Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముడి
#81
Next update please
[+] 1 user Likes Arjun0410's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#83
ముడి - పార్ట్ 12
ఈశ్వర్ భయపడ్డట్టుగానే ఒక పెద్ద german shepherd కుక్క ఈశ్వర్ వైపుగా పళ్ళు కొరుకుతూ గుర్రు మంటూ రాసాగింది.
రాం రెడ్డి కూతురు రూం లోపల పెట్టిన ఊఫర్ లో నుంచి వస్తున్న పోకిరి సినిమా పాటలను వింటూ తన గొంతు కలపసాగింది చిత్ర.
"హెల్లో ఈశ్వర్ గారూ.... ఏంటి ఇలా వచ్చారు? మీ missus ఆ? నమస్తే" చిత్రని చూపిస్తూ అడిగాడు రాం రెడ్డి.
"సార్ ముందు కుక్కని కట్టేయండి." అన్నాడు ఈశ్వర్.
"హేయ్ శాగీ, shut up! shut up!" అంటూ కుక్కని హెచ్చరించాడు రాం రెడ్డి.
ఈశ్వర్ తనను చూస్తూ పళ్ళు కొరుకుతున్న కుక్క పై దృష్టి పెడుతూనే రాం రెడ్డి తో మాట్లాడసాగాడు.
"అదే....విశ్వనాథ్ అని మా ఆఫీస్ లో పని చేసే అతను పైన పెంట్ హౌస్ కి షిఫ్ట్ అవుతున్నారు కదా."
"హా అవ్ను అవ్ను."
కుక్క ఈశ్వర్ ని చూస్తూ మరింత గట్టిగా పళ్ళు కొరకసాగింది.
"సార్ దాన్ని కట్టేయండి." మళ్ళీ అన్నాడు ఈశ్వర్.
కాస్త నిట్టూర్చి,ఆ కుక్క ని తీసుకెళ్ళి సోఫా కి కట్టేశాడు రాం రెడ్డి. ఈశ్వర్ వల్లే తాను కట్టివేయబడాల్సి ఒచ్చిందన్న అక్కసుతో మరింతగా పళ్ళు కొరకసాగింది శాగీ.
"ఇప్పుడు చెప్పబ్బా." అన్నాడు రాం రెడ్డి.
"అదే సార్, విశ్వనాథ్ నాకు కాల్ చేసాడు. మీ ఫోన్ కలవట్లేదట. చాలా సార్లు ట్రై చేసాడంట మీకు. ఒక సారి నన్ను మిమ్మల్ని అతని తో మాట్లాడించమని చెప్పాడు."
"ఓ.... ప్చ్ , గీ ఫోన్ తోని మస్తు తలకాయ్ నొప్పైంది. మా ఆమె జియో తీస్కోమని చెప్తుంటుంది...జియో బాగుంటుందా మరి?" అడిగాడు రాం రెడ్డి.
"yeah, signal strength మన area లో నైతే బావుంది. rural regions లో కూడా it is working good as far as i know" బదులిచ్చాడు ఈశ్వర్.
" ఊర్లు అంటే ... ఈ మధ్య ఎక్కువగా ఏం వెళ్ళట్లేలే. city లో signal వస్తే చాలబ్బా."
"then jio is a good choice."
"అయ్యో, పెళ్ళైనాక వచ్చారు first time. లోపలికి రండి. బయటనే నిలబడి మాట్లాడుతున్నా అప్పటినుండి." అంటూ చిత్ర వంక చూసి నవ్వుతూ లోనికి ఆహ్వానించాడు రాం రెడ్డి.
తలూపి, నవ్వుతూ లోపలికి వెళ్ళబోయింది చిత్ర. తన వైపు చూసి పళ్ళు కొరుకుతున్న శాగీ ని చూసి, "పర్లేదు సార్, ఇద్దరం ఇంకోసారి వస్తాం.... మీరు విశ్వనాథ్ తో ఇంకోసారి ఫోన్ మాట్లాడితే..." అన్నాడు ఈశ్వర్.
"ఓకే, ఓకే ఇటివ్వండి."
విశ్వనాథ్ నెంబర్ డయల్ చేసి, రాం రెడ్డి చేతిలో తన ఫోన్ ని పెట్టాడు ఈశ్వర్.
"చిన్ని! కొంచం చిన్నగ పెట్టుకో స్పీకర్ ని. అస్సలు వినిపిస్తలేదు ఇక్కడ. " అని తన కూతురి పై అరిచి, ఈశ్వర్,చిత్ర లతో " ఈ స్పీకర్ లని తీస్కపొయి బయట పడేస్తే శని ఒదిలిపోతది. అంత సౌండ్ ఒద్దని ఎన్ని సార్లు చెప్పినా చెవులకే ఎక్కదు!" అంటూ ఫోన్ లో "హలో" అన్నాడు రాం రెడ్డి.
చిత్ర వైపు తిరిగి ఈశ్వర్ ఆమె తో "ఒక్క 5 మినెట్స్." అంటూ సైగ చేసాడు.
"అయ్య, పర్లే, పర్లే. నాకు తొందరేమ్లే."అంటూ volume తగ్గింది కాబట్టి, కాస్త కష్టపడుతూ వినసాగింది చిత్ర.
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే పాట రెండో చరణం వచ్చే సరికి రాం రెడ్డి తన ఫోన్ సంభాషణని ముగించి ఈశ్వర్ కి ఫోన్ అందించాడు.
"చిత్రా, వెళ్దామా?" అడిగాడు ఈశ్వర్.
"రండి, వీలైనప్పుడు ఇద్దరూ కలిసి. ఈమె ఊరికి వెళ్ళింది. వాళ్ళ చెల్లెలి పాప ది ఫంక్షన్ ఉందని పోయింది. Actually నేను, మా పాప కలిసి రేప్పొద్దున్నే వెళ్ళేది ఉంది. మీరిట్లా ఆయనతో ఫోన్ మాట్లాడించటం చాలా మంచిదైంది." అన్నాడు రాం రెడ్డి.
అతని మాటలకి బదులుగా చిరునవ్వు ఒకటి చేసాడు.
'ఏందో ఏమో, గీ మనిషి నాతోని తప్ప ప్రపంచం లో అందరితోని మంచిగ నవ్వుతడు! ' అనుకుంది చిత్ర.
ఈశ్వర్ చిత్రలు వెళ్ళిపోయాక, ఈశ్వర్ అంతకుముందు ఏనాడూ అపార్ట్మెంట్ లో ఎవరితోనూ అంత సేపు మాట్లాడని వైనం గుర్తుకు వచ్చింది రాం రెడ్డికి. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుండే ఈశ్వర్ లో తేడా చాలా ప్రస్పుటంగా కనిపించింది రాం రెడ్డి కి. తన కూతురి శరీర రంగు వల్ల పెద్ద ఉద్యోగస్థుడైన అల్లుడు దొరకడేమో నన్న భయాన్ని ఏర్పరుచుకున్న రాం రెడ్డికి ఈశ్వర్, చిత్ర ల జంట కాస్త ఆశాజనకంగా తోచింది!
"గా కుక్క జెర్మన్ షెప్పర్డు గదా?" అడిగింది చిత్ర, లిఫ్ట్ బయటకు అడుగుపెడుతూ.
"హం" అని మాట ఆపుకోలేక, "నీకు ఎలా తెలుసు?" అని అడిగాడు ఈశ్వర్.
"అదా, ఆ వకిల్ శ్రీనివాస రావ్ ఇంట్ల ఉంటుండె అది. వాళ్ళమ్మకి బాలేకుంటే హైదరబాదు కి ఒచ్చిండే వాళ్ళు ఆమెని తీస్కొని. మా మామ కాడ ఒదిలి పోయిర్రు పోయేటప్పుడు ఆళ్ళు. మస్తు ఉంటుండే మా చేను ల. కొత్తోళ్ళెవరన్న ఒస్తే మస్తు మొరుగుతుండె. కానీ మా పక్క పొలమోళ్ళు సంపేశిర్రు దాన్ని అన్నం ల మందు కలిపి. ఓర్చుకోలేక పోయిర్రు దొంగముండా కొడుకులు." అంది చిత్ర ఆవేశంగా.
చిత్ర యొక్క పదజాలాన్ని చూసి కాస్త ఉలిక్కిపడ్డాడు ఈశ్వర్. తనను మనసులో చిత్ర ఏ పదజాలం తో తిట్టుకుంటోందో నన్న ఆలోచన కలిగిందతడికి.
"కుక్కలకి అట్ల బయపడగూడదు. గవి నువ్వు బయపడ్తే ఇంగా ఎక్కువ జేస్తయ్.గవి మనం భయపడ్తే మన శరీరం ల కెళ్ళి ఒచ్చే వాసనను జూశి " అంది చిత్ర.
చిత్ర తాను శాగీ ని చూసి భయపడిన విషయాన్ని గురించే ప్రస్తావిస్తుందని అర్థమైంది ఈశ్వర్ కి.
"ఏమో, నాకు దాన్ని చూస్తే చాలా భయమేస్తూ ఉంటుంది." అన్నాడు ఈశ్వర్ నిజాయితీగా.
"నీ వాసనను సూస్తదంతే గది. గంతకు మించి ఏముండదు. నువ్వు బయపడ్తివంటే నిన్ను దొంగవు అనుకుంటది గది. దానికి నువ్వు బయపడ్తె తెలుస్తదంట .నీ శరీరం ల కెళ్ళి ఏంటివో హార్మొన్లో ఏంటివో ఒస్తయంట.అప్పుడు గది నీ వాసనను జూశి నువ్వు బయపడ్తున్నవ్ అని గుర్తుపడ్తదంట. " అంది చిత్ర.
తనను 'దొంగ ' తో చిత్ర పోల్చడం కాస్త వింతగా అనిపించింది ఈశ్వర్ కి.
"మామ అప్పుడప్పుడు ఆదివారం పూట ఈనాడు పేపరు తెస్తుంటడు. అందుల ఒచ్చే ఆదివారం పుస్తకం ల సదివింటి చిన్నగున్నప్పుడు ఇది." అంది చిత్ర, ఇవ్వాల్సిందానికన్నా ఎక్కువ సమాచారాన్ని ఇచ్చే తన అలవాటుకి బద్ధురాలై.
"ఓ." అన్నాడు ఈశ్వర్ తమ ఇంటి తాళాన్ని తెరుస్తూ.
"ఏందో ఏమో, గిన్ని రోజులైతుంది. మామ ఒక్కసారి గూడ ఫోన్ చెయ్యనే లే" అంది చిత్ర, తన మేనమామ నూ, పెంట్లవెల్లి నీ, పొలాన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ.
"మరి నువ్వే చేయొచ్చుగా ఫోన్." అన్నాడు ఈశ్వర్.
"అయ్య, ఒద్దు ఒద్దులే. మామ బాగ పనిమీద ఉండింటడు. గందుకే చేస్తలేనట్టున్నడు. ఊకె పంచాయితీలవ్తుంటయ్ అప్పుడప్పుడు. అదే గాకుండగ బుడ్డలు పంట మీదికి ఒచ్చింటయ్ . కూలోళ్ళు దొర్కుతలేరు గీమద్య కాలంల."
"ఓ." అన్నాడు ఈశ్వర్.
"అందులవోను నేను పక్కన గూడలేను. నేను చేతికింద ఉండింటె నన్న గాయ్న కి చేయాడుతుండే. ఒక్కడే అయ్యింటడు పాపం మామ. గా గీత, స్వాతి లకు పని రాదు, సద్వూ రాదు.... అంటే పాపం మంచి పిల్లలే లేగాని. మామ కి ఏం సాయం జెయ్యరు. ఎప్పుడు జూడు టి.వి ల ముందు కూసుంటరు బడి కెళ్ళి ఒచ్చి. పాపం కస్తిగ అయితున్నట్టుంది మామకి ఒక్కడే చేస్కోనీకె." అంది చిత్ర, తన మేనమామ పట్ల కాస్త ఆందోళనను వెలిబుచ్చుతూ.
"హం." అన్నాడు ఈశ్వర్.
కుశల ప్రశ్నలు అడగటానికి తన తల్లిదండ్రులకు తాను ఫోన్ చేసి ఏళ్ళు గడిచిన వైనం గుర్తుకు వచ్చింది ఈశ్వర్ కి. చిత్ర తన మేనమామ నుంచి ఫోన్ కొరకు ఎదురు చూస్తున్నట్టు, తన తల్లిదండ్రులు కూడా తన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారేమోనన్న ఆలోచన కలిగింది ఈశ్వర్ కి. ఒక్క క్షణం తనకూ తన తల్లిదండ్రులకూ మధ్యన పెరిగిన దూరం తన యొక్క స్వయంకృతాపరాధం గా తోచింది ఈశ్వర్ కి. తన పుట్టింటిని ప్రేమగా తలుచుకోగలిగే చిత్ర పై ఒక్క క్షణం అసూయ కలిగింది ఈశ్వర్ కి. తనకు తలుచుకోవడానికి చనిపోయిన అమృత తప్ప ఎవరూ లేరేంటి అన్న ప్రశ్న కలిగిందతడికి! అపరాధభావం, అసూయ, బాధ కలగలిసిన భావోద్వేగం అతని ముఖం లోని కవళికలను మార్చింది.
"నేనేమన్న తప్పుగ మాట్లాడిన్నా?....ఇదో... ఏమన్న తప్పుగ అనింటే చెప్పు నాకు.సరేనా? నాకు సక్కగ మాట్లాడనీకె రాదు అప్పుడప్పుడు." అంది చిత్ర అప్రయత్నంగా, తన భర్త బాధపడటాన్ని గమనించినదై.
ఒక్క రెండు నిమిషల మౌనం వారిద్దరి మధ్య ఆవహించింది. తానేమైనా తప్పుగా మాట్లాడానేమో నని చిత్ర కాస్త కంగారు పడసాగింది. కానీ తానన్న మాటలకూ, అమృత కూ సంబంధం ఏమీ లేదన్న భావన కలిగింది చిత్రకి. తన భర్త ని అమృతే కాక ఇంకేదైనా ఆలోచన వేధిస్తోందా ? లేక తన మాటలే సరైనవి కావా? అన్న ఆలోచనలు ఆమెకు కలిగాయి.
'ఏందో ఏమో, గదేదో సిన్మాల పక్కోళ్ళ మనసుల ఏమనుకుంటున్నరో వినబడినట్టు నాకు గీ మనిషి ఏమనుకుంటుండో తెలిశింటే అయిపోవు.' అనుకుంది చిత్ర మనసులో.
అప్రయత్నంగా తన జుట్టు చెరుపుకుని, తిరిగి సరిచేసుకుని తన గదిలోనికి వెళ్ళబోయాడు ఈశ్వర్.
' ఇంగ ఇరోజు గీ మనిషి తోని ఎక్కువ మాట్లాడొద్దు.రేపు మళ్ళ ఏదన్న మాట్లాడుదం. ఎక్కువ గెల్కిచ్కుంటే అసల్కే మోసమొచ్చేటట్టుంది! ఏందో ఏమో, గీ మనిషి మామూల్ గ నా తోని మాట్లాడుతనే ఇంత మంచిగ అనిపిస్తది నాకు. అట్లాంటిది నాతోని ప్రేమగ మాట్లాడితే ఇంగెంత మంచిగుంటదో! ' అనుకుంది చిత్ర మనస్సులో.
" రాత్రికి ఉప్మా జేద్దం అనుకుంటున్న. ఒక వేళ నీకు చెపాతీలే కావాలంటె గవే జేస్త." అంది చిత్ర, సాధ్యమైనంత గంభీరంగా ముఖం పెడదామనుకుని, విఫలమై, తనకు అలవాటైన రీతిలో పళ్ళికిలిస్తూ. ఏదోటి మాట్లాడి, తన భర్తను ఆలోచనల నుండి బయటకు తీస్కొద్దామన్న ఉద్దేశం తో.
"ఏదైనా పర్లేదు నాకు. వీలైతే కాస్త త్వరగా చేయి." అన్నాడు ఈశ్వర్.
"ఉప్మా జేస్త ఐతె" అంది చిత్ర.
