Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముడి
#41
Please go on don't stop
[+] 1 user Likes Aavii's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
నచ్చకపోవడం నచ్చడం అనేది చదువరులపై వదిలేసి మీరు కొనసాగించండి బ్రో. మీకు తెలుసుకదా నూటికి తొంబై మంది ఈ సైట్కి ఎందుకు వస్తారో.

చిత్ర క్యారెక్టర్ చాలా బాగా వస్తోంది. అమాకత్వం, బోళాతనం, తన పల్లెటూరి మనసు, కల్మషం లేకుండా చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూసి ఏడవడం, ఈశ్వర్ కు అణుగుణంగా మెలగాలని ప్రయత్నిచడం ఇంకా చాలా షేడ్స్..బావుంది బ్రో.

ఇక అమృత ఎలా ఉండేదో మీరింకా చెప్పలేదు. 

ఈశ్వర్ క్యారెక్టర్ కూడా బావుంది. అమృత జ్ఞాపకాలను మరచిపోలేక, ఇటు చిత్రకు ద్రోహం చేస్తున్నానన్న భావనతో ద్రోహానికంటే న్యాయం చేయలేకపోతున్నాననే ఆలోచన, అమృతను చిత్ర ప్రవర్తన మర్చిపోయేటట్లు చేస్తుందేమోనన్న భయం...
మీరు కొనసాగించడి బ్రో.....        
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply
#43
Nice story continue
[+] 2 users Like AnandKumarpy's post
Like Reply
#44
మితృలు కొనసాగించమని అడుగుతున్నారు కాబట్టి వారి అభిప్రాయాలకు విలువనిస్తూ, తరువాత భాగం అందుకోండి.

ఓ మిత్రుడు చిత్ర భాష వల్ల అన్నారు, కానీ మన తెలుగులో చాలా ప్రాంతీయ భేధాలున్నాయి...అన్నింటినీ అందరూ సముచితంగానే వాడుతున్నారు, ఉపయోగిస్తున్నారు..అది సరి కాదేమో!

