Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముడి
#1
గతం లోని దుఃఖం తో తనకు తాను ముడి వేసుకున్న ఒక వ్యక్తికి, భవిష్యత్తు పై ఆశాభావం తో తనకు తాను ముడి వేసుకున్న మరో వ్యక్తికి మధ్య పడ్డ పెళ్ళి అనే ముడి వారిద్దరనీ ఎలా ముడివేసిందన్నదే ఈ కథ.

ఇక్కడ ఎటువంటి శృంగార సన్నివేశాలు ఉండవు. కేవలం భావోద్వేగాలు మాత్రమే.


6వ తారీఖు నుంచి మొదలు


ఇతర ధారావాహికాలు

ముడి

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
నువ్వు చాలా కథలు ప్రారంభం  చేశావు ....

 బ్రదర్  ఒక్క కథ అయినా పూర్తి చేస్తే మంచిది....

ఎందుకు చెప్పు కొత్త కథ అని స్టార్ట్ చేయడం....

ఒక రెండు అప్డేట్ ఇవ్వడం.... తరువాత  గాలికి వదిలేయడం.....

ప్రతి ఒక్కరు ఇలాగే కథలు రాసుకుంటూ పోతే... సైట్ కీ భారం  తప్ప ఉపయోగం ఎం ఉండదు..... ఒకసారి  ఆలోచించండి  దయచేసి.....


ఏదైనా తప్పుగా మాట్లాడివుంటే.... క్షమించండి........ 
ఆమని Heart Heart గారి విరాభిమాని.......
[+] 11 users Like ANUMAY112911's post
Like Reply
#3
Nice please start the story sir
[+] 1 user Likes sri7869's post
Like Reply
#4
ముడి- మొదటి భాగం
            - Santosh Narva

సౌష్ఠవమైన శరీరంతో నిండుగా కనిపించే అమృత , పాలిపోయి ,శుష్కించి వెంటిలేటర్ సహాయంతో తన 'మరణ శయ్య’ పై పడి వుంది .నల్లటి మెరుపుతో జలపాతాన్ని ప్రతిబింబించే ఆమె కురులేవీ లేవిప్పుడామెకు.ఈశ్వర్ రాక కై శక్తినంతా కూడగట్టుకుని,తాను ఉన్న ఐ.సి.యు డోర్ వైపే దృష్టి పెట్టింది అమృత. ఇక తన 'సమయం' ఐపొవొచ్చిందని అర్థమౌతోందామెకు. ఒక్క సారి 'చివరగా' ఈశ్వర్ ని చూడాలనిపించింది ఆమెకు. ఆమె కళ్ళ ముందు మొత్తం ఈశ్వర్ తో గడిపిన క్షణాలే తిరుగుతున్నాయి. ఈశ్వర్ తో ఇంకొన్ని అందమైన క్షణాలను పంచుకోవటం కోసం ఇంకొన్ని రోజులు తనకు మిగిలి ఉండింటే బాగుండు అనిపించిందామెకు. నాస్తికురాలైన ఆమె తన ఊహ తెలిసాక మొట్టమొదటి సారిగా దేవుడిని ప్రార్థించింది ఈశ్వర్ తన కళ్ళముందుండగా తనను 'చంపమని '! అమృత తనను కోరిన మొదటి, చివరి కోరికని దేవుడు మన్నించాడు!

పౌర్ణమి నాటి నిండు చంద్రుడి లా ఉండే 'తన ' అమృత గత ఆరు నెలలుగా ఒక్కొక్కటిగా తన 'కళలను ' కోల్పోతూ వస్తున్న వైనం అతని గుండెకు భరించలేనంత నొప్పిని కలిగిస్తూ వుంది. రోజు రోజుకీ ఆమెను చూడటానికి సైతం ధైర్యం చాలట్లేదతడికి! కానీ ఆ క్షణం అమృతని చూసిన అతడికి అర్థమయ్యింది ,తన జీవితం లో ఇకపై మిగిలేది నిరవధికమైన 'అమావాస్యే ' నని!

ఈశ్వర్ తన ఒక్కో అడుగు అమృత వైపు వేస్తున్నా, అతనికి మాత్రం అమృత కు తాను దూరంగా వెళుతున్న భావన కలుగుతోంది. తన కళ్ళల్లోని కన్నీటి యవనికలు తన కంటిపాప లో కొలువై ఉన్న అమృత ప్రతిబింబాన్ని మసకగా మారుస్తున్నాయి.

ఒంటిలోని శక్తినంతా కూడగట్టుకుని మోము పై కష్టంగా ఒక చిరునవ్వు ఉంచే ప్రయత్నాన్ని చేస్తూ వుంది అమృత.'నేనిక వెళ్తున్నా. నువ్వు జాగ్రత్త.' అని ఆమె కళ్ళు చెబుతున్నాయి, అతని మనస్సు వింటూ వుంది.
***************************************

పెళ్ళింట్లో అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు....

కొందరి మనస్సుల్లో సంతోషం, కొందరి మనస్సుల్లో అసంతృప్తి, కొందరిలో ఆత్రుత, ఇంకొందరిలో అసూయ.... అందరి ఉల్లములల్లోనూ ఏదో ఒక భావోద్వేగం, ఒక్క పెళ్ళికొడుకైన ఈశ్వర్ మనస్సులో తప్ప!

అతడి అణువణువునా నిర్లిప్తత ఆవహించింది.

పెళ్ళిలో అతనికి వినిపిస్తున్న నాదస్వరం అతని చెవుల్లో పదునైన సూదులతో ఎవరో పొడుస్తున్నట్టుగా భావన కలిగించింది.

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ.. అన్న మంత్రాన్ని మూడుసార్లు పఠిస్తున్నంత సేపూ అతను తన యొక్క సొంత స్వరాన్నే అసహ్యించుకోసాగాడు.

తన కాళ్ళు కడగబడుతున్నప్పుడు ఆమ్లం తో దహించివేయబడుతున్నట్టుగా తోచింది అతడికి
పాణి గ్రహణ సమయం లో పెళ్ళికూతురైన చిత్ర చేతిని అతని చేతిలో పెట్టినప్పుడు, ఆమె స్పర్శ అతని అణువణూవునూ జలదరింపజేయసాగింది.

అతని తలపై చిత్ర జీలకర్ర-బెల్లం ఉంచినప్పుడు , ఆమె చేయి భస్మాసుర హస్తంగా తోచింది అతడికి.

సుమంగళి పూజ సమయం లో అతని పై వెదజల్లబడ్డ అక్షతలు అతనికి శరాల వలె గుచ్చుకుంటున్నాయి.

చిత్రకు, తనకు మధ్య ఉన్న తెర తొలగించివేయబడ్డప్పుడు , ఆమె కళ్ళల్లో కనిపించిన అతని ప్రతిబింబాన్ని చూసి తనపై తనకే జాలితో కూడిన అసహ్యం కలిగిందతడికి.

చిత్ర మెడలో మంగళ సూత్రం కడుతున్నప్పుడు , అది తన మెడకు బిగుసుకుంటున్న ఉరి తాడు వలె తోచింది ఈశ్వర్ కి.

హోమాగ్ని చుట్టూ చేస్తున్న ప్రదక్షిణలు అగమ్యమైన నిశీధిలోనికి తను చేస్తున్న ప్రయాణం లా అనిపిస్తోందతడికి. అతనికి 'ముడి పడి ' ఉన్న చిత్ర అతనికి అడుగు వేయలేనంత 'బరువు’ గా తోస్తోంది.
----------------సశేషం..------------------


ఇతర ధారావాహికాలు

ముడి

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 10 users Like k3vv3's post
Like Reply
#5
ఈ కథ తరువాత భాగాలు ఒక్కొక్కటీ 5/7 రోజుల వ్యవధిలో మీ ముందుకు తేగలను.


మీ మీ అభిప్రాయాలను లైకులద్వారా గానీ రేటింగ్ ద్వారా కానీ వ్యాఖ్యానాల ద్వారా పంచుకోమని మనవి పాఠక మిత్రులకు.


ఇతర ధారావాహికాలు

ముడి

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
#6
కాస్త భిన్నంగా మొదలెట్టారు గారు. అయినా ఈ మద్య చావు కబుర్లు ఎక్కువగా వినడం జరుగుతోంది. మీ కథనూ మరణ శయ్య పై ఉన్న అమృతతో మొదలెట్టారు. పెళ్ళిలో జరిగే తంతులకు మీ ఉపమానాలు శంకర్ మానసిక పరిస్థిని తెలుపుతున్నాయి. క్యారక్టరైజేషన్ బావుంది...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply
#7
Nice super start
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#8
బాగుంది ఆరంభం....
[+] 1 user Likes sravan35's post
Like Reply
#9
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#10
Nice update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#11
Baagundi
[+] 1 user Likes ramd420's post
Like Reply
#12
Continue chayandi k3vv3 bro
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





[+] 1 user Likes taru's post
Like Reply
#13
(05-06-2023, 01:53 PM)Uday Wrote: కాస్త భిన్నంగా మొదలెట్టారు గారు. అయినా ఈ మద్య చావు కబుర్లు ఎక్కువగా వినడం జరుగుతోంది. మీ కథనూ మరణ శయ్య పై ఉన్న అమృతతో మొదలెట్టారు. పెళ్ళిలో జరిగే తంతులకు మీ ఉపమానాలు శంకర్ మానసిక పరిస్థిని తెలుపుతున్నాయి. క్యారక్టరైజేషన్ బావుంది...కొనసాగించండి.

ఆరంభం లోనే శంకర్ మానసిక పరిస్థితులను చెబుతే కథ ముందు ఎటువంటి మలుపులు తిరుగుతుందో అనేదానికి సూచనగా ఈ ఘట్టాన్ని ప్రారంభించడమైనది.
ధన్యవాదములు Smile


ఇతర ధారావాహికాలు

ముడి

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#14
వ్యాఖ్యానించిన, మెచ్చిన, చదివిన పాఠక మిత్రులందరికీ కృతజ్ఞతలు