"ఓకే."అన్నాడు ఈశ్వర్.
నవ్వుతూ వంట గది వైపు చిత్ర, ముఖం లో కవళికలు లేకుండా, మస్తిష్కం లో ఎన్నో ఆలోచనలను నింపుకుని ఈశ్వర్ పడక గది వైపు నడవసాగారు.
"చిత్రా!" అన్న పిలుపు విని ఈశ్వర్ వైపు తిరిగింది చిత్ర.
ఒక్క క్షణం కాస్త నిట్టూర్చి, చిత్ర వైపు చూసి చూడనట్టుగా తన కళ్ళని ఉంచి, కాస్త గంభీరమైన స్వరం తో
"నాకంటూ కొన్ని issues ఉన్నాయి.అందుకే నేను ఇలా ఉంటాను అప్పుడప్పుడూ... ఇందులో నీ తప్పేం లేదు.trust me. problem నావైపే ఉంది. నువ్వు ఇలా మాట్లాడితే నిన్ను బాధపెడ్తున్నానేమో నని చాలా guilt కలుగుతూ ఉంటుంది నాకు." అన్నాడు ఈశ్వర్.
చిత్ర ఏం మాట్లాడలేదు. చిత్ర నుంచి ఏ బదులూ రాకపోయేసరికి, తన గదిలోకి వెళ్ళాడు ఈశ్వర్, తలుపు మూస్తూ చిత్రతో " వీలైతే try to make it fast. కాస్త ఆకలిగా ఉంది." అన్నాడు ఈశ్వర్.
"అట్లే." బదులిచ్చింది చిత్ర.
ఒక్క సారిగా తన భర్త తలుపు వేసుకున్న తరువాత చిత్ర కళ్ళు చెమర్చాయి.తన భర్త లో ఆమెకు ఒక పసి వాడు కనిపించాడు. ఆ క్షణం తన భర్తని ఇకపై కంటికి రెప్పలా కాపాడుకోవాలని చిత్ర నిర్ణయించుకుంది. ఏ విషయమ్లో నైనా తన మాటల ద్వారా కానీ, తన చేతల ద్వారా కానీ ఏలాంటి అతన్ని కాస్త కూడా బాధపెట్టుకూడదని ఆమె నిర్ణయించుకుంది. తన ఇష్టదైవమైన కృష్ణుడిని తలుచుకుని
"ఏందయ్యా ఇది? బంగారం లాంటోడు కదయ్యా, ఎందుకట్ల బాధపెడ్తవ్ గా మనిషిని? గంత బాధ ల గూడ నేను బాద పడ్తున్ననేమో నని ఆలోచిస్తుండు కదయ్యా? ఎట్ల బాదపెట్టబుద్ది అవ్తుంది నీకు ?" అంది చిత్ర, తన మనస్సులో ఆమె నివాసముంచుకున్న కృష్ణుడితో.
తన భర్త విషయం లో తనకు తాను ఏర్పరుచుకున్న ఒడంబడికను అతనికి ఇష్టమైన రీతిలో ఉప్మా చేయడం నుంచే ప్రారంభించింది చిత్ర.
పదహైదు నిమిషాల శ్రమ తరువాత తయారైన వేడి, వేడి ఉప్మా ని కాస్త చేతిలోకి తీసుకుని ఉప్ఫ్, ఉప్ఫ్ మంటూ ఊదుతూ నోట్లో వేసుకుంది చిత్ర. తన భర్తకి నచ్చిన రీతిలోనే అయ్యిందని నిర్ధారించుకుంది.
'ఏందో ఏమో, ఉప్పు కారం లేని గీ తిండి తినీ తినీ కాళ్ళు,చేతులు నొస్తున్నయ్ నాకు.' అనుకుంది చిత్ర మనస్సులో.
తన భర్త ఉప్మా తినే వేగాన్ని గమనించి
'పాపం చానా ఆకలిగొన్నడు.' అనుకుంది చిత్ర మనస్సులో.
"ఇంకొంచం పెట్టుకో." అని ఈశ్వర్ పళ్ళెం లో ఇంకాస్త వడ్డించింది చిత్ర. తన డైట్ ప్లాన్ కి అది విరుద్ధమైనా చిత్ర ఏమైనా అనుకుంటుందేమో నని మౌనంగా అతని పళ్ళెం లో రెండవ సారి వడ్డించబడిన ఉప్మా ని తినసాగాడు ఈశ్వర్.
"ఇదో.... నాకు ఎక్కువ సదువు రాదు. అందులవోను నీకన్నా వయసుల చానా చిన్నదాన్ని. పట్నం గూడ కొత్త. అందుకే నా వల్ల ఏమన్న ఇబ్బంది ఐతుందేమోనని అట్ల అడిగిన. ఎందుకంటే నువ్వు ఏమన్న జెప్తే తెల్సుకోని దానికి తగ్గట్టు మారుదమని. అంతే గానీ నీ వల్ల నేను ఏం ఇబ్బంది పడ్తలే. నిజంగ జెప్తున్న. అయినా నీ వల్ల అసలు నాకు బాదెందుకు అవ్తది జెప్పు?"అంది చిత్ర, తన భర్తకు తన వల్ల కలిగిన అపరాధభావాన్ని తొలగింపదలచినదై.
చిత్ర మాటలు ఈశ్వర్ కి మరింత అపరాధభావాన్ని కలిగించాయి. కానీ చిత్ర అపరాధభావానికి గురౌతుందేమో నని ముఖం పై కృత్రిమమైన చిరునవ్వొకటి ధరించాడు ఈశ్వర్.
ఈశ్వర్ ముఖం లోని చిరునవ్వుని చూసి చిత్ర మనస్సు కుదుటబడింది.
"నువ్వు నవుతుంటే మస్తుంటవ్ తెలుసా?" అని అనబోయి, మంచిగా సాగుతున్న వ్యవహారం చెడిపోతుందేమో నని భయపడి ఊరుకుంది చిత్ర.
" మనం రేపు బోయి నిమ్మకాయలు కొందం. ఉప్మా లకి నిమ్మకాయ చెట్ని మస్తుంటది. మంచి రసం రసం ఉన్నవి కొనాలె.పుల్ల పుల్లగ ఉంటది చెట్ని మంచిగ. సలికాలం నాల్కె పిడచగట్టుక పొయినట్టవ్తది, జెర పులుపు పడ్తే మంచిగనిపిస్తది.ఏమంటవ్?" అంది చిత్ర, నిమ్మకాయ్ చెట్నీ తలుచుకున్నందుకు తన నాలుక పై అప్రయత్నంగా వచ్చిన లాలాజలాన్ని మింగుతూ.
"ఓకే, తెచ్చుకుందాం." అన్నాడు ఈశ్వర్ , మళ్ళీ కృత్రిమమైన చిరునవ్వు తన ముఖం పై ఉంచాడు ఈశ్వర్.
తినడం ముగించాక తన కంచాన్ని తీసుకుని కడగటానికి సింక్ వద్దకి వెళ్ళాడు ఈశ్వర్.
'ఏందో ఏమో, గీ మనిషి అంట్లు తోమడం ఎప్పుడు మానుకుంటడో ఏమో.' అనుకుంది చిత్ర తన మనస్సులో.
ఈశ్వర్ తన వాకింగ్ కి సిద్ధం అవ్వసాగాడు. తనకు అవసరమైన దానికన్నా ఎక్కువ కాలరీలు తిన్నందుకు గాను రోజు కన్నా ఇంకాస్త ఎక్కువగా నడవాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్.
తన కాళ్ళకి షూస్ తొడుక్కుంటున్న తన భర్త ని చూసి
'ఏందో ఏమో, మనిషి సూడనీకె నలుగురిని కొట్టెటట్టు కనబడ్తడు కండల తోని. కుక్క ని సూస్తె బయపడ్తడు.' అనుకుని పుసుక్కున బయటకి నవ్వింది చిత్ర.
చిత్ర అలా ఎందుకు నవ్విందో అర్తం కాక, తలుపు తెరుచుకుని వాకింగ్ కి బయలుదేరాడు ఈశ్వర్.
--------------------సశేషం.--------------------
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
#84
(13-07-2023, 02:26 PM)k3vv3 Wrote: ముడి - పార్ట్ 12
ఈశ్వర్ భయపడ్డట్టుగానే ఒక పెద్ద german shepherd కుక్క ఈశ్వర్ వైపుగా పళ్ళు కొరుకుతూ గుర్రు మంటూ రాసాగింది.
Story is moving along nicely.  clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#85
Superb update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#86
ముడి పార్ట్ 13
పొద్దున వ్యాయామాన్ని ముగించుకుని వచ్చిన ఈశ్వర్ కి తలస్నానం చేసి, కొప్పుకు టవల్ ని చుట్టుకున్న చిత్ర కనిపించింది.
తన వైపు చూసి, నిండైన నవ్వును విసిరిన చిత్ర కి బదులుగా ఒక కృతకమైన నవ్వొకటి విసిరాడు ఈశ్వర్. తన భర్త చిరునవ్వు ను చూసిన చిత్ర, మరింతగా ఆనందపడసాగింది.
"దోషల్ జేస్తున్న. నూనె ఏం ఎక్కువెయ్య. బుడ్డల చెట్ని నీకు ఇష్టమే గద?" అడిగింది చిత్ర.
"ఓకే." అన్నాడు ఈశ్వర్.
' హ్మ్మ్మ్ం.... అందరూ అమృతలు కాలేరు.they both are as different as sky and mud ! ' అనుకున్నాడు ఈశ్వర్.
స్నానాల గదిలోనికి వెళ్ళి షవర్ ని ఆన్ చేసుకున్న ఈశ్వర్ కి అసలు తాను చిత్ర ని, అమృత ని ఎందుకు పోల్చుతున్నడో అర్థం కాలేదు! తను పదే పదే చిత్ర అమృత కి సరితూగదని తనకు తాను ఎందుకు సర్ది చెప్పుకోవాలని అనుకుంటున్నాడో అతని అర్థం కాలేదసలు. షవర్ లోనుంచి చల్లని నీళ్ళు అతని పెదవులను తాకాయి. ఒక్క క్షణం అమృత అతనికి పెట్టిన మొదటి ముద్దు గుర్తుకు వచ్చిందతనికి. తన ముని వేళ్ళని తన పెదవులకి ఆనించి, కళ్ళు మూసుకుని అమృత పెదవుల స్పర్శని గుర్తుకు తెచ్చుకున్నాడు ఈశ్వర్. "ఏదో రోజు నాకు ఊపిరాడకుండా చేసి చంపేస్తావ్ రా నువ్వు నీ ముద్దులతోటి! " అని సరదాగా అమృత ఎప్పుడూ అంటూ ఉండే మాటలు గుర్తొచ్చాయి ఈశ్వర్ కి. షవర్ లోనుంచి దుంకే నీళ్ళ ప్రవాహం లో అతని కన్నీళ్ళు కలిసిపోయాయి. అమృత బ్రతికున్నప్పుడు తను చేసిన ఆకతాయి పనులన్నీ నెమరు వేసుకున్నాడు ఈశ్వర్. అప్రయత్నమైన ఒక చిరునవ్వు అతని ముఖం పై వెలిసింది.అలా శోకం లో నవ్వు వెతుక్కోవడం గత మూడు సంవత్సరాలుగా అలవాటు చేసుకున్నాడు ఈశ్వర్.
అమృత ని తలుచుకునేటప్పుడు అనవసరంగా చిత్ర ని గుర్తుతెచ్చుకోవద్దు అని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్. చిత్ర కేవలం తనకు 'భార్య ' మాత్రమే ననీ, తన మనస్సులో నివాసముండేది కాదనీ గట్టిగా తనకు తాను చెప్పుకున్నాడు ఈశ్వర్.
అమృత గ్న్యాపకాల్లో మునిగి తేలుతున్న ఈశ్వర్ టి.వి శబ్దం వినబడే సరికి, ఇహ లోకం లోకి వచ్చాడు. గబా గబా స్నానమనే కార్యక్రమాన్ని ముగించుకుని , బయటకు వచ్చాడు. నీటి తుంపరలు పడి , కిటికి నుండి వస్తున్న సూర్యుణి కిరణాలను ప్రతిఫలింపజేస్తున్న ఈశ్వర్ మేని ని ఓరగా దొంగచూపులు చూడసాగింది చిత్ర. అతను తన తలపై పడ్డ నీటిని తన చేతితో విదిలిస్తూ ఉన్నాడు. 'వి ' ఆకారం లో ఉండే అతని ఊర్ద్వ భాగాన్ని ఒక్కసారి తనివి తీరా కౌగిలించుకోవాలి అనిపించిందామెకు.అతని దృడమైన భుజాలు, బంగారు వర్ణం లో మెరుస్తున్న అతని మేని ఛాయ చిత్ర నరాల్లో తాపాన్ని రేపింది. ఒక్క సారి అతని దేహం లోని అణువణువునూ ముద్దాడాలనిపించింది ఆమెకి. ఒక వైపు భక్తి టి.వి చూస్తూ తనకా ఆలోచనలు రావటమేంటని తనని తాను ప్రశ్నించుకుని, తనను తాను నిభాయించుకుంది.
"దోషలు అయినయ్ జూడు. బుడ్డల చెట్నీ గూడ ఉంది."
"ఓకే, రెడీ అయి వస్తాను."
"దబ్బున దా. సల్లగైపోతయ్ మళ్ళ. వేడి వేడి గనే మస్తుంటయ్ దోషలు."
"ఓకే."
చిత్ర తనకు అలవాటైన రీతిలో మళ్ళీ ఈశ్వర్ వైపు చూస్తూ నిండుగా నవ్వింది.
చిత్ర కన్నా అమృతే చాలా అందంగా , నిండుగా నవ్వుతుందని మనసులో అనుకున్నాడు ఈశ్వర్.
బట్టలు మార్చుకున్నంత సేపూ అమృత నవ్వును గుర్తుకు తెచ్చుకుని, చిత్ర కన్నా అమృత బాగా నవ్వుంతుందని నిర్ధారిచుకున్నాడు ఈశ్వర్.
చిత్ర చేసిన దోశలు చాలా రుచిగా అనిపించాయి ఈశ్వర్ కి. వారానికి కనీసం రెండు సార్లైనా చిత్ర దోశలు చేసింటే బావుండుననిపించింది అతనికి.
"నచ్చినయా నీకు?" అడిగింది చిత్ర.
"చాలా బాగున్నాయ్ ." తన మనసులోని మాటను చెప్పాడు ఈశ్వర్, దోశలను తరచుగా చేయమని చిత్రతో చెబుదామనుకుని, ఊరుకున్నాడు ఈశ్వర్.
"ఇంగొంచం చెట్నీ యేస్కో. చానా ఉందింగా." అంటూ ఈశ్వర్ సుముఖత కోసం ఎదురు చూడకుండా పచ్చడిని వడ్డించింది చిత్ర. ఈశ్వర్ తను చేసిన దోశలను తింటూ ఉంటే చాలా ఆనందమేసిందామెకు. ఇంకో దోశ అతని ప్లేట్ లో వడ్డిద్దామనుకుని, పొద్దు పొద్దునే అతని మూడ్ ని చెడగొట్టడం ఇష్టం లేక ఊరుకుంది చిత్ర.
'చిత్ర తనతో ఉన్నప్పుడు మాత్రమే అలా నగుముఖం తో ఉంటుందా లేక ఆమె ముఖమే అంతా ?'అన్న సందేహం కలిగింది ఈశ్వర్ కి.
తను తినడం ముగించాక, తన ఎంగిలి కంచాన్ని కడగటానికి సింక్ వైపు వెళ్తున్న ఈశ్వర్ తో
"ఇదో.... నీకు చెప్పడం మర్చిపొయిన.. మనకు పాలేశే పిలగాడు నిన్న జెప్పిండె మూడు దినాలు రానని." అంది చిత్ర.
"ఓ...మరి ఇప్పుడు తేయాలా పాలు?"
"లే.. ఇప్పుడేమొద్దు గాన్లె. సాయింత్రం తెచ్చ్కుందం ." అంది చిత్ర , తన ముఖం పై నున్న చిరునవ్వుని చెదరనీయకుండా.