ఏది ఏమైనా చదివిన, అభిప్రాయాలు వెలుబుచ్చిన పాఠకమితృలందరికీ అభినందనలు, అభివందనములు Namaskar
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#45
ముడి- 7వ భాగం
చిత్ర చేసిన చెపాతీలు తిని, గది లోనికి వెళ్ళి లాప్టాప్ లో తన పని చేస్కోవడం ప్రారంభించాడు ఈశ్వర్. చిత్ర రాక ముందు హోటల్ లోంచి తెప్పించుకునే పుల్కాల కన్నా చిత్ర చేసిన చెపాతీలు చాలా మెత్తగా తోచాయి ఈశ్వర్ కి. చిత్ర
టి.వి లో కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రం చూస్తూ ఉంది.మహేష్ బాబు యొక్క తండ్రి కాబట్టి కృష్ణ అంటే ప్రత్యేకమైన అభిమానం చిత్రకి. ఒక ఉదాహరణమైన పల్లెటూరి పిల్లలా సిన్మాలో లీనమైపోయింది చిత్ర.సన్నివేశానికి తగ్గట్టుగా మారుతున్న ఆమె హావభావాలను చూసి కాస్త సరదా కలిగింది ఈశ్వర్ కి.
చిత్ర వైపు నుంచి తన దృష్టి ని లాప్టాప్ పై కేంద్రీకరించాడు ఈశ్వర్. తను రాసిన code లో bugs పుట్టగొడుగుల్లా వొస్తూవున్నాయి. తాను రాసిన 312 లైన్ల code లో ఏదైనా bracket కానీ semi colon కానీ miss అయ్యిందేమోనని వెతకసాగాడు ఈశ్వర్. ఎక్కడికీ అతనికి తప్పెక్కడ జరిగిందో తెలియరాలేదు.అతని తల కొద్దిగా పొడవసాగింది.ఒక గ్లాసెడు స్ట్రాంగ్ టీ తాగాలి అనిపించింది అతడికి. కిచెన్ వైపుగా బయలుదేరాడు ఈశ్వర్.దారిలో అతనికి హాల్లో సోఫా మీద కూర్చున్న చిత్ర కనిపించింది. టీ తాగేంత ఇష్టం తనకు ఉంది కానీ టీ పెట్టుకునేంత ఓపిక అతడికి కలగట్లేదు. మనస్సులో చాలా సంశయంతో చిత్ర వైపు చూడసాగాడు. ఒక ముప్పై సెకండ్ల తరవాత చిత్ర అతని వైపు తిరిగింది. ఆమె ముఖం నిండా చిరునవ్వుతో ఈశ్వర్ వైపు చూడసాగింది.
"busy ఆ?" అడిగాడు ఈశ్వర్ మొహమాటం కూడిన స్వరం తో.
నవ్వుతూనే తల అడ్డంగా ఊపింది చిత్ర.
"నీకు టీ తాగే అలవాటుందా?"అన్నాడు ఈశ్వర్, సరాసరి టీ పెట్టమని చిత్ర కి చెప్పటం రాక.
ఒక్క క్షణం ఈశ్వర్ వంక చూసి, ఈశ్వర్ ఉద్దేశాన్ని గ్రహించి,
"చాయ్ పెడ్త ఆగు. ఐదు నిమిషాలంతే." అని సోఫాలోంచి లేచి, వడి వడిగా కిచెన్ వైపు నడవసాగింది చిత్ర.
చిత్ర తనకు చాయ్ పెట్టడంలో చూపిస్తున్న ఉత్సుకతని చూసి, ఒక్క క్షణం తాను అనవసరంగా అడగాడనిపించింది అతనికి. కానీ చిత్ర లో ఉన్న చలాకీతనం కించిత్ ఆకర్షణీయంగా తోచింది అతనికి.
కిచెన్ ద్వారం దాకా వెళ్ళిన చిత్ర, ఈశ్వర్ వైపు తిరిగి,
" ఇదో... చాయ్ ల యాలకుబుడ్డలు ఎయ్యాల్నా?" అడిగింది చిత్ర.
యాలకుబుడ్డలు అంటే యలాచీ అని గ్రహించడానికి ఈశ్వర్ కి పది సెకండ్లు పట్టింది. మనస్సులో యలాచీ వాసనను ఆస్వాదిస్తూ టీ తాగాలని ఉన్నా నిభాయించుకుని,
"నీ ఇష్టం."అన్నాడు ఈశ్వర్.
'ఏందో ఏమో ఈ మనిషి. తాగేది నేనా ఆయ్ననా?!" లోలోన అనుకుంది చిత్ర.
కిచెన్ లోకి వెళ్ళి, తాను ఎనిమిదేళ్ళప్పుడు తన తల్లి అయిన మహాలక్ష్మి దెగ్గర తాను నేర్చుకున్న టీ చేయడం మొదలెట్టింది చిత్ర. తన జీవితం లో ఎప్పుడూ టీ పెట్టేటప్పుడు అంత శ్రద్ధ వహించలేదామె. తన మామయ్య తన టీ ని ఎక్కువగా మెచ్చుకున్న రోజులల్లో తాను టీ చేసిన విధానాన్నంతా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది చిత్ర, ఆయన అమెను మెచ్చుకున్నప్పుడు తాను చక్కెర, టీ పొడి, పాలు వేసిన పాళ్ళను గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ టీ తయారు చేసింది చిత్ర.
'ఏందో ఏమో, మామ నా టీ మస్తుంటది అని ఊకె అన్నడో లేక నిజంగ నచ్చే అన్నడో!' అని మనసులో కాస్త సందేహం కలిగింది ఆమెకు.
తన గదిలో టీ కోసం ఎదురు చూస్తున్న ఈశ్వర్ కి టీ అందించింది చిత్ర.
"థాంక్స్" అంటూ కప్పు ని అందుకున్నాడు ఈశ్వర్.
"నో మెన్ షన్ ." నవ్వుతూ బదులిచ్చింది చిత్ర.
ఒక్క సారి ఈశ్వర్ టీ కప్పుని తన చేతిలో పట్టుకుని, పొగలు కక్కుతున్న టీ వాసనను పీల్చాడు.యలాచీ ల వాసన అతని సమ్మోహపరచ సాగింది. ఒక్కో గుటక తాగసాగాడు. చిత్ర ఈశ్వర్ వైపు ఆసక్తితో చూడసాగింది. కప్పు లోని టీ ఆఖరి చుక్క వరకూ తాగి, కప్పు తీసుకుని కిచెన్ వైపు బయల్దేరబోయాడు ఈశ్వర్.
"అయ్య గిది కంచం ఏం కాదు గద, కప్పే గద! నేను తీస్కపోతలే." అంటూ ఈశ్వర్ తాగిన కప్పుని అందుకుంది చిత్ర.
"tea is nice." అన్నాడు ఈశ్వర్, ఇంకా ఎక్కువ మెచ్చుకొవాలనున్నా నిభాయించుకుంటూ.
"అవ్నా! థాంక్స్." అంది చిత్ర ఉత్సాహంగా.
"actually చాలా చాలా బావుంది."తన మనస్సులో మాటను చెప్పాడు ఈశ్వర్, తనను తాను నిభాయించుకోవడం లొ విఫలం అయి.
" అయితే రోజు పెట్టిస్త నేను టీ. మా మామ గూడ ఎప్పుడు అంటుండె నేను టీ మస్తు పెడ్త అని." అంటూ ఉత్సాహంగా కిచెన్ వైపుగా వెళ్ళింది చిత్ర.
ఒక్క క్షణం చిత్ర పట్ల అపరాధభావం కలిగింది ఈశ్వర్ కి.
తాను టీ పెట్టినప్పుడు వాడిన పదార్థాల నిష్పత్తిని గుర్తు చేస్కుంటూ కప్పుని కడగసాగింది చిత్ర.
"చిత్రా!" అన్న పిలుపు వినిపించింది చిత్రకు.
క్షణం లో గదిలో ఉన్న ఈశ్వర్ ముందు వాలింది చిత్ర.
"office లో నుంచి call వచ్చింది నాకు. meeting ఉంది అంట. i need to go." అన్నాడు ఈశ్వర్.
" ఎప్పుడొస్తవ్ ?" అడిగింది చిత్ర అయత్నకృతంగా.
