Posts: 571
Threads: 2
Likes Received: 115 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
అనిరుద్ర మజాకా, చితగొట్టేస్తున్నాడు. తన నైజం, ఖచ్చితత్వం, సమానత్వం అన్ని సరిగ్గా పాటిస్తున్నాడు. ఇక పొతే ద్విముఖ తన బ్యాంకు బాలన్స్ మొత్తం ఇచ్చేసింది అంటే అనిమిసా ఫ్లష్ బ్యాక్ ఏంటో తెలుసుకోవాలని అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
అనిరుద్ర H/o అనిమిష - 12వ భాగం
అప్పుడే లోపలికి అడుగుపెట్టిన ద్విముఖ తన క్యారీబ్యాగ్ లో వున్న టిఫిన్ అందిస్తూ, కొత్త దంపతులు కదా అని నా వంతుగా అయ్యర్ హోటల్ నుండి టిఫిన్ పట్టుకొచ్చాను.
వస్తూనే మంచి సీన్ చూశాను. వాహ్ క్యా సీన్ హై... మా కెమెరామేన్ ని తీసుకురాలేదు ...
“మొగుడేసిన ముగ్గు' అని ఓ ప్రోగ్రామ్ తయారుచేసేదాన్ని” నవ్వుతూ అంది.
“మగవాడు ముగ్గులు వేయకూడదా? ఇవి ఆడవాళ్ళే చేయాలి... ఇవి మగ చేయాలి అని రాజ్యాంగంలో ఎక్కడా లేదే” అన్నాడు అనిరుద్ర. .. "
“నిజమే... మీరు హండ్రెడ్ పర్సంట్ కరెక్ట్... ముందు టిఫిన్ చేయండి. చల్లారిపోతుంది మీకిష్టమని అయ్యర్ హోటల్ నుంచి తెచ్చాను” అంది ద్విముఖ.
“ఇంత శ్రమపడి పొద్దున్నే తీసుకురావాలా? మేము చేసుకుంటాంగా” అంది అనిమిష.
“ఏదో ఫస్ట్ డే అని తెచ్చాను”
“నువ్వు కూడా మాతో జాయినవ్వు...” అంది అనిమిష ప్లేట్స్ లో టిఫిన్ సర్దుతూ.
“మా కార్తీక్ వుంటే బావుండేది. వాడికి అయ్యర్ హోటల్ ఇడ్లీలంటే చాలా ఇష్టం అన్నాడు అనిరుద్ర.
“ఎందుకు? తేరగా వచ్చాయనా?” అని నాలుక కరుచుకుంది అనిమిష.
“ఫోన్ చేసి రమ్మనండి” అంది ద్విముఖ.
“అక్కర్లేదు... నేను వచ్చేశాను” రొప్పుతూ వచ్చి అన్నాడు కార్తీక్.
“అరె.. అదేంట్రా... నీకప్పుడే ఇడ్లీ వాసన వచ్చిందా?” అడిగాడు అనిరుద్ర.
“కాదు ద్విముఖ కనిపించింది. నేను జాగింగ్ చేస్తుంటే ద్విముఖగారు ఇడ్లీలు ప్యాక్ చేయించుకోవడం చూశాను. ఖచ్చితంగా మీకోసమే అని అర్ధమైంది. నేనూ మీతో జాయిన్ అవ్వొచ్చని ద్విముఖగారిని పిలిచాను. అప్పటికే ఆటో కదిలింది...”
“అలాంటప్పుడు మరో ఆటో ఎక్కి రావొచ్చుగా. ఇలా పరుగెత్తుకుంటూ రావడమెందుకురా?”
“పాయింట్ నెంబర్ వన్... జాగింగ్ కదా అని పర్సు తేలేదు. పాయింట్ నెంబర్ టు... నీకు తెలుసుగా నాకు కుక్కలంటే ఎలర్జీ అని. నేను ఆటోని పిలుస్తూ పరుగెడుతుంటే ఓ కుక్క వెంటపడింది. అది ఆడకుక్కేమో... దాని బాయ్ ఫ్రెండ్ కుక్క గర్ల్ ఫ్రెండ్ కుక్క వెంటపడింది. ఆ రెండూ నా వెంటపడ్డాయి. జాగింగ్ కాస్తా రన్నింగ్ అయింది. పాయింట్ నెంబర్ త్రీ... ఆలస్యమైతే మీరెక్కడ నాకు టిఫిన్ మిగల్చకుండా తినేస్తారేమోనన్న భయం...” !
ద్విముఖ నవ్వింది. అనిమిష టిఫిన్ నాలుగు ప్లేట్లలో సర్దింది. నలుగురు టిఫిన్ చేశాక కాఫీ తాగి బయల్దేరారు. కాఫీ తానే కలుపుతానని చెప్పి కాఫీ కలిపి అందరికీ ఇచ్చింది అనిమిష. ద్విముఖ, కార్తీక్ వెళ్లిపోయారు.
***
“ఏం కూరలు వండను” నేల మీద కూర్చొని కూరగాయల్ని నేల మీద పరిచి అడిగాడు అనిరుద్ర.
“కూరలా.. బహువచనం లేదు... ఏకవచనమే... ఏదో ఒకటి వండండి” అంది అనిమిష.
“అదేంటి డాళింగ్... మూడు కూరలు... రసం... సాంబారు... వడియాలు... గడ్డ పెరుగు... మన మెనూలో ఇవేమీ ఉండవా?”
“ఆ ఉంటాయి... మీరు తాజ్ బంజారా ఛైర్మన్ కూతురినో, టాటా బిర్లాల వారసులో చేసుకుంటే... ఈ కూరలన్నీ వారం రోజులు రావాలి. ఒక పచ్చడి... ఒక కూర... రసం చాలు...”
“ఎట్లీస్ట్ కాస్త మజ్జిగ కూడా ఉండదా?”
“ఉండదు. అది వుంటే నా సంపాదనంతా వాటికే సరిపోతుంది” అనేసి అనిమిష బాత్రూమ్లోకి వెళ్లింది.
“హలో... బాత్రూమ్లో వున్న మహారాణి... ఆమ్లెట్ వేసుకోవచ్చా... అసలే మనకు నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగదు... ఆమ్లెట్ వుంటే అడ్జస్ట్ చేసుకుంటాను” గట్టిగా అరిచి అడిగాడు అనిరుద్ర.
“వేసుకోవచ్చు... ఎగ్ ఆమ్లెట్ కు అయ్యే గ్యాస్ మీ అకౌంట్లోకి వస్తుంది” బాత్రూమ్లో నుండే చెప్పింది అనిమిష.
“రొంబ థాంక్స్” అంటూ కూరలు తరగడం మొదలుపెట్టాడు.
టైం చూసుకుంది అనిమిష. తొమ్మిదిన్నర. కిచెన్ లోకి తొంగి చూసింది. కిచెన్లో నుండి ఘుమఘుమలు... అనిరుద్ర సీరియస్గా కూర కలుపుతున్నాడు.
“తొందరగా... ఆఫీసుకు టైం అవుతోంది” అరిచింది అనిమిష.
“వన్ మినిట్ ప్లీజ్...” అంటూనే అనిరుద్ర డిషెస్ ఒక్కోటి తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు.
“అవునూ... ఈ వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు?” అడిగింది అనిమిష.
“ఎక్కడా నేర్చుకోలేదు... జస్ట్ ప్రాక్టీస్ ప్రయోగం... అంతే “వ్వా...ట్” అదిరిపడి అంది అనిమిష.
“అవును. మనకు ఒకరి దగ్గర నేర్చుకునే అలవాటు లేదు. కాస్త మెదడుతో ఆలోచించి, టేస్ట్ చూసి చేసేయడమే” అంటూ అన్నం వడ్డించాడు ఆమె ప్లేటులో.
“ఫర్లేదు... నేను వడ్డించుకుంటాను” అంది అనిమిష. “వద్దులే... ఆనక వడ్డించలేదు... జీతంలో కట్... అంటే ప్రమాదం” అన్నాడు అనిరుద్ర.
అనిమష టమోట కర్రీ వేసుకుంది. కాస్త ఉప్పు తక్కువైనా బాగానే ఉంది.అనిరుద్ర డబుల్ ఆమ్లెట్ వేసుకొని తింటున్నాడు.
“అదేంటి... అన్నం తినరా?” అడిగింది అనిమిష.
“తినను... అన్నం బదులు ఆమ్లెట్. ఆ డబ్బులతో ఆమ్లెట్ తింటున్నాను. చాలా బావుంది విజయవాడ రైల్వేస్టేషన్లో బ్రెడ్ ఆమ్లెట్ బావుంటుంది. అప్పట్నుంచి అలా ఆమ్లెట్ వేయడానికి ట్రై చేస్తున్నాను”
“అలా ఒక్కడివే మింగకపోతే కాస్త ఇవ్వొచ్చుగా” అనుకుంది మనసులో. అతను ఆమ్లెట్ తినే విధానం చూసి నోరూరింది అనిమిషకు. అతడు ఆమ్లెట్ తింటూ వుంటే చూడాలనిపిస్తోంది. ఆమ్లెట్ చివర్లు పెదవుల మధ్య పెట్టుకొని తింటున్నాడు. ఆ క్షణం అతని పళ్ల మధ్య వున్న ఆమ్లెట్ ని సగం కొరికేయాలనిపించింది. పెదవులు తడుపుకుంది. గుర్రుగా చూసింది అనిరుద్రవైపు. అనిరుద్ర ఇదేమీ పట్టించుకోకుండా ఆమ్లెట్ తిని, ప్లేటు సింక్లో వేసి... వాష్ బేసిన్ దగ్గరకెళ్లి అద్దంలో మొహం చూసుకుంటున్నాడు. అనిమిష కోపంగా అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని ప్లేట్ పక్కనే వున్న ఆమ్లెట్ ని చూసి ఆశ్చర్యపోయింది..
“అది నీకోసమే... ఈ ఒక్క రోజు కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్” చెప్పాడు అనిరుద్ర.
ఒక్క క్షణం గిల్టీ ఫీలింగ్. అతడి గురించి తనెంత తక్కువగా ఆలోచించింది. 'కనీసం తన కోసం వండిన అన్నం కాస్త పెట్టినా సరిపోయేది” అనుకుంది.
****
అన్నం టిఫిన్ బాక్స్ లో పెట్టుకొని బయటకు నడిచింది అనిమిష.
“హలో... వన్ సెకన్” పిలిచాడు అనిరుద్ర.
ఆగి ఏమిటన్నట్టు చూసింది. అనిరుద్ర ఓ కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. అరటి ఆకులో మల్లెపూల మాల. అనిరుద్రవైపు చూసింది.
“మల్లెపూలలో మత్తు మందేమీ స్ప్రే చేయలేదు. కొత్తగా పెళ్లయిన అమ్మాయి మల్లెపూలు పెట్టుకోకుండా వస్తే ఆఫీసులో డౌటొస్తుంది. అయినా నన్నో మల్లెపూలు అమ్మే శాల్తీ అనుకో. నీకంతగా ఇష్టంలేకపోతే మల్లెపూల ఖరీదు ఇచ్చెయ్” అని ఆగాడు అనిరుద్ర.
చివుక్కుమంది అనిమిష మనసు. మౌనంగా ఆ మల్లెపూలను జడలో పెట్టుకుంది. అద్దంలో చూసుకుంది. కొత్త అందమేదో వచ్చినట్టు అనిపించింది.
“థాంక్స్...” అంది మనస్పూర్తిగా అనిమిష
“రొంబ వెల్కమ్... అలాగే వెళ్లేముందు బై చెప్పు... అఫ్ కోర్స్ నా కోసం కాదు. చుట్టుపక్కల వాళ్లు చూసి 'వాహ్' అనుకోవడం కోసం”
“బై” మనస్ఫూర్తిగానే చెప్పింది. ఆ క్షణం తనే అతని దగ్గరకెళ్లి అతణ్ణి గట్టిగా వాటేసుకుని ‘బై’ చెప్పినట్టు అతను తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి హత్తుకున్నట్టు ఫీలయ్యింది. ఆ ఫీలింగ్ ఆమెలో మధురోహలను శృతి చేశాయి.
***
అనిమిష వెళ్లాక ఇల్లంతా సర్దే కార్యక్రమంలో వుండగా కార్తీక్ వచ్చాడు. వస్తూనే లోపలికి తొంగిచూశాడు.
“కార్తీక్... లోపలికి రాకుండా ఏంటలా తొంగి చూస్తున్నావ్?” అడిగాడు అనిరుద్ర కార్తీక్ ని లోపలికి ఆహ్వానిస్తూ,
“సిస్టర్ వుందేమోనని”
“సిస్టరా? ఈ టైంలో వుండేది మిస్టరే. అయినా సిస్టర్ అంటే ఎందుకంత భయం? హాస్పిటల్లో సిస్టర్ ని చూసి ఇంజెక్షన్ పొడుస్తుందేమోనని భయం. ఈ సిస్టర్ కి భయపడ్డం ఎందుకు?”
“పెళ్లయితే మగవాడి స్వేచ్ఛ ఐస్లా కరిగిపోతుందని నా అభిమాన రచయిత సరసమైన కథలో రాశాడు” -
“నా బాడీ ఫ్రీజర్ లాంటిది. ఇక్కడ కరిగేవేమీ ఉండవు. మనసు తప్ప... ఇంతకీ విశేషాలేమిటి?”
“ఏమున్నాయి అనూ... నీ పెళ్లయ్యాక నన్ను ఒంటరితనం సునామీలా చుట్టేసింది”
“ఈ డైలాగ్ వింటే రీడర్స్ అపార్ధం చేసుకుంటారు. ఇంకోమాట చెప్పు... ఈలోగా నేను మొహం కడుక్కొస్తాను... అలా బయటకెళ్లి కాఫీ తాగొద్దాం” అన్నాడు అనిరుద్ర.