"లేదు, కాసేపట్లో విశ్వనాథ్ వాళ్ళు వస్తారు. వాళ్ళకి టీ ఆఫర్ చేయాలి కదా." అన్నాడు ఈశ్వర్.
"ఓ... సరె సరె. మళ్ళిప్పుడు గా సూపర్ మార్కెట్ దాంక నడ్చుకుంట పోతవా?" అడిగింది చిత్ర.
"లేదు పాలు పక్క గల్లీ లోని షాప్ లో దొరుకుతాయి."
"ఓ... ఇప్పుడు వోతున్నవా?"
"హం."
"దా నేంగూడ ఒస్త."
"నువ్వెందుకు?" అడిగాడు ఈశ్వర్, చిత్ర తాను ఎప్పుడు సరుకులు కొనడానికి వెళ్ళినా తోడుగా రావాలనుకుంటుందేమో నని ఖంగారు పడి.
"అయ్య, రేపటికెళ్ళి నేను తీస్కరానీకె. రోజు నీకు వోనీకె వీలు కావద్దు?!" అంది చిత్ర.
చిత్ర మాటలు నిజమేనని తోచాయతడికి, కానీ ఎందుకో ఆమె ముఖం లోని చిరునవ్వు కాస్త అనుమానాస్పదంగా తోచిందతడికి! ఏది ఏమైనా చిత్ర తో అనవసరమైన మాటలు మాట్లాడకూడదని భీష్మించుకున్నాడు ఈశ్వర్.
ఈశ్వర్ , చిత్ర లు లిఫ్ట్ లో దిగి , గేటు వరకు నడవసాగారు.
"చదువుకోమంటే టి.వి టి.వి టి.వి!రూపాయ్, రూపాయ్ పెట్టి వేలకు వేల ఫీజులు పెట్టి చదువిస్తుంటే తెలుస్తలేదసలు. నాలుగు తగిలిస్తే ఇద్దరు చదువుతరు అప్పుడు! అయినా మీ అమ్మని అనాలి, ప్రతీ దానికి గారాబం చేసి ఇట్ల చెడగొడుతుంది మిమ్మల్ని! సాయంత్రం ఇంటికి వస్తరు కదా, అప్పుడు చెప్త ఇద్దరి పని." అంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్ల పై సంతకాలు పెడుతున్నాడు ఓంకార్.
సరిగ్గా కాలేజ్ బస్ వచ్చే సమయానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ల పై తమ తండ్రిని సంతకాలు పెట్టమని చెప్పిన ఆ పిల్లల తెలివితేటలు చూసి నవ్వొచ్చింది ఈశ్వర్ కి. తన భర్త ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు చిత్రకి.
వాళ్ళిద్దరూ షాప్ వైపుగా నడుచుకుంటూ వెళ్ళారు. రెండు పాకెట్ల toned milk కొన్నాడు ఈశ్వర్.
'ఏందో ఏమో, ఈడ ప్రతీదానికి పైసల్ పెట్టాల్సొస్తుంది.' అనుకుంది చిత్ర మనస్సులో.
ఈశ్వర్ 50 రూపాయల నోటుని షాపామె చేతిలో పెట్టాడు.
"సార్ 4 రూపీస్ చేంజ్ ఉందా?." అందామె.
"లేదు."
"చిల్లర లేదు సార్." అందామె.
"పర్లేదు లెండి." అన్నాడు ఈశ్వర్.
"నేను రేపు పాలు కొననీకె ఒస్త. అప్పుడిద్దువు గాన్లె.నువ్వు ఆరు రూపాయలియ్యలె గద?" అంది చిత్ర వెనక నుంచి.
"హా అవునండి."
"రేపు నేనొస్త జూడు. ఈన రాడు. గుర్తుగ ఇయ్యి సరేనా?" అంది చిత్ర, కృత్రిమమైన నవ్వుని ముఖానికి తగిలించుకుని.
వాళ్ళిద్దరిలో చాలా తేడా కనిపించింది షాపామె కి. చిత్ర శ్రీనగర్ కాలనీ లో నివసించాల్సిన వ్యక్తిగా తోచలేదామెకి.
"సరే, అలాగే, మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇస్తా." అందామె.
ఒక్క క్షణం ఈశ్వర్ కి తల తీసేసినట్టయింది. వారిద్దరూ తిరిగి తమ ఫ్లాట్ కి పయనమయ్యారు.
"6 రూపీస్ దెగ్గరేముంది చెప్పు? పాపం అలా అన్నావు ఆమెను." అనే మాటలు నోటి వరకు వచ్చాయి ఈశ్వర్ కి కానీ చిత్రతో ఏలాంటి సంభాషణను పెట్టకూడదనుకున్న అతని ప్రతిగ్న్య గుర్తుకువచ్చి ఊరుకున్నాడు.
వారింటికి చేరుకున్నాక, చిత్ర పాల ప్యాకెట్లని తీసుకుని కాచడానికి వెళ్ళింది. తాను అనుకున్నట్టుగానే చిత్ర తో ఎటువంటి సంభాషణ చేయనందుకు గర్వంగా తన రూం వైపు అడుగులేశాడు ఈశ్వర్.
వారి ఇంటిలో ఉండే గోడ గడియారం 11 సార్లు కొట్టిన పది నిమిషాలకి వాళ్ళింటి కాలింగ్ బెల్ మోగింది.
"హా..... బావున్నరా? రండి లోపటికి." అంది చిత్ర, శ్రీజ, విశ్వనాథ్ దంపతులని చూస్తూ.
లోపలికి వస్తూ,
"మేడం , సార్ ఉన్నా...?" విశ్వనాథ్ మాటని పూర్తి చేయకముందే రూం లో నుండి వచ్చాడు ఈశ్వర్.
"హాయ్ విశ్వనాథ్."
"హలో సార్, .... కింద సామాన్లు ఉన్నాయ్.షిఫ్ట్ చేసేటప్పుడు కొంచం మీరు కూడా పక్కనుంటే బావుంటుందని.." అన్నాడు విశ్వనాథ్ కాస్త మొహమాటం తోనే.
"అయ్యో , దానిదేముంది. వెళ్దాం పద." అన్నాడు ఈశ్వర్.
"మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాము."అన్నాడు విశ్వనాథ్ , చిత్ర వైపు చూస్తూ.
"అయ్య, అట్లేమ్లే." అంది చిత్ర నవ్వుతూ.
తనను చూసి చిత్ర నవ్వే రీతిలో, మిగిలిన వారిని చిత్ర చూసి నవ్వే రీతిలో తేడా ప్రస్పుటంగా కనిపించింది ఈశ్వర్ కి.
"వెళ్దామా? " మళ్ళీ అన్నాడు ఈశ్వర్ విశ్వనాథ్ తో, చిత్ర ని ఇంకాస్త ఎక్కువ సేపు చూడొద్దని నిర్ణయించుకున్నవాడై.
ఈశ్వర్ కి తమ వల్ల విసుగు కలిగిందేమో నని పొరబడ్డాడు విశ్వనాథ్. తన భార్య తో
" శ్రీజా, త్వరగా రా." అన్నాడు.
"అయ్య, వీళ్ళీడనే ఉంటరు గానిలే. మీరు పొయిరండి. " అంది చిత్ర.
తనకు తన భార్య అవసరం ఉన్నా, ఈశ్వర్ కి మరింత విసుగు తెప్పించినట్టవుతుందేమో నని చిత్ర యొక్క ప్రతిపాదనకు అంగీకరించాడు విశ్వనాథ్.
"అర్థం చేస్కో" అని తన కళ్ళతోటే తన భార్య కి చెప్పాడు విశ్వనాథ్.
విశ్వనాథ్ పరిస్థితిని అర్థం చేసుకుని,
"సరే, సార్ తో పాటు మీరు వెళ్ళండి. నేను, వీడు ఇక్కడ ఉంటాం అప్పటిదాకా." అంది శ్రీజ.
అభిరాం చాక్లెట్ అడిగితే కొనివ్వడం మర్చిపోయానని గుర్తొచ్చింది విశ్వనాథ్ కి. చిత్ర దెగ్గర తన సుపుత్రుడు చాక్లెట్ కోసం తన ప్రతాపాన్ని చూపించకూడదని కోరుకున్నాడు విశ్వనాథ్.
ఈశ్వర్, విశ్వనాథ్ లు లిఫ్ట్ లో కిందికి దిగుతున్నారు.
ఈశ్వర్ ఏదో ముభావంగా ఉన్నట్టు తోచింది విశ్వనాథ్ కి.అనవసరంగా తాను ఈశ్వర్ కి భంగం కలిగించాననిపించింది అతనికి.
ఈశ్వర్ మాత్రం అమృత, చిత్ర ల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. చిత్ర తనను చూసినప్పుడు ఆమె కళ్ళల్లోని మెరుపు నచ్చట్లేదతడికి అస్సలు. ఒక పసుపు రంగు తాడుని ఆమె మెడ చుట్టూ మూడు ముళ్ళుగా కట్టినందుకే అంత మెరుపు చూపిస్తుందా చిత్ర తన చూపుల్లో అన్న సందేహం కలిగిందతడికి. చిత్ర కి దూరంగా ఒక రెండు రోజులు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాలనిపించింది ఈశ్వర్ కి.
ఈశ్వర్ నుండి సామాన్ల షిఫ్టింగ్ విషయం లో ఎన్నో సలహాలు తీస్కుందామనుకున్న విశ్వనాథ్ , ఈశ్వర్ ప్రవర్తనను చూసి తన ఆలోచనను విరమించుకున్నాడు. అసలు అతనికి ఒక సబార్డినేట్ తన తో కలిసి ఒకే అపార్ట్మెంట్ లో ఉండటం ఇష్టం లేదేమోనన్న అనుమానం కూడా కలిగింది.
సామన్లని ఒక్కొక్కటిగా హమాలీలు లిఫ్ట్ ద్వారా తరలిస్తూ ఉన్నారు. ఈశ్వర్ కి తన మస్తిష్కం నిండా చిత్ర, అమృతలు నాట్యం చేస్తూ ఉండటం తో మానసికంగా అలసిపోయి, తన ఫోన్ లో ఫేస్ బుక్ ని స్క్రోల్ చేసుకోసాగాడు ఈశ్వర్. అతనికి 5 years ago memories అని ఆమృతతో కలిసి గోవా బీచ్ లో దిగిన ఫోటోలు కనిపించాయి. అప్రయత్నంగా అతని వేలు అమృత ప్రొఫైల్ పైకి వెళ్ళింది. ఆమె ఫోటోలు ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. అందులోని ప్రతీ ఫోటోలో ఈశ్వర్ ఉన్నాడు. అమృత తో పక్కన నిలబడ్డ ప్రతీ ఫోటో లో అతని ముఖం పై ఒక మెరుపు కనిపించింది అతడికి. ఒక్క క్షణం ఈశ్వర్ కి గతం లోని తనపై అసూయ కలిగింది. అప్రయత్నంగా అమృత ఫోటోని ఫుల్ సైజ్ లో పెట్టి తన చూపుడు వేలుతో ఆమె ఛాయా చిత్రం పై నిమరసాగాడు ఈశ్వర్.
ఇంతలో దడాల్న శబ్దం కావడంతో తన గత స్మృతుల నుండి బయటకు వచ్చాడు ఈశ్వర్. బాసాన్లు పెట్టే స్టీల్ స్టాండ్ హమాలీ చేతుల నుండి జారిపోయి, కింద పడింది.
"జాగ్రత్త గా చేయి, డబ్బులు పెట్టే కొన్నవి అవి." అని అనబోయి, ఈశ్వర్ ఉన్నాడని నిభాయించుకున్నాడు విశ్వనాథ్.
"విశ్వనాథ్ , నేను కాసేపు బయట ఉంటాను. ఏమైనా అవసరం ఉంటే పిలువు నన్ను .ఓకేనా?"అన్నాడు ఈశ్వర్.
సరేనన్నాడు విశ్వనాథ్, ఈశ్వర్ వల్ల ఏం పని లేదని గ్రహించి.
చలికాలపు సూర్యుని వేడిమి ఈశ్వర్ మేని ని వెచ్చగా తాకసాగింది. తనను నిత్యం వెంటాడేది అమృతే అనుకుంటే, ఇప్పుడు కొత్తగా చిత్ర ఒకత్తి వచ్చిందనుకున్నాడు ఈశ్వర్.
***
ఈశ్వర్, విశ్వనాథ్ లు రావడానికి ఆలస్యమౌతుందని గ్రహించారు శ్రీజ, చిత్ర లు.
"వాళ్ళొచ్చే వరకు ఛాయ్ పెట్ట్కొస్త." అంది చిత్ర.
"అయ్యో, ఉండన్లెండి. మీకెందుకు శ్రమ?" అంది శ్రీజ,నాలుక ఛాయ్ కోసం లాగుతున్నా, మొహమాటపడి.
"అయ్య, అందుల ఏముంది? ఛాయ్ మంచిగ చేస్త నేను. ఒక్కసారి తాగితివంటె మళ్ళ మళ్ళ అడుగుతవ్ రోజు." అంది చిత్ర నవ్వుతూ.
సరేనంటూ తలూపింది శ్రీజ, చిత్ర తో వాదనను కొనసాగించడానికి ఇష్టపడక. చిత్ర ఛాయ్ మరిగిస్తుంటే ఛాయ్ కి అలవరచబడ్డ శ్రీజ నాలుక తహతహలాడసాగింది. నిశ్శబ్దంగా, బుద్ధిమంతుడిలా కూర్చున్న అభిరాం వైపు చూసి, కాస్త ఉపశమనంగా నిట్టూర్చింది శ్రీజ, వాడు అల్లరి చేసే కార్యక్రమానికి చిత్ర వాళ్ళింట్లో విరామాన్ని ఇచ్చినందుకు.
వారం క్రితం తన భర్త తో కలిసి సూపర్ మార్కెట్ కి తొలిసారి వెళ్ళినప్పుడు కొనుక్కున్న గ్లాసుల్లో ఛాయ్ తెచ్చింది చిత్ర. ఒక్క గుటక తాగాక, శ్రీజ కు చాలా రుచిగా తోచింది ఛాయ్, ఏదో ఒక సాకు తో తరుచుగా వచ్చి, చిత్ర చేసే ఛాయ్ తాగాలనిపించిందామెకి ఒక్క క్షణం.
ఇద్దరూ తమ సంభాషణని కొనసాగించారు. అభిరాం కి మాటలు రాని విషయాన్ని గూర్చి తన మాటల్లో ప్రసక్తి తీసుకురాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడసాగింది చిత్ర. ఇంతలో చిత్ర, తన తల్లి చేతుల్లోని ఛాయ్ ని చూసి, తానేదో మర్చిపోతున్ననని ఆలోచించడం ఆరంభించాడు అభిరాం.
చిత్ర, శ్రీజ లు తమ చేతుల్లోని కాఫీల్లో ఛాయ్ ని పూర్తిచేసుకున్నారు.ఇంతలో అభిరాం నోటి నుండి ఒక వింత శబ్దం వినిపించసాగింది. చిత్రకు తన కర్ణభేరిని ఎవరో పదునైన పుల్లతో కుచ్చినట్టుగా అనిపించింది. శ్రీజ కి అర్థమైంది వాడు అడుగుతుంది చాక్లెట్ నని.
"అభీ చాక్లెట్ కొందాం. కిందికి వెళ్ళాక. డాడీ నిన్న మనం చూసిన న్యూ హౌస్ కి అన్నీ షిఫ్ట్ చేస్తున్నాడు నాన్నా." అంది శ్రీజ.
"చాక్లెట్లు నాట్ గుడ్, యువర్ .... టీత్ గో." అంది చిత్ర.
ఒక్క క్షణం చిత్ర ను చూసి, వెక్కిరింపుగా నవ్వి, తిరిగి కర్ణ కఠోరమైన శబ్దాన్ని కొనసాగించాడు అభిరాం.
'ఏందో ఏమో, గీ పిలగాడు నన్ను జూశి నవ్వుతుండా, నా ఇంగ్లీషు జూశి నవ్వుతుండా?' అని లోలోన అనుమానపడింది చిత్ర.
