Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముడి
#21
Update baagundi
[+] 1 user Likes ramd420's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
అప్డేట్ చాల బాగుంది thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
#23
ముడి -4 వ భాగం
తన గదిలో లాప్ టాప్ ముందు కూర్చుని దువ్వబడిన తన జుట్టుని అప్రయత్నంగా చెరిపి ,తిరిగి సరిచేసుకుంటూ ఏకాగ్రత తో తన పని చేస్కుంటున్నాడు ఈశ్వర్.' టంగ్ టంగ్' అని కాలింగ్ బెల్ శబ్దం అతనికి వినిపించింది. ఎవరో చూద్దామని లేవబోతున్న అతడికి హాల్లో ఉన్న చిత్ర తలుపు తెరవడానికి వెళ్ళడం కనిపించి తన పని ని కొనసాగించాడు. రెండు నిమిషాల తరువాత చిత్ర అతనున్న గది దగ్గరికి వచ్చింది. చిత్ర కాళ్ళ పట్టీల శబ్దానికి ఈశ్వర్ తన తల ఎత్తి చిత్ర వంక చూసాడు.
"అదేందో అమెజాను కెళ్ళి ఒచ్చిర్రంట. ఏందో బుక్ అంట చేశిర్రంట గద" అంది చిత్ర.
"హా , యా, వస్తున్న." అంటూ లాప్టాప్ ని మూసి, దర్వాజ్ దగ్గరికి వెళ్ళాడు ఈశ్వర్. విషయమేంటా అని ఉత్సుకత తో చిత్ర అతన్ని అనుసరించింది.
" సార్, మీరేనా ఈశ్వర్?" అడిగాడు తలుపు బయట ఉన్న వ్యక్తి.
"హా.. ఆర్డర్ రేపొస్తుందనుకున్నా." బదులిచ్చాడు ఈశ్వర్.
" లేదు సార్, మీరు బుక్ చేసిన model stock లో ఉంది అందుకే తెచ్చాము.actually మీకు చాలా సార్లు కాల్ చేసాం. మీరు లిఫ్ట్ చెయ్యలేదు." అన్నాడావ్యక్తి ఫిర్యాదు గా.
" హో సారీ, సారీ. ఫోన్ నిన్న సైలంట్ లో పెట్టా. మర్చిపోయా." బదులిచ్చాడు ఈశ్వర్ సంజాయిషీ ఇచ్చినట్టుగా.
చిత్రకు తన భర్త బయటి వ్యక్తికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావటం కాస్త నచ్చలేదు.
అవతలి వ్యక్తి ఫోన్ తీసి " హా అడ్రస్ ఇదే, పైకి తీస్కొచ్చేయ్." అన్నాడు.
చిత్రకు ఏదో వస్తువు తీస్కొస్తున్నారని తెలుసు కానీ అదేంటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.
4 నిమిషాల తరువాత లిఫ్ట్ ద్వారా ఒక ఫోల్డింగ్ మంచాన్ని తీస్కొచ్చాడు ఒక అబ్బాయి. ఈశ్వర్ ఆ మంచాన్ని లోపల హాల్లో పెట్టమని ఆ అబ్బాయి తో చెప్పాడు.అతడు అలాగే చేసి, ఈశ్వర్ దగ్గర సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు.
చిత్రకు ఆ మంచం ఎందుకో మెల్లిగా అర్థమౌతూ వుంది. ఈశ్వర్ తన కండలు తిరిగిన చేతి తో చాలా తేలికగా ఆ మంచాన్ని ఎత్తుకెళ్ళి మరో బెడ్ రూం లో పరిచాడు. బాధ, కోపం కలగలిసిన భావోద్వేగం ఆమెను ఆవహించింది.ఈశ్వర్ తిరిగి తన లాప్టాప్ దెగ్గరికి వెళ్ళిపోయాడు.
చిత్ర తనను తాను నిభాయించుకోవటానికి తన ఏకైక కాలక్షేపమైన 'గోడ టి.వీ ' ఆన్ చేసింది . 1253 వ చానల్ జెమినీ టి.వి అని గుర్తు తెచ్చుకుని పెట్టుకుంది. తెర మీద మహేష్ బాబు కనబడేసరికి కాస్త ఊరట లభించిందామెకు. " నువ్వంటే నాకు రోకు, మోజు " అని మహేష్ బాబు సాయాజీ షిండే తో అంటున్నాడు. అప్రయత్నంగా ఒక్క సారి కిసుక్కున నవ్వింది చిత్ర గట్టిగా. విషయం అర్థం కాక ఈశ్వర్ హాల్లోకి వచ్చాడు, అక్కడ సంపూర్ణంగా నిమగ్నమై ఉన్న చిత్ర ను చూసి కాస్త ఆశ్చర్యపోయి ఫ్రిడ్జ్ లోనుంచి నీళ్ళ బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాడు.
****
తన చిటికెన వేలిని పైకి లేపాడు మహేష్ బాబు, పక్కన thank you puri jagannadh అని టైటిల్ పడింది. సినిమా ఐపోవడం తో చిత్రకు ఏం చేయాలో అర్థం కాలేదు. అన్ని చానళ్ళని ఒక్కొక్కటిగా మారుస్తూ వుంది. హిందీ చానళ్ళు రావడం మొదలయ్యాయి. కైట్స్ సినిమాలో హృతిక్ రోషన్ బార్బరా మోరా పెదవులు గట్టిగా పెనవేస్కున్న సన్నివేశం వస్తూ వుంది. తన స్నేహితురాలూ, కొన్ని విషయాల్లో గురువు అయిన వీణ తనతో పంచుకున్న 'సంగతులు ' చిత్రకు గుర్తుకు రావటం మొదలయ్యాయి. ఓరగా ఒక సారి ఈశ్వర్ వైపు చూసింది. అక్కడ ఈశ్వర్ తను పనిచేయకపోతే ప్రపంచం మొత్తం తలకిందులవుతుందేమో నన్నట్టుగా లాప్టాప్ లో తన పనిలో నిమగ్నమయి ఉన్నాడు. 'ఏందో ఈ మనిషి ' అని లోలోన అనుకుని ఒక్కసారి గాఢంగా నిట్టూర్చింది. ఈశ్వర్ ఆమెకు ముందటి రోజు కంటే ఎక్కువ అందంగా కనబడుతున్నాడు. ఉదయాన్నే షేవ్ చేస్కున్నందుకు అతని చెంపలు నున్నగా కనబడుతున్నాయి. కిటికీ లోంచి పడ్డ వెలుతురు అతని చెంపలపై పడి ప్రతిబింబింపబడుతూ వుంది.
తనతో తన భర్త సరిగా మాట్లాడడని తెలిసినా చిత్రకు మాత్రం అతనితో ఏదైనా మాట కలపాలని అనిపిస్తూ వుంది. 'సాకు ' కోసం వెతుకులాట ప్రారంభించింది చిత్ర. చివరకు ఒక మెరుపు లా 'ఛాయ్ ' గుర్తొచ్చింది. " ప్రపంచం ల ఎట్లాంటోడైన గూడ నీ ఛాయ్ కి బాంచన్ అనాల్నే బుజ్జీ."అని నిత్యం తన ఛాయ్ చేసే ప్రావీణ్యత ను ఉద్దేశించి తన మేనమామ అనే మాటలు ఆమెకి గుర్తొచ్చాయి. ఒక్క క్షణం చిత్రకి తన మామయ్య, తన ఊరైన పెంట్లవెల్లి, తన పుట్టిల్లు, దాని పక్కన ఉన్న నాలుగెకరాల పొలం... ఇవన్నీ గుర్తొచ్చాయి. ' మామ ఫోన్ ఎప్పుడు జేస్తడో ఏమో. ఒక సారి మామ తో మాట్లాడ్తె జెర మనస్సు సాఫ్ అయితది.' అనుకుంది చిత్ర మనస్సులో.
వంటింటి వైపు అడుగులేస్తున్న ఆమెకి చాయ్ పొడి అయిపోయిందన్న విషయం గుర్తుకు వచ్చింది. ' సరిపొయ్యింది పట్టు!' అని మనస్సులో అనుకుంటూ ఈశ్వర్ ఉన్న గదిలోని తలుపు వద్దకు వెళ్ళింది. చిత్ర యొక్క కాలి గజ్జెల శబ్దం వినబడి ఈశ్వర్ ఆమె వైపు 'ఏంటి ? ' అన్నట్టుగా చూశాడు.
" ఛాయ్ పత్తా నిండుకుంది." అంది చిత్ర.
"ఆ?!" అన్నాడు ఈశ్వర్ అర్థం కానట్టు.
" ఇంట్ల సామాన్లు అయిపొయినయ్ అనగూడదు. గందుకే అట్ల అన్న."
ఈసారి ఈశ్వర్ కి అర్థం అయ్యింది. " ఒక్క 10 మినెట్స్ టైం ఇవ్వగలవా, తెస్తా ." అన్నాడు ఈశ్వర్ చాలా పొడిగా.
