Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
ముడి- 20
ఈశ్వర్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా మంద్రంగా వినిపిస్తోంది వంటింట్లో పని చేస్కుంటున్న చిత్రకు. తన భర్త మాట్లాడుతోంది అతని స్నేహితుడు ఆదర్శ్ తోనే నని అర్థం చేసుకుంది చిత్ర. ఈశ్వర్ తన స్నేహిస్తుడితో ఏం మాట్లాడ దలచుకున్నాడో వినాలనుకుంది చిత్ర. తను తిప్పుతున్న మిక్సీ ని ఆపి తన చెవులను ఈశ్వర్ గది వైపుగా పెట్టి వినసాగింది. కానీ ఒక నిమిషం తరవాత తన భర్త పై అలా గూడచర్యం చేయడం నచ్చలేదామెకు. తిరిగి మిక్సీ ని ఆరంభించింది. తన భర్తకు మెత్తగా మెదిగిన చెట్నీ ఇష్టమని గుర్తు తెచ్చుకుని, కాస్త ఎక్కువ సేపు మిక్సీ పట్టింది చిత్ర.
"చిత్రా! " అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది చిత్ర.
"అదీ.... మా friend ఆదర్శ్ ఈరోజు hyderabad వస్తున్నాడు. తన పని అయిపోయాక lunch కి మనింటికి పిలుద్దాం అనుకుంటున్నా. i mean.... నీకు అభ్యంతరం ఏం లేకపోతేనే. ఒక వేళ నీకేమైనా అభ్యంతరం ఉంటే please say to me. మేమిద్దరం ఏదైనా restaurant లో lunch చేస్తాం." అన్నాడు ఈశ్వర్ మొహమాటపడుతూ.
'ఏందో ఏమో గీ మనిషి, పెన్లానికి వొంట వొండమని జెప్పనీకి గూడ ఇదైపోతడు. ' అనుకుంది చిత్ర మనస్సులో.
"అయ్య, నాకిబ్బందేం ఉంటది జెప్పు ?! నువ్వేమొండమంటే గదే ఒండుత."
"చాలా thanks.special గా ఏమీ వద్దు. నువ్వు ఏదైతే వండాలి అనుకున్నావో అదే వండు. మన ఇద్దరికీ కాకుండా ఇంకొకరికి extra వండు అంతే. " అన్నాడు ఈశ్వర్.
" సరే" అంది చిత్ర.
వంటింట్లో నుంచి తన భర్త బయటికి వెళ్ళగానే అతను thanks చెప్పినందుకు గాను విసుగ్గా నిట్టూర్చింది చిత్ర. కానీ ఆమెకు ఈశ్వర్ ' మనింటికి ' అన్న పదం వాడిన విషయం గుర్తొచ్చింది.
' అబ్బ! గీ మనిషి మాటవర్సకి అన్నడో, లేక మన్సుల గట్లనే అనిపిచ్చి అన్నడో అసలు!' అనుకుంది చిత్ర.
తన భర్త కి తన వల్ల అతని స్నేహితుడి దగ్గర మాట రాకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీస్కోవాలని గట్టిగా నిర్ణయించుకుంది చిత్ర.
***
చిత్ర చేసిన ఇడ్లీలు చాలా రుచికరంగా అనిపించాయి ఈశ్వర్ కి. చెట్నీ తనకిష్టమైన విధంగా బాగా మెదిగి ఉండటం తో తను పెట్టుకున్న డైట్ లిమిట్ దాటి రెండు ఇడ్లీలు ఎక్కువగా తిన్నాడు ఈశ్వర్. తన భర్త అలా బంగారం దుకాణం లో తూకం లాగా తినకపోవడం సంతోషాన్ని కలిగించింది చిత్ర కు. చిత్ర కు తనకిష్టమైన విధంగా వంట చేయడం ప్రతీసారి ఎలా సాధ్యపడుతుందో అర్థం కాలేదు ఈశ్వర్ కి. కానీ చిత్ర చేతి వంటకు ఈశ్వర్ బాగా అలవాటు పడ్డాడు. తను office canteen లో తిన్నప్పడల్లా ఇబ్బందిగా అనిపించసాగింది ఈశ్వర్ కి.
" టిఫిన్ బావుంది." అన్నాడు ఈశ్వర్ చిత్ర ని మెచ్చుకోకుండా ఉండలేక.
"ఇంకొన్ని తిను." అని బలవంతంగా పెట్టబోయి, తన భర్త కోరుకునే స్వాతంత్ర్యాన్ని అతనికి ఇవ్వాలని భావించి ఊరుకుంది చిత్ర.
ఈశ్వర్ తన గదిలోనికి వెళ్ళి తన పని చేస్కోవడం తిరిగి ప్రారంభించాక, చిత్ర ప్లేట్ లో మిగిలిన ఇడ్లీలన్నింటినీ వడ్డించుకుని, తను చేసిన చప్పని చెట్నీ పై తన కోసం ' ప్రత్యేకంగా ' తయారు చేసుకున్న కారప్పొడిని దట్టంగా చిలకరించుకుని , సోఫా పై కూర్చుని తినసాగింది చిత్ర.
' గీ మనిషి గీన గీ కారం తినెనంటె ఎగురుతడింగ పైకి, కిందికీ ' అని తనలో తాను నవ్వుకుంది చిత్ర.
తన భర్త తనకు ఆడే విధానాన్ని నేర్పించిన 2048 ఆట ని తన ఫోన్ లొ ఆడసాగింది చిత్ర. స్మార్ట్ ఫోన్ ఇంతక ముందు అలవాటు లేని చిత్రకు, తన భర్త 'చాలా ' ఓపికగా తను అడిగిన ప్రతీ వింత సందేహానికీ సమాధానం చెప్పిన వైనాన్ని ఆ ఫోన్ లో ఆడిన ప్రతీ సారీ గుర్తు తెచ్చుకొని మురిసిపో సాగింది చిత్ర.
' ఏదేమన్న గాని, గీ ఫోను తయారు చేశినోడు ముప్పై వెయిలు దీనికి పెట్టుడైతె మస్తు అన్యాయం. గదైతే నిజం. ' అనుకుంది చిత్ర తన మనస్సులో.
' ఏదేమన్న గాని, గా శ్రీజ ని అడిగి , చీపుల ఏమి లాప్టాపు ఒస్తదో తెల్సుకోని గీన తో కొనిపిచ్చుకోవాలె. ఇంగా బాగ చెప్పిచ్చుకోవొచ్చు గీ మనిషి తోని. అయినా నెలక్ నెలక్ రోండు లక్షలు సంపాదిస్తడు. గన్ని పైసలు ఏం జేస్తం మేమిద్దరం. గిట్ల ఏదన్న వస్తువులు కొనుక్కపోయి మామోళ్ళకు సూపిస్తెనన్న బాగుంటది గాని.' అనుకుంది చిత్ర తన మనస్సులో.
****
" చిత్రా! " అన్న పిలుపు విని, స్టార్ మహిళ ప్రోగ్రాం లో నిమగ్నమైపోయిన చిత్ర, పిలుపు వచ్చిన వైపుకి తిరిగి చూసింది.
" ఏమి ?" అడిగింది చిత్ర, మహామొహమాటంగా ముఖం పెట్టిన తన భర్త వైపు చూస్తూ.
" అదీ.....actually office నుంచి phone వచ్చింది. unexpected server crash అయిందంట . i need to go there and check the matter. so....నువ్వు ఆదర్శ్ ని receive చేస్కోగలవా? please. "
please అన్న పదాన్ని విని చుర్రుమంటూ కోపం వచ్చింది చిత్రకి. తనకు తన భర్త చెప్పిన విషయం పూర్తిగా అర్థం కాకున్నా అతని ఉద్దేశం మాత్రం అర్థమైంది. అయినా కూడా please అన్న పదాన్ని తన భర్త తన దెగ్గర వాడటం వల్ల కలిగిన కోపాన్ని ఏదో ఒక విధంగా ప్రదర్శించాలని నిర్ణయించుకుంది.
"ఆ ?! ఏందీ ?! " అడిగింది చిత్ర, అర్థం కానట్టుగా నటిస్తూ.
" అదీ, నేను urgent గా office వెళ్ళాల్సి వస్తోంది. మా friend ఆదర్శ్ ని receive చేస్కో. ఏమనుకోకు. నిన్ను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు."
" సరె." అంది చిత్ర, గొంతులో కాస్త చికాకు, ఆగ్రహాన్ని ప్రతిష్టింపజేస్తూ.
'ఏందో ఏమో గీ మనిషి ప్లీజు జెప్పుడు బంజేస్తడు అనుకుంటె, ఇంకా ఎక్కువ అడుక్కుంటుండు. పెన్లాం తోని మాట్లాడనీకె గూడ తెల్వదు ' అనుకుంది చిత్ర, తన మనస్సులో.
చిత్రకు ఇష్టం లేని పని చెప్పి, ఆమెకు విసుగు కలిగించానేమో నని భావించుకున్నాడు ఈశ్వర్. తను ఏం మాట్లాడినా పళ్ళికిలిస్తూ తిరిగి మాట్లాడే చిత్ర లో ఈ ఆకస్మిక మార్పు చాలా ఆశ్చర్యకరంగా తోచింది ఈశ్వర్ కి.
ఈశ్వర్ బయటికి వెళ్ళాక తను తన భర్త తో కటువుగా వ్యవహరించినందుకు చివుక్కుమంది చిత్ర మనస్సులో.
'ఏందో ఏమో, ఊకె కోపం తెప్పిస్తడీ మనిషి నాకు గా ప్లీజులు , సారిలు జెప్పి. నేనే జెర కోపం తగ్గిచ్కోవాలె. ప్చ్ ... గలీజుదాన్ని అనోసరంగ గా మనిషి తోని గట్ల కోపంగ మాట్లాడితి. ఏం తినకుండనే పొయ్యిండు మళ్ళెప్పుడొస్తడో ఏమొ. ప్చ్.. ఆకలి గొంటడు మనిషి. ' అనుకుంది చిత్ర తన మనస్సులో.
****
చిత్ర వాళ్ళింటి గోడ గడియారం 2 సార్లు కొట్టి నలభై ఐదు నిమిషాలు గడిచాయి. కాలింగ్ బెల్ రెండు సార్లు నొక్కబడింది. బయట కాలింగ్ బెల్ కొట్టింది తన భర్త కాదని నిర్దారించుకుని, తన భర్త చెప్పిన స్నేహితుడు అయి ఉండొచ్చుననుకుని తలుపు తీయడానికి వెళ్ళింది చిత్ర.
"నేను ఈశ్వర్ ఫ్రెండ్ ఆదర్శ్ ని. తనకు phone చేసాను. మీరుంటారని చెప్పాడు నాకు. " అన్నాడు ఆదర్శ్ చిత్రని చూస్తూ.
" ఆ అవ్నవ్ను. గీన ఏదో అర్జంటు పనుందని పొయ్యిండె. వస్త అన్నడు దబ్బున్నే.... మీరు లోపల్కి రండి అన్నా. " అంటూ ఆదర్శ్ ని లోనికి ఆహ్వానించింది చిత్ర.
ఈశ్వర్ భార్య అంటే ఫలానా విధంగా ఉంటుందని ఊహించుకున్న ఆదర్శ్ , చిత్రని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. కానీ తన ఆశ్చర్యాన్ని బయటికి కనిపించనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు.
గ్లాస్ నిండా మంచి నీటిని ఇచ్చింది చిత్ర.
" మొకం కడుక్కుంటరా? బాత్రూము గాడుంది జూడండి. " అంటూ ఆదర్శ్ చేతిలో నుంచి గ్లాస్ ని తీసుకుంటూ సైగ చేస్తూ స్నానాల గది యొక్క దిశని చూపించింది చిత్ర.
" యా , తెలుసు. " అన్నాడు ఆదర్శ్ చిరునవ్వుతో.
ప్రతిగా నవ్వింది చిత్ర, తమ ఇంటికి ఆదర్శ్ ఇంతకముందు చాలా సార్లు తన పెళ్ళి కాక ముందు వచ్చాడని గ్రహించి.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
" గీన ఒస్తననే అన్నడు. ఫోన్ జేస్త ఆగండి. పాపం మీకు గూడ ఆకలైతుంటది. " అంటూ తన ఫోన్ వైపుగా నడవసాగింది చిత్ర.
"లేదు లేదు. ఈశ్వర్ కి నేను call చేసా ఇక్కడికి వచ్చేముందే. తను office నుండి కాసేపట్లో start అవుతా అన్నాడు.may be one hour పట్టొచ్చు."
"అయ్య, మళ్ళ మీకు ఆకలైతదేమో గద. గంత వరకు ఏమన్న బిస్కెట్లు తింటరా? ఉన్నయ్ ఇంట్ల. " అంది చిత్ర.
" అయ్యో, పర్లేదు. ఆకలేం వేయట్లేదు నాకు." కడుపులో ఎలుకలు తిరుగుతున్నా నవ్వుతూ బదులిచ్చాడు ఆదర్శ్.
" సరే ." అంది చిత్ర.
" గీన ఒచ్చేవరకు టి.వి చూస్తరా అన్నా? పటండి రిమోటు. " అంటూ టి.వి రిమోట్ ని ఆదర్శ్ చేతిలో పెట్టింది చిత్ర.
