్రీ.
"అలా ఏం కాదు. ఈ అందమైన జంటలను చూస్తుంటే నాకు కూడా నా కాబోయే భార్యతో ఇలానే చేతిలో చెయ్యేసి కళ్ళతోటే అనుబంధం పెనవేసుకుని నడుస్తూ అలా ముందుకెళ్లాలి అనిపిస్తోంది", అన్నాడు అభిజిత్.
అలా అన్నాడో లేదో అక్కడి ప్రాంగణంలో ఒక్క జంట కూడా లేకుండా అందరూ మాయం అయిపోయారు. ఇప్పుడక్కడ అభిజిత్, అంకిత తప్ప ఎవ్వరూ లేరు. సంజయ్ లేడు. ఆ శంఖినీ జాతి స్త్రీ కూడా లేదు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
అభిజిత్, అంకితలు వేసుకున్న దుస్తులు మారిపోయాయి. అక్కడి ప్రాంగణం అంతా చీకటిగా మారిపోయింది. అభిజిత్, అంకితలకు అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. ఎన్నో నక్షత్రాలు చుట్టూ కనబడుతున్నాయి. 27 నక్షత్రాలున్నాయి. దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలు ఆ 27 నక్షత్రాలు. దక్షుడు చంద్రుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చెయ్యటం అభిజిత్, అంకితల కళ్ళ ముందు కనబడుతోంది. చంద్రుడు రోహిణీకి బాగా దగ్గరయ్యి మిగతా 26 మందినీ దూరం పెట్టడం, ఆ 26 మందీ దక్షుని దగ్గరికి వెళ్లి తమ బాధను మొరపెట్టుకోవడం, దక్షుడు చంద్రుని దగ్గరకొచ్చి హెచ్చరించటం ఇవన్నీ ఒక దాని తర్వాత మరొకటి అభిజిత్, అంకితల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దక్షుడి శాపంతో చంద్రుడు ఒక చోట కూర్చుని రోదిస్తూ ఉండటం కనిపించింది అభిజిత్, అంకితలకు. వారి కళ్ళ ముందే చంద్రుడు అలా బాధపడటం చూసి చలించిపోయారు. ఓదార్చటానికి దగ్గరకి వెళ్లే లోపు చంద్రుని దగ్గరికి బ్రహ్మ వచ్చాడు.
"అదిగో అటు వైపు చూడు", అంటూ బ్రహ్మ చూపిస్తున్న దిశగా చూసిన చంద్రుడు ఆశ్చర్యపోయాడు. అభిజిత్, అంకితలు కూడా అటు వైపు చూసారు. వారి కళ్ళను వారే నమ్మలేనట్టుగా ఉందా అద్భుతం.
అదొక పాల సముద్రం. ఆ పాల సముద్రంలో ఎగసి పడే అలలు. ఎవరో కవ్వముతో చిలుకుతున్నట్టుగా అక్కడ ఆ పాల సముద్ర మథనము జరుగుతోంది. పాల సముద్రములో ఎగసి పడే ప్రతీ అల వల్ల అక్కడ పాల నురుగు అంతకు అంత పెరుగుతూ పోతోంది. పెరుగుతున్న ఆ పాల నురుగు చిక్కగా తయారవుతోంది. అలా కొంతసేపు ఆ పాలసముద్రంలో జరిగే మథనాన్నే చూస్తూ ఉన్నారు అభిజిత్, అంకితలు. ఆ పాల నురుగు చిక్కదనం ఎక్కువవుతూ పోగా అందులో నుండి ఉద్భవించాడు చంద్రుడు. ఇదంతా బ్రహ్మ చంద్రుడికి చూపించాడు. బ్రహ్మ చంద్రుడితో ఇలా అన్నాడు.
"అది నీ పుట్టుక, చంద్రమా. అలాంటి నువ్వు ఇలాంటి స్థితిలో ఉండటం లోకానికే అమితమైన బాధ. దక్షుడు నీకిచ్చిన ఈ క్షయ వ్యాధి పోవాలంటే నీ మనసును ఆ పరమశివుని యందే లగ్నం చేసి ఉంచు. కఠినమైన తపస్సును ఆచరించు. ఆ పరమశివుడే నీకు దారి చూపిస్తాడు. విజయోస్తు", అని అంతర్ధానమయ్యాడు.
చంద్రుడు నిష్ఠగా శివుణ్ణి పూజిస్తే, శివుడు ప్రత్యక్షం అయ్యి శుక్ల పక్షంలో చంద్రుడు క్రమక్రమంగా వృద్ధి చెందేలా, కృష్ణ పక్షంలో మాత్రం క్షీణిస్తూ ఉండేలా దక్షుడిచ్చిన శాపాన్ని సడలించాడు. పూర్తిగా ఆ శాపాన్ని తొలగిస్తే దక్ష ప్రజాపతి వాక్కుకు అర్థం లేకుండా పోతుంది. అందుకే శివుడు చంద్రుని ప్రార్థన మేరకు ఆ చంద్రుణ్ణి శిరస్సున ధరించాడు. చంద్రుడు పార్వతీ దేవి భక్తుడయిపోయాడు. పన్నెండు మంది అమ్మవారి మహాభక్తులలో ఒకడయ్యాడు.
ఆ రోజు నుండి చంద్రుడు మహాశివభక్తుడిగా గొప్ప పేరు పొందాడు. తన దోషాన్ని సైతం అధిగమించాడు.
ఇదంతా ఒక కథలా వారి కళ్ళముందు జరుగుతున్నట్టు అనిపించింది. అది ముగిసిపోగానే వారి చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి అంతక్రితం ఉన్న ప్రాంగణం కనిపించింది.
మునుపటిలా అక్కడ ఎంతో మంది అందమైన జంటలు కనిపించారు. సంజయ్ వారి పక్కనే ఉన్నాడు. అంకిత మాత్రం అభిజిత్ పక్కన ఉంది. శంఖినీ జాతి స్త్రీ వాళ్లకు ఎదురుగానే ఉన్నది.
“మనసు చేసే మాయ తొలగిపోవాలంటే భక్తి ఒక్కటే ఏకైక మార్గం. ఎంత కష్టపడైనా సరే మనసుని భక్తి మార్గము నందే ప్రవేశ పెట్టాలి. మీకు చంద్రుని కథంతా కళ్ళ ముందు కనిపించటానికి కారణం ఏంటో తెలుసా?" అని అడిగింది ఆ శంఖినీ జాతి స్త్రీ.
తెలియదు అన్నట్టుగా అభిజిత్, అంకితలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
"అయితే మీతో వచ్చిన మీ స్నేహితుడిని అతనికి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారో ఒకసారి అడిగి చూడండి", అంది శంఖినీ జాతి స్త్రీ.
"సంజయ్, నీకు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు?" అడిగాడు అభిజిత్.
"అదేం ప్రశ్న. బాగా వయసు మళ్ళిన వృద్ధ దంపతులు ఒకరిని ఒకరు చూసుకుంటూ పసి పిల్లలలా కలిసిపోయి తిరుగుతూ ఉన్నారు కదా. వాళ్ళే కనిపిస్తున్నారు.అయినా ఎందుకలా అడుగుతున్నావు?" అన్నాడు సంజయ్.
"అంటే నీకిక్కడ యువతీ, యువకులు ఎవ్వరూ కనిపించటం లేదా?" అని అడిగాడు అభిజిత్.
"లేదు", అటు వైపు నుండి సంజయ్ జవాబు.
"మరి శంఖినీ జాతి స్త్రీ కనిపిస్తోందా?" అడిగాడు అభిజిత్.
"లేదు", అటు వైపు నుండి సంజయ్ జవాబు.
సంజయ్ చెప్పిన జవాబులు విని నిర్ఘాంతపోయారు ఇద్దరూ. అభిజిత్, అంకిత ఇటు తిరిగి చూసే లోపు ఆ శంఖినీ జాతి స్త్రీ మాయమైపోయింది.
అప్పుడు అభిజిత్ కి అందులోని అంతరార్థం బోధపడింది. ఆమె ఒక దేవతని అర్థం అయ్యింది. అభిజిత్, అంకితల మనసు ఇంకా మాయకు వశం అయ్యి ఉండటం వల్లే వాళ్లకు అక్కడ ఎంతో మంది యువతీ, యువకులు జంటగా కనిపించారు. ఆ మాయను దూరం చేసి ఇందుః ప్రాకారంలోని చంద్రుని గురించి చెబుతూ తమకు జ్ఞానోదయం కలిగించటానికి వచ్చిన దేవత అని అభిజిత్ కు అనిపించింది. అంకిత ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉంది. అసలేం జరిగిందో అర్థం అయ్యే స్థితిలో తను లేదు.
