Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముడి
Wish You a Happy New Year K3VV3 garu
[+] 1 user Likes sri7869's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update please
Like Reply
There is an update in previous page
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Next update kosam wating bro
[+] 1 user Likes BR0304's post
Like Reply
ఇదిగో మీరు అడిగినందుకు ఓ చిన్న అప్డేట్
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
ఈశ్వర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతలో ఒక బంతి వచ్చి చిత్ర కాళ్ళకు తగిలింది.
" ఆంటీ బాల్ " అని అరుస్తున్నాడు ఒక ఐదేళ్ళ అబ్బాయి.
అబ్బాయిని చూసిన చిత్రకు అభిరామే కళ్ళ ముందు మెదలసాగాడు. అతన్ని చూస్తూనే ఉండిపోయింది చిత్ర, తన కళ్ళ నిండా నీళ్ళని నింపుకుంటూ.
" దూరంగా వెళ్ళి ఆడుకో " అంటూ బంతిని అబ్బాయి వైపు విసిరాడు ఈశ్వర్.
చిత్ర మాత్రం బాబు వైపే చూడసాగింది.
" చిత్రా, ఇంక వెళ్దామా లేట్ అవుతుంది ." అన్నాడు ఈశ్వర్, ఇక లాభం లేదనుకుని.
సరేనంటూ తలూపింది చిత్ర.
తాను అనవసరంగా తన భార్య ని పార్క్ కి తీసుకొచ్చినట్టుగా భావించాడు ఈశ్వర్. వెంటనే అతనికి తన భార్య కు పార్క్ ఎదురుగా ఉన్న సందు చివరన ఉండే గుడి అంటే ఇష్టం అన్న విషయం గుర్తుకు వచ్చింది. కనీసం గుడి కి తీసుకుపోతే నన్నా ఫలితం ఉంటుందేమో నన్న ఆశతో
" చిత్రా, అటూ , ఇటూ తిప్పుతున్నాననుకోకు. గుడికి వెళ్దామా? నువ్వు రోజు అన్న శిల్ప కళ ను నాకు కూడా చూడాలని ఉంది ." అన్నాడు ఈశ్వర్, గట్టిగా నవ్వుతూ.
" ఒద్దు " అంది చిత్ర, ఖరాఖండిగా.
" అయ్యో , ఎందుకలా ?" అడిగాడు ఈశ్వర్, తన భార్య యొక్క స్పందనకు ఆశ్చర్యపడిపోతూ.
" చిన్నగున్నప్పటి కెళ్ళి నేను గంత నమ్ముత గాయ్నని. నేనంటె చులకన . నన్ను బాద పెట్టుడంటె చానా సరదా.... అయిదేండ్ల పిలగాడిని ఎందుకు తీస్కపోదమనుకున్నడు ? గంత తొందరెందుకు ?! మాటలు గూడ రావు కద గా పిలగాణికి. ఎందుకట్ల జేస్తడు? ఎందుకట్ల ఆడుకుంటడు?!... నేను ఇంగెప్పుడు పోను గాయ్న దెగ్గరికి. గాయ్నకి ఇంగ పూజలు చెయ్యను. " అంది చిత్ర కోపంగా, తన కన్నీళ్ళని తుడుచుకుంటూ.
" అది కాదు చిత్రా.... చూడు చిత్రా, may be తన దెగ్గరికి తొందరగా తీసుకెళ్ళబోతున్నాడు కాబట్టే బాబు కి మాటలు ఇవ్వలేదేమో దేవుడు." అన్నాడు ఈశ్వర్.
చిత్ర ముఖ కవళికలలో ఎలాంటి మార్పు లేదు.
ఒక్క క్షణం నిట్టూర్చి, చిత్ర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ " చిత్రా, life లో ఏదో ఒక unexpected incident జరిగిందని నిన్ను నువ్వు మార్చుకోకు చిత్రా. అప్పుడు నిన్ను నువ్వే కోల్పోవాల్సి వస్తుంది. please. Don't change yourself. నువ్వు ఇలాగే బావున్నావు చిత్రా. you have no idea how awesome you live." అన్నాడు ఈశ్వర్. మాటలు ఈశ్వర్ గుండె పొరల్లో నుంచి బయటకు వచ్చాయి.