" ఏమో తెలీదు. " బదులిచ్చాడు ఈశ్వర్.
***
ఈశ్వర్ ఆఫీస్ కి తయారయి బయటకు వెళ్ళబోతున్నాడు.
"ఇదో" పిలిచింది చిత్ర.
తన వైపు తిరిగిన ఈశ్వర్ తో
" మధ్యానం ఏడ తింటవ్ మరి?" అడిగింది చిత్ర.
"office canteen లో తింటా."
"ఓ.. బావుంటదా ఆడ?"
"అంటే... మరీ అంత hygenic గా ఉండదు. కానీ తప్పదుగా."
"ఓ" అంది చిత్ర hygenic అంటే హోటల్ పేరు కాదు, ఇంకేదో అని గుర్తిస్తూ.
గుమ్మం అవతల కాలు పెట్టబోతున్న ఈశ్వర్ తో "ఇదో... నువ్వు ఆఫీసు కి పోయే ముందు రోజు నాకు చెప్పు. అన్నం ఒండి బాక్సు కట్టిస్త."అంది చిత్ర.
సరేనన్నాడు ఈశ్వర్.
"టాటా" అంటూ చేయి ఊపింది చిత్ర ఉత్సాహంగా.
చిరు మందహాసాన్ని చిత్ర వైపు విసిరాడు ఈశ్వర్, ఆమె చూపినంత ఉత్సాహంగా తిరిగి చేయి ఊపడం ఇష్టం లేక.
లిఫ్ట్ లో కిందికి దిగుతున్న అతడి మనస్సులో చిత్ర తన జీవితం లోకి చాలా వేగంగా దూసుకొస్తున్న భావన కలిగింది. చిత్ర ఏం చేసినా కూడా తన మనస్సులో పాతుకుపోయిన తన అమృత ను భర్తీ చేయలేదని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు ఈశ్వర్.
***
తన ఒక్కదాని కోసం అన్నం వండుకుంది చిత్ర. ఈశ్వర్ లేడని కూర లో తనకు కావలసినంత కారం దట్టించింది చిత్ర. కారం, యెల్లిపాయ, అల్లం కలగలిసిన ఆ కూర వాసన పీలిస్తేనే పిడుచగట్టుకుపోయిన ఆమె నాలుక లాలాజలాన్ని ఊర్చ సాగింది. వత్తుగా కలుపుకుని , ఒక్కో ముద్దని లొట్టలు వేసుకుంటూ తినసాగింది చిత్ర.
'ఏందో ఏమో, ఈడికొచ్చినాక నాలుకకి కారం తగ్లక నత్తి నత్తి వొస్తుంది మాట.' అనుకుంది లోలోపల.
కానీ మనస్సులో ఈశ్వర్ తను చేసిన వంటని తినకుండా ఎక్కడో ఆఫీస్ కాంటీన్ లో తినడం కాస్త లోటుగా అనిపించిందామెకి.
భోజనం పూర్తయ్యాక తిరిగి టి.వి ముందు కూర్చుంది చిత్ర. ఆమెకు టి.వి లో వచ్చే కార్యక్రమాలు చాలా విసుగుదల ను కలిగించాయి.
'ఏందో ఏమో, గా మనిషి ఉంటెనన్న జెర లైటింగు కొట్టుకుంటు పొద్దు గడుపుకోవొచ్చు.' అని లోలోన ముసిముసిగా నవ్వుకుంది చిత్ర.
ఊరిలో ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమవడం అలవాటైన చిత్రకు అలా ఏం పని చేయకుండా ఉండటం తన కాళ్ళు, చేతులు బంధింపబడినట్టుగా తొచింది. తమ ఫ్లాట్ పైకప్పు కి అంటుకుని ఉన్న పాదుట్టు చిత్ర దృష్టి లో పడింది.
బూజు కర్రని తన చేతికి అందుకుని పాదుట్టు దులపడం ప్రారంభించింది చిత్ర. అర గంట కేటాయించి బూజు ఆనవాలు లేకుండా దులిపిన ఆమె మనస్సు ఇంకా శాంతించలేదు. తన భర్త ఈశ్వర్ వచ్చే వరకూ ఏదో ఒక పని చేయాలి అని నిర్ణయించుకుంది. పెద్ద పడక గదిలోకి వెళ్ళి తడిబట్ట తో అల్మారాలనూ, కబ్బోర్డులనూ తుడవసాగిందామె.
'ఏందో ఏమో, రోజు గా సోఫా మీద కూసుని, కూసుని నడుముల్ పట్కవొయ్నయ్. గిట్ల తుడుస్తాంటె పయి మొత్తం సమ్మగుంది.' అనుకుంది చిత్ర తన మనస్సులో.
చిత్ర కబ్బోర్డులు తుడవడం అయిపోయాక, ఆఖరుగా ఈశ్వర్ reading table ని తుడవనారంభించింది. ఒక్కో సొరుగుని తెరిచి, అందులో ఉన్న పుస్తకాలను పొడిబట్ట తీసుకుని తుడవసాగింది.
అందులో ఉన్న software పుస్తకాలను చూస్తూ, అవి దేని గురించి ఉన్నాయో అర్థం కాక నిట్టూరుస్తూ తుడవసాగింది. అక్కడ తలపై హ్యాట్ ని ధరించి, చిరునవ్వులు చిందిస్తున్న పిల్ల బొమ్మ cover page గా కలిగిన పుస్తకం ఒకటి చిత్ర ని బాగా ఆకర్షించింది. స్వతహాగా చిన్న పిల్లలంటే చాలా ఇష్టం గల చిత్ర ఆ పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకుని
'నేను జెర నల్లగుంట గాబట్టి మరీ గింత తెల్లగున్న పిల్లలు గారు.' అనుకుంది మనస్సులో.
ఆమెకు తన స్నేహితురాలూ, కొన్ని విషయాల్లో గురువు అయిన వీణ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
'ఏందో ఏమో, సిన్మాలల్ల పెళ్ళైన రోజున రాత్రే గంత అయిపోతయ్, ఈడ నేమో గీ మనిషి ఇట్లుండు!' అనుకుంది మనసులో.
అప్రయత్నంగా ఆ పుస్తకాన్ని తెరిచింది చిత్ర. మొదటి పేజీ లో It is not etiquette to peep into someone's personals అని రాసి ఉంది. చిత్ర చూపు etiquette అన్న పదం దెగ్గరనే ఆగిపోయింది.
కింద
'ఏందిదీ 'ఎత్తికొట్టే'నా? ఏందో ఏమో, గా మనిషి లాగనే ఉన్నయ్ గాయ్న రాశినవి గూడ. గానీ రాత మాత్రం మస్తుంది, ముత్యాల లెక్క. గిట్ల మంచిగ నేను గూడ రాసింటె బడి ల నాకు ఊకె తన్నులు తప్పేవి. ' అనుకుంది మనస్సులో.
మొదటి పేజీ తిప్పి చూసింది అప్రయత్నంగా.
అమృతా! నువ్వు నన్ను వొదిలి వెళ్ళిపోయి మూడు నెలలవుతుంది. చచ్చిపోవాలి అనిపిస్తోంది నాకు.
ఒక్క సారిగా చిత్ర కళ్ళు మసకబారాయి.ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ఆమెకు తెలుస్తోంది. తరవాతి పేజీ చదివేంత ధైర్యం ఆమెకు చాలట్లేదు. ఒక్క సారి తన గుండెల నిండా శ్వాస తీసుకుని, తన ఇష్టదైవమైన కృష్ణుడిని తలుచుకుని, వణికే తన చేతులతో తరవాతి పేజీ ని తెరిచింది.
అమృతా! ఆ cancer ఏదో నాకు వచ్చింటే బావుండు కదా.నీకే ఎందుకు వచ్చింది? అసలు ఎందుకిలా జరిగింది? నువ్వు నా పక్కన ఇప్పుడు ఉంటే ఎంత బావుండేదో కదా.....చాలా చాలా నొప్పిగా ఉంది అమ్మూ నువ్వు లేకపోవడం.
 
