Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముడి
పాఠక మితృలందరికీ వందనములు
ముఖ్యంగా కధను చదివి వ్యాఖ్యానించినవారికి, మెచ్చినవారికి అభివందనములు
అతి త్వరలో, మరో రెండు అప్డేట్ల తరువాత సుఖాంతమౌతుంది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ముడి- చివరి భాగం
స్వాతికి లెక్కల్లో ఏదో సందేహం వస్తే నివృత్తి చేస్తూ ఉన్నాడు ఈశ్వర్.
" బాబూ, చానా సంతోషంగుంది. మీరూ, బుజ్జీ ఒచ్చినందుకు. మేమే పిలుద్దం అనుకుంటున్నం. మీరే ఒస్తిరి. అంత బాగనేనా ఆడ? పెద్ద ఆపార్టుమెంటుల ఉంటరంట గద మీరు ? ఈన జెప్పిండె... గప్పుడు పెళ్ళప్పుడు రానీకె కుదర్లె నాకు. గందుకే రాలె. ఏమనుకోవొద్దు." అంది జయమ్మ.
" అయ్యో, పర్లేదండి ." అన్నాడు ఈశ్వర్.
" బుజ్జిని చూస్తె చానా సంతోషంగుంది బాబు. దానికి ముక్కు మీన కోపం గాని, మనస్సు చానా మంచిది దానిది. అదేమన్న కోపం తెప్పించినా గూడ జెర మీరే ఓర్సుకోండి. "
" అయ్యో తన వల్ల ఎప్పుడూ ఇబ్బందీ రాలేదు నాకు." అన్నాడు ఈశ్వర్.
" చానా సంతోషం బాబూ. బుజ్జి , నువ్వు ఇద్దరు సంతోషంగ ఉంటే సాలు. "
ఈశ్వర్ చిరు మందహాసం చేశాడు. జయమ్మ చిత్ర యొక్క మేలుని అంత మనస్పూర్తిగా కోరుకోవడం ఈశ్వర్ కి సంతోషాన్ని కలిగించింది.
ఇంతలో గ్లాసు నిండా పాలు తీసుకుని వచ్చింది చిత్ర.
"ఇదో... పాలు తీస్కో. సుక్క బర్రెవి. మస్తుంటయ్ కమ్మగ." అని తన భర్త చేతికి అందించింది చిత్ర.
" మరి నువ్వు తాగవా ?" అంటూ చిత్ర వైపు చూస్తూ అడిగాడు ఈశ్వర్.
" నాకు ఆకలేం అయితలే. నువ్వు తాగు రోజు పొద్దు పొద్దు గల్ల తింటవ్ టిఫిను. ఆకలి గొంటవ్ ." అంది చిత్ర.
చిత్ర యొక్క ' పెద్దరికాన్ని ' చూసి ముచ్చటపడింది జయమ్మ.
పాలు తాగిన ఈశ్వర్ తో
" ఇదో... కార్ల పొయి కూరగాయలు తెద్దమా ? ఊరు గూడ సూపిచ్చినట్టైతది నీకు. ఏమంటవ్ ?" అంది చిత్ర.
" yeah sure."
చిత్ర, ఈశ్వర్ లు ఇద్దరూ కార్లో బయలుదేరారు. మధ్యలో ఒక చోట కార్ ఆపమంది చిత్ర.
" ఇదో.... గుడి నాకు చానా ఇష్టం. ఒక సారి పోదమా లోనికి ? జెస్టు లోపటికి ఇట్ల పొయి, అట్లొద్దం. సరేనా ?" అంది చిత్ర.
" హేయ్ , నీకిష్టమైనంత సేపు ఉందాం లోపల. నాకు తోందరేం లేదు. " అన్నాడు ఈశ్వర్.
చిత్ర, ఈశ్వర్ లు ఇద్దరూ సాయి బాబా గుడి లోనికి వెళ్ళారు.
అక్కడ చేతులు జోడించి మొక్కని తన భర్త తరఫున ముందు దేవుడికి మొక్కి, తరువాత తన దండాన్ని మొక్కుకుంది చిత్ర. అక్కడ ఉన్న విభూతిని కాస్త చేతిలోకి తీసుకుని, తన భర్త నుదురు పై రాసింది చిత్ర.
ఈశ్వర్, చిత్ర లు ఒక మూలకు కూర్చున్నారు.
" గీ గుడికి పెండ్లి కాక ముందు ప్రతి గురు వారం వచ్చెడిదాన్ని. నాకు మస్తు ఇష్టం గీ గుడంటె." అంది చిత్ర.
" .. బాగుంది చుట్టూ atmosphere. idol కూడా చాలా బావుంది."
" ?! "
" అదే .. విగ్రహం."
" హా ... గీ గుడిని బాలకిషన్ రావు అనేటాయ్న చెందాలకు తిరిగి కట్టించిండె. పాపం చానా కష్టపడిండె. గిప్పుడు ఈడుంట లేరు వాళ్ళు. హైదరబాదులనే ఉంటరు వాళ్ళ కొడుకు దేర. ఇంగ అప్పుడప్పుడొస్తుంతరు గుడిని సూడనీకె. " అంది చిత్ర.
"." అన్నాడు ఈశ్వర్, అవసరమైన దాని కన్నా ఎక్కువ సమాచారాన్ని ఇచ్చే అలవాటున్న చిత్రని చూసి ముచ్చటపడుతూ.
" ఏమి నవ్తున్నవ్ ?"
" ఏమీ లేదు."
" చెప్పు. "
" నువ్వు పక్కనుంటే అస్సలు బోర్ కొట్టదు చిత్రా."
" హహ, చిన్నగున్నప్పటి కెళ్ళి నేను గంతే. మా అమ్మ నేను సన్నవిల్ల వున్నప్పుడు నా నోట్ల వస పోశింటదని అంటుండె ఊకె" అంది చిత్ర నవ్వుతూ.
" వస అంటె ?!"
" గదే ... చిన్నగున్నప్పుడు మాటలు దబ్బున రానీకె పోస్తరు పిల్ల నోట్లల్ల."
" .... నిజమే అన్నాడు మీ మామయ్య."
అలిగింది చిత్ర, గట్టిగా నవ్వాడు ఈశ్వర్.
కూరగాయలు కొనుక్కుని ఇంటికి వెళ్ళారు ఈశ్వర్, చిత్ర లు.
అప్పటికే రామచంద్రయ్య వచ్చి ఉన్నాడు.
" మామా ! ఎట్లున్నవ్ ?! " , " బుజ్జీ ! ఎట్లున్నవ్ ?! " ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్న మరు క్షణమే ఏకకాలంలో అన్నారు.
రెండు , మూడు కుశల ప్రశ్నల తరువాత చిత్ర తన మామయ్యకు ఆరోగ్యం పై ' క్లాసు ' తీసుకోవడం ప్రారంభించింది.
భవిష్యత్తులో తాను చిత్ర చేతిలో ఎన్ని ' క్లాసు లు ' వినాల్సి వస్తుందో ననుకున్నాడు ఈశ్వర్.
ఐదు నిమిషాల చిత్ర చీవాట్లు, రామచంద్రయ్య సంజాయిషీల తరవాత చిత్ర , రామచంద్రయ్యలకు పక్కన ఈశ్వర్ ఉన్న విషయం గుర్తొచ్చింది.
" ఎట్లున్నరు బాబు? అంత మంచిగనే ఉందా? మీ అమ్మ, నాయినలు బాగున్నరా ?"
" హా బావున్నారు. " అన్నాడు ఈశ్వర్. తన సొంత తల్లిదండృల యొక్క క్షేమ సమాచారాన్ని గూర్చి ఒక్క సారైనా కనుక్కోవాలన్న ఆలోచన కూడా తనకు రాని విషయం ఈశ్వర్ మనస్సును కలుక్కుమనేలా చేసింది. తనకు కూడా చిత్ర తన వాళ్ళతో ఆప్యాయంగా ఉన్నట్టుగా తను తల్లిదండృల తో ఉండింటే ఎంతో బావుండుననిపించింది.
" విజయవాడ లోనే ఉన్నారా మీ అమ్మ వాళ్ళు ?" అడిగాడు రామచంద్రయ్య.
" హా అవునండీ." బదులిచ్చాడు ఈశ్వర్.
ఈశ్వర్ సమాధానం తెలిపేటప్పటి స్వరాన్ని బట్టి అతను లోలోన ఏం ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకోగలిగింది చిత్ర.
తను కొనుక్కొచ్చిన ఆలుగడ్డలను తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది చిత్ర.
***
ఈశ్వర్ కి తోడుగా చిత్ర కూడా చప్పనైన ఆలుగడ్డ కూర తినసాగింది. మిగిలిన వాళ్ళు కోడి గుడ్డు, ఉల్లిగడ్డల కూర తినసాగారు.
భోజనాలు ముగించాక, ఇంటి ముందున్న వేప చెట్టు కింద ఉన్న బెంచ్ పై కూర్చున్నారు చిత్ర, ఈశ్వర్ లు.
ఈశ్వర్ కి తన అమ్మ, నాన్నలు గుర్తు రాసాగారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడాలి అనిపించింది ఈశ్వర్ కి. కానీ అన్నేళ్ళుగా తన తల్లి దండృలతో అతను పెంచుకున్న దూరం అతడికి గుర్తుకు రాసాగింది.
" ఇదో... నీ ఫోనిస్తవా? జెర పనుంది."
" ఎందుకు ?"
" అని జెప్పాల్నా?! అడుగుతె ఇయ్యవా నాకు ?! " అంది చిత్ర.
" హం. " అని నిట్టూర్చి, నవ్వుతూ తన భార్య చేతికి ఫోన్ ఇచ్చాడు ఈశ్వర్.
పక్కకు వెళ్ళింది చిత్ర ఫోను తీసుకుని.
తనకు తెలిసిన కాస్త ' సెల్ ఫోన్ ' గ్న్యానం తో , ఫోన్ తో కుస్తీ పడి, రెండు నిమిషాల తరువాత 'mom' అన్న కాంటాక్ట్ కి ఫోను కలిపింది చిత్ర.
" అత్తయ్యా, నేను చిత్ర ని . బాగున్నరా?..." అంటూ సంభాషణని ప్రారంభించింది చిత్ర.
రెండు నిమిషాల తరువాత తన భర్త చేతిలో ఫోను పెట్టింది చిత్ర.
" ఎవరు ?"
" మాట్లాడు."
"రేయ్ నాన్నా, ఎలా ఉన్నావ్ రా ? " అంది ఈశ్వర్ వాళ్ళ అమ్మ సరళ.
" బావున్నాను. నువ్వెలా ఉన్నావ్? నాన్న హెల్త్ ఎలా ఉంది ?" అవి కుశల ప్రశ్నల్లా కాక ఈశ్వర్ యొక్క మనస్సు లోతుల్లోనుంచి తన్నుకు రాసాగాయి.
" బావున్నా రా నేను. మీ నాన్న హెల్త్ .. ఇంక తెలిసిందే కదరా, బి.పి ఉంది. పాపం బానే కేర్ తీసుకుంటున్నాడు లే కానీ నా భయం నాకు ఉంటుంది కదరా. సమ్మర్ కదా, బాగా నీరసపడుతున్నాడు."
".. జాగ్రత్త గా చూస్కో అమ్మా నాన్న ని. బిపి కంట్రోల్ లో ఉండేలా."
ఎన్నో రోజుల నుంచి లోపల దాచుకున్న మాటలన్నీ ఒక్కొక్కటిగా ఈశ్వర్ నోటి వెంట రాసాగాయి.
తన భర్త ను ఏకాంతంగా వదిలేస్తే బావుంటుందనుకుని, అటు నుండి వెళ్ళింది చిత్ర.
...
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
ఆఖరి భాగం ఈ ఆదివారం