ఒక్కో మాట అంటున్నంత సేపూ ఈశ్వర్ కి మూడేళ్ళ తన గతం గుర్తుకు రాసాగింది. తను ప్రేమించిన అమృత మరణం తరవాత , తనను తాను మార్చుకునే క్రమం లో తనను తానే కోల్పోయిన వైనం అతని కళ్ళ ముందు మెదలసాగింది. చిత్ర తన జీవితం లో దశలోనూ తనలా విషయం లోనూ వ్యవహరించకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్.
ఒక్క క్షణం గుడి వైపుకు చూసి, తిరిగి తన భర్త వైపుకి తిరిగి,
" ఇదో... మనం ఇంటికి పోదమా ? సూపర్ మార్కెట్ వరకు పొవ్వాలనిపిస్తలే....పోదమా ?" అంది చిత్ర.
" yeah yeah okay నీ ఇష్టం. " అన్నాడు ఈశ్వర్, అతని కంటి చూపు గుడి వైపుకి పడింది.
చిత్ర సంతోషంగా ఉండటానికి అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు ఈశ్వర్. నాస్తికుడైన అతడు గుడి వంక చూస్తూ, తన మనస్సులో
" చిత్ర చాలా happy గా ఉండాలి. ఎప్పుడూ చాలా చాలా happy గా ఉండాలి." అనుకున్నాడు.
ఇద్దరూ తమ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళసాగారు. చిత్ర భుజం పైన చేయి వేసి నడిపించుకు వెళ్ళసాగాడు ఈశ్వర్.
మౌనంగా నడుస్తున్న చిత్రను ఏదో ఒక సంభాషణ లో ఉంచాలని అనుకున్నాడు ఈశ్వర్.
" చిత్రా, నేను formal dresses కొనాలి అనుకుంటున్నాను. నువ్వే select చేయాలి. రేపు shopping mall కి వెళ్దాం . సరేనా ?" అన్నాడు ఈశ్వర్.
" formal dress లు అంటే ?"
" అదే... నేను office కి వేస్కెళ్తుంటాను కదా full hands shirt , plain pant అలా." అన్నాడు ఈశ్వర్.
" ... నాకు మంచిగ తెల్వదు గద. నీకు నచ్చుతయో లేదొ మళ్ళ. "అంది చిత్ర.
తన భార్య ఏదో ఒక విషయం మీద మాట్లాడటం సంతోషాన్ని కలిగించింది ఈశ్వర్ కి.
" ఏం కాదు లే, నీకు నచ్చితే చాలు కాని. అయినా ఇప్పుడు ఎలా వేసుకున్నా fashion ." అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ.
" మ్మ్మ్ం... సరే మళ్ళైతె." అంది చిత్ర.
" ఇదో .... నాకు ఇంటికి పొయ్నాంక వొంట చేయాల్నని అనిపిస్తలే ఇయాల. నువ్వు గా రోజు.. గదే నాకు చెయ్యి కాలిన రోజు, బయటికెళ్ళి ఫోను జేశి తెప్పిచ్చినవ్ జూడు. అట్ల ఇయాల గూడ తెప్పిస్తవా ? " అంది చిత్ర.
" ఫుడ్ ఆర్డర్ చేయటమెందుకు ? నాకు వంట చేయడం వస్తుంది . నేను చేస్తా ఇవాళ. చూద్దువు గాని నా వంట టేస్ట్ కూడా ." నవ్వుతూ అన్నాడు ఈశ్వర్.
చిరునవ్వొకటి నవ్వింది చిత్ర.
***
వాకింగ్ ముగించుకుని వచ్చారు చిత్ర , ఈశ్వర్ లు.
" నేను చేసిన ఉప్మా గురించి నువ్వేమైనా చెబుతావేమో నని ఇందాకటి నుంచి వెయిటింగ్ నేను. " అన్నాడు ఈశ్వర్.
" మస్తుంది.... నిజంగ. " అంది చిత్ర.
" మరి అప్పుడే చెప్పొచ్చుగా ఇదేదో ?! "
" నువ్వు మంచిగుంది అంటె రోజు చేస్తా అంటవ్ ! నాకట్ల మంచిగనిపియ్యదు. గందుకే ఇంగేమి చెప్పలే. " అంది చిత్ర నవ్వుతూ.
