Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 12
#21
(29-07-2023, 10:45 PM)k3vv3 Wrote: చీకటి రాజ్యం
ఇక్కడ కనిపించే ప్రతీది అబద్ధమే
 
చుట్టూచీకటి అలుముకోవటంతో తళతళ మెరుస్తున్న ఆ భవనపు కాంతులు రెట్టింపు అయ్యి కనబడుతూ కంటికి ఒక అద్భుతంలా అనిపిస్తున్నాయి.
Good story K3vv3 garu!!!
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(30-07-2023, 08:06 AM)TheCaptain1983 Wrote: Good story K3vv3 garu!!!

Thank you The Captain గారు
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#23
సిద్ధపురుషుడి ఆగమనం
శ్వేతద్వీపవాసి రాక
అలా ఒక 5 నిమిషాల పాటు ఆ భేరి నిరంతరాయంగా మోగి ఆ తర్వాత ఆగిపోయింది.
అక్కడేమైందో చూద్దామని అదృశ్య మందిరం వైపుకుబయలుదేరారు అభిజిత్, అంకిత, సంజయ్ లు అధిష్ఠాతో సహా. రాజవరంలోని జనం అందరూ అదృశ్య మందిరం బయటే గుమిగూడారు. నగారా ఆగిపోయినప్పటి నుండి వాళ్ళు తమ మోకాళ్ళ మీదే నిలబడి చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఏదో ధ్యానంలో ఉన్నారు.
 
అక్కడి ఎంట్రన్స్ గేట్ బయటే నిలబడిఆత్రంగాలోపలికి చూస్తున్నారు అభిజిత్, సంజయ్ లు. అంకిత, అధిష్ఠా కాస్త దూరంగానేనిలబడ్డారు.
 
తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్నవారు కనబడ్డారు వాళ్లకి. వాళ్ళు రాజప్రాకారం వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ నడకలో ఎలాంటి తొందరపాటు కానీ, తడబాటు కానీలేదు. చాలా ప్రశాంతంగా నడుస్తూ వస్తున్నారు. వాళ్లకు భిన్నంగా వున్న మరొక వ్యక్తి కూడా వాళ్ళతో పాటే వస్తున్నాడు. బహుశా అతను వాళ్ళ రాజ్యంలోని మంత్రి ఏమో అనిపించింది సంజయ్ కి. ఎందుకంటే అతనికళ్ళల్లో చురుకుదనం, ముఖవర్ఛస్సులో తెలివితేటలు కొట్టొచ్చినట్టు బయటికి కనబడుతున్నాయి.
 
అదృశ్య మందిరం ప్రవేశద్వారం చేరుకోగానే తెలుపురంగు వస్త్రాలు ధరించిన వాళ్ళు తమతో పాటు వచ్చిన ఆ వ్యక్తికిచేతులు జోడించి నమస్కరిస్తూవచ్చిన దారినే వెనుదిరిగారు.
 
ఆ వ్యక్తిని చూడగానే అధిష్ఠా ప్రవేశద్వారం దగ్గరికొచ్చి స్వాగతించాడు.
"మా రాజవరం ప్రజలకుముక్తిని ప్రసాదించటానికి వచ్చిన ఆ యోగి, సిద్ధ పురుషుడు మీరే అనిపిస్తోంది. అందుకోండి ఇవే మా ప్రణామములు", అంటూ తన మోకాళ్ళ మీద నిలబడి శిరస్సును భూమాతకు తాకిస్తూ వందనం తెలిపాడు.
 
"అధిష్ఠా నువ్వు పలికినదినిక్కమే. నన్ను సమర్థ రాఘవుడు అందురు.
పాతాళలోకంలోని20వ స్థానంలో వుండే శ్వేతద్వీప వైకుంఠవాసిని. పరమాత్ముడైన హరికి దాసుడను."
 
ఇలా అనగానే అక్కడున్న అభిజిత్, అంకిత, సంజయ్ లు వారికితెలియకుండానే ఆ వ్యక్తికిరెండు చేతులూ జోడిస్తూ, శిరస్సు వంచి నమస్కారం పెట్టారు. ఏదో తెలియని ఒక పారవశ్యంతో వాళ్లకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
 
ఆ సిద్ధపురుషుడు పసిపాపలా స్వచ్చముగా వాళ్ళని చూస్తూ ఒక చిరునవ్వు అందించాడు.
 
"అదే మందస్మితసుందర వదనారవిందము. ఏమి వర్చస్సు స్వామీ మీది. మీ ద్వారా ఆయనను దర్శించుకున్న అనుభూతికి లోనవుతున్నాము", అన్నాడు అధిష్ఠా.
 
"అదంతా ఆయన రచించే విష్ణుమాయ, అధిష్ఠా. ఆయన ప్రేమకు పాత్రులైనవారికే అలాంటి తీయ్యటి మైకాన్ని కలిగిస్తాడు. ఇందులో నా ప్రమేయం లేశమాత్రమైనను లేదు", అంటూ నవ్వాడు.
 
ఆ సిద్ధపురుషుడు నడుస్తూ ముందుకెళ్తుంటే.....
ఆయన వెనకే అభిజిత్, సంజయ్, అంకిత ఆయన అంగరక్షకులలా వస్తున్నారు.
అధిష్ఠా వీరి వెనక వస్తున్నాడు.
అధిష్ఠాను అనుసరిస్తూ రాజవరం ప్రజలు వస్తున్నారు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply
#24
అశుతోష్ ఇంటరాగేషన్
ఇన్వెస్టిగేషన్ వింగ్, సి.బి.ఐ. ముంబై

సి. బి. ఐ. లోని ఇన్వెస్టిగేషన్ వింగ్ ఎనాలిసిస్
 
సి. బి. ఐ. లోని ఇన్వెస్టిగేషన్ వింగ్ ఎనాలిసిస్ ప్రకారం అదృశ్య మందిరంలో తప్పిపోయి మాయమైపోయిన ఐదు మందిలో హిస్టరీ అండ్ మైథాలజీ ప్రొఫెసర్ రాధాకృష్ణన్, సైంటిస్ట్ కృష్ణస్వామి కాకుండా
ప్రపంచంలోనే ధనవంతులైన ఇద్దరు బిజినెస్ మాగ్నెట్స్, దేశంలోని అతి పెద్ద అపోజిషన్ పార్టీ నేతకూడా ఉండటంతో ఈ కేసుని అన్ని కోణాల నుండి దర్యాప్తు చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది.
 
ఈ ఇన్వెస్టిగేషన్ ని అశుతోష్ స్వయంగా హేండిల్ చేస్తున్నాడు. మధ్యలో ఏదైనా డీటెయిల్ మిస్ అయినా, ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా సంజయ్ ని మెయిల్ లో కానీ, కాల్ లో కానీ అడుగుతున్నాడు.
 
మొదటిగా రాధాకృష్ణన్ ని ఎంచుకున్నాడు ఇన్వెస్టిగేషన్ సబ్జెక్టు గా. అదృశ్యమందిరం కెళ్లే ముందు ఏ ఏ ఆక్టివిటీస్ చేసాడో మొత్తం డే-టు-డే డేటా అంతా ఒక ఫైల్ లో స్టోర్ చేసాడు. అక్కడికి బయలుదేరే ఒక వారం ముందు రాధాకృష్ణన్ ఒక రష్యన్ జియాలజిస్ట్ ని ఢిల్లీలోకలిసాడు. అక్కడ జరిగిన "మదర్ ఎర్త్" అనే కాన్ఫరెన్స్ కి వస్తున్నాడని తెలిసాక ఆ రోజు సాయంత్రం గుర్గావ్ లోని ట్రిడెంట్ హోటల్ లో పర్సనల్ మీటింగ్ ఒకటి షెడ్యూల్ చేసుకున్నాడు. మూడు గంటల పాటు వారు అక్కడ మాట్లాడుకున్నట్టు రికార్డ్స్ లో ఉందని ట్రిడెంట్ హోటల్ మేనేజర్ చెప్పటంతో అశుతోష్ ఆ జియాలజిస్ట్ ను ఇంటరాగేట్ చేద్దామనుకున్నాడు. స్కైప్ లో కనెక్ట్ అయ్యి ఆయనను పర్మిషన్అడిగాడు ఇంటరాగేషన్ కోసం. వెంటనే ఒప్పుకున్నాడాయన.
 