అప్డేట్ చాల బాగుంది  thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
అదృష్టవంతుడు ఈశ్వర్ చిత్ర లాంటి భార్య దొరికినందుకు. భర్త మనసులోని ఆలోచనలను ఎంతమంది భార్యలు అర్థం చేసుకుంటారు చెప్పకుండానే, చెప్తే కూడా అర్థం చేసుకోనివాళ్ళు కోకొల్లలు.

బావుంది భయ్యా అప్డేట్.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
(16-06-2023, 08:33 AM)k3vv3 Wrote: ముడి- 3వ భాగం

ఆఫీస్ నుండి ఈశ్వర్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తోంది చిత్ర. పెళ్ళైన మూడవ రోజు నుండే గంట కొట్టినట్టుగా తొమ్మిదింటికి తన భర్త ఆఫీస్ కి వెళ్ళటం కాస్త ఆశ్చర్యకరంగా తోచింది చిత్రకి. ఒక రకమైన గంభీరమైన వాతావరణం ఈశ్వర్ , అతని తల్లిదండ్రుల మధ్య నెలకొందని గమనించింది చిత్ర. గత నాలుగు రోజులుగా ఒక్కసారి కూడా తన భర్త నవ్వగా చూళ్ళేదు తను. చిత్ర కు మనస్సులో ఒక మూల కాస్త భయం వేస్తోంది. పైగా వెళ్ళేటప్పుడు సరళ, గోవిందరావు లు తనతో మాట్లాడిన విధానం తన మనస్సు లో ఏదో సందేహాన్ని కలిగిస్తోంది.
కానీ తన భర్త ఈశ్వర్ యొక్క సౌష్ఠవమైన దేహం, పాలుగారుతున్నట్టుగా ఉండే అతని మేని ఛాయ, ఒత్తైన అతని జుట్టు, గంభీరత తో కూడిన అతడి నడక లు గుర్తొచ్చినప్పుడల్లా చిత్ర కు లోలోన సిగ్గేస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన మహేష్ బాబు కు అందంలో సరితూగుతూ ..'మహేష్ బాబు లా ఉన్నాడు’ అన్న ఉపమానానికి సరిగ్గా సరిపోయే వాడిగా చిత్ర కు ఈశ్వర్ తోచాడు.
ఇంతలో 'టంగ్ టంగ్ టంగ్' అంటూ కాలింగ్ బెల్ మూడు సార్లు మోగింది.బెల్ మోగిస్తున్నది తన భర్త ఈశ్వరేనేమోనని ఊహించింది చిత్ర. వడివడిగా వెళ్ళి తలుపు తెరిచింది. తన ఎదురుగా తన భర్త ఈశ్వర్ నిల్చుని ఉన్నాడు. అతని భుజానికి ఒక బ్యాగ్ తగిలించ బడి వుంది. అతని కళ్ళు కాస్త అలసిపోయి వున్నాయి.ఈశ్వర్ ని చూడగానే చిత్ర ముఖం లో అప్రయత్నపూర్వకమైన దరహాసమొకటి చిగురించింది.ఈశ్వర్ మాత్రం తన ముఖం నిండా నిర్లిప్తతను నింపుకుని చిత్ర ఎప్పుడు తన దారికి అడ్డం జరుగుతుందా, తాను ఎప్పుడూ లోపలికి వెళ్తాడా అన్నట్టుగా ఎదురుచూస్తున్నాడు.
తన భర్త నుండి తన దరహాసానికి ప్రతిగా నవ్వు రాకపోయేసరికి కాస్త చివుక్కుమంది చిత్ర గుండెలో. ఈశ్వర్ భావోద్వేగరహితమైన ముఖం తో చిత్ర వైపు నిర్లిప్తంగా చూస్తున్నాడు.చిత్ర అతను తనని అడ్డు తప్పుకోమంటున్నాడని అర్థం చేసుకుని పక్కకు జరిగింది.వెంటనే , చిత్ర ఉనికిని పట్టించుకోనట్టుగా హాల్లోకి వచ్చాడు ఈశ్వర్.
చిత్ర కు తన భర్త తో ఏదో ఒకటి మాట్లాడాలనిపించింది. "అత్తయ్యా, మామయ్యా గంట ముందు పొయ్యిండే." అంది చిత్ర.
"హం" అన్నాడు ఈశ్వర్.
చిత్ర కు ఈశ్వర్ తో ఇంకాస్త మాట్లాడాలి అనిపించింది.
"స్నానం జేస్తరా? వేడి నీళ్ళు పెట్టాల్నా మీకు?" అడిగింది చిత్ర, ఈశ్వర్ తన వైపు తిరిగి సమాధానం చెబుతాడేమోనన్న ఊహ తో.
"అక్కర్లేదు." అన్నాడు ఈశ్వర్ చిత్ర వంక చూడకుండానే.
చిత్రవైపు కనీసం చూడనైనా చూడకుండా తన గదిలోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్.
ఒక్క క్షణం చిత్ర కు తాను ఉన్నది పది అంతస్థుల అపార్ట్మెంట్ సముదాయం లో 503 ఫ్లాట్ అని కాక, ఎడారిలో తనను కాలుస్తున్న ఇసుక తెన్నెల మధ్య ఉన్నట్టుగా తోచింది.తనతో పాటు ఉన్నది తన భర్తేనా? లేక ఎవరో అపరిచితుడా? అన్న సందేహం ఆమెకి కలిగింది.
సరళ, గోవిందరావులు తనతో మాట్లాడుతున్నప్పుడు వారి స్వరాలలో తొణికిసలాడిన అపరాధభావం చిత్ర మనస్సులో భయాన్ని రేపసాగింది.
గుండె లోతుల్లో నుండి వస్తున్న తడిని తన పంటి బిగువున బంధించి హాలు మధ్యలో 'ఒంటరిగా' నిల్చుండి పోయింది చిత్ర.
స్నానం చేసి కాటన్ టీ షర్ట్, షాట్ లల్లో బయటకు వచ్చిన ఈశ్వర్ , చిత్ర యొక్క ఉనికిని పట్టించుకోకుండా తన ఫ్లాట్ లోని వివిధ ప్రదేశాలకు తిరుగుతూవున్నాడు. చిత్ర మాత్రం అలాగే స్థాణువులా హాలు మధ్యలో నిల్చుండిపోయింది.
* * *
గత గంటన్నర నుండీ చిత్ర ఒకే ప్రదేశం లో నిలబడి ఉందని గమనించినా పట్టించుకోనట్టుగా మెలిగాడు ఈశ్వర్. ఎన్నో ఆలోచనలు చిత్ర మనస్సులో నాట్యమాడుతూ ఉన్నాయి. వాళ్ళింటి గోడ గడియారం తొమ్మిది సార్లు గంట కొట్టింది. గంట శబ్దంతో ఆలోచనల సుడుల నుండి ఇంద్రియావస్థ కు వచ్చింది చిత్ర.ఈశ్వర్ గదిలో తన ల్యాప్ టాప్ లో ఏదో పని చేసుకుంటున్నాడని గమనించింది చిత్ర.
చిత్ర ఆ గది తలుపు వైపు అడుగులు వేసి, గది గుమ్మం దగ్గర నిలబడి" తినడానికి వస్తరా? ఆలుగడ్డ కూర మీకిష్టమని అత్తయ్య చెప్పింది. చేశ్న. కారం గూడంగ ఎక్కువెయ్యలే, మీకు ఇష్టముండదని" అంది.
"నాకు ఆకలిగా లేదు. నువ్వు భోంచేయి." అన్నాడు ఈశ్వర్ పొడిగా ల్యాప్టాప్ వైపు చూస్తూనే.
"అది గాదు కొంచం తినండి. మళ్ళ రాత్రి ఆకలి గొంటరు." అంది చిత్ర.
"నాకు ఆకలిగా లేదు" అన్నాడు ఈశ్వర్ ఈసారి కూడా లాప్ టాప్ వైపు చూస్తూనే.
"కనీసం పాలైన తాగండి. రాత్రి మళ్ళ ఆకలవ్తది." అంది చిత్ర.