" ఒక్క ఐదు నిమిషాల్ల ఒస్త." అంటూ ఫ్రిజ్ లో నుండి పెరుగు గిన్నె తీసుకుని లోనికి వెళ్ళింది చిత్ర.
చందర్ రావు తనకు నేర్పించిన వెజ్ బిర్యానీని లంచ్ కి తయారు చేసింది చిత్ర. దానికి తగ్గ రైతా ని తయారు చేయసాగింది.
'ఏందో ఏమో, గా రోజు గా ముసలాయ్న నేర్పిచ్చినట్టే చేసిన్నో లేదో ఇరోజు?! కరెక్టు టైముకి లేకపొయ్యిండు ఆ ముసలాయ్న. ' అనుకుంది చిత్ర, తన మనస్సులో.
' క్రిష్నయ్యా గిరోజు జెర మంచిగ అయ్యెటట్లు జూడు ఒంట. ఈ ఒచ్చినాయ్న కాడ ఈశ్వరు కి మాట రానియ్యకు.' అని కృష్ణుడితో చెప్పుకుంది చిత్ర.
ఏదో చీకటి గదిలా ఉండే ఈశ్వర్ యొక్క ఫ్లాట్ లొ ఏదో తెలియని జీవం ఉట్టిపడుతున్నటుగా అనిపించింది ఆదర్శ్ కి. కాని తన ప్రతీ చేష్టలో, ప్రతీ మాటలో పల్లెటూరిదనాన్ని నింపుకున్న చిత్ర ఈశ్వర్ కి సరైన జోడిగా అనిపించలేదు ఆదర్శ్ కి.
తనకు గుర్తున్న అమృతని, తన కళ్ళముందు కనబడుతున్న చిత్ర ని పోల్చుకొని, ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూసి తన స్నేహితుడి కాపురం నిలుస్తుందెమొనన్న చిరు ఆశ కలిగిన ఆదర్శ్ కి తన ఆశ తీరెటట్లుగా అనిపించలేదు.
పది నిమిషాల తరువాత సోఫా లో కూర్చున్న ఆదర్శ్ కి ఎదురుగా డైనింగ్ టేబుల్ కుర్చీని వేసుకుని కూర్చుంది చిత్ర. తమ ఇంటికి వచ్చిన అతిథి కి ఎదురుచూపు వల్ల విసుగు కలగకుండా చూస్కోవాలనుకుంది చిత్ర.
"అది... ఫ్యాను పెద్దగ ఎయ్యమంటరా?" అడిగింది చిత్ర, ఏదో ఒకటి మాట్లాడదలచి.
"పర్లేదు లెండి. it is fine." బదులిచ్చాడు ఆదర్శ్.
'ఏందో ఏమో, మద్యానం పూట ఎండ ఉంటది. రాత్రి పూట మాత్రం మస్తు చలి పెడ్తది. హైదరబాదు క్లయిమెటు మస్తు వెరయిటీగ ఉంటది. " అంటూ నవ్వింది చిత్ర.
" హా కానీ actually మా side ఇంకా దారుణంగా ఉంటుంది climate. ఇదే చాలా నయం." అన్నాడు ఆదర్శ్.
"ఓ.... ఏడుంటరు మీరు?"
"New Delhi. two years అవుతోంది వెళ్ళీ. ఇంతక ముందు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉండే వాళ్ళం."
"ఓ.. మీ వాళ్ళు గూడంగ మీ తోననే ఉంటరా డిల్లీ ల ?"
" యా, my wife, తను doctor. అక్కడే చిన్న clinic పెట్టుకుంది."
ఇద్దరూ మాటి మాటికి ఈశ్వర్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడసాగారు గోడ గడియారం వైపు చూస్తూ.
ఒక నాలుగు నిమిషాల వికారపు నిశ్శబ్దం తరువాత, కాస్త ధైర్యం తెచ్చుకుని, చిత్ర వైపు చూస్తూ,
"అది....ఈశ్వర్ basic గా చాలా మంచోడు. కానీ బయటకి అలా కొంచెం కరుకుగా కనిపిస్తుంటాడు. వాడి life లో చాలా bad phase చూసాడు వాడు. అందుకే అలా" ఒక్క క్షణం ఆగి గొంతు సవరించుకొని , " వాడి విషయం లో కాస్త ఓపికగా ఉండండి. వాడు చెడ్డోడు ఐతే కాదసలు".
తన మాట ముగించిన ఆదర్శ్ కి తన ఆఖరి వాక్యం కాస్త వికారమైనదిగా తోచింది. ఇంకేమి మాట్లాడాలో అతనికి అర్థం కాలేదు.
"అయ్యో, తెల్సన్నా! గీన చాన మంచోడని".
"మ్మ్మ్ం....అలా అనే కాదు....మీ personal విషయాల్లో వేలు పెడుతున్నా అనుకోకండి. ఒక వేల ఈశ్వర్ వల్ల ఏదైన ఇబ్బంది కలిగినా, అది వాడు కావాలని చేసుండడు."
"అయ్య, అట్లేం లేదు. అసలు గాయ్న వల్ల నాకు ఇబ్బందెందుకు అయితది?" అంది చిత్ర కృత్రిమమైన చిరునవ్వు తెచ్చుకుని.
ఆమెకు తన భర్త గురించి తనకే చెప్పడం నచ్చలేదసలు. కానీ మనస్సులో ఒక మూలన తన భర్త యొక్క స్నేహితుడు తన భర్త పై చూపిస్తున్న శ్రద్ద బాగా నచ్చిందామెకు.
" మరోలా అనుకోకండి. ఈశ్వర్ నాకు college లో నుండి తెలుసు. చాలా దెగ్గరిగా చూసా వాడిని. అందుకే ఏదో మాట్లాడాలి అనిపించింది అంతే.... sorry if i said anything wrong." అన్నాడు ఆదర్శ్ కాస్త మొహమాటపడుతూ.
"అయ్య, మీరు సారి ఎందుకు జెప్తుర్రన్నా ?! మీ లాంటోళ్ళె ఏమన్న అయినగూడ మా ఇద్దరికి దైర్యంగ ఉంటరు.... మీకు జెర కుదిరినప్పుడు ఈనకు జెర ఫోను జేస్తుండండి. మీతోని మాట్లాడితె జెర కుష్ అయితడీన." అంది చిత్ర, ఆదర్శ్ తనను క్షమాపణ అడిగిన విషయమై కాస్త నొచ్చుకుంటూ.
ఆదర్శ్ కి మనస్సులో ఒకేసారి చిత్ర పట్ల జాలి, ఈశ్వర్ విషయం లో కాస్త ఊరట రెండూ కలిగాయి. ఏదేమైనా చేసి, చిత్ర తన ప్రేమ తో అమృతని మరిపింపచేస్తే అదే చాలనుకున్నాడు ఆదర్శ్. ఆదర్శ్ మనస్సులో ఏదో ఆలోచిస్తున్నట్టుగా గ్రహించింది చిత్ర. అమృత గురించే అయ్యుంటుందని భావించిందామె. ఆదర్శ్ తనతో అమృత ని ఉద్దేశించే పై మాటలు మాట్లాడుంటాడని గ్రహించింది చిత్ర.
"మీరు ఏం జేస్తుంటరన్నా ?" అడిగింది చిత్ర, మధ్యలో వికారంగా ఆగిపోయిన సంభాషణ ని కొనసాగించడానికి.
" నేను statistician ని. i work for central government." బదులిచ్చాడు ఆదర్శ్.
"అంటే ?!" అని అడుగుదామనుకుని, తన అగ్న్యానం బహిర్గతమౌతుందేమో నని తన మాటను విరమించుకుంది చిత్ర.
తను పెద్దగా చదువుకోని వైనం తన భర్త కు కాస్త పరువు తక్కువ విషయం గా భావించింది చిత్ర. కనీసం ఇంటర్మీడియెట్ వరకైనా తను చదువుకొని ఉంటే బావుండేదని అనిపించిందామెకు ఆ క్షణం.
కాలింగ్ బెల్ మూడు సార్లు మోగింది.
" ఈన ఒచ్చిండు." అంటూ తలుపు దెగ్గరికి వెళ్ళింది చిత్ర.
చిత్రని కలిసాక , తన స్నేహితుడైన ఈశ్వర్ అమృత ప్రస్తావన తెస్తే ఎలా స్పందించాలో తెలియకుండా మారింది ఆదర్శ్ కి. అమృత చనిపోయిన తరువాత ఎన్నో సార్లు ఆమె విషయమై తన స్నేహితుడితో కలిసి ఎన్నో మాటలను పంచుకున్న ఆదర్శ్ కి ప్రస్తుత పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తోచింది. చిత్ర లో ఈశ్వర్ పట్ల ఏదో తెలియని శ్రద్ద, అంతకు మించి అతని పట్ల ఆమె ఏదో పాశాన్ని ఏర్పరుచుకున్నట్టుగా కనిపించింది ఆదర్శ్ కి. అమృత పట్ల ఈశ్వర్ కి ఉన్న ' విధేయత ' గుర్తొచ్చి, చిత్ర, ఈశ్వర్ ల కాపురం ఏమవుతుందో నన్న భయం కలిగిందతడికి ఒక్క క్షణం.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
చిత్ర తలుపు తెరిచే సరికి, తన వైపు నవ్వుతూ వస్తున్న ఈశ్వర్ ని చూసాడు ఆదర్శ్. ఈశ్వర్ కి ఏదో స్పష్టమైన మార్పు కనిపించింది ఆదర్శ్ కి.
*****
చిత్ర చేసిన వెజ్ బిర్యాని చిత్రకి తప్ప మిగిలిన ఇద్దరికీ చాలా రుచికరంగా తోచింది.
' ఏందో ఏమో, గీ మనిషొక్కడే గిట్ల సప్పగ తింటడనుకున్న. నేను తప్ప ప్రపంచముల ఉన్నోళ్ళందరు గిట్లనే ఉన్నట్టున్నరు సప్ప కూడు తినుకుంట. ' అనుకుని నిట్టూర్చింది చిత్ర తన మనస్సులో.
తిన్నాక ఈశ్వర్, ఆదర్శ్ లు బయటకి కార్ లో బయలుదేరారు.
అమృత ని మెల్లిగా మరచిపోతున్న తన భర్త కి తన స్నేహితుడి వల్ల గతం మరింతగా గుర్తుకు వస్తుందేమో నని భయపడింది చిత్ర.
కానీ తన భర్త యొక్క శ్రేయోభిలాషి గా తోస్తున్న ఆదర్శ్ అతన్ని బాధ పెట్టకుండా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాడని తనకు తాను సర్ది చెప్పుకుంది చిత్ర.
తను చేసిన వెజ్ బిర్యానీ పై తను చేసుకున్న ' ప్రత్యేకమైన కారప్పొడి ' ని చల్లుకుని తినసాగింది చిత్ర.
తింటున్నంత సేపూ ఆమెకు తన భర్త , అమృత లే గుర్తుకు రాసాగారు. ఒక వేళ తన భర్తకు అమృత గురించే మాట్లాడాలి అనిపించి ఆదర్శ్ తో ఆమె గురించి మాట్లాడినా పరవాలేదనుకుంది చిత్ర. తన భర్త అమృత విషయం లో తనకు చెప్పుకోలేని బాధంతా తన స్నేహితుడి తో చెప్పుకుంటే మేలనుకుంది. ఒక్క క్షణం ఆమెకు అమృత గురించి తనకు తెలిసిన విషయం తన భర్త కు తెలిసింటే బావుండును అనిపించింది. అప్పుడు అతనికి అమృత గుర్తొచ్చినప్పుడల్లా ఆ బాధని తనతో పంచుకునే వీలుంటుందని భావించింది చిత్ర.
' క్రిష్నయ్యా, అసలు ఏందో ఏమో గిదంత అర్తమే గాదు నాకు అప్పుడప్పుడు. కాని ఈశ్వరు మంచిగ, సంతోషంగ ఉంటే మాత్రం చానా బావుంటది నాకు సూడనీకె. నిన్ను చానా సార్లు అడిగిన, మళ్ళ అడుగుతున్న, జెర మంచిగ సూడు గాయ్నని బాదపెట్టకుండగ.... గా మనిషి చానా మంచోడు. బంగారం... ఎట్లనో అనిపిస్తది నాకు, గాయ్న బాదపడ్తె. నువ్వు గా అమృతని నీ కాడికి దబ్బున తీస్కపొయ్నవ్ గాబట్టి జెర నీ మీద కోపమైతడు గా మనిషి .... నీకెమన్న కోపముంటె నా మీద సూపియ్... ప్చ్ , గిన్ని సార్లు అడిగిచ్చుకోకు నాతోని, జెర మంచిగ సూడు గా మనిషిని, ఎప్పుడు సంతోషంగ ఉండెటట్టు సూడు.' , రామాచార్యులు ఆమెకు ఇచ్చిన కృష్ణుడి బొమ్మ కలిగిన పాకెట్ కాలెండర్ ని చూస్తూ మనస్సులో అనుకుంది చిత్ర.