ప్లేస్ : రూమ్ నెంబర్ 306, సి. బి. ఐ. ఇన్వెస్టిగేషన్ వింగ్, ముంబై
టైం : 11AM
 
అశుతోష్: హాయ్. థాంక్స్ ఫర్ కో-ఆపరేటింగ్ విత్ అస్. దీన్ని ఇంటరాగేషన్ లా కాకుండా ఒక ఇంటర్వ్యూ అనుకోండి.ఈ ఇంటర్వ్యూలో ప్రతీ సెకండ్ రికార్డు చెయ్యబడుతుంది విజువల్ గా అండ్ ఆడియో కూడా. అది మీకు ఒకే కదా?
 
ఆండ్రూ: యా. ఇబ్బందేం లేదు. గో ఎహెడ్.
 
 అశుతోష్: మీ ఇంట్రో ఇస్తే....ఇట్ వుడ్ బీ ఏ బెటర్ స్టార్ట్.
 
ఆండ్రూ: మై నేమ్ ఈజ్ ఆండ్రూ గంబుర్ట్సేవ్. మా ఫాదర్ ఒక వెల్ రెడ్, వెల్ నోన్ అండ్ ఎక్స్పర్ట్ జియాలజిస్ట్. నేను ఆయన అడుగుజాడల్లోనే ఈ కెరీర్ ని చూజ్ చేసుకున్నాను. ఐ యాం హియర్ టు టాక్ అబౌట్ మై మీటింగ్ విత్ ది హిస్టరీ అండ్ మైథాలజీ ప్రొఫెసర్ రాధాకృష్ణన్ ఇన్ ట్రిడెంట్ హోటల్ గుర్గావ్.
 
 అశుతోష్: గ్రేట్ స్టార్ట్ ఇండీడ్ . ఆ రోజు హోటల్ లో మీరు రాధాకృష్ణన్ గారితో చాలా సేపు దేని గురించో వివరిస్తున్నారని అక్కడ మీకు అపెటైజర్ సర్వ్ చేసిన అతను చెప్పాడు. ఒక గంట సేపు మీరే మాట్లాడుతున్నారంట. రాధాకృష్ణన్ గారేం మాట్లాడట్లేదు అని చెప్పాడతను.
 
ఆండ్రూ: గ్రేట్. ఇండియాలోప్రతీ ఒక్కరూ సీక్రెట్ ఏజెంట్ అనుకుంటా. వాళ్ళ పని కాకుండా అవతలి వాడు ఎప్పుడేం చేస్తున్నాడని ఒక కంట కనిపెడుతూనే ఉంటారనుకుంటా. కమింగ్ టు ది పాయింట్, ఆ రోజు నేను  కోలా సూపర్ డీప్ బోర్ హోల్    గురించి నాకు తెలిసిన అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను రాధాకృష్ణన్ తో.
మోస్ట్ అఫ్ థెమ్ ఆర్ సైంటిఫిక్ డీటెయిల్స్. మిగిలినవి కొన్ని రూమర్స్ అండ్ కొంత ఫిక్షన్.
 
 అశుతోష్: ఆ టాపిక్ అసలెందుకు వచ్చింది?
 
ఆండ్రూ: సోవియెట్ యూనియన్ నిర్వహించి చాలా రోజుల వరకు రికార్డు ఉన్న డీపెస్ట్ బోర్ హోల్ అది. టెక్నికల్డీటెయిల్స్ మీకు ఆల్రెడీ తెలుసు.
ఆ టైములో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్నో డైమండ్స్ దొరికాయని ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చేసింది అని చాలా మంది విదేశీ మీడియాలో రిపోర్ట్ చేశారు. బయట సామాన్య ప్రజలు కూడా అదే చెప్పుకున్నారు. వీటిలో నిజానిజాలేంటో తెలుసుకుందామని రాధాకృష్ణన్ నన్ను అడగటం జరిగింది. నాకు తెలిసినదంతా చెప్పాను. మా ఫాదర్ ద్వారా విన్నది, చిన్నప్పుడు నేను చూసింది, నా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది. అన్నీ చెప్పాను. సోవియెట్ యూనియన్ లోపల ఏం జరుగుతుందో నేనే కాదు ఎవ్వరూ చెప్పలేరు. చెప్పకూడదు కూడా.
 
 అశుతోష్: అదృశ్య మందిరం గురించి మీకేం తెలుసు?
 
 ఆండ్రూ: చాలా డైమండ్స్ ఉన్న ప్యాలస్ అని తెలుసు. హహహ. సారీ. తప్పుగా అనుకోకండి. నవ్వాగలేదు. సి.బి.ఐ. కదా. సో మీకే ఎక్కువ తెలియాలి.
 
 అశుతోష్: కోలా సూపర్ డీప్ బోర్ హోల్ గురించి మిమ్మల్నికొన్ని ప్రశ్నలు అడగొచ్చా?
 
 ఆండ్రూ: యా. అడగండి. నాకు తెలిసింది, నేను చెప్పగలిగినవి మాత్రమే నేను చెబుతాను.
 
 అశుతోష్:ఆ బోర్ హోల్ లో కొన్నికిలోమీటర్స్ డీప్ కెళ్ళాక కొంత మంది ఆర్తనాదాలు, కేకలు వినిపించాయని కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ బయట వున్నాయి.అందులో నిజం ఎంత? ఈ ప్రాజెక్ట్ ద్వారా మీరసలు సాధించింది ఏమిటి?
 
 ఆండ్రూ: ఆ క్లిప్పింగ్స్    నేను కూడా   విన్నాను. ఆ ఆడియో రికార్డింగ్స్ లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ  వెల్ టుహెల్   అని ప్రచారంలో ఉన్న కట్టుకథలే.  ఈ బోర్ వెల్ మూత బడ్డాక ఒక్కొక్కరూ వారికి తోచిన, వాళ్లకు నచ్చిన ఫిక్షన్ కథలు అల్లేశారు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను. రీసెంట్ ఫైండింగ్స్ లో భూమి లోపల వుండే మాంటెల్ లోని ఇంకో లేయర్ లో ఎన్నో పర్వతాలు ఉన్నట్టుగా కనుగొన్నారు. దానికి   660 కిలోమీటర్ బౌండరీ   అని పేరు పెట్టారు. సో దీన్ని బట్టి చూస్తే మనకు తెలియని మరొకప్రపంచమే వుంది భూగర్భంలో.
 
ఇకపోతే మీ రెండోప్రశ్నకి జవాబు చాలా సింపుల్. సోవియెట్ యూనియన్ ఎప్పుడూ తన ప్రత్యర్థి అమెరికా మీద విజయం సాధించటానికే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేపడుతూ ఉంటుంది. అంతక ముందు యునైటెడ్ స్టేట్స్ పేరిట ఉన్న 9,583 మీటర్స్ డెప్త్ ని 12 ,262 మీటర్స్ తో క్రాస్ చేసింది రష్యా. రెండు దశాబ్దాల పాటు ఆ రికార్డు   రష్యా   పేరిట ఉంది.  ఈ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఇంతకంటే సాధించిన ఘనకార్యం ఏదీ లేదు.
 