ఈశ్వర్ చిత్ర వైపు చుర్రున ఒక చూపు చూశాడు. ఆ చూపులో చిత్ర పట్ల వికర్షనా భావం తాండవిస్తోంది. చిత్ర కు ఇంకేమీ మాట్లాడాలనిపించలేదు.
ఆకలి వేస్తున్నా తినాలనిపించలేదు చిత్ర కి. హాల్లోని సోఫాలో కూర్చుండిపోయింది.తన తల్లి చనిపోయినప్పుడు తన చుట్టూ ఎంతో మంది జనాలున్నా తనను ఆవరించిన నిశ్శబ్దపు స్థితి తనకు గుర్తుకు వచ్చింది. ఈ క్షణం కూడా అలాంటి స్థితిలోనే తానున్నట్టుగా భావించుకుంది చిత్ర. తన పంటి బిగువున ఆ బాధ ను దాచుకోవటం ఆమె వల్ల కావట్లేదు. కాపురానికి కొత్త ఇంట్లో అడుగుపెట్టబోయే ముందు ఆమె కన్న కలలు కల్లలు గానే మిగిలిపోబోతున్నాయేమోనన్న ఊహ కన్నీళ్ళలా మారి ఆమె చెంపల మీదుగా జారి పడుతూ వుంది.
***
గదిలో ఉన్న ఈశ్వర్ కి దాహం వేసింది. హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాడు. అక్కడ అతనికి మనస్సులో ఏదో ఆలోచనతో, కళ్ళ నిండా నీళ్ళతో సోఫాలో కూర్చుని ఉన్న చిత్ర కనిపించింది.
" ఎందుకు ఏడుస్తున్నావ్?" అన్న మాట ఈశ్వర్ నోటి దాకా వచ్చింది. కానీ ఆ ప్రశ్న అతడికి అడగాలనిపించలేదు. ఆమె ఏడుపుకి కారణం తానేనేమోనన్న భావన కలిగింది అతడికి.
"భోంచేశావా?" అన్నాడు ఈశ్వర్ చిత్ర ముందు నిలబడి.
చిత్ర ఈశ్వర్ వైపు చూసింది.
"భోంచేశావా?" మళ్ళీ అడిగాడు ఈశ్వర్.
అడ్డంగా తలూపింది చిత్ర.
"భోంచేద్దాం పద" అన్నాడు ఈశ్వర్.
* * *
ఈశ్వర్ కి అన్నం వడ్డించింది చిత్ర.
"నువ్వు కూడా కూర్చో" అని చెప్పబోయి విరమించుకున్నాడు ఈశ్వర్.
ఈశ్వర్ అన్నం తిన్న వేగం చూస్తే అతనికి బాగా ఆకలి వేసిందని అర్థమయ్యింది చిత్రకు.ఈశ్వర్ తింటున్నంతసేపూ ఆబగా చూస్తూ ఉంది చిత్ర. చనిపోయిందనుకున్న ఆమె ఆకలి మళ్ళీ బతికి వచ్చి తన కడుపులో గోల చేయసాగింది.
ఈశ్వర్ తినటం ముగించాక తను తిన్న కంచం ఎత్తబోతుంటే చిత్ర వారిస్తూ"నేను తీస్త లెండి. మీరు పొయి చేతులు కడుక్కోండి."అంది.
"వద్దు నా ప్లేట్ నేనే తీస్తాను. నా ఎంగిలి కంచాన్ని ఇంకొకరు కడిగితే నాకస్సలు నచ్చదు." అన్నాడు ఈశ్వర్.
సింక్ దెగ్గరికి వెళ్ళి తన పళ్ళాన్ని తనే శుభ్రంగా కడుక్కున్నాడు ఈశ్వర్.
" నీ పేరు చిత్ర కదా ?!" అడిగాడు ఈశ్వర్. భార్యను పేరడిగే భర్త ప్రపంచం లో అతనొక్కడే అయ్యుంటాడనిపించింది చిత్ర కు. కానీ అతని స్వరం లో తన పేరు తనకే చాలా అందంగా తోచింది.
"హా" అంటూ తలూపింది చిత్ర.
"నా పేరు ఈశ్వర్."
తెలుసన్నట్టుగా నవ్వింది చిత్ర.
"నన్ను అండి, పొండి అని పిలవకు నా పేరు ఈశ్వర్. నన్ను అలాగే పిలువు." అన్నాడు ఈశ్వర్.
"అట్ల మంచిగనిపియ్యదు నాకు." అప్రయత్నంగా తన మనస్సులో ని మాటను చెప్పింది చిత్ర.
" నాకు అలానే ఇష్టం ఆపైన నీ ఇష్టం." అన్నాడు ఈశ్వర్ చాలా పొడిగా.
మిన్నకుండిపోయింది చిత్ర.
ఈశ్వర్ తన కాళ్ళ కు స్పోర్ట్స్ షూస్ తొడుక్కుని బయటకు వెళ్ళాడు. రాత్రి పదింటికి ఈశ్వర్ అలా బూట్లేసుకుని బయటకు వెళ్ళటం కాస్త విడ్డూరంగా అనిపించింది చిత్రకు.చిత్ర తన భోజనం కానిచ్చేసింది.తొమ్మిదింటి కల్లా పడుకునే అలవాటున్న చిత్రకి అంత రాత్రి దాకా మేలుక ఉండటం గత నాలుగు రోజులుగా ఇబ్బందిగా మారింది. నిద్ర ముంచుకొస్తున్న కళ్ళతో ఈశ్వర్ రాకకై ఎదురుచూడసాగింది చిత్ర.
కాసేపటికి ఇంటికి తిరిగొచ్చాడు ఈశ్వర్. అతని నుదుటి పై ఒకటి, రెండు చెమట బిందువులున్నాయి. తిన్నాక కాసేపు అరగటానికి వాకింగ్ చేసే అలవాటు ఈశ్వర్ కి ఉన్నట్టుగా గ్రహించింది చిత్ర.కళ్ళనిండా నిద్ర ముంచుకు రావటంతో తూలుతోంది చిత్ర. ఈశ్వర్ తో " నిద్రొస్తోంది నాకు." అని అంది.
ఈశ్వర్ చిత్ర వంక చూస్తూ "ఐతే వెళ్ళి పడుకో. దానికి నా Permission ఎందుకు?" అని అన్నాడు.
చిత్ర బెడ్ రూం లో ఉన్న మంచం పైన నడుం వాల్చింది. ఈశ్వర్ రాకకై ఎదురు చూడ సాగింది. కాసేపటికి ఈశ్వర్ గది లోనికి వచ్చాడు. చిత్ర వంక చూడకుండా ఆమె పక్కన ఉన్న చెద్దరు, మెత్త తీసుకుని హాల్లో ఉన్న సోఫా లో పడుకుండి పోయాడు.
చిత్ర కు తోందరగా నిద్ర పట్టలేదు. తన జీవిత పయనం అగమ్యం వైపేమోనని తోచింది చిత్రకు. అంత అందమైన డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లో తన 'స్థానం' ఏమిటో తెలిసింది చిత్రకు.
* * *
పొద్దున ఐదింటికే నిద్ర లేచింది చిత్ర. శనివారం కావటం తో తలస్నానం చేసి, ఆరింటికల్లా చక్కగా తయారయ్యింది. పక్క రూం లో ఈశ్వర్ ట్రెడ్ మిల్ పై చమటలు వచ్చేలా పరిగెడుతున్నాడు.ప్రతి శనివారం తను నిష్టగా పూజించే వేంకటేశ్వర స్వామి పటం ఒక్కటైనా కనిపించలేదు చిత్ర కు. నిజానికి ఏ ఒక్క దేవుడి పటం కూడా లేదు ఆ ఇంట్లో. సోఫాలో కూచుని , కళ్ళు మూసుకుని గోవింద నామాలు మనస్సులో చదువుకుంది చిత్ర.చెమటలు కక్కుతున్న దేహం తో స్నానానికి వెళ్ళాడు ఈశ్వర్.తన ముందు కూరగాయలను ఉంచుకుని తరుగుతూ ఉంది చిత్ర. కత్తిపీట తో కూరగాయలు తరగటం అలవాటైన ఆమెకు చాక్ తో తరగటం కాస్త ఇబ్బంది గా అనిపించింది.