ఇంకాసేపు అభిరాం చేసే శబ్దాన్ని వింటే తన చెవులు పనిచేయవని భావించింది చిత్ర. కాస్త ఆలోచించాక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది చిత్ర కి.
"యూ ఈట్ సలాడా?" అడిగింది చిత్ర.
హఠాత్తుగా తన అరుపుని ఆపకుండా కాస్త నెమ్మిదిగా స్వరాన్ని తగ్గించాడు అభిరాం.
"కోకోనట్ సలాడ్? యూ ఈటా?"
నిలువునా తలూపాడు అభిరాం.
చిత్ర ఉదయం పల్లీల చెట్నీ చేసినప్పుడు మిగిలిపోయిన కొబ్బరి ని తురుమి, అందులో చక్కెర కలుపుకుని తీసుకొచ్చింది.
అభిరాం మెల్లిగా స్పూన్ నిండా ఆ మిశ్రమాన్ని పెట్టుకున్నాడు. చిత్ర ని తన కొడుకు వల్ల ఇబ్బందికి గురి చేస్తున్నానేమో నన్న అపరాధభావం తో శ్రీజ , కర్ణకఠోరమైన కేకలు వినే బాధ తప్పుతుందేమో నన్న ఆశతో చిత్ర , ఉత్కంఠ తో చూడసాగారు అభిరాం వైపు. అభిరాం ఒక చిరునవ్వు చేశాడు. చిత్ర కు వాడి నవ్వు బాగా ఆకర్షణీయంగా తోచింది. చాలా తక్కువ పరిచయం లోనే అభిరాం పై చాలా పాశం ఏర్పడిందామెకు.
"పిలగాడు మస్తు ముద్దుగున్నడు. తీస్కొసుండు శ్రీజా అప్పుడప్పుడు. " అభిరాం బుగ్గల్ని నిమురుతూ చెప్పింది చిత్ర.చిత్ర ని పట్టించుకోకుండా వాడు ఆ 'కోకోనట్ సలాడ్ ' ని తింటూ ఉన్నాడు.
చిత్ర తనతో 'ఫార్మాలిటీ' గా ఆ మాట అనట్లేదని గ్రహించింది శ్రీజ. తమ కొడుకు యొక్క లోపాన్ని గురించి గుచ్చి గుచ్చి అడగే వాళ్ళనీ, వాడి అల్లరి ని చూసి కాస్త విసుగు ప్రదర్శించే వాళ్ళనే చూసిన శ్రీజకు, చిత్ర అన్న ఆ మాటలు చాలా ఆనందం కలిగించాయి.
***
సామాన్లంతా షిఫ్ట్ చేశాక, హమాలీలకు డబ్బులు పంచే పని చేస్తున్నాడు విశ్వనాథ్. ముందు మాట్లాడుకున్న దానికన్నా' ఛాయ్ పైసల ' పేరుతో 100 ఎక్కువ వసూలు చేస్తున్న హమాలీలపై విసుక్కుందామని ఉన్నా, ఈశ్వర్ పక్కన ఉన్నాడన్న మొహమాటం తో ఊరుకున్నాడు విశ్వనాథ్.
ఈశ్వర్ మాత్రం వారం క్రితం తాను చూస్తున్నప్పుడు చిత్ర భంగం కలిగించిన 'సిటీ లైట్స్ ' చిత్రం యొక్క కొనసాగింపు భాగాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంతక ముందు కన్నా ఈశ్వర్ యొక్క మూడ్ కాస్త మెరుగైనట్టు గమనించాడు విశ్వనాథ్.
లిఫ్ట్ లో 5వ అంతస్థుకు దిగ సాగారు ఇద్దరూ.
"సార్, చాలా థాంక్స్.... ఆండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాం ." అన్నాడు విశ్వనాథ్, నిజాయితీ, మొహమాటం కలగలిసిన స్వరం తో.
"అయ్యో, అలా ఏం లేదు విశ్వనాథ్. చిత్ర కి అయినా మీ వైఫ్ ఉంటే కాస్త తోడుగా ఉన్నట్టుంటుంది." అన్నాడు ఈశ్వర్ అసంకల్పితంగా. తాను అంత ఉపచేతనంగా చిత్ర ప్రస్తావన ఎలా తేగలిగాడో ఈశ్వర్ కి అర్థం కాలేదు.
ఈశ్వర్ మాటలు కాస్త ఊరట ని ఇచ్చాయి విశ్వనాథ్ కి.ఈశ్వర్ పై ఒక్క విస్పష్టమైన అభిప్రాయానికి రాలేకపోతున్నాడు విశ్వనాథ్.ఈశ్వర్ తన మనస్సులో ఎప్పుడూ ఏదో ఆలోచన కలిగి ఉంటాడనిపించింది విశ్వనాథ్ కు.ఈశ్వర్ ని ఏం ఆలోచిస్తున్నాడో కనుక్కుందామనుకుని, పైన పని చేసే వారు, చనువిచ్చినంత మాత్రాన, హద్దులు దాటి వెళ్ళకూడదనుకుని, ఊరుకున్నాడు విశ్వనాథ్. కానీ ఈశ్వర్ పై ఆఫీస్ లో ఉన్న అభిప్రాయం మాత్రం తప్పేమో నన్న భావన కలిగింది అతడికి.
ఈశ్వర్, విశ్వనాథ్ లు చివరికి, ఏలాంటి బరువులు ఎత్తకున్నా, అలసిపోయిన దేహాలతో కింద ఫ్లాట్ కి చేరుకున్నారు.చిత్ర ముందు విశ్వనాథ్ ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది, తిరిగి తన వైపు సునిశితంగా చూస్తున్న తన వైపు చూసి మళ్ళీ నవ్వింది. ఈశ్వర్ మళ్ళీ గుర్తించాడు ఆ నవ్వులో తేడాని.
*****
చిత్ర వాళ్ళింటి గోడ గడియారం 6 సార్లు మోగి అరగంట కావొస్తుంది. మధ్యాహ్నం చిత్ర చేసిన నూనె లేని బెండకాయ కూర విశ్వనాథ్, శ్రీజ లతో కలిసి తిన్నాక,ఈశ్వర్ కదలకుందా గత 5 గంటలుగా తన పనిలో నిమగ్నమయి ఉన్నాడు. ఆఖరుగా అతను పడ్డ కష్టానికి తగిన ఫలితం వచ్చినందుకు కాస్త ఆనందమేసింది ఈశ్వర్ కి. ఒక్కసారి లాప్టాప్ పక్కకు పెట్టి, మంచం పై వాలిపోయాడు.ఒక ఐదు నిమిషాల తరువాత అతడికి విసుగు రావడం ఆరంభమైంది.అతడు భరించలేనంత విసుగు కలిగిందతడికి. యూట్యూబ్ లో చార్లీ చాప్లిన్ సినిమాలని పెట్టుకున్నాడు కానీ అతడి విసుగు ని అది పోగొట్టలేకపోయింది. తన ఫోన్ తీసుకుని తన స్నేహితుడైన ఆదర్శ్ కి ఫోన్ కలిపాడు,కానీ స్విచ్చాఫ్ వచ్చింది. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదసలు.మూడు సార్లు సంకోచించి, తరువాత ఉదయం తాను పాలప్యాకెట్లు కొన్నప్పుడు చిత్ర తో మాట్లాడకూడదని పెట్టుకున్న సంకల్పానికి భంగం కలగించుకోని విషయం గుర్తుకు తెచ్చుకుని , టి.వి చూస్తున్న చిత్ర దెగ్గరికి మెల్లిగా నడుస్తూ వెళ్ళాడు ఈశ్వర్.
"మూవీ చూస్తున్నావా?" సమాధానం తెలిసే అడిగాడు ఈశ్వర్.
నవ్వుతూ తలూపింది చిత్ర, ఆమె కళ్ళతో సాధ్యమైనంత వరకూ తక్కువగా తన చూపు కలిసేలా చూసుకున్నాడు ఈశ్వర్.
"నచ్చిందా మూవీ?" తను అడగవలసిన ప్రశ్న ని జాగ్రత్తగా ఎంచుకున్నాడు ఈశ్వర్.
"బాగుంది.... కానీ ఇందుల మహేషుబాబు చేశింటే ఇంగా మస్తుగుండు." బదులిచ్చింది చిత్ర.
ఈశ్వర్ కి ఆమె సమాధానం కాస్త వింతగా తోచింది.
"డిస్టర్బ్ చేసానా?" అడిగాడు ఈశ్వర్.సాఫ్ట్ వేర్ ప్రపంచం లో పనిచేయటం వల్ల అతనికి బాగా అలవాటైన దౌత్యపరమైన ప్రశ్న అది.
"అయ్య! డిస్టర్బు గానీకి నేనేం పనిజెస్తున్న అసలు?" అంది చిత్ర తన భర్త అడిగిన ప్రశ్నలోని అసహజతకు కాస్త నవ్వుతూ.
" నాకు చాలా బోర్ కొడుతోంది. నీకు ఇబ్బందేం లేకుంటే అలా fresh air కి తిరుగుదామా? "
--------------------సశేషం[b]--------------------[/b]
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
#87
కథనం చాలా చాలా బావుంది. వ్యాకరణ దోషం లేని భాష ముచ్చటగా వుంది. చదవడానికి సొంపుగా వున్నప్పుడు ఏ మాండలీకం అయితే ఏం? రావి రావుగారు చెప్పినట్లు తృప్తిగా భోజనం చేసినట్లుంది.

వ్యాస్
[+] 1 user Likes Vyas Kumar's post
Like Reply
#88
(29-07-2023, 10:43 PM)k3vv3 Wrote: ముడి పార్ట్ 13
పొద్దున వ్యాయామాన్ని ముగించుకుని వచ్చిన ఈశ్వర్ కి తలస్నానం చేసి, కొప్పుకు టవల్ ని చుట్టుకున్న చిత్ర కనిపించింది.
K3vv3 garu! Story is going on nicely. Good work !!! Curious to see how their relationship unfolds...
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#89
ముడి- పార్ట్ - 14
"ఇప్పుడా?!" అంది చిత్ర, ఒంట్లో కాస్త అననుకూలత గలదై.
"సారీ, సారీ. జస్ట్ ఊరికే అడిగా అంతే." అన్నాడు ఈశ్వర్.
"అంటే , ఒక ఐదు నిమిషాలల్ల మొహం కడుక్కోని పోదమా లేక ఇప్పుడే పోదమా అని అడిగిన అంతే, అంతకమించి ఏం లేదు." అంది చిత్ర మాటకారితనం లో తనకున్న పూర్తి గ్న్యానాన్ని వాడుకుంటూ.
"ఓ.... సరే నువ్వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రా. నేను వెయిట్ చేస్తాను ." అన్నాడు ఈశ్వర్.
"సరే ఐదంటె ఐదు నిమిషాలంతే. ఊకె జిడ్డు జిడ్డవ్తది మొహం . అందుకే అట్ల. అంతకమించి ఏం లే." అంది చిత్ర.
"పర్లేదు, melanin content of skin అనేది it is a good resistance to skin ailments." అన్నాడు ఈశ్వర్.
చిత్ర కృత్రిమంగా ఈశ్వర్ వైపు చూసి నవ్వి, స్నానాల గదికి వెళ్ళింది.
'ఏందో ఏమో, గీ మనిషి కి ప్రపంచం లో ఉన్న ప్రతీ విషయం తెలుసు గానీ, సచ్చిపోయినోళ్ళు తిరిగి రారని మాత్రం తెల్వదు ! ' అనుకుంది చిత్ర, పార్క్ ఎవెన్యూ సబ్బుతో తన ముఖాన్ని తోముతూ.
కానీ ఒక్క క్షణం చిత్రకు తన భావన తప్పుగా తోచింది. తన భర్త యొక్క మనస్సుని ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని తనకు తాను చేసుకున్న ఒడంబడికి ఆమెకు గుర్తొచ్చింది. ఈశ్వర్ ఎప్పుడైనా అమృత ని తలుచుకుని బాధపడుతుంటే తాను జాగ్రత్తగా ఉండి, అతని మనస్సుని అతనికి తెలియకుండానే మళ్ళించాలనుకుంది చిత్ర.
ఒంట్లో కాస్త అశక్తత ఉన్నా, తన భర్త కి తోడుగా నడకకి వెళ్ళాలనుకుంది. అతనికి ఒక వేళ అమృత గుర్తొచ్చినట్టైతే తను పక్కన ఉండి అతని ఆలోచనలను పక్కకు మరల్చాలనుకుంది చిత్ర. ముఖం కడుక్కుని , తువాల తో తుడుచుకుని అద్దం ముందుకు వచ్చి నిల్చుంది చిత్ర. రామాచార్యులు ఆమెకు ఇచ్చిన కుంకుమ ను నుదిటి పై దిద్దుకుంది చిత్ర. ఇంతకుముందు లా ఆమె శరీర రంగు విషయమై ఆమెకు ఎలాంటి అభద్రతా భావం కలగట్లేదిప్పుడు. తన భర్త మనిషి యొక్క రంగుని చూసి దూరం పెట్టే మనస్తత్వమున్న వాడు కాడని చిత్రకు ఆర్థమైంది. కానీ మనస్సులో ఏదో మూలన తన భర్త తనతో తాను అందంగా ఉంటానని మాటవరసకైనా ఒక్కసారి చెప్పింటే బావుండుననిపించింది.
ఆలోచనల ప్రవాహం లో ఆమెకు ఈశ్వర్ హాల్లో తనకోసం ఎదురుచూస్తున్నాడన్న విషయం గుర్తుకు వచ్చింది. వడి వడిగా హాల్లోకి నడుస్తూ వెళ్ళింది చిత్ర.
ఈశ్వర్ ఆమెతో " ఐ మీన్ , నీకు ప్రాబ్లెం ఏం లేదు కదా?! am i causing you inconvenience ? " అడిగాడు ఈశ్వర్.
'ఏందో ఏమో, మనిషి ఊకె మొదటికొస్తడు! ' అనుకుంది చిత్ర మనస్సులో.
"అయ్య అట్లేం లేదు! నాకు ఇంకన్.... ఇబ్బందేం లేద్లే " అంది చిత్ర ఈశ్వర్ కళ్ళల్లోకి చూస్తూ, తనకు అలవాటైన విధంగా ,inconvenience అనటానికి నోరు తిరగక.
"హం." అన్నాడు ఈశ్వర్ , అతని మనస్సులో చిత్ర ని అనవసరంగా తనకు తోడుగా రమ్మని పిలిచానేమో నన్న అనుమానం రాసాగింది. ఆమె తో ఏ విషయం లోనూ మాట కలపకుండా తమ నడకని పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్.
వాళ్ళిద్దరూ లిఫ్ట్ లో కిందికి దిగసాగారు. కింద లిఫ్ట్ డోర్ దెగ్గర విశ్వనాథ్, శ్రీజ దంపతులు తమ సుపుత్రుడితో కలిసి చేతుల్లో సామాన్ల కవర్లతో లిఫ్ట్ ఎప్పుడు కిందికి వస్తుందో నని ఎదురుచూస్తూ వున్నారు.
చిత్ర, ఈశ్వర్ల ను చూసి వాళ్ళు పలకరించారు. చిత్ర లాలనగా అభిరాం బుగ్గని పట్టుకుని లాగింది నవ్వుతూ. వాడు చిత్ర ని కిందికీ, మీదికీ చూసి "ఏంది నీ బాధ?! " అన్నట్టుగా కళ్ళతోటే సైగ చేశాడు.
వారితో సంభాషణ ముగిసాక, చిత్ర ఈశ్వర్ లు గేట్ వద్దకు బయలుదేరారు. వాళ్ళకి వాచ్ మెన్ ఓంకార్ ఇంటి నుంచి మాటలు వినబడసాగాయి.
"ఇప్పటికే వేలకు వేలు ఫీజులు పెట్టిస్తున్నారు ఇద్దరూ. మళ్ళి ట్యూషన్లు అంటే ఎక్కడికి పోయి చచ్చేది నేను?! మరి ట్యూషన్ పెట్టిస్తేనన్నా చదువుతరా అంటె ఆ నమ్మకం కూడా లేదు నాకు!" అంటూ అరుస్తున్నాడు ఓంకార్ తన పిల్లలైన రేణుక, రాజేష్ లపై.