 అశుతోష్: సో, మీరు అదృశ్య మందిరం గురించి కానీ, డైమండ్స్ గురించి కానీ ఏం మాట్లాడలేదు అన్నమాట?
 
 ఆండ్రూ: నో
 
 అశుతోష్: ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా?
 
ఆండ్రూ: నేనొక జియాలజిస్ట్ ని. 1984 లో బోర్ వెల్ మూతబడ్డాక మళ్ళీ తిరిగి 1985 లో పునః ప్రారంభించారు. అప్పట్లో ఎంతో మంది ఆఫీసర్ లని మా నాన్న గారు ప్రాధేయపడ్డారు. దయచేసి ఆపెయ్యండి అని. ఎవ్వరూ వినలేదు. ఎన్నో వేల డిగ్రీల టెంపరేచర్ ఉంటుందని ఎస్టిమేట్ చేసి మరీ చెప్పారు అయినా ఎవ్వరూ వినలేదు. చివరికి ఏం జరిగింది? ఆయన చెప్పినట్టే 356 ఫారెన్ హీట్ నమోదు అయ్యింది. ఇక చేసేది లేక 1992 లో పూర్తిగా ఆపేసారు.
 
1986 లో జరిగిన   చెర్నోబిల్ డిజాస్టర్   అత్యంత విషాదకరమైన సంఘటన. అందులో సుమారు 4000నుండి 9000మంది చనిపోయారు. ఇంకా ఎక్కువ మందే ఎఫెక్ట్ అయ్యారు.
 
ఇప్పుడు దీనికి దానికిఏంటి సంబంధం అనుకుంటున్నారా?
ఒక్కటుంది.
 
చెర్నోబిల్ మానవ తప్పిదం.
మన భూగర్భాన్ని స్వార్థం కోసం, డబ్బు కోసం, ఆధిపత్యం కోసం ఇలా తవ్వుకోవటం కూడా మానవ తప్పిదమే.
రెండూ మనిషి చేసిన తప్పులే.
 
మనకు తెలిసిందే సృష్టి అనుకుంటున్నాం. మనకు తెలియని సృష్టి ఎంతో ఉంది. మనం ఆ సృష్టిని గౌరవించినప్పుడే మనకు ఇక్కడ జీవించే అర్హత ఉంటుంది. లేకపోతే ఆక్సిజన్ పీల్చే హక్కు కూడా లేదు. ఎప్పుడైతే ప్రపంచ దేశాల నాయకులు ఈ సత్యాన్ని గుర్తిస్తారో అప్పుడు వాళ్ళ పర్సనల్ ఎజెండా లను పక్కన బెట్టి మానవాళి గురించి, ప్రకృతి గురించి, ప్రపంచ శాంతి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఎంతో మంది సి. ఈ. ఓ లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధారాళంగా విరాళాలు ఇస్తున్నారు. అది శుభ పరిణామమే. ఇలాంటివి మన రాజకీయ నాయకులు చెయ్యాల్సిన పనులు.
 
అశుతోష్  : చాలా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు. ఒక నిజమైన జియాలజిస్ట్ కనిపిస్తున్నారు మీలో ఇప్పుడు. ఇట్'స్ మై ప్లెషర్ మీటింగ్ యు.
 
ఆండ్రూ: థాంక్ యు. మీకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఐ యాం జస్ట్ యే ఫోన్ కాల్ యవే అని గుర్తుపెట్టుకోండి. మీకు సాయపడటానికి నేనెప్పుడూ సిద్ధమే.
 
 అశుతోష్ థాంక్స్ ఏ లాట్!
 
ఇంటరాగేషన్ అక్కడితో ముగిసింది.
 
అశుతోష్ మొబైల్ రింగ్ అవ్వటం మొదలు పెట్టింది.
 
ఫోన్ డిస్ప్లేలో ఉన్న పేరు -   సంజయ్
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#25
Super fantastic update
Like Reply
#26
ఈ స్టోరీ కోసం చాల రీసెర్చ్ చేసినట్లు ఉన్నారు సర్, 

చాల బాగుంది కథ, దయ చేసి కొనసాగించండి
[+] 1 user Likes sri7869's post
Like Reply
#27
తప్పకుండా మిత్రమా!

కాకపోతే ఈ విభాగంలోకి ఎక్కువ మంది పాఠకులు రావట్లేదు. అందుకని అప్డేట్లు నెమ్మదిగా ఇస్తున్నాను.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#28
సంజయ్ ఫోన్ కాల్

సంజయ్-అశుతోష్ ల సంభాషణ



అశుతోష్: హా చెప్పు సంజయ్....నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా....మీరు ముగ్గురూ అదృశ్య మందిరం వెళ్లినప్పటి నుండి నాకు ఒక్క వీడియో కాల్ చెయ్యలేదు....యు గైస్ డిడ్ నాట్ అప్డేట్ మీ అబౌట్ ఎనీథింగ్....వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్?

 

సంజయ్: ఏం చెప్పమంటారు సర్? ఇక్కడ జరిగేవి చెప్తే మీరసలు బిలీవ్ చేస్తారో చేయ్యరో కూడా అర్థం కాట్లేదు నాకు. మేము కొన్ని రోజుల తర్వాత మీకు వీడియో కాల్ లో కేసు ప్రోగ్రెస్ అప్డేట్ చేస్తాం. ఇవ్వాళ ఆండ్రూతో మీ ఇంటరాగేషన్ ఎలా జరిగింది? ఏమన్నా చెప్పాడా?

 

అశుతోష్: యు నో రష్యన్స్....వాళ్ళు గాని చెప్పాలి

 

సంజయ్: డోంట్ వర్రీ సర్...మీరింకా చాలా మందిని ఇంటర్వ్యూ చెయ్యాలి....చాలా ప్లేసెస్ ఇన్వెస్టిగేట్ చెయ్యాలి....థిస్ ఈజ్ జస్ట్ ఏ స్టార్ట్.....డిజప్పాయింట్ అవ్వకండి

 

అశుతోష్: హే...మర్చిపోయా అడగటం....నువ్వు మన సైబర్ ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసినమొబైల్ VoIP app ఇన్స్టాల్ చేసావ్ కదా?....ఐ మీన్ ఈ కాల్ సెక్యూర్ కదా?

 

సంజయ్: యా...నేనెప్పుడూ అదే ఆప్ యూజ్ చేస్తాను సర్....మీరు మరిచిపోయినట్టున్నారు...ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో మీకంటే సీనియర్ ని నేను...జస్ట్ టురిమైండ్యు

 

అశుతోష్: హయ్యో...నా ఉద్దేశం అది కాదు....కాల్ సెక్యూర్ అని తెలిస్తే కానీ ఫ్రీ గా మాట్లాడలేం కదా.....జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటున్నా......అసలు విషయం ఏంటంటే నిన్ను కొన్ని డౌట్స్ అడగాలి నువ్వు చేసిన ఇన్వెస్టిగేషన్ గురించి....ఆర్ యు ఫ్రీ నౌ?

 

సంజయ్: ఒక అరగంట టైం ఉంది సర్.....అడగండి.

 

 అశుతోష్: ఓకే....ఇంచుమించు టు ఇయర్స్ ఎందుకు పట్టింది అదృశ్య మందిరంలో 5మంది మిస్ అయ్యారు అనికనిపెట్టడానికి?

 

సంజయ్: సర్,   అదృశ్య మందిరం   ఒకటి ఉందనే విషయమే అప్పటి దాకా ఎవ్వరికీ తెలీదు....అక్కడికి 5 మంది వెళ్తారు, తప్పిపోతారు అని ఎలా తెలుస్తుంది అంత ఈజీగా?