స్నానం ముగించుకుని బయటకు వచ్చాడు ఈశ్వర్. తెల్లటి మేని చాయతో కండలు తిరిగిన అతడి దేహం పై నీటి బొట్లు మెరుస్తూ వున్నాయి.చొక్కా వేసుకుంటే నాజూకుగా కనిపించినా , ఈశ్వర్ రాతి లాంటి కండలు తిరిగిన దేహం కలిగి ఉన్నాడని గ్రహించింది చిత్ర మహేష్ బాబు కన్నా బావున్నాడు అన్న ఉపమానానికి సరిగ్గా సరిపోతాడు అనిపించింది.సినిమా హీరోలకు మాత్రమే ఉంటుందనుకున్న 'సిక్స్ పాక్' తన భర్త కు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించింది చిత్ర కు. తన కు లోలోన సిగ్గుగా అనిపించింది.తన స్నేహితురాలూ, కొన్ని విషయాల్లో 'గురువు ' అయిన వీణ తనకు చెప్పిన సంగతులు చిత్రకు గుర్తొచ్చాయి. ఆమె మదిలో కొంటె తలపుల తలుపులు తెరుచుకున్నాయి.
కానీ ఒక్కసారిగా నిన్న రాత్రి ఈశ్వర్ తనకు తెలియజెప్పిన ' తన స్థానం' ఆమెకు గుర్తొచ్చింది. ఈశ్వర్ వైపు నుంచి కూరగాయల వైపు తన చూపును తిప్పుకుంది. తను ఈశ్వర్ వైపు చూసినా , చూడకున్నా అతనికి పెద్దగా తేడా ఏం ఉండదని గ్రహించిందామె!
ఈశ్వర్ గదిలోంచి వెళ్ళి కాటన్ టీ షర్ట్, షార్ట్ లో బయటకు వచ్చాడు.
"ఆఫీస్ కి పోతలే?" అడిగింది చిత్ర.
"ప్చ్"
"సెలవా?" అడిగింది చిత్ర కాస్త కుతూహలం తో.
"నేను రోజూ పోనవసరం లేదు.I work from home mostly." బదులిచ్చాడు ఈశ్వర్ చిత్ర వైపు చూడకుండానే.
"ఓ.. టిఫిన్ ఏం చేయను?" అడిగింది చిత్ర.
"ఏదైనా పర్లేదు. కారం ఎక్కువ లేకుండా చేయి." అని ఒక్క క్షణం ఆగి" ఒక వేళ అలా చేయటం నీకు నచ్చదు అంటే నేను హోటల్ నుంచి తెప్పించుకుంటా." చాలా పొడిగా పూర్తిచేశాడు ఈశ్వర్. ఆఖరు వాక్యం అస్సలు నచ్చలేదు చిత్రకు.
"కారం లేకుండనే జేస్తలే. ఇంట్ల ఉప్మా రవ్వ ఉందా?" అడిగింది చిత్ర.
డీప్ ఫ్రిడ్జ్ లోనుంచి ప్యాక్ చేసిన కవరులో ఉన్న ఉప్మా రవ్వను డైనింగ్ టేబుల్ పై పెట్టాడు ఈశ్వర్.
అరగంట తరవాత లాప్ టాప్ ముందు పెట్టుకుని పనిచేసుకుంటున్న తన భర్త తో
"ఉప్మా అయింది. ఈడికే తేవాల్నా? డైనింగ్ టేబుల్ దేరనే ఉంచుద్నా?" అడిగింది చిత్ర.
"అక్కడికే వస్తున్నా. . Two minutes." అన్నాడు ఈశ్వర్ తనకు వచ్చిన మెయిల్స్ చదువుతూ.
* * *
ముందు రోజు రాత్రి లాగానే ఈశ్వర్ తాను తిన్న కంచాన్ని తానే కడిగి , తిరిగి తన గదిలోనికి వెళ్ళి లాప్ టాప్ ముందు కూర్చున్నాడు. చిత్రకు తను చేసిన ఉప్మా తనకే నచ్చలేదు. తన జీవితం లో అంత చప్ప తిండి తానెప్పుడూ తినుండదు. ముందు రోజు రాత్రి అప్పటి ఆలుగడ్డకూర కన్నా ఎక్కువ చప్పగా ఉంది ఉప్మా. చేసేదిలేక ఉప్మా మొత్తం లో అక్కడక్కడ ఉన్న పచ్చిమిరపకాయ ముక్కలన్నింటినీ నములుతూ ఏదోలా ఉప్మా కానిచ్చేసింది చిత్ర.
* * *
వాళ్ళ ఇంటి గోడపై ఉన్న గడియారం పది సార్లు గంట కొట్టింది. గత గంట సేపుగా ఒకే చోట సొఫాలో కూర్చుని ఉంది చిత్ర. ఆమెకు పొద్దు పోవట్లేదసలు.గోడ కి 'తగిలించి ఉన్న ' పెద్ద టీవీ పెట్టాలనిపించిందామెకు. స్విచ్ ఆన్ చేసింది. కానీ Hathaway అని మాత్రమే కనిపిస్తోంది. గదిలో లాప్టాప్ ముందు పనిచేసుకుంటున్న ఈశ్వర్ వద్దకు వెళ్ళి" టి.వి ఎట్ల పెట్టాలె. అదేందో Hathaway అని వొస్తోంది. నాకు అర్థమవ్తలేదు అస్సలు." అంది.
లాప్ టాప్ ని మూసివేసి హాల్లో డైనింగ్ టేబుల్ పైన ఉన్న రిమోట్ తీసుకుని ఆన్ చేశాడు ఈశ్వర్. రిమోట్ చిత్ర చేతిలో పెడుతూ " కొంచం సౌండ్ చిన్నగా పెట్టుకుని చూడగలవా?" అన్నాడు ఈశ్వర్.అది పైకి విజ్ణాపన లా కనిపిస్తున్నా అది ఆజ్ణ అని అర్థమయ్యింది చిత్రకు. సరేనని తలూపింది చిత్ర.
* * *
పన్నెండు చానళ్ళల్లో ఏదో ఒకటి ఎంచుకోవటం అలవాటైన చిత్రకు 1250 చానళ్ళల్లో ఏ చానల్ చూడాలో నిర్ణయించుకోవటం చాలా కష్టంగా తోచింది.రిమోట్ ని ఆయుధంగా చేసుకుని గంటసేపు టీ.వీ తో చేసిన సంగ్రామం లో ఎట్టకేలకు చిత్ర గెలిచింది. అరవ, మళయాళం, ఇంగ్లీష్ లాంటి భాషల చానల్స్ కాక తెలుగు చానల్స్ వరసగా ఒక్కోటిగా రావటం మొదలెట్టాయి.
gemini music చానల్లో 'గల గల పారుతున్న గోదారిలా' పాట ప్రసారమవుతూ ఉంది. పసుప్పచ్చ చొక్కా వేసుకుని, బీచ్ లో ఇలియానా యొక్క నడుముని నడిపిస్తూ ఉన్నాడు మహేష్ బాబు. ఒక్క క్షణం చిత్రకు ఉదయం స్నానం చేసి వచ్చిన ఈశ్వర్ తలంపుకు వచ్చాడు. టి.వి స్క్రీన్ పై మహేష్ బాబు వచ్చినప్పుడల్లా కన్ను రెప్ప వేయని చిత్ర, తెర మీద ఉన్న అతన్ని పట్టించుకోకుండా అప్రయత్నంగా తన చూపు ఈశ్వర్ వైపు మరల్చింది. గత నాలుగు రోజులుగా క్షవరం చేయబడక కాస్త గరుకుగా ఉన్న అతని చెంపలను నిమురుకుంటూ , చాలా పద్దతిగా మరియు వత్తుగా ఉన్న తన జుట్టుని చెరుపుకుని మళ్ళీ సరిచేసుకుంటూ లాప్టాప్ లో ఏదో చదువుతూ వున్నాడు ఈశ్వర్. గట్టిగా తడిమితే కందిపోతాడా అన్నంత తెల్లని మేని ఛాయ కలిగి ఉన్నాడు ఈశ్వర్. ఇంతలో టీవీ లో fair and lovely advertisement వస్తూ వుంది. చామన ఛాయ వర్ణం గల తన చేతినీ, ఈశ్వర్ ముఖాన్నీ పోల్చి చూసుకుని,before using fair and lovely, after using fair and lovely గా అనువయించుకుని తనలో తానే నవ్వుకుంది చిత్ర.