ఇతర ధారావాహికాలు

ముడి

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#15
ముడి - 2 వ భాగం
తన స్నేహితురాలు, కొన్ని విషయాల్లో తనకు 'గురువైన’ వీణ తనకు చెప్పిన ఎన్నో విషయాలు పంతొమ్మిదేళ్ళ చిత్ర మనస్సులో మెదులుతూ వున్నాయి. మనస్సులో కాస్త బెరుకు, కాస్త సిగ్గు, కాస్త ఆనందం, కాస్త ఆతురుత కలగలిసి చిత్ర యొక్క అరచేతుల్లో స్వేదము పుట్టుకొస్తోంది. పెళ్ళై నాలుగు రోజులైనా తన భర్త ఈశ్వర్ తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు తను. ఈ రోజు సాయంత్రం తమ పెద్దలందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళ బోతున్నారు . తాను,తన భర్త ఈశ్వర్... ఇరువురు మాత్రమే ఒకే ఇంట్లో ఉండబోతున్నారు!
ఇంతలో తనకు 12 ఏళ్ళ వయసప్పటినుంచీ అన్నీ తానై ఉండిన తన మేనమామ అయిన రామచంద్రయ్య చిత్ర ను పిలిచాడు. ఆయన తనకు వీడ్కోలు చెప్పడానికే పిలుస్తున్నాడని చిత్ర ఊహించగలిగింది. చేతి లో పాతబడిన సూట్కేస్ నొకదానిని పట్టుకుని బయలుదేరటానికి సిద్దం గా ఉన్నాడు రామచంద్రయ్య.
చిత్ర ఆయనతో “మామా! అప్పుడే వోతున్నవా?” అంది.
నిజానికి చిత్ర కు తెలుసు రామచంద్రయ్య ఈ నాలుగు రోజులే కష్టంగా ఉన్నాడని. కానీ మనస్సు లో ఏదో ఒక మూల తన మామయ్య ఇంకొన్ని రోజులు తన కళ్ళెదుట ఉంటే బాగుండేది అనిపిస్తోంది చిత్ర కు.
“హా, అవ్ను బుజ్జీ. పొయ్యొస్త. గదేందో పైసల్ ఏస్తదంట సర్కార్ బ్యాంక్ అకౌంట్లల్ల. MRO office కాడికి పోయి సంతకం పెట్టిచ్కోవాలె. మస్తు పైరవీ ఉంది ఇంగా. అయ్నా నేను ఎప్పుడైనా ఊరికాడికి పోవాల్సినోడ్నే గదా! నువ్వు ఈడ జాగ్రత్త. ఈశ్వర్ తోని మంచిగ వుండు. గాయ్న ఏమన్న అన్నా గూడ నువ్వే జెర సర్దుకో. నేన్పొయ్యొస్తిగ . జాగ్రత్తనే బుజ్జీ.” ఆఖరి మాట చెప్పేటప్పుడు రామచంద్రయ్య గొంతు కాస్త గద్గరమైంది. మెల్లగా చిత్ర కళ్ళల్లో నీళ్ళు ఊరాయి. ఆయన్ని గట్టిగా కావిలించుకొని ఏడ్చింది. తడవుతున్న తన కళ్ళను తాను తుడుచుకుని , తనను కావలించుకున్న తన మేనకోడలు చిత్ర భుజాలను పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ “ గట్ల చిన్న పిల్ల లెక్క ఏడుస్తవేందే బుజ్జీ! నిన్నేం అడివిల వొదిలేస్తలేను గద! కొన్ని రోజులు పొయ్నాక పండుగకు ఊరి కాడికి రమ్మన్నా నువ్వే రావు జూడు. గిప్పుడిట్లనే ఏడుస్తవ్! తర్వాత రమ్మన్నా పనుంది, రానంటవ్ ! “ అంటూ గద్గర స్వరంతో నే ప్రయత్నపూర్వకంగా తెచ్చి పెట్టుకున్న నవ్వొకటి విసిరాడు రామచంద్రయ్య.
చిత్ర ఆయన ముఖం లోని నవ్వుకు ప్రతిగా నవ్వలేదు. కృతజ్ఞతా భావంతో , పొంగుకొస్తున్న కన్నీళ్ళ వల్ల తనకు మసకగా కనబడుతున్న రామచంద్రయ్య వైపు చూస్తూ వుంది. “ నువ్వే లేకుంటే నేనేమయిపోయేదాన్ని ?!” అని ఆమె కళ్ళు ఆయనతో చెబుతున్నాయి.
“తిక్క పిల్ల” అని చిత్ర ని దగ్గరకు తీసుకొని ఆమె నుదుటిపై వాత్సల్యం తో ముద్దాడాడు.
“పొయ్యొస్తనే బుజ్జీ!” అంటూ తన suitcase తీసుకుని గుమ్మం వైపుగా నడవబోయాడు రామచంద్రయ్య.
“కింది దాక నేన్గూడొస్త మామా.” అని తన మేనమామ వారిస్తున్నా వినకుండా ఆయన చేతిలోని suitcase ని తీసుకుని lift వైపు వడివడిగా అడుగులు వేసింది చిత్ర.
వారిరువురినీ అంతసేపూ గమనిస్తూ వున్నారు ఈశ్వర్ తల్లిదండ్రులైన సరళ, గోవింద రావులు.
“ఇలాంటి పిల్లను అనవసరంగా బాధ పెడుతున్నామా ?” చూపులతోనే తన భార్య ను అడిగాడు గోవింద రావు.
“ ఏం పరవాలేదు అంతా సర్దుకుంటుంది. “ తనూ చూపులతోనే బదులిచ్చింది సరళ.
నిజానికి 'అంతా సర్దుకుంటుందిలే ‘ అని పైకి చెబుతున్నప్పటికీ సరళ మనస్సులో మాత్రం తన కొడుకు సంసారం ఏమైపొతుందోనన్న ఆందోళన మాత్రం తిరుగుతోంది. అమృత ను మరచిపోలేకపోతున్న తన కొడుకు కు తాను వేసిన ‘ బలవంతపు బంధం’ ఎంతకాలం తెగిపోకుండా నిలుస్తుందో ఒక కనీస అంచనా కూడా ఆమెకు లేదు. పెళ్ళి చేసుకోకపోతే చస్తానని తన కొడుకు కు తను చేసిన భావోద్వేగపు బెదిరింపు బంధాన్నైతే వేయగలిగింది కానీ దాన్ని తెగకుండా చూసుకునేంత ‘బలం’ తన బెదిరింపు కి లేదని తెలుసామెకి. తను తన కొడుకు కు చేస్తున్న బలవంతపు పెళ్లి మీద ఇద్దరి జీవితాలు,రెండు కుటుంబాలు ముడిపడి ఉన్నాయని తెలిసినా, కొడుకు మీద వున్న వాత్సల్యం తనచే చిత్ర, ఈశ్వర్ లకు ముడివేసేలా చేసింది. ఒకవైపు తనను కాల్చేసే తన కొడుకు చూపులు, మరో వైపు 'నువ్వు తప్పు చేస్తున్నావ్'అని హితవు పలికే భర్త మాటలూ వెరసి సరళని బాగా గుచ్చుకుంటున్నాయి. దీనికి తోడు చిత్ర, రామచంద్రయ్యలను చూసిన ప్రతి సారీ ఆమె మనస్సులో అపరాధభావం తొణికిసలాడుతోంది.కానీ తన కొడుకు పై తనకున్న ప్రేమతోనే ఇదంతా చేశానని తనకు తాను సంజాయిషీ ఇచ్చుకుంది. ఎప్పటికైనా తన కొడుకు మారకపోడా, అమృత ని మరిచిపోయి చిత్ర ను తన జీవితం లోకి అంగీకరించకపోతాడా అని మిళుకుమిళుకు మంటున్న 'ఆశాదీపం' ఒకటి సరళ మనస్సులో ఏదో ఒక మూలన ఉంది. కానీ చిత్ర ను చూస్తే తన 'ఆశాదీపం' ములగకుండా ఉంటుందన్న నమ్మకం కలగట్లేదామెకి. అమృత తో చిత్ర ని పోల్చిన ప్రతిసారీ, ఏ విషయం లోనూ చిత్ర అమృతకు సాటి వచ్చేలా కనిపించట్లేదామెకి. తన కొడుకు మనస్సులో ఇంకా 'సజీవంగా' ఉన్న అమృత ను మరిపించి తన దారికి తెచ్చుకునేంత 'నేర్పు ' చిత్ర లో ఉన్నట్టుగా ఆమెకు కనబడట్లేదు. మీనమేషాలెంచక ఒక ప్రయత్నం చేసింది సరళ. నిజానికి గోవింద రావుకి కూడా తన కొడుకు కాపురం నిలుస్తుందన్న నమ్మకం లేదు. వాళ్ళిద్దరూ తన కొడుకు ఈశ్వర్ కాపురాన్ని కూలకుండా నిలిపే భారాన్ని వారు నిత్యం కొలిచే ఈశ్వరుడి పై ఉంచారు !