****
ఈశ్వర్ , ఆదర్శ్ లు ఇద్దరూ హైదరాబాద్ రోడ్ల పై తిరిగీ, తిరిగీ సాయంత్రం వారిద్దరికీ ఇష్టమైన టాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. బుద్ధుడిని చూస్తూ కారం తక్కువగా వేయించుకున్న చూడువా తినసాగారు ఇద్దరూ. కాసేపు సాఫ్ట్ వేర్ ముచ్చట్లు పెట్టుకోసాగారు ఇద్దరూ.
తను ఆదర్శ్ ని కలిసిన ప్రతిసారీ జరిగే ఏదో ఒక క్రియ అప్పుడు జరగనట్టుగా తోచిందతడికి. చాలా సేపటికి తనకు అమృత గురించి మాట్లాడాలన్న విషయం గుర్తుకు వచ్చింది. ' తన ' అమృత గురించి మాట్లాడటం తను మరచిపోవడం ఏంటన్న అపరాధభావం తో కూడిన ప్రశ్న కలిగిందతడికి. అమృత విషయమై ఏదోటి గుర్తు తెచ్చుకుని ఆదర్శ్ తో మాట్లాడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఈశ్వర్. కానీ ఏం మాట్లాడాలో ఎంత ఆలోచించినా అతనికి అర్థం కావట్లేదసలు. తను అమృత గురించి మాట్లాడలేక పోవడానికి చిత్ర నే కారణంగా తోచింది ఈశ్వర్ కి. అసలు చిత్ర కి తనకూ, తన అమృతకూ నడుమన వచ్చేంత ప్రాధాన్యత తాను ఎందుకిస్తున్నాడో అర్థం కాలేదు ఈశ్వర్ కి. తనే అనవసరంగా చిత్రకు ఇవ్వవలసినదానికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా నిర్దారించుకున్నాడు ఈశ్వర్. గత కొంత కాలంగా అమృతని తాను పెద్దగా ' పట్టించుకోనట్టుగా ' తోచింది ఈశ్వర్ కి. ఇకపై అమృత కు మళ్ళీ పాత ప్రాధాన్యత ఇచ్చి, చిత్ర వల్ల తను తన అమృతకు దూరం కాకుండా తగు జాగ్రత్తలు తీస్కోవాలని నిశ్చయించుకున్నాడు ఈశ్వర్.
తన స్నేహితుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టుగా అర్థం చేసుకున్నాడు ఆదర్శ్. విషయమేంటని అడగబోయి, అది అమృత గురించే అయ్యుంటుందని భావించి, తన స్నేహితుడు ఇప్పుడు అమృత ప్రస్తావన తెస్తే ఏం చెప్పాలో తెలియక అయోమయానికి గురవసాగాడు ఆదర్శ్. చిత్రని కలిసాక ఎందుకో అతడికి అంతకు ముందులా అమృత విషయమై ఈశ్వర్ తో మాట్లాడాలనిపించట్లేదు. ఈశ్వర్ , ఆదర్శ్ లు ఇద్దరూ లోలోన అమృత , చిత్ర ల గురించి ఆలోచిస్తూ, సంభాషణను కొనసాగించడానికి పైకి పొడి పొడిగా వారి వారి ఉద్యోగ సంబధమైన చర్చ ని పెట్టుకున్నారు.
***
పొద్దున మిగిలొపోయిన ఇడ్లీ పిండి తో ఈటీవీ అభిరుచి చానెల్ లో చూసి నేర్చుకున్న ఊతప్పం లను వండింది చిత్ర. ఈశ్వర్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా తోచింది చిత్రకి. అతనికి అమృత గుర్తొచ్చి ఉంటుందని గ్రహించింది చిత్ర. అమృత గురించి తను ఊహించినంత ' తనివితీరా ' తన భర్త మాట్లాడలేకపోయాడేమో నని భావించింది చిత్ర. తన ప్రాణ స్నేహితుడితో తన మనస్సుని పూర్తిగా ఎందుకు పంచుకోలేక పోయుంటాడో తెలియక ఆశ్చర్యపోయింది చిత్ర. ఏదేమైనా వచ్చే రెండు, మూడు రోజులు తన భర్త ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలనుకుంది చిత్ర. అతనికి ఏ విధమైన కలత కలగకుండా చూసుకోవాలని అనుకుంది.
ఆదర్శ్, ఈశ్వర్ లు ఇద్దరూ తిన్నాక వాకింగ్ కి బయలుదేరారు.
***
ఈశ్వర్ ఆదర్శ్ కి తను రోజు పడుకునే గదిలోని మంచం పై పడుకోమని చెప్పాడు. చిత్ర ఆ విషయాన్ని గమనిస్తూ ఉంది. తన భర్త సోఫా పై పడుకోబోతున్నాడని గ్రహించిందామె. అతని బదులు సోఫా పై తనే పడుకోవాలని నిర్ణయించుకుంది. కానీ తన భర్త తనని బాగా చూసుకోవడం లేదని అతని స్నేహితుడు భావిస్తాడేమో నని తోచింది చిత్రకు. పైగా తను అలా పడుకుంటే తన భర్తను అపరాధభావానికి లోను చేసినదైతుందని భావించిందామె. తన గదిలోకి వచ్చి, మెత్త, చెద్దరు తీసుకుని సోఫా దెగ్గరికి బయలుదేరుతున్న తన భర్తతో
" ఇదో... ఇట్లంటున్ననని ఏమనుకోకు.... మీ దోస్తు ముందర నువ్వు గిట్ల సోఫాల పండుకుంటే నువ్వు గాయ్న ముందు తక్కువయితవ్ అనిపిస్తది నాకు... నాకు అట్ల మంచిగనిపియ్యదు... నేను నీకు అస్సలు తాకకుండగ పండుకుంట. నన్ను నమ్ము. నువ్వు గిదొక్కరోజు గీ రూములనే పండుకో." అంది చిత్ర.
ఈశ్వర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక, చప్పుడు చేయకుండా చిత్ర రోజూ పడుకునే మంచం పై పడుకున్నాడు ఒక మూలకు. చిత్ర మరో మూలకు పడుకుంది. నిద్రలో అటూ , ఇటూ పొర్లే అలవాటున్న చిత్ర, ఈ రాత్రికి మాత్రం అస్సలు కదలకుండా, అస్సలు తన భర్తకు తాకకుండా పడుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇద్దరూ తమ , తమ దుప్పట్లను కప్పుకున్నారు. కానీ వారిద్దరికీ త్వరగా నిద్ర పట్టలేదు , ఒకరి ని గూర్చి మరొకరు చేస్తున్న ఆలోచనల వల్ల.
---------------------సశేషం. ----------------------
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,353
Threads: 0
Likes Received: 6,812 in 5,171 posts
Likes Given: 70,112
Joined: Feb 2022
Reputation:
87
అద్భుతమైన అప్డేట్ ఇచ్చారు
Good Writing
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
ముడి - 21
ఆదర్శ్ ని airport లో drop చేయడానికి వెళ్ళాడు ఈశ్వర్. అతని మనస్సులో ముందు రోజు రాత్రి తనతో చిత్ర మాట్లాడిన మాటలే మెదులుతూ ఉన్నాయి. తన స్నేహితుడైన ఆదర్శ్ ముందు తను తక్కువ కాకూడదని చిత్ర అనుకోవడం అతని మెదడులో తిరుగుతూ ఉంది. తన స్నేహితుడైన ఆదర్శ్ తో ఏదో విషయం మాట్లాడాలి అని ఉన్నా, అతని నోటికి చిత్ర గురించి ఆలోచనలు అడ్డుపడుతూ ఉన్నాయి.
తన స్నేహితుడైన ఈశ్వర్ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టుగా గమనించాడు ఆదర్శ్. అది బహుశా అమృత గురించో లేక చిత్ర గురించోనని భావించాడు. తాను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే మంచిదనుకున్నాడు ఆదర్శ్. ఆలోచనల సుడిలో బండి నడుపుతున్న ఈశ్వర్ airport చేరుకున్నాడు.
తన స్నేహితుడి దగ్గర సెలవు తీసుకుంటున్న ఆదర్శ్ అతన్ని గట్టిగా హత్తుకున్నాడు.
" మామా, I am very happy for you రా." అన్నాడు ఆదర్శ్. తన స్నేహితుడికి చిత్ర గుర్తుకు వచ్చి అన్న మాటలవి అని ఈశ్వర్ గ్రహించగలిగాడు. చనిపోయిన అమృత పట్ల తన 'విధేయత ' ని ప్రపంచం లో అందరికన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నాడని తను భావించే ఆదర్శ్ కూడా తన జీవితం లోకి చిత్ర రావడాన్ని అంగీకరించడం మింగుడు పడలేదు ఈశ్వర్ కి. ఒక్క క్షణం ఒంటరి వాడయిన భావన కలిగిందతడికి. కృత్రిమమైన చిరునవ్వు ప్రతిగా చేశాడు ఈశ్వర్. ఇకపై తను ' మాట్లాడుకోవడానికి ' అమృత సరిపోతుందనీ, ఇంకెవరూ తనకు అక్కర్లేదనీ నిశ్చయించుకున్నాడు ఈశ్వర్. చిత్ర ఏం చేసినా తన మనస్సులో ఉన్న అమృత బొమ్మని చెరపలేదని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు ఈశ్వర్. తన స్నేహితుడి తో వీడ్కోలు కార్యక్రమం అయిపోయాక, కారు లో తిరుగు ప్రయాణాన్ని ఆరంభించాడు ఈశ్వర్.
అప్రయత్నంగా ఒక్కో విషయాన్ని పరిగణం లోకి తీసుకుంటూ చిత్ర కన్నా అమృతే నయమని పదే పదే తనతో తాను చెప్పుకోసాగాడు ఈశ్వర్. అమృత రూపాన్ని తలుచుకోసాగాడు ఈశ్వర్. ఆమెతో గడిపిన క్షణాలూ, ఆమెతో మాట్లాడిన ఊసులూ, ఆమెతో పడిన చిలిపి తగాదాలూ, వారు 'ఏకమైన ' క్షణాలూ, ఆమెకు చేసిన బాసలూ ఒక్కొక్కటిగా అతని కళ్ళ ముందు మెదలసాగాయి. 'తన ' అమృత ని ఈ మధ్య ఎక్కువగా గుర్తు తెచ్చుకోని విషయం అతని గుర్తుకు వచ్చింది. దానికి కారణం చిత్రే నని బలంగా తన మనస్సులో అనుకోసాగాడు ఈశ్వర్. ముందు తాను సరిగా ఉంటే చిత్ర కి ఆ అవకాశం ఉండేది కాదన్న భావన కలిగిందతడికి. ఇకపై చిత్ర కి దూరంగా ఉండాలని 'మరోసారి ' నిశ్చయించుకున్నాడు ఈశ్వర్.
ఇంకో ఇరవై నిమిషాల్లో తన అపార్ట్మెంట్ కి చేరుతాడనగా అసలు తాను చిత్రని ఎందుకు దూరం పెట్టాలి అనుకుంటున్నాడన్న సందేహం కలిగింది ఈశ్వర్ కి. చిత్ర ద్వారా కూడా తను ప్రేమని పొందగలనేమో నన్న సందేహం కలిగింది ఈశ్వర్ కి. బ్రతికున్నప్పుడు తన వైపు అమృత చూసినప్పుడు ఆమెలో కనిపించే మెరుపు, చిత్ర కళ్ళల్లో కూడా కనిపించినట్టుగా గుర్తు రాసాగింది అతనికి. తన పెళ్ళైన తరువాత చిత్రకు, తనకు మధ్య జరిగిన సన్నివేశాలన్ని అతని కళ్ళ ముందు కదలాడసాగాయి. చిత్ర కి అమృత గురించి తెలుసేమో నన్న అనుమానం కలిగింది ఒక్క క్షణం ! ఆలోచనల సుడిలో మరింతగా కొట్టుకుపోతున్నట్టుగా అనిపించింది ఈశ్వర్ కి. ఇంకాసేపైతే మళ్ళీ తను చిత్ర దెగ్గరకు వెళ్ళబోతున్నట్టు గుర్తొచ్చింది ఈశ్వర్ కి. చిత్ర ని చూడాలని పించలేదు ఈశ్వర్ కి. తనను అంతగా 'నియంత్రిస్తున్న ' చిత్ర నుంచి కాసేపు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్. రోడ్డు పై ఉన్న యూ టర్న్ తీసుకుని, తనకు మొదటిసారి అమృత కనిపించిన చోటు వైపుగా ప్రయాణాన్ని ప్రారంభించాడు ఈశ్వర్ !
***
కాలింగ్ బెల్ మూడు సార్లు మోగకపోయే సరికి, వచ్చేది తన భర్త కాదని అర్థం చేసుకుని, నిట్టూరుస్తూ తలుపు తీయటానికి వెళ్ళింది చిత్ర. తలుపు తెరిచిన తనకు ఎదురుగా వాచ్ మెన్ ఓంకార్ భార్య అయిన జ్యోతి కనిపించింది.
"లోపటికి రా జోతి. ఏమి ఇట్లొస్తివి ?" అంది చిత్ర.
" ఉండనీ మేడం. అదీ, మేము కొంచం తొందరలో ఉన్నాము. అర్జంటుగా ఊరికి వెళ్ళాల్సొస్తోంది. దాని విషయం మాట్లాడడానికే ఇప్పుడు వచ్చా." అంది జ్యోతి.