సార్,

మీ కధలోని పాత్రలు, వారి భావోద్వేగాలు కళ్ళకు కట్టినట్టు, నాకేదో సినిమా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంత  వాస్తవికంగా ఉన్నాయి.  Smile

కధా ప్రవాహం చక్కగా వెళుతుంది.   clps

పైగా ముందు ముందు ఏమి జరగబోతోందో అని ఉత్కంఠభరితంగా ఉంది.

ఏవో నాలుగు బూతు కధలు చదువుకుని పోదామనుకుంటే, శృంగార వేదికలో సెక్స్ లేకుండా కధలు రాసి నాలాంటి దానయ్యలను  ఆకర్షించడం సామాన్యమైన విషయం కాదండీ.

అసలు ఇంతవరకు ఎందుకు నేను స్పందించలేకపోయానో, తలపై ఓ చిన్న మొట్టికాయ వేసుకున్నాను

నాకెందుకో మీరు ఒక చిత్రకధా రచయిత అని ఒకవైపు అనుమానం. 

ఏది ఏమైనా, ఈ వేదికలో మమ్మందరినీ అలరిస్తున్న మీకు అనురాగంతో...సలాం అండీ...

మీ...రోబియర్తో
Quote:Writing to Entertain, in a Wicked Way... devil2

[+] 3 users Like Roberto's post
Like Reply
(04-02-2024, 04:20 AM)Roberto Wrote:
సార్,

మీ కధలోని పాత్రలు, వారి భావోద్వేగాలు కళ్ళకు కట్టినట్టు, నాకేదో సినిమా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంత  వాస్తవికంగా ఉన్నాయి.  Smile

కధా ప్రవాహం చక్కగా వెళుతుంది.   clps

పైగా ముందు ముందు ఏమి జరగబోతోందో అని ఉత్కంఠభరితంగా ఉంది.

ఏవో నాలుగు బూతు కధలు చదువుకుని పోదామనుకుంటే, శృంగార వేదికలో సెక్స్ లేకుండా కధలు రాసి నాలాంటి దానయ్యలను  ఆకర్షించడం సామాన్యమైన విషయం కాదండీ.

అసలు ఇంతవరకు ఎందుకు నేను స్పందించలేకపోయానో, తలపై ఓ చిన్న మొట్టికాయ వేసుకున్నాను

నాకెందుకో మీరు ఒక చిత్రకధా రచయిత అని ఒకవైపు అనుమానం. 

ఏది ఏమైనా, ఈ వేదికలో మమ్మందరినీ అలరిస్తున్న మీకు అనురాగంతో...సలాం అండీ...

మీ...రోబియర్తో

ధన్యవాదములు మిత్రమా!

ఈ ఫోరమ్లో (విభాగంలో) కధలు చదివే వారు చాలా తక్కువ మంది. అందరూ శృంగార కథలు చదివే వారే, అతి కొద్ది మంది మాత్రమే ఈ విభాగానికి వచ్చి కథలు చదువుతారు. అయినా నేను ఆ విధమైన కథలు పొందు పరుస్తున్నాను, ఎందుకంటే మీ లాంటి అతి కొద్ది మంది పాఠకుల కోసం.

ఇక్కడ క్రమం తప్పకుండా వచ్చి చదివే వారి కోసమే నా ఈ కథలు, మీకు మిగిలిన వారికి కృతజ్ఞతలతో  ఈ కథ ఆఖరి భాగం అందిస్తున్నాను.