చిత్ర తన చీర కొంగుతో కళ్ళని పూర్తిగా పదే పదే తుడుచుకుంటూ ఒక్కో పేజీ ని తిప్పసాగింది.
ఇంకెన్ని రోజులు ఇలా నన్ను పట్టుకునుంటావ్ అమ్మూ నువ్వు? నన్ను ఒదిలేయ్. నాకు కూడా అందరిలా బ్రతకాలి అని ఉంది.... నువ్వు నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయావ్ గా! మరి ఇంకా నన్ను ఎందుకిలా పట్టుకున్నావ్ అమ్మూ!?
--
 
ఒక సారి చనిపోతే ఇంక తిరిగి రారు కదా!? వాళ్ళతో మనం మాట్లాడలేం కదా?! మరి ఎందుకు అమ్మూ చనిపోయావు?! నేను నీకు నచ్చలేదా? ఏమైనా ఇబ్బంది పెట్టానా నేను? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? మరి ఎందుకెళ్ళావు అమ్మూ నా నుంచి దూరంగా ? ఒక్కో క్షణం నువ్వు గుర్తొస్తుంటే ఎంత నొప్పిగా ఉందో నీకు తెలుసా?
--
ఇంకొక్క సారి నా దెగ్గరికి రా అమ్మూ, ఒక్క సారి నీ గొంతు వినాలనుంది, ఒక్క సారి నిన్ను తాకాలనుంది, ఒక్క సారి నీ ఒడిలో పడుకోవాలనుంది, ఒక్క సారి నీకు నచ్చే విధంగా నీ పెదవులను ముద్దాడాలనుంది, ఒక్క సారి నీతో గొడవ పడి నువ్వు అలిగితే చూసి సరదాపడాలనుంది.ఒక్కసారి అమ్మూ, ఒకే ఒక్క సారి...
--
నాకు నిజంగా ఈ పెళ్ళి ఇష్టం లేదు అమ్మూ. నిజంగా ఇష్టం లేదు. కనీసం ఆ అమ్మాయి ఫోటో కూడా చూడాలని లేదు నాకు. కానీ అమ్మ నన్ను చనిపోతాను అని బెదిరిస్తోంది అమ్మూ. నువ్వు కాక ఇంకొకరితో బ్రతుకుని పంచుకోవటం నాకు నచ్చట్లేదు అమ్మూ. భయం వేస్తోంది నాకు. 
 
--
చిత్ర ని చూస్తే తప్పు చేస్తున్నా నన్న feeling కలుగుతోంది అమ్మూ. నా ప్రవర్తన కి ఆమె కారణం కాదని తనకు నేనెలా చెప్పాలి అమ్మూ? తన కళ్ళల్లోకి సూటిగా చూడ లేక పోతున్నా.
 
