Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముడి
ముడి – 17
మరుసటి రోజు ఉదయాన్నే స్వెటర్ కొనడానికి చిత్ర, ఈశ్వర్ లు బయల్దేరారు తమ స్విఫ్ట్ కార్ లో.
"అవ్నూ ఈ కార్ల పాటలొస్తయా?" అడిగింది చిత్ర.
"వస్తాయి... కానీ ప్రస్తుతం పాటలు లేవు." బదులిచ్చాడు ఈశ్వర్.
"ఏమైనా పాటలు వినాలని ఉందా?" మళ్ళీ తనే అడిగాడు ఈశ్వర్, హైదరబాద్ ట్రాఫిక్ అలవాటులేని చిత్ర కు విసుగు కలుగుతుందేమో నన్న అనుమానం కలిగిన వాడై.
"లేవన్నవ్ గద." అంది చిత్ర.
"Download చేస్తా. చెప్పు ఏ పాటలు వింటావు?" అడిగాడు ఈశ్వర్.
".......మహేష్ బాబు వి ఉన్నయా?" ఉత్సాహంగా అడిగింది చిత్ర. సంగీత దర్శకుడి పేరో, గాయకుడి పేరో, కనీసం సినిమా పేరు కూడా చెప్పకుండా నటుడి పేరు చెప్పడం కాస్త వింతగా తోచింది ఈశ్వర్ కి.
" ఏ మూవీ సాంగ్స్ కావలి మహేష్ బాబు వి?" అడిగాడు ఈశ్వర్.
" పోకిరి... కాదు కాదు మురారి. మురారి పాటలు పెడ్తవా ? చానా రోజులైంది యినీ." అంది చిత్ర.
తన ఫోన్ లో మురారి పాటలు Download చేసి, కార్ లో ఉన్న music system ద్వారా ప్లే చేసాడు ఈశ్వర్.
ట్రాఫిక్ మెల్లిగా కదల నారంభించింది.
' ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక....' పాట ప్లే అవుతూ ఉంది.
" మస్తు ఉంటది గద ఈ సినిమ " అంది చిత్ర అప్రయత్నమైన ఉత్సాహం కలదై.
"ఏమో నాకు మరీ అంతగా నచ్చలేదు" బదులిచ్చాడు ఈశ్వర్ నిజాయితీగా.
" అవునా ! ఏం నచ్చలే నీకు అందుల ?! మహేష్ బాబు ది నాలుగో సినిమా అది. మస్తు జేశిండు ఐనా గూడా. లాస్ట్ లయితే ఏడుపు ఒస్తది మస్తు... గదే గాయ్న కడుపుల గడ్డ పార కుచ్కున్నప్పుడు." అంది చిత్ర.
"హో.. ఏమో నాకైతే boring గా అనిపించిండె మూవీ." అన్నాడు ఈశ్వర్.
"ఏడ ఏడనిపించిండె బోర్ ?! మహేష్ బాబు మస్తు జేశిండు గద ఆ సినిమాల" అంది చిత్ర.
చిత్ర యొక్క 'fanism' అర్థమైంది ఈశ్వర్ కి. fans తో ఎందుకొచ్చిన తంటా అని
" హా... ఔను బానే ఉంటుంది మూవీ. క్లైమాక్స్ లో నిజంగా మహేష్ బాబు బాగా చేసాడు." అన్నాడు ఈశ్వర్.
ఈశ్వర్ యొక్క ఆంతర్యాన్ని గ్రహించింది చిత్ర.
"ఐనా.... నాకు నచ్చితే నీకు గూడ నచ్చాలే అని లేదు లే. నీకు నచ్చకపొయ్యిండొచ్చు లే."అంది చిత్ర.
తన ఉద్దేశాన్ని చిత్ర గ్రహించగలిగిందని గ్రహించగలిగాడు ఈశ్వర్.
"నాకైతే మహేష్ బాబు ప్రతి సినిమాల నచ్చుతడు. ఆయ్న వి ఏ సిన్మా అయ్నా నాకు నచ్చుతది." అంది చిత్ర చిరునవ్వుతో.
"ఔనా !!! ఆగడు కూడా నచ్చిందా ఐతే ?!!!" వెటకారంగా అన్నాడు ఈశ్వర్.
" ఆ సిన్మాల గూడ మహేష్ బాబు మస్తు జేసిండు. సిన్మా తీసేటొళ్ళు సక్కగ తియ్యలే అంతే." అంది చిత్ర సంజాయిషీ ఇస్తున్నట్టుగా.
"హం .ఓకే." అన్నాడు ఈశ్వర్ , మహేష్ బాబు ను గూర్చిన చర్చ ముగించదలచిన వాడై.
వాళ్ళ కారు ట్రాఫిక్ లో అతి మెల్లిగా కదులుతూ ఉంది.
ఒక్కొక్కటిగా మహేష్ బాబు సినిమాల పాటలు వింటూ ఉన్నారు ఇద్దరూ.
' పుచ్చకాయ, పుచ్చకాయ తీపి పెదవి నువ్వు ఇచ్చుకోవె . ఇచ్చుకోవె ...' పాట ప్లే అవుతూ ఉంది.
మాటల్లో వాళ్ళు చేరాల్సిన షాపింగ్ మాల్ వచ్చేసింది.
" ఎన్ని కిలోమీటర్ల దూరం ఒచ్చినం ఇప్పుడు మనం ?" అడిగింది చిత్ర.
"four or five kilometres" అన్నాడు ఈశ్వర్.
"గంటన్నర కెళ్ళి మనం పొయింది గింతేనా ? దీనికి బదులు నడిచి పోతే అర్ద గంటల ఒస్తుంటుమి గద ?!" అంది చిత్ర.
నవ్వాడు ఈశ్వర్. తన భర్త యొక్క నవ్వుని చూసి, తన మనస్సులో నవ్వింది చిత్ర.
ఇంద్రభవనాన్ని తలపించే షాపింగ్ మాల్ ని చూస్తూ ఉంది చిత్ర. ఆమె కళ్ళు షాపింగ్ మాల్ లోని ప్రతి అణువునూ ఆశ్చర్యం తో చూస్తున్నాయి. చిత్ర కళ్ళల్లోని ఆశ్చర్యాన్ని చూసి, ఈశ్వర్ కి కాస్త ముచ్చటేసింది.
మెడ పట్టుకు పోతుందా అన్నంతగా దిక్కులు చూస్తూ ఉంది చిత్ర. అక్కడ పొట్టి , పొట్టి బట్టలేసుకున్న ఆడవాళ్ళని చూసి కాస్త ఏవగింపు కలిగింది చిత్రకు.
అక్కడ తినుబండారాలు అమ్మడాన్ని గమనించింది చిత్ర. చిత్ర ఫుడ్ కోర్ట్ వైపు చూడటాన్ని గమనించాడు. ఆమెకు ఆకలి వేస్తుందేమో నన్న భావన కలిగిందతడికి.
" మనం ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందేమో. ఇక్కడే తినేసి వెళ్దామా? this place looks hygenic " అన్నాడు ఈశ్వర్.
ఇంతకు మునుపోసారి తన భర్త 'hygenic' అన్న పదాన్ని వాడినప్పుడు 160 రూపాయలు ఖర్చైన విషయం గుర్తుకు వచ్చింది చిత్రకు. కానీ అక్కడ ఫుడ్ కోర్ట్ దెగ్గర కూర్చుని భాగస్వాములతో పాటు తింటున్న స్త్రీలని చూసి, తనకు కూడా తన భర్త తో కలిసి అలా తినాలనిపించింది చిత్రకు. తన భర్త సంపాదించే 2 లక్షల రూపాయల్లో ఒక సారి 100, 200 రూపాయలు ఖర్చుపెడితే తప్పులేదని సర్ది చెప్పుకుంది చిత్ర. తను కాస్త తెలివిగా పొదుపు చేస్తే ఇద్దరూ ఇప్పుడు కలిసి తింటున్న డబ్బులను కవర్ చేయొచ్చని సర్దిచెప్పుకుంది.
"అట్లే... ఈడ దోషలు దొరుకుతయా?" అంది చిత్ర.
"ఇక్కడ దోషలు, ఇడ్లీలు దొరకవు చిత్రా."
"మరి?"
"ముందు లోనికి వెళ్దాం."
"అట్లే" అంది చిత్ర, తన భర్త మాటలోని చిరు వ్యంగ్యం చాలా 'ఆకర్షణీయంగా ' తోచిందామెకు.
ఫుడ్ కోర్ట్ లోపల కూర్చుంటూ "బర్గర్ తింటావా?" అని అడిగాడు ఈశ్వర్.
"బర్గర్ అంటే లావుగ బన్ను లాగుండి, టి.వి లల్ల కనిపిస్తది జూడు, అదేనా?" అడిగింది చిత్ర.
"హా అదే, అదే." చిత్ర అంత 'త్వరగా' గుర్తించినందుకు ఊపిరి పీల్చుకున్నాడు ఈశ్వర్.
"తింట!" ఉత్సాహంగా చెప్పింది చిత్ర.
రెండు వెజ్ చీజ్ బర్గర్ లను ఆర్డర్ చేయ దలిచాడు ఈశ్వర్.
"అవును, నువ్వు non-veg తింటావు కదా?" అడిగాడు ఈశ్వర్ 'తియ్యగా'.
"తింట" అంది చిత్ర . అనవసరంగా నిజం చెప్పానేమో నని అనిపించింది ఆమెకి.
"మరి.... ఎప్పుడు non-veg తినట్లేదేంటి నువ్వు?" అడిగాడు ఈశ్వర్ చిత్ర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మాంసం విషయం లో చిత్ర ఏదో గూడుపుఠాణి పన్నుతోందన్న భావన కలిగిందతడికి!
"అంటే... నీకు non-veg నచ్చదని అత్తయ్య చెప్పిండె. అందుకే ఇంగ మానేశ్న" బదులిచ్చింది చిత్ర, నిజాయితీగా తన భర్త కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాట అతనికి చెబుతున్నప్పుడు చాలా సంతోషం కలిగిందామెకు.