 

అశుతోష్: సరిగ్గా ఇక్కడే నాకు ఇంకో డౌట్ వస్తోంది.....వెళ్లిన ఐదుగురూ ఆషామాషీ వ్యక్తులు కాదు కదా....చాలా పెద్ద మనుషులు....అప్పుడు ఎవరో ఒకరి దగ్గరి నుంచి మీడియాకి లీక్ అవుతుంది కదా?

 

 సంజయ్: మీడియా గురించి నాకు తెలీదు సర్.....ఎందుకంటే ఈ కేసు సి. బి. ఐ. కి అసైన్ అయినప్పటి నుంచేరిపోర్ట్ చెయ్యటం స్టార్ట్ చేసింది......



అంతక ముందు వరకుఏ ఛానల్ వాళ్ళకీ మినిమం ఐడియా లేదు అన్నట్టే సైలెంట్ గా ఉన్నారు.

 

అశుతోష్: ఇది కాస్త విచిత్రంగానే ఉంది.....ఇక్కడ నీ గురించి స్పెషల్ గా మెన్షన్ చెయ్యాలి.....అసలు ఆ ఐదుగురి గురించి ఎంత ఇన్ఫర్మేషన్ సేకరించావ్ ! నిజంగా గ్రేట్! అయినా నాకు తెలియక అడుగుతున్నా. ఆ అదృశ్య మందిరంలోకి వెళ్ళింది ఈ ఐదుగురే అని ఎలా కనిపెట్టావ్?

 

 సంజయ్  : నాకు జర్నలిస్ట్స్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు సర్....తనకి   ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే స్పెషల్ ఇంటరెస్ట్ పీజీ చేసే రోజుల నుండి......తను సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ లో నన్ను అప్రోచ్ అయ్యాడు....అప్పటి నుంచి మేమిద్దరమే సీక్రెట్ గా వర్కౌట్ చేసాం....నేనిక్కడికి వచ్చే ముందు తన నెంబర్ మీతో షేర్ చేసాను.

 

అశుతోష్: యా.....తనని ఇంకా కలవలేదు....ఐ విల్ మీట్ హిం సూన్.....ఇంకొక లాస్ట్ క్వశ్చన్.

 

సంజయ్  : అడగండి సర్...

 

అశుతోష్: తను నిన్నే ఎందుకు అప్రోచ్ అయ్యాడు ?

 

సంజయ్: తను నా రూమ్ మేట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ లైఫ్.

 

అశుతోష్: రూమ్ మేట్ ఆ? హాస్టల్ లోనా? లేక వర్కింగ్ మెన్ పీజీ లోనా?

 

 సంజయ్: లేదు సర్....నేను యు.పీ. ఎస్. సి కి ప్రిపేర్ అవుతున్న రోజుల్లో తనతోటే రూమ్ షేర్ చేసుకున్నాను......ఇన్ ఫాక్ట్, నా ఐపీఎస్ సెలక్షన్ వెనక తన ప్రోత్సాహం, గైడెన్స్ అండ్ చాలా సార్లు టీచింగ్ కూడా....ఎంతో హెల్ప్ అయ్యింది.....ఏ విషయాన్ని అయినా సరే, విడమరిచి మూడు ముక్కల్లో చెప్పేస్తాడు ఛాయ్ వాలాకు కూడా అర్థం అయ్యే భాషలో....నేను చాలా సార్లు డిప్రెస్డ్ గా ఉన్నప్పుడు గుల్జార్, జావేద్ అఖ్తర్ సాబ్ లాంటి వాళ్ళు రాసిన ఉర్దూ షాయరీచెప్పేవాడు. తన ఫ్రెండ్స్ లో థియేటర్ ఆర్టిస్ట్ లు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళ షోస్ కి పిలుచుకుని వెళ్ళేవాడు. నాకు తనవల్లే జీవితంలో   కంప్లేసెన్సీ అలవాటు కాలేదు.

 

 అశుతోష్: నీతో మాట్లాడుతున్నప్పుడు చాలా సార్లు డిక్షనరీ అవసరం అనిపించేది....అఫ్ కోర్స్ నాకు ఆ పదాలు తెలియకకాదు.....నేను జనరల్ గా వాడను నా డైలీ లైఫ్ లో....కంప్లేసెన్సీ అంటే ఏంటో చెప్తావా ?

 

సంజయ్: హహహ....అంత ఎక్సప్లనేషన్ ఎందుకు? డైరెక్ట్ గా అడిగి ఉంటే చెప్పేసేవాడిని కదా

 

అశుతోష్: ఇగో అడ్డొస్తుంది కదా

 

సంజయ్: కంప్లేసెన్సీ అంటే మన విజయాలతో మనం తృప్తి చెందటం. ఇది సాధించాను ఇంతకంటే నాకేం కావాలి అనే సంతృప్తితో మన ఇన్నర్ పొటెన్షియల్ ని పూర్తి స్థాయిలో గుర్తించకపోవడం.

 

అశుతోష్ " : ఆల్రెడీ తెలిసిన పదమే అయినా ఇవ్వాళ అందులోని మీనింగ్ బోధపడింది......ఇంకా ఏం చెబుతూ ఉంటాడు మీ ఫ్రెండ్ ?

 

సంజయ్: తనని మీరు మీట్ అయినప్పుడు రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన "ఇఫ్" ఒకసారి వినిపించమని నా మాటగా అడగండి.....హి విల్ బ్లో యువర్ మైండ్ అవే ! ఐ విల్ బెట్ మై లైఫ్ ఆన్ థిస్ !

 

అశుతోష్: షూర్....!

 

 

వాళ్లకి తెలియకుండానే కాసేపు సైలెన్స్ వచ్చేసింది. మాటల్లో డెప్త్ ఎక్కువుంటే హార్ట్, బ్రెయిన్ ఒకే సారి రెస్పాండ్ అవుతూ ఉంటాయి, అప్పుడు మనకి తెలియకుండానే ఆలోచనల్లో ఎక్కడో ఆగిపోతాం. అలాంటప్పుడు వచ్చే సైలెన్స్ ఇది.

 

 

అశుతోష్: సంజయ్ పోయెట్రీ మీద ఇంత ఇంటరెస్ట్ ఉండడం మన జాబ్ కి మంచిదే అంటావా?

 

 సంజయ్: నేనూ ఒకప్పుడు సేమ్ ఇలానే ఆలోచించేవాడిని......నా ఆలోచనా విధానాన్ని మార్చేశాడు తను....

పోయెట్రీ ఈజ్ ఫర్ లైఫ్ సర్....వేర్ యాస్, జాబ్ ఈజ్ ఫర్ లివింగ్

 

 అశుతోష్: వెల్ సెడ్ !

 

సంజయ్: థాంక్ యు సర్....బట్ దీనికి కూడా క్రెడిట్ వాడికే ఇవ్వాలి మీరు.

ఛలో....ఐ విల్ టేక్ ఏ లీవ్ ఫర్ నౌ....బైసర్

 

 అశుతోష్: యా సంజయ్....బై...టేక్ కేర్

 

సంజయ్: సర్...

 

 అశుతోష్: హా...చెప్పు

 

 సంజయ్: తిన్నారా?

 

 అశుతోష్: నా గురించి తెలిసిందేగా...ఇప్పుడెళ్ళి ఆర్డర్ పెట్టాలి జొమాటో లో ....థాంక్స్ ఫర్ ఆస్కింగ్.....బట్ నువ్వు ఇలాంటి క్వశ్చన్ అడిగితే నాకు స్మితనే గుర్తుకొస్తుంది

 

సంజయ్: జ్ఞాపకాల్ని గుర్తు పెట్టుకోండి సర్.....గాయాల్ని గుర్తు చేసుకోకండి

 

అశుతోష్: కరెక్ట్ !