"మంచిది." బదులిచ్చింది చిత్ర. ఈశ్వర్ తనతో మాట్లాడేటప్పుడు చూపిస్తున్న 'formality' విన్నప్పుడల్లా ఆమెకు కోపమొస్తూ వుంది. ఒక్క క్షణం హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళందరూ పెళ్ళాలతో అలాగే మాట్లాడతారేమో నన్న అనుమానం ఆమెకు కలిగింది. కానీ హైదరాబాద్ వాళ్లైనా లేక వాళ్ళ ఊరైన పెంట్లవెల్లి వాళ్ళైనా పెళ్ళానికి దూరంగా , పక్క రూం లో పడుకోవటానికి విడి గా మంచాన్ని తెచ్చుకోరు అని నమ్మకంగా అనుకుంది చిత్ర. కావున సమస్య హైదరాబాద్ ది కాదని, సమస్య వాళ్ళ ఇంట్లోనే ఉందని రూఢీ చేస్కుంది ఆమె! సరిగ్గా గంట కొట్టినట్టుగా పది నిమిషాల తరువాత లాప్టాప్ మూసి చిత్ర వైపు చూస్తూ "టీ పొడి ఒక్కటేనా , ఇంకేమైనా తేవాలా?" అని అడిగాడు.
"హా.. చానా ఉన్నయ్. ఒక్క నిముషం.. కూరగాయలు, ఆకు కూరలుంటే ఇంగా నయం. బండలూడ్చే చీపురు. మిర్పకాయలు గూడ లెవ్వు. కొన్ని స్టీలు గిన్నెలు, ప్లేట్లు, చెంచాలు , గంటెలు.." అంటూ చిత్ర మాట్లాడటం ఆపేసింది, సెల్ ఫోన్ లో ఏదో పని చేసుకుంటూన్న ఈశ్వర్ వైపు చూస్తూ." ఆపావేంటి? చెప్పు." అన్నాడు ఈశ్వర్. అప్పుడర్థమైంది చిత్రకి ఈశ్వర్ సెల్ ఫోన్ లో లిస్ట్ రాసుకుంటున్నాడని.
" పళ్ళ బ్రష్షు నాకొకటి, రోజు పొద్దున పూట వేలి తోనే పళ్ళు తోముతున్న." అదనపు సమాచారం కూడా ఇచ్చింది చిత్ర.
చుర్రున ఒక చూపు చిత్ర వైపు చూస్తూ, తిరిగి తన సెల్ఫోన్ స్క్రీన్ వైపు చూడటం కొనసాగించాడు ఈశ్వర్.
" మీరా షాంపోలు." అని చెప్పి ముగించింది చిత్ర.
"ఓకే.." అని తన పక్కనున్న tablemate పైన ఉన్న తన పర్సుని తీసి తన షార్ట్ లో పెట్టుకుని మంచం దిగాడు ఈశ్వర్.
" అయ్య! దీని మీదనే బయిటికి పోతవా?" అంది చిత్ర, ఈశ్వర్ తొడుక్కున్న షార్ట్ ని ఉద్దేశించి.
"హా.. ఏం ? బాలేదా?" అన్నాడు ఈశ్వర్ కాస్త ఆశ్చర్యపోతూ , ఏదైనా ఆ షార్ట్ కి అంటిందేమోనని అద్దం లో చూసుకుంటూ. చిత్ర కి మాత్రం తన భర్త తన తో ' సాధారణంగా ' ఆ ఒక్క వాక్యం మాట్లాడటం బాగా నచ్చింది. ' ఈ మనిషి ఇట్లనే ఉండొచ్చు గద ఎప్పుడు?' అని తనలో తాను అనుకుంది.
" ఏం లే బానే ఉంది." అంది చిత్ర, తన భర్త తో షార్ట్ లో బయటకు వెళ్ళటాన్ని గూర్చి మాట్లాడటానికి సిగ్గువల్ల కలిగిన సంశయానికి బద్దురాలై.
"హం. ఓకే." అన్నాడు ఈశ్వర్ ,చిత్ర పట్ల తనకున్న వికర్షనా భావాన్ని కొనసాగిస్తూ.
' మళ్ళ మొదటికొచ్చిండు మనిషి.' అనుకుంది చిత్ర.
బయటకు వెళ్ళటానికి ప్రయాణమవుతున్న ఈశ్వర్ తో " ఇదో.... నేంగూడ ఒద్దునా? నాల్గు రోజుల కెల్ళి ఇంట్లనే ఉన్న . బోర్ కొడ్తుంది... అంటే షాప్ కాడికి పోతె సామాన్లు గూడ ఏమన్న తెచ్చేవుంటే గుర్తొస్తయ్ గదా అని." అంది చిత్ర.
చిత్రకు కి బోర్ కొట్టడం విషయమై కించిత్ జాలి కలిగింది ఈశ్వర్ కి. నిజానికి పెళ్ళైన రోజు నుండి తను గమనిస్తున్నంతరకూ చిత్ర చాలా అమాయకంగా తోస్తోంది ఈశ్వర్ కి. చిత్ర పట్ల మనస్సులో ఏదో ఒక మూల ఒక రకమైన అపరాధభావం అతడి మనస్సులో కలుగుతూ వుంది. కానీ చనిపోయిన 'తన '  అమృత పట్ల ఉన్న అతడి 'నిబద్ధత ' చిత్ర పట్ల ఒక విధమైన వికర్షణా భావాన్ని తాను చిత్ర పట్ల పెంపొందించుకునేలా నడిపిస్తోంది అతడిని.
" ఓకే. " అన్నాడు ఈశ్వర్ ఆమె వైపు చూడకుండానే.
మనస్సులో ఛాయ్ కి కృతజ్ఞతలు చెప్పుకుంది చిత్ర. మనస్సులో ఆమెకు ఈశ్వర్ తో చాలా చాలా మాట్లాడాలని ఉంది.
" ఒక్క ఐదు నిమిషాలు.. జెర మొహం కడ్డుక్కొనొస్త. జిడ్డు జిడ్డు అయింది. సరేనా?" అడిగింది చిత్ర.
ఎప్పటిలాగే " ఓకే" అన్నాడు ఈశ్వర్ పొడిగా.
" అంటే...ఒక పది నిమిషాలు." అంటూ స్నానాల గది వైపు వెళ్ళింది చిత్ర,ఇందాక గంట కొట్టినట్టు సరిగ్గా పది నిమిషాలకే లేచిన తన భర్త యొక్క సమయ పాలనను గుర్తుచేస్కుంటూ.
స్నానాల గదిలో ఉన్న టాయిలెట్ సీట్ నుంచి, వాడే సబ్బు వరకూ ప్రతీదీ కొత్తగా తోస్తున్నాయి చిత్రకు. ' ఏందో ఏమో, గివన్ని అల్వాటు కానీకె మస్తు రోజులయెటట్టుంది.' అనుకుంది చిత్ర.
park avenue సబ్బు యొక్క వింత వాసనను భరిస్తూ గబ గబా ముఖం కడుక్కుంది చిత్ర. అద్దం వద్దకు వచ్చి, ముఖాన్ని తుడుచుకుని, పొట్లం లో కట్టబడి ఉన్న వాళ్ళ ఊరు గ్రామ దేవత చౌడేశ్వరీ దేవి యొక్క కుంకుమ ని నుదిటికి పెట్టుకుంది చిత్ర. వంశపారంపర్యంగా తనకు అబ్బిన మేని రంగుని చూస్తూ, ' ఏందో ఏమో, మేమిద్దరం మరీ చెస్ బోర్డు మీద గళ్ళ లెక్క ఉన్నం!' అనుకుంది.
" నువ్వు, మా అమ్మ , మీ అమ్మ అందరు గల్సి నాకు ఇట్ల మీకున్న నల్ల రంగు పట్టిచ్చిర్రు" అని అంటూ ఉండేది చిత్ర తన మేన మామ తో సరదాగా.
" పార్వతి దేవి గూడ నల్లగనే ఉంటదే బుజ్జీ. నువ్వు గూడ ఆమె పేరు వెట్కోని గట్ల మంగళకరంగ ఉంటవ్. మీ అత్త జూడు తెల్లగ ఏందో పాలిపొయినట్టు ఉంటది. మనకున్న అందం మీ అత్త తాన ఏడుందే. గందుకే ఆళ్ళ నాయ్న నన్ను ఏరుకుని, యెంటబడి మరీ పెళ్ళిజేశిండు మీ అత్త తోని." అంటూ నవ్వేవాడు రామచంద్రయ్య.
తన మేన కోడలితో ముచ్చట్లు పెట్టడం రామచంద్రయ్యకు చాలా ఇష్టం. తన భార్య జయమ్మ లేని సమయం లోనే ఎక్కువగా ముచ్చట్లు పెట్టేవాడాయన. తన చెల్లెలు చనిపోతున్నప్పుడు ఆమెకు ఇచ్చిన మాటకు అణుగుణంగా చిత్రని తన కూతుళ్ళతో సమానంగా పెంచలేకపోతున్నాననే అపరాధభావం ఎప్పుడూ అతడిని మనస్సులో ఏదో మూలన వెంటాడేది. చిత్ర మాత్రం ఏనాడూ తన మేన మామ పట్ల లేశమైన అసంతృప్తిని ప్రకటించలేదు!
' ఏందో ఏమో , గీ మొఖానికున్న జిడ్డుని పోగొట్టనీకి విం బార్లు కావాలె.' అనుకుంటూ నిట్టూర్చింది చిత్ర అద్దం లో ఉన్న తన నిత్యం నూనె తో కారిపొయినట్టుండే తన ముఖాన్ని చూసుకుంటూ.