ఈశ్వర్ కి అస్సలు నచ్చలేదు ఆమె చెప్పిన సమాధానం.
"చికెన్ బర్గర్ చెప్తాను ఓకేనా? తిందువు కాని. చాలా టేస్టీ గా ఉంటుంది. పాపం మీ పెంట్లవెల్లి లో అవి ఎక్కువగా దొరకకపోయుంటాయి." అన్నాడు ఈశ్వర్.
"అయ్య! ఉండన్లే, ఎందుకు. నువ్వు తినేదే నాకు కూడ జెప్పు." అంది చిత్ర.
"చికెన్ ఇష్టమో కాదో చెప్పు నువ్వు అంతే!" అన్నాడు ఈశ్వర్ కళ్ళల్లో, మాటలో కాస్త గాంభీర్యాన్ని ఒలకబోస్తూ.
"హా ఇష్టమే" అంది చిత్ర.
వెయిటర్ కి ఆర్డర్ ఇచ్చాడు ఈశ్వర్. చేసిన ఆర్డర్ రావటానికి వాళ్ళు ఇద్దరూ వేచి వుండసాగారు.
తన భర్త తనతో చికెన్ బర్గర్ ఎందుకు 'తినిపిస్తున్నాడో' మెల్లి మెల్లిగా అర్థం అవుతోంది చిత్ర కు. ఆమె మనస్సు చివుక్కుమంది. తన ముందే కూర్చున్నా, తన భర్త ఒక్క సారిగా వెయ్యి అడుగులు దూరంగా వెళ్ళిన భావన కలిగిందామెకు.
"చికెన్ బర్గర్ చెప్తాను ఓకేనా? తిందువు కాని. చాలా టేస్టీ గా ఉంటుంది. పాపం మీ పెంట్లవెల్లి లో అవి ఎక్కువగా దొరకకపోయుంటాయి." అన్నాడు ఈశ్వర్.
 
" ఏమి ఆలోచిస్తున్నవ్ ?" అడిగింది చిత్ర, ఆ ప్రశ్న అడిగిన మరుక్షణం , అనవసరంగా అడిగానేమో నన్న భావన కలిగింది చిత్ర కు. తన ప్రశ్న అమృత గురించి ఆలోచిస్తున్న తన భర్త ను మరింతగా బాధిస్తుందేమో నన్న భయం కలిగిందామెకి.
"ఏం లేదు, ఏం లేదు"అన్నాడు ఈశ్వర్ తేరుకుని, చిత్ర వైపు తాను తదేకంగా చూస్తున్నట్టు గుర్తించినవాడై.
కృత్రిమమైన చిరునవ్వొకటి తన మోము పై ఉంచింది చిత్ర. ఈశ్వర్ కి చిత్ర ముఖం పై ఉన్న చిరునవ్వు తనను ఎప్పుడెప్పుడు ఆమె చూసినప్పుడు కలిగే చిరునవ్వు కంటే వేరేగా ఉందని అనిపించింది. ఈ నవ్వు కన్నా ఆమె అలవాటుగా చేసే చిరునవ్వే బాగున్నట్టుగా అనిపించిందతడికి.
ఇంతలో వెయిటర్ చికెన్ బర్గర్, వెజ్ బర్గర్ లను తీసుకుని వచ్చాడు.
"చికెన్ ది ఈడ పెట్టు అన్నా." అంది చిత్ర, వెయిటర్ తో.
చికెన్ బర్గర్ తింటున్న చిత్ర కి, జీవితం లో మొదటి సారిగా మాంసాన్ని తింటున్న భావన కలిగింది. తనకు అలా అనిపించడం తనకే ఆశ్చర్యంగా తోచింది.
ఈశ్వర్ కౌంటర్ దెగ్గర బిల్ కడుతూ ఉన్నప్పుడు చిత్ర చేతుల్లో చేతులు వేసుకుంటూ నడుస్తున్న జంటల్ని చూస్తూ ఉంది. ఈశ్వర్ బిల్ కట్టడం ముగించిన విషయాన్ని గమనించి, బిల్ ఎంతయిందో చూసుంటో బావుండుననుకుంది.
"రా... ఫష్ట్ ఫ్లోర్ కి వెళదాం. స్వెటర్స్ అక్కడ ఉంటాయ్ " అన్నాడు ఈశ్వర్,
" సరే" అంది చిత్ర.
ఈశ్వర్ ఆమెను escalator వద్దకు తీస్కెళ్ళాడు.
"అబ్బ ఇదెక్కాల్నా ఇప్పుడు? మెట్లు లెవ్వా పైకి పోనీకే?" అడిగింది చిత్ర కాస్త భయపడుతూ.
"ఏ ఏమైంది? భయమా నీకు ఇది?" అడిగాడు ఈశ్వర్.
"హా."
"హేయ్, ఏం కాదు నేనున్నా కదా, చూడు ఎంత మంది వెళుతున్నారో , ఇది danger ఐతే వాళ్ళు అలా ఎక్కి వెళ్తారా చెప్పు." ధైర్యం చెప్పాడు ఈశ్వర్.
"ఏమో నాకు భయమేస్తది గది." అంది చిత్ర.
"శ్... ఏమవ్వదు! రా నా చేయి పట్టుకో. నన్ను పట్టుకుని ఉండు. 10 seconds లో వెళ్తాం మనం." అని ఆమె చేయి పట్టుకుని escalator పై అడుగు వేసాడు ఈశ్వర్.
చిత్ర భయంగా అతని చేతి గట్టిగా పట్టుకుని , కళ్ళు మూసుకుంది. escalator పై రెండు, మూడు క్షణాల తరువాత ఆమె కళ్ళు తెరిచింది.ఈశ్వర్ ఆమె వైపే చూస్తున్నాడు. కళ్ళు తెరిచిన ఆమెతో
'ఒకేనా?' అన్నట్టుగా సైగతోనే అడిగాడు ఈశ్వర్.
తలూపింది చిత్ర. చిత్రకు తన భర్త తన పట్ల ఆ క్షణం చూపించిన శ్రద్ద బాగా నచ్చింది. ఒక్క క్షణం స్వెటర్లు ఇంకా పై అంతస్థులో ఉండింటే బాగుండు అనిపించింది!
ఆమె కోరుకున్నట్టుగానే పెద్దల బట్టలు నాలుగో అంతస్థులో ఉన్నట్టుగా తెలుసుకున్నారు ఇద్దరూ. escalator దగ్గరకు రాగానే చిత్ర ఈశ్వర్ యొక్క మోచేయి, భుజం మధ్య భాగాన్ని పట్టుకుంది. అతని చేతి కండరాలు చాలా కరుకుగా తోచాయి ఆమె అరచేతికి. కావాలని అతన్ని పట్టుకున్నందున తన భర్త వైపు చూడాలంటే కాస్త సిగ్గేసింది చిత్రకు. తన చూపు నేరుగా, తన ఎదురుగా పెట్టుకుని escalator పై నిలబడింది. పై అంతస్థు రాగానే, ఈశ్వర్ ఆమెతో " ఇదిగో ఈ ఫ్లోర్ కూడా వచ్చింది. ఏమైనా అయ్యిందా చెప్పు!" అన్నాడు.
"అవునవును , ఏం గాలేదు నువ్వన్నట్టే." అంది చిత్ర.
ఈశ్వర్ కి ఆమె మాటల్లో కించిత్ వెటకారం ధ్వనించి నట్టుగా అనిపించింది.
రెండవ అంతస్థులో ని సేల్స్ గర్ల్ వద్దకు వెళ్ళి, చిత్రని చూపిస్తూ ఆమెకు స్వెటర్ చూపించమని అడిగాడు ఈశ్వర్. రెండు , మూడు వేసుకుని చూసి ఆఖరుగా నీలం రంగు స్వెటర్ ని ఎంపిక చేసుకున్నారు వాళ్ళు.చిత్రకు ఆ స్వెటర్ చాలా బాగా నచ్చినట్టుగా గ్రహించాడు ఈశ్వర్.
ఈశ్వర్ ఆ సేల్స్ గర్ల్ కి ఆ స్వెటర్ ని ప్యాక్ చేయమని ఇస్తున్నప్పుడు చిత్ర ఆ స్వెటర్ వెల రూపాయి తక్కువ నాలుగు వేలు గా చూసింది! వెంటనే ఆమె
" ఇదొద్దులే, ఇంగోటి కొందం.అస్సలిక్కడనే ఒద్దు. ఇంగో చోట కొందం." అంది.
చిత్ర వైపు వింతగా చూస్తున్న సేల్స్ గర్ల్ కి స్వెటర్ ని ప్యాక్ చేసి, బిల్ సిద్దం చేయమని చెప్పాడు ఈశ్వర్. చిత్ర ఏదో అనబోతుంటే నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసాడు. ఈశ్వర్ కి స్వెటర్ పైన ఉన్న వెల నే కారణమేమో నన్న భావన కలిగింది.
సేల్స్ గర్ల్ వెళ్ళాక, చిత్ర తో" ఎమైంది? ఏంటి నీ problem అసలు?" అన్నాడు ఈశ్వర్ , సమాధానాన్ని ఊహిస్తూనే.
" చలి కోటుకి నాల్గు వేలా ?! ఎవడన్న కొంటడా అట్ల ?!" అంది చిత్ర.
" మరి చలికి వణికితే బావుంటుందా?"
" అయ్తే మాత్రం నాల్గు వేలా ?! మా మామ పెళ్ళప్పుడు నాకు ఇప్పిచ్చిన పెళ్ళి చీరనే 2200 పడిండె." అంది చిత్ర.
ఈశ్వర్ కి ఆ పోలిక కాస్త వింతగా తోచింది.
" అయ్నా, రోజు చలి ల ఏడికి పోత నేను ?" మళ్ళీ తానే అంది చిత్ర.