 

 సంజయ్: గుడ్ నైట్ సర్....ఆలోచనల్లో పడి డ్రైవ్ చేస్తూ ఇంటికెళ్లొద్దు.....ఎఫ్. ఎం. కానీ,

ఇంస్ట్రుమెంటల్ మ్యూజిక్కానీ వింటూ వెళ్ళండి

 

అశుతోష్: థాంక్స్ అగైన్....నా గురించి చాలా షార్ట్ టైంలో అర్థం అయిపోయింది నీకు

 

సంజయ్:  మన జాబ్ అదే కదా సర్

 

 అశుతోష్: ట్రూ.... ఛలో...సీ యు.

 

ఫోన్ పెట్టేసి ఒకసారి చుట్టూ చూసాడు అశుతోష్.

టైం నైట్ 11అయ్యింది.

సంజయ్ చెప్పినట్టే ఆలోచనలన్నీ క్లియర్ చేసి.......కామ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్తున్నాడు.

 

బాంద్రా-వర్లి సీ లింక్ బ్రిడ్జి క్రాస్ చేస్తున్నాడు....ట్రాఫిక్ ఎక్కువ ఉండటంతో మధ్యలో ఇరుక్కుపోయాడు.

ఇంతలో ఎవరో చిన్నపిల్లాడు ఒక గుడ్డ తీసుకునివిండ్ షీల్డ్ ని శుభ్రంగా నీళ్లతో తుడిచేసి డబ్బులివ్వండి  అంటూ కార్ బయటి నుంచే సైగ చేస్తూ అడిగాడు.

ఆ పిల్లాడి మైండ్ సెట్ నచ్చి విండో పేన్ తెరిచి 100 /- నోట్ ఇద్దామని వాలెట్ లో నుండి తీసి ఇవ్వబోతున్నాడు.

 

ఆ పిల్లాడి వెనక బ్యాక్గ్రౌండ్ లో ఎవరో మాసిన గడ్డంతో ఒక పెద్దాయన ఆత్రంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూవెళుతూ ఉండటం అవుట్ ఫోకస్ లో కనబడింది.

 

పిల్లాడికి డబ్బులిచ్చేశాడు.

 

ఆ పెద్దాయన్ని ఎక్కడో చూసినట్టు అనిపించి.... కార్ కొంచెంముందుకి పోనిచ్చాడు.

 

ఆయన మరెవరో కాదు.

 

ప్రొఫెసర్ రాధాకృష్ణన్.

 
ట్రాఫిక్ ఎంతకీ ముందుకి కదలకపోవడంతో అలెర్ట్ అయ్యి వెంటనే కార్ దిగి, అతన్నే ఫాలో అవ్వటం స్టార్ట్ చేసాడు అశుతోష్.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
#29
Nice interesting update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#30
మాయా రూపధారులు
షేప్ షిఫ్టర్స్
 
సిద్ధపురుషుడు అయిన సమర్థ రాఘవుడు రాజవరం గ్రామంలోని అధిష్ఠా నివాస స్థానమున విచ్చేసి ఉన్నారు. అభిజిత్, అంకిత, సంజయ్ లు ఉలుకుపలుకు లేకుండా ఉన్నారు. కళ్ళార్పకుండా ఆ సిద్ధపురుషుణ్ణే చూస్తున్నారు. అక్కడే తగిన చోటు చూసుకుని కూర్చున్నారు. సిద్ధపురుషుడు వారి ముగ్గురికీ ఎదురుగా ఆసీనుడై ఉన్నాడు. అధిష్ఠా గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నాడు.
 
"ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలు ఎంతో ముఖ్యమైనవి. చాలా జాగ్రత్తగా నేను చెప్పేవి విని వాటిని మీ మదిలో గుర్తుంచుకోవాలి", అన్నాడు సమర్థ రాఘవుడు.
 
ముగ్గురూ ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు ఏమీ అర్థం కానట్టు.
 
"కైలాసంలో శివుడు పార్వతీ దేవికి తంత్ర శాస్త్రాన్ని చెప్పాడు. ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క శాస్త్రం చొప్పున 64 చెప్పాడు. చరిత్ర తీసుకుంటే మనకు ఎంతో మంది తంత్ర శాస్త్ర ఉపాసకులు దొరుకుతారు. తంత్రానికి కావాల్సింది మంత్రం, యంత్రం. మంత్రం శబ్దానికి కట్టుబడి ఉంటుంది. యంత్రం మంత్రశక్తిని ఒక ఆకారంలో ఉద్భవింపజేసి ఉంచుతుంది. తంత్రము రహస్యంగా ఉంచదగినది. బయటికి చెప్పేది కాదు. అలాంటి తంత్ర శక్తి సిద్ధించాలంటే మంత్రం అవసరం. యంత్రానికి మంత్రం తోడైనప్పుడే ఆ తంత్రము పరిపూర్ణంగా  సిద్ధిస్తుంది.
 
కొన్ని అరుదైన మంత్ర శక్తుల కోసం ఎన్నో ఏళ్లుగా ఈ భూమి మీద ఎంతో మంది నాగమణుల కోసం అన్వేషిస్తూ గడిపారు. ఆ క్రమంలోనే ఎన్నో తప్పిదాలు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. తాము కోరుకునే దేవతలను సంతృప్తి పరిచి మంత్రశక్తిని సంపాదించటానికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. నాగమణిని సమర్పిస్తే అలాంటి అద్భుత మంత్ర శక్తులు దక్కుతాయనే భ్రమలో వుంటారు. అత్యాశకు పోయి కొంత మంది మూర్ఖులు దుష్ట శక్తులను ఆశ్రయిస్తారు.
 
ఈ 'అదృశ్య మందిరం' లోకి అడుగుపెట్టిన 5 మందీ అలాంటి వారే. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన స్వార్థగుణం. ఒకరికి పదవి, ఒకరికి అనంతమైన ఐశ్వర్యం, ఒకరికి పేరు, ఒకరికి యవ్వనం, ఒకరికి ఇంకేదో కొత్తది కనిపెట్టాలి అన్న కాంక్ష వల్ల కలిగిన ఆరాటం.
 
ఈ సృష్టిలోని గొప్పతనం ఏంటంటే మంచి, చెడు అంటూ వేరువేరుగా దేన్నీ చూడకపోవడం. ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా వారికి ఏది దక్కాలో అది దక్కి తీరుతుంది. సృష్టి నియమాలను అతిక్రమిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో మానవులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే ఇది కలియుగం. క్రితం యుగాలలో ధర్మాచరణ వల్ల దేవతలు 
అశరీరవాణి రూపంలో మనుషులకు జ్ఞానబోధ చేసేవారు. ఇప్పుడు అలా కాదు. వ్యక్తిగత నియంత్రణ చాలా ముఖ్యం. అది లేకపోతే ఎంత జ్ఞానాన్ని సంపాదించినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మీకేమైనా సందేహాలు ఉన్నచో అడగండి. నివృత్తి చేస్తాను."
 
"స్వామీ , ఈ ఐదుగురికీ మంత్ర సిద్ధి కలిగింది అంటారా?" అడిగాడు సంజయ్.
 
"ఎప్పటికీ కలగదు", అన్నాడు సిద్ధపురుషుడు.
 
ఎందుకు అన్నట్టు చూసారు ముగ్గురూ ఆయనవైపు.
 