పెద్దబాబు(k3vv3)
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
1:45:36 సమయం పాటు సాగిన ఈశ్వర్ ఫోన్ సంభాషణ ఎట్టకేలకు ముగిసింది.
ఎన్నో రోజుల భారాన్ని దించుకుని, ప్రసన్న వదనం తో కూర్చున్న తన భర్త పక్కన వచ్చి కూర్చుంది చిత్ర.
" అయిపొయ్యిందా మీ ముచ్చట ! " అంది చిత్ర వ్యంగ్యంగా.
" అమ్మ వాళ్ళ ను నెక్స్ట్ వీక్ మన ఇంటికి రమ్మన్నా." సంతోషంగా చెప్పాడు ఈశ్వర్.
చిరునవ్వొకటి విసిరింది చిత్ర.
ఇంతలో జయమ్మ చిత్ర, ఈశ్వర్ లకు ఛాయ్ తీసుకొచ్చింది.
చాయ్ కాస్త తాగంగానే తన భార్య పెట్టినంత బాగా జయమ్మకు చాయ్ పెట్టడం రాదని నిర్ణయించాడు ఈశ్వర్.
" బుజ్జీ, ఈశ్వరు కి సూపియ్యి మంచిగ. గా సోమశిల, మంచాలకట్ట, సింగోట్నం గియన్ని. మంచిగ కారున్నది గద. రోడ్డు గూడంగ మంచిగ అయింది గిప్పుడు " అంది జయమ్మ.
" అవ్ను.. పోదమా మంచిగ మస్తుంటది క్రిశ్నా నది కాడ. గుళ్ళు గూడంగ మస్తుంటయ్. మంచిగ తిరుగుదం ఇయాల. ఏమంటవ్ ?" అంది చిత్ర.
"yeah sure " అన్నాడు ఈశ్వర్.
" ఒక్క పది నిమ్శాలాగు. మొకం కడుక్కొనొస్త. జిడ్డు జిడ్డు గయ్యింది మొకం మొత్తం."
" ఓకే ." అని గట్టిగా నవ్వాడు ఈశ్వర్.
" ఏందో ఏమో, నీకు బలె నవ్వొస్తుంది నన్ను జూస్తే." అని మూతి ముడుచుకుని అక్కడినుంచి స్నానాల గది వైపుకు వెళ్ళింది చిత్ర.
వడి వడిగా నడుస్తూ వెళ్తున్న చిత్రని అలాగే నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు ఈశ్వర్.
*****
చిత్ర, ఈశ్వర్ లు ఇద్దరూ కార్ లో సోమశిల కు బయలుదేరారు. చిత్ర తన గతం లోని ఒక్కో విశేషాన్ని చెప్పసాగింది. గోలీలాటలో తను గెలుచుకున్న గోలీలను తనకు ఇవ్వలేదని తన పక్కింటి అబ్బాయిని కొరికిన విషయం, తనకు మార్కులు తక్కువగా వస్తే తన మామయ్య చెవి మెలితిప్పిన విషయం , ఆడుకుంటుండగా పన్ను విరగ్గొట్టుకున్న విషయం, పదవ తరగతి పరీక్ష చిట్టీలు కొట్టి పాసయిన విషయం, చిన్నప్పుడు ఇంట్లో చిల్లర దొంగతనం చేస్తూ వాళ్ళ అమ్మకు దొరికిపోయిన విషయం.. ఇలా ఆపకుండా ఒక్కో విషయాన్ని చెప్పసాగింది చిత్ర.
నవ్వీ నవ్వీ ఈశ్వర్ ఆయాసపడసాగాడు.
సోమశిల లోని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు ఈశ్వర్ , చిత్ర లు.
" చాలా బావుంది చిత్రా ప్లేస్. " అన్నాడు ఈశ్వర్.
" హా మస్తు మంచిగుంటది. గందుకే గద నిన్ను తీస్కొచ్చింది ఈడికి. దా నది సూద్దువు. మస్తుంటది క్రిశ్నా నది ఈడ. " అంది చిత్ర.
చిత్ర యొక్క ఉత్సాహాన్ని ఆస్వాదిస్తూ ఆమె వెనక నడవసాగాడు ఈశ్వర్.
సూర్యాస్తమయం కావొస్తూ ఉంది. నది దెగ్గరి జాలర్లు తమ తమ ఇళ్ళకు ప్రయాణమవుతూ ఉన్నారు. చిత్ర, ఈశ్వర్ లు ఇద్దరూ నది ఒడ్డున కూర్చుని ఉన్నారు.నది ఒడ్డులో నుండి వీస్తున్న చల్లని గాలి ఈశ్వర్ , చిత్ర ముఖాలకు తాకుతూ ఉంది.ఇద్దరూ మాటలతో కాక తమ కళ్ళతోనే సంభాషించుకోసాగారు. ఒక్కసారి చుట్టు పక్కల ఎవరైనా ఉన్నారేమో నని పరికించి చూసింది చిత్ర ఎవరూ లేరని రూఢీ చేసుకుంది.
ఈశ్వర్ అప్రయత్నంగా తన జుట్టుని చేత్తో చెరుపుకుని, తిరిగి సరిచేసుకుంటూ ఉన్నాడు. చిత్ర తన చేతి వేళ్ళతో ఈశ్వర్ యొక్క జుట్టుని నిమరసాగింది. ఈశ్వర్ కి చిత్ర యొక్క స్పర్శ మనోహరంగా తోచింది.
ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్కో సాగారు. చిత్ర నుదుటిపై స్వేదం పుట్టుకొస్తోంది. ఆమె గొంతు తడారిన భావన కలగటం తో గుటకలు మింగ సాగింది.
వారిద్దరూ అప్రయత్నంగా దెగ్గరకు రాసాగారు. ఒకరి నిశ్వాసలు మరొకరికి వేడిగా తగల సాగాయి. అప్రయత్నంగా కళ్ళు మూసుకున్న చిత్రకు ఈశ్వర్ యొక్క పెదవులు వెచ్చగా తాకాయి. ఆమె చేతులు ఈశ్వర్ యొక్క మెడ చుట్టూ పెనవేసుకోబడ్డాయి. తన భర్త యొక్క పెదవుల స్పర్శ ఆమె పెదవులకు చల్లదనాన్ని, ఆమె నరాల్లో వేడినీ పుట్టించసాగింది.
ముద్దు కార్యక్రమం పూర్తైనదని ఈశ్వర్ తన పెదాలను దూరం చేసి, చిత్ర కళ్ళల్లోకి సూటిగా చూడసాగాడు. ఈశ్వర్ యొక్క పదునైన కంటి చూపుకి ప్రతిగా చిత్ర తన కళ్ళనిండా సిగ్గుని నింపుకుని , తన కళ్ళతోనే నవ్వసాగింది. తన స్నేహితురాలూ, ఇలాంటి విషయాల్లో తనకు ' గురువైన ' వీణ చెప్పిన దానికన్నా ఆచరణాత్మకంగా ముద్దు ఎక్కువ బాగుందని నిర్దారించుకుంది చిత్ర.
చిత్ర చెంపలను తన చేతుల్లోకి తీసుకుని ఆమె నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు ఈశ్వర్.
క్షణం చిత్ర యొక్క కళ్ళల్లోని సంతోషం తన జీవితం యొక్క ఉద్దేశంగా తోచింది ఈశ్వర్ కి.
చీకటి పడ్డాక ఇద్దరూ కార్లో ఇంటికి వెళ్ళడానికి కార్లో కూర్చున్నారు.
" ఇదో ...."
" ఏంటి ?"
" ఇంగోటి పెట్టుకుందమా ? మంచిగుంది."
ఈసారి చిత్ర, ఈశ్వర్ లు ఇంకాస్త త్రికరణశుద్దిగా తమ ముద్దు కార్యక్రమాన్ని నిర్వర్తించారు.
మరుసటి రోజు మధ్యాహ్నం భోంచేసుకుని, కొల్లాపూర్ లోని వకీలు శ్రీనివాసరావు వాళ్ళింటిని సందర్శించి, హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు ఈశ్వర్, చిత్ర లు.
దారిలో ఒక రెస్టారెంట్ లో భోంచేసి, వాళ్ళింటికి చేరుకున్నారు.
ఎప్పటిలాగే ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. చిత్రకు నిద్ర పట్టట్లేదసలు. ముందు రోజు యొక్క ముద్దు కార్యక్రమాలూ, వీణ చెప్పిన విషయాలూ వెరసి, చిత్రకు రాత్రి గడవడం చాలా కష్టంగా తోచింది.
ఇంతలో తన భర్త యొక్క కాళ్ళ అలికిడి వినబడింది చిత్రకు.
' హమ్మయ్య .' అనుకుంది తన మనస్సులో.
లైట్ వేస్తూ ఈశ్వర్ చిత్ర పడుకున్న గదిలోనికి వచ్చాడు.
ఏం మాట్లాడాలో అర్థం కాక తన భర్త యొక్క కళ్ళల్లోకే చూడబోయింది చిత్ర. ఎంత ధైర్యంగా ఉందామన్నా, ఉండలేక, సిగ్గుతో తన తలను వంచుకుంది. ఆమె అరచేతుల్లో పుడుతున్న స్వేదాన్ని తన చీరకు తుడుచుకోసాగింది.
" చిత్రా ."
" చెప్పు." అంది చిత్ర, తన తల కిందికి దించుకునే.
" నన్ను క్షమించు."
ఒక్క సారిగా తన తల ఎత్తి ఈశ్వర్ వైపు ఆశ్చర్యంగా చూసింది చిత్ర. తన ఎదురుగా తడిసిన కళ్ళతో ఉన్నాడు ఈశ్వర్.
" ఏయ్ ! ఎందుకట్లంటున్నవ్ ?! " అంది చిత్ర , ఒకేసారి తనకు కలుగుతున్న కోపాన్నీ, బాధనీ అణుచుకుంటూ.
" నన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళకు చిత్రా, నాకు నువ్వు కావాలి. లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనుండాలి."
" ఏమి గట్ల మాట్లాడుతున్నవ్ ఇయాల. నేనేడికి బోత చెప్పు ?! "
" నీకో విషయం చెప్పాలి చిత్రా.... నేనొక అమ్మాయిని ప్రేమించా నిన్ను పెళ్ళి చేస్కోక ముందు."
" అట్లనా? .... నాకు గూడ బడిల ఉన్నప్పుడు ఒక పిలగాడు ఇష్టముంటుండె . ఏడుండో ఏమో గిప్పుడు." అంది చిత్ర, తన భావోద్వేగాన్నంతా అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ, కృత్రిమమైన చిరునవ్వొకటి ధరించి.
" అలా కాదు..... మేము మూడేళ్ళు కలిసున్నాం. తను కాన్సర్ తో నా చేతుల్లోనే చనిపోయింది. అప్పటినుంచి నేను నా లైఫ్ లో ఇంకే అమ్మాయినీ రానివ్వకూడదనుకున్నా. మా అమ్మ తను చనిపోతానని బెదిరించి నీతో నా పెళ్ళి చేసింది..."
" ఇదో ..." అని ఈశ్వర్ మాటకు అడ్డుపడబోయింది చిత్ర.
" నన్ను పూర్తిగా చెప్పనివ్వు..... నన్ను పూర్తిగా చెప్పనివ్వు. తెలియాలి నీకు !"
చిత్ర కళ్ళల్లో మెల్లిగా నీళ్ళు తిరగసాగాయి.
" నిన్ను దూరం పెట్టాలని చూసా చిత్రా, తనను మనస్సులో ఉంచుకుని.కానీ నా వల్ల కాలేదు చిత్రా. నా వల్ల కాలేదు. చాలా బాధ పెట్టాను చిత్రా నిన్ను. చాలా చాలా బాధ పెట్టాను చాలా సార్లు. ఎన్ని సార్లు నిన్ను గట్టిగా హత్తుకుని ఏడవాలనిపించిందో తెలుసా. నిన్ను బాగా చూసుకోవాల్సిన నేను నిన్ను బాధ పెట్టాను చిత్రా. చాలా బాధ పెట్టాను. " ఈశ్వర్ కళ్ళల్లోంచి నీళ్ళు రాలసాగాయి. అతను మంచం పై కూర్చున్న చిత్ర ముందు మోకాళ్ళ మీద కూలబడిపోయాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
ఈశ్వర్ తలని తన చేత్తో పైకి లేపి, అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని, అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
" ఇదో... నువ్వు బంగారానివి. అర్తమౌతుందా? నువ్వు బంగారానివి. నువ్వు నాకు దొర్కినందుకు ఎన్ని సార్లు క్రిశ్నయ్య కి దండం పెట్టుకున్ననో తెల్సా ? నేను బాద పడ్న అని నీకెప్పుడన్న జెప్పిన్నా ? ? ఇంగోసారి నువ్వు గిట్ల మాట్లాడ్తే నాకు మస్తు కోపమొస్తది జెప్తున్న . అర్తమైతుందా ? నాకు మస్తు కోపమొస్తది." అంది చిత్ర గద్గర స్వరంతో.
"i am sorry chitra , don't leave me. please don't leave me ever. " ఈశ్వర్ ముఖం మొత్తం కన్నీళ్ళతో నిండిపోయింది.
" ఇదో .... ఇక్కడ జూడు. " అంటూ తన భర్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
" నువ్వంటె నాకు చానా ఇష్టం. చానా చానా ఇష్టం. చచ్చేంత ఇష్టం నువ్వంటె నాకు. నీ వల్ల నాకెప్పుడు బాద కల్గలె. కల్గదు గూడ. బంగారాన్వి నువ్వు. నిన్ను బాగ సూస్కుంట నేను. నీకెప్పుడు ఏమి బాద కల్గనియ్య. నువ్వెప్పుడు సంతోషంగ ఉంటే సూడడం చానా ఇష్టం నాకు. నువ్వు గిట్ల ఏడుస్తుంటె నాకు మస్తు బాదవ్తుంది. అయినా గిట్ల ఏడుస్తరా ఎవరన్న గలీజ్ ? ? ."
ఈశ్వర్ కళ్ళ నుండి కన్నీటి ధారలు పారుతూనే ఉన్నాయి. తను ఏడుస్తూ, తన భర్త కన్నీళ్ళను తుడవసాగింది చిత్ర.
" ఇంగో సారి నేను నీ వల్ల బాద పడ్న అని నువ్వన్నవంటె మస్తు కోపమొస్తది జూడు నాకు. ఇంగెప్పుడన్న గిట్ల మాట్లాడినవంటె మంచిగుండదు జెప్తున్న. " అంటూ అతని ముఖం పై ఏడుస్తూ పదే పదే ముద్దాడింది చిత్ర.
"i love you. i love you . i love you. i lo..." అంటూ చిత్ర ఒళ్ళో తన తల పెట్టి తనివి తీరా ఏడవసాగాడు ఈశ్వర్.
ఈశ్వర్ యొక్క ఒత్తైన జుట్టును నిమురుతూ అతని తలపై తన తలను ఉంచింది చిత్ర.
తన ఇష్టదైవమైన శ్రీ కృష్ణుడిని తలుచుకుని, ఎల్లప్పుడూ తన భర్త సంతోషంగా ఉండేలా, ఎలాంటి బాధ పడకుండా ఉండేలా చూసుకొమ్మని కృష్ణుడిని ' హెచ్చరించింది ' చిత్ర.
-------------
ముడి నవలకు వీడ్కోలు 
 