ఆ అసిధారావ్రతం అనే ప్రాంగణం నుండి బయటికి వచ్చేసారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
"స్వామి, ఈ ప్రాంగణానికి అన్న పేరెందుకు పెట్టారో చెప్పగలరా?" అని ఆత్రంగా అడిగాడు అభిజిత్.
" అసిధారావ్రతం అనగా స్త్రీపురుషులిద్దరూ ఒకే శయనంపై నిదురిస్తూ బ్రహ్మచర్య దీక్షతో ఉండుట. అతి కష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించేవారు మీకు ఈ ప్రాంగణంలో కనబడతారు కాబట్టే ఆ వ్రతం పేరే ఈ ప్రాంగణానికి పెట్టారు", అని బదులిచ్చాడా సిద్ధపురుషుడు.
"అంటే మాకు అక్కడ కనిపించిన వాళ్ళు కూడా ముముక్షువులేనా స్వామి?" అని ఆశ్చర్యపోతూ అడిగాడు సంజయ్.
సిద్ధపురుషుడు నవ్వుతూ,"అంతే కదా", అన్నాడు.
సిద్ధపురుషుడు, ఆ ఇద్దరు సైనికులూ ముందుకెళ్తూ ఉండగా వారిని అనుసరిస్తూ అభిజిత్, అంకిత, సంజయ్ లు ఇందుః ప్రాకారం నుండి శివుని ఆలయానికి బయలుదేరారు.
శంభలలోని ఈ శివుని ఆలయం ఉండే ప్రాకారానికి ఏ పేరూ లేదు. అందరూ ఆ ప్రాకారాన్ని శివుని ఆలయం అనే పిలుస్తారు. అక్కడంతా శివ మయమే.
ఓం నమః శివాయ
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
శంభల నగరం – 10
శివుని ఆలయం
అక్కడ విభూతి ధరించని మోము మనకు కనబడదు. శివ నామస్మరణ చెయ్యని గొంతు మనకు వినబడదు.
సుగంధ ద్రవ్యాల నుండి వచ్చే సువాసనలు మైకాన్ని కలిగిస్తాయి. కానీ అక్కడ అణువణువులో ఉన్న భస్మం యొక్క పరిమళాలు మాత్రం మనకు బ్రహ్మ జ్ఞానాన్ని అందిస్తాయి.
అక్కడ మాట్లాడితే శివుడు. ఆట ఆడితే శివుడు. పాట పాడితే శివుడు.
ఏది చెయ్యాలన్నా అక్కడ శివుడే. ఏదీ చెయ్యకపోయినా అక్కడ శివుడే.
అక్కడ అడుగుపెట్టక ముందు వరకూ మనకు కనిపించేదో ప్రపంచం. అడుగుపెట్టాక ఆ శివుడే ప్రపంచం.
మన శిరస్సు పైకెత్తి చూస్తే కానీ కనిపించనంత ఎత్తులో ఉంటాడు శివుడు. హిరణ్యము అనగా మేలిమి బంగారంతో చెయ్యబడ్డ మూర్తీభవించిన ఈశ్వరత్వము అక్కడ మనకు కనిపిస్తుంది.
56 అడుగుల ఎత్తున్న ఆ శివుడు తన రెండు కళ్ళనూ మూసివేసి ధ్యానంలో ఉంటాడు. రెండు చేతులనూ చిన్ముద్రతో ఉంచి పద్మాసనంలో ధ్యానం చేస్తున్న ఆ శివుడు అంత ఎత్తులో మనకు కనిపిస్తాడు.
అక్కడున్న శివుణ్ణి చూస్తే 56 అడుగుల ఎత్తున్న పరమశివుడే సాక్షాత్తుగా అక్కడికొచ్చి ధ్యానం చేస్తున్నాడు అన్నట్టుంటుంది కానీ శివుని విగ్రహంలా ఎక్కడా అనిపించదు.
ఒక దృశ్యం అద్భుతంగా ఉంటే కళ్లప్పగించి చూస్తాం. కానీ ఆ శివుని ఆలయములో ఏది చూసినా ఒక అద్భుతమే. అప్పుడు రెప్పార్పకుండా చూస్తాం. రెప్పపాటులేని స్థితినే అనిమిషత్వం అంటారు. అనిమిషత్వానికున్న మరొక పేరే ఈశ్వరత్వము. ఆ ఈశ్వరత్వమే కాల స్వరూపం. కాలం రెప్పపాటైనా సరే ఆగదు. అలాంటి కాలస్వరూపుడైన ఆ శివుణ్ణి మనం చూడాలంటే రెప్పార్పకుండానే చూడాలి. ఎప్పుడు ఏ అద్భుతం మన కంటికి అందకుండా పోతుందో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది ఆ శివుని ఆలయంలో. అంత అద్భుతంగా ఉంటుందక్కడి శివుని వైభవం.
శివునికి ఎదురుగా ఉన్న నంది 26 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ నంది కూడా సువర్ణముతోనే రూపకల్పన చేయబడ్డది.
శివునికి అభిషేకం జరుగుతున్నప్పుడే అక్కడున్న నందికి కూడా అభిషేకం జరుపుతారక్కడ.
ఆ ఆలయంలోనే ఒక బంగారు ఉన్నది. ఆ సింహాసనం 36 అడుగుల ఎత్తు ఉంటుంది. అక్కడున్న 56 అడుగుల శివుడికి తగ్గట్టుగా ఉంటుందా సింహాసనం.
అక్కడ వాళ్ళ దినచర్య శివపంచాక్షరితో మొదలవుతుంది.
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ.... భస్మాంగరాగాయ మహేశ్వరాయ అంటూ మొదలయ్యే ఆ శివపంచాక్షరీ స్తోత్రాన్ని వినటం, చూడటం జన్మ జన్మల పుణ్యమే అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ శివపంచాక్షరి చెప్పే సమయానికి ఎందరో యోగులు, దేవతలు, యక్షులు, అఘోరీలు, ముముక్షువులు, నాగసాధువులు ఇలా శంభల నగర ప్రాకారాలలో లేని వారు ఎంతో మంది మనకు కనబడతారక్కడ. యక్షస్వరూపాయ జటాధరాయ....పినాక హస్తాయ సనాతనాయ అంటున్నప్పుడు డమరుకం మోగుతూ ఉంటుందక్కడ.
అభిజిత్, అంకిత, సంజయ్ లు శివుణ్ణి చూస్తూ మైమరచిపోయి ఉన్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు ఆలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
అభిజిత్, అంకిత, సంజయ్ లు నిలబడి శివుణ్ణి తదేకముగా చూస్తూ ఉన్న ఆ చోటికి ఒక నాగసాధువు వచ్చాడు. వీరితో ఇలా అన్నాడు.
“ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబు
ఎవ్వడాదిమధ్యలయుండెవ్వడు సర్వంబు తానై యున్నవాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్”
మీరే పని మీద ఇక్కడికొచ్చారో నాకు తెలుసు. మీరు కోరుకునే ఆ ప్రపంచ శాంతి కోసమే మేమిక్కడ రోజూ శివునికి పూజలు చేస్తున్నాము. శంభల రాజ్యంలో మీరు నేర్చుకునే విద్యలు ఘోర కలిని అంతం చెయ్యటానికి ఉపయోగపడతాయి. కానీ మీకు భవిష్యత్తులో మా నాగసాధువుల అవసరం ఉంటుంది. అందుకే ఈ తాళంచెవిని మీ దగ్గర ఉంచుకోండి”, అని చెప్పేసి తాళంచెవిని సంజయ్ చేతికిచ్చి ఆ నాగసాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఆ నాగసాధువు వెళ్తున్న వైపే ఆశ్చర్యంగా చూసారు అభిజిత్, అంకిత, సంజయ్ లు ముగ్గురూ.
అంతలో అక్కడికి ఒక ముముక్షువు వచ్చాడు.
"ఇక్కడి శివాలయ చరిత్ర ఏంటో మీకు తెలుసా?" అని అడిగాడు.
"తెలీదు స్వామి", అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో.