" ఈ రోజు నుంచి రోజూ మనిద్దరం కలిసి ఈ నాలుగు వేల స్వెటర్ కోసమైనా వాకింగ్ కి వెళ్దాం. సరేనా ?" అన్నాడు ఈశ్వర్ కాస్త ఆయాసంగా, మాటవరసకు, అప్పుడు చిత్ర ని అదుపుచేయ దలచిన వాడై.
"ఏదోలే!" అని ముఖాన్ని అటువైపు తిప్పుకుని ముడుచుకుంది చిత్ర, డబ్బులు దండగ ఐపోతున్నాయని.
తను ఈ స్వెటర్ అనే మిష చేత నిన్నటి మాదిరి వాకింగ్ కి వెళ్ళొచ్చని తట్టింది చిత్ర బుర్రకి.
ఈశ్వర్ వైపు తిరుగుతూ చిరునవ్వుతో "అట్లనే గానిలె. నీ ఇష్టం ఇంగ" అంది.
ఎట్టకేలకు స్వెటర్ వివాదం సద్దుమణిగినందుకు ఊపిరి పీల్చుకున్నాడు ఈశ్వర్.
వాళ్ళు స్వెటర్ కొనుగోలు ముగించుకుని, బయటకు వస్తున్నప్పుడు ఫుడ్ కోర్ట్ వైపు చూస్తూ,
' బాబోయ్, బర్గర్ లకు ఐదు వందలు అయ్యాయని చిత్ర చూడలేదు, బతికిపోయా.' అనుకున్నాడు మనసులో.
* * *
ఆ రోజు రాత్రి భోజనం చేసాక, తన వాకింగ్ షూస్ వేసుకుని వాకింగ్ కి సిద్దపడ్డాడు ఈశ్వర్. అతను షూ లేసులు కట్టుకుంటూ ఉంటే అతని ముందు పాదాల జత ఒకటి ఒచ్చి ఆగింది. తల పైకెత్తి చూశాడు... పొద్దున కొన్న నీలం రంగు స్వెటర్ వేసుకుని, వాకింగ్ కి తయారయి నిలబడింది చిత్ర!
-------------------------సశేషం. -------------------------
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Good wonderful update  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
(30-08-2023, 06:39 PM)k3vv3 Wrote: ముడి – 17
మరుసటి రోజు ఉదయాన్నే స్వెటర్ కొనడానికి చిత్ర, ఈశ్వర్ లు బయల్దేరారు తమ స్విఫ్ట్ కార్ లో.
Good update K3vv3 garu!!!
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
దయ చేసి తరవాత అప్డేట్ ఇవ్వగలరు
[+] 1 user Likes sri7869's post
Like Reply
రేపు మద్యాహ్నం తరువాత అప్డేట్ ఇవ్వగలను.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
ముడి - 18
తన లాప్ టాప్ పై ప్రోగ్రాం టైప్ చేస్తూ వున్నాడు ఈశ్వర్. ఇంతలో అతని ఫోన్ రింగ్ టోన్ మోగింది.స్క్రీన్ పై ఏదో కొత్త నెంబరు ఉంది.ఫోన్ ఎత్తి
"హలో" అన్నాడు ఈశ్వర్.
"ఈశ్వరా మాట్లాడేది?" అవతల నుంచి ఒక మగ గొంతు .
"హా! మీరు?"
"నేను రామచంద్రయ్యను బాబూ."
"రామచంద్రయ్యా?" గుర్తుపట్టలేదు ఈశ్వర్.
"రామచంద్రయ్య బాబూ, పెంట్లవెల్లి నుంచి."
", yeah yeah sorry.చెప్పండి." అన్నాడు ఈశ్వర్.
తనచే కన్యాదానం చేయించుకున్న వ్యక్తి తన పేరు నే మరచిపోవటం ఆశ్చర్యంగా తోచింది రామచంద్రయ్యకు.
"బాగున్నావా బాబు?" అడిగాడు రామచంద్రయ్య.
"హా! బావున్నాను బాబాయ్ గారు. పిన్ని గారు, మీ పిల్లలూ ఎలా ఉన్నారు?" అడిగాడు ఈశ్వర్.
"హా, అందరూ బావున్నారు." బదులిచ్చాడు రామచంద్రయ్య.
"చిత్ర ఉందా బాబూ?" మళ్ళీ తానే అడిగాడు రామచంద్రయ్య.
"చిత్ర.... తను కూరగాయలు తేవటానికి బయటికి వెళ్ళింది. వచ్చాక ఫోన్ చేయిస్తాను."అన్నాడు ఈశ్వర్.
"అవునా. సరే సరే.మంచిది బాబూ"అన్నాడు రామచంద్రయ్య.
"ఉంటాను బాబాయ్ గారు." అని ఫోన్ పెట్టేశాడు ఈశ్వర్.
పెళ్ళప్పటి కంటే ఇందాక మాట్లాడినప్పుడు ఈశ్వర్ స్వరం లో తమ పట్ల కాస్త 'తడితనం' ధ్వనించింది రామచంద్రయ్యకు. ఈశ్వర్ దెగ్గర తన మేనకోడలు చిత్ర ఎలా ఉందోనని పెళ్ళైనప్పటినుంచీ ఆందోళన పడుతూ వస్తున్న రామచంద్రయ్యకు కొంత లో కొంత ఉపశమనం లభించింది.
పెళ్ళప్పుడు ఈశ్వర్ యొక్క నిర్లిప్తతకు కారణమేంటో తెలుసుకోవాలనిపించింది రామచంద్రయ్యకు అప్పుడే . కానీ అతని మనస్సుని బాధిస్తున్నదేంటో వాకబు చేసేంత 'స్థాయి ' తనకు లేదని ఆయనకు తెలుసు. కూసింతైనా తమ పై భారం లేకుండా జరుగుతున్న తన మేనకోడలి పెళ్ళికి ఎక్కడ ఎసరు వస్తుందోనని చాలా జాగ్రత్తగా, మిన్నకుండా ఉన్నాడు రామచంద్రయ్య. నిజానికి పెళ్ళి ఖాయమవ్వడంలో, ఈశ్వర్ యొక్క తల్లిదండ్రులతో జరిపిన మంతనాలల్లో , మిగిలిన పెళ్ళి విషయాల్లోనూ ఆయన భార్య జయమ్మే ముందుండి నడిపించింది. ఆయన కేవలం ప్రేక్షకపాత్ర వహించాడు. ఖర్చేమీ లేకుండా ఐపోతున్నందుకు తన భార్య చిత్ర కు సంబంధాన్ని కుదర్చటం లో చొరవ చూపిస్తున్న విషయం తెలుసాయనకి. కానీ ఆయన అప్పుడు ఏమీ మాట్లాడలేక పోయాడు. ఈశ్వర్ ని పెళ్ళిలో చూస్తున్నంత సేపూ ఆయన మనస్సులో ఎన్నో శంకలు అంకురించాయి.తరువాత ఊళ్ళో ఉన్నప్పుడు చిత్ర తనకు గుర్తొచ్చినప్పుడల్లా స్వార్థం కలగలిసిన తన మౌనం ఆమె జీవితాన్ని బలిచేయబోతోందా అన్న ప్రశ్న కలిగినప్పుడల్లా ఆయన మనస్సు అపరాధభావం తో నిండిపోసాగింది. చిత్రకు ఫోన్ చేద్దామని చాలా సార్లు అనిపించినా , ఆమెతో మాట్లాడటానికి ధైర్యం సరిపోలేదాయనకు. ఏమైనా మరీ ఎక్కువ ఇబ్బంది ఎదురైతే చిత్ర తనను సంప్రదిస్తునదన్న గుడ్డిధైర్యం కలిగి ఉన్నాడాయన. అన్నింటికీ మించి తాను భారం వేసిన శ్రీరామచంద్రుడు తన మేనకోడలికి అన్యాయం చేయడని ఆయన విశ్వాసం.
* * *
సంచిలో కూరగాయలు పట్టుకుని వచ్చింది చిత్ర. ఆమెకు ఎదురెళ్ళి కూరగాయల సంచి తీసుకున్నాడు ఈశ్వర్. సంచి తీసుకుంటూ " మీ ఊరు నుండి ఫోన్ వచ్చింది" అన్నాడు. మాట విన్న చిత్ర కళ్ళల్లో ఈశ్వర్ కి ఒక మెరుపు కనిపించింది. ఈశ్వర్ Received calls list లోంచి రామచంద్రయ్య కు డయల్ చేసి,ఫోన్ చిత్ర చేతికి ఇచ్చాడు . అటువైపు నుండి రామచంద్రయ్య గొంతు "హలో" అంది.
చిత్ర గొంతు కాస్త భావుకమవుతున్నట్టు గమంచించాడు ఈశ్వర్.
"మామా ......ఎట్లున్నవ్?" అడిగింది చిత్ర.
"బాగున్ననే బుజ్జీ. నువ్వెట్లున్నవ్?" అడిగాడు రామచంద్రయ్య.
"హా బావున్న మామా. అత్త, గీత, స్వాతి ... అందరు బావున్నరా?" అడిగింది చిత్ర.
" హా అందరం బాగున్నం" బదులిచ్చాడు రామచంద్రయ్య.
"ఇంగేంది మామా ? ఆరోగ్యం ఎట్లుంది?B.P సూపిచ్కుంటున్నవా సరిగ? ఉప్పు తక్వనే తింటున్నవా? సత్యం డాక్టర్ ఇచ్చే మందులు వాడుతున్నవా సరిగ? పై అల్కగనే ఉంటుందా? రాత్రి పూట చలిల తిరగడం బంద్ చేశినవా లేక అట్లనే తిరుగుతున్నవా ?" ప్రేమ, దాని వల్ల వచ్చే అధికారం కలగలిసిన స్వరం తో ప్రశ్నల వర్షం కురిపించింది చిత్ర.
చిత్ర కి తన మేనమామ పై ఉన్న ప్రేమని చూసి ఈశ్వర్ కి ముచ్చటేసింది.