లిఫ్ట్ లో కిందికి దిగి అపార్ట్మెంట్ మెయిన్ గేట్ వద్దకు నడుస్తూ వెళ్ళారు చిత్ర, రామచంద్రయ్యలు. అపార్ట్మెంట్ మెయిన్ గేట్ దెగ్గర చిత్ర చేతిలో నుంచి తన సూట్ కేస్ తీసుకున్నాడు రామచంద్రయ్య.
" ఊరికి పొయ్నాక అత్త తోటి ఫోన్ చేపిస్తలే. ఇగ నేను పొయ్యొస్త బుజ్జీ. జాగ్రత్త. ఏమన్న గావాల్నంటే ఫోన్ జెయ్" అన్నాడు రామచంద్రయ్య.
సరేనంటూ తలూపింది చిత్ర.
" వచ్చే నెల ఎట్లా వస్త గద నేను. ఇగ పొయ్యొస్త మళ్ళ. జాగ్రత్త. పొయ్యొస్త మళ్ళ జాగ్రత్త." ఒకే మాట రెండు సార్లు చెప్పాడు రామచంద్రయ్య.
సరేనంది చిత్ర. ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతలో అటువైపు గా రోడ్ పై వస్తున్న ఆటో ఎక్కాడు రామచంద్రయ్య.
ఎన్నో చిన్న చిన్న ఆనందాలకు దూరమైన తన మేనకోడలంటే రామచంద్రయ్యకు జాలితో కూడిన వాత్సల్యం. తన ప్రమేయం పెద్దగా లేకుండానే జరిగిన పెళ్ళి చిత్ర జీవితం లో పడ్డ కష్టాలన్నింటికీ చరమ గీతం పలకాలన్నది ఆయన ఆకాంక్ష. కానీ ఈశ్వర్ ప్రవర్తన ఆయనకు కాస్త శంక కలిగిస్తోంది. జీవితం లో ఎంతో ప్రాముఖ్యమైన పెళ్ళి అనే అంకం జరుగుతున్నా ఈశ్వర్ ముఖం లో ఏదో నిర్లిప్తత రామచంద్రయ్యకు ప్రస్పుటంగా కనిపించింది. ఈశ్వర్ నిర్లిప్తత వెనకున్న కారణం ఏమిటో ఆరాతీయాలనివున్నా, తన స్థాయీ,స్థానం గుర్తుకు వచ్చి మిన్నకున్నాడు రామచంద్రయ్య. ఒక్కసారి తన ఆటో వైపే చూస్తున్న చిత్ర ను ఆటో లోనుండి తేరిపారా చూశాడు రామచంద్రయ్య. "దీనికి ఏమీ బాధల్లేకుండా ఉండెటట్టుగ జెర నువ్వే సూస్కొవయ్యా!" అని తన మనస్సులో తాను నిత్యం కొలిచే శ్రీరామచంద్రుడి పైనే భారం వేశాడు రామచంద్రయ్య.!
****
గోడ గడియారం 4 సార్లు గంట కొట్టింది. సరళ, గోవిందరావులు ఇద్దరూ చెరో సూట్కేస్ పట్టుకుని బయలుదేరటానికి సిద్దంగా ఉన్నారు.
"అన్ని పెట్టుకుర్రా అత్తయ్యా ? ఒక్కసారి జూడండి ఏమైనా మర్చిపోయిర్రేమో." అంది చిత్ర.
" అన్ని పెట్టుకున్నాం లే."అన్నాడు గోవింద రావు.
సరళ మౌనంగా చిత్ర వైపే చూస్తూ వుంది. ఒక్క క్షణం సరళ తన భర్త గోవిందరావు వైపు చూసింది. సరళ యొక్క చూపును అర్థం చేసుకున్నాడు గోవింద రావు. చిత్రను చూస్తున్నంత సేపూ ఏదో అపరాధభావం ఆమె కళ్ళల్లో తొణికిసలాడుతూ వుంది. చిత్ర తో చాలా మాట్లాడాలని లోలోన ఉన్నా, ఎలా ప్రారంభించాలో తెలియట్లేదామెకు.
"బస్సులనే పోతున్నరా అత్తయ్యా?" అని అడిగింది చిత్ర.
"హా. అవును." ఎట్టకేలకు నోరు మెదిపింది చిత్ర.
గోవిందరావు వైపు ఒక్కసారి చూసి, తన చూపును తిరిగి చిత్ర వైపుగా తిప్పి" చూడమ్మా...."అని ఒక్క క్షణం నిట్టూర్చి, " చూడమ్మా చిత్రా, ఈశ్వర్ ని జాగ్రత్తగా చూసుకో. వాడు పైకి అలా కనబడినా , చాలా మంచి వాడు. కొంచం సహనం తో ఉండు." అంది.
ఆమె మాట్లాడుతున్నంతా సేపూ ఒక రకమైన అపరాధభావం ఆమె స్వరం లో తొణికిసలాడినట్టుగా గుర్తించింది చిత్ర. పైకి ఆమె ఒకటి మాట్లాడుతూ, లోలోన మరేదో భావిస్తున్నట్టుగా ఆమె ముఖ కవళికల ఆధారంగా గుర్తించగలిగింది చిత్ర.
చిత్ర మనస్సులో పెళ్ళైన గత నాలుగు రోజులుగా నాటబడిన సంశయపు బీజానికి సరళ స్వరం లోని అపరాధభావం నీళ్ళు పోసినట్టయ్యింది.
గోవింద రావుకి చిత్రను చూస్తే చాలా జాలి కలిగింది. తమ కూతురైన రాధ కు పెళ్ళి చేసేటప్పుడు తమకు కాబోయే అల్లుడి గూర్చి వారు పరి పరి విధాలుగా వాకబు చేసిన వైనం ఆయనకు గుర్తుకు వచ్చింది. చిత్రలో తన కూతురు రాధ కనిపించింది ఆయనకు. పెళ్ళి చేసి పంపిన చోట తన కూతురు ఇబ్బంది పడుతూ ఉంటే తానెలా విల విల లాడిపోతాడో , అలాగే చిత్ర తరఫు వాళ్ళు కూడా బాధపడతారేమోనని అనిపించింది అతడికి.ఆయన మనస్సుని ' తప్పు చేశామన్న ' బాధ కలచి వేస్తోంది.
అప్రయత్నంగా చిత్ర తలను నిమురుతూ 'వస్తామమ్మా. నువ్వు జాగ్రత్త. ఏదైనా ఇబ్బంది అయితే మాకు ఫోన్ చేయి. సరేనా?" అన్నాడు గోవింద రావు.
గోవింద రావు కళ్ళల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది చిత్రకు. చిత్ర చూపు సరళ వైపు గా మరలింది.సరళ తన భర్తను కోపం, అపరాధభావం కలగలసిన భావొద్వేగం తో చూస్తూ వుంది.
చిత్ర మదిలో ఒక మూల 'మోసపోయానా నేను?' అన్న శంక అంకురించింది. కానీ తన అనుమానాలన్నింటినీ తన ముఖం లో కనబడనీయకుండా ఉండాలని నిర్ణయించుకుంది చిత్ర. కానీ ఎంత ప్రయత్నించినా తన మనస్సు లోని భావాలు ఆమె ముఖ కవళికలను మార్చసాగాయి.
సరళకు ఇంకా ఎక్కువ సేపు అక్కడ ఉండాలి అనిపించలేదు. నేల పై పెట్టబడి ఉన్న సూట్ కేస్ ని తీసుకుని, గోవింద రావు వంక చూస్తూ, "పదండి వెళ్దాం. టైం అవుతోంది." అంది కాస్త గంభీరమైన స్వరం తో.
గోవిందరావు సరళను అనుసరించాడు. పెద్ద దర్వాజా దాకా అప్రయత్నంగా వారికి తోడుగా వచ్చింది చిత్ర. గడప దాటుతున్నప్పుడు గోవింద రావు ఒక సారి చిత్ర వైపు చూశాడు.ఆయన చూపులో "జాగ్రత్త ఉండు. ధైర్యంగా ఉండు. సహనం తో ఉండు." అన్న సందేశం చిత్ర కు కనిపించింది.
తన మేనమామ కు వీడ్కోలు పలికినట్లుగా వారికి తోడుగా కింది వరకు వెళ్ళాలనిపించలేదు చిత్రకు. వారు తలుపు నుంచి కాస్త దూరం వెళ్ళగానే తలుపు మూసుకుంది చిత్ర. హాల్లో సోఫా పై కూలబడిపోయింది. కళ్ళు మూసుకుని తన ఇష్టమైన శ్రీకృష్ణుడిని తలుచుకుంది చిత్ర.
"ఏందయ్యా వీళ్ళు గిట్ల మాట్లాడుతున్నరు? నాకేం అర్థమైతలేదు అస్సల్." అని కృష్ణుడిని అడిగింది చిత్ర. చిన్నప్పటి నుంచి తనకు ఎప్పుడు ఆందోళన కలిగినా , కృష్ణుడిని తలచుకోవటం చిత్రకు అలవాటు.
'అంతా బాగానే ఉంటుందిలే.' అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది చిత్ర.