చిత్రకు తన సర్కార్ బడిలోని చదువూ, తను చదువు విషయం లో తన మేనమామ పెట్టిన చీవాట్లూ గుర్తొచ్చి , ఒకసారి అప్రయత్నంగా చిరునవ్వు నవ్వింది.
"ఏమైంది ? ఎందుకు నవ్వుతున్నావ్?" అడిగాడు ఈశ్వర్, అలా అసంధర్భంగా చిత్ర నవ్వడాన్ని చూసి.
"ఏమ్లే. మామ గుర్తొచ్చిండె." అంది చిత్ర.
"మరి ఒక సారి ఫోన్ చేయొచ్చుగా ఊరికి ?" అనబోయి, తనతో తాను చేసుకున్న ఒప్పందం గుర్తొచ్చి, ఊరుకున్నాడు ఈశ్వర్.
"చిన్నగున్నప్పుడు అస్సల్ సద్వక పోతుంటి నేను. మామ చెప్పీ చెప్పీ ఊకున్నడింగ." అంది చిత్ర, తనకున్న అలవాటుకి బద్దురాలై.
"ఓ...హం." బదులిచ్చాడు ఈశ్వర్, తన జుట్టు చెరుపుకుని, తిరిగి సరిచేసుకుంటూ.
ఫుట్ పాత్ వైపుగా కాక, రోడ్డు వైపుగా నడుస్తున్న చిత్రని మెయిన్ రోడ్ దెగ్గరికి వాళ్ళు చేరాక, ఫుట్ పాత్ వైపుగా వెళ్ళమని చెప్పి, రోడ్డు వైపు తాను నిలబడ్డాడు ఈశ్వర్. ఒక అసంకల్పితమైన నవ్వు ఆమె మోములో అంకురించింది.
కాసేపు అలా నడిచాక ఈశ్వర్ కి చిత్ర తనతో ఏదైనా విషయం పై మాట్లాడింటే బావుండుననిపించింది. అతనికి అలా నిశ్శబ్దంగా నడవడం నచ్చట్లేదసలు. నిజానికి మౌనంగా తనలో తాను అమృత ని గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడటాన్ని గత మూడేళ్ళుగా అలవాటు చేసుకున్న ఈశ్వర్ కి చిత్ర తన జీవితం లోకి వచ్చిన కొద్ది రోజులకే ఒంటరితనం భారంగా తోస్తోంది! చిత్ర తనతో ఏదో ఒక లౌకిక విషయమ్మీద మాట్లాడింటే బావుండుననిపించింది అతనికి.
అలా నడుస్తూ తన పాకెట్ లో నుంచి తన ఫోన్ తీసుకుని ఫేస్ బుక్ ని స్క్రోల్ చేయసాగాడు ఈశ్వర్ కానీ అతనికి తన పేస్ బుక్ ఫీడ్ నిశ్శబ్దాని కన్నా విసుగుగా తోచింది. సాధారణంగానే వేగంగా నడిచే ఈశ్వర్ యొక్క వేగాన్ని అందుకోవడం కాస్త శారీరక అననుకూలత గలిగిన చిత్ర కు కష్టంగా తోచింది.
"చిత్రా, నేను మరీ ఫాస్ట్ గా నడుస్తున్నానా?" అడిగాడు ఈశ్వర్, తాను చిత్ర యొక్క స్వల్ప ప్రయాస ని గమనించగలగడం తనకే ఆశ్చర్యంగా తోచింది ఈశ్వర్ కి.
"అయ్య, ఏమ్లే. అట్లేమ్లే. " అని ఒక కృత్రిమమైన చిరునవ్వొకటి నవ్వింది చిత్ర.
నిజానికి తన శరీరం ఆ సమయం లో అంత వేగంగా నడవడానికి సిధ్దపడకున్నా, తన భర్త తనను ఇబ్బంది పెడుతున్నానేమో ననుకుని తనని ఇకపై వాకింగ్ కి తోడుగా రమ్మని పిలవడేమోనని భయపడి చిత్ర అలా సమాధానమిచ్చింది. తన భర్త తో సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని గడపాలన్నది ఆమె యొక్క అభిలాష.
చిత్ర కు తను తన భర్త తో అబద్ధం చెప్పానన్న విషయం అతనికి తెలిసిందేమో నన్న అనుమానం కలిగింది. తాను ఎలాంటి ఇబ్బంది పడట్లేదని నిరూపించుకోవడానికి ఆమె ఏదో ఒకటి మాట్లాడాలని నిర్ణయించుకుంది.
"ఇదో.... నువ్వు ఏం ఉద్యోగం చేస్తవ్ ?" అడిగింది చిత్ర.
చిత్ర తనను అంత ప్రత్యక్షంగా తన ఉద్యోగ జీవితం గురించి అడగడం కాస్త ఇబ్బంది గా అనిపించింది ఈశ్వర్ కి. కానీ ఆమె ఒక ప్రశ్న వేసినప్పుడు సమాధానం ఇవ్వకపోవడం అతనికి తప్పు అనిపించింది. అదే కాక తన విసుగుని పెంచుతున్న నిశ్శబ్దపు నడక కన్నా చిత్ర తో మాట్లాడటం చాలా నయమనిపించింది అతనికి.
"నేను HRM softwares పై work చేస్తుంటా." బదులిచ్చాడు ఈశ్వర్.
"....."
"అంటే Human Resource Management కోసం వాడే softwares ని design చేస్తుంటుంది మా company."
"......."
"ఒక సంస్థ యొక్క మానవ వనరుల నిర్వహణ కు కావలసిన సాఫ్ట్ వేర్లని తయారుచేస్తుంటాము." అన్నాడు ఈశ్వర్ ఈసారైనా చిత్ర కు అర్థం అవుతుందన్న ఆశతో.
"......."
"ఇప్పుడూ.... ఒక కంపెనీ అనగా ఒక సంస్థ లోని ఉద్యోగుల్లో ఎవరెవరు కొత్తగా నియమించ బడ్డారు, ఎవరెవరు ఎన్ని రొజుల నుంచి పని చేస్తున్నారు, ఎవరెవరికి ఎంత జీతం , ఎవరెవరు ఎన్ని లీవులు పెట్టారు ,ఎవరి పనితీరు ఎలా ఉంది? వీటన్నింటి గురించి సమగ్రంగా మేము సదరు సంస్థకి సమాచారాన్ని ఇస్తుంటాము." అన్నాడు ఈశ్వర్.
"ఓ" అంది చిత్ర.
చిత్ర కు పూర్తిగా అర్థం కాలేదని అర్థమైంది ఈశ్వర్ కి కానీ అంతకు మించి చిత్రకు విశదీకరించడం తన తరం కాదని అనుకున్నాడు మనస్సులో.
"ఓ.... జీతమెంత?"
" అన్ని కటింగ్స్ పోను మంత్లీ టూ లాక్స్ వస్తుంది." బదులిచ్చాడు ఈశ్వర్ తన నడకని కొనసాగిస్తూ.
ఎందుకో ఒక్క పది క్షణాల తరువాత అతనికి చిత్ర తనతో పాటుగా నడవట్లేదేమోనన్న భావన కలిగి, వెనకాలకి తిరిగి చూశాడు.
నోరు బార్లా తెరిచి, ఈశ్వర్ వైపుగా చూస్తూ ఉండిపోయింది చిత్ర.
ప్రపంచం యొక్క అభిప్రాయాన్ని సామాన్యంగా గత మూడేళ్ళుగా పట్టించుకోవడం మానేసిన ఈశ్వర్ కి చిత్ర అలా బార్లా నోరు తెరిచి రోడ్డుపై నిలబడటం కాస్త సిగ్గుగా అనిపించింది. వడి వడిగా ఆమె వైపు నడిచి, ఆమె తో
"చిత్రా! ఏంటి అలా నిలబడ్డావ్ ? ఏమైంది" అని అడిగాడు ఈశ్వర్.
"ఏంది, నిజంగ రెండు లక్షలా? రెండు లక్షల రూపాయలేనా? నెల నెల ఇస్తరా నీకు ?" అడిగింది చిత్ర.
"అవును." అన్నాడు ఈశ్వర్.
"ఓ.." అంది చిత్ర. ఆమెకు తాను హోటల్ లో తిన్న దోషలు, వాషింగ్ మెషీన్ , పాల పాకెట్ దెగ్గర చిల్లర .... ఇవన్ని సంభవించినప్పుడు తన భర్త అస్సలు డబ్బుల గురించి ఆలోచించక పోవడం వెనకున్న కారణమేంటో గ్రహించినదై.
'ఏందో ఏమో, రెండు లక్షల తోని పెంట్లవెల్లి ల నాలుగు పెళ్ళిళ్ళు జేయొచ్చు! గా వకీల్ శ్రీనివాస రావ్ బార్య రుక్మిణి తన మెగుడే పేద్ద సంపాదిస్తడన్నట్టు చెప్తుంటది. ఈ సారి కల్సినప్పుడు ఏదో విదంగ గీ టాపికు దెచ్చి చెప్పాలె ఆమెకి గీన జీతం రెండు లక్షలని .' అనుకుంది చిత్ర మనస్సులో.
తన భర్త ఇంతకు ముందులా డబ్బులను 'దుబారా' పెట్టనివ్వకుండా చాలా జాగ్రత్తగా కూడబెట్టి పెద్ద పెద్ద ఇళ్ళు, స్థలాలూ అతనిచేత కొనిపించాలని నిర్ణయించుకుంది చిత్ర. సాధ్యమైనంత త్వరగా వారి ఇంటి ఆర్థిక లావాదేవీల విషయం లో తను చాలా చురుగ్గా వ్యవహరించడం ప్రారంభించాలనుకుంది చిత్ర.
అలా నడుస్తున్న వాళ్ళకి పెట్ హాస్పిటల్ నుండి శాగీ ని తీసుకొస్తున్న రాం రెడ్డి ఎదురయ్యాడు వాళ్ళకు . అయత్నకృతంగా ఈశ్వర్ చిత్ర పక్కకి వెళ్ళి నిల్చున్నాడు. ఈశ్వర్ భయాన్ని చూసి అతనితో
"అదేమనదబ్బా, భయపడకు అట్ల అనవసరంగా." అని అనబోయి, ఈశ్వర్ తో తనకు పెద్దగా పరిచయం లేదని గుర్తుకు వచ్చి, ఊరుకున్నాడు రాం రెడ్డి.
"ఏమైంది దీనికి?" అడిగింది చిత్ర శాగీ ని నిమురుతూ.
"అదా... ఏం లేదమ్మా . కొంచం తినట్లేదెందుకో ఇది. డాక్టర్ కి చూపిస్తే ఈ టానిక్ ఇచ్చిండు." అంటూ టానిక్ ని చిత్ర కు చూపించాడు రాం రెడ్డి.
"ఓ." అని, ఆ టానిక్ ఏంటో చూడాలనుకుని, దాని పేరు కూడా అర్థం కాక, ఊరుకుంది చిత్ర.
"సరే ఇగ నేను వెళ్త.... ఆంటి ఒచ్చింది చూడండి ఇంటికి. ఎప్పుడైనా వీలు చూసుకుని రండి ఇద్దరు మా ఇంటికి." అంటూ వెళ్ళాడు రాం రెడ్డి, ఈశ్వర్ ఇంకా శాగీ కి భయపడి వాళ్ళిద్దరికీ నాలుగడుగుల దూరం లో నిలబడటాన్ని గమనించి.
తన భర్త అంత కండలు తిరిగిన సౌష్ఠవమైన దేహాన్ని కలిగి ఉన్నా , కుక్కకు అంతలా భయపడే వైనాన్నీ, తను అంత డబ్బు సంపాదిస్తున్నా అతనిలో ఉన్న నమ్రత నీ తలుచుకుని విడతల వారిగా నవ్వుకుంటూ, గర్వపడుతూ నడవసాగింది చిత్ర.
వారు చిత్ర వెళ్ళే కృష్ణుడి గుడి సందుకు చేరుకున్నారు.
"చిత్రా, గుడికి వెళ్ళొస్తావా? నేను పార్క్ లో వెయిట్ చేస్తుంటాలే అంతవరకూ." అన్నాడు ఈశ్వర్.
"ఇప్పుడొద్దులే. మళ్ళింగోసారి పోత గాన్లె." అంది చిత్ర.
ఈశ్వర్ తాను పక్కనున్నందుకు చిత్ర అలా అంటుందేమో నని అనుకున్నాడు. తన ఇష్టాలకి అనుగుణంగా చిత్ర అలా తనని తాను మార్చుకోవడం నచ్చలేదతనికి అస్సలు. అతనికి చిత్ర గుడ్ల విషయం లో కూడా ఇదే చేయటం గుర్తుకు వచ్చింది. వెంటనే చిత్ర తో చాలా 'తియ్యగా '
"పర్లేదు చిత్రా, నేను పక్కనున్న పార్క్ లో వెయిట్ చేస్తాలే. నువ్వు వెళ్ళి గుడి లోనికి వెళ్ళి అక్కడున్న శిల్పకళా నైపుణ్యాన్ని చూసి రా" అన్నాడు ఈశ్వర్.
"ప్చ్... అట్ల గాదు, నేను దూరమున్న . పోగూడదు గీ మూడు రోజులు." అంది చిత్ర.
చిత్ర తను ఋతుస్నాత గా ఉన్న విషయాన్ని చెబుతుందని గ్రహించాడు ఈశ్వర్.
"అయితే గుడికి వెళ్ళకూడదా?" అడిగాడు ఈశ్వర్.
"గీ మూడు రోజులు ఆడోళ్ళకు మైలుంటది. గందుకే పూజల్ గీజల్ చెయ్యరు." బదులిచ్చింది చిత్ర, ముప్పై ఏళ్ళ వయసున్న ఈశ్వర్ అలా అడగడానికి కాస్త ఆశ్చర్యపోతూ.
"my foot! menstrual cycle it is a characteristic of every woman.that is the reason for the running of the entire human race.menstrual period time లో నువ్వనే సో కాల్డ్ మైల వాళ్ళ అమ్మలకు ఉన్నందువల్లే వాళ్ళు కూడా పుట్టారు, ఐ మీన్ ఈ రూల్స్ పెట్టిన వాళ్ళు. " అన్నాడు ఈశ్వర్, సమాజం పట్ల కాస్త నిరసనగా.
"అయినా నిన్ను పుట్టించింది నువ్వు నమ్మే దేవుడే ఐనప్పుడు, తన దెగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు నువ్వు మైల లో ఉన్నావా , పొద్దున స్నానం చేసావా, ఇంట్లో నువ్వు చికెన్ తిన్నావా ? అని అన్నీ పట్టించుకుంటాడా?damn it! " అన్నాడు ఈశ్వర్ తన మాటలకు కొనసాగింపుగా.
" ఇగో.... గది ఆడోళ్ళ జోలి. నీకెందుకు జెప్పు ?! " అంది చిత్ర , దురుసుగా.
"హం." అని ఊరుకున్నాడు ఈశ్వర్ , ఒక్క క్షణం తనకు చిత్ర అంతకు మునుపు వాడిన 'దొంగ ముండా కొడుకులు ' అన్న పద ప్రయోగం గుర్తొచ్చి.
'క్రిష్నయ్యా, గీ మనిషి చానా చానా మంచోడు. జెర నా మీద ప్రేమెక్కువయి నిన్ను అట్ల అంటుండు. అంతే ఇంగేమ్లేదు. ' అనుకుంది చిత్ర మనస్సులో.
"ఇంగ పోదమా ఇంటికి? " అడిగింది చిత్ర.
సరేనంటూ తలూపాడు ఈశ్వర్.
చిత్ర ఒంట్లో బలం తక్కువగా ఉంటుందేమో నని అనుమానం కలిగి, ఈశ్వర్ తన నడక వేగాన్ని తగ్గించాడు. చిత్ర ఆ విషయాన్ని గమనించి లోలోన మురిసిపోయింది.