తమ ఫ్లాట్ కి తాళం వేసి, తమ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ వైపు నడిచారు ఇద్దరూ.
" కొల్లాపూర్ ల వకీల్ శ్రీనివాస రావ్ ఇంట్ల గూడ ఉంటది గిది. కానీ ఊకె కిర్రుమంటది గది. ఇది మస్తు దబ్బున తీస్కపోతోంది." అని చిత్ర లిఫ్ట్ ని ఉద్దేశించిన వాక్యాన్ని పూర్తిచేసే లోపే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసింది.
కింద గ్రౌండ్ ఫ్లోర్ లోని పార్కింగ్ స్పేస్ లో చిన్న పిల్లలందరూ ఆడుకుంటున్నారు. చిత్ర వారి వైపు నవ్వుతూ చూసింది. ఇంతలో ఒక ప్లాస్టిక్ బాల్ ఆమె చేతికి వేగంగా తాకింది. ఆ బంతిని కొట్టింది వాచ్ మెన్ కొడుకు రాజేష్. చిత్ర కు బాల్ తగలంగానే నాలుక కరుచుకున్నాడు.
"ఎన్ని సార్లు చెప్పాలె మీకు ఈడ ఆడుకండని ?!?!" అరిచాడు వాచ్ మెన్ ఓంకార్, చిత్ర వైపు చూస్తూ " సారీ మేడం, ఏమనుకోవొద్దు. ఇప్పటినించి ఆడుకోకుండా చేస్త." అన్నాడు సంజాయిషీ ఇచ్చినట్టుగా ఈశ్వర్ , చిత్ర ల వైపు వంతుల వారిగా చూస్తూ.
" అయ్య! పిల్లలన్నాంక ఆడుతరు. దెబ్బేం తాకలే నాకు." బదులిచ్చింది చిత్ర. చేతిలో బ్యాట్ పట్టుకున్న బాబు వైపు చూస్తూ, కింద పడి ఉన్న బంతిని తన చేతుల్లోకి తీస్కుంటూ " విచు క్లాసు స్టడీయింగ్?" అడిగింది చిత్ర.
" 5 త్ " బదులిచ్చాడు రాజేష్.
"ఓ... టేక్ ." అంటూ ఆ బంతిని రాజేష్ వైపు విసిరింది.
తన ఊరి యాసలో ఇంగ్లీష్ మాట్లాడుతున్న చిత్ర ని చూసి , కాస్త నవ్వొచ్చింది ఈశ్వర్ కి. ఈశ్వర్ ముఖం లో చిగురించిన దరహాసాన్ని చూసి కాస్త సంతోషమేసింది చిత్ర కి.
' ఈ మనిషి నవ్వితే మస్తు ఉండెటట్టున్నడు .' మనస్సులో అనుకుంది చిత్ర.
అక్కడున్న పిల్లలందరితో " బాయ్. ఐ కం అగేన్ ." అంది చిత్ర.
పిల్లలందరూ కలిసికట్టుగా తిరిగి ఆమెకు టాటా చెప్పారు.
" మస్తు ఉషారున్నర్ పిల్లలు." అంది చిత్ర.
" హం." ఈశ్వర్ సమాధానం ఇవ్వక ముందే చిత్ర ఊహించగలిగింది!
కాసేపు నడిచాక వాళ్ళు మెయిన్ రోడ్ దెగ్గరకు వచ్చారు.
" ఈ ఊరుని ఏమంటర్ ?" అడిగింది చిత్ర.
" శ్రీనగర్ కాలనీ." బదులిచ్చాడు ఈశ్వర్.
" ఈడి నుంచి ....దిల్షుక్ నగర్ ఎంత దూరం?"
"ఏమో, 15 kilometers ఉండొచ్చు. ఏ?" అడిగాడు ఈశ్వర్.
" మా దోస్త్ వీణ ఉంటది గాడ. వాళ్ళాయ్న గాడేందో పెద్ద బట్టల దుకణమ్ల వాచ్ మెన్ నౌకరి చేస్తడంట. జీతం 15 వెయిలు ఇస్తరంట నెలకు! నా కన్న పెద్దది మూడు నాలుగేణ్లు కానీ మేము మంచిగ దోస్తుల్లాగ ఉంటం." అంది చిత్ర, తన అలవాటైన విధంగా అవసరమైన దానికన్నా ఎక్కువ సమాచారాన్ని ఇస్తూ.
"హం".
వాళ్ళింటి గల్లీ నుండి మెయిన్ రోడ్ ఎక్కారు వాళ్ళిద్దరూ. రోడ్ పై వేగంగా వెనకాలి నుండి వచ్చే వాహనాలు చిత్ర పక్కన్నుండి వెళ్తున్నాయి. చిత్రకి కాస్త భయం వేస్తోంది అన్ని వాహనాలు ఒకదాని వెంట మరొకటి వేగంగా వెళ్తుంటే.
" ఇటు వైపు రా ." అని ఈశ్వర్ రోడ్ వైపు తాను వెళ్ళి , చిత్రని రోడ్ కి దూరంగా వెళ్ళేలా దారిచ్చాడు.
తనను గమనించనట్టే ఉండే తన భర్త తన అవస్థ క్షణాల్లో ఎలా పసిగట్టగలిగాడో చిత్రకు అర్థం కాలేదు, కానీ అలా అతను తన మీద శ్రద్ద చూపించటం బాగా సంతోషాన్ని కలిగించింది చిత్రకు. దారిలో ఉన్న gym లో నుంచి వస్తున్న ఆడవాళ్ళ సమూహాన్ని చూసింది చిత్ర. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ షార్ట్స్ వేసుకుని వెళ్తున్నారు.
'ఏందో ఏమో, గీడ అందరు సగం సగం బట్టలే ఏస్కునే టట్టుర్రు.ఆడోళ్ళే ఏస్కోని తిరగంగ ఇంగ మొగోళ్ళు ఏస్కోర ఏంది ?!' అనుకుని చిత్ర తన మనస్సులో తన భర్త వేసుకున్న షార్ట్ వైపు చూస్తూ.
కాస్త దూరం నడిచాక సూపర్ మార్కెట్ వచ్చింది. వాళ్ళూరి పాతబడిన రాజుగారి బంగ్లా కన్నా పెద్దగా కనిపిస్తోంది ఆ సూపర్ మార్కెట్. ఈశ్వర్ తన చేతిలో ఒక ట్రాలీని తీసుకుని , ఇంకొకటి చిత్రకి అందించి
" నీకు ఏవైనా అవసరం అనిపిస్తే ఈ ట్రాలీ లో వేయి. ఓకేనా?" అన్నాడు ఈశ్వర్.
సరే నంటూ తలూపింది చిత్ర.
స్టీలు గిన్నెల నుంచి, బొట్టుబిళ్ళల వరకూ ప్రతీదీ దొరికే సూపర్ మార్కెట్ ని చూసి ' ఏందో ఏమో, గిది కొల్లాపురం సంత లెక్కుంది!' అనుకుంది చిత్ర.
ఒక గంట సేపు తిరిగి , తమ బుట్టలు రెండూ నింపుకుని, కౌంటర్ వద్ద లైన్ లో నిలబడ్డారు ఇద్దరూ. కౌంటర్ పక్కన కోడి గుడ్లు కనబడ్డాయి చిత్రకి. మాంసం తిని చాలా కాలమైన ఆమె నాలుక లాలాజలాన్ని కార్చింది.
"ఇదో... గుడ్లు కొందం, రాత్రి ఆమ్లెట్లు తిందం. నేను ఆమ్లెట్లు బాగ ఒండుత." అంది చిత్ర ఉత్సాహంగా.
"నేను నాన్ వెజ్ తినను... ఎగ్ కూడా తినను.అలా అని నిన్ను తినవద్దు అని చెప్పను. నీ ఫుడ్ నీ ఇష్టం. నేను కర్రీ పాయింట్ లో ఏదైనా వెజ్ కర్రీ కొనుక్కుని తింటా." అన్నాడు ఈశ్వర్ తన స్వరం లో ఏలాంటి హెచ్చుతగ్గులు లేకుండా.
ఒక్క 2 క్షణాలు గుడ్ల వైపు తేరిపారా చూసింది చిత్ర అప్రయత్నంగా. ఈశ్వర్ వైపు తిరిగి." అట్లవ్తె ఏమొద్దులే గుడ్లు." అంది చిత్ర.
ఈశ్వర్ కి ఆ సంభాషణని కొనసాగించాలి అని అనిపించలేదు. ముక్క లేనిదే ముద్ద దిగని తనని శాకాహారిగా మార్చిన అమృత అతనికి గుర్తుకు రాసాగింది. విషాలమైన అతని తేనె కళ్ళలో సన్నటి నీటి తెరలు అలముకున్నాయి!