"హా, బానే వున్ననే బుజ్జీ. ఉప్పు ఎక్కువేం ఏసుకుంటలే. బి . పి ఎక్కువేమ్లేదు. సత్యం గోలీలు మార్చిండె. ఇంగ రాత్రి పూట అప్పుడప్పుడు అవసరముంటే చలి పొవ్వ వడ్తది కదనే ఇంగ.... ఒక చలి కోటు కొన్న. మొన్న నాగర్ కర్నూల్ కి పొయినప్పుడు కొనింటి.మస్తు వెచ్చగ ఉంటది గది ఏస్కుంటె." అన్నాడు రామచంద్రయ్య.
"హా.. నేను గూడ ఈడ చలి కోటు కొన్న . ఈన ఇప్పిచ్చిండె. మస్తుంది. నాలుగు వేలంట తెల్సా?" అంది చిత్ర.
చిత్ర చెప్పింది తాను ఇప్పించిన స్వెటర్ గురించేనని గ్రహించాడు ఈశ్వర్. చిత్ర అలా తను స్వెటర్ కొనిచ్చిన విషయం వాళ్ళ మేనమామ కి చెబుతూ ఉంటే కూసింత గర్వం తో కూడిన సంతోషం కలిగింది అతడికి. ఈశ్వర్ సంగతి సంభాషణ మధ్య రావటంతో అదే అదును అనుకుని, గొంతు కాస్త సవరిచుకుని, చిత్ర తో" ఈశ్వర్ బాగ చూస్కుంటుండా? గాడేమైన ఇబ్బంది అవ్తోందా ?' అన్నాడు రామచంద్రయ్య.
"ఏం లే మామా! మంచిగున్న. ఐనా గట్లడుగుతున్నవ్ ఏంది?" అంది చిత్ర, అప్రయత్నంగా ఈశ్వర్ వైపు చూస్తూ.
రామచంద్రయ్య వాకబు చేసింది తన గురించేనని గ్రహించగలిగాడు ఈశ్వర్ తెలియని ఒక వింత భావోద్వేగం ఆవరించింది అతడిని. తాను పక్కన లేకపోతే చిత్ర మరోలా బదులిచ్చేదేమోనన్న భావన అతడికి కలిగింది ! ఎన్నో ప్రశ్నలు అతడి మస్తిష్కం లో ఉదయించాయి. చిత్ర ముందు నిలబడటానికి అతడికి ధైర్యం చాల్లేదు.
చిత్ర వైపు చూడకుండా" నాకు కొంచం పనుంది. నువ్వు మాట్లాడు." అని చిత్రకు చెప్పి గదిలోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్.
"నిజంగా బానేవున్నవా బుజ్జీ? ఆడేం ఇబ్బంది లేదు గద?" మళ్ళీ అడిగాడు రామచంద్రయ్య.
"అయ్యా!! ఏం లేదు మామా . ఐనా నీకు గా అనుమానం ఎందుకొచ్చింది? గిన్ని సాత్లు అడుగుతున్నవ్ !?" అంది చిత్ర.
మాట వినగానే రామచంద్రయ్య మనస్సు తేలికయ్యింది. ఆయన మనస్సులో వేళ్ళూనుకు పోయిన అపరాధభావం కూకటి వేళ్ళతో సహా పెకిలించబడిపోయింది.
"సంతోషమే బుజ్జీ. ఇంగో మీ అత్త మాట్లాడుతదంట జూడు" అన్నాడు రామచంద్రయ్య.
తన మేనకోడలికి ఇబ్బంది లేదని తెలుసుకున్నాక తాను ఫోన్ చేసిన ఉద్దేశ్యం తీరిపోయింది అనిపించింది ఆయనకు.
"బుజ్జీ... యినిపిస్తుందా?" అంది జయమ్మ.
" హా... యినిపిస్తుంది. ఎట్లున్నవ్ అత్తా?" అడిగింది చిత్ర.
"బాగున్ననే. నువ్వెట్లున్నవ్ ?"
"హా బావున్నత్తా."
" నువ్వు పొయ్న కాడి కెళ్ళి మస్తు గుర్తొస్తున్నవే. మీ మామకు చానా సార్లు చెప్పిన నీకు ఫోన్ జెయ్యమని. ఇరోజు చేస్త, రేపు జేస్త అని ఇంత టయిము చేశిండు." అని తన భర్త మీద ఫిర్యాదు చేసింది జయమ్మ.
చిత్ర కు మునుపెన్నడూ తన అత్త గొంతులో తన పట్ల అంత ఆప్యాయత ధ్వనించ లేదు. జయమ్మ గొంతు లోని 'తడితనం' ఆమెకు చాలా కొత్తగా, ఆనందదాయకంగా తోచింది.
' , ఏముంది లే అత్తా! ఇప్పుడు ఫోన్ చేసినవ్ గద. మాట్లాడుదం మంచిగ." అంది చిత్ర నవ్వుతూ.
ప్రపంచం తలకిందులైనా చిత్ర తన మేనమామ మీద రవ్వంత నింద కూడా పడనీయదని తెలుసు జయమ్మకి! నిజానికి చిత్ర పెళ్ళి చేసుకుని, వాళ్ళింటి నుంచి వెళ్ళాక, ఆమె లేని ఇల్లు అంత లోటుగా తనకు కనిపిస్తుందని కల్లో కూడా ఊహించలేదు జయమ్మ. చిత్ర పక్కన ఉన్నప్పుడు ఆమె విలువ తనకు తెలియలేదనిపించిందామెకు. చిత్ర పెళ్ళి గుర్తొచ్చినప్పుడల్లా చాలా అపరాధబావం కలుగుతోంది జయమ్మకు. తన కూతుళ్ళ పెళ్ళికి చిత్ర పెళ్ళి ఎక్కడ అడ్డుగా వస్తుందోనని 'చవకగా' చిత్ర పెళ్ళి అయ్యేలా చూసిన ఆమెకు చిత్ర ను తలుచుకున్నప్పుడల్లా ' తప్పు చేసానేమో ' అన్న భావన బాగా కలచివేస్తోంది. చిత్ర అక్కడ ఏం ఇబ్బంది పడుతుందోనని బాగా చింత కలుగుతోందామెకు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
" మీ ఆయ్న మంచిగ చూస్కుంటుండా బుజ్జీ?" అడిగింది జయమ్మ చాలా సూటిగా. ప్రశ్న పూర్తైన తరవాత జయమ్మ, రామచంద్రయ్యలు ఇద్దరికీ మరీ అంత 'సూటి ' గా అడిగేది లేకుండెనేమో నన్న భావన కలిగింది.
"హా... ఆయ్నకేం! మంచిగ చూస్కుంటుండు......అయ్నా ఏందత్తా నువ్వు, మామ అట్ల అడుగుతుర్రు ?" చిత్ర గొంతులో సున్నితమైన కోపం, ఆశ్చర్యం ధ్వనించాయి.
"ఏం లేదే బుజ్జీ.ఒక్క దానివే ఆడేడ్నో హైదరబాదుల ఉంటవ్ గద! అందుకే అడిగిన గంతే. ఏమనుకోవాకు. "అంది జయమ్మ కాస్త సంజాయిషీ ఇచ్చినట్టుగా క్షమాపణ కోరుతున్న స్వరం తో.
"అయ్య! గట్ల మాట్లాడతవేంది అత్తా?! నేనేమనుకుంట! నువ్వు, మామ నన్ను ఏమైన అనొచ్చత్తా. గిట్లెప్పుడు మాట్లాడకు." నొచ్చుకున్నట్టుగా చెప్పింది చిత్ర.
చిత్ర తన భర్త రామచంద్రయ్య తో పాటుగా తనను కలిపి మాట్లాడినందుకు చాలా ఆనందం వేసింది జయమ్మ కు. "కాలం ఎనిమిది సంవత్సరాలు వెనక్కి వెళితే చిత్రను తన కూతుళ్ళతో సమానంగా పెంచేదాన్ని." అని లోలోన అనుకుంది జయమ్మ. సంతోషం, బాధ లు కలగలిసిన వింత భావోద్వేగం కలిగింది ఆమెకు.
"బుజ్జీ...." అంది జయమ్మ.జయమ్మ తనను పిలిచినప్పుడు స్వరం లో అంత 'తడి ' చిత్రకు ఎప్పుడూ కనిపించలేదు.
"చెప్పత్తా..." అంది చిత్ర.
"నువ్వు బాగుంటె చాలే బుజ్జీ. అయినా నువ్వేడుంటె ఆడ అందరు సంతోషంగ ఉంటరు. మీ ఆయ్నని అడిగిన అని జెప్పు. హైదరబాద్ కి రానీకె ప్రయత్నం జేస్త నేను. నిన్ను సూడాలని పానం లాగుతోంది నాకు." అంది జయమ్మ.
"రా అత్తా. నిన్ను, మామ ని నాక్కూడ సూడాలనిపిస్తోంది."
"వస్తమే బుజ్జీ. గదేందో సర్కార్ నుంచి పైసలొచ్చేవున్నయంట. మధ్యల ఎందుకో ఆగిపొయ్నయంట. గా పని మీద మీ మామ తిరుగుతుండు. గదేందో సక్కపడ్నాక వస్తం మేం." అంది జయమ్మ.
"మామ ను వేళ కు తినమని చెప్పత్తా. ఉప్పు, కారం తక్కువెయ్యి. సత్యం డాక్టర్ దెగ్గరికి వారానికొకసారి పొయి బి.పి సూపిచ్కొమ్మను. ఆగం ఆగం తిరుగుతడూకె. పైసలొస్తయని ఆరోగ్యం చెడగొట్కుంటడు." తన మామ ఆరోగ్యం పై ఉన్న ఆందోళనను బయట పెట్టింది చిత్ర.
"గా మనిషి నేను జెప్తే యింటడా?! నువ్వుండంగ నీకు భయపడి జెర ఆరోగ్యం సూస్కుంటుండె. నువ్వు పొయ్నాంక ఇంగ ఆగం ఆగం తిరుగుతుండు." వాపోయింది జయమ్మ.
జయమ్మ మాటలు విన్నాక చిత్రకు తన మామ ఆరోగ్యం పై ఆందోళన ఎక్కువైంది.