***
వాళ్ళింటి గోడ గడియారం ఎనిమిది సార్లు కొట్టి ఇరవై నిమిషలయ్యింది. లాప్టాప్ పై పని చేసుకుంటున్న ఈశ్వర్, చిత్ర తలుపు దెగ్గర నిలబడి ఉన్న విషయాన్ని గమనించాడు.
"ఏంటి చిత్రా?" అడిగాడు ఈశ్వర్.
"ఇగో... నీకు కోపమొస్తది ! "
"ష్... అలా ఏం లేదు. చెప్పు" అన్నాడు ఈశ్వర్.
"ఇగో, ఊళ్ళ దూరమున్నప్పుడు వంటింట్లకి పోకుంటి నేను.... మళ్ళిప్పుడు నేను ఒంట జేస్తే నువ్వేమన్న అనుకుంటవా?" అడిగింది చిత్ర.
ఒక్క సారి చుర్రుమంటూ చిత్ర వైపు చూశాడు ఈశ్వర్.
"పిండి తడుపుత. అర్దగంట ల అయితయ్ చెపాతీలు." అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిత్ర.
****
మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలకు చిత్ర, ఈశ్వర్ లు డైనింగ్ టేబుల్ దెగ్గర కూర్చుని చిత్ర చేసిన ఛాయ్ తాగుతూ ఉన్నారు. ఈశ్వర్ తనని తాను ఎంత అదుపులో ఉంచుకోవాలనుకున్నా చిత్ర తో కనీసం రోజుకి ఒక్కసారైనా ఛాయ్ పెట్టించుకోలేక ఉండలేకపోతున్నాడు. ఇదే తాను చిత్ర చేసే ఛాయ్ ని తాగడం ఆఖరుసారని ప్రతిగ్న్య చేసాడు ఈశ్వర్, కనీసం అలా తాను చిత్ర ని ఛాయ్ పెట్టమని అడగడం తగ్గించాలని తన ప్రతిగ్న్య ను వెంటనే సవరించుకున్నాడు ఈశ్వర్.
"ఇదో.... ఇప్పుడు నీకు పనుందా ఏమన్న ?" అడిగింది చిత్ర.
"లేదు." అన్నాడు ఈశ్వర్ నిజాయితీగా.
"ఏమ్లే... ఇడ్లీ స్టాండు కొందమా? రోజు చెపాతీలే అయితున్నయ్ నీకు పొద్దునా, రాత్రి." అంది చిత్ర.
"అయ్యో నాకు ఇబ్బందేం లేదులే." అన్నాడు ఈశ్వర్, చిత్ర అలా తనతిండి విషయం లో అంత లోతుగా ఆలోచించడం నచ్చక. నిజానికి చిత్ర దోశ లు చేసినప్పటి నుంచీ ఈశ్వర్ చిత్ర చేతి టిఫిన్లు తినాలని ఉవ్విళ్ళూరుతున్నాడు తన మనస్సులో.
"నీ ఒక్కని కోసమే గాదులే . నా కోసం గూడ . నేను జెసిన ఇడ్లీలను తినడం మస్తు ఇష్టం నాకు." అంది చిత్ర, తన భర్తని ఈ రీతిలో ఒప్పించడం సులువని గ్రహించినదై.
"హం . ఓకే. ఒక ఫైవ్ మినెట్స్ లో స్టార్ట్ అవుదాం." అన్నాడు ఈశ్వర్, తన ఎంగిలి కప్పుని సింక్ వద్దకు తీసుకు వెళుతూ.
తన భర్త తో తాను పదే పదే దురుసుగా మాట్లాడుతున్నందుకు కాస్త అపరాధ భావం కలిగింది చిత్ర కు. తనపై అసలు కోపం తెచ్చుకోని తన భర్త పై చాలా అనురాగం కలిగిందామెకు.కానీ మనస్సులో ఒక మూల 'మహేషు బాబు కంటే బాగుండే ' తన భర్త ను ఒకసారి కోపం లో చూడాలనిపించింది చిత్ర కు. కోపం లో అతని బుగ్గలు ఎంత ఎరుపెక్కుతాయో నని అంచనా వేయసాగింది.
చేతిలో కార్ కీస్ పట్టుకుని వచ్చాడు ఈశ్వర్.
"అయ్య... సూపర్ మార్కెట్ గీడనే గద..... మంచిగ నిన్నట్లెక్క నడుసుకుంటు పోదం ఇద్దరం." అంది చిత్ర, రెండో వాక్యం అనవసరంగా మాట్లాడానేమో నని తనకే అనిపించింది.
"actually , ఆ సూపర్ మార్కెట్ లో ఇడ్లీ స్టాండ్ లాంటివి అంత మంచి క్వాలిటీ వి ఉండవు. They get corroded easily. it is not good for health." అన్నాడు ఈశ్వర్.
చిత్రకు తన భర్త చెప్పే విషయం పూర్తిగా అర్థం కాకున్నా అతని ఉద్దేశాన్ని మాత్రం అర్థం చేసుకో గలిగింది.
'ఏందో ఏమో గీ మనిషి ని జూస్తుంటే అప్పుడప్పుడు గా డేట్టాలు సబ్బు గుర్తొస్తుంటది ' అనుకుంది చిత్ర తన మనస్సులో.
ఇద్దరూ కలిసి కారులో ప్రయాణించ సాగారు.
ఎంత ఆ మాటని అదుపులో ఉంచుకుందామనుకున్నా, ఆపుకోలేక తన భర్త తో
"ఇదో.... నీకు బ్యారం జేయనీకె రాదు.నేను జేస్త బ్యారం. ఇందాక పెట్రోలు కొట్టిస్తివి ఐదు వందలు. గిట్ల పెట్రోలు కర్చన్న మనకి గిట్టుబాటు అవ్వలె గద! " అంది చిత్ర.
ఈశ్వర్ కి మెల్లిగా మనస్సులో కాస్త భయం కలగ సాగింది, డబ్బుల విషయం లో చిత్ర తన నోటిని బార్లా తెర్చే వైనాలన్నీ అతని కళ్ళముందు మెదలసాగాయి.
"చూడు చిత్రా! అక్కడన్నీ fixed prices ఉంటాయి. సో మనకు బేరమాడే chance ఉండదు." అన్నాడు ఈశ్వర్ చిత్ర అర్థం చేసుకుంటుందన్న ఆశతో.
తన భర్త చేసే 'దుబారా' తెలిసినదై
" అవ్నా! సూద్దం ఆళ్ళ ఫిక్సుడు ప్రైజుల సంగతేందో !" అంది చిత్ర.
"బాబోయ్! " అనుకున్నాడు ఈశ్వర్ తన మనస్సులో.
ఈశ్వర్, చిత్ర లు తమ గమ్యస్థలానికి చేరుకున్నారు.
అక్కడ 20 % డిస్కౌంట్ అన్న పెద్ద బోర్డ్ చూసి ఊపిరి పీల్చుకున్నాడు ఈశ్వర్. చిత్ర కి ఆ బోర్డ్ ని చూపుతూ
"చూడు చిత్రా! అక్కడ చూడు. మనం బేరమాడాల్సిన పని లేదు. వాళ్ళే మనకు 20% డిస్కౌంట్ ఇస్తున్నారు." అన్నాడు ఈశ్వర్ , అసంకల్పితమైన ఉపశమనం పొందిన వాడై.
"గది వాళ్ళేట్లన్న ఇస్తరు . గది అందరికిచ్చే డిస్కౌంటు. గదే గాక మనం గూడ కొంత తీస్కొవ్వాలె డిస్కౌంటు అడిగి." అనబోయి, తన భర్త ఇష్టానికి వ్యతిరేకంగా తాను ముందురోజు నుంచి పదే పదే ప్రవర్తిస్తున్న విషయం గుర్తొచ్చి, ఊరుకుంది చిత్ర.
చిత్రని ఒప్పించగలిగానని భ్రమపడి ఆనందపడ్డాడు ఈశ్వర్.
అక్కడి సేల్స్ గాల్స్ చిత్ర లోని పెల్లెటూరుదనాన్ని కాస్త అవహేళన చేస్తున్నట్టుగా కనిపించింది ఈశ్వర్ కి. చిత్ర అవేవీ పట్టించుకోకుండా తాను వచ్చిన మీదనే ధ్యాస పెట్టింది చిత్ర .ఈశ్వర్ కి చిత్ర అలా అవహేళన కాబడటం నచ్చలేదసలు. పదహేను నిమిషాల తరువాత ఆ షాప్ లో అన్నింటికన్నా అతి చవకైన ఇడ్లీ స్టాండ్ ను ఎంచుకోగలిగింది చిత్ర.
తరువాత హఠాత్తుగా చిత్ర కు పొంగణాలు గుర్తుకు వచ్చాయి. తను చేసే టిఫిన్లల్లో అన్నింటికన్నా రుచికరమైనవి పొంగణాలే నని చిత్ర నమ్మకం. ఆ పొంగణాలను తన భర్త కి చేసిపెట్టాలనుకుంది చిత్ర.ఆ సేల్స్ గాల్స్ తో పొంగణాల పెన్నం గురించి అడిగింది. వాళ్ళకి చిత్ర ఏమంటుందో అర్థం కాలేదసలు. చిత్ర లోని పల్లెటూరుదనానికి మరింతగా నవ్వసాగారు వారు.
"excuse me ! మీరు నవ్వడానికి గల reason ఏంటో నేను తెలుసుకోవొచ్చా? లేక కింద manager ని అడగమంటారా?" అన్నాడు ఈశ్వర్ కోపంగా.
అతని బుగ్గలు కోపం వల్ల కాస్త ఎరుపెక్కాయి. ఈశ్వర్, చిత్ర లకు వేరువేరుగా "సారీ" చెప్పారా ఇద్దరు సేల్స్ గాల్స్.
చిత్ర కి కోపం గా ఉండే తన భర్త ని చూద్దామనుకున్న కోరిక అంత త్వరగా తీరినందుకు బాగా ఆనందం కలిగింది. ఆ కోపమేదో తన పై గాక , తన కోసం రావడం చిత్ర కు ఇంకా బాగా నచ్చింది.
'గా మహేషు బాబేంది. ఈన ముందు అస్సల్ ఎవ్వరు తూగనేతూగరు.' అనుకుంది చిత్ర మనస్సులో మురిసిపోతూ.
----------------------సశేషం. --------------------------
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#90
(30-07-2023, 06:37 PM)Vyas Kumar Wrote: కథనం చాలా చాలా బావుంది. వ్యాకరణ దోషం లేని భాష ముచ్చటగా వుంది. చదవడానికి సొంపుగా వున్నప్పుడు ఏ మాండలీకం  అయితే ఏం? రావి రావుగారు చెప్పినట్లు తృప్తిగా భోజనం చేసినట్లుంది.

వ్యాస్

ధన్యవాదములు వ్యాస్ గారు-
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#91
(31-07-2023, 03:16 AM)TheCaptain1983 Wrote: K3vv3 garu! Story is going on nicely. Good work !!! Curious to see how their relationship unfolds..
Thank you The Captain.
You will get to see all updates with story unfolding, gradually.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#92
(01-08-2023, 06:24 PM)k3vv3 Wrote: ముడి- పార్ట్ - 14
"ఇప్పుడా?!" అంది చిత్ర, ఒంట్లో కాస్త అననుకూలత గలదై.
"సారీ, సారీ. జస్ట్ ఊరికే అడిగా అంతే." అన్నాడు ఈశ్వర్.
K3vv3 garu!!! Once again..a very nice episode!!!
Like Reply
#93
update
Like Reply
#94
ముడి -15
"ఇదో.... నిమ్మకాయ చట్నీ పెడ్దమన్న గద. ఎప్పుడు గొందం నిమ్మకాయలు? "
"ఇప్పుడు కొంచం busy గా ఉన్నా. కాస్త workload ఎక్కువగా ఉంది.... నేనే చెప్తాను ఎప్పుడు వెళ్దామో.... సారీ."
"అయ్య అయ్య, నువ్వట్ల ఊకె సారీ జెప్పకు నాకు. నీకెప్పుడు కుదిర్తె అప్పుడే పోదం గాని. పని చేస్కో." అంది చిత్ర.
తన భర్త తన దెగ్గర 'సారీ' అన్న పదాన్ని చాలా తరుచుగా వాడుతూ ఉండటం నచ్చట్లేదామెకి.
'ఏందో ఏమో, గీ మనిషి ల మార్చాల్సినవి చానా ఉన్నయ్.' అనుకుంది తన మనస్సులో.
****
హాల్లో సోఫా పై కూర్చుని టి.వి చూస్తున్న చిత్రకి ముందు రోజు సేల్స్ గాల్స్ పై ' తన కోసం' ఈశ్వర్ కోపాన్ని చూపించిన వైనాన్ని పదే పదే తలుచుకోసాగింది చిత్ర. ఆమె మనస్సు సంతోషం తో, గర్వం తో ఉప్పొంగసాగింది. టి.వి వైపు చూడకుండా ఆమె ఓరగా బుద్ధిగా పని చేసుకుంటున్న ఈశ్వర్ ని చూడసాగింది.
తన భర్త క్లీన్ షేవ్ చేసుకుంటే బావుంటాడో, లేక కాస్త గరుకుగా గడ్డం ఉంచుకుంటే బావుంటాడో నని ఆలోచించసాగింది చిత్ర. పదహేను నిమిషాల విశ్లేషణ తరువాత తన భర్త ఎలాగైనా బావుంటాడన్న అభిప్రాయానికి వచ్చిందామె. పని మధ్యలో అప్రయత్నంగా ఈశ్వర్ తన తల ఎత్తి చిత్ర వైపు చూశాడు. తన వైపే చూస్తున్న చిత్ర వైపు చూస్తూ
"ఏదైనా చెప్పాలా నాకు?" అని సైగ చేశాడు.
"ఏమ్లే, ఏమ్లే. ఛాయ తాగుతవేమోనని." అంది చిత్ర. అంత అయత్నకృతంగా తాను ఎలా అబద్దమాడగలిగానన్న సందేహం కలిగిందామెకు.
ఈశ్వర్ కు చిత్ర నోటి వెంబట 'చాయ్' అన్న మాట విన్న వెంటనే అతని మెదడు లోని ప్రతి నరం చిత్ర చేసే ఛాయ్ ని కోరుకోసాగింది. కానీ అతనికి చిత్ర తో మరీ ఎక్కువగా ఛాయ్ లు పెట్టించుకోవొద్దని తనకు తాను పెట్టుకున్న నిశ్చయం గుర్తొచ్చి,
"ఇప్పుడేం ఒద్దులే చిత్రా! కావలసినప్పుడు నేనే నిన్ను అడుగుతాను లే." అన్నాడు 'తియ్యగా'.
తన భర్త యొక్క స్వరం లోని కృత్రిమమైన తియ్యదనాన్ని నిజమని భ్రమపడి, ఆనందపడింది చిత్ర. నిండుగా నవ్వుతూ సరేనన్నట్టుగా తలూపింది చిత్ర, తన భర్త వైపు చూస్తూ.
ఆ 'నవ్వు ' ని చూసి వెంటనే తన చూపుని తన లాప్టాప్ స్క్రీన్ పై పోనిచ్చాడు ఈశ్వర్. ఆమె వల్ల అతనికి కలుగుతున్న అపరాధభావాన్ని అణుచుకోవడానికి ప్రయత్నించసాగాడు.
చిత్ర కి తన భర్త తనతో అంత 'తియ్యగా' మాట్లాడిన దానికి ప్రతిగా ఏదైనా మంచి రుచికరమైన వంటకం చేసిపెట్టాలన్న ఆలోచన కలిగింది. వెంటనే ఆమె మెదడు కి ఈటీవీ అభిరుచి చానెల్ స్ఫురించింది. ఆ చానెల్ నెంబరుని కష్టపడి గుర్తుతెచ్చుకుని, టి.వి లో ఆ చానెల్ ని పెట్టింది చిత్ర. అందులో చికెన్ టిక్కా ని తయారుచేసే విధానాన్ని, పూర్తిగా అర్థం కాకున్నా కళ్ళు పెద్దవిగా చేసి ,తలూపుతూ 'వింటున్న ' యాంకర్ కి విశదీకరిస్తున్నాడు చెఫ్. ఆ చికెన్ ముక్కల్ని చూడగానే చిత్ర నోరూరింది.