"అయితే మీరు తప్పకుండా తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ శివాలయంలో మీరు చూసే ఆ శివుడు శాంతస్వరూపుడు కాడు. సతీదేవి అగ్నికి ఆహుతైన రోజున ఇదే చోట ఆయన శివతాండవం చేసాడు.
ప్రతీ సంవత్సరం ఒక్కసారి ఆ శివతాండవాన్ని చూసే అదృష్టం శంభల నగర వాసులకు దక్కుతుంది. ఆ శివ తాండవాన్ని చూడటం అదృష్టమే అయినా చూసి తట్టుకోవటం అంత తేలిక కాదు. ఆయనని అలా చూస్తే కన్నీటి గంగ ధారగా ప్రవహిస్తుంది. మంగళస్వరూపుడైన ఈ శివుడేనా ఇలా రుద్ర తాండవం చేస్తోంది అని భయం వేస్తుంది. ఆ రోజు ఆయనను శాంతింపచెయ్యటానికి ఇక్కడ స్తోత్రాలు, సూక్తాలు ఎన్నింటినో పఠిస్తారు.
ఇక్కడున్న భక్తులకు ఆ రోజు నిజమైన పరీక్ష. ఎవ్వరైతే మనసారా శివుణ్ణి ప్రార్థిస్తారో అప్పుడే ఆయన శాంతిస్తాడు. ఆ భక్తుని కోరికలను నెరవేరుస్తాడు.
ఇక్కడ మీరు చూస్తున్న ఆ 56 అడుగుల శివుణ్ణి రూపకల్పన చేసింది దేవశిల్పి విశ్వకర్మ. సూర్యమండలంలోని సూర్య గణాలు లెక్కలేనంత బంగారాన్ని తెచ్చి ఇచ్చాయి. ఆ మేలిమి బంగారంతోనే ఇక్కడున్న శివుణ్ణి, నందిని, సింహాసనాన్ని రూపకల్పన చేసాడు విశ్వకర్మ”, అన్నాడా ముముక్షువు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
"స్వామి, శివుడు ఎక్కడి నుండి వస్తాడు?" అడిగాడు అభిజిత్
ఆ ముముక్షువు అభిజిత్ ను ఎగాదిగా ఒక్కసారి చూసి గట్టిగా నవ్వాడు. అభిజిత్ గుండెను తన చేత్తో బలంగా తాకుతూ,"నీ హృదయం అనే పద్మంలో నుండి వస్తాడు", అన్నాడు.
"ఇక్కడ ధ్యాన రూపంలో ఉన్న ఆ 56 అడుగుల బంగారు శివుణ్ణి కేవలం విగ్రహస్వరూపం అనుకుంటున్నావా?" అని అభిజిత్ ను గట్టిగా అడిగాడు.
“సూర్య గణాలు తెచ్చిన ఆ బంగారం సూర్యప్రభకు నిదర్శనం. ఆ సూర్యుని ద్వారానే ఇక్కడ శివుణ్ణి మనం దర్శించుకుంటున్నాం. బంగారానికి ఉన్న గుణాలలో జ్వలించే శక్తి ప్రథమమైనది. ఎంతగా జ్వలిస్తే అంతగా మెరిసిపోతుంది. సతీదేవి అగ్నికి ఆహుతి కావటం జ్వలనమే కదా. అందుకే ఆ రోజున ఇక్కడ మీకు కనిపించే ఈ హిరణ్య తేజమైన శివుడు ధ్యానం వీడి తన నటరాజరూపంతో జ్వలిస్తూ తాండవం చేస్తాడు”, అన్నాడా ముముక్షువు.
"అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆ ధ్యానరూపంలో ఉన్న శివుడే కళ్ళు తెరిచి ఇక్కడ తాండవం చేస్తాడా స్వామి?" అంటూ ఆ 56 అడుగుల శివుణ్ణి చూస్తూ అభిజిత్ విస్తుపోయి ఆ పరమశివునికి సాష్టాంగ నమస్కారం చేసాడు.
"అవును. ఆయనని బంగారు వర్ణంలో అలా ధ్యాన మూర్తిగా చూడటం వలన మీకు విగ్రహంలా కనిపిస్తున్నాడు. కొంత మంది యోగీంద్రులకు ఆయన తీసుకునే శ్వాస కూడా వినిపిస్తుంది. వాళ్ళ యోగసిద్ధి అలాంటిది మరి", అన్నాడా ముముక్షువు.
" పాదుకాతీర్థం తయారీలో వాడే పుప్పొడిని ఈ శివుని ఆలయంలో ఉన్న సువర్ణ పుష్పాల నుండే తీసుకుంటారని చెప్పారు స్వామి. ఆ సువర్ణ పుష్పాలు ఉన్న చెట్టు ఎక్కడుందో చెబుతారా?" అని అడిగాడు అభిజిత్.
ముముక్షువు వాళ్ళ ముగ్గురినీ ఒక చోటికి తీసుకువెళ్లాడు. అక్కడొక దేవతా వృక్షం ఉన్నది. ఆ దేవతా వృక్షానికే ఎన్నో సువర్ణ పుష్పాలున్నవి. వాటిని చూపిస్తూ ఆ ముముక్షువు ఇలా చెప్పాడు.
"సూర్యుని నామాలలోని ఒక నామమే పూషా. పోషించువాడు అని అర్థం. సమృద్ధిని ఇచ్చువాడు అని అర్థం. ద్వాదశ ఆదిత్యులలో ఒకడే పూషుడు. ఆయన నుండే ఈ సువర్ణ పుష్పాలు ఉన్న చెట్టు వచ్చింది. ఈ చెట్టుని కూడా సూర్య గణాలే అందించాయి", అన్నాడా ముముక్షువు.
ఇంతలో అక్కడికి సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు వచ్చారు. ఆ సైనికుల్ని చూడగానే అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళు సైనికులు కారు. ఇన్నాళ్లూ సైనికుల వేషధారణలో వాళ్ళని భ్రమింప జేసిన కామరూపధారులు. అనగా ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగల శక్తి సంపన్నులు వారు.
ఆ ఇద్దరు సైనికులూ వాళ్ళ రూపాల్ని వదిలేసి తమ సొంత రూపంలోకి వచ్చేసారు. వాళ్లిప్పుడు సైనికులలా లేరు. శంభల రాజ్యంలోని ఖరీదైన వస్త్రాలు ధరించి ఉన్నారు.
"నేను అనిరుద్ధుల వారి ఆస్థానంలోని మంత్రిని. నా పేరు ఫాలనేత్రుడు. మా అమ్మ శివభక్తురాలు. అందుకే నాకు ఆ శివుని పేరే పెట్టింది", అన్నాడు ఆ మంత్రి.
"నేను అనిరుద్ధుల వారి రాజ్యంలోని సేనాధిపతిని. నా పేరు రుద్రసముద్భవ ", అన్నాడా సేనాధిపతి.
"మిమ్మల్ని పరీక్షించనిదే మీకు శంభల రాజ్యంలోని యుద్ధ విద్యలు నేర్పటం అసాధ్యం. మీకా యోగ్యత లేనిచో ఆ విద్యలు మీకు నేర్పినా అవి సిద్ధించవు. అందుకే మేము ఎప్పటికప్పుడు సిద్ధపురుషుడితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఇప్పుడు మాకు మీ మీద నమ్మకం కలిగినది. ఇక శంభల రాజ్యానికి బయలుదేరుదామా?" అని అడిగాడు ఆ ఫాలనేత్రుడు.
శివునికి నమస్కరించి ఆ ఆలయం నుండి బయటికొచ్చేశారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
సిద్ధపురుషుడు, రుద్రసముద్భవ, ఫాలనేత్రుడు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది.
అప్పుడే అక్కడికో ఖగరథము వచ్చినది.
"భూలోకంలో మీరు చూసే విమానాల కంటే 1000 రేట్లు వేగంతో ఈ ఖగరథ గమనం ఉంటుంది.
ఇలాంటివి శంభల రాజ్యంలో కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి", అంటూ ఆ ఖగరథంలోకి వాళ్ళను ఆహ్వానిస్తూ అన్నాడు మంత్రి ఐన ఫాలనేత్రుడు.