పుస్తకం యొక్క కవర్ పేజీ లోని పాప బొమ్మపై పడ్డ తన కన్నీళ్ళను తన చీర కొంగుతో తుడిచింది చిత్ర. ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా ఇంతక ముందు ఉన్న తీరుగా ఉంచింది చిత్ర. తన మెదడు మొద్దుబారినట్టు తోచింది చిత్రకి. సోఫా దెగ్గరికి వెళ్ళి టీ.వీ పెట్టుకుంది.ఆమె మనస్సు ఆమె ఆధీనం లో ఉండటం లేదు.భరించలేనంత బరువు ఆమె గుండెల్లో ఉన్నట్టుగా తోచిందామెకు. తన ఇష్టదైవమైన కృష్ణుడిని తలుచుకుంది చిత్ర. అంతకుముందు సూపర్ మార్కెట్ కి వెళ్ళేదారిలో తనకు కనిపించిన కృష్ణుడి గుడి ఆమెకు గుర్తొచ్చింది.తన ఇంటికి తాళం వేసి, లిఫ్ట్ లో కిందికి బయలుదేరింది చిత్ర.
ఆవేశం లో బయలుదేరింది కానీ తాముంటున్న అపార్ట్మెంట్ గేట్ దెగ్గరికి వెళ్ళాక గుడికి దారి పూర్తిగా తనకు తెలియని విషయం గుర్తొచ్చిందామెకు.
ఒక్కసారి దిక్కులు చూసిన ఆమెకు వాచ్ మెన్ భార్య జ్యోతి కనబడింది. ఆమె దెగ్గరికి వెళ్ళి
"జ్యోతీ, నీకు ఈడ కృష్ణుని గుడి ఏడుందో తెల్సా?" అడిగింది.
"హా మేడం" సమాధానమిచ్చింది జ్యోతి.
"ఏమనుకోకపోతే జెర ఆడి వరకు నన్ను తీస్కపోతవా?" అడిగింది చిత్ర.
తనకు ఉన్న పనులు గుర్తొచ్చి, ఒక్క క్షణం తన భర్త వైపు చూసింది జ్యోతి.
"అయ్యో, దానిదేముంది మేడం. పో, మేడం కి దారి చూపించు." అన్నాడు ఓంకార్, జ్యోతికి చిత్రకు తోడుగా వెళ్ళమని సైగ చేస్తూ.
" మీకు ఇబ్బందేం లేదు గద." అంది చిత్ర, జ్యోతి కళ్లల్లోకి సూటిగా చూస్తూ.
"అయ్యో. అలా ఏం లేదు మేడం. రండి వెళ్దాం." అంది జ్యోతి.
ఇద్దరూ గుడి వైపు నడక ప్రారంభించారు. కనిపించినప్పుడల్లా చెలాకీగా కనబడే చిత్ర, ముభావంగా ఉండటాన్ని చూసి కాస్త ఆశ్చర్యపోయింది జ్యోతి. కారణమేంటని తెలుసుకోవాలనున్నా 'పెద్దోళ్ళ గొడవలు మనకెందుకులే 'అని అనుకుంది మనస్సులో.
చిత్ర దారిని జాగ్రత్తగా పరిశీలిస్తూ నడుస్తోంది. వారి మధ్య ఉన్న వికారమైన నిశ్శబ్దానికి తెరదించాలనుకుంది జ్యోతి.
"సార్ ఆఫీస్ కి వెళ్ళారా మేడం?" అడిగింది జ్యోతి.
"హా, ఆయ్నకేందో మీటింగు ఉందంట." బదులిచ్చింది చిత్ర.
మాటల్లో గుడి దెగ్గరికి వెళ్ళారిద్దరూ.
"నాకు జెర లేటయ్తదేమో. నువ్వు ఇంగ పో." అంది చిత్ర.
"పర్లేదు మేడం. నేను ఉంటాను లెండీ."
" లేలే. నాకు ఇంటికి దారి దెల్సిందిలే. రాగల్గుత నేనొక్కదాన్నే. నువ్వు ఇంగ పో. పనుంటది గద నీకైనా." అంది చిత్ర.
"సరే మేడం...ఒక వేళ దారి ఏమైనా తెలియకుంటే వేద అపార్టమెంట్స్ అని ఎవరిని అడిగినా చెప్తారు." అంది జ్యోతి, చిత్ర దెగ్గర సెల్ ఫోన్ లేని విషయాన్ని గమనించి.
"సరే.... ఇబ్బందయినట్టుంది నీకు. ఏమనుకోవాకు." అంది చిత్ర.
"అయ్యో అలాంటిదేం లేదు మేడం. మీ లాగ మాతో అపార్ట్మెంట్ లో మాట్లాడేవాళ్ళే చాలా చాలా తక్కువ." అని తన మనస్సులో మాట ను బయటపెట్టింది జ్యోతి.
"ఇంగో, ఆయ్న ఒస్తే గనుక ఈ తాళం చెవులియ్యి. సరేనా" అంటూ తన చేతిలో నున్న తన అపార్ట్మెంట్ యొక్క తాళం చెవిని జ్యోతి చేతిలో పెట్టింది చిత్ర.
సరేనంటూ తలూపింది జ్యోతి. బయటి నుంచే దేవుడికి దండం పెట్టుకుని అపార్ట్మెంట్ కి బయలుదేరింది జ్యోతి
గర్భగుడిలో ఉన్న కృష్ణుడిని చూస్తూ కూర్చుంది చిత్ర. తను ఇంతకముందు చూసిన దేవాలయాల్లోలా నల్లరాతితో చేయబడక, పాలరాయిలో తెల్లగా ఉన్నాడు కృష్ణుడు. మౌనంగా అతన్ని చూడసాగింది చిత్ర.తన చుట్టుపక్కల ఉన్న అలికిడులేవీ ఆమెకు వినిపించడం లేదు. బాగా భారమైన గుండెతో ఆమె కూర్చున్నదన్న విషయాన్ని గుర్తించాడు ఆ గుడి పూజారి రామాచార్యులు. పిలిచి విషయమేంటో కనుక్కుందామనుకుని, తన నిర్ణయాన్ని విరమించుకున్నాడు.
మనస్సులో కూడా మాట్లాడుకోలేనంతగా నిరీహ లో ఉంది చిత్ర. చివరకు ఒక్క సారి గట్టిగా ఊపిరి పీల్చుకుని, కృష్ణుడి ని చూస్తూ
' చూడయ్యా, ఈశ్వర్ అంటె చానా ఇష్టమయ్యా నాకు. చానా చానా ఇష్టం.ఎందుకో తెల్వదు గానీ ఆ మనిషి చానా ఇష్టమయితుండు నాకు..... నిన్ను ఏం అడగాల్నో నాకు అర్తమవ్తలేదయ్యా... జీవితం లో చానా అలిశిపోయిన అయ్యా నేను. జెర మంచిగ జూడు నన్ను. ' అనుకుంది చిత్ర తన మనస్సులో.
లేచి రాధాకృష్ణులకి ప్రణామం చేసి, రామాచార్యుల దెగ్గరికి వెళ్ళింది. తీర్థాన్ని ఇస్తూ
"ఎక్కడుంటారూ ?" అడిగాడు రామాచార్యులు.
" వేద అపార్ట్మెంట్స్." అంది చిత్ర, ఇందాక జ్యోతి తనకు చెప్పిన మాటని గుర్తుతెచ్చుకుంటూ.
"ఓ... మేము ఆ పక్కనే ఉంటాం.కొత్తగా వచ్చారా మీరు?"అడిగాడు రామాచార్యులు.
"హా అవ్ను.కొత్తగ పెళ్ళయింది నాకు. ఈడ దెగ్గర్ల ఇదే గుడుందని ఒచ్చిన నేను.మా ఊరి కాడ క్రిష్నుడు నల్లగుంటడు.ఈడ తెల్లగుండు. మంచిగుంది గుడి ప్రశాంతంగ." అంది చిత్ర, పూజారి ఇచ్చిన కొబ్బరి ముక్కను నములుతూ, అవసరమైన దానికన్నా ఎక్కువ సమాచారం ఇచ్చే తన అలవాటుకి బద్దురాలై.
"తీరిక ఉన్నప్పుడు వస్తూ ఉండండి." అన్నాడు రామాచార్యులు నవ్వుతూ, తను జోలి పెట్టుకునేందుకు ఒక వ్యక్తి దొరికిందని కాస్త సంతోషిస్తూ.
"మంచిది అయ్గారూ. పొయ్యొస్తింగ." అంటూ అతని ఆశీస్సులు తీస్కుని తన ఇంటికి బయలుదేరింది చిత్ర.
తను వెళ్ళాల్సిన దారిని జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ తన అపార్ట్మెంట్ గేట్ వద్దకు వెళ్ళింది చిత్ర.
అక్కడ ఆమెకు ఓంకార్ ఎదురయ్యాడు.
"ఇబ్బంది ఏమైనా అయ్యిందా మేడం?" అడిగాడు ఓంకార్.
"ఇబ్బందేం గాలె. రూటు మొత్తం మంచిగనే గుర్తుండె." అంది చిత్ర, చిరు మందహాసం చేస్తూ.
"సార్ ఒచ్చారు మేడం. కీస్ ఇచ్చేసా."అన్నాడు ఓంకార్.
సరేనంది చిత్ర.
చిత్ర మనస్సులో ఏదో తెలియని అలజడి కలిగింది. తన భర్త రాసుకున్న ఒక్కో అక్షరం ఆమె కళ్ళముందు కదలాడసాగాయి. చిన్నప్పుడు వాళ్ళ ఊరిలో జరిగిన యోగా శిబిరం లో ఆమె విన్న విషయం గుర్తొచ్చి, శ్వాసను గుండెలనిండా తీస్కుంటూ, వదలసాగింది చిత్ర, కానీ ఎంత ప్రయత్నించినా ఆమె మనస్సులో అలజడి తగ్గట్లేదు. తన ఇంటి కాలింగ్ బెల్ ని కొట్టింది. ఈశ్వర్ ని చూడాలంటే ఒక విధమైన భయం, విముఖత, ప్రేమ కలగలిసిన భావోద్వేగం ఆమె మనస్సుని నింపింది. తనకు పెళ్ళైన కొద్ది రోజుల్లో అంతకుముందు జీవితం లో అంతకముందు తనకు పరిచయం లేని భావోదేగాలెన్నింటినో ఆమె అనుభవిస్తూ ఉంది. కానీ తన భర్త తన పట్ల చూపుతున్న వికర్షణా భావానికి గల కారణం తెలుసుకున్న ఆమెకు ఆ నిజాన్ని భరించటం చాలా కష్టంగా తోచింది. ఒక్కసారిగా తన ధైర్యాన్నంతా కూడగట్టుకుని ద్వారం వైపుగా చూస్తూ ఎదురుచూడసాగింది చిత్ర.
ఈశ్వర్ డోర్ ని తెరిచాడు.
"sorry washroom లో ఉండింటి ఇందాక, door తీయటం late అయింది." అన్నాడు ఈశ్వర్.
"అయ్యా పర్లె, పర్లె." అంది చిత్ర.
చిరు మందహాసాన్ని చేశాడు ఈశ్వర్, తిరిగి మందహాసం చేసిన చిత్ర మనస్సులో ఎన్నో ఆలోచనలు కదలాడసాగాయి. ఈశ్వర్ యొక్క నవ్వు నిజమైనదా, కృత్రిమమైనదా అన్న సందేహం కలిగిందామెకు, ఈశ్వర్ పుస్తకం లో రాసిన ఒక్కో అక్షరం ఆమెకు గుర్తొచ్చి.
" గుడికి పొయ్యింటి." అంది చిత్ర, గంభీరంగా ఉందామనుకున్నా , ఆపుకోలేక.
"యా, వాచ్ మెన్ చెప్పాడు.దారి confuse ఏమైనా అయ్యవా?" అడిగాడు ఈశ్వర్, కించిత్ శ్రద్ద చూపిస్తూ.
"లే. ఏమ్లే . గుర్తుండె దారి బానె." అంది చిత్ర.
"హం." అంటూ తన గదిలోనికి వెళ్ళాడు ఈశ్వర్.
టీవీ పెట్టుకుని, తన దృష్టిని మాత్రం గదిలో ఉన్న ఈశ్వర్ వైపుగా కేంద్రీకరిస్తూ, అతని వైపు ఓరగా చూడసాగింది చిత్ర.
-----------------------------------------సశేషం.---------------------------------------
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 15 users Like k3vv3's post
Like Reply
#46
Super Story. Very Heart Touching!!
Like Reply
#47
Nice super update
Like Reply
#48
అప్డేట్ బాగుంది
Like Reply
#49
అప్డేట్ చాల బాగుంది   thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
#50
మస్తుగుంది