"ఈ ఐదుగురూ వాళ్ళ పితృదేవతలకు విముక్తిని కలిగించలేదు. వీరిలానే వారి పూర్వీకులు కూడా ఎంతో స్వార్థం, దురాశ కలిగిన వాళ్ళు. వీరు కనుక పితృ కర్మలు శ్రద్ధగా ఆచరించి ఉంటే ఈ రోజున వారికి ఇలాంటి దుస్థితి కలిగుండేది కాదు."
 
"పితృకర్మలు ఆచరించకపోతే ఏం జరుగుతుంది?" అడిగాడు అభిజిత్.
 
"శాపం తగులుతుంది.  వీళ్ళకి జరిగింది అదే. వీళ్ళ పూర్వీకులు ఎన్నెన్నో తీరని కోరికలతో చనిపోయారు. వారికి పితృకర్మలు చేయకపోవటం వలన ఆ తీరని కోరికలతో ప్రేతాత్మలుగా మారిపోయారు. వారు ప్రేతలోకంలో ఉండిపోయారు. ప్రేతలోకంలో ఉండే వీరి ద్వారానే ఈ ఐదుగురి గురించి పాతాళలోకం అడుగున వుండే మహాపాతకులకి తెలిసింది", అని సంజయ్ దిక్కు చూసాడు ఆ సిద్ధ పురుషుడు.
 
"ఈ కేసుని నువ్వే ఇన్వెస్టిగేట్ చెయ్యటానికి కూడా ఒక కారణం ఉన్నది. అదేంటో తెలుసా ?" అని అడిగాడు సంజయ్ ని.
 
వాళ్ళలా ఇంగ్లీష్ లో నార్మల్ గా మాట్లాడేసరికి షాక్ అయ్యారు ముగ్గురూ ఒక్క నిమిషం.  సంజయ్ కూడా ఆ ప్రశ్నకు ఖంగుతిన్నాడు.
 
"అదేమిటో మీరే వివరించండి స్వామి", అన్నాడు సంజయ్ వినమ్రంగా.
 
"మీ పూర్వీకులకు... వారి పూర్వీకులు  ఎంతో అన్యాయం చేశారు. చాలా రుణపడిపోయారు వాళ్ళు మీకు. అందుకే నువ్వు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చెయ్యగలుగుతున్నావ్. ప్రపంచానికే తెలియకుండా ఆ ఐదుగురూ దాచిపెట్టిన ఈ 'సీక్రెట్ ఆపరేషన్' నీ ఒక్కడికే తెలిసింది."
 
"స్వామీ  మీరు మాకు లానే ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడగలుగుతున్నారు?" అడిగాడు అభిజిత్.
 
"ఇంగ్లీష్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రొం మెనీ లాంగ్వేజెస్....అందుకే మాట్లాడగలుగుతున్నాను."
 
కొంచెం సేపు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
 
"స్వామీ  నాదొక చివరి ప్రశ్న",అని సంశయిస్తూ అన్నాడు  సంజయ్.
 
"అడుగు"
 
"ఆ ఐదుగురూ పితృకార్యాలు చెయ్యలేదు కాబట్టి ఆ ప్రేతాత్మలు వారికి చెడు తలపెట్టాయి అనటం సబబుగా ఉంటుంది కానీ, పాతాళ లోకం కింద వుండే ఆ మహాపాతకులకి ఇందులో ఏమిటి సంబంధం? ఇప్పుడా మహాపాతకులు ఎక్కడున్నారు? "అని అడిగాడు సంజయ్.
 
"చాలా సరైన ప్రశ్న అడిగావు. ఇందులో ఒక లోతైన ధర్మసూక్ష్మం ఉంది. ఉపనయనం అయిన ప్రతీ ఒక్కరు భోజనం చేసిన తర్వాత చివరిలో కుడిచేతిలో నీరు పోసుకుని  
అమృతాపిధానమసి  అని చెబుతూ
 
రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం 
అర్థినాముదకం దత్తం అక్షయ్యము ఉపతిష్ఠతు 
 
 
అని చెప్పి నీళ్లు వదలటం వల్ల పాతాళలోకం కింద వుండే ఆ మహాపాతకులకు అవి చేరతాయి. అటువంటి దుస్థితిలో ఉంటారు వాళ్ళు.
 
ఈ ఐదుగురూ ఏ నాడు అలా నీళ్లు వదిలిన పాపాన పోలేదు. సరిగ్గా ఇక్కడే ఆ మహాపాతకులకి సువర్ణ అవకాశం దొరికింది. ఎవరైతే అలా నీళ్లు వదలకుండా వుంటారో వారి తంత్రం సిద్ధించదు. అలాంటివాళ్ళు ఏ అధిదేవత కోసం అయితే తంత్రప్రయోగం చేస్తారో వారి స్థానంలో అసుర అధిపతి ఒకరు ప్రత్యక్షం అవుతారు.
 
తంత్రం కోసం ఆ ఐదుగురూ ప్రేతాత్మలను ఆశ్రయించారు. ఆ ప్రేతాత్మలు ఈ మహాపాతకులకి భూలోకం వెళ్ళటానికి ఇదే ఏకైక మార్గం అని సూచించాయి.
 
మహాపాతకులకు నాయకుడైన  ఘోరకలి అరుదైన ఒక నాగమణిని దొంగిలించాడు. ఆ నాగమణిని ప్రేతాత్మలు ఆ ఐదుగురికీ అందజేశాయి. ఆ ఐదుగురూ తంత్రం ప్రయోగించి చూసారప్పుడు. అధి దేవత ప్రత్యక్షం అవుతుందని ఆశపడ్డారు. కానీ  ప్రచండుడు ప్రత్యక్షం అయ్యాడు. ఘోరకలినీ, తన చీకటి రాజ్యాలు అన్నింటినీ విముక్తి చేసాడు. ఇప్పుడు ఆ చీకటి రాజ్యాలన్నీ భూలోకంలోకి విడుదల చెయ్యబడ్డాయి. తొందరలోనే వాటి సామ్రాజ్యాలు ఎక్కువవుతాయి."
 
"అమ్మో! దీని వెనకాల ఇంత స్టోరీ ఉందా !" అన్నది అంకిత.
 
"ఇది కథ కాదు. దేని మీదా పూర్తిగా నమ్మకం లేకుండా కర్మలను ఆచరించే వారి వల్ల ప్రపంచం అనుభవించే వ్యథ !" అని బాధపడ్డాడు ఆ సిద్ధపురుషుడు.
 
"స్వామి, ఇప్పుడు ఈ చీకటి రాజ్యాల్లో ఉండేవారు బయటి ప్రపంచంలో ఎలా తిరుగుతారు?" అడిగాడు సంజయ్.
 
"మాయా రూపధారులయ్యి తిరుగుతారు."
 
"అంటే ఎలా స్వామి?" అడిగాడు అభిజిత్.
 
"షేప్ షిఫ్టర్స్ తెలుసా?" అడిగాడు ఆ సిద్ధ పురుషుడు.
 
"హా...తెలుసు....ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తాం కదా", అన్నాడు అభిజిత్.
 
"హహహ....ఇంగ్లీష్ సినిమాలు కాదు....మన రామాయణంలోనే వీటి ప్రస్తావన ఉన్నది.
 
మారీచుడు బంగారు లేడిలా మారటం అదే కదా", అన్నాడా సిద్ధ పురుషుడు .
 
"ఇప్పుడు వాళ్ళు షేప్ షిఫ్టర్స్ గా మారి బయటి ప్రపంచంలో తిరుగుతున్నారా స్వామి?" అడిగాడు సంజయ్.
 
"ఈ పాటికి ఎవరినో మాయ చేస్తూ ఉండుంటారు ఆ మాయా రూపధారులు", అంటూ అంతః చక్షువులతో చూసాడు.
 