భూలోకంలోని విమానానికి రెట్టింపు పరిమాణంలో ఉందా ఖగరథం. బయటి నుండి చూసే వాళ్లకి బంగారు విమానంలా ఉంది. భూలోకంలోని విమానాలకు ఉన్నట్టే ఈ ఖగరథానికి రెక్కలున్నాయి కానీ అవి గాలిలో ఉన్నప్పుడు మాత్రమే తెరుచుకునేలా వెసలుబాటు ఉంది. ఒక్క సారి భూమ్మీదకు దిగిన తర్వాత ఆ రెక్కలు ఇక కనిపించవు. అలా అమర్చారు వాటిని.
శంభల నగరంలో చిట్టచివరి ప్రాకారం ఐన చింతామణి గృహంలోకి అడుగుపెట్టడానికి అనుమతి, అర్హత లేకపోవటం వల్ల అభిజిత్, అంకిత, సంజయ్ లు శివుని ఆలయం నుండి ఖగరథంలో శంభల రాజ్యానికి పయనమయ్యారు. సిద్ధపురుషుడు కూడా వారితో పాటే వస్తున్నాడు.
మంత్రి ఫాలనేత్రుడు, సేనాధిపతి రుద్రసముద్భవ ఎంతో ఆనందంగా ఒక కార్యాన్ని పూర్తిచేసినట్టు గర్వంతో విజయదరహాసం చేస్తున్నారు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Super fantastic update
Posts: 765
Threads: 0
Likes Received: 1,220 in 684 posts
Likes Given: 3,048
Joined: Jun 2020
Reputation:
41
(07-05-2024, 07:10 PM)k3vv3 Wrote:
మంత్రి ఫాలనేత్రుడు, సేనాధిపతి రుద్రసముద్భవ ఎంతో ఆనందంగా ఒక కార్యాన్ని పూర్తిచేసినట్టు గర్వంతో విజయదరహాసం చేస్తున్నారు.
Very good update, K3VV3 gaaru!!!
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
ఘోర కలి అరాచకాలు - 1
బోర్డు డైరెక్టర్ లతో ఘోర కలి మీటింగ్
భూలోకంలో ఘోర కలి ఏ రంగాన్నీ వదిలిపెట్టలేదు. స్టీల్, ఐరన్, మినరల్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఇలా అన్ని రంగాల్లో తనేంటో ప్రపంచానికి పరిచయం చెయ్యాలని సంకల్పించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. తన సామ్రాజ్యాన్ని విస్తరించి జీ.కె. కార్పొరేషన్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో ప్రపంచంలోని పలు చోట్ల కంపెనీలను స్థాపించి శ్రామికులను నియమించుకున్నాడు. తన ప్రతీ కంపెనీలో కొన్ని వేల మంది వర్కర్స్ తన ఆజ్ఞలను అనుసరించి పనిచేస్తూ ఉంటారు. ఘోర కలి దగ్గరున్న నాగమణి ఎంతో శక్తివంతమైనది కావటంతో దాన్ని ఆసరాగా చేసుకుని ఎన్నోఅరాచకాలు చెయ్యటం మొదలు పెట్టాడు.
ఒక రోజు జీ.కె. కార్పొరేషన్ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ ల మీటింగ్ ని ఘోర కలి సీక్రెట్ గా తన సామ్రాజ్యంలో ఏర్పాటు చేసాడు. ఆ రోజు ఘోర కలికి సెక్యూరిటీగా ఎంతో మంది ఉన్నారక్కడ. ఆ మీటింగ్ కి పది దేశాల నుండి వచ్చిన పదిహేను మంది బోర్డు డైరెక్టర్స్ ఒక చోట హాజరయ్యారు. వారు అక్కడికొచ్చి 2 గంటలవుతోంది. ఘోర కలి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. అంతలో అక్కడికి ఘోర కలి తన సొంత రూపంతోనే వచ్చాడు. కళ్ళకు కాటుకతో, నలుపైన దుస్తులతో, తను ధరించిన ఆ దుస్తులపైన వికృతమైన గుర్తులతో చూడగానే ఒళ్ళు గగ్గుర్పొడిచేలా ఉన్నాడు.
"సభకు నమస్కారం. నేను డైరెక్ట్ గా పాయింట్ కొచ్చేస్తున్నాను. మీ పదిహేను మందీ ఇన్ని రోజులూ చాలా కష్టపడ్డారు. నేను చెప్పినట్టే మన కంపెనీలలో పని చేసే వర్కర్స్ తాగే టీ లో 'సమూఢ' అనే చీకటి రాజ్యంలో చెయ్యబడ్డ ద్రవ్యాన్ని కలిపి వారికిస్తూ వచ్చారు. వారిలో కనిపించిన మార్పేంటో మనం కళ్లారా మన ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళు పంపిన రిపోర్ట్స్ లోనే చూసాం. అందుకు ముందుగా మనందరం సెలెబ్రేట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ లెక్కలేనంత మద్యం దొరుకుతుంది ఈ రోజు. ఇష్టపూర్వకంగా ఎంత కావలి అనిపిస్తే అంత తాగండి. ఏది కావాలి అనిపిస్తే అది తినండి. మా వంటవాళ్లు అన్ని రకాల కూరలూ వండించారు. మగువలకు కొదవే లేదీ సామ్రాజ్యంలో. ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి మీ సొంతం అవుతుంది.
కానీ ఇవన్నీ మీరనుభవించే ముందు మీరు నాకోసం ఒక చిన్న పని చేసిపెట్టాలి. చేస్తారా?" అని వాళ్ళని అడిగాడు ఘోర కలి.
ఘోర కలి చేస్తారా అని ప్రత్యేకించి వాళ్ళని అడుగుతున్నాడంటే అదేదో అల్లాటప్పా విషయం కాదని వాళ్లకి అర్థం అయిపోయింది.
అక్కడున్న పదిహేను మంది గుండెలూ వేగంగా పోటీపడి మరీ కొట్టుకుంటున్నాయి. ఒకరి కళ్ళు ఒకరు చూసుకుంటున్నారు. హ్యాండ్ కర్చీఫ్ తో నుదుటి పై చెమటని తుడుచుకుంటున్నారు. ప్రాణం పోయే ముందు ఎలా ఉంటుందో ఘోర కలి అడిగిన దానికి ఎదురుచెప్పటం అలా ఉంటుంది. ఇన్నాళ్లూ ఘోర కలితో చేతులు కలిపి తెగ సంబరపడిపోయారు. డబ్బు ఇచ్చే నషా అలాంటిది. ఎంత ప్రమాదంలో పడ్డామో తెలిసేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయి ఎదురుగా ఘోర కలి రూపంలో యముడు రెడీ గా ఉంటాడు.
"ఏంటి ఆలోచిస్తున్నారు?" అన్నాడు ఘోర కలి.
అక్కడంతా నిశ్శబ్దం.
"ఇంకా ఆలోచిస్తున్నారేంటి.......................?" అని ఈ సారి గట్టిగా బల్ల గుద్ది మరీ అడిగాడు ఘోర కలి.
"అలాగే….అలాగే…. మీరేది అడిగితే అది చేస్తాం", అని ఆ పదిహేను మందీ లేచి నిల్చుని చేతులు కట్టుకుని ముక్తకంఠంతో మాటిచ్చారు.
"హహ్హాహ్హా.....భయం....భయం.....భయం భయమే నా పెట్టుబడి.....ఇప్పుడీ భయమే నా రాబడి", అంటూ భయంకరంగా నవ్వాడు.
"మీరందరూ మీ మీ రూపాల్ని శాశ్వతంగా మార్చేసుకోవాలి. అదే మీరు నాకోసం చేసే చిన్న పని", అని గట్టిగా నవ్వాడు ఘోర కలి.
"అంటే మా ఐడెంటిటీ మారిపోతుందా?" అని అడిగాడు వాళ్ళల్లో ఒకడు.
"మీ ఐడెంటిటీ ఏం మారిపోదు. మీ ఫామిలీ వాళ్లకు మీరేం దూరం అవ్వరు. ప్రపంచానికి మీ ఐడెంటిటీ అలానే ఉంటుంది. కానీ మీ రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి.
హ్హాహ్హాహ్హా", అంటూ నవ్వాడు ఘోర కలి.
వాళ్లకేం అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
అది గమనించిన ఘోర కలి వారికి అర్థం అయ్యేలా ఇలా వివరించాడు.