మొదలెట్టాక అస్సలు ఆగలే

దంచి కొట్టినృ
సర్వేజనా సుఖినోభవంతు...
[+] 1 user Likes Mohana69's post
Like Reply
#51
బావుంది బ్రో..అరే నిజ్జంగనే మస్తుగుంది గీ అప్డేట్. ఎందుకు నచ్చిందని ఆలోచిస్తే సగటు మనుషుల్లా కాక కాస్త డిఫరెంటుగా ప్రవర్తించింది చిత్ర. చదువుతోనే అన్నీ రావని చిత్ర క్యరెక్టర్ చూస్తే తెలుస్తోంది. ఈశ్వర్ కూడా కొద్దిగా మారినట్లున్నాడు, ఎక్కువ నవ్వుతున్నాడు ఈ మద్య...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
#52
SUPER GA UNDHI STORY..........READ CHESTU UNTE MANASU EKADIKO POOTHUNDHI..........CONTINUE CHEYAI BRO...AWESOME UPDATE
Like Reply
#53
Nice update s
Like Reply
#54
కథ కథనం చాల బాగున్నాయి... ఎవరకి ఎవరితో ముడి పడుతుందో .. ఒకసారి ముడి పడ్డాక ఇలాగ జరిగితే.. చాల బాగుంది.. 
Like Reply
#55
Nice update
phani kumar c
24*7 in sex trans
Like Reply
#56
ఇది ఆల్రెడీ ప్రతిలిపి అనే సైట్లో వేరే రచయిత రాసిన కథ. వాళ్ళ కథలని వేరే సైట్ల నుంచి కాపీ చేయకండి బ్రదర్
Severe copy right issues can happen.

Original Story: https://telugu.pratilipi.com/series/mudi...0885u92n6u

[Image: tmp.png]
Like Reply
#57
(29-06-2023, 11:30 AM)itskris Wrote: ఇది ఆల్రెడీ ప్రతిలిపి అనే సైట్లో వేరే రచయిత రాసిన కథ. వాళ్ళ కథలని వేరే సైట్ల నుంచి కాపీ చేయకండి బ్రదర్
Severe copy right issues can happen.

Original Story: https://telugu.pratilipi.com/series/mudi...0885u92n6u

[Image: tmp.png]

అరే అవును కదా...     banghead
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#58
(29-06-2023, 11:30 AM)itskris Wrote: ఇది ఆల్రెడీ ప్రతిలిపి అనే సైట్లో వేరే రచయిత రాసిన కథ. వాళ్ళ కథలని వేరే సైట్ల నుంచి కాపీ చేయకండి బ్రదర్
Severe copy right issues can happen.

Original Story: https://telugu.pratilipi.com/series/mudi...0885u92n6u

[Image: tmp.png]

I started this story with that author name only, please see the first part.

Those who didn't see or go there can read here.

I am not claiming any rights or privileges' for posting here, since I liked it; posting here on that author name.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#59
ముడి - 8 వ భాగం
చిత్ర కి రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆమె కళ్ళు మూసుకుంటే ఆమె కళ్ళ ముందు ఈశ్వర్ పుస్తకం లో రాసిన అక్షరాలు కదలాడసాగాయి. మనస్సులో తెలియని అలజడి కలిగిందామెకు.ఎన్నో ప్రశ్నలు ఆమె మస్తిష్కాన్ని తొలవసాగాయి. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర పట్టలేదు.చిన్నప్పటి నుంచీ తన చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరికీ తెలియకుండా తను రోదించిన క్షణాలన్నీ తన ముందు కదలాడసాగాయి . ఎంత ప్రయత్నించినా ఆమె ఆలోచనల ప్రవాహం ఆగలేదు.చనిపోయిన అమృత తన కన్నా చదువుకున్నదీ, తన కన్నా తెలివైనదీ, తన కన్నా అందమైనదీ కావొచ్చని తనకు తానే నిర్ధారించుకుంది చిత్ర. చిన్నప్పుడు తన తల్లి తనను ఒంటరి ని చేసినట్టే, తన భర్త కూడా తనని ఒంటరి ని చేస్తాడేమో నన్న భయం చిత్రని ఆవహించింది.ఒక్కసారి ఈశ్వర్ ని గట్టిగా హత్తుకుని,
'ఇంగో గామె సచ్చిపొయింది.ఇంగ రాదింగ. నువ్వంటె నాకు చానా చానా ఇష్టం. నీకు గామె లేని లోటు తెల్వకుండ నిన్ను సూస్కుంట.నన్ను గిట్ల దూరం పెట్టకు నువ్వు.' అని అనాలనిపించిందామెకు.
ఆలోచనల సుడిలో పడి అలసిన చిత్రకు తెల్లవారు జామున మూడు గంటలకు నిద్ర పట్టింది. పార్క్ కి వెళ్ళి వ్యాయామం చేసి ఇంటికి తిరిగొచ్చిన ఈశ్వర్ అలికిడికి నిద్ర లేచింది చిత్ర. షూస్ విప్పుతూ, రుమాలతో తన నుదిటిని తుడుచుకుంటున్న ఈశ్వర్ తో
" ఇదో... టిఫిన్ పుల్గం జేస్త. సరేనా?" అంది చిత్ర.
తనకు అలవాటైనట్టుగా "హం" అని అందామనుకుని, విరమించుకుని, "అంటే ఏంటి?" అడిగాడు ఈశ్వర్, చిత్ర చెప్పిన వంటకం ఏంటో అర్థం కాక.
"పుల్గం.. తెల్వదా? అన్నం, పెసర్ పప్పు, మిర్యాలూ ఏసి జేస్తరు. వెంకటేశ్వర సామి గుళ్ళల్ల శనివారం, శనివారం పెడ్తరు జూడు . అది." అంది చిత్ర, వాక్యం పూర్తయ్యాక , తన భర్త గుడికి వెళ్ళడన్న విషయాన్ని గ్రహిస్తూ.
" అన్నం అంటే carbs.breakfast కి అన్ని carbs మంచివి కావు.....but పర్లేదులే weekly once తినొచ్చు.carbs give lots of energy " అన్నాడు ఈశ్వర్.
'ఏందో ఏమో, గీ మనిషి నా తోని మంచిగ మాట్లాడినా అర్తం గాడు, మంచిగ మాట్లాడకున్నా అర్తం గాడు.' అనుకుంది చిత్ర, తన మనస్సులో.
"మళ్ళైతె ఇప్పుడు జేద్దునా ఒద్దా ?" అడిగింది చిత్ర.
"అయ్యో, నేను చెయ్యమనే చెప్తొన్నా." అన్నాడు ఈశ్వర్ , చిత్ర ప్రశ్నకి కాస్త ఆశ్చర్యపోతూ.
"సరే అయితె."అంది చిత్ర, తన అగ్న్యానానికి తనే నవ్వుతూ.
ప్రతిగా చిరునవ్వు ఒకటి విసిరాడు ఈశ్వర్.
చిత్రకు ఈశ్వర్ యొక్క నవ్వు చాలా ఆకర్షణీయంగా తోచినా, అది తన పట్ల ఆత్మీయత తో వచ్చిన నవ్వా లేక జాలి వల్ల వచ్చిన నవ్వా ఆమెకు అర్థం కాలేదు. అసలు ఆ నవ్వు సహజమైనదో లేక కృత్రిమమైనదో నన్న సందేహం ఆమెకు కలగసాగింది. ఒక్క క్షణం తనకు అమృత గురించి తెలియకపోయింటే బావుండు ననిపించింది!
"ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావ్ ?" అడిగాడు ఈశ్వర్.
"ఏమ్లే, ఏమ్లే"
"వీలైతే కాస్త త్వరగా చేస్తావా? కాస్త ఆకలిగా ఉంది." అన్నాడు ఈశ్వర్.
"అయ్య! ఇంగో ఇరవై నిమిషాల్ల అవ్తదంతే." అంటూ వడివడిగా కిచెన్ వైపు నడిచింది చిత్ర.
తన గదిలోకి వెళ్ళి లాప్టాప్ ని ముందు ఉంచుకున్న ఈశ్వర్ కి facebook నుండి ఒక pop-up notification వచ్చింది తన స్నేహితుడు ఆదర్శ్ birthday అంటూ.
వెంటనే తన సెల్ ఫోన్ తీసుకుని తన స్నేహితుడి ఫోన్ కి కలిపాడు ఈశ్వర్.
"మామా , happy birthday రా. ఎలా ఉన్నావ్ ? " అన్నాడు ఈశ్వర్ ఉత్సాహంగా.
కిచెన్ లో ఉన్న చిత్రకి ఇవన్నీ వినబడుతూ ఉన్నాయి. తన భర్త స్వరం లో మొట్టమొదటి సారి కాస్త ఉత్సాహం కనబడిందామెకు.
'ఏందో ఏమో, ఈ మనిషి నా తోని గూడ గిట్ల మంచిగ మాట్లాడొచ్చుగద ఎప్పుడు.' అనుకుంది మనసులో.
"హా.... అయ్యింది రా. పిలవలేదు friends ఎవ్వరినీ. actually నీ తో చాలా మాట్లాడాలి మామా. evening office అయ్యక call చేయి రా నాకు. bye రా. missing you మామా." అంటూ ఫోన్ పెట్టేశాడు ఈశ్వర్.
తన భర్త ప్రస్తావించింది తమ పెళ్ళి గురించేనని గ్రహించింది చిత్ర. ఒక్క క్షణం పెళ్ళప్పటి ఈశ్వర్ గుర్తొచ్చాడు చిత్రకు. తెలుపు, పసుపు మధ్య గల మేని ఛాయతో, నుదిటి పై బాసికం తో, బుగ్గ పై దిష్టి చుక్క తో, తన దృడమైన శరీరాన్ని కప్పే పట్టు వస్త్రాలల్లో ఉన్న ఈశ్వర్ ని చూసి తన స్నేహితురాలూ, కొన్ని విషయాల్లో తనకు గురువు అయిన వీణ తనకు చెప్పిన ఎన్నో సంగతులు గుర్తు తెచ్చుకుని తాను సిగ్గుపడ్డ వైనం గుర్తొచ్చింది చిత్రకు. అప్పుడు అతని మోము లో ఉన్న నిర్లిప్తత వెనక గల కారణం ఇప్పుడు తెలుసామెకు. ఒక్క క్షణం ఆమె మనస్సు కలుక్కుమంది.