“అదేంట్రా అనూ... ఫ్రెండొస్తే కనీసం కాఫీ కూడా ఇవ్వొద్దంటుందా మీ ఆవిడ”
“అనదు.. ఆవిడ అనురాగదేవత... మట్టిలో మాణిక్యం...” “అమ్మోరు ఏమీ కాదు... పొగడ్తలు ఆపి విషయం చెప్పు”
“ఈ ఇంట్లో జరిగే ఖర్చులు ఫిఫ్టీ ఫిఫ్టీ... గెస్ట్లకు అయ్యే ఖర్చు ఎవరి గెస్ట్లు వస్తే వారే భరించాలి. ఆమె అకౌంట్లో కాఫీ తాగడం తప్పుకదరా...”
కార్తీక్ మోకాళ్ల మీద కూర్చున్నాడు.
“ఏం చేస్తున్నావురా...” కంగారుగా అడిగాడు అనిరుద్ర.
“నీ నిజాయితీ ముందు మోకరిల్లుతున్నాను. వెయ్యేళ్లు మీ చుట్టుపక్కల వాళ్ల ఆయుషు
పోసుకొని వర్ధిల్లరా...”
“థాంక్స్... పద” అంటూ తాళం కప్పతో బయటకు నడిచాడు అనిరుద్ర.
****
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
అనిరుద్ర H/o అనిమిష - 13వ భాగం
సాయంత్రం అనిమిష ఆఫీసు నుండి వచ్చేసరికి అనిరుద్ర చపాతీలు చేస్తూ కనిపించాడు. అలసటగా హ్యాండ్ బ్యాగ్ ను సోఫాలోకి గిరాటు వేసి, బాత్రూమ్లోకి వెళ్లి ఫ్రెషప్ అయ్యి... శారీ విప్పేసి, నైటీ కోసం చూస్తోంది అలవాటుగా.
అప్పుడే కాఫీ పట్టుకొచ్చిన అనిరుద్ర పెట్టీకోట్, బ్లౌజ్తో వున్న అనిమిషను చూసి అలాగే నిలబడిపోయాడు.
“ఏయ్... ద్విముఖా... ఏం చేస్తున్నావే...” అంటూ ఎదురుగా వున్న అనిరుద్ర చూసి కెవ్వున అరిచి రెండు చేతులను క్రాస్లా గుండెలకు అడ్డుపెట్టుకుంది.
“థాంక్యూ” అని కాఫీ కప్పు అక్కడ పెట్టి వెళ్లాడు . గబగబా చీర కట్టుకొని ఓరకంటి హాలులో కూర్చున్న అనిరుద్ర వైపు చూసింది. తనకు పెళ్లయ్యిందన్న విషయమే మర్చిపోయింది ద్విముఖ ఉన్నట్టే ఫీలై, అలవాటుగా నైటీ మర్చిపోయింది. తనని చూసిన అనిరుద్ర 'సారీ' చెప్పకుండా 'థాంక్స్” అని ఎందుకు వెళ్లిపోయాడు.
వెంటనే సిగ్గును పక్కన పెట్టి అనిరుద్ర దగ్గరకెళ్లి, “హలో... ఏమిటీ.. ఫ్రీ షో చూసినట్లు చూసి... చప్పున సారీ చెప్పకుండా 'థాంక్స్' అని చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి?” అని అడిగింది.
“శారీ లేకుండా మలయాళ కుట్టేలా కనిపించారు. ఇలాంటి క్లిప్పింగుల కోసం సినిమాలకెళ్తాం. నా పెళ్లాం అలా కనిపించేసరికి కర్టెసీ కోసమైనా థాంక్స్ చెప్పొద్దా. అయినా , ఇందులో మిస్టేక్ ఏముంది? డోర్ ఓపెన్ చేసి, షట్టర్ ఓపెన్ చేసినట్టుగా అందాల్ని క్యాట్ వాక్లా చూపిస్తుంటే నా తప్పేముంది...” అన్నాడు అనిరుద్ర.
“ఛీఛీ... మీ నోట్లో నోరు పెట్టడం నాదీ తప్పు” అంది అనిమిష.
“నా నోట్లో నువ్వు నోరెప్పుడు పెట్టావు? కనీసం ముద్దు కూడా పెట్టలేదు. కమల్ హాసన్ ఈ డైలాగ్ వింటే సంతోషపడిపోతాడు” అనిమిష రుసరుసలాడుతూ తన గదిలోకి వెళ్లిపోయింది.
****
అనిరుద్ర చేసిన కాఫీ ఆమెకు బాగా నచ్చింది. చపాతీ వాసన అదిరిపోతోంది.
“చపాతీలోకి ఏం చేస్తున్నారు? బంగాళాదుంప అయితే అదిరిపోతుంది” అంది కిచెన్ లోకి వచ్చి అనిమిష.
“అదిరిపోతే చెయ్... నాకూ ఆకలి దంచేస్తోంది” అన్నాడు అనిరుద్ర.
“నేనా... ఇప్పుడా...”
“నువ్వు కాకపోతే కరీనాకపూర్ వచ్చి చేస్తుందా? ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం చేస్తావా?” అడిగాడు అనిరుద్ర.
“మీరు చేయరా?”
“హలో... ఈవెనింగ్ డ్యూటీ నీదే... ఆఫీసుకు వెళ్లే హడావుడిలో వున్నావని మార్నింగ్ ఎక్స్ట్రా పనులు కూడా చేశాను”
అనిమిష వెంటనే బంగాళాదుంప కూర చేయడంలో మునిగిపోయింది.
* **
రాత్రి పది దాటింది. హాలులో కూర్చొని టీవీ చూస్తున్నాడు అనిరుద్ర. అనిమిషకు నిద్ర ముంచుకొస్తోంది. అనిరుద్ర పడుకున్నాక అతని పడగ్గదికి బయట్నుంచి తాళం వేయాలన్నది ఆమె ఆలోచన.
“హలో... నువ్వు పడుకునే వరకూ పడుకోను. నేను ముందే పడుకుంటే బయట్నుంచి తాళం వేసినా వేస్తావు” ఆమె మనసులోని ఫీలింగ్స్ చదివినట్టు అన్నాడు అనిరుద్ర.
“ఈ మనిషికి ఫేస్ రీడింగే కాదు... హార్ట్ రీడింగ్ కూడా తెలుసునేమో” అనుకుంది అనిమిష “మరి నేనేం చేయాలి?
. “ఓ పని చేద్దాం. నా కళ్లకు గంతలు కడతావా?” అడిగాడు అనిరుద్ర. “చేతులు కట్టేస్తాను” అంది అనిమిష.
“థాంక్స్... కళ్లకు గంతలు కట్టనందుకు”
“రెండూ... కళ్లకు గంతలు కడితే చేతుల్తో విప్పేసుకుంటారు”
“పోనీ కళ్లకు గంతలు కట్టకుండా చేతులు కట్టేయ్”
“అప్పుడు కళ్లు మిటకరిస్తూ అర్ధరాత్రి వచ్చి నా గదిలోకి తొంగి చూస్తే”
“ఛఛ... నీకింత అనుమానం అయితే ఎలా? పోనీ పక్కింటికెళ్లి పడుకోనా?” అడిగాడు ఒళ్లు మండి అనిరుద్ర.
“పక్కింటాయన ఊర్కోడు... ఒళ్లు చీరేస్తాడు” అంది అనిమిష.
రాత్రి పదకొండు అవుతుండగా అనిరుద్ర అనిమిష గది దగ్గరకొచ్చి, పిలిచాడు. అనిమిష తలుపు తీసి, 'ఏంటి?' అని అడిగింది.
“నోటితే చెప్తేగానీ నీకు సమ్మగా ఉండదా? బాత్రూమ్ కి వెళ్లాలి” కోపంగా చూసి.
“వెళ్లండి” అంది పక్కకు జరిగి.
“ఎలా వెళ్లను. గుడ్డి ముండావాడిని తీస్కెళ్లు” అన్నాడు అనిరుద్ర.
“నేనా.. ఛఛ... నేను తీసుకెళ్లను”
“అయితే కళ్ల గంతలు, చేతికి వున్న కట్లు విప్పు”
అనిమిష అతణ్ణి బాత్రూమ్ దగ్గరకి నడిపించుకుంటూ వెళ్లి, అతని చేతికి వున్న కట్లు విప్పింది. అయిదు నిమిషాల తర్వాత బాత్రూమ్లో నుండి బయటకు వచ్చాడు. మళ్లీ అతని చేతుల్ని కట్టేసింది. తాపీగా నడుచుకుంటూ బయటికెళ్లాడు అనిరుద్ర.
“అదేంటి... కళ్లకు గంతలు కట్టినా అలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్తున్నావ్...'
“అలవాటైంది... అన్నట్టు ఓ విషయం తెలుసుకో... కళ్ల గంతలు, చేతులకు , కడితే సరిపోదు. మనసుకు గంతలు కట్టుకోవద్దు” తన గదిలోకి వెళ్తూ చెప్పాడు అనిరుద్ర..
ఇంకెప్పుడూ అలా కళ్లకు గంతలు కట్టకూడదని, చేతులు కట్టి పడేయకూడదని నిర్ణయించుకుంది అనిమిష.
***
ఆఫీసు వదిలే సమయానికి వచ్చింది ద్విముఖ. .
“కొత్త కాపురం ఎలా ఉంది?” అడిగింది ద్విముఖ క్యాంటీన్లో కూర్చొని సమోసా తింటూ.
“నాకేం కొత్తగా అనిపించడంలేదు.. నీ బదులు అతను... కాకపోతే ఒక్కోసారి నాకే గిల్టీ ఫీలింగ్...”
“నీలో గిల్టీ ఫీలింగ్ మొదలైందీ అంటే అనిరుద్ర మీద సాఫ్ట్ కార్నర్ డెవలప్ అవుతోందన్నమాట... నువ్వు అతడి ప్రేమలో పడిపోతున్నావన్నమాట” అంది ద్విముఖ.
“ఛఛ... అలాంటిదేమీ లేదు”
“లేదని నీ నోరు చెప్తోంది. ఉందని నీ బుగ్గలోని ఎరుపు చెప్తోంది. ఇంతకీ నీ పని ఎంతవరకు వచ్చింది?”
“చాలావరకూ అయిపోయినట్టే.. అనిరుద్ర పేరు మీద బైక్ తీసుకోవాలని మా బాస్ ను 'లోన్' అడిగాను. అనిరుద్రతో మాట్లాడికానీ లోన్ శాంక్షన్ చేయనని చెప్పాడు. ఈ విషయం అనిరుద్రకు చెప్పాలి. ఆయన్నెలా కన్విన్స్ చేయాలో అర్ధంకావడంలేదు. పైగా చెక్ ఆయన పేరుతోనే ఇస్తాడట”
“పోనీ అనిరుద్రతో నేను మాట్లాడనా?” అంది.
“వద్దోద్దు... బావోదు... అతను అపార్ధం చేసుకుంటాడేమో” “ఏం చేస్తావ్?”
“ఏదో విధంగా నేనే మేనేజ్ చేస్తాను”
“సరే... అప్పుడే మీకు పెళ్లయి ఇరవై రోజులు దాటిందంటే నమ్మబుద్దేయడం లేదు” అంది ద్విముఖ.
“అవునవును” నవ్వుతూ అంది అనిమిష.
****
అనిమిష ఇంటికొచ్చేసరికి అనిరుద్ర పేపర్ చదువుతున్నాడు. అనిమిష ఫ్రెషప్ అయి వచ్చి, అనిరుద్ర పక్కనే కూర్చుంది.
“హలో... నేను అనిరుద్రని”
“తెలుసు... నా మొగుడు...” అంది అతనికి మరి కాస్త దగ్గరగా జరుగుతూ.
“ఏమో.. మళ్లీ గతంలోకి వెళ్లి... మన పెళ్లయిన విషయం మరిచి, నీ ఫ్రెండ్ ద్విముఖ అని కూర్చున్నావేమోనని”
“ఛఛ... అలాంటిదేం లేదు... అన్నట్టు మీకిష్టమైన స్వీట్ తెచ్చాను” అంటూ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది.
“నాకిష్టమైన స్వీటా... నా దృష్టిలో ముద్దు తప్ప... ఇంకేమీ స్వీట్గా వుండదే” అనిమిష పెదవుల వంక చూస్తూ అన్నాడు.
మరోసారి అయితే ఉక్రోషంగా ఏదో ఓ సమాధానం చెప్పేదే... కానీ ఇప్పుడలా కాదు.
“అది కాదు... మీకు తిరుపతి లడ్డు ఇష్టం కదా. మా కొలీగ్ తిరుపతి వెళ్తుంటే మీ కోసం ఓ లడ్డూ తీసుకురమ్మని చెప్పాను. తీసుకొచ్చింది” అంటూ లడ్డూ ప్యాకెట్ తీసి ఇచ్చింది.
ఓసారి అనిమిష వంక చూసి, “ఏంటీ.. ఈ రాత్రి లడ్డూలో మత్తు కలిపి ఇచ్చి పడుకోబెడదామనే...”
“ఛఛ... నిజంగా మీ కోసమే... మీకు నమ్మకం లేకపోతే నేను తింటాను...” అంటూ కొద్దిగా చిదిమి లడ్డూ కళ్లకు అద్దుకొని నోట్లో వేసుకుంది.
“కొద్దిగా తింటే నమ్మేస్తానా... సగమైనా తినాలి” అనిమిష సగం లడ్డు తను తీసుకొని మిగతా సగం అనిరుద్రకు ఇచ్చింది. అనిరుద్ర లడ్డూను కొద్దికొద్దిగా తింటూ, “ఇక రాసెయ్” అన్నాడు.
“ఏంటి?” అడిగింది అర్ధంకాక.
“ఐస్ రాసే పని ఏమైనా ఉందా?” అనిమిష వంక చూసి అడిగాడు.
“మీరలా అంటే నేనేమీ రాయను” అంది అలిగిన ఎక్స్ప్రెషనిస్తూ.
“సరే... ఏమీ అననుగానీ ఏంటీ విషయం?”
“పాప ఏడ్చిందా?”
“అలా కాదు సీరియస్... నేను మీ కోసం బైక్ కావాలని లోన్ కు అప్లయ్ చేశాను”
“బైకా... ఆల్రెడీ నాకోటి ఉంది. టివియస్ విక్టర్... మళ్లీ ఎందుకు? అయినా నేనంటే మీకు ఎంత ప్రేమ అనిమిషా? ఇంతకీ ఆ బైక్ ఫ్రీనా? ఇన్స్టాల్మెంట్లు నేను కట్టుకోవాలా? లేదా ఆ బైక్ మీద రోజూ నిన్ను దింపాలా?”
“అసలు బైకే కొనడం లేదు”
“కొనడం లేదా... మరి లోనెందుకు?”
"ఆ డబ్బుతో నాకు కాస్త పర్సనల్ పని ఉంది. నేను లోన్ ఇన్స్టాల్ మెంట్స్ పే చేస్తాను”
“అంటే లోన్ పేరుతో తీసుకుంటున్నావన్నమాట... అవునూ నాకో డౌట్... నన్నేమి ఇరికించవు కదా... నిన్ను చూస్తుంటే కృషీ బ్యాంక్ గుర్తిస్తోంది. నాకేం టెండర్ పెట్టవు కదా..
'ఒక్క క్షణం ఆమె కళ్లలో నుండి నీళ్లు ఉబికివచ్చాయి.
“అంత నమ్మకం లేకపోతే అప్పు వున్నట్టు ప్రామిసరీ నోటు రాసిస్తాను. ఆఫ్రాల్ అరవై వేలు నమ్మరా?” అంది ఏడుపును అదిమిపెట్టుకుంటూ..
“వద్దు... నవరసాల్లో నాకు నచ్చని రసం ఒకే ఒకటి... అది శోక రసం” చెప్పాడు అనిరుద్ర.
“అయితే మా బాస్ మీకు ఫోన్ చేసి లోన్ కావాలా? అని అడుగుతాడు. కావాలని చెప్పండి. చెక్ ఇస్తానంటాడు. తీసుకోండి. ఆ తర్వాత ఆ చెక్ క్యాష్ చేసి నాకివ్వండి”
“మనలో మాట ఈ డబ్బుతో షేర్లు కొంటున్నావా? బిజినెస్ చేస్తున్నావా?”
“ఏదో ఒకటి... ప్లీజ్” అని అనిమిష వెళ్లబోతుంటే...
“మీ బాసాసురుడు పొద్దున్నే ఫోన్ చేసి డిటైల్స్ అడిగాడు. చెక్ కూడా పంపించాడు. చెక్ ని క్యాష్ చేశాను. ఆ డబ్బు నీ గదిలో వుంది” అని చెప్పాడు అనిరుద్ర.
ఒక్క క్షణం ఆగి తన గదిలోకి వెళ్లి టేబుల్ మీద అరవై వేలు చూసింది అనిమిష. వెనక్కి పరుగెత్తుకొచ్చి అనిరుద్రను గట్టిగా వాటేసుకుంది చాలా గట్టిగా.
“థాంక్యూ.. థాంక్యూ...” అంది అతణ్ణి అలా పట్టుకొని. అప్రయత్నంగానే అతని చెయ్యి ఆమె తల నిమిరింది.
****
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
అనిరుద్ర H/o అనిమిష - 14వ భాగం
బ్యాంక్ నుంచి బయటికొచ్చింది అనిమిష బైక్ కోసం బాస్ ఇచ్చిన డబ్బును కూడా బ్యాంక్లో డిపాజిట్ చేసింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ద్విముఖ కనిపించింది.
“హాయ్... ఇదేంటి... రోడ్లన్నీ సర్వే చేస్తున్నావా?” అడిగింది అనిమిష.
“ఏ ప్రోగ్రామ్ చేయాలో అర్ధంకావడం లేదు. మా క్రియేటివ్ హెడ్ సంగతి తెలుసుగా... ఆలోచించండి.... వెరైటీగా... నాలా... అంటాడు. అతడాలోచించింది ఏమీ ఉండదు. మేము చించలేక చావాలి” అంది ద్విముఖ. ఆ అంది. “మేము టీవీ ఛానెల్స్ తిప్పుతూ క్షణాల్లో నిర్దాక్షిణ్యంగా మారుస్తూ ఉంటాం. మీకేమో “ఏ ప్రోగ్రాం చేయాలా? ఎలా డిఫరెంట్ గా ఉండాలా? అన్న తాపత్రయం” అంది అనిమిష.
“ఏం చేస్తాం? పీత కష్టాలు పీతవి... జార్జి బుష్ కష్టాలు సద్దాం హుస్సేన్ వి” అంది ద్విముఖ.
“పాలిటిక్స్ లోకి వెళ్లవా.... అద్సరేగానీ కాఫీ తాగుతావా?” అడిగింది అనిమిష.
“కాఫీనా...? అని ఆగి, “సరే పద... కాఫీలో కెఫిన్ మన మెదడును ఉత్తేజ పరుస్తుంది అంటూ కాఫీ షాప్ వైపు నడిచింది.
***
“ఇంతకీ ఏం పని మీద ఇటొచ్చావ్?”
“బ్యాంక్లో మనీ డిపాజిట్ చేద్దామని”
“ఎంత వరకొచ్చింది?” అడిగింది ద్విముఖ.
“వనెండాఫ్ వరకూ అడ్జస్టయ్యింది. ఇంకా మూడున్నర లక్షలు కావాలి. ఎంతగా సేవ్ చేసినా కుదరటం లేదు”
“పోనీ ఫైనాన్స్లో ట్రై చేద్దామా?” అడిగింది ద్విముఖ.
. “వద్దు... వడ్డీ భరించడం మన వల్ల కాదు” అంది . “పోనీ మీ ఆయన్ని అడక్కూడదా?”
“ఆయనా... మొన్నోసారి రెండోసారి కాఫీ అడిగానని దానికి నాలుగు రూపాయలు వసూలు చేశాడు. మనీ మైండెడ్ మొగుడు” అంది కచ్చగా.
“ఏమో... నాకు అలా అనిపించడంలేదు”
“ఎందుకనిపిస్తుంది... రెండు రోజులు ఆయనతో వుండి చూడు.. నీకే తెలుస్తుంది” అంది అనిమిష.
“నీకభ్యంతరం లేదా?” అడిగింది ద్విముఖ.
“ఏయ్... యూ... నాటీ” అంది అనిమిష .
“చూశావా... 'నా మొగుడు నాకే సొంతం' సినిమా అందుకే వచ్చింది” అనిమిష హాయిగా నవ్వింది. ఇద్దరూ కాఫీ తాగి డిస్పర్స్ అయ్యారు.
***
“హలో... ఎక్స్ క్యూజ్ మీ” అనిమిష ఆఫీసుకు బయల్దేరుతుంటే పిలిచాడు అనిరుద్ర.
"ఏంటీ...” ఆగి వెనక్కి తిరగకుండానే అడిగింది. “మన శాలరీ ఎప్పుడిస్తారు?”
“శాలరీనా? దానికింకా రోండ్రోజుల టైం వుందిగా... ఎప్పుడూ మనీ మనీ అని చంపుతావేంటి?”
"అది కాదు నాకర్జంటుగా కొంత అమౌంట్ కావాలి. ఓ ఫైవ్ హండ్రెడ్ సర్టగలవా?”
“ఏం... ఫైవ్ హండ్రెడ్ లేదా?”
“నా స్వార్జితం లేదు” చెప్పాడు ఒళ్లుమండి అనిరుద్ర.
“అయితే ఓ పని చేయండి. బీచ్ రోడ్డులో ఏదైనా పని వెతుక్కోండి” చెప్పి విసురుగా బయటకు నడిచింది.
“పోవే... రాక్షసి” కసిగా బయటకే అనేశాడు అనిరుద్ర. “ఏంటీ... ఏమన్నారు?” అనడిగింది వెనక్కొచ్చి.
“బైబై.. సీ.. యూ... అన్నాను" చెప్పాడు అనిరుద్ర.
* * *
ఆఫీసు వదిలిపెట్టగానే ఆటోలో బయల్దేరింది బస్సు కోసం వెయిట్ చేసే ఓపిక లేక అనిమిష, ఆటో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది.
ఓ వ్యక్తి ఆటో లోపలికి తల పెట్టి, “ఎక్స్ క్యూజ్ మి మేడమ్... అందమైన టెడ్డీబేర్... జత అరవై రూపాయలు. చాలా బావుంటాయి. టెడ్డీబేర్లను అందమైన అమ్మాయిలతో పోలుస్తారు. టెడ్డీబేర్ మీ ఇంట్లో వుంటే...” అతను చెప్తుండగానే తల తిప్పి చూసి షాకైంది అనిమిష.
ఎదురుగా అనిరుద్ర. టెడ్డీబేర్ బొమ్మలు చేతిలో పట్టుకుని తనకు చెప్తున్నాడు.
“మీరా..” షాకింగ్ గా అడిగింది.
“యస్ మేడమ్... టెడ్డీబేర్ కావాలా వద్దా.. మీకైతే యాభైకే...” అన్నాడు అనిరుద్ర.
“ఇదేంటి... అసహ్యంగా... ముందు ఆటో ఎక్కండి” అంది ఆటోడ్రైవర్ తనను చూస్తున్నాడేమోనని ఫీలవుతూ.
“సారీ... మా బాస్ జీతం ఇవ్వలేదు. అందుకే పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను. అన్నట్టు నీకు అన్నం వండి పెట్టాను. బాగా మెక్కి పడుకోవచ్చు. నాకు వద్దు” చెప్పాడు మెల్లిగా అనిమిష చెవిలో అనిరుద్ర.
ఆటోవాడు విచిత్రంగా రియర్ వ్యూ మిర్రర్ లో నుండి చూస్తున్నాడు.
“ఏయ్ టెడ్డీ బేర్.. కమ్ హియర్... అటు పక్క పాలియో కారులో నుండి ఓ మిడిల్ ఏజ్ ఆంగ్లో ఇండియన్ పిలిచింది.
“కమింగ్ మేడమ్...” అంటూ అటు వెళ్లాడు అనిరుద్ర.
అనిమిషకు ఇరిటేటింగ్ గా ఉంది. ఎప్పుడు అనిరుద్ర వస్తాడా? ఎప్పుడెప్పుడు దులపాలా? అని ఎదురుచూస్తోంది. తొమ్మిది అయింది. పది దాటింది. అయినా రాలేదు. కోపం క్రమక్రమంగా తగ్గుతోన్నట్టు అనిపించింది. కోపం స్థానే ఇంకా రాలేదే... అన్న ఆదుర్దా చోటు చేసుకుంది.
ఆ ఆదుర్గా స్థానే... పాపం అతనికి డబ్బుతో ఏం అవసరమో... తను ఇచ్చినా బావుండుననే ఫీలింగ్ చోటు చేసుకుంది. అతని కోసం పదకొండున్నర వరకూ ఎదురుచూసి తలుపు దగ్గరగా వేసి తన గదిలోకి వెళ్లి పడుకుంది. ఈసారి తన గదికి బోల్ట్ పెట్టలేదు.
***
ఎవరో తనను పిలిచినట్టు అనిపించి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది అనిమిష, ఒక్క క్షణం కంగారు... భయం... “ఏంటి... నా గదిలోకి వచ్చావ్?” కంగారుగా అడిగింది అనిరుద్రని.
“ఒక్కసారి అలా హాలులోకి వస్తావా?” అడిగాడు అనిరుద్ర.
“ఎందుకు?” అనుమానంగానే అడుగుతూనే లేచింది.
హాలు చీకటిగా అనిపించింది. హాలు లోపలికి అడుగు పెట్టి షాకయింది. హాలు మధ్యలో టేబుల్ మీద కేక్... క్యాండిల్స్ వెలిగించి ఉన్నాయి. కేక్ మీద... 'హ్యాపీ బర్త్ డే టు అనిమిష’ అన్న అక్షరాలు....
“మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే” చప్పట్లు కొట్టి అన్నాడు అనిరుద్ర. అనిమిష షాకయ్యింది. అప్రయత్నంగానే ఆమె కళ్లు చెమ్మగిల్లాయి.
“కమాన్ కేక్ కట్ చెయ్...” అంటూ చాకు చేతికి ఇచ్చాడు. 'కీ' ఇచ్చిన ఉమెన్ రోబోలా ఆమె కేక్ దగ్గరకి వెళ్లి కేక్ కట్ చేసింది.
“బీ హ్యాపీ... నువ్వెప్పుడూ హ్యాపీగా, నీకిష్టమైన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండాలి. దిసీజ్ మై స్మాల్ గిఫ్ట్... జస్ట్ ఫర్ హండ్రెడ్ వేల్యూ.. కైలాసగిరి వెళ్లి తెచ్చాను. నీకో విషయం తెలుసా... ఉదయం నుండి టెడ్డీ బేర్లు అమ్మితే వచ్చిన డబ్బుతో వీటిని కొన్నాను. చీరకే నాలుగు వందలు సరిపోయాయి. కైలాసగిరి నుండి లెఫ్ట్ అండ్ రైటే...” అనిరుద్ర చెప్తుంటే అతని మొహం వంకే చూస్తుండిపోయింది.
అతని మొహం వాడిపోయింది. కళ్లు ఎర్రబడి ఉన్నాయి. జుట్టు రేగిపోయింది. అంటే ఉదయం తనని శాలరీ అని అడిగింది. ఇందుకోసమా...
“నీ సర్టిఫికెట్స్లో నీ డేటాఫ్ బర్త్ ట్వంటీ ఫస్ట్ అని ఉంది. వన్స్ ఎగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే” అంటూ కేక్ ను ఆమె నోట్లో పెట్టాడు.
ఆ తర్వాత వెళ్లి లైట్ వేసి, మెయిన్ డోర్ క్లోజ్ చేసి తన గదిలోకి వెళ్తూ, “గుడ్ నైట్” అన్నాడు.
“ఆ చీర నాకెందుకు?” అని అడిగింది అనిమిష
“బర్త్ డే గిఫ్ట్... మన ప్రొఫెషనల్ అకౌంట్లోకి రాదు. నా భార్యకు నేనిచ్చే గిఫ్ట్. నచ్చకపోతే వదిలెయ్... ఎవరికైనా ఇచ్చెయ్” చెప్పాడు అనిరుద్ర.
అనిమిష అద్దం ముందు నిలబడింది. తను కట్టుకున్న చీర విప్పేసింది. పెట్టీకోట్ తో ఉంది. అనిరుద్ర తెచ్చిన చీర ఒంటికి చుట్టుకుంది. తర్వాత ఇష్టంగా కట్టుకుంది. చిత్రంగా అనిరుద్ర తనను చుట్టేసిన ఫీలింగ్ కలిగింది. ఆ చీరను విప్పేయబుద్ధికాలేదు. అలాగే
చిరతో పడుకుండిపోయింది. తెల్లవారుఝామునే అనిరుద్ర ఆ చీరలో తనను చూడకముందే విప్పేసింది.
“ఇవ్వాళ టిఫినేమిటి?” అడిగింది అనిమిష కిచెన్లో వున్న అనిరుద్రను.
“పైనాపిల్ కేక్” చెప్పాడు అనిరుద్ర.
“నేనడిగేది టిఫిన్”
“నేను చెప్పేది టిఫిన్ గురించే. నిన్న తెచ్చిన కేక్ ఫ్రిజ్ లో పెట్టాను. ఇవ్వాళ బ్రేక్ ఫాస్ట్ కు అదే. లంచ్ కు వంకాయ ఫ్రై” చెప్పాడు అనిరుద్ర.
“బుద్ధి వున్న వాడెవడైనా కేక్ ను బ్రేక్ ఫాస్ట్గా తింటాడా?” అడిగింది అనిమిష.
“హలో... ఎక్స్ క్యూజ్ మీ... వాయిస్ డౌన్ చేయండి. మన అగ్రిమెంట్లో బ్రేక్ ఫాస్ట్ రోజు విడిచి రోజు నా డ్యూటీ. బ్రేక్ ఫాస్ట్లో ఫలాన ఐటమే ఉండాలని ఏం లేదు. ఏం మొన్న అన్నం తిరగమోత పెట్టి ఇదే బ్రేక్ ఫాస్ట్ అంటే నేను తిన్లెదా? కావాలంటే చెప్పు పైనాపిల్ కేక్ ని కూడా తిరగమోత పెడతాను”
“ఛీ.. ఛీ...” అని బాత్రూమ్లోకి వెళ్లి వెంటనే బయటికొచ్చి, “నాకు వంకాయ వద్దు. టమోటా కర్రీ కావాలి” అంది.
“సారీ... టమోటా నో స్టాక్.... అన్నట్టు కూరలకు డబ్బులిచ్చి వెళ్లు”
“ఏం మొన్ననే ఇచ్చానుగా..”
“టమోటా కేజీ పదహారు. తమరిచ్చింది ఎనిమిది లెక్కన. వంకాయ పన్నెండు. తమరిచ్చింది ఆరు చొప్పున, పచ్చిమిర్చి పద్దెనిమిది. తమరిచ్చింది తొమ్మిది చొప్పున. తమరికి సగం సగం ఇచ్చి, సగం సగం నొక్కడం అలవాటా?” అనిరుద్ర అన్నాడు.
“నాకేం అలవాటు లేదు. మీకే లేకపోతే ధరలు అంతలా మండిపోతున్నాయా? వేరీజ్ బిల్లూ...” అడిగింది దీర్ఘం తీసి మరీ.
“యూ వాంట్ బిల్లూ... నీ హ్యాండ్ బ్యాగ్ కు చిల్లుపడేలా తెస్తాను బిల్లు” కసిగా అనుకున్నాడు అనిరుద్ర.
“సాయంత్రం నేనే తెస్తాను కూరగాయలు. అయినా కేజీల చొప్పున అక్కర్లేదు” అంటూ విసవిసా బాత్రూమ్లోకి వెళ్లింది అనిమిష
***
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
అనిరుద్ర H/o అనిమిష - 15వ భాగం
లంచ్ అవర్.
అనిమిష లంచ్ బాక్స్ తీసుకొని తన సీటులో నుండి లేచింది. అప్పుడే అనిరుద్ర వచ్చాడు. రిసెప్షన్లో వున్న భావన అనిరుద్రను చూసి లేచి విష్ చేసింది.
“హలో... బావున్నారా సార్... అనిమిషను పిలుస్తాను. ఉండండి” అంది.
“అక్కర్లేదు... మా ఆవిడకు స్లిప్ ఇచ్చి వెళ్తామని వచ్చాను. ఇది తనకు ఇవ్వండి” అంటూ ఓ స్లిప్ ఇచ్చాడు. దాని మీద టమోటా... పదహారు రూపాయలు కిలో, పచ్చిమిర్చి... పద్దెనిమిది రూపాయలు... వంకాయలు పన్నెండు రూపాయలు.. మొత్తం నలభై ఆరు రూపాయలు.. కొత్తిమీర రెండు రూపాయలు, కరివేపాకు రెండు రూపాయలు... మొత్తం యాభై రూపాయలు. అనిరుద్ర సార్ ఇచ్చినది నలభై రూపాయలు. బాకీ పది రూపాయలు... నాగలక్ష్మి, కూరగాయలమ్మి చేవ్రాలు... అని ఉంది.
అది చూడకూడదనుకుంటూనే చూసి, “ఇదేంటి సార్?” అని అడిగింది భావన క్యూరియాసిటీ ఆపుకోలేక.
“బిల్లు... మా ఆవిడ బిల్లు కావాలంది. ఎందుకైనా మంచిదని ఆఫీసుకొచ్చి ఇస్తున్నాను. అన్నట్టు ఈ పాన్ కూడా మా ఆవిడకివ్వండి. తనకు భోం చేయగానే 'కామత్ స్వీట్ పాన్' తినడం అలవాటు.
“మంచిది కాదు మొర్రో' అన్నా వినదు. మర్చిపోకుండా ఇవ్వండి” అంటూ మరో మాటకు అవకాశమివ్వకుండి వెనుదిరిగాడు అనిరుద్ర.
అనిమిష భయపడ్తూనే భావన దగ్గరికొచ్చింది. అప్పటికే భావన ఈ విషయాన్ని నిఖితకు పాస్ చేసింది.
“ఇదేం బావోలేదు అనిమిషా... మీ ఆయన్ని చూస్తుంటే జెంటిల్మెన్ లా ఉన్నాడు. అయినా కూరగాయలకు కూడా లెక్కలు అడుగుతావా.. మరీ అంత అనుమానం పనికిరాదే... పాపం... నాగలక్ష్మి అట... ఆవిడ చేవ్రాలు కూడా రాసుకొచ్చాడు. బంగారంలాంటి ఆయన్ని లెక్కలడుగుతావ్... ఆ పాప పరిహారానికి లక్షోత్తుల నోము నోయాల్సిందే” చెప్పింది నిఖిత.
భావన అనిరుద్ర ఇచ్చిన పాన్ని అనిమిషకు ఇచ్చి, దాంతోపాటు కూరగాయలు రేట్లు వున్న స్లిప్ కూడా ఇచ్చింది..
అన్నం తిని కోపంగా పాన్ని బయటకు గిరాటు వేయబోయింది. అయినా స్వీట్ పాన్ని గిరాటు వేయడం ఇష్టంలేక నోట్లో పెట్టుకొని అనిరుద్రను ఊహించుకుంటూ నమిలి నమిలి తినేసింది అనిమిష.
****
ఆఫీసు వదలగానే కూరగాయల మార్కెట్ కు వెళ్లింది. రెగ్యులర్గా కూరలు కొనే నాగలక్ష్మి దగ్గరకెళ్లింది.
“నమస్తే మేడమ్... బావున్నారా? అయినా ఇదేం బావోలేదు మేడమ్... పాపం సార్ ఎంత బాధపడ్డారు. మా ఆవిడ నమ్మడం లేదు. బిల్లు ఇవ్వమని అడిగారు. నాతో కాగితం రాయించారు. అయినా సారు చాలా మంచోరు...” నాగలక్ష్మి చెప్పుకుపోతోంది. అనిమిష కూరగాయలు కొనకుండానే ఇంటికొచ్చింది. అనిరుద్రను కరిచేయాలన్నత కోపంగా ఉందామెకు.
* * *
“అసలు మీరేమనుకుంటున్నారు? ఆఫీసుకు వచ్చి బిల్లు ఇస్తారా? నాగలక్ష్మితో చెప్పిస్తారా?” గయ్మంది ఇంటికి వస్తూనే అనిమిష.
“నువ్వేగా బిల్లు అడిగావ్... అందులో నా తప్పేముంది...” తాపీగా అన్నాడు. ఏమనాలో అనిమిషకు తోచలేదు. తనేమంటే అతనేమంటాడోనన్న భయం కూడా ఉంది.
“త్వరగా ఫ్రెషప్ అయి వస్తే వేడి వేడి కాఫీ రెడీ చేసి పెడతా... ఆ తర్వాత చల్లారింద లాభం లేదు” అన్నాడు అనిరుద్ర. ఆలస్యం చేస్తే చల్లారిన కాఫీ ఇస్తాడన్న భయంతో బాత్రూమ్లోకి దూరింది ఫ్రెషప్ అవ్వడానికి.
***
రోజులు గడిచిపోతున్నాయి. అనిరుద్రతో క...లి...సి...వుం...డ...డం... అనిమిషలో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు వున్నా, అతను ఆమెను ఎంత ఇరిటేట్ చేసినా అందులో ఏదో మత్తు వున్నట్టు అనిపిస్తోంది. మరో పక్క ఆమె సమకూర్చుకోవాల్సిన డబ్బు కూడా జమ అవుతూ వస్తోంది. అనిరుద్ర కాలిక్యులేటెడ్గా ఉంటాడు. ఓ రోజు సినిమాకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఎవరి డబ్బులు వాళ్లే పెట్టుకోవాలనుకున్నారు. ఆటోలో వెళ్లారు. కనీసం ఆటో డబ్బులైనా అనిరుద్ర ఇస్తాడనుకుంది. తన వంతుకు సగం డబ్బు ఇచ్చి కామ్గా థియేటర్ వైపు నడిచాడు.
మరోసారి సన్నజాజులు జడలో పెట్టుకోవాలని అనుకుంది. అదీ అనిరుద్ర కొనిపెడితే పెట్టుకోవాలని... సన్నజాజులు తెచ్చిచ్చి అందులో సగం డబ్బులు డిమాండ్ చేశాడు. అనిరుద్ర ఎలా ప్రవర్తించినా ఆమెలో ఉక్రోషం కలుగుతుందేగానీ ద్వేషం కలగడంలేదు. స్వీట్ పెయిన్ లా ఉంది.
****
“అప్పుడే మీ పెళ్లయి ఆరు నెలలు దాటిందంటే ఆశ్చర్యంగా ఉంది” అంది ద్విముఖ.
“నాకూ అలానే ఉంది. బెంగుళూరులో ఫైనల్ ట్రీట్ మెంట్ మొదలైంది. వన్ ఆర్ టూ వీక్స్లో సర్జరీ మొదలవుతుంది. ఈలోగా మొత్తం ఆరు లక్షలు సమకూరాలి. లోన్స్, అడ్వాన్స్లు, శాలరీ... అన్నీ కలిపి మూడు లక్షలు దాటలేదు” బాధగా నిట్టూర్చి చెప్పింది.
“చూద్దాం... మీ బాస్ ని పర్సనల్ లోన్ కూడా అడిగావ్గా”
“ఏం చేస్తాడో ఏమో... టైం తక్కువగా ఉంది” అంది అనిమిష.
“అనిరుధ్రను అడక్కూడదనే డిసైడ్ అయ్యావుగా” " “అవును... ఆయన అదో టైప్ మనిషి”
“ఇంతకీ ఇంతవరకూ 'అది' లేదా?” అడిగింది లోగొంతుకతో ద్విముఖ.
“అదేంటి.. అదంటే... ఏది?” ముందు అర్ధంకాక అడిగింది అనిమిష.
“అదంటే 'అదే'... మీ ఆయనతో “అది” అంది ద్విముఖ.
ఎర్రబడ్డ మొహంతో తలదించుకొని, “ఏదీ లేదు. అయినా ఆయన చేస్తోంది హజ్బెండ్ జాబ్... అందులోనూ టెంపరరీ..” చెప్పింది.
“పర్మినెంట్ చేసెయ్... 'అది'కి ఒప్పుకుంటే పర్మనెంట్ అయిపోతుంది”
“నాకిప్పుడు వేటి మీదా ఎలాంటి ఆశలు లేవు” అంది అనిమిష ఓ విషాద వీచిక ఆమెను ఆవరిస్తుండగా.
***
అనిరుద్ర కూరగాయలు తరుగుతున్నాడు. అనిమిష అతనికి హెల్ప్ చేస్తోంది.
“ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలు పేముంది. అన్న పాట నిజమే కదూ...” అడిగింది అనిమిష.
“కాదు... అసలు ఆడుతూ పాడుతూ పని ఎలా చేస్తారు? నీలా ఆ కూరగాయలు అటూ ఇటూ కెలకడం తప్ప” అన్నాడు అనిరుద్ర..
“మీకు వంకరగా తప్ప చక్కగా మాట్లాడ్డం రాదా?” ఉక్రోషంగా అంది అనిమిష.
“హలో... మనకు మాట్లాడ్డమే వచ్చు. అది ఎవరితో... ఎప్పుడు... ఎలా... ఎందుకు... ఏ స్టయిల్లో... ఏ పాట్రన్లో... ఏ విధంగా మాట్లాడాలో అన్నది ఎదుటివాళ్లను బట్టి డిసైడ్ చేసుకుంటాను”
“ఏంటి... ఏలు ఎ ఏలు ఉపయోగించారు. ప్రాస కోసమా...” అంది అనిమిష.
అప్పుడే ద్విముఖ వాళ్లిద్దరిని దగ్గరగా చూసి, “సారీ... డిస్ట్రబ్ చేశానా... తర్వాతొస్తాన్లే” అంది వెనక్కి వెళ్లబోతున్నట్టు నటిస్తూ,
“అంతొద్దు. వచ్చేయండి... ఇక్కడ అలాంటి 'అది' ప్రోగ్రామ్స్ ఏమీ జరగడంలేదు. అసలు మీ ఫ్రెండ్ 'ఇదికే ఒప్పుకోవడం లేదు. ఇక 'అది'కేం ఒప్పుకుంటుంది?”
“ఇది' అంటే ఏది?”
“అది”కి ముందు 'ఇది'... అబ్బ... చెప్పాలంటే నాకు సిగ్గు” అన్నాడు అనిరుద్ర.
“ఇదిగో ఇలాంటి తింగరి వేషాలే వద్దు. బీ సీరియస్... అయామ్ యువర్ బాస్..”
“నేనింకా బ్రాస్ అనుకున్నాను. సారీ... బ్రా..స్” అన్నాడు అనిరుద్ర.
ద్విముఖ నవ్వుతోంది. అనిరుద్ర ద్విముఖ వంక చూస్తూ, “ఎంత బాగా నవ్వుతున్నారు... నవ్వడం కూడా ఓ ఫైన్ ఆర్ట్... అందులో ఆడవాళ్ల నవ్వులకు అర్ధాలే వేరేలే” అన్నాడు అల్లరిగా.
“ఏంటీ... నవ్వుల్లో కూడా ఆడ.. మగ... నవ్వులుంటాయా?”
"వైనాట్... మీకో విషయం తెలుసా? మగవారికన్నా ఆడవారే 126 శాతం ఎక్కువగా నవ్వుతారట. ఓ పరిశోధనలో తేలిన అంశం. కాకపోతే మగవాళ్లు సెక్సీ జోకులను ఆస్వాదిస్తారు.
ఆడవాళ్లు అలాంటివాటి పట్ల ఆసక్తి చూపించరు. డిగ్నిటీగా వినగానే ఫ్రెష్ గా నవ్వొచ్చే జోకుతలే ఇష్టం. నవ్వితేనే ఎండార్ఫిన్లనే సహజ ఉత్పత్తి బాధానివారిణీలు పనిచేసేవి. అంతెందుకు.. బాగా నవ్వినప్పుడు మీ గుండె మీద చెయ్యి పెట్టుకొని చూసుకోండి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నవ్వడం ఆగిపోయిన తర్వాత ముఫ్పై సెకన్ల వరకు అలాగే కొట్టుకుంటుంది”
“మీకు చాలా విషయాలు తెలుసే....”
“ఆ విషయాన్ని మీ ఫ్రెండ్ గుర్తించడం లేదు” అంటూ అనిమిష వైపు చూశాడు.
“ద్విముఖ కాఫీ తెస్తానుండు” అంటూ లేచింది అనిమిష .
“నేను తీసుకొస్తాను... మీరు మాట్లాడుతూ ఉండండి”
“అక్కర్లేదు... మీరు తీస్కొస్తే సర్వీస్ ఛార్జ్ అని అకౌంట్ రాస్తారు”
“ద్విముఖగారు నాక్కూడా గెస్టే... నాలుగైదుసార్లు కాఫీ తాగించారు. దీనికి సర్వీస్ ఛార్జ్ వేయనులే” అంటూ కిచెన్ లోకి వెళ్లాడు అనిరుద్ర.
****
“అనిమిషా... నీకో గుడ్ న్యూస్... 'రియల్ అండ్ ఫెయిర్' పేరుతో బెస్ట్ కపుల్ పోటీ ఏర్పాటుచేశారు. దానికి చీఫ్ గెస్ట్ మా డ్రీమ్ టీవీ ఛైర్మన్, వాళ్లావిడే... జడ్జెస్ ఎవరో తెలుసా? మీ బాస్ శోభరాజ్... మా బాస్, మా బాస్ భార్య... ఇంకా కమిటీ వుందిలే.... ప్రైజ్ మనీ ఎంతనుకున్నావ్... అక్షరాల లక్ష...”
“లక్షా...” అంది కళ్లు పెద్దవి చేసి.
“లక్షణంగా లక్షే. ఆ విషయం నాకూ తెలుసూ...” కాఫీ కప్పులతో వచ్చి ఓ కప్పు ద్విముఖకు, మరో కప్పు అనిమిషకు ఇచ్చి తనో కప్పు తీసుకొని అన్నాడు అనిరుద్ర.
“తెలుసా... తెలిసేందుకు చెప్పలేదు”
“చెప్పడం ఎందుకు?”
“మనకు లక్ష వస్తుందిగా” అంది అనిమిష .
“మనకా... మనకెందుకు వస్తుంది. మనకు 'అది' జరగలేదుగా. 'అది' జరక్కుండా కూడా బెస్ట్ కపుల్ అని లక్ష ఇస్తారా? ఉండు కనుక్కుంటాను” అంటూ కాఫీ కప్పు కింద పెట్టి ఫోన్ చేయబోయాడు. ద్విముఖ నవ్వును బలవంతాన ఆపుకుంది.
“చూశావా ద్విముఖా... బాస్ అన్న జాలి కూడా లేదు” అంది అనిమిష.
“బాస్ అంటే బాధ్యత ఉండాలి. జాలి ఎందుకు?” సెటైరిగ్గా అన్నాడు అనిరుద్ర.
ద్విముఖ వాళ్ల మధ్య కలుగజేసుకొని, “ఇప్పుడు అసలు విషయం ఆలోచించండి. ఆ 'షో'లో పార్టిసిపేట్ చేస్తే మీకు బహుమతి రావచ్చు”
“నాకు నమ్మకం లేదు. ఈ తింగరి బుచ్చితో వెళ్తే ప్రైజేమొస్తుంది” అనిరుద్ర తేల్చేశాడు.
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
అనిరుద్ర H/o అనిమిష - 16వ భాగం
“మరెవ్వరితో వెళ్లే వస్తుందో...” కోపంగా అనిరుద్రవైపు చూస్తూ అంది అనిమిష.
“అబ్బ... మీ గొడవ ఆపండే...” అంటూ అనిరుద్రవైపు చూసి, “చూడండి అనిరుద్రా... దీంట్లో మీక్కూడా లాభం ఉంది” అంది ద్విముఖ.
“అవును... దీంట్లో గెలిస్తే.. ఒక నెల శాలరీ బోనస్గా ఇస్తా” అంది అనిమిష.
“ఏంటీ... లక్ష రూపాయలు గెలిస్తే... ఒక నెల శాలరీ బోనస్గా ఇస్తావా? థాంక్స్ ఓ పని చెయ్... షోకి నా ఫొటో తీసుకొని వెళ్లు. నేను రాను”
“నువ్వు రాకుండా వాడెలా ఇస్తాడు లక్ష?”
“మరదే... నీకు లక్షిస్తే... నాకు నెల బోనస్సేమిటి? నాదే మేజర్ పార్ట్... నాకు సిక్స్టి నీకు ఫార్టీ...”
“అక్కర్లేదు” అంది ఉక్రోషంగా అనిమిష.
వెంటనే ద్విముఖ అనిమిషను మోచేత్తో పొడిచి, “తొందరపడకు. అతణ్ణి జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి. అవసరం మనది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చినా యాభై వేలు వస్తుంది కదా” అంది.
అనిరుద్ర ఓ చెవి అటువేశాడు.
అనిమిష అనిరుద్రవైపు చూసి, “సరే సరే... ఫిఫ్టీ ఫిఫ్టీ... కానీ ఓ షరతు”
“షరతు కాదు. రిక్వెస్ట్ అనాలి. చెప్పు”
“సరే రిక్వెస్ట్... మిగతా నీ వంతు యాభై వేలు... నాకు అప్పుగా ఇవ్వాలి. నెలనెలా కొంత పే చేస్తాను”
“నాకు డౌట్ గా ఉంది. ఈ డబ్బంతా ఏం చేస్తున్నావు? ఏ స్విస్ బ్యాంక్ కో తరలించడం లేదు కదా... నన్నేమీ ఇరికించవు కదా” అన్నాడు అనిరుద్ర అనుమానంగా.
“నేను జెన్యూన్” అంది ఉక్రోషపడిపోతూ అనిమిష.
“థాంక్స్... సరే... ఏం చేస్తాం... బట్ వన్ కండీషన్... ఆ యాభై వేలకు ఇంట్రెస్ట్ పే చెయ్యాలి. లేకపోతే నీకు డబ్బివ్వడానికి నాకు ‘ఇంట్రెస్ట్’ ఉండదు”
“సరే...” అంది అనిమిష.
“పద... చెక్ తెచ్చేసుకుందాం” అన్నాడు అనిరుద్ర.
“ఏంటీ తెచ్చుకునేది... పోటీలో పాల్గొని బెస్ట్ కపుల్ గా ప్రైజ్ కొట్టేయాలి. ఈలోగా బాగా ప్రిపేర్ అవ్వండి” ద్విముఖ చెప్పింది..
“నేను బాగానే ప్రిపేర్ అవుతాను. వన్ మోర్ కండీషన్. పోటీలో నేను జీవించేస్తాను. ఆఫర్స్ ప్రైజ్ కోసమే... అందులో భాగంగా నేను తన నడుం మీదో, ఇంకెక్కడో చెయ్యి " దగ్గరకు లాక్కున్నా “ఇది’ పెట్టుకున్నా అభ్యంతరం పెట్టకూడదు”
“నేనొప్పుకోను” అంది అనిమిష.
“అయితే నేనూ ఒప్పుకోను” అన్నాడు అనిరుద్ర.
“అనిమిషా పోనీలేవే... ఎంత కాదన్నా నీ మొగుడే కదా. పైగా వోన్లీ ఎక్స్టర్నల్ యూజే కదా? అవసరం మనది కదా”
“ఇది అంటున్నాడు. 'ఇది' అంటే ఏమిటో కనుక్కో” అంది కాస్త మెత్తబడిపోతూ.
“మిష్టర్ అనిరుద్రగారూ... 'ఇది' అంటే ఏమిటో... అని అడుగుతోంది మా అనీమిష.
“అబ్బ... మీకేదీ అర్ధంకాదు... ఈ గవర్నమెంట్ బడిపిల్లలకు కండోమ్స్ ఇస్తుందిగానీ “ఇది' అంటే ఏమిటో చెప్పదు. ఇది అంటే... ఉమ్మా... ముద్దు” అన్నాడు నవ్వుతూ. ఈసారి అనిమిష ముఖం ఎర్రబడింది.
“వోన్లీ... ఒకే ఒక 'ఇది’. అంతకుమించి ఒప్పుకోను” అంది అనిమిష.
“రొంబ థాంక్స్...” అంటూ అల్లరిగా నవ్వి అక్కడ్నుంచి కిచెన్ లోకి వెళ్లాడు అనిరుద్ర.
“హమ్మయ్య... ఓ ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యింది. నువ్విక బెస్ట్ కపుల్ గా గెలవడానికి సిద్ధంగా ఉండు. ఎన్ని తెలుగు సినిమాలలో చూడలేదు ఇలాంటి సీన్లు... రెచ్చిపో... ఆల్ ద బెస్ట్... అన్నట్టు ఎల్లుండే పోటీ... ఈలోగా ప్రిపేర్ అవ్వండి. నేనొస్తాను” అంటూ బయల్దేరింది ద్విముఖ.
“ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను. ఛాన్స్ దొరికింది కదానని ఎక్కడిపడితే అక్కడ చెయ్యేస్తే ఊర్కోను” సీరియస్గా అంది అనిమిష.
“నేనూ ఇప్పుడే చెప్తున్నాను. ఛాన్స్ దొరికింది కదానని... నన్ను విదిలిస్తే ఊర్కోను. మూడ్ ని బట్టి, టైంని బట్టి, సిట్యుయేషన్ ని బట్టి నేను రియాక్టవుతూ ఉంటాను” అన్నాడు అనిరుద్ర.
“ఏదో ఒకటి చెయ్... ఊర్కోక చస్తానా... అవసరం నాది కదా”
“ఆ విషయం అండర్లైన్ చేస్కో..” అన్నాడు అనిరుద్ర. అనిమిష అద్దంలో తనను తాను చూసుకుంది. సింపుల్ గా ఉంది. ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయల్దేరారు.
బెస్ట్ కపుల్ పోటీ ప్రారంభమైంది. ఎక్కడ చూసినా జంటలే. ఫార్టీ ప్లస్ జంటలు కూడా ఉన్నాయ్. ప్రపంచంలోని ప్రేమనంతా ఒలకబోస్తున్నాయి. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోవడం... నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టుకోవడం, అన్నం తినిపించుకోవడం, వాటేసుకోవడం, నడుం చుట్టూ చేతులు వేసుకోవడం... లాంటి యాక్షన్ పార్ట్స్ యాక్షన్ కట్లు లేకుండానే మొదలయ్యాయి.
డ్రీమ్ టీవీ ఛైర్మన్, అతని భార్య, శోభరాజ్, ఓ టేబుల్ ముందు కూర్చున్నారు. వాళ్ల ముందు టీవీ ఉంది. ఆ ప్రిమిసెస్ అంతా క్లోజ్ సర్క్యూట్ టీవీ కెమెరాలు ఉన్నాయి. కొన్ని కెమెరాలు నిరంతరం ఆ దంపతుల చుట్టూ తిరుగుతున్నాయి.
టీవీ ఛానెల్స్, మీడియా వచ్చేసింది. ద్విముఖ, కార్తీక్లు ఓ వైపు నుండి ఆసక్తిగా గమనిస్తున్నారు. కెమెరా అనిరుద్ర, అనిమిషల మీద ఫోకస్ అయ్యింది. ఈలోగా మైక్లో జడ్జేస్
ఓ ప్రశ్న అడిగారు.
“ప్రేమంటే ఏమిటి?”
జంటలు తమ తమ నిర్వచనాలు చెప్పడం మొదలు పెట్టారు. చచ్చే వరకూ కలిసివుండేది. ప్రే అంటే ప్రేమించు. మ... అంటే మరచిపో... అజరామరం... అదో మైకం.. ఇలా ఎవరికి తోచిన సమాధానాలు వాళ్లు చెప్పారు. మైక్ అనిరుద్ర ముందుకొచ్చింది.
“ప్రేమంటే... అదో కెమికల్ రియాక్షన్. రసాయనిక చర్య. ప్రేమంటే మనకు తెలియనిది... మనసుకు మాత్రమే తెలిసింది. మన చేతల్లో చూపించలేనిది. ఎదుటి మనిషి మనసు పొరల్లోకి దూసుకువెళ్లేది” అని చెప్పాడు.
క్లాప్స్... క్లాప్స్... క్లాప్స్.... అనిరుద్ర మెల్లిగా అనిమిష చెవిలో గొణిగాడు.
“ఏమిటా గొణుగుడు... విషయమేమిటో?” అడిగింది లోగొంతుకతో అనిమిష.
మెల్లగా కిందికి వంగి ఎవ్వరూ చూడకుండా (కెమెరా తమవైపు వుందని గమనించి) అనిమిష నడుము మీద ముద్దు పెట్టుకున్నాడు. అనిమిష మొహం సిగ్గుతో గులాబీ తోటగా మారింది.
ఆ దృశ్యం చూసిన జడ్జెస్ నవ్వుకున్నారు ముసిముసిగా. ఈలోగా అనిరుద్ర ఆపిల్ కట్ చేస్తూ ఎవ్వరూ చూడకుండా అనిమిష చెవిలో 'సారీ' అని ఓసారి చెప్పేసి చాకుతో ఆమె చేతి వేలి మీద చిన్న గాటు పెట్టాడు. అనిమిష కెవ్వుమంది.
వెంటనే అనిరుద్ర కంగారు నటిస్తూ, “ఏమైంది అనూ...” అంటూ ఆమె తర్జని రక్తసిక్తం అవ్వడం గమనించి ఆమె చేతి వేలిని తన నోట్లోకి లాక్కున్నాడు.
జడ్జెస్ ఆ దృశ్యాన్ని అలానే చూస్తుండిపోయారు. అనిరుద్ర కర్ఛీఫ్తో ఆ వేలికి కట్టుకట్టాడు.
****
“డియర్ పార్టిసిపెంట్స్... బెస్ట్ కపుల్ పోటీ ముగిసింది. దంపతులు తమ దాంపత్య మధురిమలను మా ముందు ప్రదర్శించారు. ప్రేమంటే ఏమిటో సరైన నిర్వచనం చెప్పడమే కాదు తన భార్య చేతికి అయిన చిన్న గాయానికే తల్లడిల్లిపోయిన అనిరుద్ర ప్రేమను ప్రత్యక్షంగా చూసాం. “బెస్ట్ కపుల్గా ఎంపిక చేసి లక్ష రూపాయల బహుమతి అందిస్తున్నాం” జడ్జెస్ అనౌన్స్ చేసారు. శోభరాజ్ అనిరుద్ర దంపతులను మనస్పూర్తిగా అభినందించాడు.
*****
“మీకసలు... కాదు... కాదు... నీకసలు బుద్ధి ఉందా? ఎంత శాడిస్ట్ వి కాకపోతే చాకుతో వేలి మీద గాయం చేస్తావా? ఏం నువ్వే కోసుకోవచ్చుగా. పైగా నా వేలేమైనా ఐస్ ఫ్రూట్ అనుకున్నావా? ఛాన్స్ దొరికింది కదా అని అదే పనిగా అరిగిపోయేంతవరకూ చప్పరిస్తావా? ఛ..ఛ... పది సబ్బులు అరగదీసి ఆ వేలిని కడుక్కోవాలి. అరడజను డెట్టాల్ బాటిల్స్తో క్లీన్ చేసుకోవాలి” ఇంటికి వచ్చాక అప్పటివరకూ వున్న ఉక్రోషాన్ని తిట్ల రూపంలో వెళ్లగక్కింది అనిమిష.
అనిరుద్ర ఆ తిట్లను కామ్ గా విన్నాడు.
“ఏంటీ... నేను నోరు నొప్పి పుట్టేలా తిడ్తుంటే... మిడ్ నైట్ మసాలా చూసినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటి? అక్కడే పీక పిసికేయాలనుకున్నాను” మరింత ఇరిటేటింగ్గా అంది.
“హలో... ఏంటీ తెగ రెచ్చిపోతున్నావ్... ఏదో నీకు బహుమతి తెచ్చిపెడదామని.. కాస్త ఓవరాక్షన్ చేశాను. అసలు నా నోటిని యమునా నదిలో కడుక్కోవాలి. కృష్ణా నదిలో స్నానం చేయాలి” అన్నాడు అనిరుద్ర.
“బహుమతి కోసం అంతసేపు వేలు చప్పరించాలా? అయినా ఆ కోసుకునే వేలేదో నువ్వు కోసుకోవచ్చుగా” అంది ముక్కుపుటాలెగరేస్తూ అనిమిష.
అనిరుద్ర అటూ ఇటూ చూసి కిచెన్ లో నుండి చాకు తీసుకొచ్చి, “అయితే నా వేలు కోసుకుంటాను. నువ్వొచ్చి చప్పరించు” అన్నాడు ఆమెను రెచ్చగొడ్తూ.
“ఛీ.. ఛీ... నోరు విప్పితే సెన్సారే..”
“థాంక్స్... భళారే...” అన్నాడు అనిరుద్ర.
“నీ మొహం చూడాలంటేనే ఇరిటేటింగ్ గా ఉంది. నాక్కనిపించకు... నిన్నీ క్షణమే మొగుడి పోస్టు నుండి పీకేస్తున్నాను” అంది అనిమిష.
“రొంబ థాంక్స్... నా లెక్క సెటిల్ చెయ్... అమౌంట్ క్లియర్ చెయ్యి. రేపే ఇంటర్నెట్లో యాడ్ ఇస్తాను. హాయిగా ఏ చైనా అమ్మాయినో చేసుకొని మొగుడి జాబ్ చేసి పెడతా...”
“మీ ఫేస్ కు కరెక్ట్ సూటబుల్” అంది అనిమిష.
"వన్స్ ఎగైన్ రొంబ థాంక్స్” అంటూ బయటకు నడిచాడు అనిరుద్ర.
****
అనిరుద్ర బయటకెళ్లి రాత్రి పదకొండు అయినా రాలేదు. ఒక్కదానికి అన్నం తినబుద్దికాలేదు. వాష్ బేసిన్ దగ్గరకి వెళ్లి చెయ్యి కడుక్కోబోయి ఆగింది. కుడి చెయ్యి చూపుడు వేలు... అనిరుద్ర నోట్లో పెట్టుకున్న వేలు... ఆ వేలిని కడుక్కోవాలనిపించలేదు. తన పెదవులకు ఆన్చుకుంది. అర్ధరాత్రి పదకొండు అవుతుండగా అనిరుద్ర నుండి ఫోన్.
“హలో... నేను అనిరుద్రను”
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
అనిరుద్ర H/o అనిమిష - 17వ భాగం
అప్పుడే అనిరుద్ర కనిపించక ఒక రోజు దాటింది. అనిరుద్ర లేని లోటు తెలుస్తోంది. ఎప్పుడూ గిల్లికజ్జాలు... మాటకు మాట అన్నా... అనిరుద్ర ఎంత తిట్టినా, ఆ తిట్టులో ఇష్టం.. ఆ సెటైర్లో ఎఫెక్షన్ ఆమెకు గుర్తిస్తోంది. సరిగ్గా అప్పుడే ద్విముఖ వచ్చింది.
“ద్విముఖా... ఎల్లుండిలోగా మరో రెండు లక్షలు సర్దితే సరిపోతుంది. కాకపోతే ఆయనకు ఓ రెండు లక్షలు బాకీ ఉంటాను” అంది అనిమిష.
****
“అనిరుద్ర కనిపించడం లేదేంటి?” అడిగింది ద్విముఖ..
“ఆయనకేదో రాచకార్యాలున్నాయట. పెళ్లాన్ని ఒంటరిగా వదిలి ఎలా వెళ్లాలని అనిపించిందో... పైగా డబ్బో... డబ్బో... అంటాడు” అంది అనిమిష.
“అనిరుద్ర గురించి అలా మాట్లాడకు. అయినా నాకో సంగతి చెప్పు. నిజంగా అనిరుద్ర అంటే నీకు ఇష్టం లేదా? కేవలం అతణ్ణి ఓ మొగుడు జాబ్ చేసే వ్యక్తిగానే చూస్తున్నావా?”
ద్విముఖ ప్రశ్నకు అనిమిష తలదించుకుంది.
“నువ్వు అనిరుద్రను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలియదుగానీ... అనిరుద్ర నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. మగవాడు.. సప్తపది నడిచి, మూడు ముళ్లు వేసి, చేతిలో చెయ్యి వేసి నువ్వే నా భార్యవి... నీ కష్టాలు, కన్నీళ్లు నావి అని ప్రమాణం చేసి ఏమాత్రం ఛాన్స్ వున్నా... డబ్బా కొట్టుకుంటాడు. కానీ అనిరుద్ర అలాంటి ప్రమాణాలు ఏమీ చేయకపోయినా, మిమ్మల్ని కట్టిపడేసే సంబంధం లేకపోయినా, నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు” ద్విముఖ సీరియస్ గా చెప్పింది.
చేయగలిగే గొప్ప గుణం ఆ బెస్ట్ కపుల్గా సెలక్టయ్యా క... రాత్రి నా దగ్గరకొచ్చాడు
“నిజమా... నీకెలా తెలుసు?!”
"ప్రేమించే మనిషికి ఆమె మనసులో నుంచి మాట బయటకు రాకుండానే ఏదైనా గొప్ప గుణం అనిరుద్రకు వుందని తెలిసింది కాబట్టి. అసలేమైందో తెలుసా? మీరు
గా సెలక్టయ్యాక... ఆ డబ్బును నీకిచ్చి నీతో ప్రామిసరీ నోటు రాయించుకున్నాక " దగ్గరకొచ్చాడు అనిరుద్ర. అప్పుడేం జరిగిందంటే...” అంటూ చెప్పడం మొదలు పెట్టింది ద్విముఖ.
****
రాత్రి పది దాటుతుండగా వచ్చిన అనిరుద్రను చూసి ద్విముఖ షాకైంది.
“ఇదేంటి... ఈ టైమ్లో... కొంపదీసి అనిమిషతో గొడవపడ్డారా?” అతణ్ణి ఆహ్వానిస్తూ అడిగింది ద్విముఖ..
“మీరు అనిమిషకు నిజంగా బెస్ట్ ఫ్రెండేనా?” సూటిగా అడిగాడు అనిరుద్ర.
“అదేంటి? ఆ డౌట్ ఎందుకొచ్చింది?”
“ఎందుకొచ్చిందంటే... అనిమిష మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆమె కష్టాల్లో వున్నప్పుడు గమనించకుండా వుండడం వల్ల వచ్చింది” .
“వాడూ యూ మీన్” “మీ ఫ్రెండ్ ఏదో సమస్యలో వుంది కదూ”
“అవును” అంది ద్విముఖ తల వంచుకొని.
“ఏమిటా సమస్య?”
“అది మీకెందుకు చెప్పాలి?”
“నేను అనిమిష భర్తను కాబట్టి. ఆమె సుఖాల్లోనే కాదు... కష్టాల్లో కూడా నాకు భాగం వుంటుంది కాబట్టి, ఆమె మంచి చెడులు నేనే చూడాలి కాబట్టి...”
అనిరుద్ర మాటలకు అలాగే చూస్తుండిపోయింది ద్విముఖ.
“అవును... నేను ఆమె దగ్గర భర్త ఉద్యోగమే చేస్తూ ఉండవచ్చు. అయినా ఆమెను ప్రేమిస్తున్నాను తోటి మనిషిగానే కాదు... నా చిటికెన వేలు పట్టుకొని... నాటకమే అయినా... మనసులో లేకపోయినా... నన్ను పదిమంది కోసం భర్త అని గౌరవించినందుకు... ఆమె కష్టాలను పట్టించుకోకపోతే నా వ్యక్తిత్వానికి అర్థమేలేదు...”
“సారీ... మీలో అనిమిష మీద ఇంత ప్రేమ ఉందనుకోలేదు. అసలేం జరిగిందంటే...” అని చెప్పడం మొదలు పెట్టింది.
"అనిమిషకు ఒకే ఒక చెల్లెలు ఉంది. తన పేరు సుధ. ఆమె తప్ప మరెవ్వరూ లేరు. చెల్లెలంటే ప్రాణం. బెంగుళూరు నుండి వస్తుంటే రోడ్డు పక్కనే వున్న చెట్టు కొమ్మ బలంగా తాకడంతో ఆమె ప్రయాణిస్తున్న బస్సు పై కప్పు ఎగిరిపోయింది. అందులో వున్న వాళ్లల్లో పదిమంది చనిపోయారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు”
“అవునవును... చాలాకాలం క్రిందట జరిగింది. ఆ వార్త చదివిన గుర్తు”
“తీవ్రంగా గాయపడ్డ వాళ్లలో అనిమిష చెల్లెలు సుధ కూడా ఉంది. మొహం నుజ్జునుజ్జు అయ్యింది. చాలామంది డాక్టర్లు చేతులెత్తేశారు. ఓ న్యూరో సర్జన్ ముందుకొచ్చాడు.
“అనిమిష బెంగుళూరులో వున్న ఇల్లు... తన ఒంటి మీద వున్న బంగారం... అన్నీ అమ్మేసి అనేక ఆపరేషన్లు చేయించింది. సుధ మొహం ఓ రూపానికి వచ్చింది. మందులకయ్యే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ జాబ్ చేస్తూ తను చాలా పొదుపుగా వుంటే చెల్లెలికి డబ్బు పంపిస్తూ
వచ్చింది. ఈ విషయం మొన్న మొన్నటివరకూ నాకూ తెలియదు. వాళ్ల బాస్ పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినా ఎందుకు చేసుకోలేదో తెలుసా? ముందు తన చెల్లెలు బాగుడాలి. తన పెళ్లి చెయ్యాలి. ఆ తర్వాత తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకోవాలి. అంతేగానీ డబ్బుకోసం బాస్ ని మోసం చేయడానికి ఇష్టపడలేదు” అదే సమయంలో మీ ప్రకటన చేస్తుంది. ఇందులో మోసం లేదు... రెండు పక్షాలకూ అంగీకారమే. మిమ్మల్ని చేసుకుంటే డబ్బు సమకూరుతుంది. తన సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే మీకు మొగుడు ఉద్యోగం ఇచ్చింది. ఆ విధంగా మిమ్మల్ని కూడా మోసం చేసే ఉద్దేశం తనకు లేదు”
“ఆఫీసులో అడ్వాన్సుగా తీసుకున్నా, గిఫ్ట్ డబ్బు కలెక్ట్ చేసుకున్నా, బెస్ట్ కపుల్గా డబ్బు వచ్చినా, మీ దగ్గర అప్పు చేసినా చెల్లెలి కోసమే. ఇంకా అనిమిష చెల్లెలు సుధకు దవడ ఎముక పెరగాలి. కృత్రిమంగా పళ్లు కట్టాల్సి ఉంది. కంటిని కూడా అమర్చాలి. ఆపరేషన్ కోసం ఇంకా అయిదారు లక్షలు కావాలన్నారు. ఇతరుల సాయాన్ని అర్ధించడానికి ఆమె అభిజాత్యం అడ్డు వచ్చింది. మీ వల్ల చాలా సమకూరింది. ఇంకా రెండు లక్షలు కావాలి. అందుకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది”
“నిజం చెప్పాలంటే... ఇన్ని బాధల మధ్య మీతో గొడవపడ్డా ఆమెకు మీతో రిలీఫ్ కలుగుతోంది. ఇదీ అనిమిష జీవితం వెనుక పరుచుకున్న విషాదపు క్రీనీడ” చెప్పింది ద్విముఖ.
“థాంక్యూ... ఇప్పటికైనా నిజం చెప్పారు” అంటూ లేచాడు అనిరుద్ర.
"ఈ విషయం అనిమిషకు చెప్తారా?” అడిగింది ద్విముఖ.
. “చెప్పను... అసలు అనిమిషను కొన్ని రోజులపాటు కలవను”
“ఎందుకని... మొత్తంగా ఆమె జీవితంలో నుంచి తప్పుకుంటారా?” ఆందోళనగా
అడిగింది.
'లేదు... నా భార్య చెల్లెలిని... నా మరదలిని కాపాడుకుంటాను. బావ స్థానంలో పెద్దగా నా బాధ్యత నెరవేరుస్తాను. ఒక్క విషయం... ఈ సంగతి అనిమిషకు
చెప్పకండి. నా భార్య అభిజాత్యం దెబ్బ తినడం భరించలేను. తనో ఉత్త మొద్దుమొహం” ఈ అన్నప్పుడు అనిరుద్ర కళ్లల్లో సన్నటి కన్నీటి పొర.
****
అదీ జరిగింది. ఆ తర్వాత కార్తీక్ ద్వారా తెలిసింది. అనిరుద్ర తన బైక్ అమ్మేశాడని. తనఖా పెట్టి ఆ డబ్బుతో బెంగుళూరు వెళ్లాడు. మీ చెల్లెలి ఆపరేషన్ నీ స్థానంలో
వుంది చేయించాడు. అనిరుద్ర డబ్బు వెంటనే సర్దడం వల్ల నీకు చెప్పిన టైమ్ కన్నా ముందే ఆపరేషన్ చేసేశారు డాక్టర్లు” చెప్పింది ద్విముఖ.
ఒక చిన్న ఉద్వేగం వేనవేల భూకంప ప్రకంపనలయ్యాయి. ఒక చిన్న సన్నటి కన్నీటిపా వేనవేల సునామీలయ్యాయి.
“ఏయ్... అనూ... ఏంటి?”
“ద్విముఖ... నేను అనిరుద్రను మిస్సయ్యాను. ఆయన మిసెస్ అయి కూడా. నాకిప్పుడు సిగ్గు, బిడియం వదిలి ఆయనను గట్టిగా వాటేసుకోవాలని ఉంది” నిజాయితీగా చెప్పింది అనిమిష.
“అయితే ఎందుకాలస్యం? నేనై..” అన్న మాటలు వినిపించి తలెత్తింది.
ఎదురుగా అనిరుద్ర... మొహమంతో వాడిపోయి ఉంది. ఆ పక్కనే తన చెల్లెలు... ప్రమాదానికి గురి కాకముందు ఎలా వుందో.. అచ్చంగా అలాగే ఉంది.
“అక్కా.. బావ చాలా బావున్నాడు. స్మార్ట్ గా ఉన్నాడు...” చెల్లెలు అంటోంది. ఆ క్షణం చెల్లెల్ని పలకరించాలని కూడా అనిపించలేదు.
తనకిప్పుడు తల్లి తండ్రి సర్వం... తన దైవం అనిరుద్రే. పరుగెత్తుకెళ్లి అతణ్ణి తన దగ్గరకు లాక్కొని వాటేసుకుంది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు రాలి అతని గుండెను అభిషేకిస్తున్నాయి.
****
ఆ గదిలో ఇద్దరే ఉన్నారు. అనిరుద్ర... అనిమిష.
ఇద్దరూ మౌనాన్నే ఆశ్రయించారు. అనిరుద్ర ముందు కదిలి అనిమిష చుబుకాన్ని పైకెత్తాడు. ఆమె కళ్లు కిందికి వాలాయి. అతని చూపులు ఆమె నడుమందాల వైపు మళ్లాయి ఆ సిట్యుయేషన్ లో కూడా. అతను తన నడుం వంక, నడుం మడత వంక చూస్తున్నాడని తెలిసినా తన చీర కొంగును నడుమందాలకు అచ్ఛాదనగా మార్చుకోలేదు. ఆ నడుం అనిరుద్రదే అన్నట్టుగా ఉంది.
“అనిమిషా... మాట్లాడవేంటి?”
“ఏం మాట్లాడను... మాట్లాడ్డానికి స్వర పేటిక సిద్ధంగాలేదు. అది మౌనాన్నే ఆశ్రయించింది. నన్నెందుకు పర్మినెంట్గా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు... ఎందుకు మొగుడి పోస్ట్ లోకి వచ్చారు?” చిన్నపిల్లలా అడిగింది ఏడుస్తూ.
“పోనీ... నన్ను పర్మినెంట్గా మొగుడు పోస్ట్లో కొనసాగించు” “మొగుడి పోస్ట్ కి మీరు రిజైన్ చేస్తే మిమ్మల్ని చంపి నేను చస్తాను” కోపంగా అంది.
“పిచ్చి అనిమిషా... నేనెందుకు మొగుడి పోస్ట్ లో జాబ్ చేస్తున్నానో తెలుసా? నాకే ఉదోగ్యం దొరక్క కాదు. చేయలేకా కాదు”
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
అనిరుద్ర H/o అనిమిష - చివరి భాగం
“మరి?!”
చాలామంది హౌస్ వైఫ్ అంటే చులకన. భార్యలు ఇంటి పట్టునే ఉంటారు. అదేమైనా జాబ్ చేయడం కన్నా గొప్పనా? అన్న ఫీలింగ్... నిజంగా భర్త హోదాను ఓ ఉద్యోగంగా భావిస్తే హౌస్ హజ్బెండ్లా వుంటే... నా భార్య పడే బాధలు... నా భార్యలో కలిగే ఫీలింగ్స్ ఏమిటో తెలుస్తాయి... అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్. భర్త అనుబంధాన్ని ఉద్యోగ బంధంగా మారిస్తే ఎలా ఉంటుందో... అందులోని సరదాలు... అల్లర్లు... కిలికించితాలు... గిలిగింతలు... గిల్లికజ్జాలు ఎలా వుంటాయో తెలుసుకొని వాటిని మధుర జ్ఞాపకాలుగా, మధురోహలుగా సృష్టించుకోవాలి.
నీ అమాయకత్వం నన్నూ ఆకర్షించింది. నీ నిస్సహాయత నన్ను కదిలించింది. నీ నిజాయితీ నన్ను నీ కౌగిలిలో కట్టి పడేసింది. అందుకే మొగుడి ఉద్యోగం నీ దగ్గరే చేశాను”
అనిమిష వార్డ్రోబ్ దగ్గరికి వెళ్లి షరతుల కాగితం, అగ్రిమెంట్ కాగితం తీసుకొచ్చి పరపరా చింపేసింది.
“ఇవాల్టి నుండి ఒక జీవిత కాలంపాటు నా మొగుడిగా పర్మినెంట్ చేస్తున్నాను” అంది. అతణ్ణి అల్లుకుపోయి.
“నేనే అగ్రిమెంట్ పేపర్ ని... నీ పెదాలతో నా పెదాల మీద సంతకం చేస్తే ఓ పనైపోతుంది” అన్నాడు అనిరుద్ర.
“సంతకానికి ముందు అడ్వాన్స్ ఇవ్వాలిగా” అంటూ అతని చేతిని తన నడుము మీదికి చేర్చింది.
****
అసలు సిసలైన ఫస్ట్ నైట్.
ఆమె తన నడుమును దాచుకోలేదు. ఆ మాటకొస్తే ఆమె తనలోని ఏ అందాలనూ దాచుకోలేదు. అతనూ అంతే... అతణ్ణి తన అనాచ్చాదిత దేహంలోకి లాక్కొని... “మీ లక్కీ నంబర్ ఆరు... నా లక్కీ నంబర్ ఏడు... మొత్తం పదమూడు... తెల్లవారేలోగా మన లక్కీ అందం పదమూడు అని ప్రూవ్ అవ్వాలి. నాకు తెలుసు మీరు ప్రూవ్ చేస్తారు” అంది అతణి దుప్పటితో చుట్టేసి.
ఎర్లీ మార్నింగ్ ఆమె నుండి విడివడి అన్నాడు... “థర్టీనే కానీ... ఒకటి ఫినిషింగ్ టచ్... సరిగ్గా కౌంట్ చేయ్...”
****
ఉపసంహారం.
శోభరాజ్ భావనను స్ట్రెయిట్ గా అడిగాడు, “నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీకు ఓకేనా?కాని ఒక షరతు... పెళ్లయ్యాక హైహీల్స్ వేసుకోకూడదు...” అని.
భావన సరేనంది. తమ ప్రేమతో మరింతగా హైట్ తగ్గి అతని ప్రేమను అందుకోవాలని నిర్ణయించుకుంది.
నిఖితను వాళ్లాయన కుజ గ్రహానికి తీసుకువెళ్తానుగానీ అయిదొందలు పెట్టి చీర, కొననుగాక కొనను అనడంతో తప్పనిసరిగా కుజగ్రహానికి టికెట్లు బుక్ చేయించమని చెప్పి మొగుడికి.
ద్విముఖను సిగ్గుపడ్తూనే అడిగాడు కార్తీక్.
“మనం పెళ్లి చేసుకుందామా?” అని. సరేనని ద్విముఖ.
డ్రీమ్ ఛానల్లో క్రియేటివ్ హెడ్ ని అతనికి హెడ్ లేదన్న విషయం తెలిసిన తర్వాత అతణ్ణి పీకేసి, ఒరిజినల్ క్రియేటివ్ హెడ్ పోస్టును ద్విముఖకు అప్పగించారు.