"మీరందరూ నా లా మారిపోతారు. అంటే చూడటానికి మీరు అచ్చం నాలాగే కనబడతారు బయటి ప్రపంచానికి. దీని వల్ల నా ఐడెంటిటీని ట్రేస్ అవుట్ చెయ్యటం ఎవ్వరి వల్లా కాదు. అప్పుడు మిమ్మల్ని చూసి మీకెదురు తిరగటానికి అందరూ భయపడతారు.
నేను నా సామ్రాజ్యంలో ఇక్కడే కూర్చుని ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు.
ఏది జరిగినా నిమిషాల్లో యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా నా సందేశాన్ని ప్రపంచంతో పంచుకుంటాను. ఇక్కడే ఉంటూ ప్రపంచంలో పలు చోట్ల జరిగే ఎన్నో సంఘటనలను నాకు నచ్చే విధంగా మలచుకుంటాను. ప్రపంచం మొత్తాన్ని భయపెడతాను.
మీరు ఉండే చోట జనాలు మిమ్మల్నే ఘోర కలి అనుకుని భ్రమపడుతూ భయపడుతూ బ్రతుకుతారు.
ఆ భయమే మన పెట్టుబడి.
ఆ భయంతోటే ప్రజలు మనకు బానిసలవుతారు.
ఆ భయంతోటే మనం వారికి దొరలు అవుతాం.
ఆ భయంతోటే ప్రపంచాన్ని గడగడలాడిస్తాం.
మీరు చెయ్య వలసిందల్లా నా లా మారిపోవటమే.
చేస్తారు కదూ?" అంటూ ఆ పదిహేను మందిని ఒక్కసారి సూటిగా చూస్తూ గంభీరంగా అడిగాడు.
వేరే గత్యంతరం లేక వాళ్ళందరూ ఒప్పుకున్నారు.
"ఈ ఘోర కలి ఎప్పుడూ మీ చుట్టూ రక్షగా ఉంటాడు", అంటూ ఘోర కలి అక్కడున్న ప్రతీ ఒక్కడి వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుని రాక్షస ప్రేమతో ప్రతీ ఒక్కడి బుగ్గపైన ముద్దు పెట్టాడు. ఘోర కలి శ్వాస బలంగా తగులుతోంది అక్కడున్న ప్రతీ ఒక్కడికి.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
"నన్ను నమ్మి వచ్చిన వాళ్లకు ఇలాగే ముద్దిచ్చి నా ప్రేమను చూపిస్తాను. అది నా గుణం.
ఈ రోజుతో మీరందరూ నా లా మారిపోతారు. ప్రపంచానికి నన్ను చూపే అద్దాలు మీరే.
హహ్హాహ్హా", అంటూ ఘోర కలి నవ్వుతున్నప్పుడు తెలియకుండానే కళ్ళ వెంట ధారగా కన్నీళ్లు ఉప్పొంగాయి.
ఇంతలో ఘోర కలికి ఒక రక్షక భటుడి నుండి పిలుపు రావటంతో అక్కడి నుండి హుటాహుటిన వెళ్ళిపోయాడు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Nice wonderful update
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
05-06-2024, 05:28 PM
(This post was last modified: 05-06-2024, 05:31 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
శంభల రాజ్యం – 1
శంభల రాజ్యానికి స్వాగతం
ఖగరథం శంభల రాజ్యానికి చేరుకున్నది. శంభల రాజ్య ప్రవేశ ద్వారం దగ్గర భూలోక వాసులకు ఘనస్వాగతం పలకటానికి అక్కడ ఎంతో మంది ఎదురుచూస్తూ ఉన్నారు. ఖగరథం నుండి బయటకు అడుగుపెట్టిన మంత్రి ఫాలనేత్రుడు, సేనాధిపతి రుద్రసముద్భవలతో పాటు సిద్ధపురుషుడు ముందుకు కదిలి వెళుతున్నారు. వారిని అభిజిత్, అంకిత, సంజయ్ లు అనుసరిస్తున్నారు. వీళ్ళతో పాటు అక్కడుండే ఒక భటుడు కూడా వస్తున్నాడు.
శంభల రాజ్యాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు అన్నట్టుంది అక్కడి వాతావరణం. శంభల నగరంలోలానే శంభల రాజ్యంలో దొరికే వాయువు అత్యంత శ్రేష్ఠమైనదిగా అనిపించింది వారికి. కాలు నేలను తాకగానే అక్కడున్న మట్టి రేణువులు చర్మానికి గట్టిగా అతుక్కున్నట్టు అనిపించాయి. అభిజిత్ కి తన కాలు వైబ్రేట్ అయినట్టు అనిపించి, "ఇక్కడ మట్టి ఏంటి ఇలా ఉంది?" అని అడిగాడు.
"ఇది మంకిల. మట్టి కాదు. ఇది చాలా దూరం వ్యాపిస్తుంది. నువ్వు ఇక్కడికొచ్చావన్న సాక్ష్యం చెబుతుంది", అన్నాడు భటుడు.
"ఇంద్రియాలకు స్పందించే గుణం ఉంటుంది. ఈ మంకిలకు వ్యాపించే గుణం ఉంది. వెళ్ళేటప్పుడు ఒక పిడికిలంత తీసుకుని వెళ్ళు. భూలోకంలో ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది", అన్నాడు ఆ భటుడు అభిజిత్ కళ్ళలోకి చూస్తూ.
భవిష్యత్తులో జరగబోయేదేదో కళ్ళ ముందు ఫ్లాష్ లా కనిపించింది అభిజిత్ కి. కానీ అదేంటో అంత క్లియర్ గా తెలియట్లేదు. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు. ఆ భటుడు చెప్పినట్టే ఒక పిడికిలంత మంకిల తీసుకుని తన దగ్గరున్న పౌచ్ లో వేసుకున్నాడు.
“ఇప్పుడు దాచుకున్న ఈ పిడికెడే భూలోకంలో పదింతలు అవుతుంది. ఎందరినో కాపాడుతుంది”, అంటూ ఆ భటుడు చిత్రంగా నవ్వాడు.
"శంభల రాజ్యంలో జాగ్రత్త దొరా", అన్నాడు. అభిజిత్ అర్థం కానట్టు చూసాడు.
"ఇక్కడ నెగ్గావా...ముల్లోకాలు నీవే. ఇక్కడ ఓడావా... విజయమిక దక్కదు దొరా", అన్నాడు.
అభిజిత్ అలర్ట్ అయ్యాడు. తనకు సంబంధించినది ఏదో ఆ భటుడు చెబుతున్నాడనిపించింది.
"ఇక్కడి ఆడవాళ్లు మాయ చేస్తారు దొరా....వాళ్ళ వలలో పడకు", అని అంకితను చూస్తూ, "ఆమెను ప్రేమించాలో వద్దో ఒక నిర్ణయం తీసుకో దొరా....సౌఖ్యంగా ఉంటాది నీ మనసు. కుదుటపడుతుంది నీ వయసు", అన్నాడు. ఆ మాట అంకితకు కూడా వినబడింది. అభిజిత్ ని చూస్తూ నవ్వింది.
అభిజిత్ ఆ భటుడిని పక్కకు పిలిచి, "బాసు నువ్వు భూలోకంలో ఫార్చ్యూన్ టెల్లింగ్….అదే చిలకజోస్యం చెప్పేవాడివా....నీ లాంగ్వేజ్ అలాగే ఉంది మరి", అన్నాడు.
"నీకు అర్థం అవ్వాలని అలా చెప్పా దొరా", అన్నాడు భటుడు.
"ఇదిగో అంతా బానే ఉంది కానీ, నువ్వు నన్ను దొరా అనకు. ఐ యాం నాట్ యువర్ దొరా", అన్నాడు అభిజిత్.
"లేదు దొరా. మనది ఏడు జన్మల సంబంధం. నువ్వు మా దొరవే", అన్నాడు ఆ భటుడు. ముందుకు కదిలాడు భటుడు.
అభిజిత్ ఆగిపోయాడు ఆ మాటకి. లోపల ఇలా అనుకుంటున్నాడు.
"ఏడు జన్మల సంబంధమా? వీడెంటిలా మాట్లాడుతున్నాడు ! ఏంటోలే...ముందు ముందు ఇంకెన్ని షాక్ లు ఇస్తాడో !"
ఒక వేగు వీరిని స్వాగతించటానికి అక్కడే ఎదురు చూస్తూ ఉన్నాడు.
"భూలోక వాసులకు ప్రణామములు", అంటూ అక్కడున్న వేగు వారిని స్వాగతించాడు.