గిన్నెలోంచి ఆవిరి తన ముఖానికి తాకుతూ ఉండటం తో తన ఇంద్రియ గ్న్యానం లోకి తిరిగి వచ్చింది చిత్ర.
"ఇదో... టిఫిన్ అయ్యింది జూడు." అంది చిత్ర, డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి, ఈశ్వర్ కి వినబడే విధంగా.
ఈశ్వర్ ఒక్క ముద్ద తిని, బావుంది అన్నాక , చిత్ర మనస్సు కాస్త కుదుటపడింది.
"దీనికి చెట్నీ గూడ ఉంటది. మస్తుంటది అది జేస్తే. నువ్వు దబ్బున చేయమన్నవని ఇంగ చెట్నీ చెయ్యలే ఈసారి." అంది చిత్ర.
ఒక చిరునవ్వు విసిరాడు ఈశ్వర్.
"నువ్వు నవ్వితే మస్తుంటవ్ !" అనబోయి, మరొకసారి విరమించుకుంది చిత్ర.
ఈశ్వర్ ని చూసినప్పుడల్లా అతను పుస్తకం లో రాసుకున్న మాటలే గుర్తురాసాగాయి చిత్ర కి.
'సూడనీకె మస్తు అమాయకుని తీర్న కనిపిస్తడు, గాని లోపల గింతగనం ఆలోచిస్తడా?" అనుకుంది చిత్ర మనస్సులో.
నిజానికి చిత్ర మనస్సులో ఒక మూల చనిపోయిన వ్యక్తి పట్ల తన భర్తకి ఉన్న నిబద్దత ని చూసి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది!
"నువ్వు కూడా తినొచ్చుగా."అన్నాడు ఈశ్వర్.
"ఇద్దరం తింటె నీకు ఒడ్డిచ్చెటప్పుడు నీకు నాది ఎంగిలైతది. నాకట్ల మంచిగనిపియ్యదు." అంది చిత్ర.
ఈశ్వర్ కి ఆ సంభాషణని కొనసాగించాలనిపించలేదు.
"ఇంకొంచం ఏస్కో." అని వడ్డించబోయింది చిత్ర.
"చాలు , ఇప్పటికే calorie intake ఎక్కువైంది." అన్నాడు ఈశ్వర్.
'చాలు ' అన్న మాటని గమనించి, అతని కంచం లో ఇంకాస్త వడ్డించే ప్రయత్నాన్ని మానుకుంది చిత్ర. ఈశ్వర్ తన కంచాన్ని కడగటానికి సింక్ దెగ్గరికి తీస్కెళ్ళాడు.
చిత్ర కు ఈశ్వర్ తో ఏదో ఒక విషయమై ఇంకొంతసేపు మాట్లాడాలనిపించింది.'సాకు ' కోసం దిక్కులు చూడసాగిన ఆమెకు వాషింగ్ మిషన్ కనిపించింది.
"ఇదో... ఊరికెళ్ళి ఈడికి ఒచ్చినాంక బట్టలన్ని ఇడిశినవైనయ్. ఇప్పుడు నేను కట్టుకున్న చీరనే ఉందింగ.జెర ఆ వాషింగ్మిషన్ ఎట్ల వాడాల్నో సూపిస్తివంటే నీవి, నావి బట్టలు ఉతికేస్త. నీవి గూడ చానా బట్టలు పడ్నట్టున్నయ్ ఇడిశినవి." అంది చిత్ర.
"ఓకే." అంటూ వాషింగ్ మిషన్ దెగ్గరికి నడిచాడు ఈశ్వర్.
" అంటే... ఊర్ల మాకు రాజమ్మ ఒస్తది.. గదే మా సాకలామె. ఇంగ గామె ఉత్కుతది గాబట్టి సక్కగ ఉత్కనీకి నేర్చుకొలె నేను." అంది చిత్ర.
"పర్లేదు లే. అదే పనికోసమే కదా వాషింగ్ మెషీన్ కొనుకున్నది." అన్నాడు ఈశ్వర్.
చిత్ర, ఈశ్వర్ లు ఒకరికి ఒకరు చిరునవ్వులు ఇచ్చిపుచ్చుకున్నారు.
" గిది ఎంత రేటు పడ్డది?" కుతూహలంగా అడిగింది చిత్ర.
"rough గా 25k అనుకుంటా." బదులిచ్చాడు ఈశ్వర్.
"ఓ.."అంటూ ఒక్క క్షణం తలూపి " అంటే ఎంత?" అడిగింది చిత్ర.
"పాతిక వేలు." బదులిచ్చాడు ఈశ్వర్ , కొద్దిగా నిట్టూరుస్తూ.
సమాధానం చెప్పి, వాషింగ్ మెషీన్ వైపు దృష్టి కేంద్రీకరించిన ఈశ్వర్ కి, పది సెకెండ్లు దాటినా చిత్ర నుండి ఉలుకూ పలుకూ లేకపోవడం తో ఆమె వైపు చూశాడు.చిత్ర ముఖం లో ఆశ్చర్యపు రేఖను చూసి ఈశ్వర్ ఒక్క క్షణం కంగారు పడ్డాడు.
" ఇరవై అయిదు వేలా? బట్టలుతకనీకి ? మళ్ళ డిటర్జెంటు ఏస్తనే ఉంటం గద! ఎంత దారుణమసలు!గా రాజమ్మకి మేము నెలకు రెండు నూర్లు ఇస్తుంటిమంతే." అంది చిత్ర.
ఈశ్వర్ కి అంతకు మునుపు హోటల్ లో టిఫిన్ చేసాక , తాను బిల్ కట్టేటప్పుడు చిత్ర చూపిన ఆందొళన గుర్తొచ్చింది. ఒక్క క్షణం చిత్ర అర్థం చేసుకుంటుందేమోనన్న చిరు ఆశతో
" చూడు చిత్రా, ఇప్పుడు ఆ రాజమ్మని హైదరాబాద్ కి వచ్చి బట్టలు ఉతికి వెళ్ళమంటే బావుండదు కదా, అందుకే ఇక్కడ వాషింగ్ మషీన్ కొన్నా." అన్నాడు ఈశ్వర్.
తన భర్త యొక్క హాస్య చతురతకి తనకు అలవాటైన రీతిలో పుసుక్కున నవ్వింది చిత్ర.
ఈశ్వర్ వాషింగ్ మషీన్ వాడకాన్ని విపులంగా వివరించాడు చిత్ర కి. ఆమె కళ్ళు రెండు పెద్దవిగా చేసి విన్న వైనం కాస్త సరదాగా అనిపించింది ఈశ్వర్ కి.
"ఇప్పుడు ఓకే నా?try చేసి చూస్తావా?" అడిగాడు ఈశ్వర్.
నవ్వుతూ, ఉత్సాహంగా తలూపింది చిత్ర.
"wash room లో బట్టలు ఉన్నట్టున్నాయి. తెస్తా ఆగు." అని స్నానాల గదివైపు వెళ్ళబోయాడు ఈశ్వర్.
"షీ.షీ నువ్వు బోకు. నేను బోత." అంటూ వెళ్ళి వాళ్ళిద్దరి విడిచిన బట్టలు కొన్ని తెచ్చింది చిత్ర.
"అదేంటి? " అడిగాడు ఈశ్వర్.
"ఇంగో... గట్ల నేనిడిశిన బట్టలు నువ్వు ముట్టుకుంటె మంచిగుండదు." అంది చిత్ర, మిషన్ మూత తెరిచి, అందులో కొన్ని బట్టలు వేస్తూ.
ఈశ్వర్ కి ఆ వాషింగ్ మషీన్ పనితీరు గూర్చి విశదీకరించే అంకాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలనిపించింది.
" ఇప్పుడు on చేయి. around 45 minutes తరవాత ఒక music ఒస్తుంది.అప్పుడు dry button ని press చేయి. బట్టలు చాలా వరకు ఆరిపోతాయి. తరువాత hang చేయాలి.ఫాన్ గాలికి ఒక one hour ఆరేస్తే సరిపోతుంది.winter కదా, summer ఇతే ఆరేయనవసరం కూడా ఉండదు. ఓకే నా? doubts ఏమైనా ఉన్నాయా? " అన్నాడు ఈశ్వర్.
లేదన్నట్టుగా నవ్వుతూ తలూపింది చిత్ర.
"మరి నేనిక నా work చేస్కోవడానికి వెళ్దునా?" అడిగాడు ఈశ్వర్.
"అయ్యో, అయ్యో పో పో." అంది చిత్ర.
"హం" అంటూ లాప్టాప్ వైపుగా వెళ్తున్న ఈశ్వర్ ని "ఇదో" అంటూ పిలిచింది చిత్ర. తన వైపు తిరిగిన తన భర్త తో
"డిస్టర్బ్ ఏం చెయ్యలే గదా?" అంది చిత్ర.
"హేయ్... అలా ఏం లేదు." అని చిత్ర వైపు తిరిగి చెప్పి, గది లోపలికి బయలుదేరాడు ఈశ్వర్.
చిత్ర కి ఆ సమాధానం బాగా నచ్చింది. నిజానికి ఆ సమాధానం కోసమే ఆమె అతన్ని కావాలనే అడిగింది అలా!
ప్లేట్ లో పుల్గం వడ్డించుకుని, సోఫా మీద కూర్చుని, టి.వి చూస్తూ, దృష్టి మాత్రం ఈశ్వర్ వైపు సారించి,అప్పుడప్పుడు శబ్దాలు చేస్తున్న వాషింగ్ మిషన్ వైపు చూస్తూ, తినసాగింది చిత్ర.
***
“ఏంటి అలా ఉన్నావ్?” అన్నాడు ఈశ్వర్.
అంత త్వరగా తనకు ఒంట్లో బాగాలేదని తన భర్త ఎలా గ్రహించాడో తెలియక కాస్త ఆశ్చర్యపోయింది చిత్ర.
“హా, కొంచం పైబాలే.”
“ఏ, ఏమైంది?” చిత్ర వైపు సూటిగా చూస్తూ అడిగాడు ఈశ్వర్
.“ఏం లేదు. సలికాలం గదా! కొంచం నెత్తి నొస్తుందంతే. “
“అవునా?! ఎలా ఉంది ఇప్పుడు ?” అడిగాడు ఈశ్వర్ ఆసక్తిగా.
“హా! కొంచం నొప్పంతె .”
“ లేదు.. నొప్పి ఒక side ఉందా? రెండు sides ఉందా?” పరిశీలన గా అడిగాడు ఈశ్వర్.
“అంటే?!” అర్థం కాక అడిగింది చిత్ర.
“ అదే తలకు ఒకే వైపు నొప్పి ఉందా? లేక total తలంతా నొప్పుందా?” కుతూహలం తో అడిగాడు ఈశ్వర్.