ఒక దృశ్యం కనిపించింది ముంబై లో
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
#31
Super marvelous update  clps yourock thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
#32
ఆ మద్యలో ఏప్పుడో చూసిన గుర్తు, తరువాత్తరువాత మెల్లగా మరుగున పడిపోయింది ఈ కథ నా మెమరీ నుంచి. మళ్ళీ ఇన్ని రోజులకు చూడటం, చదవడం కుదిరింది. చాలా కుతూహలంగా, ఉత్సుకతగా వుంది చదువుతుంటే. భూమిలోకి సొరంగం తవ్వుతుంటే కేకలు, ఏడుపులు వినిపించాయని కూడా ఎప్పుడో చదివిన గుర్తు, ఇప్పుడు మళ్ళీ చైనా వాడు తవ్వబోతున్నాడంటా, చూద్దాం ఏం దొరకుతుందో.

పోతే నాకున్న కొన్ని సందేహాలను అడగొచ్చు అనుకుంటా. ఈ మద్య కూన్ని ఆర్టికల్స్, అదేవిదంగా కోరాలో అడిగే సందేహాలకు ఇచ్చిన, వచ్చిన జవాబులను బట్టి "ఆకాలంలో ఉన్న మహిమలూ, మహోన్వితమైన అస్త్రశస్త్రాలు, ప్రయోగ వుపసః హారక మంత్రాలు ఆ కాలం వాళ్ళకు మాత్రమే వుపయోగిస్తాయని, ఈ కాలం వాళ్ళకు వాటిని భరించే యోగ్యతగాని, నిష్టత గాని లేవని, అందుకే అవి కాలక్రమంలో మరుగున పడిపోయాయని " వుంది. అటువంటప్పుడు ఆకాలంలో రాసిన ఆచమ[b]
 మంత్రాలు, వేదాలు ఈ కాలంలో కూడా ఎలా / ఎందుకు పాటించాలి. కాలమనేది నిరంతరం మార్పు చెందుతూ వుంటుందికదా, మరి అప్పుడు చెప్పినవి ఇప్పుడేలా అన్వయించుకోవాలి.  
[/b]
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply
#33
అద్భుతం...??
[+] 1 user Likes nariasp's post
Like Reply
#34
అద్భుతం.....
[+] 1 user Likes nariasp's post
Like Reply
#35
చాలా బాగుంది
Please update ఇవ్వండి
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 2 users Like The Prince's post
Like Reply
#36
చదివిన, స్పందించిన మితృలకు ధన్యవాదములు
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#37
అశుతోష్ ఇన్ డేంజర్
మాయా రూపధారి సృష్టించిన గందరగోళం
 
సిద్ధపురుషుడికి ముంబైలో మొట్టమొదటగా కనిపించిన దృశ్యం అశుతోష్ మాసిన గడ్డం ఉన్న పెద్దాయనని ఫాలో అవుతూ వెళ్ళటం. వెంటనే తనకు కనిపించిన దృశ్యాన్ని సంజయ్, అంకిత, అభిజిత్ లతో ఇలా వివరించాడు.
 
"మీ పై అధికారి ఎవరో తన వాహనాన్ని మధ్యలోనే ఆపేసి ఒక మాసిన గడ్డం వున్న పెద్దాయనని వెంబడిస్తున్నాడు. మాయా రూపధారులని తలచుకోగానే నాకు కనిపించినది ఇదే. ఆయనతో మీలో ఎవరైనా మాట్లాడగలరా ఇప్పుడు? వెంటనే ఆయనని హెచ్చరించండి. ఆయన ఒక మయా రూపధారి వలలో చిక్కుకున్నాడని చెప్పండి. ఎవరో అనుకుని పొరబడినట్టున్నాడు."
 
"ఆయనకు వెంటనే ఫోన్ చేసి చెప్తాను స్వామి", అంటూ అశుతోష్ తో మాట్లాడటానికి బయటికి వెళ్ళాడు సంజయ్.
 
"మాసిన గడ్డం ఉన్న పెద్దాయన అంటే మైథాలజీ ప్రొఫెసర్ రాధాకృష్ణన్ కదా?", అంది అంకిత అభిజిత్ తో.
 
"అందులో డౌట్ ఏం ఉంది? ఒక్కసారి చూస్తే మర్చిపోయే ప్రొఫైల్ పిక్కా అయ్యగారిది!" అన్నాడు సర్కాస్టిక్ గా అభిజిత్.
 
"హహహ...అందరూ నీలా హ్యాండ్సమ్ గా ఉండరు లే", అని మెల్లగా అభిజిత్ కి మాత్రమే వినబడేలా అంది అంకిత.
 
"ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడేది ! ఇవ్వాళ ఏమైంది నీకు?" అన్నాడు అభిజిత్.
 
"ఏంటి ఒక్క కాంప్లిమెంట్ కే అంతలా ఎగ్జైట్ అయిపోతున్నావ్", అంది అంకిత.
 
"సరే అవ్వను లే", అని ఠక్కున బదులిచ్చాడు.
 
"నీకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు", అంది.
 
"ఇప్పుడు నువ్వే కదా మాట్లాడింది", అన్నాడు.
 
"అవును నేనే మాట్లాడా. అయితే ఏంటి?" అంది.
 
"ఏం లేదు. ఇంతకీ కేసు ఎప్పుడు సాల్వ్ అవుతుంది అంటావ్?" అన్నాడు.
 
"ఇప్పట్లో కాదు. ఎందుకు అలా అడిగావు?" అంది.
 
"నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఇదంతా. కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఇలా రాజవరానికి రావటం. ఇవన్నీ జరగటం. కేసు సాల్వ్ అయిపోయి మళ్ళీ మనం ముంబై బ్యాక్ వెళ్ళిపోతే ఇవన్నీ మిస్ అయిపోతానని పక్క బాధగా, మరో పక్క భయంగా ఉంది", అన్నాడు.
 
"ఏంటి నీకు ఇదంతా జోక్ లా ఉందా? అక్కడ అశుతోష్ ట్రాప్ అయ్యాడు బాబు", అంది.
 
"లైఫ్ లో మాత్రం థ్రిల్ ఉండాల్సిందే", అన్నాడు.
 
"ఏదైనా చెప్పటం చాలా ఈజీ.....చెయ్యటం కష్టం", అంది.
 
"ఏదైతే అందరికీ కష్టంగా అనిపిస్తుందో అదే ఎగ్జైట్ చేస్తుంది నన్ను.......చిన్నప్పటి నుంచి నా నేచర్ అంతే", అనేశాడు సూటిగా అంకిత కళ్ళలోకి చూస్తూ.
 
"క్యూటీ", అంది చిన్నగా తనకు మాత్రమే వినబడేలా.
 
"ఏంటి ఏదో అన్నావ్...డ్యూటీ నా?" అన్నాడు.
 
"నీకు వినబడింది అని నాకు తెలుసు. ఎందుకు ఆస్కార్ యాక్టింగ్ లు చేస్తావ్ నా దగ్గర", అంది.
 
"హే....నిజంగానే నాకు వినబడలేదు", అన్నాడు ఏమీ తెలియనట్టు అమాయకంగా. కానీ ఏం లాభం? ఎంతగా నవ్వు ఆపుకుందామని ట్రై చేసినా చిరునవ్వు కబ్జా చేసేసింది అభిజిత్ ఫేస్ ని.
 
అది చూసి అందంగా నవ్వింది అంకిత.
అభిజిత్ కి మరింత ఆనందం కలిగించే నవ్వు అది.
 
 
డిస్ప్లే లో సంజయ్ నెంబర్ కనబడగానే అశుతోష్ కాల్ లిఫ్ట్ చేసాడు.
 