"శ్వేత ద్వీప వైకుంఠ వాసి ఐన సిద్ధపురుషుణ్ణి కలుసుకోవటం ఎంతో ఆనందాన్నిచ్చే విషయం", అని శిరస్సు వంచి సిద్ధపురుషునికి ప్రణామం చేశాడా వేగు.
"శంభల రాజ్యాధిపతి అనిరుద్ధుల వారు మీ అందరికీ తగిన విడిదిని ఏర్పాటు చేశారు", అంటూ ఆ వేగు వాళ్ళను ఒక అతిథి గృహానికి తీసుకెళ్లాడు.అతిథిగృహం చేరుకున్నారు వారందరూ.
...
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
"ఇచట మీరు విశ్రాంతి తీసుకోవలసిందిగా అనిరుద్ధుల వారి విన్నపం. రేపు సభనందు మిమ్మల్ని అందరికీ పరిచయం చేసిన పిమ్మట వారు మీతో ఏకాంతంగా చర్చిస్తారు. కూలంకషంగా అన్ని విషయాలు అప్పుడు మీకే తెలుస్తాయి. అంతవరకు అలసటకు గురైన మీ మనసుకు ప్రశాంతతనివ్వండి", అని ఆ వేగు అక్కడి నుండి నిష్క్రమించాడు.
మంత్రి ఫాలనేత్రుడు, సేనాధిపతి రుద్రసముద్భవలు వారి నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.
అతిథి గృహం నుండి బయటకు చూస్తే ఎంతో విశాలమైన శంభల రాజ్యం కళ్ళకు దేదీప్యమానంగా కనిపించింది. శంభల రాజ్యాన్ని చూస్తూ సిద్ధపురుషుడు అభిజిత్, అంకిత, సంజయ్ లతో ఇలా చెప్పాడు.
“శంభల నగరంలో ప్రాకారాలున్నట్టే శంభల రాజ్యంలో కూడా ప్రాకారాలున్నాయి. కానీ అవి సందర్శించటానికి శంభల రాజ్యాధిపతి అయిన అనిరుద్ధుల వారి ఆజ్ఞ కావాలి. యుద్ధ సేనాధిపతికి సముచితంగా అనిపించాలి. శంభల రాజ్యంలోనివి యుద్ధ ప్రాకారాలు. అంటే ఇక్కడ యుద్ధంలో ప్రయోగించే అనేకానేక వ్యూహాలు, అస్త్రాలు, ఆయుధాలు, సైన్యం ఇలా ఒక వేరే ప్రపంచమే ఉంటుందిక్కడ. ఇక్కడ నేర్పేది యుద్ధ విద్య. ఇక్కడి వారు బ్రతికేది రక్షించటానికే. రక్షించేది బ్రతికించటానికే. యుద్ధ నీతి తెలుసు. రీతి తెలుసు. వాటిని అతిక్రమిస్తే సంహారం ఇంకా బాగా తెలుసు.
ఇక్కడి ప్రతి కన్నూ మిమ్మల్ని ఒక కంట గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆలోచనలే శత్రువులు. వ్యక్తులు కాదు. చెడుకి, మంచికి వ్యత్యాసం వచ్చేది మన ఆలోచనలోనే. అది చెడ్డ పనైనా, మంచి పనైనా పడే కష్టం ఒక్కటే. అంతరంగంలో స్వచ్ఛత కోల్పోయినప్పుడు ఎంత గొప్ప పనైనా వృథాగా మిగిలిపోతుంది. అందుకే ఇక్కడ మీకిచ్చే శిక్షణకు మీరు అన్ని విధాలా అర్హులా కాదా అని మంత్రి, సేనాధిపతి మిమ్మల్ని పరీక్షించారు. భూలోక వాసులను ఘోర కలి నుండి కాపాడటం చిన్న విషయం కాదు. ఎన్నో యుద్ధ విద్యలలో ప్రవేశం ఉండాలి, ఎంతో వ్యూహ రచన కావాలి. అవన్నీ మీకందివ్వటానికి మీకొక గొప్ప ఆశయం కావాలి. మీలో పవిత్రత నిండి ఉండాలి.
మరీ ముఖ్యంగా, అవి కడదాకా మీలో అలాగే ఉండాలి”, అని చిన్నగా నవ్వుతూ సిద్ధపురుషుడు అభిజిత్ కళ్ళలోకి చూసాడు.
తను ఎవరికైతే చెప్పాలనుకున్నాడో వారికి విషయం బోధపడేలా ఉంటుంది ఆయన చిరునవ్వు. అదొక అస్త్రం అంతే. ఆ నవ్వు ఒక బాణం లాంటిది. చాలా అరుదుగా సంధించే ఆ చిరునవ్వు మనకు గుచ్చుకుందా. అంతే. జ్ఞానం వెల్లివిరుస్తుంది. కార్యాచరణ కళ్లముందుంటుంది. సిద్ధపురుషుడి ద్వారా పెల్లుబికే దైవీ శక్తి అది.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
అప్డేట్ చాల బాగుంది
Posts: 765
Threads: 0
Likes Received: 1,220 in 684 posts
Likes Given: 3,048
Joined: Jun 2020
Reputation:
41
(05-06-2024, 05:32 PM)k3vv3 Wrote: తను ఎవరికైతే చెప్పాలనుకున్నాడో వారికి విషయం బోధపడేలా ఉంటుంది ఆయన చిరునవ్వు. అదొక అస్త్రం అంతే. ఆ నవ్వు ఒక బాణం లాంటిది. చాలా అరుదుగా సంధించే ఆ చిరునవ్వు మనకు గుచ్చుకుందా. అంతే. జ్ఞానం వెల్లివిరుస్తుంది. కార్యాచరణ కళ్లముందుంటుంది. సిద్ధపురుషుడి ద్వారా పెల్లుబికే దైవీ శక్తి అది.
K3vv3 garu!!! Very good updates. Story is interesting.
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
ఘోర కలి అరాచకాలు - 2
కపాలిని దేవి ఆలయం
ఘోర కలికి రక్షక భటుడి నుండి పిలుపొచ్చింది. కపాలిని దేవి ఉండే చోటు నుండి కబురొచ్చిందని ఆ భటుడు వణుకుతూ ఘోర కలికి చెప్పాడు. ఆ రోజు సాయంత్రమే తన సామ్రాజ్యంలో పది దేశాల నుండి వచ్చిన పదిహేను మంది బోర్డు డైరెక్టర్ లను తన రూపంలోకి మార్చే ప్రక్రియ మొదలవ్వబోతుంది. అది జరిగేటప్పుడు తను అక్కడ వుండకూడదు. ఈ ప్రక్రియ తంత్రం ద్వారా జరుగుతుంది.
ఘోర కలి తంత్ర విద్యలను అర్థం చేసుకున్న వైద్య బృందం అక్కడుంది. వారికి ఆజ్ఞ రాగానే ఈ పదిహేను మందిని అచ్చు గుద్దినట్టు ఘోర కలిలా మార్చేస్తారు. వారికి ఆజ్ఞ ఇవ్వటానికి రాయబారిగా ఘోర కలికి బాగా నమ్మకస్తుడైన సురా ను నియమించాడు. సురా ఘోర కలికి బాగా దగ్గరైన వ్యక్తి. బాల్యం నుండి మిత్రుడే. ఘోర కలి ఎక్కడుంటే సురా అక్కడుంటాడు. వారి స్నేహం అలాంటిది. సురా తంత్రంతో సిద్ధించిన ఆ యంత్రాన్ని తీసుకొచ్చి వైద్య బృందానికి అందిస్తాడు. అప్పుడు వారు అచేతనంగా అక్కడ ఉన్న పదిహేను మందిపై ఆ యంత్రాన్ని ఉంచుతారు. ఘోర కలి అనుకునే లక్ష్యాలు, ఆశయాలు, ఆశలు అన్నీ యంత్రం ద్వారా ఆ పదిహేను మందిలో నరనరాన నిండిపోయాక ఆ వైద్య బృందం ఘోర కలిలా వారి బాహ్యరూపాల్ని కూడా మార్చేస్తుంది.