ఇతర ధారావాహికాలు

ముడి

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 11 users Like k3vv3's post
Like Reply
#16
Nice starting please continue
[+] 1 user Likes sri7869's post
Like Reply
#17
ముడి- 3వ భాగం


ఆఫీస్ నుండి ఈశ్వర్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తోంది చిత్ర. పెళ్ళైన మూడవ రోజు నుండే గంట కొట్టినట్టుగా తొమ్మిదింటికి తన భర్త ఆఫీస్ కి వెళ్ళటం కాస్త ఆశ్చర్యకరంగా తోచింది చిత్రకి. ఒక రకమైన గంభీరమైన వాతావరణం ఈశ్వర్ , అతని తల్లిదండ్రుల మధ్య నెలకొందని గమనించింది చిత్ర. గత నాలుగు రోజులుగా ఒక్కసారి కూడా తన భర్త నవ్వగా చూళ్ళేదు తను. చిత్ర కు మనస్సులో ఒక మూల కాస్త భయం వేస్తోంది. పైగా వెళ్ళేటప్పుడు సరళ, గోవిందరావు లు తనతో మాట్లాడిన విధానం తన మనస్సు లో ఏదో సందేహాన్ని కలిగిస్తోంది.
కానీ తన భర్త ఈశ్వర్ యొక్క సౌష్ఠవమైన దేహం, పాలుగారుతున్నట్టుగా ఉండే అతని మేని ఛాయ, ఒత్తైన అతని జుట్టు, గంభీరత తో కూడిన అతడి నడక లు గుర్తొచ్చినప్పుడల్లా చిత్ర కు లోలోన సిగ్గేస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన మహేష్ బాబు కు అందంలో సరితూగుతూ ..'మహేష్ బాబు లా ఉన్నాడు’ అన్న ఉపమానానికి సరిగ్గా సరిపోయే వాడిగా చిత్ర కు ఈశ్వర్ తోచాడు.
ఇంతలో 'టంగ్ టంగ్ టంగ్' అంటూ కాలింగ్ బెల్ మూడు సార్లు మోగింది.బెల్ మోగిస్తున్నది తన భర్త ఈశ్వరేనేమోనని ఊహించింది చిత్ర. వడివడిగా వెళ్ళి తలుపు తెరిచింది. తన ఎదురుగా తన భర్త ఈశ్వర్ నిల్చుని ఉన్నాడు. అతని భుజానికి ఒక బ్యాగ్ తగిలించ బడి వుంది. అతని కళ్ళు కాస్త అలసిపోయి వున్నాయి.ఈశ్వర్ ని చూడగానే చిత్ర ముఖం లో అప్రయత్నపూర్వకమైన దరహాసమొకటి చిగురించింది.ఈశ్వర్ మాత్రం తన ముఖం నిండా నిర్లిప్తతను నింపుకుని చిత్ర ఎప్పుడు తన దారికి అడ్డం జరుగుతుందా, తాను ఎప్పుడూ లోపలికి వెళ్తాడా అన్నట్టుగా ఎదురుచూస్తున్నాడు.
తన భర్త నుండి తన దరహాసానికి ప్రతిగా నవ్వు రాకపోయేసరికి కాస్త చివుక్కుమంది చిత్ర గుండెలో. ఈశ్వర్ భావోద్వేగరహితమైన ముఖం తో చిత్ర వైపు నిర్లిప్తంగా చూస్తున్నాడు.చిత్ర అతను తనని అడ్డు తప్పుకోమంటున్నాడని అర్థం చేసుకుని పక్కకు జరిగింది.వెంటనే , చిత్ర ఉనికిని పట్టించుకోనట్టుగా హాల్లోకి వచ్చాడు ఈశ్వర్.
చిత్ర కు తన భర్త తో ఏదో ఒకటి మాట్లాడాలనిపించింది. "అత్తయ్యా, మామయ్యా గంట ముందు పొయ్యిండే." అంది చిత్ర.
"హం" అన్నాడు ఈశ్వర్.
చిత్ర కు ఈశ్వర్ తో ఇంకాస్త మాట్లాడాలి అనిపించింది.
"స్నానం జేస్తరా? వేడి నీళ్ళు పెట్టాల్నా మీకు?" అడిగింది చిత్ర, ఈశ్వర్ తన వైపు తిరిగి సమాధానం చెబుతాడేమోనన్న ఊహ తో.
"అక్కర్లేదు." అన్నాడు ఈశ్వర్ చిత్ర వంక చూడకుండానే.
చిత్రవైపు కనీసం చూడనైనా చూడకుండా తన గదిలోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్.
ఒక్క క్షణం చిత్ర కు తాను ఉన్నది పది అంతస్థుల అపార్ట్మెంట్ సముదాయం లో 503 ఫ్లాట్ అని కాక, ఎడారిలో తనను కాలుస్తున్న ఇసుక తెన్నెల మధ్య ఉన్నట్టుగా తోచింది.తనతో పాటు ఉన్నది తన భర్తేనా? లేక ఎవరో అపరిచితుడా? అన్న సందేహం ఆమెకి కలిగింది.
సరళ, గోవిందరావులు తనతో మాట్లాడుతున్నప్పుడు వారి స్వరాలలో తొణికిసలాడిన అపరాధభావం చిత్ర మనస్సులో భయాన్ని రేపసాగింది.
గుండె లోతుల్లో నుండి వస్తున్న తడిని తన పంటి బిగువున బంధించి హాలు మధ్యలో 'ఒంటరిగా' నిల్చుండి పోయింది చిత్ర.
స్నానం చేసి కాటన్ టీ షర్ట్, షాట్ లల్లో బయటకు వచ్చిన ఈశ్వర్ , చిత్ర యొక్క ఉనికిని పట్టించుకోకుండా తన ఫ్లాట్ లోని వివిధ ప్రదేశాలకు తిరుగుతూవున్నాడు. చిత్ర మాత్రం అలాగే స్థాణువులా హాలు మధ్యలో నిల్చుండిపోయింది.
* * *
గత గంటన్నర నుండీ చిత్ర ఒకే ప్రదేశం లో నిలబడి ఉందని గమనించినా పట్టించుకోనట్టుగా మెలిగాడు ఈశ్వర్. ఎన్నో ఆలోచనలు చిత్ర మనస్సులో నాట్యమాడుతూ ఉన్నాయి. వాళ్ళింటి గోడ గడియారం తొమ్మిది సార్లు గంట కొట్టింది. గంట శబ్దంతో ఆలోచనల సుడుల నుండి ఇంద్రియావస్థ కు వచ్చింది చిత్ర.ఈశ్వర్ గదిలో తన ల్యాప్ టాప్ లో ఏదో పని చేసుకుంటున్నాడని గమనించింది చిత్ర.
చిత్ర ఆ గది తలుపు వైపు అడుగులు వేసి, గది గుమ్మం దగ్గర నిలబడి" తినడానికి వస్తరా? ఆలుగడ్డ కూర మీకిష్టమని అత్తయ్య చెప్పింది. చేశ్న. కారం గూడంగ ఎక్కువెయ్యలే, మీకు ఇష్టముండదని" అంది.
"నాకు ఆకలిగా లేదు. నువ్వు భోంచేయి." అన్నాడు ఈశ్వర్ పొడిగా ల్యాప్టాప్ వైపు చూస్తూనే.
"అది గాదు కొంచం తినండి. మళ్ళ రాత్రి ఆకలి గొంటరు." అంది చిత్ర.
"నాకు ఆకలిగా లేదు" అన్నాడు ఈశ్వర్ ఈసారి కూడా లాప్ టాప్ వైపు చూస్తూనే.
"కనీసం పాలైన తాగండి. రాత్రి మళ్ళ ఆకలవ్తది." అంది చిత్ర.
ఈశ్వర్ చిత్ర వైపు చుర్రున ఒక చూపు చూశాడు. ఆ చూపులో చిత్ర పట్ల వికర్షనా భావం తాండవిస్తోంది. చిత్ర కు ఇంకేమీ మాట్లాడాలనిపించలేదు.
ఆకలి వేస్తున్నా తినాలనిపించలేదు చిత్ర కి. హాల్లోని సోఫాలో కూర్చుండిపోయింది.తన తల్లి చనిపోయినప్పుడు తన చుట్టూ ఎంతో మంది జనాలున్నా తనను ఆవరించిన నిశ్శబ్దపు స్థితి తనకు గుర్తుకు వచ్చింది. ఈ క్షణం కూడా అలాంటి స్థితిలోనే తానున్నట్టుగా భావించుకుంది చిత్ర. తన పంటి బిగువున ఆ బాధ ను దాచుకోవటం ఆమె వల్ల కావట్లేదు. కాపురానికి కొత్త ఇంట్లో అడుగుపెట్టబోయే ముందు ఆమె కన్న కలలు కల్లలు గానే మిగిలిపోబోతున్నాయేమోనన్న ఊహ కన్నీళ్ళలా మారి ఆమె చెంపల మీదుగా జారి పడుతూ వుంది.
***
గదిలో ఉన్న ఈశ్వర్ కి దాహం వేసింది. హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాడు. అక్కడ అతనికి మనస్సులో ఏదో ఆలోచనతో, కళ్ళ నిండా నీళ్ళతో సోఫాలో కూర్చుని ఉన్న చిత్ర కనిపించింది.
" ఎందుకు ఏడుస్తున్నావ్?" అన్న మాట ఈశ్వర్ నోటి దాకా వచ్చింది. కానీ ఆ ప్రశ్న అతడికి అడగాలనిపించలేదు. ఆమె ఏడుపుకి కారణం తానేనేమోనన్న భావన కలిగింది అతడికి.
"భోంచేశావా?" అన్నాడు ఈశ్వర్ చిత్ర ముందు నిలబడి.
చిత్ర ఈశ్వర్ వైపు చూసింది.
"భోంచేశావా?" మళ్ళీ అడిగాడు ఈశ్వర్.
అడ్డంగా తలూపింది చిత్ర.
"భోంచేద్దాం పద" అన్నాడు ఈశ్వర్.
* * *
ఈశ్వర్ కి అన్నం వడ్డించింది చిత్ర.
"నువ్వు కూడా కూర్చో" అని చెప్పబోయి విరమించుకున్నాడు ఈశ్వర్.
ఈశ్వర్ అన్నం తిన్న వేగం చూస్తే అతనికి బాగా ఆకలి వేసిందని అర్థమయ్యింది చిత్రకు.ఈశ్వర్ తింటున్నంతసేపూ ఆబగా చూస్తూ ఉంది చిత్ర. చనిపోయిందనుకున్న ఆమె ఆకలి మళ్ళీ బతికి వచ్చి తన కడుపులో గోల చేయసాగింది.
ఈశ్వర్ తినటం ముగించాక తను తిన్న కంచం ఎత్తబోతుంటే చిత్ర వారిస్తూ"నేను తీస్త లెండి. మీరు పొయి చేతులు కడుక్కోండి."అంది.
"వద్దు నా ప్లేట్ నేనే తీస్తాను. నా ఎంగిలి కంచాన్ని ఇంకొకరు కడిగితే నాకస్సలు నచ్చదు." అన్నాడు ఈశ్వర్.
సింక్ దెగ్గరికి వెళ్ళి తన పళ్ళాన్ని తనే శుభ్రంగా కడుక్కున్నాడు ఈశ్వర్.
" నీ పేరు చిత్ర కదా ?!" అడిగాడు ఈశ్వర్. భార్యను పేరడిగే భర్త ప్రపంచం లో అతనొక్కడే అయ్యుంటాడనిపించింది చిత్ర కు. కానీ అతని స్వరం లో తన పేరు తనకే చాలా అందంగా తోచింది.
"హా" అంటూ తలూపింది చిత్ర.
"నా పేరు ఈశ్వర్."
తెలుసన్నట్టుగా నవ్వింది చిత్ర.
"నన్ను అండి, పొండి అని పిలవకు నా పేరు ఈశ్వర్. నన్ను అలాగే పిలువు." అన్నాడు ఈశ్వర్.
"అట్ల మంచిగనిపియ్యదు నాకు." అప్రయత్నంగా తన మనస్సులో ని మాటను చెప్పింది చిత్ర.
" నాకు అలానే ఇష్టం ఆపైన నీ ఇష్టం." అన్నాడు ఈశ్వర్ చాలా పొడిగా.
మిన్నకుండిపోయింది చిత్ర.