ప్రతిగా ఒక చిరునవ్వు నవ్వాడు ఈశ్వర్. చిత్ర నవ్వు తన యొక్క మనస్సుకి తాకిన అనుభూతి కలిగింది ఈశ్వర్ కి.
***
చిత్ర ఈశ్వర్ లు తమ , తమ గదుల్లోకి పడుకోవడానికి వెళ్ళారు.
కాసేపయ్యాక, తలుపు కొట్టిన శబ్దం వినిపించేసరికి ఈశ్వర్ వెళ్ళి తన గది తలుపు తెరిచాడు. ఎదురుగా చిత్ర కళ్ళ నిండా నీళ్ళతో నిల్చుని ఉంది.
" నాకు రోజు పండుకుంటె అబిరామే గుర్తుకొస్తుండు. నిద్ర పడ్తలే నాకస్సలు రాత్రిపూట. నిన్న, మొన్న గూడ నిద్ర పట్టలే నాకు. నీ కాడనే పండుకుంట ఇయాల. పండుకోనిస్తవా నన్ను. " అంది చిత్ర.
" హేయ్ , అడగాలా ?! రా లోపలికి. " అంటూ తన భార్యను లోపలికి తీసుకుని వచ్చాడు ఈశ్వర్.
మంచం పైన కూర్చున్న చిత్ర పక్కన కూర్చున్నాడు ఈశ్వర్.
" నీకేమి తాకకుండగ పండుకుంట నేను సరెనా. నాకు బయమవ్తోంది ఒక్క దాన్నె పండుకొవ్వలంటె. గందుకే " అంది చిత్ర, సంజాయిషీ ఇచ్చుకుంటూ.
" హేయ్! ఇది మనిల్లు. నీ ఇష్టమొచ్చిన దెగ్గర పడుకోవొచ్చు. పదే పదే చెప్పకు ఇలా నాకు. " అన్నాడు ఈశ్వర్, ఆప్యాయత నిండిన కోపం తో.
ఒక్క నిమిషం పాటు మౌనంగా కూర్చున్నారు వాళ్ళిద్దరు. హఠాత్తుగా తన భర్తను కౌగిలించుకుని తనివితీరా ఏడవసాగింది చిత్ర. అభిరాం విషయం లో ఆమె మనస్సు పొరల్లో ఉన్న బాధంతా బయటకు వెళ్ళగక్కుతుందని గ్రహించాడు ఈశ్వర్ .
ఆమె తనివితీరా ఏడ్చిందని రూఢీ చేసుకున్నాక, ఆమె భుజాలను పట్టుకుని లాగి, ఆమె కళ్ళల్లోకి చూస్తూ
" చిత్రా, ఎక్కడికైనా వెళ్దామా ఒక రెండు , మూడు రోజులు ? నీకిష్టమొచ్చిన ప్లేస్ చెప్పు. తీస్కెళ్తా నిన్ను. " అన్నాడు ఈశ్వర్.
" మా ఊరికి పోదమా ? మామోళ్ళని సూడాలనిపిస్తుంది. పెంట్లవెల్లికి తీస్కపోతవా నన్ను?" అంది చిత్ర ఈశ్వర్ తన మాటను పూర్తి చేసిన మరుక్షణమే.
" sure. "
" మనం ఒస్తున్నమని మామోళ్ళకు ముందే జెప్పకు. జెర సర్ప్రైజు ఉంటది మంచిగ . " అంది చిత్ర.
ఆమె కళ్ళల్లో మునుపటి మెరుపు యొక్క చాయలు కనిపించాయి ఈశ్వర్ కి.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
Nice update super
[+] 1 user Likes BR0304's post
Like Reply
(07-01-2024, 10:32 PM)k3vv3 Wrote: " మనం ఒస్తున్నమని మామోళ్ళకు ముందే జెప్పకు. జెర సర్ప్రైజు ఉంటది మంచిగ . " అంది చిత్ర.
ఆమె కళ్ళల్లో మునుపటి మెరుపు యొక్క చాయలు కనిపించాయి ఈశ్వర్ కి.

Nice update andi K3vv3 garu!!!


clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
Update please
Like Reply
అద్భుతం
[+] 1 user Likes shoanj's post
Like Reply
సూపర్. తన ఊరికెళ్ళీన చిత్ర ఈశ్వర్ కు ఇంకా ఎన్ని సర్ప్రైజ్ లు ఇస్తుందో...కొనసాగించు బ్రో
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
Update please wating
Like Reply
ఈ రొజే  మీ కథ ముడి చదవడం జరిగింది , చదువుతూ ఉన్నంత సేపు   కళ్ళలో తడి ఆరలేదంటే నమ్మండి , చాల బాగా రాస్త్రున్నారు  ఆపకుండా  రాస్తూ పొండి

శివ  
[+] 3 users Like siva_reddy32's post
Like Reply
ఇప్పటి వరకు కథను చదివి ఆదరించిన పాఠక మహాశయులందరికీ పేరు పేరునా కృతజ్ఞతాభివందనములు thanks
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
ఆమె కళ్ళల్లో మునుపటి మెరుపు యొక్క చాయలు కనిపించాయి ఈశ్వర్ కి.
" నీకెలా ఇష్టమైతే అలానే. ఇప్పుడైతే పడుకో మరి. పొద్దున్నే arrange చేస్కోవాలి అన్ని." అన్నాడు ఈశ్వర్.
" సరే . " అంటూ మంచం యొక్క మూలకు వెళ్ళి పడుకుంది చిత్ర.
తన మనస్సు కుదుటపడటం తో మెల్లిగా నిద్రలోకి జారుకుంది చిత్ర.
ప్రశాంతంగా పసి పాప లాగా నిద్రపోయిన తన భార్య తల నిమురుతూ, ఆమె నుదురు ని ముద్దాడాడు ఈశ్వర్.
పొద్దున్నే ఆరింటికి హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈశ్వర్ , చిత్ర లు పదింటికల్లా పెంట్లవెల్లికి చేరుకున్నారు. ఎక్కువ చప్పుడు చేయకుండా తన మామయ్య వాళ్ళింట్లోకి వెళ్ళింది చిత్ర. అక్కడ టి.వి చూస్తున్న స్వాతి కళ్ళు వెనకాల నుంచి మూసింది చిత్ర.
చిత్ర వేళ్ళను కాసేపు తడిమిన స్వాతి,
" వొదినె నా ?" అంది.
" ఎట్లున్నవ్ ?! " అంది చిత్ర నవ్వుతూ, స్వాతి వైపు చూస్తూ.
" బావున్న . నువ్వెట్లున్నవ్ ? అన్న గూడ ఒచ్చిండా ?" తన మాట పూర్తి చేసే లోపే బయట తన కార్ ని పార్క్ చేసి ఈశ్వర్, వంటింట్లో నుంచి జయమ్మ ఒకేసారి గదికి వచ్చారు.
" అయ్యా ! ఎప్పుడొస్తిరి ?? సడనుగ వస్తిరి ఇద్దరు ! కూసో బాబూ . ఎట్లుర్రు బాబు ? బుజ్జీ, నువ్వెట్లున్నవే? అస్సలు ఫొను, గీను ఏం జెయ్యకుండనే ఒస్తిరి డయిరెక్టుగ ! ఎండల పడొచ్చినట్టున్నరు ఇద్దర్కి నీళ్ళిస్త ఆగండి !" అంటూ వంటింట్లోకి వడి వడిగా వెళ్ళింది జయమ్మ.
" ఇదో.. కూసో ." అంటూ ఇనప కుర్చీ పై ఆరేయబడ్డ తువాల ను పక్కకు తీసి, తన భర్తను కూర్చోమన్నట్టుగా సైగ చేసింది చిత్ర.
" ఆగు ఫ్యాను పెద్ద జేస్త. " అంటూ రెగులేటర్ వద్దకు వెళ్ళి, ఫ్యాన్ వేగాన్ని పెంచింది చిత్ర.
మూలకు నిలబడి ఈశ్వర్ ని చూస్తున్న స్వాతి వైపు కి తిరిగి
" హాయ్ ." అన్నాడు ఈశ్వర్.
" అన్న కు హాయంట జెప్పు." అంది చిత్ర, నవ్వుతూ.
చిత్ర ముఖం పూర్తిగా వెలిగిపోతూ మునుపటిలా ఉండటాన్ని గమనించాడు ఈశ్వర్. చిత్ర ను పెంట్లవెల్లికి తీసుకు రావడం చాలా మంచిదైనట్టుగా భావించాడు ఈశ్వర్.