నాగమణితో, తంత్రంతో ఘోర కలి కపాలిని దేవి సాక్షాత్కారము పొందుతాడు. ఆ దేవి మంత్రాన్ని ప్రసాదిస్తుంది. ఆ మంత్రాన్ని ఘోర కలి అక్కడి నుండే పఠిస్తాడు.సూరాకు తను ఇచ్చి పంపే యంత్రంతో తన సామ్రాజ్యంలో ఉన్న ఆ పదిహేను మందిని తన రూపంలోకి మార్చేస్తారు వైద్య బృందం. దేవి ఇచ్చిన మంత్రంతో కఠోర దీక్షతో సాధన పూర్తయ్యాక పరిపూర్ణమైన కామరూపధారిగా మారిపోతాడు ఘోర కలి. తను అనుకున్నట్టే ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు.
ఇది ఘోర కలి ప్రణాళిక.
ప్రపంచంపై తను సాధించబోయే ఆధిపత్యాన్ని గుర్తుచేసుకుంటూ, తన ఇన్ని యుగాల నిరీక్షణను గుర్తుచేసుకుంటూ ఒక పక్క వికృతంగా నవ్వుతూనే మరో పక్క కంటి నిండా నీరు నిండిపోయి ఉండగా ఒక్క నిమిషం ఆగి మంచి నీళ్లు తాగి ముందుకు కదిలాడు. తన చీకటి సామ్రాజ్యం నుండి కపాలిని దేవి ఉండే స్థలానికి బయలుదేరాడు.
ఘోర కలి తన దగ్గరున్న నాగమణిని వెంట తీసుకెళుతూ
కాళీ….
కపాలిని….
శూలిని…..
జగజ్జనని…..
అని అమ్మవారి నామాలను పదే పదే గట్టిగా బయటికి వినబడేలా ఘోషిస్తూ వెళుతున్నాడు.
కపాలిని దేవి ఆలయాన్ని సమీపిస్తున్నాడు. చీకటి తెరలు తెరలుగా కమ్ముకొంటోంది. చిన్న వెలుగు రేఖ కూడా దరిదాపుల్లో కనబడనంత దూరం అయిపోతోంది. ఘోర కలిని సైతం వణికించే పెను చీకటిలా ఉందది.
బాహ్యప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతున్నట్టుంది. మనకు కనిపించే ఈ వెలుగు ప్రపంచంలోనే కనబడని అంధకారం ఇంత దాగుందా అనిపించేలా ఉంది ఆ కపాలిని దేవి ఆలయ ప్రాంగణం. గాలి వల్ల, వాసన వల్ల, గుళ్లోని గంటల చప్పుడు వల్ల మాత్రమే ఘోర కలి అడుగులు ముందుకు పడుతున్నాయి కానీ దారి తెలిసి కాదు.
మెల్లిగా పసిపాపల ఏడుపులు మొదలయ్యాయి. ఘోర కలి ఘోషలు ఆగిపోయాయి. పసిపాల ఏడుపులు ఇంకా ఇంకా ఎక్కువయ్యాయి. ఒకరు ఇద్దరు ముగ్గురు అలా కొన్ని వేల, లక్షల, కోట్ల ఏడుపులు పసిపాపల ఏడుపులు తీవ్రతరం దాల్చాయి. ఘోర కలి కంట నీరు తిరిగింది. ఘోర కలికి ఏడుపంటేనే అసహ్యం. పసిపిల్లలు ఏడిస్తే తన బాల్యం గుర్తుకొచ్చి కోపం తెచ్చేసుకుంటాడు. అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. అలాంటిది ఈ రోజు అన్ని ఏడుపులు ఒకేసారి ఎలా విన్నాడో, విని ఎలా తట్టుకున్నాడో కూడా తెలియట్లేదు. ఒంట్లోని ప్రతి కణం స్పందించినట్టు అనిపించింది. కొన్ని సంవత్సరాల, దశాబ్దాల, శతాబ్దాల బాధ కన్నీటి సంద్రమై ఎగసెగసి పడ్డట్టు అనిపించింది. కన్నీరు ధారలా ప్రవహించింది. వానలా ఎడతెరపి లేకుండా కురిసింది.
ఇన్నాళ్లూ తన అంతరంగం ఎండిపోయిన ఎడారి అనుకున్నాడు. ఇవ్వాళే తెలిసింది. తనను కూడా ఏడిపించగల శక్తి ఒకటుందని. అది ఈ కపాలిని దేవి ఆలయంలోనే ఉంటుందని మాత్రం కలలో కూడా కల కనలేదు. కపాలిని దేవిని ఇప్పుడు చూడాలంటేనే భయంగా అనిపించేలా ఉంది ఆ పసిపాపల రోదన.
ఘోర కలికి ఏమీ పాలుపోవట్లేదు. అంతు చిక్కట్లేదు. ఏడుపు ఎప్పుడాగిపోతుందో తెలియట్లేదు. కపాలిని దేవి కనిపిస్తుందో లేదో కూడా తెలియదు. కనిపించినా కరుణిస్తుందో లేదో తెలియదు. తన చీకటి సామ్రాజ్యం నుండి ధైర్యంగా బయలుదేరిన ఘోర కలి ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు. కాళీ....కపాలిని....శూలిని....జగజ్జనని అంటూ ఊగిపోతూ వచ్చిన ఘోర కలికి ఇప్పుడు నోరు పెగలట్లేదు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Nice update
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
శంభల రాజ్యం – 2
అనిరుద్ధుడి ఆగమనం – ఆదేశం
శంభల రాజ్యాధిపతి అనిరుద్ధుడు. ఆయన మహా విష్ణు భక్తుడు. భూలోకవాసులలో విష్ణువును అత్యంత భక్తితో కొనియాడిన అన్నమయ్య, త్యాగరాజు వంటి వాగ్గేయకారుల సంకీర్తనలు నిత్యం వింటూ కన్నీటి పర్యంతం అవుతూ ఉంటాడు. ఆయన భూలోకవాసులను ఇంతవరకు కలిసింది లేదు. మొదటి సారి సిద్ధపురుషుడి మీదున్న నమ్మకంతో అభిజిత్, అంకిత, సంజయ్ లను కలుస్తున్నాడు. సిద్ధపురుషుడు శ్వేతద్వీప వైకుంఠ వాసి. సిద్ధపురుషుడి గురించి ముల్లోకాలలో తెలియని వారు లేరు. అంత గొప్ప విష్ణు భక్తుడు. సమర్థ రాఘవుడు అనే పేరుతో చివరి జన్మలో నామధేయాన్ని సార్థకం చేసుకున్న తెలివైన మంత్రివర్యుడు. అతని మాటకంత విలువుంది.
అనిరుద్ధుడి దినచర్య రోజూ పొద్దున్నేఎన్నో సేవలతో విష్ణు మూర్తికి పూజలు చెయ్యటంతో మొదలవుతుంది. అటు పిమ్మట సర్వలోక రక్షకుడైన ఈశ్వరుణ్ణి వేడుకుంటాడు. కావ్యాలెన్నో చదువుతాడు. యుద్ధవిద్యలెన్నిటినో పర్యవేక్షిస్తాడు. శంభల రాజ్యం చాలా తెలివైనవారిని సైతం మాయకు గురి చేసే లోకం. ఇక్కడి మగువలకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందులో ఒక మర్మం దాగుంది. యుద్ధం జయించాలంటే ప్రతి క్షణం గెలుపు మీదనే దృష్టి నిలపాలి. ఆ దృష్టిని తమవైపుకు తిప్పుకునే శక్తి పుష్కలంగా కలవారు శంభల రాజ్యం లోని సౌందర్యవతులు. వీరికున్నఅపురూప లావణ్యంతో చూపులను బంధించి వేస్తారు. వీరు నిత్య యవ్వనంతో అలరారే స్త్రీ శక్తి కలవారు. యుద్ధవీరుల గురించి వీరి ద్వారా సేనాధిపతికి ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుంది. వీరికి సంబంధించిన రహస్యం ఒకటుంది. అనిరుద్ధుడికీ, మంత్రికి, సేనాధిపతికి తప్ప శంభల రాజ్యంలో మరెవరికీ తెలియదది.