"ఓ.. ఏమి గింత సడనుగ పోతున్నరు ?! ఏమన్న పని పడ్డదా?"
"అదీ. మీకు తెలుసు కద మేడం మా పొలం పంచాయితీ లో ఉందని.. దాని విషయమయ్యే వెళ్తున్నాం."
" హా అవ్నవ్ను జెప్పినవ్ నాకు, గుర్తుంది.... ఏమీ సంగతి?"
" మా పక్క పొలం వాళ్ళు మా పొలం కంచె దాటి వస్తున్నరట... మాకున్నది మా పొలమొక్కటే మేడం . అదున్నదన్న ధైర్యం తోటే చదివిస్తున్నాం మా పిల్లల్ని." అంది జ్యోతి, పొలం పరుల పాలౌతుందేమో నన్న భయానికి లోనౌతూ.
"అయ్య అట్లేం గాదులె. మీరు దైర్యంగ ఉండండి. అన్నిటికి గా క్రిశ్నయ్య ఉంటడు. మీరైతె ఊకె ఎవ్వర్ని నమ్మకండి ఊర్ల. ఏం జెయ్యాలనుకున్నా ఎక్కువ మందికి తెల్వకుండ ఉండేలాగ సూస్కోండి. అర్తమవుతుందా ?" అంది చిత్ర, ధైర్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తూ.
" హా సరే మేడం... అదీ, పిల్లల విషయం మీ గురించి మాట్లాడడానికే వచ్చా నేనిప్పుడు." అంది జ్యోతి కాస్త మొహమాటపడుతూ.
" అయ్యో జెప్పు ఏమి ?"
విషయాన్ని ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు జ్యోతి కి.
"అదీ.. ఈన కొంచం తెంపరి మేడం. ఊరికే కోపమొస్తే అరుస్తుంటాడు. ఎన్ని సార్లు చెప్పినా మారడు ఆ మనిషి. ఇప్పుడు ఊరికి ఒక్కడినే పంపితే ఏమవుతుందో నని భయం నాకు. పక్కన నేనుంటే నన్న జెర కంట్రోలు ల ఉంటడు మనిషి. అయినా ఈడ నేనిక్కడ ఉంటే అక్కడ ఏమౌతుందో నని భయం వేస్తూ ఉంటుంది నాకు చాల..."
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
చిత్ర జ్యోతి తనని ఏమడగబోతుందో ఊహించగలిగింది. కానీ ఆమె నోటి వెంట అడిగేవరకూ ఊరుకోవాలనుకుంది.
" పిల్లల్ని కూడ మాతో తీసుకుపోదమంటె వాళ్ళ చదువు పాడౌతుందని ఈనకి భయం మేడం. వాళ్ళు బాగా చదివి మంచిగ సెటిలవ్వాలనే గదా మేమిద్దరం కష్టపడుతున్నది.... అందుకే... మేము వచ్చే వరకు పిల్లల్ని మీ దెగ్గర ఉంచితే... రెండు, మూడు రోజులల్లో ఒస్తాము మేడం. వాళ్ళేం అల్లరి చేయరు. అపార్ట్మెంట్ లో మీరే బాగా మాట్లాడతారు మేడం మాతో. అందుకే ఇలా మిమ్మల్నే అడుగుతున్నా. పిల్లలిద్దర్నీ ఒంటరిగా ఒదిలి పోవాలంటే భయమౌతోంది, పొద్దున లేస్తే టివి లల్ల ఏమేమో చెప్తున్నరు. రెండు, మూడు రోజుల్లో వచ్చేస్తాం మేడం మేము. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాం ..."
అంటూ మొహమాటంగా తన మాటల్ని కొనసాగిస్తున్న జ్యోతికి అడ్డుపడుతూ
" అయ్యో, దాందేముంది ?! ఉంటరు గాని మంచిగ ఈడనే ఇద్దరు. నాకు గూడ మస్తు టైం పాసు అవ్తది మంచిగ, సాయంత్రం పూట." అంది చిత్ర జ్యోతి యొక్క మొహమాటాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ.
" అదీ.... మరి సార్ కి నచ్చుతుందో లేదో ?! సార్ కి కోపం వస్తుందేమో నని ...." సణగసాగింది జ్యోతి.
జ్యోతి యొక్క ఉద్దేశం అర్థమయ్యింది చిత్ర కు. తన భర్త ఏదో రాక్షసుడైనట్టుగా భావిస్తున్న జ్యోతి పై ఆమెకు కోపం కలిగింది. తన భర్త పై అపార్ట్మెంట్ లో ఏర్పడ్డ ముద్రను మార్చే ప్రయత్నం చేయాలనుకుంది చిత్ర.
" ఈశ్వరు నిన్ను గాని, మీ ఆయనని గాని ఎప్పుడన్న ఏమన్న అన్నడా ?"
" అయ్యో లేదు మేడం."
" పోనీ, మీకేమన్న ఇబ్బంది జేశిండా ?"
" అయ్యో, లేద్లేదు."
" మళ్ళ ?!"
"అయ్యో అయ్యో... నా ఉద్దేశం అది కాదు మేడం. సార్ పనికి ఏదైనా అడ్డుగా ఉంటుదేమో నని అంతే." చిత్ర కు కోపం కలగడం ఊహించని పరిణామంగా భావించిన జ్యోతి, వ్యవహారానికి హాని జరగకుండా ఉండేలా జాగ్రత్తగా ఉండాలనుకుంది.
" పక్కన పిడుగులు పడ్తున్నగూడా గా మనిషి పనిల ఉన్నడంటె దిక్కు గూడ సూడడు. మీ పిల్లల వల్ల గాయ్నకు ఇబ్బందేమి ఉండదు గాన్లె." అంది చిత్ర, తన వైపు కనీసం చూడకుండా లాప్టాప్ లోపలికి వెళ్తాడేమో అన్నట్టుగా పనిచేసుకునే తన భర్తను తలుచుకుంటూ, నవ్వుతూ.
చిత్ర చేసిన హాస్యానికి నవ్వీ, నవ్వనట్టుగా నవ్వింది జ్యోతి, దానికి చిత్ర ఎలా స్పందిస్తుందో నన్న భయం తో. 'పెద్దోళ్ళ ' తో వ్యవహారం లో జాగ్రత్తగా మెలగాలని మరోసారి రుజువైందని భావించుకుంది జ్యోతి. ఒక్క క్షణం తన పిల్లలు ఈశ్వర్, చిత్ర లకు భారంగా తోస్తారేమో నన్న సందేహం కలిగిందామెకు.
తాను హఠాత్తుగా కోపం తెచ్చుకునే సరికి జ్యోతి తన పిల్లల విషయం లో కాస్త సందేహిస్తున్నదని గ్రహించింది చిత్ర. ఒక్క క్షణం ఆమెకు జ్యోతి ని అనవసరంగా అన్నానేమో నన్న అపరాధ భావం కలిగింది. కానీ తిరిగి, తన భర్త గురించి ప్రతికూలమైన మాటలు మాట్లాడినప్పుడు సహించేది లేదని మనస్సులో అనుకుంది చిత్ర.
పిల్లలిద్దరూ క్షేమంగా ఉండేలా తాను బాగా చూస్కుంటా నని ఆమెకు అర్థమయ్యే మార్గం కోసం ఆలోచించసాగింది చిత్ర.
" అదీ... నా ఫోను నెంబరు రాసుకో. ఊరు కాడ నీకు పిల్లలు గుర్తుకు వొచ్చినప్పుడు మాట్లాడనీకె ఉంటది. " అంది చిత్ర.
*****
అమృత చనిపోయాక ఎన్నో సార్లు ఆమెను మొదటిసారి చూసిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎంతో భావోద్వేగానికి లోనయ్యేవాడు ఈశ్వర్. కానీ అతనికి ఈసారి తాను అనుకున్నంత భావోద్వేగం కలగలేదు. అమృతకు తాను దూరం అవ్తున్నట్టుగా అనిపించింది ఈశ్వర్ కి. ఇలా తను అమృత కు దూరం కావడానికి చిత్రే కారణంగా అనిపించింది ఈశ్వర్ కి. ఒక్కసారిగా చిత్ర పై మునుపెన్నడూ లేని అక్కసు కలిగిందతడికి.
కాలింగ్ బెల్ మూడు సార్లు మోగడం తో వడివడిగా తలుపుల వద్దకు అడుగులు వేసింది చిత్ర. తలుపు తీయబడిన తరువాత
"ఏమి గింత సేపయ్యింది ?!" వాకబు చేసింది చిత్ర.
" ఫలానా టైం కి వస్తా అని నేనెప్పుడూ నీకు చెప్పలేదు కదా ?! " అన్నాడు ఈశ్వర్, చిత్ర ను ' దూరంగా ' ఉంచే కార్యక్రమాన్ని ' మొదలుపెడుతూ ' .
పుసుక్కున నవ్వింది చిత్ర, తన భర్త హాస్య చతురత చూపిస్తున్నాడని భ్రమపడి.
చిత్ర నుంచి ఊహించని ప్రతిస్పందన ఎదురయ్యే సరికి, ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఈశ్వర్ కి.
హాల్లో చాప మీద కూర్చుని, హోం వర్క్ చేసుకుంటున్న రేణుక, రాజేష్ లపై ఈశ్వర్ కంటి చూపు పడింది.
ఈశ్వర్ ని గమనించిన చిత్ర అతని తో
" ఏమ్లే... వాళ్ళమ్మోళ్ళు ఊరికి పోతుర్రంట, గదే ఆ రోజు జ్యోతి జెప్పింది గద పొలం పంచాయితి అని. ఇంగ పిల్లలని మనింట్ల రెండు దినాలు ఉంచుత అంటె, సరే ననే జెప్పిన." అంది చిత్ర, చిరు మందహాసం చేస్తూ.
మౌనంగా ఉండిపోయాడు ఈశ్వర్.
" నీకేమన్న ఇబ్బందవ్తదేమో నని బయపడ్డరు అనోసరంగ. నీకేమి ఇబ్బంది గాదని జెప్పిన." అంది చిత్ర, కాస్త ఆప్యాయత నిండిన స్వరం తో.
చిత్ర కళ్ళల్లో, మాట లో తడితనాన్ని సహించలేక పోయాడు ఈశ్వర్. విఛ్ఛిత్తత కూడిన స్వరం తో
" నాకు ఇబ్బంది అవదని నీకు చెప్పానా ?! " అన్నాడు ఈశ్వర్.
రాజేష్, రేణుక లు ఇద్దరు హోం వర్క్ చేయడం మానేసి వారిరువురి వంక చూడసాగారు.
తన భర్త నుండి ఊహించని ప్రతిస్పందన ఎదురయ్యే సరికి మనసులో కలుక్కుమంది చిత్ర కి. ఆ పిల్లల తల్లైన జ్యోతి వద్ద తన భర్త ను వెనకేసుకొచ్చిన వైనం గుర్తుకు వచ్చి, ఆ పిల్లల ముందు తాను అవమాన పడ్డట్టుగా భావించుకుంది చిత్ర.
చిత్ర పై తన అక్కసు తీర్చుకున్నానని కాస్త ఉపశమనం పొంది తన గదిలోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్. చిత్ర ను అనవసరంగా బాధ పెడుతున్నానేమో నన్న అపరాధభావాన్ని తొలగించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ, అమృత ని తలుచుకుంటూ, తను చేసిన పనికి తనకు తాను విమోచనము చేసుకుంటూ తనకిష్టమైన చార్లీ చాప్లిన్ సినిమా చూడసాగాడు ఈశ్వర్. అతని మెదడు నిండా చిత్ర గుర్తుకు రాసాగింది. బలవంతంగా నవ్వు రాకున్నా గట్టిగా నవ్వుతూ సినిమా చూడసాగాడు ఈశ్వర్.
***
సినిమా చూస్తూ, విసుగును అనుభవిస్తున్న ఈశ్వర్ కి చిత్ర యొక్క పట్టీల శబ్దం వినబడింది. అయత్నకృతంగా తల ఎత్తబోయి, చిత్ర ని దూరంగా ఉంచాలన్న తన ' సంకల్పం ' గుర్తుకు వచ్చి, మూకీ సినిమా సౌండ్ పెంచి చూడసాగాడు ఈశ్వర్.
" ఇదో .... ఇదో.... ఇదో"
కావాలని మూడవ సారికి పలికాడు ఈశ్వర్.
" అన్నమయింది. మామిడికాయ పప్పు జేశిన. పుల్లగుంది కాయ మంచిగ. దా తిందువు గాని." అంది చిత్ర.
చిత్ర పిలిచిన వెంటనే వెళ్ళొద్దనిపించింది ఈశ్వర్ కి.
" పని మీదున్నాను కదా . కనిపించట్లేదా ?!" అని అందామనుకుని, తన 'కొత్త రకం ' ప్రవర్తన తనకే మింగుడుపడనట్టుగా అనిపించే సరికి, చిత్ర వైపు చూస్తూ,
" ఒక్క ten minutes." అన్నాడు ఈశ్వర్, తనకు అలవాటు లేని పనులు చేయడం తన వల్ల కాదనుకుంటూ.