సమాప్తం
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
Happy Ending  yourock

Thanks for giving a beautiful love story  happy
[+] 1 user Likes sri7869's post
Like Reply
Nice ending
[+] 1 user Likes BR0304's post
Like Reply
(04-02-2024, 01:07 PM)k3vv3 Wrote: ఈశ్వర్ తలని తన చేత్తో పైకి లేపి, అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని, అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
" ఇదో... నువ్వు బంగారానివి. అర్తమౌతుందా? నువ్వు బంగారానివి. నువ్వు నాకు దొర్కినందుకు ఎన్ని సార్లు క్రిశ్నయ్య కి దండం పెట్టుకున్ననో తెల్సా ? నేను బాద పడ్న అని నీకెప్పుడన్న జెప్పిన్నా ? ? ఇంగోసారి నువ్వు గిట్ల మాట్లాడ్తే నాకు మస్తు కోపమొస్తది జెప్తున్న . అర్తమైతుందా ? నాకు మస్తు కోపమొస్తది." అంది చిత్ర గద్గర స్వరంతో.
"i am sorry chitra , don't leave me. please don't leave me ever. " ఈశ్వర్ ముఖం మొత్తం కన్నీళ్ళతో నిండిపోయింది.
" ఇదో .... ఇక్కడ జూడు. " అంటూ తన భర్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
" నువ్వంటె నాకు చానా ఇష్టం. చానా చానా ఇష్టం. చచ్చేంత ఇష్టం నువ్వంటె నాకు. నీ వల్ల నాకెప్పుడు బాద కల్గలె. కల్గదు గూడ. బంగారాన్వి నువ్వు. నిన్ను బాగ సూస్కుంట నేను. నీకెప్పుడు ఏమి బాద కల్గనియ్య. నువ్వెప్పుడు సంతోషంగ ఉంటే సూడడం చానా ఇష్టం నాకు. నువ్వు గిట్ల ఏడుస్తుంటె నాకు మస్తు బాదవ్తుంది. అయినా గిట్ల ఏడుస్తరా ఎవరన్న గలీజ్ ? ? ."
ఈశ్వర్ కళ్ళ నుండి కన్నీటి ధారలు పారుతూనే ఉన్నాయి. తను ఏడుస్తూ, తన భర్త కన్నీళ్ళను తుడవసాగింది చిత్ర.
" ఇంగో సారి నేను నీ వల్ల బాద పడ్న అని నువ్వన్నవంటె మస్తు కోపమొస్తది జూడు నాకు. ఇంగెప్పుడన్న గిట్ల మాట్లాడినవంటె మంచిగుండదు జెప్తున్న. " అంటూ అతని ముఖం పై ఏడుస్తూ పదే పదే ముద్దాడింది చిత్ర.
"i love you. i love you . i love you. i lo..." అంటూ చిత్ర ఒళ్ళో తన తల పెట్టి తనివి తీరా ఏడవసాగాడు ఈశ్వర్.
ఈశ్వర్ యొక్క ఒత్తైన జుట్టును నిమురుతూ అతని తలపై తన తలను ఉంచింది చిత్ర.
తన ఇష్టదైవమైన శ్రీ కృష్ణుడిని తలుచుకుని, ఎల్లప్పుడూ తన భర్త సంతోషంగా ఉండేలా, ఎలాంటి బాధ పడకుండా ఉండేలా చూసుకొమ్మని కృష్ణుడిని ' హెచ్చరించింది ' చిత్ర.
-------------
ముడి నవలకు వీడ్కోలు 
 
సమాప్తం

Nice story writer garu , my heart full congratulations for your fantastic narration and emotions
[+] 2 users Like 9652138080's post
Like Reply
భయ్యా ఒకటి గమనించరా...ఈశ్వర్ అమృతను ప్రేమించాడా, మర్చిపోలేకపోతున్నాడా అన్న మాటను పక్కన పెడితే, చిత్రను దాగర చేయకుండా ఉండడానికైన అసలు కారణం 'తను దగ్గరై మళ్ళీ అమృతలా ఎక్కడ దూరమౌతుందోనన్న భయం' అతడి మాటల్లోనే బయటకొచ్చేసింది చూసారా....