--------------సశేషం. ---------------
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 11 users Like k3vv3's post
Like Reply
#24
Feeling different story, nice start
[+] 1 user Likes cherry8g's post
Like Reply
#25
అప్డేట్ చాల అద్భుతంగా ఇచ్చారు thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
#26
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
#27
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#28
Super update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#29
ముడి 5వ భాగం

సూపర్ మార్కెట్ నుండి తమ తిరుగు ప్రయాణం లో ఈశ్వర్ చాలా భావుకమై ఉండటం
గమనించింది చిత్ర.ఆమె మనస్సు చివుక్కుమనింది ఈశ్వర్ ని అలా చూసి. విషయమేంటో కనుక్కుందామనిపించింది ఆమెకు. కాస్త సంశయం మనస్సులో మొలిచివున్నా, "ఏంది అట్లున్నవ్? ఏమన్న గుర్తొచ్చిందా?" అడిగింది చిత్ర.
చిత్ర అలా అడగటం ఈశ్వర్ కి బొత్తిగా నచ్చలేదు. అమృత విషయం లో చిత్ర కు సమాధానం చెప్పాల్సి రావటం అన్న ఊహే అతనికి అమితమైన చిరాకును కలిగిస్తోంది. చిత్ర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ "నాకు ఏమీ కాలేదు. అర్థం అయ్యిందా?" అన్నాడు ఈశ్వర్ తన స్వరాన్ని అత్యంత శాంతంగా ఉంచుతూ. ఈశ్వర్ మనస్సులోని భావాలకీ , అతను ఆ మాటలను వ్యక్తీకరించే విధానానికీ అస్సలు పొంతన లేదని గ్రహించింది చిత్ర!
'ఏందో ఏమో, ఈ మనిషి కళ్ళతోనే కాల్చెటట్టున్నడు!" అనుకుంది చిత్ర మనస్సులో.
వాళ్ళు నడుస్తున్న దారిలో కొన్ని జంటలు వెళ్ళడం గమనించింది చిత్ర. వాళ్ళు అందరూ తమ తమ భాగస్వామి చేతిని పట్టుకుని నడూస్తూ ఉన్నారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్కుంటూ, నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఉన్న మగవారి కళ్ళల్లో వారి వారి భాగస్వాముల పట్ల ఆప్యాయత కనపడసాగింది చిత్రకు. తొలిసారిగా తన భర్తకు తాను నచ్చలేదేమోనన్న అభద్రతా భావం ఆమెకు కలిగింది. ఒక వేళ తను నిజంగా తన భర్త కు నచ్చనట్టైతే కారణాలేమై ఉంటాయని ఆమె ఆలోచించసాగింది. తన శరీర రంగు అతనికి నచ్చలేదా? తను పల్లెటూరిది కావటం అతనికి నచ్చలేదా? లేదా అంతగా చదువుకోనందుకు తను అతనికి నచ్చలేదా? అన్న ప్రశ్నలు ఆమెను తొలచసాగాయి. రోజు లో ఒక్క సారైనా తన భర్త తనతో ఆప్యాయంగా మాట్లాడితే చాలనుకుంది చిత్ర. కానీ ఈశ్వర్ ప్రవర్తన ఆమెకు అస్సలు మింగుడు పడట్లేదు. తనను తాను సమీక్షించుకొని, తన భర్త కు నచ్చినట్టుగా మారాలని నిర్ణయించుకుంది.
ఇంతలో ఆమె అక్కడ రోడ్ పై ఉన్న ఒక జంట లో అమ్మాయి తన భాగస్వామి తో ఇంగ్లీష్ లో మాట్లాడటం గమనించింది చిత్ర. ఈశ్వర్ తో " మస్తు బిగ్గ్ సూపర్ మార్కెట్ గద అది. ఆల్ ఐటంస్ దొర్కుతున్నయ్ ఆడ." అంది చిత్ర, సాధ్యమైనన్ని ఇంగ్లీష్ పదాలు వాక్యం లో పెడుతూ.ఈశ్వర్ నిలువుగా తలూపాడు కనీసం చిత్ర వైపు తల కూడా తిప్పకుండా.
దారిలో ఆమె ' రాధా సమేత కృష్ణుడి దేవాలయం' కి దారి అన్న బోర్డ్ చూసింది. తన ఊరైన పెంట్లవెల్లి లో రోజూ గుడికి వెళ్ళే అలవాటున్న చిత్ర ఆ బోర్డ్ ని చూసిన వెంటనే ఈశ్వర్ తో అప్రయంతంగా
" ఈడ కృష్ణుని గుడి ఉన్నట్టుంది గా. పొయ్యొద్దమా ఓసారి?" అడిగింది ఉత్సాహంగా.
"నేను దేవుణ్ణి నమ్మను. కావాలంటే నువ్వు వెళ్ళిరా. నేను ఇక్కడే wait చేస్తా." అన్నాడు ఈశ్వర్ ఎప్పటిలాగే స్వరం లో హెచ్చుతగ్గులు లేకుండా.
" అయితే ఇంగో సారి పోతగానిలే. ఏడుందో అర్తమయ్యింది గద ఇంగ." అంది చిత్ర.
"హం."అన్నాడు ఈశ్వర్.
'ఏందో ఏమో ఈ మనిషి! గా మహేష్ బాబు నేనొక్కడినే సిన్మా లాగ నే ఉన్నడు , అర్తం గాకుండ ఒకసారికి.' అంటూ నిట్టూర్చింది చిత్ర, కానీ మనసులో ఒక మూల ఈశ్వర్ ని ఏదో తొలుస్తూ ఉందన్న విషయాన్ని గుర్తించిందామె. ఏది ఏమైనా అలా తన భర్త మనస్సులో నిత్యం ఏదో తిరుగుతూ ఉండటం నచ్చట్లేదామెకు అస్సలు. అతని మనస్సుని నిత్యం తొలిచే విషయమేంటో తెలుసుకోవాలనిపిస్తోందామెకు. నిజానికి అది కుతూహలం కాదు, ఈశ్వర్ పై చిత్ర చూపిస్తున్న శ్రద్ద!
"ఏం అయ్యిందో చెప్పరాదు? ఎందుకట్లున్నవ్ అసలు?" అడిగింది చిత్ర, అప్రయత్నగా వచ్చిన చనువుతో.
అమృత విషయమై పదే పదే చిత్ర వాకబు చేస్తూ ఉండటం ఈశ్వర్ సహించలేక పోతున్నాడు.
" నేను ఎప్పుడూ అలాగే ఉంటా . గత మూడేళ్ళుగా అలాగే ఉంటున్నా. అమృత cancer తో చనిపోయినప్పటి నుంచి నేనిలాగే ఉంటున్నా. ఇలా కాక మరోలా ఉండటం నాకు చేత కాదు. మా అమ్మ నన్ను emotional blackmail చేస్తే నిన్ను పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. చాలా ఇంకేమైనా చెప్పాలా?!" అని ఒక్కసారి గట్టిగా చిత్ర పై అరవాలనిపించింది ఈశ్వర్ కి!
తన సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్ర వైపు తిరిగి,
" నా మొహమే అంత. అందుకే అలా కనిపిస్తున్నా నీకు. నీకు నా మొహం నచ్చకపోయినట్టైతే నేను చేయగలిగింది ఏమీ లేదు అనే అనుకుంటున్నా."అన్నాడు అతి శాంతంగా.
చిత్రకు ఇంకేమీ మాట్లాడాలనిపించ లేదు. అలా అంత 'మృదువు ' గా మాట్లాడే బదులు తను ఏదైనా తప్పు చేసుంటే ఈశ్వర్ కి తన కోపం తగ్గే దాకా తనని తిట్టుంటే బావుండునని అనిపించింది చిత్రకి. తన మనస్సు కల్లుక్కుమన్నది. తనలో ఏం లోపం ఉందో తనకు అస్సలు అర్థం కావట్లేదు.
మౌనంగా తమ అపార్ట్మెంట్ వైపు గా ఈశ్వర్ ని అనుసరించింది. ఈశ్వర్ మనస్సులో మాత్రం అమృత తో తాను గడిపిన క్షణాల తాలూకు గ్న్యాపకాలు కదలాడసాగాయి.
వాళ్ళు తిరిగి తమ పది అంతస్థులున్న అపార్ట్మెంట్ సముదాయానికి వెళ్ళేసరికి, గ్రౌండ్ ఫ్లోర్ లో వాచ్ మెన్ ఓంకార్ భార్య జ్యోతి తన ఇద్దరు పిల్లలకీ అన్నం తినిపిస్తూ ఉంది. చిత్రని రాజేష్ గమనించి హాయ్ చెప్పాడు. చిత్ర తిరిగి హాయ్ చెప్పింది అతడికి. అక్కడ రాజేష్ పోలికనున్న అమ్మాయిని చూసి, జ్యోతి వైపు తిరిగి" ఇద్దరు అమడాల పిల్లలా?" అడిగింది చిత్ర.
" హా అవ్ను మేడం. " నవ్వుతూ బదులిచ్చింది జ్యోతి.
" వాట్ ఈజ్ యువర్ నేం?" అడిగింది చిత్ర ఆ అమ్మాయిని.
" రేణుక " బదులిచ్చిందా అమ్మాయి.
"ఓ.. గుడ్. యూ బిగ్ ఆర్ యువర్ బ్రదర్ బిగ్?" అడిగింది.
చిత్ర అడిగిన ప్రశ్నేంటో అర్థం చేస్కోడానికి ఈశ్వర్ కి, రేణుకకి, రాజేష్ కి 5 సెకెండ్ల సమయం పట్టింది.
"he is five minutes elder to me." బదులిచ్చింది రేణుక.
" మా పిల్లలిద్దరూ పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ చదువుతున్నరు. పైసలెక్కువైనా గూడా ఇంగ్లీష్ ఒస్తదని పెద్ద కాలేజ్ల చదువిస్తున్నం." అంది జ్యోతి , తన కూతురి ఇంగ్లీష్ ప్రావీణ్యత కి మురిసిపోతూ.
" హా మస్తు సద్వెటట్టున్నరు మీ పిల్లలిద్దరు." అంది చిత్ర, పదవ తరగతి లో ఆఖరి పరీక్ష రాసిన తరువాత, ఇక చదవాల్సిన అవసరం ఉండదని ఆమె సంతోషపడిన విషయం గుర్తుకు వచ్చి, మనస్సులో నవ్వుకుంటూ.
జ్యోతికి చాలా ఆనందమేసింది. వాళ్ళ సంపాదన లో సింహ భాగం తమ పిల్లల చదువు కోసం ఖర్చుపెడుతున్న వారి కృషి కి కాస్త సమర్థన దొరికినట్టుగా తోచిందామెకు.
" సార్ కి పెళ్ళయిందని ఈన చెప్తే తెలిసింది. ఎన్ని రోజులయ్యింది మేడం మీరు వచ్చి?" అడిగింది జ్యోతి కలుపుగోలుగా, చిత్ర తమను తనతో సమానంగా చూస్తూ మాట్లాడుతున్న విధానానికి లోలోన ఆనందపడుతూ.
" గిది ఆరో రోజనుకుంట... సరె ఉంట మళ్ళ. ఈనకి పనుంటది మళ్ళ." అంది చిత్ర, తన పక్కన అప్పటి నుండి ఈశ్వర్ వేచి ఉన్నాడని గుర్తుకు వచ్చి.
"మంచిది మేడం." బదులిచ్చింది జ్యోతి.
లిఫ్ట్ వైపు నడిచి వెళ్తున్న ఈశ్వర్, చిత్రలు ఉత్తర, దక్షిణ దృవాల్లా కనిపించారు జ్యోతికి. తాముంటున్న రెండేళ్ళల్లో ఈశ్వర్ తన తో మాట్లాడిన దానికన్నా రెండు నిమిషాల్లో చిత్ర ఎక్కువ మాట్లాడినట్టు తోచిందామెకు.
తమ ఫ్లాట్ కి చేరుకున్నాక, ఈశ్వర్ తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. తన లాప్టాప్ ని ముందు పెట్టుకుని ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వటానికి ప్రయత్నిస్తున్నాడు , కానీ అతని మస్తిష్కం లో మొత్తం చిత్ర తిరగాడసాగింది, ఆమె పట్ల ఒక రకమైన అక్కసు కలగసాగింది అతడికి. ఇంతలో పట్టీల శబ్దం వినిపించి తల పైకి ఎత్తి చూశాడు ఈశ్వర్.
" రాత్రికి ఏం ఒండుదును? ఆల్గడ్డ ఉంది, టమాటుంది, బెండ కాయుంది, ఒంకాయుంది.?" అడిగింది చిత్ర, ముఖం పై చిరునవ్వుతో.
"నీ ఇష్టం."
"అట్ల గాదు, నీకు ఏది నచ్చుతదో చెప్తె, అది ఒండుత."
ఈశ్వర్ అణువణువునా చిత్ర పై వికర్షణా భావం తాండవించసాగింది, ఒక గఢమైన నిట్టూర్పు విడిచి, ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
"చూడు చిత్రా, నీకు ఇష్టమైనదేదో వండు.నువ్వు ఏది వండుతే అది నీకోసం తిని పెడతా నేను. ఇప్పుడు నన్ను నా పనిని చేస్కోనిస్తే నేను చాలా సంతోషిస్తా.... ప్లీజ్." అంటూ తన రెండు చేతులూ జోడించి చిత్ర వైపు చూశాడు ఈశ్వర్.
ఒక్కసారిగా చిత్ర చూపుకు ఈశ్వర్ చాలా మసకగా కనిపించసాగాడు. ఆమె కళ్ళల్లో నీటి తెరలు అలముకున్నాయి. పొంగుకొస్తున్న దుఃఖాన్ని తన పెదవి కింద అదిమి పెట్టింది. తన శక్తినంతా కూడగట్టుకుని, "మంచిది." అని మాత్రం చెప్పి వంట గదిలోకి వెళ్ళిపోయింది చిత్ర.
ఈశ్వర్ కి క్షణక్షణానికి చిత్ర పట్ల వికర్షణా భావం పెరగసాగింది. ఇందాక తనతో నవ్వుతూ మాట్లాడుతున్న చిత్ర ముఖం అతని కళ్ళ ముందు మెదులుతూ వుంది. ఆమె నవ్వు , అమృత కోసం తన మనస్సులో కట్టుకున్న కోవెల ను కూలదోసేదిగా తోస్తోందతడికి! చిత్ర నుంచి తన మనస్సుకు స్వాంతన చేకూర్చటానికి తనకు బాగా ఇష్టమైన చార్లీ చాప్లిన్ సన్నివేశాలని చూడనారంభించాడు ఈశ్వర్.
ఇంతలో అతడికి వంట గదిలోనుంచి కెవ్వున ఒక కేక వినబడింది. పరిగెత్తుకు వెళ్ళి చూశాడు. అక్కడ చిత్ర తన చేతిని ఉఫ్,ఉఫ్ మంటూ ఊదుతూ ఉంది. వేడి నూనె ఆమె చేతిపై పడ్డట్టుగా గమనించాడు ఈశ్వర్. వెంటనే సింక్ లో నల్లా ని ఆన్ చేసి, చిత్రని నీటి ధార కింద కాలిన భాగాన్ని ఉంచమన్నాడు.ఆమె పాటించింది.
చిత్రని హాల్లోకి వెళ్ళమని చెప్పి తను గదిలోకి వెళ్ళాడు. రెండు నిమిషాల తరువాత చేతిలో బర్నాల్ ఆయింట్మెంట్ తో వచ్చాడు ఈశ్వర్.
" గిప్పుడవన్ని ఏం అవసరమ్లే. సల్లగయింది నీళ్ళు పడ్డాంక."
"oil వల్ల వచ్చిన burn అది.ointment లో Aminacrine HCl 0.1% ఇంకా cetrimide 0.5% ఉంటాయ్. అవి anti-septic and anti-microbial agents గా work చేస్తాయి."
పుసుక్కున నవ్వింది చిత్ర.
అంత నొప్పిని మరచిపోయి చిత్ర నవ్వగలిగినంత హాస్యం తన మాటలో ఏముందో అర్థం కాలేదు ఈశ్వర్ కి.
చిత్ర చేతికి మూత తీసిన ointment tube అందించాడు ఈశ్వర్. ఎడం చేతితో ointment రాసుకోవటంలో ఆమె ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించి , ఆమె చేతిని చాచమని చెప్పి, కాలిన భాగం లో ointment పూయసాగాడు ఈశ్వర్.
" ఇదో... నాకు సక్కగ మాట్లాడనీకె రాదు.ఎప్పుడు ఏం మాట్లాడాల్నో అస్సలు తెల్వదు నాకు. ఏదోటి వాగుతుంట.. కోపం గాకు నా మీద. సరేనా? నీకు నా వల్ల ఏమన్న ఇబ్బంది ఐతె చెప్పు నాకు. నేను మారుత .సరేనా?నువ్వు అట్ల నా వల్ల ఇబ్బంది పడ్తుంటె నాకు అస్సల్ నచ్చుతలె." అంది చిత్ర తన మనస్సులో ఉన్న భావం మొత్తాన్నీ ఈశ్వర్ ముందు వ్యక్తపరుస్తూ.
ఈ మాటలు విన్న ఈశ్వర్ కి చిత్ర కళ్ళల్లోకి చూసేందుకు ధైర్యం చాల లేదు!!
చిత్ర చేతికి బర్నాల్ రాయటం ఐపోయాక, ఆమె వైపు చూడకుండా"నేను మనిద్దరికీ ఇప్పుడు ఫుడ్ order చేస్తాను. ఒక half an hour లో వస్తుంది... రేపు పొద్దటి వరకు దెబ్బ తగ్గకపోతే డాక్టర్ దెగ్గరికి వెళ్దాం." అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈశ్వర్.
-------------------సశేషం.---------------------------
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply
#30
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#31
Nice Superb update  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
#32
ముడి - 6వ భాగం
రోజూ లాగ కాక కాస్త ఆలస్యంగా నిద్ర లేచాడు ఈశ్వర్. సోఫాలో కూర్చుని భక్తి టీ.వీ లో లలితా సహస్రనామాలు వింటూ, చపాతీలు చేయటానికి గోధుమ పిండి పిసుకుతూ వుంది చిత్ర.ఈశ్వర్ ని చూస్తూ నిండుగా నవ్వింది చిత్ర. ఈశ్వర్ ప్రతిగా చిరు మందహాసమొకటి చేశాడు.
"నువ్వు నవ్తే మస్తుంటవ్!" అనబోయి విరమించుకుంది చిత్ర.
"ఏమి ఇరోజు లేటుగ లేశ్నవ్?" అడిగింది చిత్ర, నిద్ర సరిగాలేనట్టున్న అతని కళ్ళని గమనిస్తూ.
" కొంచం అలసటగా అనిపించింది. అందుకే త్వరగా లేవలేదు." బదులిచ్చాడు ఈశ్వర్.
"అవ్నా. వేడి, వేడి నీళ్ళతోని స్నానం జేస్తే పోతయి నొప్పులు, గిప్పులు ఏమన్నుంటే. పెట్టమంటవా?" అడిగింది చిత్ర.
"వద్దు వద్దు. నాకు చల్ల నీళ్ళే అలవాటు." అన్నాడు ఈశ్వర్.
" రాత్రి సక్కగ నిద్రపట్టలే? కళ్ళు ముంగటికి ఒచ్చినయ్ ?" అడిగింది చిత్ర, ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆపుకోలేక.
మౌనంగా స్నానాల గది వైపు వెళ్ళాడు ఈశ్వర్.
'అయ్య! మళ్ల ఈ మనిషి ని ఏమన్న అనగూడనిది అన్ననా ?' అని లోలోన కాస్త భయపడింది చిత్ర.
షవర్ ఆన్ చేసుకున్న ఈశ్వర్ కి, రాత్రంతా చిత్ర అన్న మాటల గురించి తాను ఆలోచించిన వైనం గుర్తుకు వచ్చింది.
రాత్రంతా అతడి మస్తిష్కం లో చిత్ర విషయం లో ఒక విధమైన అపరాధభావం తాండవించింది. చిత్ర పట్ల తాను చూపిస్తున్న వికర్షణా భావానికి కారణం తన మనస్సంతా నిండుకున్న అమృతే కానీ తను కారణం కాదని చిత్రకి ఎలా చెప్పాలో ఈశ్వర్ కి అర్థం కాలేదు. తానే ఏదో తప్పు చేసినట్టుగా భావించుకుంటున్న చిత్ర పట్ల చాలా జాలి కలిగింది అతడికి. చిత్ర మనస్సుని గాయపెడుతున్నానేమో నన్న అపరాధభావం అతడి మనస్సును తొలిచింది. రాత్రి మొత్తం అతని మస్తిష్కం లో ఇవే ఆలోచనలు కదలాడాయి.ఉదయాన్నే చిత్ర రాత్రి తనకు నిద్ర పట్టని వైనాన్ని గుర్తించడం చాలా ఆశ్చర్యం కలిగించింది అతడికి.
కూరగాయలు తరుగుతున్న చిత్ర దెగ్గరకు వెళ్ళి " ఎలా ఉంది నిన్నటి దెబ్బ? మానిందా ?" అడిగాడు ఈశ్వర్.
'ఏందో ఏమో, ఈ మనిషి ఇరోజు మంచిగ మాట్లాడుతుండు ' అని లోలోన చాలా మురిసిపోయింది చిత్ర.
"హా! మానింది. నువ్వు పూశిన మందు మస్తు పంజేశింది. సూడు" అంటూ తన చేతిని నవ్వుతూ ఈశ్వర్ కి చూపించింది చిత్ర.
ఈశ్వర్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూసి, "ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇంకా skin rupture ఉంది.... ఇరోజు వంట ఏం చేయకు.heat తాకితే skin further గా rupture అవుతుంది. ఇరోజు బయట తిందాం." అన్నాడు ఈశ్వర్. తీక్షణంగా తన గాయం వైపు ఈశ్వర్ చూస్తూ ఉండటం చిత్రకు చాలా ఆనందాన్ని కలిగించింది.
" సరె, అట్లనే గాని" అంది చిత్ర, 'పర్లేదు వంట చేస్తా'అని వాదిస్తే ఎక్కడ ఈశ్వర్ కోపమొస్తుందోనని.
"ready నా నువ్వు?నువ్వు ready అయితే వెళ్దాం మరి. " అడిగాడు ఈశ్వర్.
" హా తయారే ఉన్న" ఉత్సాహంగా బదులిచ్చింది చిత్ర.
లిఫ్ట్ లో కిందికి దిగుతున్నప్పుడు, ఈశ్వర్ తో ఏదో మాట్లాడదలచి, మరోసారి వకీల్ శ్రీనివాసరావు ఇంట్లో సరిగ్గా పనిచేయని లిఫ్ట్ గురించి మాట్లాడింది చిత్ర. ఈశ్వర్ తన ఓపికనంతా కూడగట్టుకుని, చిత్ర వైపు చూసి తన తల ఊపసాగాడు.
" ఇంగో దీని తలుపు గూడ మస్తు అల్కగ ఒస్తది తియ్యనీకె. గా లిఫ్టు మస్తు గట్టిగుంటది తీయనీకె. " అంది చిత్ర. గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చాక, బయటకు వస్తూ.
ముందు రోజు చిత్ర మాటలు గుర్తుకు వచ్చి, ఆమెను గాయపరచకూడదు అన్న తన నియమం గుర్తుకు వచ్చి, చిరు మందహాసం చేశాడు ఈశ్వర్.
" నువ్వు నవ్తే మస్తుంటవ్ !" అని మళ్ళీ అనబోయి, చాలా చాలా కష్టంగా తమాయించుకుంది చిత్ర.
అతను తన చేతిలో కారు యొక్క తాళం చెవిని పట్టుకుని ఉండటాన్ని గమనించి,
"మనం నడ్చుకుంటు పోతలే?" అడిగింది చిత్ర.
"లేదు, దెగ్గర్లో hygenic hotel లేదు. అందుకే car లో వెళ్దామని." బదులిచ్చాడు ఈశ్వర్.
"ఓ." అంది చిత్ర.
వాచ్ మెన్ ఓంకార్ యొక్క భార్య జ్యోతి , తన పిల్లలైన రాజేష్, రేణుక లని కాలేజ్ బస్ ఎక్కించి వారికి ఎదురైంది.
చిత్ర, జ్యోతులు మందహాసాలను ఇచ్చిపుచ్చుకున్నారు.
" కాలేజ్ కి పోతుర్రా పిల్లలు?" అడిగింది చిత్ర.
"హా అవ్ను మేడం. మీరెక్కడికి?" అంది జ్యోతి.
" టిఫిన్ తిన్నీకె పోతున్నం.మళ్ళ కలుస్త. " బదులిచ్చింది చిత్ర.
***
కార్ లో ప్రయాణాన్ని ప్రారంభించారు వారు.
"ఈ కార్ల సీట్లు మంచిగ మెత్తగున్నయ్. వకీల్ శ్రీనివాస రావు కార్ల జెర ఒత్కవోతయ్. గీ కారు జెర పెద్దది గూడ ఉంది" అంది చిత్ర.
" ఓ... ఎవరు ఆయన ?"
" మా మామ చిన్నప్పటి దోస్తు. మన పెళ్ళికి గూడ వొచ్చిండె. నీతో ఇంగ్లీష్ ల మాట్లాడినాయ్న." అంది చిత్ర.
"ఏమో లే , అంత గుర్తు లేదు."
"ఓ.. ఈ సారి పెంట్లవెల్లి కి పొయినప్పుడు పరిచయం జేస్త గాని." అంది చిత్ర.
"హం. ఓకే."
"ఆళ్ళ కారు మూడు నాల్గు సార్లు ఎక్కిన. యెనకాల సీట్ల కూసుండింటి. నాతోటి ఇంగో నలుగురైదుగురు మంది కూసున్నిండె. మస్తు టైటు గ అనిపిచ్చిండె.ఈడ మంచిగ ముందు సీట్ల నీ పక్కన పోతుంటె మస్తుంది."
"ఓ."
ఒక్క క్షణం ఆగి, ఈశ్వర్ వైపు సూటిగా చూస్తూ " నేనేమన్న ఎక్కువ మాట్లాడ్తనా? నీకు ఏమన్న నచ్చుతలేదా నాలొ ?" అడిగింది చిత్ర.
" లేదు, లేదు. అలా ఏం లేదు." అన్నాడు ఈశ్వర్ , చిత్ర దెగ్గర తన ' నటన ' ను సమీక్షించుకుంటూ.
" నీకేమన్న నాలొ నచ్చకుంటే నాకు జెప్పు. సరెనా?..... ఇన్ని సార్లు ఇదే జెప్తున్నేంది అనుకోకు." అంది చిత్ర కాస్త తన స్వరం లో తీవ్రత ను ప్రతిష్టింపజేస్తూ.
"హేయ్... అలా ఏం లేదు. " బదులిచ్చాడు ఈశ్వర్ చిత్ర వైపు తిరిగి, ఆమె కళ్ళల్లోకి చూస్తూ.
చిత్ర ఒక చిరునవ్వు నవ్వింది.
ఇంతలొ వాళ్ళు చేరాల్సిన హోటల్ వచ్చింది. సాయి సంపూర్ణా గ్రాండ్ అని పెద్ద పెద్ద అక్షరాలున్నాయి బోర్డ్ మీద. అది చూసి చిత్ర
" హోటల్ పేరు ఇంగోటేందో జెప్పినవ్ గద?! " అడిగింది.
"ఔనా.... ఇదేనే నేను తీస్కొస్తానన్న హోటల్ ?!" అన్నాడు ఈశ్వర్.
వాళ్ళిద్దరూ టేబుల్ దెగ్గర కూర్చున్నారు. వెయిటర్ ఆర్డర్ తీస్కోవడానికి వచ్చాడు.
" ఏం తీస్కుంటావ్? " అడిగాడు ఈశ్వర్.
30 సెకండ్లు ఆలోచించింది చిత్ర.
" దోష ఉంటదా ఈడ?"
"ఉంటుంది మేడం. ఏ దోష తేవాలి?" అడిగాడు వెయిటర్.
" ఏ దోష అంటె.... బియ్యం పిండి దోష తేయి అన్నా." అంది చిత్ర.
అర్థం కానట్టు ముఖం పెట్టిన వెయిటర్ ని చూసి నవ్వొచ్చింది ఈశ్వర్ కి కానీ ఆపుకున్నాడు.
" 2 plain dosa .less oil" అన్నాడు ఈశ్వర్.
వెయిటర్ వెళ్ళాక చిత్ర వైపు చూసి గట్టిగా నవ్వసాగాడు.
" ఏందుకు నవ్తున్నవ్ ?! "
" మీ పెంట్లవెల్లి లో హోటల్స్ లేవా?"
"ఒకటుంది . రాఘవెంద్ర హోటలని."
ఈశ్వర్ చిరునవ్వు నవ్వాడు.
'ఏందో ఏమో, ఈ హైద్రాబాద్ ల అందరు సప్పగ తినేటట్టుర్రు.'అనుకుంది చిత్ర, చప్పగా అనిపించిన పచ్చడిని ఉద్దేశించి.
బిల్ చూసి చిత్ర కళ్ళు గిర్రుమన్నాయి.
" నూటా అరవై రూపాయలా?! రెండు దోశలకా?" అంటూ నోరు బార్లా తెరిచింది చిత్ర.
చిత్ర ఆశ్చర్యాన్ని చూసి ఒకింత ఆశ్చర్యం , భయం రెండూ వేసాయి వెయిటర్ కి. చిత్రని ఆగమన్నట్టుగా సైగ చేసి వెయిటర్ కి బిల్ pay చేశాడు ఈశ్వర్.
"నూటా అరవై రూపాయలా?!"
"చూడు చిత్రా! ఇది హైదరాబాద్, మీ ఊరి rates ఉండవు ఇక్కడ." అన్నాడు ఈశ్వర్ చిత్ర అర్థం చేస్కుంటుందేమోనన్న ఆశతో.
సంతృప్తి చెందలేదు చిత్ర.
కార్ లో వారి ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్నారు ఇద్దరూ. చిత్ర ఏదో ఆలోచనలో నిమగ్నమయినట్టు గమనించాడు ఈశ్వర్. ఒక వేళ ఆమె పట్ల తన ప్రవర్తన వల్ల ఆమె ఏమైనా గాయపడి అలా ఆలోచనలో ముంగిపోయిందేమోనన్న అనుమానం కలిగింది అతడికి ఒక్క క్షణం. మౌనంగా ఉండాలని అనుకున్నా, ఉండబట్టలేక అడిగాడు అతడు
" ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావ్?"
" రెండు దోషలకు నూటా అరవై రూపాయలా? ఇంట్ల మంచిగ చెపాతీలు చేస్తుంటి గద! నూటా అరవై రూపాయలకు నాలుగు కిలోల పిండి ఒస్తది. కిలోకి పది చెపాతీలు అనుకుంటే, నలభై చెపాతీలు చెయ్యొచ్చు. ఇద్దరం కలిసి ఎంత గాదన్నా రెండు రోజులు తినొచ్చు."
ఈశ్వర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
***
గోడకి తగిలించి ఉన్న గడియారం 6 సార్లు కొట్టింది.
“ఏం జేస్తున్నవ్?” అడిగింది చిత్ర మామూలుగా.
“Movie చూస్తున్నా” బదులిచ్చాడు ఈశ్వర్ laptop వైపు చూస్తూనే.
చిత్ర అక్కడే నిలబడ్డట్టనిపించింది ఈశ్వర్ కి.
చిత్ర వంక తల ఎత్తి చూశాడు. Laptop వెనుక భాగాన్ని కాస్త ఆతురుతతో చూస్తుంది చిత్ర.
“కూర్చుంటావా?” అని పక్కకు జరిగి చిత్ర కు చోటు ఇచ్చాడు ఈశ్వర్ .
చిత్ర వడివడిగా వచ్చి కూర్చుని laptop screen వైపు ఆసక్తిగా చూడసాగింది. Laptop screen పై చార్లీ చాప్లిన్ ప్రహసనాన్ని అభినయిస్తున్నాడు. తన కళ్ళని పెద్దవిగా చేస్తూ చూసింది చిత్ర చార్లీ చాప్లిన్ వైపు.
చిత్ర మోములో ఆశ్చర్యపు మెరుపు ఒక్క క్షణం ఆకర్షణీయంగా తోచింది ఈశ్వర్ కి.
“ఓ‌ గీననా! నాక్మస్తు ఇష్టం ఈన సిన్మాలు. “
“చార్లీ చాప్లిన్ movies చూశావా ఇంతకుముందు?”
“ఏందీ?!” అడిగింది చిత్ర అర్థం కానట్టు గా ముఖం పెట్టి.
“అదే ఈయన పేరు చార్లీ చాప్లిన్.” అన్నాడు ఈశ్వర్ .
“ హా చూశ్న. ఒక గుడ్డామె ఉంటది, గీన బాగ సూస్కుంటడామెని, జైల్ల పడ్తడు, ఒక పైసలున్నాయన ఉంటడు.” అంది చిత్ర తాను ఎప్పుడో ఐదేళ్ల క్రితం చూసిన సినిమా కథ గుర్తుకు తెచ్చుకుంటూ.
చిత్ర చెప్పిన వర్ణన విని ఆమె ఏం సినిమా చూసిందో గ్రహించగలిగాడు ఈశ్వర్.
“city lights ! Awesome movie, నువ్వు ఇంగ్లీష్ మూవీస్ కూడా చూస్తావా?”
“ఎక్కువేమ్లే. మా కేబుల్ చానల్ల ఏస్తరు ఇంగ్లీష్ సినిమాలు అప్పుడప్పుడు. అప్పుడు చూశ్న ఈ సిన్మాని.”
“కేబుల్ చానలా?” అర్థం కానట్టు అడిగాడు ఈశ్వర్.
“హా, మా కేబుల్ ఆపరేటరు పుల్లయ్య రోజో సిన్మా ఏస్తడు.”
“ఓ” అన్నాడు ఈశ్వర్ ‘పుల్లయ్య’ అన్న పేరు కి కాస్త నవ్వుతూ.
“ఈ సిన్మా కంప్యూటర్ ల ఉందా?” అడిగింది చిత్ర.
“లేదు. Internet లో వుంది.” అన్నాడు ఈశ్వర్.
“హో, Internet ల సిన్మాలన్ని ఉంటాయా?” అడిగింది చిత్ర అమాయకంగా.
“చాలా ఉంటాయి. చార్లీ చాప్లిన్ వి అన్నీ ఉంటాయి.”
“ఓ....” అని ఏదో అనబోయింది చిత్ర.
చిత్ర వైపు చూస్తూ “ ఏ? ఏదైనా సినిమా చూడాలనుందా?” అన్నాడు ఈశ్వర్. చిత్ర ఇందాక ఏదో చెప్పబోయి ఉపసింహరించుకుందని గమనించాడు ఈశ్వర్. సంతోషం గా ముఖం పెట్టింది చిత్ర. ఒక అర నిమిషం పాటు ఆలోచించింది చిత్ర. ఏ సినిమా పేరు చెబుతుందబ్బా అన్నట్టుగా ముఖం పెట్టాడు ఈశ్వర్.

“ మాతృదేవోభవ సినిమా ఉంటదా?” ఆశ గా అడిగింది చిత్ర.చిత్ర ఎంపిక కి కాస్త ఆశ్చర్యపోయాడు ఈశ్వర్.
“ అదో ఏడుపుగొట్టు సినిమా. దాన్నేం చూస్తావ్ ?!” అన్నాడు ఈశ్వర్.
“ఏమో నాకదిష్టం .” నొచ్చుకుంటున్నట్టుగా అంది చిత్ర.
తన జుట్టు ని చెరిపి , తిరిగి సరిచేస్తూ YouTube search bar దగ్గర matrudevobhava అని search చేశాడు ఈశ్వర్.
“గిప్పుడేమొద్దులే. నువ్వు ఈ సిన్మా పూర్తిగ జూడు. నేను తర్వాత జూస్తలే. “ అంది చిత్ర.
“ఉండనీలే చూడు. “ అని చెప్పి హాల్లోకి వెళ్ళిపోయాడు ఈశ్వర్. సోఫాలో కూర్చుని తన ఫోన్ లో తన సినిమాని కొనసాగించాడు ఈశ్వర్.
కాసేపయ్యాక అతనికి గట్టిగా ముక్కు చీదుతున్న శబ్దం వినిపించింది. చిత్ర సినిమా చూస్తున్న గది వైపు గా చూశాడు ఈశ్వర్. అక్కడ చిత్ర చేతిలో రుమాలు పట్టుకుని తడిసిన కళ్ళతో చూస్తూ వుంది సినిమా ని. ఈశ్వర్ అప్రయత్నంగా ముక్కు చీదుతూ, కళ్ళు తుడుచుకుంటూ సినిమా చూస్తున్న చిత్ర వైపు పదే, పదే చూడసాగాడు.
కన్నీళ్ళ తో ఆమె కళ్లు ఎర్రబడ్డాయి. బ్యాక్ గ్రౌండ్ లో ‘ కన్నీటికి కలువలు పూసేనా’ పాట వినబడుతోంది. చిత్ర కళ్ల వెంట నీళ్లు రావటం ఈశ్వర్ కి చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది.
* * * * * *
ఆఖరుగా కోటా శ్రీనివాస రావు దంపతులు దివ్యాంగుడైన అబ్బాయిని తన కవల సోదరుడి తో పాటుగా పెంచుకోవటానికి సిద్దపడటం ఆనందాన్ని కలిగించింది చిత్రకు. సినిమా ఐపోయిందని ఈశ్వర్ ని పిలుద్దామనుకుని తలెత్తింది చిత్ర. ఆ పాటికే తీక్షణంగా తన వైపు చూస్తున్న ఈశ్వర్ ఆమెకు కనిపించాడు. ఈశ్వర్ అలా తదేకంగా తన వైపే చూడటాన్ని చూసింది చిత్ర. తన పై పలువరస లోని నాలుగు పళ్ళు కనబడేలా నవ్విందొక సారి.
“సిన్మా ఐపోయింది.” అంది చిత్ర ఈశ్వర్ కి వినబడే విధంగా.
ఈశ్వర్ చిత్ర ఉన్న గది వద్దకు వచ్చాడు. మళ్ళీ నవ్వింది చిత్ర.
“ బావుందా సినిమా?” అని సమాధానం తెలిసే అడిగాడు ఈశ్వర్.
“హా! బాగుంది. ఈ సిన్మా నేను మస్తు సార్లు చూశ్న. ఐనా సూడాలన్పిస్తది బాగ.”
“ఓ, అంత నచ్చిందా?”
“ హా, ఈ సిన్మా సూశ్నప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తొస్తది.” అంది చిత్ర కాస్త భావుకమవుతూ.
ఈశ్వర్ ఏమీ మాట్లాడలేదు. చిత్ర కు మనస్సులో తన తల్లిని గూర్చి ఇంకా కొంత మాట్లాడాలని వుంది. తన తల్లి పట్ల మనస్సులో తనకు ఉన్న ప్రేమను మాటల రూపంలో బయటకు తేవాలని వుంది. కానీ శ్రోతగా ఉండటం ఈశ్వర్ కి ఇష్టమో లేదోనన్న సంశయం ఆమె మదిలో కదలాడుతోంది. ఒక నిమిషం పాటు వారి మధ్య నిశ్శబ్దం తాండవించింది. ఈశ్వర్ కి చిత్ర తన కుత్తుక లో ఏవో మాటలు దాచుకున్నట్లుగా తోచింది. ఏదో ఒకటి మాట్లాడి వారి మధ్యనున్న నిశ్శబ్దపు గోడను చేధించాలనిపించింది ఈశ్వర్ కి. తనకు తోచిన ఎన్నో మాటల్లో ఒక ప్రశ్నను ఎంపిక చేసుకున్నాడు ఈశ్వర్.
“ మీ అమ్మ గారి పేరేంటి?”
“ అమ్మ పేరు లక్ష్మి. నేను కడుపుల ఉన్నప్పుడే మా నాన్న చనిపొయ్యిండు. అమ్మ నాకు 12 ఏళ్లున్నప్పుడు ..” భావుకమయ్యింది చిత్ర. గద్గర స్వరంతో రెండు వాక్యాలు పలకగలిగిన చిత్ర స్వరం తరువాత పెగలనని మొరాయించింది.
ఏం మాట్లాడాలో తెలియలేదు ఈశ్వర్ కి. కావలసిన వాళ్ల చావు ఎంత నొప్పి కలిగిస్తుందో తెలుసతడికి. అనుక్షణం అమృత యొక్క జ్ఞాపకాలల్లో 'జీవించే’ ఈశ్వర్ కి చిత్ర యొక్క బాధ ను అర్థం చేసుకోవడానికి పెద్ద గా కష్టం కాలేదు. అవసాన దశలో అమృత పడ్డ నొప్పి ఈశ్వర్ గుండె లో ఇంకా పచ్చిగానే వుంది. కాన్సర్ రాకాసి అమృత యొక్క ఒక్కో కణాన్ని కబళిస్తుంటే ఒక నిస్సహాయుడైన ప్రేక్షకుడిగా మిగిలాడు ఈశ్వర్. ఆమె నొప్పి భరించలేక చిందించిన ప్రతి కన్నీటి బొట్టు ఈశ్వర్ హృదయాన్ని దహించి వేసింది. చిత్ర కళ్లల్లోని నీటి యవనికలను చూస్తున్నంతసేపు ఈశ్వర్ కళ్ళ ముందు అమృత యొక్క జీవితం లోని ఆఖరి అంకం మొత్తం అతని కళ్ళ ముందు 'రీలు’ లా తిరిగింది. అతని కళ్ళు చెమర్చసాగాయి.
చిత్ర తన కళ్ళను తుడుచుకుంటూ “ ఇది ఎప్పుడో అయ్యుండెలే. తర్వాత నేనింగ మా మామ కాడనే పెరిగిన. బా జూస్కుండు మామ నన్ను . ఇంగ అప్పుడప్పుడు అమ్మ నాకిట్ల గుర్తొస్తది అమ్మ నాకు.” అంది ఏమనాలో తెలియక.
'అప్పుడప్పుడు గుర్తురావడం’ అన్న మాట ఈశ్వర్ కి నచ్చలేదు బొత్తిగా. అమృత ను తాను ‘మర్చిపోనట్టుగా ‘ చిత్ర తన తల్లిని మర్చిపోకుండా ఎందుకుండలేదన్న ప్రశ్న అతన్ని తొలిచింది. చిత్ర లో అతడికి ఒక 'సాధారణ మనిషి’ కనిపించాడు. దూరమైన అయిన వాళ్ళను 'పోయిన వాళ్ళు’ గా చూసేంత ‘నేర్పు’ గల ఒక సాధారణ మనిషి ని చిత్ర లో చూశాడు ఈశ్వర్. చిత్ర కూడా 'అందరిలానే’ నన్న భావన అతనికి రుచించలేదు. ఒక రకమైన అసహనం అతన్ని ఆవహించింది. వెంటనే లేచి వడివడిగా తన గదిలోకి వెళ్ళి దడాల్న తలుపేస్కున్నాడు ఈశ్వర్. చివుక్కుమంది చిత్ర కు. తానేం తప్పుగా మాట్లాడిందో తెలియలేదామెకు. కానీ ఈశ్వర్ మనస్సుకి బాగా గాయమైందని మాత్రం అర్థమయ్యింది చిత్ర కి.
తలుపులు వేసుకున్న ఈశ్వర్ కి ఒక్కసారిగా తనను తాను సమీక్షించుకోవాలనిపించింది. తానెందుకు చిత్ర లా 'మామూలుగా’ ఉండలేక పోతున్నాడనే భావన అతని మస్తిష్కాన్ని ఆవహించింది.
అతని మదిలో అమృత తో గడిపిన జ్ఞాపకాల దొంతరలు తెరలు తెరలుగా కదలాడసాగాయి.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 13 users Like k3vv3's post
Like Reply
#33
ఇక్కడ పాఠక మితృలను ఈ కథ ఆకట్టుకున్నట్లు లేదనుకుంటాను.


మొత్తం 25 భాగాలు ఉండవచ్చు


ఆపేయమంటారా!!!
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#34
No brother... please continue...
[+] 1 user Likes Shabjaila 123's post
Like Reply
#35
ప్లీజ్ కంటిన్యూ చేయండి 
[+] 1 user Likes adultindia's post
Like Reply
#36
Janalaku (chitra) language nachaledhemo ani na abiprayam but story ithe bagundi
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#37
(24-06-2023, 06:55 PM)3vv3temp-trust-page Wrote: ఇక్కడ పాఠక మితృలను ఈ కథ ఆకట్టుకున్నట్లు లేదనుకుంటాను.


మొత్తం 25 భాగాలు ఉండవచ్చు


ఆపేయమంటారా!!!

K3vv3 garu! Good emotional story. Curious to see how you will take this story forward. 
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
#38
 Baagundi, story aapakandi . 
[+] 1 user Likes the_kamma232's post
Like Reply
#39
(24-06-2023, 06:55 PM)k3vv3 Wrote: ఇక్కడ పాఠక మితృలను ఈ కథ ఆకట్టుకున్నట్లు లేదనుకుంటాను.


మొత్తం 25 భాగాలు ఉండవచ్చు


ఆపేయమంటారా!!!

Different emotions
Different story

Contunie chayandi k3vv3 bro
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





[+] 1 user Likes taru's post
Like Reply
#40
Ipudeee complete chadivaaaaa , chalaa heart touching story anipistundi. Hatttsbofff
[+] 1 user Likes cherry8g's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)