ఈశ్వర్ తన కాళ్ళ కు స్పోర్ట్స్ షూస్ తొడుక్కుని బయటకు వెళ్ళాడు. రాత్రి పదింటికి ఈశ్వర్ అలా బూట్లేసుకుని బయటకు వెళ్ళటం కాస్త విడ్డూరంగా అనిపించింది చిత్రకు.చిత్ర తన భోజనం కానిచ్చేసింది.తొమ్మిదింటి కల్లా పడుకునే అలవాటున్న చిత్రకి అంత రాత్రి దాకా మేలుక ఉండటం గత నాలుగు రోజులుగా ఇబ్బందిగా మారింది. నిద్ర ముంచుకొస్తున్న కళ్ళతో ఈశ్వర్ రాకకై ఎదురుచూడసాగింది చిత్ర.
కాసేపటికి ఇంటికి తిరిగొచ్చాడు ఈశ్వర్. అతని నుదుటి పై ఒకటి, రెండు చెమట బిందువులున్నాయి. తిన్నాక కాసేపు అరగటానికి వాకింగ్ చేసే అలవాటు ఈశ్వర్ కి ఉన్నట్టుగా గ్రహించింది చిత్ర.కళ్ళనిండా నిద్ర ముంచుకు రావటంతో తూలుతోంది చిత్ర. ఈశ్వర్ తో " నిద్రొస్తోంది నాకు." అని అంది.
ఈశ్వర్ చిత్ర వంక చూస్తూ "ఐతే వెళ్ళి పడుకో. దానికి నా Permission ఎందుకు?" అని అన్నాడు.
చిత్ర బెడ్ రూం లో ఉన్న మంచం పైన నడుం వాల్చింది. ఈశ్వర్ రాకకై ఎదురు చూడ సాగింది. కాసేపటికి ఈశ్వర్ గది లోనికి వచ్చాడు. చిత్ర వంక చూడకుండా ఆమె పక్కన ఉన్న చెద్దరు, మెత్త తీసుకుని హాల్లో ఉన్న సోఫా లో పడుకుండి పోయాడు.
చిత్ర కు తోందరగా నిద్ర పట్టలేదు. తన జీవిత పయనం అగమ్యం వైపేమోనని తోచింది చిత్రకు. అంత అందమైన డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లో తన 'స్థానం' ఏమిటో తెలిసింది చిత్రకు.
* * *
పొద్దున ఐదింటికే నిద్ర లేచింది చిత్ర. శనివారం కావటం తో తలస్నానం చేసి, ఆరింటికల్లా చక్కగా తయారయ్యింది. పక్క రూం లో ఈశ్వర్ ట్రెడ్ మిల్ పై చమటలు వచ్చేలా పరిగెడుతున్నాడు.ప్రతి శనివారం తను నిష్టగా పూజించే వేంకటేశ్వర స్వామి పటం ఒక్కటైనా కనిపించలేదు చిత్ర కు. నిజానికి ఏ ఒక్క దేవుడి పటం కూడా లేదు ఆ ఇంట్లో. సోఫాలో కూచుని , కళ్ళు మూసుకుని గోవింద నామాలు మనస్సులో చదువుకుంది చిత్ర.చెమటలు కక్కుతున్న దేహం తో స్నానానికి వెళ్ళాడు ఈశ్వర్.తన ముందు కూరగాయలను ఉంచుకుని తరుగుతూ ఉంది చిత్ర. కత్తిపీట తో కూరగాయలు తరగటం అలవాటైన ఆమెకు చాక్ తో తరగటం కాస్త ఇబ్బంది గా అనిపించింది.
స్నానం ముగించుకుని బయటకు వచ్చాడు ఈశ్వర్. తెల్లటి మేని చాయతో కండలు తిరిగిన అతడి దేహం పై నీటి బొట్లు మెరుస్తూ వున్నాయి.చొక్కా వేసుకుంటే నాజూకుగా కనిపించినా , ఈశ్వర్ రాతి లాంటి కండలు తిరిగిన దేహం కలిగి ఉన్నాడని గ్రహించింది చిత్ర మహేష్ బాబు కన్నా బావున్నాడు అన్న ఉపమానానికి సరిగ్గా సరిపోతాడు అనిపించింది.సినిమా హీరోలకు మాత్రమే ఉంటుందనుకున్న 'సిక్స్ పాక్' తన భర్త కు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించింది చిత్ర కు. తన కు లోలోన సిగ్గుగా అనిపించింది.తన స్నేహితురాలూ, కొన్ని విషయాల్లో 'గురువు ' అయిన వీణ తనకు చెప్పిన సంగతులు చిత్రకు గుర్తొచ్చాయి. ఆమె మదిలో కొంటె తలపుల తలుపులు తెరుచుకున్నాయి.
కానీ ఒక్కసారిగా నిన్న రాత్రి ఈశ్వర్ తనకు తెలియజెప్పిన ' తన స్థానం' ఆమెకు గుర్తొచ్చింది. ఈశ్వర్ వైపు నుంచి కూరగాయల వైపు తన చూపును తిప్పుకుంది. తను ఈశ్వర్ వైపు చూసినా , చూడకున్నా అతనికి పెద్దగా తేడా ఏం ఉండదని గ్రహించిందామె!
ఈశ్వర్ గదిలోంచి వెళ్ళి కాటన్ టీ షర్ట్, షార్ట్ లో బయటకు వచ్చాడు.
"ఆఫీస్ కి పోతలే?" అడిగింది చిత్ర.
"ప్చ్"
"సెలవా?" అడిగింది చిత్ర కాస్త కుతూహలం తో.
"నేను రోజూ పోనవసరం లేదు.I work from home mostly." బదులిచ్చాడు ఈశ్వర్ చిత్ర వైపు చూడకుండానే.
"ఓ.. టిఫిన్ ఏం చేయను?" అడిగింది చిత్ర.
"ఏదైనా పర్లేదు. కారం ఎక్కువ లేకుండా చేయి." అని ఒక్క క్షణం ఆగి" ఒక వేళ అలా చేయటం నీకు నచ్చదు అంటే నేను హోటల్ నుంచి తెప్పించుకుంటా." చాలా పొడిగా పూర్తిచేశాడు ఈశ్వర్. ఆఖరు వాక్యం అస్సలు నచ్చలేదు చిత్రకు.
"కారం లేకుండనే జేస్తలే. ఇంట్ల ఉప్మా రవ్వ ఉందా?" అడిగింది చిత్ర.
డీప్ ఫ్రిడ్జ్ లోనుంచి ప్యాక్ చేసిన కవరులో ఉన్న ఉప్మా రవ్వను డైనింగ్ టేబుల్ పై పెట్టాడు ఈశ్వర్.