“ మరీ అంతేంలేదు నొప్పి . సలికాలమన్నాక ఇయన్ని వొస్తుంటయి గద. పొద్దట్కల్ల పొతద్లే. “ అంటూ ఈశ్వర్ ముందు వున్న కంచం లో అన్నం వడ్డించింది చిత్ర.
“ఎప్పుడు తగ్గుతుందో చెప్పడానికి నువ్వేమైనా డాక్టర్ వా? అడిగిందానికి సమాధానం చెప్పు.”
“ మరి నువ్వేమైనా డాక్టర్ వా?” అని నాలుక్కర్చుకుంది చిత్ర.
మారు మాట్లాడకుండా మౌనంగా చిత్ర తనకు వడ్డించిన అన్నం తిని, చిత్ర వైపు చూస్తూ“తిన్నావా?” అన్నాడు ఈశ్వర్.
“లే, నీదైపోయ్నాక తిందమని.”
“ఐతే తినకు.”
అర్థం కానట్టుగా ముఖం పెట్టింది చిత్ర.
Wash basin దగ్గరకు వెళ్ళి చేతులు కడుగుతూ “ నీకు వచ్చిన fever ఎలాంటిదో మనకు తెలీదు. Viral fever వచ్చినప్పుడు digestive system సరిగా పనిచేయదు. So అప్పుడు easy గా digest అవ్వని food తీస్కుంటే jaundice కూడా వస్తుంది. “ అన్నాడు ఈశ్వర్.
పుసుక్కున నవ్వింది చిత్ర.
చిత్ర వంక చూస్తూ “ నవ్వెందుకు వస్తోంది నీకు? నేనేమైనా joke చెప్పానా?” అన్నాడు ఈశ్వర్ కాస్త గద్దింపు కలిగిన స్వరంతో.
కాస్త ఆశ్చర్యపోయింది చిత్ర. ఎప్పుడూ లేనిది తనను అలా గద్దించేసరికి వింతగా తోచింది చిత్రకి.
“ నా cell phone ఇవ్వు. “ అంటూ dining table పై ఉన్న తన cellphone వైపు చూపాడు ఈశ్వర్.
చిత్ర ఈశ్వర్ చేతిలో cellphone పెట్టి “ఏం చేస్తాడబ్బా?!” అన్నట్టుగా చూస్తోంది ఈశ్వర్ వైపు.
“ hello. This is Eeswar. ...yeah, I am fine … actually my wife.....” ‘మై వైఫ్’ అనేటప్పుడు ఈశ్వర్ కు తన స్వరం లో తనకే కొంత తిరస్కరణ భావం కనిపించింది.
'మై వైఫ్’ అన్న మాట తర్వాత రెండు క్షణాల పాటు అప్రయత్నపూర్వకమైన మౌనం అతని స్వరాన్ని ఆవహించింది. తనకు తెలియకుండానే అతని కళ్ళు చిత్ర వైపు కు తిరిగాయి. లోలోపల గాయమైనట్టుగా చిత్ర ముఖం లో ప్రస్పుటంగా కనిపించింది ఈశ్వర్ కి.
ఒక్క క్షణం అతని మనస్సు ను అపరాధ భావం ముంచెత్తింది. “హలో.. ఈశ్వర్ గారు?!” అని అవతలనుండి వినిపించింది అతడికి.
“హా.. హలో, హలో ..my wife Chitra is a bit ill. Dr.సురేష్ రెడ్డి గారి appointment కోసం phone చేస్తున్నా.” అన్నాడు ఈశ్వర్.
“ thank you so much . We will be there in 15 minutes “ అన్నాడు ఈశ్వర్ అవతల వ్యక్తి appointment ని నిర్దారించాక.
***
డాక్టర్ ఉన్న రూం లోకి వెళ్ళారు ఈశ్వర్, చిత్ర లు.
తనకు తెలిసిన వాడే కావడం తో ఈశ్వర్ ని చూసి ఒక మందహాసాన్ని చేశాడు డాక్టర్.
ఈశ్వర్ ప్రతిగా నవ్వుతూ ,చిత్ర ని చూపిస్తూ "తనకు ఒంట్లో బాలేదట.head ache అట. అందుకే తీస్కొచ్చాను." అన్నాడు ఈశ్వర్.
చిత్ర వైపు చూస్తూ" ఎన్ని రోజుల నుండి నొప్పి ఉంది?" అడిగాడు డాక్టర్.
" గంట నుంచి." చెప్పింది చిత్ర.
అంత 'సీరియస్ జోక్' కి బాగా నవ్వుదామనిపించింది డాక్టర్ కి. కానీ ఈశ్వర్ ముఖం లో ఏలాంటి నవ్వు తాలూకు లక్షణాలు కనిపించక పోయేసరికి నవ్వాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. చిత్ర నాడి పట్టుకు చూసి ఆమెకు కొద్దిగా జ్వరం ఉన్నట్టు గ్రహించి,
" 4 డేస్ రెండు పూటలా ఈ టాబ్లెట్స్ వాడండి. తరవాత కూడా జ్వరం తగ్గకుంటే టెస్ట్ చేద్దాం." అన్నాడు డాక్టర్ పేపర్ పైన రాస్తూ.
" ఎంతకైనా మంచిది, లిక్విడ్ డైట్ తీస్కోండి. చల్ల గాలికి తిరగకండి. ఎక్కువ strain అవ్వకుండా రెస్ట్ తీస్కోండి." అన్నాడు డాక్టర్.
"థాంక్యూ డాక్టర్. ఏం డైట్ తీస్కోవాలి? ఫ్రూట్ జూసెస్ తీస్కోవొచ్చా? ఏ ఏ జూసెస్ తీస్కోవాలి? అన్నం తినొచ్చా? చపాతి తినొచ్చా? మజ్జిగ తీస్కోవచ్చా? లేక బ్రెడ్ తినాలా? ఏదైనా వైరల్ ఫివర్ వచ్చే chance ఉందా? మరీ danger ఏం లేదు కదా ?!"A.K 47 తుపాకీ తూటాల్లా ప్రశ్నలను సంధించాడు ఈశ్వర్.
తన ఊరు పెంట్లవెల్లి లో ఉన్నప్పుడు జ్వరం వస్తే జహంగీర్ మెడికల్ షాప్ నడిపే 'చదువుకోని డాక్టర్ ' జహంగీర్ ని , తన భర్త ఈశ్వర్ నీ పోల్చి చూసుకుని వస్తున్న నవ్వుని ఆపుకుంది చిత్ర, ఇంతక మునుపు ఈశ్వర్ తనను గద్దించిన విషయం గుర్తుకు వచ్చి.
ఈశ్వర్ 'సంగతి ' తెలిసిన డాక్టర్ మాత్రం "ఏం పరవాలేదు. కారం లేకుండా,easy గా digest అయ్యే ఫుడ్ ఏదైనా తీస్కోవొచ్చు."అన్నాడు శాంతంగా.
"చాలా థాంక్స్ " అని ఐదు వందల నోటు ఫీజు గా ఆయన చేతుల్లో పెట్టాడు ఈశ్వర్. ఇంకా పూర్తిగా రాని జ్వరం కోసం అప్పుడే ఐదు వందలు ఖర్చు కావటాన్ని చూసి, నిజంగానే తనకు జ్వరం వచ్చేలా ఉంది అని అనుకుంది చిత్ర.
హాస్పిటల్ లోని మెడికల్ షాప్ లో మందులు కొనుక్కుని వస్తుండగా ఈశ్వర్ కి ఒక సన్నివేషం ఎదురైంది. ఒక పాతిక సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయి విగత జీవియై, స్ట్రెచర్ పైన తీస్కెళ్ళబడుతూ వుంది. ఆమె చుట్టూ ఆమెకు అయిన వాళ్ళు మిన్నంటేలా రోదిస్తున్నారు. ఈశ్వర్ గొంతులోని తడి ఆరింది. ఒక్క సారిగా అతని కళ్ళముందు కాలం మూడేళ్ళ వెనక్కి వెళ్ళింది.
"సర్ prescription ఇవ్వండి ." అన్న మాటలు విని 'వర్తమానం' లోకి వచ్చాడు ఈశ్వర్.
"yeah yeah sorry " అంటూ మెడికల్ షాప్ అబ్బాయి చేతిలో prescription పెట్టాడు ఈశ్వర్. అతని కళ్ళు చెమర్చటం చేత ఈశ్వర్ చూపు మసకగా మారింది. గత మూడున్నరేళ్ళుగా నీటి తో నిండటం అతని కళ్ళకు అలవాటుగా మారింది.
అమృత ఆరోగ్యం విషయం లో తాను శ్రద్ద వహించి ఉన్నట్టయితే ఆమె బ్రతికుండేదేమో నన్న భావన ఈశ్వర్ ని గత మూడేళ్ళుగా హింసించ సాగింది. అనారోగ్యం అంటే ఒక విధమైన భయాన్ని ఏర్పరుచుకున్నాడు ఈశ్వర్!
* * *
ఈశ్వర్ కళ్ళు ఎర్రబడటం గమనించి,ఏదైనా మాట్లాడాలని మనస్సులో ఉన్నా, విరమించుకుంది చిత్ర. బహుశా అమృత తన భర్తకు గుర్తొచ్చిందేమోనన్న అనుమానం కలిగిందామెకు. కార్ స్టీరింగ్ పై ఉన్న తన భర్త చేతి మీద చేతి ఉంచి
" అమృత ని తల్సుకోని అట్ల ఊకె బాధపడకు. మనసుల ఎట్లనో అనిపిస్తది నాకు నువ్వట్ల బాధపడ్తుంటే." అని చెప్పాలి అనిపించింది చిత్రకు.
మధ్యలో ఒక పళ్ళ దుకాణం దగ్గర కారు ఆపాడు ఈశ్వర్. చిత్ర ని కారు లోనే కూర్చోమని చెప్పి, ఐదారు రకాల పళ్ళు కొని తెచ్చాడు.
'ఇవన్ని నేను తినాలంటే నెల పడ్తదేమో !' లోలోన అనుకుంది చిత్ర.
---------------సశేషం.---------------------
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 11 users Like k3vv3's post
Like Reply
#60
అప్డేట్ చాల బాగుంది thanks
Like Reply




Users browsing this thread: 3 Guest(s)