"నువ్వు బాగా సూస్కో అత్తా మామను. ఫోన్ జేస్తుండు అత్తా. మామ జాగ్రత్త. ఏదీ ఒకసారి ఇయ్యి ఫోన్ మామకి." అంది చిత్ర కాస్త భావుకత కలిగిన స్వరం తో.
జయమ్మ ఫోన్ రామచంద్రయ్య చేతిలో పెట్టింది. కాస్త జంకుతూ ఫోన్ తీసుకున్నాడు రామచంద్రయ్య చిత్ర ఏం చివాట్లు పెడుతుందోనని !
"హలో" అన్నాడు రామచంద్రయ్య.
"ఏమి నువ్వేమో అట్ల చెప్తివి. అత్తనేమో వేరే లాగ చెప్తోంది?" అంది చిత్ర.
" మీ అత్త ఊకనే అట్ల జెప్తది. మంచిగనే వాడుతున్న గోలీలు." అన్నాడు రామచంద్రయ్య.
"మామా...."అని ఒక్క క్షణం ఆగి" జెర అత్త చెప్పినట్టు విను మామా. నువ్వు ఇంగా సోరోడివి గావు. ముసలిగైనవ్. నీకు చానా దూరం ఉన్న నేను. నన్ను నీ గురించి చింత చెయ్యనీకు మామా. మందులు సక్కగ వాడు. జెర ఆరోగ్యం బాగ సూస్కో." అంది చిత్ర భావుకమవుతూ.
"సరే బుజ్జీ." అన్నాడు రామచంద్రయ్య చాలా నిజాయితీగా. ఆయన పై కట్టుకున్న భార్య చెప్పిన మాటల కన్నా మేన కోడలు చెప్పిన హితవు ఎక్కువగా ప్రభావం చూపింది.
"గీత, స్వాతి లు ఎట్లుర్రు? ఉన్నరా పక్కన్నే?" అడిగింది చిత్ర.
"లేదు... వాళ్ళు అలివేలమ్మ అత్త కాడికి పోయిర్రు."
" ... వాళ్ళని అడిగినట్టు చెప్పు మామా. ఫోన్ చేపియ్యి వాళ్ళతోని వాళ్ళు వొచ్చినాక. ఇద్దరి తోటి మాట్లాడీ చానా రోజులైంది. " అంది చిత్ర.
" చేపిస్త... ఉంటనే బుజ్జీ. జాగ్రత్త." తన మేన కోడలి తో ఎట్టకేలకు మాట్లాడానన్న తృప్తి కలిగిన స్వరం తో అన్నాడు రామచంద్రయ్య.
" హా సరే మామా. మళ్ళా చెప్తున్న. ఆరోగ్యం బాగ సూస్కో." అంది చిత్ర.
సరిగ్గా వారి సంభాషణ ముగిసిన మరుక్షణం గది లోనుంచి బయటకు వచ్చాడు ఈశ్వర్. చిత్ర చేతిలోని తన ఫోన్ తీస్కున్నాడు. గదిలో ఉన్న వ్యక్తికి తన సంభాషణ ముగిసిన విషయం ఎలా తెలీసిందోనని ఆశ్చర్యం కలిగింది చిత్రకి.
నిజానికి ఈశ్వర్ తలుపు చాటుగా చిత్ర యొక్క ఫోన్ సంభాషణ ని వింటూనే ఉన్నాడు. తాను చిత్ర ని బాగా చూస్కుంటున్నట్టు చిత్ర ఆమె తరఫు వాళ్ళకు చెప్పటం చాలా ఆలోచింపజేస్తోందతడిని. చిత్ర తన గూర్చి అంత 'మంచి ' గా చెప్పటం చాలా అపరాధభావాన్ని కలిగిస్తోందతడికి. ఒక్క సారిగా అతడికి చనిపోయిన అమృత స్ఫురించింది. ఈశ్వర్ కు ఒక్క క్షణం అమృత, చిత్ర మధ్య తాను నలిగిపోతున్నట్టుగా తోచింది !!
* * *
రోజు రాత్రి భోజనం చేశాక ఇద్దరూ వాకింగ్ కి వెళ్ళారు. చిత్ర కు అనవసరంగా 'ఖరీదైన ' స్వెటర్ ఇప్పించాననుకున్నాడు ఈశ్వర్.చిత్ర కు తన భర్త తో పెంట్లవెల్లి నుండి ఫోన్ వచ్చిన ఆనందాన్ని మరింతగా పంచుకోవాలని అనిపించసాగింది. ఐదు నిమిషాల ప్రయత్నపూర్వకమైన మౌనం తరవాత తన భర్త తో
"లాస్టుకి ఇప్పుడు చేశిర్రు మామోళ్ళు ఫోను." అంది చిత్ర.
"ఊళ్ళో అందరూ బావున్నారా?" అడిగాడు ఈశ్వర్, ఆమె మాటకి సమాధానం గా, అతనికి చిత్ర మాట అనేటప్పుడు, ఆమె గొంతులోని సంతోషం చాలా ఆకర్షణీయంగా అనిపించింది.
" హా బావున్నరు." అంది చిత్ర ఈశ్వర్ తనను తన వాళ్ళ గురించి ఈశ్వర్ అడిగాడని ఆనందపడిపోతూ.
" అత్త గూడ మంచిగ మాట్లడిండె." ఉత్సాహాన్ని కొనసాగిస్తూ చెప్పింది చిత్ర.
".... ఆమె ఇంతకముందు నీతో సరిగా మాట్లాడకపోయేదా ?" అడిగాడు ఈశ్వర్, ప్రశ్న పూర్తయ్యాక, అనవసరంగా చిత్ర ను గాయపరిచే ప్రశ్న ను అడిగానని పించించి అతనికి.
చిత్ర జాగరుకురాలు అయ్యింది. తన మేనమామ దెగ్గర తను సంతోషంగా పెరగలేదని తన భర్త అనుకుంటాడేమో ననుకుంది చిత్ర.
"అయ్య, అట్లేమ్లే. మామలాగనే అత్త గూడ నన్ను మస్తు సూస్కుంటుండె. అత్త సొంత బిడ్డ లెక్క సూస్కుంది నన్ను"
 
" నిన్ను నిజంగా అంత బాగా చూస్కుంటే ఖర్చు లేకుండా జరుగుతోందని నిన్ను నా లాంటి వాడికి ఇచ్చి పెళ్ళి చేసేది కాదు. " అన్న మాట ఈశ్వర్ గొంతు దాక వచ్చి ఆగిపోయింది !!!
కృత్రిమమైన చిరునవ్వొకటి చిత్ర వైపు విసిరాడు ఈశ్వర్.
" గీత, స్వాతి లు ఇద్దరు మిస్సయ్యిండె. వాళ్ళు గూడ ఉండింటే మాట్లాడుతుంటి మంచిగ. పని ఐపోవు." అంది చిత్ర, తన సంభాషణని కొనసాగించ దలచినదై.
" మీ మామయ్య పిల్లలా వాళ్ళు?"
" హా అవ్ను. మా అలివేలమ్మ అత్త. గదే మా అత్త వాళ్ళ చెల్లి కాడికి పొయిర్రంట. వాళ్ళొచ్చినాక ఫోన్ జేపిస్త అన్నడు మామ. కానీ జేపిస్తడో లేదో ?!"అంది చిత్ర కాస్త నిరుత్సాహం కలిగిన స్వరం తో, రామచంద్రయ్య ఫోన్ చేస్తాడో లేదో నన్న సందేహం కలదై.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
" మరి నువ్వే ఫోన్ చేయొచ్చుగా. వాళ్ళతో అంతగా మాట్లాడాలనిపించినప్పుడు వాళ్ళు ఫోన్ చేసే వరకు wait చేయడమెందుకు చెప్పు ?! " అన్నాడు ఈశ్వర్, చిత్ర తన పుట్టింటి పై గల మమకారాన్ని చూసి తనకు ముచ్చటేయడం వల్ల.
"ఉండన్లే నీకు ఫోన్ అవ్సరమౌతది గద. అమెరికా కెళ్ళి ఫోన్లు వొస్తుంటయ్ నీకు. మళ్ళ నా ఫోన్లు నీకు అడ్డమౌతయ్ ." అంది చిత్ర, నిజాయితీగా. పని ఒత్తిడి లో కనిపిస్తున్న తన భర్తకి లేశమైన ఇబ్బంది కూడా కలిగించగూడదన్న నిశ్చయం కలదై.
"అలా ఏం లేదులే. ఒక్కసారి నువ్వు మాట్లాడితే మరీ కొంపలేమి మునిగిపోవు." అన్నాడు ఈశ్వర్.
"ఉండన్లే. వాళ్ళే జేస్తరు గాని." అంది చిత్ర.
"సరే మనం ఇంకో ఫోన్ కొందాం. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో నీకు ఇష్టం వచ్చినంత సేపు నువ్వు మాట్లాడొచ్చు. సరేనా?" అన్నాడు ఈశ్వర్.
"నాకు ఫోనెందుకు?! ఉండన్లే." అంది చిత్ర.
ఊరుకున్నాడు ఈశ్వర్.
వాకింగ్ ముగించుకుని ఇంటికి వెళ్ళాక తన లాప్టాప్ ని ముందు ఉంచుకుని, latest Android phones కోసం వెతకడం ప్రారంభించాడు ఈశ్వర్. అతనికి one plus 3T ఫోన్ బాగా నచ్చింది. గది లోపల ఉన్న చిత్రను కేకేసి పిలిచి, తన పక్కన కూర్చోమని చెప్పి స్క్రీన్ పైన ఉన్న ఫోన్ images చూపించాడు ఈశ్వర్.
"బావుందా ఫోన్? నచ్చిందా?" అడిగాడు.
"ఇప్పుడెందుకు ఇవన్ని..." అని ఏదో చెప్పబోయింది చిత్ర.
"బావుందా లేదా చెప్పు" అన్నాడు ఈశ్వర్.
"బావుంది."