'ఏందో ఏమో, గంత ఉంటడు మనిషి సూడనీకె. చికెన్, గికెన్ తిననంటడు. ఊకె ఆక్కూరలు మేక లెక్క నమిల్తే ఏమొస్తదసలు? మంచిగ అన్ని కొట్కదినాలె. " అనుకుంది చిత్ర తన మనస్సులో. పెళ్ళి కాక మునుపు తాను పట్నం లోని వ్యక్తికి భార్యను అవబోతున్నానని తెలుసుకొని, రకరకాలైన మాంసపు వంటకాలను రుచిచూద్దామనుకున్న విషయం గుర్తొచ్చింది చిత్ర కు.చిత్రకు తన ఊరూ, తన మామయ్యా గుర్తు రాసాగారు. ఒక్కసారి తనివితీరా తన మామయ్య తో మాట్లాడాలనిపించింది ఆమెకి. పెళ్ళై ఇన్ని రోజులవుతున్నా ఇంకా తన మేనమామ ఫోన్ చేయకపోవడానికి కారణం అర్థం కాలేదామెకు.ఊళ్ళో పరిస్థితులు ఏమైనా ఆందోళనకరంగా ఉన్నాయేమో నన్న భావన కలిగిందామెకు. కానీ ఎదైనా క్లిష్టమైన సమస్య ఎదురైతే తన మేనమామ తనను ఖచ్చితంగా సంప్రదిస్తాడని తనకు తాను సర్ది చెప్పుకుంది చిత్ర.
ఒక్క క్షణం ఈశ్వర్ అలా శాకాహారిగా మారటానికి అమృతే కారణమేమో నన్న భావన కలిగిందామెకు. అమృత ఆమె మస్తిష్కం లోకి 'రాగానే' చిత్ర తన భర్త ని తలుచుకుని ముందు రోజు నుంచీ అనుభవిస్తున్న సంతోషం మొత్తం ఒక్కసారిగా ఆవిరైపోయింది.
'క్రిష్నయ్యా! గా అమృతని ఊకె నా మైండు లోకి రాకుండగ సూడయ్యా జెర! మంచిగ అనిపిస్తలేదయ్యా నాకు గాయ్న ఇంగో ఆమెని తల్సుకుంటుండు అని నాకు గుర్తొస్తె. నాకు నేను ఏం గాదులే అని ఎంత చెప్పుకున్నా మనసుల మస్తు బాధవుతుందయ్యా నాకు. గాయ్న మనసుల నేనే ఉండేటట్టు సూడయ్యా. ఇంగేం ఒద్దయ్యా నాకు. ఇంగేం కోరుకోను నిన్ను. ' అనుకుంది చిత్ర తన మనస్సులో.
తన భర్తను తనకు ' అలవాటైన రీతిలో ' ఓరగా చూడటాన్ని కొనసాగించింది చిత్ర. గులాబీ, గోధుమ వర్ణాల మధ్య ఉండే తన భర్త పెదవులు చాలా ఆకర్షణీయంగా కనిపించాయి ఆమెకి. తన భర్త పెదవులను తనివితీరా ముద్దాడాలనిపించింది చిత్రకి. ఆమెకు తన స్నేహితురాలూ, కొన్ని విషయాల్లో 'గురువైన 'వీణ చెప్పిన సంగతులు స్ఫురణకు రాసాగాయి.
'క్రిష్నయ్యా, గా అమృత లెక్క గీ వీణ గూడ నాకు గుర్తు రాకుండగ సూడయ్యా. గిది గుర్తొస్తే నాకు ఇంగో రకమైన బాదవ్తుంది ఊకె. ' అని తనలో తాను తన భర్త వైపు చూస్తూ నిట్టూరుస్తూ నవ్వుకుంది చిత్ర.
ఇంతలో యాంకర్ నోటి నుండి 'ఆలూ పరోటా' అన్న మాట చిత్ర చెవిన పడింది.
'ఆల్గడ్డలంటే ఈనకి మస్తిష్టం ! మంచిగ గీ ఒంటలు జేశేటాయన చెప్తే నేర్సుకోని మంచిగ చేశి పెడ్త నేనింగ ' అని నిశ్చయించుకుంది చిత్ర.
టి.వి సౌండ్ పెంచుదామనుకుని, తన భర్త పనికి విఘాతం కలుగుతుందేమో నని భావించి, లేచి టి.వి పక్కన నిలబడి ఆసక్తిగా చెఫ్ చెప్పే తయారీ విధానాన్ని వినసాగింది చిత్ర.
సగం వరకు వచ్చేసరికి చిత్ర అంతకుముందెన్నడూ వినని పదార్థాల పేర్లు చెఫ్ నోటి నుండి రాసాగాయి.
'ఏందో ఏమో, ఈళ్ళు చెప్పేటివేందో గానీ నాకు పల్కనీకె నోరు గూడంగ తిరుగుతలే.' అనుకుంది చిత్ర తన మనస్సులో.
ఆ పదార్థాలకి ప్రత్యామ్నాయంగా ధనియాలు, జీలకర్ర వంటివి వాడాలని నిర్ణయించుకుంది చిత్ర. ఆలూ పరాటా తయారీ విధానాన్ని సంగ్రహంగా ఆఖరున చెఫ్ చెబుతూ ఉంటే తీక్షణమైన దృష్టి తో వినసాగింది చిత్ర. అతను చెప్పటం ముగించాక , టి.వి బంద్ చేసి, తన భర్త వైపు ఒక సారి తనివి తీరా చూసుకుని, వంటింటి వైపు బయలుదేరింది చిత్ర.
ఆ చెఫ్ చెప్పిన పదార్థాలల్లో చిత్రకు తెలిసినవాటిని వాడింది చిత్ర. ఆమెకు 'అర్థం కాని ' పదార్థాలను తనకు తెలిసిన పదార్థాలతో భర్తీ చేసింది చిత్ర. ఆ చెఫ్ చెప్పిన నిష్పత్తిలోనే కాక, కారానికి దూరంగా ఉండే తన భర్త యొక్క ఇష్టాలను చాలా తీక్షణంగా గుర్తు తెచ్చుకుని తయారు చేయసాగింది చిత్ర. తన భర్త యొక్క ఇష్టాలను అంత గా గుర్తెరిగి, అందుకు తగ్గట్టుగా తాను వంటకాన్ని తయారు చేసే విధానం చిత్రకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎట్టకేలకు మితిమీరిన ఉత్సాహం వల్ల ఒక సారి చిన్నగా చేయి కాల్చుకుని, పరాటాల తయారీని పూర్తిచేసింది చిత్ర. ఆ ఆలూ పరాటాలు సరిగా వచ్చాయో, లేదో నని కాస్త చించుకుని తినాలనుకుంది చిత్ర. కానీ అది ఎంగిలి అవుతుందేమో నని తన ప్రయత్నాన్ని విరమించుకుంది చిత్ర. తను తయారు చేసిన విధానం పై భరోసాని తెచ్చుకుంది చిత్ర.
' ఎందుకు బాగుండదు. మస్తుంటది ఆల్గడ్డ పరాట. గీనకు ఎట్లా మస్తిష్టం ఆల్గడ్డ. జెర మరీ బాలేకున్నా గూడ నచ్చుతది గానిలే.' అని మనస్సులో అనుకుంది చిత్ర.
ఆ పరాటా లను హాట్ ప్యాక్ లో సర్దింది చిత్ర. దోరగా కాలిన ఆ పరాటాలను తృప్తిగా నిమురుతూ
'గివి తిన్నాంక . నోరు తెరిచి అడగాలె నన్నింగ. చిత్రా, ఎప్పుడు జెస్తవ్ పరాటాలు మళ్ళ అని.' అనుకుంది చిత్ర మనస్సులో. కానీ మరుక్షణం ఆమెకు తన భర్త తనని ఆశతో అర్థించాలన్న ఆమె భావన తప్పుగా తోచింది. తన భర్త తనను అడగకముందే అతని ఇష్టాలన్నింటినీ తెలుసుకుని వ్యవహరించాలనుకుంది.
చిత్ర తనను రాత్రి భోజనానికి ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురుచూస్తూ లాప్టాప్ ముందు కూర్చున్నాడు ఈశ్వర్.అప్రయత్నంగా తన జుట్టుని చెరుపుకుని సరిచేసుకుంటున్నాడు ఈశ్వర్. కాలి పట్టీల శబ్దం వినబడగానే తన తల పైకి ఎత్తి చిత్ర వంక చూశాడు.
"ఇదో.... నాకు ఆల్గడ్డ పరాటాలంటే చానా ఇష్టం. ఊకె తింటుంటి మా మామ ఇంట్ల ఉన్నప్పుడు. అందుకే చేశ్న ఇగ. నీకు ఇబ్బందేం లేదు గద?!" అంది చిత్ర ఈశ్వర్ తో, తన లౌక్యాన్ని ప్రదర్షిస్తూ.
"అయ్యో పర్లేదు. నాకు కూడా ఆలూ అంటే చాలా ఇష్టం. " నిజాయితీగా సమాధానమిచ్చాడు ఈశ్వర్.
చిత్రకు తన భర్త 'ఇంకోసారి ' ముద్దొచ్చాడు.
చిత్ర చేసిన పరాటాలు బాగా నచ్చాయి ఈశ్వర్ కి. ఈ విషయం ఆమెకు చెప్పాలనుకున్నాడు ఈశ్వర్, కానీ చిత్ర తో అతిగా సంభాషించగూడదన్న అతని 'నియమం ' అతనికి గుర్తొచ్చి ఊరుకున్నాడు. తన భర్త నోటి వెంబడి ఏదైనా మెచ్చుకోలు వస్తుందేమో నని ఆశగా ఎదురు చూడసాగించి చిత్ర. పరాటాలు చెడిపోయాయేమో నన్న అనుమానం కలిగిందామెకు.
'ఏందో ఏమో, మంచిగ కానట్టున్నయివి. పాపం రోజు లెక్క చెపాతీలు జేశింటే ఐపోవసలు. అనోసరంగ ఈనని ఇవి తనబెడ్తి.' అనుకుంది చిత్ర తన మనస్సులో.
తినడం ముగించాక తన ఎంగిలి కంచాన్ని కడగడానికి సింక్ దెగ్గరికి తీస్కెళ్ళాడు ఈశ్వర్. చిత్ర చాలా కష్టపడి చేసిన రుచికరమైన పరాటాలు తనకి నచ్చాయని ఒప్పుకోకపోవడం తప్పనిపించింది అతనికి.
"పరాటాలు చాలా బావున్నాయి చిత్రా.they were really delicious." అన్నాడు ఈశ్వర్ కిచెన్ నుండి వస్తూ. తన భర్త ఇంగ్లీష్ లో చెప్పింది అర్థం కాకున్నా మొదటి వాక్యానికి సంబంధించిందే అయి ఉంటుందని భావించింది చిత్ర.
"అవునా. తాంక్స్. చానా తాంక్స్. మంచిగ కాలేదేమో అనుకున్నసలు." అంది చిత్ర, తనకు లోపల నుండి పొంగుకొస్తున్న సంతోషాన్ని కాస్త అణుచుకుంటూ. తనకు ఇంకా ఆ విషయం పై మాట్లాడాలని ఉన్నా , వ్యవహారం చెడిపోతుందేమో నని భావించి అంతే మాట్లాడింది చిత్ర.
రోజు లాగే తన కాళ్ళకి వాకింగ్ షూస్ తొడుక్కుని వాకింగ్ కి బయలుదేరాడు ఈశ్వర్. చిత్ర కు ఏదో స్ఫురించినదై , వడి వడిగా తలుపు దెగ్గరికి పరిగెత్తింది. లిఫ్ట్ దెగ్గర నిలబడి లిఫ్ట్ కాబిన్ కోసం ఎదురుచూస్తున్న చిత్ర ఈశ్వర్ తో
"ఇదో... వొచ్చేటప్పుడు జెర మీరా షాంపోలు తెస్తవా? నేను మొన్న రెండు రోజులు పాలు తెస్తి జుడు. ఆ అంగట్ల దొరుకుతయ్. జెర తెయ్యి." అంది చిత్ర.
సరేనని తలూపాడు ఈశ్వర్.
"ఇదో ...చిల్లరుందా మళ్ళ? గా షాపామె ఊకె చిల్లర లెవ్వంటది."
తన శరీరం లోని ఓపికనంతా కూడదీసుకుని చిత్ర తో "చూడు చిత్రా,each meera shampoo costs 2 rupees each. నా దెగ్గర10 rupees note ఉంది purse లో.5 sachets కొంటాను. అప్పుడు ఆమె వైపు చిల్లరేం ఉండదు. సరేనా?" అన్నాడు ఈశ్వర్.
"మంచిది." అంది చిత్ర.
తన మాటల్లోని వ్యంగ్యాన్ని చిత్ర అర్థం చేసుకోలేదని అర్థం చేసుకున్నాడు ఈశ్వర్. ఇంతలో లిఫ్ట్ క్యాబిన్ వాళ్ళుండే ఐదవ అంతస్థుకి వచ్చింది. అందులోంచి చందర్ రావు బయటకి వచ్చాడు.
---------------------సశేషం. ------------------------
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
#95
(09-08-2023, 08:46 AM)k3vv3 Wrote: ముడి -15
"ఇదో.... నిమ్మకాయ చట్నీ పెడ్దమన్న గద. ఎప్పుడు గొందం నిమ్మకాయలు? "
K3vv3 garu! simply nice!!!
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#96
అప్డేట్ చాల బాగుంది clps yourock thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
#97
Please continue this story please
Like Reply
#98
ముడి - 16
రాబోవు వారం రోజులకు తలకు మించిన భారాన్ని మోపిన తన బాస్ పై రుసరుసలాడుతూ తన ఇంటి కాలింగ్ బెల్ ని మూడు సార్లు నొక్కాడు ఈశ్వర్. తలుపు తెరుచుకుంది. కానీ తలుపు తెరిచింది చిత్ర కాదు... చందర్ రావు!
చందర్ రావు retired bank manager. ఈశ్వర్ వాళ్ళ పై ఫ్లోర్ లో ఉంటాడు.ఆయన భార్య రెండేళ్ళ క్రితం చనిపోయింది. ఆయన కొడుకు, కూతురు అమెరికా లో స్థిరపడ్డారు. ఆయన భార్య చనిపోయాక ఆయన అమెరికా వెళ్ళటం కానీ , లేక ఆయన సంతానం అమెరికా నుండి ఆయనని చూడటానికి వచ్చినట్టుగాకానీ ఈశ్వర్ చూడలేదెప్పుడూ.
తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని 'పట్టించుకోని ' వాడిగా ముద్రపడ్డ ఈశ్వర్ ని ఏనాడూ పలకరించలేదు చందర్ రావు. ఈశ్వర్ కూడా తన పై పడ్డ ముద్ర ని చెరిపేసుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు.!
డోర్ తెరుచుకున్నాక, ఎదురుగా చందర్ రావు ని చూసి కాస్త ఉలిక్కిపడి, తరవాత తేరుకుని, కృత్రిమమమైన నవ్వొకటి విసిరాడు ఈశ్వర్. ప్రతిగా చందర్ రావు కూడా ఒక నవ్వు విసిరాడు. చందర్ రావు డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి కూరగాయలు తరిగే పనిని కొనసాగించాడు. ఇంతలో చేతిలో గరిట తో వంటింట్లోనుంచి వచ్చింది చిత్ర.
* * *
గంట తరువాత వేడి, వేడి వెజ్ బిర్యానీ తయారయ్యింది.... చిత్ర, చందర్ రావులు ముద్ద నోట్లో పెట్టుకున్న ఈశ్వర్ వైపు ఏం చెబుతాడోనని ఆతురుతతో చూస్తున్నారు. ఈశ్వర్ కి వాళ్ళ ముఖాలల్లోని కుతూహలాన్ని చూసి, వాళ్ళని ఆటపట్టించాలనిపిచింది. ముఖం లో ఏలాంటి భావోద్వేగాన్ని ఉంచకుండా ఇంకో రెండు ముద్దలు తిన్నాడు ఈశ్వర్. కుతూహలాన్ని ఆపుకోలేకపోయింది చిత్ర.
"ఎట్లుంది?" అని అడిగింది.
చందర్ రావు కూడా అంతే కుతూహలం తో ఈశ్వర్ సమాధానానికై ఎదురు చూస్తున్నాడు. పక్కన ఉన్న నీళ్ళ గ్లాసు తీసుకుని, కొన్ని నీళ్ళు తాగాడు ఈశ్వర్. చిత్ర, చందర్ రావులు ఒకరి ముఖాన్ని మరొకరు చూసుకోసాగారు.
"బావుంది. in fact super గా ఉంది." అన్నాడు ఈశ్వర్.
చిత్ర, చందర్ రావులు గత రెండు గంటలుగా పడ్డ కుస్తీలో ఎట్టకేలకు విజయం సాధించినట్టుగా భావించుకుని, ఒకరి ముఖాన్ని మరొకరు చూసుకుంటూ "హమ్మయ్య" అనుకున్నారు.
తూకం తో కొలిచినట్టు తినే ఈశ్వర్, తేన్పులు తీస్తూనే బిర్యాని లాగించాడు. తన చుట్టూ మరో ఇద్దరు ఉన్నారన్న విషయాన్ని మరచి, తన్మయత్వం తో తినసాగాడు ఈశ్వర్. చాలా రోజుల తరవాత అలా తన్మయత్వం లో తనను తాను మరచిపోతూ భోంచేసాడతడు. చిత్రకు అలా తింటున్న ఈశ్వర్ ని చూసి చాలా సంతోషమేసింది. తన భర్త ను చూస్తున్నప్పుడు చిత్ర కళ్ళల్లోని మెరుపు చూసి చందర్ రావు కు ముచ్చటేసింది. చిత్రను, ఈశ్వర్ ని చూసి ఆయనకు తన సంతానం గుర్తుకు వచ్చారు.
కడుపు నిండా తిని తన ఎంగిలి కంచాన్ని తీసుకుని సింక్ వైపుగా వెళ్ళాడు ఈశ్వర్. "ఆయనకది అలవాటు" అంది చిత్ర చందర్ రావు వైపు చూస్తూ, ఈశ్వర్ చర్యకు సంజాయిషీ ఇచ్చినట్టుగా.
చిన్నగా నవ్వాడు చందర్ రావు. చందర్ రావుని తినమని చెప్పింది చిత్ర. తనకు బాక్స్ లో కొంచం కట్టివ్వమని, తన ఫ్లాట్ కి వెళ్ళి తింటానని కోరాడు చందర్ రావు. ఎక్కువ వద్దనీ, తనకు అరగదనీ, కొంచం మాత్రమే కట్టివ్వమని మరీ మరీ చెప్పాడు చందర్ రావు. ఆయన సూచనలనే అనుసరించింది చిత్ర.
ఈశ్వర్ ఫోన్ కి అమెరికా లో ఉన్న క్లైంట్ నుంచి కాల్ వచ్చింది. కాస్త విసుక్కుంటూనే ఫోన్ ఎత్తి మాట్లాడుతూ తన రూం లోకి వెళ్ళి లాప్ టాప్ ముందు కూర్చున్నాడు ఈశ్వర్. ఎప్పుడూ లేనిది ఈశ్వర్ కి తన పని పట్ల అసహనం కలిగినట్టుగా గుర్తించింది చిత్ర. ఒక వైపు ఈశ్వర్ని చూస్తూనే బిర్యానీ తింటూ వుంది చిత్ర. అతనలా ఒత్తిడికి లోనవటం ఆమెకు కాస్త ఆందోళన కలిగించింది. తన ఫోన్ సంభాషణను ముగించుకుని వాకింగ్ షూస్ వేసుకోబోయాడు ఈశ్వర్. ఎందుకో ఆ వేళ చిత్రకు ఈశ్వర్ ని కనిపెట్టుకోని ఉండాలనిపించింది చిత్రకు.
"వాకింగ్ కు నేను గూడ వస్త." అంది చిత్ర.
"అంటే గా పెద్దమన్షి పాపం ఎక్కువ తిననన్నడు. ఇంగ నేను వేస్టయిపోతదని జెర ఎక్కువ తిన్న. రాత్రి పూట అరగదని ఒద్దమనుకుంటున్న . గంతే ఇంగేమ్లే." అంది చిత్ర, కాస్త నిజాన్నీ, కాస్త అబద్దాన్నీ కలిపి చెబుతూ.
ఆమె ప్రతిపాదనకు కాస్త ఆశ్చర్యం వేసినా సరేనన్నాడు ఈశ్వర్.
* * *
గత పదిహేను నిమిషాలుగా ఇద్దరూ మౌనంగా నడుస్తూ వున్నారు. ఈశ్వర్ ముఖం లో కాస్త అసహనం కనిపిస్తోంది చిత్రకు. ఈశ్వర్ తో ఏదో ఒకటి మాట్లాడాలనిపించిందామెకు.
ఇంతలో ఈశ్వరే "ఆయన పేరేంటో ఉండే?! ...అదే ఇందాక మన ఇంటికి వచ్చిన ఆయన." అన్నాడు ఈశ్వర్.
"చందర్ రావు. రెండు రొజులు పాలు కొననీకి పోతి గద. అప్పుడు షాపు కాడ పరిచెయమయిండె. పాపం ఒక్కడే ఫ్లాట్ ల ఉంటడు. చానా మంచోడు ." అంది చిత్ర.
" ఈరోజటి బిర్యానీ ఎట్ల జేయాల్నో గాయన్నే జెప్పిండు. పాపం కూరగాయలు సన్నగ తరిగిచ్చిండు. ఆయ్నకు తిండం కన్నా వొండడం ఎక్కువ ఇష్టం అంట. కానీ ఆయ్న ఒండి పెట్టనీకి వాల్లింట్లో ఎవ్వరు లేరు ఆయ్న తప్ప. అందుకే నేనే జెప్పిన మనింటికి రమ్మని. మస్తు సంతోషమయ్యిండే ఆయ్నకి." అంది చిత్ర, అవసరమైన దాని కన్నా ఎక్కువ సమాచారాన్ని ఇచ్చే తన అలవాటుకు బద్దురాలై.అన్ని రోజులుగా ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నా కనీసం ముఖ పరిచయం కూడా చేసుకోని తనకూ, ఇంటికి పిలిచి కూరగాయలు తరిగించేంత 'నేర్పు ' గల చిత్రకూ చాలా వ్యత్యాసమున్నట్టుగా అనిపించింది ఈశ్వర్ కి.
" హా. ఒక్కడే కనిపిస్తూ ఉంటాడు పాపం. వాళ్ళ పిల్లలు abroad లో సెటిల్ అయ్యారంట." అన్నాడు ఈశ్వర్.
"అబ్రాడ్ ల కాదు, అమెరికా ల" ఈశ్వర్ ని సరిచేసింది చిత్ర.
చిత్ర ఇంగ్లీష్ ప్రావిణ్యాన్ని చూసి లోలోన నవ్వుకున్నాడు ఈశ్వర్.
ఒక్కసారి తన ఇష్టదైవమైన కృష్ణుడిని తలుచుకుని,
"ఏమి అట్లున్నవ్ ఆఫీస్ కెళ్ళి సాయంత్రమొచ్చినప్పుడు?" తాను వాకింగ్ కి వచ్చిన కారణం పై పని చేయటం ప్రారంభించింది చిత్ర.
" అదా...work tensions. ఎప్పుడూ ఉండేవే. client requirements ఎక్కువగా ఉన్నాయి. మాకు టైం తక్కువగా ఉంది. మా టీం లో ఇద్దరు లీవ్ లో ఉన్నారు. వన్ వీక్ లో ఫినిష్ చేయాలి అంట. మా టీం లో నాకు తప్ప ఆ language రాదు. సో, ఆ పని మొత్తం నా మీదికే తోసాడు మా బాస్." వివరించాడు ఈశ్వర్.
ఈశ్వర్ తనకు అంత విపులంగా తన పరిస్థితిని వివరిస్తుంటే చాలా సంతోషమేసింది చిత్రకు. అతను చెప్పింది పూర్తిగా అర్థం అవ్వకున్నా, సంగ్రహంగా అర్థం అయ్యిందామెకు. రాబోవు వారం రోజుల్లో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నైనా రాబోవు వారం రోజులు తన భర్తకు అనుకూలంగా వ్యవహరించాలనుకుంది చిత్ర.
చిత్ర తన అసహనాన్ని గుర్తించగలగడం చాలా ఆశ్చర్యంగా తోచింది ఈశ్వర్ కి. అమృత మరణం తరువాత అలా మనస్పూర్తిగా బాగోగులు ఇంకొకరిచేత అడిగించుకునీ చాలా ఏళ్ళైన విషయం అతనికి గుర్తుకు వచ్చింది. ఏదో తెలియని భావుకత కలిగిందతడికి. కానీ, అతని మస్తిష్కానికి అమృత గుర్తుకు రాసాగింది. అసలు తన 'ప్రాణానికి ప్రాణమైన ' 'తన అమృత ' తనకు అస్సలు తరచుగా గుర్తురాకపోవడాన్ని గుర్తించాడు ఈశ్వర్.వెంటనే చిత్ర పట్ల అతనికి ఏర్పడ్డ భావుకత పై అమృత పట్ల అతను చూపించే ' విధేయత ' అనే పొర కమ్మింది. అతని ముఖకవళికల్లో మార్పుని గమనించింది చిత్ర. తన భర్త కి అమృత గుర్తొచ్చినట్టుగా ఊహించి, అతన్ని ఇంకా ఇబ్బంది పెట్టగూడదని నిర్ణయించుకుంది చిత్ర. అతనితో ఏదో వేరే విషయాన్ని గూర్చి మాట్లాడి అతని ఆలోచనలను మళ్ళించాలనుకుంది చిత్ర.
"నువ్వు ఎంత దూరం నడుస్తవ్ రోజు?" అడిగింది చిత్ర.
"usually up and down కలిపి 1 kilometer నడుస్తా.but ఇరోజు ఎక్కువ నడుద్దాం అనుకుంటున్నా. ఎక్కువ తిన్నాగా అందుకే.i mean ఒక వేళ నీకు ఇబ్బందిగా ఉంటే నేను రోజు లాగే నడుస్తా." అన్నాడు ఈశ్వర్.
"లే అట్లేమ్లే. నాకు గూడ నడవడమంటే మస్తు ఇష్టం." అంది చిత్ర.." నీ తో నడవడం అంటే చాలా ఇష్టం" అని తన భర్త తో చెప్పాలనిపించింది ఆమెకి.
"ఓ. ఫైన్ ." అన్నాడు ఈశ్వర్.
కాస్త దూరం నడిచాక, తిరుగు ప్రయాణాన్ని ఆరంభించారు వాళ్ళిద్దరూ. తన భర్త అమృతని గుర్తుచేసుకుని, బాధ పడే కార్యక్రమాన్ని తన చాకచక్యతతో నిరోధించ గలిగినందుకు గాను లోలోన చాలా గర్వపడింది.
" నువ్వు చాలా ఫాస్ట్ గా నడుస్తున్నావ్. నైస్" మెచ్చుకోలుగా అన్నాడు ఈశ్వర్.
"హా. ఊళ్ళ బాగ అలవాటు నడవడం. జెర ఊరు బయట ఉంటమ్మేం. ఏ పనికయినా ఊళ్ళకు పొవ్వాలె. కిలోమీటరు దూరం ఉంటది." అంది చిత్ర.
ఇంతలో చల్లని గాలి ఈశ్వర్ ముఖాన్ని తాకింది. వెచ్చని వులెన్ స్వెటర్ ధరించిన అతడికి ఒంటిపై పెద్దగా చల్లగా అనిపించలేదు. కానీ చిత్ర ఆ చలి వల్ల కాస్త వణకడం గమనించాడతడు.
"స్వెటర్ వేసుకురాలేదా?" అన్నాడు ఈశ్వర్.
"స్వెటర్ లేదు." అని కళ్ళతోనే బదులిచ్చింది చిత్ర.
చిత్ర ని చూసి, జాలి, అపరాధభావం కలగలిసిన భావోద్వేగం కలిగింది ఈశ్వర్ కి. కానీ తాను చిత్ర ని జాలిగా చూస్తే ఆమె అత్మాభిమానం దెబ్బతింటుందేమో నని అనిపించింది ఈశ్వర్ కి.
" ఇంటికి వెళ్ళాక order చేద్దాం sweater." అన్నాడు ఈశ్వర్.
"అట్లే." అంది చిత్ర.
'order' చేయటానికి అదేమైనా మసాలా దోశ నా అని సందేహం కలిగింది చిత్రకు.
ఇంటికి చేరుకున్నాక చిత్రను పక్కన కూర్చోబెట్టుకుని , లాప్ టాప్ లో amazon website ని open చేశాడు ఈశ్వర్. అందులో రకరకాల స్వెటర్ బొమ్మలు వస్తున్నాయి.
"అవునూ, నీ సైజ్ ఏంటి?" అడిగాడు ఈశ్వర్.
" అంటే?" తిరిగి ప్రశ్నించింది చిత్ర.
"స్వెటర్ వేసుకోవటానికి నీ సైజ్ ఏంటి" విపులంగా చెప్పాడు ఈశ్వర్.
"ఏమో." అంది చిత్ర.
ఈశ్వర్ ఒక్కసారి తన పక్కన కూర్చున్న చిత్ర యొక్క మెడ నుంచి ఉదర భాగం వరకూ పరికించి చూశాడు 'తొలిసారిగా'!
ఒక్క క్షణం అతని కంటి చూపు ఆమె యొక్క బిగువైన కుచ ద్వయం దగ్గర ఆగింది. చిత్ర యొక్క కుచద్వయం చాలా నయన మనోహరంగా తోచిందతడికి. మరుక్షణం తనను తాను తమాయించుకుని తన చూపు పక్కకు తిప్పుకున్నాడు. తన భర్త అలా తనను 'చూస్తుంటే' చిత్ర ధమనుల్లోని రుధిరం ఉరకలు వేయసాగింది. తన ఒంటి తాను తట్టుకోలేనంత తాపం పుట్టింది. ఒక్కసారిగా తన భర్త తనను గట్టిగా పట్టుకుంటే బావుండు అనిపించింది. రాతిలా ధృడంగా ఉండే అతని యెదకు ఆమె యొక్క కుచములని అతడు అదిమి పట్టింటే బావుండు అనిపించింది ఆమెకు. తనను తాను శాంత పరుచుకునేందుకు అప్రయత్నంగా ఒక నిట్టూర్పు విడిచింది చిత్ర.
చిత్ర యొక్క మోము పై ఉన్న హావభావాలని గ్రహించగలిగాడు ఈశ్వర్! చిత్ర వైపు నుండి తన చూపును లాప్ టాప్ వైపు తిప్పుకుని "actually ఇక్కడ ఎక్కువ models లేవు. రేపు ఉదయం మనం షాప్ కి వెళ్ళి కొందాం . సరేనా?" అన్నాడు ఈశ్వర్.
సరేనంది చిత్ర తన భర్త యొక్క ఆంతర్యాన్ని గ్రహించి. తన మనస్సులో చనిపోయిన అమృతని క్షమాపణలు కోరుకుంటూ తన గది లోనికి వెళ్ళాడు ఈశ్వర్.

------------------సశేషం.[b]------------------[/b]
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
#99
(19-08-2023, 05:00 PM)k3vv3 Wrote: ముడి - 16
రాబోవు వారం రోజులకు తలకు మించిన భారాన్ని మోపిన తన బాస్ పై రుసరుసలాడుతూ తన ఇంటి కాలింగ్ బెల్ ని మూడు సార్లు నొక్కాడు ఈశ్వర్. 
K3vv3 garu!!! This story is engrossing. The way they are slowly bonding looks interesting. You are telling the story smoothly.
clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
Nice superb update   clps yourock thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)