అనిరుద్ధుడి ఆజ్ఞను అనుసరించి సిద్ధపురుషుడు అభిజిత్, అంకిత, సంజయ్ లతో శంభల రాజ్యంలోని ఆస్థానంలో ఆయన రాకకై ఎదురుచూస్తూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ దుందుభి మ్రోగింది. జయజయ ధ్వానంలా వినిపించే ఆ భేరి అనిరుద్ధుడి రాకను సూచిస్తుంది. అందుకు చిహ్నంగా సభలోని ప్రతి ఒక్కరూ లేచి నిల్చున్నారు. అందరి కళ్ళూ ఆయన పైనే ఉన్నాయి. రాజే రాజ్యానికి రవి అనిపించేలా ద్వారాలు తెరుచుకోగానే కిరణాలు చుట్టూ పరివారంలా ఉండగా మధ్యలో నక్షత్రంలా వెలిగిపోతూ వస్తున్నాడు అనిరుద్ధుడు. ఆయన చిరునవ్వు చూస్తే చాలు మనం గెలిచేసినట్టే అన్నట్టు ఉంటుంది. ఆయన నవ్వు మన హృదయ సామ్రాజ్యాన్ని ఎప్పుడు ఆక్రమించిందో తెలిసేలోపే మన మోముపై చిరునవ్వు వెల్లివిరుస్తుంది. అది ఆయన ఘనత.
ఎంతో తెలిసినా ఏమీ తెలియనట్టు ఉంటాడనిపిస్తుంది. ఎంత తెలిసినా ఇంకేదో తెలుసుకుంటూనే ఉంటాడనిపిస్తుంది. ఎన్నో యుద్ధాలను చూసిన చిరుతపులి కళ్ళలా ఆయన కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. ఎంతో మందిని మట్టికరిపించిన చేతులలా అనిపిస్తాయి. ఆయన ఠీవి చూస్తే ఎక్కడా లేశమాత్రమైనా అహం కనబడదు. పైగా ఆభరణంలా అనిపిస్తుంది. ఆయన రాజసం చూస్తే అది ఆయన మకుటంలా మెరిసిపోతూ ఉంటుంది. ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అనే మన గుండెచప్పుడు మనకే ఆ ఆస్థానంలో ప్రతిధ్వనిస్తూ వినబడుతూ ఉంటుంది. అంతటి మౌనం నెలవై ఉంటుందక్కడ. అది ఆయన మహిమ. నీలివర్ణంలో ఉన్న పట్టు వస్త్రముతో, మెడలో వైకుంఠ హారము ధరించి వస్తుంటే ఆ శోభతోనే సభ విరాజిల్లుతోందా అన్నట్టుంది.
సింహాసనం పై ఆసీనుడైన అనిరుద్ధుడు తన హావభావాలతో, చేతి సైగతో అక్కడున్న మంత్రికి ఏదో చెబితే మంత్రి మర్యాదపూర్వకంగా సిద్ధపురుషుణ్ణి మాట్లాడవలసిందిగా కోరాడు.
సిద్ధపురుషుడు, "ప్రణామములు అనిరుద్ధా, మీరు ఈ రోజున ధృవ నక్షత్రం వలే విష్ణుకాంతితో ధగధగా మెరిసిపోతున్నారు."
మధ్యలోనే సిద్ధపురుషుణ్ణి అడ్డుకున్న అనిరుద్ధుడు, " అందుకు ఒక కారణం ఉన్నది. నేను పూజలో నిమగ్నమై ఉండగా మీ గురించి స్వామివారు అడిగారు. మీరు తేజస్సుతో వెలిగిపోతున్నారని వారికి చెప్పాను. ఆయన నవ్వు నాకు వినిపించింది. రోజూ ఆయనను దర్శించే మీరు ఇంకెంత అదృష్టవంతులో అనిపించింది."
సిద్ధపురుషుడు ఆనందపడిపోతూ,"ఆయన నా గురించి మిమ్మల్ని అడిగారా !"
శ్వేతద్వీప వైకుంఠాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, "వారు తండ్రివలే వాత్సల్యం చూపిస్తారు. ఆ ప్రేమ రుచి చూసినవాడికి వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాదు. వారి ఆజ్ఞను అనుసరించే ఇంత దూరం వచ్చాను. వారిని నేనెప్పుడూ మరిచిపోలేదు."
అనిరుద్ధుడు అందుకుని," మరిచిపోలేరు. వారి దర్శనభాగ్యం నాకు కలుగుతుందో లేదో తెలియదు కానీ వారిని చూసిన మిమ్మల్ని నేరుగా ఇలా కలుసుకోవటం నన్నెంతో భక్తిపారవశ్యానికి గురి చేస్తోంది" అంటూ ఆయన సింహాసనం పై నుండి లేచి సిద్ధపురుషుడి వద్దకు నడుస్తూ వచ్చి ఆయనకు శిరస్సు వంచి అభివందనం చేసి తిరిగి తన పీఠాన్ని అధిష్టించారు.
సిద్ధపురుషుడు, "భూలోకంలో ఘోరకలి ఆధిపత్యం చేపడతాడు. ఘోరకలిని అడ్డుకోవాలంటే శంభల రాజ్యం లోని యుద్ధవిద్యలలో వీరు రాటుదేలాలి", అంటూ అభిజిత్, అంకిత, సంజయ్ లను పరిచయం చేసాడు.
"శంభల రాజ్యంలోని వీరులు కొందరు మాకు కావాలి. వారు లేనిదే ఘోర కలిని ఎదిరించలేము. మీ సైన్యం, మీ వ్యూహ రచన, మీ ఆయుధాలు, మీ అస్త్రాలు...ఇలా మీరు ఇవ్వగలిగినది ఏదైనా అది మాకు భాగ్యమే" , అని సిద్ధపురుషుడు ముగించాడు.
"మరి పరాక్రమము?" అన్నాడు అనిరుద్ధుడు.
అభిజిత్ మాట్లాడకుండా ఉండలేకపోయాడు.
"సర్...మీకు మా భూలోకవాసుల గురించి తెలీదు అనుకుంటా. మాకుండేదే పరాక్రమము. చిన్నప్పటి నుండి మేము రాసినన్ని పరీక్షలు ఏ లోకంలోనూ రాసుండరు. ప్రాణానికి తెగించి ఘోర కలితో నేను పోరాడతాను. మీకు కుదిరితే హెల్ప్ చెయ్యండి. లేకపోతే లేదు."
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
అనిరుద్ధుడు మళ్ళీ లేచి నిలబడి అభిజిత్ ఉన్న చోటికి నడుచుకుంటూ వచ్చి అభిజిత్ కళ్ళల్లోకి సూటిగా చూసి నవ్వుతూ, "అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపెనీ ఉయ్యాల" అంటూ అభిజిత్ భుజాల పై తన రెండు చేతులూ వేసి గట్టిగా పట్టుకునేసరికి ఏదో తెలియని జ్ఞానం అతనిలో ప్రవేశించినట్టు అభిజిత్ అనిరుద్ధుడినే చూస్తూ ఉండిపోయాడు.
“పరాక్రమం నీలో కనిపించింది అభిజిత్. ఈ జోరు కాస్త తగ్గిస్తే సరిపోతుంది", అనేసి సభాప్రాంగణం మధ్యలో నిలబడి అనిరుద్ధుడు అక్కడున్న వాళ్ళ అందరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇలా చెప్పాడు.
"మన శంభల నుండి ఘోర కలిని సంహరించేందుకు కొంత సైన్యాన్ని తరలిస్తున్నాను. ఇందులో మీకెలాంటి అభ్యంతరాలు లేవనే భావిస్తున్నాను. సిద్ధపురుషుడు శ్వేతద్వీప వైకుంఠ వాసి. ఆయన నేతృత్వంలో ఈ ముగ్గురూ మన రాజ్యంలో యుద్ధవిద్యలనభ్యసిస్తారు. వీరికి మీ సహకారం కావాలి. పరాక్రమం అంటే ఏంటో అదెలా ఉంటుందో వీరికి పరిచయం చెయ్యండి రుద్రసముద్భవా" అంటూ సేనాధిపతి వైపు సూటిగా చూస్తూ ఆజ్ఞాపించటంతో సభ ముగిసింది. అనిరుద్ధుడు నిష్క్రమించాడు.
ఆయన వచ్చేటప్పుడు ఎలా అయితే అందరూ నిలబడ్డారో, వెళ్లిపోయేటప్పుడు కూడా గౌరవప్రదంగా నిల్చున్నారు. ఒక రాజుకిచ్చే గౌరవం శాసనాల్లో రాయబడి ఉండదు. ఆయనని చూసిన మరుక్షణమే అది పుడుతుంది. రాజు వెడలె రవి తేజములలరగా అంటూ అదిగో వెళుతున్నాడే ఆ అనిరుద్ధుడే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఇదే ఆయన శంభల రాజ్యం.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
|