వెంటనే ఫోన్ ఆర్డర్ పెట్టెశాడు ఈశ్వర్.
" మంగళ వారం లోపు delivery అవుతుందంట ఫోన్. " అన్నాడు ఈశ్వర్.
" సరే.... ఎంత ఫోన్ ?" వాకబుగా అడిగింది చిత్ర 'మెల్లిగా'.
"ముప్పై వేలు" అని నిజం చెప్పబోయి, 4 వేల స్వెటర్ కే చిత్ర 'క్లాసు ' పీకిన విషయం గుర్తొచ్చి
" మూడు వేలు." అని అబద్దమాడాడు ఈశ్వర్. తను అబద్దమాడాల్సినంతగా చిత్ర తనని భయపెట్టడం ఆశ్చర్యంగా తోచింది ఈశ్వర్ కి!
-------------------------సశేషం. -------------------------
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
Excellent wonderful update  clps yourock thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
అది భయం కాదని, చిత్ర మనసును కష్టపెట్టకూడదన్న ఇష్టమని ఈశ్వర్ కు ఇంకా అర్థం కాలే
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
Nice update s
[+] 1 user Likes Vvrao19761976's post
Like Reply
nice. strory
[+] 1 user Likes nalininaidu's post
Like Reply
ఏందుకో ఈ కథ చదువుతున్నాపుడు చాల ఆనందంగా ఉంటుంది
[+] 1 user Likes Vishnupuku's post
Like Reply
ముడి- 19
గత గంట సేపటి నుండి చిత్ర టి.వి చానళ్ళను ఒక్కొక్కటిగా మారుస్తూనే ఉంది. తన భర్త ఇంట్లో లేకపోయే సరికి ఆమెకు టి.వి చూడటం కూడా విసుగ్గా అనిపించింది. తన భర్త ఇంట్లో లేడని తెలిసినా రోజూ అతను కూర్చుని పని చేసుకునే చోటు వైపు అప్రయత్నంగా తాను పదే పదే చూడటం వింతగా తోచింది చిత్ర కు.
పట్నం లో ఛానళ్ళు ఎక్కువయి ఇబ్బందవుతోందని అనిపించింది చిత్రకు. ఊళ్ళో ఉన్నప్పుడు పుల్లయ్య కేబుల్ టి.వి లో వచ్చే ఐదు ఛానళ్ళు చూడటమే సులువని పించింది ఆమెకు.
"ఏందో ఏమో, గీ మనిషి వారానికోసారి ఇట్ల ఆఫీసుకని పోతెనే ఎట్లనో అవ్తుంది. రోజు గాని పొయ్యిండంటె ఇంగ నేనెట్ల బతుకుతుంటినో ఏమో." అనుకుంది చిత్ర మనస్సులో.
తన భర్త తనకు కొనిపించిన ఫోన్ ని తేరిపారా చూస్కుంది. కనీసం ఒక్క మనిషికైనా తన భర్త ఆమెకు ఇప్పించిన ఫొన్ ని చూపించాలన్న కోరిక చిత్రకు బలంగా కలగసాగింది. తనకు ఇబ్బంది కలుగుతుందేమోనని తన కోసం ఆలోచించి మరీ తన భర్త తనకు ఇప్పించిన ఫోన్ ని ప్రదర్శించకపోతే రోజు రాత్రి ఆమెకు నిద్రపట్టనట్టుగా అనిపించింది.
"గిప్పుడొక్కసారి గా వకీలు శ్రీనివాసరావ్ భార్య రుక్మిణమ్మ ఉండాల్సింది పక్కన. మస్తు మజా ఒస్తుండె. వాళ్ళొక్కరి కాడనే సెల్ ఫోను ఉన్నట్టు మస్తు ఓవరు ఆక్శను జేస్తుండె." అనుకుంది చిత్ర మనస్సులో.
ఫోన్ ఎవరి ముందు ప్రదర్శించాలో ఆలోచిస్తున్న ఆమెకు శ్రీజ గుర్తుకు వచ్చింది. అమెతో బాటు చిత్రకు అభిరాం గుర్తుకు వచ్చాడు. వాడి కళ్ళల్లోని అల్లరి గుర్తొచ్చి చాలా ముద్దొచ్చింది ఆమెకి. తన ఇంటికి తాళం వేసుకుని , చేతిలో ఫోన్ ని పట్టుకుని శ్రీజ వాళ్ళ ఇంటికి బయలుదేరింది చిత్ర. ముందు తన భర్త ఆమెకు ఇప్పించిన స్వెటర్ కూడా వేసుకుందామనుకున్నా, మిట్ట మధ్యాహ్నం పూట స్వెటర్ వేసుకువెళితే అంతగా బావుండదన్న ఆలోచన కలిగి, స్వెటర్ వేసుకునే ప్రయత్నాన్ని విరమించుకుంది చిత్ర.
చిత్ర రాకకు సంతోషించింది శ్రీజ. అభిరాం కి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ని నేర్పిస్తూ ఉంది శ్రీజ. అభిరాం ని చూసి చిత్ర ఒక చిరునవ్వు నవ్వింది. వాడు మాత్రం " నవ్వింది చాలు, వచ్చిన పని చూస్కుని వెళ్ళు. " అని చూపులతోనే బదులిచ్చాడు.
"ఈన ఆఫీసుకి పొయ్యిండె, ఇంటికాడ బోరు కొట్టిండె. అందుకె వొచ్చిన, గిట్ల నిన్ను సూశిపోదమని." అంది చిత్ర, తన ఫోన్ ని తన రెండు చేతులతో ఆడిస్తూ.
"హా అవును, మా హస్బెండ్ చెప్పాడు, ఈశ్వర్ సర్ కి ఏదో మీటింగ్ ఉందట. ఇద్దరూ మార్నింగ్ కలిసే వెళ్ళారు ఆఫీస్ కి." తనకు తెలిసిన సమాచారాన్ని ఇచ్చింది శ్రీజ.
బదులుగా మందహాసం చేసింది చిత్ర. శ్రీజ దృష్టిలో పడేట్టుగా ఇంకాస్త ఎక్కువగా ఫోన్ ఆడిద్దామనుకుని, తనకే కాస్త సిగ్గు కలిగి, ఊరుకుంది చిత్ర.
అసంకల్పితంగా శ్రీజ చూపు చిత్ర చేతిలోని కొత్తదనం వల్ల మెరుస్తున్న ఫోన్ పై పడింది.
"ఫోన్ కొత్తదా మేడం ?" అడిగింది శ్రీజ.
చిత్రకు తనొచ్చిన పని విజయవంతమైనందుకు సంతోషం వేసింది చాలా.
"హా అవ్ను. ఇరోజే ఒచ్చింది, గదేందో అమెజానోళ్ళంట.. తెచ్చిచ్చిర్రు. సాయంత్రం ఈనొచ్చి నేర్పుతడంట ఎట్ల వాడాల్నో." అంది చిత్ర నిండుగా నవ్వుతూ.
సెల్ ఫోన్ వాడుక తెలియని వాళ్ళు కూడా ఉన్నారని చిత్రని చూసి తెలుసుకుని కాస్త ఆశ్చర్యపోయింది శ్రీజ. కానీ ఆమె మనస్సుకి చిత్ర ని చిన్నచూపు తో చూడాలనిపించలేదు. ఆమెలో ఏదో ఔచిత్యం కనబడింది శ్రీజ కు. చిత్ర, ఈశ్వర్ దంపతులు , మాటలు రాని తన కొడుకును మిగిలిన వాళ్లలా ' వింత వస్తువు ' గా చూడకుండా, ' మామూలుగా' చూసిన వైనం ఆమెకు బాగా నచ్చింది.అంతే కాక, తన భర్త పట్ల ఈశ్వర్ చూపిన మంచిదనం ఆమెకు తెలుసు. దంపతుల మీద ఒక విధమైన అభిమానం కలగసాగింది శ్రీజకు.
తను చిత్రకు ఫోన్ వాడకాన్ని నేర్పిద్దామనుకుని, చిత్ర అలా తను ఆమెకు నేర్పిస్తే నొచ్చుకుంటుందేమో నని ఊరుకుంది శ్రీజ.
" అవ్నూ , మీ ఆయ్న రోజు పోతడు ఆఫీసుకు , మా ఆయ్న లెక్క ... అదేంది... వర్కు ఫ్రం హోము జెయనీకె రాదా?" అడిగింది చిత్ర.
"ఈశ్వర్ సార్ హోదా పెద్దది మేడం, ఈన సార్ దెగ్గర సబ్ ఆర్డినేట్ గా చేస్తారు. ఈశ్వర్ సార్ కేడర్ వాళ్ళకు ఇంట్లో నుండే పని చేసే ఆప్షన్ ఉంటుంది." అంది శ్రీజ.
శ్రీజ చెప్పింది పూర్తిగా అర్థం కాకున్నా, తన భర్త హోదా పెద్దదని మాత్రం అర్థమైంది చిత్రకు. గర్వం , సంతోషం కలగలిసిన భావోద్వేగం కలిగిందామెకు.
"ఏమో గాని, మద్యన మూడు నాల్గు రోజుల కెళ్ళి ఈనకి మస్తు పనెక్కువయింది. ఏందో క్లైంట్లు అమెరికా కెళ్ళి పనెక్కువ జెప్తుర్రు అంటుండు. " అంది చిత్ర, తన భర్త మీద కాస్త బెంగ పడుతూ.
"హా, అవ్ను. మా ఆయన కూడా అదే చెప్పాడు. పాపం ఈశ్వర్ సార్ పై బర్డేన్ ఎక్కువగా పడుతోందని..... చాలా సిన్సియర్ గా పనిచేస్తాడంట సార్ , ఈన ఎప్పుడూ చెబుతుంటాడు... నిజానికి ఈన జాయిన్ అయిన కొత్తలో చాలా హెల్ప్ చేసాడంట సార్. వర్క్ లోడ్ ఒకేసారి వేయకుండా ఈన పని నేర్చుకునేవరకు సార్ చేస్కునేవారట వర్క్ మొత్తం. వేరే వాళ్ళెవరయినా ఉండుంటె ఈన చాలా ఇబ్బంది పడేవాడంట, చెబుతుంటాడు ఎప్పుడూ." స్వరం లో కృతగ్న్యతా భావం తో చెప్పింది శ్రీజ.