happy ending with wetness in the eyes and corners of the heart
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
(04-02-2024, 01:07 PM)k3vv3 Wrote: ఈశ్వర్ తలని తన చేత్తో పైకి లేపి, అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని, అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
" ఇదో... నువ్వు బంగారానివి. అర్తమౌతుందా? నువ్వు బంగారానివి. నువ్వు నాకు దొర్కినందుకు ఎన్ని సార్లు క్రిశ్నయ్య కి దండం పెట్టుకున్ననో తెల్సా ? నేను బాద పడ్న అని నీకెప్పుడన్న జెప్పిన్నా ? ? ఇంగోసారి నువ్వు గిట్ల మాట్లాడ్తే నాకు మస్తు కోపమొస్తది జెప్తున్న . అర్తమైతుందా ? నాకు మస్తు కోపమొస్తది." అంది చిత్ర గద్గర స్వరంతో.
"i am sorry chitra , don't leave me. please don't leave me ever. " ఈశ్వర్ ముఖం మొత్తం కన్నీళ్ళతో నిండిపోయింది.
" ఇదో .... ఇక్కడ జూడు. " అంటూ తన భర్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
" నువ్వంటె నాకు చానా ఇష్టం. చానా చానా ఇష్టం. చచ్చేంత ఇష్టం నువ్వంటె నాకు. నీ వల్ల నాకెప్పుడు బాద కల్గలె. కల్గదు గూడ. బంగారాన్వి నువ్వు. నిన్ను బాగ సూస్కుంట నేను. నీకెప్పుడు ఏమి బాద కల్గనియ్య. నువ్వెప్పుడు సంతోషంగ ఉంటే సూడడం చానా ఇష్టం నాకు. నువ్వు గిట్ల ఏడుస్తుంటె నాకు మస్తు బాదవ్తుంది. అయినా గిట్ల ఏడుస్తరా ఎవరన్న గలీజ్ ? ? ."
ఈశ్వర్ కళ్ళ నుండి కన్నీటి ధారలు పారుతూనే ఉన్నాయి. తను ఏడుస్తూ, తన భర్త కన్నీళ్ళను తుడవసాగింది చిత్ర.
" ఇంగో సారి నేను నీ వల్ల బాద పడ్న అని నువ్వన్నవంటె మస్తు కోపమొస్తది జూడు నాకు. ఇంగెప్పుడన్న గిట్ల మాట్లాడినవంటె మంచిగుండదు జెప్తున్న. " అంటూ అతని ముఖం పై ఏడుస్తూ పదే పదే ముద్దాడింది చిత్ర.
"i love you. i love you . i love you. i lo..." అంటూ చిత్ర ఒళ్ళో తన తల పెట్టి తనివి తీరా ఏడవసాగాడు ఈశ్వర్.
ఈశ్వర్ యొక్క ఒత్తైన జుట్టును నిమురుతూ అతని తలపై తన తలను ఉంచింది చిత్ర.
తన ఇష్టదైవమైన శ్రీ కృష్ణుడిని తలుచుకుని, ఎల్లప్పుడూ తన భర్త సంతోషంగా ఉండేలా, ఎలాంటి బాధ పడకుండా ఉండేలా చూసుకొమ్మని కృష్ణుడిని ' హెచ్చరించింది ' చిత్ర.
-------------
ముడి నవలకు వీడ్కోలు 
 
సమాప్తం

గురువుగారూ, Namaskar

ఒక్క మాటలో చెప్పాలంటే...అమోఘం...  Iex

"అన్ని కథలూ pen తోనే వ్రాసినవి ఉండవు...
కొన్ని కథలు pain తోకూడా వ్రాసినవి ఉంటాయి"

అనడానికి "ముడి" కథ నిదర్శనమేమో...

బాధ, అనురాగం, ఆప్యాయతను పెంచుతాయి అని ముఖ్య పాత్రలు ఈశ్వర్ చిత్ర ల సందేశం అని నాకు అనిపిస్తుందండీ.

కొంత వాస్తవిక జీవితం అలాగే ఉంటుందేమో...

ఒక్కకరూ కాలక్రమేణా వలపుకు గురౌతుండడం, వలపు మయే మరి.

ముఖ్యంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ , ఒక పల్లెటూరి అమ్మాయి పెళ్ళి, స్నేహం...బాషా వైవిధ్యం చాలా వినూత్నంగానూ, నాకైతే ఒక ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది.

పదాల అల్లికవలన కూడా, ఇంకా చదవాలి అనిపించడం గమనార్హం.

వేదనతో కూడిన ఒక మాంచి భావన ఉన్న కథను అందజేసినందులకు, మీ కృషికీ మెప్పుదల - గురువుగారు

పోతే...ఒక చిన్న హాస్యపు జల్లు...
ఈ వేదికలో ఉన్న కొంతమంది పూకూ, గుద్దా, సళ్ళు పిచ్చోల్లను ఇలాంటి సాత్విక కథల వైపు మళ్ళించేస్తే ఎలాగండి బాబూ...
తలపట్టుకుంటున్నాను...(హాస్యానికి లెండి ?)

ఇప్పటికి 10 అధ్యాయాలు చదివానండి. పూర్తిగా చదివిన తరువాత నా అభిప్రాయాన్ని మరొక్కమారు తెలియజేస్తానండీ
Quote:Writing to Entertain, in a Wicked Way... devil2

[+] 2 users Like Roberto's post
Like Reply
(04-02-2024, 01:07 PM)k3vv3 Wrote: ఈశ్వర్ తలని తన చేత్తో పైకి లేపి, అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని, అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
" ఇదో... నువ్వు బంగారానివి. అర్తమౌతుందా? నువ్వు బంగారానివి. నువ్వు నాకు దొర్కినందుకు ఎన్ని సార్లు క్రిశ్నయ్య కి దండం పెట్టుకున్ననో తెల్సా ? నేను బాద పడ్న అని నీకెప్పుడన్న జెప్పిన్నా ? ? ఇంగోసారి నువ్వు గిట్ల మాట్లాడ్తే నాకు మస్తు కోపమొస్తది జెప్తున్న . అర్తమైతుందా ? నాకు మస్తు కోపమొస్తది." అంది చిత్ర గద్గర స్వరంతో.
"i am sorry chitra , don't leave me. please don't leave me ever. " ఈశ్వర్ ముఖం మొత్తం కన్నీళ్ళతో నిండిపోయింది.
" ఇదో .... ఇక్కడ జూడు. " అంటూ తన భర్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
" నువ్వంటె నాకు చానా ఇష్టం. చానా చానా ఇష్టం. చచ్చేంత ఇష్టం నువ్వంటె నాకు. నీ వల్ల నాకెప్పుడు బాద కల్గలె. కల్గదు గూడ. బంగారాన్వి నువ్వు. నిన్ను బాగ సూస్కుంట నేను. నీకెప్పుడు ఏమి బాద కల్గనియ్య. నువ్వెప్పుడు సంతోషంగ ఉంటే సూడడం చానా ఇష్టం నాకు. నువ్వు గిట్ల ఏడుస్తుంటె నాకు మస్తు బాదవ్తుంది. అయినా గిట్ల ఏడుస్తరా ఎవరన్న గలీజ్ ? ? ."
ఈశ్వర్ కళ్ళ నుండి కన్నీటి ధారలు పారుతూనే ఉన్నాయి. తను ఏడుస్తూ, తన భర్త కన్నీళ్ళను తుడవసాగింది చిత్ర.
" ఇంగో సారి నేను నీ వల్ల బాద పడ్న అని నువ్వన్నవంటె మస్తు కోపమొస్తది జూడు నాకు. ఇంగెప్పుడన్న గిట్ల మాట్లాడినవంటె మంచిగుండదు జెప్తున్న. " అంటూ అతని ముఖం పై ఏడుస్తూ పదే పదే ముద్దాడింది చిత్ర.
"i love you. i love you . i love you. i lo..." అంటూ చిత్ర ఒళ్ళో తన తల పెట్టి తనివి తీరా ఏడవసాగాడు ఈశ్వర్.
ఈశ్వర్ యొక్క ఒత్తైన జుట్టును నిమురుతూ అతని తలపై తన తలను ఉంచింది చిత్ర.
తన ఇష్టదైవమైన శ్రీ కృష్ణుడిని తలుచుకుని, ఎల్లప్పుడూ తన భర్త సంతోషంగా ఉండేలా, ఎలాంటి బాధ పడకుండా ఉండేలా చూసుకొమ్మని కృష్ణుడిని ' హెచ్చరించింది ' చిత్ర.
-------------
ముడి నవలకు వీడ్కోలు 
 
సమాప్తం
చాలా బాగుంది..!
[+] 1 user Likes e.sai's post
Like Reply
(04-02-2024, 01:07 PM)k3vv3 Wrote: తన ఇష్టదైవమైన శ్రీ కృష్ణుడిని తలుచుకుని, ఎల్లప్పుడూ తన భర్త సంతోషంగా ఉండేలా, ఎలాంటి బాధ పడకుండా ఉండేలా చూసుకొమ్మని కృష్ణుడిని ' హెచ్చరించింది ' చిత్ర.
-------------
ముడి నవలకు వీడ్కోలు 
 
సమాప్తం

Very good
update and ending, K3vv3 garu!!!

clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply

Users browsing this thread: 2 Guest(s)