బామ్మ కాశీ నుంచే ఫోన్ చేసి విషయం తెలుసుకొని కాశీ నుండి తిరుపతికి వెళ్లింది.
కార్తీక్ పత్రికలు, పుస్తకాలు తెగ చదివి... చెత్తగా ఎలా రాయకూడదో, కొత్తగా ఎలా రాయలో తెలుసుకున్నాడు. ఓ సీరియల్ ని కూడా ప్రారంభించాడు.
ఆ సీరియల్ కథ అనిరుద్ర, అనిమిషలదే. టైటిల్ అర్ధంకాక బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే... ఆ సీరియల్ కి ఏం టైటిల్ పెట్టాలో అనిరుద్రే చెప్పాడు.
ఆ సీరియలకు అతను సూచించిన టైటిల్... 'అనిరుద్ర H/o అనిమిష'.
సీరియస్ గా ఆలోచిస్తోంది సుధ.
“ఏంటే ఆలోచిస్తున్నావు?” అడిగింది అనిమిష.
“బావ గురించే...
“బావ గురించి ఆలోచించాల్సింది నేను... నువ్వెందుకు?” అనుమానంగా అడిగింది అనిమిష.
“బావ... మొన్న బెంగుళూరు వచ్చినప్పుడు నా తల్లో ఒడి పెట్టి ఛఛ... నా ఒడిలో తల పెట్టి, 'మీ అక్క బాస్ దగ్గర పనిచేయలేకపోతున్నాను. తన దగ్గర 'అది' లేదు. 'ఇది’ లేదు. మీ అక్క దగ్గర మొగుడి పోస్ట్ కి రిజైన్ చేసేస్తాను. నీ దగ్గరేమైనా వేకెన్సీ వుంటే చెప్పు' అన్నాడు. నేను ఆపరేషన్ టేబుల్ మీద వున్నప్పుడు చూద్దాం...' అని మాట ఇచ్చాను” అక్క మొహంలో రియాక్షన్స్ ని గమనిస్తూ చెప్పింది సుధ.
“ఏయ్... నా మొగుడితో నీకు పనేంటే... అయినా నేను నా మొగుడ్నింకా ఊస్టే చేయలేదు. పైగా పర్మినెంట్ చేయబోతున్నాను. అసలు నిన్ను కాదే... అతగాడిని అనాలి..." అంటూ చుట్టూ చూసింది. .
అనిరుద్ర లేడని కన్ఫర్మ్ చేసుకొని, “ఒరేయ్... అనిరుధ్రా... ఎక్కడ్రా...” అని అరిచింది.
“నీ వెనకే ఉన్నాను...” తాపీగా చెప్పాడు అనిరుద్ర.
అనిమిష గతుక్కుమంది. నాలిక్కరుచుకొని ఓ కన్ను మూసి ఓ కన్ను తెరిచి ఓరగా మొగుణ్ణి చూసింది.
అనిరుద్ర సుధ వైపు చూసి, “మరదలా... నీ దగ్గర వేకెన్సీ ఏమైనా వుందేమో చెప్పు... నేను రిజైన్ చేసి నీ దగ్గర జాయినైపోతా...” అన్నాడు.
అనిరుద్ర జుట్టును మొత్తం చెరిపేసి, “ఏంటీ... నీకు మా చెల్లెలు కావాలా?” అని అడిగింది అనిమిష.
“అక్క మొగుడు అర్ద మొగుడు కదా... అని ఫీలవుతున్నావా?” అడిగాడు అనిరుద్ర.
“లేదు... నాకిష్టమే... మీరెక్కడ... ఎప్పుడు... ఎవరితో వున్నా... మీ మనసులో వుండేది నేనే కదా... సుధతో మాట్లడనా?” అడిగింది అనిమిష.
షాకవడం అనిరుద్ర వంతయ్యింది. అనిమిష సరదాకు అన్లేదని తెలిశాక అతని మనసు చెమ్మగిల్లింది. ఆమె మెడ వంపులో తలపెట్టి, “నీకింకో ముగ్గురు చెల్లెళ్లు వుంటే బావుండేది” అన్నాడు.
***
తెల్లవారుఝామున మొబైల్ మోగింది. అప్పటికే అనిరుద్రను దుప్పటిలో చుట్టేసింది. అనిమిష. బద్దకంగా తన తలకు కుడివైపున వున్న మొబైల్ అందుకొని ఓకే బటన్ నొక్కి 'హలో' అన్నాడు..
“నేను కువైట్ నుండి మాట్లాడుతున్నాను. మొగుడి పోస్ట్ కావాలన్న మీ ప్రకటన ఆలస్యంగా చూశాను. మీకు మొగుడి పోస్ట్ ఇవ్వడానికి రెడీ...” ఓ అందమైన ఆడపిల్ల కంఠం వినిపించింది.
నిద్రలో కూడా ఆ మాటలు విన్న అనిమిష కళ్లు తెరిచి మొగుడి దగ్గర్నుండి మొబైల్ లాక్కొని... “సారీ... మొగుడి పోస్ట్ని నేను నా మొగుడికి పర్మినెంట్ చేశాను. టింగ్... టింగ్... దిస్ నంబర్ ఈజ్ పర్మినెంట్లీ అవుటాఫ్ సర్వీస్... ప్లీజ్ డయల్ ఆప్టర్ హండ్రెడ్ ఇయర్స్... టింగ్... టింగ్...” అంటూ ఫోన్ కట్ చేసి, మొగుడి పెదవులకు తన పెదవులతో తాళం వేసింది.
అప్పుడే మొబైల్లో ఓ మెసేజ్ వచ్చింది. “ఆల్ ద బెస్ట్ రా మనవడా... నేనొచ్చేసరికి బుల్లి అనిరుద్ధుడు మీ ఆవిడ కడుపులో ఉండాలి. బామ్మ రాక్షసి ఫ్రమ్ తిరుపతి...” పేరుతో
మెసేజ్ అది.
ఓ ప్రముఖ పత్రికలో కార్తీక్ రాసిన సీరియల్ మొదలైంది. ఆ సీరియల్ పేరు 'అనిరుద్ర H/o అనిమిషు.
*****
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
ఫినిషింగ్ టచ్
పది నెలల తర్వాత....
“అనిరుద్ర H/o అనిమిష' సీరియల్ పాఠకుల అభినందనల వర్షంతో... ఆదరణ పూర్వక హర్షంతో తడిసి ముద్దయి... సూపర్ హిట్టయ్యింది.
నవల పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో కనువిందు చేసింది.
విశాలమైన ఆడిటోరియంలో, వేనవేల ప్రేక్షకులు, అభిమాన పాఠకుల సమక్షంలో.. వారి కరతాళ ధ్వనుల మధ్య చిరుమందహాసంతో....
అనిరుద్ర H/o అనిమిష నవలను అనిమిష W/o అనిరుద్ర విడుదల చేసింది.
తొలి కాపీ అందుకున్నది చిన్నారి విరజ D/o అనిరుద్ర.
చూడముచ్చటైన ఆ వేడుకలో మీరూ ఉన్నారు. మీ అభిమానమూ ఉంది.
(అయిపోయింది)
పి.యస్:
ఆగ్రాలో తాజ్మహలని... హైదరాబాద్లో చార్మినార్ ని... తెలుగింట్లో ఆవకాయని.... కన్నడిగులు బిసిబేళిబాత్ ని.... తమిళియన్ల పొంగలిని.... అనిరుద్ర H/o అనిమిషలను ఇష్టపడని వాళ్ళెవరు? థాంక్యూ.... థాంక్యూ.... థాంక్యూ వెరీమచ్!
- రచయిత్రి
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
ఇక్కడితో ఈ కధ పూర్తి అయ్యింది.......మరొక మాంచి కథ తో మీ ముందుకి వస్తాను
•
Posts: 404
Threads: 2
Likes Received: 54 in 46 posts
Likes Given: 5
Joined: Nov 2018
Reputation:
7
Tondaraga aipoindemo Anna feeling vachindi ANNEPU Garu. But good ending.
•
Posts: 374
Threads: 0
Likes Received: 39 in 31 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
1
కథ చాలా చాలా చాలా అద్భుతంగా ఉంది annepu గారు.
ఇంత మంచి కథను మాకు అందించినందుకు ధన్యవాదాలు
•
Posts: 5,890
Threads: 0
Likes Received: 2,597 in 2,162 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
Excellent and morvelous story
•
Posts: 571
Threads: 2
Likes Received: 115 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
12-11-2018, 10:10 PM
(This post was last modified: 12-11-2018, 10:11 PM by vickymaster.)
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల చాల బాగుంది కథ, అప్పుడే ఫినిష్ అయ్యింది అని బాధ గ ఉంది. కథ లో కొన్ని చోట్ల క్లారిటీ మిస్ అయ్యినట్టు నాకు అనిపించింది.
ఉదాహరణకు
Quote:అనిరుద్ర బయటకెళ్లి రాత్రి పదకొండు అయినా రాలేదు. ఒక్కదానికి అన్నం తినబుద్దికాలేదు. వాష్ బేసిన్ దగ్గరకి వెళ్లి చెయ్యి కడుక్కోబోయి ఆగింది. కుడి చెయ్యి చూపుడు వేలు... అనిరుద్ర నోట్లో పెట్టుకున్న వేలు... ఆ వేలిని కడుక్కోవాలనిపించలేదు. తన పెదవులకు ఆన్చుకుంది. అర్ధరాత్రి పదకొండు అవుతుండగా అనిరుద్ర నుండి ఫోన్.
“హలో... నేను అనిరుద్రను”
అనిరుద్ర H/o అనిమిష - 17వ భాగం
అప్పుడే అనిరుద్ర కనిపించక ఒక రోజు దాటింది. అనిరుద్ర లేని లోటు తెలుస్తోంది. ఎప్పుడూ గిల్లికజ్జాలు... మాటకు మాట అన్నా... అనిరుద్ర ఎంత తిట్టినా, ఆ తిట్టులో ఇష్టం.. ఆ సెటైర్లో ఎఫెక్షన్ ఆమెకు గుర్తిస్తోంది. సరిగ్గా అప్పుడే ద్విముఖ వచ్చింది.
“ద్విముఖా... ఎల్లుండిలోగా మరో రెండు లక్షలు సర్దితే సరిపోతుంది. కాకపోతే ఆయనకు ఓ రెండు లక్షలు బాకీ ఉంటాను” అంది అనిమిష.
Quote:“నువ్వు అనిరుద్రను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలియదుగానీ... అనిరుద్ర నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. మగవాడు.. సప్తపది నడిచి, మూడు ముళ్లు వేసి, చేతిలో చెయ్యి వేసి నువ్వే నా భార్యవి... నీ కష్టాలు, కన్నీళ్లు నావి అని ప్రమాణం చేసి ఏమాత్రం ఛాన్స్ వున్నా... డబ్బా కొట్టుకుంటాడు. కానీ అనిరుద్ర అలాంటి ప్రమాణాలు ఏమీ చేయకపోయినా, మిమ్మల్ని కట్టిపడేసే సంబంధం లేకపోయినా, నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు” ద్విముఖ సీరియస్ గా చెప్పింది.
చేయగలిగే గొప్ప గుణం ఆ బెస్ట్ కపుల్గా సెలక్టయ్యా క... రాత్రి నా దగ్గరకొచ్చాడు
“నిజమా... నీకెలా తెలుసు?!”
"ప్రేమించే మనిషికి ఆమె మనసులో నుంచి మాట బయటకు రాకుండానే ఏదైనా గొప్ప గుణం అనిరుద్రకు వుందని తెలిసింది కాబట్టి. అసలేమైందో తెలుసా? మీరు
గా సెలక్టయ్యాక... ఆ డబ్బును నీకిచ్చి నీతో ప్రామిసరీ నోటు రాయించుకున్నాక " దగ్గరకొచ్చాడు అనిరుద్ర. అప్పుడేం జరిగిందంటే...” అంటూ చెప్పడం మొదలు పెట్టింది ద్విముఖ.
ఈ పేరాగ్రాఫ్స్ మధ్యలో కొంత మిస్ అయ్యింది ఒకసారి చూసుకోండి.
మీరు ఎం అనుకోను అంటే ఈ కథ కంప్లీట్ గ ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా? రచయిత్రి పేరు తెలీదు అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న హెల్ప్ టైటిల్ ఇదేనా లేదా వేరేదా కూడా చెప్పగలరు.
నెక్స్ట్ కథ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
•
Posts: 882
Threads: 1
Likes Received: 443 in 360 posts
Likes Given: 215
Joined: Nov 2018
Reputation:
1
Super ante super....... Matalu levu
•
Posts: 42
Threads: 0
Likes Received: 5 in 5 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 1,170
Threads: 0
Likes Received: 534 in 408 posts
Likes Given: 2,274
Joined: Nov 2018
Reputation:
9
అప్డేట్ సూపర్ గా ఉంది.
నిజమైన మొగుడు పెళ్ళాల్ల కస్సు బస్సులాడటం బాగుంది.
•
Posts: 34
Threads: 0
Likes Received: 38 in 21 posts
Likes Given: 81
Joined: Nov 2018
Reputation:
2
Thanks for a very wonderful story .
we hope much more stores from u
•
Posts: 3,726
Threads: 50
Likes Received: 9,603 in 3,030 posts
Likes Given: 0
Joined: Nov 2018
13-11-2018, 10:43 AM
(This post was last modified: 13-11-2018, 10:45 AM by LUKYYRUS.)
262.అనిరుద్ర H/o అనిమిష
ముచ్చర్ల రజనీ శకుంతల
సంఖ్యానువాదం:అన్నెపూ
Complete Story PDF
No Images
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
Thank you very much lucky trus garu
•
|