తన భర్తను వరసగా అంత పొగిడేసరికి చిత్రకు తట్టుకోలేనంతగా గర్వం, సంతోషం కలిగాయి.
"అందులేముంది లే." అని లోపల బాగా ఆనందపడుతున్నా, బయటికి మాత్రం అదేదో సాధారణ విషమైనట్టుగా ముఖం పెట్టింది చిత్ర.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
వాళ్ళిద్దరి సంభాషణని వింటూ ఉన్నాడు అభిరాం . వాడికి వాళ్ళ సంభాషణ చాలా విసుగ్గా అనిపించింది. చిత్ర రాక వల్ల తన పై తన తల్లి యొక్క శ్రద్ద గత ఐదు నిమిషాలుగా తగ్గిందని అనిపించింది అభిరాం కి. వెంటనే ఒక్క సారి గట్టిగా తన గొంతు సవరించుకుని, తనకు అలవాటైన విధంగా చిత్ర కర్ణభేరి కి తూట్లు పడేంతలా అరవడం ప్రారంభించాడు.
తన సుపుత్రుడు తన మాట వినడని తెలిసినా, చిత్ర ముందు తన ప్రయత్నం తాను చేస్తున్నట్టుగా నైనా కనిపించాలని అభిరాం తో " అభీ, it is bad manners to make noise like that ! see, aunty thinks that you are a bad boy and she says to all people that you are a bad boy." అంది శ్రీజ.
హైదరాబాద్ లో తనకు తప్ప అందరికీ ఇంగ్లీష్ బాగా వచ్చినట్టుగా అనిపించింది చిత్రకు. వాడు చిత్ర వైపు చూసాడు, చిత్ర కు ఏం చేయాలో తెలియక, మళ్ళీ మందహాసం చేసింది. వాడు మాత్రం చిత్ర వైపు తిరిగి, " నీకు అంత సీన్ ఉందా? " అని చిత్రను చూపులతోనే అడిగాడు.
"నో... దిస్ బాయ్, వెరీ గుడ్డ్ బాయ్." అంటూ వాడి బుగ్గను పట్టుకుని మెల్లిగా గిల్లింది చిత్ర.
వాడు చిత్ర ని కిందికీ, పైకీ " ఏందీ నీ బాద?" అన్నట్టుగా చూసి, వాళ్ళమ్మ వైపు తిరిగి, తనకిష్టమైన చాక్లెట్ కోసం అరవడం ప్రారంభించాడు.
వాడు చేస్తున్న సైగలను చూసిన శ్రీజకు వాడు చాక్లెట్ కోసమే అరుస్తున్నాడని అర్థమైంది. వెంటనే వడి వడిగా ఫ్రిజ్ వద్దకు నడిచింది శ్రీజ. వాడు వాడి అరుపుకు స్వల్ప విరామాన్నిచ్చి, ఫ్రిజ్ లో చాక్లెట్ కోసం వెతుకుతున్న వాళ్ళ అమ్మ వైపు చూడసాగాడు. ఆమె శరీరభాష గమనించిన వాడికి, అక్కడ చాక్లెట్లు లేవని ఆమెకు అర్థమైందని వాడికి అర్థమైంది.
వాడు సారి తన గొంతుని మరింత బాగా సవరించుకోసాగాడు. చిత్ర, శ్రీజలు వాడి గొంతు సవరింపు విని భయపడసాగారు.
"వేట్ .... కుక్ సలాడ్?యూ ఈటా?" అంది చిత్ర, ఏదో ఆలోచన వచ్చినదై.
ఒక్క క్షణం అనుమానంగా చిత్ర వైపు చూసాడు అభిరాం, వాడికి చిత్ర అంతకముందు పెట్టిన ' కోకోనట్ సలాడ్ ' గుర్తుకు వచ్చింది. "సరే ఏదోటి తొందరగా తీసుకురా. " అన్నట్టుగా ముఖం పెట్టాడు అభిరాం.
చిత్ర శ్రీజకు సైగ చేస్తూ శ్రీజ వాళ్ళింటి వంటింటి వైపు వెళ్ళింది. శ్రీజ ఆమెను అనుసరించింది.
చిత్ర ఎడమ చేతిలో తన భర్త తనకు ఇప్పించిన కొత్త సెల్ ఫోన్ ని పట్టుకునే వంటింటిలోకి వెళ్ళింది. తన భర్త తనకు ఇచ్చిన సెల్ ఫోన్ ని వదిలి ఉండబుద్ది కాలేదామెకు.తన సుపుత్రుడి వల్ల చిత్ర ఏమైనా విసుగు తెచ్చుకుంటుందేమో నని పరికించి చూసింది శ్రీజ. కానీ చిత్ర ముఖం పై ఎలాంటి విసుగు ఛాయలు ఆమెకు కానరాక పోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది.
"మీ ఇంట్ల కొబ్బరుందా?" అడిగింది చిత్ర, శ్రీజ వంక చూస్తూ.
"....లేదు." ఐదు క్షణాల పాటు ఆలోచించి బదులిచ్చింది శ్రీజ.
".." అంది చిత్ర, హాల్లో సోఫా పై కూర్చుని, గోడ గడియారం వంక చూస్తున్న అభిరాం ని చూస్తూ.
" అయ్యో, పర్లేదు మేడం , వాడు కాసేపు అరిచి, సర్దుకుంటాడు లెండి." అంది శ్రీజ, చిత్ర ఇబ్బంది పడుతుందేమో నన్న భావన కలదై.
"అయ్య, ఉండన్లె! చిన్న పిలగాడు గద, గట్ల అల్లరి జేస్తెనే ముద్దుగుంటది సూడనీకె. " అంది చిత్ర నవ్వుతూ.
శ్రీజకు మరి కాస్త సంతోషం కలిగింది, చిత్ర తన కొడుకు పట్ల చూపుతున్న ' తడితనానికి ' .
" బెల్లమూ, బుడ్డలూ ఉన్నయా ?" అడిగింది చిత్ర.
"బుడ్డలా?!" అడిగింది శ్రీజ, కాస్త అయోమయానికి గురై.
"అదే....అయ్య, బుడ్డల్ తెల్వవా?! హవ్వ! ..... అదే... పల్లీలు, పల్లీలు!"
".... ఉన్నాయి." అంటూ పల్లీల డబ్బాకై వెదుకులాట ప్రారంభించింది శ్రీజ. గుర్తుగా వస్తువులు పెట్టుకోకుండా అనవసరంగా వెతుకుతుందని తన భర్త ఎప్పుడూ చేసే ఫిర్యాదు నిజమేననిపించింది శ్రీజకు.
తన పెంట్లవెల్లి యాస పట్నం లోని జనాలకి బాగా ఇబ్బంది కలిగిస్తోందని మరోసారి అర్థమైంది చిత్రకు. ఒక్క క్షణం తన యాస వల్ల తన భర్త ఇబ్బంది పడుతుంటాడేమో నన్న భావన కలిగింది చిత్రకు. కానీ తన భర్త తన మాటతీరు పట్ల ఒక్కసారి కూడా విసుగు అన్నది చూపించకపోవడాన్ని గుర్తు తెచ్చుకుని మురిసిపోయింది చిత్ర లోలోన. రాను రాను తన భర్త ఏం చేసినా తన అపురూపురంగా కనిపిస్తున్నాయన్న భావన కలిగి నవ్వుకుంది చిత్ర.
"ఏమైంది? ఏమైనా గుర్తొచ్చిందా? మీలో మీరే నవ్వుతున్నారు?" అడిగింది శ్రీజ, కాస్త చనువు తీసుకుని, చిత్ర చేతిలో పల్లీల డబ్బా పెడుతూ.
"ఏమ్లే ఏమ్లే... మీ పిలగానికి పల్లీలు పడ్తయా బానే ?"
"హా... వాడికి ఏవైనా అరుగుతాయి తోందరగా, అదే గా నా తలనొప్పి !"
"బెల్లం ఉందా?" అంది చిత్ర, నవ్వుతూ.
"హా..." అంటూ మళ్ళీ తన వెదుకులాట ప్రారంభించింది శ్రీజ.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
"మీ అబిరాము మస్తు నచ్చిండు నాకు. గిట్ల ఒస్తుంట అప్పుడప్పుడు, ఈన ఇంట్ల లేనప్పుడు. సరేనా?" అంది చిత్ర, హాల్లో నోట్ బుక్ లోని పేజీని చించి రాకెట్ చేస్తున్న అభిరాం వైపు చిరునవ్వుతో చూస్తూ.
"అయ్యో! రండి మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు. నాకు కూడా బోర్ కొడుతుంటుంది అప్పుడప్పుడు. కొత్త ప్లేస్ అనేసరికి భయపడ్డాను నేను. కానీ మీరున్నందుకు చాలా బెటర్ అనిపించింది నాకు." నిజాయితీగా చెప్పింది శ్రీజ.
ఎట్టకేలకు బెల్లం డబ్బాను చిత్ర చేతికి ఇచ్చింది శ్రీజ. కాస్త బెల్లం గడ్డను తీసుకుని ముక్కలు ముక్కలు గా చేయసాగింది చిత్ర. బెల్లం ముక్కల్ని పల్లీల్లో కలిపి ' సలాడ్ ' ని పూర్తి చేసింది.
శ్రీజ, చిత్ర లు ఇద్దరూ హాల్లో తాను చించిన రెండవ కాగితంతో కత్తి పడవ చేయాలో, లేక మళ్ళీ రాకెట్ చేయాలో తేల్చుకోలేక సతమౌతున్న అభిరాం వద్దకు వెళ్ళారు.
" ఈట్ దిస్...దిస్...దిస్..."
"గ్రౌండ్ నట్ సలాడ్." అంటూ చిత్ర అవస్థను గమనించి వాక్యాన్ని పూర్తి చేసింది శ్రీజ.
"టేక్ అండ్ ఈట్ ." అంటూ అభిరాం చేతికి స్టీలు కప్పునూ, చెంచానూ ఇచ్చింది చిత్ర.
వాడు ' సలాడ్ ' ని స్పూన్ తో కాస్త తోడుకుని నోట్లో పెట్టుకున్నాడు.
చిత్ర వైపుగా తిరిగి " పర్లేదు, బాగానే చేసావ్ ! " అన్నట్టుగా హావభావాన్ని ప్రకటించాడు.
శ్రీజ, చిత్రలు ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.
అభిరాం టి.వి పెట్టుకుని డోరేమాన్ కార్టూన్ చూడసాగాడు.
శ్రీజ, చిత్ర లు ఇద్దరూ పిచ్చాపాటీ బెడ్ రూం లోకి వెళ్ళి మాట్లాడుకోసాగారు. శ్రీజ తన మాటల్లో తన కొడుకు అభిరాం కి మాటలు రావడానికి చేసిన ప్రయత్నాలూ, అవన్నీ విఫలమైన విషయాలూ అన్నీ చెప్పసాగింది. చిత్రకు అభిరాం విషయమై చాలా జాలి కలిగింది. కానీ తను జాలి పడ్డట్టుగా బయటపడితే శ్రీజ నొచ్చుకుంటుందేమో నని ఊరుకుంది చిత్ర.
" అయినా గీ మద్య మనం వార్తలల్ల సూస్తనే ఉన్నం గద, సయింటిస్టులు ఏదోటి చేస్తరు గానిలే అబిరాము కోసము." అంది చిత్ర, ఏమని మాట్లాడాలో తెలియక.
" ఆశ పోతోంది మేడం రోజురోజుకి. భయం వేస్తుంటుంది కూడా అప్పుడప్పుడు. మా ఆయన నా కన్నా ఎక్కువ బెంగ పెట్టుకున్నాడు వాడి మీద. వీడు చాలా చాలా మొండి. ఎప్పటికీ మేమిద్దరం ఉండం కదా మేడం, మా తరవాత వాడి పరిస్థితేంటో ఆలోచిస్తేనే భయమేస్తూ ఉంటుంది." అంటూ చమర్చిన తన కళ్ళను తుడుచుకుంది శ్రీజ, ఎన్నో రోజుల నుండి తన మనస్సు పొరల్లో ఉన్న బాధను బయటపెట్టడానికి చిత్ర సరైన వ్యక్తిగా తోచింది శ్రీజకు.
చిత్ర ఆమెను దెగ్గరికి తీసుకుని,
" సూడు స్రీజా, మీరప్పుడే చేతులెత్తేస్తె ఎట్ల జెప్పండి? మీ వోడు మస్తు మంచిగ బతుకుతడు. మస్తు ఉషారుండు మీ అబిరాము." అంది చిత్ర.
శ్రీజ ఇంకా బాధలోనే ఉందని అర్థం చేస్కుంది చిత్ర. ఏదైనా మాట్లాడి విషయాన్ని మరల్చాలనుకుంది. వెంటనే ఆమెకు తన చేతిలో ఉన్న ఫోన్ కనిపించింది.
" స్రీజా, గీ ఫోను ఎట్ల వాడాల్నో జెర సూపిస్తవా? ఈన ఒచ్చే వరకు ఆగబుద్ది అవ్తలే. " అంది చిత్ర.
తన భర్త తనకు విపులంగా సెల్ ఫోన్ వాడకాన్ని గురించి చెబుతుంటే విందామని కలలు కన్న తను ఇలా శ్రీజ తో అనడం తాను చేస్తున్న గొప్ప త్యాగం గా భావించుకుంది చిత్ర. ఒక వేళ శ్రీజ తనకు అర్థమయ్యేలా వివరించినా కూడా, తన భర్త దెగ్గర ఏమీ రానట్టుగా నటించి , మళ్ళీ తన భర్త తో చెప్పించుకోవొచ్చులే నని తనకు తాను సర్ది చెప్పుకుంది.
శ్రీజ తన కళ్ళు తుడుచుకుని, చిత్ర చేతుల్లోనుంచి ఫోన్ తీసుకుని, ఫోన్ ని పరికించి చూడసాగింది.
" వన్ ప్లస్ త్రీ టి... నైస్ చాయిస్ . ఫోన్ కన్నా నన్నడిగితే ఆండ్రాయిడ్ ఫోన్సే బెటర్. చాలా లిమిటేషన్స్ ఉంటున్నాయి ఫోన్స్ లో మధ్య. అన్ని ఆప్స్ దొరకవు.డౌన్లోడ్ చేస్కోవాలన్నా తలనొప్పి. బాగా కాస్ట్లీ కూడా అయ్యాయి అవి. ఇదైతే తర్టీ థౌసండ్ లోనే వస్తుంది. " అంది శ్రీజ.
"ఏందీ? ! " అంది చిత్ర, నోరు తెరిచి.
"అదే.. ఫోన్ బాగుంది అని చెప్తున్నా." అంది శ్రీజ, చిత్రకు అర్థం కాని విషయాలేవేవో చెప్పి, ఆమె నొచ్చుకునేలా చేశానేమో నన్న భావన కలిగిందామెకు.
"ఇది ముప్పైవేలా ఫోను? మూడు వేలు కాదా?" అడిగింది చిత్ర.
" అయ్యో, కాదు. మూడు వేలకి ఫోన్ బాటరీ కూడా రాదు." అంది శ్రీజ, చిత్ర అడిగిన 'వింత ' ప్రశ్నకు కాస్త ఆశ్చర్యపోతూ.
"..." అంది చిత్ర.
శ్రీజ చిత్రకు ఫోన్ వాడకం లోని బేసిక్స్ చెప్పసాగింది. చిత్ర కు మాత్రం తన భర్త ఫోన్ ఖరీదు మూడు వేలే నని చెప్పిన విషయమే గుర్తుకు రాసాగింది.
***
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
రాత్రి భోజనాన్ని ముగించుకుని వాకింగ్ కు బయలుదేరారు ఈశ్వర్, చిత్ర లు.
"ఇదో...నీకు ఏమన్న విసుగు నేను గీన తెప్పిస్తే నువ్వు నన్ను తిట్టొచ్చు . అర్తమవ్తుందా? నేనేమనుకోను. " అంది చిత్ర.
" అసలు నిన్ను ఎందుకు తిడతా నేను?" ఆశ్చర్యంగా అడిగాడు ఈశ్వర్, అసంబద్దంగా చిత్ర తన సంభాషణని ప్రారంభించేసరికి.
"ఏమ్లే.... ఊకెనే అన్న."
"హం."
ఒక ఐదు నిమిషాల తరువాత చిత్ర మళ్ళీ మాట్లాడటం ప్రారంభించింది.
"ఇదో....."
"చెప్పు."
"నేను పెరిగిన కాడ పైసలు ఎక్కువ లేకుంటుండె. అందుకే పైసలు ఎక్కువ కర్సయితుంటె జెర బయం నాకు. అంతకుమించి ఏం లేదు. మనసు ఒప్పుకోదు పైసలన్ని కర్సయితుంటె. గంతే గానీ నిన్ను ఇబ్బంది పెట్టాలని నేననుకోలె. అర్తమైతుందా?" అంది చిత్ర, కాస్త గద్గర స్వరం తో.
"హేయ్ ?! ఏమైంది? " ఈశ్వర్ కి అసలు చిత్ర విషయమై ఇలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదసలు.
"ఏమ్లే... ఊకెనే అన్న.... మీటింగుకి పొయింటిరంట గద. ఎట్లయ్యిండె మీటింగు?" అడిగింది చిత్ర.
"హం.....పర్లేదు."
" శ్రీజ కాడికి పొయ్యింటి సాయంత్రం. గామె చెప్పిండె నీకు ఇయాల మీటింగుందని."
".."
***
ఈశ్వర్, చిత్ర లు ఎవరి గదుల్లో వాళ్ళు పడుకోవడానికి వెళ్ళారు.
చిత్ర తనతో మాట్లాడిన అసందర్భపు మాటల వెనక ఉన్న ఆంతర్యం ఏంటో అర్థం కాక అయోమయంగా ఆలోచించసాగాడు ఈశ్వర్.
" ఏందయ్యా క్రిష్నయ్యా, గింత బంగారు లెక్కనున్న మనిషిని ఇస్తివి నాకు మొగణి . మళ్ళ మా ఇద్దరి మద్య గా అమృత ని ఎందుకు పెడ్తివయ్యా నువ్వు? నాకు గా మనిషి కి చానా దెగ్గర కావాలనుందయ్యా. చానా చానా దెగ్గర కావాలనుంది......ఒక్కసారి గా మనిషి ని గట్టిగ పట్టుకుని , గాయ్నంటె ఎంత ఇష్టమో నాకు చెప్పాలనుందయ్యా. గాయ్న ఒళ్ళ పడ్కోని, ఏదో జోలి చెప్తుంటే వినాలనుందయ్యా నాకు,.....నన్ను దూరం జెయ్యకయ్యా గా మనిషి నుంచి. చానా ఇష్టమౌతున్నడు రోజు రోజుకి గా మనిషి. ఏడుపొస్తుందయ్యా నాకు. గా మనిషి కి గింత దెగ్గరగా ఉంటు గూడ, దూరంగ ఉండాల్నంటె. ఎంత గట్టిగుందమనుకున్నా అప్పుడప్పుడు నా తోని అవ్తలేదయ్యా..... అవ్తలేదు " అని మనస్సులో అనుకుంటూ, తన కంట్లోంచి రాలిపడ్డ కన్నీళ్ళను తుడుచుకుంది చిత్ర.

---------------------సశేషం---------------------
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
reserved
Like Reply
బావుంది భయ్యా, ఈ సారి కాస్త యాస ఎక్కువౌనట్లుంది అక్కడక్కడా వెతుక్కోవాల్సి వచ్చింది Big Grin
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)