ఏమైనా అద్భుతం జరిగి, చిత్రే తనకు దూరంగా ఉండింటే బావుండుననుకున్నాడు. ఒక్క క్షణం చిత్ర కళ్లల్లోకి చూశాడు ఈశ్వర్. అంతకు మునుపు, వాచ్ మెన్ పిల్లల విషయం లో తను కరుకుగా అన్న మాట తాలూకు ప్రభావం ఏమాత్రం కనిపించలేదు ఆమె మోము లో అతడికి. మళ్ళీ అదే మెరుపు కనిపించింది ఆమె కళ్ళల్లో. లోలోన ఒక అసహాయతపు నిట్టూర్పు విడిచాడు ఈశ్వర్.
"అట్లే, నీ ఇష్టం. నువ్వెప్పుడంటె, గప్పుడే." అంటూ వెళ్ళిపోయింది చిత్ర నవ్వుతూ.
ఆ సినిమాని ఏడు నిమిషాలకు మించి చూడలేక పోయాడు ఈశ్వర్.
హాల్లోకి వచ్చిన ఈశ్వర్ కి, సోఫా పైన కూర్చుని టి.వి చూస్తున్న రేణుక, రాజేష్ లు కనిపించారు. ఈశ్వర్ పాదాల అలికిడికి వాళ్ళిద్దరూ అతని వైపు చూశారు.
----------------------సశేషం . ----------------------
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,353
Threads: 0
Likes Received: 6,812 in 5,171 posts
Likes Given: 70,112
Joined: Feb 2022
Reputation:
87
•
Posts: 768
Threads: 0
Likes Received: 1,233 in 688 posts
Likes Given: 3,062
Joined: Jun 2020
Reputation:
41
(08-10-2023, 07:05 PM)k3vv3 Wrote: చిత్ర జ్యోతి తనని ఏమడగబోతుందో ఊహించగలిగింది. కానీ ఆమె నోటి వెంట అడిగేవరకూ ఊరుకోవాలనుకుంది. Nice story, K3vv3 garu!
•
Posts: 1,665
Threads: 3
Likes Received: 2,352 in 1,191 posts
Likes Given: 3,182
Joined: Nov 2018
Reputation:
46
బావుంది సార్, ముడి అని కాకుండా "తడి (మనసులో)" అని పెట్టుంటే బావుండేది
: :ఉదయ్
The following 1 user Likes Uday's post:1 user Likes Uday's post
• k3vv3
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
ముడి – 22
వారి కళ్ళల్లో తన పట్ల కాస్త భయం కనిపించింది ఈశ్వర్ కి. ఇందాక తను చిత్ర తో ' ప్రయత్నించిన ' ప్రవర్తన వల్ల ఆ పిల్లలు బాధ పడ్డారేమో నన్న అపరాధ భావం కలిగింది ఈశ్వర్ కి. కనీసం ఆ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకైనా ఏలాంటి ' ప్రయోగాలు ' చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్!
కంప్యూటర్ ముందు పని చేసుకుంటున్న తన భర్త అలసిపోయాడని గుర్తించి, అతని రూం దెగ్గరికి వెళ్ళింది చిత్ర.
కంప్యూటర్ లోని కోడింగ్ తో విసిగి, వేసారిన ఈశ్వర్ కళ్ళకు చిత్ర యొక్క నగుమోము ఉపశమనం లా తోచింది. ఆమె కళ్ళు, ఆమె నవ్వు, చాలా ఆకర్శణీయంగా తోచాయి ఈశ్వర్ కి.
"ఇదో, నేను చాయ్ తాగుదమనుకుంటున్న . నీగ్గూడ చెయ్యమంటవా ?" అడిగింది చిత్ర.
తనకు అలసటగా అనిపించి, తన నాలుక చాయ్ ని కోరుకున్నప్పుడే చిత్ర కు కూడా ఛాయ్ తాగాలని ఎలా అనిపిస్తుందోనని ఆశ్చర్యం కలిగింది ఈశ్వర్ కి.
తనకు తలనొప్పిగా ఉన్నప్పుడల్లా తన తలకు నూనె పెట్టి అమృత మర్దనా చేస్తుండే విషయం గుర్తొచ్చింది ఈశ్వర్ కి. ఒక్క క్షణం అతనికి చిత్ర తనకు దెగ్గరయ్యింటే బాగుండుననిపించింది. గత మూడేళ్ళుగా మనుషుల యొక్క ఆత్మీయ స్పర్శ లకూ, ఆత్మీయ మాటలకూ దూరమైన ఈశ్వర్ కి, చిత్ర తనతో రోజూ కాసేపు ఏదొ ఒక విషయం లో కబుర్లు చెప్పుంటే బావుండుననిపించింది.
" కొంచమే జేస్త. ఎక్కువేమి చెయ్య గాని. తాగుదువు. సరెనా ?" అంది చిత్ర, తన భర్త తన వైపు తీక్షణంగా చూస్తూ, ఏమీ మాట్లాడక పోయే సరికి.
" yeah yeah పెట్టు. actually నేనే నిన్ను tea అడుగుదామనుకుంటున్నా. " అన్నాడు ఈశ్వర్.
' తెలుసు గాన్లె. ' అని లోలోన నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళింది చిత్ర.
***
వాళ్ళింటి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని, ఈశ్వర్, చిత్ర లు ఛాయ్ తాగసాగారు.
" టీ చాలా బావుంది. " అన్నాడు ఈశ్వర్.
తన భర్త ఎదో బయటి వాళ్ళకు చెప్పినట్టుగా తాగిన ప్రతీసారి టీ బావున్నట్టు చెప్పనవసరం లేదనిపించింది చిత్ర కు. పనిలో పడి అలసిపోయిన తన భర్త కు రుచికరంగా ఛాయ్ చేయడం తన కనీస బాధ్యత అనీ, అది తన భర్త ఏదో ఘనకార్యం లా ప్రతీసారీ మెచ్చుకోవడం నచ్చలేదామెకి.
" నేను మంచిగనే జేస్త ఎప్పుడన్నా. " అంది చిత్ర కాస్త విసురుగా.
ఊహించని సమాధానం చిత్ర నుండి ఎదురయ్యేసరికి ఎలా స్పందించాలో తెలియక కృతకమైన చిరు మందహాసం చేసాడు ఈశ్వర్.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.
వెళ్ళి తలుపు తీసిన చిత్రకు శ్రీజ, అభిరాం లు కనిపించారు.
" లోపటికి రా స్రీజా. " అంది చిత్ర ఆప్యాయంగా.
" ఉండని మేడం. మళ్ళి సారి వోస్తా. అది... వీడిది birthday ఇవాళ. evening party ఉంది. మీరు, సార్ తప్పకుండా రావాలి. " అంటూ , డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఈశ్వర్ ని వైపు చూస్తూ, " తప్పకుండా మీ ఇద్దరు రావాలి. " అంది శ్రీజ మరోసారి.
"sure", " సరే " , ఈశ్వర్, చిత్ర లు ఒకేసారి అన్నారు.
" హ్యాపీ బర్తుడే. " అంటూ అభిరాం బుగ్గను తడిమింది చిత్ర ఆప్యాయంగా.
ప్రతిగా మందహాసం చేసాడు అభిరాం. అభిరాం చేసిన మందహాసం చిత్ర కు బాగా సంతోషాన్ని కలిగించింది.
తన సుపుత్రుడికి అస్సలు నచ్చని ' బుగ్గ గిల్లుడు ' కార్యక్రమాన్ని చిత్ర చేసినా కూడా, వాడు అంత 'శాంతంగా ' స్పందించడం తో ఆశ్చర్యపోయింది శ్రీజ.
తన సుపుత్రుడి వైపే నవ్వుతూ చూస్తున్న చిత్ర వైపు చూస్తూ, ఆమెతో
" అంతే కాదు మేడం.. night ఏం వండకండి. అందరం కలిసి మా ఇంట్లోనే dinner చేద్దాం." అంది శ్రీజ.
సరే నని చెప్పబోయి, ఒక్కసారి ఈశ్వర్ వైపు చూసింది చిత్ర, అతని ఇష్టాన్ని అనుసరిద్దామనుకుని.
చిత్ర తన అభిప్రాయానకై తన వైపు చూడటాన్ని ఈశ్వర్ గమనించాడు. శ్రీజ అంత ఆప్యాయంగా పిలిస్తే వెళ్లకపోతే తప్పవుతుందన్న భావన వెలిబుచ్చాడు ఈశ్వర్ తన కళ్ళల్లో .
"వస్తమైతె తప్పకుండ." అంది చిత్ర, చిరు మందహాసం చేస్తూ.
తిరిగి మందహాసం చేస్తూ వెళ్తున్న శ్రీజ ని ఏదో గుర్తొచ్చినట్టుగా పిలిచింది చిత్ర.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
" గదీ... వాచ్ మెన్ వోళ్ల పిల్లలు మా ఇంట్లనే ఉన్నరు. నా కిందాక గుర్తుకి రాలె. " అంది చిత్ర.
" ఓ... అవ్నవ్ను. ఊరెళ్తున్నామని చెప్పారు.. మీ ఇంట్లోనే ఉంచారా పిల్లల్ని?"
" హా అవ్ను, పొలం పంచాయితి అయితె పొయిర్రు. రేపో, ఎల్లుండో ఒస్తమని జెప్పిర్రు."
"ఓ అవ్నా.. అయినా పర్లేదు మేడం. వాళ్ళు కూడా వస్తారు లేండి. అందరం కలిసే భోంచేద్దాం." అంది శ్రీజ.
" నీకు గింత మందికి ఒండనీకి ఇబ్బందయితదేమొ గద. " అంది చిత్ర.
" అయ్యో, అలా ఏం లేదు. మీరెంత మంది ఒస్తే మేము అంత హాపీ." అంది శ్రీజ, కృత్రిమమైన చిరునవ్వు సంధిస్తూ, మచ్చు మీద పెట్టబడిన పెద్ద కుక్కర్ ని కిందికి దింపాలని ఆలోచిస్తూ.
" మంచిది అయ్తె. ఒస్తం మేమందరం." అంది చిత్ర, నిండుగా మంసహాసం చేస్తూ.
***
" ఇదో.... ఏమ్లే, గా చిన్నపిలగాని పుట్టిన దినం గద ఇరోజు, గందుకే కొవ్వొత్తి మీన గా పిలగాని పేరు చెక్కుదము అనుకుంటున్న. గా పిలగాని పేరు ఇంగ్లీశుల a..b..e..r..a..m ఏనా ?" అడిగింది చిత్ర, భోజనం ముగించుకుని, తన ప్లేట్ కడుక్కుంటున్న ఈశ్వర్ ని.
" abhiraam అన్నది proper noun. so you have that freedom to keep spelling as you wish. But if i were you, i would prefer A..b..h..i..r..a..a..m. " అన్నాడు ఈశ్వర్.
తాను కనీసం ఇంటర్మీడియట్ వరకైనా చదువుకుని ఉండింటే బాగుండుననుకుంది చిత్ర.
" నేను చిన్నగున్నప్పుడు గా వాకీల్ స్రీనివాసరావు పెద్ద బిడ్డ వైశ్నవి తోని బాగా దోస్తుగ ఉంటుంటి. గా పిల్ల వాళ్ళ మామ కాడికి వనపర్తి కి పొయినప్పుడు నేర్చుకుండెనంట, నాకు గూడ నేర్పిండె గప్పుడు, ఎండ కాలం సెల్వులల్ల. " అంది చిత్ర తనకు అబ్బిన కళ యొక్క పుట్టు పూర్వత్తరాలు ఉత్సాహంగా చెబుతూ.
" ఓ .. నైస్, బావుంటుంది. నాకు కూడా pencil carvings అంటే చాలా ఇష్టం. అమృ...."
' అమృత కి నేను ఇచ్చిన first gift కూడా pencil carving ఏ. ' అనబోయిన ఈశ్వర్ మాట మధ్యలోనే ఆగిపోయింది.
తన భర్త చనిపోయిన తన ప్రియురాలిని గూర్చే ఏదో విషయాన్ని ప్రస్తావించబోయాడని అర్థం చేస్కుంది చిత్ర. తను అస్సలు ఆ మాట ని విననట్టుగా తన భర్తకు భ్రమ కలిగించాలనుకుని,
" pencil carving ఆ , అంటే ఏంది ?! " అడిగింది చిత్ర.
చిత్ర ' అమృత ' అనే శబ్దాన్ని విననందుకు ఊపిరి పీల్చుకున్నాడు ఈశ్వర్!
" అదీ .. నువ్విప్పుడు candle పై చేస్తున్నావ్ కదా , అదే pencil carvings అయితే , pencil nib పై చేస్తారు. అంతే"
" అంటే పెన్సిలు మొలికి మీదనా ?"
" హా."
" అయ్య, మస్తు కష్టము గదా అట్ల."
" హా, బట్ , ట్రై చేస్తుంటే అదే వస్తుంది. కొంచం ఓపిక కావాలి అంతే." నవ్వుతూ అన్నాడు ఈశ్వర్.
"ఓ"
ఒక నిమిషం పాటు సంశయం తరవాత, చిత్ర, తన భర్త తో
" ఇదో... నీకిప్పుడేమన్న అర్జంటు పనుందా ?" అడిగింది.
"urgent అంటే specific గా ఏం లేదు. ఏ ఎందుకలా అడిగావ్ ?" అడిగాడు ఈశ్వర్.
" జెర పక్కనుంటవా గిది చేస్తున్నప్పుడు. చానా రోజులయ్యింది చేశీ. మంచిగ రాదేమోనని బయమవ్తుంది. " అంది చిత్ర నిజాయితీగా.
***
తాను ఊహించిన దానికన్నా చిత్ర కు candle carving కళలో ప్రావీణ్యం చాలా తక్కువ ఉందని చాలా తక్కువ సమయం లోనే గ్రహించగలిగాడు ఈశ్వర్.
ఇద్దరూ కలిసి సాయంత్రం పార్టీ సమయానికల్లా candle carving పనిని పూర్తి చేసారు.
" మస్తు చేశ్న కద !" అంది చిత్ర తన కళాఖండాన్ని చూసి మురిసిపోతూ.
ఏం మాట్లాడాలో తెలియక అవునన్నట్టుగా మూలిగాడు ఈశ్వర్.
వాళ్ళింటి గోడ గడియారం ఆరు సార్లు కొట్టింది.
" ఆరయ్యింది. పార్టి కి తయారవుదమా ? పిల్లలు గూడ ఒచ్చే టయిమయ్యింది." అంది చిత్ర.
" హం " అన్నాడు ఈశ్వర్, అమృత చనిపోయిన తరువాత, తన పెళ్ళిని మినహాయించి వెళ్తున్న మొదటి వేడుక అని గుర్తు చేసుకుంటూ.
" నేను మళ్ళ పొయి, మొకము కడుక్కొనొస్త. మస్తు జిడ్డు జిడ్డు అయింది. అట్లనే జెర చీర గూడ మార్సుకుంట. " అంటూ స్నానాల గది వైపుగా నడిచింది చిత్ర.
***
కాలేజ్ నుండి వచ్చిన రేణుక, రాజేష్ లను వెంటబెట్టుకుని బయలుదేరారు ఈశ్వర్, చిత్ర లు.
లిఫ్ట్ లోపలికి నడిచారు నలుగురూ. తను, తన భర్త తో కలిసి చేసిన కళాఖండాన్ని మళ్ళీ తన భర్త సహాయం తీసుకుని ప్యాక్ చేసింది చిత్ర.
ఆ ఇద్దరు పిల్లలు తనను చూసి కాస్త భయపడుతున్నట్టుగా గమనించాడు ఈశ్వర్. వాళ్ళు అలా తనపై వికర్షణా భావాన్ని చూపిస్తూ ఉండటం అసౌకర్యంగా అనిపించింది ఈశ్వర్ కి.
"what are your names ?" అడిగాడు ఈశ్వర్, ఆ పిల్లలు తనకు కాస్త దెగ్గరౌతారేమో నని ఆశ పడుతూ.
" అంకులు ఆస్కింగునో ? టెల్ , టూ నేంస్ " అంది చిత్ర, తన భర్త ఆ పిల్లలతో సంకర్షించడానికి ప్రయత్నం చేయడాన్ని ఆస్వాదిస్తూ.
చిత్ర ఇంగ్లీష్ ని విని, ఆ ఇద్దరు పిల్లలు నవ్వు ఆపుకుంటున్నారని గుర్తించాడు ఈశ్వర్. ఒక్క క్షణం ఆ ఇద్దరు పిల్లల పై కోపం, చిత్ర పై జాలి కలిగాయి ఈశ్వర్ కి.
" రేణుక " " రాజేష్ " అంటూ బదులిచ్చారు ఇద్దరు పిల్లలు.
" హం ." అన్నాడు ఈశ్వర్ , వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇద్దామనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకుంటూ, చిత్ర అవమాన పడ్డదేమో నన్న ఆలోచన కలిగి ఉండి.
తాను అనవసరంగా మధ్యలో మాట్లాడానేమో ననుకుంది చిత్ర. అందుకే తన భర్త అతనికి ' అలవాటైనట్టుగా ' " హం " అన్న శబ్దాన్ని చేసినట్టుగా భావించుకుంది చిత్ర.
లిఫ్ట్ పెంట్ హౌస్ వద్దకు చేరే సరికి, నాలుగు తెలియని ముఖాలు మాత్రమే కనిపించాయి వాళ్ళకి. ఆ నలుగురిలో ఆడ వాళ్ళ ముఖాలు విశ్వనాథ్ ని పోలి ఉండటం తో వాళ్ళు విశ్వనాథ్ యొక్క అక్కలుగా, వారి పక్కన ఉన్నది విశ్వనాథ్ యొక్క బావలుగా గుర్తించాడు ఈశ్వర్.
అపార్ట్మెంట్ మొత్తం లో కేవలం తామే పిలవబడ్డామని గుర్తించి ఆశ్చర్యపోయారు ఈశ్వర్, చిత్ర లు.
" వచ్చారా మేడం , మీ కోసమే చూస్తున్నాం. వీడు అప్పటి నుంచి ఒకటే ఎదురు చూస్తున్నాడు కేక్ కట్ చేద్దామని." అంది శ్రీజ నవ్వుతూ, ' మీదే ఆలస్యం ' అన్న అర్థం వచ్చేలా.
" పిల్లలు ఒచ్చే వరకు లేటయ్యిండె ." అంది చిత్ర నిజాయితీగా.
చిత్ర అంత నిజాయితీ సమాధానం చెప్పేసరికి, అనవసరంగా తాను లౌక్యాన్ని ఆమె వద్ద చూపించినట్టుగా భావించుకుంది శ్రీజ.
చిత్ర, ఈశ్వర్ లకు కూర్చీలు వేసింది శ్రీజ.
లోపలి నుంచి కూల్ కేక్ నూ, అభిరాం నూ బయటకు తీసుకు వచ్చింది శ్రీజ.
రాజేష్, రేణుక లతో పాటు చిత్ర ఆబగా ఆ కేక్ వంక చూడసాగింది.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
వెంటనే ఏదో మరచిపోయినట్టుగా లోనికి వెళ్ళింది శ్రీజ. ఐదు నిమిషాలైనా తిరిగి రాకపోయే సరికి విషయమేంటో తెలుసుకుందామనుకుంది చిత్ర. శ్రీజ యొక్క ఆడపడుచులెవ్వరూ ఆమె ఏం వెతుకుతుందో తెలుసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపనట్టుగా గుర్తించ గలిగింది చిత్ర. ఈశ్వర్ ఎక్కడికి వెళ్తున్నావని అడిగేలోపే వడివడిగా శ్రీజ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది చిత్ర.
వస్తువులను పక్కనే పెట్టుకుని , వాటి కోసం తన చుట్టంతా వెతికే అలవాటున్న శ్రీజ, దేనికోసమో వెదుకుతున్నట్టుగా గుర్తించింది చిత్ర.
" నువ్వు చాకు కోసము దేవులాడుతున్నవా ?" అడిగింది చిత్ర.
" హా అవ్ను " అంది శ్రీజ.
" గీడనే ఉంది గద." అంటూ వంట గట్టు పై మూలకు ఉన్న చాకు ని చూపించింది చిత్ర నవ్వుతూ.
" హమ్మయ్యా, దొరికింది. అప్పటి నుండీ వెతుకుతున్నా. " అంది శ్రీజ, నిట్టూరుస్తూ.
' ఏందో ఏమో, గీమె మరీ గిట్లుంటే కష్టమే. ' అనుకుంది చిత్ర తన మనస్సులో. పైకి మాత్రం చిరునవ్వు నవ్వింది చిత్ర.
" నాకు వస్తువులు త్వరగా దొరికి చావవు. మా ఆయన ఎప్పుడూ తిడుతుంటాడు నన్ను ఊరికే వెతుకుతుంటా అని" అంది శ్రీజ.
చిరునవ్వొకటి నవ్వింది చిత్ర, ఏమని స్పందించాలో తెలియక.
బయటికి చాకు తో వచ్చిన తన తల్లిని చూసి
" ఇంతసేపా ? " అన్నట్టుగా ముఖం పెట్టాడు అభిరాం.
విశ్వనాథ్ , శ్రీజ లు ఇద్దరూ హ్యాపీ బర్త్‌డే పాటను పాడసాగారు. చిత్ర గోంతు కలుపుదామనుకుని, తప్పుగా పాడితే తన పరువూ, తన వల్ల తన భర్త పరువూ పోతుందేమో నని ఊరుకుంది. ఇంతలో ఈశ్వర్ కి ఫోన్ వస్తే, మాట్లాడటానికి పక్కకు వెళ్ళాడు. కేకు ని అభిరాం నోట్లో పెట్టారు వాడి తల్లిదండ్రులు, మేనత్తలు.
అభిరాం ని తిరిగి తన మేనత్తలకు , మామయ్యలకు కేకు తినిపించమని చెప్పింది వాళ్ళ అమ్మ.
" వీళ్ళతో పెట్టించుకోవడమే ఎక్కువ ." అన్నట్టుగా ముఖం పెట్టి , వాళ్ళకు కేకు తినిపించాడు అభిరాం.
ఇదంతా చూస్తున్న చిత్ర
' ఏందో ఏమో, గింత మంది కలిసి ఒకరి నోట్ల ఇంగోళ్ళు పెడుతున్నరు. ఎంగిలయితుంది. మళ్ళ గా కేకు నే నాకు ఈశ్వరు కూ పెట్టేటట్టున్నరు గద ! ' అనుకుంది తన మనస్సులో.
గిఫ్ట్ లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అభిరాం యొక్క ఇద్దరు మేనత్తలూ, చెరో గిఫ్ట్ ఇచ్చారు అభిరాం కి. తన తల్లి వద్దని వారిస్తున్నా , పట్టుబట్టి అప్పడే ఆ గిఫ్ట్‌ల పై ఉన్న కవర్లని తెరిపించాడు అభిరాం. వాడి కి ఆ గిఫ్ట్‌లు చాలా ' రొటీన్ ' గా తోచాయి.
" నువ్వు కూడా ఇట్లాంటివే తెచ్చావా లేక కొత్తవేవైనా తెచ్చావా ?" అని చూపులతోనే అడిగాడు అభిరాం.
" అదీ... ఈన ఫోను ల మాట్లాడనీకె పొయ్యిండు. ఈన కోసమే వెయిటు జేస్తున్న . " అంది చిత్ర, గిఫ్ట్ ని అందజేయడానికి వెనక ఉన్న కారణాన్ని చెబుతున్నట్టుగా.
" పరవాలేదు లే " అన్నట్టుగా చిరునవ్వోటి నవ్వింది శ్రీజ.
మూడు నిమిషాలు గడిచినా ఈశ్వర్ రాకపోయే సరికి, అందరూ ఈశ్వర్ ఎప్పుడు వస్తాడా,ఆ గిఫ్ట్ ఎప్పుడు వాళ్ళు అందజేస్తారా అన్నట్టుగా చిత్ర వంక చూడసాగారు. ఇంక వాళ్ళను ఎదురుచూసేలా చేయడం కష్టమనిపించింది చిత్రకు.
" ఈనొచ్చే దాక లేటయిటట్టుంది. " అంది చిత్ర, పర్లేదులే ఎదురుచూస్తాం అని శ్రీజ అంటుందేమో ననుకుని.
శ్రీజ ఏమీ మాట్లాడలేదు, ఎప్పుడు తంతు ముగుస్తుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉన్న తన ఆడ పడుచులను దృష్టి లో ఉంచుకుని.
' ఏందో ఏమో, ఈశ్వరు వొచ్చే దాంక నన్న ఎదురు సూస్తలేరీళ్ళు. ' అనుకుంది చిత్ర తన మనస్సులో.
పైకి మాత్రం నవ్వుతూ అభిరాం దగ్గరికి వెళ్ళి, అతనికి చేతికి తను తీసుకువచ్చిన గిఫ్ట్ ని అందించింది చిత్ర. తన భర్త తో కలిసి ఆ గిఫ్ట్ ని ఇవ్వకపోవడం చాలా లోటుగా అనిపించింది చిత్రకు.
చిత్ర చేతిలో నుంచి గిఫ్ట్ తీసుకున్న మరు క్షణమే , దాని పైనున్న కవరు ని విప్పమని తన తల్లకి సైగ చేశాడు అభిరాం.
అభిరాం ఆసక్తిని గమనించిన చిత్ర,
" ఓపెను జేయ్ , ఏం గాదు. అబిరాము కు మస్తు నచ్చుతది గది. " నవ్వుతూ అంది చిత్ర, నమ్మకంగా.
అది తెరవగానే , తన తల్లి చేత ఇటీవలే english alphabets నేర్పించుకున్న అభిరాం ఆసక్తిగా ఆ కాండిల్ కార్వింగ్ పై ఉన్న అక్షరాలు ఒక్కొక్కటిగా మనసులో చదవసాగాడు.
' abhiraam ' అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి ఆ కొవ్వొత్తి పైన.
చిత్ర తమ కొడుకు పై చూపిన ఆప్యాయతకు ఆనందించారు విశ్వనాథ్, శ్రీజ లు.
" ఏమి .. ఎట్లుంది ? నచ్చిందా ?"అభిరాం ని అడిగింది చిత్ర నవ్వుతూ.
వాడు మాత్రం ఆ కాండిల్ నే ఆసక్తిగా చూస్తూ, వాళ్ళ అమ్మ వైపు తిరిగి, దాన్ని చూపించసాగాడు.
" ఆంటీ అడుగుతుంది నాన్నా ఎలా ఉంది అని " అంది శ్రీజ, చిత్ర వైపు చూస్తూ.
తన తల్లిదండ్రులిద్దరికీ తన గిఫ్ట్ ని గర్వంగా చూపించుకున్నాక, చిత్ర వైపు తిరిగి నవ్వాడు అభిరాం.
తొర్రి పళ్ళేసుకుని, మనస్పూర్తిగా వాడు నవ్విన నవ్వు చిత్ర కు బాగా ఆకర్షణీయంగా తోచింది.
" అదీ.. ఈననే ఎక్కువ జేశిండు ఇందుల. నేనూకె అయిడియా ఇచ్చిన అంతే." అంది చిత్ర, నిజాయితీగా. గుర్తింపంతా తానొక్కదానికే రావడం బాగా ఇబ్బందిగా అనిపించిందామెకి.
ఆ మాటను శ్రీజ, విశ్వనాథ్ లకు నమ్మాలి అనిపించలేదసలు.
ఇంతలో క్లైంట్ తో ఫోన్ సంభాషణని ముగించుకుని అక్కడికి వచ్చాడు ఈశ్వర్.
" ఈనొచ్చిండు . " అంటూ తన భర్త వైపుగా నడవబోతున్న చిత్ర చేతిని పట్టుకుని ఆపాడు అభిరాం.
" ఏంది ?" అన్నట్టుగా చూస్తున్న చిత్రను కిందికి వంగమన్నట్టుగా సైగ చేసాడు అభిరాం.
ఆశ్చర్యంగా అతని సైగ ను అనుసరించిన చిత్ర నోట్లో కేకు ముక్కను పెట్టాడు అభిరాం.
తమ సుపుత్రుడి చర్య కు ఆశ్చర్యపోయారు శ్రీజ, విశ్వనాథ్ లు. అభిరాం అంత ' సున్నితత్వం ' సొంత తల్లిదండ్రులైన తమ పట్ల కూడా చూపించని వైనం గుర్తుకు వచ్చింది వాళ్ళిద్దరికీ.
అంత ప్రత్యేకంగా చూడబడ్డందుకు చాలా సంతోషం కలిగింది చిత్రకు. తనకు లభించిన ఆ గౌరవం లో తన భర్త పాత్ర చాలా ఉందనిపించిందామెకు.
తన భర్త దెగ్గరకు వెళ్ళి , ఏం చెప్పాలో తెలియక, " గీ కేకు సల్లగుంది." అంది చిత్ర.
" yeah ,అది cool cake ." అన్నాడు ఈశ్వర్ , చిత్ర మాటకి వచ్చిన చిరునవ్వుతో.
" కొల్లాపూర్ ల గూడ ఉంటయి కేకులు. గాడ కొత్తగ అయ్యంగారు బేకరి అని పెట్టిండె. కాని గీ కేకు మస్తుంది. గది నమ్లాల్సొస్తుండె ఊకె. గిదేమో నోట్లేసుకుంటెనే కరిగిపొయ్యింది." అంది చిత్ర.
కేకు ను గూర్చి చిత్ర సంభాషణను కొనసాగించడం కాస్త ఇబ్బందికరంగా తోచింది ఈశ్వర్ కి. అక్కడి వాళ్ళెవరైనా వింటే చిత్రను చులకనగా చూస్తారేమో నన్న భావన కలిగింది ఈశ్వర్ కి. చిత్ర చులకనగా చూడబడటానికి అర్హురాలు కాదనిపించింది ఈశ్వర్ కి.
"హం." అన్నాడు ఈశ్వర్ బదులుగా.
సంభాషణని ఆపమని తన భర్త తనకు పరోక్షంగా చెప్పాడని అర్థం చేసుకుంది చిత్ర.
disposable plates లో కేక్ ముక్కల ని పెట్టి, అందరికీ పంచింది శ్రీజ. రేణుక, రాజేష్ లతో కలిసి చిత్ర కేక్ ని తినసాగింది. ఆ పిల్లలు తినే విధానానికీ, చిత్ర తినే విధానానికీ ఎలాంటి తేడా కనిపించలేదు ఈశ్వర్ కి. తొందరలో చిత్రనీ, ఆ పిల్లలనీ ఎక్కడికైనా మంచి ఫుడ్ కోర్ట్ కి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్.
***
భోజనానికి కూర్చున్నారు అందరూ. వాచ్ మెన్ పిల్లలిద్దరినీ వారితో పాటుగా కాక, విడిగా కుర్చోబెట్టడం నచ్చలేదు ఈశ్వర్ కి. వాళ్ళు అవమానపడ్డారేమో నన్న భావన కలిగిందతడికి.
చిత్ర, ఈశ్వర్ , విశ్వనాథ్ లకు అన్నం , కూరలు, పప్పు వడ్డించింది శ్రీజ.
మొదటి ముద్ద తిన్న చిత్ర నేరుగా ఈశ్వర్ వంక చూసింది.
***
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
రోజూ లాగే తన నాలుగు వేల రూపాయల స్వెటర్ వేసుకుని తన భర్త తో కలిసి వాకింగ్ చేయసాగింది చిత్ర.
" ఇదో.... ఆళ్ళు గట్ల కూరలు గంత కారం జేస్తరనుకోలె.. ప్చ్, నేనే గా స్రీజకు చెప్పకపోతి నువ్వు కారం చానా తక్కువ తింటవని. సారి" అంది చిత్ర, అపరాధభావం తో.
తనపై పదే పదే అంత మమకారాన్ని చిత్ర ఎలా చూపించగలుగుతుందో నని చిత్ర యొక్క కళ్ళల్లోకి చూస్తూ అడగాలనిపించింది ఈశ్వర్ కి.
" హం " అన్నాడు ఈశ్వర్, చిత్ర వైపు చూడాలనుకున్న తన కోరికను చంపుకుంటూ.
-----------------------సశేషం. ------------------------
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,353
Threads: 0
Likes Received: 6,812 in 5,171 posts
Likes Given: 70,112
Joined: Feb 2022
Reputation:
87
Super fantastic update
Posts: 768
Threads: 0
Likes Received: 1,233 in 688 posts
Likes Given: 3,062
Joined: Jun 2020
Reputation:
41
(24-10-2023, 01:08 PM)k3vv3 Wrote: రోజూ లాగే తన నాలుగు వేల రూపాయల స్వెటర్ వేసుకుని తన భర్త తో కలిసి వాకింగ్ చేయసాగింది చిత్ర. Very good update, K3vv3 garu!!!
Posts: 1,665
Threads: 3
Likes Received: 2,352 in 1,191 posts
Likes Given: 3,182
Joined: Nov 2018
Reputation:
46
మరీ ఇంత వివరంగా రాస్తారనుకోలేదు ఇష్టమైన భర్త పట్ల భార్య ప్రవర్తన ఎలా ఉంటుందని, చాలా నేచరుల్‌గా ఉంది చిత్ర ప్రవర్తన, ఈశ్వర్‌కి ఏంకావాలో చెప్పకముందే అర్థం చేసుకోవడం...బావుంది బ్రో ...కొనసాగించండి.
: :ఉదయ్
The following 1 user Likes Uday's post:1 user Likes Uday's post
• k3vv3
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
ముడి – 23
" ఇదో... గా వాచ్ మెను బార్య జోతి ఫోను జేసింది. ఇంగ నాల్గు రోజులైతదంట వచ్చెవరకు ఈడికి. " అంది చిత్ర కాస్త బెరుకుగా, లాప్టాప్ ముందు కూర్చుని పని చేసుకుంటున్న తన భర్త తో.
"okay". బదులిచ్చాడు ఈశ్వర్.
" మళ్ళ నీకు ఇబ్బందేమి గాదా, పిల్లలున్నందుకు ?" అడిగింది చిత్ర.
" అయ్యో ఇబ్బందేమ్లేదు. వాళ్ళ వల్ల ఇబ్బందేం ఉంటుంది చెప్పు ?" నవ్వుతూ అన్నాడు ఈశ్వర్.
తన భర్త సమాధానం తో సంతోషపడింది చిత్ర.
" చాయ్ చేస్కుంటున్న నేను. నీగ్గూడ కొంచం పోస్త తాగుదువు సరేనా ?" అంది చిత్ర.
" కొంచం ఎక్కువే పెట్టు. ఎక్కువే తాగాలనిపిస్తోంది నాకు. "
" అట్లే ." అని నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది చిత్ర.
చిత్ర తనతో ఇంకాస్త మాట్లాడి ఉంటే బాగుండు ననిపించింది ఈశ్వర్ కి. ఒక నిమిషం తరువాత వంటింట్లో చిత్ర వద్దకు వెళ్ళాడు ఈశ్వర్.
అనూహ్యమైన తన భర్త రాక ను చూసి ఆశ్చర్యపోయింది చిత్ర.
" ఏమి ఇట్లొస్తివి ? " అడిగింది చిత్ర అయత్నకృతంగా.
"ఊరికే." బదులిచ్చాడు ఈశ్వర్, ఆ ప్రశ్న కు తన దెగ్గర కూడా సమాధానం లేకపోయే సరికి.
తన భర్త వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి, తిరిగి పొయ్యి వైపుకు తిరిగింది చిత్ర.
చిత్ర యొక్క నవ్వును మరోసారి చూడాలన్న కోరిక కలగసాగింది ఈశ్వర్ కి.
మరుగుతున్న నీటిలో పాలు, టీ పొడి పోసింది చిత్ర.
చక్కెర డబ్బా వైపుగా చేతిని చాపుతూ , దాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న చిత్ర చేతికి డబ్బాను ఇచ్చాడు ఈశ్వర్.
తాను కోరుకున్నట్టుగానే తన వైపుకి తిరిగి నవ్వి, ఆ చక్కెర డబ్బాను చేతిలోకి తీసుకుంది చిత్ర.
"గదేందో లంసా పొడి దొరుకుతదంట గద, స్రీజ చెప్పిండె. గదేస్కుంటె ఇంగా మస్తు మంచిగ అయితదంట గద చాయ్. " అంది చిత్ర, ఈశ్వర్ వైపు చూస్తూ.
"yeah అవును. ఈసారి super market కి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం."
"అట్లే." అంది చిత్ర.
చిత్ర తనకు అలవాటైన విధంగా ఏ వకీలు శ్రీనివాసరావు గురించో, తన మేనమామ గురించో లేక తన ఊరి గురించో మాట్లాడింటే బావుండుననిపించింది ఈశ్వర్ కి. అమె తో తన సంభాషణ కొనసాగేటట్టుగా చిత్ర వైపు నుండి ఏదైనా పొడిగింపు వచ్చింటే బావుండునని ఎదురు చూడసాగాడు ఈశ్వర్.
కానీ చిత్ర మాత్రం ఏమీ మాట్లాడలేదు. రెండు కప్పుల నిండా చాయ్ పోసి, ఒకటి తన భర్త చేతికి అందించింది.
" ఈడనే తాగుదమా? లేకపోతె డైనింగు టేబుల్ కాడికి పోదమా ?" అడిగింది చిత్ర.
" అక్కడికే వెళ్దాం." నిరాశపడుతూ బదులిచ్చాడు ఈశ్వర్.
డైనింగ్ టేబుల్ కుర్చీ పై కూర్చుని , తనకు అలవాటైన విధంగా శబ్దం వచ్చేలా చాయ్ ని జుర్రసాగింది చిత్ర.
" చిత్రా.." పిలిచాడు ఈశ్వర్.
తనవైపు చూసిన చిత్ర తో
" నువ్వు టీ చాలా బాగా చేస్తావ్." అన్నాడు ఈశ్వర్, ఇంకా తన చేతిలోని చాయ్ ని తాగకముందే.
" తెలుసు నాకు. " అంటూ ఎప్పటిలా తన భర్త నుంచి ఎదురైన ' అనవసరపు ' మెచ్చుకోలు పై తన వ్యతిరేకతను వ్యక్తపరుద్దామనుకున్న చిత్ర, తన ప్రయత్నాన్ని విరమించుకుంది. తన యొక్క దురుసుతనం వెనక గల కారణాన్ని గ్రహించగలిగేంత ' లౌక్యం ' తన భర్త కు లేదని భావించింది చిత్ర! పైగా పదే పదే తన భర్త తో దురుసుగా మాట్లాడితే అతని మనస్సు గాయపడుతుందేమో నని భావించింది చిత్ర.
" తాంక్సు. " అంది చిత్ర.
చిత్ర ఎప్పటిలా కాకుండా తక్కువగా సంభాషించే సరికి, ఈశ్వర్ కి నిరాశ కలిగింది.
"actually i used to prefer coffee. But now i am addicted to your tea." అంటూ గట్టిగా నవ్వాడు ఈశ్వర్.
తను చేసిన చాయ్ కి మెచ్చుకోలు కి కొనసాగింపుగానే తన భర్త పై మాటలను అన్నాడని మాత్రం గ్రహించగలిగింది చిత్ర.
" నువ్వు నవ్తే మస్తుంటవ్ ." అంది చిత్ర. ఎప్పటినించో మోస్తున్న భారాన్ని తీర్చుకున్నట్టుగా అనిపించిందామెకు!
" రేయ్ నీ smile అంటే చాలా ఇష్టం రా నాకు. దాన్ని చూసే పడిపోయా నేను. " అని నిత్యం అమృత బ్రతికున్నప్పుడు తనతో అనే మాటలు హఠాత్తుగా గుర్తొచ్చాయి ఈశ్వర్ కి.
ఒక్క క్షణం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామనిపించింది ఈశ్వర్ కి. కానీ చిత్ర ని ఇంకాస్త సేపు చూడాలనిపించిందతడికి. చిత్ర కళ్ళల్లో తన పట్ల చూపుతున్న ప్రేమను ఇంకాస్త సేపు చూడాలనిపించింది ఈశ్వర్ కి.
" తాంక్స్." అన్నాడు ఈశ్వర్ , కృత్రిమమైన చిరునవ్వొకటి విసురుతూ.
" గీ మాట నీకు జెప్దమని మస్తు సార్లనుకున్న తెల్సా ." అంది చిత్ర నవ్వుతూ.
" హం . ఓకే ."
చిత్ర ఏదో చెప్పబోయి ఊరుకున్నట్టుగా గుర్తించాడు. ఏదో సన్నిహితమైన వ్యాఖ్య చేసేందుకే చిత్ర ప్రయత్నించిందని భావించాడు ఈశ్వర్.
చిత్ర ఆ వ్యాఖ్య చేస్తే తనకు బావుంటుందో , చెయ్యకపోతే బావుంటుందో అర్థం కాలేదు ఈశ్వర్ కి!
" ఇదో ...... నాకు ఎప్పటికెళ్ళో ఒక కోరికుంది. " అంది చిత్ర, తన లోని ధైర్యాన్నంతా కూడగట్టుకుని.
" ఏంటి ?"
" నీకు మస్తు కోపమొస్తది. ఒద్దుగాన్లె. " అంది చిత్ర.
" చెప్పు. ఏంటి ?" అడిగాడు ఈశ్వర్.
డైనింగ్ టేబుల్ అవతలి వైపు కూర్చుని టీ తాగుతున్న తన భర్త వైపు ఒరిగి, అతని నుదుటి పై ముద్దాడింది చిత్ర.
" గీ పని జెయ్యాల్నని నాకెప్పటికెళ్ళో ఉండె.... నాదేమి తప్పు లేదు జూడు. నువ్వే అడిగినవ్ ఏందీ అని." అంది చిత్ర, ఈశర్ కళ్ళల్లోకి చూద్దామని ప్రయత్నించి, ధైర్యం చాలక కిందికి చూస్తూ.
చిత్రను ఒక్కసారి గట్టిగా హత్తుకుని గత మూడేళ్ళుగా తను అనుభవిస్తున్న నొప్పినంతా ఆమె ముందు వెళ్లగక్కాలన్న కోరిక కలగసాగింది ఈశ్వర్ కి. తన గుండె పొరల్లో ఉండిపోయిన దుఃఖాన్ని చిత్రకు చెప్పొచ్చో లేదో నన్న సందేహం అతడికి కలిగింది. ఒక్క క్షణం అతను చిత్ర కళ్ళల్లోకి చూశాడు. ఎప్పటిలాగే చిత్ర తన కళ్ళ నిండా తనపై ప్రేమను నింపుకున్నదని గుర్తించాడు. తన ఆలోచనల్లో అమృతను నింపుకున్న ఈశ్వర్ కి చిత్ర కళ్ళల్లోకి సూటిగా చూసేంత ధైర్యం సరిపోలేదు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
" అదీ... actually నాకు work balance ఉంది. నేనింక రూం లోకి వెళ్తా. if you don't mind నీ cup తో పాటే నా cup కూడా కడిగేసేయ్. " అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు ఈశ్వర్.
ఈశ్వర్ తనను అలా ముద్దు పెట్టినందుకు తనకు బుర్ర లేదని తిట్టాడేమో నన్న అనుమానం కలిగింది చిత్ర కు. కానీ అతను ఆ వాక్యాన్ని చెప్పిన విధానాన్నీ, తను తాగిన కప్పు ను కూడా కడగమని పురుమాయించిన విషయాన్నీ పరిగణం లోకి తీసుకుని తన భర్త తనను బుర్ర లేదని తిట్టలేదని నిర్ధారించుకుంచి చిత్ర.
' ఏందో ఏమో, గిప్పుడు ఈశ్వరుని ఎట్ల సూడాల్నో నేను ఇయాల. సిగ్గవ్తుంది మస్తు. ' అనుకుంది చిత్ర తన మనస్సులో.
కనీసం ఆ ఒక్క రోజు గడిచే వరకైనా తన భర్త కళ్ళల్లోకి సూటిగా చూసే అవసరం రాకుంటే బావుండుననుకుంది చిత్ర.
*****
ఆ రోజు సాయంత్రం పూర్తిగా అర్థం కాకున్నా యూట్యూబ్ లో సామవేదం షణ్ముఖ రావు యొక్క లలితా సహస్రనామాల ప్రవచనాన్ని తన భర్త తనకు కొనిపించిన ఫోను లో , చెవులకు హెడ్ సెట్ పెట్టుకుని చూస్తూ ఉంది చిత్ర. మధ్య మధ్య లో ఆపి, తిరిగి మళ్ళీ చూసే అవకాశం కలిగిన ఉండటంతో చిత్ర కు టి.వి కన్నా ఫోనే ఎక్కువ నచ్చసాగిందామెకు.
తల అడ్డంగా, నిలువుగా ఊపుతూ తీక్షణంగా వీడియో ని చూస్తూ ఉంది చిత్ర.
" చిత్రా !" పిలిచాడు ఈశ్వర్.
చిత్ర పలకలేదు.
" చిత్రా ! " మళ్ళీ పిలిచాడు ఈశ్వర్.
పక్కన ఉండి ఇదంతా చూస్తున్న రాజేష్ చిత్ర భుజాన్ని తట్టి, ఈశ్వర్ వైపు తన చూపుడు వేలి ని చూపించాడు.
తన భర్త వైపుకు చూసిన చిత్ర కు మధ్యాహ్నం యొక్క ముద్దు వ్యవహారం గుర్తుకు వచ్చింది. ఒక్క క్షణం ఆమెకు సిగ్గు, ధమనుల్లో వేడి రెండూ కలిగాయి. ఈసారి పెడితే గిడితే తన భర్త యొక్క పెదాలకే పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది చిత్ర.
" అదీ.. busy ఆ ?"
"ఏమ్లే ." అంది చిత్ర, తన భర్త ఆ ప్రశ్న తనను అడిగినందుకు లోలోన నవ్వుకుంటూ.
" వంట start చేసావా ?" అడిగాడు ఈశ్వర్.
" అయ్యో లేదింగా. ఆకలి గొన్నవా ?" అడిగింది చిత్ర, ఈశ్వర్ వైపు శ్రద్దగా చూస్తూ.
అమృత మరణం తరవాత తన ఆకలిని పట్టించుకునే ఏకైక వ్యక్తిగా చిత్ర అనిపించింది ఈశ్వర్ కి. ఆమె తన తో మాట్లాడేటప్పుడల్లా స్వరం లో చూపించే అనురక్తి మళ్ళీ మళ్ళీ వినాలనే కోరిక కలగసాగింది ఈశ్వర్ కి.
" పిల్లలూ, నువ్వూ , నేనూ అందరం కలిసి ఎక్కడికైనా మంచి restaurant కి వెళ్ళి తిందామా ఇవాళ ? " అడిగాడు ఈశ్వర్.
తన భర్త పెట్టే ఖర్చు గుర్తు తెచ్చుకున్న చిత్ర, ఆ పిల్లలను కూడా తీసుకువెళ్తే చాలా డబ్బులు అవ్తాయని మనస్సులో ఆలోచించసాగింది.
" అంటే మనం ఇంతవరకూ బయటకి వెళ్ళి ఎప్పుడూ డిన్నర్ చేయలేదు కదా, అందుకే అలా అడిగా. " అన్నాడు ఈశ్వర్ సంజాయిషీ ఇస్తున్నట్టుగా, చిత్ర దీర్ఘాలోచనలో ఉండటం చూసి.
తన భర్త తనకు సంజాయిషీ ఇవ్వాల్సి రావటం అస్సలు నచ్చలేదు చిత్ర కి. అతను అంత ఆప్యాయంగా తనను బయటికి తీసుకెళ్తా అన్నప్పుడు వెంటనే సరేననక అనవసరంగా సంజాయిషీ ఇచ్చుకునేలా చేసానన్న అపరాధభావం కలిగింది చిత్ర కు.
" ఒక్క పది నిముషాలు. మొకం జిడ్డు జిడ్డుగుంది. జెర కడుక్కొనొస్త. సరెనా ?" అంది చిత్ర, ఆమెకు మళ్ళీ తన భర్త యొక్క పెదవులు ఆకర్షణీయంగా తోచాయి.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
' ఏందో ఏమో, గీ మనిషి ని ఏమో జేసేటట్టే ఉన్న ఇయాల. జెర కంట్రోలు జేస్కొవ్వాలె. ' అనుకుంది చిత్ర తన మనస్సులో.
సరేనంటూ నవ్వాడు ఈశ్వర్. ప్రతిగా నవ్వుతూ స్నానాల గది వైపు వెళ్ళింది చిత్ర.
చిత్ర ని దూరం పెట్టే ప్రయత్నాన్ని విరమించుకుంటే తన జీవితం చాలా అందంగా ఉండేటట్టుగా భావించాడు ఈశ్వర్.
తన పెళ్ళైన తరవాత నుంచీ చిత్ర తన పై ప్రేమ చూపించిన తార్కాణాలన్నీ ఈశ్వర్ యొక్క మస్తిష్కం లో మెదలసాగాయి. ఏదో తెలియని బలం అతన్ని ఆవహించినట్టుగా అనిపించిందతడికి. నిస్సారంగా కనిపించిన అతని జీవితం , మరోసారి చివురించిన భావన కలిగిందతడికి.
" చీర చాలా బావుంది చిత్రా." అన్నాడు ఈశ్వర్, తయారయి వచ్చిన చిత్రని చూస్తూ. చిత్రని అభినందించడం ఈశ్వర్ యొక్క మనస్సుకి అతను ఊహించని స్వాంతనని చేకూర్చింది.
ఒక్క క్షణం జరుగుతున్నదంతా కలనేమో నన్న అనుమానం కలిగింది చిత్రకు.
" అవ్నా, తాంక్సు తాంక్సు. గిది మా మామ కొనిపిచ్చిండె. మూడు వందలు పడిండె.
పెళ్ళప్పుడు గిసొంటివి నాల్గు కొన్న. చాముండేశువరి టెక్సుటయిల్సని మస్తు ఫేమసు పెంట్లవెల్లి ల. " అంది చిత్ర, ఉప్పొంగిపోతూ.
" నీకు ఈ కలర్ బాగా సెట్ అయ్యింది." అన్నాడు ఈశ్వర్, ఆ సంభాషణను ఇంకాస్త కొనసాగించాలన్న కోరికకు లోనై.
" అదీ... చిన్నగున్నప్పుడు గింత నల్లగేమి లేకపోతుంటి నేను. నాకు పద్నాల్గేండ్లు పడ్నాంక మరీ నల్లగవుడం స్టార్టు అయిండె." అంది చిత్ర, తన భర్తకు తన శరీరపు రంగు ను గూర్చి సంజాయిషీ ఇవ్వదలచినదై.
చిత్ర మాట కి ఈశ్వర్ మనస్సు చివుక్కుమంది. పేలవమైన తన సాంఘీక నిపుణత వల్ల చిత్రకు తన యొక్క ఉద్దేశాన్ని వ్యక్తీకరించడం లో విఫలమైనట్టుగా తోచింది ఈశ్వర్ కి.
" నువ్వు నల్లగా ఉంటావనో తెల్లగా ఉంటావనో నేనెప్పుడూ ఆలోచించలేదు చిత్రా. ఇరోజు నువ్వు నాకు బాగా కనిపిస్తున్నావన్న మాట చెప్పాలనుకున్నాను. చెప్పడానికి రాలేదు నాకు అంతే." అన్న మాటలు ఈశ్వర్ యొక్క మనస్సు నుండి బయటకు తన్నుకు వచ్చాయి.
తన భర్త మాటలకు చిత్ర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తన భర్త నుండి ఇలాంటి ఒక్క మాట కోసం తాను ఎంతో ఎదురు చూసిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. పొంగుకొస్తున్న భావోద్వేగాన్ని తమాయించుకోవడం చాలా కష్టంగా తోచిందామెకు.
" నువ్వు గూడ మస్తున్నవ్ ఈ డ్రస్సుల. చెప్పాల్నంటె నువ్వు ఏ డ్రస్సు యేస్కున్నా మస్తనిపిస్తవ్ నాకు . నిజంగ." అంది చిత్ర తన పెదవుల నిండా, తన కళ్ళ నిండా నవ్వును నింపుకుని.
తనకు తానుగా ఏర్పరుచుకున్న ఒక పంజరం లోనుంచి బయట పడ్ద భావన కలిగింది ఈశ్వర్ కి. చిత్ర ను దూరంగా ఉంచాలన్న ఆలోచనను దూరం చేస్కుంటే తన మనస్సులో ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టుగా తోచింది ఈశ్వర్ కి ఆ క్షణం.
***
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
|