అశుతోష్: హా చెప్పు సంజయ్
 
 సంజయ్: సర్ మీరు ఫాలో చేస్తున్న వ్యక్తి ప్రొఫెసర్ రాధాకృష్ణన్ కాదు....
 
 అశుతోష్: అసలు ఎలా తెలిసింది నీకు? ఆర్ యు వాచింగ్ మీ ఫ్రొం డిస్టెన్స్?
 
చుట్టూ ఒక సారి చూసాడు అశుతోష్.
 
సంజయ్: సర్ ఇందాక మీకు కాల్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని విచిత్రాలు జరుగుతున్నాయి అని చెప్పాను కదా. సో నన్ను నమ్మండి. మీరు రాధాకృష్ణన్ అనుకుని ఎవరిని అయితే ఫాలో అవుతున్నారో మాయా రూపధారి అతను.
 
 అశుతోష్: వాట్ !
 
సంజయ్: షేప్ షిఫ్టర్ సర్
 
 అశుతోష్: వాట్ ఆర్ యు టాకింగ్, సంజయ్? ఈజ్ థిస్ సమ్ కైండ్ అఫ్ ప్రాంక్ ?
 
 సంజయ్: లేదు సర్. నాకు ఎన్నో విషయాలు తెలిసాయి ఇక్కడ. విల్ అప్డేట్ ఆల్ అఫ్ దెమ్ టు యు వన్స్ యు ఆర్ సేఫ్....
 
ఇప్పుడు మాత్రం నేను చెప్పేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. చాలా మంది షేప్ షిఫ్టర్లు బయట ప్రపంచంలో తిరుగుతున్నారు. అతనితో జాగ్రత్తగా ఉండండి. అతని మాయలో పడకండి. ఫాలో చెయ్యండి కానీ తొందరపడి అతన్ని ఫిజికల్ గా ఎటాక్ చెయ్యటం కానీ, కస్టడీ లోకి తీసుకోవటం కానీ చెయ్యొద్దు. చాలా డేంజరస్ అది.
 
 అతను రాధాకృష్ణన్ కాదు అంటున్నావ్. షేప్ షిఫ్టర్ అంటున్నావ్. అసలు ఎవరు ఇంతకీ?
 
సంజయ్: చీకటి రాజ్యం అతనిది. పాతాళలోకం కింద వుండే మహాపాతకులలో ఒకడు అతను. భూమ్మీద ఇంకొన్ని రోజుల్లో ఎన్నో చీకటి రాజ్యాలు తమ సామ్రాజ్యాలను విస్తరించుకోనున్నాయి.
 
అశుతోష్ : ఏంటో నాకేం అర్థం కావట్లేదు. దీని గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి నేను అతన్ని ఫాలో అవుతున్నాను. లీడ్ ఏదైనా దొరికితే నేను అప్డేట్ చేస్తాను. అండ్ విల్ స్టే సేఫ్. విల్ మైంటైన్ మై డిస్టెన్స్ ఫ్రం ది  షేప్ షిఫ్టర్, యాజ్ యు కాల్ ఇట్.
 
సంజయ్: థాంక్ యు సర్. ప్లీజ్ స్టే సేఫ్
 
ఒక నిర్మానుష్యమైన వీధిలోకి మాయారూపధారుడు అడుగుపెట్టాడు. అతన్నే అనుసరిస్తూ అడుగులో అడుగు వేస్తూ వెళ్ళాడు అశుతోష్. కొంత దూరం నడిచాక మాయా రూపధారి కనబడలేదు.
 
ఎటు వెళ్లిపోయాడా అని ప్రతీ చోటా వెతికాడు అశుతోష్. చుట్టూ చూసాడు. ఎక్కడా కనబడలేదు.
 
ఇంతలో వెనక నుండి ఎవరిదో చెయ్యి అశుతోష్ భుజాన్ని తాకినట్టు అనిపించింది.
తిరిగి చూసాడు.

చీకటి సామ్రాజ్యాల నాయకుడు  ఘోర కలి  కనిపించాడు.
 
భయంతో వణికిపోయాడు అశుతోష్.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#38
(01-09-2023, 03:12 PM)Uday Wrote: ఆ మద్యలో ఏప్పుడో చూసిన గుర్తు, తరువాత్తరువాత మెల్లగా మరుగున పడిపోయింది ఈ కథ నా మెమరీ నుంచి. మళ్ళీ ఇన్ని రోజులకు చూడటం, చదవడం కుదిరింది. చాలా కుతూహలంగా, ఉత్సుకతగా వుంది చదువుతుంటే. భూమిలోకి సొరంగం తవ్వుతుంటే కేకలు, ఏడుపులు వినిపించాయని కూడా ఎప్పుడో చదివిన గుర్తు, ఇప్పుడు మళ్ళీ చైనా వాడు తవ్వబోతున్నాడంటా, చూద్దాం ఏం దొరకుతుందో.

పోతే నాకున్న కొన్ని సందేహాలను అడగొచ్చు అనుకుంటా. ఈ మద్య కూన్ని ఆర్టికల్స్, అదేవిదంగా కోరాలో అడిగే సందేహాలకు ఇచ్చిన, వచ్చిన జవాబులను బట్టి "ఆకాలంలో ఉన్న మహిమలూ, మహోన్వితమైన అస్త్రశస్త్రాలు, ప్రయోగ వుపసః హారక మంత్రాలు ఆ కాలం వాళ్ళకు మాత్రమే వుపయోగిస్తాయని, ఈ కాలం వాళ్ళకు వాటిని భరించే యోగ్యతగాని, నిష్టత గాని లేవని, అందుకే అవి కాలక్రమంలో మరుగున పడిపోయాయని " వుంది. అటువంటప్పుడు ఆకాలంలో రాసిన ఆచమ[b]
 మంత్రాలు, వేదాలు ఈ కాలంలో కూడా ఎలా / ఎందుకు పాటించాలి. కాలమనేది నిరంతరం మార్పు చెందుతూ వుంటుందికదా, మరి అప్పుడు చెప్పినవి ఇప్పుడేలా అన్వయించుకోవాలి.  
[/b]
మిత్రమా

మీరడిగిన ప్రశ్న భేషుగ్గా ఉంది. కాకపోతే అప్పటి మంత్రాలు, అస్తశస్త్రాలు ఈ కాలంలో ఉపయోగపడతాయా అంటే ఔననే చెప్పాలి. ఇప్పటి అణ్వస్తాలు మన పురాణాల్లో చెప్పబడిన బ్రహ్మ, నారాయణ, త్రిపురాంతక, బ్రహ్మశిరో నామాస్త్రాలు ఇపుడు అటమిక్, హైడ్రోజెన్, ప్రోటాన్ బాంబులుగా అనుకోవచ్చును. అలాగే పుష్పక విమానం మన ప్రస్తుత విమానం అనుకోవచ్చును.

అలాగే మన మంత్రాల వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తిరోగమిస్తున్నాయని, సాధారణ ఆరోగ్యం వృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఉదాహరణకు ఓంకారం, ధ్యానం, యోగ.
ఇపుడు వీటిని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తూ ఫలితాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. 

మనం లోతుగా అలోచిస్తే వాటి ప్రయోజనాలు విదిశమౌతాయి.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#39
ఈ ఫోరమ్లో పాఠకులు తక్కువ కాబట్టి,  అప్డేట్లు వారం, పది రోజులకో సారి మాత్రమే ఇస్తున్నాను.
 
మిత్రులు గమనించే ఉంటారనుకుంటాను.
 
ధన్యవాదములు
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#40
అప్డేట్ చాల అద్భుతంగా ఇచ్చారు  clps yourock thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: