16-05-2023, 04:42 AM
bagundi
కధా స్రవంతి ❤️
|
05-09-2023, 11:37 PM
(This post was last modified: 05-09-2023, 11:38 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
ప్రేమ
నా బుజ్జి కదా ఈ ఒక్క ముద్ద తినమ్మా.. ఇరవై నాలుగేళ్ల కూతురు స్వప్నని బతిమిలాడుతుంది వాళ్ళ అమ్మ తన కన్నీళ్లు దిగమింగుతూ స్వప్న : బావని చూపిస్తా అన్నావ్ ఫోన్ చేసాను, వస్తున్నాడట.. నువ్వు అన్నం తినేసి రెడీ అయితే నిన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానన్నాడు స్వప్న : రోజూ ఇదే చెప్తున్నావ్, అన్నం తిన్నాక నన్ను కట్టేస్తావ్.. ప్లీజ్ అమ్మా.. నీ కాళ్లు పట్టుకుంటా.. నన్ను నా బావ దెగ్గరికి పోనివ్వు.. నాకు బావ కావాలమ్మా.. నన్నోదిలేయి మా.. ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చేసింది. సరే తిను ఇవ్వాళ నిన్ను నీ బావ దెగ్గరికి పంపించేస్తా, ప్రామిస్ స్వప్న : నిజంగా.. ఏది నా మీద ఒట్టేయి అని తల్లి చేతిని తీసుకుని తల మీద వేసుకుంది. నీ మీద ఒట్టు, ఆనందంగా కళ్ళు తుడుచుకుంది. స్వప్న : థాంక్స్ మా.. త్వరగా తినిపించు.. ఇంతకీ బావకి ఫోన్ చేసావా.. వస్తున్నాడా బావ రాడు, నువ్వే వెళ్ళాలి స్వప్న : అవునా.. ఏదోకటిలే.. అంతా మీ వల్లే.. అలిగినట్టున్నాడు.. ఇప్పుడు నేనెళ్ళి బతిమిలాడుకోవాలి.. మరి నాన్న...? నాన్నకి చెప్పకుండానే పంపించేస్తున్నా స్వప్న : అవునవును.. ఆయనకి తెలీకూడదు.. తెలిస్తే బావని ఆరోజు కత్తితొ పొడిచినట్టే మళ్ళీ పొడుస్తాడు. ఆ రోజు నేనెంత ఏడ్చానో అవును అని కళ్ళు తుడుచుకుంటూ అన్నం తినిపించింది. అన్నం తింటున్నంతసేపు స్వప్న తన బావ గురించి చెపుతుంటే ఊ కొడుతూనే తన కూతురికి తినిపించి తనూ తినింది. స్వప్నా.. ఇలా నా ఒళ్ళో పడుకో అంది ఇందాక తాను రాసిన ఉత్తరం పక్కన పెడుతూ. స్వప్న : ఏంటిమా నా బట్టలు సర్దవా అంది ఒళ్ళో పడుకుంటూ మళ్ళీ ఈ జన్మలో మనం కలుస్తామో లేదో కొంచెంసేపు నాతో ఉండమ్మా అని కూతురి తల నిమురుతూ పాట పాడసాగింది. కన్నానే నిన్ను కనుపాపలా పెంచానే నిన్ను పసిపాపలా సాకితినే నిన్ను సివంగిలా చంపుకుంటున్నా చేజేతులా నీ ఆశలు నీరై పోయేనే నీ బతుకే చితికి పోయేనే ప్రేమకి బలి పశువాయనే.. నీ బావా స్వప్న : ఆయి.. బావా.. పాడు పాడు పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి స్మశానానికి కాపురమిచ్చన్నే... స్మశానానికి కాపురమిచ్చన్నే... స్మశానానికి కాపురమిచ్చన్నే... అని పాడుతూ కూతురి కళ్ళు మూసి అలానే జొ కొడుతూ తాను శాశ్వత నిద్రలోకి జారుకుంది. కాసేపటికి రాజారెడ్డికి కబురొచ్చి ఇంటికి వచ్చాడు, ఏడ్చాడు. పీడా వదిలిందనుకుంది రాజరెడ్డి అమ్మ. జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోయాయి. సొంత అమ్మే కూతురికి విషం పెట్టి చంపి తాను చనిపోయిందన్న వార్త తప్ప అస్సలు నిజాలు పేపర్లో చదివిన ఏ ఒక్కరికి తెలియవు. చెరువు గట్టున కూర్చుని పెళ్ళాం విడిచిన ఉత్తరం బైటికి తీసాడు. "బావా.. నువ్వు ఎన్నో పాపాలు చేసావు. ఏ ఒక్కరోజు నేను నీతో ఒక్కసారి కూడా ఆ విషయాలు మాట్లాడలేదు.. ఇప్పుడు కూడా నాకు ఆ ధైర్యం లేదు అందుకే, ఇవే నేను నీతో మాట్లాడే చివరి మాటలు. నీ పంతంతో నా కూతురిని ఎంతో ఏడిపించావు. మీ అమ్మ చెప్పుడు మాటలు విని నా మేనల్లుడి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగావు, అంతటితో ఆగారా మీరు.. లేదు.. నా మేనల్లుడిని పొట్టన బెట్టుకున్నావు. ఏమి చూడని అనుభవించని వయసు వాడిది, వాడిని ఎంత దారుణంగా చంపావో ఒక్కసారి గుర్తుతెచ్చుకో మన బిడ్డ పిచ్చిది అయిపోయింది. నీ పంతము నెగ్గింది, మీ అమ్మ గారి మాట గెలుచుకుంది. కాని బలయ్యింది ఒక్కడి ప్రాణమే అనుకుంటున్నావేమో కాదు.. ఏ రోజు అయితే నువ్వు నా మేనల్లుడిని చంపావో అదేరోజు నీ కూతురు కూడా చచ్చిపోయింది. దాన్ని మీరంతా కలిసి పిచ్చిదాన్ని చేశారు, చంపేశారు. దాని బాధ చూడటం ఇక నా వల్ల కాదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా బిడ్డని నా చేతులతో నేనే విషం పెట్టి చంపుకునేలా చేసావ్.. అది భరించడానికి నేను రాజారెడ్డిని కాదుగా, అందుకే నేనూ వెళ్లిపోతున్నాను. క్షమించలేనన్ని తప్పులు చేసేసావ్ రాజారెడ్డి.. నీకు ఆ దేవుడు శిక్ష వెయ్యాలని కోరుకుంటూ.. నీకు ఇరవై ఏడేళ్లు సేవలు చేసిన నీ భార్య."
08-09-2023, 08:38 AM
Super emotive.
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
20-02-2024, 12:59 AM
చెయ్యని తప్పుకి పడే శిక్ష నరకం
అర్ధరాత్రి రాళ్ళ వర్షం పడుతుంది. నడి రోడ్డు మీద రజిని ఒక్కటే బోరున ఏడుస్తూ కూర్చుంది. శరీరం మొత్తం తడిచినా ఒళ్ళంతా చెమటలు, ఏడ్చి ఏడ్చి అలిసిపోయింది. అరికాళ్ళు బొబ్బలు కట్టాయి. నిన్న పొద్దున తిన్న భోజనం అంతే.. కొడుకు కోసం వెతుకుతూనే ఉంది. పదిహేనేళ్ళు ఉంటాయి వాడికి. అమ్మ మీద కోపం, బాధతో వెళ్ళిపోయాడు. ఒక్కడే.. వాడి చేతిలో డబ్బులు కూడా లేవు. అంత వర్షంలో కూడా జరిగింది తలుచుకుని తల బాదుకుంది రజిని. తన భర్త రాజేష్ హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇంకో ఆరు నెలలు గడిచిపోతే ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేస్తానన్నాడు. చాలా సాఫీగా సాగిపోయే అమ్మా కొడుకుల జీవితాలలోకి శనిలా దాపరించింది కుసుమ. మొగుడితో సుఖం సరిపోక కాలేజీ కుర్రాడిని వెతుక్కుంది. ముందు తన రంకు గురించి రజినికి చెప్పింది. ఒక్కరోజు రజిని ఇంట్లో సుఖపడతానని ఊపిరి ఆడనివ్వకుండా బతిమిలాడి పని కానిచ్చుకుంది. ఆ తరువాత రజిని ఇంట్లో గుట్టుగా రంకు నడుపుతూ అలవాటు పడింది, రజినికి ఇదేలా ఆపాలో తెలీలేదు. కాలక్రమంలో ఆ కాలేజీ కుర్రాడి కన్ను రజిని మీద పడింది. కుసుమ దానికి వ్యూహ రచన చేసింది. చిన్నగా రజిని మెదడులో పురుగు నాటి ఆలోచనలకి బీజం వేసింది. రజినికి తన పడక సుఖం, ఆ కుర్రాడితో కవ్వింపులు బహిరంగ ప్రదర్శన చేస్తూ చిన్నగా రజినిని తన దారిలోకి తెచ్చుకుంది. రజిని ని పూర్తిగా మార్చుతూ మొట్ట మొదటిసారి కుర్రాడి చేతిని రజిని పాలిండ్ల మీద వేయించింది. చివరికి దెగ్గరుండి తన ఇంట్లో తన మంచం మీదె కుర్రాడి మీదకి తోసి పండబెట్టడానికి రజినిని ఒప్పించింది. ఎప్పటిలాగే కొడుకు కూలుకి వెళ్ళగానే కుసుమకి తన రూమునిచ్చి సాయం చేసేది రజిని. కానీ ఇవ్వాళ తనే పడుకోబోతుంది. కుసుమ చాలా అందంగా రెడీ చేసింది, చాలా ఆభరణాలు తోడిగించింది. కుర్రాడు రాగానే ఇద్దరికీ దిష్టి తీసి రూములోకి తోసి కాసేపటికి ఆపుకోలేక తనూ లోపలికి వెళ్ళిపోయింది. నలభై నిమిషాల తరువాత మంచం మీద నుంచి లేచింది రజిని. కుర్రాడి వంక నవ్వుతూ వంగి వాడి పెదవుల మీద ముద్దు పెట్టుకుని జాకెట్ వేసుకుంటూ కిటికీ వంక చూసింది మామూలుగా కొడుకు కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు. వాడి కళ్లెమ్మటి నీళ్లు. ఒక్క క్షణం నిశచేష్టగా అయిపోయింది రజిని. కొడుకు చుసాడన్నా భయం లేదు. వాడి కళ్లెమ్మటి కారిన నీళ్లు చూసి అల్లాడిపోయింది హృదయం. మనసు చివుక్కుమంది. వెంటనే చీర కట్టుకుని బయటకి వెళ్లి చూస్తే కొడుకు కనిపించలేదు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉంది కొడుకుని. కనిపించలేదు. తెలిసిన అందరి దెగ్గరికి వెళ్ళింది. అందరినీ సాయం అడిగింది. కొడుకు జాడ లేదు. రోజూ ఫోన్ చేసి మాట్లాడే భార్య, కొడుకు రెండు రోజులుగా ఫోన్ చెయ్యకపోవడం, తను చేసినా ఎత్తకపోవడంతో దిగులు పడ్డాడు రాజేష్. ఒక్కసారి చూసి మళ్ళీ వచ్చేద్దామని ఉన్నపళంగా సిక్ లీవ్స్ పెట్టేసి ఇంటికి బైలుదేరాడు. ఆటో దిగి గేట్ తీసి లోపలికి వస్తుంటే జనాలు కనిపించారు, రాజేష్ ఇంటి లోపలికి వచ్చే సమయానికి లోపల సిఐ ఒక పుస్తకంతో రజిని తల మీద కొట్టడం చూసి కోపంగా వెళ్ళాడు. రాజేష్ ని చూసిన సిఐ మాట్లాడదామని ఎదురు వస్తుంటే రాజేష్ కళ్ళు మాత్రం కింద కూర్చున్న రజిని ఒడిలో తెల్లని గుడ్డతో కప్పిన ఐదడుగుల ఆకారాన్ని చూస్తూ ఏమి అర్ధంకాక చిన్నగా మోకాళ్ళ మీద కూర్చుని రజిని వంక చూసాడు, ఆమె సూన్యాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది. తెల్లని గుడ్డ తప్పించి చూసి మూడు అడుగులు వెనక్కి పడ్డాడు. చెయ్యి ఎత్తి.. సిఐ వంకా చుట్టూ ఉన్న వాళ్ళ వంకా చూస్తుంటే.. సారీ సర్ మీ అబ్బాయి ఇక లేరు అన్నాడు సిఐ. రాజేష్ వల్ల కాలేదు, మోకాళ్ళ మీద కూర్చుని గట్టిగా ఏడుస్తూ తన వల్ల కాక తల మీద రెండు చేతులు పెట్టుకుని ఏడుస్తుంటే చూసేవాళ్ళ కళ్ళు కన్నీటిమయం అయ్యాయి. రాజేష్ లేచి తెల్ల వస్త్రం మొత్తం తీసాడు. తల పగిలి బ్రెయిన్ బైటికి వచ్చేసింది. బాడీ మీద కాళ్లు చేతులు అలా పెట్టి ఉంచారు. రాజేష్ కొడుకుని చూసిన వాళ్ళు చాలామంది భయంతో బైటికి వెళ్లిపోయారు. రెండు గంటల తరువాత సిఐ రాజేష్ తో మాట్లాడాడు. సిఐ : ప్లే గ్రౌండ్లో చాలాసేపు ఒంటరిగా కూర్చుని డైరీ రాసుకున్నాడు, ఆ తరువాత ఇంటికి వస్తుంటే లారీ కొట్టేసింది. రోడ్డు మీద ఏదో ఆలోచిస్తూ మధ్యలోకి వచ్చేసాడు, లారీ డ్రైవర్ కి పక్కకి తిప్పే అవకాశం లేదు. తిప్పితే మిగతా పిల్లల ప్రాణాలు పోతాయి.. స్పాట్ డెడ్. మీ అబ్బాయి ఎందుకు అలా రోడ్డు మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాడో తెలియాలంటే ఆ డైరీ చదవండి అని ఇందాక రాధిక తల మీద కోపంగా కొట్టిన డైరీ వంక చూసి మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి బైటికి వెళ్ళాడు. రాజేష్ కళ్ళు తుడుచుకుంటూనే డైరీ చేతిలోకి తీసుకున్నాడు. రోజూ డైరీ పేజీ చివరన ఐ లవ్ యు అమ్మా అని రాసే కొడుకు.. ఆఖరిగా రాసిన పేజీ చదివాక చివరన రాసిన ఐ హేట్ యు అమ్మా అని డైరీని ముగించేసాడు. డైరీ పూర్తి అయ్యింది, తన కొడుకు జీవితము పూర్తి అయిపోయింది. రజిని వంక చూసాడు, ఆమెలో ఉలుకు పలుకు లేదు. ఉందా చచ్చిపోయిందా అని గట్టిగా కదిలించాడు. తల తిప్పి చూస్తే మొగుడు డైరీ పట్టుకుని ఉన్నాడు. వచ్చారా మీకోసమే చూస్తున్నాను (ఆమె గొంతులో మాటలు పెకలలేదు..) చాలా భారంగా మాట్లాడి ఒళ్ళో ఉన్న కొడుకుని చూసుకుంది. ముద్దు ఎక్కడ పెట్టాలో తెలీలేదు. మొగుడి కోసం చెయ్యి ఎత్తి ఆయన కాళ్లు పట్టుకుని దెగ్గరికి లాక్కుంది. రాజేష్ కదలలేదు. భర్త వంక చూసి కొడుకుని తీసుకొమ్మన్నట్టు చెపితే ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ కింద కూర్చున్నాడు. లేచి ఒక్క పరుగున రూములోకి వెళ్లి తలుపు పెట్టేసుకుని మంచం ఎక్కి తను కట్టుకున్న చీరనే ఊడదీసి ఫ్యానుకి ఉరేసి కాళ్ళని వదిలేసింది. (కన్నయ్యా.. నువ్వెప్పుడు తప్పు చేసినా నా కోపం అలకా తీరేవరకు సారీ చెపుతూ బతిమిలాడేవాడివి. మరి నాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదే.. అవకాశం ఇచ్చేంత చిన్న తప్పు కాదుగా అందుకే ఇవ్వలేదు అంతేనా (బైట తలుపు చెప్పుళ్ళ మోతకి మెడ ఇంకా గట్టిగా బిగసుకున్నట్టు అనిపించింది. కాళ్ళతో నిలబడే అవకాశం ఉన్నా రజిని మనసు ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నట్టు నరకం కనపడుతున్నా నొప్పి లేదు, బాధ మాత్రమే.. అవి కన్నీళ్ళ రూపంలో బొట్లుగా కారుతూనే ఉన్నాయి) నాకు అవకాశం ఇవ్వకపోతే వదిలేస్తానా.. నువ్వెక్కడున్నావో అక్కడికే వచ్చి సారీ చెపుతా (కళ్ళు మూసుకుంది / తలుపులు తెరుచుకున్నాయి / ఇంకో ప్రాణం ఆవిరి)
తప్పు చేసిన భార్యా చనిపోయింది ఏమి తెలియని పసివాడు చనిపోయాడు కానీ ఏ తప్పు చెయ్యని, ప్రాణంగా ప్రేమించే భార్యా బిడ్డా కోసం, వాళ్ళకే దూరంగా ఉంటూ గొడ్డులా కష్టపడే రాజేష్ మాత్రం ఆ జ్ఞాపకాలు, గుర్తులతో బ్రతకాలి. అది నరకం కన్నా ఎక్కువ
❤️❤️❤️
❤️
20-02-2024, 09:49 AM
Good story sir
20-02-2024, 10:07 AM
ఎందుకలా చేసింది రజిని
తన మీద కోపం వస్తుంది, కానీ బాధగా కూడా ఉంది నలభై నిమిషాలు మొత్తం అందరి జీవితాలని చేరిపేసింది. Nice story bro Brain lo nunchi povatledhu Baga rasaru |
« Next Oldest | Next Newest »
|