అరగంట తరవాత లాప్ టాప్ ముందు పెట్టుకుని పనిచేసుకుంటున్న తన భర్త తో
"ఉప్మా అయింది. ఈడికే తేవాల్నా? డైనింగ్ టేబుల్ దేరనే ఉంచుద్నా?" అడిగింది చిత్ర.
"అక్కడికే వస్తున్నా. . Two minutes." అన్నాడు ఈశ్వర్ తనకు వచ్చిన మెయిల్స్ చదువుతూ.
* * *
ముందు రోజు రాత్రి లాగానే ఈశ్వర్ తాను తిన్న కంచాన్ని తానే కడిగి , తిరిగి తన గదిలోనికి వెళ్ళి లాప్ టాప్ ముందు కూర్చున్నాడు. చిత్రకు తను చేసిన ఉప్మా తనకే నచ్చలేదు. తన జీవితం లో అంత చప్ప తిండి తానెప్పుడూ తినుండదు. ముందు రోజు రాత్రి అప్పటి ఆలుగడ్డకూర కన్నా ఎక్కువ చప్పగా ఉంది ఉప్మా. చేసేదిలేక ఉప్మా మొత్తం లో అక్కడక్కడ ఉన్న పచ్చిమిరపకాయ ముక్కలన్నింటినీ నములుతూ ఏదోలా ఉప్మా కానిచ్చేసింది చిత్ర.
* * *
వాళ్ళ ఇంటి గోడపై ఉన్న గడియారం పది సార్లు గంట కొట్టింది. గత గంట సేపుగా ఒకే చోట సొఫాలో కూర్చుని ఉంది చిత్ర. ఆమెకు పొద్దు పోవట్లేదసలు.గోడ కి 'తగిలించి ఉన్న ' పెద్ద టీవీ పెట్టాలనిపించిందామెకు. స్విచ్ ఆన్ చేసింది. కానీ Hathaway అని మాత్రమే కనిపిస్తోంది. గదిలో లాప్టాప్ ముందు పనిచేసుకుంటున్న ఈశ్వర్ వద్దకు వెళ్ళి" టి.వి ఎట్ల పెట్టాలె. అదేందో Hathaway అని వొస్తోంది. నాకు అర్థమవ్తలేదు అస్సలు." అంది.
లాప్ టాప్ ని మూసివేసి హాల్లో డైనింగ్ టేబుల్ పైన ఉన్న రిమోట్ తీసుకుని ఆన్ చేశాడు ఈశ్వర్. రిమోట్ చిత్ర చేతిలో పెడుతూ " కొంచం సౌండ్ చిన్నగా పెట్టుకుని చూడగలవా?" అన్నాడు ఈశ్వర్.అది పైకి విజ్ణాపన లా కనిపిస్తున్నా అది ఆజ్ణ అని అర్థమయ్యింది చిత్రకు. సరేనని తలూపింది చిత్ర.
* * *
పన్నెండు చానళ్ళల్లో ఏదో ఒకటి ఎంచుకోవటం అలవాటైన చిత్రకు 1250 చానళ్ళల్లో ఏ చానల్ చూడాలో నిర్ణయించుకోవటం చాలా కష్టంగా తోచింది.రిమోట్ ని ఆయుధంగా చేసుకుని గంటసేపు టీ.వీ తో చేసిన సంగ్రామం లో ఎట్టకేలకు చిత్ర గెలిచింది. అరవ, మళయాళం, ఇంగ్లీష్ లాంటి భాషల చానల్స్ కాక తెలుగు చానల్స్ వరసగా ఒక్కోటిగా రావటం మొదలెట్టాయి.
gemini music చానల్లో 'గల గల పారుతున్న గోదారిలా' పాట ప్రసారమవుతూ ఉంది. పసుప్పచ్చ చొక్కా వేసుకుని, బీచ్ లో ఇలియానా యొక్క నడుముని నడిపిస్తూ ఉన్నాడు మహేష్ బాబు. ఒక్క క్షణం చిత్రకు ఉదయం స్నానం చేసి వచ్చిన ఈశ్వర్ తలంపుకు వచ్చాడు. టి.వి స్క్రీన్ పై మహేష్ బాబు వచ్చినప్పుడల్లా కన్ను రెప్ప వేయని చిత్ర, తెర మీద ఉన్న అతన్ని పట్టించుకోకుండా అప్రయత్నంగా తన చూపు ఈశ్వర్ వైపు మరల్చింది. గత నాలుగు రోజులుగా క్షవరం చేయబడక కాస్త గరుకుగా ఉన్న అతని చెంపలను నిమురుకుంటూ , చాలా పద్దతిగా మరియు వత్తుగా ఉన్న తన జుట్టుని చెరుపుకుని మళ్ళీ సరిచేసుకుంటూ లాప్టాప్ లో ఏదో చదువుతూ వున్నాడు ఈశ్వర్. గట్టిగా తడిమితే కందిపోతాడా అన్నంత తెల్లని మేని ఛాయ కలిగి ఉన్నాడు ఈశ్వర్. ఇంతలో టీవీ లో fair and lovely advertisement వస్తూ వుంది. చామన ఛాయ వర్ణం గల తన చేతినీ, ఈశ్వర్ ముఖాన్నీ పోల్చి చూసుకుని,before using fair and lovely, after using fair and lovely గా అనువయించుకుని తనలో తానే నవ్వుకుంది చిత్ర.


ఇతర ధారావాహికాలు

ముడి

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 10 users Like k3vv3's post
Like Reply
#18
Nice update
[+] 2 users Like K.R.kishore's post
Like Reply
#19
Nice update k3vv3 bro
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





[+] 1 user Likes taru's post
Like Reply
#20
చాలా బాగా వస్తోంది కథ. ఎమోషన్లు మరీ అతిగా కాకుండా మెలోడ్రామాను చక్కగా పండిస్తూ, పాత్రల మనోభావాలను చక్కగా వివరిస్తూ బావుందండి....కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)