తనకు తిరిగి హాయ్ చెప్పిన స్వాతి తో
" ఏం చదువుతున్నావ్ ? " అడిగాడు ఈశ్వర్.
" నయింత్ అయిపోయింది. టెంత్ సదవాలె." అంది స్వాతి.
" గీతేది ? కనిపిస్తలే ?" అంది చిత్ర.
" గీత లక్ష్మమ్మ అత్తోళ్ళింటికి పొయింది. పొద్దు గల్లనే పొయ్యిండె గాడికి." అంది స్వాతి.
" అయ్య, గట్లనా " అంది చిత్ర.
ఇంతలో రెండు గ్లాసుల నిండా మజ్జిగ తీసుకుని వచ్చింది జయమ్మ.
" ఎండల పడొచ్చిర్రు. పటండి మజ్జిగ జేస్కొచ్చిన. శక్కెర తక్కువైతె అడుగు బాబు." అంటూ ఈశ్వర్ చేతికి మజ్జిగ ఇచ్చింది జయమ్మ.
సరేనంటూ తలూపాడు ఈశ్వర్.
" మామేడుండు ? కనిపిస్తలేడు ?" అడిగింది చిత్ర.
" సామాన్లు తెయ్యనీకె అంగడి కాడికి పొయ్యిండె మీ మామ. ఒస్తడు ఇంగో పది, ప్దిహేను నిమ్శాలల్ల." అంది జయమ్మ.
" ఇంగేమి అత్తా, మామ ది, నీది పయి ఎట్లుంది ?" అడిగింది చిత్ర.
" బానే ఉందే బుజ్జీ, జెర ఎండకాలం గద, మీ మామ నే గీ మద్యన చాతనైతలే అంటుండు అప్పుడప్పుడు." అంది జయమ్మ.
" అయ్య, చాతనైతలేదా? ఏమట్ల? డాక్టరు కాడికి పొయి సూపిచ్కుండా మళ్ళ ?" అడిగింది చిత్ర, ఆందోళన , కోపం, ఆప్యాయత కలగలిసిన భావోద్వేగం కలిగినదై.
" ఒచ్చినాంక నువ్వే అడుగుదువు మీ మామ ని. గాయ్నకి కోడలు జెప్తెనే అర్తమైతది, పెణ్లాం, పిల్లలు జెప్తే చెవులకెక్కదు." అంది జయమ్మ.
" మంచిగ పూట పూటకు టైముకు తింటుండా ? ఊర్ల పోంటి తిరగవడ్తుండా ?" అడిగింది చిత్ర.
" వొస్తడు గద, నువ్వే అడుగు. నేను గివన్ని అడుగుతె చెడ్దదాన్నవ్త తల్లి. నువ్వే అడుగు గా మనిషి ని. నీతోనైతె మంచిగ చెప్తడు ముచ్చట." అంది జయమ్మ.
" ఉం, అడుగుత రాని !" అంది చిత్ర.
చిత్ర, జయమ్మ సంభాషణ బాగా ఆసక్తికరంగా, వినోదంగా తోచింది ఈశ్వర్ కి.
చిత్ర, జయమ్మ లకు హఠాత్తుగా పక్కన ఈశ్వర్ ఉన్నాడన్న విషయం గుర్తొచ్చింది. కాస్త మొహమాటంగా ఈశ్వర్ వైపు తిరిగి,
" వచ్చెటప్పుడేమన్న ఇబ్బంది అయ్యిండెనా ?" అంది జయమ్మ చిరునవ్వుతూ.
" అయ్యో, లేద్లేదు. అలా ఏం లేదు. బాగానే టైం పాస్ అయ్యిండే " అన్నాడూ ఈశ్వర్, చిత్ర దారి పొడవునా తన ఊరి విశేషాలు ఆపకుండా చెప్పిన వైనాన్ని గుర్తు తెచ్చుకుంటూ.
" ఆకలిగొన్నట్టున్నరు పాపం. అర్ద గంటల వొంట జేస్కొస్త. సరెనా ?" అంది జయమ్మ.
సరేనన్నట్టుగా తలూపాడు ఈశ్వర్.
వంటింటిలోకి వెళ్ళిన జయమ్మ వెనకే చిత్ర కూడా వెళ్ళింది.
" అత్తా, గీయ్న మన లెక్క కారం గీరం ఎక్కువ తినడు. మస్తు సప్పగ తింటడు. నేనే జేస్త గీయ్నకు వొంట గీడున్నంతవరకు అర్తమైందా ?" అంది చిత్ర.
" అట్లే ." అంటూ తలూపింది జయమ్మ.
" ఇంగొ మాట, గాయ్న చికెన్, మటన్ తినడు సూడు. "
" అట్లే."
" గుడ్లు గిడ్లు కూడ తేవాకండి. గవి కూడ తినడు ఈన."
"అట్లే .""
" ఇంగో ఇంట్ల దోమతెరుందా ?"
" హా ఉంది పైనుంది మచ్చు మీద. కిందికి దించాలె. "
" రాత్రి ఈనకు దోమ తెర సిద్దం జేయాలె జూడు. మన లెక్క దోమలు అల్వాటులెవ్వు ఈశ్వర్ కి. "
" అట్లే."
" ఏమేం కూరగాయలున్నయ్ ఇంట్ల ?"
" ఏమి లెవ్వు. గుడ్లున్నయ్ అంతే. గుడ్డు కూర ఒండుదమనుకున్న. నాకు తెల్వదు గద ఈశ్వరు నీసు తినడని." అంది జయమ్మ.
" అయ్య, గట్లనా ?! "
" హా.. ఫోను జేస్త మళ్ళ మామకు ."
" ఒద్దొద్దుగాన్లె. ఈన నేను గలిసి కార్ల పోతం పాబ్బాయి సందు కాడికి. గాడ శంకరయ్యోళ్ళు కూరగాయల్ పెట్టుకుంటరు గద. గాడికి పోయి తెస్తం ఇద్దరం కూరగాయలు."
" కార్లొచ్చినార్ ? బస్సుల గాదా ?"
" షీ... బస్సుల తిరుగుడు ఆయ్నకి అల్వాటు లేదు. మేము పక్క సందులకు గూడ కార్లనే పోతం . "
" మ్మ్మ్ం. సర్లె. పోయి రాపొండి. నేను గంత వరకు అన్నం పొయి మీన పెడ్త.... మీ ఆయ్న పాలు తాగుతడా? సుక్క బర్రె పాలున్నయ్. "
" ఈనిందా సుక్క బర్రె ? "
" అవ్ను. వారమౌతుంది. మూడు రోజుల కింద వరక్ గూడ జున్నిచ్చిండె గది."
" అవ్నా... సరె పాలు వొయ్యి గ్లాసుల. శక్కెరెక్కువెయ్యకు. గాయ్న తాగడు శక్కెరెక్కువ. లావౌతరంట శక్కెరెక్కువ తింటె."
" అట్లే తల్లి. మీ ఆయ్నకెంత గావాల్నో నువ్వే పోస్కో అమ్మా! మళ్ళ నేను పోస్తె నువ్వు మెచ్చుతవో లేదో !"
" అట్లే . గీ గిన్నలున్నయేనా పాలు ?! కాచి పోస్త ఆయ్నకు." అంటూ పాలు పొయ్యి మీద పెట్టింది చిత్ర.
తన కూతుళ్ళకు పెళ్ళిళ్ళైతే ఇంక వాళ్ళతో ఎంత వేగాల్సొస్తుందో నని భావిస్తూ, నిట్టూరుస్తూ వంటింట్లో నుంచి బయటకు వచ్చింది జయమ్మ.
...
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
Super update
[+] 1 user Likes BR0304's post
Like Reply
(19-01-2024, 01:12 PM)k3vv3 Wrote: తన కూతుళ్ళకు పెళ్ళిళ్ళైతే ఇంక వాళ్ళతో ఎంత వేగాల్సొస్తుందో నని భావిస్తూ, నిట్టూరుస్తూ వంటింట్లో నుంచి బయటకు వచ్చింది జయమ్మ.
...

Nice update, K3vv3 garu! Story is flowing moving smoothly.

clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
మళ్ళీ మునుపటి చిత్ర బయటికొచ్చింది. గలగల మాట్లాడేస్తూ. బావుంది...కొనసాగించు బ్రో.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)